Activities calendar

21 January 2018

చెరువులోపడి అక్కాచెల్లెళ్లు మృతి

శ్రీకాకుళం : పాతపట్నం మండలం రంకినిలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులోపడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మృతులు వనజాక్షి, స్వాతిగా గుర్తించారు. 

22:05 - January 21, 2018

బీసీ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో 10 టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ కు పరోక్ష ఎన్నికతో అస్థిరత వస్తుందన్నారు. గ్రూప్ రాజకీయాలు పెరుగుతాయని చెప్పారు. ఘర్షణలు తలెత్తుతాయని తెలిపారు. మళ్లీ పట్వారీ వ్యవస్థను తీసుకురావడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. లా ఆండ్ ఆర్డర్ సమస్య వస్తుందన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని భావించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:01 - January 21, 2018
22:00 - January 21, 2018
21:58 - January 21, 2018

ఢిల్లీ : ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో... ఆమెరికాలో పాలన పూర్తిగా స్తంబించిపోయింది. సర్వీసులతో పాటు .. టూరిస్ట్ ప్రాంతాలు కూడా ముతపడ్డాయి. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో న్యూయార్క్ లో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక స్థలం మూగబోయింది. వీకెండ్ కావడంతో అక్కడకు వెళ్లడానికి వచ్చిన వేలాది మంది పర్యాటకులు నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నో నెలల ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్న విదేశీ టూరిస్టులు అమెరికాలో పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

21:57 - January 21, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా ఓం ప్రకాశ్‌ రావత్‌ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 23న సీఈసీగా రావత్‌ బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఉన్న అచల్‌ కుమార్‌ జోతి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో రావత్‌ నియమితులయ్యారు. 64 ఏళ్ల రావత్‌ 1977 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్రంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల కమిషనర్‌గా అశోక్‌ లావాసాను నియమించారు. లావాసా కూడా ఈనెల 23న బాధ్యతలు తీసుకుంటారు. 

 

21:55 - January 21, 2018

ఢిల్లీ : హస్తినలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడింది. ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో ఆప్‌ ఇబ్బందుల్లో పడింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. 
ఇబ్బందుల్లో ఆప్‌ 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఇబ్బందుల్లో పడింది. లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడింది. వీరిలో మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌, మహిళా ఎమ్మెల్యే అల్కా లంబా కూడా ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి 2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాల్లో 65 సీట్లులో ఆప్‌ అభ్యర్థులు నెగ్గారు. వీరిలో 21 మంది ఎమ్మెల్యేలు 2015 మార్చి 13 నుంచి 2016 సెప్టెంబర్‌ 3 వరకు పార్లమెంటరీ కార్యదర్శులుగా పనిచేశారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభదాయక పదవులు చెప్పట్టడంపై అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. లాభదాయక పదవులు అనుభవించిన ఆప్‌ ఎమ్మెల్యేలను అనర్హుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్‌... పార్లమెంటరీ కార్యదర్శి  లాభదాయక పదవి అని, దీనిని చేపట్టిన శాసనసభ్యులను అర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముంద్ర వేశారు. లాభదాయక పదవులు చేపట్టిన 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేల్లో ఇటీవల జర్నైల్‌ సింగ్‌ రాజీనామా  చేశారు.  రాష్ట్రపతి నిర్ణయంతో ఇప్పుడు మరో 20 మంది పదవులు కోల్పోయారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ సంఖ్యాబలం 45కు పడిపోయింది. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడినప్పటికీ ఆప్‌ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. మేజిక్‌ ఫిగర్‌ 36 కేంటే 9 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అనర్హత వేటు పడిన ఆప్‌ ఎమ్మెల్యే స్థానాలకు ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇరవై మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమన్నది ఆప్‌ నేతల వాదన. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. 

 

21:49 - January 21, 2018

హైదరాబాద్ : విభజన చట్టం హామీలు అమలు చేయకపోతే  సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీపీఎం ఏపీ కార్యదర్శి మధు మండిపడ్డారు.  ఓ వైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ ప్రత్యేక హోదా కోసం న్యాయ పోరాటం అంటూ చంద్రబాబు  ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ మోసపూరిత ధోరణిపై చంద్రబాబు తన వైఖరేంటో చెప్పాలని మధు డిమాండ్ చేశారు. విభజన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. 

 

21:47 - January 21, 2018

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కాళేశ్వరం ఎత్తిపోత పథకం సందర్శనలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్‌.. కేసీఆర్‌ను, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశంసించడాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. నరసింహన్‌పై ముప్పేటదాడి ప్రారంభించారు. గవర్నర్‌ టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌గా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భజనపరుడుగా మారారని మండిపడుతున్నారు. గవర్నర్‌ వ్యవహారశైలిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేయాలని టీకాంగ్ నేతలు నిర్ణయించారు. 
గవర్నర్‌ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న కాంగ్రెస్ నేతలు  
శనివారం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సందర్శించిన అనంతరం.. గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలను పరిశీలించకుడా గవర్నర్‌ నరసింహన్‌ ఈ పథకాన్ని ప్రశంసించడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు చేపట్టిన విషయాన్ని నరసింహన్‌ మరచిపోయారంటూ మండిపడుతున్నారు. అప్పట్లో అంబేడ్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల గా చేపట్టిన ఈ ప్రాజెక్టు పేరును సీఎం కేసీఆర్‌ కాళేశ్వరంగా మార్చిన వాస్తావాన్ని గవర్నర్‌ మర్చిపోయారా? అన్ని ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో 10 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో 38 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అంచనా వ్యయం...  కేసీఆర్‌ పాలనలో 81 వేల కోట్లకు పెంచిన అంశాన్ని ప్రస్తావించారు.  ఈ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాల్సిన గవర్నర్‌ కాళేశ్వరం ఎత్తిపోతల  పథకం అద్భుతమని ప్రశంసించడాన్ని తప్పుపడుతున్నారు. 
గవర్నర్‌ కేసీఆర్‌ ఏజెంట్‌ : వీహెచ్  
గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మండిపడ్డారు. కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతిలో నరసింహన్‌కు కూడా భాగం ఉందా ? అని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల నరసింహన్‌కు ఆసక్తి ఉంటే టీఆర్‌ఎస్‌లో చేరి ఎన్నికల్లో పోటీచేయొచ్చని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు. 
రాజ్యాంగేతరశక్తిగా మారిన గవర్నర్‌ : పొన్నం  
గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగేతరశక్తిగా మారారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. వ్యక్తిపూజ ఎక్కువైందని విమర్శించారు. గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌ను టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హస్తం నేతలు ప్రకటించడంతో... ఈ అంశం... ఏ మలుపుతిరుగుతుందో చూడాలి. 

21:41 - January 21, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు నుండి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు మూడు జిల్లాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. 
కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభం  
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజ‌కీయ యాత్రకు రంగం సిద్ధమైంది. సోమవారం నుండి తెలంగాణలోని మూడు జిల్లాల్లో రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం యాత్రను ప్రారంభించనున్నారు. దర్శనానంతరం యాత్ర ఎలా చేయాలనేది వెల్లడిస్తానని తెలిపారు. కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేపడుతున్నట్లు జనసేన వెల్లడించారు. ఈ యాత్రలో పబ్లిక్‌ మీటింగ్‌లు ఉండవని స్పష్టం చేశారు. కేవలం జనసేన కార్యకర్తలను కలిసి.. సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.
స్థానిక ప్రతినిధులతో పవన్ భేటీ 
సోమవారం ఉదయం హైదరాబాద్‌ను నుండి బయలు దేరి 3 గంటల సమయంలో కొండగట్టుకు చేరుకుంటారు పవన్‌. అనంతరం కరీంనగర్‌కు చేరుకొని స్థానిక ప్రతినిధులతో భేటీ కానున్నారు. 23వ తేదీ కరీంనగర్‌ లోని జగిత్యాల రోడ్‌లో ఉన్న శుభం గార్డెన్స్‌లో నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల జనసేన కార్యకర్తలతో పవన్‌ సమావేశమవనున్నారు. అనంతరం కొత్తగూడెం చేరుకోనున్నారు. 24వ తేదీన కొత్తగూడెం నుండి ప్రదర్శన చేస్తూ ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాలోని కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. 
మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి : పవన్  
తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం వల్లే యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు పవన్‌ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్యనేతలతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ నెలాఖరులో పార్టీ సమన్వయ కర్తలు సమావేశం జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మార్చి నెలలో పార్టీ ప్లీనరీని నిర్వహించే అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 
పవన్‌ ఫ్లెక్సీకి అభిమానులు పూజలు 
జనసేన యాత్ర నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పవన్‌ ఫ్లెక్సీకి ఆయన అభిమానులు పూజలు చేశారు. పవన్‌ ప్రారంభించే యాత్ర దిగ్విజయం కావాలని కోరుతూ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాక కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు అభిమానులు తెలిపారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ రాజ‌కీయంగా కొండ‌గ‌ట్టులోకి అడుగు పెట్టబోతున్నారు. అంజన్నను మనస్ఫూర్తిగా ద‌ర్శించుకున్న అనంతరం యాత్ర విశేషాలు తెలపనున్నారు. 

 

రేపటి నుంచి పవన్ కళ్యాణ్ నిరంతర ప్రజాయాత్ర

హైదరాబాద్ : రేపటి నుంచి పవన్ కళ్యాణ్ నిరంతర ప్రజాయాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజల అనంతరం యాత్ర వివరాలు వెల్లడించనున్నారు. 

టీడీపీ, బీజేపీ మధ్య జరిగిన ఘటనపై చంద్రబాబుకు నివేదిక

ప.గో : జిల్లాలో టీడీపీ, బీజేపీ మధ్య జరిగిన ఘటనపై నివేదికను కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు అందజేశారు.

 

20:02 - January 21, 2018

పటాస్ ఫేమ్ సద్దాం, బిందాస్ బ్రదర్స్ తో 10 టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా సద్దాం, బిందాస్ బ్రదర్స్ భాస్కర్, జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తమ తమ కెరీర్ వివరించారు. పటాస్ షోలోకి ఎలా వచ్చారో తెలిపారు. తమ అనుభవాలను చెప్పారు. పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:47 - January 21, 2018

విజయవాడ : అదొక పేరుగాంచిన సిఎస్‌ఐ చర్చి... ఎందరికో ఆశీర్వచనాలు అందించిన పవిత్ర స్థలం... కానీ కొన్ని నెలలుగా వివాదాలకు కేంద్రబింధువుగా మారింది. సిఎస్ఐ చర్చి బిషప్‌ దైవాశీర్వాదం అక్రమాలకు పాల్పడ్డారని ఓవర్గం ఆరోపిస్తోంది. ఆధారాలతో సహా మంగళగిరిలోని డీజీ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేసింది. 
తారాస్థాయికి వివాదాలు  
విజయవాడ గవర్నర్‌పేటలోని చర్చ్ ఆఫ్‌ సౌత్‌ ఇండియా సంఘంలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. సిఎస్ఐ చర్చ్‌ బిషప్‌ గోదాడ దైవాశీర్వాదం సంస్థ ఆస్తులను కబ్జా చేశారంటూ... ఓ వర్గం సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలతో సహా మంగళగిరిలోని డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. 
క్రైస్తవుల మనోభావాలు సీఐడీ దెబ్బతీసింది : బిషప్‌
ఫిర్యాదు అందుకున్న సిఐడి అధికారులు బిషప్‌ను విచారించారు.  కానీ... అధికారులు తన వ్యక్తిగత వివరాలు అడిగారే తప్ప... ఎలాంటి విచారణ చేయలేదని బిషప్‌ అంటున్నారు.. అధికారులు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అంటున్నారు. బిషప్‌ అక్రమాలపై పూర్తి ఆధారాలను అధికారులకు ఇచ్చామంటోంది ఆయన ప్రత్యర్థి వర్గం... సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

 

19:35 - January 21, 2018

తూర్పుగోదావరి : మాటలు కోటలు దాటుతాయి.. అడుగు గడపదాటదు అన్నట్టుగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు. రాజమండ్రిలో గోదావరి తీరాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు.. నాలుగేళ్లు గడిచినా.. పనులు అంగుళం కూడా కదలడంలేదు. ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించిన అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల దుస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌..

ఓవైపు గలగలాపారే గోదారి.. దాని పక్కనే విశాలమైన ఇసుకతిన్నెలు.. ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి సోయగాని గోదావరి తీరం పెట్టిందిపేరు. ఇలాంటి ప్రకృతి అందాలకు మరింత మెరుగులద్ది.. పర్యాటకరంగానికి ఊపునివ్వడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిందే అఖండగోదారి ప్రాజెక్టు. అప్పట్లో స్వయంగా గోదావరిలో బోటు షికారు చేసిన చంద్రబాబు.. అఖండగోదావరి ప్రాజెక్టు శిలాఫలకం వేశారు. అప్పటి నుంచి నత్తనడకన సాగుతున్న పనులు మరో 5ఏళ్లకు కూడా పూర్తియ్యే పరిస్థితి కనిపించడంలేదని రాజమండ్రి వాసులు అంటున్నారు. 

రాజమహేంద్రవరం సమీపంలోని లంకలు, కోటిలింగాల రేవులో ఫ్లోటింగ్‌ స్టేజ్‌, ఘాట్‌వద్ద  ప్రత్యేక సౌకర్యాలు, ఏటిగట్టును  ఈటింగ్‌ స్ట్రీట్‌గా మార్చడం. దాంతోపాటు కోటిలింగాల ఘాట్‌ నుంచి పుష్కరఘాట్‌ వరకు  గ్లాస్‌తో నీటిలోనే వాకింగ్‌వే నిర్మించడం.. గోదావరి హారతికి కొత్తజట్టీల ఏర్పాటు.. నదిమధ్యలో కేతవారిలంక చుట్టు వాక్‌వే నిర్మించాల్సి ఉంది. 

అఖండగోదావరిలో ప్రధానమైన పిచ్చుకలంక , హేవ్‌లాక్‌ టూరిజం, ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకు జలరవాణా అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటితోపాటు పాపికొండలకు వెళ్లేదారిలో .. అక్కడక్కడా ఉండే దీవుల్లో పర్యాటకులు కొద్దిసేపు సేదతీరేందుకు ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌లు అభివృద్ధి చేయాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు పూర్తయిన పనులు చూస్తే.. ఇప్పట్లో రాజమండ్రిలో పర్యాటకం ఊపందుకునే దాఖలాలు కనిపించడంలేదని స్థానికులు అంటున్నారు. ఇపటికి కేవలం 20శాతం పనులే పూర్తయ్యాయి. ఇక మిగిలిన 80శాతం పనులు పూర్తికావాలంటే ఇంకెన్నేళ్లు పడుతుందోనని రాజమహేంద్రవరం ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గోదావరి టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని రాజమహేంద్రవరం ప్రజలు కోరుతున్నారు. 

19:30 - January 21, 2018

కడప : చరిత్రకు సజీవ సాక్ష్యం గండికోట దుర్గం. అద్భుత శిల్పకళా నైపుణ్యం దాని సొంతం.  ఓ వైపు లోయలో సుడులు తిరుగుతూ హొయలు పోయే పెన్నా నదీ ప్రవాహం... మరోవైపు ఒడ్డున శతృ దుర్బేద్యమైన కోట దుర్గం. చూపరులకు రెండు కళ్ళూ చాలవు అనిపించే అద్భుత శిల్ప కళా కావ్యం. నేటి నుంచి మూడు రోజులపాటు  ఇక్కడ ప్రభుత్వం ఉత్సవాలను  నిర్వహిస్తోంది... గండికోట ఘనచరితపై  టెన్‌టీవీ ప్రత్యేక కథనం....
మరో హంపీగా గుర్తింపుపొందిన గండికోట
పూర్వం ఎందరో రాజుల ఏలుబడిలో...  దశదిశలా కీర్తిని చాటుతూ... ఓ వెలుగు వెలిగిందీ గండికోట. మరో హంపీగా ప్రశంసలు పొందిన గండికోట... అద్భుత కట్టడాలు, శిల్పకళా నైపుణ్యం, తాగునీటి చెరువులు, కోనేరులతో అలరారింది. కరవుకాలాల్లో ఆహార కొరత తీర్చేందుకు ఇక్కడ ధాన్యాగారం కూడా నిర్మించారు. ఏనుగులు ఢీ కొట్టినా కదలని ధృడమైన సింహద్వారాలు,  పెన్నాలోయ సోయగం ఇలా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 
క్రీస్తుశకం 1123 జనవరి 9న గండికోట నిర్మాణం
కడప జిల్లాకే తలమానికం గండికోట... జమ్మలమడుగుకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని క్రీస్తు శకం 1123లో జనవరి 9న నిర్మించినట్టు గండికోట కైపియత్‌ ద్వారా తెలుస్తోంది. మొదట పెమ్మసాని రాజుల ఆధీనంలోనూ...  తర్వాత విజయనగర ప్రభువులు, గోల్కొండ నవాబులు, మైసూర్‌ రాజుల తర్వాత ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది.
గండికోట అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఈ నేపథ్యంలో గండికోటను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు  ముందడుగు వేసింది ఏపీ ప్రభుత్వం...  గతేడాది ఉత్సవాలను మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం...ఇక ప్రతియేటా నిర్వహిస్తామని ప్రకటించింది.
నేటినుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు
నేటినుంచి  మూడు రోజుల పాటు ప్రభుత్వం గండికోట ఉత్సవాలు నిర్వహిస్తోంది. వాటి ప్రచారంలో భాగంగా.. కడప నగరంలో కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా కూడలి నుంచి ప్రారంభమైన  ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా చేసిన నృత్య, కళా ప్రదర్శనలు   ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో పాల్గొని  గండికోట వైభవాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు ముందుకు రావాలన్నారు జాయింట్‌ కలెక్టర్‌ శ్వేతా తీయోటియా. ప్రదర్శన లో ఆకట్టుకున్న కళాకారులను జేసీ ప్రత్యేకంగా అభినందించారు.
మౌళిక సదుపాయాలపై సందర్శకుల అసంతృప్తి 
గండికోట గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న ఔత్సాహికులు... కోటను సందర్శించేందుకు వస్తున్నారు. అమెరికన్‌ గ్రాండ్‌ కేనియన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటున్నారు. ఉత్సవాల ఏర్పాట్లకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ... పర్యాటకులకోసం మౌళిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతమెంతో ఘన చరిత్ర గల వారసత్వ సంపదలు శిథిలావస్థకు చేరి... కాలగర్భంలో కలుస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో చరిత్ర పుటలకే పరిమితం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

విశాఖ కేజీహెచ్ లో దారుణం

విశాఖ : విశాఖపట్నం కేజీహెచ్‌లో స్ట్రెచర్ బాయ్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. పరీక్ష కోసం వెళ్లిన మహిళ రోగిపై స్ట్రెచర్ బాయ్ కిరణ్ కుమార్ లైంగిక దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న రోగి బంధువులు ఆందోళనకు దిగారు. 

19:19 - January 21, 2018

పశ్చిమ గోదావరి : పశ్చిమ ఏజెన్సీలో తల్లీ కూతుళ్ళ మృతదేహాలు కలకలం రేపాయి. బుట్టాయగూడెం మండలం ఎర్రాయగూడెం సమీపంలోని జీడిమామిడి తోటలో రెండు మృతదేహాలు బయటపడ్డాయి.  మృతులు పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేట గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్ళు ఈళ్ల సావిత్రి, పులిబోయిన మంగతాయారుగా పోలీసులు నిర్ధారించారు.  కుటుంబ కలహాలతో వారి భర్తలే హత్యచేసి ఉంటారని  పోలీసులు భావిస్తున్నారు. ఈళ్ళసావిత్రి భర్త రామాంజనేయులు, పులిబోయిన మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

18:48 - January 21, 2018

చిత్తూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ పాదయాత్ర సభలో స్టేజీ కూలింది. సభ జరుగుతుండగా స్టేజీపైకి కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్లడంతో స్టేజీ కూలింది. దీంతో వైసీపీ నేతలు కిందపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు, మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులను మాత్రం జగన్ పరామర్శించలేదు. గాయపడినవారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

18:41 - January 21, 2018

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తన స్ధాయికి దిగజారి కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఎంతవరకూ సమంజసమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈమేరకు ఆయనతో 10 టివితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. కేసీఆర్‌ను పొగడుతూ భజన చేస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ తెలంగాణలో ఒక టూరిస్టుగా పర్యటించవచ్చని.. పొలిటీషయిన్‌గా వస్తే ఊరుకోమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఏ మాత్రం స్పందించని పవన్ తెలంగాణలో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు.

 

18:32 - January 21, 2018

హైదరాబాద్ : పేరుకు విశ్వనగరం.. మురికివాడల్లో జనానికి నిత్యం నరకం.. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా కనీస సౌకర్యాలులేని అభాగ్యులు ఎందరో..! సొంత ఇంటికోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బస్తీవాసులు. కాగితాలకే పరిమితం అయిన ప్రభుత్వాధినేతల ప్రకటనలు. హైదరాబాద్ అడిక్‌మెట్‌ ఏరియాల్లో మురికివాడల పరిస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌..
టీ.సర్కార్‌పై ప్రజలు మండిపాటు
ప్రపంచ నగరం, దేశానికే రెండో రాజధాని అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై హైదరాబాద్‌ ప్రజలు మండిపడుతున్నారు. నగరంలోని అడిక్ మెట్, వడ్డెర బస్తీ లో నిరుపేదలు తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు . ఉండటానికి సొంత ఇళ్లులేక ..ఇరుకైన గుడిసెల్లో ..వానకు తడుస్తూ..ఎప్పుడు కూలుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు..   
చాలీ చాలనీ ఆదాయంతో జీవనం 
అడిక్‌మెట్‌ మురికివాడలోని పేదలంతా ఇండ్లలో పని చేస్తూ చాలీ చాలనీ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. కనీసీం తాగునీరు కూడా దొరకని పరిస్థితినెలకొంది. వేసవి రాకముందే ఈ బస్తీలో నీటి ఎద్దడి మొదలైంది. మంచి నీటి సంగతి అలా ఉంచితే.. బస్తీలో డ్రైనేజి వ్యవస్థల సరిగా లేక జనం అనారోగ్యాల పాలవుతున్నారు. మరోవైపు వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైంది . వారం రోజుల కొకసారి వచ్చే నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మురికి నీరు వాడలేక..డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 
మహిళలు అనేక అవస్థలు
ఇక్కడి మురకివాడలో మహిళలకు కనీసం టాయిలెట్ , మరుగుదొడ్డి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నారు .ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైక కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళితే రైలు డీకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు . ఎన్ని సార్లు ,ప్రజా ప్రతినిధులు,అదికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు.  
మహిళలకు పింఛన్‌ అందని పరిస్థితి 
ఇక పేదల చెంతకు సంక్షేమపథకాలు చేరాలంటే.. అదో యజ్ఞమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న ఒంటరి మహిళలకు పింఛన్‌ అందని పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బస్తీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి సొంతభనం కూడా లేకుండా పోయింది.  ప్రస్తుతం అద్దెభవనంలోనే అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది. అదికూడా శిథిలావస్థకు చేరుకుంది. ఎపుడు కూలి మీదపడుతుందోనని చిన్నారులు, గర్భిణీస్త్రీలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకు సమస్యలు తీర్చాలని అడిక్‌మెట్‌ వడ్డెర బస్తీ వాసులు కోరుతున్నారు. 

 

18:21 - January 21, 2018

మేడ్చల్ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లోని  గట్టు మైసమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారు ఝామునుంచే భక్తులు క్యూ కట్టారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలి పెద్ద సుధీర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

18:16 - January 21, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ అన్నారు. హైదరాబాద్‌ నల్లకుంట హరినాధ ఆశ్రమంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన ఆదివాసీ గోడు నివేదన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీ జాబితా నుంచి గిరిజనులను తొలగించేందుకు జరుగుతున్న కుట్ర తాలూకు ఆధారాలతో రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని నందకుమార్ ఆవిష్కరించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అండతో పోలీసులు ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని నందకుమార్ చెప్పారు. 

 

17:59 - January 21, 2018

పెద్దపల్లి : ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనరేట్‌ నూతన భవన నిర్మాణానికి...డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌లతో కలిసి శంఖుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. 

 

17:53 - January 21, 2018

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్‌లో ప్రార్ధనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థన సమయంలో పవన్ వెంటన ఆయన భార్య అన్నా ఉన్నారు. ప్రార్థన అనంతరం పవన్ కల్యాణ్ దంపతులకు చర్చ్ ఫాదర్ బాలశౌరి దీవెనలు అందించారు. 

 

17:49 - January 21, 2018

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు తన రాజకీయ యాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు పదేళ్ల తరువాత జిల్లాకు రానున్నారు పవన్. ఇష్టదైవమైన ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ యాత్ర ప్రారంభించనున్నారు. పవన్ రాక సందర్భంగా అభిమానులు చేస్తున్న ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

17:31 - January 21, 2018
17:23 - January 21, 2018

విశాఖ : విశాఖపట్నం కేజీహెచ్‌లో స్ట్రెచర్ బాయ్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. పరీక్ష కోసం వెళ్లిన మహిళ రోగిపై స్ట్రెచర్ బాయ్ కిరణ్ కుమార్ లైంగిక దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న రోగి బంధువులు ఆందోళనకు దిగారు. కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

పవన్ వ్యాఖ్యలు ఉపసంరించుకోవాలి : పొన్నం

కరీంనగర్ : కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ యాత్ర పై స్పందించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంరించుకున్నాకే కరీంనగర్ లో అడుగుపెట్టాలని హెంచ్చరించారు. కేసీఆర్, పవన్ కు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని పోన్నం డిమాండ్ చేశారు, పవన్ ట్విట్టర్ బాబుగానే పరిగణిస్తామని, రాజకీయనాయకుడిగా గుర్తిమని ఆయన తెలిపారు. 

జగన్ ప్రజా సంకల్ప యాత్రలో అపశ్రుతి

చిత్తూరు : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాళహస్తిలో జగన్ బహిరంగ సభ జరుగుతుండగా స్టేజ్ కుప్పకూలడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కిందపడ్డారు. 

ఉపరాష్ట్రపతి ఇంట్లో సంక్రాంతి మిలాన్

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో సంక్రాంతి మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. 

ఉపరాష్ట్రపతి ఇంట్లో సంక్రాంతి మిలాన్

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో సంక్రాంతి మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. 

17:05 - January 21, 2018

కర్నూలు : హైదరాబాద్ శివార్లలో కలకలం సృష్టించిన చెడ్డిగ్యాంగ్ కర్నూలులోకి చొరబడింది. న్యూ కృష్ణానగర్, ఆదిత్యనగర్, విఠల్‌నగర్‌లలో ఈ గ్యాంగ్ చోరికి తెగపడింది. 3 ఇళ్లలో చోరీకి పాల్పడి... ఓ ఇంటికి నిప్పుపెట్టారు. బనియన్లు, చెడ్డీలతో తిరుగుతున్న యువకులను స్థానికులు చూసి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వీరంతా పారిపోయారు. వీరి వేషధారణను చూసి చెడ్డీగ్యాంగ్‌గా నిర్థారించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:03 - January 21, 2018

ఢిల్లీ : 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి వేటు వేశారు. ఈసీ ప్రతిపాదనను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. దీంతో 20మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై నోటిఫికేషన్ జారీ అయింది. లాభదాయక పదవుల్లో ఉన్నందుకు 20మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఈసీ రాష్ట్రపతికి శుక్రవారం ప్రతిపాదించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:58 - January 21, 2018

ఢిల్లీ : 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై నోటిఫికేషన్ జారీ అయింది. ఈసీ ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి అనర్హత వేటు వేశారు.

16:33 - January 21, 2018

హైదరాబాద్ : 2019లో జరగబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సర్కార్‌ను కూల్చడం ఖాయమని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. ముషిరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్‌లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో రమణ పాల్గొని, మాట్లాడారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందన్నారు. 

16:24 - January 21, 2018

కరీంనగర్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా ప్రాజెక్టును ప్రశంసించిన గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌.. టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల పట్ల నరసింహన్‌కి  ఆసక్తి ఉంటే టీఆర్‌ఎస్‌లో చేరొచ్చని జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు.

కర్నూలులో చెడ్డీగ్యాంగ్

కర్నూలు : చెడ్డీగ్యాంగ్ కర్నూలులోని న్యూ కృష్ణానగర్,ఆదిత్యనగర్, వఠల్ నగర్ లో చోరికి తెగబడ్డారు. గ్యాంగ్ మూడు ఇళ్లలో చోరీకి పాల్పడింది, మరో ఇంటికి ఏకంగా నిప్పు పెట్టారు. 

16:11 - January 21, 2018

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించకుండా.. ప్రాజెక్టు అద్భుతమని ప్రశంసించడాన్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి వైస్‌ హాయంలో చేపట్టి 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టను కాళేశ్వరంగా పేరు మార్చిన విషయం గవర్నర్‌కు తెలియదా.. .అని ప్రశ్నించారు. 38 వేల కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు 81 వేల కోట్లకు చేరుకున్నా నరసింహన్‌ నోరు మెదపకపోడాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే ప్రాజెక్టు చేపట్టారని మల్లు విక్రమార్క అన్నారు. టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌గా పని చేస్తూ గవర్నర్‌ కేసీఆర్‌కు భజన చేస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. కాళేశ్వరం నిర్వాసితుల సమస్యలు గవర్నర్‌కు పట్టవా ? అని శ్రీధర్‌బాబు అడిగారు. 

 

ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఢిల్లీ : 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈసీ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముంద్ర వేశారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హతగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 

15:40 - January 21, 2018

విజయవాడ : సీపీఎం తూర్పు కృష్ణా మొదటి మహాసభలు గుడివాడలో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ మహాసభల్లో భూ సమస్యపై సీపీఎం ప్రతినిధులు లోతైన చర్చ జరుపుతున్నారు. ప్రజలెదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

 

15:36 - January 21, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని డిచ్‌పల్లిలో ఉపాధిహామీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. డిచ్‌పల్లిలోని ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ అంబర్‌సింగ్‌ తమ ఆఫీసు భవనం పైనుంచే కిందకు దూకాడు. ఉపాధిహామీ లావాదేవీలపై అధికారులు ఆడిట్‌జరపుతుండగా భవనంపైనుంచి అంబర్‌సింగ్‌ దూకేశాడు. తీవ్రగాయాల పాలైన బాధితుణ్ని నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

15:34 - January 21, 2018

పెద్దపల్లి : తెలంగాణ రాష్ర్ట హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పెద్దపల్లిలో పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీన్ని 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌ జిత్ దుగ్గల్‌ పాల్గొన్నారు.

 

గవర్నర్ పై భట్టి విక్రమార్క ఫైర్

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ పై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు, హరీష్ రావు కాళేశ్వర్ రావు అని గవర్నర్ కితాబు ఇవ్వడం ఏంటాని ఆయన ప్రశ్నించాడు. గవర్నర్ హోదాను కించపరిచేలా నరసింహన్ వ్యవహరించారని భట్టి అన్నారు. 

14:53 - January 21, 2018

గుంటూరు : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో  మమేకం కావడం కూడా అంతే ప్రధానం అన్నారు.  ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ప్రజాప్రతినిధుల పనితీరు బాగుంటేనే వారి మద్దతు ఉంటుందన్నారు. ప్రజల మద్దతు పొందేందుకు కృషియాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 
నదుల అనుసంధానం కోసం వ్యూహాలు : చంద్రబాబు 
నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటికరువును అధిగమిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అమవరావతిలో జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు మాట్లాడారు. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి,  పెన్నా నదులతోపాటు వాటి ఉపనదులను అనుసంధానించడానికి వ్యూహాలు రూపొందిస్తున్నామన్నారు. 

ఉపాధిహామీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ : జిల్లా డిచ్ పల్లిలో ఉపాధిహామీ ఉద్యోగి ఆత్మయత్నం చేశాడు. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ భవనం పై నుంచి దూకాడు. టెక్నికల్ అసిస్టెంట్ భవన్ లో సోషల్ ఆడిట్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

13:28 - January 21, 2018

హైదరాబాద్ : వనస్థలిపురంలో రియల్టర్ అంతయ్య కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కానీ అంతయ్య ను పోలీసులు విడిపించినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తేటతెల్లమైంది. అంతయ్యే చాకచక్యంగా తప్పించుకుని క్షేమంగా ఇంటికి తిరిగిచ్చాడు. ఈ సందర్భంగా కిడ్నాప్ జరిగిన తీరు..వారు వ్యవహరించిన దానిపై టెన్ టివి అంతయ్యతో మాట్లాడింది.

ఏడున్నర గంటలకు షాపుకు వెళ్లి వస్తున్నట్లు, తమకు ఇంటికి సమీపంలో ఓ కారు ఆపి ఉందన్నారు. కారు సమీపంలోకి రాగానే ఓ వ్యక్తి అంకుల్ అని పిలవడం జరిగిందని, తాను చూసే సరికి ఒక్కసారిగా తనను కారులోకి లాక్కొన్నారని పేర్కొన్నారు. వెంటనే తనకు కళ్లకు గంతలు కట్టి ఎక్కడకో తీసుకపోయారని తెలిపారు. ఓ ప్రదేశానికి తీసుకెళ్లి వారి బాస్ తో మాట్లాడడం జరిగిందని, రూ. 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, కిడ్నాప్ చేసిన వారు బీహార్ కు చెందిన వారని తెలిపారు. కానీ వారి బాస్ తెలుగులో మాట్లాడారని, సాయంత్రానికి మంచినీళ్లు ఇచ్చారన్నారు. రాత్రి తనకు కళ్ల గంతలు విప్పారని, రాత్రి సమయంలో కిడ్నాప్ చేసిన వారు గాఢ నిద్రలో ఉండడంతో తాను తప్పించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. పొదల్లోనే తాను కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చానని, ఓ హైవే కనబడిందని తెలిపారు. తాను హోటల్ కు వచ్చి సృహ కోల్పోవడం జరిగిందన్నారు. ఆ హోటల్ యాజమాన్యం తనకు పాలు ఇచ్చారన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:06 - January 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. కొండగట్టు ఆలయం నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం పవన్ మీడియాతో మాట్లాడారు. కేవలం ప్రజా సమస్యల కోసం యాత్ర నిర్వహించనున్నట్లు, పబ్లిక్ మీటింగ్ లు ఉండవన్నారు. జనసేన కార్యకర్తలతో మాట్లాడి ప్రజా సమస్యలు..ఇతరత్రా వివరాలు సేకరించడం జరుగుతోందన్నారు. యాత్రకు సంబంధించిన వివరాలు..షెడ్యూల్ యాత్రలో ప్రకటించడం జరుగుతోందన్నారు. 

రేపటి నుంచి పవన్ రాజకీయ యాత్ర

హైదరాబాద్ : రేపటి నుంచి తెలంగాణలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర చేయనున్నారు. రేపు ఉదయం కరీంనగర్ జిల్లా కొండగట్టు అంజనేయస్వామి దర్శనం అనంతరం ఆయన యాత్ర ప్రారంభించనున్నారు. పవన్ యాత్ర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. 

12:32 - January 21, 2018
12:16 - January 21, 2018

విజయవాడ : టిడిపి వర్క్ షాప్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేసిన పనులను చెప్పగలిగితే రాష్ట్రంలో 175 సీట్లు గెలుచుకొనే సత్తా టిడిపికి ఉంటుందన్నారు. ఎవరి అవసరం ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు అవసరం లేదని పరోక్షంగా చెప్పినట్లైంది. గత కొన్ని రోజులుగా కేంద్రం సాయం చేయడం లేదని టిడిపి నేతలు భావిస్తున్నారు. విభజన హామీలు...ఇతరత్రా వాటిపై బాబు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

12:15 - January 21, 2018

విజయవాడ : అభివృద్ధి జరగని జిల్లాలో తాను స్వయంగా రంగంలోకి దిగి ధర్నాలు..నిరహార దీక్షలు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టిడిపి వర్క్ షాప్ లో ప్రజాప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. మార్చిలోపు రాష్ట్రం ఓడిఎఫ్ అవుతుందని, అభివృద్ధి జరగని జిల్లాలో ప్రజాప్రతినిధుల వైఖరిని నిరిసిస్తూ తానే స్వయంగా ధర్నా చేస్తానని..నిరహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. చంద్రన్న బీమా పథకం కింద ప్రమాదంలో మృతి చెందిన వారి విషయంలో రూ. 5 లక్షలు..ఇతరత్రా పనులన్నీ పది రోజుల్లో పూర్తి చేయాలని చెప్పడం జరిగిందన్నారు. చేతివృత్తులు..కుల వృత్తుల వారికి ఆధునీకరణ పనిముట్లు ఇప్పించాలని యోచించినట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్..నిరుద్యోగ భృతి రెండు మాత్రమే మిగిలిపోయాయని, ఇవి పూర్తి చేస్తే వంద శాతానికి పైగానే పనులు చేసినట్లు, జన్మభూమి కార్యక్రమంలో 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆర్థికం..వ్యక్తిగతం..ఆర్థికేతర కమ్యూనిటీ..ఆర్థికేతర వ్యక్తిగతం..ఇళ్లు...ఫించన్లు...కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. 

ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు

గుంటూరు : ఏపీ చంద్రబాబు నాయుడు టీడీపీ వర్క్ షాప్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పగలిగితే 175  సీట్లు మనవే అని, ఇక ఎవరితో అవసరం లేదని ఆయన అన్నారు. 

టీడీపీ వర్క్ షాప్ ప్రారంభించిన చంద్రబాబు

గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ వర్క్ షాప్ ప్రారంభించారు. ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు. 

11:37 - January 21, 2018

విభజన హేతుబద్దంగా జరగలేదు : చంద్రబాబు

గుంటూరు : రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని, విభజన చట్టంలో హామీలన్ని నెరవేర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. 

11:26 - January 21, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొలాండ్ అంబాసిడర్ బురాకోవస్కీ భేటీ అయ్యారు. జనసేన కార్యాలయంలో పోలాండ్ బృందానికి పవన్ దంపతులు స్వాగతం పలికారు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పవన్ పోలాండ్ వాసులతో భేటీ అయ్యారు. పోలాండ్ వాసులతో పవన్ వివరాలు బురాకోవస్కీ తెలుసుకున్నారు. దీనితో పవన్ తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం 20 మంది పోలాండ్ విద్యార్థులతో బురాకోవస్కీ నగరానికి వచ్చి పవన్ తో భేటీ అయ్యారు. 

11:18 - January 21, 2018

హైదరాబాద్ : వనస్థలిపురం పరిధిలోని చైతన్యనగర్ లో రియల్టర్ చెరకు అంతయ్య కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. రాత్రి క్షేమంగా అంతయ్య ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. వ్యాపార లావాదేవీలే కారణమని తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

11:04 - January 21, 2018
11:02 - January 21, 2018
10:23 - January 21, 2018

పెద్దపల్లి : జిల్లాలో రైతుకంట కన్నీరు వలుకుతోంది. సుల్దానాబాద్‌,ఓదెల, ఎలిగెడు జుల్లపల్లి, కాల్యశ్రీరాంపూర్‌లో వేసిన పంటలు ఎండిపోయాయి. అప్పుజేసి సాగుచేసిన వరిపంట... నీరులేక ఎండిపోయింది. పొలం నెర్రెలు వారింది. ఎండిపోయిన పంటను పశువులు మేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువలకు నీరు విడుదల చేస్తే ఈ పరిస్థితి దాపురించేంది కాదని చెప్తున్నారు. ప్రభుత్వమే సాగుచేసుకోమని చెబితే పంట వేశామని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు పంటకు నీరు ఇవ్వక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.

పవన్ కల్యాణ్ ను కలిసి పోలాండ్ అంబాసిడర్ ఆడమ్

హైదరాబాద్ : జనసేన కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ కలిశారు. 

10:20 - January 21, 2018

సెయింట్ మేరీస్ చర్చి పవన్ కల్యాణ్ ప్రార్ధనాలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రార్ధనాలు చేశారు. ఉదయం 7గంటలకు తన సతీమణి అన్నాతో పవన్ ప్రార్ధనాల్లో పాల్గొన్నారు. 

10:18 - January 21, 2018

యాదాద్రి : కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనే ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై కామాంధుడు రెచ్చిపోయాడు. రాజుపేట మండలంలోని బేగంపేటలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. తల్లిదండ్రులు పోలానికి వెళ్లిన సమయంలో కాంపౌడర్ గా పనిచేసే మహేష్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితమే జరిగినట్లు సమాచారం. జ్వరంతో బాధ పడుతుండగా తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ ఘోరం బయటపడింది. అత్యాచారం చేసిన మహేష్ పై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

10:13 - January 21, 2018

విజయవాడ : ఒక సంవత్సరంలో ఎన్నికలు..దీనితో అన్ని పార్టీలు అధికారంలోకి రావాలని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగా పలు హామీలు గుప్పిస్తున్నారు. ఇక అధికార పలు వరాలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు పార్టీ అధిష్టానం దిశా నిర్దేశం చేస్తోంది. ఏపీలో టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ పటిష్టం..ప్రభుత్వానికి చెందిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిడిపి భావిస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసం పక్కనే ఉన్న గ్రీవెన్స్ సెల్స్ లో ఆదివారం టిడిపి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పల్లె పల్లెకు టిడిపి..ఇలాంటి నిర్వహించిన కార్యక్రమాలపై బాబు వివరించే అవకాశం ఉంది. ఇందులో ప్రజాప్రతినిధులకు గ్రేడింగ్ ఇస్తారని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి వర్క్ షాప్..

హైదరాబాద్ : టిడిపి ఒక్క రోజు వర్క్ షాప్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ వర్క్ షాప్ జరుగనుంది. సాయంత్రం వరకు ఈ వర్క్ షాప్ జరుగనుంది. వర్క్ షాప్ అనంతరం చంద్రబాబు నేరుగా దావోస్ కు వెళ్లనున్నారు. విభజన హామీలు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ జరుగనుంది. 

ఇంటర్ విద్యార్థి సూసైడ్...

మహబూబ్ నగర్ : ప్రతిభ జూనియర్ కాలేజీలో హాస్టల్ లో ఇంటర్ విద్యార్థి అంజప్ప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు కాలేజీ ఇష్టం లేదని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. మద్దూరు (మం) చింతలదిన్నె వాసిగా గుర్తించారు. 

09:46 - January 21, 2018

ఢిల్లీ : భారత అంధుల క్రికెట్‌ జట్టు మరోసారి సత్తా చాటింది. వన్డే వరల్డ్‌కప్‌లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. శనివారం షార్జాలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో భారతజట్టు పాక్‌ను చిత్తుచేసింది. రెండు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2014లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ ఇండియా జట్టు.. పాక్‌పైనే విజయం సాధించింది. ప్రపంచకప్‌ గెలిచిన భారత అంధుల జట్టును ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారతజట్టుకు అభినందనలు తెలిపారు.

09:45 - January 21, 2018

హైదరాబాద్ : పేరుకు విశ్వనగరం.. మురికివాడల్లో జనానికి నిత్యం నరకం.. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా కనీస సౌకర్యాలులేని అభాగ్యులు ఎందరో..! సొంత ఇంటికోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బస్తీవాసులు. కాగితాలకే పరిమితం అయిన ప్రభుత్వాధినేతల ప్రకటనలు. హైదరాబాద్ అడిక్‌మెట్‌ ఏరియాల్లో మురికివాడల పరిస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌. ప్రపంచ నగరం, దేశానికే రెండో రాజధాని అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై హైదరాబాద్‌ ప్రజలు మండిపడుతున్నారు. నగరంలోని అడిక్ మెట్, వడ్డెర బస్తీ లో నిరుపేదలు తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు . ఉండటానికి సొంత ఇళ్లులేక ..ఇరుకైన గుడిసెల్లో ..వానకు తడుస్తూ..ఎప్పుడు కూలుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

అడిక్‌మెట్‌ మురికివాడలోని పేదలంతా ఇండ్లలో పని చేస్తూ చాలీ చాలనీ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. కనీసీం తాగునీరు కూడా దొరకని పరిస్థితినెలకొంది. వేసవి రాకముందే ఈ బస్తీలో నీటి ఎద్దడి మొదలైంది. మంచి నీటి సంగతి అలా ఉంచితే.. బస్తీలో డ్రైనేజి వ్యవస్థల సరిగా లేక జనం అనారోగ్యాల పాలవుతున్నారు. మరోవైపు వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైంది. వారం రోజుల కొకసారి వచ్చే నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరు వాడలేక..డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి మురకివాడలో మహిళలకు కనీసం టాయిలెట్ , మరుగుదొడ్డి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నారు. ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైక కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళితే రైలు ఢీ కొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని సార్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు.

ఇక పేదల చెంతకు సంక్షేమ పథకాలు చేరాలంటే.. అదో యజ్ఞమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న ఒంటరి మహిళలకు పింఛన్‌ అందని పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బస్తీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం అద్దెభవనంలోనే అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది. అదికూడా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలి మీద పడుతుందోనని చిన్నారులు, గర్భిణీస్త్రీలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకు సమస్యలు తీర్చాలని అడిక్‌మెట్‌ వడ్డెర బస్తీ వాసులు కోరుతున్నారు. 

09:43 - January 21, 2018

ఢిల్లీ : పలు రంగాల్లో ప్రతిభావంతులైన 112 మంది మహిళామణులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల్లో తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన 227 మంది మహిళల పేర్లను సేకరించిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారిలో 112 మందిని సత్కారానికి ఎంపిక చేసింది. తొలి మిసైల్‌ప్రాజెక్ట్‌ హెడ్‌, శ్మశానం నిర్వహిస్తున్న తొలిమహిళ, తొలి ఒలింపిక్‌ పతకం సాధించినవారు.. ఇలా వివిధ రంగాల్లోకి తొలిసారి అడుగులేసిన మహిళల వివరాలను సేకరించి ఈ గౌరవానికి ఎంపికచేశారు. ఇందులో తెలుగురాష్ట్రాలకు చెందిన పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, వంకదారత్‌ సరిత, సైనా నెహ్వాల్‌, టెస్సీ థామస్‌, కెప్టెన్‌ శోభా, కె.మిథాలీరాజ్‌, సాజిదాఖాన్‌, సానియామీర్జా, శోభనాకామినేని , గాయని కేఎస్‌చిత్ర అవార్డులు అందుకున్నారు.

 

09:40 - January 21, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకే ఎన్‌జీవోలు నివేదికలు తయారుచేస్తున్నాయంటూ తెలంగాణ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నివేదికలో చూపించిన లోపాలను ఎందుకు సరిదిద్దుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తే నాణ్యమైన విద్యాలయాలుగా మారే అవకాశం ఉందంటున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ఉపాధ్యాయులే కారణమంటూ యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌-అసర్ ఇచ్చిన రిపోర్టుపై వివాదం రాజుకుంది. నివేదికపై తెలంగాణ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అసర్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ప్రభుత్వ విద్యాసంస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా నివేదిక ఉందని వారు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అరకొర సౌకర్యాల కారణంగానే ఫలితాలు ఆశించిన స్ధాయిలో రావడం లేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కనీసం నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండటం లేదని... దీంతో ఎన్నో ఏళ్లుగా అదే టీచర్లతో పాఠాలు బోధిస్తూ పాఠశాలలు నడుపుతున్నామని అంటున్నారు. అసర్ నివేదిక ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం సర్కారీ బడులకు ఎంతో చేసామని చెప్పుకోవడమే కానీ.. ఆచరణలో ఏమీ ఉండటం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. డిజిటల్ క్లాసులను ఆరంభ శూరత్వంగా మిగిల్చారని మండిపడుతున్నారు. ఎన్జీవోలు ఇచ్చిన నివేదికల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెడితే నాణ్యమైన విద్యను అందించడానికి వీలవుతుందని వారు చెబుతున్నారు.

ఇక మౌళిక సదుపాయాల కల్పనలో తీవ్రమైన లోపాలున్నాయని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధులకు సరిపడా క్లాస్ రూమ్‌లు, టీచర్లు లేక నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఇవన్నీ పట్టించుకోని ప్రభుత్వం ఎన్జీవోలు ఇచ్చిన రిపోర్టును పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా పాఠశాలల్లో సౌకర్యాలు సరిగ్గా ఉంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నివేదికలపై దృష్టి పెట్టే ముందు ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

08:31 - January 21, 2018

ఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అమెరికా షట్‌డౌన్‌ అయింది. నిర్ణీత వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందక పోవడంతో అమెరికా ప్రభుత్వం మూత పడింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వని రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఖర్చులకు సంబంధించి కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనపై సెనేట్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. నిర్ణీత వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం షట్‌డౌన్‌ ప్రకటించింది.

శుక్రవారం రాత్రి రిపబ్లికన్ల ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు డెమోక్రాట్లు అడ్డు తగిలారు. బడ్జెట్‌ ప్రస్తావనకు అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదానికి కావలసిన 60 ఓట్లు ట్రంప్‌ ప్రభుత్వానికి దక్కలేదు. రిపబ్లికన్లు మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో 230-197 ఓట్ల తేడాతో బిల్లు పాసైంది. సెనేట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లు ఆమోదం పొందలేదు. ట్రంప్‌ పార్టీకి చెందిన ముగ్గురు సెనేటర్లు బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. వలసదారుల భద్రత అంశంలో కొందరు రిపబ్లికన్లు డెమోక్రట్లకు మద్దతు ఇవ్వడమే ఇందుకు కారణం. వలసదారుల భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని డెమోక్రాట్లు బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

సెనేట్‌లో జనవరి 19లోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. బిల్లు ఆమోదానికి మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు అవసరం ఉంది. డెమోక్రాట్లు, రిపబ్లికన్‌ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బిల్లుకు ఆమోదం లభించలేదు. ఈ కారణంగా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.

షట్‌డౌన్‌తో ఫిబ్రవరి 16 వరకు అమెరికా ప్రభుత్వం మూతపడే అవకాశం ఉంది. జాతీయ భద్రత, పోస్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మెడికల్ సర్వీసులు కొనసాగనున్నాయి. నేషనల్ పార్క్‌లు, మాన్యుమెంట్లు మూసివేయనున్నారు. షట్‌డౌన్‌ కారణంగా అమెరికా ప్రభుత్వానికి వారానికి 42 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. ప్రభుత్వం మూత పడడంతో ఉద్యోగులకు 40 రోజుల పాటు వేతనం లేని సెలవులు ప్రకటించారు. ఎమర్జెన్సీ వర్కర్లకు మాత్రమే జీతం ఇస్తారు. అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్‌ కావడం 1981 నుంచి ఇది 12వ సారి. డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ జరిపిన చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ పరిస్థితికి డెమోక్రాట్లే కారణమని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు అమెరికాలో 7 లక్షల మంది అక్రమ వలసదారులున్నారు. వాళ్లను తరిమివేయాలని ట్రంప్ భావిస్తుంటే వలసదారులకు అండగా డెమోక్రాట్లు నిలిచారు. వలసదారులను డ్రీమర్స్‌ అంటారు. 2012లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో డ్రీమర్లకు పాక్షికంగా లీగల్ స్టేటస్ కల్పించారు. చట్ట విరుద్ధమైన ఇమిగ్రేషన్లు, భద్రత లేని సరిహద్దులు రిపబ్లికన్లు కోరుకుంటున్నారని ట్రంప్‌ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది.

08:25 - January 21, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఇటీవలే ప్రధాన మంత్రితో సీఎం బాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. అవసరమైతే విభజన హామీల గురించి సుప్రీంకోర్టుకు కూడా వెళుతామని కలెక్టర్ల సదస్సులో సీఎం బాబు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న క్లౌడ్‌హబ్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చలో పంచుమర్తి అనురాధ (టిడిపి), డా.గంగాధర్ (బిసి జనసభ అధ్యక్షులు) హన్మంతరావు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జ్యూరిచ్ లో పర్యటించనున్న కేటీఆర్...

హైదరాబాద్ : స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. సోమవారం నుండి 26 వరకు దావోస్ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పాల్గొననున్నారు.

 

07:17 - January 21, 2018

హల్వా వండిన జైట్లీ..

ఢిల్లీ : 2018-19 గాను బడ్జెట్ ప్రచురణ సన్నాహాలు మొదలయ్యాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఉద్యోగులందరితో కలిసి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హల్వా వండారు. 

06:57 - January 21, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి చేతుల మీదుగా మొదటి మహిళ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సరిత తెలిపారు. సరిత తెలంగాణ ఆడబిడ్డ. ఢిల్లీలో బస్సును నడుపుతున్న తొలి మహిళా డ్రైవర్‌. దీంతో ఆమెకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఫస్ట్‌ లేడీస్‌ అవార్డును అందుకున్నారు. స్వరాష్ట్రమైన తెలంగాణలో తనకు గుర్తింపులేదని... పలువురు అధికార పెద్దలను కలిసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు అవకాశం ఇస్తే.. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును నడుపుతానంటోన్న మహిళా బస్సు డ్రైవర్‌ సరిత ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

06:55 - January 21, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై టీమాస్ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హామీల అమలు కోసం ఈనెల 22న కలెక్టరేట్ల ముట్టడి చేపడుతున్నట్టు టీమాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ తెలిపారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇళ్లులేని కుటుంబాలు 20 లక్షలకుపైగా ఉంటే... కేవలం 4462 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లే ఇప్పటి వరకు కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజాగాయకుడు, టీమాస్‌ నేత గద్దర్‌తో కలిసి వెస్లీ మాట్లాడారు. కవులు, కళాకారులతో సాంస్కృతిక ఉద్యమం చేపట్టనున్నట్టు గద్దర్ తెలిపారు. 

06:54 - January 21, 2018

హైదరాబాద్ : పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులపై వివాదం రోజురోజుకు హీటెక్కుతోంది. సబ్ కమిటీ రిపోర్టుపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్... సర్పంచ్‌లకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి ఈనెల 28న అన్ని పంచాయతీల్లో తీర్మానాలు చేస్తామని TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సోమాజీగూడలో సర్పంచ్‌ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌తో పాటు ప్రొ.కోదండరామ్, చాడ వెంకట్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, హరగోపాల్, ప్రొ.నాగేశ్వర్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వం పరోక్ష పద్ధతిలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం మానుకోకుంటే సర్పంచ్‌ల సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉత్తమ్ హెచ్చరించారు. 

06:51 - January 21, 2018

హైదరాబాద్ : మోత్కుపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో టీ-టీడీపీ మేల్కొంది. మోత్కుపల్లి రేపిన దుమారం నుంచి పార్టీని కాపాడేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోత్కుపల్లి క్రమశిక్షణ తప్పరాని ఆయనపై చర్యలు తీసుకోవడం ఖాయమని పలువురు సైకిల్‌పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ వ‌ల‌స‌లతో తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇటీవ‌ల సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీ క్యాడ‌ర్ ను మ‌రింత నైరాశ్యంలోకి నెట్టాయి. పార్టీ తెలంగాణాలో మ‌నుగ‌డ సాధించ‌లేద‌నే అభిప్రాయాన్ని వ్యక‌్తం చేయ‌డం టిడిపి నేత‌ల‌ను సైతం ఆత్మర‌క్షణ‌లో వేసింది. మోత్కుపల్లి వ్యవహరంపై సైకిల్‌పార్టీ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్రమ‌శిక్షణ‌కు మారుపేరుగా ఉండే తెలుగుదేశం పార్టీలో ఇవేం వ్యాఖ్యలంటూ కొంత మంది నేత‌లు అంటున్నారు. ఈ ప‌రిస్థితులు పార్టీ పోలిట్ బ్యోరో, సెంట్రల్ క‌మిటీ నేత‌లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భ‌వ‌న్ లో స‌మావేశమై దిద్దుబాటు చ‌ర్యలను చేప‌ట్టాల‌న్న అబిప్రాయానికి వ‌చ్చారు. పార్టీ క్యాడ‌ర్ లో నిరుత్సాహం నింపే విధంగా ఉన్న మోత్కుప‌ల్లి వ్యాఖ్యల‌ను పోలిట్ బ్యూరో, సెంట్రల్‌ క‌మిటీ త‌ప్పు బ‌ట్టింది.

ఈ వ్యవ‌హారంపై స‌మ‌గ్ర నివేదిక‌ల‌ను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు విన్నవించాలని నిర్ణయించారు. మోత్కుపల్లిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సమావేశంలో కొందరు నేతలు డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ జాతీయ క‌మిటీ సూచ‌న‌లు లేకుండా ఏక‌ప‌క్షంగా చ‌ర్యలు వ‌ద్దన్న అభిప్రాయంతో.. పార్టీ హై క‌మాండ్ సూచ‌న‌ల కోసం వేచి చూద్దామ‌న్న నిర్ణయానికి పోలిట్ బ్యూరో వ‌చ్చింది. టీ-టీడీపీ సిఫారసుతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఒక వేళ మోత్కుపల్లిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే జరిగే పరిణామాలపై పసుపుపార్టీ నేతల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

06:49 - January 21, 2018

హైదరాబాద్ : వచ్చిన ఛాన్స్‌ను వదిలేదు.. ఉక్కిరిబిక్కిరి చేసేదాకా విడిచేదిలేదు. ఇదీ ఇపుడు తెలంగాణ హస్తంపార్టీ అనుసరిస్తున్న వ్యూహం. డిల్లీ లో ఆప్ ఎమ్మెల్యేల‌పై వేటు అంశాన్నిమ‌న‌ము ఆయుధంగా మ‌లుచుకుని గులాబి స‌ర్కార్‌ను ఇరుకున పెట్టడానికి టీకాంగ్రెస్‌ రెడీ అవుతోంది. ఇప్పటికే పార్లమెంట‌రీ సెక్రట‌రీల నియామ‌కంపై ఇప్పటికే హైకోర్ట్‌తో మొట్టికాయ‌లు వేయించిన హ‌స్తం పార్టీ.. ఇప్పుడు ఏకంగా వారిపై వేటుకోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ‌డ‌ప తొక్కేందుకు సిద్ధం అవుతోంది.

గులాబి స‌ర్కార్ పై అంశాల‌వారిగా కాలుదువ్వుతున్న టీ- కాంగ్రెస్ లో ఇప్పుడు మ‌రింత జోరు క‌నిపిస్తుంది. తాజాగా డిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల‌పై ఈసీ వేటుకు రాష్ట్రప‌తికి సిఫార‌సు చేయ‌డాన్ని తెలంగాణ‌లో రాజ‌కీయంగా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు వ్యూహాన్ని రెడీ చేసింది. కెజ్రీవాల్ స‌ర్కార్ మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన లాభ‌దాయ‌క ప‌ద‌వుల నియామ‌కాల‌ను ఆయుధంగా చేసుకునేందుకు సిద్దమ‌వుతోంది.

ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేప‌ట్టిన ఎమ్మెల్యేల‌కు లాభ‌ధాయ‌క ప‌ద‌వుల నియామ‌కాల‌పై తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిరియ‌స్ కావ‌డం.. వారిపై అన‌ర్హత వేటు వేయాల‌ని రాష్ట్రప‌తికి సిఫార‌సు చేయ‌డంతో టికాంగ్రెస్‌కు వ‌రంగా మారింది. స‌రిగ్గా దీన్ని ఆయుధంగా చేసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ఉత్తమ్‌కుమార్‌ అండ్‌ టీమ్‌ భావిస్తోంది. గ‌తంలోనే ఈకేసులో హైకోర్ట్ గ‌డ‌ప తొక్కిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిల్లీ ఎపిసోడ్ ను అస్త్రంగా చేసుకుంటున్నారు.

కేఐసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేప‌ట్టిన త‌మ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, గ్యాద‌రి కిషోర్ , కోవా లక్ష్మి, విన‌య్ భాస్కర్ , జ‌ల‌గం వెంక‌ట్రావ్‌ను పార్ల‌మెంట‌రి సెక్రట‌రీలుగా నియ‌మించింది. అయితే వారికి రాజ్యాంగ విరుద్దంగా కెబినెట్ హోదా క‌ల్పించార‌ని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి , ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్ట్ ను ఆశ్రయించ‌డం.. దానిపై హైకోర్ట్ ప్రభుత్వానికి మోట్టికాయ‌లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్రభుత్వం వారిని ఆ ప‌ద‌వుల‌నుండి తొలిగించాల్సి వచ్చింది. కేసీఆర్ నైతికత‌కు క‌ట్టుబ‌డిఉంటే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు రేవంత్

ఇదిలావుంటే.. లాభ‌ధాయక ప‌ద‌వుల‌ను చేయ‌ప‌ట్టమ‌ని గ‌తంలో హైకోర్ట్ కు విన్నవించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ త‌ర్వాత కూడా మ‌రో 21 మందిని కేబినెట్ హోదాలో నియ‌మించ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇది ముమ్మాటికి కోర్టు దిక్కార‌ణే అంటున్నారు. ఆరుగురు పార్లమెంట‌రీ సెక్రట‌రీల‌తో పాటు.. ఈ 21 మందిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికిపిర్యాదు చేస్తామంటున్నారు టీకాంగ్రెస్‌ నేతలు. హస్తం పార్టీ కోర్టు వ్యూహం ఫలిస్తే.. కోర్టులో కేసీఆర్‌ సర్కార్‌కు తిప్పలు తప్పవని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఆరుగురు పార్లమెంటరీ సెక్రెటరీలతోపాటు కొత్త గా నియ‌మించిన 21 మందికి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయంగా కనిపిస్తోందని అభిప్రాయాలు వస్తున్నాయి. మ‌రి టీ-కాంగ్రెస్ ఏమేర‌కు త‌న ఫ్యూహంలో స‌క్సెస్ అవుతుందో వేచి చూడాలి. 

06:47 - January 21, 2018

ఢిల్లీ : ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్‌ సిటీలోని ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌పై గ్రనేడ్‌లతో దాడి చేశారు. ముష్కరుల దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో మారణాయుధాలతో హోటల్‌లోకి దూరిన నలుగురు ఉగ్రవాదులు.. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. కనిపించిన వారిని విడువకుండా తుపాకులతో కాల్చివేశారు. మరికొందరిని బందీలుగా పట్టుకున్నారు. రాకెట్‌లాంచర్లు, గ్రనేడ్‌లు విసరడంతో హోట్‌ల్‌లో కొన్ని ఫ్లోర్లకు నిప్పంటుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హోటల్‌ను చుట్టుముట్టిన భద్రతా దళాలు ముష్కరులు బయటికి పారిపోకుండా పహరా కాస్తున్నాయి.   

06:45 - January 21, 2018

విజయవాడ : ఢిల్లీలో ' ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌ అవార్డు'ను ఏపీ మంత్రి నారా లోకేష్‌ అందుకున్నారు. రాష్ర్టంతో పాటు తనకూ ఈ అవార్డు రావడంపట్ల మంత్రి లోకేష్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఏపీలో ఎన్నో ఆవిష్కరణలు చేపట్టామన్నారు. రాష్ర్టంలో ప్రతి ఇంటికీ చౌకగా టెలిఫోన్, ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను అందించడం దేశంలోనే రికార్డ్‌ అని చెప్పారు.. అలాగే కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను లోకేష్‌ కలిశారు. విశాఖలో పంచాయతీరాజ్‌ మంత్రుల సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

06:44 - January 21, 2018

హైదరాబాద్ : పవన్ తన రాజకీయ యాత్రను ప్రముఖ పుణ్యక్షేత్రమైన కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయం నుంచి ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో తాను ఈ ప్రాంతంలోనే పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ పేర్కొన్నారు. తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయ స్వామి కావడంతో ఇక్కడి నుంచే తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నట్లు పవన్ తెలిపారు. సర్వమత ప్రార్ధనల అనంతరం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం.. సమస్యల అధ్యయనం చేయడానికి ఈ యాత్ర ద్వారా ముందుకు వస్తున్నానని పవన్ తెలిపారు. తన పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తానని ట్విట్టర్ ద్వారా పవన్ స్పష్టం చేశారు. 

06:43 - January 21, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నభూతో నభవిష్యత్‌ అన్నట్టు ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓ గొప్ప ప్రాజెక్ట్‌ అంటూ కొనియాడారు. ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన చేసిన గవర్నర్‌.. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌ దంపతులు ఉదయమే కాళేశ్వరానికి హెలికాప్టర్‌లో వచ్చారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ దగ్గరికి చేరుకుని... అక్కడి నుంచి కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు.గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముక్తేశ్వరస్వామి ఆలయంనుంచి కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు గవర్నర్‌ చేరుకున్నారు. నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంజనీర్లను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లర్ల పనితీరును పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టను నరసింహన్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి అన్నారం బ్యారేజీకి గవర్నర్‌ హెలికాప్టర్‌లో వెళ్లారు. ఆయనతోపాటు మంత్రి హరీశ్‌రావు, స్పీకర్ మధుసూదనాచారి వెళ్లారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్‌రావు మ్యాపుల ద్వారా గవర్నర్‌కు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులను గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు సాగుతున్న తీరుపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ నభూతో నభవిష్యత్‌ అన్నట్టుగా ఉందన్నారు. ఈ అద్భుత నిర్మాణం వెనక టీమ్‌ వర్క్‌ ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ గొప్ప ప్రాజెక్ట్‌ అంటూ కొనియాడారు. మరో ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆశిస్తున్నాన్నారు. ప్రాజెక్ట్‌ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ గవర్నర్‌ అభినందనలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన పూర్తి చేసేందుకు కేసీఆర్‌, హరీశ్‌రావు శ్రమిస్తున్నారని గవర్నర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూసిన తర్వాత కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖరరావు అని పిలవాలనిపిస్తోందన్నారు. ఇక హరీశ్‌రావు తనువంతా కాళేశ్వరమేనని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయ, పారిశ్‌రామిక రంగాల అభివృద్ధి జరగుతుందుని కేసీఆర్‌ అన్నారు. అంతేకాదు.. ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందన్నారు. తాగునీరు కూడా అందుతుందని స్పష్టం చేశారు. మొత్తానికి గవర్నర్‌ కాళేశ్వరం యాత్ర సక్సెస్‌ అయినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపారు. 

06:41 - January 21, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న క్లౌడ్‌హబ్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పీపీపీ పద్దతిలో భోగాపురం, భావనపాడు విమానాశ్రయాల నిర్మాణానికి ఓకే చెప్పిన మంత్రిమండలి... . డ్రగ్‌ కంట్రోల్‌శాఖలో 50 పోస్టులు, విద్యుత్‌శాఖలో 400 కొలువుల భర్తీకి పచ్చజెండా ఊపింది. క్లౌడ్‌హబ్‌ పాలసీపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం క్లౌడ్‌హబ్‌ పాలసీ 2018-2020ని ఆమోదించింది. డేటా సెంటర్లు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్లౌడ్‌హబ్‌ కంపెనీల ద్వారా 2020కి రాష్ట్రానికి 32వేల 500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పాలసీ లక్ష్యంగా నిర్దేశించింది. అత్యాధునిక సాంకేతిక పరీక్షా కేంద్రాలు, డ్రైవర్‌ లెస్‌ కార్లు, డ్రోన్లు, ఫిన్‌టెక్‌, స్మార్ట్‌సిటీస్‌లాంటి టెక్నాలజీని పరీక్షించేందుకు అవకాశం కల్పించనుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. డేటాకు గోప్యత, భద్రతను కల్పిస్తుంది.

ఆదరణ పథకం కింద 300 కోట్ల రూపాయలతో 2.5 లక్షల మంది బీసీలకు పనిముట్లు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు స్లాబుల్లో 30వేలు, 20వేలు, 10వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు. కృష్ణా జిల్లా ఆట్కూరులో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రైతు సాధికార సంస్థ వెయ్యికోట్ల రుణం పొండానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానంలో భోగాపురం, భావనపాడు ఎయిర్‌పోర్టు నిర్మాణాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీకి దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలా పేరును పెట్టాలని నిర్ణయించింది. ఇక డ్రగ్‌ కంట్రోల్‌శాఖలో 50 పోస్టులు, విద్యుత్‌శాఖలో 400 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

06:39 - January 21, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బవానా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మూడంతస్తుల ఈ భవనంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో 13 మంది మృతి చెందగా, కింది అంతస్తులో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. దాదాపు 20 ఫైర్‌ ఇంజన్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమింయి. మొదట గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు కార్మికులు టెర్రాస్‌ పైనుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

ఢిల్లీలో 17 మంది మృతి...

ఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బావాన ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. 

'చలోరే చల్ చల్ ' పేరిట పవన్ యాత్ర...

హైదరాబాద్ : 'చలోరే చల్ చల్ ' పేరిట సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్ర చేపట్టనున్నారు.రెండు మూడు రోజుల్లోనే యాత్ర ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం యాత్ర తేదీలు, రూట్ మ్యాప్ ప్రకటన చేయనున్నారు. 

దావోస్ కు వెళ్లనున్న కేటీఆర్...

హైదరాబాద్ : సోమవారం నుండి 26 వరకు దావోస్ లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. 

ఆమోదానికి నోచుకోని ద్రవ్య వినిమయ బిల్లు...

ఢిల్లీ : అమెరికాలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దీనితో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

విజయవాడ : అమరావతిలో సమావేశమైన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న క్లౌడ్‌హబ్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పీపీపీ పద్దతిలో భోగాపురం, భావనపాడు విమానాశ్రయాల నిర్మాణానికి ఓకే చెప్పిన మంత్రిమండలి... . డ్రగ్‌ కంట్రోల్‌శాఖలో 50 పోస్టులు, విద్యుత్‌శాఖలో 400 కొలువుల భర్తీకి పచ్చజెండా ఊపింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బాబు వన్ డే వర్క్ షాప్...

హైదరాబాద్ : ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో వన్ డే వర్క్ షాప్ జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

ముదురుతున్న పంచాయితీ రాజ్ చట్టం...

హైదరాబాద్ : పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులపై వివాదం రోజురోజుకు హీటెక్కుతోంది. సబ్ కమిటీ రిపోర్టుపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్... సర్పంచ్‌లకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి ఈనెల 28న అన్ని పంచాయతీల్లో తీర్మానాలు చేస్తామని TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈసీకి ఫిర్యాదు చేయనున్న టి.కాంగ్రెస్...

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి అయాచితంగా మరో ఆయుధం లభించింది. ఢిల్లీలో 20మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈసీ చేసిన రికమండేషన్‌.. తమకు ఉపయోగపడుతుందని అంచనాకొచ్చింది. తెలంగాణలోనూ చట్ట విరుద్ధంగా నియమించబడిన ఆరుగురు పార్లమెంటు సెక్రటరీలను అనర్హులుగా ప్రకటించాలని.. ఈసీకి సోమవారం ఫిర్యాదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పారు. 

Don't Miss