Activities calendar

18 January 2018

21:08 - January 18, 2018

హైదరాబాద్ : టీటీడీపీ సీనియర్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతున్నాయి. పార్టీ తెలంగాణలో ప్రాభవం కోల్పోయిందని అందరూ అంటుంటే వినడానికి బాధగా ఉందని మోత్కుపల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అపవాదు కంటే పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుందని మీడియా సాక్షిగా పార్టీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ పార్టీని విలీనం చేసే ఉద్దేశం లేకపోతే చంద్రబాబు స్వయంగా తెలంగాణ ప్రాంతమంతా తిరిగి ఇతర పార్టీలకు ధీటుగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఆ తీరిక లేదన్నారాయన. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తమలాంటి ఎందరో సీనియర్లు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మోత్కుపల్లి స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ఘాట్‌కు చంద్రబాబు రాకపోవడంపై
ఇక ఎన్టీఆర్ ఘాట్‌కు చంద్రబాబు రాకపోవడంపై కూడా మోత్కుపల్లి స్పందించారు. చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై టీటీడీపీ నేతలు గరం అవుతున్నారు. టీడీపీలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని.. అయితే ఎప్పుడు, ఎక్కడ ఎలా మాట్లాడాలనేది నిర్ణయించుకుని మాట్లాడితే అది వారికి, పార్టీకి మంచిదని టీటీడీపీ అధ్యక్షుడు రమణ సూచించారు. మోత్కుపల్లి కామెంట్స్‌పై మరో సీనియర్ దయాకర్‌రెడ్డి స్పందించారు. మోత్కుపల్లి కామెంట్స్ చేస్తున్నప్పుడు పక్కన తను ఉండకపోవడం ఆయన అదృష్టం అన్నారాయన. మోత్కుపల్లి వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీలో మరో కుట్ర జరుగుతోందని భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు .. ఆపై సీనియర్ల స్పందన పార్టీలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మోత్కుపల్లి చేసిన కామెంట్స్‌ను పార్టీ అధినేత చంద్రబాబు పాజిటెవ్‌గా తీసుకుంటారో లేక నెగెటివ్‌గా తీసుకుంటారో... తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

21:07 - January 18, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నివాళులు అర్పించగా... ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు చరిత్ర ఉన్నంత వెరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన అన్నారు. పేదవారి కోసం ఎన్టీఆర్‌ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.. ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులు
మరోవైపు నారా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులర్పించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు బ్రహ్మణి కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ చేరుకుని సమాధిపై పుష్ప గుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అంతకుముందు నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. హరిక్రిష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని.. ఆయన కడుపున పుట్టడం తాను చేసుకున్న పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎన్టీఆర్‌ ఓ రాజకీయ దురంధరుడు అని ఎన్టీఆర్‌ మరో కుమారుడు బాలకృష్ణ కీర్తించారు. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించిన బాలకృష్ణ తెలుగు వారి గుండె చప్పుడు, ఆరాధ్య దైవమని అన్నారు. ఎన్టీఆర్‌ సాధించింది విక్టరీ కాదు హిస్టరీ అని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు.ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన లక్ష్మీపార్వతి... ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు అభ్యర్ధనలు కూడా పంపలేదని విమర్శించారు. 

21:06 - January 18, 2018

హైదరాబాద్ : దొంగతనాలు, హత్యలు, దోపిడీలు చేసేవారు.. చైన్‌ స్నాచర్లు, నకిలీ నోట్ల చలామణి చేస్తున్న వారు.. డ్రగ్స్ సప్లై దారులు.. రౌడీషీటర్లు.. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఇళ్లకు పోలీసులు నేరుగా వెళ్లి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ నేరాలకు పాల్పడ్డ వారి డేటాను సేకరిస్తున్నారు. గతంలో పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన అడ్రస్ ఆధారంగా నేరస్తుల సర్వే కొనసాగుతోంది. నిందితులు ఇచ్చిన చిరునామాలో ఉంటున్నారా? ఇంకా నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్నారా? లేక ఉపాధి అవకాశాలను వెతుక్కున్నారా? వంటి అంశాలను సేకరిస్తున్నారు. డీజీపీ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు నేరస్థుల సమగ్ర సర్వేలో పాల్గొంటున్నారు. నేరస్థుల వివరాలను ఆధార్‌తో అనుసంధానిస్తూ జియోట్యాగ్‌ను అప్లై చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం నేరస్థుల సర్వే
రెండేళ్ల క్రితం సైబరాబాద్‌- హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో దొంగలు, నేరస్థుల సర్వే నిర్వహించారు. అప్పుడు కేవలం ఇళ్లల్లో దొంగతనాలు చేసేవారిని, స్నాచర్లను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం అన్నిరకాల నేరస్థుల ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లతో పాటు జిల్లాల్లో కూడా నేరగాళ్ల సర్వే నిర్వహించారు. ప్రస్తుతం జైళ్లలో ఉన్నవారిని మినహాయించి మిగిలిన వారిందరి వద్దకు వెళ్తున్నారు. ఇతర వివరాలతో పాటుగా నేరస్థులు.. వారి కుటుంబ సభ్యుల ఫోటోలను సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే జరుపుతున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. గత పది సంవత్సరాలుగా నేరం చేస్తున్న వారి కుటుంబ పరిస్థితులు, వారేం చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నేర రహిత రాష్ట్రంగా చేసేందుకు,,, నేరస్థుల్లో మార్పు తెచ్చేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలోని హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న సర్వేను డీజీపీ పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 18 వేల మంది నేరస్థులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 18 వేల మంది నేరస్థులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో దాదాపు 32 వేల మంది నేరస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్‌ పరిధిలో 20 వేల మంది, రాచకొండలో 19,260 మంది నేరస్తులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరందరి డేటాను తీసుకుని తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన TS COP సైట్‌లో పొందుపరచి నేరాలను, నేరగాళ్లను అదుపు చేస్తామని డీజీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నేరం చేస్తే దొరికిపోతామనే భయం నేరగాళ్లకు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. తరచూ చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లల్లో దొంగతనాలు చేసే వారంతా ఎక్కువగా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. సర్వేలో వీరితోపాటు ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారి డేటానూ సేకరిస్తున్నారు. టీఎస్ కాప్ మొబైల్ యాప్‌లో నేరస్థుల సర్వేను నిక్షిప్తంగా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వారికదలికలపై నిఘా ఉంటుందని డీజీపీ తెలిపారు.

 

21:04 - January 18, 2018

గుంటూరు : ప్రతి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో జవాబుదారీగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబునాయుడు. యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తొలిరోజు వ్యవసాయంపై అధికారులు తమ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. పరిశ్రమల శాఖ అభివృద్ధిపై చర్చించారు.

విభజన సమస్యలను ఒక్కొక్కటిగా
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని, విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు అభివృద్ధికి సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే పనితీరుపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు విశ్లేషించుకునేలా సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అలా చేయడం ద్వారా ఎంత వృద్ధి సాధించామో కలెక్టర్ల సదస్సులో తేలిపోతుందన్నారు. ప్రతీ శాఖకు కీ పెర్ఫార్మెన్స్ ఇండెక్సులు ఏర్పాటుచేస్తామని, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు.2029 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదగాలని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి, చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్‌లతో పాటు మంత్రులు, కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

20:39 - January 18, 2018

ఎట్టకేలకు పద్మావత్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. కొన్ని రాష్ట్రాలు సినిమా విధించిన నిషేధంపై సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. మీ ఇష్టం వచ్చిన్నట్టు చేస్తే కుదరదని సుప్రీం స్పష్టం చేసింది. అయితే కర్ణిసేన మాత్రం టికెట్లు కొని అయిన సినిమా నిలుపుదల చేస్తామని ప్రకటించింది. 

20:17 - January 18, 2018

అత్యంత విశ్వనీస సమాచారం మనకు తెల్సిపోయింది.. కోదండరాం సారు కొత్త పార్టీ వెడ్తున్నడా..? లేదా..? ఏ గాయినెందుకు వెడ్తడు..? ఆయనకు రాజకీయమంటెనే ఇష్టంలేదని కొందరు.. ప్రశ్నించుడు కాడనే ఉంటడు సారు.. పరిపాలనదాక వోడు అని కొందరు.. ఇట్ల ఎవ్వలి మాట వాళ్లు మాట్లాడుకుంటున్నరు.. కని మనం జేఏసీల కీలకమైన నేతతోని మాట్లాడినం.. సారు పార్టీ వెడ్తున్నడా లేదా సూడుండ్రిగ..

అబ్బా ఎన్టీరామారావు సారు స్వర్గానికి వొయ్యి ఇర్వై రెండేండ్లైందిగని.. ఆయన ఆత్మకు శాంతి ఎట్లగల్గుతదని.. అటు నందమూరి ఫ్యామిలీ పరందామయ్యలు కనుక్కోలేకపోయిండ్రు.. ఆయన ప్రియమైన అల్లుడు చంద్రాలు గూడ తెల్సుకోలేకపోయిండ్రు.. కాబోయే కళల గవర్నర్.. గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారు మాత్రమే రామారావు ఆత్మకు శాంతి మార్గం గనిపెట్టిండు..

మనుండంగ మంచినీళ్లు వొయ్యనోళ్లు.. సావుకు మాత్రం ముందుగాళ్ల నిలవడ్డరట.. ఎన్టీరామారావు ముచ్చట్ల నందమూరి ఫ్యామిలీ డ్రామాలు జూస్తుంటె అట్లనే అనిపిస్తున్నది.. ఒకల్ని వట్టక ఒకలు ఎగవడి ఎగవడి పూలు జల్లి సమాధికి సన్మానాలు జేస్తున్నరు.. పాపం ఎన్టీరామారావు సారు ఎంత గోసెళ్ల వోశిండు.. ఆఖరికి గడియలళ్ల.. ఆయనను గోసవెట్టినోళ్లే ఇయ్యాళ ఆనందబాష్పాలు గార్చి.. బైటగూడ నటిస్తున్నరు..

అడుక్క తినెటోనికి హక్కులెందుకు చెప్పుండ్రి..? వానికి హక్కులు ఉంటేంది...? లేకుంటేంది..? వాని బత్కే అడుక్కతినుడాయే.. ఇంత పెద్ద మాట ఎందుకంటె..? చేతులు గాలినంక ఆకులు వట్కున్నట్టు.. సింగరేణి కార్మికులు ఇప్పుడు లొల్లికి దిగుతున్నరు.ఎన్నిలప్పుడు మాకిచ్చిన హామీలు నెరవేర్చుతాన్నముఖ్యమంత్రిగారు ఏమాయే అంటున్నరు.. ఈ సోయి ఎన్నికలప్పుడే ఉంటే ఎంత బాగుండే..?అనేది ముచ్చట..?
సకల జనుల సమగ్ర కుటుంబ సర్వేలెక్క.. సకల నేరస్తుల సర్వే జేపిస్తడట తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిగారు.. ఆ దొంగలకు జియో ట్యాగింగు వెట్టి.. వాళ్లు ఏడ తిర్గుతున్నరు..? ఏం జేస్తున్నరు..? అనేది ఎప్పటికప్పుడు తెల్సుకుంటరట.. తెల్సుకోవాల్సిందే నేరాల నివారణ కోసంగని.. మరి డీజీపీ గారు మేము గూడ కొన్ని సూచనలు జేస్తం పనికొస్తె పరిగణలోకి దీస్కోండ్రి..

ఏ ప్రభుత్వ అధికారన్న లంచం అడ్గితె చెప్పుతోని గొట్టుమని తెలంగాణ ముఖ్యమంత్రి జెప్పిండుగదా..? అది అమలైతున్నదో లేదో తెల్వదిగని.. నేను మాత్రం ఒక్క ముచ్చట జెప్తున్న..ఎవ్వడన్న మీడియా పేరు జెప్పి.. డబ్బులు అడ్గిండే అనుకో ఆడనే తోలు చెప్పుదీస్కోని కొట్టుండ్రి.. ఏంగాదు..? మీ అక్రమాలు బైటవెట్టొద్దంటే మాకు పైసలియ్యాలే అంటరా..? ఇదేనా జర్నలిజం అంటే..?

మొన్న మరదలిని ఇద్దరు బావలు గల్చి బొర్లిచ్చి కొట్టిండ్రు.. ఇయ్యాళ తిరుపతి దిక్కు సాటి మహిళ అని సూడకుంట.. పెయ్యిమీది బట్టలన్ని గుంజేశి.. నడి బాజట్ల గొట్టిండ్రంటే.. అయ్యో ఎంతైనా మన అసొంటి మహిళనే గదా... బరివాతల జేశి కొడ్తె ఇజ్జత్ మానం బోతదన్న శిగ్గుండొద్దా..? మన్సుల వాళ్లు పశువులా మీరే జెప్పాలె ఇగ..

యావత్ క్రికెట్ అభిమానులారా..? దక్షిణాఫ్రికాతోని కిర్ కెట్ మ్యాచ్ ఆడుతున్న ఇండియా పోరగాళ్ల ఆట సరిగలేదుగదా..? పొయ్యినోడు పొయ్యినట్టే ఔటైతున్నడు వస్తున్నడు.. ఇండియా ఇజ్జత్ కచ్రా జేశిండ్రు అని బాధపడ్తున్నరా..? ఇద్వర్ సంది ఇగ మీకు అసొంటి బాధలుండయ్.. నల్గురు ఆణిముత్యాలసొంటి క్రికెట్ ఆటగాళ్లు మన హైద్రావాద్ ఎల్బీస్టేడియంల కసరత్తు జేస్తున్నరు పాండ్రి పరిచయం జేస్త..

ముగిసిన జీఎస్టీ మండలి సమావేశం

ఢిల్లీ : జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది. రిటర్న్స ఫైలింగ్ ప్రక్రియ సరళతరం చేసే అంశంపై చర్చించామని, సవరించిన జీఎస్టీ రేట్లు  ఈనెల 25 అమలు చేస్తామని, 29 వస్తువులు, 53 విభాగాల సేవల జీఎస్టీ రేట్లు అరుణ్ జైట్లీ అన్నారు. 

19:22 - January 18, 2018

గ్రహణం వస్తే వచ్చే అతిపెద్ద డిజస్టర్ ఎంటంటే గ్రహణానికి వారం రోజుల ముందు అయ్యాగార్లు టీవీ స్టూడియోలకు వచ్చి గ్రహణం ఏదో జరుగుతుందని చెప్పడమని ప్రముఖ హేతువాది బాబు గోగినేని అన్నారు. కొంత మంది స్వామిజీలు డబ్బులు సంపదించుకోవాడానికి గ్రహణాన్ని ఉపయోగించుకుంటారని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:51 - January 18, 2018

యాదాద్రి : సంక్రాంతి పండగరోజు ఆవుమాంసం తిన్నారని దళితులపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దాడికి నిరసనగా టీమాస్‌ కన్వీనర్‌ జాన్‌ వెస్లీ ఆధ్వర్యంలో.. యాదగిరిగుట్టలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎస్‌ఎస్‌ వాదులు గోరక్షక పేరుతో చేస్తున్న దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ధర్నాలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. దీనిపై పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు.

18:51 - January 18, 2018

తూర్పుగోదావరి : బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా యువత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. బెల్ట్ షాపులు రద్దు చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాపుల మూలంగా యువత భవితవ్యం నాశనం అవుతోందని ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

18:50 - January 18, 2018

గుంటూరు : రాష్ట్రాల అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధిలో భాగంగా అన్ని రాష్ట్రాలు పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలని రాజీవ్‌కుమార్ సూచించారు.

18:49 - January 18, 2018

ఢిల్లీ : ప్రత్యేక ప్యాకేజీ అంశాలను బడ్జెట్‌లో చేర్చాలని, ఏపీ రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ బడ్జెట్‌లోనే ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రీబడ్జెట్ సమావేశంలో పాల్గొని... ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ వాటా పెంచాలని రాష్ట్రాలన్నీ కోరాయని, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకు సాయం పెంచాలని కోరినట్లు కూడా యనమల తెలిపారు.

18:39 - January 18, 2018

తెలుగు దేశం పార్టీ విలీనం చేసే ప్రసక్తే లేదని, టీడీపీ పుట్టిందే హైదరాబాద్ లో అని, టీడీపీ బడుగుల కోసం పుట్టిన పార్టీ అని, మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. మోత్కుపల్లి పొలిట్ బ్యూరో సభ్యుడు ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశంలో మనగడ సాగిస్తున్నాయని, తెలంగాణ ప్రాంతంలో వైసీపీ టీఆర్ఎస్ లో విలీనం అయిందని, టీటీడీపీలో కూడా ముఖ్యులు ఎవరు లేరని టీఆర్ఎస్ నేత రాకేష్ నేత అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:12 - January 18, 2018

కర్నూలు : జిల్లా ఆదోనిలోని వాల్మీకి నగర్ లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వేటకొడవళ్లతో ఇరువర్గాలు దాడులకు తెగపడ్డారు. ఈ ఘర్షణ 13 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాటుసారా విషయంలో విదామే ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:07 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టీజాక్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారేందుకు సిద్ధమవుతోంది. పార్టీగా అవతరించేందుకు కసరత్తు టీ జేఏసీ నేతలు కసరత్తు చేస్తున్నారు. టీజాక్‌ను రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే....ఇటీవల దీనిపై టీజేసీలో భిన్న వాదనలు వినిపిస్తున్నా.....రాజకీయ పార్టీగా మార్చాలన్న డిమాండ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో పొలిటికల్ పార్టీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం కావాలన్న అభిప్రాయం టీజాక్ నేతల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు టీజాక్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు
తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చిన టీజాక్.. రాబోయే ఎన్నికలకు ప్రణాళికలను కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేసుకొంటోందని సమాచారం. టీ జేఏసీని రాజకీయ పార్టీగా మార్చే అంశంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునేందుకు వచ్చే నెల మొదటి వారంలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీగా ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లాలా ? భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయాలా ? అన్న అంశం పై వెంటనే నిర్ణయానికి వచ్చే అవకాశంలేదని భావిస్తున్నారు. గత మూడేళ్లుగా కేసీఆర్‌ ప్రభుత్వం విధానాలను తూర్పారపడుతున్న టీజాక్ కు కాంగ్రెస్ పార్టీ అండదండలున్నాయన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే రాజకీయ పార్టీగా టీజాక్ అవతరిస్తే వర్తమాన రాజకీయాలపై ఎలా వ్యవహరిస్తోందో అన్న అంశంపై ఉత్కంఠ రేగుతోంది.

18:06 - January 18, 2018

హైదరాబాద్ : పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేస్తే.. ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. అసలు తెలంగాణలో లోకల్ బాడీ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. సబ్ కమిటీ రిపోర్టుపై వెంటన్ ఆల్‌ పార్టీ మీటింగ్ నిర్వహించి అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

17:29 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా చేయడానికి నేరుస్తుల సమగ్ర సర్వే చేపడుతున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 31 జిల్లాలో సర్వే కొనసాగుతుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మున్సిపల్ శాఖపై చంద్రబాబు అగ్రహం

గుంటూరు : కలెక్టర్ల సమావేశంలో మున్సిపల్ శాఖ పై సీఎం అగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వరదనీటి వ్యవస్థ పనులు సరిగా చేపట్టకపోవడంపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. 

క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

హైదరాబాద్ : అబిడ్స్, నారాయణగూడ, జంజాహిల్స్ లోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.45 లక్షలు, టీవీ, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. 

16:36 - January 18, 2018

కృష్ణా : విభజన హామీలపై మోడీతో సీఎం చంద్రబాబు చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేంద్రం విభజన హామీలను అమలు చేయకుండా ఏపీ వివక్ష చూపుతుందని ఆయన తెలిపారు.

 

16:26 - January 18, 2018

హైదరాబాద్ : మోత్కుపల్లి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం లేదని, టీడీపీకితో తెలంగాణలో లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. టీడీపీ సిద్ధాంతలతో నిర్మితమైన పార్టీ అని టీడీపీని ఏ పార్టీలో కలిపే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

డీజీపీ ఆదేశాలతో నేరుస్తుల సర్వే

హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే నేరుస్తుల సర్వే చేస్తున్నమని రాచకొండ సీపీ మోహన్ భగవత్ అన్నారు. 

16:15 - January 18, 2018

భూపాలపల్లి : మేడారం జాతరకు ఇప్పటి నుంచి భక్తులు క్కూ కడుతున్నారు. ముందుగానే అమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు జనం తరలివస్తున్నారు. వనదేవలత దర్శనం కోసం ఊరు వాడ తరలివస్తోంది. అమ్మలు కొలువుతీరే ఆత్మీయ సందర్భం కోసం గిరిజన పూజారాలు పూజలు ప్రారంభించారు. సమ్మక్క, సారలమ్మలను గద్దెపైకి తీసుకొచ్చే మహాఘట్టం ఆవిష్కృతానికి ముందు నిర్వహించే క్రతువు మొదలైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారి జరుగుతున్న మేడారం మహా జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించే ఈ జాతర మాగశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది. వనదేవతలను ప్రతిష్టించేందుకు మందుకు నిర్వహించే పూజలు మేడారంలో ప్రారంభమయ్యాయి.

భక్తులు గద్దెలపై పూజలు
జనం ఆధునిక పోకడల వైపు మళ్లుతున్నా... అనాదిగా వస్తున్న సంప్రదాయాలను మాత్రం మరిచిపోరని మేడారం జాతర రుజువు చేస్తోంది. ప్రధాన జాతరకు పక్షం రోజుల ముందు మండ మెలిగే పండుగ నిర్వహిస్తారు. ముందుగానే దేవతల దర్శానికి వచ్చిన భక్తులు గద్దెలపై పూజలు చేసి వెళ్తుంటారు. మేడారంలో సమ్మక్క దేవత పూజా మందిరంలో, కన్నెపల్లిలో సారలమ్మ గుడిలో పూజలు చేస్తారు. గతంలో అమ్మవార్ల గద్దెల దగ్గర గుడిసెలువేసి పూజలు నిర్వహించేవారు. అమ్మవార్ల పూజా సామాగ్రికి రక్షణ లేకపోవడం, కొన్ని సందర్భాల్లో గుడిసెలు దగ్ధమవడం వంటి ఘటన నేపథ్యంలో మేడారం, కన్నెపల్లిలో మందిరాలు నిర్మించారు. గుడి మెలిగే పండుగలో భాగంగా జాతరకు 15 రోజులు ముందు మందిరాలను శుద్ధి చేశారు.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, కన్నపల్లిలోని సారలమ్మ, ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను శుద్ధి చేయడంతో ప్రజలు తమ బంధువులను మేడారం జాతరకు ఆహ్వానించడం ప్రారంభించారు. 

16:14 - January 18, 2018

భువనేశ్వర్ : భారత్‌ ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషా సముద్ర తీరంలో ఉన్న ద్వీపం నుంచి ఉదయం 10 గంటలకు ఇంటర్‌ కాంటినెంటల్ బాలిస్టిక్‌ మిసైల్‌ అగ్నిని ప్రయోగించారు. అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించనుంది. అగ్ని విజయవంతం కావడంతో పాకిస్తాన్‌, చైనా దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి రానున్నాయి. అగ్ని-5 క్షిపణిని డిఆర్‌డిఓ రూపొందించింది. 50 టన్నుల బరువు కల అగ్ని క్షిపణి-5కు ఒకటిన్నర టన్నుల అణ్వాయుధాలను మోసుకెళ్తే శక్తి ఉంది. ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ తదితర దేశాల సరసన భారత్‌ నిలిచింది. అగ్ని క్షిపణి ఇంతకుముందు 2012, 2013, 2015, 2016లో డిఆర్‌డిఏ ప్రయోగించింది. 

16:13 - January 18, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో హర్యానా రెయాన్‌ స్కూలు లాంటి కేసు ఒకటి వెలుగు చూసింది. లక్నో త్రివేణినగర్‌లో ఉన్న బ్రైట్‌ల్యాండ్‌ స్కూల్లో ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్న విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. సిసిటివి ఫుటేజి ఆధారంగా ఈ దాడికి పాల్పడింది ఓ బాలికగా గుర్తించారు. సిసిటివి వీడియోలో చిన్న జుట్టుతో కనిపించిన ఆ అక్కే నాపై దాడి చేసిందని గాయపడ్డ విద్యార్థి రుతిక్‌ పోలీసులకు చెప్పాడు. ఉదయం పదిన్నరకు ప్రార్థన అనంతరం ఆ అమ్మాయి తనని క్లాస్‌ రూమ్‌ నుంచి తీసుకెళ్లి వాష్‌ రూంలో బంధించిందని రుతిక్‌ తెలిపాడు. రెండు చేతులను చున్నీతో కట్టేసి కత్తితో దాడి చేసినట్లు బాలుడు పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై బాలుడి పేరెంట్స్‌ స్కూలు ముందు ఆందోళన చేపట్టారు. సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడి చేసిన విద్యార్థిని 6 నుంచి 8 వ క్లాస్‌కు చెందినదై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

16:12 - January 18, 2018

సిద్దిపేట : అతితక్కువ సమయంలో అత్యంత ప్రజాదారణ పొందిన చానల్‌ టెన్‌ టీవీ అన్నారు సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రం స్థానిక గాంధీ సెంటర్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో.. ఆయన టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో టెన్‌ టీవీ మరింత అభివృద్ధి చెంది ప్రజల పక్షాన నిలవాలని మల్లారెడ్డి కోరారు.

16:11 - January 18, 2018

సిద్దిపేట : జిల్లా చేర్యాల మండల కేంద్రంలో బ్రిటీష్‌ డిప్యూటి హై కమిషనర్‌ ఆండ్రె ఫ్లెమింగ్‌ పర్యటించారు. చేర్యాల మండల కేంద్రంలోని నకాశి చిత్రకారులను కలిశారు. వారు గీసిన చిత్రాలను తిలకించారు. చిత్రకారుల కుటుంబాలను కలిసి వారితో ఆర్థిక, సామాజిక, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. నకాశి చిత్రాలు జీవం ఉట్టి పడేలా ఉన్నాయని ఫ్లెమింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

16:10 - January 18, 2018

పశ్చిమ గోదావరి : జిల్లా నరసాపురంలో టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మాధవనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. టెన్‌టీవీ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా టెన్‌టీవీ ప్రేక్షకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. 

16:09 - January 18, 2018

మహబూబ్ నగర్ : టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి చేసిన కామెంట్‌పై టీడీపీ అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడిన తరువాత టీటీడీపీలోరెండో కుట్ర జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి కామెంట్ చేస్తున్నారని దయాకర్ రెడ్డి మండిపడ్డారు. 

16:07 - January 18, 2018

గుంటూరు : ప్రతి జిల్లా కలెక్టర్ జిల్లా స్ధాయిలో జవాబుదారీగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబునాయుడు. యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదగాలన్నారు చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురైన ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నట్లు ఆయన చెప్పారు. 2014-15తో పోలిస్తే వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లలో వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందన్నారు.

15:45 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో మాట్లాడిన సీఎం హైదరాబాద్‌ స్వాతంత్రానికి ముందే అభివృద్ధి చెందిఉందన్నారు. ఇక్కడ అన్ని వర్గాలు మిలితమై ఉన్నారన్నారు. సమైక్య పాలనలో హైదరాబాద్‌ నిర్లక్ష్యానికి గురైందన్నారు. రిజర్వేషన్లను 50 శాతానికి పైగా పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 90 శాతం ఉంటే... ఓసీలు 10 శాతమే ఉన్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతానమని చెప్పారు.

పాతబస్తీలో నేరస్తుల సర్వే నిర్వహిస్తున్న సీపీ

హైదరాబాద్ : పాతబస్తీలోని భవానీ నగర్ లో సీపీ శ్రీనివాసరావు సమగ్ర నేరస్తుల సర్వే నిర్వహస్తున్నారు. 

ప్రకాశంలో దళితులపై వివక్ష

ప్రకాశం : జిల్లా కందూకూరు మండలం కాకుటూరులో దళితులపై వివక్ష చూపుతున్నారు. బొడ్రాయి వైపు  దళితులు నడవొద్దంటూ గ్రామస్తులు హుకుం జారీ చేశారు. అంతేకాకుండా గ్రామంలో వాహనాలు నడపొద్దని కూడా అంక్షలు విధించారు. 

ఇండియా టుడే సమ్మిట్ పాల్గొన్న కేసీఆర్

హైదరాబాద్ : పార్క్ హయత్ హోటల్ లో ఇండియా టుడే సమ్మిట్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇండియా న్యూ రీడర్ రాజ్ దీప్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానలు ఇచ్చారు. 

14:11 - January 18, 2018
13:46 - January 18, 2018
13:45 - January 18, 2018
13:44 - January 18, 2018
13:35 - January 18, 2018

విజయవాడ : ప్రజాప్రతినిధుల తనయులు రెచ్చిపోతున్నారు...అధికారంలో ఉన్నది తమవారేనని..ఏదీ చేసినా చెల్లుతుందనే ఉద్ధేశ్యంతో వీరంగం సృష్టిస్తున్నారు. తాజాగా పశ్చిమనియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనయుడు సాహూల్ ఖాన్ వీరంగం సృష్టించడం హల్ చల్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి కారులో బుధవారం అర్ధరాత్రి సాహూల్ ఖాన్ వెళుతున్నాడు. ఈ కారుతో వీరంగం సృష్టించారు. బైక్ పై వెళుతున్న వారిని కారుతో ఢీకొట్టడంతో వారికి గాయాలయ్యాయి. కారును నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. కారును ఫొటోలు తీస్తున్న పోలీసులపై సాహూల్ ఖాన్ వీరంగం సృష్టించాడు. కారులో ఉన్న వారు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకని మాచవరం పీఎస్ కు తరలించారు. అక్కడ పోలీసులతో సాహూల్ వాగ్వాదానికి దిగాడు. 

ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనయుడు హల్ చల్...

విజయవాడ : ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహూల్ ఖాన్ వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి కారులో అతివేగంగా వెళుతూ బైక్ ను ఢీకొట్టారు. బైక్ పై వెళుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న కృష్ణ తేజను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వారు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 

13:27 - January 18, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా మోగింది. గురువారం మూడు ఈశాన్య రాష్ట్రాలకు సీఈసీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిమితి రూ. 20లక్షలు విధించారు. ఫిబ్రవరి 18న త్రిపురలో..ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 3వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. 60 చొప్పున అసెంబ్లీ సీట్లున్నాయి. మార్చి 6తో మేఘాలయ శాసనసభా కాలం...మార్చి 13తో నాగాలాండ్ శాసనసభా కాలం..మార్చి 14తో త్రిపుర శాసనసభ కాలం ముగియనున్నాయి. 

రాజీవ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు...

విజయవాడ : కలెక్టర్ల సదస్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పన్నులు చెల్లించే వారిలో 40 శాతం మంది ఆంధ్రావాళ్లేనని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు ఇక్కడకు వస్తే ఆర్థిక సమస్యలుండవని తెలిపారు. 

13:21 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడం కోసమే నేరస్తుల సర్వే నిర్వహించనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో సహా 31 జిల్లాల్లో ఏకకాలంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..నేరరహితంగా తీర్చిదిద్దే లక్ష్యమని, నేరం చేస్తే పట్టుబడిపోతామని..శిక్ష పడుతుందని నేరస్తులు అనుకోవడానికి..నేరం చేయడానికి భయపడే విధంగా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. టెక్నాలజీ సాయంతో నేరస్తుల ఆట కట్టిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం శాంతిభద్రతలకు నిలయంగా..పెట్టుబడులకు నిలయంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

గుట్కా ప్యాకెట్ల లభ్యం...

హైదరాబాద్ : పాతబస్తీలో భారీగా గుట్కా ప్యాకెట్లను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రూ. 3.50 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. 

13:09 - January 18, 2018

నల్గొండ : మిర్యాలగూడలో కానిస్టేబుళ్లను సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. 2009 పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు...భారీగా పైలటింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసు రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరితో అభ్యర్థులు పరీక్షలు రాయించారు. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. 45 మంది అభ్యర్థులు ఎంపిక అయినట్లు సమాచారం. అప్పటి నుండి విచారణ చేస్తున్న సీబీసీఐడీ అధికారులకు పక్కా ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. బుధవారం రాత్రి మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ వాడపల్లి పీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సీబీసీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ జాబితాలో మరికొంతమంది కానిస్టేబుళ్లున్నట్లు ఆరోపణలు వినపిస్తున్నాయి. 

విలీనం చేయాలనడం సరికాదన్న రేవంత్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో టి.టిడిపిని విలీనం చేయాలని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం సరికాదని టి.కాంగ్రెస్ నేత రేవంత్ పేర్కొన్నారు. ఏపీలో జగన్ కు..తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా శక్తులు ఏకం కావాలని, బీసీలు, దళితులను మోసం చేసిన కేసీఆర్ వెంట ఎలా నడుస్తారని ప్రశ్నించారు. 

బాబుతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ...

విజయవాడ : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాల డ్యాష్ బోర్డు రూపకల్పనతో నీతి ఆయోగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీని ప్రత్యేకంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా బాబు కోరారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా చేయూతనివ్వాలని కోరారు. 

హ్లీకి అరుదైన గౌరవం..

ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నికయ్యాడు. అంతేగాకుండా 2017 వన్డే క్రికేటర్ ఆఫ్ ది ఇయర్ గా ఇతనే ఎన్నిక కావడం విశేషం. 2017 ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్టీవెన్ స్మిత్ ఎన్నికయ్యాడు. 

ఫిబ్రవరి 18న త్రిపురలో ఎన్నికలు..

ఢిల్లీ : మూడు ఈశాన్య రాష్ట్రాలకు సీఈసీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు గురువారం ఎన్నికల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిమితి రూ. 20లక్షలు విధించారు. ఫిబ్రవరి 18న త్రిపురలో..ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6తో మేఘాలయ శాసనసభా కాలం...మార్చి 13తో నాగాలాండ్ శాసనసభా కాలం..మార్చి 14తో త్రిపుర శాసనసభ కాలం ముగియనున్నాయి. 

12:26 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు..నేరాలు పెరగగకుండా ఉండేందుకు డీజీపీ 'నేరస్తుల సమగ్ర సర్వే' చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ల నాటి నేరస్తుల పూర్తి వివరాలను ఈ సర్వేలో సేకరించనున్నారు. గురువారం ఉదయం సుల్తాన్ బజార్ సీఐ శివశంకర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి మాట్లాడింది. డీజీపీ మహేందర్ ఆదేశాల ప్రకారం తాము సర్వే నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. 15-20 రోజుల క్రితమే డేటాను సేకరించడం జరిగిందని, కొన్ని నేరాల విషయాల్లో తాము సమాచారం సేకరించడం..ఇతర పీఎస్ లకు అందచేసినట్లు తెలిపారు. 197 మంది నేరస్తుల వివరాలు దొరికాయని, వీరందరూ ఎక్కడుంటున్నారు ? వారి సమగ్ర వివరాలు సేకరించినట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:17 - January 18, 2018
12:16 - January 18, 2018

ఢిల్లీ : 'పద్మావత్' సినిమా విడుదలకు కష్టాలు తీరాయి. ఎట్టకేలకు ఈనెల 25న దేశ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. 'పద్మావత్' నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో పద్మావత్ సినిమాను నిషేధించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని తెలిపింది. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ 'పద్మావత్' సినిమాను తెరకెక్కించారు.

సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాపై బీజేపీ రాజకీయం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే విడుదలకు అనుమతి నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొన్ని కట్లు, షరతులతో ఈ చిత్ర విడుదలకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఓకే చెప్పినా.. ఆందోళనకారులు మాత్రం సినిమాను అడ్డుకుంటామనే చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలలో పద్మావత్ విడుదలను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నిక నోటిఫికేషన్..

ఢిల్లీ : మూడు ఈశాన్య రాష్ట్రాలకు సీఈసీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు గురువారం ఎన్నికల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. 

పద్మావత్ సినిమా నిషేధంపై సుప్రీం ఆగ్రహం..

ఢిల్లీ : 'పద్మావత్' సినిమాపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేసింది. హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో పద్మావత్ సినిమాను నిషేధించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. 

మూడు రాష్ట్రాలకు ఎన్నిక నోటిఫికేషన్..

ఢిల్లీ : మూడు రాష్ట్రాలకు సీఈసీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయేనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేయనుంది. మార్చి 6తో మేఘాలయ శాసనసభా కాలం...మార్చి 13తో నాగాలాండ్ శాసనసభా కాలం..మార్చి 14తో త్రిపుర శాసనసభ కాలం ముగియనున్నాయి. 

'సురక్షిత భారత్ గా మారాలన్నదే నీతి ఆయోగ్ లక్ష్యం'...

విజయవాడ : పేదరిక, అవినీతి రహిత భారత్ ను నిర్మించాలని, ప్రణాళికా సంఘంతో నీతి ఆయోగ్ కు పోలిక లేదని, రాష్ట్రాల అభివృద్ధి కోసమే తాము పనిచేయడం జరుగుతోందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధి కోసమే తాము పనిచేయడం జరుగుతోందని, టీమిండియాగా పనిచేయాలన్నదే తమ ఉద్ధేశ్యమన్నారు. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. 

11:42 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 'సమగ్ర నేరస్తుల సర్వే'ను పోలీసులు ప్రారంభించారు. గురువారం నుండి గ్రేటర్ హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. పదేళ్ల నాటి నేరస్తుల పూర్తి వివరాలను ఈ సర్వేలో సేకరించనున్నారు. ఎల్ బినగర్ డీసీపీ 'నేరస్తుల సర్వే'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. 6316 నేరస్తులున్నట్లు తెలుస్తోందని, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం తాము సర్వే నిర్వంచడం జరుగుతోందని, 70 మందిని సర్వే చేయడం జరిగిందన్నారు. వారి గత అనుభవాలు..వారి ఫింగర్ ప్రింట్స్..అన్ని వివరాలు సేకరించడం జరుగుతోందన్నారు. సర్వేకు వారు కూడా సహకరించడం జరుగుతోందని, ఎలాంటి క్రిమినల్ జరిగినా దర్యాప్తుకు ఈ సర్వే చక్కగా ఉపయోగపడుతుందన్నారు. 

11:39 - January 18, 2018

చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఓ మహిళను సాటి మహిళలే వివస్త్రకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన జిల్లాలోని శాంతిపురంలో చోటు చేసుకుంది. శాంతిపురంలో ఉమ అనే వైసీపీ నేత నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే ఇతర మహిళలు గురువారం ఉదయం ఉమను బయటకు లాక్కొచి వివస్త్రను చేసి చితకబాదారు. ఉమ వేరొకరితో సంబంధం పెట్టుకుందని పేర్కొంటూ సంబంధిత వారే దాడికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. దాడికి పాల్పడిన వారు టిడిపికి సంబంధించని వారేనని తెలుస్తోంది. కుప్పం పోలీసులకు ఫోన్ చేసిన స్పందించడం లేదని బాధిత మహిళ పేర్కొంటోంది. కుప్పం నియోజకవర్గం చంద్రమౌళి చికిత్స పొందుతున్న ఉమను పరామర్శించనున్నారు. తమకు..ఇతరులకు పాత తగాదాలున్నాయని అమానుషంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

11:12 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ టిడిపిలో మళ్లీ ముసలం పట్టిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన సీనియర్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టిడిపి పార్టీ ఇబ్బందుల్లో ఉందని, టి.టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి టీఆర్ఎస్ లో టి.టిడిపి విలీనం చూస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను టి.టిడిపి సీనియర్ నేతలు కొట్టిపారేస్తున్నారు. తెలంగాణలో టిడిపికి వచ్చి నష్టమేమి లేదని, నాయకులు వెళ్లినా కార్యకర్తలే పార్టీని నడిపాస్తారని తెలిపారు.

టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. ఏ ఉద్దేశ్యంతో మోత్కుపల్లి మాట్లాడారో తెలియదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్తాయిలో పర్యటిస్తున్నట్లు, కోటి సభ్యత్వం కల ఏకైక పార్టీ టి.టిడిపియేనని తెలిపారు. ఎన్ని అటుపోట్లు వచ్చినా పార్టీ బలంగా ఉందన్నారు.

 

'పోలవర నిర్మాణంలో చంద్రబాబు, గడ్కరీలకు కమీషన్లు'..

అనంతపురం : ఏపీని రెండు సామాజిక వర్గాలే అనేక ఏళ్లుగా ఏలుతున్నా అభివృద్ధి శూన్యమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. పోలవరానికి ఖర్చు పెట్టిన రూ. 12వేల కోట్లలో రూ. 6వేల కోట్లు చంద్రబాబు, గడ్కరీలు కమీషన్లు పంచుకున్నారని ఆరోపించారు. ఇప్పటికీ జిల్లా కరవులో మార్పు లేదని తెలిపారు. 

సీనియర్ న్యాయమూర్తులతో సీజేఐ భేటీ...

ఢిల్లీ : నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా భేటీ అయ్యారు. అసంతృప్త న్యాయమూర్తులతో సీజేఐ జరుపుతున్న భేటీ ఇది రెండో సారి. 

కానిస్టేబుల్ ను అరెస్టు చేసిన సీబీసీఐడీ..

నల్గొండ : మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ లో కానిస్టేబుల్ సందీప్ ను సీబీసీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 2009లో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో మాస్ కాపీయింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 

మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఎల్.రమణ స్పందన..

హైదరాబాద్ : టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. ఏ ఉద్దేశ్యంతో మోత్కుపల్లి మాట్లాడారో తెలియదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్తాయిలో పర్యటిస్తున్నట్లు, కోటి సభ్యత్వం కల ఏకైక పార్టీ టి.టిడిపియేనని తెలిపారు. ఎన్ని అటుపోట్లు వచ్చినా పార్టీ బలంగా ఉందన్నారు. 

బాబుతో కలెక్టర్ల భేటీ...

విజయవాడ : సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ హాజరయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

10:37 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర నేరస్తుల సర్వేకు పోలీసులు శ్రీకారం చుట్టారు. గురువారం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభం కానుంది. పదేళ్ల నాటి నేరస్తుల పూర్తి వివరాలను ఈ సర్వేలో సేకరించనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా నేరస్తుల సర్వే నిర్వహిస్తున్నారు. డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు ఈ సర్వేలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహితంగా చేయాలని పోలీసులు ఈ సర్వేను చేపట్టనున్నారు. ఇప్పటికే కాప్ యాప్ ను రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.

నేరస్తుల ఫొటోలు..వారి వేలి ముద్రలు..నేరస్తులకు సంబంధించిన కుటుంబసభ్యుల పేర్లు..వారి గుర్తింపు కార్డులు..వారి జీవిత చరిత్ర..జైల్లో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు పెంచుకున్నారు ? విడుదలైన అనంతరం ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు ? ఇలాంటి కొన్నింటిపై ఆరా తీయనున్నారు. 

10:19 - January 18, 2018

విజయవాడ : పేద వాడికి స్వర్గీయ ఎన్టీఆర్ అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...సినిమాల్లో రాముడు, కృష్ణుడు వేషాలు వేసి చరిత్ర సృష్టించారని, అలాంటి పాత్రలు ఎవరూ వేయలేరని తెలిపారు. రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్త ఒరవడిని సృష్టించారని, పేదలకు ఎలా సహాయం చేయాలో చేసి చూపించారని పేర్కొన్నారు. రాజకీయం పేదోడికి అండగా ఉండాలని..పేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉండాలని ఎన్టీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. పేదలు గుడిసెల్లో ఉండకూడదని..రైతులు ఆనందంగా ఉండాలని..ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ఏ కార్యక్రమం చేసినా పేదవారిని దృష్టిలో పెట్టుకుని చేశారని, తెలుగు వారి ఆత్మగౌరం దెబ్బతినకుండా చూశారని తెలిపారు. ఎన్టీఆర్ ను తలచుకుని పనులు చేస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయని, ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకొనే విధంగా..ఒక మెమోరియల్ రూపకల్పనకు శ్రీకారం చుడుతామన్నారు. 

10:10 - January 18, 2018

హైదరాబాద్ : టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కలకలం రేపుతున్నాయి. మోత్కుపల్లి పార్టీ మారుతారని, అందుకే కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ కు వస్తే బాగుండేదన్నారు. తెలంగాణలో టిడిపి పార్టీ ఇబ్బందుల్లో ఉందని, టి.టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భుజాన వేసుకుని పార్టీని నడపాలని అనుకున్నట్లు కానీ ఎవరూ సహకరించడం లేదన్నారు. అందుకోసం టి.టిడిపిని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై టి.టిడిపి అధిష్టానం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనపై చర్యలు తీసుకుంటారా ? అనేది తెలియరావడం లేదు.

2014 సాధారణ ఎన్నికల అనంతరం భారీగా వలసలు పెరిగాయి. పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సరిగ్గా పార్టీని పట్టించుకోవడం లేదని పలు సందర్భాల్లో మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. టి.టిడిపి నుండి బయటకు వెళ్లాలనే మోత్కుపల్లి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లోని కొంతమంది వ్యక్తులతో మోత్కుపల్లి చర్చలు జరుపుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. 

ఈపీపీ ప్లాంట్ లో కార్మికుడు మృతి...

సంగారెడ్డి : పుల్కల్ మండలం చౌటకూరు స్పిరిట్ కంపెనీలో ఈపీపీ ప్లాంట్ లో చక్రపాణి (20) అనే కార్మికుడు పడి మృతి చెందాడు. కంపెనీ ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. 

09:48 - January 18, 2018

మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు...

హైదరాబాద్ : టి.టిడిపిని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ పతనమైందన్న చెడ్డ పేరు కంటే విలీనం చేయడం మంచిదని, బాబుకు తానిచ్చే వ్యక్తిగత సలహా ఇదేనన్నారు. 

ఎన్టీఆర్ చరిత్ర వారికి తెలియదన్న లక్ష్మీ పార్వతి...

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవిత చరిత్ర వారి కొడుకులకు తెలియదని..తనను సంప్రదిస్తే వివరాలను చెప్పగలనని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ అసలు కోణం..ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటకు రావాలని పేర్కొన్నారు. 

09:26 - January 18, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ తాను పోరాటం చేస్తూనే ఉన్నానని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ...ద్రోహం చేసిన వారిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అవినీతిలో కూరుకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన చరిత్రను వక్రీకరించి, మహానేరాన్ని తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఎన్టీఆర్ గుండెపోటుకు కారకులైన వ్యక్తులు అవినీతిలో కూరుకపోయారని పేర్కొన్నారు.

 

09:06 - January 18, 2018

వేముల రాధికతో ఎమ్మెల్యే జిగ్నేషన్ మేవానీ...

హైదరాబాద్ : గుజరాత్ దళిత, స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తెలంగాణలో పర్యటన కొనసాగుతోంది. బుధవారం జైలులో మందకృష్ణ మాదిగను పరామర్శించిన జిగ్నేష్ గురువారం వేముల రోహిత్ తల్లి రాధికతో భేటీ అయ్యారు. వేముల రాధికకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, దళితులపై దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ ఒక యుగపరుషుడు - హరికృష్ణ...

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఒక యుగపరుషుడని, ఆయన కడుపున పుట్టడం తమ పునర్జన్మ సుకృతమని హరికృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన నివాళులర్పించారు. ఆయన గురించి చెప్పాలంటే తరాలు..యుగాలు చాలవని, తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రతింటా ఆ మహానుభావుడు జీవించి ఉంటాడన్నారు. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్ అని తెలిపారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని, దీని కోసం ప్రతొక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. 

తెలుగు జాతి చప్పుడు ఎన్టీఆర్ - బాలకృష్ణ...

హైదరాబాద్ : తెలుగు జాతి చప్పుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన నివాళులర్పించారు. తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు. యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారికి సేవ చేయాలన్న సంకల్పంతో టిడిపిని స్థాపించారని, ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాడుతామన్నారు. 

 

08:31 - January 18, 2018

హైదరాబాద్ : గుజరాత్ దళిత, స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తెలంగాణలో పర్యటన కొనసాగుతోంది. బుధవారం జైలులో మందకృష్ణ మాదిగను పరామర్శించిన జిగ్నేష్ గురువారం వేముల రోహిత్ తల్లి రాధికతో భేటీ అయ్యారు. వేముల రాధికకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, దళితులపై దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా లెఫ్ట్, ప్రజా సంఘాలతో కలిసి ఓ వేదికను ఏర్పాటు చేస్తామన్నారుర. సుప్రీం న్యాయమూర్తులే ప్రజల ముందుకు వచ్చారంటే దేశం ఎటువైపు వెళుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా బీజేపీ ప్లాన్ గా ముందుకెళుతోందని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరు చేస్తామన్నారు. 

08:26 - January 18, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భువనేశ్వరీలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగపరుషుడని, ఆయన కడుపున పుట్టడం తమ పునర్జన్మ సుకృతమన్నారు. ఆయన గురించి చెప్పాలంటే తరాలు..యుగాలు చాలవని, తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రతింటా ఆ మహానుభావుడు జీవించి ఉంటాడన్నారు. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్ అని తెలిపారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని, దీని కోసం ప్రతొక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

తెలుగు జాతి చప్పుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు. యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారికి సేవ చేయాలన్న సంకల్పంతో టిడిపిని స్థాపించారని, ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాడుతామన్నారు. 

08:18 - January 18, 2018
08:12 - January 18, 2018

కడప : కర్నూలు - కడప జాతీయ రహదారిపై గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. దువ్వూరు మండలం చిన్నశింగనపల్లెకు చెందిన పలువురు దినసరి కూలీలు రాజుపాలెం దగ్గర జరుగుతున్న పనులు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 15 మంది ట్రాక్టర్ లో వెళుతున్నారు. గుడిపాడు మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీనితో సిద్దమ్మ, దస్తగిరమ్మ, బ్రహ్మయ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్ బోల్తా...

కడప : కర్నూలు - కడప జాతీయ రహదారిపై గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. సిద్దమ్మ, దస్తగిరమ్మ, బ్రహ్మయ్యలుగా గుర్తించారు. ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

07:31 - January 18, 2018

భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏపీకి కష్టాలు వీడడం లేదు. విభజన హామీలు..ఇతరత్రా వాటిపై కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు కొనసాగిస్తున్నారు. కానీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని, ఢిల్లీకి బాబు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బుద్ధా వెంకన్న (టిడిపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

ఎన్టీఆర్ గార్డెన్ లో...

హైదరాబాద్ : ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్ లో పలువురు నివాళులర్పిస్తున్నారు. భువనేశ్వరీ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు నివాళులర్పించారు. 

ఎన్టీఆర్ 22వ వర్ధంతి...

హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. దేశ వ్యాప్తంగా 240 లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 20, ఏపీలో 104కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశారు.

06:37 - January 18, 2018

అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్‌ ఇవ్వాలి. ప్రతి దళితునికి మూడెకరాల భూమి పంచాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇలా పలు డిమాండ్లతో తెలంగాణలో టీ మాస్‌ ఆందోళన బాట పట్టింది. ఈనెల 16నుంచి 19వరకూ మండల కేంద్రాల్లో రిలే దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉద్దేశం గురించి టెన్ టివి జనపథంలో టీ మాస్‌ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆశయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లక్ చేయండి. 

06:35 - January 18, 2018

ఢిల్లీ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో విఫలమైంది.3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను సౌతాఫ్రికా మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో రెండో టెస్ట్‌లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టుకు సంచలన విజయాన్నందించాడు. 4వ ఇన్నింగ్స్‌లో 287 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి చేతులెత్తేశారు. 3 వికెట్లకు 35 పరుగులతో ఆఖరి రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.

అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన తొలి టెస్ట్‌లోనే లుంగీ నంగ్డీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్ కలిగిన భారత్‌కు చెక్‌ పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు తీసి భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు.రాహుల్‌,విరాట్‌ కొహ్లీ,హార్దిక్‌ పాండ్య,అశ్విన్‌,షమీ,బుమ్రా వికెట్లు తీసి భారత్‌ను 151 పరుగులకే కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.

135 పరుగుల తేడాతో నెగ్గిన సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది.2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టుకు సంచలన విజయాన్నందించిన లుంగీ నంగ్డీకే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. రెండు టెస్టుల్లోనూ బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో టీమిండియాకు సిరీస్‌ ఓటమి తప్పలేదు.

06:32 - January 18, 2018

ఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గుజరాత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో బెంజమిన్ నెతన్యాహు దంపతులకు ప్రధాని మోది స్వాగతం పలికారు. అనంతరం బెంజమిన్‌తో కలిసి మోది సబర్మతి ఆశ్రమం వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమం ప్రత్యేకతలను నెతన్యాహు దంపతులకు ప్రధాని వివరించారు. ఆశ్రమంలో ఉన్న మగ్గంపై బెంజమిన్ దంపతులు నూలు వడికారు. సబర్మతీ ఆశ్రమంలో బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమంలో సరదాగా పతంగులు ఎగురవేశారు. 

06:30 - January 18, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, నలుగురు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా జడ్జిలతో ఏర్పాటు చేసిన లంచ్‌భేటీకి సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ హాజరు కాలేదు. జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ మాత్రం ఈ భేటీకి వచ్చారు. దీంతో నలుగురు న్యాయమూర్తులతో చీఫ్‌ జస్టిస్‌ గురువారం మరోసారి సమావేశమయ్యే అవకాశముంది. కాగా న్యాయమూర్తులతో సీజేఐ మంగళవారం జరిగిన తేనీరు భేటీ వాడివేడిగానే సాగింది. ఈ నేపథ్యంలో లంచ్‌ భేటీలో కొంతమేరకు సానుకూల వాతావరణం ఏర్పడవచ్చునని, ఇది క్రమంగా సంక్షోభానికి తెరదించే దిశగా అడుగులు వేసేందుకు దారితీయవచ్చని భావించారు. కానీ సమావేశానికి చలమేశ్వర్‌ హాజరు కాకపోవడం పలురకాల వాదనలకు తావిస్తోంది. 

06:28 - January 18, 2018

హైదరాబాద్ : పుస్తకాల పండక్కి సమయం ఆసన్నమైంది. హైదరాబాద్‌లో గురువారం నుంచి బుక్‌ఫెయిర్‌ ప్రారంభం అవుతోంది. ఈ బుక్ ఫెయిర్ పదకొండు రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆదర్వర్యంలో నిర్వహించనున్న హైద్రాబాద్ బుక్‌ ఫెస్టివల్‌ దేశంలోనే రెండో స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలోని బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి భాగ్యరెడ్డి వర్శ పేరును, ప్రధాన వేదికకు సినారె పేరును పెట్టారు.  

06:26 - January 18, 2018

హైదరాబాద్ : స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. విఎస్టీ చౌరస్తా నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ నిర్వహించిన ర్యాలీలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయు, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూసీతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

06:23 - January 18, 2018

హైదరాబాద్ : పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. చాపకింద నీరులా వినియోగదారుల జేబుకు చిల్లిపెడుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి.. రోజువారిగా మార్చు విధానం అమలు చేసినప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పైసల్లో తగ్గుతూ.. రూపాయల్లో పెరుగుతూ.. వినియోగ దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటికి తీద్దామంటే భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా ... దేశీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ధరలు అమాతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్‌ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం.

చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్‌ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.92కు, డీజిల్‌ ధర రూ.68.79కు చేరాయి.

రెండేళ్ల క్రితం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గినప్పడు.. ధరలను తగ్గించకుండా ప్రభుత్వాలు సొమ్ముచేసుకున్నాయి. గతేడాది నుండి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.. డీజిల్‌పై పదిహేడు రూపాయల ముప్పైమూడు పైసలు వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారం పడుతున్నట్లు తెలుస్తోంది.

పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌కు తోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు.. చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ.4,085గా ఉంది. ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే అసలు ధరలుగా ఉండగా.. మిగతాదంతా పన్నుల భారమే.
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం అందులో చేర్చలేదు. పెట్రోల్‌ ఉత్పత్తులతో భారీగా ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం...

హైదరాబాద్ : గాంధీ భవన్ లో మధ్యాహ్నం 12గంటలకు కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై చర్చ జరుగనుంది. 

భారత్ బీఎస్ఎఫ్ జవాన్ వీరమరణం...

జమ్మూ కాశ్మీర్ : పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆర్.ఎస్.పురా సెక్టార్ లో పాక్ జరిపిన కాల్పుల్లో భారత బీఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందాడు. 

జపాన్ లో మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. జపాన్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. 

పటన్ చెరువులో అగ్నిప్రమాదం...

సంగారెడ్డి : పటన్ చెరులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగర్వాల్ రబ్బర్స్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

కలెక్టర్లతో బాబు భేటీ...

విజయవాడ : తెలంగాణలో కలెక్టర్లతో సీఎం భేటీ ముగిసిందో లేదో.. ఇప్పుడు ఏపీ సీఎం కూడా కలెక్టర్లతో భేటీకి సిద్ధమయ్యారు. గురువారం నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. వచ్చే ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలుపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు..

ఢిల్లీ : పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. చాపకింద నీరులా వినియోగదారుల జేబుకు చిల్లిపెడుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి.. రోజువారిగా మార్చు విధానం అమలు చేసినప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పైసల్లో తగ్గుతూ.. రూపాయల్లో పెరుగుతూ.. వినియోగ దారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

 

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివాదం..

ఢిల్లీ : దేశమంతా హాట్ టాపిక్‌గా మారిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నట్లు కనిపించినా.. స్పష్టమైన ఫలితం కనిపించడం లేదు. 

సుఖోయ్ విమానంలో నిర్మాలా సీతారామన్..

ఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ జెట్‌ విమానంలో ప్రయాణించారు. మిలటరీ డ్రెస్‌ వేసుకున్న మంత్రి జోధ్‌పూర్‌లోని ఎయిర్‌బేస్‌ సుఖోయ్‌ 30 ఎంకేఐ జెట్‌ విమానంలో 45 నిమిషాల పాటు ప్రయాణించారు. 

Don't Miss