Activities calendar

19 January 2018

21:39 - January 19, 2018

హైదరాబాద్ : స్వచ్ భార‌త్..స్వచ్ తెలంగాణ‌..స్వచ్ హైద‌రాబాద్.. నినాదం ఏదైనా పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఆరోగ్య కర వాతావరణం కల్పించడంమే లక్ష్యంగా 2014 అక్టోరబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రతినిత్యం పోగవుతున్న వ్యర్థాల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి ఆయా లోకల్‌పాలనా వ్యవస్థలు. లోకల్‌బాడీల మధ్య పోటీవాతావరణాన్ని సృష్టించి పారిశుద్ధ్యంవైపు వేగంగా అడుగులు వేసేలా కేంద్రం ఈ స్వచ్‌సర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఈనే పథ్యంలో గత మూడేళ్లుగా చేపడుతున్న స్వచ్ఛతా కార్యక్రమాల ప్రయోజనాన్ని అంచనావేయడం.. ఏ నగరం, ఏ పట్టణం యేయే అంశాల్లో ముందంజలో ఉందో గుర్తిచేందుకు కేంద్రం స్వచ్‌సర్వేక్షణ్‌ - 2018ను చేపట్టింది.

హైద‌రాబాద్ 275 స్థానంలో
కాగా.. 2015లో నిర్వహించిన సర్వేక్షన్ పోటిల్లో 476 నగరాలు, పట్టణాలు ఉండ‌గా .. వీటిలో హైద‌రాబాద్ 275 స్థానంలో నిలిచింది. 2016లో హైద‌రాబాద్ లో నిర్వహించిన స్వచ్ హైదార‌బాద్ కార్యక్రమంతో శానిటేష‌న్ మెరుగుప‌డి బ‌ల్దియాకు 19వ స్థానం ల‌భించింది. ఇక 2017లో 434ప‌ట్ట‌ణాల్లో 22స్థానంలోనిలిచిన హైద‌రాబాద్.. మెట్రో న‌గ‌రాల్లో మాత్రం మొద‌టి స్థానం ద‌క్కించుకుంది. అయితే ఈ ఎడాది నిర్వహిస్తున్న స్వచ్ స‌ర్వేక్షన లో దేశ వ్యాప్తంగా 4041 లోకల్‌బాడీలు పోటీపడుతున్నాయి. ఈ సారి ఎలాగైన త‌మ స్థానాన్ని మెరుగు ప‌రుచుకోవాల‌ని బల్దియా అధికారులు స్కెచ్‌వేశారు. పైగా ఈ ఏడాది ఇప్పటికే హైదరాబాద్‌ ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ సిటీగా కూడా గుర్తింపు పొందడం.. అధికారుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న స్వచ్‌సర్వేక్షణ్‌-2018 పోటీల్లో టాప్‌ టెన్‌ ర్యాంకే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా...
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్‌సర్వేక్షణ్ వచ్చే ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోకూడా జరగనుంది. 4వేల మార్కుల ప‌రిక్షలో ఎక్కువ మార్కుల‌ను త‌న ఖాతాలో వేసుకోవ‌డానికి ప‌క్కాప్రణాళిక‌తో ముందుకెళ్తుంతోంది బల్దియా అధికారగణం. వీటిలో 35శాతం మార్కులు అంటే 1400మార్కులు పారిశుధ్యానికి కేటాయిస్తుండగా.. కేంద్ర ప‌ట్టణబివృద్ది శాఖ నియ‌మించిన క్వాలీటి కంట్రోల్ విభాగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 30శాతం అంటే 1200 మార్కులు కేటాయించనుంది. ఇక మిగిలిన 35శాతం మార్కుల‌ను పౌరుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని కేటాయిస్తారు. ఇలా మూడు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ క‌న‌బ‌రిచిన నగరం లేదా పట్టణం 2018 స్వచ్ఛసర్వేక్షణ్‌లో టాప్‌లోనిలవనుంది. అయితే గ‌డిచిన రెండు ఎళ్లలో కోంత మేర‌కైనా ప్రతిభ‌క‌న‌భ కనబరిచిన జిహెచ్ఎంసి..ఈ ఎడాది ఎకంగా 4041లోక‌ల్ బాడిలతో పోటీపడుతోంది.టాప్ ర్యాంకే లక్ష్యంగా బల్దియా అధికారులు వినూత్న ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తూ సాగుతున్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించి స్వచ్‌సర్వేక్షణ్‌ -2108లో భాగ్యనగరాన్ని మెరిపిస్తామంటున్నారు. 

20:59 - January 19, 2018

పార్టీ శ్రేణులు, అభిమానులకు పవన్ ప్రకటన

హైదరాబాద్ : అభిమానులకు, కార్యకర్తలకు పవన్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్మాణ దశలో ఉందని, అన్ని విషయాల్లో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నామని, మనకు ప్రజా సమస్యులు పరిష్కరమే ముఖ్యమని పవన్ ప్రకటనలో పేర్కొన్నాడు. కొందరు కావాలనే పేరు కోసమో మన దృష్టిని మళ్లించడానికో చిరాకు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి వారి విషయంలో స్పందించకండని కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. 

20:05 - January 19, 2018

కృష్ణా : అభిమానులకు, కార్యకర్తలకు పవన్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్మాణ దశలో ఉందని, అన్ని విషయాల్లో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నామని, మనకు ప్రజా సమస్యులు పరిష్కరమే ముఖ్యమని పవన్ ప్రకటనలో పేర్కొన్నాడు. కొందరు కావాలనే పేరు కోసమో మన దృష్టిని మళ్లించడానికో చిరాకు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి వారి విషయంలో స్పందించకండని కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. పార్టీపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా హుందాగానే ఉందామని, అందరూ ఓర్పుతో ఉండండి, మీ ఆవేశం పార్టీకి హాని అని పవన్ అన్నారు. పార్టీపై, నాపై కొందరు చేస్తున్న విమర్శలకు లెక్కగడుతున్న అవి హద్దు మీరిప్పుడు స్పందిస్తానని పవన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కలెక్టర్లు, ఎస్పీలతో కొనసాగుతున్న సమావేశం

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందాని, ప్రజల అభిప్రాయాలను అనుసరించే పని చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 

19:30 - January 19, 2018

పోయిన సంవత్సరం కొంత మంది తనను 300,400 ర్యాంకు వస్తే ఎలా అని అడిగారు దానికి తను మొదటి ర్యాంకు కోసం ప్రయిత్నిస్తా అని చెప్పానని, మరి మొదటి ర్యాంకు వస్తే ఎం చేస్తారని అడిగితే దాన్ని నిలబెట్టుకోవడం చేస్తామని చెప్పానని జీహెచ్ఎంసీ కమిషనర్ అన్నారు. హైదరాబాద్ ను స్వచ్చ సిటీ మార్చాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:27 - January 19, 2018
19:19 - January 19, 2018
19:18 - January 19, 2018

ప్రభుత్వ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ప్రభుత్వ కార్యాలయంపై ఉగ్రవాదులు గ్రైనేడ్ లతో దాడి చేశారు. ఈ దాడిలో పౌరులకు గాయాలయ్యాయి. 

మాదాపూర్ పీఎస్ లో కత్తి మహేష్ ఫిర్యాదు

హైదరాబాద్ : మాదాపూర్ పీఎస్ లో తనపై నిన్న దాడి చేసిన వారిపై  కత్తి మహేష్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

18:18 - January 19, 2018

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి సాధించడం కోసం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. రాములు తెలిపారు. ఈనెల 25న ఎల్‌బీ నగర్‌లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ జరుగుతుందన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్‌లో ఆవిర్భావ సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌ కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌ అబద్దాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. మాటల గారడీతప్ప.... కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయడం లేదని విమర్శించారు. 

18:17 - January 19, 2018

ఖమ్మం: కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట టీమాస్‌ ఆధ్వర్యంలో పేదలు ఆందోళనకు దిగారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించాలని నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని టీమాస్‌ నాయకుడు బొంతు రాంబాబు విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

18:15 - January 19, 2018

యాదాద్రి : పేదలకు కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్‌డీవో కార్యాలయం ఎదుట టీమాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలకు నివాస గృహాలు, నివాస స్థలాలను ఇవ్వాలని పేదలు ధర్నాకు దిగారు. నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అనంతరం ఆర్‌డీవోకు మెమోరాండం అందజేశారు. హామీలను వెంటనే అమలు చేయాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని టీమాస్‌ నేతలు కల్లూరి మల్లేష్‌, ఆనగంటి వెంకటేష్ హెచ్చరించారు.  

18:10 - January 19, 2018

హైదారబాద్ : హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరం చేస్తామని ప్రభుత్వం బహిరంగ సభల్లో పదే పదే చెప్తూ వస్తోంది. కానీ నేతలకు నగరంలో ఉన్న మురికివాడల దుస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రజా సమస్యలపై టీ మాస్‌ చేస్తున్న అధ్యయనంలో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. పేదలు తమ సమస్యలను వందలాదిగా వినతుల రూపంలో అందిస్తున్నారు. అధికార పార్టీ ఎన్నికల్లో ఇళ్లు లేని పేదవారికి డబుల్‌ బెడ్‌ రూంలు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ కలగానే మిగిలిపోతుంది. ఏళ్ల తరబడి ఇళ్లులేక ఇరుకైన ఇళ్లలో అద్దెకి నివసిస్తామని.. ప్రభుత్వాధికారులు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా దుర్భర పరిస్థితిలో బతుకీడుస్తున్నారు. అనేక మంది పేదలు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం ధరఖాస్తు చేసుకున్నా.. ఎవ్వరికీ రాలేదని వాపోతున్నారు.

పింఛన్‌ అందడంలేదు...
అర్హులైన వారికి కూడా పింఛన్‌ అందడంలేదు. ఉపాధి లేక పోవడంతో నిరుద్యోగ యువత.. ప్రభుత్వం అందించే కార్పోరేషన్ల రుణాల వైపు ఆశగా చూస్తుంటే.. రుణాలు మాత్రం మంజూరు చేయడం లేదు. ఎంబీసీల కులాల జాబితా ప్రకటించి వారికి కేటాయించిన వెయ్యికోట్ల నిధులను ఎంబీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా వీరికి అందడంలో జాప్యం జరుగుతోంది. మురికి వాడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని టీ మాస్‌ నేతలు కోరుతున్నారు. ఇళ్లులేని వారందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కట్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికై టీమాస్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమవుతున్నారు.

18:09 - January 19, 2018

హైదరాబాద్ : కత్తి వర్సెస్‌ పవన్‌ అభిమానులు వివాదం మరింత ముదురుతోంది. సినీక్రిటిక్‌ కత్తిమహేశ్‌పై హైదరాబాద్‌ కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. దాడికి నిరసనగా పవన్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పలుపునిచ్చారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులకు కత్తి మహేశ్‌ ఫిర్యాదు చేశారు.

18:08 - January 19, 2018

అనంతపురం : మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అని చెప్పడానికి ఇది మరో సంఘటన. తన పేరిట ఉన్న పొలాన్ని అనాథాశ్రమానికి ఇస్తాననడంతో తల్లిని చూడటం మానేశాడు కొడుకు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని ముద్దిరెడ్డి పల్లికి చెందిన గంగమ్మకి ముగ్గురు కుతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. గంగమ్మ వృద్ధాప్యంలో ఉండటంతో ఆమె ఆలనా పాలన చూసేందుకు ముగ్గురు కుమారులు తల్లిని పంచుకున్నారు. చిన్న కుమారుడి వంతు రావడంతో పొలాన్ని ఇవ్వలేదన్న కసితో తల్లిని సరిగ్గా చూడటం మానేసాడు. కాలికి గాయమై.. దుర్వాసన వస్తుండటంతో తల్లిని పగలంతా గడ్డివాము వద్ద వదిలేసి.. రాత్రికి ఇంటికి తీసుకెళ్తున్నాడు. కన్న కొడుకు మీద మమకారంతో ఆ తల్లి మాత్రం బాగానే చుసుకుంటున్నాడని తన మాతృత్వాన్ని చాటుకుంటుంది. స్థానికులు మాత్రం చిన్న కుమారుడు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే అలా చేస్తున్నాడని అంటున్నారు.

18:06 - January 19, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీ మాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ వెంటనే చేపట్టాలని కోరారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్‌ అంబర్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట టీ మాస్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న వెస్లీ... అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట కబ్జాకు గురైందని ఆరోపించారు. వెంటనే బతుకమ్మకుంటలో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించాలన్నారు. 

18:05 - January 19, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామగ్రామాన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణా సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దంత సమస్యలతో బాధపడే వారికి చికిత్స అందించేందుకు రూ.36 లక్షలు ఖర్చుతో మొబైల్ డెంటల్ వ్యాన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మంత్రి లక్ష్మారెడ్డి ఈ మొబైల్ డెంటల్ వ్యాన్‌ను ప్రారంభించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏపీలో కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశం

గుంటూరు : అమరావతిలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విశాఖలో అమరావతి డ్రోన్ల కంపెనీలో ఈ డ్రోన్ తయారు చేశారు. 

17:40 - January 19, 2018
17:39 - January 19, 2018
17:38 - January 19, 2018

హైదరాబాద్ :  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దంత సమస్యల పరిష్కారం కోసం మొబైల్ డెంటల్ వ్యాన్ ఎంతగానో సహకరిస్తుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆయన మొబైల్ డెంటల్ వ్యాన్‌ను ప్రారంభించారు. కొన్నేళ్లుగా మొబైల్ డెంటల్ వ్యాన్‌ కావాలని డిమాండ్ చేస్తున్న ఉస్మానియా డెంటల్ కాలేజీ ప్రిన్స్‌పల్, స్టాఫ్‌ కల ఈరోజు నెరవేరిందన్నారాయన. ఈ వ్యాన్‌ ద్వారా త్వరలో గ్రామగ్రామాన డెంటల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రజల్లో దంత సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు.. అవసరమైతే వ్యాన్‌లోనే శస్త్ర చికిత్సలు చేస్తారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. 

నెల్లూరు జిల్లాలో దళితులపై కుల వివక్ష

నెల్లూరు : జిల్లాలో దళితులపై కుల వివక్ష బయటపడింది. అగ్రవర్ణ పెద్దలు దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దళితులపై అగ్రవర్ణాలవారు దాడులకు తెగపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ విషయంపై దళితులు ఏఎస్పీని కలిశారు.

16:02 - January 19, 2018

నెల్లూరు : జిల్లాలో దళితులపై కుల వివక్ష బయటపడింది. అగ్రవర్ణ పెద్దలు దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దళితులపై అగ్రవర్ణాలవారు దాడులకు తెగపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ విషయంపై దళితులు ఏఎస్పీని కలిశారు. మరింత సమచారం కోసం వీడియో చూడండి.

15:43 - January 19, 2018

గంటూరు : సీఏ సీపీటీ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయిలో మాస్టర్‌మైండ్‌ విద్యార్థులకు 38 శాతం పాస్‌ పర్సంటేజ్‌ రావడం హర్షనీయం అన్నారు మాస్టర్‌మైండ్స్‌ డైరెక్టర్‌ మోహన్‌. గ్రూప్‌-1లో పాస్ పర్సంటేజ్‌ 15 శాతం, గ్రూప్‌-2లో పాస్‌ పర్సంటేజ్‌ 15 శాతం, రెండు గ్రూపుల్లో కలిపి 22 శాతం ఉత్తీర్ణత ఉండటం ఎంతో ఆనందించదగ్గ విషయం అన్నారు. మాస్టర్ మైండ్స్‌ నుండి సుమారు 1650 మంది సీఏ సీపీటీలో ఉత్తీర్ణత సాధించగా, సీఏ ఫైనల్‌ ఫలితాల్లో 450 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డైరెక్టర్‌ తెలిపారు. 

15:42 - January 19, 2018

గుంటూరు : విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు చంద్రబాబు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సాయం చేయాల్సిందేనన్నారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు కూడా వెళ్తామన్నారు. తెలంగాణతో ఏపీకి పోలికే లేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై చర్చ జరిగింది. రాజధాని కాబట్టే అందరూ హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారన్నారు. 1995కు ముందు.. తర్వాత అభివృద్ధిని చూస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు

కారు పై పడ్డ ఇనుప రాడ్

హైదరాబాద్ : మెట్రో పనులు అపస్రుతి చోటు చేసుకుంది.ఇనుప రాడ్ మెట్రో పిల్లర్ పై నుంచి కారుపై జారి పడింది. రాడ్ కారు ఇంజన్ లోకి దూసుకుపోవడంతో కారు ఇంజన్ ధ్వసమైంది. దీనిపై కారు ఓనర్ అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా రూ.2100 జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడ్డాడు. 

15:37 - January 19, 2018

హైదరాబాద్ : కత్తి మహేశ్‌పై దాడిని ఖండిస్తూ ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు పవన్‌కల్యాణ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పవన్‌కల్యాణ్‌ అభిమానులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. కత్తి మహేశ్‌కు పవన్‌కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్‌లో మరోసారి కత్తి మహేశ్‌పై దాడి జరిగితే.. పవన్‌కల్యాణ్‌ సినిమాలను అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. 

15:33 - January 19, 2018

ఢిల్లీ : వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాడాన్ని నిరసిస్తూ ఎస్టీలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా దిగారు. వాల్మీ బోయలను ఎస్టీల్లో చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందన వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

15:32 - January 19, 2018

హైదరాబాద్ : మెట్రో పనులు అపస్రుతి చోటు చేసుకుంది.ఇనుప రాడ్ మెట్రో పిల్లర్ పై నుంచి కారుపై జారి పడింది. రాడ్ కారు ఇంజన్ లోకి దూసుకుపోవడంతో కారు ఇంజన్ ధ్వసమైంది. దీనిపై కారు ఓనర్ అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:28 - January 19, 2018

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా రూ.2100 జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడ్డాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:04 - January 19, 2018

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. అనర్హత వేటు వివేదికను ఎన్నికల సంఘం రాష్ట్రపతికి పంపించింది. కేజ్రీవాల్ రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సంగారెడ్డిలో రైతు మహాధర్నా

సంగారెడ్డి : నగరంలో కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నా జరిగింది. రైతు మహాధర్నాకు రైతులు భారీగా తరలి వచ్చారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రైతు మహాధర్నా నిర్వహించారు. 

అయేషా మీరా హత్యకేసు పునర్ విచరించాలి : హై కోర్టు

హైదరాబాద్ : అయేషా మీరా కేసును మళ్లీ విచరించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కేసు దర్యాప్తును సిట్ కు అప్పగించింది. హై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని, అనుమతి లేకుండా సిట్ అధికారులను బదిలీ చేయొద్దని ఏపీ డీజీపీని ఆదేశించింది. ఏప్రిల్ 28లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

14:42 - January 19, 2018

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. అనర్హత వేటు వివేదికను ఎన్నికల సంఘం రాష్ట్రపతికి పంపించింది. రింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:37 - January 19, 2018

సంగారెడ్డి : నగరంలో కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నా జరిగింది. రైతు మహాధర్నాకు రైతులు భారీగా తరలి వచ్చారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రైతు మహాధర్నా నిర్వహించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:35 - January 19, 2018

హైదరాబాద్ : అయేషా మీరా కేసును మళ్లీ విచరించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కేసు దర్యాప్తును సిట్ కు అప్పగించింది. హై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని, అనుమతి లేకుండా సిట్ అధికారులను బదిలీ చేయొద్దని ఏపీ డీజీపీని ఆదేశించింది. ఏప్రిల్ 28లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మళ్లీ ఆయేషా మీరా కేసు దర్యాప్తు...

హైదరాబాద్ : అయేషా మీరా కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తును సిట్ కు అప్పగించింది. ఏప్రిల్ 28లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని సూచించింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను అనుమతి లేకుడా బదిలీ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

13:32 - January 19, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను ఓయూ విద్యార్థులు దగ్ధం చేశారు. సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఓయూ జేఏసీ స్పందించింది. మహేష్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఓయూలో పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడారు. కత్తి మహేష్ కు క్షమాపణలు చెప్పాలని, మరోసారి దాడి జరిగితే పవన్ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

13:29 - January 19, 2018

గుంటూరు : ఏపీలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిరింగిపురంలో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేగింది. అల్లంవారిపల్లెకు చెందిన బ్రహ్మయ్య అనే రైతు భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. కానీ పంటలు సరిగ్గా పండలేదు. తెగుళ్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయాడు. తన కష్టాన్ని అధికారులకు చెబుతామని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. సీఎం మీటింగ్ కు కలెక్టర్ వెళ్లారని సిబ్బంది చెప్పడంతో తన సమస్య ఎవరూ తీర్చరని బ్రహ్మయ్య భావించాడు. వెంటనే తాను తెచ్చుకున్న పురుగుల మందును సేవించాడు. అక్కడున్న సిబ్బంది జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. 

13:22 - January 19, 2018

వరంగల్ : జిల్లాలో నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. భరత్, నజ్మీన్ లు కంప్యూటర్ ఇనిస్టిట్యూల్ లో పనిచేస్తున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

13:03 - January 19, 2018

అంతర్ రాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్ల అరెస్టు...

నెల్లూరు : మర్రిపాడు, వెంకటగిరి, దత్తులూరు పరిధిలో ఏడుగురు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 60 లక్షల విలువైన 45 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నలుగురు తమిళనాడుకు చెందిన వారున్నారు. 

12:30 - January 19, 2018
12:28 - January 19, 2018

ప్రకాశం : కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయతీలో దళితులపై వివక్షపై అగ్రవర్ణాలు స్పందించాయి. టెన్ టివితో వారు మాట్లాడారు. గ్రామంలో 10-11 మంది చనిపోయారని దీనితో సిద్ధాంతిని సంప్రదిస్తే గ్రామంలో బొడ్డు రాయి ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. తాము బొడ్డు రాయి ఏర్పాటు చేసుకుని దళితుల కోసం ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచి జరిగితే..ఇటువైపు ప్రయాణించవచ్చని..చెడు జరిగితే మరోవైపు గుండా వెళ్లాలని పేర్కొనడం జరిగిందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:25 - January 19, 2018

ప్రకాశం : ఒకటా రెండా.. నిత్యం ఎన్నో దాడులు.. ఎన్నో ఆకృత్యాలు.. మరెన్నో దారుణాలు. దేశమంతటా గాయాల పచ్చివాసన. గ్రామాల్లో, పట్టణాల్లో దళితులపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి..దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది..కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయతీలో అగ్రవర్ణాల ఆగడాలు శృతిమించాయి.

బొడ్డురాయిని ఏర్పాటు చేయడంతో అటువైపు దళితులను అగ్రవర్ణాలు రానివ్వడం లేదు. దళితులు గ్రామంలోకి రాకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నారు. కనీసం పిల్లలను స్కూల్ కు వెళ్లనీయడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులను గ్రామంలోకి అనుమతించకపోవడాన్ని దళిత సంఘాలు ఖండించాయి. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

12:12 - January 19, 2018

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్ష పడుతుందా ? లేక జరిమాన విధిస్తారా ? అనే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

కానీ ప్రదీప్ కోర్టుకు హాజరు కాలేదు. తాను ఇతర షూటింగ్ లో బిజీగా ఉన్నానని..త్వరలోనే కౌన్సెలింగ్ కు హాజరవుతానని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. అనంతరం కౌన్సెలింగ్ కు హాజరయ్యారు. 22వ తేదీన కోర్టుకు హాజరవుతానని చెప్పిన ప్రదీప్ శుక్రవారం కోర్టుకు వచ్చాడు. పట్టుబడిన సందర్భంంలో 178 పాయింట్ల ఆల్కాహాల్ ఉన్నట్లు తేలడంతో ఆయనపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. జరిమానతో సరిపుచ్చుతుందా ? లేక జైలు శిక్ష విధిస్తుందా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. 

12:07 - January 19, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ 'విభజన' మాట అందుకున్నారు. శుక్రవారం రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ఏపీపై పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఏపీకి పోలికే లేదని..తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారనడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి పలు సమస్యలు ఎదురయ్యాయని, కేంద్రం ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా 20 నుండి 30 శాతం వెనుకబడి ఉన్నట్లు, ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనన్నారు. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళతామని వ్యాఖ్యానించడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, ఇందుకు ప్రజలు కారణం కాదన్నారు. 

నాంపల్లి కోర్టుకు ప్రదీప్..

హైదరాబాద్ : యాంకర్, నటుడు ప్రదీప్ నేడు నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యాడు. డిసెంబర్ 31వ తేదీ తప్పతాగి పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. 

వరంగల్ లో ప్రేమ జంట ఆత్మహత్య...

వరంగల్ : దుగ్గొండి మండలం రేకంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. 

విభజనతో వచ్చిన కష్టం - బాబు..

విజయవాడ : ఇతర రాష్ట్రాల కన్నా 20 నుండి 30 శాతం వెనుకబడి ఉన్నట్లు, సమాన స్థాయి వచ్చే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, ఇందుకు ప్రజలు కారణం కాదన్నారు. విభజనతో వచ్చిన కష్టమన్నారు. 

మాల్యాపై అరెస్టు వారెంట్..

ఢిల్లీ : ప్రముఖ వ్యాపార వేత్త, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన కేసులో కంపెనీల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనపై విచారిస్తోంది. 

ఓయూ విద్యార్థుల ర్యాలీ..

హైదరాబాద్ : ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పవన్ కు ఓయూ, కాకతీయ విద్యార్థుల మద్దతుంటుందని, పబ్లిసిటీ కోసమే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పట్టించుకోవద్దని ఓయూ విద్యార్థులు సూచించారు. 

ఉస్మానియా దారులు మూసివేత..

హైదరాబాద్ : ఉస్మానియా వర్సిటీకి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. సినీ క్రిటిక్స్ కత్తి మహేష్ పై జరిగిన దాడికి నిరసనగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కు మద్దతుగ కొంతమంది ఆందోళనలకు దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనితో పోలీసులు భారీగా మోహరించారు. వర్శిటీలో ఎటువంటి ఆందోళనలకూ అనుమతి లేదని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళుతామన్న బాబు..

విజయవాడ : కేంద్రం సాయం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని, ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళతామని వ్యాఖ్యానించడం గమనార్హం. 

సిద్ధిపేటలో మంత్రి హరీష్..

సిద్ధిపేట : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చంద్లాపూర్ లో రంగానాయక రిజర్వాయర్ కాల్వ పనులను బుల్లెట్ పై ప్రయాణిస్తూ మంత్రి హరీష్ పరిశీలించారు.

 

10:33 - January 19, 2018
10:24 - January 19, 2018

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బాధ కలిగించాయంట..ఈ విషయాన్ని బాబే స్వయంగా చెప్పారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో గురువారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారనడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995 పూర్వం, 1995 తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఆంధ్ర వాళ్ల కృషి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు స్పందన...

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం స్పందించారు. తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995 పూర్వం, 1995 తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు బాధ కలిగించాయని పేర్కొన్నారు.

10:16 - January 19, 2018

హైదరాబాద్ : సినీ క్రిటిక్ 'కత్తి మహేష్' పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..కత్తి మహేష్ కు మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ గురువారం రాత్రి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఓ ఛానెల్ లో చర్చలో పాల్గొని వెళుతున్న 'కత్తి మహేష్'పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీనితో ఆయన పీఎస్ లో ఫిర్యాదు చేయనున్నారు. దాడి ఘటనప ఓయూ జీఏసీ స్పందించింది. దాడిని ఖండించింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా 'కత్తి మహేష్' తో టెన్ టివి మాట్లాడింది. తనపై ఎవరు దాడి చేసినా వారు పవన్ ఫ్యాన్స్ అని అనుకుంటానని..అందుకనే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దాడి ఎవరు చేశారో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, చట్టాన్ని నమ్ముతానని తెలిపారు. దళితుడి కాబట్టే ఇంతస్థాయిలో దాడి జరుగుతుందని తేటతెల్లమయిన తరువాతే ఈ విషయాలు చర్చలోకి వచ్చాయని, దళిత సంఘాల మద్దతు తనకు ఉంటుందని తెలిపారు. వ్యూహం గురించి చర్చించలేదని, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించిందన్నారు. పవన్ మెడలు వంచే కార్యక్రమం బృహత్తర కార్యక్రమమని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

విమాన సేవలు ప్రారంభం..

విజయవాడ : గన్నవరం-ముంబై విమాన సేవలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. గన్నవరం నుంచి ముంబైకి మూడు రోజులు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం విమానం రాకపోకలు సాగించనుంది. 

09:51 - January 19, 2018

విజయవాడ : మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు మాదే.. కాదు మీ ఇలాఖాలో మాజెండానే ఎగురుతుంది.. ఇదీ ఇపుడు ఏపీలో అధికార, విపక్షపార్టీ నేతల మధ్య నడుస్తున్న డైలాగ్‌వార్‌. పులివెందులలో గెలుపుమాదే అంటున్న టీడీపీ నేతలకు .. కుప్పంలో మేమేపాగా వేస్తామని వైసీపీ నాయకులు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కడప జిల్లా పులివెందులలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఏపీలో పొలిటికల్‌ పందెంకోళ్లు డైలాగ్‌లతో ఢీకొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ - టీడీపీ అధినేతల మధ్య మాటల యుద్ధం 2019 ఎన్నికలకు సమర సన్నాహం చేస్తోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ముఖ్యంగా వైసీపి అధినేత జగన్ సొంత నియోజకర్గం పులివెందులలో టిడిపి గెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులపై తనదైన వ్యూహాన్ని అమలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల గడ్డపై పసుపుజెండా ఎగరడం ఖాయం అంటూ ప్రత్యర్థి పార్టీలో కలకలం రేపుతున్నారు. తరచుగా కడప, పులవెందులలోనే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పులివెందులలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు... పదేళ్లు అధికారంలో ఉండి కూడా సోంత ఊరికి నీరు తీసుకురాలేకపోయారని జగన్‌ను టార్గెట్‌ చేశారు.

అటు ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్‌ కూడా టీడీపీ అధ్యక్షుడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈసారి తమదే విజయమని జగన్ ప్రకటిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పం నియోజకర్గంపైన జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారని వైసీపీ నేతలు అంటున్నారు. కుప్పం అసెంబ్లీ స్థానంలో అధికంగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఫ్యాన్‌గుర్తుపార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో భాగంగా బీసీలకు జగన్‌ పలు హామీల వరాలు ఇస్తున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శింస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానంలో బిసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపి అభ్యర్ధిగా నిలుపుతున్నట్లు జగన్ ప్రకటించారు. అధికారంలోకి వస్తే కుప్పం నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో అవకాశం ఇస్తామని జగన్ ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా టైం ఉన్నా.. అధికార, ప్రతిపక్షపార్టీ అధినేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్‌ను వేడెక్కించారు. దీంతో అటు కుప్పుంలోనూ, ఇటు పులివెందులలోనూ ఈసారి గెలుపు ఎవరిదనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల్లో ఓటరు మహాశయుడు ఎవరికి ఎలాంటి ఫలితం ఇస్తారో వేచి చూడాల్సిందే.  

09:47 - January 19, 2018

విజయవాడ : రాజకీయపార్టీల్లో అంతర్గత విబేధాలు, ఆదిపత్యపోరు మామూలే.. కాని ఆ పార్టీలో మాత్రం కొత్త ట్రెండ్‌ షురూ అయింది. సామాజిక వర్గాల పోరుతో ఏపీలో వైసీపీ సతమతం అవుతోంది. వైసీపీలో జరుగుతున్న రెండు సామాజిక వర్గాల కోల్డ్‌వార్‌పై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.. ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో వైసీపీలో సమాజికవర్గాల పోరు ముదురుతోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అధినాయకత్వం.. ఆ దిశగా ప్రయత్నంచడంలేదని పార్టీక్యాడర్‌ అసంతృత్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలిచారు. దింతో వైసీపీ అధికారపీఠానికి దూరం అయిందనే వాదనలు అప్పట్లోనే వచ్చాయి. తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపునేతలను జగన్ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో మాత్రం కాపులను నేతలని కాదని రెడ్డివర్గం నేతలకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.

విజయవాడ పాలిటిక్స్‌లో బలమైన నాయకుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం ఇపుడు జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజవర్గం నుంచి తనకు రావాల్సిన పార్టీ టిక్కెట్‌ గౌతంరెడ్డికి దక్కడం పై వంగవీటి రాధ అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఉప్పూ-నిప్పుల పంచాయతీ సాగుతున్న నేపథ్యంలో వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిపై పార్టీ సస్పెన్‌వేటు వేసింది. దీంతో విజయవా సెంట్రల్‌ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గాడిన పడుతుందని భావించిన వైసీపీ అధినాయకత్వానికి మరో తలనొప్పి మొదలైంది. తాజాగా వంగవీటి రాధ వర్సెస్‌ మల్లాది విష్ణు అన్నట్టు అంతర్గత పోరు జోరందుకుంది. మల్లాది వర్గం తీరుపై పార్టీఅధ్యక్షుడు జగన్ కు ఫిర్యాదు చేసినా..సరైన స్పందన లేదని రాధాకృష్ణ అసంత్రుప్తిగా ఉన్నట్టు వైసీపీ క్యాడర్‌ చెప్పుకుంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో కేవలం వైసీపీ ఐదు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ముఖ్యంగా కాకినాడ నియోజక వర్గంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవడంతో అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ సీట్లపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అయింది. ఎన్నికల అనంతరం నష్టాన్ని భర్తీ చేసేందుకు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడ నియోజక వర్గం బాధ్యతల నుంచి తప్పించి.. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణని పార్టీలోకి తీసుకొని ఆయన తనయుడు శశి కి సమన్వయ కర్త బాధ్యతలు అప్పగించారు. ఇంతవరు బాగేనే ఉన్నా.. తాజాగా మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ బాధ్యతలు అప్పగించడంపై కాపు నేతలు జగన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అటు గుంటూరు జిల్లాలోనూ రెడ్డి వర్సెస్‌ కాపు సామాజికవర్గాల అంతర్గత పోరు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు-2 నియోజక వర్గంలో పోటీ చేసిన లేళ్ళ అప్పిరెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక్కడ అప్పిరెడ్డికి కాపునేతలు సహకరించలేదనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ మరోసారి లేళ్లఅప్పిరెడ్డికి గుంటూరు పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వడంపై కాపునేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు, వరప్రసాద్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తూనే ఉండటం.. పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

పార్టీలో సాగుతున్న కాపు -రెడ్డివర్గాల అంతర్గతపోరు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనని వైసీపీ అధినాయకత్వం ఆందోళన పడుతోంది. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో బలంగాఉన్న సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. 

మళ్లీ పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాక్ కాల్పుల విరమణనకు తూట్లు పొడుస్తూనే ఉంది. ఆర్.ఎస్.పురా సెక్టార్ లో పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. 

సెకండ్ డే కలెక్టర్ల సదస్సు...

విజయవాడ : అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో పలు అంశాలపై బాబు దశా..దిశ నేర్దేశం చేస్తున్నారు. 

ఇజ్రాయిల్ ప్రధాని తిరుగు ప్రయాణం..

ఢిల్లీ : ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటన పూర్తయ్యింది. శుక్రవారం ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న నెతన్యాహు ఇజ్రాయిల్ కు పయనమయ్యారు. 

09:09 - January 19, 2018

సొంత కొడుకుని హత్య చేసిన తల్లి...

కేరళ : సొంత కుమారుడిని హత్య చేసిన కేసులో ఓ తల్లిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొల్లాంలో 14ఏళ్ల బాలుడు మూడు రోజులుగా కనిపించకుండాపోయాడు. అతని మృతదేహం అరటితోటల్లో లభ్యమైంది. 

08:31 - January 19, 2018
08:30 - January 19, 2018
08:27 - January 19, 2018

విశాఖపట్టణం : ఒకే నెంబర్ పై రెండు లారీలు ఉంటాయా ? ఎలా ఉంటాయి ? అని అంటారా..కానీ జిల్లాలో ఒకే నెంబర్ పై రెండు లారీలు తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని టెన్ టివి వీడియో దృశ్యాలతో ఎంవీఐ గణేష్ రెడ్డికి పంపింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. 17వ తేదీన ఒకే సమయంలో వేర్వేరు చోట ఉన్న రెండు లారీలున్నాయి. ఏపీ 31టిబి 0124, ఏపీ 31టిబి 0115 నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో 0124 వాహనంపై బకాయిలున్నట్లు తెలిసింది. దీనిపై వివరణ కోరగా రూ. 1,68,000 వసూలు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఆన్ లైన్ లో ఇంకా బకాయిలున్నట్లు చూపిస్తోంది. రవాణాశాఖ అధికారుల అండదండలతోనే ఈ తతంగం కొనసాగుతోందని ఆరోపణలున్నాయి.

 

07:29 - January 19, 2018

ఇండియా టుడే నిర్వహించిన సౌత్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏమాత్రం పోటీపడలేదన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై స్పందిస్తూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోబోమన్నారు కేసీఆర్‌. టి.టిడిపిలో ముసలం పుట్టింది. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), మన్నె గోవర్ధన్ (టీఆర్ఎస్), మల్లయ్య యాదవ్ (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

జగన్ పాదయాత్రకు బ్రేక్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఒక రోజు విరామం ఇవ్వనున్నారు. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కు రానున్నారు. 

నవరంగ్ స్టూడియోలో ప్రమాదం...

ముంబై : నవరంగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు, ఓ అగ్నిమాపక సిబ్బందికి గాయలైనట్లు తెలుస్తోంది. 

06:48 - January 19, 2018

ఒకటా రెండా.. నిత్యం ఎన్నో దాడులు.. ఎన్నో ఆకృత్యాలు.. మరెన్నో దారుణాలు. దేశమంతటా గాయాల పచ్చివాసన. గ్రామాల్లో, పట్టణాల్లో నిత్యం దళితులపై జరుగుతున్న దాడుల్లో వార్తల్లోకెక్కేవెన్ని? న్యాయం జరిగేవెన్ని? ఒకడు చేయి చేసుకుంటాడు. ఒక గుంపు ప్రాణాలు తీస్తుంది. ఒక గుంపు బరిసెలతో, గొడ్డళ్లతో తరిమి తరిమి చంపుతుంది. మరొకడు లేత యువకుణ్ని నిలువునా కాల్చి చంపుతాడు. మరొకడు పశువులా లైంగిక అత్యాచారాలకు పాల్పడతాడు. ఇంకొక ప్రజాప్రతినిధి.... స్థాయిని కూడా మరచి నోరు పారేసుకుంటాడు.. అన్ని చోట్లా బాధితులు దళితులే.. అమానవీయంగా, అన్యాయంగా ఎందరినో కుల దురహంకారం బలిగొంటోంది. ఏళ్లకేళ్లు న్యాయం జరగక, దళితులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాక్ష్యాలు చూపటంలో సర్కార్లు విఫలమవుతూనే ఉన్నాయి. మరి దీనికి ముగింపు ఎప్పుడు? పరిష్కారం ఏంటి? ఈ అంశంపై టెన్ టివి జనపధంలో మాల్యాద్రి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:43 - January 19, 2018

ఢిల్లీ : తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ పెద్దలకు పలు విన్నపాలు చేశారు. ప్రగతిశీల రాష్ర్టాలకు మరింత సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొన్న ఆయన రాష్ర్టానికి కావాల్సిన నిధులపై కేంద్రానికి వివరించామన్నారు. దేశంలోనూ, రాష్ర్టంలోనూ విద్యావంతులకు ఉపాధి కల్పించే వ్యవసాయ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల రంగాలపై దృష్టి సారించాలని కోరినట్టు ఈటల తెలిపారు. 

06:33 - January 19, 2018

హైదరాబాద్ : ఇండియా టుడే నిర్వహించిన సౌత్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏమాత్రం పోటీపడలేదన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై స్పందిస్తూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోబోమన్నారు కేసీఆర్‌. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఇండియాటుడే నిర్వహించిన సౌత్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. హింసకు తావులేకుండా రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం1గా నిలిచిందని సీఎం వివరించారు.

తెలంగాణ ఏర్పడ్డ ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డామ‌ని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి చేరుకున్నామ‌ని చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల‌ కంటే ముందుందన్నారు. తెలంగాణ కంటే 17 చిన్న రాష్ట్రాలు ఉన్నాయన్న కేసీఆర్‌.. మానవ వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నో మతాలవాళ్లు, ఎన్నో ప్రాంతాల వాళ్లు దశాబ్ధాలుగా ఇక్కడ భాగమై జీవిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా గౌరవమిస్తామంటే అందుకు స్వాగతిస్తామన్నారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు కేటాయించిన నీళ్లు.. లెక్కల్లో మాత్రమే కన్పించేవని.. వాస్తవంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా ఏనాడు దక్కలేదన్నారు. అందుకే మా హక్కులను సాధించేందుకే ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత అంశంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. 2020 నాటికి రాష్ట్రంలోని కోటి ఎకరాలకు నీరు ఇస్తామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమేనన్న కేసీఆర్‌.. ఆంధ్రాతో తెలంగాణకు పోటీ.. పోలిక లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే తాము పాటిస్తున్న విధానమన్నారు. సమైక్య పాలనలో హైదరాబాద్‌ నీటి వనరులన్నీ కబ్జా చేసి, అందమైన హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేశారని కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు గార్డెన్ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రస్తుత లక్ష్యమన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 90 శాతం ఉన్నారని.. ఓసీలు 10 శాతం మాత్రమే ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఎలా సరిపోతాయని కేసీఆర్‌ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రిజర్వేషన్ల అంశంపై సభలో లేవనెత్తుతామని కేసీఆర్‌ చెప్పారు. 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేసీఆర్‌.. తాము ఎవరితోనూ కలవబోమని, ఎవరైనా తమతోనే కలవాలని అన్నారు. ప్రస్తుత సెక్రెటేరియట్‌ సౌకర్యవంతంగా లేదన్న కేసీఆర్‌.. దాన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రగతిభవన్‌ తెలంగాణ సీఎం అధికారం నివాసమని, అందులో కేసీఆర్‌ ఒక్కరే ఉండరని చెప్పారు. తన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు అందులో ఉంటారని వెల్లడించారు. తెలంగాణ కోసం తన కుటుంబసభ్యులు పోరాడారని.. ప్రజలు ఎన్నుకుంటేనే తన పిల్లలు గెలిచారని చెప్పారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదన్న కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబం అన్నారు. 

06:29 - January 19, 2018

హైదరాబాద్ : కత్తి వర్సెస్‌ పవన్‌ అభిమానులు వివాదం మరింత ముదురుతోంది. సినీక్రిటిక్‌ కత్తిమహేశ్‌పై హైదరాబాద్‌ కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. దాడికి నిరసనగా ఇవాళ పవన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పలుపునిచ్చారు.  

గజల్ బెయిల్ పిటిషన్ పై విచారణ...

హైదరాబాద్ : గజల్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించనుంది. గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

కత్తి మహేష్ దాడిని ఖండించిన ఓయూ జేఏసీ...

హైదరాబాద్ : కొండాపూర్ లో కత్తి మహేష్ పై దాడిని నిరసిస్తూ నేడు ఓయూ జేఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. 

కత్తి మహేష్ పై కోడి గుడ్ల దాడి...

హైదరాబాద్ : కొండాపూర్ లో సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లలతో దాడికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా పవన్ అభిమానులు...కత్తి మహేష్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 

కేసీఆర్ తో టి. జేఏసీ సమావేశం...

హైదరాబాద్ : నేడు కేసీఆర్ తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం జరుగనుంది. సైనికకుటుంబ సహాయ నిధికి ఒక రోజు మూల వేతనం రూ. 50 కోట్లు ఇవ్వాలని జేఏసీ కోరుతోంది. 

కేస్లాపూర్ లో నాగోబా జాతర దర్బార్...

ఆదిలాబాద్ : కేస్లాపూర్ లో నాగోబా జాతర జరుగుతోంది. నేడు జాతరలో భాగంగా దర్బార్ నిర్వహించనున్నారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకిరణ్ రెడ్డిలు పాల్గొననున్నారు. 

Don't Miss