Activities calendar

20 January 2018

22:07 - January 20, 2018

ఢిల్లీ : పలు రంగాల్లో ప్రతిభావంతులైన 112 మంది మహిళామణులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల్లో  తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన 227 మంది మహిళల  పేర్లను సేకరించిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారిలో 112 మందిని సత్కారానికి ఎంపిక చేసింది. తొలి మిసైల్‌ప్రాజెక్ట్‌ హెడ్‌, శ్మశానం నిర్వహిస్తున్న తొలిమహిళ, తొలి ఒలింపిక్‌ పతకం సాధించినవారు.. ఇలా వివిధ రంగాల్లోకి తొలిసారి అడుగులేసిన మహిళల వివరాలను సేకరించి ఈ గౌరవానికి ఎంపికచేశారు. ఇందులో తెలుగురాష్ట్రాలకు చెందిన పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, వంకదారత్‌ సరిత , సైనా నెహ్వాల్‌ , టెస్సీ థామస్‌, కెప్టెన్‌ శోభా,  కె.మిథాలీరాజ్‌ , సాజిదాఖాన్‌ , సానియామీర్జా , శోభనాకామినేని , గాయని కేఎస్‌చిత్ర అవార్డులు అందుకున్నారు. 

 

22:03 - January 20, 2018

హైదరాబాద్ : పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులపై వివాదం రోజురోజుకు హీటెక్కుతోంది. సబ్ కమిటీ రిపోర్టుపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్... సర్పంచ్‌లకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి ఈనెల 28న అన్ని పంచాయతీల్లో తీర్మానాలు చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సోమాజీగూడలో సర్పంచ్‌ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌తో పాటు ప్రొ.కోదండరామ్, చాడ వెంకట్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, హరగోపాల్, ప్రొ.నాగేశ్వర్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వం పరోక్ష పద్ధతిలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం మానుకోకుంటే సర్పంచ్‌ల సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉత్తమ్ హెచ్చరించారు. 

21:58 - January 20, 2018

గుంటూరు : పాలనలోనే కాదు.. పార్టీ విషయాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... చంద్రబాబుకు నచ్చదు. పార్టీని డ్యామేజ్ చేస్తే.. ఆయన అసలు సహించరు. ఇవాళ జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఇదే జరిగింది. పార్టీ వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం మూడు గంటలపాటు హాట్ హాట్‌గా సాగింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు. 

విభ‌జ‌న సమస్యలపై  కోర్టుకెళ్లే అంశాన్ని సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు మరోసారి ప్రస్తావించారు. ఇబ్బందులు వస్తే కోర్టుకు వెళ్లడం సహజమని.. దీనిని బీజేపీ వ్యతిరేకంగా భావించకూడదన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ఏదో జరుగుతోందన్న సంకేతాలు వెళ్లేలా కొందరు వార్తలు ప్రచురించారని చంద్రబాబు  అన్నారు.  హైదరాబాద్‌ను ధ్వంసం చేశామనే రీతిలో సీఎం కేసీఆర్ కామెంట్ చేయడం సరికాదని.. భాగ్యనగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు చంద్రబాబు. 

ఇక సంక్రాంతి నేపథ్యంలో జరిగిన కోడిపందాల‌పై  సమావేశంలో నేతలకు క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. సంప్రదాయం కోసం కోడిపందాలు నిర్వహించుకోవడంలో తప్పులేదు కానీ.. పందాలు మేమే నిర్వహిస్తామనే రీతిలో మాట్లాడటం సరికాదన్నారు చంద్రబాబు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ నుంచి కొందరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పలువురు మంత్రులు చెప్పగా.. స్ధానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ కొత్తవారిని పార్టీలో చేర్చుకోవచ్చని చంద్రబాబు వారికి సూచించారు. ఇటీవల మోడీతో జరిగిన సమావేశం ఫలప్రదమైందని.. నియోజకవర్గాల పెంపుపై కేంద్రం సానుకూలంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చంద్రబాబు ఈ సమావేశంలో నేతలకు సూచించారు.  ఇక ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో వన్ డే వర్క్ షాప్ జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

 

21:55 - January 20, 2018

గుంటూరు : త్వరలో తాగునీటి కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ 50ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఫైబర్‌ గ్రిడ్‌ అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది పేదలకు 18 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ 2 పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. చేతి, కుల వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు పంపిణీ చేస్తామని.. ఏప్రిల్‌ నుంచి ఈ పథకం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో 2.50 లక్షల మందికి ఆధునిక పనిముట్లు అందిస్తామన్నారు. 

 

21:48 - January 20, 2018

గుంటూరు : అమరావతిలో సమావేశమైన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న క్లౌడ్‌హబ్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పీపీపీ పద్దతిలో భోగాపురం, భావనపాడు విమానాశ్రయాల నిర్మాణానికి ఓకే చెప్పిన మంత్రిమండలి... . డ్రగ్‌ కంట్రోల్‌శాఖలో 50 పోస్టులు, విద్యుత్‌శాఖలో 400 కొలువుల భర్తీకి పచ్చజెండా ఊపింది. 

స్విట్జర్లాండ్ చేరుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్నారు. 

21:30 - January 20, 2018

విశారధన్ మహారాజ్..మహాకాలినడక, చంద్రబాబు విదేశీ పర్యటనలు.. రాష్ట్రానికి ఒరింగిందేమి..? ఆయేషా హత్య కేసు...అమాయకునికి జైలు శిక్ష, టీసర్కార్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎక్కడ ? దళితులు ప్రవేశిస్తే గుడి మైలవడ్తదంట, రహదారి విస్తరణ...రోడ్డున పడ్డ పేదల బతుకులు, 
మహిళను తోటి మహిళలే బట్టలిప్పేసి కొట్టారు, ఆవుపాలు తాగిన పందిపిల్ల.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

20:44 - January 20, 2018

దేశాన్ని డిజిటలైజ్‌ చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొట్టాయి. క్యాష్‌లెస్‌ ఎకానమీ అన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఊదరగొట్టారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనేని గొప్పలు చెప్పారు. గ్రామాలకు గ్రామాలనే డిజిటల్‌ ఊళ్లుగా ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో దీనికి  పెద్ద ప్రచారం జరిగింది. కానీ  క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు 2017 చెబుతోంది. ఇదే అంశంపై ప్రొ.నాగేశ్వర్ మాట్లాడారు. ప్రభుత్వ సెక్టార్ ఎంప్లాయింట్ మెంట్ తగ్గుతుందన్నారు. ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయింట్ మెంట్ పెరుగుతోందని తెలిపారు. దేశంలో లెర్నింగ్ విధానంలో లోపం ఉందన్నారు. దేశంలో లెర్నింగ్ క్రైసిస్ ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:33 - January 20, 2018

హైదరాబాద్ : దేశాన్ని డిజిటలైజ్‌ చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొట్టాయి. క్యాష్‌లెస్‌ ఎకానమీ అన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఊదరగొట్టారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనేని గొప్పలు చెప్పారు. గ్రామాలకు గ్రామాలనే డిజిటల్‌ ఊళ్లుగా ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో దీనికి  పెద్ద ప్రచారం జరిగింది. కానీ  క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు 2017 చెబుతోంది. 
భిన్నంగా సర్వేలు 
డిజిటల్‌ రంగంలో దేశం దూసుకుపోతోందని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పలు చెప్పారు.  ఆర్థిక లావాదేవీలు, పరిపాలన అంతా ఇక ఆన్‌లైన్‌లోనేని ఊదరగొట్టారు. కానీ వాస్తవాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. 
డిజిటల్‌ యుగానికి కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కీలకం
డిజిటల్‌ యుగానికి కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కీలకం. కానీ దేశంలోని యువకుల్లో ఎక్కువ భాగం ఈ రెండూ వినియోగించడంలేదని  యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు-2017  తేటతెల్లం చేసింది. 14-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులతో ఈ సర్వే నిర్వహించారు. దేశంలో ఇప్పటికీ 63.7 శాతం మంది ఇంటర్నెట్‌, 59.3 శాతం మంది కంప్యూట్‌ వినియోగించడంలేదు. అయితే కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కంటే మొబైల్‌ ఫోన్‌ వాడేవారు ఎక్కువగా ఉన్నారు. మొబైల్‌లేనివారు 17.6 శాతం మాత్రమే ఉన్నారు. 
డిజిటల్‌ రంగంపై ప్రథమ్‌ దేశవ్యాప్త సర్వే 
డిజిటల్‌ రంగంపై ప్రథమ్‌ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.  24 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లోని 1641 గ్రామాల్లో ఈ సర్వే జరిగింది. తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లాలో అథ్యయనం చేశారు. ఆరవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 30 వేల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. ఇంటర్నెట్‌ కంటే మొబైల్‌ ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. 14-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో 72.6 శాతం మంది ఫోన్లు వినియోగిస్తున్నారు. మొబైల్‌ వాడని యువత 17.6 శాతం మాత్రమే ఉంది. 9.8 శాతం మంది అప్పుడప్పుడు మొబైల్‌ వినియోగిస్తున్నారు. 28 శాతం మంది ఇంటర్నెట్‌ వాడుతుంటే, మరో 8.3 శాతం అప్పుడప్పుడు వినియోగిస్తున్నారని అసర్‌ నివేదికలోని అంశాలు విశదీకరిస్తున్నాయి. 
గ్రామీణ యువతకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువ 
గ్రామీణ యువతకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువగా ఉంది. వీరిలో 25.5 శాతం మాత్రమే కంప్యూటర్‌ వినియోగిస్తున్నారు. 15.1 శాతం అప్పుడప్పుడు మాత్రమే వాడుతున్నారు. దేశం డిజిటల్‌ యుగంలోకి దూసుకెళ్తోదంటూ నేతలు చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు పొంతనలేదని యాన్యువల్‌  స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు చెబుతోంది. బ్యాంకు  ఖాతాలు 74.3 శాతం మందికి ఉంటే, వీరిలో కేవలం 15.7 శాతానికే  ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నది  4.6 శాతమేని  ప్రథమ్‌ సర్వే తేల్చింది. 
వ్యవసాయంపై ఆసక్తి చూపిన 1.2 శాతం విద్యార్థులు 
విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీర్‌, డాక్టర్‌, టీచర్‌ కావాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేవలం 1.2 శాతం మంది మాత్రమే వ్యవసాయంపై ఆసక్తి చూపారు. దేశమాత రక్షణ కోసం ఆర్మీలో చేరతామని 17.6 శాతం మంది చెప్పారు. బాలికల్లో 18.1 శాతం డాక్టర్‌ అవ్వాలని చెబితే, 25.1 శాతం టీచర్‌ కవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. బాలురుల్లో  ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని 12.8 శాతం  కోరుకొంటే, బాలికల్లో 9.3 శాతం మాత్రమే గవర్నమెంట్‌ జాబ్‌పై ఆస్తక్తి కనపరిచారు. 40 శాతం మంది యువత ఎంచుకున్న లక్ష్యానికి  ఆమడదూరంలో నడుస్తున్నారని సర్వేలో తేలింది. 
మాతృభాష చదవలేని విద్యార్థులు 25 శాతం 
చాలా మంది విద్యార్థులకు మాతృభాషపైనే పట్టులేదు. అంగ్లభాషా పరిజ్ఞానం అంతంత మాత్రమే. భావవ్యక్తీకరణ అంతకంటే లేదు. 25 శాతం మాతృభాషను కూడా సరిగా చదవలేకపోతున్నారు. 14 ఏళ్ల వయసు ఉన్న బాలురులో 53 శాతం మందికి చిన్న చిన్న ఆంగ్ల పదాలు కూడా చదవలేకపోతున్నారు. 18 ఏళ్ల వయసు ఉన్నవారిలో 60 శాతం మంది ఇంగ్లీషు చదవగల్గుతున్నారు. అయితే ఆంగ్లం చదవివారిలో 79 శాతం మందికి పదాల అర్థాలు తెలియిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. లెక్కల్లో 43 శాతం మంది విద్యార్థులు భాగాహారాలు, 22.6 శాతం మంది తీసివేతలు చేయగలుగుతున్నారు. 34.3 శాతం మంది నంబర్లను గుర్తిస్తున్నారు. యువతలో ఎక్కువ భాగం టీవీలకు అతుక్కుపోతున్నారు. వార్తా పత్రికలు చదివేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 85 శాతం మంది టీవీలు చూస్తున్నారు. 45.8 శాతం మంది ఎఫ్‌ఎం రేడియో వింటున్నారు. 57.8 శాతం న్యూస్‌ పేపర్లు చదువుతున్నారని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టులోని అంశాలు చెబుతున్నాయి. 

 

కర్నూలులో విషాదం

కర్నూలు : నగరంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం పదేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. స్థానిక వీకర్ సెక్షన్‌లోని మున్సిపల్ పార్కులోని సంపులో పడి పదేళ్ల బాలుడు తిరుమలేశు మృతి చెందాడు. సంపు పైన ఎలాంటి మూత లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమంటున్న బంధువులు... న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. 

 

 

రాజకీయ యాత్రపై ట్విట్టర్ లో స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : రాజకీయ యాత్రపై ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ స్పందించారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. 2009లో ప్రచార సమయంలో పెను ప్రమాదం నుంచి కొండగట్టులోనే క్షేమంగా బయటపడ్డానని తెలిపారు. తమ కుటుంబ ఇలవేల్పు కూడా ఆంజనేయస్వామే అని అన్నారు.   

 

19:40 - January 20, 2018

సంగారెడ్డి : రైతులు మోసపోయారు.... అవును వారంతా నిండా మోసపోయారు. తెలియని తనంతో నమ్ముకున్న నేలకు దూరమయ్యారు.  ఎవరో వచ్చి తమ భూముల్లో నిర్మాణాలు చేపడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. పార్లమెంట్‌లో చట్టాలు చేసే వ్యక్తే... ఆ రైతుల భూములను కాజేశాడు.
3వేల ఎకరాలకు ఎసరుపెట్టిన ఎంపీ
మంత్రి కేటీఆర్‌ పక్కన  కూర్చుని హడావుడి చేస్తున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసుకదా. అవును మీరనుకున్నది కరెక్టే. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌. అధికారపార్టీ ఎంపీ బీబీ పాటిల్‌ భూదాహానికి వందలాది మంది రైతులు విలవిల్లాడుతున్నారు. ఒకటికాదు... రెండుకాదు... ఏకంగా మూడువేల ఎకరాలకు ఈ ఎంపీ ఎసరు పెట్టారు. 
మళ్లీ కనిపించకుండా పోయిన శర్మ
ఢిల్లీకి చెందిన శర్మ అనే వ్యక్తి 2006లో కంగ్టి మండలంలోని బంరా, బోర్గి, చాప్టా, కంగ్టి, మోర్గీతోపాటు మొత్తం 15 గ్రామాల ప్రజలకు చెందిన  భూములను కొనుగోలు చేశాడు.  ఎకరాకు 40వేలు ఇస్తానని చెప్పి... అడ్వాన్స్‌గా పదివేల  చొప్పున  ముట్టజెప్పి మొత్తం భూములన్నీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.  ఆ తర్వాత శర్మ రైతులను కలువలేదు.  అప్పటి నుంచి మళ్లీ శర్మ వచ్చింది లేదు. ఎకరాకు 30వేల చొప్పున ఇవ్వాల్సిన డబ్బులూ ఇవ్వలేదు.  దీంతో రైతులు తమ భూములను మళ్లీ సాగుచేసుకోవడం మొదలుపెట్టారు. 
ఎంపీ అనుచరులు బెదిరింపులు
కొద్ది రోజులుగా రైతులను ఎంపీ బీబీ పాటిల్‌కు చెందిన కొంతమంది అనుయాయులు వారిని భూముల్లోకి వెళ్లనీయడం లేదు. ఈ భూములన్నీ తమవేనంటూ అందులో నిర్మాణాలకు పూనుకున్నారు. శర్మ నుంచి ఈ భూములన్నీ ఎంపీ బీబీ పాటిల్‌ కొనుగోలు చేశారని.. రైతులంతా వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు. దీంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. 
తమకు శర్మ మొత్తం డబ్బులు ఇవ్వలేదంటున్న రైతులు
రైతులు భూమలు అమ్మాలనుకున్న మాట వాస్తవమే.  కానీ వారి భూములు కొనుగోలు చేసిన శర్మ అనే వ్యక్తి ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇవ్వలేదు. పైగా ఇన్ని సంవత్సరాలైనా తిరిగి రాలేదు.  అందుకే తాము తమ భూములను సాగు చేసుకుంటున్నామని చెబుతున్నారు. మీరు వచ్చి భూములు ఇవ్వాలంటే తామెలా ఇస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం భూములు కొనుగోలు చేస్తామంటే నిరభ్యంతరంగా ఇస్తామని తేల్చి చెబుతున్నారు. ప్రజల అమాయకత్వం, ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకుని టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బరితెగించారని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ విమర్శిస్తున్నారు. 
కొత్త మలుపు తిరిగిన ఎంపీ భూదందా
ఈ గొడవ ఇలా కొనసాగుతుండగానే కథ మరో మలుపు తిరిగింది. రైతుల నుంచి 2006లో భూములను కొనుగోలు చేసిన శర్మ చనిపోయి చానాళ్లైంది. ఆయన రైతుల భూములను బ్యాంకుల్లో తనఖాపెట్టి వందలకోట్ల రుణాలు పొందినట్టు తెలుస్తోంది. దీనిపై సీబీసీఐడీ విచారణ కూడా జరుగుతోంది. ఒకవైపు సీబీసీఐడీ విచారణ జరుగుతుండగానే.. మరోవైపు బీబీ పాటిల్‌ రైతుల భూముల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు సమాయాత్తమవుతున్నారు.  శర్మ నుంచి బీబీ పాటిల్‌ ఎప్పుడు భూములు కొనుగోలు చేశారో చెప్పాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి రైతుల జీవితాలతో ఆటలాడుకోచ్చా అని నిలదీస్తున్నారు.
కన్నెత్తిచూడని రెవెన్యూ అధికారులు 
రైతులు, ఎంపీ మధ్య భూముల కోసం ఇంత తతంగా నడుస్తోంటే... రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. తమకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. ఎంపీ బీబీపాటిల్‌ ఒకవైపు  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ఏర్పాట్లు జరుగుతుంటే... దానికి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్‌ చెబుతున్నారు. 
గ్రామస్తులకు అండగా సీపీఎం నాయకులు 
15 గ్రామాల రైతులకు బీబీ పాటిల్‌ చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకున్న సీపీఎం నాయకులు... గ్రామస్తులకు అండగా నిలుస్తున్నారు.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  దీంతో ఎంపీ ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు, రైతులపైకి పోలీసులను ఉసిగొల్పి అరెస్ట్‌ చేయించారు. తమపై ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని సీపీఎం నాయకులు చెప్తున్నారు. ఎంపీ బీబీ పాటిల్‌ భూదందాపై జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరవాలని బాధితులు కోరుతున్నారు.  అన్యాయానికి గురవుతున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై గవర్నర్‌ సంతృప్తి

భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నారం పంపుహౌజ్‌, సుందిళ్ల బ్యారేజ్‌ పనులను ఆయన పరిశీలించారు. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.  మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను రోజువారీగా టార్గెట్‌ ఇచ్చి జరిపిస్తున్నట్టు ప్రాజెక్ట్‌లో పనిచేసే అధికారులు గవర్నర్‌కు తెలిపారు.  కార్మికులకు సదుపాయాలు, వేతన భత్యాలు ఎలా ఇస్తున్నారో కూడా గవర్నర్‌ తెలుసుకున్నారు. 

 

18:48 - January 20, 2018

భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నారం పంపుహౌజ్‌, సుందిళ్ల బ్యారేజ్‌ పనులను ఆయన పరిశీలించారు. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.  మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను రోజువారీగా టార్గెట్‌ ఇచ్చి జరిపిస్తున్నట్టు ప్రాజెక్ట్‌లో పనిచేసే అధికారులు గవర్నర్‌కు తెలిపారు.  కార్మికులకు సదుపాయాలు, వేతన భత్యాలు ఎలా ఇస్తున్నారో కూడా గవర్నర్‌ తెలుసుకున్నారు. 

 

18:45 - January 20, 2018

హైదరాబాద్ : అడిక్‌మెట్ డివిజన్‌లోని వడ్డెరబస్తీ కష్టాల్లో కూరుకుపోయింది. చాలీచాలని ఇంట్లో.. కనీస సౌకర్యాలు లేక బస్తీవాసులు నానా అవస్థలు పడుతున్నారు. టాయిలెట్ సౌకర్యం లేక బస్తీని ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి అనేకమంది చనిపోయిన పరిస్థితి. ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా అవేమీ మాకు చేరడం లేదని బస్తీవాసులు ఆవేదనతో చెబుతున్నారు. గూడులేని తమకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పించడంతో కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు. బస్తీలోని పేదల కష్టాలపై 10 టివి గ్రౌండ్ రిపోర్ట్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:43 - January 20, 2018

కర్నూలు : బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహా చిత్రం యూనిట్‌ హిందూపురంలో సందడి చేసింది. దీంతో బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా 102 మంది బ్రాహ్మణులకు సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రంలో హీరో బ్రాహ్మణుల గురించి వివరించిన విధానం అర్చకులకు ఎంతో నచ్చిందని బాలకృష్ణ అభిమానులు అన్నారు. సినిమా విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు నటి హరిప్రియ. తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలోని పాత్ర మంగ పేరుతోనే పిలవడం మరింత ఆనందంగా ఉందన్నారు. 

 

18:41 - January 20, 2018

ఢిల్లీ : జస్టిస్ బి.హెచ్‌.లోయా మృతి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్‌ మిశ్రా స్వయంగా విచారణ జరపనున్నారు. లోయా కేసును ఇంతకముందు జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కు అప్పగించారు. దీనిపై నలుగురు తిరుగుబాటు న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అరుణ్‌ మిశ్రాను తప్పించి సిజెఐ కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌లో చీఫ్‌ జస్టిస్‌తో పాటు జస్టిస్‌ ఎఎం ఖాన్‌విల్కర్, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసం లోయా కేసును సోమవారం విచారణ జరపనుంది. కేసుల కేటాయింపుల్లో చీఫ్ జస్టిస్ సరిగా వ్యవహరించడం లేదని ఇటీవల జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని నలుగురు జడ్జీలు సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. లోయా కేసును జస్టిస్ అరుణ్ మిశ్రాకు అప్పగించడం వల్లే.. ఆ నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై ఆరోపణలు చేశారు.

 

18:37 - January 20, 2018

సంగారెడ్డి : చెరువులు, కాలువలు, కుంటలు.. ఇలా దేనినీ వదలకుండా మింగేస్తున్నారు భూకబ్జాదారులు.  హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలురావడంతో భూమాఫియా దందాకు తెరలేపింది.  అధికారుల అండతో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తోంది.  సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో చెరువుల ఆక్రమణలపై 10టీవీ కథనం...
ఖాళీ జాగా కనిపిస్తే పాగా
సంగారెడ్డి జిల్లాలో భూకబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. రాత్రికి రాత్రే కబ్జా చేసేస్తున్నారు.  అది ప్రభుత్వ భూమా, ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన భూమా అన్న తేడా లేదు. చివరికి చెరువులు, కుంటలు, కాలువలు, శిఖం భూములు అన్న తేడాలేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. 
తెల్లాపూర్‌లో కబ్జారాయుళ్ల అక్రమాలు
సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, కొల్లూరు ప్రాంతాలన్నీ హైదరాబాద్‌కు ఆనుకునే ఉంటాయి.  ఇక్కడి భూములకు మార్కెట్‌లో యమా డిమాండ్‌ ఉంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి.  దీంతో భూబకాసురులు ఇక్కడ రెచ్చిపోతున్నారు. ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారు. తెల్లాపూర్‌లో కబ్జారాయుళ్ల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పెద్దపెద్ద సంస్థలు కూడా చెరువు శిఖం భూములు, చెరువులు, కాలువలు ఆక్రమించుకుంటున్నాయి.  అలా ఆక్రమించుకున్న భూముల్లో బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నాయి.  ఇందుకు ఇరిగేషన్‌ అధికారులు ముడుపులకు ఆశపడి  ఎన్‌వోసీలు ఇచ్చేశారు. దీంతో మూడు కబ్జాలు, ఆరు ప్లాట్లుగా దందా సాగుతోంది.
వనం చెరువునూ వదలని అక్రమార్కులు
తెల్లాపూర్‌లోని వనం చెరువునూ కబ్జారాయుళ్లు వదలలేదు. వనం చెరువును ఆక్రమించి అక్కడ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. గ్రామస్తులు అదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్టు గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.  ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. కొంతమంది భూ ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. 
తెల్లాపూర్‌ ఆక్రమణలపై కోర్టులో పిటిషన్‌
తెల్లాపూర్‌ ఆక్రమణలపై నిజానిజాలు తేల్చేందుకు ట్రిబ్యునల్‌ ఓ బృందాన్ని నియమించింది. ఈ బృందం గ్రామంలోని ఆక్రమణలను పరిశీలించింది. అయితే ఇప్పుడే ఏమీ చెప్పలేమని... నివేదికను ట్రిబ్యునల్‌కు అందిస్తామని బృందం సభ్యులు తెలిపారు. 
నీటి వనరులు ధ్వంసం
కాలువలు, చెరువుల కబ్జాలతో నీటి వనరులు ధ్వంసమైపోతున్నాయి.  వాటిని రక్షించాల్సిన అధికారులు ముడుపులకు ఆశపడి ఎన్‌వోసీలు ఇచ్చేస్తున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

18:34 - January 20, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హామీల అమలు కోసం ఈనెల 22న కలెక్టరేట్ల ముట్టడి చేపడుతున్నట్టు టీమాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ తెలిపారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇళ్లులేని కుటుంబాలు 20 లక్షలకుపైగా ఉంటే... కేవలం 4462 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లే ఇప్పటి వరకు కేటాయించారని విమర్శించారు. అర్హులైన పేదలందరికీ రెండు పడకల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు చేపట్టాలని, దళితులకు మూడెకరాల భూపంపిణీ వెంటనే చేపట్టాలన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజాగాయకుడు, టీమాస్‌ నేత గద్దర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.  కవులు, కళాకారులతో సాంస్కృతిక ఉద్యమం చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. 

 

18:32 - January 20, 2018

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులో సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ డబ్బులు చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకు సిబ్బంది లోపల ఉండగానే బ్యాంకుకు తాళాలు వేసి ఆందోళన చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బ్యాంక్‌లో కట్టిన పాలసీలు మెచ్యూరిటీ అయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా బ్యాంక్ సిబ్బంది ఖాతాదారుల్ని  బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నారు. తమకు రావాల్సిన మొత్తం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

 

18:29 - January 20, 2018

ఢిల్లీ : వివిధ రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిన మహిళలకు రాష్ట్రపతి అవార్డులు ప్రకటించారు. మరికొద్ది సేపట్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌లో ఉత్తమ సేవలందించిన అధికారిణికి వేణుకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెబుతున్న వేణుతో 10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:23 - January 20, 2018

ఢిల్లీ : క్రీడల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన  దీపా కర్మాకర్‌కు రాష్ట్రపతి అవార్డు దక్కింది. వివిధ రంగాల్లో అగ్రభాగంలో నిలిచిన మహిళలకు రాష్ట్రపతి అవార్డులు ప్రకటించారు. ఈ జాబితాలో దీపా కర్మాకర్‌కు అవార్డు దక్కింది. తనకు అవార్డు దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తన ఆటను  మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ అవార్డు ప్రోత్సాహానిస్తోందంటున్న దీపా కర్మాకర్‌తో 10టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:21 - January 20, 2018

హైదరాబాద్ : డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.63 వేల రూపాయలతో పాటు సెన్సార్‌ ఫోన్‌ను సీజ్ చేశారు. ప్రవీణ్‌ అనే వ్యక్తి ఢిల్లీలో సెన్సార్‌ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా వీరంతా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. 

 

18:16 - January 20, 2018

ఢిల్లీ : దేశంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు రాష్ట్రపతి పురస్కారాలు అందజేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ 112 మంది మహిళలు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా సినీ గాయని చిత్రకు మొదటి మహిళల్లో ఒకరిగా గుర్తింపు దక్కింది. తనకు ఈ గుర్తింపు దక్కడం చాలా ఆనందంగా ఉందంటున్న సింగర్‌ చిత్రతో 10 టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

18:10 - January 20, 2018

హైదరాబాద్ : స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్‌ దక్కిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ తీవ్రంగా విమర్శించారు.  జడ్పీటీసీ మొదలు శాసనసభ, క్యాబినెట్‌ దేనికీ విలువలేకుండా పోయిందన్నారు. కేవలం ఆయన కుటుంబంలోని నలుగురి కనుసన్నల్లోనే అన్ని సాగుతున్నాయంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు.

 

కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. ఏపీ ట్రాన్స్‌కోలో 382 పోస్టులకు అనుమతి, ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలో మరో 406 పోస్టులకు అనుమతిచ్చే అంశంపై చర్చించనుంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 

18:04 - January 20, 2018

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది.  ఏపీ ట్రాన్స్‌కోలో 382 పోస్టులకు అనుమతి, ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలో మరో 406 పోస్టులకు అనుమతిచ్చే అంశంపై చర్చించనుంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:47 - January 20, 2018

హైదరాబాద్ : తెలంగాణలో చట్ట విరుద్ధంగా నియమించబడిన ఆరుగురు పార్లమెంటు సెక్రటరీలను అనర్హులుగా ప్రకటించాలని సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ న్యాయస్ధానాలను తప్పు దోవ పట్టించి తన పార్టీలోని నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించారని ఆయన విమర్శించారు. గతంలో చట్ట విరుద్ధంగా నియమించిన పార్లమెంటు సెక్రటరీలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని కేసీఆర్ బేఖాతరు చేస్తూ మరో 21 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

 

17:44 - January 20, 2018

హైదరాబాద్‌ : వనస్థలిపురంలో రియల్టర్‌ కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. వనస్థలిపురంలో చైతన్యనగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చెరుకుపల్లి అనంతయ్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఉదయం కిరాణాషాప్‌కు వెళ్లివస్తుండగా కాపుకాసిన దుండగులు... అతడిని కిడ్నాప్‌చేసి కారులో తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతయ్య కిడ్నాప్‌తో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షల కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతయ్య గతంలో దేవరకొండ సర్పంచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
 

 

17:41 - January 20, 2018

సంగారెడ్డి : వారంతా ప్రభుత్వ మాజీ ఉద్యోగులు. పైసాపైసా కూడబెట్టుకున్నారు. పోగేసిన డబ్బులతో భూములు కొనుక్కున్నారు. తీరా ఇప్పుడా భూములను కబ్జాదారులు లాగేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్‌సీ పురం మండలం ఈదులనాగులపల్లిలో భూకబ్జాపై స్పెషల్‌ స్టోరీ... 
716 ఎకరాల్లో వెంచర్‌
ఇదిగో మీరు చూస్తున్న వీరంతా హైదరాబాద్‌ వాసులు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందినవారు.  వచ్చిన జీతంలోంచి కొద్దికొద్దిగా మిగుల్చుకుని పైసాపైసా కూడబెట్టారు. పోగేసుకున్న డబ్బులతో ఆర్‌సి పురం మండలం ఈదుల నాగుపల్లిలోని సర్వేనంబర్‌ 135లో భూములు కొనుగోలు చేశారు. 716 ఎకరాల్లో వేసిన వెంచర్లలో వీరితోపాటు మరికొంతమంది ప్లాట్లు కొనుగోలు చేశారు.  భూములు కొనుగోలు అయితే చేశారు కానీ... దాన్ని తర్వాత పట్టించుకోలేదు. మధ్యమధ్యలో వచ్చి చూసిపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే భూమిని కొనుక్కుని మళ్లీ అటువైపు రాలేదు. 
సర్వేనంబర్‌ 135లోని భూముల కబ్జా
ప్లాట్లను కొనుగోలుచేసిన వారెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కబ్జాదారులు ఆ భూములపై కన్నేశారు. వీరి ప్లాట్లు ఉన్న భూములను కబ్జా చేశారు. వీరి ప్లాట్ల వరకే కాదు.. సమీపంలో ఉన్న బందం చెరువు, కుమ్మరికుంటతోసహా వంద ఎకరాలకుపైగా కబ్జా చేశారు. ప్రగతి రిసార్ట్స్‌ వీరి భూములను కబ్జాపెట్టింది. 
అధికారులకు స్థల యజమానుల ఫిర్యాదు
తమ భూములను ప్రగతి రిసార్ట్స్‌ కబ్జా చేసిందని తెలుసుకున్న స్థల యజమానులు  అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. హైకోర్టు మెట్టెక్కారు.  గత ఏడాది జూన్‌లో హైకోర్టు ఈదులనాగులపల్లి భూములపై సమగ్ర విచారణకు ఆదేశించింది.  ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి ఆర్‌డీవోనూ ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి ఆరు నెలలు పూర్తైనా ఇంత వరకు ఆర్‌డీవో హైకోర్టుకు నివేదిక సమర్పించలేదు.  దీంతో ఆర్‌డీవోపై స్థల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థల డాక్యుమెంట్లు ఉన్నాయంటున్న మాజీ ఉద్యోగులు
135 సర్వేనంబర్‌లోని స్థలాలకు  పట్టాదారుని  వారి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. స్థల యజమానులకు న్యాయం చేయాల్సి అధికారులు అక్రమార్కులకు వంతపాడుతున్నారు.  ఇదే విషయాన్ని స్థల యజమానులు ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే... అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేస్తే మాత్రం సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఈదులనాగులపల్లిలోని సర్వేనంబర్‌ 135లో ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. నిజానిజాలేంటో తేలుతాయి. మరి అధికారులు మాత్రం అందుకు పూనుకోవడం లేదు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థల యజమానులు కోరుతున్నారు.

 

హైదరాబాద్ లో రియల్టర్‌ కిడ్నాప్‌

హైదరాబాద్‌ : నగరంలో కిడ్నాప్‌ కలకలం రేపింది. వనస్థలిపురంలో రియల్టర్‌ అనంతయ్యను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. కారులో నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేశారు. అనంతయ్య తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అనంతయ్య దేవరకొండ సర్పంచ్‌గా పని చేశారు. 

వానపల్లి వీఆర్వో అదృశ్యం

తూర్పు గోదావరి : జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి వీఆర్వో బండారు సత్యనారాయణ అదృశ్యమయ్యాడు. గత కొంతకాలంగా తహశీల్దార్‌ వేధింపులు ఎక్కువ అయ్యాయని.. తనకు సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 9 డిమాండ్లతో కలెక్టర్‌, వీఆర్వోకు సూసైడ్‌ లేఖ రాశాడు. అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

17:25 - January 20, 2018

హైదరాబాద్‌ : నగరంలో కిడ్నాప్‌ కలకలం రేపింది. వనస్థలిపురంలో రియల్టర్‌ అనంతయ్యను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. కారులో నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేశారు. అనంతయ్య తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అనంతయ్య దేవరకొండ సర్పంచ్‌గా పని చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:01 - January 20, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి వీఆర్వో బండారు సత్యనారాయణ అదృశ్యమయ్యాడు. గత కొంతకాలంగా తహశీల్దార్‌ వేధింపులు ఎక్కువ అయ్యాయని.. తనకు సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 9 డిమాండ్లతో కలెక్టర్‌, వీఆర్వోకు సూసైడ్‌ లేఖ రాశాడు. అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మేడ్చల్ లో శాడిస్ట్ భర్త...

మేడ్చల్ : జిల్లాలో ఓ భర్త కట్టుకున్న భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. గతంలో తనపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిందనే కోపంతో... భార్యకు దెయ్యం పట్టిందని గ్రామస్తులను నమ్మించాడు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుందని ఓ మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లి దారుణంగా ఒంటినిండా వాతలు పెట్టించాడు.

13:33 - January 20, 2018

చెన్నై : సన్ టీవీ కార్యాలయం ముందు హీరో సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు. హిరో కించపరిచే విధంగా సన్ టీవీ ప్రసారమైన షో పై చానల్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణాలు తెలపాలని వారు డిమాండి.  సన్ మ్యూజిక్ చానల్ లో యాంకర్లు అబితాబ్ హైట్ ఎక్కడా సూర్య హైట్ ఎక్కడా సూర్య ఇప్పటికే అనుష్క నటించినప్పుడు హై హిల్స్ షూ వేసుకున్నారని కామెంట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:28 - January 20, 2018

మేడ్చల్ : జిల్లాలో ఓ భర్త కట్టుకున్న భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. గతంలో తనపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిందనే కోపంతో... భార్యకు దెయ్యం పట్టిందని గ్రామస్తులను నమ్మించాడు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుందని ఓ మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లి దారుణంగా ఒంటినిండా వాతలు పెట్టించాడు. దీంతో ఆమె భర్తపై శామీర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదుచేసింది. పోలీసులు భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:26 - January 20, 2018

హైదరాబాద్ : వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సులో నుంచి కిందపడి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందింది. డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో బస్సు డోర్‌ వద్ద సీట్లో కూర్చున్న అంజలి బస్సులో నుండి కిందపడింది. చిన్నారిపై నుండి బస్సు పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అంజలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బస్సులో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడమే ప్రమాదానికి కారణమని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

13:25 - January 20, 2018

చిత్తూరు : తిరుపతిలో నకిలీ డాక్టర్‌ హల్‌ చల్‌ చేశాడు. డాక్టర్‌ పేరు చెప్పి గోపి మాధవి ఆస్పత్రిలో ప్రవేశించాడు. ఆస్పత్రిలోని ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించి ఉడాయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:24 - January 20, 2018

కరీంనగర్ : జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్ నరసింహన్ పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నేపల్లి పంప్‌హౌజ్‌ను గవర్నర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పిల్లర్ల పనితీరును, మేడిగడ్డ ఆనకట్టను నరసింహన్ పరిశీలించారు. ప్రాజెక్టు పనితీరును మంత్రి హరీష్‌రావు...గవర్నర్‌కు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, మూడు షిఫ్టుల్లో సిబ్బంది పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

13:21 - January 20, 2018
13:11 - January 20, 2018

కొనసాగుతున్న గవర్నర్ పర్యటన

కరీంనగర్ : కాళేశ్వరంలో గవర్నర్ పర్యటన కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గవర్నర్ కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శించారు. ప్రాజెక్టు వివరాలకు మంత్రి హరీష్ రావు గవర్నర్ కు వివరించారు. 

అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ భేటీ

కృష్ణా : విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం జరుగుతోంది. వైసీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల  సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో బొత్స, పార్థసాథి, అప్పిరెడ్డి, జోగి రమేష్  పాల్గొన్నారు. 

12:21 - January 20, 2018
12:20 - January 20, 2018

సంగారెడ్డి : మీరు చూస్తున్న ఈ ప్రాంతం అమీన్‌పూర్‌ మండలంలోని శెట్టికుంటలోనిది. మిషన్‌ కాకతీయ కింద శెట్టికుంటలో పనులు చేపట్టారు. పూడికతీత పనులు ఒకవైపు కొనసాగుతుండగానే... మరోవైపు భూబకాసురులు అక్రమాలకు తెరతీశారు. శెట్టికుంటను పూర్తిగా ఆక్రమించుకున్నారు. అనంతరం దాంట్లో రాత్రికి రాత్రే వెంచర్‌ వేశారు. ఆతర్వాత వాటిని ఫ్లాట్లుగా చేసి విక్రయించారు. కోట్లకు కోట్లు గడించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. శెట్టికుంట ఆక్రమణకుగురైందన్న సమాచారంతో అధికారులు ఆలస్యంగా మేలుకొన్నారు. వెంచర్‌ ఎఫ్‌టీఎల్‌లో ఉందని నిర్దారించి ఏడాది క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ఆతర్వాత పనైపోయిందని చేతులు దులుపుకున్నారు. కొన్నాళ్లు గడిచింది. అధికారులు ఆ విషయం మరచిపోయారు. ఇదే అదనుగా భావించిన కబ్జారాయుళ్లు మళ్లీ అక్రమదందాకు తెరతీశారు. మరికొన్ని వెంచర్లు వేశారు. అమాయకులైన ప్రజలకు విక్రయించి మళ్లీ సొమ్ము చేసుకున్నారు. ఈ అక్రమ వెంచర్లలో నిర్మాణాలు యధేచ్చగా సాగిపోతున్నాయి. సుమారు 60గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

కోర్టును ఆశ్రయించారు....
అక్రమ నిర్మాణాలపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం స్టేటస్‌ కో ఇచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్మాణాలు జరుపుతున్నారు. పటాన్‌చెరు పట్టణాన్ని ఆనుకుని ఉన్న శెట్టికుంటలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు చూడీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. శెట్టికుంట ఆక్రమణపై స్థానిక సీపీఎం నాయకులు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు భారీగా జరుగుతున్నా నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. గతంలో సంగారెడ్డి జేసీగా పనిచేసిన వెంకట్రామిరెడ్డి శెట్టికుంటలో జరిగే నిర్మాణాలు అన్నీ పూర్తిగా అక్రమమైనవేనని తేల్చారు. నిర్మించిన ఇళ్లను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరి తర్వాత వచ్చిన అధికారులు ఎందుకు నిర్మాణాలపై మౌనంగా ఉన్నారన్నదే అసలు ప్రశ్న. ఇదే విషయంపై మియాపూర్‌ తహసీల్దార్‌ను టెన్‌టీవీ వివరణ కోరగా.. శెట్టికుంట పూర్తిగా వాటర్‌ బాడీనేనని, ఎప్పటికైనా కోర్టు తమకే అనుకూలంగా తీర్పునిస్తుందని చెబుతున్నారు.

అధికారపార్టీ నేతల అండదండలు
కబ్జారాయుళ్లకు అధికారులు, అధికారపార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. వారి అండతోనే కనిపించిన చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, ప్రజలకు ఉపయోగపడే చెరువులు, కుంటలను కబ్జారాయుళ్లు మాయం చేస్తుంటే అధికారులు మౌనం వహిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చెరువులు, కుంటలు కబ్జాకాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

12:18 - January 20, 2018

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో నూతన ఈవో ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మ చెంత తాంత్రిక పూజల వ్యవహారం వివాదాలకు దారితీయడంతో ఈవో సూర్యకుమారిపై బదిలీవేటు వేశారు. అయితే ఈ స్థానంలో మళ్లీ ఐఎఎస్‌ను నియమిస్తారా లేదా దేవాదాయ శాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆలయంలో కొన్నేళ్ల నుండి ఈవోగా పనిచేసేవారు వివాదాస్పదంగామారడం, ఆలయంలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక నుండి ఈవోల వ్యవహారంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని చూస్తోంది.

దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్‌గా అనురాధ
ప్రస్తుతం దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్‌గా ఉన్న వైవీ అనురాధ దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు. మరి కొన్ని రోజుల్లో ప్రభుత్వం కొత్త ఈవోను నియమించాల్సి ఉంది. అయితే దేవస్థానానికి చెందిన కొంత మంది అధికారులు, అర్చకులు తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈవోగా నియమించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దుర్గగుడిలో దీర్ఘకాలంగా పని చేసిన ఏఈవో, సూపరింటెండెంట్లు, గుమస్తాలను మొత్తం 23 మందికి పైగా సిబ్బందిని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. వీరిలో కొంత మంది తమ పలుకుబడితో తిరిగి ఆలయానికి వచ్చేందుకు చక్రం తిప్పుతున్నారు. వీరందరూ కలసి సింహాచలం ఈవోగా ఉన్న రామచంద్రమోహన్‌ను దుర్గగుడికి ఈవో నియమించాలని పైస్థాయిలో పట్టుబడుతున్నారని ఆలయంలో చర్చ జరుగుతోంది.

ద్వారకా తిరుమల ఆలయ ఈవో త్రినాథరావు
ఓ వైపు దుర్గగుడి ఈవోగా పలువురి పేర్లు వినబడుతున్నాయి. ముంబయికి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ, ద్వారకా తిరుమల ఆలయ ఈవో త్రినాథరావును తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుర్గగుడిలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంతకు ముందు దుర్గగుడిలో ఈవోగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న ఈవోల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు, రాజకీయాల్లేకుండా పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోనుంది. ఆలయ ఈవో నియామకంపై తుది నిర్ణయం సీఎం చంద్రబాబుదే కాబట్టి దేవాదాయ శాఖ చైర్మన్‌తో పాటు దేవాదాయశాఖ మంత్రి, ఆలయ అధికారులతో సీఎం సంప్రదింపులు జరపనున్నారు. 

సన్ టీవీ కార్యాలయాన్ని ముట్టడించిన సూర్య అభిమానులు

చెన్నై : సన్ టీవీ కార్యాలయాన్ని హీరో సూర్యు అభిమానులు ముట్టడించారు. సూర్యను కించపరుస్తూ సన్ మ్యూజిక్ లో వచ్చిన కార్యక్రమంపై నిర్వహకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వారితో పోలీసులు చర్చించి అక్కడి నుంచి పంపించారు. 

11:37 - January 20, 2018

తూర్పుగోదావరి : పోలవరం పనులను మరో సబ్‌ కాంట్రాక్ట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పనులు చేసిన ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ గడువులోగా పనులు చేయకపోవడంతో ఈ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో.. కొత్తగా పోలవరం సబ్‌ కాంట్రాక్టర్‌గా.. పనులు చేపట్టేందుకు.. నవయుగ సంస్థ ముందుకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. పాత ధరలకే కాంక్రీట్‌ పనులు చేస్తామంటూ నవయుగ సంస్థ ముందుకొచ్చిందంటున్నారు. జనవరి నెలాఖరు కల్లా పోలవరంలో పనులు చేపట్టేందుకు పూర్తిస్థాయి ప్రక్రియను పూర్తిచేసుకుని.. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలని ఈ సంస్థ చూస్తోందని సమాచారం. ఏపీ జెన్‌కో విద్యుత్‌ కేంద్రం పనులను సైతం నవయుగ సంస్థే దక్కించుకుంది. దీంతో జల విద్యుత్‌ పనుల్లో భాగంగా మట్టి పనులను కూడా ఈ సంస్థకే అప్పగించేందుకు జలవనరుల శాఖ సిద్ధమయ్యింది. ప్రభుత్వం ప్రకటించిన టెండర్లు జనవరి 18తో ముగియడంతో.. టెండర్ల ప్రక్రియను మరో వారం వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నవయుగ కంపెనీ పాత ధరలతో పనులు చేపట్టేందుకు లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపితే.. పనులు అప్పగించనున్నారు.

జీవో నెంబర్ 22, 63లను వర్తింపచేయాలని
మరోవైపు పాత ధరలకే కాంట్రాక్ట్‌ అప్పగించే యోచనతో.. జీవో నెంబర్ 22, 63లను వర్తింపచేయాలని ప్రభుత్వం చూస్తోంది. ధరల సర్దుబాటు కింద అదనపు నిధులను కట్టబెట్టి కమీషన్లు అందుకోవాలన్నదే దీని ఎత్తుగడ అని పోలవరం జలాశయంలో 60సీ నిబంధన కింద కొంతభాగం పనులను విడదీస్తూ... రాష్ట్ర ప్రభుత్వం.. రూ.1483.22 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా..పీపీఏ అనుమతి లేకుండా జారీ చేశారని.. టెండర్‌ను నిలిపేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ లేఖ పంపింది. పాత కాంట్రాక్టర్‌కు నెల రోజుల గడువు ఇవ్వాలని.. నిర్దేశించిన మేరకు పనులు చేస్తే అదే కాంట్రాక్టర్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో కొత్త టెండర్‌ అంశాన్ని పరిశీలిస్తామని గత సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర సర్కార్‌ టెండర్‌ షెడ్యూల్‌ను పొడిగించింది. గడువు సమయం ముగిసినా పాత కాంట్రాక్టర్‌ తీరులో మార్పు రాలేదని.. దీంతో కొత్త టెండర్‌కు అనుమతి ఇవ్వాలని.. 2018 జనవరి 4న రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. పీపీఏ సమావేశంలో కొత్త టెండర్‌పై నిర్ణయంపై ఆచితూచి వ్యవహారించాలని దిశానిర్దేశం చేశారు.

60-సి నిబంధన కింద..
కేంద్రం సూచనల మేరకు 2018 జనవరి 11న నిర్వహించిన పీపీఏ సమావేశంలోనూ టెండర్లపై అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 60-సి నిబంధన కింద విడదీసి పిలిచిన పనుల వాస్తవ విలువ 2010-11 ధరల ప్రకారం రూ.11వందల 96 కోట్లని.. వాటి విలువను రూ.14వందల 83కోట్లకు పెంచి టెండర్లు పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు వందల ఎనభై ఏడు కోట్ల అదనపు భారాన్ని ఎవరు భరిస్తారని పీపీఏ సీఈవో సౌమిత్రి హల్దర్‌ నిలదీశారు. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.ఇదిలా ఉండగా, 2018 వరకు పోలవరాన్ని పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. అనుకున్న సమయానికి పోలవరం పూర్తవ్వడం సాధ్యపడదని గతంలోనే నిపుణుల కమిటీ సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరాన్ని 2019 కల్లా పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ప్రారంభం

గుంటూరు : చంద్రబాబు అధ్యక్షతను టీడీపీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి కార్యక్రమం జరిగిన తీరు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:09 - January 20, 2018

గుంటూరు : చంద్రబాబు అధ్యక్షతను టీడీపీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి కార్యక్రమం జరిగిన తీరు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

హైదరాబాద్ : వనస్థలిపురంలో దారుణం జరిగింది. స్కూల్ బస్సు కిందపడి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందింది. డ్రైవర్ సడన్ బ్రెక్ వేయడంతో అంజలి బస్సు నుంచి కింద పడి చనిపోయింది. బస్సులో క్లీనర్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 

11:05 - January 20, 2018

కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

కర్నూలు : జిల్లా లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. షాపులోని సామాగ్రి అంతా కాలి బూడిదయ్యింది. సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది మంటలార్పివేసింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటల్లో ఏసీబీ దాడులు

 

హైదరాబాద్ : ఇరిగేషన్‌శాఖ డిప్యూటీ ఇంజనీర్‌ శ్రవణ్‌కుమార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సుచిత్రలోని ఆయన నివాసంతో పాటు మరో 6 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఆత్మహత్య చేసుకుంటానని రైతు సెల్ఫీ వీడియో

గుంటూరు : అధికారుల తీరుతో విసిగిపోయిన రాజా అనే రైతు ఈ నెల 22న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. అప్పుల తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు సిద్దమైనట్లు రాజా తెలిపారు. అధికారులు పాస్ బుక్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించాడు.

10:53 - January 20, 2018

కర్నూలు : జిల్లా లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. షాపులోని సామాగ్రి అంతా కాలి బూడిదయ్యింది. సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది మంటలార్పివేసింది. ఈ

10:52 - January 20, 2018

కృష్ణా : సీపీఎమ్‌ కృష్ణా జిల్లా తూర్పు ప్రథమ మహా సభలు గుడివాడలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీఎమ్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:49 - January 20, 2018

హైదరాబాద్ :  ఇరిగేషన్‌శాఖ డిప్యూటీ ఇంజనీర్‌ శ్రవణ్‌కుమార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సుచిత్రలోని ఆయన నివాసంతో పాటు మరో 6 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

10:47 - January 20, 2018

గుంటూరు : చంద్రబాబు దూరదృష్టితో పనిచేయడం వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ చేసిన వ్యాఖ్యలతోపాటు.... విభజన హామీలపై కోర్టుకెళతామంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. రాబోయే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ అంటే ఏంటో తెలుస్తుందని సోమిరెడ్డి అన్నారు. 

10:45 - January 20, 2018

హైదరాబాద్ : వనస్థలిపురంలో దారుణం జరిగింది. స్కూల్ బస్సు కిందపడి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందింది. డ్రైవర్ సడన్ బ్రెక్ వేయడంతో అంజలి బస్సు నుంచి కింద పడి చనిపోయింది. బస్సులో క్లీనర్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:44 - January 20, 2018

గుంటూరు : అధికారుల తీరుతో విసిగిపోయిన రాజా అనే రైతు ఈ నెల 22న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. అప్పుల తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు సిద్దమైనట్లు రాజా తెలిపారు. అధికారులు పాస్ బుక్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించాడు. తన చనిపోతే చంద్రన్న బీమా కింద వచ్చే రూ.5లక్షల తన కుటుంబానికి ఇవ్వాలని రాజా కోరాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : కాసేపట్లో టిడీపీ సమన్వయ భేటీ జరగనుంది. ఉదయం 10గంటలకు చంద్రబాబు అధ్యక్షతను టీడీపీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి కార్యక్రమం జరిగిన తీరు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

09:10 - January 20, 2018

గుంటూరు : కాసేపట్లో టిడీపీ సమన్వయ భేటీ జరగనుంది. ఉదయం 10గంటలకు చంద్రబాబు అధ్యక్షతను టీడీపీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి కార్యక్రమం జరిగిన తీరు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కర్నూలులో కల్తీ పెట్రోలు

కర్నూలు : జిల్లాలోని పెట్రోల్ బంకులో మోసం వెలుగు చూసింది. బంకు యాజమానులు పెట్రోల్ లో కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూర్ లోని నాగిరెడ్డి పెట్రోల్ బంకులో పెట్రోలులో నీళ్లు కలిపినట్లు వినియోగదారుడు గమనించడంతో ఆయన స్థానికులతో కలిసి పెట్రోల్ బంకు యాజమానిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

09:03 - January 20, 2018

గుంటూరు లో అగ్ని ప్రమాదం

గుంటూరు : జిల్లా తెనాలిలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో టింబర్ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనస్థలానికి చేరుకు ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వటిల్లిందని తెలుస్తోంది.

08:26 - January 20, 2018

కర్నూలు : జిల్లాలోని పెట్రోల్ బంకులో మోసం వెలుగు చూసింది. బంకు యాజమానులు పెట్రోల్ లో కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూర్ లోని నాగిరెడ్డి పెట్రోల్ బంకులో పెట్రోలులో నీళ్లు కలిపినట్లు వినియోగదారుడు గమనించడంతో ఆయన స్థానికులతో కలిసి పెట్రోల్ బంకు యాజమానిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:25 - January 20, 2018

గుంటూరు : జిల్లా తెనాలిలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో టింబర్ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనస్థలానికి చేరుకు ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వటిల్లిందని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

గచ్చిబౌలి స్టేడియంలో షీ వాక్

హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియం వద్ద షీ వాక్ ను పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషన్ హరిచందన, ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, సీపీ సతీమణి సోనిక శాండిల్యా పాల్గొన్నారు. 

నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, జన్మభూమి మా ఊరు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

07:42 - January 20, 2018

ఆస్ట్రేలియా : అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.పృద్వీ షా సారధ్యంలోని భారత జట్టు గ్రూప్‌ దశను ఓటమంటూ లేకుండా హ్యాట్రిక్‌ విజయాలతో ముగించింది. తొలి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ,పాపువా న్యూ గినియా జట్లపై సునాయాస విజయాలు సాధించిన భారత్‌... 3వ గ్రూప్‌ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. గ్రూప్‌-బీ పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన సూపర్‌ లీగ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది.

జింబాబ్వే జట్టు 48.1 ఓవర్లలో 154 పరుగులకే
మౌంట్‌ మాంగ్నాయుయీ బే ఓవల్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారీ స్కోర్‌ నమోదు చేయలేకపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో జింబాబ్వే జట్టు 48.1 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది.అనుకుల్‌ రాయ్‌ 4 వికెట్లు పడగొట్టి జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా
155 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 21.4 ఓవర్లలోనే చేధించింది.ఓపెనర్లు శుభమ్‌ గిల్‌,హార్విక్‌ దెశాయ్‌ హాఫ్‌ సెంచరీలు సాధించిన భారత జట్టుకు సునాయాస విజయాన్నందించారు. 90 పరుగులతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శుభమ్‌ గిల్‌కు మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్ దక్కింది.ఈ విజయంతో భారత్‌ ఓటమంటూ లేకుండా గ్రూప్‌ దశను ముగించింది.ఈ టోర్నీలో అసలే మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు నాకౌట్‌ రౌండ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే....మరో సారి అండర్‌-19 వరల్డ్‌ కప్ సొంతం చేసుకోవడం ఖాయం.

07:41 - January 20, 2018

చెన్నై : సీఎస్కే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని క్రికెటర్ ధోని అన్నారు. చెన్నైలో సీఎస్కే టీం గురించి పలు విషయాలు మాట్లాడిన ధోని రజనీకాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీని ఒకసారి కలిశానని.. ఇప్పుడు మళ్లీ కలవాలనే ఆశ బలంగా ఉందని ధోనీ అన్నారు. సమయం దొరికినపుడు రజనీకాంత్‌ను తప్పకుండా కలుస్తానని ధోనీ చెప్పారు. 

07:40 - January 20, 2018

వాషింగ్టన్ : ముంబై దాడుల మాస్టర్‌ మైండ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ విచారణ జరపాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. హఫీజ్‌ను తాము ఉగ్రవాదిగానే చూస్తామని యుఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి హీథర్‌ నోర్ట్‌ తెలిపారు. 2008లో జరిగిన ముంబై దాడుల్లో హఫీజ్‌ హస్తం ఉందని...ఈ దాడిలో అమెరికన్లతో పాటు చాలామంది చనిపోయారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది జాబితాలో హఫీజ్ ఉన్నాడని, అతన్ని చట్టం ప్రకారమే విచారించాలని అమెరికా పాకిస్తాన్‌కు సూచించింది. హఫీజ్‌పై పాకిస్తాన్‌లో కేసులే లేవని, అతన్ని విచారించలేమని పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించడం గమనార్హం. 

07:39 - January 20, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘన వరుసగా రెండోరోజుకూడా కొనసాగింది. ఆర్నియా, ఆర్‌ఎస్‌ పురా, రామ్‌గఢ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. పాక్‌ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా... మరో ముగ్గురు గాయపడ్డారు. సరిహద్దు గ్రామాలను టార్గెట్‌ చేసుకుని పాక్‌ కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌ కాల్పులను భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. 3 సెక్టార్లలోని పాకిస్తాన్‌ ఔట్‌పోస్టులు లక్ష్యంగా భారత్‌ కాల్పులు జరుపుతోంది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న కాల్పులతో సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పాక్‌ రేంజర్లు శుక్రవారం జరిపిన కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌ జవానుతో పాటు 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. 

07:37 - January 20, 2018

ఢిల్లీ : లాభదాయకమైన పదవులకు సంబంధించిన వ్యవహారంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్‌ షాకిచ్చింది. 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను ఈసీ అనర్హులుగా పేర్కొంది. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. వీరు రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని నివేదికను పంపింది.ఒకవేళ ఈసీ సిఫారసును రాష్ట్రపతి గనక ఆమోదం తెలిపితే ఢిల్లీలోని 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ఆప్‌కు 46 మంది ఎమ్మెల్యేలుంటారు కనక...కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదు.

సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్‌ నిర్ణయిం
ఈసీ నిర్ణయాన్ని ఛాలేంజ్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్‌ నిర్ణయించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు తమ వాదన వినిపించే అవకాశం ఈసీ ఇవ్వలేదని ఆరోపించింది. ఎమ్మెల్యేలు ప్రభుత్వ కారు, బంగళా వంటి అధికారిక సదుపాయాలు ఏవీ ఉపయోగించుకోలేదని ఆప్‌ స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపిలు స్వాగతించాయి. కేజ్రీవాల్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. కేజ్రీవాల్‌ మంత్రులంతా అవినీతి పరులేనని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ 2015లో 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడం ద్వారా వారికి కాబినెట్‌ హోదా కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవులు చేపట్టారని, వారిపై అనర్హత వేటు వేయాలని బిజెపి ఈసీకి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. దీంతో అనర్హత వేటును తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన సవరణ బిల్లును అప్పట్లో రాష్ట్రపతి తిరస్కరించి ఎన్నికల సంఘానికి నివేదించారు. 2016లో ఈసీ 21 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చింది. దీనికి వారు వివరణ కూడా ఇచ్చారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జర్నైల్‌ సింగ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 20 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. 

07:36 - January 20, 2018

మెదక్ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలోని వెంకటకాజా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో టెన్‌ టీవీ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ర్ట కార్యదర్శి బిక్షపతి, అల్లదుర్గం మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, పోతులగూడ ఎంపీటీసీ చంటి హృదయ కిరణ్, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

07:35 - January 20, 2018

ప్రకాశం/నెల్లూరు : ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయితీలో అగ్రవర్ణాలు దళితులను గ్రామంలోకి అడుగుపెట్టనివ్వడంలేదు.గ్రామంలో బొడ్డురాయిని ఏర్పాటు చేసినందుకు తమను గ్రామంలోకి అనుమతించడంలేదని దళితులంటున్నారు. స్కూలుకు కూడా వెళ్లకనీయకుండా పిల్లలను అగ్రవర్ణాల వాళ్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. అటు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తీపనూరులో కుల వివక్ష రాజుకుంది. దళితులపై అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయిస్తుండటంతో దళితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తీపనూరులో 25 దళిత కుటుంబాలు, 150 అగ్ర వర్ణాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అగ్రకులస్తులు అడ్డుపడ్డారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దళితులపై దాడి చేశారు. దీంతో దళితులు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 30న ఆలయ ప్రవేశం కల్పిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చినట్లు సమాచారం. 

07:34 - January 20, 2018

కృష్ణా : ఏపీ ఏసీబీ అధికారులు వేగం పెంచారు. అవితినీతి చేపలు, జలగలు, తిమింగలాను వరుసగా పట్టుకుంటున్నారు. అన్ని స్థాయిల్లో అవినీతిని కూకటివేళ్లతో పెకలించేందుకు సోదాలు, దాడులు విస్తృతం చేస్తున్నారు. ఏసీబీ దాడులతో అక్రమార్కులు హడిలిపోతున్నారు. ప్రజలను జలగల్లాపటుకుని పీడించి సంపాదించిన అవినీతి సొమ్ముతో కట్టిన మేడలు, కొనుగోలు చేసిన కార్లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటూ అక్రమార్కులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ పరిపాలనాధికారులు, కార్యదర్శలు వంటి చిన్న చేపలను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఇప్పుడు పెద్ద చేపలపై గురిపెట్టారు. కృష్ణా జిల్లాలో గత ఏడాది పట్టుబడ్డ 15 కేసుల్లో 13 లంచం కేసులు. మిగిలిన రెండూ ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు.

16 కోట్ల రూపాయలు...
విజయవాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ అధికారి ఇంట్లో ఆదాయానికి మించి 16 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పొలం నుంచి హెచ్‌టీ విద్యుత్‌ స్తంభం తొలగించేందుకు ఒక రైతు నుంచి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వరప్రసాద్‌ రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. విజయవాడ నగర పాలక సంస్థలో 18 లక్షల రూపాయల బిల్లు చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ నుంచి లక్ష లంచం తీసుకుంటూ ముఖ్య గణాంకాధికారి శివశంకర్‌ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. తూర్పుగోదారి జిల్లాలోని ఓ ఆలయ ఈవో చీమలకొండ సాయి లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. అక్రమార్కుల ఆస్తుల స్వాధీనానికి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు దాడులు విస్తృతంచేసి... అవినీతిపరులు ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలను కూడా చైతన్యం చేస్తోంది. 

07:33 - January 20, 2018

హైదరాబాద్ : మూలిగే న‌క్కపై తాటి పండు పడినట్టైంది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి. నేతల వ‌ల‌స‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సైకిల్‌పార్టీకి సీనియర్‌ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు వ్యాఖ్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని సమాయత్తం చేయాలన్న దృష్టితో ఓవైపు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టిన తరుణంలో.. మోత్కుప‌ల్లి కామెంట్లు కలవరం కలిగిస్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు తెలుగుదేశంపార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్నివ్యక్తం చేసిన మోత్కుప‌ల్లి.. తాజాగా విలీనం అంశాన్ని లేవ‌నెత్తడం వెనుక రాజకీయ ఎజెండాను ఉందని తెలుగుత‌మ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ..
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ.. మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేర‌కు గ‌వ‌ర్నర్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించిన మోత్కుపల్లికి ఆశాభంగం ఎదురయిందని.. దీంతో అవకాశం వచ్చినపుడల్లా తన అక్కసును ఇలా వెళ్లగక్కుతున్నారని సైకిల్‌పార్టీలో చెప్పుకుంటున్నారు. దీనికి తోడు వరుసగా నేతలు వసలబాట పట్టడంతో.. ఇక తెలంగాణలో టీడీపీ కోలుకునే అవకాశం లేదని మోత్కుపల్లి భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఎన్నికల వరకు వేచి చూడకుండా తన దారి తాను చూసుకోవాలనే ఈయన ఇలాంటి స్టాండ్‌ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. గులాబి పార్టీతో ఒప్పందంలో భాగంగానే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశార‌ని టీ-టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. టీ-టీడీపీని టీఆర్‌ఎస్‌లోకలిపేయాలన్న వ్యాఖ్యలను గులాబీపార్టీ నేతలు కూడా స్వాగతించడం.. దీనికి నిదర్శనం అంటున్నారు.

కామెంట్ల వెనుక గులాబీబాస్‌ వ్యూహం
మోత్కుపల్లి కామెంట్ల వెనుక గులాబీబాస్‌ వ్యూహం ఉన్నట్టు టీ-టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ దూకుడును అడ్డకునేందుకే మోత్కుపల్లిని తెరమీదకు తెస్తున్నారనే వాదన వినిపిస్తోంది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున మోత్కుపల్లికి ఛాన్స్‌ ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఒక వేళ రాజ్యసభకు అవకాశం రాకున్నా.. ప్రభుత్వంలో కీలక పాత్రపోషించే అవకాశం ఉందని అటు గులాబీపార్టీలో కూడా చెప్పుకోవడం కొసమెరుపు. మొత్తానికి గులాబీబాస్‌ వ్యూహంలో భాగంగానే టీ-టీడీపీలో తాజా తుఫాన్‌ లేచిందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. 

07:32 - January 20, 2018

గుంటూరు : పదిరోజుల పాటు కొనసాగిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జన్మభూమి కార్యక్రమం నిర్ణహణలో అధికారుల పనితీరు తనకు ఆనందం కలిగించిందన్నారు. రాష్ట్రంలో రియల్‌టైం గవర్నరెన్స్‌తో ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరిస్తున్నామన్నారు చంద్రబాబు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అయ్యారని కితాబునిచ్చారు. రియల్‌టైటం గవర్నెన్స్‌, ఈ ప్రగతి , సాధికార సర్వే, పరిష్కార వేదిక.. కార్యక్రమం ఏదైనా ' ప్రజలే ముందు' అనే కాన్సెప్ట్‌తోపనిచేస్తున్నామన్నారు. మొత్తం 16వేల గ్రామాలకు వెళ్లిన నోడల్‌ అధికారులు.. 9 మస్యలపైనా సమీక్షలు చేసి.. పరిష్కారానికి కృషిచేశారన్నారు. జన్మభూమి దరఖాస్తులను రాజకీయాలతో సంబంధం ఏప్రిల్‌ 1 నుంచి పరిష్కరిస్తామన్నారు.

మూడు నెలల్లోనే సమస్య పరిష్కారం
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మంచి ప్రగతి సాధిస్తుంద్నారు. ఈ ఖరీఫ్‌సీజన్‌లో వర్షపాతం 13.5శాతం తక్కువగా పంట దగుబడిలో మంచి ప్రగతి సాధించామన్నారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతతో ఉందన్న చంద్రబాబు.. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సమస్యను పరిష్కరించామన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ కష్టాలను అధిగమించామని, భవిష్యత్తులో కరంటుబిల్లులు పెంచేయోచన లేదన్న ముఖ్యమంత్రి.. అవసరమైతే విద్యుత్‌బిల్లులు తగ్గిస్తామన్నారు.

ప్రజలను ప్రభుత్వ అతిథులు
జన్మభూమి సభల్లో సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన ప్రజలను ప్రభుత్వ అతిథులుగా చూస్తూ.. సమస్యల పరిష్కారానికి కృషిచేశారని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. చీఫ్‌ సెక్రెటరీ నుంచి గ్రామస్థాయిలో వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శివరకు అందరూ బాగా పనిచేశారని ప్రశంశించారు. 10రోజుల పాటు జరిగిన జన్మభూమి -మావూరు కార్యక్రమంలో సమస్యలు సత్వరం పరిష్కారం కావడంతో 63శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో సాధించబోయే స్వర్ణాంధ్రప్రదేశ్‌కు అధికారులు తమ పనితీరుతో పునాధులు వేశారని ప్రశంశించారు. 

07:31 - January 20, 2018

హైదరాబాద్/కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్‌ నరసింహన్‌ ఇవాళ పరిశీలిస్తారు. ఉదయం 7.45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి బయలు దేరుతారు. ఉదయం 8.30 నిమిషాలకు కాళేశ్వరం ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 8.30 నుంచి ఉదయం 9 వరకు కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శిస్తారు.

తిరిగి హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు
ఉదయం 9.30 నుంచి 10 వరకు కన్నెపల్లి పంప్ హౌజ్‌ను సందర్శించి అక్కడ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. తర్వాత 10.30 నుంచి 11 వరకు అన్నారం బ్యారేజీని పరిశీలించిన తర్వాత సుందిళ్ల బ్యారేజ్ సైట్‌కు చేరుకుంటారు. ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 12 వరకు సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్ హౌజ్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 కు శాయంపేటలోని ప్యాకేజీ 6 పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.45కి లక్ష్మిపూర్ గ్రామంలోని ప్యాకేజీ 8ను సందర్శిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు లక్ష్మిపూర్ గ్రామంలోని ప్యాకేజీ 8 దగ్గర ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. తిరిగి హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు పయనమవుతారు. గవర్నర్‌ పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 

నేడు అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ సమ్మిట్

ఢిల్లీ : నేడు విజ్ఞాన్ భవన్ లో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ సమ్మిట్ జరగనుంది. ఇందులో ఇన్నోవేషన్ అవార్డును ఏపీ మంత్రి లోకేష్ అందుకోనున్నారు. 

07:19 - January 20, 2018

చట్టప్రకారం చూస్తే ఆఫీస్ ఆఫ్ ప్రపార్టీ అనేది తప్పు కిందనే వస్తుందని, అయితే తమ వాదానలు వినాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని, ఆప్ ఎమ్మెల్యేలు ఇంతర వరకు ఎటువంటి బెనిఫిట్ రాలేదని వారు చెబుతున్నారని ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్ అన్నారు. ఈసీ పై రాజకీయా ఒత్తిడిలు ఉన్నాయని ఆయన తెలిపారు. బీజేపీ ముందు అనేక అశంలు ఉన్నాయని, చాలా రాష్ట్రాల్లో ఇటువంటి కేసులున్నాయని, అయితే కేజ్రీవాల్ అధికారంలో ఎలా వచ్చారని, వారి పాలన ఏ విధంగా జరుగుతుందో కనబడుతుందని బీజేపీ నేత కుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

నేడు కాళేశ్వరంలో పర్యటించినున్న గవర్నర్

హైదరాబాద్ : నేడు రాష్ట్ర గవర్నర్ నరసింహన్  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం 8.30 ఆయన కాళేశ్వరం చేరుకోనున్నారు. 

Don't Miss