Activities calendar

16 January 2018

21:41 - January 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మార్పీఎస్  అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డిలను ఉత్తమ్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో పడిందన్నారు ఉత్తమ్. మందకృష్ణ, ఒంటేరులను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని.. ఉత్తమ్ డిమాండ్ చేశారు.

21:40 - January 16, 2018

గుంటూరు : కనుమ రోజు కూడా ఏపీలో కోడి పందేలు జోరుగా సాగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల మూడురోజుల పాటూ కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు. కోడిపందాలకు తోడు గుండాట, పేకాట, కోసు, బెట్టింగులు భారీగా కొనసాగాయి. ఈ పందాల్లో కోట్ల రూపాయలు చేతులుమారాయి. ఇంత జరుగుతున్నా అటువైపు అధికార యంత్రాంగం గానీ పోలీసులుగానీ కన్నెత్తి చూడలేదు. భోగి, సంక్రాంతి, కనుమ అనే తేడా లేకుండా ఏపీలో జోరుగా కోడి పందాలను నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని పందెంరాయుళ్లు సంప్రదాయమంటూ కోళ్లకు కత్తులు గట్టి నోట్ల కట్టలతో పందేలకు దిగారు. ఈ పందేల ముసుగులో పేకాట, గుండాట, కోసు లాంటి జూద క్రీడలు విచ్చలవిడిగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులుమారాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో 200 కోట్లకు పైగా చేతులు మారాయని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా రామలింగేశ్వర నగర్‌లో బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోయారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలు నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పందాల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జోరుగా కోడిపందాలు, గుండాట నిర్వహించారు. కోడి పందాల బరిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా.. అటువైపు పోలీసులు గానీ రెవిన్యూ యంత్రాంగంగానీ కన్నెత్తైనా చూడలేదు.

చీరపల్లిలో ఉద్రిక్తత
అటు పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం చీరపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటుచేసిన కోడిపందేల స్థావరం వద్ద పందెంరాయుళ్లు ఘర్షణ పడ్డారు. దీంతో కుర్చీలతో కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో కోడిపందేలను సంప్రదాయం ప్రకారం కాకుండా జూదంగా మార్చేశారని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. 'కోట్ల రూపాయల మేర కోడి పందేల రూపంలో చేతులు మారాయన్నారు. పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయిందని దీనికి అధికార పార్టీ నేతలే కారణమన్నారు. పేకాట, గుండాట, బెల్ట్‌ షాపులు, కత్తులు కట్టి కోడిపందేలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదని అంబటి ప్రశ్నించారు.కోడి పందేలు కాసేందుకు, గుండాటలు ఆడేందుకు జూదరులు ఎగబడ్డారు. సమీపంలోనే మద్యం, బిర్యానీ, మాంసం పకోడీ, శీతల పానీయాలు వంటివి అందుబాటులో ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు పందేలను తిలకించారు.

21:39 - January 16, 2018

హైదరాబాద్ : దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు కంపెనీల సీయివోలు, ప్రతినిధులతో బిజీ జిజీగా గడిపారు. వివిధ కంపెనీలను కలిసిన మంత్రి బృందం తెలంగాణ రాష్ర్టంలో ఉన్న వ్యాపార, పెట్టబడులు అవకాశాలను వివరించారు. ముఖ్యంగా అటోమోబైల్, టెక్స్‌టైల్,ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఆటోమోబైల్ దిగ్గజం హ్యూందయ్ కార్పొరేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌తో సమావేశమయ్యారు. కొరియా టెక్స్‌టైల్ సిటీగా పేరుగాంచిన దైగు మెట్రోపాలిటన్ నగరాన్ని కేటీఆర్ బృందం సందర్శించింది.

21:38 - January 16, 2018

హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో భేటీ అయ్యారు. మార్చి 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేSసారి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని, దీని కొరకు ప్రతీ గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. పాస్‌ పుస్తకాల పంపిణీలో ప్రజాప్రతినిధులతో పాటు.. అధికారులను భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో 93 శాతం భూమి
భూ రికార్డుల ప్రక్షాళనలో 93 శాతం భూమి, 92 శాతం ఖాతాలు వివాదరహితమైనవిగా తేలాయని సీఎం అన్నారు. కొన్ని చోట్ల మాత్రమే వివాదాలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి నెల చివరికల్లా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు నిర్వహించే రెవిన్యూ కోర్టుల స్థానంలో జిల్లా మొత్తానికి ఒకే ఒక రెవిన్యూ కోర్టు వుండేలా చర్యలు చేపట్టారన్నారు. రెవిన్యూ రికార్డుల నిర్వహణలో మార్చి 12 నుంచి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉండాల్సిన అవసరం లేదన్న సీఎం.. రాష్ట్రంలో రోజువారిగా జరిగే రిజిస్ట్రేషన్లు రెండున్నర వేల నుండి నాలుగు వేల వరకు వుంటాయన్నారు. ఇందులో 60 శాతం పట్టణ ప్రాంతాల్లో, 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వుంటాయన్నారు. ఇక ముందు ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు కూడా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తుంటాయన్నారు. మొత్తం 584 మండలాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలుంటాయన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్‌కు నెలల కొద్దీ సమయం పట్టాల్సిన అవసరం ఉండదని.. పాస్ పుస్తకాల్లో తక్షణమే ఎంట్రీలు, మార్పులు, చేర్పులు చేయాలన్నారు. దీన్ని వెంటనే "ధరణి" వెబ్ సైట్‌లో అప్ డేట్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. భూరికార్డుల ప్రక్షాళణ పూర్తయిన నాటి నుండి మార్చ్‌ 12 వరకు చోటు చేసుకుంటున్న క్రయ విక్రయాల వివరాలు కలెక్టర్లు అప్ డేట్ చేసి ధరణిలో ఎక్కించాలన్నారు. అలాగే షెడ్యూల్‌ ప్లెయిన్‌ ఏరియాల్లో సాదాబైనామా దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. మార్చి 12 తర్వాత సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించవద్దని కలెక్టర్లకు సూచించారు. భూ బదలాయింపులన్నీ రిజిస్ట్రేషన్‌ ద్వారాగానీ, వారసత్వ హక్కుగా మ్యుటేషన్‌ కానీ జరగాలన్నారు.

పంచాయితీ ఎన్నికలపై
అలాగే పంచాయితీ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో చర్చించారు. గ్రామ పంచాయితీల ఏర్పాటుకు పంచాయితీ, జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా భౌగోళిక హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాల లిటిగేషన్‌కు తావు ఇవ్వకుండా గ్రామ పంచాయితీలు ఏర్పాటు కావాలన్నారు. దీన్ని శాసన ప్రక్రియ ద్వారా చేయబోతున్నామని చెప్పారు. ఇప్పుడున్న 8 వేల 684 గ్రామపంచాయితీలకు అదనంగా మరో నాలుగు వేల గ్రామపంచాయితీలు ఏర్పాటు కావచ్చన్నారు. నూతన పంచాయితీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. దీని కొరకు ఎన్నోరకాల చర్యలు జరిపామని.. ఇంకా జరుపుతున్నామన్నారు. సర్పంచ్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్దతా.. పరోక్ష పద్దతా అనేది కూడా చర్చిస్తున్నామన్నారు. 

21:37 - January 16, 2018

యూపీ : ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఢిల్లీ నుంచి ఆగ్రా చేరుకున్న ఇజ్రాయిల్‌ ప్రధానికి ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. తాజ్‌ మహల్‌ ముందు ఉన్న బెంచ్‌పై నిల్చుని నెతన్యాహు, ఆయన భార్య ఫొటో దిగారు. నెతన్యాహు రాకతో తాజ్‌మహల్‌కి 2 గంటల పాటు సందర్శకులను అనుమతించలేదు. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదికి గాల్‌ మొబైల్‌ వాటర్‌ జీప్‌ను గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. నీటి శుద్ధి కోసం వాడే ఈ జీపు ఖరీదు 75 లక్షలు. విపత్తులు వచ్చినపుడు ఈ జీపును వినియోగిస్తారు.  

కందుల కొనుగోళ్లపై హరీష్ రావు అసంతృప్తి

హైదరాబాద్: కందుల కొనుగోళ్ల చెల్లింపులు పెండింగ్ పై మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు చెల్లించాల్సిన రూ.147 కోట్లను వెంటనే చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

20:35 - January 16, 2018

రెండువేల ఇర్వై ఆరు దాక తెలంగాణ, ఆంధ్రల నియోజకవర్గాల పెంపు ముచ్చటనే ఉండది అని మొన్నటిదాక కేంద్రమోళ్లు మొత్తుకున్నరు.. ఈడ రాష్ట్రాధిపతులు మాత్రం.. పెంపు ఖాయం.. త్వరలో పెంపు అని చెరికల కార్యాన్ని సజావుగ నడ్పుకున్నరు... ఇంతకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెర్గుతయా.. లేదా.?. ఇయ్యాళ బీజేపీ మన్సుల ఏమున్నది..? ఒక్కపారి జూద్దాం..

ఒక ముచ్చట రైతులను చాల కన్ఫ్యూజ్ జేస్తున్నది.. తెలంగాణ సర్కారేమో.. మార్చి పదకొండు తారీఖు సంది రైతులకు కొత్త పాసుపుస్తకాలిస్తమంటున్నది.. ఇచ్చుడు అయ్యేపనేనా..? అనేది అనుమానం.. ఎందుకంటె సర్కారు పాత పాస్ బుక్కులను రద్దు జేశి కొత్తయి ఇస్తమంటే బ్యాంకులు ఒప్పుకుంటయా..? బ్యాంకులకు పాసుబుక్కులకు సంబంధం ఏందో సూడుండ్రి ముందు..

మోసం, దగా, కుట్ర, నయవంచనా.. అవినీతి.. అక్రమాలు.. ఇన్నిగల్పితె తెలంగాణ సర్కారట.. అవినీతి అనే పదాన్ని అద్దంముంగట వెడ్తె..అండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం గనిపిస్తదట.. అంత ఆగమున్నదట తెలంగాణల పరిపాలన.. రైతులు మోసపోయిండ్రు, నిరుద్యోగులు మోసపోయిండ్రు.. డ్వాక్రా మహిళలు మోసపోయిండ్రు.. లాభపడ్డది ఒక్క కేసీఆర్ ఫ్యామిలేనట..

మింగ మెత్కులేదు మీసాలకు సంపెంగ నూనే అన్నట్టు.. మన తెలంగాణ ప్రభుత్వం ఏతులెట్లుంటయ్.?? ఓ మొగులు మీదికెళ్లి తెప్పలు దించి.. చెర్లు నింపుతున్నట్టు ముచ్చట్లు జెప్తరు.. తెప్పలుండయ్ లొట్టపీసుండది.. అన్ని ఏతులే.. ఎందుకోమరి ఈ తీర్గ పొంకనాలు గొడ్తది.. తాగెనీళ్లు లేని తండాలు గూడాలను జూశినంక గూడ మనమే నంబర్ వన్ అంటే.. నవ్వాల్నా ఏడ్వాల్నా సార్లూ..

ఏదివా ఓ బాతాల మోడీ..? అచ్చే దిన్ అచ్చేదిన్ అంటివి.. నీ అచ్చెదిన్ నోట్లు దుబ్బ.. సచ్చెదినమొచ్చింది జనం.. ఉప్పునిర్పకాయ ఇడ్సిపెట్టకపోతివి.. గాసం ధరలు వెర్గే.. పిట్రోల్, డీజీల్ ధరలు.. దేశం బుట్టిన సంది ఇప్పటిదాక ఇంత రికార్డు స్థాయిల వెర్గుడేనా అచ్చేదిన్ అంటే..? బొంబాయి దిక్కు అటీటు ఎన్బై రూపాలకు లీటరు పిట్రోలా..? బత్కాల్నా జనం సావాల్నా అయ్యా నీ ఉద్దార్కానికి..

జనవరి నెల వడ్డదంటే సాలూ.. ఇగ ఊర్లపొంటి జాతర్లు సుర్వైనట్టే.. మల్లన్న జాతర.. పోశమ్మ జాతర.. ఐలేని జాతర.. ఇవ్విటికి తోడు రెండేండ్ల కోపారొచ్చె సమ్మక్క సారక్క జాతర.. అటు నాగోబా జాతర.. తెలంగాణ అంతట ఇది జాతర్ల గడియలన్కోరాదుండ్రి.. ఆదిలాబాద్ జిల్లా కెళ్లి వరంగల్ జిల్లాదాక ఏడేడ ఏం జాతరైతున్నది కలెదిర్గొద్దాం పాండ్రి..

నెల్లూరు జిల్లాల ఒక పండుగ గమ్మతున్నది.. సంకురాత్రి పండుగలనే భాగమైనప్పటికీ.. అది జర్రంత వెరైటీగనిపిస్తున్నది..అంటె తెలంగాణల ముఖ్యమంత్రి హైద్రావాదుల దీవులనాడు అయితది ఇసొంటిదే.. సేమ్ అట్లాంటిదే నెల్లూరు కాడ సంకురాత్రి నాడైంది.. సమాధులళ్ల గూసోని తినె పండుగను జూశిండ్రా మీరెన్నడన్న సూపెడ్త రాండ్రి..

 

శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

కర్నూలు : జిల్లా శ్రీశైలంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. భ్రమంరబిక మల్లికార్జున పుష్పపల్లకి సేవలో ఊరేగారు. 

19:19 - January 16, 2018
19:15 - January 16, 2018

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది. మార్చి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని కోసం ప్రతి గ్రామంలో నోడల్ అధికారిని నియమించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ చట్ట సవరణపై కూడా చర్చించారు. తెలంగాణలో కొత్తగా 4వేల గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

దేవినేనికి హరీష్ రావు లేఖ

హైదరాబాద్: ఏపీ మంత్రి దేవినేనికి టీఎస్ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రాజోలిబండ డైవర్షన్ పై మరో సారి చర్చకు రావాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. మీకు అనుకూలమైన తేది, సమయం తెలియజేయాలని ఆయన లేఖ లో పేర్కొన్నారు. 

చెరువులో దూకి పేకాట రాయుళ్లు

కడప : జిల్లా పుట్లంపల్లి చెరువులో ముగ్గురు పేకాటరాయుళ్లు దూకారు. పోలీసులు వస్తున్నారనే భయంతో వారు చెరువులో దూకినట్టు తెలుస్తోంది.  గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

18:26 - January 16, 2018

కేంద్ర హోం మంత్రికి హరిబాబు లేఖ

గుంటురు : కేంద్ర హోం మంత్రికి బీజేపీ ఎంపీ హరిబాబు లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీకి కొత్త గవర్నర్, హకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కొరారు. హైకోర్టు కోసం ప్రభుత్వం భవనాలు అన్వేషిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

18:25 - January 16, 2018
18:19 - January 16, 2018

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహా' సినిమాపై మహీంద్ర ఆటోమోబైల్స్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర స్పందించారు. జైసింహా సినిమాలో బాలకృష్ణ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశాన్ని విష్ణు చైతన్య అనే నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్విటర్‌లో పంపించారు. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న సన్నివేశం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోందని.. దీన్ని మీరు కూడా చూడాలని ఆనంద్‌ మహీంద్రాకు ట్వీట్‌ చేశారు. ఈ సన్నివేశాన్ని చూసి మహీంద్ర కూడా అవాక్కయ్యారు. దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ..హాహా..బొలెరో కార్లను చెక్‌ చేయడానికి సర్వీస్‌ వర్క్‌షాపులు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు వాడనక్కర్లేదు అని సరదాగా ట్వీట్‌ చేశారు.

18:16 - January 16, 2018

మెదక్ : 10TV ప్రజల టీవీ అని అన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆమె 1OTV క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ... వారి సమస్యలను పాలకుల ముందుకు తెస్తున్న 10టీవీ సిబ్బందికి, 10టీవీ ప్రేక్షకులకు.. గీతారెడ్డి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

18:15 - January 16, 2018

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో నిషేధిత క్యాట్‌ఫిష్‌ పట్టుబడింది. 44 డబ్బాల్లో క్యాట్‌ఫిష్‌ను కోల్‌కత్తా నుండి బీదర్‌కు తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబందించి ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

యువతి సూసైడ్..
హైదరాబాద్ బోరబండలో 18ఏళ్ల యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గుర్తించిన స్థానికులు... ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే యువతి మృతిచెందింది. సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

18:12 - January 16, 2018

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా చంద్రబాబుకు దొరకడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు చంద్రబాబుకు ఏడాది సమయం పట్టిందన్నారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తాను రాష్ట్రం కోసం 30సార్లు ఢిల్లీ వెళ్లానని చెబుతుంటారని.. అయితే వాటివల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏ మేలు జరిగిందని బుగ్గన నిలదీశారు.

న్యాయస్థానాల మాటకు విలువ ఎక్కడ - అంబటి...
ఏపీలో న్యాయస్థానాలు చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఏపీలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి.. కోళ్లకు కత్తులు కట్టి.. పందేలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కళ్లముందే ఇంత జరుగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ 3 రోజులు పోలీసులకు సెలవులు ఇస్తే బాగుండేదని అంబటి సలహా ఇచ్చారు. 

18:10 - January 16, 2018

హైదరాబాద్ : బీసీలపై కేసీఆర్‌కు ప్రేమే ఉంటే ముందుగా క్రిమిలేయర్ ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ ఎత్తేయకుండా MBCల పేరుతో కేసీఆర్ మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఉన్నతపదవులు అనుభవించిన కేశవరావు, డీ.శ్రీనివాస్.. ఇప్పుడు టీఆర్ఎస్‌లో బానిస బతుకులుగా మారాయని పేర్కొన్నారు. 

18:08 - January 16, 2018

ఢిల్లీ : రెండోరోజుల కేంద్ర విద్యా సలహా సంఘం సమావేశాలపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు పూర్తిగా నిరుత్సాహ పరిచాయన్నారు. భేటీలో ప్రాధమిక ఉన్నత విద్యా ప్రమాణాల అభివృద్ధిపై ఉపసంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు.. తీసుకోవాల్సిన భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రానికి స్పష్టత లేదన్నారు కడియం. 

18:06 - January 16, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఇద్దరు దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. జూలూరుపాడ్‌ మండలం గుండెపూడిలో బడ్డీకొట్టు అమ్ముకుని జీవించే గాదె లక్ష్మి మెడలోంచి 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు ఇద్దరు దొంగలు. పారిపోతున్న ఇద్దరు దొంగలను చండ్రుగొండ, జూలూరుపాడు పోలీసులు, గ్రామస్తులు వెంబడించారు. ఇద్దరు దొంగలను పట్టుకున్న గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేశారు. వీరు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 

17:53 - January 16, 2018
17:50 - January 16, 2018
17:43 - January 16, 2018

హైదరాబాద్ : ఆర్డీఎస్ పనులు చేపట్టే విషయంలో మరోసారి ఏపీ ప్రభుత్వంతో చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇరు రాష్ట్ర మంత్రుల చర్చించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి దేవినేనికి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంగళవారం లేఖ రాశారు. కర్నాటక నీటి పారుదల శాఖతో చర్చించడం జరిగిందని, దీనిపై స్పందించాలని లేఖలో కోరారు. సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఫేజ్ 1 పనులన్నీ పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు పనుల వల్ల కర్నూలు జిల్లా రైతులతో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు..ఇతరత్రా అంశాలపై చర్చలు జరుపుతారు. 

దేవినేనికి హరీష్ లేఖ...

హైదరాబాద్ : ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆర్డీఎస్ పై మరోసారి చర్చిద్దామని, అనుకూలమైన తేదీ..సమయం చెప్పాలని లేఖలో కోరారు. 

17:29 - January 16, 2018

కృష్ణా : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన కనుమ రోజున పందాలు మరింత జోరందుకున్నాయి. జిల్లాలో ఏకంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. బరులు ఏర్పాటు చేసి కోళ్లకు కత్తులు కట్టి పందాలు కాస్తున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పందాలు ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు మద్యం ఏరులై పారింది. రామలింగేశ్వరనగర్ లో కూడా పందాలు జోరుగా సాగాయి. కానీ తాము కత్తులు కట్టి పందాలు నిర్వహించడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:24 - January 16, 2018

పశ్చిమగోదావరి : సంక్రాంతి..పండుగ మొదలవుతుందనగా హెచ్చరికలు..తీర్పులు..పండుగ ప్రారంభం కాగానే ఇవన్నీ ఏవీ అమలు కావు. పండుగ సందర్భంగా మూడు రోజులు జోరుగా పందాలు కొనసాగాయి. దాదాపు రూ. 300 నుండి రూ. 350 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 300 బరులు ఏర్పాటు చేసి పందాలను నిర్వహించారు. భోగీ పండుగ ప్రారంభం నుండే బరులు ఏర్పాటు చేసి పందాలను నిర్వహించారు. రాజకీయ వత్తిళ్లతో పోలీసులు చేతులెత్తేశారు. దీనితో ఎక్కడ చూసినా పందాలతో బిజీ బిజీగా గడిపారు.

పండుగ చివరి రోజైన మంగళవారం కొవ్వూరులో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బెట్టింగ్ విషయంలో డబ్బులు తేడా వచ్చిందనే కారణంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురి వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. 

17:18 - January 16, 2018

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన..పంచాయతీ రాజ్ ఎన్నికలు..మున్సిపల్ చట్ట సవరణపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. మార్చి 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని సూచించారు. అంతేగాకుండా మార్చి 12 నుండి టి. బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కు రూ. 2వేల కోట్లు కేటాయిస్తామని, ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై పరిశీలన చేయనున్నట్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల విధి విధానాలను శాసనసభలో ప్రవేశ పెట్టనున్న బిల్లులో పొందుపరుస్తామన్నారు. జిల్లా అధికారుల ప్రతిపాదనలకు అనుగుణంగా కొత్త గ్రామ పంచాయతీలకు భౌగోళిక హద్దులుండాలని, కోర్టు వివాదాలకు తావు లేకుండా పంచాయతీలు...శాసన ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడున్న 8,684 గ్రామ పంచాయతీలకు అదనంగా 4వేల పంచాయతీలు ఏర్పాటు కావొచ్చన్నారు. గ్రామ పంచాయతీకి పనుల అప్పగింతపై చర్చ జరిగిందని తెలిపారు.
వచ్చే ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి చేయలేకపోవడంతో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

17:16 - January 16, 2018

ఢిల్లీ : హజ్ యాత్ర విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. యాత్రకు ఇచ్చే సబ్సిడీని కేంద్రం నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. 1.75 లక్షల మంది హజ్ యాత్రికులపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు ఏటా హజ్ యాత్రికులకు రూ. 700 కోట్ల సబ్సిడీ ఖర్చు చేయనుంది. ప్రస్తుతం సబ్సిడీ ఎత్తివేయడంతో ఆ డబ్బులు మిగిలనున్నాయి. ఈ డబ్బులను ముస్లిం బాలికల విద్యకు ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ 22 ఎయిర్ పోర్టులున్నాయి. వీటిని 9కి తగ్గించారు. నౌకా

2012 లో సుప్రీంకోర్టు హజ్ సబ్సిడీపై పలు సూచనలు చేసింది. 2022 వచ్చే వరకు సబ్సిడీలు తగ్గించాలని, ఇతర సంక్షేమంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందని 2014 నుండే సబ్సిడీ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. 2022 వరకు గడువున్నా ఇప్పటికిప్పుడు తొలగించడం పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది. సబ్సిడీ ఎత్తివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరనున్నాయని తెలుస్తోంది.

మతోన్మాద అజెండాలో భాగమే - గఫూర్..
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ టెన్ టివితో మాట్లాడారు. మతోన్మాద అజెండా అమలు చేయడంలో ఒక భాగమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. హాజ్ యాత్ర అనేది ముస్లింలో ఒక విశ్వాసం ఉంటుందని..పేద..మధ్య తరగతి వారికి సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు. కుంభమేళా జరుగుతున్న సమయంలో ఎంతో ఖర్చు పెడుతుందని..బీజేపీ మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వమని తెలిసిందేన్నారు. మైనార్టీల విద్యాభివృద్ధి విషయంలో బడ్జెట్ లో కేటాయించడమే తప్పించి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. 

విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు - రావుల..

హైదరాబాద్ : విద్యపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టి.టిడిపి నేత రావుల పేర్కొన్నారు. కేజీ టూ పీజీ విద్యను అభినందిస్తామని, ఉన్న స్కూల్స్ ను మూసివేశారని తెలిపారు. 4637 స్కూల్స్ మూతపడ్డాయని అంచనా వేస్తున్నట్లు, జీవో 99 ఉందా లేదో విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 4200 స్కూల్స్ కి రూ. 2 లక్షల 10 వేల చొప్పున కేంద్రం నిధులు ఇస్తే ఒక్క స్కూల్ కు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. చదువు లేకుండా ఎన్ని పథకాలు పెట్టినా నిరుపయోగమన్నారు. పక్క రాష్ట్రంలో రెండు డీఎస్సీలు పూర్తయితే తెలంగాణలో ఒక్క డీఎస్సీ కూడా రాలేదన్నారు. 

కేంద్ర విద్యా సలహా సంఘం సమావేశంపై కడియం అసంతృప్తి...

ఢిల్లీ : కేంద్ర విద్యా సలహా సంఘం సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉప సంఘాలు ఇచ్చిన తీర్మానాలపై కేంద్రం తీరును మంత్రి కడియం తప్పు పట్టారు. కమిటీలు ఇచ్చిన తీర్మానాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకొసారి భేటీ నిర్వహించాలని కోరడం జరిగిందని, దేశంలో విద్యా వ్యవస్థ పటిష్టానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని..టీఆర్ఎస్ గురుకులాలను కేంద్ర మంత్రి జవదేకర్ అభినందించారన్నారు. కాలేజీల్లో విద్యార్థుల చేరికలకు ఆధార్ ను అనుసంధానించామని, తెలంగాణలో బోగస్ ఉపాధ్యాయ లేరన్నారు. 

హజ్ యాత్రకు సబ్సిడీ నో..

ఢిల్లీ : హజ్ యాత్రకు సబ్సిడీని కేంద్రం నిలిపివేసింది. 1.75 లక్షల మంది హజ్ యాత్రికులపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు ఏటా హజ్ యాత్రికులకు రూ. 700 కోట్ల సబ్సిడీ కానుంది. సబ్సిడీకి ఇచ్చే నిధులను ముస్లిం బాలికల విద్యకు ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. 

దౌండ్ లో కాల్పులు..ముగ్గురి మృతి...

మహారాష్ట్ర : పుణె సమీపంలోని దౌండ్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. 

మార్చి 12 నుండి టి. బడ్జెట్ సమావేశాలు - కేసీఆర్..

హైదరాబాద్ : మార్చి 12 నుండి టి. బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కు రూ. 2వేల కోట్లు కేటాయిస్తామని, ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై పరిశీలన చేయనున్నట్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల విధి విధానాలను శాసనసభలో ప్రవేశ పెట్టనున్న బిల్లులో పొందుపరుస్తామన్నారు. జిల్లా అధికారుల ప్రతిపాదనలకు అనుగుణంగా కొత్త గ్రామ పంచాయతీలకు భౌగోళిక హద్దులుండాలని, కోర్టు వివాదాలకు తావు లేకుండా పంచాయతీలు...శాసన ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామన్నారు.

అంకిరెడ్డి పల్లిలో విషాదం...

కర్నూలు : కొలిమిగండ్ల మండలం అంకిరెడ్డి పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తండ్రి విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. 

15:01 - January 16, 2018

సుప్రీంకోర్టు అసంతృప్త న్యాయవాదుల అంశంలో వివాదం సమసిపోయినట్టేనని బార్ కౌన్సిల్ ప్రకటించింది. సీజే..జడ్జీలకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, సుప్రీంకోర్టులో కార్యాకలాపాలు యదావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సమాంతరంగా కాల్వలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు. ఏపీలో కోళ్ల పందాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయా అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహ రెడ్డి (సీపీఎం), శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), మల్లు రవి (టి.కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని వ్యతిరేకిస్తామన్న వీహెచ్..

హైదరాబాద్ : కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. సర్పంచ్ లకు పరోక్ష ఎన్నికలు పెట్టి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ కు బిసీలపై చిత్తశుద్ధి ఉంటే క్రిమిలేయర్ ఎత్తివేయాలని, కులాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీల అభివృద్ధి కోసం పీసీసీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. 

కేసీఆర్ కు రేవంత్ లేఖ..

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టి.కాంగ్రెస్ నేత రేవంత్ బహిరంగల లేఖ రాశారు. ఖైదీల క్షమాభిక్ష విషయంలో మాట నిలబెట్టుకోలేదని..రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీల విడుదల విషయంలో హామీని నిలబెట్టుకోవాలని లేఖలో కోరారు. 

స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి...

తమిళనాడు : నాగపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆరుకాట్టుతురై బీచ్ లోకి ఎనిమిది మంది స్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. 

చిత్తూరు కరవు రహిత జిల్లాగా మారుస్తామన్న బాబు...

చిత్తూరు : నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను బాబు ప్రారంభించనున్నారు. కుప్పంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభిస్తామని, హంద్రీ - నీవా ద్వారా ఏడాదిలోగా తాగు, సాగునీరందిస్తామని, గ్రామస్థాయిలో పర్యాటకశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు. చిత్తూరును కరవు రహిత జిల్లాగా మారుస్తామని, నెల్లూరు ఎయిర్ పోర్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఏపీలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి అందిస్తామన్నారు.  

ఇచ్చాపురం వద్ద నిలిచిన గూడ్స్ రైలు...

శ్రీకాకుళం : ఇచ్చాపురం రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు నిలిచిపోయింది. వాక్యూమ్ లీక్ కావడంతో సిబ్బంది మరమ్మత్తులు చేస్తున్నారు. రైల్వే గేట్ కు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 

అసంతృప్త జడ్జీలతో సీజే సమావేశం...

ఢిల్లీ : అసంతృప్త జడ్జీలతో సుప్రీంకోర్టు సీజే సమావేశం జరుగుతోంది. 15 నిమిషాల పాటు సీనియర్ న్యాయమూర్తులతో మంతనాలు కొనసాగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

తాజ్ మహల్ ను సందర్శించిన నెతన్యాహు..

ఢిల్లీ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఆగ్రాలో పర్యటించారు. ఆగ్రా చేరుకున్న ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంరతం తాజ్ మహల్ ను నెతన్యాహు దంపతులు సందర్శించారు. 

లోయా మృతి విచారణ..వాయిదా..

ఢిల్లీ : జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ వకర్ లో డాక్యుమెంట్లను సుప్రీంకి సమర్పించింది. కేసుకు సంబంధించిన పరిస్థితులు అందరికీ తెలియాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వచ్చే వారానికి కేసును వాయిదా వేసింది. 

నగరిలో జగన్ పాదయాత్ర..

చిత్తూరు : వైసీపీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం నగరిలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీనిచ్చారు

13:38 - January 16, 2018

ఢిల్లీ : వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని మీడియా సమావేశంలో వెల్లడించారు. సోమవారం నుండి అదృశ్యమైన తొగాడియా బుధవారం ఓ పార్కులో అపస్మారకస్థితిలో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొగాడియా మాట్లాడారు....కేంద్రం తన గొంతును నొక్కాలని చూస్తోందని...గుజరాత్, రాజస్థాన్ పోలీసులు తనను వెంటాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, గుజరాత్ పోలీసులు అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడగానే పోలీసుల ఎదుట లొంగిపోతానని తొగాడియా పేర్కొన్నారు. 

13:33 - January 16, 2018

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంట సాయంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నూతన పంచాయతీరాజ్‌ చట్టం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపైనా కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మార్చి 11వ తేదీన ఒకేసారి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం

పట్టాదారు పాస్ పుస్తకాలు ఆయా గ్రామాలకు ఒక రోజు ముందే చేరుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, మండల కేంద్రం లేదా రెవెన్యూ కేంద్రం నుండి వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. పంచాయతీ రాజ్ కొత్త చట్టంపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చి నివేదిక కేసీఆర్ చర్చిస్తున్నారు. తండాలను పంచాయతీగా మార్చాలనే ప్రభుత్వ యోచనపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. 

13:29 - January 16, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నా పలు విమర్శలు..ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవినీతి..అవకతవకలపై ప్రధాని కార్యాలయం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణంపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంకు చెందిన రిటైర్డ్ టీచర్. జే. చౌదరయ్య ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖను పీఎంఓ కార్యాలయం కేంద్ర జలవనరుల శాఖకు కూడా పంపించారు. దీనిపై విచారణ జరిపించి తగిన సమాధానం చెప్పాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:24 - January 16, 2018

కర్నూలు : సంక్రాంతి పండుగ అయిపోయింది..బుధవారం కనుమ..ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఏపీ రాష్ట్రంలో కనుమ పండుగ సందర్భంగా మాంసాహారాన్ని ఇంటికి తెచ్చుకుంటుంటారు. కానీ కర్నూలు నగరంలో చికెన్..మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. అనారోగ్యంతో ఉన్న కోళ్లు..గొర్లు..పొట్టెళ్ల మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా పలు కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. అనారోగ్యంతో ఉన్న జీవాల మాంసాన్ని అమ్ముతున్నారని దీని ఫలితంగ రోగాలు వ్యాపిస్తున్నాయని ఇలా చేయడం సరి కాదని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్ లో పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. 

13:18 - January 16, 2018
13:10 - January 16, 2018

తమిళనాడు : రాష్ట్రంలో మరో పార్టీ పురుడు పోసుకోనుంది. జయలలిత మృతి అనంతరం ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా శశికళకు ప్రధాన అనుచరుడిగా ఉన్న దినకరన్..పన్నీర్ సెల్వం..పళనీ సెల్వం వర్గాల మధ్య తీవ్రమైన విబేధాలు నెలకొన్నాయి. అనంతరం వివిధ పరిణామాల మధ్య పన్నీర్ సెల్వం..పళనీ సెల్వంలు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అనంతరం దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

తాజాగా నూతనంగా ఓ పార్టీని స్థాపించనున్నట్లు మంగళవారం దినకరన్ కీలక ప్రకటన వెల్లడించారు. ఇప్పటికే రజనీకాంత్..కమల్ హాసన్ లు పార్టీలు స్థాపించనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటుపై బుధవారం దినకరన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయనున్నారో దానిపై ఉత్కంఠ నెలకొంది. 

దినకరన్ కొత్త పార్టీ...

తమిళనాడు : రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిష్కృతం కానుంది. శశికళ అనుచరులతో కలిసి కొత్త పార్టీని దినకరన్ ప్రకటించనున్నారు. పార్టీ ఏర్పాటుపై బుధవారం దినకరన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయనున్నారో దానిపై ఉత్కంఠ నెలకొంది. 

13:00 - January 16, 2018

తమిళనాడు : రాష్ట్రంలో మూడో రోజు జల్లికట్టు కొనసాగుతోంది. మధురై జిల్లా అళంగనల్లూరులో జల్లికట్టు పోటీలను ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ప్రారంభించారు. ఉత్సవాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

12:58 - January 16, 2018

తూర్పుగోదావరి : జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పశువుల్లంక రేవు వద్ద స్నానానికి వెళ్లి గల్లంతైన ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం ముగ్గురు యువకులు స్నానానికి వెళ్లగా... పోతుల అనిల్‌ అనే యువకుడిని స్థానికులు రక్షించారు. మిగతా ఇద్దరు పోతుల శ్యామ్‌, రేవు కల్యాణ్‌లు గల్లంతయ్యారు. నిన్నటి నుంచి గాలింపు చేపట్టగా... వారి మృతదేహాలు ఈరోజు లభ్యమయ్యాయి. 

12:57 - January 16, 2018

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేటలో కనుమ సంబరాలు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ఎడ్ల బండ్ల మీద విహరిస్తూ కనుమ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాయినాలు చెల్లిస్తూ, పండ్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

బుధవారం ఢిల్లీకి బాబు...

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు... మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. అయితే... రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మళ్లీ ఎవరినైనా కలుస్తారా అనేది చూడాల్సి ఉంది

12:55 - January 16, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీల వివాదం ఇంకా సమసిపోలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలే స్పష్టంచేశారు. ఈ వివాదం కొలిక్కి రావడానికి ఇంకా కనీసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని అన్నారు. వివాద పరిష్కారంపైనే దృష్టిసారించామని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా ఈ వివాదం వారాంతంలోపు ముగుస్తుందని చెప్పారు. కీలకమైన కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆ నలుగురు తిరుగుబాటు జడ్జీలకు సీజేఐ స్థానం కల్పించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐ మిశ్రాతోపాటు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. తిరుగుబాటు చేసిన చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లలో ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదు. ఈ ధర్మాసనం రేపటి నుంచి కీలకమైన కేసుల విచారణ మొదలుపెట్టనుంది. ఆధార్ చట్టం చెల్లుబాటు, గే సెక్స్ నేరమా కాదా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంలాంటి కీలక కేసులపై ఈ ధర్మాసనం విచారణ జరపనుంది.

12:52 - January 16, 2018

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంట సాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నూతన పంచాయతీరాజ్‌ చట్టం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపైనా కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

12:48 - January 16, 2018

నిజామాబాద్ : ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి నుంచే పార్టీ నేతలు సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానంలో వేడెక్కుతున్న రాజకీయాలపై 10 టీవీ ప్రత్యేక కథనం.. నిజామాబాద్‌ జిల్లా... తెలంగాణలో రాజకీయ చైతన్యానికి ప్రతీక. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం ఏర్పడింది. ఈ అసెంబ్లీ స్థానం ఎప్పుడూ రాజకీయ విలక్షణతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న నిజామాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. కాంగ్రెస్‌లో ఉండగా డీ శ్రీనివాస్‌ ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2014లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీ చేసిన డీఎస్‌తోపాటు, అర్బన్‌ నుంచి బరిలోకి దిగిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఓటమి చవిచూశారు. అర్బన్‌ నుంచి గణేశ్‌ గుప్తా, రూరల్‌ నుంచి బాజిరెడ్డిగోవర్దన్‌ విజయం సాధించారు.

డీ శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో రాజకీయ సమీకరణలు మారాయి. ఈ సీటు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గణేశ్‌ గుప్తా, డీఎస్‌ రెండువర్గాలుగా విడిపోయారు. తన పెద్దకుమారుడు సంజయ్‌ని రాజకీయ వారసుడిగా ప్రకటించిన డీఎస్‌... అసెంబ్లీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగం... సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు తలనొప్పిగా మారింది. సామాజికవర్గ ఓటర్లను ఇప్పటి నుంచి ఆకర్షించేందుకు వీలుగా సంజయ్‌... మున్నూరుకాపుల కోసం ఉచిత వివాహాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంజయ్‌ దూకుడుతో గణేశ్‌ గుప్తా గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అంతేకాదు నిజామాబాద్‌ రూరల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కూడా అర్బన్‌ సీటుపైనే కన్నేరు. దీంతో ఈ సీటుకోసం పోటీపడుతున్నవారి సంఖ్య మూడుకు చేరింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌లో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్సీ అకుల లలితతోపాటు పీసీసీ నేతలు రత్నాకర్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్‌ ఎవరికి దక్కినా అందరూ కలిసి పనిచేయాలని పార్టీ నేతలు ఇప్పటి నుంచే నూరిపోస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని వర్గపోరును తమకు అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు బీజేపీలో కూడా పోటీ ఎక్కువగా నేంది. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతోపాటు 2104 ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన సూర్యనారాయణ, కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన బస్వా లక్ష్మీనారాయణ టికెట్‌ కోసం పోటీ పుడుతున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీల్లో కూడా ఆశావహులు ఎక్కుగా ఉండటంతో నిజామాబాద్‌ అర్బన్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 

12:45 - January 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీని గాడిన పెట్టేందుకు పార్టీ సీనియర్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చేలా కనిపించడంలేదు. ఎప్పటికప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు నిర్వహించిన శిక్షణా శిబిరాల్లో వ్యక్తమైన అనుమానాలు టీ టీడీపీ నేతలను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ శ్రేణులను కాపాడుకోవడం తెలుగుదేశం నేతలకు కష్టంగా మారుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్తలకు ఎన్టీఆర్‌ ట్రస్‌ భవన్‌లో మూడు దఫాలుగా నిర్వహించిన శిక్షణా శిబిరాలు వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ నేతలు చేసిన హితబోధను తెలుగుదేశం కార్యకర్తలు పెడచెవిన పెట్టడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం కకావికలమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కువగా అమరావతి నిర్మాణం, ఏపీ అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నారు. 2014లో నెగ్గిన ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లోకి జారుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పార్టీ పటిష్టతపై చంద్రబాబు పెద్దగా దృష్టిపెట్టంలేదున్న వాదనలు ఉన్నాయి. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలంటే నారా, నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దృష్టి పెడితే మినహా, పార్టీ గాడినపడే అవకాశంలేదన్న అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన 15 మంది శాసనభ్యుల్లో 13 మంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆర్‌ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోరన్న అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో నెగ్గిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా కారెక్కడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. ప్రస్తుతం టీ టీడీపీలో ఉన్న నేతల్లో కూడా కొందరు టీఆర్‌ఎస్‌కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడాలనుకుంటున్న నేతలు రాజీనామాచేసి, వారిదారి వారు చూసుకుంటే.. అంకింతభావం ఉన్న నేతలను కూడగట్టుకుని తెలుగుదేశంను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా మారాలన్నది పార్టీ అధినేత చంద్రబాబు ఆశయం. హైదరాబాద్‌ వచ్చినప్పుడో లేక అమరావతి పిలిపించుకునో పార్టీ నేతలకు చంద్రబాబు ఈ మేరకు దిశానిర్దేశం చేస్తున్నా... కార్యాచరణ మాత్రం లక్ష్యానికి అనుగుణంగాలేదని పార్టీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. ఇది పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈపరిస్థితులను పార్టీ నాయకత్వం ఎలా చక్కబెడుతుందో చూడాలి. 

12:43 - January 16, 2018

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులతో సమాంతరంగా కాల్వలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి పొలాలకు నీరు సరఫరా చేసేందుకు, చెరువులు నింపేందుకు కాల్వలు కీలకమని నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన జలాశయాలు, కాల్వలు, చెక్‌డ్యామ్‌లు, పంప్‌హౌస్‌లు, సొరంగా మార్గాల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. జలాశయాల వద్ద అతిథి గృహాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఎగువ, దిగువ మానేరును జీవధారగా నిర్వహిస్తూ దక్షిణ తెలంగాణకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరాన్ని కేసీఆర్‌ అధికారులు దృష్టికి తెచ్చారు. సింగూరు ఒకసారి నిండితే ఐదేళ్ల వరకు ఇబ్బంది ఉండదన్న విషయాన్ని ప్రస్తావించారు. సింగూరు నుంచి కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ను జీవధారగా మార్చాలని ఆదేశించారు. మెదక్‌ జిల్లాను మెతుకుసీమగా మార్చేందుకు ఇది కీలకమని సూచించారు. ఈ ఏడాది జులై-ఆగస్టు నాటికి మిడ్‌ మానేరు నింపేందుకు అవకాశం ఉంటుందని అధికారులు.. సీఎం దృష్టికి తెచ్చారు. మిషన్‌ భగీరథంలో కీలకమైన ఎస్సారెస్సీని ఎప్పటికీ నీళ్లతో నింపి ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మధ్య మానేరు కాల్వలు, సొరంగమార్గం పనుల పురోగతిని కేసీఆర్‌ సమీక్షించారు. నీరు వచ్చిన వెంటనే చెరువులను నింపి, కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతగిరి, రంగానాయక్‌సాగర్‌ రిజర్వాయర్ల పనులను వేగవతం చేయాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు గ్రావిటీ ద్వారా నీరిచ్చి, ఎక్కువ భూమి సాగయ్యే విధంగా చర్యలు తీసుకోవాని కోరారు. గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ప్రతి ఎకరం భూమికి సాగునీరు అందాలని ఆదేశించారు. గంధమల, బస్వాపూర్‌ జలాశయాల పురోగతిని కూడా కేసీఆర్‌ సమీక్షించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఎక్కువ ప్రాజెక్టులను పూర్తిచేసి.. సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను ఇప్పటి నుంచే తీసుకోవాలని కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. 

కాల్వలు కీలకమన్న కేసీఆర్...

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులతో సమాంతరంగా కాల్వలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి పొలాలకు నీరు సరఫరా చేసేందుకు, చెరువులు నింపేందుకు కాల్వలు కీలకమని నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం సూచించారు. 

స్వగ్రామంలో సీఎం బాబు..

చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో మంగళవారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకుని కుటుంబంతో సహ శనివారమే గ్రామానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 

ప్రవీణ్ తొగాడియా ఆచూకి లభ్యం..

ఢిల్లీ : సోమవారం ఉదయం నుండి కనిపించకుండా పోయిన వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఓ పార్కులో అపస్మారకస్థితిలో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మాట మార్చిన అటార్నీ జనలర్...

ఢిల్లీ : సుప్రీంకోర్టు వివాదం ఇంకా ముగిసినట్లు లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యాయని నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. 

సురేష్ గోపి అరెస్టు..బెయిల్...

తమిళనాడు : బీజేపీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ నటుడు సురేష్ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. 

Don't Miss