Activities calendar

14 January 2018

21:19 - January 14, 2018

గుంటూరు : జిల్లా పెదగొట్టిపాడులో ఈనెల 1వ తేదీన అగ్రవర్ణాల దాడిలో గాయపడిన జొన్నలగడ్డ ప్రకాశం, దేవబరణంను సీపీపీం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు పరామర్శింవచారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. దళితులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఈ సందర్భంగా మధు డిమాండ్‌ చేశారు. లేకుంటే టీడీపీ సర్కార్‌పై ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు అగ్రవర్ణాలకు వత్తాసుపలుకుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ అండచూసుకుని అగ్రవర్ణాలు... దళితులపై దాడులకు తెగబడుతున్నాయన్నారు. గాయపడిన దళితులకు తక్షణ పరిహారం అందించడంతోపాటు... వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. 

గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో దళితులపై దాడిచేసిన అగ్రవర్ణాలకు చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్‌ చేశారు. దళితులపై దాడిని నిరసిస్తూ భవిష్యత్‌లో భారీ ఉద్యమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఈనెల 24న ఛలో గుంటూరు చేపడుతున్నామన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళితులకు సంఘీభావంగా ప్రజాసంఘాలు గుంటూరులో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాయి. ఈ సమావేశానికి హాజరైన మధు.. దళితులకు జరిగిన అన్యాయంపై సీఎం, డీజీపీతోపాటు ప్రజాప్రతినిధులందరికీ లేఖ రాయనున్నట్టు తెలిపారు. 

 

 

21:16 - January 14, 2018

హైదరాబాద్‌ : శివార్లలోని చెంగిచర్ల వద్ద పెట్రోల్ ట్యాంకర్ల పేలుడు ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 ఆయిల్ ట్యాంకర్లు, ఐదున్నర లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బోడుప్పల్‌లోని భీంరెడ్డినగర్‌కు చెందిన కులాల్‌ రాజు, అతని సోదరుడు జగదీప్‌ కలిసి గత ఏడెనిమిదేళ్లుగా చెంగిచర్ల రహదారి సమీపంలో ఓ అక్రమ కార్ఖానా ద్వారా చమురు సంస్థలకు చెందిన ఆయిల్ ట్యాంకర్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా పెట్రోల్, డీజిల్‌, కిరోసిన్ చోరీ చేసి వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌ జోషీ తెలిపారు. వెల్డింగ్ ద్వారా ఆయిల్ తీసే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకొని పేలుడు జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులకు చమురు సంస్థల సిబ్బందితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై కూడా విచారణ జరుపుతామని జాయింట్ సీపీ తెలిపారు.

 

చెలరేగిన కోహ్లీ సేన...

ఢిల్లీ : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌ రసకందాయంలో పడింది. తొలిరెండు సెషన్లలో సఫారీలు ఆధిపత్యం చెలాయించగా... చివరి సెషన్‌లో కోహ్లీసేన చెలరేగింది. వెంటవెంటనే వికెట్లు తీసి మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

జోరుగా జల్లికట్టు...

చెన్నై : తమిళుల సంప్రదాయ ఆట జల్లికట్టు జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ప్రత్యేక చట్టం మేరకు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమే ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని అనుమతులు, నిర్వహణ, భద్రత అంతా దగ్గరుండి చూసుకుంటోంది. 

పెట్రోల్ ట్యాంకర్ల పేలుడు ఘటనలో...

హైదరాబాద్‌ : శివార్లలోని చెంగిచర్ల వద్ద పెట్రోల్ ట్యాంకర్ల పేలుడు ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 ఆయిల్ ట్యాంకర్లు, ఐదున్నర లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 

21:04 - January 14, 2018

హైదరాబాద్ : సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌లో భారీగా మంటలు ఏగిసిపడ్డాయి. ఎలాంటి జాగ్రత్తలూ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. జనావాసాల మధ్యలో బార్ ఉండడంతో చుట్టు ప్రక్కల కాలనీ వాసులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. 

21:01 - January 14, 2018

ఢిల్లీ : కోట్లాది మంది భక్తులకు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. శబరిమల కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడై దర్శనమివ్వడంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల కొండలు అయ్యప్ప నామస్మరణలో మారుమోగాయి. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.

20:56 - January 14, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు, గాలి పటాలతో పండుగ పసందుగా సాగుతోంది.

ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు... తెలతెలవారుతుండగా భోగిమంటలు... ఉదయాన్నే లోగిళ్లలో గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల సంకీర్తనలు..... నోరూరించే పిండివంటలు.. గాలి పటాలు.. చిన్నారుల సందడులు.. ఇవన్నీ కలిపితేనే సంక్రాంతి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. సంక్రాంతి పండుగలో మొదటిరోజైన భోగి ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దీంతో భోగ భాగ్యాల భోగీ వేడుకలు అంబరాన్నంటాయి.

ఏపీ సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో భోగిపండుగను ఘనంగా జరుపుకున్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు భోగిమంటలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు తన కుటుంబ సభ్యులు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో , సుభిక్షంగా ఉండాలని శ్రీవారి ప్రార్థించినట్టు చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి మండలంలోని పుల్లయ్యగారి పల్లెలో భోగిని ఘనంగా జరుపుకున్నారు. తిరుపతిలోని తన ఇంటిముందు భోగిమంటలు వేసి దానిచుట్టూరా తిరుగుతూ ఆడిపాడారు. అందరి జీవితాల్లో భోగిపండుగ భోగ భాగ్యాలను తేవాలని ఆకాంక్షించారు.ఏపీ రాజధాని అమరావతి, విజయవాడలో భోగి సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే ప్రజలంతా వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేశారు. దాని చుట్టూరా చేరి సందడి చేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు భోగిమంటల్లో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా భోగిమంటలు వేసి ఆడిపాడారు. యలమంచిలి మండలంలో జరిగిన భోగి వేడుకల్లో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదురాజు పాల్గొన్నారు. ఇరుగుపొరుగు కలిసి పండుగ జరుపుకోవడమే ఆసలైన ఆనందమని తెలిపారు. పొలం గట్లలో యువతుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి....

తూర్పు గోదావరి జిల్లా ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భోగి సెలబ్రేషన్స్‌ జోష్‌గా సాగాయి. చిన్నాపెద్దా కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా ప్రజలు భోగిమంటలు వెలిగించారు. ఒంగోలులో లయన్స్‌క్లబ్‌, వాసవీక్లబ్‌, ఉమెన్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన భోగి సంబరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోలాట ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక నృత్యాలు, పొంగళ్లతో బోగి సంబరాలు కన్నుల విందుగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి శిద్దారాఘవరావు, ఎంపీ వైసీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి పండగ సందడిగా సాగింది. తెల్లవారుజామునే ప్రజలు భోగిమంటలు వేసి దానిచుట్టూరా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విశాఖ ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ కళాకారులతో కలిసి ఆడిపాడారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు... కోలాటం, చెక్కభజన వారితో కలిసి స్టెప్పులేశారు

అనంతపురం జిల్లాలోనూ భోగి ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, పుట్టపర్తితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు భోగిమంటలు వేశారు. లోగిళ్లలో గొబ్బెమ్మలను పెట్టి పండుగ జరుపుకున్నారు. అనంతపురంలో వాసమీక్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకలో చిన్నాపెద్దా కలిసి గాలిపటాలను ఎగురవేశారు.

తెలంగాణలోనూ ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఐడీ కారిడార్‌లో భోగి వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. అపార్ట్‌మెంట్‌ వాసులు, కాలనీవాసులు భోగిమంటలు వేసి దానిచుట్టూ చేరి సందడి చేశారు. అక్కడే వంటలు చేసుకుని ఆరగించారు. మల్కాజ్‌గిరిలోని శారదానగర్‌లో భోగి పండుగ ఉత్సాహంగా జరాగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు, పాలపొంగులు, గంగిరెద్దులు, హరిదాసుల పాటలతో పండుగను సంతోషంగా జరుపుకున్నారు. 

20:55 - January 14, 2018

విజయవాడ : కోర్టు ఆదేశాలు.. పోలీసుల హెచ్చరికలు.. ఇవేవీ వారికి పట్టలేదు. ఎప్పటిలాగానే పందెంరాయుళ్లు జోరుగా కోడిపందేలు ఆడారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా పందెంరాయుళ్లు తరలివచ్చి మరీ పందేలు వేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. భారీ భారీ టెంట్లు... అదిరిపోయే పందెం కోళ్ల స్టంట్లు.. ఏపీలోని కోస్తాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టులు ఆదేశించినా.. పోలీసులు హెచ్చరించినా.. నిర్వాహకులు వాటినేమీ పట్టించుకోలేదు. నేతల అనుచరులు, వారి కుటుంబసభ్యులే ముందుడి పందేలు నిర్వహిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మధ్య బరుల్లో యథేచ్చగా కోడిపందేలు సాగుతున్నాయి. దీంతో పందేలు సాగుతున్న ప్రాంతాలు తిరునాళ్లలాగా మారాయి.

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు కోడిపందేల్లో పాల్గొంటున్నారు. పందెంరాయుళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. దీంతో బరిలో కోళ్లు కత్తులు దూస్తున్నాయి. రక్తమోడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం, మురమల్ల, ముమ్మడివరం, కాకినాడ, పల్లంకురుల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ చాలా చోట్ల కోళ్లకు కత్తులుకట్టి పందేలు నిర్వహిస్తున్నారు. మురముళ్లలో భారీ ఏర్పాట్ల మధ్య పందేలు జరుగుతున్నాయి. వీక్షకుల కోసం మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంతోపాటు పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వేలు రూపాయలు మొదలుకొని కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ జరుగుతోంది. కోడిపందేలా మాటున గుండాట, కోతముక్క, పేకాటతోపాటు ఇతర ఆటలు నిర్వహిస్తున్నారు. పందెంరాయుళ్లు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి మరీ పందెంకాస్తున్నారు.

కోడిపందేలను నిర్వాహకులు పగలు, రాత్రి అన్న తేడాలేకుండా నిర్వహిస్తున్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భారీగా కోడిపందేలు, గుండాట, పేకాట కొనసాగుతోంది. గుండుగోలను, పెనుగొండ, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల, దెందులూరు, నరసాపురం, పాలకొల్లు, తణుకు, చింతలపూడితోపాటు నిడదవోలులో రాత్రి కూడా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.

భీమవరం మండలం వెంపలో నిర్వహించిన కోడిపందేల్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పందేలను అడ్డుకోవటంతో... స్తానికులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు జంగారెడ్డిగూడెంలో గుండాటలో నిర్వాహకులు తమను మోసం చేస్తున్నారంటూ పందెంరాయుళ్లు చితక్కొట్టారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కోడిపందేలను పోలీసులు అడ్డుకునేప్రయత్నం చేశారు.

కృష్ణా జిల్లాలోనూ కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. గన్నవరం, ఇబ్రహీంపట్నంతోపాటు జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన శిబిరాల్లో యధేచ్ఛగా మూడుముక్కలాట, మద్యం అమ్మకాలు కూడా సాగుతున్నాయి. కోడి కాళ్లకు కత్తులు కట్టి జూదగాళ్లు బరిలోకి దింపుతున్నారు. భవానీపురంలో ప్రభుత్వవిప్‌ బుద్దా వెంకన్న కోడిపందేల వేడుకలను ప్రారంభించారు. సుప్రీం ఆదేశాల మేరకు.. పందేలు లేకుండా పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నగరంలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలను చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. 

20:37 - January 14, 2018
19:49 - January 14, 2018

'పెళ్లిచూపులు' సినిమా చూసిన వారు 'ప్రియదర్శి'ని మర్చిపోరు. అందులో హీరో ఫ్రెండ్‌గా కనిపించి డైలాగ్స్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. షార్ట్ ఫిలింస్..డైరెక్షన్..స్ర్కిప్ట్ రైటింగ్ తో ఆల్ రౌండర్ గా మారిపోయాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా నవ యువ కమెడియన్ 'ప్రియదర్శి'తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలియాచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

క్రిస్టల్ బార్ అండ్ రెస్టారెంట్ లో ప్రమాదం...

హైదరాబాద్ : సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్టల్ బార్ అండ్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదంతో కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. బార్ యాజమాన్యం ఎలాంటి ఫైర్ సేఫ్టీ పాటించలేదని తెలుస్తోంది. 

19:28 - January 14, 2018
19:27 - January 14, 2018

హైదరాబాద్ : కార్పొరేట్ దోపిడిని ఎదుర్కోవడం..అగ్రకులాల అధిపత్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడబోతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎస్వీకేలో బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...ఈనెల 25వ తేదీన బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ జరుగుతుందని, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం దాసోహమైందన్నారు. ధనవంతుల చేతుల్లోనే సంపద అంతా పోగవుతోందని, రాష్ట్ర సంపదలో అన్ని కులాలకు సమాన వాట సాధించేందుకు బీఎల్ఎఫ్ పనిచేస్తుందని తెలిపారు. బహుజన ఫ్రంట్ ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. 

18:33 - January 14, 2018
18:23 - January 14, 2018

42 బైక్ ల స్వాధీనం...

కాన్పూర్ : బైక్ లను దొంగతనం చేస్తున్న ముఠాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 42 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. 

18:07 - January 14, 2018

పశ్చిమగోదావరి : సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న పందాల విషయంలో పలు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోళ్ల పందాలు..గుండాట..పేకాట..లు జోరుగా నిర్వహిస్తున్నారు. వీటిని చూసేందుకు జనాలు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే జంగారెడ్డి గూడెం డివిజన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన బరిలో పేకాట, గుండాట జోరుగా సాగుతున్నాయి. కానీ గుండాటలో నిర్వాహకులు మోసం చేస్తున్నారని పందాల్లో పాల్గొన్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదం నిర్వహిస్తున్న నిర్వాహకులపై దాడికి దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. 

పండుగ పూట మార్కెట్ యార్డులో రైతులు..

కర్నూలు : పత్తికొండ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్కెట్ సిబ్బందికి, రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 15 రోజులుగా అధికారులు వేరు శనగ కోనుగోలు చేయకపోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్రా. గత కొన్ని రోజులుగా పడిగాపులు పడుతున్నారు. పండుగ పూట ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

16:44 - January 14, 2018

కడప : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బద్వేల్ లో మహిళ..వ్యక్తి కోసుకుకున్న గొంతులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం కలకలం రేపుతోంది. బద్వేల్ లో ఖాదర్ హుస్సేన్ చిన్న షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆ షాపుకు శాంతి అనే యువతి వెళ్లింది. కాసేపటికి గొంతు మీద గాటుతో శాంతి ఆర్తానాదాలు చేసుకుంటూ పక్కనే ఆసుపత్రికి పరుగెత్తింది. స్థానికులు షాపులోకి వెళ్లగా ఖాదర్ బాషా షాపులో గొంతు వద్ద కత్తిగాటుతో కుప్పకూలిపోయిన పరిస్థితిలో కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారు గొంతు కోసుకున్నారా ? గొంతు కోశారా ? అనేది తెలియరావడం లేదు. వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. 

16:39 - January 14, 2018

పశ్చిమగోదావరి : జిల్లా వ్యాప్తంగా కోళ్ల పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ వెంప ప్రాంతంలో మాత్రం కోళ్ల పందాలు జరుగకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తీరు పట్ల గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతటా జరుగుతుంటే ఇక్కడే ఎందుకు అడ్డుకుంటున్నారని ఎదురు ప్రశ్నించారు. పోలీసుల చుట్టూ చేరి పోలీస్ డౌన్..డౌన్..అంటూ నినాదాలు చేశారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలికి వెళుతున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:32 - January 14, 2018

భవానీపురంలో కోళ్ల పందాలు...

విజయవాడ : భవానీపురంలో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. కోడి పందాలను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రారంభించారు. పందెం రాయుళ్లతో భవానీపురం సందడిగా మారింది. 

16:17 - January 14, 2018
16:12 - January 14, 2018

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ప్రధానంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి జోరు కొనసాగుతోంది. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో పందాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కోళ్ల పందాలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నారు. బరులు ఏర్పాటు చేసి కోళ్లను పందాలకు దింపుతున్నారు. పందాల్లో పాల్గొనే వారికి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరోవైపు కోళ్ల పందాలతో పాటు ఇతర పందాలు కూడా కొనసాగుతున్నాయి. గుండాట, పేకాట పందాల్లో జనాలు భారీగా పాల్గొంటున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

16:09 - January 14, 2018

కృష్ణా : జిల్లాలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఈ కోళ్ల పందాలపై సుప్రీంకోర్టు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకోవాలని..ఇతర జూదాలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ పోలీసుల నిబంధనలు పట్టించుకోని పలువురు యదేచ్చగా బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. చిల్లకల్లు మాత్రం కొంత వెరైటీ పందాలు నిర్వహించారు. కత్తులు కట్టకుండా కోళ్లను బరుల్లోకి దింపారు. ఈ పందాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

వెంపలో పోలీసు పహారా..

పశ్చిమగోదావరి : భీమవరం (మం) వెంపలో పోలీసు పహారా కొనసాగుతోంది. కోళ్ల పందాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వెంప గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రం మొత్తం కోడి పందాలు జరుగుతున్నా మమ్మల్నే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

మురుమల్లలో జోరుగా కోళ్ల పందాలు...

పశ్చిమగోదావరి : ముమ్మిడివరం నియోజవకర్గం ఐ.పోలవరం (మం) మురుమల్లలో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈ పందాలు జరుగుతున్నాయి. వీఐపీల కోసం ఒకటి, సామాన్యుల కోసం ఒకటి బరులు ఏర్పాటు చేశారు.

చిల్లకల్లులో కోళ్ల పందాలు...

కృష్ణా :  జిల్లాలోని జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. 

15:36 - January 14, 2018

పశ్చిమగోదావరి : సంక్రాంతి పండుగ...తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ చూసినా పందాల సందడి నెలకొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కోళ్లను బరుల్లోకి దింపుతున్నారు. కోళ్ల పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి జనాలు భారీగా తరలివస్తున్నారు. ఈ పందానలు చూడటానికి హైదరాబాద్ నుండి ఓ కుటుంబం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చింది. జిల్లాలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద కోళ్ల పందాలను తిలకించారు. ఈ సందర్భంగా వారితో టెన్ టివి మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:32 - January 14, 2018
15:27 - January 14, 2018

తూర్పుగోదావరి : పోలీసులు పలు ఆంక్షలు విధించినా పందాల నిర్వాహకులు ఏ మాత్రం ఖాతర్ చేయడం లేదు. పెద్దస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కోళ్లకు వివిధ రకాల పోషక పదార్థాలు ఇచ్చి కొన్ని రోజులుగా శిక్షణనిచ్చిన అనంతరం బరుల్లోకి దింపుతున్నారు. పందాల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజుల క్రితం పందాలు నిర్వహించే వారిపై..నిర్వహించవద్దని హెచ్చరించిన పోలీసులు ఆదివారం రోజు వచ్చే సరికి పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. అధికార పార్టీ..విపక్ష పార్టీలకు చెందిన నేతలు స్వయంగా రంగంలోకి దిగి పందాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, పోలీసులకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

15:19 - January 14, 2018

కృష్ణా : సంక్రాంతి పండుగొచ్చేసింది...ఇంకేముంది పందాలకు తెరలేపారు. ముఖ్యంగా నిర్వహించే కోళ్ల పందాలపై నిబంధనలు పాటించాలని సుప్రీం చెప్పడం..పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో కోళ్ల పందాలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పాటించాలని...కోళ్లకు కత్తులు కట్టుకోకుండా ఆడించాలని పోలీసులు సూచించారు. గత నాలుగు రోజుల నుండి ఎలాంటి పందాలు నిర్వహించలేదు. కానీ ఆదివారం మధ్యాహ్నానికి పరిణామాలు మారిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బరులు ఏర్పాటు చేసి కోళ్ల పందాలు నిర్వహిస్తుండడం గమనార్హం. పోలీసులు ఎక్కడా అడ్డుకోవడం లేదని తెలుస్తోంది. వైసీపీ..టీడీపీ నేతలు దగ్గరుండి పందాలను నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బరుల్లో మద్యం ఏరులై పారుతోంది. కోళ్ల పందాలతో పాటు ఇతర జూదాలు సాగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టి బరుల్లోకి దింపుతున్నట్లు వేలల్లో బెట్టింగులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

తూర్పుగోదావరి..
ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. సంక్రాంతి సంబురాల పేరిట పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పందాల్లో పాల్గొనడానికి వివిధ నగరాల నుండి భారీగా జనాలు తరలివస్తున్నారు. కార్లు..ద్విచక్రవాహనాలతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. ముమ్మిడివరం నియోజవకర్గం ఐ.పోలవరం (మం) మురుమల్లలో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈ పందాలు జరుగుతున్నాయి. వీఐపీల కోసం ఒకటి, సామాన్యుల కోసం ఒకటి బరులు ఏర్పాటు చేశారు. నగరాల నుండి భారీగా జనాలు తరలివస్తున్నారు. కార్లు..దిచక్రవాహనాలతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కోళ్ల పందాలతో పేకాట కూడా జోరుగా కొనసాగుతోంది. రెవెన్యూ, పోలీసులకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారత్ కు వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని...

ఢిల్లీ : ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పాలం ఎయిర్ పోర్టులో నెతన్యాహుకు భారత ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆరు రోజుల పాటు నెతన్యాహు భారత్ లో పర్యటించనున్నారు. 

అత్యాచారాలకు పాల్పడుతున్న ఓలా క్యాబ్ డ్రైవర్...

మేడ్చల్ : కుషాయిగూడలో మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓలా క్యాబ్ డ్రైవర్ నాగమణి కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు యువతులపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

ప్రపంచకప్ లో గెలుపొందిన భారత్..

ముంబై : అండర్ 19 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. స్కోర్లు : భారత్ 328/7. ఆస్ట్రేలియా : 228 ఆలౌట్.

13:41 - January 14, 2018

సూర్యపేట : తిర్మలగిరిలో 10 టివి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. క్యాలెండర్ ను తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ ఆవిష్కరించారు.

 

13:38 - January 14, 2018


వరంగల్ అర్బన్ : జిల్లాలోని ఐనవోలులో 10 టివి క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 10 టివి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. 

13:32 - January 14, 2018

హైదరాబాద్‌ : నగరంలో పంతంగుల సందడి మొదలైంది. ఇంటర్ నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మూడవసారి నిర్వహిస్తున్న ఈ కైట్ పెస్టివల్‌కు దేశ- విదేశాల నుంచి కైటర్స్‌ నగరానికి చేరుకుంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్‌ ఫెస్టివల్‌తో పాటు..స్వీట్‌  ఫెస్టివల్‌ను మంత్రి చందూలాల్‌ ప్రారంభించారు. 3 రోజుల పాటు  ఈ కైట్‌ ఫెస్టివల్ జరగనుంది.
3వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ 
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో 3వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది. దేశ నలుమూలల నుంచి అభిమానులు ఈ ఫెస్టివల్‌కు తరలివస్తున్నారు. విదేశాల నుంచి సుమారు 40 మంది కైట్‌ ఫ్లయర్స్‌ ఈ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీయులు, బెంగాళీలు, రాజస్తానీయులు, కేరళ, తమిళనాడు, కర్ణాటక కైట్స్‌ ప్రియులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. సంక్రాంతి వస్తుందంటే చాలు ఓ పది, పదిహేను రోజుల ముందు నుంచే పిల్లలు పోటీ పడిమరీ పతంగులు ఎగురవేస్తారు. నగరంలో జరగుతున్న కైట్స్ ఫెస్టివల్‌కు మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఐర్లాండ్, స్కాట్లాంట్, ఆస్ట్రేలియా దేశీయులు పాల్గొననున్నారు. వివిధ అకారాల్లో సిద్ధం చేసిన కైట్స్ అకాశ వీధిలో కనువిందు చేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి వచ్చే కైట్‌ ఫ్లయర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టూరిజంశాఖ.
పోటీపడుతూ పతంగులు ఎగరవేత
పోటీపడుతూ సరదాగా పతంగులు ఎగురవేస్తారు. పిల్లలే కాదు పెద్దలు సైతం గాలిపటాలు ఎగురవేసి సంబరపడిపోతారు. మనరాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి14న ఈ పంతంగుల వేడుకను నిర్వహిస్తారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి జనవరి వరకు పంతంగుల దినోత్సవం జరుపుకుంటారు. చాలా చోట్ల ఈ పతంగుల దినోత్సవం నాడు పతంగుల ఎగురవేతను పోటీగా పెట్టి, విజేతలకు బహుమతులను కూడా ప్రధానం చేస్తారు. కైట్‌ ఫెస్ట్‌వల్‌ను చూసేందుకు నగరవాసులు  పెద్ద సంఖ్యలో పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటున్నారు.

13:26 - January 14, 2018

కృష్ణా : విజయవాడలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా భోగి మంటలు వేసి చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ  భోగి వేడుకల్లో ఎంతో సందడిగా పాల్గొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలంతా తమ పుట్టింటికి తరలి రావడంతో అన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంది. మహిళలంతా ముగ్గులు, ఆటల పోటీల్లో మునిగిపోయారు. మరోవైపు కోలాట ప్రదర్శనలతో సంబరాలు జరుపుకుంటున్నారు. విజయవాడలో భోగి వేడుకలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

13:23 - January 14, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోనూ కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పినప్పటికీ దానికి భిన్నంగా పందాలు జరుగుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు పందెం రాయుళ్లు భారీ ఎత్తున చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న కోడి పందాలపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం.. 

 

మురమళ్లలో జోరుగా కోడి పందాలు

తూర్పుగోదావరి : జిల్లాలో కోడి పందాలు ఊపందుకున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మురమళ్లలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రావు ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్నాయి. రెండు బరుల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వీఐపీల కోసం ఒకటి, సామాన్యుల కోసం మరొక బరి ఏర్పాటు చేశారు. నగరాల నుంచి భారీగా పందెంరాయుళ్లు తరలివచ్చారు. 

13:18 - January 14, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో కోడి పందాలు ఊపందుకున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మురమళ్లలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రావు ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్నాయి. రెండు బరుల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వీఐపీల కోసం ఒకటి, సామాన్యుల కోసం మరొక బరి ఏర్పాటు చేశారు. నగరాల నుంచి భారీగా పందెంరాయుళ్లు తరలివచ్చారు. కోడిపందాల ప్రాంతాల్లో వందల కొద్దీ కార్లు, బైక్ లు నిలిపి ఉంచారు. కోడి పందాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, పోలీసులకు భారీగా ముడుపులు అందాయని ఆరోపణలున్నాయి. మరోవైపు పేకాట జోరుగా సాగుతోంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:00 - January 14, 2018

హైదరాబాద్ : రోడ్లన్నీ బోసిపోతున్నాయి. రయ్యిన దూసుకెళ్లే వాహనాలన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయి. రణగొణ ధ్వనుల్లేవు. చెవులకు చిల్లులు పెట్టే హారన్‌ మోతలు లేవు. అంతా నిర్మానుష్యం. ఇంతకీ ఈ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది ఎక్కడో తెలుసా.....?
బిజీలైఫ్‌కు కేరాఫ్‌ అడ్రస్ హైదరాబాద్  
హైద్రాబాద్... ఉరుకుల పరుగుల జీవితానికి అసలు సిసలైన సింబల్‌. కాలంతో పోటీ పడుతూ సాగిపోయే బిజీలైఫ్‌కు కేరాఫ్‌ అడ్రస్. ఉపాధికి సరైన ప్లేస్ కాబట్టే రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి సైతం ఎందరో జంటనగరాలకు తరలివస్తారు. వీరందరికి ఆశ్రయమిచ్చే హైదరాబాద్ జనంతో కిటకిటలాడుతుంది. 
సొంత ఊర్లకు పరుగులు
కాని నిన్నటి నుంచి పరిస్ధితి తారుమారైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లన్నీ కళ తప్పాయి. దీనికి కారణం సంక్రాంతి పండగే. అందుకే హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ అమాంతం తగ్గింది. సంక్రాంతిని అన్ని వర్గాల వారు ఘనంగా జరుపుకుంటాయి. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో జరిగే అతిపెద్ద పండగ సంక్రాంతి. ఏడాదంతా హైదరాబాద్‌లో కాలంతో కుస్తీ పట్టే వాళ్లు కాస్తా సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంత ఊర్ల వైపు పరుగులు పెడతారు. రిజర్వేషన్ దొరక్కున్నా సరే బస్సో, రైలో, కారో పట్టుకుని ఊరికెళతారు. ఇలా అందరూ సొంత ఊర్లకు వెళ్లిపోవడంతోనే హైదరాబాద్ రోడ్లు ఖాళీగా మారాయి. 
జంటనగర వాసులు సంతోషం
అయితే ఈ నిశబ్దం మహా అయితే ఇంకో రెండు రోజులుంటుంది. తర్వాత హైదరాబాద్ ఎప్పటిలానే మారుతుంది. అవే ఉరుకులు పరుగులు, ట్రాఫిక్‌ జాంలు. కాని ఇంతటి ప్రశాంత వదనంలో ఉన్న హైదరాబాద్‌ను చూస్తుంటే మాత్రం మహాదానందంగా ఉందని జంటనగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

12:54 - January 14, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో భారీగా కోడిపందాలను నిర్వహిస్తున్నారు. అక్కంపాలెం, నిడదవోలు మండలం డి.ముప్పవరం, విజ్జేశ్వరం, సింగవరం, కాటకోటేశ్వరం, తాడిమల్ల, కోరుమామిడి , భీమడోలు మండలం గుండుగొలుసు, తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్లలో జోరుగా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. బెట్టింగులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

12:53 - January 14, 2018

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా  ఒకే రోజు కొత్త పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర భూ సర్వే వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సర్వే... దేశచరిత్రలోనే రికార్డ్‌ అని సీఎం   పేర్కొన్నారు.  
భూ సమగ్ర సర్వే దేశ చరిత్రలోనే రికార్డ్ : సీఎం కేసీఆర్ 
రాష్ర్టంలో 70 ఏళ్ళ తర్వాత నిర్వహించిన భూ సమగ్ర సర్వే  ఓ రికార్డ్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేవల్ల భూమి వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. దీనిఆధారంగానే కొత్తగా పాస్‌పుస్తకాలను ముద్రిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపారు. కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో నిర్వహించే ల్యాండ్‌ వెబ్‌ సైట్‌కు ధరణి అన్నపేరును ఖరారు చేసినట్లు తెలిపారు. అవితీనికి ఆస్కారం లేని కొత్త రిజిస్ర్టేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు..  
మార్చి 11న ఎమ్మార్వో ఆఫీసుల్లో రిజిస్ర్టేషన్లు ప్రారంభం
ఎమ్మార్వో కార్యాలయాల్లో మార్చి 11న రిజిస్ర్టేషన్‌ పనులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ర్టేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. దీంతో ఆ రెండు శాఖల మధ్య మరింత సమన్వయం సాధ్యమవుతుందన్నారు. అందుకోసం ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణకు రిజిస్ర్టేషన్‌ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం చెప్పారు.  
భూ సమగ్ర సర్వే పార్ట్‌ ఎ విజయవంతం 
వందరోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళనలో పార్ట్‌-ఎ విజయవంతమైందని సీఎం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు.  ఆ వివరాల ఆధారంగానే  పంట పెట్టుబడి మద్ధతు పథకం అమలు చేస్తామన్నారు. పార్ట్‌-బి కోసం  కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.   

12:49 - January 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో  పంచాయతీరాజ్‌ కొత్త చట్టం రూపకల్పనకు ఏర్పాటైన సబ్‌కమిటీ ముఖ్యమంత్రికి నివేదికను అందించింది. గ్రామ సర్పంచ్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికే  మొగ్గు చూపినట్లు తెలుస్తోంది..  ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వం ఈ చట్టానికి   ఆమోదముద్ర వేయనుంది.
సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చిన  కేబినెట్‌ సబ్‌కమిటీ
తెలంగాణ రాష్ర్టంలో కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం రూపకల్పనకు చేసిన కసరత్తు ముగిసింది. పంచాయతీరాజ్‌ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటైన  మంత్రి వర్గ ఉపసంఘం  తుదినివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేసింది. స్థానిక సంస్థల బలోపేతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. చాలావరకూ పాత పద్ధతికే మొగ్గు చూపినా.. కొన్ని అంశాల్లో మార్పు చేసినట్లు సమాచారం. రాజ్యాంగంలోని 73, 74 అధికరణం స్పూర్తికి ఎక్కడా నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గ్రామసర్పంచ్‌లకు విస్తృత అధికారాలు కల్పించేలా  కొత్త పంచాయతీరాజ్‌ చట్టం సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి.
దేశానికే ఆదర్శవంతంగా కొత్త చట్టం రూపకల్పన
ఈ సబ్‌కమిటీలో  సుదీర్ఘ అనుభవంగల వారే సభ్యులుగా ఉన్నారు. వారి అనుభవానికి తగ్గట్టుగానే  కొత్త చట్టానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌ పరిపాలనలో దేశానికే ఆదర్శంగా ఉండేందుకోసం కృషి చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం కేరళ, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ర్టాల విధానాలను అధ్యయనం చేసినట్లు సమాచారం. ప్రజల సౌలభ్యంతోపాటు.. గ్రామ పంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా చూడాలని నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది.
కో ఆప్షన్‌ సభ్యుల అంశంలో తుదినిర్ణయం సీఎందే
భవన నిర్మాణాల అనుమతులు, కనీస రుసుము వంటి అంశాలతో పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా రూపొందించారు.  వరుసగా రెండు ఎన్నికలకు ఒకే రిజర్వేషన్‌ అంశంతోపాటు, కో-ఆప్షన్‌ సభ్యుల నియామకంలో ఎన్నారైల అంశాన్ని కూడా సీఎం నిర్ణయానికే వదిలేసినట్లు సమాచారం. 
ప్రజాహక్కుల జాబితాకు ప్రాధాన్యం 
పరిశ్రమల ఏర్పాటుకు పంచాయతీల అనుమతులతో  పనిలేకుండా చట్టంలో పొందిపరచినట్లు తెలుస్తోంది. సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు కల్పిస్తూనే... అదే సమయంలో ప్రజా హక్కుల జాబితాను కూడా రూపొందించినట్లు సమాచారం. సర్పంచ్‌లపై కలెక్టర్‌ తీసుకునే చర్యలపై అప్పిలేట్‌ అథారిటీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న సిఫార్సు చేసింది. ముగ్గురు సంతానం ఉంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను ఎత్తేయడం సాధ్యం కాదని సబ్‌ కమిటీ తేల్చింది. ఈ నివేదికపై ప్రభుత్వం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించి చట్టాన్ని అమల్లోకి తేనుంది.

 

12:47 - January 14, 2018

చిత్తూరు : సంక్రాంతి పర్వదినంగా సందర్భంగా తిరుమల శ్రీవారిని చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని... నూతన రాష్ట్రంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి కావాలని దేవుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందన్నారు. 

 

12:44 - January 14, 2018

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ప్రధానంగా యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంజాయ్‌ చేస్తున్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే యువతులు... సంక్రాంతి పండుగ రోజు సాంప్రదాయంగా రెడీ అయ్యి పొలం గట్లపై సంతోషంతో గడుపుతున్నారు. భీమవరంలో తెలుగింటి అమ్మాయిల సందడిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

12:42 - January 14, 2018

వరంగల్ : సంక్రాంతి పండుగ ఆనందాన్ని వరంగల్‌లో విదేశీయులు సైతం ఆస్వాదిస్తున్నారు. ఘనంగా వారు సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. రంగవల్లుల నుంచి పిండి వంటల వరకు అన్నీ తమకు ఇష్టమని చెబుతున్నారు. వరంగల్‌లో విదేశీయుల సంక్రాంతి పండుగపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం.. 

12:20 - January 14, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. భీమడోలు మండలం గుండుగొలనులో కోడి పందేలాను ఎమ్మెల్యే వీరాంజనేయులు ప్రారంభిచారు. కవరేజ్ కు వెళ్లిన మీడియాపై కోడి పందేలా నిర్వహకులు దాడి చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదు. నిడదవోలు, జంగారెడ్డిగూడెంతోపాటు పలు ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:02 - January 14, 2018

సింగర్ విజయలక్ష్మీతో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పాటల కెరీర్ వివరించారు. చిన్నప్పటి నుంచి సినిమా పాటలపై ఎక్కువ ఇంట్రస్ట్ ఉందన్నారు. తనకు గ్రాస్పింగ్ ఎక్కువ అన్నారు. అమ్మనాన్నలిద్దరూ సింగర్స్ అని తెలిపారు. 8 సం.రాల నుండి పాటలు పాడుతున్నానని తెలిపారు. మొదటిసారిగా రవీంధ్ర భారతిలో స్టేజ్ పై సాంగ్ పాడానని తెలిపారు. తన ఆల్ టైమ్ హీరో హీరోయిన్స్ చిరంజీవి, శ్రీదేవి అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:53 - January 14, 2018

కాకినాడ : చీడ పీడను తొలగించుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటూ జరుపుకునే విశిష్టమైన పండుగ భోగి. అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా భోగి మంటలు వేసి పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద అంతా కలిసి సంతోషంగా పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు. కాకినాడలో భోగి సందడిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం.. 

కోస్తాంధ్రలో కోడిపందాల సందడి

పశ్చిమ గోదావరి : కోస్తాంధ్రలో కోడిపందాల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడిపందాలు జోరందుకున్నాయి. కోడిపందాలను పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. కోడిపందాల కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే... కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 

11:50 - January 14, 2018

పశ్చిమ గోదావరి : కోస్తాంధ్రలో కోడిపందాల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడిపందాలు జోరందుకున్నాయి. కోడిపందాలను పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. కోడిపందాల కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే... కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కేవలం సాంప్రదాయం కొనసాగించడం కోసమే కోడిపందాలు నిర్వహిస్తున్నామన్నారు రఘురామకృష్ణంరాజు. ఇదిలావుంటే కోడిపందాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తేతలి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను, సైకిల్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వీరిని ఢీకొన్న కారు మరో ఇంట్లోకి దూసుకువెళ్లింది. మృతులు వేండ్ర సత్యన్నారాయణ, సోమయ్యగా గుర్తించారు. సంక్రాంతికి అత్తవారింటికి భీమవరం నుండి వచ్చినట్లు తెలుస్తోంది. పండగరోజు ఇలాంటి దారుణం జరగడంతో బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. 

ఇన్నోవా, లారీ ఢీ..నలుగురు మృతి

నెల్లూరు : పండుగ పూట నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద ఇన్నోవా వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా మృతులు తోటలపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం వాసులుగా గుర్తించారు.  

 

11:38 - January 14, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తేతలి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను, సైకిల్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వీరిని ఢీకొన్న కారు మరో ఇంట్లోకి దూసుకువెళ్లింది. మృతులు వేండ్ర సత్యన్నారాయణ, సోమయ్యగా గుర్తించారు. సంక్రాంతికి అత్తవారింటికి భీమవరం నుండి వచ్చినట్లు తెలుస్తోంది. పండగరోజు ఇలాంటి దారుణం జరగడంతో బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:36 - January 14, 2018

పశ్చిమ గోదావరి : భోగి సంబరాలు ఏలూరులో ఘనంగా జరుగుతున్నాయి...45డివిజన్ లో కాలనీ వాసులంతా కలసి భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు... పిల్లలు, హుషారుగా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు కొడుతున్నారు... భోగభాగ్యాలతో ఈ సంక్రాంతి పండుగను అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నారు. భోగి  సంబరాలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

11:33 - January 14, 2018

నెల్లూరు : పండుగ పూట నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద ఇన్నోవా వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా మృతులు తోటలపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:14 - January 14, 2018

విజయనగరం : జిల్లాలో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా భోగి మంటలు వేశారు. తమ కష్టాలు తొలగిపోయి.. సుఖ సంతోషాలు రావాలని ఆకాంక్షించారు. భోగి సంబరాలపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం.. 

11:02 - January 14, 2018

కాకినాడ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సంబరాలు మొదలయ్యాయి. తొలిరోజు భోగ భాగ్యాలు పంచే భోగిని జరుపుకుంటున్నారు. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ వచ్చినా సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని ప్రాంతాల్లో భోగి మంటలు వేస్తున్నారు. అందరూ ఒక్క దగ్గర చేరి పండుగ జరుపుకోవడం చాలా సంతోషం ఉందని యూత్‌ అంటోంది. కాకినాడలో భోగి మంటల సందడిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:01 - January 14, 2018

విజయవాడ : తెలుగులోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయవాడలో భోగి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భోగిమంటలు వేశారు. రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు మల్లాది విష్ణు. టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడటం లేదంటున్న మల్లాది విష్ణుతో 10టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింంది.
ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

10:59 - January 14, 2018

నెల్లూరు : మంత్రి నారాయణ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. 32వ డివిజన్‌లో ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటలను ప్రారంభించారు. పాత ఆలోచనలకు స్వస్తి పలుకుతూ... పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తూ బోగిని జరుపుకుంటారన్నారు నారాయణ. ప్రతి పేదవాడు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక పథకాన్ని చేపట్టారన్నారు. 

 

10:57 - January 14, 2018

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నగరిలో భోగి వేడుకల్లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని రోజా ఆకాంక్షించారు. 

 

10:51 - January 14, 2018

చిత్తూరు : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇప్పటికే నారావారిపల్లెకు చేరుకున్న నారా చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు ఉదయాన్నే భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఏడాదిపాటు రైతులు కష్టపడి పండించిన పంట ఇంటికి చేరుకునే శుభ సందర్భంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని బాలకృష్ణ అన్నారు. పట్టణాల్లో కంటే పల్లెల్లో పండుగ వాతావరణం బాగా ఉంటుందని... అందుకే తాము నారావారిపల్లెలో పండుగ జరుపుకుంటున్నామన్నారు. 

10:15 - January 14, 2018

గుంటూరు :  ఏపీ రాజధాని అమరావతిలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. వెంకటాయపాలెంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని, జరుపుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

07:50 - January 14, 2018

ఢిల్లీ : సంక్రాంతి సందడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజధాని హస్తినకు కూడా పాకింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగువారు రంగ వల్లికలతో అలంకరించారు. హరిదాసుల గీతాలు, సంప్రదాయ నృత్యాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

07:48 - January 14, 2018

హైదరాబాద్ : కోడి సమరానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది. మూడురోజుల పండగ సమయం రానే వచ్చింది. ఇక ఆట మొదలైనట్లే... పందానికి కోళ్ళు కాలు దువ్వుతున్నాయి. తమదే రాజ్యం అన్నట్టుగా పందెం రాయుళ్ళు కాస్కో.. అంటుంటే... పోలీస్ అధికారులు మాత్రం ఖబడ్దార్‌ అంటున్నారు... ఏపీలో కోడి యుద్ధాలపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం....
సుప్రీంకోర్టు తీర్పుతో ఆనందంలో పందెం రాయుళ్ళు
ఆంధ్రప్రదేశ్‌ అంతటా కోడిపందాల ఫీవర్‌ పట్టుకుంది. తమ పుంజు వేటుకు మిగతావి  తొలొగ్గాల్సిందే.. అన్నంతగా బరులు సిద్ధమయ్యాయి. హైకోర్టు పందాలు నిర్వహించొద్దని హెచ్చరించినా.. సుప్రీం తీర్పుతో పందెం రాయుళ్ళ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
కోడిపందాలకు ఏర్పాట్లు సిద్ధం
కోడిపందాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా... ఆగమేఘాల మీద పందాలకు చకచకా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అన్నంతగా.. ఖాళీ స్థలాల్లో కనీవినీ ఎరుగని రీతిలో పందాలకు క్యూ కట్టారు. 
పందెం రాయుళ్ళని హెచ్చరిస్తున్న పోలీసులు
కోడిపందాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని  కోర్టు కోరిన విషయం విధితమే.. ఈ లోగా పందెం రాయుళ్ళను కట్టడి చేస్తామని పోలీసులు హెచ్చరిస్తుంటే... పందెం రాయుళ్ళు వారి హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని... కత్తులు కట్టకుండా ఆడుకోవచ్చని కోర్టు సూచనలు ఇచ్చిందన్న భరోసాతో పందానికి సై అంటున్నారు.  ఎలాగైనా కట్టడిచేస్తామని ప్రభుత్వ, పోలీస్ అధికారులు చెబుతున్నారు. 
దాడులు నిర్వహిస్తున్న ఎక్సైజ్‌  పోలీసులు
కోడిపందాలకు తోడు అసాంఘిక కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి.. విచ్చలవిడిగా  మద్యం అమ్మకాలు కూడా జోరందుకుంటాయి.. మొత్తానికి ఈ సారి సంక్రాంతికి ఏపీలో పోలీసులతోపాటు... ఎక్సైజ్‌ అధికారులు సైతం తమదైన రీతిలో దాడులు చేపట్టారు.
కాలంతో పాటు మారాలన్న సూచనలు
కోడిపందాలకు ఏపీ సీఎస్‌, డీజీపీలు బాధ్యత వహించాలని హైకోర్టు వారి బాధ్యతలను గుర్తు చేసింది. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  కానీ మారుతున్న కాలంతోపాటు మనమూ మారాలని... ఈ విషయం రాజకీయ నాయకులు,  ప్రభుత్వం గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఏర్పాట్లు 
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోళ్ళ పందాలకు రంగం సిద్ధం చేశారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దగ్గరుండి కోళ్ళపందాల తంతు నిర్వహిస్తున్నారు. కొందరు మంత్రులు, అధికారులు, కోళ్ళ పందాలు జరిగే ప్రాంతాలకు వెళ్ళొద్దని పోలీస్‌ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.  మొత్తానికి కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు. 

07:44 - January 14, 2018

ఆదిలాబాద్ : సంక్రాంతి పండుగంటే ఏపీలో కోడి పందేలు ఫేమస్‌. వివిధ రకాల పిండి పదార్థాలూ చేస్తారు. మరి సంక్రాంతి పండుగకు నిర్మల్‌ జిల్లా భైంసాకూ ఓ ప్రత్యేకత ఉంది.  తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా దొరకని స్వీట్‌ భైంసా పట్టణంలోని మిఠాయి దుకాణాల్లో లభ్యమవుతుంది. ఆ స్వీటునే గేవర్‌ అంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గేవర్‌ అమ్మకాలు ఊపందుకుంటాయి.  మైదాపిండితో స్వచ్ఛమైన నెయ్యి, పాలు ఉపయోగించి తయారు చేసే ఈ స్వీట్‌కోసం ప్రజలు ఎగబడతారు. భైంసా చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు.. వివిధ నగరాల నుంచి వచ్చి ఈ స్వీటును కొనుగోలు చేస్తారు.  విదేశాలకు ఈ స్వీటును ఆర్డర్లపై  పంపిస్తుంటారు. 

 

07:37 - January 14, 2018

చిత్తూరు : జిల్లాలోని తంబల్లపల్లి నియోజకవర్గం బి. కొత్తకోట మండలంలో ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పర్యాటకశాఖ మేనేజర్‌ మురళి, మహేష్‌తోపాటు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ వేడుకలతో హార్సిలీహిల్స్‌లో పల్లెవాతావరణం ఉట్టిపడింది.
గుంటూరులో 
గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలోని కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దుగ్గిరాల దోస్త్‌ సేవ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు. రంగోలి పోటీ కన్నుల పండుగగా సాగింది. భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.  భోగి మంటలు, గొబ్బెమ్మల పాటలతో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

07:26 - January 14, 2018

కడప : భోగ భాగ్యాలను ఇచ్చే భోగి వేడుకలు కడప నగరంలోని నెహ్రూపార్క్‌లో ఘనంగా నిర్వహించారు. వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు.  తోటివారితో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవడమే అసలైన సంక్రాంతి అని నిర్వాహకులు అన్నారు. 
ఏలూరులో 
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భోగి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నవారి నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ భోగి మంటలు వేసి సంక్రాంతి సందడిని మొదలు పెట్టారు.  కొత్త బట్టలతో ప్రత్యేక పూజలు చేసి భోగి మంటను వెలిగించి పాటలు పాడుకుంటున్నారు... ఏలూరులో జరుగుతున్న భోగి సంబరాలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 
అనంతపురంలో 
అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాల ఆవరణలో భోగీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పూల నాగరాజు భోగిమంటలను వెలిగించి వేడుకలు ప్రారంభించారు.  భోగిమంటలు వేసి దాని చుట్టూరా తిరుగుతూ సిబ్బంది, కళాకారులు ఆడిపాడుతున్నారు. సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ భోగి పండుగను జరుపుకున్నారు.  భోగి మంటల చుట్టూ కూచిపూడి కళాకారులు నృత్యాలు చేస్తూ అలరించారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం అయ్యాయి. పల్లెలు, పలు ప్రాంతాల్లో భోగీ మంటలు వేశారు. 

 

నేటి నుంచి భారత్ లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన

ఢిల్లీ : భారత్ లో నేటి నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటించనున్నారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. 

 

అండర్ 19 ప్రపంచకప్.. నేడు ఆస్ట్రేలియా..భారత్ మ్యాచ్

హైదరాబాద్ : అండర్ 19 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియా..భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది. 

నేడు సీపీఎం నగర కార్యాలయంలో దళిత సంఘాల ఐక్య సమావేశం

గుంటూరు : సాయంత్ర 4 గంటలకు సీపీఎం నగర కార్యాలయంలో దళిత సంఘాల ఐక్య సమావేశం జరుగనుంది. పెదగొట్టిపాడు దళితులపై దాడి ఘటనపై చర్చించనున్నారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య పాల్గొననున్నారు. 

Don't Miss