Activities calendar

22 January 2018

బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమన్న జగన్

చిత్తూరు : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 2019లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. హోదా హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా బీజేపీతో అడుగులు వేస్తామన్నారు. ఇంగ్లీష్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు జగన్‌ చెప్పారు. 

22:07 - January 22, 2018

ఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యమని సిపిఎం పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోరాదని సిపిఎం కేంద్రకమిటి నిర్ణయించింది. బిజెపి అధికారంలోకి వచ్చాక మతతత్వ దాడులు, నిరుద్యోగం పెరిగిందని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ పెట్టుబడులకు బార్లా తెరవడం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కేంద్రకమిటి మండిపడింది. 
సిపిఎం కేంద్ర కమిటి సమావేశం 
కోల్‌కతాలో మూడు రోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కమిటీ తీర్మానం చేసింది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ... రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని సిపిఎం స్పష్టం చేసింది.
ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం
2014 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని సిపిఎం కేంద్ర కమటి విమర్శించింది. రైతుల సంక్షోభం, యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిపోయిందని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. 
బిజెపి అధికారంలో పెరిగిన హిందుత్వ శక్తుల దాడులు 
బిజెపి అధికారంలోకి వచ్చాక హిందుత్వ శక్తుల దాడులు పెరిగిపోయాయని సిపిఎం కేంద్ర కమటి పేర్కొంది. గోరక్షణ పేరిట బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై దాడులు జరగడాన్ని  ఖండించింది. మతం పేరిట బిజెపి దేశాన్ని రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం ఆరోపించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు పరిణమించిందని సిపిఎం కేంద్ర కమటి హెచ్చరించింది. రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ సంస్థలను బిజెపి రాజకీయాలకు వాడుకుంటోందని  విమర్శించింది. 
అమెరికా ముందు మోకరిల్లిన మోది ప్రభుత్వం
మోది ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు బార్లా తెరవడం, అమెరికా ముందు మోకరిల్లడాన్ని సిపిఎం కేంద్ర కమటి తప్పుపట్టింది. రక్షణ, రిటైల్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఎఫ్‌డిఐలను అనుమతించడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వల్ల దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లనుందని హెచ్చరించింది. 
లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఓడించేందుకు తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపిన బిజెపి  
త్వరలో జరగనున్న త్రిపుర ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఓడించేందుకు బిజెపి తీవ్రవాద సంస్థలతో సైతం చేతులు కలుపుతోందని సిపిఎం విమర్శించింది. త్రిపురలో బిజెపిని ఓడించే సవాల్‌ను లెఫ్ట్‌ ఫ్రంట్‌ తీసుకుందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టేలా సిపిఎం ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. పొలిట్‌ బ్యూరో రూపొందించిన ముసాయిదాకు ఓటింగ్‌ జరిపి మెజార్టీ నిర్ణయం మేరకు సవరణలు చేసింది.

22:06 - January 22, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారానికి టీ మాస్‌ ఫోరం కదం తొక్కింది. సామాజిక న్యాయం కోసం పోరుబాట పట్టింది. తెలంగాణ వచ్చి మూడున్నరేళ్లవుతున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా టీ-మాస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లను ముట్టడించారు. పలు ప్రాంతాల్లో టీ-మాస్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేపడుతామని నేతలు హెచ్చరించారు. 
హైదరాబాద్‌ లో
కేసీఆర్‌ సర్కార్‌ ఇచ్చిన హామీల అమలు కోరుతూ టీ మాస్‌ భారీ ఆందోళనకు దిగింది. తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల  ముట్టడికి పిలుపునివ్వడంతో టీమాస్‌ ఆధ్వర్యంలో ప్రజలు కలెక్టరేట్‌ల ముట్టడికి భారీగా తరలివచ్చారు. విద్యార్థులు, కార్మికులు, మహిళలు భారీగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తమకు కావలసిన ఫీజు బకాయిలు విడుదల చేయాలని, అర్హత ఉన్న వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 
రంగారెడ్డిలో 
ప్రభుత్వ వాగ్దానాలు అమలుకై రంగారెడ్డి  కలెక్టరేట్‌ ఎదుట టీ మాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందించారు. 
ఖమ్మంలో 
ఖమ్మం జిల్లా టీ-మాస్‌ ధర్నాలో ఉద్రిక్తత నెలకొంది. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ, ధర్నాకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. తర్వాత అనుమతి నిరాకరించారు.  అప్పటికే పెవిలియన్‌ గ్రౌండ్‌కు భారీగా చేరుకున్న పేదలు, మహిళలను గేట్లు మూసి నిర్భందించారు. గేటు బయటకు వచ్చే ప్రయత్నం చేసినవారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ తీరుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డిలో 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటుతున్నా ప్రజల మౌలిక అవసరాలను తీర్చలేని స్థితిలో ఉందని టీ మాస్ రాష్ట్ర నాయకులు చుక్కారాములు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన విమర్శించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడిలో చుక్కారాములు పాల్గొన్నారు. 
మేడ్చల్‌ లో 
ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ను టీ-మాస్‌ నేతలు ముట్టడించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రేషన్‌ షాపు నగదు బదిలీ, పెన్షన్‌, అభయ హస్తం వంటి తదితర సమస్యలు తీర్చాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 
నిజామాబాద్‌ లో 
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీ మాస్‌ ఫోరం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని టీమాస్‌ ఫోరం ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని నేతలు హెచ్చరించారు.
వరంగల్‌ అర్బన్‌ లో
కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని టీమాస్‌ చేపట్టింది. అయితే కలెక్టరేట్‌ వద్దకు వెళ్తున్న క్రమంలో టీ మాస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురికీ మధ్య వాగ్వాదం జరగడంతో టీ మాస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.
జనగామలో
జనగామ జిల్లాలో టీమాస్‌ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా నిర్వహించారు.  ధర్నాలో అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు. 
ఆదిలాబాద్‌ లో 
ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముందు టీ మాస్‌ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని టీ మాస్‌ నేతలు మండి పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, ఇప్పటికైనా ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన టీ మాస్‌ కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 

 

22:02 - January 22, 2018

చిత్తూరు : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 2019లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. హోదా హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా బీజేపీతో అడుగులు వేస్తామన్నారు. ఇంగ్లీష్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు జగన్‌ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:59 - January 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో జనసేనాని తొలి అడుగు పడింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తెలంగాణలో పర్యటిస్తున్నానన్న ఆయన.. ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్‌.. ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తానన్నారు. 
ప్రజా యాత్రను ప్రారంభం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన ప్రజా యాత్రను ప్రారంభించారు. ఉదయం తన నివాసం నుంచి ప్రశాసన్‌నగర్‌లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్‌కు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. భార్య లెజినోవా ఆయనకు హారతి ఇచ్చారు. అనంతరం పవన్‌ కారులో జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయలుదేరారు. ఆ సమయంలో పవన్‌కు మద్దతుగా జనసేన కార్యకర్తలు పెద్దయెత్తున నినాదాలు చేశారు. పవన్‌ వెంట పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సుమారు 50 వాహనాల్లో బయలుదేరారు.
ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్న పవన్‌ 
కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. అక్కడ పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం పవన్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పవన్‌కల్యాణ్‌ 11లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.  
కరీంనగర్‌ చేరుకున్న పవన్‌ 
ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్‌ కల్యాణ్‌ కరీంనగర్‌ చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్‌ ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశమేదీ తనకు లేదన్నారు. నిర్మాణాత్మక రాజకీయాలు మాత్రమే తాను చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో ఆలోచించి ఏయే సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చిస్తామని పవన్‌ చెప్పారు.
ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తా : పవన్  
ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో తన పర్యటన ప్రారంభమవుతుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జిల్లాలో రెండు మూడు రోజులు పర్యటన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒంగోలులో ఫ్లోరోసిస్‌, కిడ్నీ బాధితులను కలుస్తామన్నారు. అనంతరం విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం బాధితులను కలుస్తానన్నారు పవన్‌. 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలి : పవన్ 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, రాజకీయ అస్థిరత కోసం తానెప్పుడూ మాట్లాడనని పవన్‌ అన్నారు. గొడవలతో సమస్యలు పరిష్కారం కావని.. గొడవలతో ప్రజలకు ఇబ్బందులు కలిగే పని తాను చేయనని పవన్‌ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగతంగా నిర్మాణ దశలో ఉందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. 
ఓటుకు నోటుపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. 
ఓటుకు నోటుపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. అది తప్పని తనకూ తెలుసన్నారు. ఇండియన్‌ పొలిటికల్‌ ప్రాసెస్‌లో అన్ని పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయన్న ఆయన.. దీనిపై గొడవ పెట్టుకుని అస్థిరత సృష్టించడం ఇష్టం లేకే మాట్లాడలేదన్నారు.
రేపు జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం  
ఇక పవన్‌ కల్యాణ్‌ మంగళవారం కరీంనగర్‌ జిల్లా జగిత్యాల రోడ్‌లోని శుభం గార్డెన్స్‌లో 10 గంటల 45 నిమిషాలకు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కొత్తగూడెం బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కొత్తగూడెం చేరుకొని అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో జరిగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్‌కు పయనమవుతారు.

 

21:54 - January 22, 2018

స్విట్జర్లాండ్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పెట్టుబడుల వేటకు బయలుదేరి వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యారు. ముందుగా జురిచ్‌‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం.. పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్‌ రాన్ పాల్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంది. ఏపీలో సంస్థ విస్తరణకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని.. రానున్న ఐదేళ్లలో 5000 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ భేటీలో పాటు సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, యనమల రామకృష్ణుడు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఉన్నారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వం, జూరిచ్ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిరింది. ఐటీ, లైఫ్‌ సెన్సెస్, రీజినల్ డెవలప్‌మెంట్‌లో ఇరు రాష్ట్రాలు సహకరించుకోనున్నాయి. 

 

21:42 - January 22, 2018

డార్విన్ సిద్ధాంతం శాస్త్రీయంగా తప్పు అని కేంద్రమానవ వనరుల సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. సత్యపాల్ వ్యాఖ్యలపై సైన్స్ సోసైటీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్. మోహన్ రావు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి ప్రతినిధి రమేష్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

2019లో ఓట్లు, సీట్ల గురించి ఆలోచిండం లేదన్న పవన్

కరీంనగర్ : సీఎం కేసీఆర్ ను కలవడంలో తప్పేముందని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన ఘనత కేసీఆర్ ది అన్నారు. 2019లో ఓట్లు, సీట్ల గురించి ఆలోచిండం లేదని తెలిపారు. రేపు, ఎల్లుండి కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు చెప్పారు. కార్యకర్తలతో చర్చించి జనసేన కార్యక్రమాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో సమస్యలపై అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చిస్తానని తెలిపారు.

21:22 - January 22, 2018

కరీంనగర్ : సీఎం కేసీఆర్ ను కలవడంలో తప్పేముందని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన ఘనత కేసీఆర్ ది అన్నారు. 2019లో ఓట్లు, సీట్ల గురించి ఆలోచిండం లేదని తెలిపారు. రేపు, ఎల్లుండి కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు చెప్పారు. కార్యకర్తలతో చర్చించి జనసేన కార్యక్రమాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో సమస్యలపై అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చిస్తానని తెలిపారు.

 

21:13 - January 22, 2018

తెలంగాణ గవర్నర్ యవ్వారం గలీజుగున్నదంటున్న కాంగ్రెస్ పార్టీళ్లు, పవన్ కళ్యాణ్ సారు పర్యటనలు సుర్వు చేస్తున్నడు, పవన్ కళ్యాణ్ కేసీఆర్ ట్రాపుల పడ్డాడా?  చంద్రబాబుకు అసలు భయముండదా ?, మమ్మలను ఎవ్వలేం జేయలేరు అంటున్నడు ఇంటి మంత్రి నాయిని నర్సన్న, తెలంగాణల ఇంకో పార్టీ వచ్చేశింది ?, జబర్దస్త్ రోజమ్మ ఇంట్లకెళ్లి బంగారం దోస్కున్నరట, తెలంగాణ రోడ్డు మా ఆంధ్రల ఎట్లేస్తరని పంచాది లేశింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

 

20:49 - January 22, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరం 10 టీవీ క్యాలెండర్‌ను స్థానిక ఎమ్మెల్యే మొడియి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. క్యాలెండర్‌ను అందంగా తీర్చిదిద్దిన 10 టీవీ యాజమాన్యాన్ని శ్రీనివాసరావు అభినందించారు. ప్రజాసమస్యలను వెలికితీయడంలో 10 టీవీ ముందుందని చెప్పారు. వాస్తవాలను చూపించడం ద్వారా 10 టీవీ వీక్షకాదరణ పొందిందని పోలవరం ఎమ్మెల్యే  శ్రీనివాసరావు చెప్పారు. 

20:46 - January 22, 2018

గుంటూరు : జిల్లాలోని గొట్టిపాడు ప్రశాంతంగా ఉండేది. పచ్చని పంటపొలాలు, ఆహ్లాదక వాతావరణంతో అలరాలుతుండేది.  జనవరి ఫస్టు ఆ గ్రామంలో కార్చిచ్చు రాజేసింది. ఆ అలజడి నేటికీ కొనసాగుతూనే ఉంది.  ఇంతకీ గొట్టిపాడులో దళితులపై దాడికి కారణం ఏమిటి? గ్రామంలో నేటికీ 144 సెక్షన్‌ ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది? గొట్టిపాడులో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాచ్‌ దిస్‌ టెన్‌ టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌....
గొట్టిపాడులో కులచిచ్చు 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు గ్రామం ప్రశాంతతకు నిలయం. ఎటు చూసినా పచ్చని పొంటపొలాలు... ఆహ్లాదకర వాతారణం..గ్రామస్థులంతా తమ పనులు ఏవో తాము చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అలాంటి గ్రామంలోకి  అగ్రకుల అహంభావం ప్రవేశించింది. అది దళితులపై దాడికి ఉసిగొల్పింది. వెరసి అందరి జీవితాల్లోకి నూతన కాంతులు తీసుకొచ్చిన కొత్త సంవత్సరం... గొట్టిపాడులో అలజడి రేపింది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కులచిచ్చు రేపింది. 
దళితులపై దాడి
జనవరి ఫస్టున అగ్రకులస్తులు ఉండే వీధుల్లో దళిత యువకులు బైకులపై రావడం పాపమైపోయింది. దళిత యువకులు బైకులపై తిరగడాన్ని అగ్రకులస్తులు జీర్ణించుకోలేకపోయారు. వారిపై కక్షకట్టారు. దీంతో అగ్రకులానికి చెందిన వారు.. దళితులపై దాడికి తెగబడ్డారు. అంబేద్కర్‌ సెంటర్‌లో జరిగిన ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. తమవారిపై దాడి జరగడంతో దళితులు అగ్రకులస్తులపై ప్రతిదాడికి యత్నించారు.  ఇరువర్గాల ప్రజలు దాడులు చేసుకోవడంతో గ్రామంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రశాంత వాతావరణంపోయి... ఒక్కసారిగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరి ఫస్టు నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ అమలులో ఉంది.  గ్రామంలోకి ఎవరు వెళ్లాలన్న పోలీసుల అనుమతి తప్పనిసరైంది. 
గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌
అగ్రకులస్థుల దాడిలో గాయపడిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి ఇంకా సీరియస్‌గానే ఉంది. నేటికీ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే వారు చికిత్స పొందుతున్నారు. వీరిని సీపీఎం నాయకులు, కేవీపీఎస్‌ నేతలు పరామర్శించి దాడి వివరాలు తెలుసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయకపోయినా.. దళితులు అన్నకారణంగా అగ్రవర్ణాలు తమపై దాడికి పాల్పడ్డాయని బాధితులు వాపోతున్నారు.  గొడవ జరిగినప్పటి నుంచి గ్రామంలో సాంఘిక బహిష్కరణ కొనసాగుతోంది. దళితులను ఎవరూ వ్యవసాయ పనులకు పిలవడం లేదు. దళితులు కౌలుకు తీసుకున్న భూములను ఇవ్వాలన్న ఒత్తిడి పెరిగింది. దళితులకు నిత్యావసరాలు షాపుల్లో ఇవ్వడంలేదు. చివరికి దళితులకు మంగళిషాపుల్లో కటింగ్‌ కూడా చేయడం లేదు. ఆధునిక సమాజంలో ఇదేం అన్యాయమని దళితులు ప్రశ్నిస్తున్నారు.
దళితుల కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు 
అగ్రకులాల దాడిలో తీవ్ర గాయాలపాలైన దళితుల కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్నవారే తమను శత్రువులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అగ్రకులస్తులు, మరోవైపు పోలీసులు తమను వేధిస్తున్నారని వాపోయారు. అండగా ఉండాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు  పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
దళితులపైనే అక్రమ కేసులు 
పోలీసులు మాత్రం గ్రామంలో వివాదాలు పూర్తిగా తగ్గిపోయాయని చెబుతున్నారు. మళ్లీ ఘర్షణలు జరుగకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్‌ కొనసాగిస్తున్నామని తెలిపారు. దళితులపై దాడికి పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవు. పైగా దళితులపైనే అక్రమ కేసులు బనాయించారని ప్రజాసంఘాల నేతలు చెప్తున్నారు.  దాడికి పాల్పడినవారు అధికారపార్టీ నేతలని.. వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజాసంఘాల నేత లక్ష్మణ్‌ తెలిపారు.  స్థానిక శాసనసభ్యుడు రావెల కిషోర్‌బాబు దళితుడు అయ్యి ఉండికూడా.. బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
దళితుల్లో ఆగ్రహం 
దళితులపై దాడిజరిగి 20 రోజులు గడిచినా.. ఇంతవరకు ఒక్కరిపై చర్యలు తీసుకోవడంపై దళితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు దళితులకు వివిధ ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. గొట్టిపాడు దళితులను రాజకీయ, ప్రజాసంఘాల నేతలు  పరామర్శించేందుకు పోలీసులు అడ్డుచెబుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పరామర్శించి వివరాలు తెలుసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో  ప్రభుత్వంపై నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళిత వ్యతిరేకి ప్రభుత్వమంటూ దుయ్యబడుతున్నారు. దళితులపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దాడికి పాల్పడిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. దళితులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
ఈనెల 24న ఛలో గొట్టిపాడు : వామపక్షనేతలు 
గొట్టిపాడు దళితుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈనెల 24న ఛలో గొట్టిపాడు నిర్వహిస్తామని వామపక్షనేతలు హెచ్చరిస్తున్నారు. దళితులను పరామర్శించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో 24న ఏంజరుగుతుందన్న టెన్షన్‌ నెలకొంది.

 

20:36 - January 22, 2018

ఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్‌ ఎంపీ... కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. చంద్రబాబు, మోదీ కలిసి నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రజను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు.. ఇతర పార్టీలతో కలిసి పనిచేయాలని కేవీపీ కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. 

 

20:32 - January 22, 2018

స్విట్జర్‌ల్యాండ్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్‌ల్యాండ్‌  పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు  నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు.  ఈనెల 25 వరకు చంద్రబాబు దావోస్‌లో ఉంటారు.  పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో  ఆయన సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు.  చంద్రబాబు  వెంట మంత్రులు, అధికారులు కూడా వెళ్లారు. ఈనెల 26న చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. 

 

నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తా : పవన్ కళ్యాణ్

కరీంనగర్ : తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ? వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. రాజకీయ అస్థిరత కోసం తాను మాట్లాడనని చెప్పారు. నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తానని పేర్కొన్నారు. గొడవలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జనసేన చిన్న పార్టీ అని.. ఇప్పుడే సీట్ల గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఈనెల 27న అనంతపురంలో పర్యటిస్తానని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తానని చెప్పారు. 

తెలంగాణ, ఏపీలో పోటీ చేస్తా : పవన్ కళ్యాణ్

కరీంనగర్ : రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఏపీలో పోటీ చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం కావాలన్నారు. తనను బీజేపీలోకి రావాలని అమిత్ షా గతంలోనే కోరారని.. దాన్ని అప్పట్లోనే సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. 

19:37 - January 22, 2018

కరీంనగర్ : రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఏపీలో పోటీ చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం కావాలన్నారు. తనను బీజేపీలోకి రావాలని అమిత్ షా గతంలోనే కోరారని.. దాన్ని అప్పట్లోనే సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ? వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. రాజకీయ అస్థిరత కోసం తాను మాట్లాడనని చెప్పారు. నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తానని పేర్కొన్నారు. గొడవలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జనసేన చిన్న పార్టీ అని.. ఇప్పుడే సీట్ల గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఈనెల 27న అనంతపురంలో పర్యటిస్తానని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తానని చెప్పారు. 

 

18:44 - January 22, 2018

ఢిల్లీ : 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ రాజ్ పథ్ సిద్ధమైంది. రేపు రాజ్ పథ్ లో ఫుల్ డ్రస్ రిహార్సల్ నిర్వహించారు. ఇందుకోసం సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్ పథ్ వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా 10 ఆసియాన్ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. రాజ్‌పథ్ వద్ద ఏర్పాట్లపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:42 - January 22, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అనుబంధ సంఘం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రూపొందించిన క్యాలెండర్‌ను యూనియన్‌ అధ్యక్షులు గోపాల్‌ ఆవిష్కరించారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇవ్వకపోవడం బాధాకరమని గోపాల్‌ అన్నారు.

18:40 - January 22, 2018

వరంగల్‌ అర్బన్‌ : ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని చేపట్టిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా టీ మాస్‌ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ వద్దకు చేరుకునే క్రమంలో కాళోజీ సెంటర్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు టీమాస్‌ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి, పీఎస్‌కు తరలించారు. 

 

18:28 - January 22, 2018

ఖమ్మం : జిల్లాలో నిర్వహించిన టీ మాస్‌ ధర్నాలో ఉద్రిక్తత నెలకొంది. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ, ధర్నాకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. తర్వాత అనుమతి నిరాకరించారు.  అప్పటికే పెవిలియన్‌ గ్రౌండ్‌కు భారీగా చేరుకున్న పేదలు, మహిళలను గేట్లు మూసి నిర్భందించారు. గేటు బయటకు వచ్చే ప్రయత్నం చేసినవారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం నిరకుశ పాలన సాగిస్తుందని టీమాస్‌ నేతలు మండిపడ్డారు. టీ-మాస్‌ నేతల అరెస్టులకు సంబందించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

18:25 - January 22, 2018

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తిస్థాయి దర్యాప్తుకు తెలంగాణ డీజీపీ ఆదేశించారు. ప్రత్యేక అధికారిణిగా ఐజీ షికా గోయల్‌ను నియమించారు. ఐజీ షికా గోయల్.. నేరెళ్ల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు దర్యాప్తు సంఘం హైకోర్టుకు సమర్పించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:23 - January 22, 2018

కరీంనగర్  : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్యనేతలతో భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 11 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. హైదరాబాద్‌ నుంచి కొండగట్టుకు చేరుకునే మార్గంలో పవన్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానంతరం పవన్‌ కరీంనగర్‌కు వెళ్లారు. కాసేపట్లో జనసేన కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు.

 

18:16 - January 22, 2018

నిజామాబాద్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని టీమాస్‌ ఫోరం ఆరోపించింది. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీ మాస్‌ ఫోరం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్‌ చేస్తున్న టీ మాస్‌ నేతలతో మరింత సమాచారం  వీడియోలో చూద్దాం....

ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలనం

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలనం జరిగింది. 6 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్ 7-6,7-5,7-6 తేడాతో హాంగ్ చుంగ్ (దక్షణ కొరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. 

18:00 - January 22, 2018

సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటుతున్నా ప్రజల మౌలిక అవసరాలను తీర్చలేని స్థితిలో ఉందని టీ మాస్ రాష్ట్ర నాయకులు చుక్కారాములు అన్నారు. చుక్కా రాములుతో 10 టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన విమర్శించారు. టీ మాస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచుతామన్నారు. 

మంచిర్యాల కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల : కలెక్టరేట్ లో వెన్నెల రాజు గౌడ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగా ఆత్మహత్నాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు గౌడ్ మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

డి-లిమిటేషన్ బిల్లుపై మోడీ సంతకం...?

హైదరాబాద్ : డి-లిమిటిషన్ బిల్లుపై మోడీ సంతకం చేశారని సమాచారం ఉందని ఉత్తమ్ అన్నారు. పాపం స్థానిక బీజేపీ నేతలకు ఈ విషయం తెలియదని, కొన్ని జనరల్ నియోజకవర్గంలో కూడా ఎడీఎంఆర్బీ విధానాన్ని అమలు చేస్మాని ఉత్తమ్ తెలిపారు. డి-లిమిటేషన్ జరిగితే పార్లమెంట్ కు రెండు చొప్పున అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఉత్తమ్ అన్నారు. 

డిసెంబర్ లో ఎన్నికలు : ఉత్తమ్

హైదరాబాద్ : ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు వచ్చే వాతావరణం ఉందని టీపీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, అన్ని కమిటీలు పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఢిల్లీ మెట్రో స్టేషన్ లో బుల్లెట్ల కలకలం

ఢిల్లీ : మెట్రో స్టేషన్ బుల్లెట్ల కలకం రేగింది. ఓ మహిళా వద్ద 20 బుల్లెట్లు బ్యాగులో ఉన్నట్లు తెలిసింది. దీంతో అందరు కంగారుపడ్డారు. బ్యాగులో ఉన్న బుల్లెట్లు తనవేనని మహిళా తండ్రి వెల్లడించాడు. తన ఆయుధం లైసెన్స్ కాపీని మహిళా తండ్రి పోలీసులకు చూపారు. 

17:34 - January 22, 2018

చిన్ననాట ఎన్నో ఇష్టాలుంటాయి. వయసు పెరిగేకొద్ది అవి మరుగున పడిపోతుంటాయి. వాటిపై ఆసక్తి కూడా తగ్గిపోతూవుంటుంది. కానీ చిన్న నాడే ఎర్పడిన ఆసక్తిని విడిచిపెట్టకుండా మరింత మక్కువను పెంచుకొని, దాంతోనే గుర్తింపు తెచ్చుకున్నవారు అరుదుగా ఉంటారు. హాబీగా మొదలైన కళలకు మరింతగా మెరుగులు దిద్దుకుని దానికి సృజనాత్మకతను జోడించి పలువురి మన్ననలను పొందుతున్న ఓ యువతి కథనంతో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి. యువతి జాహ్నవి మాగంటి పలువురి మన్ననలను పొందుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కాసేపట్లో కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్

కరీంనగర్ : కాసేపట్లో పవన్ కల్యాణ్ కార్యకర్తలతో సమవేశం కానున్నారు. ఆయన హోటల్ శ్వేతలో సాయంత్రం 5.45 ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే హోటల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ తో చంద్రబాదు భేటీ

జ్యూరీక్ : పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రామ్ పాల్ తో ఏపీ సీఎం చంద్రబాబు తొలి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. నాందేడ్, కుప్పంలో ఇప్పటికే పయనీరింగ్ సంస్థ కార్యకలపాలు చేపట్టింది. భవిష్యత్ లో విస్తరణ దిశగా పయనీరింగ్ ప్రణాళికలు చేస్తోంది. ఏపీలో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థను సీఎం కోరారు. 

16:52 - January 22, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసీపీకి ఏ మాత్రం పోటీ కాదని ఆపార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా మూడున్నరేళ్లుగా జనం కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్‌ అని.. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడే తెలంగాణ నుంచి రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నారని అన్నారు. పవన్‌ను తాము పోటీ దారుడిగా చూడటం లేదని అంబటి రాంబాబు అన్నారు. 

16:48 - January 22, 2018

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్యనేతలతో భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 11 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. హైదరాబాద్‌ నుంచి కొండగట్టుకు చేరుకునే మార్గంలో పవన్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానంతరం పవన్‌ కరీంనగర్‌కు వెళ్లారు. కాసేపట్లో జనసేన కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:39 - January 22, 2018

ఖమ్మం : జిల్లాలో నిర్వహించిన టీ మాస్ ధర్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం చూపారు. దౌర్జాన్యానికి పాల్పడ్డారు. ర్యాలీగా వెళ్తున్న టీమాస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. పెవిలియన్ గ్రౌండ్ కు కలెక్టరేట్ కు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ధర్నాకు ముందు పోలీసులు అనుమతి ఇచ్చారు. తిరిగి అనుమతి పోలీసులు నిరాకరించారు. ప్రదర్శనకారులను బలవంతంగా అరెస్టు చేశారు. అరెస్టులపై నేతలు మండిపడుతున్నారు. 
ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

నేరేళ్ల ఘటనపై దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా నేరేళ్ల ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. హైకోర్టు ఆదేశాలతో పూర్తి స్థాయి దర్యాప్తునకు డీజీపీని ఆదేశించడంతో నేరేళ్ల ఘటనపై ప్రత్యేక అధికారిగా ఐజీ షికా గోయల్ ను తెలంగాణ ప్రభుత్వం నియమంచింది. 

గుంటూరు కలెక్టరేట్ రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు : జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. జెడ్పీ ఆవరణలో ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. నాదెండ్ల మండలం బుక్కాపురానికి చెందిన రైతు సాగు చేసి అప్పులపాలయ్యాడు. 

మున్సిపల్ చైర్మన్ కొడుకు ఆత్మహత్యాయత్నం

కడప : మాజీ మున్సిపల్ చైర్మన్ కుమారుడు చౌడం శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పుల బాధతో శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. 

16:08 - January 22, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేల నిర్వహించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్రాంతికి కోడి పందేలను నివారించకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. ఈ నెల 29న సీఎస్, డీజీపీ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

సంక్రాంతి కోడి పందాలపై హై కోర్టు ఆగ్రహం

హైదరాబాద్ : సంక్రాంతి కోడి పందాల జరగడం పట్ల ఏపీ ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందాలు జరుతుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 29న డీజీపీ, సీఎస్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. 

ఖమ్మంలో ఉద్రిక్తత

ఖమ్మం : ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్యాలని కలెక్టరేట్ వరకు టీ మాస్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులుకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని తరలిస్తున్న వాహనం ఎదుట ఆందోళనకారులు బైఠాయించారు. 

15:57 - January 22, 2018
15:42 - January 22, 2018

జగిత్యాల : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్‌ అభిమానులు ఆయనకు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు. కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.11 లక్షలు ఇచ్చారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు చేరుకోవడంతో సందడి నెలకొంది. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం పవన్‌ కరీంనగర్‌ కు బయల్దేరారు. అక్కడ బస చేసిన తర్వాత జనసేన కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రజాయాత్రకు శ్రీకారం చుడతారు. కరీంనగర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ప్రజాయాత్ర చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

భార్యను చిత్రహింసలు పెట్టిన కేసులో భర్త అరెస్ట్

మేడ్చల్ : శామీర్ పేటలో భార్యను చిత్రహింసలు పెట్టిన కేసులో భర్త కంచుగాట్ల నగేష్, మంత్రగాడు ఒగ్గు మల్లేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త అక్రమ సంబంధపై ప్రశ్నించినందుక దెయ్యం పట్టిందని నగేష్ మంత్రగాడితో భార్యను కొట్టించాడు. 

తెలంగాణలో 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

ఢిల్లీ : తెలంగాణలో 10 మంది అధికారులకు కేంద్రం ఐఏఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఐఏఎస్ హోదాలో కొర్ర లక్ష్మి, చిట్టెల లక్ష్మి, కె.ధర్మారెడ్డి, సీహెచ్ శివలింగయ్య, వి. వెంకటేశ్వర్లు, టి. వినయ్ కృష్ణారెడ్డి, ఎం.హనుమంతరావు, డి. అమోయ్ కుమార్, కె. హైమావతి, ఎం. హరితలు ఉన్నారు. 

15:10 - January 22, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలోని బాసర క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. వసంత పంచమి సందర్భంగా పలువురు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మావారిని దర్శించుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:07 - January 22, 2018

గుంటూరు : రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని వామపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గుంటూరుజిల్లా పెదగొట్టిపాడులో దళితులపై దాడులు చేసిన వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని లెఫ్ట్‌నేతలు మండిపడ్డారు. దళితులపై దాడులను నిరసిస్తూ ఈనెల 24న చలో గొట్టిపాడు నిర్వహిస్తామంటున్న  సీపీఐ, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి.మధుతో 10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఎన్నారైలతో కేటీఆర్ ముఖాముఖి

జ్యూరిచ్ : దక్షణ కొరియాలోని జ్యూరిచ్ లో ఎన్నారైలతో కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలను కేటీఆర్ వారికి వివరించారు. రాష్ట్ర సర్వోవతోముఖాభివృద్ధిలో ఎన్నారైల సమకారం అవసరమని, ఎన్నారైలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ విజన్ కు పలు రాష్ట్రాలు, కేంద్ర నుంచి అభినందనలు వచ్చాయని కేటీఆర్ గుర్తుచేశారు. 

ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

హైదరాబాద్ : మణికొండ పంచవటి కాలనీలోని నగిరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.10లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్టు తెలుస్తోంది. 

14:49 - January 22, 2018

జగిత్యాల : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్‌ అభిమానులు ఆయనకు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రజాయాత్రకు శ్రీకారం చుడతారు. కరీంనగర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ప్రజాయాత్ర చేయనున్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు చేరుకోవడంతో సందడి నెలకొంది. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

 

గజల్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

హైదరాబాద్ : గజల్ బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. గజల్ శ్రీనివాస్ ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో ఆధారలతో సహా దొరిపోయిన విషయం తెలిసిందే. 

కొండగట్టు అంజనేయస్వామి ఆయలంలో పవన్ పూజలు

కరీంనగర్ : జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయంలో పవన్ పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆలయానికి పవన్ రూ.11లక్షల విరాళం ప్రకటించారు. స్వామి అనుగ్రహంతోనే పార్టీ స్థాపించానని, అజంనేయస్వామి అశీస్సులతో 2009లో బతికి బట్ట కట్టానని పవన్ అన్నారు.

గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

ఢిల్లీ : గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ నిబంధనలు సడలించాలని ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తీరస్కరించింది. 

ఓయూ పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్

హైదరాబాద్ : ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వెలుగు చూసింది. ఆర్ట్స్ కాలేజ్ సెంటర్ లో భారీగా కాపీయింగ్ పాల్పడుతున్న 15 మందిని సబ్బంది గుర్తించి బయటకు పంపించారు. 

ప్రత్యేక హోదా, విభజన హామీలపై అఖిలపక్ష భేటీ

కృష్ణా : విజయవాడలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై అఖిలపక్ష భేటీ జరిగింది. పలు తీర్మనాలను అఖిలపక్షం ఆమోదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు అమలు చేయడంలో ప్రధాని మోడీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 

13:17 - January 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతుండడంపై టీ మాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డబుల్ బెడ్ రూం..ఫీజు రీయింబర్స్ మెంట్..ఉద్యోగాల భర్తీ..డీఎస్సీ భర్తీ చేయాలని..కనీస వేతనాలు అమలు చేయాలని..తదితర డిమాండ్లతో టీ మాస్ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట భారీ ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కూడా భారీగా ప్రజలు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గళమెత్తారు. ఉదయం నుండి నేతలు..ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించే వరకు తాము కదిలేది లేదని టీ మాస్ నేతలు స్పష్టం చేశారు. కానీ పోలీసులు లోనికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో కూడా ఆందోళనలు కొనసాగాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:16 - January 22, 2018

పద్మావతి ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ పై కొంత మంది దాడి చేశారు. మొత్తానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాకు సెన్సార్ అనుమతి లభించలేదు. సెన్సార్ బోర్డుతో చర్చల అనంతరం సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ షరతు విధించింది. అంతే కాక సినిమా పేరు పద్మావత్ గా మార్చాలని చెప్పింది. అన్నింటికి ఒకే చెప్పిన నిర్మాత సినిమా విడుదలకు సిద్దమౌతుండగా మూడు రాష్ట్రాలు ఈ సినిమాపై నిషేధాన్ని విధించాయి. దీంతో సినిమా దర్శకుడు భన్సాలీ సుప్రీం ఆశ్రయించాడు. దీంతో సుప్రీంలో సినిమాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నెల 25 సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే సికింద్రాబాద్ లోని టివోలి ఎక్స్ ట్రీమ్ సినిమా థీయేటర్ లో పద్మావత్ విడుదల కానుంది. ఆ థీయేటర్ ముందు కొంత మంది మార్వాడీ యువకులు వచ్చి చిత్రా పోస్టర్లను చించేసి హంగామా చేశారు. థీయేటర్ యాజమాని పోలీసులు తెలపడంతో పోలీసులు వచ్చే సారికి వారు వెళ్లిపోయారు.   

పవన్ సీజనల్ నాయకుడు

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు వచ్చిపోయే వ్యక్తి అని, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రావడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎసర్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. పవన్ సీఎంను కలిసిన సందర్భం వేరు, రహస్య భేటీ వేరు ఆయన తెలిపారు. 

12:42 - January 22, 2018

పెద్దపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతన్నలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమ ఆగ్రహం ఎలా ఉంటుందో ఆ ప్రజాప్రతినిధులకు చూపెట్టారు. రైతులు చేసిన ఆందోళనతో ప్రజాప్రతినిధులు కార్లు దిగి పోలీసుల సహాయంతో వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను చేపట్టారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీకి చెందిన గోదాంలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వారు ప్రయాణిస్తున్న వాహనాలకు అడ్డు తగిలారు. తమ పంటలు ఎండిపోతున్నాయని..సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారు ? అని రైతులు నిలదీశారు. రైతుల ఆగ్రహం చూసిన ప్రజాప్రతినిధులు కార్లు దిగి పోలీసుల సహయంతో వెనుదిరిగారు. 

12:35 - January 22, 2018

విజయవాడ : చిన్న చిన్న కారణాలు...పెద్దవాళ్లు మందలించారని పట్టుమని 15 సంవత్సరాలు నిండని వారు తీవ్ర మనోవేదనకు గురవుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పెద్దమ్మ మందలించిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన చిట్టినగర్ లో చోటు చేసుకుంది. కొడుకు వైద్య పరీక్షల నిమిత్తం దంపతులు చెన్నైకి వెళ్లారు. వారి కుమర్తె లిఖిత ను పెదమ్మ దగ్గర ఉంచి వెళ్లారు. కానీ రెండు రోజుల నుండి లిఖిత అదే పనిగా ఫోన్ లో మాట్లాడుతుండడం పెద్దమ్మ గమనించింది. ఫోన్ లో తరచూ మాట్లాడవద్దని...ఈ విషయం తల్లికి చెబుతానని పెద్దమ్మ బెదిరించింది. తీవ్ర మనోవేదనకు గురైన లిఖిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులకు విషయం తెలిసి భోరున విలపిస్తున్నారు. బాలిక మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

మందలించిందని బాలిక ఆత్మహత్య

కృష్ణా : జిల్లా విజయవాడలోని చిట్టి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. పెద్దమ్మ మందలించిదని 14 ఏళ్ల లలిత అనే బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లలిత తరుచు ఫోన్ మాట్లాడుతుండంతో ఆమె పెద్దమ్మ మందలించింది. 

12:29 - January 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటుతోంది. ఇచ్చిన హామీలు అమలు నోచుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుడు..పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో ప్రజా సమస్యలు పరిష్కరించాలని టీ మాస్ ఆందోళన చేపడుతోంది. గత కొన్ని రోజులుగా మండలాల్లో ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీ మాస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చింది. కానీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీ మాస్ నేతలు టెన్ టివితో మాట్లాడారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. మూడున్నరేళ్ల నుండి ఎన్నో వాగ్ధానాలు చేశారని, కానీ ఏ ఒక్క హామీ నెరవేరడం లేదని ప్రజలు పేర్కొంటున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం నివాసాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని, కానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. 400 లోపే ఇళ్లు ఇచ్చారని, ఇంతమందికి ఎక్కడి నుండి ఇస్తారని ప్రశ్నించారు. రంగారెడ్డి వద్ద జరిగిన ఆందోళనలో టీ మాస్ రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహరెడ్డి పాల్గొన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయాలని, ఎలా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం పెట్టాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఉగ్రవాది అబ్దుల్ ఖురేషి అరెస్ట్ చేసిన పోలీసులు

 ఢిల్లీ: పోలీసులు ఉగ్రవాది అబ్దుల్ ఖురేషి ని అరెస్ట్ చేశారు. ఖురేషి 2008 గుజరాత్ బాంబు పేలుళ్ల సూత్రధారి గా పోలీసులు పేర్కొన్నారు. 

12:18 - January 22, 2018
12:11 - January 22, 2018

తమిళ హీరో సూర్య ఎత్తును గేలిచేస్తూ సన్ మ్యూజిక్ లో ప్రసారమైనా కార్యక్రమం పై నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ స్పందించారు. సూర్య వ్యాఖ్యలు సరైనవి కావని వెంటనే ఆ చానల్ క్షమాపణలు చెప్పాలని, ఆ యాంకర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నటనకు ఆహార్యంతో సంబంధంలేదని ఆమె ట్వీట్ చేశారు. ఇదే విషయంపై విశాల్ కూడా స్పందించారు. నటులను కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయకూడదని ఆయన అన్నారు. సన్ మ్యూజిక్ చానల్ ఓ కార్యక్రమంలో ఇద్దరు వ్యాఖ్యతలు సూర్యను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అందులో ఓ యాంకర్ త్వరలో సూర్య, అమితాబ్ తో సినిమా చేయబోతున్నారని తెలిపింది. దీంతో వెంటనే రెండో యాంకర్ అమితాబ్ హైట్ ఎక్కడ సూర్య హైట్ ఎక్కడ అని వ్యాఖ్యానించ్చింది. మరో యాంకర్ సూర్య అనుష్కతో చేసినప్పుడే హై హిల్స్ షూ వేసుకున్నాడని, ఇప్పుడు అమితాబ్ చేయాలంటే కుర్చీ వేసుకోని నటించాలని అంది. ఈ వ్యాఖ్యలతో దూమరం రేగింది.

అడవుల్లో పులుల, జంతు గణన ప్రారంభించిన రామన్న

ఆదిలాబాద్ : తెలంగాణ అడవుల్లో పులుల, జంతు గణనను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఈ నెల 29 వరకు జంతు గణన కొనసాగుతుంది. 3వేలకు పైగా అటవీ బీట్లలో జంతువులు, వృక్షజాతులు, ఆవాసాల  గుర్తింపు ప్రక్రియ కూడా కొనసాగనుంది. 

తాగునీటి కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్న ప్రజలు

పెద్దపల్లి : జిల్లా అప్పన్నపేటలో తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ల వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకోవడంతో కొంతదూరం నడిచిన మనోహర్ రెడ్డి పోలీసు వాహనంలో వెళ్లారు. 

తాగునీటి కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్న ప్రజలు

పెద్దపల్లి : జిల్లా అప్పన్నపేటలో తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ల వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకోవడంతో కొంతదూరం నడిచిన మనోహర్ రెడ్డి పోలీసు వాహనంలో వెళ్లారు. 

11:58 - January 22, 2018

గుంటూరు : జిల్లా గొట్టిపాడులో దళితులపై జరిగిన దాడుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా మాట్లాడారు. దాడి చేసిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని, దళితులపై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయక అమాయకులైన దళితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఇందులో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఈనెల 24వ తేదీన చలో గొట్టిపాడు నిర్వహిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. 

రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టీ మాస్ ధర్నా

హైదరాబాద్ : రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టీ మాస్ ఆధ్వర్యంలో ప్రజలు ధర్నాకు దిగారు. ధర్నాలో సీఐటీయై జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్, పీఎల్ విశ్వేశ్వర్ రావు, భూపాల్, సామాజిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

11:20 - January 22, 2018

హైదరాబాద్ : ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీ మాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కొనసాగుతోంది. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద టీ మాస్ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. డబుల్ బెడ్ రూం కేటాయింపు..మౌలిక సదుపాయల కల్పించాలని...ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలని..కనీస వేతనాలు అమలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని టీ మాస్ నేతలు డిమాడ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా టీ మాస్ నేత సోమయ్య, ఇతరులు టెన్ టివితో మాట్లాడారు. డబుల్ బెడ్ రూం నివాసాలు కేటాయించాలని, ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేస్తోందని విమర్శించారు. లక్ష ఇళ్లు అని చెప్పి 9వేల నివాసాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళనలు చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

నీరు ప్రగతి, వ్యవసాయ పురోగతిపై సీఎస్ టెలికాన్ఫరెన్స్

గుంటూరు : ఏపీ సీఎస్ దినేష్ కుమార్ నీరు, ప్రగతి, వ్యవసాయ పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దావోస్ వెళ్తూ ధాన్యం సేకరణపై సీఎం మార్గదర్శకాలు ఇచ్చారని, రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని సీఎం ఆదేశించారని, రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసేవారిపై కఠన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు. 

బయటపడ్డ పోలీసు ఉన్నతాధికారుల వివాహేతర సంబంధం

హైదరాబాద్ : కేపీహెచ్ బీల్ పోలీసు ఉన్నతాధికారుల వివాహేతర సంబంధం బయటపడింది. ఏసీబీ ఏఎస్పీ, కల్వకుర్తి సీఐ మధ్య వివాహేతర సంబంధం బటయకు తెలిసింది. ఏసీబీ ఏఎస్పీ సునీత ఇంట్లో సునీతతో సీఐ మల్లికార్జున్ రెడ్డి రాసలీలలు జరుపుతుండగా సునీత భర్త, కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఏఎస్పీ సునీత, సీఐ మళ్లికార్జున్ రెడ్డి వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత, మళ్లికార్జున్ రెడ్డిపై విచారణకు ఆదేశించారు. 

11:07 - January 22, 2018
10:47 - January 22, 2018

గత నెల 31న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుడబడ్డ ప్రముఖ వ్యాఖ్యత ప్రదీప్ కారు బీఎండబ్ల్యూ ను అతని తండ్రి పాండురంగరావుకు అప్పగించారు. కొత్త సంవత్సరం రోజున ప్రదీప్ తాగి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసుల డ్రైంక్ అండ్ డ్రైవ్ దొరికిపోయాడు. ప్రదీప్ కు బ్రీత్ ఎన్ లైజర్ పెట్టినప్పుడు ఏకంగా 178 పాయిట్లు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ప్రదీప్ చెందిన లైలెన్స్ మూడు ఏళ్ల పాటు రద్దు చేసింది. అంతేకాకుండా రూ.2100 జరిమానా కూడా విధించింది.

10:25 - January 22, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. తెలంగాణలోని మూడు జిల్లాలో ఆయన రాజకీయ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కార్యాలయంలో జనసేన కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతిచ్చారు. అనంతరం ఆయన కాన్వాయ్ కొండగట్టుకు బయలుదేరింది. పదేళ్ల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తుండడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలుగూరు చౌరస్తా వద్ద జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో కామినేని భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని సమావేశమయ్యారు. కొల్లేరు భూముల వ్యవహారంపై పలు అంశాలను కామినేని కేంద్రమంత్రి దృష్టి తీసుకెళ్లాడు. 

10:15 - January 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ హామీల అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీ మాస్ కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్‌) ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారానికి సమైక్యంగా పోరాటాలను చేయాలని టీ-మాస్‌ ఫోరం ఇటీవలే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో సమస్యలపై అధ్యయనం చేసి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. కానీ స్పందన లేకపోయేసరికి జనవరి మాసం మొత్తం ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల వద్ద టీ మాస్ నేతలు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద టీమాస్ కన్వీనర్ జాన్ వెస్లీ, టీ మాస్ నేత, ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొననున్నారు. ఆయా కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

10:07 - January 22, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' 'రాజకీయ యాత్ర' కోసం సిద్ధమయ్యారు. కొండగట్టు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తన రాజకీయ యాత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం జనసేన కార్యాలయంలో ఆయన జనసేన కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతిచ్చారు. అనంతరం ఆయన కాన్వాయ్ కొండగట్టుకు బయలుదేరింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, ప్రజ్ఞాపూర్, సిద్ధిపేట మీదుగా కరీంనగర్ కు పవన్ చేరుకోనున్నారు. పవన్ తో 50 వాహనాల్లో అభిమానులు, కార్యకర్తలు తరలివెళ్లారు. దైవ దర్శనం తరువాత యాత్ర వివరాలను ఆయన ప్రకటించనున్నారు. కేవలం ప్రజా సమస్యల కోసమే ప్రజా యాత్ర చేపట్టనున్నట్లు పవన్ ప్రకటించారు. పాదయాత్రతో ఎక్కువ మందితో కలిసే అవకాశం ఉండదని, పార్టీ మీటింగ్ లు మాత్రమే ఉంటాయని..పబ్లిక్ మీటింగ్ లు ఉండవని మరోసారి స్పష్టం చేశారు. 

కొనసాగుతున్న 'పవన్' కాన్వాయ్...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' కొండగట్టుకు బయలుదేరారు. ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతిచ్చారు. సికింద్రాబాద్, తిరుమలగిరి, ప్రజ్ఞాపూర్, సిద్ధిపేట మీదుగా కరీంనగర్ కు పవన్ చేరుకోనున్నారు. పవన్ తో 50 వాహనాల్లో అభిమానులు, కార్యకర్తలు తరలివెళ్లారు. 

పవన్ కు హారతి ఇచ్చిన లెజినోవా..

హైదరాబాద్ : కొండగట్టుకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతిచ్చారు. మధ్యాహ్నం 3గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. 

09:23 - January 22, 2018
09:21 - January 22, 2018

హైదరాబాద్ : హయత్ నగర్ లోని పసుమాముల గ్రామంలో జంతు కళేబరాలతో నూనె, పౌడర్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడుల్లో జంతు కళేబరాలను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా పసుమామల గ్రామ పరిధిలోని ఓ పొలం భూమిలో జంతువుల కళేబరాలను ఎండబట్టి నూనె తయారు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. తయారు చేస్తున్న వారు బీహార్ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

09:13 - January 22, 2018
09:09 - January 22, 2018

హైదరాబాద్ : 'చలోరే చలోరే చల్' పేరిట సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి యాత్రను చేపట్టనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తన రాజకీయ యాత్రపై 'పవన్' అధికారికంగా ప్రకటించనున్నారు. ఉదయం 9గంటలకు జనసేన పార్టీ కార్యాలయం నుండి నేరుగా కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పలు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో 'జనసేన' కార్యాలయం వద్ద సందడి నెలకొంది. 'పవన్' అభిమానులు పెద్దఎత్తున ఆఫీసుకు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పవన్ తన రాజకీయ యాత్రలో ఎలాంటి రాజకీయ అంశాలు వెల్లడిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 

'జనసేన' ఆఫీసు వద్ద సందడి..

హైదరాబాద్ : 'జనసేన' కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కాసేపట్లో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి పవన్ బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా 'పవన్' అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 

08:05 - January 22, 2018
07:56 - January 22, 2018

హస్తినలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు నుండి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు మూడు జిల్లాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. మరోవైపు టిడిపి ప్రజాప్రతినిధులతో జరిగిన ఒక రోజు వర్క్ షాప్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు ఆదేశించారు. శాసనసభ్యులు ప్రజలను మెప్పించగలితే 175 సీట్లలో  టీడీపీ విజయానికి ఢోకా ఉండదని బాబు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దినకరన్ (టిడిపి), కోటేశ్వరరావు (బీజేపీ), జంగా కృష్ణమూర్తి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బాసరలో వసంతి పంచమి వేడుకలు...

ఆదిలాబాద్ : బాసరలో వసంతపంచమి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2 గం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొననున్నారు. 

06:44 - January 22, 2018

విజయవాడ : చేనేతను ఆదుకుంటామని పాలకులు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోకపోవడంతో వారి పరిస్థితి దయానీయంగా మారింది. నేసిన వస్త్రాలను కొనే వారే లేకపోవడంతో ఈ రంగాన్ని వదిలిపోతున్నారు నేతన్నలు. చేనేత కార్మికుల కళ్లల్లో ఆనందాలు, సంతోషాలు కళ తప్పుతున్నాయి. రేయింబవళ్ళూ కష్టపడి స్వయాన తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసేవాళ్లు లేక.. వారి ఎదురుచూపులన్నీ అడియాశలవుతున్నాయి. జీఎస్టీ వచ్చిన తర్వాత నుంచి ఉత్పత్తుల శాతం తగ్గుతూ వస్తోంది. దీనికితోడు కార్మికులకు వేతనాలు తగ్గిపోవడంతో.. వేరే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఈ రంగాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. ఇంకొందరు కళంకారీ వైపు మళ్లుతున్నారు.

చేనేతలో ఇంటిల్లిపాది కష్టపడినా రోజు 500 రూపాయలు సంపాదించడం కష్టతరంగా మారింది. అదే కళంకారీలో ఒక్కొక్కరికీ రోజూ 400 రూపాయల వరకు వేతనం దక్కుతుంది. ఇంకోవైపు ఆశించినస్థాయిలో లాభాలు రావడం లేదన్న కారణంతో సంఘాల ఉత్పత్తులు గణనీయంగా తగ్గుతున్నాయి. చీర నేతకు ఉపయోగించే నూలు దగ్గర నుంచి జరీ, రంగుల తదితరాల అన్నీ ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో వస్త్రాలను ఉత్పత్తి చేయాలంటే కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా అనేక కారణాలతో ఉత్పత్తులు క్రమేణా పడిపోతున్నాయి.

వివిధ చేనేత సంఘాలు చేసిన ఉత్పత్తుల్లో కొంత మేర ఆప్కో కొనుగోలు చేయాలి. కానీ ఆప్కో అలా కొనుగోలు చేయడంలేదనే ఆరోపణలున్నాయి. కాగా ఆప్కోకు వస్త్రాలు ఇస్తే వాటి బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోవడంతో సంఘాల వాళ్లు కూడా ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా ఉంటే ప్రపంచ మార్కెట్లో నేత వస్త్రాలకు డిమాండ్ ఏ మాత్రం చెక్కుచేదరలేదు. వివిధ దేశాల్లోని వినియోగదారులు మక్కువ చూపుతున్నారు.

అయినా కానీ కొనుగోళ్లు ఊపందుకోవడంలేదు. సరైన ప్రచారం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చేనేత వ్యాపారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆన్‌ లైన్‌లో కూడా వ్యాపారాన్ని విస్తృతం చేస్తే విక్రయాలు పెరగడంతోపాటు కార్మికులకు ఉపాధి కూడా దొరుకుతుంది. ప్రభుత్వాలు రాయితీలు కల్పించి.. వ్యాపారం విస్తృతం చేసే దిశగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తే పరిశ్రమ మనుగడకు దోహదపడుతుంది. ప్రభుత్వం చేనేత రంగాన్ని పట్టించుకోకపోతే ప్రమాదంగా మారనుంది. మున్ముందు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని, చేనేత కార్మికుడిను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

06:42 - January 22, 2018

విజయవాడ : ఏపీలో జల రవాణాను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి సాగరమాల ప్రాజెక్ట్‌ తొలి దశ పూర్తికి కసరత్తు చేస్తోంది. వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం అనేక టెర్మినల్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులోభాగంగా ఐదు ఓడరేవులను అభివృద్ధి చేయనున్నారు.

సాగరమాల ప్రాజెక్ట్‌ కోసం లక్షా 30 వేల 762 కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సాగర తీరం జల రవాణాకు కేంద్ర బిందువు కానున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వస్తు రవాణాకు గగన మార్గం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. త్వరితగతిన జలమార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని కోసం తీరం వెంబడి ఐదు ఓడరేవుల్లో కార్యకలాపాలను విస్తృతం చేయనున్నారు.

జల రవాణాను విస్తృతం చేసే క్రమంలో కొత్తగా మేఘవరం, నక్కపల్లి, నర్సాపూర్‌, దుగరాజుపట్నంలో ఓడరేవులను నెలకొల్పాలని చూస్తున్నారు. విశాఖలో భారీ ఓడరేవులో ఇప్పటికే సేవలను విస్తరించగా, భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ది కోసం చర్యలు చేపట్టారు. ఈ ఓడరేవుల ద్వారా రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సులభతరంగా సరుకు రవాణా అయ్యే అవకాశం ఉంది. సాగరమాల ప్రాజెక్ట్‌తో మత్స్య, రోడ్డు, రైళ్లు, పర్యాటక రంగాలు కూడా మరింత అభివృద్ధి చెందనున్నాయని... పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 315 కిలోమీటర్ల మేర జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి కేంద్రం రూ.7015 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో భాగంగా ముక్త్యాల-విజయవాడలో 82 కిలోమీటర్ల మేర 7 టెర్మినల్స్‌ నిర్మించనున్నారు. అలాగే రెండో విడత మార్గంలో విజయవాడ-కాకినాడ మధ్య 233 కిలోమీటర్ల మేర టెర్మినల్స్‌ నిర్మిస్తారు. ఇక ఈ పనుల కోసం 1730 ఎకరాలలో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. అలాగే జలరవాణాలో సరుకు సరఫరాతో పాటు.. ప్రయాణికుల రవాణాకు అనువుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ముక్త్యాల, హరిశ్చంద్రాపురం, ఇబ్రహీంపట్నం, ప్రకాశం బ్యారేజి వద్ద టెర్మినల్‌ పాయింట్లను సరుకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం ఉపయోగించనున్నారు. వేదాద్రి, అమరావతి, భవానీపురం, దుర్గాఘాట్‌ వద్ద ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా టెర్మినల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ప్రజలకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తొలిదశ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. మరి ప్రభుత్వ అంచనాలు సఫలీకృతమై జలరవాణా అందుబాటులోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. 

06:38 - January 22, 2018

నెల్లూరు: బంధాలకు విలువే లేకుండాపోతుంది. కనీ పెంచిన తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లలు బరువుగా భావిస్తున్నారు. దీంతో జీవిత చరమాంకంలో ఏ తోడూ లేక రోడ్డున పడుతున్నారు. సొంత ఇంట్లోనే కన్నుమూయాలన్న తన చివరి కోరికను సైతం పట్టించుకోకుండా తల్లిని బయటకు గెంటేశాడో ప్రబుద్దుడు. పెద్దావిడ పేరు కృష్ణవేణమ్మ. ఇన్నాళ్లు వృద్ధాశ్రమంలో ఉన్న ఈమె.. పండుగ పూట చూసేందుకు కన్న కొడుకు వద్దకు వచ్చింది. అక్కడిదాకా బాగానే ఉంది. ఆ తర్వాత కొడుకు కన్నతల్లి అని చూడకుండా ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. దీంతో ఆమె పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

నెల్లూరు జిల్లా ఉస్మాన్‌సాహేబ్‌పేటకు చెందిన కృష్ణవేణమ్మ భర్త కాలం చేసిన తర్వాత ఉన్న పొలాలను అమ్మి ఇద్దరు కొడుకులకు పంచింది. అయితే.. కొడుకులిద్దరూ జనార్ధన్‌, చంద్రశేఖర్‌లు వ్యాపారంలో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ కోపాన్ని కన్నతల్లిపై చూపారు. ఆమెను చూసుకునేది లేదని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. చేసేదేమీ లేక ఆమె కొన్నాళ్లపాటు కూతురి వద్ద ఉంది. కానీ... చివరి ఘడియలు తన సొంత ఇంట్లో గడుపుదామని కొడుకు ఇంటికి వచ్చింది. అయితే... ఆమె ఇంట్లో ఉండేందుకు కొడుకు జనార్దన్‌ ఒప్పుకోలేదు. ఆమెపై చేయి చేసుకుని బయటకు తోసేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మూడు రోజుల నుంచి పోలీస్‌స్టేషన్‌ ఎదుటే కాలం వెళ్లదీస్తోంది. విషయం మీడియాకు తెలియడంతో కృష్ణవేణమ్మ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. కొడుకులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

జీవిత చరమాంకంలో తల్లికి అండగా ఉండాల్సిన కొడుకులు... ఆస్తులు లాక్కుని కనీసం పట్టించుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కొడుకులు ఏ తల్లికి ఉండకూడదంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు పట్టించుకుని పెద్దావిడ చివరి ఘడియలు ప్రశాంతంగా గడిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

06:35 - January 22, 2018

విజయవాడ : బెజవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్ నిర్మాణం పనుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. నెలలు గడుస్తున్నా నేటికీ టెండర్లకు నోచుకోలేదు. రెండో పార్టు పైవంతెనకు సంబంధించిన అంచనాలను ఇప్పడిప్పుడే పూర్తిచేశారు. ఫ్లై ఓవర్‌ గడువు సమయం సమీపించడంతో.. సకాలంలో పనులు పూర్తిచేస్తారా ? లేదా ? అనే సందిగ్ధం నెలకొంది.

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెండో పార్టుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీఓటీ కింద కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులు చేస్తుండగా... మరోవైపు పనులపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నిర్మాణాన్ని జూన్‌ నాటికి పూర్తిచేయాలనేది లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. రెండోపార్ట్‌ వ్యయం సుమారు 124 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ స్వరూపం మారకుండా జాతీయ రహదారిపై పైవంతెన ఏలూరు రోడ్డుకు నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. అధికారులు వినూత్న రీతిలో సరికొత్త ఆకృతులను రూపొందించారు. జాతీయ రహదారికి పై భాగంలో రెండు వైపులా పైవంతెన రానుంది. ప్లై ఓవర్ కింద, పైన వాహనాలు వెళ్లేలా డిజైన్లు సిద్ధం చేశారు.

బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజ్‌ ఫ్లై ఓవర్‌ పైవంతెన కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచారు. దీంట్లో 64.6 కిలోమీటర్లు బందరు రోడ్డుకు రూ.740.70 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో 4 మేజర్ వంతెనలు, 5 చిన్న వంతెనలు, 5 పాదచారుల వంతెనలు నిర్మాణం చేయనున్నారు. ఒప్పందం మేరకు గుత్త సంస్థ బెంజ్‌ సర్కిల్‌ పైవంతెన నాలుగు వరసలు 618 మీటర్లు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. బీఓటీ కింద టెండర్‌ దక్కించుకున్న దిలీప్‌ కాన్‌ సంస్థ ఒకవైపు పార్టు పూర్తి చేసేందుకు అంగీకరించింది. ఆర్థిక శాఖ అనుమతుల తర్వాత టెండర్లను పిలవనున్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా నిడమానూరు వరకూ పొడవైన వంతెన నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు.

ప్రస్తుత నిర్మాణాలు తొలగించకుండా, భూ సేకరణ అవసరం లేకుండానే ప్లై ఓవర్‌ పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. 2018 డిసెంబర్ లోగా పైవంతెన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నాలుగైదు నెలలుగా టెండర్లను పిలవకపోవడంతో రెండోపార్టు 18 నెలల్లో పనులు పూర్తికావడం అసాధ్యంగా చెబుతున్నారు. పనులపై స్పష్టత కరువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వంతెన పనుల్ని త్వరగా పూర్తిచేయాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. టెండర్లను పిలవడంతో జాప్యం చేస్తుండటంతో.. ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత రావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా త్వరగా టెండర్లను పిలిచి పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు.

06:33 - January 22, 2018

హైదరాబాద్ : వారంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారు. కానీ వారు ఇప్పుడు మా సంక్షేమం సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో వారు తమ కాలం వెళ్లదీస్తూ.. కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మమ్మల్ని.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం చేయండంటూ అధికారుల్ని వేడుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌ వాడి, సర్వశిక్ష అభియాన్‌, ఆశా ఆయాలుగా తదితర వాటిలో వారు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరువేల మంది వివిధ పథకాల్లో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదని వారు వాపోతున్నారు. తమకు

పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని.. సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి... కలెక్టరేట్‌ ఎదుట వారు ఆందోళన చేశారు.
ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం సరైన బడ్జెట్‌ కేటాయించడం లేదు. ఇప్పడు ఆ పథకాలను కాస్త ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది. ప్రభుత్వాలు సరైన బడ్జెట్‌ను కేటాయించి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పథకాల్లో ఎక్కువగా పేద, బడుగు బలహీన వర్గాల వారే పని చేస్తున్నారు. కార్మికుల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. వీరి జీవితంలో మాత్రం ఏలాంటి మార్పులు రావటం లేదు. వీరికి శ్రమకు తగ్గ కనీస వేతనం అమలుకు నోచుకోవడం లేదు. తమకు రిటైర్మెంట్‌ అప్పడు తగిన విధంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తమ వంతు కృషిగా స్కీం వర్కర్స్‌ పని చేస్తున్నారు. తమకు కనీస సౌకర్యాలను కల్పించి.. మా సంక్షేమాన్ని పట్టించుకోండి అంటూ స్కీమ్‌ వర్కర్లు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

06:30 - January 22, 2018

హైదరాబాద్ : బుక్ ఫేయిర్ పుస్తక ప్రియులతో కళకళలాడుతోంది. వేలాదిగా తరలి వచ్చిన పుస్తకాభిమానులతో ఎన్టీఆర్ స్టేడియం సందడిగా మారింది. దేశంలోనే పెద్ద పుస్తక ప్రదర్శనల్లో ఒకటైన హైదరాబాద్ జాతీయ బుక్ ఫేయిర్ గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:28 - January 22, 2018

విజయవాడ : ఎమ్మెల్సీల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో మీ జోక్యం ఏంటని ప్రశ్నించారు. కలిసి పని చేసి ఎమ్మెల్యేలకు మెజారిటీ పెంచేలా చూస్తారనుకుంటే... వచ్చే ఓట్లు కూడా రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు లేకుండా ఉన్న మీకు ఎమ్మెల్సీ పదవులిస్తే... ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారన్నారు. ఇదే చివరి వార్నింగ్‌.. తీరు మార్చుకోకపోతే వచ్చేసారి పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు.

టీడీపీ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్సీలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పద్దతి మార్చుకోండి... ఇదే చివరి వార్నింగ్‌ అంటూ హెచ్చరించారు. ఏ పదవులు లేవని.. పార్టీకి ఉపయోగపడతారని ఎమ్మెల్సీలు పదవులు ఇస్తే.. నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారన్నారు. మీ వల్ల పార్టీకి 10 ఓట్లు పడతాయనుకుంటుంటే... ఆ ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలు గొడవ పడాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇకపై తీరు మార్చుకోకపోతే భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే... పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు చంద్రబాబు. అంతా సవ్యంగా జరుగుతుంది.. తనకేమీ తెలియదని ఎమ్మెల్సీలు అనుకుంటే పొరబాటేనన్నారు చంద్రబాబు. ప్రతి ఎమ్మెల్సీ ఎలా వ్యవహరిస్తున్నారో తన దగ్గర రిపోర్ట్‌ ఉందన్నారు. మీరు కలిసి పని చేస్తే ఎమ్మెల్యేలకు భారీ మెజారిటీ వస్తుందని... ఎంపీ సీటు గెలుచుకోవచ్చన్నారు. తీరు మార్చుకోవాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని... ఇదే చివరి వార్నింగ్‌ అని ఎమ్మెల్సీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి ఎమ్మెల్సీలకు చంద్రబాబు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. మరీ ఇకనైనా వారి తీరులో మార్పు వస్తుందా ? వేచి చూడాలి.

06:26 - January 22, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు ఆదేశించారు. శాసనసభ్యులు ప్రజలను మెప్పించగలితే 175 సీట్లలో టీడీపీ విజయానికి ఢోకా ఉండదని ప్రజాప్రనిధుల దృష్టికి తెచ్చారు. పార్టీకి దూరంగా ఉన్న వర్గాలను చేరువుచేసే ప్రయత్నాం చేయాలని అమరావతిలో జరిగిన తెలుగుదేశం సమావేశంలో చంద్రబాబు కోరారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఎమ్మెల్యే సన్నద్దతపై దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతం మెలగాల్సిన విషయాన్ని గుర్తు చేశారు. ఇద్దరిలో ఎవరు ప్రజలను నొప్పించినా ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలని హితబోధ చేశారు.

ఈనెల 2 నుంచి 11 వరకు చేపట్టిన జన్మభూమి కార్యక్రమం తర్వాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి 58 శాతం నుంచి 63 పెరిగిందన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోగా దీనిని మరో ఐదు శాతం పెంచేందుకు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకుల ప్రవర్తనను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు.

06:23 - January 22, 2018

హైదరాబాద్ : ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం వాకాటిని బెంగళూరుకు పిలిచిన అధికారులు.. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేశారంటూ వాకాటిపై అభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వాకాటిని టీడీపీ గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించింది. వాకాటి శామీర్‌పేటలోని 12 కోట్ల విలువ చేసే స్థలాన్ని.. 240 కోట్ల విలువైన స్థలంగా చూపించి... IFCI నుంచి 180 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారనే అభియోగాలున్నాయి. అంతేకాకుండా ఆ రుణం చెల్లించకపోవడంతో... IFCI సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో సీబీఐ అధికారులు వాకాటిని బెంగళూరుకు పిలిచి.. అదుపులోకి తీసుకున్నారు. 

ఫిబ్రవరి 4న 'టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం...

హైదరాబాద్ : ఫిబ్రవరి 4న టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమాశ ఏర్పాట్లపై చర్చించేందుకు టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఆదివారం భేటీ అయ్యింది. వేదిక, ఎజెండా, ఆహ్వానితులు తదితర అంశాలపై చర్చించారు. 

క్వార్టర్ ఫైనల్స్ కు రఫెల్ నడాల్...

ఢిల్లీ : టాప్‌సీడ్‌ రఫెల్‌ నడాల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అర్జెంటీనాకు చెందిన 24వ సీడ్‌ డీగొ ష్వార్జ్‌మన్‌తో ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్ జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన పోరులో నడాల్‌ 6-3, 6-7 (4), 6-3, 6-3తో గెలుపొందాడు. 

దావోస్ కు వెళ్లిన బాబు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 25 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం‌ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. 

మల్లన్నకు పెద్దపట్నం...

హైదరాబాద్ : కొమురవెల్లి మల్లన్నకు హైదరాబాద్‌ యాదవసంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం వేయనున్నారు. భక్తులు శరీరం నిండా పసుపు పూసుకొని అగ్నిగుండాలు దాటనున్నారు. 

'అనంత'లో గిరిజనులతో శంఖారావం...

హైదరాబాద్ : బోయలను ఎస్టీలో చేర్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈనెల 27న అనంతపురంలో లక్షమంది గిరిజనులతో శంఖారావం నిర్వ హిస్తున్నట్టు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్‌ పేర్కొన్నారు. 

సుప్రీంకు వెళ్లనున్న ఆప్...

ఢిల్లీ : ఇరవై మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని ఆప్‌ నేతలు వాదిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. 

జగన్ పాదయాత్రలో స్వల్ప ప్రమాదం....

చిత్తూరు : జగన్ పాదయాత్రలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలో సభ జరుగుతుండగా... స్టేజీ కూలింది. దీంతో వేదికపై ఉన్న వైసీపీ నేతలు కిందపడ్డారు. వీరిలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ప్రజల్లోకి 'పవన్'...

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు నుండి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు మూడు జిల్లాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. 

Don't Miss