Activities calendar

13 January 2018

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్యవర్తిత్వం...

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదానికి తెర దింపేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మధ్యవర్తిత్వం వహించనుంది. జడ్జిల మధ్య విభేదాలకు ముగింపు పలికే దిశగా ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమావేశమై చర్చలు జరుపనుంది. 

న్యాయమూర్తుల వివాదంపై అటార్నీ జనరల్ స్పందన...

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదం సమసిపోనుందని అటార్ని జనరల్‌ కెకె వేణుగోపాల్‌ తెలిపారు. సుప్రీంకోర్టు హితాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

న్యాయమూర్తుల సమావేశంపై ఉద్దవ్ ప్రశంసలు...

మహారాష్ట్ర : సుప్రీంకోర్టులోని నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసించారు. న్యాయ దేవతను మూగ, చెవిటిని చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. 

హెలికాప్టర్ కూలిన ఘటనలో నలుగురు మృతి...

ముంబై : ఓఎన్‌జీసీకు చెందిన పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో నలుగురు సిబ్బంది మృతి చెందారు. హెలిక్యాప్టర్‌లో ఏడుగురు ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. ఇందులో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసీఆర్ చేతికి నివేదికలు..

హైదరాబాద్ : పంట పెట్టుబడి, పంచాయతీ రాజ్ చట్టం సబ్ కమిటీల నివేదికలు సీఎం కేసీఆర్ అందచేశారు. పంట పెట్టుబడి మద్దతు పథకంపై మంత్రి పోచారం అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. పంచాయతీ రాజ్ చట్టం మార్పులు..చేర్పులపై మంత్రి జూపల్లి నివేదిక ఇచ్చారు. పలు సూచనలు..సిఫార్సులు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. 

21:19 - January 13, 2018

ముంబై : మహారాష్ట్రలో విద్యార్థుల విహారయాత్ర విషాదానికి దారితీసింది. అరేబియా సముద్రంలో విద్యార్థులను తీసుకెళ్తున్న బోటు తలకిందులైన ఘటనలో నలుగురు మృతి చెదారు. మరో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. విహారయాత్రలో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు దహను బీచ్‌ నుంచి సముద్రంలోనికి వెళ్లారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. 32 మంది విద్యార్థులను కాపాడారు. మిగిలిన నలుగురికోసం గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులతోపాటు నౌకాదళం కూడా పాలుపంచుకుంది.

 

21:17 - January 13, 2018

ముంబై : ఓఎన్‌జీసీకు చెందిన పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో నలుగురు సిబ్బంది మృతి చెందారు. హెలిక్యాప్టర్‌లో ఏడుగురు ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. ఇందులో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిలో ఐదుగురు ఉద్యోగులు, ఇద్దరు పైలెట్లు ప్రయాణిస్తున్నారు. ముంబయిలోని జుహు విమానాశ్రయం నుంచి ఉదయం 10.20గం. టేకాఫ్‌ అయిన హెలికాప్టర్‌ షెడ్యూల్‌ ప్రకారం 10.58గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ పదిన్నరకు హెలికాప్టర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే ఇండియన్‌ కోస్ట్‌ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. హెలికాప్టర్‌ కోసం గాలింపు చేపట్టిన సిబ్బంది.. చివరికి అది కూలిపోయినట్లు నిర్ధారించారు. హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

21:16 - January 13, 2018

మహారాష్ట్ర : సుప్రీంకోర్టులోని నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసించారు. న్యాయ దేవతను మూగ, చెవిటిని చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పరోక్షంగా బిజెపిని టార్గెట్‌ చేశారు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా...తన పని తాను చేసుకునేలా చూడాలని సూచించారు. న్యాయమూర్తి లోయా అనుమానస్పద మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ, పనితీరుపై నలుగురు జడ్జిలు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గోగోయ్, జస్టిస్ మదన్‌ లోకుర్‌, జస్టిస్‌ కురియన్ మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థను నమ్మాలో...లేదో...అన్న సందిగ్ధం ఏర్పడిందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

21:16 - January 13, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదం సమసిపోనుందని అటార్ని జనరల్‌ కెకె వేణుగోపాల్‌ తెలిపారు. సుప్రీంకోర్టు హితాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ... సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు అనుభవజ్ఞులు, రాజనీతీజ్ఞులని అటార్ని జనరల్‌ పేర్కొన్నారు. మరోవైపు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా...తిరుగుబాటు చేసిన నలుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌లతో ఆదివారం సాయంత్రం సమావేశమవుతారని సమాచారం. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన దిశలో లేదని...ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని... నలుగురు జడ్జిలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

21:14 - January 13, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదానికి తెర దింపేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మధ్యవర్తిత్వం వహించనుంది. జడ్జిల మధ్య విభేదాలకు ముగింపు పలికే దిశగా ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమావేశమై చర్చలు జరుపనుంది. దీనిపై మాట్లాడేందుకు 50 శాతం మంది న్యాయమూర్తులు తమ సమ్మతి తెలియజేశారని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మనన్‌ మిశ్రా తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇది కుటుంబంలోని తగాదా లాంటిదని దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని మిశ్రా చెప్పారు.

21:13 - January 13, 2018

నల్గొండ : ఉద్యమ పార్టీకి రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. తెలంగాణలో టీడీపీ కనుమరుగుయ్యే పరిస్థితుల్లో అందులోని బలమైన నాయకులను తీసుకోవడం సహజమే అన్నారు. నాయిని, శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం నడపాలన్న నిర్ణయంలో ఇలాంటివి సమర్ధనీయమైన చర్యేనని గుత్తా అన్నారు.

 

21:10 - January 13, 2018

హైదరాబాద్ : నగరంలో పంతంగుల సందడి మొదలైంది. ఇంటర్ నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మూడవసారి నిర్వహిస్తున్న ఈ కైట్ పెస్టివల్‌కు దేశ- విదేశాల నుంచి కైటర్స్‌ నగరానికి చేరుకుంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్‌ ఫెస్టివల్‌తో పాటు..స్వీట్‌ ఫెస్టివల్‌ను మంత్రి చందూలాల్‌ ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ కైట్‌ ఫెస్టివల్ జరగనుంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో 3వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది. దేశ నలుమూలల నుంచి అభిమానులు ఈ ఫెస్టివల్‌కు తరలివస్తున్నారు. విదేశాల నుంచి సుమారు 40 మంది కైట్‌ ఫ్లయర్స్‌ ఈ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీయులు, బెంగాళీలు, రాజస్తానీయులు, కేరళ, తమిళనాడు, కర్ణాటక కైట్స్‌ ప్రియులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

సంక్రాంతి వస్తుందంటే చాలు ఓ పది, పదిహేను రోజుల ముందు నుంచే పిల్లలు పోటీ పడిమరీ పతంగులు ఎగురవేస్తారు. నగరంలో జరగుతున్న కైట్స్ ఫెస్టివల్‌కు మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఐర్లాండ్, స్కాట్లాంట్, ఆస్ట్రేలియా దేశీయులు పాల్గొననున్నారు. వివిధ అకారాల్లో సిద్ధం చేసిన కైట్స్ అకాశ వీధిలో కనువిందు చేస్తున్నాయి.

పోటీపడుతూ సరదాగా పతంగులు ఎగురవేస్తారు. పిల్లలే కాదు పెద్దలు సైతం గాలిపటాలు ఎగురవేసి సంబరపడిపోతారు. మనరాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి14న ఈ పంతంగుల వేడుకను నిర్వహిస్తారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి జనవరి వరకు పంతంగుల దినోత్సవం జరుపుకుంటారు. చాలా చోట్ల ఈ పతంగుల దినోత్సవం నాడు పతంగుల ఎగురవేతను పోటీగా పెట్టి, విజేతలకు బహుమతులను కూడా ప్రధానం చేస్తారు. కైట్‌ ఫెస్ట్‌వల్‌ను చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటున్నారు.

21:09 - January 13, 2018

గుంటూరు : జిల్లా తాడికొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొట్టిపాడు దళిత బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో... కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని.. దాడికి పాల్పడిన అగ్రకుల పెత్తందారులపై కేసులు పెట్టకుండా బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం దళిత సమస్యలను పరిష్కరించకపోతే 'చలో గొట్టిపాడు' నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అండదండలతో ఎక్కడో ఓ చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అధికారం ఉందనే అహంభావంతో కొందరు తరుచూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో ఇలాంటి ఉదంతమే వెలుగుచూసింది. దళితులపై అగ్ర కులానికి చెందిన పలువురు దాడులు చేశారు. ఇదేమని ప్రశ్నించిన దళితులపైనే కేసులు బనాయించి అరెస్ట్‌ చేయడం వివాదాస్పదమైంది.

పెదగొట్టిపాడులో బాధిత దళితులను పరామర్శించేందుకు వామపక్ష, దళిత సంఘాల నేతలతో సంఘీభావ కమిటీ ఏర్పడింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేతలు గ్రామ పర్యటనకు బయల్దేరారు. అయితే.. గుంటూరులోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు... పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా లాక్కెళ్లి... వాహనాలు ఎక్కించారు. దీంతో పోలీసులు, సీపీఎం, దళిత సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్‌ నేతలను వివిధ పీఎస్‌లకు తరలించారు. మధును తాడికొండ పీఎస్‌లో దాదాపు 5 గంటలపాటు నిర్బంధించారు.
రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన సాగుతుందని మధు ఆరోపించారు. దళితులపై దాడులు జరిగితే పరామర్శించని పాలకులు... బాధితులకు అండగా నిలిచిన నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడి చేసినవారిపై 307 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కౌంటర్‌ కేసులు ఎత్తివేయాలని, అత్యాచారాల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు. దళితులకు న్యాయం కోసం ఈనెల 23 లేదా 24న... 36 వామపక్ష, ప్రజా, దళిత సంఘాలతో 'చలో గొట్టిపాడు' నిర్వహిస్తామన్నారు.

ఇక పీఎస్‌లో ఉన్న మధుతో పాటు... పలువురు సీపీఎం నేతలను రాష్ట్ర కార్యవర్గసభ్యులు సీహెచ్‌ బాబూరావు పరామర్శించారు. ప్రభుత్వం దళిత సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. బాధితులకు అండగా ఉండకుండా... దాడులు చేసిన అగ్రకులాలకే వంతపాడడం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి దళితులకు న్యాయం చేయకపోతే.. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు బాబూరావు. మధుతో పాటు సీపీఎం నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దళితుల సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

21:08 - January 13, 2018

హైదరాబాద్ : పండుగొచ్చింది... పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. సంక్రాంతిని ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబాలన్నీ పల్లెబాట పడుతున్నాయి. పండుగను ఘనంగా జరుపుకునేందుకు గ్రామాలన్నీ సిద్దమయ్యాయి. నగరవాసులంతా పల్లెకు తరలిపోతుండడంతో టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ జరుగుతోంది. మరోవైపు పట్టణవాసులంతా ఊర్లకు వెళ్తుండడంతో నగర వీధులన్నీ బోసిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలంతా పండుగను ఘనంగా జరుపుకునేందుకు సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. మరోవైపు దూర ప్రాంతంలోని తమ వారంతా వస్తుండడంతో ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పచ్చని వాకిళ్లలో రంగవళ్లికలు కన్నుల విందు చేస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పశ్ఛిమగోదావరిజిల్లా భీమవరంలో అమ్మాయిలు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

నగరమంతా పల్లెబాట పడుతోంది. ప్రయాణికుల రాకతో బస్‌, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రధాన టెర్మినల్‌ అయిన ఎమ్‌జీబీఎస్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జూబ్లీబస్టాండ్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్ నుండి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు ఏర్పాట్లు చేసింది. మరోవైపు పలువురు తమ సొంత వాహనాలలో ఊర్లకు పయనమయ్యారు. దీంతో నగర శివారులో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. అలాగే... టోల్‌గేట్‌ వద్ద గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇక సంక్రాంతి పండుగకు ఆంధ్రాలో ఉండే సరదానే వేరు. ప్రత్యేకంగా ఈ సరదాల కోసం ఏడాదికోసారి ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా ఒక్కచోటికి చేరి ఎంజాయ్‌ చేస్తుంటారు. పలు ప్రాంతాల్లో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. ఇక కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని.. జిల్లా వ్యాప్తంగా జాయింట్ యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేసి పందాలు నిర్వహించకుండా నిరోధిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహించినా, గాంబ్లింగ్‌ ఆటలాడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవిప్రకాష్‌ హెచ్చరించారు. ఇక సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు నారావారిపల్లికి నారా కుటుంబం, నందమూరి బాలకృష్ణ కుటుంబం చేరుకుంది. సంక్రాంతి సంబరాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఇక ఇప్పటికే పల్లెపల్లెన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపాటు ఎంజాయ్‌ చేసేందుకు ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు సిద్దం చేసుకుంటున్నారు. 

21:07 - January 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత తమదే అంటూ టీఆర్‌ఎస్‌ చెబుతుంటే.. జేబులు నింపుకునేందుకే ప్రైవేటు సంస్థల దగ్గర విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోసారి కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంగించి తప్పుడు అగ్రిమెంట్లు చేయడంతో 23 మంది అధికారులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ విషయంలో బాల్కసుమన్‌ ఇద్దరిపైనే కేసులు అయ్యాయంటున్నారని.. దీన్ని బట్టే టీఆర్‌ఎస్‌ అవినీతి అర్థమవుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన ఆరోపణలు తప్పని తేలితే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పారదర్శకంగా పనిచేస్తే ... సెంట్రల్‌ విజిలెన్స్‌తో గానీ సీబీఐతో గానీ విచారణ జరపాలన్నారు. తన ఆరోపణలు తప్పని తేలితే అబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తానని రేపంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

మరోవైపు 24 గంటల విద్యుత్ పంపిణీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని మీడియా చిట్‌చాట్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను, రైతులను కాల్చుకుతింటే తాము కరెంట్ ఇచ్చి అదుకుంటున్నామని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించే వాళ్లు ఆధారాలుంటే భయటపెట్టాలన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలతో ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని గ్రహించిన టీఆర్‌ఎస్‌.. కిందిస్థాయి నేతలతో సవాళ్లకు ప్రతిసవాళ్లు చేయిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను బయటపెట్టాలన్న విపక్షాల డిమాండ్‌కు మంత్రుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చుతోంది. 

21:06 - January 13, 2018

చిత్తూరు : పారిశ్రామిక, ఐటీ రంగాలకు తిరుపతి అనుకూలమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రేణిగుంటలో జోహో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని చంద్రబాబు ప్రారంభించారు. విశాఖ, అమరావతి, అనంతపురం, తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జోహో కంపెనీకి తిరుపతి అతి పెద్ద సెంటర్ కావాలని ఆకాంక్షించారు. తిరుపతికి సోమశిల- స్వర్ణముఖి నదుల నుంచి నీటిని తరలిస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురంలలో సైబర్ టవర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. 2019 నాటికి ఐటీలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు.

20:56 - January 13, 2018

పెద్దపల్లి నుండే మళ్లీ పోటీ చేస్తానని హెచ్ సీఏ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత వివేక్ పేర్కొన్నారు. కానీ పార్లమెంట్..కు సుమన్ పోవచ్చు..ఎమ్మెల్యేగా తనను పంపొచ్చు..ఏది ఏమయినా సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయమని హెచ్ సీఏలో నెలకొన్న పరిస్థితులు..ఇటీవలే ప్రముఖ క్రికేటర్ అజహారుద్దీన్ తో నెలకొన్న వివాదం..ఇతరత్రా అంశాలపై ఆయన టెన్ టివి 'వన్ టు వన్' కార్యక్రమలో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:40 - January 13, 2018

మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఫాల్స్ ఐడెంటిడీ కార్డు పెట్టుకుని సమావేశానికి వచ్చారని హెచ్ సీఏ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. టెన్ టివి వన్ టు వన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అతను హెచ్ సీఏ మెంబర్ కాదా ? అని అడగాలని సూచించారు. మెంబర్ కాని అతను ఫాల్స్ ఐడెంటిడీ కార్డు పెట్టుకుని రావచ్చా ? అని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో అజారుద్దీన్ కు బీసీసీఐ క్లియర్ చేయలేదన్నారు. బీసీసీఐతో ఎలాంటి లెటర్ తమకు రాలేదని, కోర్టులో క్లియర్ అయ్యిందని అజారుద్దీన్ పేర్కొంటున్నారని తెలిపారు. పది సంవత్సరాల పాటు క్రికెట్ కెప్టెన్ గా ఉన్న అతను తనకు ఫోన్ చేస్తే లీగల్ ప్రకారం చెప్పేవాడినని తెలిపారు. సమావేశంలో కేసీఆర్..కేటీఆర్ డౌన్..డౌన్ అనడంలో ఏమైనా అర్థం ఉందా ? అని తెలిపారు. అసలు సమావేశానికి అజహరుద్దీన్ ఎందుకు రావాలి ? క్రికెట్ డెవలప్ మెంట్ కోసం వస్తే బాగుండేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నా ప్రభుత్వం నుండి వేతనం తీసుకోవడం లేదని తెలిపారు. పబ్లిసిటీ కోసమే చెబుతున్నారని విమర్శించారు. అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్..తదితరులు అజహర్ వెనుక ఉన్నారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి 

20:09 - January 13, 2018

తెల్గు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ రథ సారధుల కథ గమ్మతున్నది.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి.. తెలంగాణ హ్యాండ్ బాస్.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీద పెద్దపెద్ద బ్రేకింగ్ ప్లేట్లేశి వార్తలేశిండ్రు ఏంది దీని మత్లావు..? కోడి పందాలు.. ఈ ముచ్చట లేకుంటే ఆంధ్రల సంకురాత్రి పండుగనే ఉండది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా.? సిరిసిల్లా దిక్కు నిన్న మబ్బుల సందే సుర్వైనట్టుందిగదా..? సంకురాత్రి.. నందమూరి బాలికాకయ్య ఇగ ఊకోకపోయినవే.. నీ సీన్మలు సల్లగుండ..మన్సులను వోలిన మన్సులు ఏడ్గురుంటరంటరు.. ఆ ఏడుగుర్ని ఎవ్వడు సూడవొయ్యిండో ఏమో నాకు తెల్వదిగని..కోళ్లకు కోపమొస్తె.. ఎట్లుంటదో ఆంధ్రల ఒకతాన సూపెట్టింది.

19:59 - January 13, 2018

'ప్రభాకర్ గౌడ్' తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. 'బాహుబలి' సినిమాతో 'కాలకేయుడి' పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గబ్బర్ సింగ్’, 'దూసుకెళ్తా’, 'దూకుడు’, 'కృష్ణం వందే జగద్గురుం’, 'దొంగాట' ఇలా కొన్ని చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటుడు. ‘కాళకేయ' ప్రభాకర్ గా గుర్తింపు పొందిన ఈ నటుడు తాజాగా 'బాలకృష్ణ' నటించిన 'జై సింహ'లో కూడా వృద్ధ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. సంక్రాంతి సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సుప్రీం బార్ అసోసియేషన్ సమావేశం...

ఢిల్లీ : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సీజేఐ - నలుగురు న్యాయమూర్తుల మధ్య వివాదం నెలకొంది. రెండు తీర్మానాలను సుప్రీం బార్ అసోసియేషన్ చేసింది. వివాద పరిష్కారానికి బార్ అసోసియేన్ ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఆదివారం సీజేఐతో పాటు నలుగురు న్యాయమూర్తులను కమిటీ సభ్యులను కలుస్తారని అసోసియేషన్ పేర్కొంది. 

పంచాయతీ రాజ్ చట్టానికి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం...

హైదరాబాద్ : నూతన పంచాయతీ రాజ్ చట్టానికి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాసేపట్లో సీఎం కేసీఆర్ కు సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

18:34 - January 13, 2018

హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ సెల్‌కాన్ మొబైల్స్‌పై బిగ్ సీ డైరెక్టర్ వై. స్వప్న కుమార్ పెట్టిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. కేసును దర్యాప్తు చేసిన మాదాపూర్‌ పోలీసులు స్వప్నకుమార్‌ ఆరోపణల్లో నిజం లేదని తేల్చారని సంస్థ తెలిపింది. 2015లో సెల్‌కాన్‌ కంపెనీ నుంచి తప్పుకున్న స్వప్నకుమార్‌.. సెల్‌కాన్‌ సంస్థపై పలు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. దీనీపై దర్యాప్తు చేసిన పోలీసులు సెల్‌కాన్‌కు సంబంధించిన బ్యాంకర్లందరినీ సంప్రదించారు. నిబంధనలకు లోబడే వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్టు అన్ని బ్యాంకులు రిపోర్టు ఇచ్చాయని సెల్‌కాన్‌ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ పటిష్టమైన స్థితిలో ఉందని, బ్యాంకర్లు రాతపూర్వకంగా పోలీసులకు వెల్లడించారని సెల్‌కాన్‌ సంస్థ ప్రకటించింది. దీంతో తమ సంస్థపై స్వప్నకుమార్‌ దురుద్దేశంతోనే ఆరోపణలు చేసినట్టు రుజువైందని సెల్‌కాన్‌ సంస్థ స్పష్టం చేసింది. 

18:32 - January 13, 2018
18:28 - January 13, 2018

పశ్చిమగోదావరి జిల్లా : జంగారెడ్డిగూడెం ఎక్సైజ్‌ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. సంక్రాంతి కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నాటుసారా ఎక్కువగా ఉండటంతో దాడులు చేశారు. జంగారెడ్డి గూడెం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ముద్దప్పగూడెం, పంగిడిగూడెంలో దాడులు నిర్వహించి.. పద్దెనిమిది వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నాటుసారాతో పాటు ఎక్కడైనా బెల్ట్‌ షాపుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరించారు. 

18:26 - January 13, 2018

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామంలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. నారావారిపల్లికి చేరుకున్న నారా, నందమూరి కుంటుంబ సభ్యులకి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలను సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

18:11 - January 13, 2018

పశ్చిమగోదావరి : సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంబరాల్లో ప్రముఖంగా పేర్కొనే కోళ్ల పందాలపై ఉత్కంఠ నెలకొంటోంది. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని కొంతమంది..నిర్వహించవద్దని పోలీసుల హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని ద్వారకా తిరుమలలో కోడి పందాల బరులపై పోలీసులు దాడులు చేశారు. బరుల ఏర్పాటుకు స్థలం ఇచ్చిన రైతులపై కేసులు నమోదు చేశారు. భీమడోలు, చాగల్లు మండలాల్లో దాడులు చేశారు. ఎక్కడా కోళ్ల పందాలు జరుగవద్దని పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పీఎస్ లో మూడు టీంలుగా విభజించి రైడ్స్ నిర్వహించడం జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు. గతంలో పందాలు జరిగిన ప్రదేశాలను గుర్తించడం..కొత్తగా ఏర్పాటు చేసిన బరులను గుర్తించి దాడులు చేయడం జరుగుతోందన్నారు. ఒక్కో డీఎస్పీ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు గస్తీలు..సోదాలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని..హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పందాలను అడ్డుకుంటామన్నారు.

పందాలు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవి ప్రకాష్ పేర్కొన్నారు. ఏలూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పందాలపై జాయింట్ యాక్షన్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని, పందాలకు సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతినివ్వలేదని, హైకోర్టు ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామన్నారు. 

త్వరలో స్పెషల్ గ్రేడ్ గా నల్గొండ - గుత్తా...

నల్గొండ : సంక్రాంతి తరువాత స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా నల్గొండ మారుతుందని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం ను విమర్శిస్తే పేరొస్తుందని, కాంగ్రెస్ లో కొత్తగా చేరిన వారు భావిస్తున్నారని, ఉత్తమ్ హామీలు ఆచరణలో సాధ్యం కావన్నారు. నాయినీ, శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సినవసరం లేదని, బలమైన నాయకులను తీసుకోవడం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని నడపాలనేది ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. 

కృష్ణానగర్ లో భారీ చోరీ...

కర్నూలు : కృష్ణానగర్ లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 4 లక్షల నగదు, కిలో బంగారం అపహరించారు. నాలుగో పట్టణ పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 

విష వాయువు లీక్..

భద్రాద్రి : కొత్తగూడెం అశ్వాపురం భారజల కర్మాగారంలో హైడ్రోజన్ సల్ఫైడ్ విష వాయువు లీక్ అయ్యింది. ట్రేడ్ మన్ వేల్పుల వెంకటరమణ (38) మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు పేర్కొంటున్నారు. 

17:53 - January 13, 2018

రంగారెడ్డి : రెండు నెలలుగా నీళ్లు లేక ఇబ్బందిపడుతున్నా.. సర్పంచ్‌ కానీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు ధర్మన్నగూడ వాసులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చింతుళ్ల గ్రామపంచాయితీలో ధర్మన్నగూడ వాసులంతా దాదాపు దళితులే.. అక్కడ ఉన్న కుటుంబాలన్నింటికి ఒకే వాటర్‌ ట్యాంక్‌ ఉందని.. రెండు నెలల క్రితం అండర్‌ డ్రైనేజీ పనుల కోసం పైప్‌లైన్‌లను తీశారని.. అవి అలానే వదిలేశారని గ్రామస్థులు వాపోతున్నారు. నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

17:52 - January 13, 2018

ఆదిలాబాద్ : జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా.. తమ కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పర్యటించిన టీమాస్‌ బృందంతో గాంధీనగర్‌ కాలనీ వాసులు తెలియచేశారు. కనీస అవసరాలైన మరుగుదొడ్లు, మురికి కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీలోకి కనీసం 108 వాహనం రావడానికి కూడా సరైన రోడ్లు లేవని వాపోయారు. సమస్యల వలయంగా ఉన్న గాంధీనగర్‌ కాలనీలో అధికారులు తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

17:50 - January 13, 2018

వరంగల్‌ : రూరల్‌ జిల్లా పర్వతగిరిలో మంత్రి హరీష్‌రావు పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపై అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇస్తే... చించివేసి.. తమను తోసేశారని కాంగ్రెస్‌ పార్టీ రైతు కిసాన్‌ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి దేవేందర్‌రావు ఆరోపించారు. దీంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకుని పోలీసులు కాంగ్రెస్‌ నేతలను పక్కకు తీసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. సమస్యలపై వినతిపత్రం ఇస్తే పట్టించుకోకుండా దౌర్జన్యం ప్రదర్శించారని ఆరోపించారు. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్దిచెబుతారన్నారు కాంగ్రెస్‌ నేతలు. 

17:48 - January 13, 2018

హైదరాబాద్‌ : నగరంలో పతంగుల సందడి మొదలైంది. ఇంటర్ నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మూడవసారి నిర్వహిస్తున్న ఈ కైట్ పెస్టివల్‌కు పెద్ద సంఖ్యలో దేశ- విదేశీయులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే కైటర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. 

17:43 - January 13, 2018

గుంటూరు : పరామర్శించడం కూడా ఒక నేరమా అని ఏపీ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పెదగొట్టిపాడు దళిత కాలనీ సందర్శనకు బయల్దేరిన సీపీఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై అగ్రకులస్తుల దాడుల నేపథ్యంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నేతలను కాలనీ సందర్శనకు బయల్దేరారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పరామర్శించడానికి వెళుతున్న సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఇతరులను అరెస్టు చేసి తాడికొండ పీఎస్ కు తరలించారు. సుమారు ఐదారు గంటల పాటు స్టేషన్ లో ఉంచి కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. 

17:11 - January 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో పారిపోతారు..బయట మాత్రం చర్చించాలంటే ఎలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా 24గంటల విద్యుత్ సరఫరాలో అవినీతి దాగి ఉందని..టి.కాంగ్రెస్ నేత రేవంత్..నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై శనివారం మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఇస్తామని ముందుకొస్తోందన్నారు. 24గంటల విద్యుత్ పంపిణీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని..ప్రజలను..రైతులను కాల్చుకు తింటే తాము ఆదుకుంటున్నామన్నారు. అవినీతి జరిగిందని ఆరోపించే వాళ్లు ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు అడిగితే కూడా సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ చట్టంపైనా అసెంబ్లీలో చర్చించవచ్చని, అప్పుడు అందరి అభిప్రాయాలను చెప్పుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రంగారెడ్డిలో మాదకద్రవ్యాలు...

రంగారెడ్డి : మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు నుండి హైదరాబాద్ కు సరఫరా చేస్తుండగా అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. 

కనిమొళి వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ స్పందన..

చిత్తూరు : కనిమొళి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు, శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలను కనిమొళి వెనక్కి తీసుకోవాలని టిటిడి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కనిమొళి వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, రాజకీయ లబ్దికి తిరుమలను వాడుకుంటే తీవ్ర పరిణామాలు తీసుకుంటామని తెలిపారు. 

16:24 - January 13, 2018

ఖమ్మం : జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుని వెళుతున్న వారిని అడ్డుకొనేందుకు వారి కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కారును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ప్రేమ వివాహం చేసుకుని వెళుతున్న వారికి ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన భద్రాది జిల్లా కొత్తగూడెం ఇల్లందులో చోటు చేసుకుంది. సుమన్ గౌడ్..సాహెల్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇల్లందు నుండి హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. మతాంతర వివాహం చేసుకోవడాన్ని అమ్మాయి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారు వెళుతున్న కారును అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. వీరి నుండి కాపాడుకోవాలని నూతన దంపతులు ప్రయత్నించారు. ప్రమాదవశాత్తు గోపాలపురం వద్ద కారు చెట్టును ఢీకొంది. కారు డ్రైవర్ మృతి చెందగా సాహెల్..సుమన్ గౌడ్ లకు గాయాలయ్యాయి. ప్రమాదానికి తమ బంధువులే కారణమని నూతన వధువు పేర్కొంటోంది. 

కార్తి చిదంబరం ఇంట్లో సోదాలు...

ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరం నివాసాలపై ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది.

16:16 - January 13, 2018

ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరం నివాసాలపై ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. సోదాలు నిర్వహించిన సమయంలో చిదంబరం ఆయన కుమారుడు కార్తి చెన్నైలో లేరు. మనీలాండరిగ్‌ కేసులో ఈ నెల 16న కార్తీ చిదంబరం హాజరు కావాలని ఈడీ నోటీసు జారీ చేసింది. 2006 చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కార్తీతోపాటు ఐఎన్‌ఎక్స్ మీడియా అధిపతులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్‌ ముఖర్జీలపై ఈడీ కేసు నమోదు చేసింది.

 

16:14 - January 13, 2018

చెన్నై : ఉదయం విమాన రాకపోకలపై భోగి మంటలు ప్రభావం చూపాయి. భోగి మంటల దెబ్బకు ఆకాశం దట్టమైన పొగతో నిండిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తమిళనాడులో పొంగల్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉదయం ప్రారంభమైన భోగి మంటల్లో ఇంట్లోని చెత్త, చెదారం, కర్రలు తదితర వస్తువులు వేయడంతో దట్టమైన పొగ అలుముకుంది. చెన్నై వీధులు పొగతో నిండిపోయాయి. ఎదురుగా దాదాపు 50 మీటర్ల వరకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కువైట్‌, షార్జా, ఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి రావలసిన 18 విమానాలను దారి మళ్లించి హైదరాబాద్‌, బెంగళూరుకు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

16:08 - January 13, 2018

నెల్లూరు : ఏపీలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు బరితెగిస్తున్నాయి. ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్నాయి. నెల్లూరులోని వీవీ మొబైల్‌ డీలర్‌షిప్‌ సంస్థ కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోంది. చెనాకు చెందిన క్రిస్కీ కంపెనీ టార్గెట్‌లు పూర్తిచేయాలంటూ ఎంప్లాయిస్‌తో గుంజీళ్లు తీయించడం వివాదంగా మారింది. దీనిపై పోలీసులుగాని, కార్మికశాఖ అధికారులుగాని ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.  

16:06 - January 13, 2018

ఖమ్మం : వెంకటగిరి రైల్వే గేట్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. హోంగార్డు కాశీవిశ్వనాథ్‌ అతని ఇద్దరు కుమారులుగా అనుమానిస్తున్నారు. అయితే... ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

16:03 - January 13, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ వంటేరు ప్రతాప్‌ రెడ్డిపై ఉద్దేశ్యపూరితంగానే కేసులు నమోదు చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. ప్రతాప్‌రెడ్డిపై పెట్టిన కేసు విషయంలో టీటీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి.. న్యాయం చేయాలని కోరారు. కేసీఆర్‌ రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నాడని.. టీటీడీపీ అధిష్టానం మేరకే వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఓయూ వెళ్లారని అన్నారు. భవష్యత్తులో సీఎంపై తిరిగి పోటీ చేసి గెలుస్తాడన్న భయంతోనే కేసీఆర్‌.. ప్రతాప్‌రెడ్డిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మోత్కుపల్లి నర్సింహ్మ అన్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మందకృష్ణలను వెంటనే విడుదల చేయాలని టి.టిడిపి డిమాండ్ చేసింది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఫిర్యాదు చేశామని..గవర్నర్ కి సమగ్ర వివరాలు అందించామని నేతలు తెలిపారు. మల్లన్న సాగర్ బాధితులకు ప్రతాప్ రెడ్డి అండగా నిలిచారని, ఆయనకు గజ్వేల్ లో ఆదరణ పెరుగుతోందని మోత్కుపల్లి పేర్కొన్నారు. కేసీఆర్ ఆయనపై కేసులు పెట్టిస్తున్నారని, చరిత్రలో ఉద్యమకారులను జైల్లో పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఓయూ విద్యార్థులతో కలిసి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఇప్పుడు ఓయూలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. 

15:36 - January 13, 2018

గుంటూరు : జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదగొట్టిపాడు దళిత కాలనీ సందర్శనకు బయల్దేరిన సీపీఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై అగ్రకులస్తుల దాడుల నేపథ్యంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నేతలను కాలనీ సందర్శనకు బయల్దేరారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు మదుతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అంతకు ముందు తెల్లవారుజాము నుంచే సీపీఎం నాయకుల ఇళ్లకు వెళ్లిమరీ పోలీసులు అరెస్టు చేశారు. గొట్టిపాడు మండల సీపీఎం కార్యదర్శి గంగాధరరావు, రాజధాని డివిజన్‌ సీపీఎం కార్యదర్శి ఎం.రవితోపాటు కాకాని పట్టణానికి చెందిన పలువురు సీపీఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.

జిల్లా గొట్టిపాడులో దళితులపై అగ్రకుల దాడులను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. దళితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో దళిత సంఘాలు- వామపక్షాలు చలో గొట్టిపాడు నిర్వహిస్తామన్నారు. బాధితులను పరామర్శించకుండా చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో నిర్బంధాలు కొనసాగిస్తోందని మధు మండిపడ్డారు.

జిల్లా గొట్టిపాడులో దళితులను పరామర్శించడానికి వెళుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అడ్డుకోవడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం నియంతృంగా ప్రవర్తిస్తోందని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో వామపక్షాలతో కలసి చలో గొట్టిపాడు ను నిర్వహిస్తామని దళిత నేతలు స్పష్టం చేశారు. 

15:00 - January 13, 2018

తండాలో జన్మించింది..ఆమె చదువు సొంతూరు తండాలను చదువుకుంది. అనంతరం పట్టణంలో కూడా చదువు కొనసాగింది. ఆమెనే నేడు బుల్లితెర అదరగొడుతోంది...తెలంగాణ యాస, భాషతో ఔరా అనిపించుకుంటున్నది. ఆమెనే 'మంగ్లీ'.. ఆమె అసలు పేరు 'మంగ్లి' కాదు 'సత్యవతి’. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె పాడిన ఓ పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ''పుట్టిన ఊరి చూసి నయనాలే, కృష్ణా గోదావరి నదులాయే అన్నట్టు''.. సాగే పాట తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా మంగ్లీ, సినీ గేయ రచయిత కందికొండ, మేఘరాజ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. పాటకు సంబంధించిన విషయాలు..ఇతరత్రా వివరాలు టీం తెలియచేసింది. కాలర్స్ కూడా టీంతో ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:42 - January 13, 2018

నెల్లూరు : వారందరూ ఉన్నతంగా చదువుకున్న వారే...కానీ ఎంత చదువుకున్నా ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు రావడం లేదు. దీనితో ఎదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. వారు పనిచేస్తున్న కంపెనీలు..సంస్థలు పెడుతున్న బాధలు భరిస్తూ వారు ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా ఉద్యోగులపై 'వివో' మొబైల్ కంపెనీ డీలర్ చేస్తున్న అరాచకం బయటపడింది. టార్గెట్ పూర్తి చేయని వారికి వేతనాలు ఇవ్వకుండా..కఠినమైన శిక్షలు విధిస్తున్నాడు.

నెల్లూరులో 'వివో' మొబైల్ షాపును చైనా కంపెనీ క్రిస్క్ నిర్వహిస్తోంది. ఇందులో నెల్లూరు, కడప జిల్లాకు చెందిన వంద మందికి దాక పని చేస్తున్నారు. వీరందరూ బీటీక్, ఏంబీఏ, డిగ్రీ పూర్తి చేసిన వారు. వారి వారి అర్హతలను బట్టి రూ. 9వేల నుండి 15వేల వేతనాలు ఇస్తామని చెప్పి ఉద్యోగంలోకి యాజమాన్యం నియమించుకుంది. అందులో కొన్ని కండీషన్ పెట్టింది. ప్రతి నెలా టార్గెట్ ఇవ్వడం చేస్తోంది. నెలకు 50-100 మొబైల్స్ విక్రయించాల్సి ఉంటుందని..టార్గెట్ పూర్తి చేయకపోతే వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా కఠిన శిక్షలు విధిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. గుంజీలు తీయించడం..డిప్స్ తీయించడం..వంటివి యాజమాన్యం చేస్తోంది. వీరి శిక్షలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు..కార్మిక అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రస్తుతం దర్శనమిచ్చిన ఈ వీడియోలపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

14:05 - January 13, 2018

ఏపీ సర్కార్ కు మధు హెచ్చరికలు...

గుంటూరు : తాడికొండ పీఎస్ లో సీపీఎం నేతలను దళిత సంఘాల నేతలు పరామర్శించారు. దళిత సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి 23 లేదా 24న చలో పెదగొట్టిపాడుకు పిలుపునిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. దళితులపై దాడి చేసిన వారిపై సెక్షన్ 307, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పెదగొట్టిపాడులో దళిత కాలనీని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 24లోపు డిమాండ్లు నెరవేర్చకపోతే దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. 

14:02 - January 13, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. కాలేజీ విద్యార్థులు ముందుగానే సంక్రాంతి పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అందంగా అలంకరించుకొని ఎడ్లబండిపై ప్రయాణం చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. భీమవరం విష్ణు ఇంజీనీరింగ్‌ కాలేజీ విద్యార్థుల సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

14:01 - January 13, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ.. బాహుబలి ప్రభాస్‌లు పోటీకి సిద్ధంగా ఉన్నారు. చోటా భీం, స్పైడర్ మ్యాన్, డోరెమాన్‌లు కూడా పోటీకి సై అంటున్నారు. ఇంతకీ దేని కోసం వీరంతా పోటీ పడుతున్నారు? తెలుసుకోవాలని ఉందా? అయితే ఓ లుక్కేయండి. కేసీఆర్, మోడీ, ప్రభాస్‌... చోటా భీం.. స్పైడర్ మ్యాన్, డోరెమాన్... వీరంతా ఇప్పుడు పతంగుల పోటీలో ఉన్నారు. హైదరాబాద్ ధూల్‌పేట మార్కెట్లో కొలువు దీరిన గాలిపటాలపై దర్శనం ఇస్తున్నారు. 

సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకొచ్చేవి రంగు రంగుల పతంగులు.. ఇక పతంగులకు పెట్టింది పేరైన ధూల్‌పేట ప్రాంతం. ఇప్పుడు అక్కడ గాలి పటాల తయారీ, అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎటు చూసినా రంగు రంగుల వెరైటీ పతంగులు కనువిందు చేస్తున్నాయి. ధర ఎంతైనా.. సంక్రాంతిని మాత్రం కలర్‌ఫుల్‌గా జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు. 

సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో సిటీలో గాలిపటాల కొనుగోళ్లు మొదలయ్యాయి. హోల్ సేల్ రిటైట్ మార్కెట్లో డిమాండ్ సరిపడా పతంగుల అమ్మకాలు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోలీస్తే ఈఏడాది మార్కెట్లో  వెరైటి అండ్ లేటెస్ట్ డిజైన్స్ ఫాన్సీ పతంగులు చిన్నారులను, నగరయువతను కనువిందు చేస్తున్నాయి. ధూల్‌పేటలో నెల ముందు నుంచే పతంగుల తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి హైదరాబాద్‌ మార్కెట్లో  చైనా, బనారస్, ఢిల్లీ, రాజస్ధాన్, జైపూర్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వెరైటీ డిజైన్ల పతంగులు కొలువుదీరాయి

వెరైటి కాగజ్, గిల్లోరా చాంద్, గిల్లోరా డోప్పన్, గిబియా, దూలా, ధూలెన్, చంద్ర, సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ, బాహుబలి క్లాత్ పతంగులతో పాటు టీం ఇండియా, బటర్ ఫ్లై, కార్టున్స్, చోటా భీం, బెన్ టన్, స్పైడర్ మాన్, డోరిమాన్, మిక్కి మౌజ్, మోటూ పత్లూ ఫాన్సీ చిత్రాలతో రూపొందించిన పతంగులు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. అయితే తాంగుస్ మాంజా, మొనోపలీ ప్లాస్టిక్ మాంజాలు నగరంలో బహిష్కరించడంతో చేతితో చేసిన మాంజా, గీటి మాంజాకు డిమాండ్ పెరిగింది. అన్నం అలువెరా, సీసం పొడి, కలర్లు, వంకాయ చింతపండుతో నూరి తయారు చేస్తున్న మంజాలకు ధూల్ పేట్ లో ఎగుమతి అధికంగా ఉంది. పావ్ పాండ్, ఆదా పాండ్, ఏక్ పాండ్, దో పాండ్ నైట్ కైట్స్, క్లాత్ కైట్స్  భారీ పతంగులు  కోనుగోలుకు సిద్ధంగా ఉంచారు. . 15 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వెరైటీ పతంగులు, 50 రూపాయల నుంచి 3వేల దాకా కాస్ట్లీ మాంజాలు అందుబాటులో ఉన్నాయి. తమ వ్యాపారంపై ధరల ప్రభావం ఎలా ఉన్న నిర్ణయించిన ధరలకే పతంగులను మాంజాలను విక్రయిస్తున్నారు వ్యాపారులు. ఈ ఏడాది చాలా వెరైటీ ఐటమ్స్ అందుబాటులో ఉంచామని ధూల్‌పేట్ వ్యాపారులు చెబుతున్నారు. పతంగుల అమ్మకాలు ఊపందుకోవడంతో భాగ్యనగరంలో సందడి పెరిగింది. సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసేందుకు చిన్నారులు ముచ్చటపడుతున్నారు. 

ఎన్ఆర్ఐ శాఖపై కేటీఆర్..నాయినీల సమీక్ష..

హైదరాబాద్ : ఎన్ ఆర్ఐ శాఖపై మంత్రులు కేటీఆర్..నాయినీలు సమీక్ష నిర్వహించారు. అక్రమ ఏజెంట్లపై చర్యలకు ప్రత్యేక డ్రైవ్ ను హోం శాఖ చేపట్టనుందని, ఈమైగ్రైడ్ లో రిజిస్టర్ చేసుకొనేందుకు ఏజెంట్లకు నెల రోజుల సమయం కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నమోదు చేసుకోని వారిని అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని హెచ్చరించారు. పదే పదే అక్రమాలకు పాల్పడే ఏజెంట్లపై పీడీ యాక్టు నమోదు చేయాలని పోలీసులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. 

ఒంటేరును విడుదల చేయాలి – టి.టిడిపి..

హైదరాబాద్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మందకృష్ణలను వెంటనే విడుదల చేయాలని టి.టిడిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు నేతలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఫిర్యాదు చేశామని..గవర్నర్ కి సమగ్ర వివరాలు అందించామని నేతలు తెలిపారు. మల్లన్న సాగర్ బాధితులకు ప్రతాప్ రెడ్డి అండగా నిలిచారని, ఆయనకు గజ్వేల్ లో ఆదరణ పెరుగుతోందని మోత్కుపల్లి పేర్కొన్నారు. కేసీఆర్ ఆయనపై కేసులు పెట్టిస్తున్నారని, చరిత్రలో ఉద్యమకారులను జైల్లో పెట్టిన దాఖలాలు లేవన్నారు.

బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా...

ఢిల్లీ : సెంచూరియన్ లో భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 

పడవ బోల్తా..40 మంది విద్యార్థులు..

మహారాష్ట్ర : దహాను సముద్ర తీరంలో 40 మంది విద్యార్థులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. నలుగురు విద్యార్థులు మృతి చెందగా 25 మందిని స్థానికులు కాపాడారు. దహాను సమద్ర తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన విద్యార్థుళ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 

13:57 - January 13, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ క్రికిట్‌ అసోసియేషన్‌పై  టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ ఫైర్‌ అయ్యారు. తనను హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తేలిందన్నారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోధాకమిటీ సిఫార్స్‌లను పరిగణలోనికి తీసుకోలేదని అజహార్‌ విమర్శించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని దీనిపై తాను  న్యాయపోరాటానికి రెడీ అవుతున్నట్టు అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. 

 

ఖమ్మంలో దారుణం

ఖమ్మం : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చర్చ్‌కంపౌండ్‌ సమీపంలోని రైలు పట్టాలపై కాశీ విశ్వనాథ్‌ అనే హోంగార్డ్‌తో పాటు మరో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేపడుతున్నారు. 

 

టార్గెట్‌లు పూర్తిచేయాలంటూ గుంజీళ్లు తీయించారు...

నెల్లూరు : ఏపీలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు బరితెగిస్తున్నాయి. ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్నాయి. నెల్లూరులోని వీవీ మొబైల్‌ డీలర్‌షిప్‌ సంస్థ కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోంది. చెనాకు చెందిన క్రిస్కీ కంపెనీ టార్గెట్‌లు పూర్తిచేయాలంటూ ఎంప్లాయిస్‌తో గుంజీళ్లు తీయించడం వివాదంగా మారింది. దీనిపై పోలీసులుగాని, కార్మికశాఖ అధికారులుగాని ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

13:53 - January 13, 2018

ఖమ్మం : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చర్చ్‌కంపౌండ్‌ సమీపంలోని రైలు పట్టాలపై కాశీ విశ్వనాథ్‌ అనే హోంగార్డ్‌తో పాటు మరో  ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేపడుతున్నారు. 

 

13:52 - January 13, 2018

నెల్లూరు : ఏపీలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు బరితెగిస్తున్నాయి. ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్నాయి. నెల్లూరులోని వీవీ మొబైల్‌ డీలర్‌షిప్‌ సంస్థ కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోంది. చెనాకు చెందిన క్రిస్కీ కంపెనీ టార్గెట్‌లు పూర్తిచేయాలంటూ ఎంప్లాయిస్‌తో గుంజీళ్లు తీయించడం వివాదంగా మారింది. దీనిపై పోలీసులుగాని, కార్మికశాఖ అధికారులుగాని ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

గవర్నర్ ను కలిసిన టీటీడీపీ నేతలు

హైదరాబాద్ : గవర్నర్ టీటీడీపీ నేతలు కలిశారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఫిర్యాదు చేశామని..గవర్నర్ కి సమగ్ర వివరాలు అందించామని నేతలు తెలిపారు. 

 

13:39 - January 13, 2018
13:38 - January 13, 2018
13:37 - January 13, 2018
13:27 - January 13, 2018

పశ్ఛిమగోదావరి : జిల్లాలోని భీమవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మాయిలు ఉత్సహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

13:25 - January 13, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల సంబరాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

13:17 - January 13, 2018
13:16 - January 13, 2018
13:15 - January 13, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు అన్ని చోట్ల పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులతో పండుగను జరుపుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఊళ్లకు పయనమవ్వడంతో బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో వస్త్ర, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 
పచ్చని తోరణాలతో సంక్రాంతికి స్వాగతం
ఏపీలో సంక్రాంతి కళ ఉట్టిపడుతోంది. పండుగ ప్రత్యేకతను చాటి చెప్పేందుకు జనం సిద్ధమవుతున్నారు. ప్రతి లోగిలి పచ్చని తోరణాలతో సంక్రాంతికి స్వాగతం పలుకుతోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పండుగ. ఈ పండుగకు ఎనలేని ప్రాధాన్యత ఉంది.  సంవత్సరమంతా ఉన్న పండుగలు ఒక ఎత్తైతే సంక్రాంతి పండుగ మరో ఎత్తు. సంక్రాంతిని తెలుగు రాష్ట్రంలోనే వారే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా సొంతూరికి తరలివెళ్తారు. కుటుంబసభ్యులంతా ఒక్క చోటికి చేరి పండుగ మూడురోజులు సంబరంగా జరుపుకుంటారు. రాష్ట్రంలోని లోగిళ్లు రంగవల్లులతో కళకళలాడుతున్నాయి. మహిళలు ముగ్గుల పోటీకి క్యూ కడుతూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతున్నారు. ఇక స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుండటంతో యువతులంతా ముగ్గుల పోటీల్లో ఆనందంగా పాల్గొంటున్నారు. రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నారు. 
జిల్లాల్లో సంక్రాంతి సందడి 
కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పండుగవేళ మూడురోజులు ప్రత్యేకంగా కనిపించేందుకు జనం సిద్ధమవుతున్నారు. కొత్తబట్టలు, కొత్త ఆభరణాల కొనుగోళ్లతో  వస్త్ర, బంగారు నగల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 
బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిటకిట 
ఇదిలా ఉంటే సంక్రాంతిని కుటుంబసమేతంగా నిర్వహించుకునేందుకు విద్యార్ధులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇలా అందరూ తమ ఇళ్లకు పయనమయ్యారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద  క్యూ కడుతున్నారు. దీంతో బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకునేందుకు జనం సిద్ధమవుతున్నారు. 

 

13:11 - January 13, 2018

హైదరాబాద్ : ప్రతిపక్ష వైసీపీలో రాజకీయాలు ఆ నలుగురు చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నా... విమర్శించాలన్నా...  లోపాలను ఎత్తిచూపాలన్నా.. ఆ నలుగురే. అధికారపక్ష నేత విమర్శలకు దీటుగా జవాబు ఇచ్చినా... తిప్పికొట్టాలన్నా ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కీలకంగా మారారు. వైసీపీలో ఆ నలుగురిపై 10 టీవీ ప్రత్యేక కథనం...
వీరికే జగన్ ప్రాధాన్యత 
వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజా.. అగ్రెసివ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని..  యాంగ్రీ యంగ్‌మేన్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. దూకుడు ప్రదర్శించే ఆళ్ల రామకృష్ణారెడ్డి... ఇప్పుడు పార్టీ రాజకీయాలు వీరి చుట్టూనే తిరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్‌ కూడా ఇప్పుడు వీరికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
కీలకంగా నలుగురు ఎమ్మెల్యేలు  
ప్రజా సమస్యలపై అటు అసెంబ్లీలో ఇటు  క్షేత్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కోర్టుల్లో కేసులు వేయడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి దిట్ట. టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీ అమల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తిచూపుతూ యువతను ఆకర్షించడంలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ కీలకంగా మారారు. చంద్రబాబును టార్గెట్‌ చేయడంలో కొడాలి నానిది ప్రత్యేక శైలి. 
ఫైర్‌ బ్రాండ్‌ రోజా ప్రత్యేక పాత్ర 
చంద్రబాబు విధానాలను ఎండగట్టడంతోపాటు వైసీపీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఫైర్‌ బ్రాండ్‌ రోజా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మహిళా సమస్యలు, డ్వాక్రా రుణమాఫీ వైఫ్యాలను ఎండగడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు సంధించడంలో ఎప్పుడే తనదే పైచేయి అని నిరూపించుకుంటారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో వీరికి ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోని తీసుకెళ్లాలని జగన్‌ ఆదేశించడంతో ఇప్పుడు వీరంతా జిల్లాల బాట పట్టారని వైసీపీలో వినిపిస్తోంది. దీంతో పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని అధినేత భావించినట్టు సమాచారం. 
ఈ నలుగురితో పార్టీకి మైలేజీ ఎంత..డ్యామేజీ ఎంత..?  
అయితే ఈ నలుగురితో పార్టీకి మైలేజీ ఎంత ఉందో... డ్యామేజీ కూడా అంతే ఉందని వైసీపీలోని సీరియర్లు చర్చించుకుంటున్నారు. వీరితో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిన సందర్భాల్లో నష్ట నివారణకు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి.. వంటి సీనియర్లు రంగంలోకి దిగాల్సి వస్తోందని చెబుతున్నారు. 

చెన్నైలో కొనసాగుతున్న శశికళ ఇళ్లపై ఐటీ దాడులు

తమిళనాడు : చెన్నైలోని శశికళ ఇళ్లపై  ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో శశికళకు చెందిన ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు రూ.4,500 కోట్ల ఆస్తులు గుర్తించారు. అటు  శశికళ వర్గీయుల ఇళ్లలోనూ కొనసాగుతున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో శశికళతోపాటు ఆమె వర్గీయుల ఇళ్లముందు పోలీసులు భారీభద్రతను ఏర్పాటు చేశారు.  

13:00 - January 13, 2018

తమిళనాడు : చెన్నైలోని శశికళ ఇళ్లపై  ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో శశికళకు చెందిన ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు రూ.4,500 కోట్ల ఆస్తులు గుర్తించారు. అటు  శశికళ వర్గీయుల ఇళ్లలోనూ కొనసాగుతున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో శశికళతోపాటు ఆమె వర్గీయుల ఇళ్లముందు పోలీసులు భారీభద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:58 - January 13, 2018

గుంటూరు : పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదగొట్టిపాడు దళిత కాలనీ సందర్శనకు  బయల్దేరిన  సీపీఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై అగ్రకులస్తుల దాడుల నేపథ్యంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నేతలను కాలనీ సందర్శనకు బయల్దేరారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు మదుతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అంతకు ముందు తెల్లవారుజాము నుంచే సీపీఎం నాయకుల ఇళ్లకు వెళ్లిమరీ పోలీసులు అరెస్టు చేశారు. గొట్టిపాడు మండల సీపీఎం కార్యదర్శి గంగాధరరావు, రాజధాని డివిజన్‌ సీపీఎం కార్యదర్శి  ఎం.రవితోపాటు కాకాని పట్టణానికి చెందిన పలువురు సీపీఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:51 - January 13, 2018

హైదరాబాద్ : ఏపీకి హైకోర్టు తరలింపు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లేఖతో... ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు సభ్యులతో  బిల్డింగ్‌ కమిటీని నియమించారు. త్వరలో ఈ కమిటీ విజయవాడ, గుంటూరులో పర్యటించి హైకోర్టు భవన స్థల పరిశీలన చేయనుంది. రెండు నగరాల్లో  తాత్కాలిక హైకోర్టుకు అనువైన భవనాలను ఎంపిక చేయనుంది.
హైకోర్టు విభజించాలని పట్టుపడుతున్న తెలంగాణ
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని. రెండు రాష్ట్రాలకు హైకోర్టు కూడా పదేళ్లపాటు కొనసాగాలని స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదేళ్లలో హైకోర్టు ఏర్పాటు చేసుకునేవరకు ప్రస్తుతమున్న హైకోర్టునే కొనసాగించాలని తెలిపింది. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధానిగా అక్కడి నుంచే పాలన సాగిస్తోంది. గతేడాది రాష్ట్ర పాలనా వ్యవస్థలో అంతర్భాగమైన  శానస, కార్యనిర్వాహకశాఖలు ఏపీకి తరలిపోయాయి. ప్రధానమైన న్యాయశాఖ మాత్రం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై... రెండు రాష్ట్రాల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. హైకోర్టును విభజించాలని... తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీలో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచే ఏపీ హైకోర్టు పనిచేసేలా... దానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామంటూ ముందుకువచ్చింది. ఒకేచోట రెండు హైకోర్టులు ఉండడం సాధ్యంకాదని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 
హైకోర్టులు ఏర్పాటు చేసుకునే యోచనలో రెండు రాష్ట్రాలు
ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు ఎవరికి వారు హైకోర్టులు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనను ముందుకు తీసుకొచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు విభజనపై దృష్టిసారించింది. ఏపీకి హైకోర్టును తరలించే విషయంపై శరవేగంగా చర్యలు ప్రారంభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌కు.... ఏపీ ప్రభుత్వం  హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన అనువైన భవనాలను పరిశీలన  చేయాలని లేఖ రాసింది. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ ఐదుగురు సభ్యులతో కూడిన బిల్డింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వారంలో కమిటీ సభ్యులు ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలతోపాటు మరికొన్ని భవనాలను పరిశీలన చేయనుంది. 
హైకోర్టు కోసం పలు భవనాలను సూచించిన ఏపీ
హైకోర్టు తాత్కాలిక భవనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని మేథా టవర్స్‌, ఇబ్రహీంపట్నం సమీపంలోని నోవా కాలేజ్‌లు ఉన్నాయి. గుంటూరు నగరంలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాలు, కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌, చుట్టుగుంట సెంటర్‌లోని హార్టికల్చర్‌  కార్యాలయ  భవనాలను కూడా కమిటీ సభ్యులు పరిశీలించే అవకాశముంది. 
దేనికి ఆమోముద్ర వేయనున్నారో ?
హైకోర్టు ఏర్పాటుకు విజయవాడ పరిసర ప్రాంతాలు అంత అనుకూలం కాదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది.  సిబ్బంది అద్దె ధరలు, ట్రాఫిక్‌ సమస్యలు, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో గుంటూరువైపే కమిటీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయి. నాగార్జున యూనివర్సిటీ అయితే  విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్యస్థంగా ఉన్నందున అందిరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయ వ్యక్తమవుతోంది. మరి కమిటీ సభ్యులు దేనికి ఆమోముద్ర వేయనున్నారో వేచి చూడాలి.
 

12:47 - January 13, 2018

హైదరాబాద్ : జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు కాలం కలిసిరావడం లేదా? సినిమాల పరంగా పవన్‌ పవర్‌ తగ్గుతోందా? రాజకీయంగా జనసేనాని జనంలోకి వెళ్లలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు.  ఒక పక్క  సినిమాలు ప్లాప్‌. ఇంకోపక్క రాజకీయ విమర్శలు. మరోపక్క వ్యక్తిగత ఆరోపణలు... వెరసి పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.  పవన్‌కు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై 10టీవీ కథనం..
జనసేనానికి కలిసిరాని కాలం
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వరుస కష్టాలతో సతమతమవుతున్నారు. పవన్‌కు కొన్నాళ్లుగా కాలం కలిసిరావడం లేదు. దీంతో ఆయన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు... పవన్‌ వ్యక్తిగత ప్రతిష్టకూడా దెబ్బతింటోంది. 
విమర్శలకు తావిస్తోన్న పవన్‌ తీరు
జనసేన పార్టీ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు పార్టీకి పవన్‌ ఓ రూపం తీసుకురాలేకపోయారు. ప్రజాసమస్యలపై అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నా... పవన్‌ను ప్రజలు పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌గానే భావిస్తున్నారు. అంతేకాదు... ఏపీ సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మాత్రమే పవన్‌ బయటకు వస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. జగన్‌ పాదయాత్ర మొదలుకాగానే.. పవన్‌ ఏపీలో పర్యటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిపోయి.. ప్రతిపక్షంపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు.  ఇది అనేక విమర్శలకు దారితీసింది. అంతేకాదు.. ప్రజారాజ్యంపార్టీ , పరిటాల రవితో తనకు జరిగిన అవమానం వివరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజకీయ విమర్శలతోపాటు.. పవన్‌ రాజకీయ అవగాహననే ప్రశ్నించేలా చేశాయి. 
పవన్‌ టార్గెట్‌గా కత్తి మహేష్‌ విమర్శలు
పవన్‌ ఫ్యాన్స్‌కు  - కత్తి మహేష్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కత్తి మహేష్‌... పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌గా అనేక విమర్శలు చేస్తున్నారు. దీంతో పవన్‌ మౌనం వహించడమెందుకన్నది సామాన్యుల ప్రశ్న. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్‌పై కత్తి చేసే విమర్శలకు ఆయన అభిమానులు అతిగా స్పందిస్తుండడం జనసేనానికి ఇబ్బందిగా మారుతోంది. 
డిజాస్టర్‌గా మిగిలిన అజ్ఞాతవాసి
పవన్‌పై వస్తున్న రాజకీయ విమర్శలకు, కత్తి మహేష్‌లాంటి వాళ్లు చేసే ఆరోపణలకు  సినిమా ద్వారా చెక్‌పెట్టవచ్చని అభిమానులు భావించారు. సంక్రాంతి రేస్‌గా వచ్చిన అజ్ఞాతవాసి హిట్‌ అయితే ఈ విమర్శలన్నిటీ సమాధానం చెప్పినట్టవుతుందని అనుకున్నారు. కానీ ఎన్నో అంచనాల మధ్య రిలీజైన అజ్ఞాతవాసి సాధారణ ప్రేక్షకుడి మాట అటుంచితే... పవన్‌ అభిమానిని కూడా మెప్పించలేకపోయింది. పవన్‌ సినీ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 
పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?  
ఈ మధ్య కాలంలో పవన్‌కు అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్‌ కలిసిరావడం లేదు. సినిమాలు నిరాశపర్చడంతో పవన్‌ ఇప్పటి నుంచైనా పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారా? లేక మరో సినిమాకు సిద్ధం అవుతారా? అన్నది ఆయన అభిమానులను కలవరపెడుతోంది. మరి పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

12:43 - January 13, 2018
12:43 - January 13, 2018
12:41 - January 13, 2018

హైదరాబాద్ : పండగపూట ప్రజలకు నగదు కష్టాలు తప్పడంలేదు.. నోట్లరద్దు తర్వాత.. జనాలకు కొన్ని రోజుల తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లు అనిపించినా  పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని ఏటీఎమ్‌లలో ఎక్కడ చూసినా నోక్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగరంలో నగదు కష్టాలపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..
మళ్ళీ నోట్లపాట్లు 
ప్రజలకు మళ్ళీ నోట్లపాట్లు మొదలయ్యాయి... సంక్రాంతి సమయంలో హైదరాబాద్‌లో  ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  బీఈ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో ఎలాగు నగదు పరిమితంగానే వస్తోంది. ఐతే ఏటీఎంలలో డబ్బు వస్తుందనుకుని వెళ్తున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. పండక్కు  ఊర్లకు వెళ్ళాలన్నా... షాపింగ్ చేయాలన్నా నగదు కావాలి. కానీ గత రెండు రోజులుగా ఏ ఏటీఎంకు వెళ్ళినా డబ్బులేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులు
ఏటీఎం కార్డులు పట్టుకుని ఎన్ని చోట్లకు తిరిగినా... నోక్యాష్‌  బోర్డులే దర్శనమిస్తున్నాయని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అకౌంట్లలో డబ్బున్నా కూడా పండగ పూట ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడుతున్నారు. మా డబ్బు మేము తీసుకోవడానికి కూడా బ్యాంకుల వారిని అడుక్కుంటున్నట్లు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు సమస్య కేవలం హైదరాబాద్‌ నగరంలోనే కాదు.. తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల్లోనూ ఏ ఏటీఎం ముందు చూసినా నో క్యాష్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

 

12:33 - January 13, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని సంజీవనగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో నలుగురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు రౌడీషీటర్లు కాగా..  గుట్కాప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తిని, బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసుఉల అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో 200 మంది పోలీసులు   తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  2కార్లు, 2ట్రాక్టర్లు, 43 బైకులు సీజ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:30 - January 13, 2018

హైదరాబాద్ : డ్రంక్ అండ్‌ డ్రైవ్‌కు హైదరాబాద్‌లో మరో ప్రాణం బలయింది. జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో  రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. మద్యంమత్తులో కారును నడిపిన యువకుడు చెట్టును ఢీకొట్టాడు. ఈప్రమాదలో విశ్వజిత్‌ అనే యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా మరోముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:28 - January 13, 2018

నల్గొండ : సంక్రాంతి పండుగతో సిటీజనం పల్లెబాటపట్టారు. సొంతవాహనాల తోపాటు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నల్లగొండ జిల్లాలోని పలు టోల్‌గేట్లవద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:16 - January 13, 2018

వనపర్తి : ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ... వారధిగా పనిచేస్తున్న ఏకైక ఛానల్‌ 10టీవీ అని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ప్రజాసమస్యలను వెలుగుతీయడంలో 10టీవీ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందన్నారు. సామాన్యుల బాధలు, కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ... ఆ సమస్యల పరిష్కారానికి తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను మేల్కొలిపే కథనాలు ప్రసారం చేస్తోన్న 10టీవీ సిబ్బంది, యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. 

 

11:42 - January 13, 2018

హైదరాబాద్ : సంక్రాంతి అంటే ప్రజలకు కేవలం పండగ... అదే దోపిడీ దొంగలకైతే పండగే పండగ. ఎందుకంటే... తాళాలు వేసిన ఇళ్ళను దోచుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోకి   కొన్ని ముఠాలు ఎంటర్‌ అయ్యాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. సో... అంతర్రాష్ర్ట దోపిడీ దొంగలపై  టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ... .
తాళాలు వేసిన ఇళ్ళే దొంగల టార్గెట్
పండగను ఎంజాయ్‌ చేసేందుకు ఊరెళ్తున్నారా... జాగ్రత్త... ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోకి  కొన్ని అంతర్రాష్ర్ట దోపిడీ ముఠాలు ఎంటర్‌ అయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్ళే టార్గెట్‌గా వారు తెగబడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇళ్ళు, అపార్ట్ మెంట్లలోకి చొరబడి అందినకాడికి దోచుకుంటాయని పోలీసులు అంటున్నారు.
దోపిడి ముఠాలపై అనుమానం
యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ముంబై, ఒరిస్సా తదితర రాష్ర్టాలకు చెందిన దోపిడి ముఠాలు...  దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  అందుకే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఆదిభట్ల, మీర్‌పేట, ఎల్బీనగర్, ముషిరాబాద్, అబిడ్స్, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పీఎస్‌ పరిధుల్లో అపార్ట్‌ మెంట్లలో చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్ళారు. నగరంలోని హుమయున్‌ నగర్ పీఎస్‌ పరిధిలో అటెన్షన్‌ డైవర్షన్‌ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకోసమే పోలీసులు ముందు జాగ్రత్తగా.. భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
సంక్రాతికి సగం సిటీ ఖాళీ
సిటీలో అసలే చైన్‌ స్నాచింగ్ బ్యాచ్‌లు కలకలం రేపుతుంటే.. మరోవైపు దోపిడీ ముఠాలు  రెచ్చిపోతున్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా అందికాడికి విలువైన సొత్తును దోచుకెళ్తున్నారు. సంక్రాంతి సెలవులతో దాదాపు సగం సిటీ ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే అదనుగా భావించే దొంగలు  దోపిడీలకు తెగబడే ప్రమాదం ఉందంటున్నారు పోలీసులు. దొంగల భారిన పడకుండా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు  సూచిస్తున్నారు. 
100, వాట్సాప్, ఎస్ఎంఎస్, హ్యాక్ఐకి తెలపండి : పోలీసులు
చోరీల గురించి సమాచారం ఇవ్వడానికి 100 కు కాల్‌ చెయ్యడం లేదా.. వాట్సాప్, ఎస్ఎంఎస్, హ్యాక్ఐ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడం చాలా మంచిదని పలువురు సీనియర్ సిటిజన్స్‌తోపాటు న్యాయవాదులు కూడా సూచిస్తున్నారు. దీని వల్ల క్రైమ్‌ రేటును తగ్గే అవకాశం ఉంటుందని వారంటున్నారు. పండగ సంబరంలో జాగ్రత్తలు మరిచిపోతే... ఇళ్ళుగుళ్ళవుతాయి... కాబట్టి ఊర్లకు వెళ్ళే వారంతా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

11:40 - January 13, 2018

హైదరాబాద్ : నగరం పల్లెబాట పడుతోంది. సంక్రాంతి  పండుగ సందర్భంగా నగరవాసులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ప్రయాణికుల రాకతో బస్‌, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే రద్దీకి తగ్గట్లుగా బస్సులు లేక ఇబ్బందులతో పాటు... అదనపు ఛార్జీలతో ప్రయాణికులపై భారం పడుతోంది.
సంక్రాంతి... పల్లెకు నగరం 
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరం పల్లెకు తరలిపోతోంది. జంటనగరాల్లోని రైల్‌, బస్‌ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాన టెర్మినల్‌ అయిన ఎమ్‌జీబీఎస్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జూబ్లీబస్టాండ్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్ నుండి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. 
టీఎస్ కు 1,910, ఏపీకు 1,352 బస్సులు 
నగరం నుండి తెలంగాణకు 1910 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు 1352 బస్సులను టీఎస్‌ ఆర్టీసీ కేటాయించింది. పండగవేళలో అత్యంత రద్దీగా ఉండే మహాత్మాగాంధీ టెర్మినల్‌తో పాటు లింగంపల్లి, చందానగర్‌, ఇసిఐఎల్‌, ఎస్సార్‌ నగర్‌, అమీర్‌పేట టెలిఫోన్‌ భవన్ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ఇక రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆన్‌లైన్‌ రిజర్వేషన్లకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  
ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోన్న ఆర్టీసీ
అయితే ఏటా పండుగలను టార్గెట్‌ చేస్తూ ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది ఆర్టీసీ. రెగ్యులర్‌ బస్సులతో పాటు 50 శాతం అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ పరిమితి దాటింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. బస్సు, రైల్వే టికెట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. 
ప్రైవేటు ట్రావెల్స్‌కు చెక్‌ పెట్టేందుకు చర్యలు : ఆర్టీసీ ఆర్ ఎమ్ 
ఈసారి ప్రైవేటు ట్రావెల్స్‌కు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు రంగారెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎమ్‌ యాదగిరి తెలిపారు. టెర్మినల్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులు ఆపకుండా ఉండేందుకు గట్టి ప్రణాళికలు రూపొందించామన్నారు. సొంత ఊరిలో పండుగను జరుపుకునేందుకు నగరవాసులు పయనమవడంతో నగరం ఖాళీ అవుతోంది. 

 

11:29 - January 13, 2018

ప్రభుత్వాల కంటే కోర్టులే ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నాయని అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. కోర్టుల వల్ల న్యాయం అందరికీ సమన్యాయం చేకూరుతుందని తెలిపారు. రాజకీయం వలన అధికారంలో ఉన్న వారికి మాత్రమే న్యాయం లభిస్తుందన్నారు. కోర్టులపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:20 - January 13, 2018
11:19 - January 13, 2018

ఢిల్లీ : సఫారీ గడ్డపై... బ్యాటింగ్‌లో ఆపసోపాలు పడుతున్న భారత్‌కు నేటి నుంచి రెండో గండం ప్రారంభమవుతుంది. తొలిటెస్టులో విజయానికి దగ్గరైనట్లే కనిపించి... చివర్లో ఓటమితో సరిపెట్టుకున్న కోహ్లీ సేన.. రెండో టెస్టుపై.. నమ్మకంతో ఉంది. సెంచూరియన్ పార్క్ వేదికగా... సౌతాఫ్రికాతో కోహ్లీ సేన సై అంటోంది. రెండో టెస్ట్‌లోఅన్ని విభాగాల్లో బలంగా  ఉన్న దక్షిణాఫ్రికా మరోసారి పేస్‌ బౌలింగ్‌తోనే భారత్‌ను  చిత్తు చేయాలని ప్లాన్‌లో ఉంది. 
సౌతాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైన టీమిండియా
భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌కు సెంచూరియన్‌ పార్క్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. టెస్టు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా 2వ ర్యాంకర్‌ సౌతాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్ట్‌కు కేప్‌టౌన్‌లో రంగం సిద్ధమైంది. తొలి టెస్ట్‌లో తేలిపోయిన కొహ్లీ అండ్‌ కో సెకండ్‌ టెస్ట్‌ నెగ్గాలని పట్టుదలతో ఉండగా....సిరీస్‌ విజయం సాధించాలని సఫారీ టీమ్‌ తహతహలాడుతోంది. 
బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్‌ 
తొలి టెస్ట్‌లో బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్‌ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది.  విరాట్‌,పుజారా,విజయ్‌,ధావన్‌ ,రోహిత్‌ శర్మ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నా స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చేతులెత్తేసింది. రెండో టెస్ట్‌లో రహానే, రాహుల్‌ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, మహమ్మద్‌ షమీ తొలి టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టారు. ఈ ముగ్గురిపై భారత జట్టు రెండో టెస్ట్‌లోనూ భారీ అంచనాలే పెట్టుకుంది. అశ్విన్‌ సైతం స్థాయికి తగ్గట్టుగా స్పిన్‌ మ్యాజిక్‌ చేస్తే భారత జట్టుకు బౌలింగ్‌లో తిరుగుండదు. 
భారత్‌ కంటే ధీటుగా సౌతాఫ్రికా  
మరోవైపు సౌతాఫ్రికా జట్టు భారత్‌ కంటే ధీటుగా ఉంది. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌  విఫలమైనా....పేస్‌ బౌలర్లే సఫారీ టీమ్‌కు సంచలన విజయాన్నందించారు. టెస్ట్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ భారత్‌పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 34 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.భారత్‌ 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరి ఈ డూ ఆర్‌ డై టెస్ట్‌లో టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. 

 

చిదంబరం ఇళ్లల్లో ఈడీ సోదాలు

చెన్నై : కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, ఢిల్లీలోని కార్యాలయాలు, ఇళ్లళ్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసు వ్యవహారంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

10:59 - January 13, 2018

నెల్లూరు : రోదసిలో భారత కీర్తిపతాక రెపరెపలాడింది. అగ్రదేశాలకే సాధ్యమైన ఫీట్‌ను సాధించిన భారత అంతరిక్ష కేంద్రం ఘన విజయం సాధించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్‌ను నింగిలోనికి పంపిన ఇస్రోకు సర్వత్ర ప్రశంశలు అందుతున్నాయి. తాజా విజయంతో ఈ ఏడాది చేపట్టబోయే చంద్రాయన్‌-2 ప్రయోగాన్ని మరింత ఉత్సాహంగా చేపడతామంటున్నారు. భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో ఘన విజయం సాధించింది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధవన్‌ అంతరిక్షకేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. 31 కృత్రిప ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. 
రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు 
పీఎస్‌ఎల్వీ సీ 40 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని రికార్డు సృష్టించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఉదయం 9గంటల 29 నిముషాలకు పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.  వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహంతో పాటు అమెరికా, బ్రిటన్ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడాలకు చెందిన 28ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-40 విజయవంతం కావడంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. అమెరికా, రష్యాల రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డును ఇస్రో సాధించింది. పీఎస్ఎల్వీ సీ-40 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి ఇస్రో ఇచ్చిన కొత్త సంవత్సర కానుక అన్నారు ఇస్రో చైర్మన్ శివన్.
పీఎస్‌ఎల్వీ సీ 40తో ఘన విజయం 
సరిగ్గా నాలుగు నెలల కిందట సెప్టెంబర్‌ 2న పీఎస్‌ఎల్‌వీ సీ 39 ప్రయోగం విఫలం చెందడంతో .. సొంత నావిగేషన్‌ వ్యవస్థను ఒడిసిపట్టాలన్న భారత్‌ ఆశలకు కొంత అవాంతరం ఎదురైంది. అపజయం ఎదురైనా.. మరింత పట్టుదలగా శ్రమించిన మన శాస్త్రవేత్తలు.. పీఎస్‌ఎల్వీ సీ 40తో ఘన విజయం సాధించారు. ఈ విజయం భవిష్యత్తులో చేపట్టబోయే చంద్రయాన్‌ - 2 , జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 డీ2 , జీశాట్‌-11 లాంటి ప్రయోగాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు ఇస్రో 
తాజా విజయంతో అంతరిక్షప్రయోగాల్లో భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తలకు సర్వత్రా ప్రశంలు వస్తున్నాయి. 

10:47 - January 13, 2018

విశాఖ : పట్టణంలో వాజీకేబుల్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా కాలేజీలో జరిగిన ఈ పోటీల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు పోటీపడి అందంగా సంప్రదాయ ముగ్గులను వేశారు.  బుల్లితెర నటీనటులు రాజ్‌కుమార్‌, వాజీ కమ్యూనికేషన్‌ అధినేత శ్రీనివాస్‌ ఈ ముగ్గుల పోటీలను ప్రారంభించారు. మరుగున పడుతున్న సంప్రదాయాలను వెలికి తీసేందుకే ఈ రంగవల్లుల పోటీ నిర్వహించినట్టు వాజీ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఎండీ శ్రీనివాస్‌ తెలిపారు. 

 

సీపీఎం నేత మధు సహా పలువురు నేతలు అరెస్టు

గుంటూరు : పెదగొట్టిపాడు దళిత కాలనీని సందర్శించేందుకు సీపీఎం నేతలు బయల్దేరారు. దళితులపై అగ్ర కులస్తుల దాడి నేపథ్యంలో సందర్శించేందుకు వెళ్తున్నారు. పార్టీ కార్యాలయం నుంచి సీపీఎం నేతలు బయల్దేరారు. పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువువరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మధు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తాడికొండ పీఎస్ కు తరలించారు. 

 

10:34 - January 13, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని సంజీవనగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు రౌడీషీటర్లు కాగా..  గుట్కాప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తిని, బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న మరో వ్యక్తిని పోలీసుఉల అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో 200 మంది పోలీసులు   తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  2కార్లు, 2ట్రాక్టర్లు, 6బైకులు సీజ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:31 - January 13, 2018

నల్గొండ : సంక్రాంతి పండుగతో సిటీజనం పల్లెబాటపట్టారు. సొంతవాహనాల తోపాటు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నల్లగొండజిల్లాలోని పలు టోల్‌గేట్లవద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:24 - January 13, 2018

కర్నూలు : జిల్లాలోని దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.  కోరామండల్‌ ఇంటర్నేషనల్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్ఓలో ఐపీఎస్‌ అధికారి ఆర్‌కె రవికృష్ణ పాల్గొన్నారు. కప్పట్రాళ్ల గ్రామాన్ని రవికృష్ణ దత్తత తీసుకోవడంతో... ప్రతిపేటా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్‌ ఆవరణలో  మహిళలు, పురుషులకు వేర్వేరుగా వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. 

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌

యాదాద్రి భువనగిరి : జిల్లాలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని సంజీవనగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు రౌడీషీటర్లు కాగా..  గుట్కాప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తిని, బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న మరో వ్యక్తిని పోలీసుఉల అదుపులోకి తీసుకున్నారు.

పలు టోల్‌గేట్లవద్ద భారీగా వాహనాలు

నల్గొండ : సంక్రాంతి పండుగతో సిటీజనం పల్లెబాటపట్టారు. సొంతవాహనాల తోపాటు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నల్లగొండజిల్లాలోని పలు టోల్‌గేట్లవద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

09:51 - January 13, 2018

నెల్లూరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. భోగి మంటలన వెలిగించారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు.  భోగి భాగ్యాలతోపాటు... చెడును తరిమి మంచిని ఆహ్వానించడమే సంక్రాంతి పండుగ ప్రత్యేక అన్నారు. ప్రకృతిని పరిరక్షించుకోవడం, సంప్రదాయాలను గౌరవించుకోవడం మన సంస్కృతిలో సమ్మిళితమై ఉందన్నారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 

 

09:48 - January 13, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో కోడి పందాలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 700 మందికి పైగా బైండోవర్ కేసులు పెట్టారు. తనిఖీల కోసం 60 ప్రత్యేక బృందాలను నియమించామంటున్న జిల్లా ఎస్‌పీ రవిప్రకాశ్‌తో 10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడి పందేల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 

09:38 - January 13, 2018

ఏలూరు : సీపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌తో ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగ సంఘాలు ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగాయి. ధర్నాకు దిగిన ఉద్యోగులతో  10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:33 - January 13, 2018

హైదరాబాద్‌ : నగరంలోని  ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. నగదు కొరత కారణంగా సంక్రాంతి సందర్భంగా .. షాపింగ్‌లు చేస్తున్నవారు, స్వగ్రామాలకు వెళ్తున్న వారంతా.. డబ్బులు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నగదు కొరతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.... 

09:31 - January 13, 2018

ఢిల్లీ : సిపిఎం పొలిట్‌ బ్యూరో కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. సుప్రీంకోర్టు వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే కీలక అంశాలను.. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తారని తెలిపింది. జడ్జిలకు కేసుల కేటాయింపుల్లో నిబంధనలను పాటించడం లేదన్న అంశాలు ప్రస్తావనకు వచ్చాయని పేర్కొంది. దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్యయుత నిర్వహణను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల మధ్య వివాదాలు సమిసిపోతాయని భావిస్తున్నట్లు సిపిఎం ప్రకటించింది.

 

నేడు నారావారిపల్లికి సీఎం చంద్రబాబు

చిత్తూరు : నేడు నారావారిపల్లికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈనెల 16న తిరిగి చంద్రబాబు అమరావతికి రానున్నారు.

 

Don't Miss