Activities calendar

17 January 2018

21:32 - January 17, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌పై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. తెలుగు నిర్మాతల కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయ పన్నులు కట్టడంలో తేడాలు చూపిస్తున్నారనే అనుమానాలు రావడంతో... ఐటీ అధికారులు తనీఖీలు చేపట్టారు. భవ్య క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, హారీక హాసిని, డీవీవీ క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, సీకే ఎంటర్టైన్మెంట్ లకు చెందిన నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేశారు.

ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఎనిమిది మంది నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేయడంతో టాలివుడ్ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 

సి.కల్యాణ్ కార్యాలయంలో
ఇటీవల రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ చిత్రం జై సింహాను నిర్మించిన సి.కల్యాణ్ కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఆ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌పై ఐటీ శాఖ దృష్టి సారించిందని సమాచారం. ఆయన నివాసంలో కూడా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల విడుదలైన పవన్ అజ్ఞాత వాసి నిర్మాణ రాధాకృష్ణకు చెందిన హారికా, హానిని కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. గత మూడేళ్లుగా వీరి టీడీఎస్‌లో తేడాలు రావడంతోనే ఈ సోదాలు జరిగాయని తెలుస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతోనే ఈ ఆకస్మిక తనీఖీలు చేశారు.

దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మరోవైపు తమ కార్యాలయంలో ఐటీ సోదాలపై సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ స్పందించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని చెప్పారు. తన కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించిన మాట వాస్తమేనని వెల్లడించారు. కొత్త సినిమా విడుదలైన ప్రతీసారి ఐటీ అధికారులు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే సోదాలకు సంబందించిన పూర్తి వివరాలు మాత్రం ఐటి అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంపై గురువారం వరకు ఒక క్లారిటీ వస్తుందని సమాచారం. 

21:21 - January 17, 2018

గుంటూరు : రాబోయే ఎన్నికలకు ఇప్పట్నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే రేపటి నుంచి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు వేదికగా భవిష్యత్ కార్యాచరణపై దిశనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ గృహనిర్మాణాలపై సమావేశంలో సీఎం దృష్టి పెట్టనున్నారు. వీటితో పాటు శాంతిభద్రతలపై కూడా చర్చ జరగనుంది. స్పాట్....

గతంలో కంటే భిన్నంగా
ఈసారి కలెక్టర్ల సదస్సును గతంలో కంటే భిన్నంగా నిర్వహించనున్నారు. సీఎం నివాసం దగ్గర నూతనంగా నిర్మించిన గ్రీవెన్స్‌ సెల్‌ హాలులో సదస్సుకు ఏర్పాట్లు చేశారు. అన్ని విభాగాలను ఏడు మిషన్లుగా విభజించి మిషన్‌ మోడ్‌ పద్ధతిలో రాష్ర్టాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల ప్రగతిని వివరించేందుకు కలెక్టర్లకు ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం కేటాయించారు.సదస్సులో తొలిరోజు వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖాధిపతులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. లంచ్‌ తర్వాత ప్రైమరీ సెక్టార్‌లో ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం పరిశ్రమల శాఖ సాధించిన వృద్ధిపై చర్చజరగనుంది. ఈ సదస్సుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అధికారులు, మంత్రులు, పోలీసులతో పాటు.. వారందరి కారు డ్రైవర్లకు కూడా భోజన ఏర్పాట్లు చేశారు. సుమారు ఐదు వందల కార్లకు పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. 

21:19 - January 17, 2018

ఢిల్లీ/విశాఖ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన వీరి భేటీలో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చే నిధుల్లో 90 శాతం రాయితీ వస్తుందన్నారు. EAP ద్వారా కాకుండా నాబార్డు, హడ్కో ద్వారా ఏపీకి రుణాలు ఇప్పించాలని జైట్లీని కోరినట్లు చెప్పారు. రెవెన్యూ లోటు 16 వేల కోట్లు ఉంటే అందులో కేవలం 4 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. ఇంకా రావల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖకు రైల్వే జోన్‌, అమరావతి నిర్మాణానికి నిధులతో పాటు పెండింగ్‌లో ఉన్న 11 కేంద్ర ఇనిస్టిట్యూషన్ల గురించి చర్చించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని జైట్లీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు.

CII సదస్సుకు జైట్లీని ఆహ్వానించినట్లు
అలాగే ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విశాఖలో జరిగే CII సదస్సుకు జైట్లీని ఆహ్వానించినట్లు చెప్పారు. అంతకుముందు CII సన్నాహక సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెడితే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానంతో వస్తే.. భూమి, వనరులు, అనుమతులను తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పారిశ్రామిక వర్గాలకు ఏపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలోనే చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు అమరావతి నమూనాను చూపించారు. ఉదయం విశాఖలో మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సును ప్రారంభించిన చంద్రబాబు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. సాంకేతిక, పారిశ్రామిక, ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్ రంగాల్లో ఏపీ ముందుందని చంద్రబాబు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు సార్క్‌ దేశాల నుంచి సుమారు 40 మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారు. 

21:18 - January 17, 2018

హైదరాబాద్/సిద్దిపేట : పీపుల్స్‌ ప్లాజాలో 102, 108 వాహనాలను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవానికి ముందు దవాఖానకు చేర్చడం, తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టారు. తొలి దశలో 41 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వాహనాలను 200 వరకు పెంచేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ సహకారంతో అమ్మఒడి వాహన సేవలను అందించనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గిరిజన ఆవాస ప్రాంతాల్లో 102 సేవలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు.

అంబులెన్స్‌పేరిట 108 టూ వీలర్ అంబులెన్సులు
అదేవిధంగా హైదరాబాద్‌లోని మురికివాడల్లో అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రయోగాత్మకంగా ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్స్‌పేరిట 108 టూ వీలర్ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 టువీలర్ 108 వాహనాలను సిద్ధం చేశారు.మరోవైపు మాతాశిశు ఆరోగ్య సంరక్షణలో నిరంతరం బస్తీల్లో ఇంటింటి తిరిగి సేవలందించే ఏఎన్‌ఎంలకు రాయితీపై బైకులను ప్రభుత్వం అందజేసింది. ఈ టూ వీలర్‌లో వ్యాక్సిన్, మందులు, సిరంజీల వంటి సామాను తీసుకువెళ్లేందుకు వీలుగా ఉందని ఏఎన్‌ఎంలు అంటున్నారు.

తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి
అనంతరం సీఎం కేసీఆర్‌ మెదక్ జిల్లా తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలోని వార్డులను సీఎం పరిశీలించారు. తూప్రాన్‌తో సహా ఆరు మండల కేంద్రాల్లో ఒక్కో మండలానికి కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే తూప్రాన్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. 20 లక్షలతో షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తూప్రాన్‌లో పెద్ద చెరువును సుందరీకరిస్తామన్నారు. త్వరలో 500 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తామని సీఎం చెప్పారు. తూప్రాన్‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించారు.అనంతరం గజ్వేల్‌లో 100 పడకల ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గజ్వేల్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 

20:41 - January 17, 2018

నీ స్నేహితులెవరో తెలిస్తే నువ్వేంటో చెప్పొచ్చంటారు.. మరి మనదేశానికి స్నేహితులెవరు?మనం ప్రపంచానికి ఏ సంకేతాలిస్తున్నాం..? ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకుని, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావించే దేశానికి దగ్గరయ్యే ఆరాటం.. ఆ అగ్రరాజ్యానికి పావులా మారిన ఓ కిరాయి గూండాలాంటి దేశంతో ఇప్పుడు కొత్త స్నేహం.. మరి ఈ స్నేహాలు ఏ లక్ష్యం కోసం? ఈ అడుగులు ఏ గమ్యం వైపు? ఈ కావలింతలకు అర్ధమేంటి?  చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేది మరొకటి.. ప్రపంచానికి నీతులు చెప్పటమే తప్ప ఆచరణలో శూన్యం. ఇదీ అమెరికా తీరు. ఇక పెద్దన్న చెప్పినట్టు ఆడే ఇజ్రాయెల్...పాలస్తీనాను అణగదొక్కటంలో, నాశనం చేయటంలో ఆయుధంగా మారింది. కానీ, కొత్త కొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి.. కొత్త కొత్త అడుగులు అర్ధంలేని గమ్యంవైపు కదులుతున్నాయి.. భారత ప్రభుత్వం అడుగులు కొత్త సంకేతాలిస్తున్నాయి.. మన పొరుగు దేశాలతో స్నేహం చేయటం తెలయదు.. కానీ, ఎక్కడో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం కావాలి.. పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, చైనా ఇలా అన్నింటికి దూరమౌతూ, అమెరికాకు దాని మిత్ర దేశాలకు దగ్గరవటం ఏ లక్ష్యం కోసం..? ఏ భావజాలం దీనికి కారణం అని చెప్పాలి?

నరహంతక దేశం.. అణచివేతే మార్గంగా బతుకుతున్న దేశం.. పరాయి నేలను దోపిడీచేసి బతుకుతున్న దేశం.. అలాంటి దేశానికి భారత్ దగ్గరవటంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇజ్రాయెల్ తో భారత్ సంబంధాలు పెంచుకునే తీరుపట్ల అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అంతిమంగా దేశానికి చేటు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఇజ్రాయిల్ చరిత్ర ఏమిటి?అసలు పాలస్తీనా సమస్య ఎందుకొచ్చింది? కారణం ఎవరు? పాలస్తీనియుల బతుకులు ఎందుకిలా మారాయి అన్నిటికీ జియోనిజమే కారణమా? ఆ భావజాలమే పాలస్తీనాను ధ్వంసం చేస్తోందా? జియోనిజం అంటే ఏంటి?
 

వాస్తవాలు కళ్లముందున్నాయి. ఎవరి తీరేమిటో స్పష్టంగా కనిపిస్తోంది.. ఎవరి పీడన ఏమిటో... ఎవరి కన్నీళ్ల వెనుక ఏ క్రౌర్యం దాగుందో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. కానీ, ఏ ప్రయోజనాలకోసం ఈ కొత్త స్నేహాలు.. ఏ సైద్దాంతిక భూమికతో దోస్తీకోసం ఈ అడుగులు.. ?మన స్నేహాలే మనమేంటో చెప్తాయి. అది వ్యక్తికైనా, దేశానికైనా సరే. నూటికి నూరుపాళ్లూ నిజం. ఏ వాదాన్ని బలపరుస్తున్నాం... ఏ విధానాలను సమర్ధిస్తున్నాం .. అనే అంశంపైనే ఇదంతా ఆధారపడి ఉంది. ఇప్పుడు అలీనవిధానానికి, ప్రజాస్వామ్యయుత సంబంధాలకు, అణచివేతకు గురవుతున్న దేశాలకు మద్ధతు ఇచ్చే పరిస్థితి దూరంగా భారత్ జరగటం దేశ భవితపై ప్రభావం చేపే అవకాశాలు బలంగా ఉన్నాయి. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

 

 

20:35 - January 17, 2018

తెలంగాణల పుట్టుడే పాపమైందా ఎట్ల నీ అరెస్టులు పాడుగాను.. మీ చేతులకు జెట్టలు వుట్ట.. అరే అడ్గితె అరెస్టులా..? ప్రజలకు అడ్గే హక్కుగూడ లేదా ఎట్ల..? అద్దంకి దయాకర్ అరెస్టు.. ఓయూ విద్యార్థులు అరెస్టు.. మందక్రిష్ణ మాదిగ అరెస్టు.. వంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు.. ఇట్ల ఎంతమందిని అరెస్టు జేస్తరు ముఖ్యమంత్రిగారూ..? ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా ?

జిగ్నేష్ మేవానీ.. గుజరాత్ రాష్ట్రంల మొన్న అయ్యిన ఎన్నికలళ్ల.. నరేంద్రమోడీనీ.. బీజేపీని చుచ్చువోపిచ్చినంత పనిజేశిన దళిత బహుజన బిడ్డ.. ఇండిపెండెంట్గ పోటీ జేశి అఖండ విజయాన్ని అందుకున్న మేవానీ.. హైద్రావాద్ చంచల్ గూడ జైలుకొచ్చిండు.. ప్రశ్నించినందుకు అరెస్టుకు గురైన మందక్రిష్ణ మాదిగను పరామర్శించిండు..

పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. తెలంగాణ మొత్తం కుతకుత ఉడ్కుతున్న ముచ్చట ఇది.. తెలంగాణ ప్రభుత్వం వచ్చెనెలల ఈ చట్టాన్ని సవరించే బిల్లును అసెంబ్లీల వెట్టి.. అదే నెలల సర్పంజి ఎలచ్చన్లకు వోవాలె అనేది ఇగురం.. ఈ చట్టం అమలైతె తెలంగాణల ఏం మార్పురావోతున్నది..? దీనితోని ఏ పార్టీకి లాభం..? నష్టపోయేది ఎవ్వలు..? పాండ్రి సూద్దాం..

మందిని ముంచెతందుకు పోలీసు అవుతారం ఒక్కటే బెటరనుకున్నడో ఏమో.. ఒకడు ఉన్నతాధికారి ఏశంగట్టి.. నిజమైన పోలీసోళ్లతాననే పైకం వసూలు జేశిండు.. అచ్చం నిజమైన పోలీసు బాసులు కింది స్థాయి సిబ్బందిని ఎట్ల ఏడిపిస్తుంటరో.. అట్లనే ఏడిపిచ్చిండు.. కాకపోతె క్యారెక్టర్ల మున్గిపోయి కాకీలు ఎంటవడ్తున్న సంగతి మర్శిపోయిండు..

మొత్తం మీద హైద్రావాదుల పోలీసోళ్లు ఓడిపోయిండ్రు.. దొంగలు గెల్చిండ్రు.. ఒక్కటి గాదు రెండు గాదు.. సంకురాత్రి పర్వదినం పేరుమీద ఇర్వై ఐదిండ్లు లూటి వొయ్యినయ్.. తాళాలేశి ఊర్లకు వొయ్యిన జనం ఇండ్లను.. దొంగలు దత్తతకు దీస్కోని.. ఆలనా పాలన జూస్కున్నరు.. ఇగ మన ఫ్రెండ్లీ పోలీసోళ్లంటరా..? ఎంతెంత వొయ్యింది సొమ్ము అని లెక్కలు రాస్కునెతందుకు దప్పితె దేనికి పన్కొస్తరు..?

ఈ దొంగలళ్ల గూడ తెల్వితక్వ సన్నాసులుంటరు.. అరే చేస్తె ఎట్ల జేయాలే..? రాజకీయ నాయకులు కోట్ల కుంభకోణాలు జేశి జనం సొమ్ము ఎట్ల కొల్లగొడ్తరు.. ఉంటే గట్లుండాలే.. ఈ తులం మాసం ఎత్కపోతె ఏం మిగుల్తదిరా వారీ.. కూలిపైకం బడది.. మీదికెళ్లి దొంగతనం జేశి ప్రజలకు దొర్కితె ఎట్లుంటది..? సూడుండ్రిగో ఇట్లుంటది..

వాళ్ల కాలినిగాదు.. వాళ్లకు సంబంధం లేదు.. ఎక్కడెక్కడి సోడిగాళ్లంతొచ్చి.. ఒక గల్లిల గొట్టుకుంటా ఉన్నరు.. కాలినోళ్లకు ఏమైతున్నదో తెల్వది.. అప్పటికి రెండు గ్యాంగులు దిమ్మడ దమ్మడ గుద్దుకుంటున్నయ్.. రౌడీ షీటర్లు గూడ ఎంటరైపోయిండ్రట.. ఏదే నాయిని నర్సన్నా హైద్రావాదుల శాంతి భద్రతల పావురం ఏడెగురుతున్నట్టు..?

 

20:14 - January 17, 2018

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. చాపకింద నీరులా వినియోగదారుల జేబుకు చిల్లిపెడుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి.. రోజువారిగా మార్చు విధానం అమలు చేసినప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో ధరలు దేశంలో భగ్గుమంటున్నాయి. బండి బయటికి తీద్దామంటే భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా ... దేశీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ధరలు అమాతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్‌ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం.

గతంలో ప్రతి 15 రోజులకోసారి
చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్‌ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.92కు, డీజిల్‌ ధర రూ.68.79కు చేరాయి. రెండేళ్ల క్రితం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గినప్పడు.. ధరలను తగ్గించకుండా ప్రభుత్వాలు సొమ్ముచేసుకున్నాయి. గతేడాది నుండి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు.

లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.. డీజిల్‌పై పదిహేడు రూపాయల ముప్పైమూడు పైసలు వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారం పడుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌కు తోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి.

క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు.. చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ.4,085గా ఉంది. ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే అసలు ధరలుగా ఉండగా.. మిగతాదంతా పన్నుల భారమే. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం అందులో చేర్చలేదు. పెట్రోల్‌ ఉత్పత్తులతో భారీగా ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

 

రేపు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర నేరస్థుల సర్వే

హైదరాబాద్ : రేపు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర నేరస్థుల సర్వే చేయనున్నారు. ప్రతి నేరుస్థుడి ఇంటికి వెళ్లి పోలీసులు సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేకు నూతన టెక్నాలజీ వినియోగించనున్నారు. 

19:18 - January 17, 2018

అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గుతున్నప్పుడు రోజువారి ధరల పాలసీ తీసుకురాకుండా ఇప్పుడు పెట్రో ధరలు పెరుగుతున్నప్పుడు ఈ పాలసీని తీసుకొచ్చారని, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోలుపై విపరీతంగా పన్నులు విధిస్తున్నారని ఆర్థిక నిపుణులు శశికుమార్ అన్నారు. పెట్రోలు వ్యాట్ తెలుగురాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని, అందరు మానసికంగా ధరలపై నిర్ణయానికి వచ్చారని బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నినాదం అచ్చే దిన్ కానీ వాస్తవానికి ప్రజలు సచ్చే దిన్ అనుకుంటున్నారని, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యారల్ ధర 142 డాలర్లు ఉంటే అప్పుడు ఇండియాలో లీటర్ పెట్రోలు రూ.60 నుంచి రూ.70 ఉందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

అరుణ్ జైట్లీని కలిసిన చంద్రబాబు

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి పాల్గొన్నారు. 2018, 2019 బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు, పోలవరానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ అంశాలను జైట్లీతో బాబు చర్చించారు.

18:48 - January 17, 2018

కృష్ణా : మచిలీపట్నం నౌకాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూముల కోసం మూడున్నరేళ్లుగా జాప్యం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ మూడున్నరేళ్లయినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా పోర్టు నిర్మాణానికి కావలసిన భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు పోర్టు నిర్మాణంపై దృష్టిసారించారు. అయితే పోర్టు నిర్మాణం కోసం 2015లోనే దృష్టి సారించినప్పటికీ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం భూ సమీకరణకు మొగ్గు చూపింది. దీంతో కొందరు రైతులు భూములు అప్పగించేందుకు ముందుకు వచ్చారు. మరికొన్ని భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించగా ప్రజా సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది. దీంతో ప్రభుత్వ విధానాలపై వామపక్షాలు మండిపడుతున్నాయి.

700 ఎకరాలు సేకరించారు...
పోర్టు నిర్మాణానికి అవసరమైన 2వేల 282 ఎకరాల పట్టా భూముల్లో భూ సమీకరణ ద్వారా ఇప్పటివరకు సుమారు 700 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూములు సందిగ్ధంలో ఉన్నాయి. ముఖ్యంగా మాగాణి భూములుగా ఉన్న తమ భూములను మెట్ట భూములుగా నమోదు చేసి, తక్కువ లీజు పొందాల్సి వస్తుందన్న అభిప్రాయం రైతుల్లో ఉంది. దీంతో రైతుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. భూ సమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలు చెల్లిస్తారు. మాగాణికి ఏడాదికి 50వేలు చొప్పున, మెట్ట భూమికి 30వేల చొప్పున ప్రతి ఏడాది 10 శాతం పెంపుతో కౌలు చెల్లించనున్నారు. అయితే మెట్ట భూములుగా గుర్తించిన తమ భూములను మాగాణిగానే పరిగణించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చి పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తుందో లేదో వేచి చూడాలి. 

18:47 - January 17, 2018

కృష్ణా : విజయవాడ మొగల్రాజపురంలో ఈనెల 19న సత్యమ్ సైంటిఫిక్ వాస్తు కార్యాలయం ప్రారంభోత్సవం కానుంది. ప్రారంభోత్సవానికి మత్రి దేవినేని ఉమ వస్తున్నట్లు వాస్తు నిపుణుడు మామిడి సత్యనారాయణ తెలిపారు. వ్యక్తి సమస్యలను తెలుసుకొని రెమెడీ చేయడమే వాస్తు ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఇంట్లో లోపాలను గుర్తించి పరిష్కరించడమే కాకుండా కట్టడాల్ని కూల్చకుండా వాస్తు ద్వారా సరిచేయొచ్చని సత్యనారాయణ తెలిపారు.

18:46 - January 17, 2018

ప్రకాశం : జిల్లాలోని కొత్తపట్నంలో ఎడ్ల పందాలు ఘనంగా జరిగాయి. మూడేళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి నాటుబండి లాగుడు పోటీలకు మొత్తం 15 ఎడ్లజతలు వచ్చాయి. ఎడ్ల బల ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

18:45 - January 17, 2018

పశ్చిమగోదావరి : జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. పలు వాహనాల్లో వెళ్ళిన పోలీసులు కోడిపందాల శిబిరాన్ని చుట్టుముట్టారు. ఈ అనూహ్య దాడితో నిశ్చేష్టులైన పందెం రాయుళ్ళు పారిపోయారురు. గత నాలుగు రోజులుగా కొప్పాకలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

18:44 - January 17, 2018

నెల్లూరు : జిల్లాలో గొబ్బెమ్మల పండగ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆనంద ఆంధ్రప్రదేశ్‌ కావాలంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే ముఖ్మమంత్రి ఉద్దేశమని చెప్పారు. అందుకోసమే పండగల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు బడ్జెట్‌ కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

18:43 - January 17, 2018

గుంటూరు : డిజిటల్‌ లింక్‌ అకాడమీ సాఫ్ట్‌ వేర్‌ శిక్షణా కేంద్రాన్ని మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఐటీరంగంలో ఉపాధి కల్పించేందుకు ఇలాంటి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు హోంమంత్రి చినరాజప్ప. రాష్ర్టంలో టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. గుంటూరులో ఏర్పాటైన డిజిటల్‌ లింక్‌ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. రాష్ర్టానికి భవిష్యత్తులో వంద కంపెనీలు రాబోతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. 

18:42 - January 17, 2018

ఢిల్లీ : ఏపీలో పెట్టుబడులు పెడితే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఢిల్లీలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. మీరు పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానంతో వస్తే.. భూమి, వనరులు, అనుమతులను తాము అందిస్తామన్నారు. పారిశ్రామిక వర్గాలకు ఏపీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. 

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

నెల్లూరు : జిల్లా తోటపల్లిగూడూరు మండలం కొత్తకోడూరు బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో వెంకటేశ్వర్లు, యశ్వంత్ రెడ్డి, దిలీప్ కుమార్ ఉన్నారు. మృతులు మనుబోలు మండలం కొమ్మలపూడి వాసులుగా పోలీసులు గుర్తించారు.

18:09 - January 17, 2018

నెల్లూరు : జిల్లా తోటపల్లిగూడూరు మండలం కొత్తకోడూరు బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో వెంకటేశ్వర్లు, యశ్వంత్ రెడ్డి, దిలీప్ కుమార్ ఉన్నారు. మృతులు మనుబోలు మండలం కొమ్మలపూడి వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

17:38 - January 17, 2018

హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ తరలిపోయిందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రోఫెసర్‌ కోదండరామ్‌ ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ యాంటీ కరప్షన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఓయూలోని విధ్యార్ధి సంఘాలు సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణకు సహకారం అందిస్తామని చెప్పినా.. ప్రభుత్వం నిర్వహించలేక పోయిందన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ తరలిపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.

17:35 - January 17, 2018

హైదరాబాద్ : గురువారం నుంచి ప్రారంభమయ్యే జాతీయ పుస్తక ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్నీ భాషల పుస్తకాలతో పదకొండు రోజుల పాటు హైద్రాబాద్ నడిబొడ్డున కొలువుతీరేందుకు బుక్ ఫెయిర్ సన్నద్ధమైంది. ఎన్‌టీఆర్ స్టేడియంలో మొత్తం 334 స్టాల్స్‌లో అన్నీ రకాల పుస్తకాల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది.

17:34 - January 17, 2018

ఆదిలాబాద్ : కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వచ్చి మూడున్నరేళ్ళు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని సీఐటీయు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబు తీవ్రంగా విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పీఆర్‌టీయు భవనంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్కీమ్ వర్కర్లని కార్మికులకు గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని సాయి బాబు డిమాండ్ చేశారు. 

17:33 - January 17, 2018

నిజామాబాద్ :స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తిస్తూ, 18వేలు కనీస వేతనం చెల్లించడంతోపాటు... పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈమేరకు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో కార్మికులు రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్‌ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. 

17:32 - January 17, 2018

హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చంచల్‌గూడ జైల్లో మందకృష్ణ మాదిగను కలిశారు. గుజరాత్‌ దళిత ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానితో కలిసి ఆయన మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని కత్తి మహేష్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మార్పీఎస్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కత్తి మహేష్‌ తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌పై మరోసారి మండిపడ్డ కత్తి మహేష్‌ అసలు జనసేనలో జనమే లేరన్నారు. 

17:31 - January 17, 2018

ఢిల్లీ : కాళేశ్వరం పనుల తీరును పరిశీలించేందుకు కేంద్రమంత్రి గడ్కరీని...రాష్ట్రానికి ఆహ్వానించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతరాష్ట్రీయ అనుసంధానం సమావేశానికి హాజరై.. నాలుగు అంశాల గురించి హరీశ్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో నితిన్‌గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు పనితీరుపై నితిన్‌గడ్కరీ ప్రశంసలు కురిపించినట్లు హరీష్ తెలిపారు. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు.

17:30 - January 17, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా స్కీమ్‌ వర్కర్లు రోడ్డెక్కారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద కేంద్ర తీరును నిరసిస్తూ హడ్తాల్‌ నిర్వహించారు. నూతన వేతన విధానం.. పెన్షన్‌, ఈఎస్‌ఐ విధానాలను అమలు చేయాలని సీఐటీయూ నాయకురాలు సింధు డిమాండ్‌ చేశారు. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న ఎమ్మార్పీస్ కార్యకర్త

సిద్దిపేట : జిల్లా గజ్వేల్ సీఎం కేసీఆర్ పర్యటనలో సీఎం కాన్వాయ్ ని ఎమ్మార్పీఎస్ కార్యకర్త కృష్ణ అడ్డుకున్నారు. మందకృష్ణ వెంటనే విడుదల చేయాలని కృష్ణ డిమాండ్ చేశారు. 

సోమశిల దక్షణ కాలువకు గండి

నెల్లూరు : జిల్లా సోమశిల దక్షిణ కాలువకు గండి పడింది. సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేయడంతో కలువాయి గ్రామసమీపంలో గండి పడడంతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగింది. కాలువ సామర్థ్యాం 200 క్యూసెక్కులు అయితే అధికారులు 250 క్యూసెక్కులు విడుదల చేశారు.

17:06 - January 17, 2018
17:00 - January 17, 2018

నెల్లూరు : జిల్లా సోమశిల దక్షిణ కాలువకు గండి పడింది. సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేయడంతో కలువాయి గ్రామసమీపంలో గండి పడడంతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగింది. కాలువ సామర్థ్యాం 200 క్యూసెక్కులు అయితే అధికారులు 250 క్యూసెక్కులు విడుదల చేశారు. మరింత మమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

పార్టీ వీడుతున్న వార్తలను ఖండించిన వంగవీటి

కృష్ణా : వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను తన సన్నిహీతుల వద్ద వంగవీటి రాధా ఖండించారు. తను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తానని రాధా అన్నారు. 

16:13 - January 17, 2018
16:11 - January 17, 2018

సెంచూరియన్ : సౌత అఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. సౌత్ అఫ్రికా 131 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ ను 2 0 తేడాతో సౌత్ అఫ్రికా స్వంతం చేసుకుంది. సౌత్ అఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 335, రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307 రెండో ఇన్నింగ్స్ లో 151 పరుగులు చేసింది. 

16:05 - January 17, 2018

కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని ఓ ఇంటిపై అధికారులు దాడి చేసి భారీ ఎత్తున రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం -పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో 97 కోట్ల పాత నోట్లు దొరికాయి. 500, 1000 నోట్లను బెడ్‌లాగా పరచి ఉన్న నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. కాన్పూర్‌లోని స్వరూప్‌ నగర్‌ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఈ డబ్బును గుర్తించారు. డబ్బు మార్పిడి చేస్తామని చెప్పిన 16 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంటి యజమానిని వ్యాపారి అశోక్‌ ఖత్రీగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొత్తంపై పూర్తి వివరాలను రిజర్వు బ్యాంకు, ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం తెలియజేస్తుందని పోలీసులు తెలిపారు. 

16:04 - January 17, 2018

ఢిల్లీ : 'పద్మావత్‌' సినిమా మళ్లీ సుప్రీంకోర్టుకెక్కింది. ఈ నెల 25న విడుదల కాబోతున్న 'పద్మావత్‌' సినిమాపై రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని... తమ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న బాలీవుడ్‌ చిత్రం 'పద్మావత్‌' ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఒకరోజు ముందే విడుదల చేయాలని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ నిర్ణయించినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. సెన్సార్‌ బోర్డు కొన్ని మార్పులు చేసి సినిమాకు సర్టిఫికేట్‌ ఇచ్చినప్పటికీ... బిజెపి పాలిత రాష్ట్రాలు పద్మావత్‌పై నిషేధం విధించాయి. ఈ సినిమాలో నటించిన దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. 

16:03 - January 17, 2018

కరీంనగర్ :మేడారం జాతర ముగిసేదాకా తెల్లబెల్లం అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో ఎక్సైజ్ కేసులపై రివ్యూ నిర్వహించారు. తెల్లబెల్లంపై ఆంక్షలు లేవని.. అయితే నల్ల బెల్లం అమ్మితే తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. GHMC పరిధిలో... బహిరంగ ప్రదేశంలో మద్యపాన నియంత్రణపై దృష్టిపెట్టామని.. అకున్‌ సబర్వాల్‌ తెలిపారు.

16:02 - January 17, 2018

ఢిల్లీ : హజ్‌ యాత్రీకులకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సిపిఎం తప్పు పట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేంద్రం నిరంకుశ నిర్ణయం తీసుకున్నదని విమర్శించింది. హజ్‌ యాత్రీకులకు ఇచ్చే సబ్సిడీని పదేళ్ల పాటు కొనసాగించాలని 2012లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు విరుద్ధంగా సబ్సిడీని ఎత్తివేస్తూ కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని సిపిఎం మండిపడింది. లౌకిక రాజ్యంలో మతపరమైన సబ్సిడీలకు సిద్ధాంతపరంగా తాము వ్యతిరేకమని పేర్కొంది. ప్రభుత్వాలు మతపరమైన సబ్సీడీలకు ప్రోత్సాహం ఇవ్వకూడదని సీపీఎంసూచించింది.

 

15:59 - January 17, 2018

మెదక్ : జిల్లా నర్సాపూర్‌లో బీవీఆర్‌ఐటీ కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రతినిత్యం ప్రజల పక్షం వహిస్తూ... టెన్‌టీవీ ఎనలేని సేవలందిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే వార్తలు అందించడంలోనూ ముందుంటోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీజీఎం కాంతారావు, డీన్‌ లక్ష్మీనరసయ్య, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

15:58 - January 17, 2018

మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టెన్‌ టీవీ ప్రసారాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌. మహబూబ్ నగర్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రసారాలు చేస్తున్న టెన్‌ టీవీని అభినందించారు.

15:57 - January 17, 2018

విశాఖ : మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు చంద్రబాబు. ప్రపంచంలో ప్రతి 10 మందిలో నలుగురు ఐటీ నిపుణులు మన దేశానికి చెందినవారే ఉన్నారని.. వారిలో ఒక్కరు రాష్ట్రానికి చెందినవారు ఉన్నారన్నారు చంద్రబాబు. ఈ సందర్బంగా చంద్రబాబు పలువురు మహిళా పారిశ్రామికవేత్తలను సన్మానించారు. 

15:56 - January 17, 2018

సిద్దిపేట : గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రిని కేసీఆర్‌ ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్బంగా తూప్రాన్‌పై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. డిగ్రీ కాలేజీతో పాటు.. 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్నారు. మరోసారి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో తూప్రాన్‌ వచ్చి... ప్రతి ఒక్కరినీ కలుస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

 

రెండో టెస్టులో సౌత్ అఫ్రికా ఘన విజయం

సెంచూరియన్ : సౌత అఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. సౌత్ అఫ్రికా 131 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ ను 2 0 తేడాతో సౌత్ అఫ్రికా స్వంతం చేసుకుంది. సౌత్ అఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 335, రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307 రెండో ఇన్నింగ్స్ లో 151 పరుగులు చేసింది. 

15:40 - January 17, 2018
15:26 - January 17, 2018

రంగారెడ్డి : నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి చెందాడు. శంషాబాద్ నారాయణ కాలేజీలో కరెంట్ షాక్ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఖాసీమ్ మృతి చెందాడు. మంచినీళ్లు తాగుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో విద్యార్థికి షాక్ కొట్టింది. కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.

నందిగామ మార్కెట్ చైర్మన్ కు బెదిరింపులు

కృష్ణా : నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్ కావేరి రెస్టారెంట్ యజమాని మురళిపై పీఎస్ ఫిర్యాదు చేశారు. మురళీ తనను బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పవన్ పై కత్తి కామెంట్స్

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ కామెంట్స్ చేశారు. జనసేన తోక పార్టీ అని, పవన్ తప్ప ఆ పార్టీలో జనమే లేరని ఆయన అన్నారు. పూనంపై ప్రశ్నలకు పవన్ స్పందించాలని, పవన్ సమాధానం కోసం తను ఆతృతగా ఎదురుచూస్తున్నాని కత్తి అన్నారు. 

15:23 - January 17, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ కు సంబంధించి 8 మంది బడా నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వాహిస్తున్నారు. గత మూడేళ్లుగా పన్ను కట్టని కొంత మంది నిర్మాతలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. భవ్య క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, హారిక హాసిని, డీవీవీ క్రియేషన్స్, డీవీవీ దానయ్య, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్, సీకే ఎంటర్ టైన్ మెంట్ పై ఐటీ దాడులు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:09 - January 17, 2018
15:07 - January 17, 2018

హైదరాబాద్ : వనస్థలిపురం సుష్మా థియేటర్ వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. టిప్పర్ వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

మందకృష్ణను కలిసిన కత్తి మహేష్

హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో మందకృష్ణను సినీ క్రిటిక్ కత్తి మహేష్ కలిశారు. కేసీఆర్ పై తిరుగుబాటు తప్పదని, రాష్ట్రంలో అప్రజాస్వామిక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు. 

14:40 - January 17, 2018

మ్యాట్రిమోనీ పెళ్లి సంబంధాల మోసాలపై సలహాలు, సూచనలు చేయడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి మానవి మై రైట్ వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:19 - January 17, 2018

ఢిల్లీ : తమకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో మండి హౌస్ వద్దకు స్కీం వర్కర్లు చేరుకుని ఆందోళనకు దిగారు. కేంద్ర పథకాలకు బడ్జెట్ పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగాయి. 

14:11 - January 17, 2018

విశాఖ : జిల్లా సబ్బవరంలో దారుణం జరిగింది. లక్ష్మి అనే వివాహితను ఆమె బావలు(భర్త అన్నలు)చితకబాదారు. ఆమె పండుగకు పుట్టింటికి వెళ్తానని కోరడంతో ఆమె విచక్షణరహితంగా కొట్టారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాచిగూడలో గ్యాంగ్ వార్

హైదరాబాద్ : కాచిగూడలోని వెంకటేశ్వర నగర్ లో నడి రోడ్డు పై రెండు గ్యాంగ్ లు కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా వారు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలు కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణలో అంబర్ పేటకు చెందిన ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్టు సమాచారం ఉంది. పోలీసులు కేవలం పిటి కేసు నమోదు చేసి వదిలేశారు.

14:04 - January 17, 2018

హైదరాబాద్ : కాచిగూడలోని వెంకటేశ్వర నగర్ లో నడి రోడ్డు పై రెండు గ్యాంగ్ లు కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా వారు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలు కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణలో అంబర్ పేటకు చెందిన ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్టు సమాచారం ఉంది. పోలీసులు కేవలం పిటి కేసు నమోదు చేసి వదిలేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

వంగవీటి పార్టీ మారండంలేదు : వైసీపీ

కృష్ణా : వంగవీటి రాధా పార్టీ మారడంలేదని, ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న  వార్తలు అవాస్తమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్ధసారధి అన్నారు. ఇదంతా టీడీపీ కుట్రతో ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమే అని ఆయన అన్నారు. 

'జై సింహ' నిర్మాత ఆఫీసులో ఐటీ సోదాలు...

హైదరాబాద్ : ‘జై సింహ' చిత్ర నిర్మాత ఆఫీసులో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. కృష్ణా నగర్ లోని సి.కళ్యాణ్ ఆఫీసులో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

తూప్రాన్ కు రూ. 5 కోట్లు - కేసీఆర్...

మెదక్ : సీఎం కేసీఆర్ తూప్రాన్ కు చేరుకున్నారు. 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. తూప్రాన్ కు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 

ఢిల్లీకి బాబు..

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారు. వచ్చే నెలలో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీలో జరిగే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

13:23 - January 17, 2018

విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి..

రంగారెడ్డి : శంషాబాద్ శ్రీ నారాయణ జూనియర్ కాలేజీలో విద్యుత్ షాక్ తో ఫస్టియర్ విద్యార్థి ఖాసిం మృతి చెందాడు. మరో విద్యార్థిని ఆరతికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని యాజమాన్యం తరలించింది. 

13:18 - January 17, 2018

ఢిల్లీ : ఆధార్ కార్డు ద్వారా వ్యక్తిగత డేటాకు భద్రత ఉందా ? ఎలాంటి భద్రత ఉండదని..ఇది ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని పలువురు సుప్రీంని ఆశ్రయించారు. బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆధార్ కు రాజ్యాంగబద్ధత ఉందా ? అన్న అంశాన్ని సుప్రీం తేల్చనుంది. ఎలాంటి అభద్రత లేదని..గోప్యతకు ఎలాంటి భంగం ఉండదని కేంద్రం తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆధార్ కార్డు ద్వారా పలు ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంటున్నారు. రూ. 500 చెల్లిస్తే ఆధార్ గోప్యత బహిరంగ పరుస్తున్నారనే దానిపై వార్తలు వెలువడడంతో మరింత కలకలం రేగింది. 130కోట్ల ప్రజానీకంలో 90 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని అంచనా. ఇటీవలే ఆధార్ లింక్ గడువును మార్చి 31 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

విశాఖలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం...

విశాఖపట్టణం : నగరంలో అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కుటుంబానికి నెలకు రూ. 10వేల ఆదాయమే లక్ష్యమని, మహిళల పట్ల ఎక్కడా వివక్ష లేకుండా చేస్తున్నామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారని, అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ముఖ్యమన్నారు.

 

13:10 - January 17, 2018

విశాఖపట్టణం : ఎస్టీ జాబితాలో తమను చేర్చాలంటూ మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. బుధవారం నగరంలోని నోవాటెల్ లో జరుగుతున్న మహిళా అంతర్జాతీయ సదస్సుకు హాజరు కానున్న సీఎం బాబు ఎదుట తమ నిరసన తెలియచేయాలని మత్స్యకారులు ప్రయత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుండి వెళ్లగొట్టారు. దీనితో విశాఖ బీచ్ లో జలదీక్ష చేపట్టారు. గతంలో వీరు జీవీఎంసీ వద్ద దీక్షను చేపట్టారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం తెలిపి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. కానీ ఆ హామీ నెరవేరకపోతుండడంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు వచ్చినా తీర ప్రాంతంపై ప్రభావం పడుతోందని..దీనితో తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. 

సుప్రీంలో ఆధార్ గోప్యతపై విచారణ...

ఢిల్లీ : సుప్రీంకోర్టులో ఆధార్ గోప్యతపై విచారణ జరిగింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆధార్ కు రాజ్యాంగబద్ధత ఉందా ? అన్న అంశాన్ని సుప్రీం తేల్చనుంది. 

తెలంగాణలో పల్లెపల్లెకు టి.టిడిపి..

హైదరాబాద్ : తెలంగాణలో జరుగనున్న పల్లెపల్లెకు టిడిపి కార్యక్రమంపై నేతలు చర్చిస్తున్నారు. పల్లెపల్లెకు టి.టిడిపిని విజయవంతం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి ఏర్పాటు, రక్తదాన శిబిరాలపై చర్చిస్తున్నారు. 

చెన్నంపల్లి కోట తవ్వకాలు..

కర్నూలు : జిల్లా చెన్నంపల్లి కోటలో మొదలైన తవ్వకాలు 30 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజులు తవ్వకాలు జరుగుతున్నా ఎలాంటి నిధులు..ఇతరత్రా ఏమీ దొరకడం లేదు. తవ్వకాలు జరుపుతుండడం..కోటను ధ్వంసం చేస్తుండడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

12:24 - January 17, 2018

కర్నూలు : జిల్లా చెన్నంపల్లి కోటలో మొదలైన తవ్వకాలు 30 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజులు తవ్వకాలు జరుగుతున్నా ఎలాంటి నిధులు..ఇతరత్రా ఏమీ దొరకడం లేదు. తవ్వకాలు జరుపుతుండడం..కోటను ధ్వంసం చేస్తుండడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళగంగను దాటి కిందకు వెళ్తే నిజంగానే గుప్తనిధులు ఉన్నాయా? గుప్తనిధిని చేరుకునే మార్గం ఇదేనా ? అనే దానిపై అధికారులు యోచిస్తున్నారు. చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం 30 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. క్యావిటీ స్కానర్లు, జీపీఎస్ స్కానర్లతో భూమిలో క్యావిటీల కోసం వెతికారు. భూమి లోపలికి 30 అడుగుల లోతు వరకూ తవ్వినా ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే కోట లోపల ఉండే వాటిని కనుక్కొనేందుకు అత్యాధునిక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. జీపీఆర్ స్కానర్ తో కోటలో నిధుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 600 సంవత్సరాల చరిత్ర గల కోటలో తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కానీ నిధులు..ఖనిజాలు ఉన్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ రెవెన్యూ, మైనింగ్, పోలీసులు..ఇలా ఐదారు డిపార్ట్ మెంట్ల అధికారులు అక్కడే ఉంటూ తవ్వకాలు చేయిపిస్తున్నారు. చివరకు నిధులు దొరకుతాయా ? శ్రమే మిగులుతుందా ? అనేది చూడాలి. 

లక్ష్మీ నరసింహ స్వామి సురక్ష బీమా...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం లక్ష్మీ నరసింహ స్వామి సురక్ష బీమా అందుబాటులోకి వచ్చింది. రూ. 60 రుసుముగా విధించారు. ఏక్స్ గ్రేషియా రూ. 5లక్షలు..శాశ్వత అంగవైకల్యం లేదా మరణం సంభవిస్తే వర్తింపు చేయనున్నారు. వయస్సు పరిమితి 12 ఏళ్ల నుండి 80 ఏళ్లు ఉండాలని, బీమా కాలపరిమితి 2018 మార్చి 1 నుండి 2019 ఫిబ్రవరి విధించారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 5గా నిర్ణయించారు. ప్రతి బీమా దారుడికి ఒక ఐడీ కార్డు ఇవ్వనుంది. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం www.booranarsaihgoud చూడవచ్చు. 

మోడీ, నెతన్యాహూల రోడ్ షో...

గుజరాత్ : అహ్మదాబాద్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ లు రోడ్ షోలో పాల్గొన్నారు. కాసేపటి క్రితం అహ్మదాబాద్ కు చేరుకున్న నెతన్యాహూకు ప్రధాని మోడీ, ఇతరులు ఘన స్వాగతం పలికారు.

12:12 - January 17, 2018

విజయవాడ : వైసీపీకి మరో షాక్ తగులనుంది. ఇప్పటికే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో కష్టాలు పడుతున్న వైసీపీకి మరో ఇబ్బంది కలుగనుందని ప్రచారం జరుగుతోంది. విజయవాడకు చెందిన వంగవీటి రాధ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనితో ఆయన త్వరలోనే పార్టీ మారుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయని తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు హామీ ఇవ్వలేదని జగన్ పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్లాది విష్ణుకి సెంట్రల్, వెల్లంపల్లికి పశ్చిమ, యలమంచిలి రవికి తూర్పు టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని..ఆవని గడ్డ నుండి పోటీ చేయాలని వంగవీటి రాధాకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది. కానీ తనకు విజయవాడ సెంట్రల్ సీటు కావావలని వంగవీటి రాధా పట్టుబడుతున్నట్లు, దీనికి జగన్ నో చెప్పారని వార్తలు వెలువడుతున్నాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి విగ్రహాలకు రాధాకృష్ణ వెళుతుండడంపై వైసీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీనితో విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని అధిష్టానం సూచించడంతో తీవ్ర అసంతృప్తికి గురయినట్లు సమాచారం. ఈ రెండు కారణాలతో వంగవీటి రాధా పార్టీ మారనున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియరావడం లేదు. ఇటీవలే పార్టీ నుండి సస్పెండ్ అయిన గౌతంరెడ్డి మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరి వంగవీటి రాధా పార్టీ మారుతారా ? మారితే ఏ పార్టీలో చేరుతారు ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

102 అమ్మఒడి, 108 బైక్ అంబులెన్స్ ల ప్రారంభం...

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో 102 అమ్మ ఒడి అంబులెన్స్, 108 బైక్ అంబులెన్స్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

గవర్నర్ ను కలిసిన మాజీ సీఎం హుడా...

హర్యానా : రాష్ట్ర గవర్నర్ ను మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ హుడా కలిశారు. శాంతిభద్రతలు కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, కట్టర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

అహ్మదాబాద్ కు ఇజ్రాయిల్ ప్రధాని..

గుజరాత్ : ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు దంపతులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. వారికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. 

11:36 - January 17, 2018

విజయవాడ : మంగళగిరిలోని ఎన్ ఆర్డీ టెన్ పార్కులో 13 ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కొత్త కొత్త పాలసీలను తీసుకరావడం జరుగుతోందని, ఈ పాలసీల ద్వారా చిన్న చిన్న కంపెనీలు..పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఏముందని రావాలని పలు కంపెనీల యాజమాన్యం పేర్కొన్నాయని చాకులాంటి యువతీ యువకులున్నారని తెలపడం జరిగిందన్నారు. ఏపీ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు వస్తాయని ఎవరూ ఊహించలేదని..కానీ పద్దతి ప్రకారం ముందుకెళుతూ ఐటీ కంపెనీలు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. 

11:33 - January 17, 2018

హైదరాబాద్ : పేద ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తేవడానికి టి.సర్కార్ చర్యలు తీసుకొంటోంది. రద్దీ ప్రాంతాలు..ఇరుకు ఉన్న కాలనీల్లోకి వెళ్లడానికి 108 వాహనం ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 'బైక్ అంబులెన్స్', 102 వ్యాన్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఉచితంగా ఈ సదుపాయాన్ని కల్పించనుంది. బైక్ లో పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్సకు అవసరమయ్యే సాధనాలను ఒక కిట్ ను అమర్చారు. ఆక్సిజన్ సిలిండర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8గంటల వరకు ఈ సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఇందులో పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారికి మాత్రమే వెహికల్స్ అందచేయడం జరుగుతోంది. త్వరలోనే జీపీఎస్ సిస్టం అమలు చేస్తారని తెలిపారు. 

11:14 - January 17, 2018
11:11 - January 17, 2018

పెద్దపల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీరాంసాగర్ రెండు కెనాల్ల ద్వారా పెద్దపలి నియోజకవర్గానికి నీరందుతోంది. డీ 83, డీ 86 కెనాళ్లకు నీరు విడుదల చేయకపోడంతో చివరి ఆయుకట్టు రైతులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీరు లేకపోవడంతో పంటలు బీడుగా మారిపోయాయి. గత వారం రోజుల క్రితం కాకతీయ కెనాల్ ద్వారా తమ తమ నియోజకవర్గాలకు నీటిని విడుదల చేయడంపై పెద్దపల్లి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిన విడుదల చేయాలంటూ మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా పెద్దపల్లి రైతులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే విజయ రమణ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనితో పోలీసులు ముందస్తు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయ రమణను గృహ నిర్భందం చేసి అరెస్టు చేశారు. సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మొక్కజోన్న పంట కోసం దున్నుకున్నారని, ఖరీఫ్ సీజన్ లో కూడా పంట సరిగ్గా చేతికందలేదని మాజీ ఎమ్మెల్యే విజయ రమణ పేర్కొన్నారు. అక్రమంగా మంత్రి ఈటెల నీటిని విడుదల చేసుకున్నారని, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. 

10:37 - January 17, 2018

ఖమ్మం : పండుగ కోసం వచ్చిన ఓ మహిళ ఆనందం ఆవిరైపోయింది. మూడు రోజుల పాటు ఆనందంగా గడిపిన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ మహిళ తన కుమారుడు చెర్రీతో కలిసి కొత్తగూడెం జిల్లాలోని చండ్రగొండులో ఉంటున్న తన తండ్రి ఇంటికి సంక్రాంతి పండుగ నిమిత్తం వచ్చింది.

మంగళవారం రాత్రి జూలురు పాడు సెంటర్ కు చెర్రీ తాతతో బయటకు వచ్చాడు. ఆ రోడ్డుపై నడిచి వెళుతుండగా అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చెర్రీ అక్కడికక్కడనే మృతి చెందగా తాతకు గాయాలయ్యాయి. కుమారుడు మృతి చెందాడని తెలుసుకున్న ఆ తల్లి తీవ్ర విషాదంలో మునగిపోయింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు బుధవారం ఉదయం రహదారిప రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. 

కరీంనగర్ లో టి.కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు...

కరీంనగర్ : మాజీ ఎమ్మెల్యే విజయ రమణను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

చండ్రగొండులో దారుణం...

భద్రాద్రి : కొత్తగూడెం జిల్లాలోని చండ్రగొండులో దారుణం చోటు చేసుకుంది. తాతా, మనవడిని ఓ టిప్పర్ ఢీకొంది. ఈఘటనలో మనవడు చెర్రీ మృతి చెందగా తాతకు తీవ్రగాయాలయ్యాయి.

 

కాన్పూర్ లో రద్దైన పాత నోట్లు..

ఉత్తర్ ప్రదేశ్ : కాన్పూర్ లో భారీగా పాత నోట్లు పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. ఓ ఇంట్లో రూ. 20 కోట్ల విలువైన రద్దైన నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్బీఐ, ఐటీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. 

10:25 - January 17, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, సీనియర్‌ జడ్జిల వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. నలుగురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి భేటి అయ్యారు. వీరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ వివాదానికి ఇక తెరపడనుందా? సుప్రీంకోర్టు పాలన వ్యవస్థ సరైన దిశలో నడవడం లేదని నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఉదయం పది గంటలకు జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకుర్, కురియన్ జోసెఫ్‌లతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సమావేశమయ్యారు. సీజేఐ చాంబర్‌లో ఈ సమావేశం 15 నిమిషాలు పాటు జరిగింది. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చీఫ్ జస్టిస్ చర్చించారు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు చీఫ్‌ జస్టిస్‌ వేసిన తొలి అడుగుగా భావిస్తున్నారు. నలుగురు జడ్జిలతో సిజె బుధవారం మరోసారి భేటి అయ్యే అవకాశం ఉంది. అనంతరం సుప్రీంకోర్టుకు చెందిన మిగతా జడ్జిలతో కూడా దీపక్‌ మిశ్రా టీ సమావేశం నిర్వహించారు. అంతకుముందు అసంతృప్త జడ్జిల వివాదం ఇంకా ముగియనట్లే కనిపిస్తోందని, మరో రెండు మూడు రోజుల్లో సద్దుమణిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వెల్లడించారు.

ఈ వివాదం వారాంతంలోపు ముగుస్తుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టులో పాలన సరిగా జరగడం లేదంటూ ఈనెల 12న నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు చేశారు. వివిధ కేసులపై బెంచ్‌ల ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించిన విషయం తెలిసిందే. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడం సంచలనం సృష్టించింది.

నాగోబా జాతర ప్రారంభం...

ఆదిలాబాద్ : జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో మెస్రం కుల పెద్దల సమక్షంలో నాగోబాకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు వారియర్ లు హాజరయ్యారు. పలు ప్రాంతాల నుండి భారీగా మెస్రం వంశీయులు తరలివచ్చారు. నాగోబా జాతర సందర్భంగా ఈనెల 19వ తేదీన గిరిజన దర్బార్ జరుగనుంది. ఈనెల 22 వరకు కేస్లాపూర్ నాగోబా జాతర జరుగనుంది. 

ఐటీ సంస్థల ప్రారంభం...

గుంటూరు : మంగళగిరి ఆటోనగర్ లోని ఐటీ పార్కులో మూడు ఐటీ సంస్థలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. మేక్ మై క్లినిక్, ఎక్సెల్లార్, బీవీజీ ఇండియా సంస్థలు ఆయన ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. 

09:35 - January 17, 2018
09:34 - January 17, 2018

తమిళనాడు : రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులు వెళుతున్న వ్యాన్ బోల్తా పడడంతో ఆరుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్ కు చెందిన కొంతమంది టెంపో వ్యాన్ లో ఉత్తరాది పర్యటనకు బయలుదేరారు. రామేశ్వరంకు వెళుతుండగా మంగళవారం రాత్రి తుత్తుకుడి జిల్లా దళవాయపురం వద్ద బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా పడింది. నిద్రమత్తులో ఉండడంతో ఏమి జరిగిందో వారికి అర్థం కాలేదు. అర్థం అయ్యేలోపే ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 7గురికి గాయాలయ్యాయి. వ్యాన్ లో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగం..డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా ? అనేది తెలియాల్సి ఉంది. 

వ్యాన్ బోల్తా..6గురు పర్యాటకులు మృతి...

తమిళనాడు : తుత్తుకుడి జిల్లా దళవాయపురం వద్ద బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా పడింది. ఆరుగురు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. మృతులు మధ్య ప్రదేశ్ కు చెందిన వారు. 

09:24 - January 17, 2018

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఎస్ఆర్ ఎస్ పి నీటిని కాకతీయ కెనాల్ ద్వారా తన నియోజకవర్గానికి మంత్రి ఈటెల విడుదల చేయడంతో వివాదం ప్రారంభమైంది. మంత్రి ఈటెల చర్యను రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ తమ నియోజకవర్గాలకు నీటిని విడుదల చేశారని..ఇతర నియోజకవర్గాలకు నీటిని విడుదల చేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిన విడుదల చేయాలంటూ మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా పెద్దపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ విషయంలో నీటి పారుదల శాఖ మంత్రితో ఎమ్మెల్యే వాదనకు దిగినట్లు సమాచారం. కానీ ప్రజాప్రతినిధుల వత్తిడితో నీటిని ఆయా నియోజకవర్గాలకు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో బుధవారం మాజీ ఎమ్మెల్యే విజయ రమణ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనితో పోలీసులు ముందస్తు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయ రమణను గృహ నిర్భందం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

స్కూల్ బస్సు డ్రైవర్ల సమ్మె...

మధ్యప్రదేశ్ : ఆర్టీఓ విధించిన నిబంధనలపై స్కూల్ బస్సు డ్రైవర్లు సమ్మె చేపట్టారు. దీనితో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. భోపాల్ లో తల్లిదండ్రులు తమ తమ వాహనాల్లో పిల్లలను స్కూల్స్ వద్ద దింపుతున్నారు. 

09:07 - January 17, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలో నాగోబా జాతర కోలాహలంగా సాగుతోంది. నాలుగు రాష్ట్రా నుంచి తరలి వచ్చిన గిరిజనులు తమ ఆరాధ్యదైవం నాగోబాకు భక్తి శ్రద్ధలో పూజలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ వాయిద్యాలతో నాగోబాకు ఘనంగా పూజలు జరుగుతున్నాయి.ప్రతిఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగుతుంది. పకృతితో పెనవేసుకున్న ఆదివాశీల సంస్కృతికి అసలు సిసలు ప్రతిరూపం ఈ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర వెల్లిమండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం కొలువు దీరింది. ఇక్కడ మొస్రం తెగ గిరిజనులు మాత్రమే

నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నాలుగు తెగల ఆదివాసీలు ప్రధానంగా నోగోబాను పూజిస్తారు. అయితే గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో నాగేంద్రుణ్ని దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటారు పుష్యమాసం ప్రారంభం నుంచి నెలవంక కనిపించిన రెండో రోజున మొస్రం తెగ గిరిజనులు కేస్లాపూర్‌లో సమావేశమవుతారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన మొదటి రోజే గిరిజనులంతా తమ ఇంళ్లు, వాకిళ్లూ అందంగా అలంకరించుకుంటారు. మరుసటి రోజు ఇచ్చోడ మండలం సిరికొండలోని కుమ్మరులకు కుండలు చేయమని చెప్పి వస్తారు. నాగోబా పూజలో కీలకమైన కుండలను సిరికొండ గ్రామానికి చెందిన కుమ్మరి వంశస్తులే తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కుండలు తయారైన తర్వాత పుష్యపౌర్ణమి నాడు మొస్రం తెగవారంతా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. పూజాకలశాలు తీసుకొని గోదావరి నది పవిత్ర జలాలను తీసుకు రావడానికి బయలుదేరుతారు. కేస్లాపూర్ నుంచి సుమారు 80 కి.మీ. దూరం నడిచి గోదావరి తీరానికి వెళ్తారు. ఈ ప్రయాణంలో ఊరి పొలిమేరల్లో మాత్రమే వారు బస చేస్తుంటారు.

నాలుగు రోజుల్లో జన్నారం మండలం కలమడుగు గ్రామ ప్రాంతంలో గోదావరి తీరం చేరతారు. ఇక్కడ అస్తాన్ మడుగు దగ్గర గల పంచలింగాలకు పూజ చేస్తారు. అక్కడి గోదావరి జలం తీసుకొని తెల్లవారక ముందే ఆ ప్రాంత పొలిమేరలు దాటుతారు. మళ్లీ కాలినడకన తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. మార్గమధ్యంలో ఏ ఊరిలోకి ప్రవేశించకుండా అటవీప్రాంతం నుంచి నడక సాగిస్తారు . గోదావరి జలాలతో ఊరిలోకి ప్రవేశించరాదన్న నియమాన్ని పాటిస్తారు. కేస్లాపూర్‌ చేరుకున్న తర్వాత.. అక్కడ నుంచి మంగళవాయిద్యాలతో నీటి కలశాలను నాగోబా ఆలయానికి చేరుస్తారు. మరోవైపు మిగతా గిరిజనులు అంతా అమావాస్య రోజు సాయంత్రానికి ఎడ్లబండ్లలో ఆలయం పరిసరాలకు చేరుకుంటారు. మొస్రం తెగ ఆడపడుచులు, అల్లుళ్లు వరుస క్రమంలో నాగోబా ఆలయాన్ని శుభ్రపరిచి, నీళ్లతో కడుగుతారు. ఆలయంలోని మట్టితో గద్దె వేస్తారు. ఈ గద్దె వేయడాన్ని 'భోవ్‌లా వాట్‌వాల్' పిలుస్తారు. గద్దె వేసిన మరుసటి రోజు నుంచి వారం రోజుల పాటు ఇష్టదైవం నాగేంద్రుడికి వివిధ రీతుల పూజలు నిర్వహిస్తారు.

సుల్తానాబాద్ లో నేడు కాంగ్రెస్ ఆందోళన...

పెద్దపల్లి : ఎస్ఆర్ఎస్ పి నీటిని బి-83, 86 కెనాల్ కు విడుదల చేయాలని సుల్తానాబాద్ లోని నేడు కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేయనుంది. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు..రైతులు మందుస్తుగా అరెస్టులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయ రమణను గృహ నిర్భందం చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు. 

08:25 - January 17, 2018

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఎన్ని నిర్వహిస్తున్నా మందుబాబులు మారడం లేదు. వీకెండ్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ చిక్కుతూనే ఉన్నారు. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో సుహాని యువతి హల్ చల్ చేసింది. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆమెకు టెస్టు చేయగా మోతాదుకు మించిన మద్యం సేవించినట్లు వెల్లడైంది. దీనితో ఆమె ప్రయాణించిన కారును సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 59 మందిపై కేసులు నమోదు చేశారు. 34 కార్లు, 25 బైక్ లు సీజ్ చేశారు.

 

పాఠశాల టీచర్ అనుమానాస్పదస్థితి మృతి...

కరీంనగర్ : హుజురాబాద్ వ్యవసాయ బావిలో ప్రైవేటు పాఠశాల టీచర్ రాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నాలుగు రోజులుగా రాజు కోసం కుటుంబీకులు గాలిస్తున్నారు. 

ఫిబ్రవరి 21న కమల్ యాత్ర..

చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమౌతున్నారు. ఫిబ్రవరి 21 నుండి రామంతపురం నుండి యాత్ర మొదలు పెట్టనున్నట్లు కమల్ కాసేపటి క్రితం ప్రకటించారు. యాత్రలో రాజకీయ పార్టీ పేరు..విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. 

దేశ రాజధానిలో పొగమంచు...

ఢిల్లీ : దేశ రాజధానిలో పొగమంచు దట్టంగా అలుముకొంది. రవాణా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. 21 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 13 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

06:49 - January 17, 2018

అవి ప్రజల ప్రయోజనాలకోసం పెట్టబడిన స్కీములు... కానీ వాటిలో పనిచేసే ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం ఉండదు. కార్మికచట్టాలు అమలు కావు. చివరికీ ఆ స్కీములనే ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వీటిని నిరసిస్తూ ఈరోజు సమ్మెకి దిగుతున్నారు. 26 స్కీముల్లో లక్షలాది మంది సమ్మెకి దిగుతున్నారు. ఈ సమ్మెకి గల కారణాలపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు రమ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:47 - January 17, 2018

హైదరాబాద్ : మిషన్‌కాకతీయ నాలుగోదశకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈసారి మొత్తం 5703 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ పథకం నాలుగోదశకు తెలంగాన ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈమేరకు అధికారులకు నీటిపారుదలశాఖామంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆయా చెరువుల కింద ఆయకట్టును స్థిరీకరణ, అదనపు ఆయకట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

ఫిబ్రవరి 3వ తేదీ లోగా మిషన్ కాకతీయ 4 వ దశ పనులను ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సమయం నిర్దేశం చేశారు. ఫీడర్ చానల్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 4 వ దశలో చేపట్టనున్న పనులపై మంగళవారం సెక్రెటేరియట్ లో ఆయన ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరోజు కారోజు విధిగా వాట్సప్ లో పనుల ఫొటోలు పెట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ నెలాఖరులోగా పనుల గ్రౌండింగ్ జరగాలన్నారు మంత్రి హరీశ్‌రావు. నాలుగో దశ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రజాప్రతినుధులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతోపాటు పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా భాగస్వాములు కావాలన్నారు. ఫోర్త్‌ఫేజ్‌లో మొత్తం 5703 చెరువుల పునరుద్ధరణ చేపడతామన్నారు మంత్రి హరీశ్‌రావు.

4వ దశలో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు. దీనికోసం ముందగా భూసారా పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూడు గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న 2,500ల సాయిల్‌టెస్ట్ కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు. చెరువు మట్టి పొలాల్లో వేసుకునేలా రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలఅధికారులు,సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరిపాలనపరంగా ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. ఇదిలావుంటే మిషన్ కాకతీయ రెండు, మూడో దశలలో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు.. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో జాప్యం చేయరాదని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశంతో అధికారుల్లో మరోసారి ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. 

06:43 - January 17, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం ముందుగానే సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగాన్ని కూడా ఈ దిశగా సమాయత్తం చేస్తోంది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. నిర్ణీత గడువుకు ప్రకారం పంచాయతీరాజ్‌ ఎన్నికలను నిర్వహించి ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వచ్చే నెల చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాలని గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారు. కానీ బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణగా సిద్ధంఅవుతోంది. పైకి తమకు ముందస్తు ఎన్నికల అవసరం లేదంటూనే లోలోపల ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పాలనాధికారులకు ఎన్నికలకు ఎలా సిద్ధంకావాలో హితబోధ చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కొన్ని మినహా, మిగిలినవి ప్రజలపై ప్రభావం చూపలేకపోతున్నాయని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఇంతవరకు అమలు చేసిన పథకాల్లో అసులు లబ్ధిదారుల కంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే చేరాయన్న వాదనలను ఉన్నాయి. దీంతో ప్రభుత్వం అభాసుపాలవడంతోపాటు, విమర్శలు ఎదుర్కొంది. ట్రాక్టర్లు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ప్రోత్సాహకాలు వంటి పథకాలు ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలడానికి కారమణమయ్యాయని కలెక్టర్ల సమావేవంలో కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అయితే దీనికి కలెక్టర్లు కూడా దీటుగానే ప్రతిస్పందిచారని వినిపిస్తోంది. అధికార పార్టీ నేతల అతిజోక్యంతో తామేమీ చేయలేకపోయామని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైందని కేసీఆర్‌ అభిప్రాయపడ్దారు.

కొత్త జిల్లాల్లో చాలాచోట్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన కూడా చేయలేకపోయిన విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడంపై ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేరారని వినిపిస్తోంది. ఈ పథకం అమలుపై అధికారులు, ఎమ్మెల్యేలు గొడవపడి మీడియా ఎక్కడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు రైతులకు ఈ ఏడాది మే నుంచి పెట్టుబడిసాయం చెక్‌ల పంపణీ, పట్టదారు పాసు పుస్తకాల జారీ పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం పనితీరుకు అద్దంపట్టే ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేయాలని కోరారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుని అమలు చేసేలా ఆదేశాలు ఇస్తామని జిల్లా కలెక్టర్ల దృష్టికి తెచ్చారు.

పంచాయతీ ఎన్నికల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చే ఎన్నికల హమీ అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా చూడాలని కోరారు. అత్యంత పకడ్బందీగా తీసుకొస్తున్న కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై అన్ని స్థాయిల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల చివరిలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలను కేసీఆర్‌ ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికలా? పరోక్ష ఎన్నికలా ? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేసీఆర్‌ జిల్లా కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. అయితే ముఖ్యమంత్రి చెబుతున్నట్టు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. రిజర్వేషన్లకు ఎప్పటి జనాభాను ప్రాతిపదికాగా తీసుకోవాలన్న అంశంపై స్పష్టత లేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశిస్తున్నట్టు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు సాధ్యంకాకపోవచ్చని భావిస్తున్నారు. 

06:40 - January 17, 2018

ప్రకాశం : జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. నవ్య కేబుల్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. బజర్దస్త్‌ నటులు చిత్రం శీను, ఫణి, బుల్లితెర నటుడు అజయ్‌ ఘోష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటులు, జానపద నృత్యాలతో కార్యక్రమం అలరించింది.

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో హాస్య నటుడు పృథ్వి సందడి చేశారు. కోడి పందేల బరిని సందర్శించారు. పందేలను ఆసక్తిగా తిలకించారు. కోడిని పట్టుకుని బరిలో దిగి సందడి చేశారు. ఆంక్షల మధ్య పండుగ సంప్రదాయాలను జరుపుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 

06:35 - January 17, 2018

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారు. వచ్చే నెలలో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీలో జరిగే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. వచ్చే నెల 24 నుంచి 26 వరకు విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు జరుగనుంది. దీనికి సంబంధించి ఇవాళ ఢిల్లీలో జరిగే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈభేటీలో చంద్రబాబుతో పాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు కూడా పాల్గొంటారు. సదస్సుకు హాజరయ్యే కార్పొరేట్లు, పారిశ్రామిక సంస్థలపై చంద్రబాబు.. సీఐఐ ప్రతినిధులతో సమీక్షిస్తారు. ఆహ్వానితుల జాబితాపై చర్చిస్తారు. 2015, 2016 భాగస్వామ్య సదస్సుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఎన్ని అమల్లోకి వచ్చాయి, ఏమేరకు పెట్టుబడులు లభించాయన్న అంశంపై సమీక్షిస్తారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ వేదిక కావడం వరుసగా ఇది మూడోసారి. గతంలో కంటే ఈసారి భిన్నంగా దీనిని నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో మౌలికసదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయన్న విషయాన్ని సీఐఐ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించాలని చూస్తున్నారు. గతంలో ఏపీలో మౌలికసదుపాయాలు లేవన్న కారణంగా పెట్టుబుడులు పెట్టేందుకు కొందరు కార్పొరేట్లు వెనక్కి తగ్గిన నేపథ్యంలో... ఏడాదిగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన మౌలికసదుపాయాలను సీఐఐ దృష్టికి తీసుకెళ్లి, ఈసారి ఎక్కువ మంది కార్పొరేట్లను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటారు.
ఆరు రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. ఈనెల 12న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం... ప్రత్యేక ప్యాకేజీ అమలుపై చర్చించారు. ఇప్పుడు కూడా హస్తిన పర్యటలో చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశమై ప్యాకేజీ అమలుపై చర్చించే చాన్స్‌ ఉంది. 

అండర్ 19ప్రపంచ క్రికెట్..

ఢిల్లీ : వరుసగా రెండో విజయంతో భారత జట్టు అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పపువా న్యూ గినియాతో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

గుడిమెలిగే పండుగ...

వరంగల్ : మేడారం మహాజాతరలో తొలిఘట్టమైన గుడిమెలిగె పండుగ బుధవారం జరగనుంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయాలతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

జగన్ 64వ రోజు పాదయాత్ర..

చిత్తూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 64వ రోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వేదమాలపేట మండలం పాడిరేడులో పాదయాత్ర కొనసాగనుంది. పాడిరేడు నుంచి తాత్నేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం మీదుగా కొనసాగనుంది. 

అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సు...

విశాఖపట్టణం : నగరంలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సు జరుగనుంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు ?

హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే నెల ఫిబ్రవరిలోనే నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా, పరోక్షంగానా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఆ ఎన్నికల విధి విధానాలను కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపరుస్తామని తెలిపారు.

భారత్ లక్ష్యం 287 పరుగులు..

ఢిల్లీ : సెంచూరీయన్ లో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ 287 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా రెండో ఇన్సింగ్స్ లో 258 పరుగులు చేసింది. దీనితో భారత్ 287 పరుగులు చేయాల్సి ఉంది. 

హజ్ యాత్ర..సబ్సిడీ ఎత్తివేతపై అసదుద్దీన్ స్పందన..

ఢిల్లీ : పవిత్ర హజ్‌యాత్రకు వెళ్లే భారత ముస్లిం యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని కేంద్రం ఎత్తివేయడం పట్ల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హజ్‌ యాత్రకు మాత్రమే కాకుండా అన్ని మతాల యాత్రలకు సంబంధించి సబ్సిడీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Don't Miss