Activities calendar

23 January 2018

21:57 - January 23, 2018

దావోస్ : దావోస్‌లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిమాత్రం రాష్ట్రంపైనే ఉంది. రైతులు పండించిన పంటలకు ముఖ్యంగా వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు... అధికారుతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతులకు పుష్కలంగా పంటలు చేతికొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తే రైతులకు మేలు జరుగుతుందని, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రైతులకు నష్టం కలిగితే సహించేదిలేదని హెచ్చరించారు. 

21:49 - January 23, 2018

దావోస్ : భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం 48 వ వార్షిక సమావేశంలో మోది ప్రసంగించారు. గత 20 ఏళ్లలో భారత్‌ వేగంగా అభివృద్ది చెందిందని.... 1997లో 400 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుతం ఆరు రెట్లు పెరిగిందని తెలిపారు. మనమంతా భూమాత సంతానమన్న మోదీ.. భారతీయ శాస్ర్తాలు మనిషిని భూమి పుత్రునిగా పేర్కొంటున్నాయని గుర్తు చేశారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని... కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడమే దీనికి పరిష్కారమని ప్రధాని చెప్పారు. గ్లోబలైజేషన్, ఉగ్రవాదం ప్రపంచానికి అతిపెద్ద సవాలని... దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. వసుధైక కుటుంబ భావనను భారత్‌ విశ్వసిస్తుందని ప్రధాని ఉద్భోదించారు. దావోస్‌ వేదికపై 20 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

21:36 - January 23, 2018
21:24 - January 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌ సుందర్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ.కంచ ఐలయ్య, గద్దర్, పీఎల్.విశ్వేశ్వరరావు, కాకి మాధవరావు పాల్గొన్నారు. టీ-మాస్ చైర్మన్‌గా కంచ ఐలయ్య, కన్వీనర్‌గా జాన్ వెస్లీ, కో-కన్వీనర్‌గా జ్వలిత ఎన్నికయ్యారు.

సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యం
తెలంగాణ లో సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా టీ-మాస్ పని చేస్తుందని ప్రొ.కంచ ఐలయ్య అన్నారు. టీ మాస్ రాజకీయ పార్టీ కాదని ఆయన స్పష్టం చేశారు. టీ-మాస్‌ను గ్రామ గ్రామానికి తీసుకెళుతున్నామని.. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు సామాజిక న్యాయం ఎజెండాగా పనిచేసేలా ఒత్తిడి తెస్తామని కంచ ఐలయ్య చెప్పారు. అణగారిన కులాలవారు ఉద్యోగాల్లో తీవ్ర అసమానతలు ఎదుర్కోవాల్సి వస్తోందని టీ-మాస్ కన్వీనర్ జాన్ వెస్లీ అన్నారు. 18 లక్షల మంది ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకపోతే 15 రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు.

తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థ
తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిన దశలో ప్రజలు ముందుకు రావాలన్నారు ప్రజా గాయకుడు గద్దర్. కవులు, కళాకారులు ఐక్యమై బలమైన మాస్ సాంస్కృతిక ఉద్యమంగా ఏర్పడాలని గద్దర్ పిలుపునిచ్చారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు టీ-మాస్ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా టీ-మాస్ నేతలు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సెమినార్లు నిర్వహించబోతున్నారు. జనవరి 26 న అంబేడ్కర్ విగ్రహాల ముందు రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిన బూననున్నారు. 

21:11 - January 23, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్న జనసేనానిని కాంగ్రెస్‌ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణ సమస్యల అధ్యయనం పేరుతో యాత్ర చేస్తూ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సామాజిక తెలంగాణ అంటున్న పవన్‌కు రైతులు, విద్యార్థులు, బీసీలు, ఎంబీసీలు, దళితులు, గిరిజనుల సమస్యలు పట్టవా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు కేసీఆర్‌ పాలన అంతగా నచ్చితే జనసేన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని సీఎల్‌పీ ఉప నేత జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు.

రోజు రోజుకూ పెరుగుతున్న ఇసుక మాఫియా
తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు, కులవివక్ష, దళితులపై దాడులను ప్రశ్నించలేని పవన్‌ కల్యాణ్‌.. కేసీఆర్‌కు భజన చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెక్క భజన చేసే పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ పార్టీ వేస్ట్‌ అని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శించారు.సినిమాల్లో సీన్‌ ముగియడంతో పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారంటూ కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి పవన్‌ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, చంద్రబాబులకు చెక్కభజన చేసేందుకే జనసేన పార్టీ ఉందన్న ఆయన యాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ ప్రశ్నించే వారు కాదని చెక్కభజన చేసే కల్యాణ్‌ అని ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారని తులసి రెడ్డి మండిపడ్డారు. జగన్‌కు క్విడ్‌ ప్రోకో, చంద్రబాబుకు ఓటుకు నోటు కేసుల భయం పట్టుకుందని విమర్శించారు. 

 

21:05 - January 23, 2018

కరీంనగర్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మంగళవారం రెండోరోజు.. కరీంనగర్‌ జిల్లాలో యాత్ర కొనసాగించారు. కరీంనగర్‌ శుభం గార్డెన్స్‌లో.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అయ్యారు. జనసైన్యం సమక్షంలో.. జై తెలంగాణ అంటూ నినదించి ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్‌.. 2019 ఎన్నికల్లో పోటీలో ఉంటామన్నారు. పార్టీ శక్తిసామర్థ్యాల మేరకు అభ్యర్థులను బరిలో దించుతామన్నారు.

పెరుగుతున్న మతతత్వ ధోరణులు
దేశంలో పెరుగుతున్న మతతత్వ ధోరణులపై పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలో మత ప్రాతిపదికన పాకిస్థాన్‌ ఏర్పడినా.. భారత్‌ను మాత్రం సెక్యులర్‌ రాజ్యంగా నిర్మించారని పవన్‌ అన్నారు. మతాల ప్రస్తావన లేని దేశనిర్మాణమే జనసేన లక్ష్యం అన్నారు పవన్ కల్యాణ్‌.ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కాకుండా, అభివృద్ధికి దూరంగా ఉన్న కులాలకు ఆర్థిక భద్రత కల్పించడమే సామాజిక న్యాయం అని పవన్‌ అన్నారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందన్న పవన్ అవినీతి లేని సమాజం కోసం యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు
కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు పవన్ కల్యాణ్‌. రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాడేవారందరినీ తాను ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు. ఆంధ్రాకే పరిమితం అవుతూ.. తెలంగాణకు రావడం లేదెందుకని అడిగే వారికోసమే ఈ యాత్ర అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని కోరారు. తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం తాను ఓ సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు. ఆంధ్రా తనకు జన్మనిస్తే... తెలంగాణ పునర్జన్మనిచ్చిందని... కొండగట్టు ఆంజనేయుడు తనను కాపాడారని పవన్‌ గుర్తు చేసుకున్నారు. తుది శ్వాస వరకూ తెలంగాణ నేలకు రుణపడి ఉంటానన్నారు. సమావేశం అనంతరం, వపన్ కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు కొత్తగూడెం నుంచి పవన్ ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 1:30కు ఖమ్మం చేరుకుంటారు. అక్కడ జరిగే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నారు. ఆ తరువాత పవన్ హైదరాబాద్ తిరిగి వెళ్తారు. 

20:34 - January 23, 2018
20:33 - January 23, 2018

మావొయిస్టు కొరియర్ల అరెస్టు

ఖమ్మం : నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీల్లో చర్ల పోలీసులకు కొరియర్లు చిక్కారు. మావోయిస్టులకు మెడిసిన్ తీసుకెళ్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.10వేల విలువైన మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు. 

19:24 - January 23, 2018

రాష్ట్రం ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని, దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా దళితులను అరెస్ట్ చేయడం దారుణమని సీపీఎం నాయకులు నార్సింగరావు అన్నారు. వామపక్షనాయకులను అరెస్ట్ చేయడం దారుణమని, దళితుల వైపు ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నారని, దళిత యువకులపై ఆత్యచార కేసు పెట్టారని దళిత బహుజన ఫ్రంట్ నాయకులు భాగ్యరావు అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం రాష్ట్రంలో లేదని, ఆయన ఆలోచనలు ప్రభుత్వం అమలు చేస్తే ఇలాంటి ఉండవని ఎస్సీ, ఎస్టీ మాజీ చైర్మన్ నాగర్జున అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

19:12 - January 23, 2018

శ్రీకాకుళం : బుధవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో దాదాపు 36 గంటల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజు రాత్రి 12:15 నిమిషాలకు స్వామివారి క్షీరాభిషేకంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం విశేష పూజలు, ఇతర సేవలు నిర్వహిస్తారు. సూర్య నారాయణ స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వేడుకల్లో మొత్తం ఎనిమిది ప్రభుత్వ శాఖలు సేవలు అందించనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

వీఐపీ దర్శనానికి వచ్చే వారికి
ఉచిత దర్శనంతో పాటు.. వీఐపీ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్లలో త్రాగునీరు, వైద్య శిబిరాలు, వృద్ధులు, వికలాంగులు కోసం బ్యాటరీ సహాయంతో నడిచే వాహనాలు సిద్ధం చేశారు. ఇంద్ర పుష్కరిణి వద్ద గజ ఈతగాళ్లను ఉంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం విరివిగా పార్కింగ్ స్థలాలు, చెప్పుల స్టాండులు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

 

 

గజల్ బెయిల్ పిటిషన్ పై విచారణలు

హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణలు జరిగాయి. గజల్ బెయిల్ ఇవ్వొద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఏ2 గా ఉన్న నింధితురాలు పార్వతి ఎందుకు అరెస్ట్ చేయాలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. 

18:38 - January 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు చనిపోగా... మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి దగ్గర కారు .. ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. ఇక ఆకివీడు మండలం అజ్జమూరు దగ్గర ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. వీరిని షకీల్‌, నాగార్జునగా గుర్తించారు.

18:37 - January 23, 2018

తూర్పుగోదావరి : టెట్‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడలో విద్యార్థులు మంత్రి గంటా శ్రీనివాసరావు వాహనశ్రేణిని అడ్డుకున్నారు. మంత్రి బసచేసిన హోటల్‌ ముందు బైటాయించారు. ప్రభుత్వంతోపాటు మంత్రి గంటాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తు అనుమతిలేకుండా ధర్నా, ఆందోళన చేయడం కుదరదని పోలీసులు చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల అనుమతితో కొంతమంది విద్యార్థులు మంత్రి గంటాను కలిసి టెట్‌ వాయిదా వేయాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. 

18:33 - January 23, 2018

గుంటూరు : ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రపద్రేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్‌ రాన్ పాల్‌.. చీఫ్‌ ఇన్వెస్టర్‌ ఆఫీసర్‌ సందీప్‌రాజ్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో దిగుబడుల సాధనకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 40లక్షల ఎకరాలకు పరిమితమైన ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు విస్తరించాలన్న దార్శనికతతో పని చేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా సెన్సర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ.. తమ రాష్ట్రం ఒక్క ఉద్యానరంగంలోనే 30శాతం వృద్ధిరేటును నమోదు చేసిందన్నారు. ఆక్వా రంగాన్ని కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేశామని.. ఆక్వాలో దేశంలోనే తమ రాష్ట్రం నంబర్‌-1 అన్నారు చంద్రబాబు.

పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు
ఇక రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి ప్రణాళికతో వస్తే... అన్ని విధాలా సహకరిస్తామని.. పయనీర్‌ వెంచర్స్‌కు చంద్రబాబు తెలిపారు. సింగల్‌ డెస్క్‌ విధానం ద్వారా అన్ని అనుమతులను మూడు వారాల్లోనే ఇస్తామని.. దానికి నాది ఫార్మర్‌ ప్రోడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ తరహాలో పాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా పెద్ద ఎత్తున సహకార సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కుప్పంలో చిన్న పాటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సరుకు రవాణా సులభతరం అయ్యేవిధంగా చేస్తామని తెలిపారు.

ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు
పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని.. రానున్న ఐదేళ్లలో 5000 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి భవిష్యత్‌ కార్యాచరణ సవివరంగా ప్రకటిస్తామన్నారు. కాగా సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పయనీరింగ్‌ సంస్థ దేశంలో వెయ్యి కోట్ల పెట్టుబడులను పెట్టింది. కుప్పం, నాందేడ్‌లో ఇప్పటికే కార్యకలాపాలను కూడా ప్రారంభించింది. 

18:31 - January 23, 2018

గుంటూరు : ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. విజయవాడ దుర్గగుడి ఈవోగా ఎం.పద్మ, రాష్ట్రబ్రహ్మణ కార్పొరేషన్ ఎండీగా పద్మకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ను, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని, సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్టు చేయాల్సిందిగా జేఎస్వీ ప్రసాద్ ను ఆదేశించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:22 - January 23, 2018

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

గుంటూరు : ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. విజయవాడ దుర్గగుడి ఈవోగా ఎం.పద్మ, రాష్ట్రబ్రహ్మణ కార్పొరేషన్ ఎండీగా పద్మకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ను, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని, సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్టు చేయాల్సిందిగా జేఎస్వీ ప్రసాద్ ను ఆదేశించారు. 

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

గుంటూరు : ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. విజయవాడ దుర్గగుడి ఈవోగా ఎం.పద్మ, రాష్ట్రబ్రహ్మణ కార్పొరేషన్ ఎండీగా పద్మకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ను, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని, సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్టు చేయాల్సిందిగా జేఎస్వీ ప్రసాద్ ను ఆదేశించారు. 

బీసీ ఎఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే లెక్క : ముద్రగడ

గుంటూరు : కాపు రిజర్వేషన్లకు గవర్నర్ సంతకం అయిందని, బిల్లుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కాపు నేత ముద్రగడ డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణకు బీసీ నాయకులు అంగీరిస్తున్నారని, కాపులకు బీసీ ఎఫ్ గా సర్టిఫికెట్ ఇస్తేనే నమ్ముతామని ముద్రగడ అన్నారు. 

గిరిజనులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

తూర్పుగోదావరి : దావోస్ నుంచి మారుమూల గిరిజనులతో ఏపీ సీఎం చంద్రబాబబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం పలకరింపుతో గిరిజనులు పులకించిపోయారు.  గిరిజనుల యోగక్షేమాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని రంపచోడవరానికి 200 కిలోమిటర్ల దూరంలో ఉన్న గిరిజనులకు ఫైబర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని సీఎం తెలిపారు. 

17:49 - January 23, 2018

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ నియోజకవర్గం బన్సీలాల్‌పేటలోని బండమైసమ్మనగర్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ యోగితా రాణా పరిశీలించారు. 

17:48 - January 23, 2018
17:44 - January 23, 2018
17:43 - January 23, 2018

నిజామాబాద్: మరో అక్రమార్కుడు ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. మినరల్ వాటర్‌ ప్లాంట్ యజమానుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

17:41 - January 23, 2018

ఆదిలాబాద్ : జిల్లాలో టీ మాస్‌ ఫోరం నేతలు కోలాం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించినట్లు టీ మాస్‌ నేతలు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సమస్యను పరిష్కరించకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:40 - January 23, 2018

కరీంనగర్ : పవన్‌ రాజకీయ ప్రస్థానం మరోసారి ఊపందుకుంది. న్నిటిదాకా ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్న పవన్‌.. ప్రస్తుతం తెలంగాణలో యాత్రను కొనసాగిస్తూ మరోసారి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చారు. జగిత్యాలజిల్లా కొండగట్టులో పూజలు చేసిన పవన్‌..కరీంనగర్‌ జిల్లాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. మొదటిసారిగా 2009లో కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన పవన్‌.. అప్పట్లో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీకి అనుబంధ విభాగంగా ఏర్పడిన యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన పలు అవాంతరాలు ఎదుర్కొన్నారు. తన పర్యటనకు ఉపయోగించిన వాహనం మొరాయించడంతోపాటు చివరికి విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలతో బయటపడటం లాంటి సంఘటనలు జరిగాయి, పవన్‌ కరీంనగర్‌జిల్లాతోపాటు కొండగట్టు క్షేత్రంతో తన అనుబంధాన్ని కొనసాగించడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

2009 జనవరి 20న కొండగట్టులో
ప్రజారాజ్యంపార్టీ ఆవిర్భావం తర్వాత 2009 జనవరి 20న కొండగట్టులో పవన్‌కల్యాణ్‌ పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో తన ప్రచార రథం మొరాయించడంతో పవన్‌ నానాఅవస్థలు పడ్డారు. చివరికి తన ప్రచార రథాన్ని తాడుతోకట్టి లాగించుకుంటూ మెకానిక్‌ షెడ్‌కు చేరుకోవాల్సివచ్చింది. వాహనం రిపేర్‌ అయ్యేంతవరకు దాదాపు 4గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ప్రాచారం ప్రారంభించిన పవన్‌.. హుస్నాబాద్‌ పట్టణంలో తన ప్రచారరథం టాప్‌లో నిలుచుని ప్రచారం నిర్వహిస్తుండా 11కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన పవన్‌ను అప్పట్లో ఆయన కుటుంబసభ్యులు కూడా వచ్చి పరామర్శించారు. అయితే అప్పట్లో ఆయన వెంట ఉన్న వైద్య బృందం సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో అప్పటి యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పటి జనసేనాని ప్రాణాలతో బయటపడ్డారు.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత..
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పవన్‌..మరోసారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ అభిమానులు ఆనాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తనకు కొండగట్టు అంజన్న అంటే చాలా భక్తి భావం ఉందని పవన్‌ మరోసారి చాటారని అభిమానులు చెప్పుకుంటున్నారు. 2009నాటి పర్యటనలో కూడా కొండగట్టులో పూజలు నిర్వహించిన ప్రచారం నిర్వహించిన పవన్‌కళ్యాణ్‌కు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా మరోసారి కొండగట్టులో పూజలు నిర్వహించి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారైనా పవన్‌కు అన్నీ కలిసిరావాలని జనసేనపార్టీ కార్యకర్తలు, పవర్‌స్టార్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

17:39 - January 23, 2018

సిద్దిపేట : ప్రజా సమస్యలపై పోరాడే మందకృష్ణ, వంటేరు ప్రతాప్‌ వంటి నేతలను అరెస్ట్‌ చేయడం బాధాకరం అన్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరామ్. పౌరవేదికలను ప్రభుత్వం అడ్డుకొని ఆంక్షలు విధిస్తుందని, వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పౌర వేదికలకు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు. పౌరవేదికలను ప్రజా స్వామ్యాన్ని రాజ్యాంగ బద్ధంగా కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన ప్రధాని

దావోస్ : ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం చేశారు. 20 ఏళ్ల తర్వాత భారత్ తరుపున మోడీ ప్రసంగం చేశారు. చివరగా దేవగౌడ 1997లో ప్రపంచ ఆర్థిక సదస్సులు ప్రసంగం చేశారు. అప్పుడు భారత్ జీడీపీ 400 బిలియన్ డాలర్లుగా ఉంది. 

16:41 - January 23, 2018

సంగారెడ్డి : జిల్లాలో ఐదు వందల కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. పైసా పైసా పోగేసి కొన్న తమ స్థలాల కోసం ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కబ్జా చెర నుండి మా స్థలాలు మాకు దక్కేలా చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:38 - January 23, 2018
16:36 - January 23, 2018

చెన్నై : నాగబాబు కూతరు నిహారిక తెలంగాణలో పర్యటిస్తున్న బాబాయ్ పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒరు నల్ల నాల్ పొత్తు సాల్రేవ్ తమిళ చ్రితంలో నటిస్తోంది.. ఈ చిత్రానికి అర్మిగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిహరిక విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల చేస్తామని చెబుతున్నారు. తమిళంఓ నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా బాబాయ్ కి ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

రాహుల్ గాంధీని కలిసిన రఘువీరారెడ్డి

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీ పీసీస చీఫ్ రఘువీరారెడ్డి కలిశారు. ఏపీలో కాంగ్రెస్ సంస్థాగత అంశాలు, పరిస్థితులపై రాహుల్ రఘువీరా వివరించారు. 

ఎన్నికల సంఘానికి రేవంత్ లేఖ

హైదరాబాద్ : రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. లాభదాయక పదవులు అనుభవించిన 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆన్ లైన్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ ఫిర్యాదు చేశారు. 

16:11 - January 23, 2018

హైదరాబాద్ : రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. లాభదాయక పదవులు అనుభవించిన 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆన్ లైన్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ ఫిర్యాదు చేశారు. ఆప్ ఎమ్మెల్యేల వ్యవహారంలో రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని రేవంత్ కోరారు. 

16:09 - January 23, 2018

కృష్ణా : వెనకబడిన వర్గాలపక్షాన నిలబడి, వాళ్లల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 10టీవీ కృషిచేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ నాగభూషణం. విజయవాడ 10టీవీ కార్యాలయంలో 2018 నూతన ఏడాది క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా 10టీవీ ముందుంటున్నందని 10టీవీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

16:00 - January 23, 2018

కరీంనగర్ : జనసేన ఆకాంక్ష తెంగాణ యువత ఆకాంక్ష అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. 2019 ఎన్నికల్లో పోటీలో ఉంటామని పవన్‌ అన్నారు. పార్టీ శక్తిసామర్థ్యాల మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తామన్నారు. రాబోయే ఎన్నికల సమరానికి సుదీర్ఘ యుద్ధం చేయడానికి కార్యకర్తలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను స్మార్ట్‌సీఎం అంటే కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకు కోపం అని పవన్‌ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకోసం పోరాడే ఎవరినైనా తాను గౌవరవిస్తాన్నన్నారు. కాని కాంగ్రెస్‌వారిని మెప్పించడానికి తాను కేసీఆర్‌ను విమర్శించనని పవన్‌ స్పష్టంచేశారు. తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కేసీఆర్‌పై పవన్‌ మరోసారి ప్రశంశలు కురిపించారు. తనకు ప్రజాసేవలోనే సంతృప్తి ఉందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి జనసేన కృషిచేస్తుందన్నారు. తాను పార్టీని చాలా బాధ్యతగా నడిపిస్తున్నానన్న పవన్‌ కల్యాణ్‌.. రాబోయే ఎన్నికల్లోజనసేన పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. జైతెలంగాణ నినాదంతో ప్రారంభించిన స్పీచ్‌ను అదే నినాదంతో ముగించారు. 

15:23 - January 23, 2018

తండ్రికొడుకుల ఆత్మహత్యాయత్నం

కడప : జిల్లా కలెక్టరేట్ వద్ద తండ్రికొడుకులు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య కాపురానికి రాకపోవడంతో తండ్రి గంగరాజు, కొడుకు రాజేష్ విషం తాగారు. రాజేష్ పరిస్థితి నిలకడగా ఉందని, గంగరాజు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. గంగరాజు పులివెందుల మండలం మోటనుందలపల్లి చెందినవారు.

15:18 - January 23, 2018
15:17 - January 23, 2018

కడప : జిల్లా కలెక్టరేట్ వద్ద తండ్రికొడుకులు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య కాపురానికి రాకపోవడంతో తండ్రి గంగరాజు, కొడుకు రాజేష్ విషం తాగారు. రాజేష్ పరిస్థితి నిలకడగా ఉందని, గంగరాజు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. గంగరాజు పులివెందుల మండలం మోటనుందలపల్లి చెందినవారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:16 - January 23, 2018

డే కేర్ సెంటర్లలో పెరిగె పిల్లలకు ఇంట్లో పెరిగె పిల్లలకు తేడా ఉంటుందని, ఈ రోజుల్లో పిల్లలు పుట్టలేదని కొందరు బాధపడుతుంటే మరికొందరు పుట్టిన పిల్లలను డే కేర్ సెంటర్ లో వేస్తున్నారని, ఆర్థిక ఉన్నవారు కూడా ఇలా చేస్తున్నారని పిల్లల మానసిక వైద్య నిపుణురాలు జ్యోతిరాజా అన్నారు. పిల్లలకు మొదటి ఐదేళ్లు చాలా ముఖ్యమని, పిల్లలను డే కేర్ వదిలివేయడం వల్ల వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వస్తాయని పిల్లల వైద్య నిపుణురాలు డా. నాందిని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:15 - January 23, 2018

భోపాల్ : మధ్యప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా ఆనందీ బెన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హేమంత్‌ గుప్తా ఆనందీ బెన్‌ పటేల్‌ ప్రమాణం చేయించారు. గవర్నర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన నేతలు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, అధికారులు తదితరులు హాజరయ్యారు. నవంబర్‌ 21, 1941లో జన్మించిన ఆనందీ బెన్‌ పటేల్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. గుజరాత్‌లో మోది తర్వాత ఆనందీ బెన్‌ సిఎంగా ఉన్నారు. పటేల్‌ ఆందోళన నేపథ్యంలో ఆమె సిఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  

15:14 - January 23, 2018

ముంబై : పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది. బిజెపితో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. శివసేన జాతీయ పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నేత సంజయ్‌ రావత్‌ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాని మోదీని...బిజెపిని టార్గెట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో శివసేన, బిజెపి ల మధ్య అవగాహన కుదరకపోవడంతో ఇరు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. పెద్ద పార్టీగా అవతరించిన బిజెపి-శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

15:13 - January 23, 2018

కరీంనగర్ : వందేమాతరం నినాదంతో సమనానమైనది జైతెలంగాణ నినాదం అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. కరీంనగర్‌లో పార్టీకార్యకర్తలతో భేటీ సందర్భంగా జైతెలంగాణ అని నినదించి తన ప్రసంగా ప్రారంభించారు. సామాజిక న్యాయం అంటే కేవలం ఎన్నికల్లో సీట్లు కేటాయించడమేకాదన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. అభివృద్ధికి దూరంగా ఉన్న కులాలకు ఆర్థిక భద్రత కల్పించడమే సామాజిక న్యాయం అన్నారు. అటు దేశంలో పెరుగుతున్న మతతత్వ ధోరణులపై పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలో మత ప్రాతిపధిక పాకిస్థాన్‌ ఏర్పడినా.. భారత్‌ను మాత్రం సెక్యులర్‌ రాజ్యంగా నిర్మించారని పవన్‌ అన్నారు. మతాల ప్రస్తావన లేని దేశనిర్మాణమే జనసేన లక్ష్యం అన్నారు. దేశంలో సెక్యులర్‌ వ్యవస్థ పరిరక్షణక జనసేన కృషిచేస్తుందన్నారు పవన్‌ కల్యాణ్‌. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రాంతీయభాషలను, యాసలను కాపాడేందుకు జనసేనపార్టీ లక్ష్యంగా పెట్టుంకుందన్నారు. 

ప్రియుడి మోసాం..ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు : జిల్లా తిరుపతిలో ప్రియుడి నయవంచనకు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

సీపీఎం నేతలపై ఏబీవీపీ కార్యకర్తల దాడి

నల్లగొండ : జిల్లాలో ఏబీవీపీ కార్యకర్తలు సీపీఎం నేతలపై దాడికి పాల్పడ్డారు. జిల్లాలో సీపీఎం మహాసభల సందర్భంగా వారు గోడలపై మహాసభల సంబంధించి రాతలు రాశారు. ఈ రాతలపై ఏబీవీపీ కార్యకర్తలు రంగుచల్లారు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన సీపీఎం నేతలపై ఏబీవీపీ కార్యకర్తలు డాడులు చేశారు. 

మందకృష్ణకు బెయిల్ మంజూరు

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మందకృష్ణ ఈ నెల 2 నుంచి జైలులో ఉంటున్నారు.

15:07 - January 23, 2018

చిత్తూరు : జిల్లా తిరుపతిలో ప్రియుడి నయవంచనకు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడాది కాలంగా ఈ యువతిని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని ప్రేమికుడు పరారయ్యాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:06 - January 23, 2018

నల్లగొండ : జిల్లాలో ఏబీవీపీ కార్యకర్తలు సీపీఎం నేతలపై దాడికి పాల్పడ్డారు. జిల్లాలో సీపీఎం మహాసభల సందర్భంగా వారు గోడలపై మహాసభల సంబంధించి రాతలు రాశారు. ఈ రాతలపై ఏబీవీపీ కార్యకర్తలు రంగుచల్లారు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన సీపీఎం నేతలపై ఏబీవీపీ కార్యకర్తలు డాడులు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:01 - January 23, 2018

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మందకృష్ణ ఈ నెల 2 నుంచి జైలులో ఉంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:02 - January 23, 2018

హైదరాబాద్ : 10 టీవీ క్యాలెండర్‌ను తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆవిష్కరించారు. తెలంగాణ పర్యాటక విశేషాలతో రూపొందించిన క్యాలెండర్‌ అన్ని విధాల బాగుందని ప్రశంసించారు. ఇది అందరి ఇళ్లలో ఉండాల్సిన క్యాలెండర్‌ అని బుర్రా వెంకటేశం చెప్పారు. 
 

14:00 - January 23, 2018

నిజామాబాద్ : మరో అక్రమార్కుడు ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. మినరల్ వాటర్‌ ప్లాంట్ యజమానుల నుంచి  డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

13:57 - January 23, 2018

కృష్ణా : విజయవాడలో స్కీమ్‌ వర్కర్స్‌ ఆందోళనబాట పట్టారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలంటూ కదం తొక్కారు. విజయవాడలో ఒకరోజు సమ్మెకు దిగారు.  దీంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్లతోపాటు ఇతర అనుబంధ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.  ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా వెనకడుగువేసే ప్రసక్తే లేదంటున్న స్కీమ్‌ వర్కర్స్‌ నాయకులతో 10టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 
 

13:56 - January 23, 2018

కరీంనగర్ : వందేమాతరం నినాదంతో సమనానమైనది జైతెలంగాణ నినాదం అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. కరీంనగర్‌ల పార్టీకార్యకర్తలతో భేటీ సందర్భంగా జైతెలంగాణ అని నినదించి తన ప్రసంగా ప్రారంభించారు. 'ఆంధ్ర జన్మనిస్తే..తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది, తెలంగాణ నేలకు చివరి శ్వాసవరకు రుణపడిఉంటా. వందేమాతరానికి ఉన్నంత శక్తి  జైతెలంగాణ నినాదానికి ఉంది. మార్చి 14లోపు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తా. రాజకీయాల్లోకి కొత్త రక్తం కావాలి. సామాజిక న్యాయం అంటే సీట్టు ఇవ్వడమే కాదు. అందిరికీ అభివృద్ధి ఫలాలు అందాలి. నాకు ఏ ఒక్కరితో వ్యక్తిగతంగా గొడవల్లేవు. ప్రజాసమస్యలు, విధానపరంగానే నా  పోరాటం. కొన్ని కులాలకే అధికారం పరిమితం అయింది అని అన్నారు. 
కేసీఆర్ పై ప్రశంసలు
కేసీఆర్‌ను స్మార్ట్‌సీఎం అంటే కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకు కోపం అని పవన్‌ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకోసం పోరాడే ఎవరినైనా తాను గౌవరవిస్తాన్నన్నారు. కాని కాంగ్రెస్‌వారిని మెప్పించడానికి తాను కేసీఆర్‌ను విమర్శించనని పవన్‌ స్పష్టంచేశారు. తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కేసీఆర్‌పై పవన్‌ మరోసారి ప్రశంశలు కురిపించారు. 

 

పద్మావత్‌ సినిమాను నిషేధించాలని వేసిన పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్‌ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పద్మావత్‌  ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వాలే చూడాలని సుప్రీం కోర్టు సూచించింది. 

13:50 - January 23, 2018

ఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్‌ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పద్మావత్‌  ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వాలే చూడాలని సుప్రీం కోర్టు సూచించింది. మరో వైపు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌లలో డిస్ర్టిబ్యూటర్‌ సినిమా విడుదల సందర్భంగా భయాందోళనకు గురవుతున్నారు. పద్మావత్‌కు వ్యతిరేకంగా ఉజ్జయిని, జైపూర్‌, సవాయ్‌ మాదోపూర్‌లో కర్నిసేనల ఆందోళనలు చేస్తున్నారు.

13:45 - January 23, 2018

గుంటూరు : జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. రేపటి చలో పెదగొట్టిపాడు నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లకు దిగారు. సీపీఎం నాయకులతోపాటు పలువురు దళిత, ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును పోలీసులు తాడేపల్లి దగ్గర ముందస్తు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన నాయకులందరినీ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:40 - January 23, 2018

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ నియోజకవర్గం బన్సీలాల్‌పేటలోని బండమైసమ్మనగర్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ యోగితా రాణా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదవాళ్ల కళ అని, ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పారు. హైదరాబాద్ ను గుడిసేలు లేని సీటిగా చేయాలనే ఆలోచన ఉందన్నారు. 

 

13:39 - January 23, 2018

కరీంనగర్ : తెలంగాణలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. నిన్న కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం తర్వాత.. పవన్‌ తన పర్యటన ప్రారంభించారు. ఇవాళ కరీంనగర్‌లోని శుభం గార్డెన్‌లో జనసేన కార్యకర్తలో పవన్‌ భేటీ అవుతారు. ఈ భేటీలో మూడు జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. దాదాపు 1500 మంది హాజరవ్వనున్నారు.  రాబోయే ఎన్నికల్లో ఏపీతోపాటు తెలంగాణలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్‌.. ఆదిశగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాసమస్యలే అజెండాగా పోరాడుతూ..పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న వ్యూహంతో ముందుకు పోతామని జనసేన అధినేత అంటున్నారు. 

13:04 - January 23, 2018

కరీంనగర్ : రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని..తెలంగాణ నేలకు చివరిశ్వాసవరకు రుణపడి ఉంటానని తెలిపారు. ఏడు సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. మార్చి 14న వరకు పూర్తిస్థాయి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వందేమాతరానికి ఉన్న శక్తి జై తెలంగాణ నినాదానికి ఉందన్నారు. 
కొన్ని కులాలకే సమాజిక న్యాయం 
కొన్ని కులాలకే సమాజిక న్యాయం జరిగిందని తెలిపారు. కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు కావాలన్నారు. భారతదేశం సెక్యులర్ రాజ్యంగా ఉందని పేర్కొన్నారు. భాషను, యాసను గౌవరవించే సంప్రదాయం కావాలన్నారు. భారతదేశం ఒకటిగా ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని పిలుపునిచ్చారు. సంస్కృతులను కాపాడే విధంగా జనసేన వ్యవహరిస్తుందన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందన్నారు. 
జాతీయతను విస్మరించవద్దు.. 
ప్రాంతీయతను గౌరవించాలని..అయితే ప్రాంతీయత భావనలో పడి జాతీయతను విస్మరించవద్దన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయత జనసేన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం అంటే సీట్లు ఇవ్వడమే కాదు...అందరూ అభివృద్ధి చెందాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరారు. అందరికీ ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. తనకు ఏ వ్యక్తితతో వ్యక్తిగతంగా విభేదాల్లేవన్నారు. ఏ ఒక్క పార్టీ మీద ధ్వేషం లేదని చెప్పారు. 
తెలంగాణ పసిబిడ్డ 
తెలంగాణ పసిబిడ్డ అన్నారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరాజకీయ నాయకునికి ఉందన్నారు. కేసీఆర్ అంటే ముందునుంచి తనకు ఇష్టమన్నారు. రాజకీయల నుంచి ప్రజల కోసం పని చేసి ఏ వ్యక్తినైనా గౌరవిస్తానని చెప్పారు. 'మన యాస, భాషను గౌరవించాలని' అన్నారు. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ ఉందన్నారు. తెలంగాణ ఒక్కరోజులో రాలేదని... 25 సం.లు పట్టిందన్నారు. అవినీతి లేని సమాజం రావాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రజా సమస్యలు, విధానపరంగానే తన పోరాటమన్నారు. ఆంధ్ర, తెలంగాణ వేరు కాదని చెప్పారు. 'మీ కోసం నేను ఉన్నాను 'అని పవన్ భరోసా ఇచ్చారు. 

 

 

ప్రాంతీయత విస్మరించని జాతీయత లక్ష్యం : పవన్

కరీంనగర్ : ప్రాంతీయతను గౌరవించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయత భావనలో పడి జాతీయతను విస్మరించవద్దన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయత జనసేన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం అంటే సీట్లు ఇవ్వడమే కాదు...అందరూ అభివృద్ధి చెందాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరారు.

ప్రాంతీయత విస్మరించని జాతీయత లక్ష్యం : పవన్

కరీంనగర్ : ప్రాంతీయతను గౌరవించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయత భావనలో పడి జాతీయతను విస్మరించవద్దన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయత జనసేన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం అంటే సీట్లు ఇవ్వడమే కాదు...అందరూ అభివృద్ధి చెందాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరారు.

కొన్ని కులాలకే సమాజిక న్యాయం జరిగిందన్న పవన్

కరీంనగర్ : వందేమాతరానికి ఉన్న శక్తి జై తెలంగాణ నినాదానికి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. కొన్ని కులాలకే సమాజిక న్యాయం జరిగిందని తెలిపారు. కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు కావాలన్నారు. భారతదేశం సెక్యులర్ రాజ్యంగా ఉందని పేర్కొన్నారు. భాషను, యాసను గౌవరవించే సంప్రదాయం కావాలన్నారు. భారతదేశం ఒకటిగా ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని పిలుపునిచ్చారు. సంస్కృతులను కాపాడే విధంగా జనసేన వ్యవహరిస్తుందన్నారు.

 

తెలంగాణ నేలకు చివరిశ్వాసవరకు రుణపడి ఉంటా : పవన్ కళ్యాణ్

కరీంనగర్ : రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరీంనగర్  లోని శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని..తెలంగాణ నేలకు చివరిశ్వాసవరకు రుణపడి ఉంటానని తెలిపారు. మార్చి 14న వరకు పూర్తిస్థాయి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు.

 

11:40 - January 23, 2018

గుంటూరు : జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. రేపటి చలో పెదగొట్టిపాడు నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లకు దిగారు. సీపీఎం నాయకులతోపాటు పలువురు దళిత, ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును పోలీసులు తాడేపల్లి దగ్గర ముందస్తు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన నాయకులందరినీ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:36 - January 23, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు చనిపోగా... మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.  నల్లజర్ల మండలంలోని అనంతపల్లి దగ్గర కారు .. ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. ఇక ఆకివీడు మండలం అజ్జమూరు దగ్గర ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. వీరిని షకీల్‌, నాగార్జునగా గుర్తించారు.

11:24 - January 23, 2018

ఢిల్లీ : గణతంత్ర వేడుకలకు దేశరాజధాని ముస్తాబవుతోంది. మరికొద్ది సేపట్లో రాజ్‌పథ్‌లో సైనికదళాల కవాతు రిహార్సల్స్‌ జరగనున్నాయి. దీనికోసం రాజ్‌పథ్‌ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనాల రాకపోకలపై ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:17 - January 23, 2018

కరీంనగర్ : తెలంగాణలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. నిన్న కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం తర్వాత.. పవన్‌ తన పర్యటన ప్రారంభించారు. ఇవాళ కరీంనగర్‌లోని శుభం గార్డెన్‌లో జనసేన కార్యకర్తలో పవన్‌ భేటీ అవుతారు. ఈ భేటీలో మూడు జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. దాదాపు 1500 మంది హాజరవ్వనున్నారు.  రాబోయే ఎన్నికల్లో ఏపీతోపాటు తెలంగాణలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్‌.. ఆదిశగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాసమస్యలే అజెండాగా పోరాడుతూ..పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న వ్యూహంతో ముందుకు పోతామని జనసేన అధినేత అంటున్నారు. 

 

11:14 - January 23, 2018

హైదరాబాద్ : త్వరలో ఏపీ-తెలంగాణ మధ్య హైస్పీడ్‌ రైలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్‌ రైళ్లు ప్రవేశపెడతామన్న బీజేపీ హామీలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కితే ఇరు రాష్ట్రాల్లో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
హైస్పీడ్‌ రైలుతో రాష్ట్రాల రాజధానుల అనుసంధానం 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల రాజధానులను హైస్పీడ్‌ రైలుతో అనుసంధానం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌-అమరావతి మధ్య బుల్లెట్‌రైలుతో పాటు 8 లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించాలని రెండేళ్ల క్రితమే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా... ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. 
జపాన్‌ సహకారంతో బుల్లెట్ రైలు 
దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బుల్లెట్‌ రైలు తరహా హైస్పీడ్‌ రైళ్లు నడుపుతామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఢిల్లీ ముంబై, అహ్మదాబాద్‌-ముంబై, ముంబై-చెన్నై, ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-నాగ్‌పూర్‌ సెక్షన్లలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. గతేడాదిలో అహ్మదాబాద్‌-ముంబై మధ్య బుల్లెట్‌రైలు ప్రాజెక్ట్‌కు జపాన్‌ సహకారంతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. 
కోల్‌కతా మధ్య మరో ప్రాజెక్ట్‌ 
ఇక ఇందులో భాగంగానే ఢిల్లీ నుంచి వారణాసి మీదుగా కోల్‌కతా మధ్య మరో ప్రాజెక్ట్‌కు కేంద్రం సిద్దమవుతోంది. దక్షిణాదిలో కూడా బెంగళూరు చెన్నై, చెన్నై-హైదరాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైళ్లు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రతిపాదన మేరకు రైల్వేశాఖ సహకారంతో రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ హైదరాబాద్‌-అమరావతి మధ్య బుల్లెట్‌ రైలు నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌లో మెట్రోరైలును ప్రకటించిన మోదీ... తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య హైస్పీడ్‌ రైలుపై ప్రకటన చేస్తారని అందరూ ఊహించారు. అయితే... అలాంటిదేమీ లేకపోవడంతో... ఈ బడ్జెట్‌లో ఖచ్చితంగా బుల్లెట్‌ రైలు ప్రస్తావని ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. 
హైదరాబాద్‌ అమరావతి మధ్య హైస్పీడ్‌ రైలు 
హైదరాబాద్‌ అమరావతి మధ్య హైస్పీడ్‌ రైలు, 8 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ఎంతో సమయం కలిసివస్తుందని అందరూ భావిస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు బస్సు ద్వారా దాదాపు 6 గంటల సమయం పడుతుండగా... రైలు ద్వారా 5.30 గంటల నుంచి 6.30 గంటల సమయం పడుతుంది. ఈ మార్గంలో హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేస్తే... 270 కిలోమీటర్ల గమ్యాన్ని 40 నుంచి 50 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. 
రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు 
ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ఇరు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి 65ను 8 లేన్లతో ఎక్స్‌ప్రెస్‌ హైవేగా విస్తరించడం, ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానదిపై 8 లేన్లతో వంతెన, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా బుల్లెట్‌ రైలు కోసం మరొక వంతెన నిర్మించి అమరావతితో అనుసంధానం చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రయాణికుల సేఫ్టీకి కూడా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక విజయవాడ, గుంటూరులకు సర్క్యులర్‌ రైళ్లు, మెట్రో రైళ్లను నడిపితే భవిష్యత్‌లో ట్రాఫిక్‌ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య హైస్పీడ్‌ రైళ్లు ప్రారంభమైతే అతి తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఇరు రాష్ట్రాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయని పలువురు భావిస్తున్నారు. 

 

సీపీఎం, దళిత సంఘాల నేతల మందుస్తు అరెస్టు

 గుంటూరు : రేపు చలో పెదగొట్టిపాడు నేపథ్యంలో పలువురు సీపీఎం, దళిత సంఘాల నేతలను పోలీసులు మందుస్తుగా అరెస్టు చేశారు. తాడేపల్లి వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పలువురు సీపీఎం, కేవీపీఎస్ నేతలను అరెస్టు చేసి, తాడేపల్లికి పీఎస్ కు తరలించారు. 

మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం

భూపాల్ : మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనందిబెన్ పటేల్ ను నియమించారు. ఈమేరకు గవర్నర్ గా పటేల్ మాణస్వీకారం చేశారు. 

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

పశ్చిమగోదావరి : ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందారు. 

 

10:22 - January 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొన్న ఘటనలో చిన్నారితో సహా తల్లి, సురేశ్ మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులు దేవి (32), నిశ్చయ (2), సురేశ్ గా గుర్తించారు. ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యుకులు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:21 - January 23, 2018

కర్నూలు : అటవీశాఖ అధికారి రాస లీలల భాగోతం బయటపడింది. జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు ఓ మహిళతో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వెంకటేశ్వరరావుతోపాటు మహిళలను పోలీసులు అరెస్టు చేసి, పీఎస్ కు తరలించారు. కర్నూలులో బిఎస్.వెంకటేశ్వర రావు అటవీశాఖ నిఘా విభాగం అధికారిగా పని చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓ మహిళను తెచ్చుకొని రాత్రి ఒంటి గంట సమయంలో ఆమెతో వ్యభిచారం చేశాడు. ఇది గమనించిన స్థానికులు విద్యార్థి సంఘాలు బిఎస్.వెంకటేశ్వర రావు, మహిళ ఉన్న గదికి తాళం వేసి, నిర్బంధించారు. పోలీసులకు సమాచారం అంధించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంకటేశ్వరరావుతోపాటు మహిళలను అరెస్టు చేసి, పీఎస్ కు తరలించారు. వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోవాలి, అతన్ని విధుల నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కాసేపట్లో జనసేన కార్యకర్తలతో పవన్ భేటీ..

కరీంనగర్ : జగిత్యాలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కాసేపట్లో శుభం గార్డెన్స్ కు చేరుకోనున్నారు. 10 :45 నిముషాలకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాన్నం భోజనం అనంతరం కొత్తగూడెం బయలుదేరి వెళతారు.

09:06 - January 23, 2018

హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మహిళపై దాడి...

తూర్పుగోదావరి : సర్పవరం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇద్దరు మహిళలపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తులు..ఇనుప రాడ్లతో దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఉమా మహేశ్వరీ ఉన్నారు. 

పెద్దపల్లిలో 144 సెక్షన్...

కరీంనగర్ : పెద్దపల్లిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సభలు..సమావేశాలు..ధర్నాలు..రాస్తారోకోలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బీజేపీ నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది.

 

బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బోల్తా...

హైదరాబాద్ : బేగంపేట పీఎన్ టి ఫై ఓవర్ పై కారు బోల్తా పడింది. కారులో ఉన్న వారు పరారయ్యారు. మద్యం మత్తులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. 

అనంతపల్లి వద్ద ప్రమాదం...

పశ్చిమగోదావరి : నల్లజర్ల (మం) అనంతపల్లి వద్ద ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొన్న ఘటనలో చిన్నారితో సహా తల్లి మృతి చెందింది. దేవి (32), నిశ్చయ (02) మృతి చెందిన వారిలో ఉన్నారు. 

08:25 - January 23, 2018

కలెక్షన్ కింగ్..డైలాగ్ కింగ్..గా పేరొందిన 'మోహన్ బాబు' ప్రమాణ స్వీకారం చేయడం ఏంటీ ? రాజకీయ ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేశారా ? ఎప్పుడు ఎన్నికయ్యారు ? అంటూ ఏవో ఊహించుకోకండి..ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మాట నిజమే కానీ రాజకీయాల్లో మాత్రం కాదు. ఎన్నో చిత్రాల్లో నటించిన 'మోహన్ బాబు' పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫిల్మ్ నగర్ లో ఉన్న దైవ సన్నిధాన ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి ఆధ్వర్యంలో సోమవారం ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయనతోపాటు 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 'మోహన్ బాబు' మాట్లాడుతూ...తానెప్పుడూ దేవాలయ చైర్మెన్‌ అవ్వాలనుకోలేదని, సినిమాలు, నా సంస్థలను చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నానని తెలిపారు. చైర్మెన్‌గా అదనపు బాధ్యతలు ఎందుకు ఎంచుకోవాలని అనుకోవడం జరిగిందని, కానీ టి.సుబ్బరామిరెడ్డి వంటి పలువురి వల్ల ఫిల్మ్‌ నగర్‌ దైవ సన్నిధాన చైర్మెన్‌ పదవీ బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు.

పాలక మండలిలో గిరిబాబు, పరుచూరిగోపాలకృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, కోమటిరెడ్డి లక్ష్మి, లక్ష్మి, చాముండేశ్వరినాథ్‌, వి.రామ్‌ప్రసాద్‌, రఘురామకృష్ణ ఉన్నారు. కార్యదర్శిగా కాజా సూర్యనారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్ర రావు, పరచూరి వెంకటేశ్వరరావుతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని మోహన్‌బాబుకు అభినందనలు తెలిపారు.

08:17 - January 23, 2018

ప‌దునైన సంభాష‌ణ‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌పై పంచ్ లు వేయాల‌న్నా మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమా తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా కాంపౌండ్ నుండి హీరోగా వచ్చి అలరిస్తున్న 'సాయి ధరమ్ తేజ'తో వినాయక్ ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ కొనసాగుతోంది. 'సాయి ధరమ్ తేజ' సరసన 'లావణ్య త్రిపాఠి' జంటగా నటిస్తోంది.

కెరీర్ మొదట్లోనే కొంచెం తడబడ్డ మెగాహీరో 'సాయి ధరమ్ తేజ్' ఆ తర్వాత వరుస విజయాలతో మెగా ఫ్యాన్స్ కి చాలా దగ్గరయ్యడు. 'విన్నర్' సినిమా ఫ్లాప్ అవ్వడంతో 'కృష్ణ వంశి' సినిమా 'నక్షత్రం' మీద హోప్స్ పెట్టుకొని అది కూడా ఆడియన్స్ ని రీచ్ అవ్వకపోవడంతో 'సాయి ధరమ్ తేజ' కొద్దిగా ఆలోచించాడు. 'జవాన్' విడుదల అవ్వకముందే వి వి వినాయక్ సినిమాని ఒకే చేశాడు. ఫుల్ యాక్షన్..ఎంటర్ టైన్ మెంట్ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయ్యిందని, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని నిర్మాత సి.కళ్యాణ్‌ పేర్కొన్నారు. సాయిధరమ్‌తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌, వినాయక్‌ టేకింగ్‌ హైలైట్‌గా ఈ చిత్రం రూపొందిందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఈ 'ఇంటిలిజెంట్' అలరిస్తాడా ? లేడా ? అనేది చూడాలి. 

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన డీఎఫ్ వో...

కర్నూలు : అటవీ శాఖ నిఘా విభాగం అధికారం వెంకటేశ్వరరావు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు మహిళను పీఎస్ కు తరలించారు. 

నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్...

చిత్తూరు : నేడు తొట్టంబేడు మండలం రెడ్డిగుంట నుండి వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. నెల్లూరు జిల్లాలోకి ఆయన ప్రవేశించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. 

07:54 - January 23, 2018

ఏపీలో రాజకీయాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత రాజశేఖర్, టీడీపీ నేత చందూసాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఉమామహేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమన్న జగన్...వంటి పలు అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

రాహుల్ తో భేటీ కానున్న ఏపీ కాంగ్రెస్ నేతలు...

ఢిల్లీ : నేడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు..ఇతరత్రా వాటిపై వారు చర్చించనున్నారు. 

దావోస్ లో మోడీ ప్రసంగం..

 

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. దావోస్ లో జరుగుతున్న ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తున్నారు. 

 

ఢిల్లీలో మధ్యంతర ఎన్నికలు ?

ఢిల్లీ : రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఇరవైమంది ఎమ్మెల్యేలపై లాభదాయక పదవుల కారణంతో ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆప్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లినా స్టే లభించలేదు. దాంతో ఆప్‌ సోమవారం పిటిషన్‌ను ఉపసంహరించుకొంది. తాజాగా వేరే పిటిషన్‌ వేయాలని నిర్ణయించింది. 

ఫిబ్రవరి 21 నుండి కమల్ రాజకీయ యాత్ర...

చెన్నై : ఫిబ్రవరి 21వ తేదీ నుండి ప్రజల మధ్యలోకి సినీ నటుడు కమల్ వెళ్లనున్నారు. రామేశ్వరం నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు కమల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

07:18 - January 23, 2018

వారంతా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం వారిప్పుడు ప్రభుత్వాన్ని మా సంక్షేమం సంగతేంటని అడుగుతున్నారు. తమ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. వారే స్కీం వర్కర్స్‌. ఇప్పుడు వారంత సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సమ్మెకు గల కారణాలు.. వారి పట్ల ప్రభుత్వ విధానాల గురించి టెన్ టివి జనపథంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఏవీ నాగేశ్వరరావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:17 - January 23, 2018

ఢిల్లీ : మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రహ్మణి ఇండస్ట్రీస్‌లో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి చెందిన 189 కోట్ల రూపాయల యంత్రపరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 2009లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రపరికరాలకు కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించలేదని డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన నోటీసులను గాలి జనార్దన్‌రెడ్డి బేఖాతర్‌ చేశారు. కడపలోని బ్రహ్మణి స్టీల్‌ ఇండస్ట్రీస్‌తోపాటు ఓబుళాపురం మైనింగ్‌ యంత్రపరికరాలను సీజ్‌ చేశారు.  గాలి జనార్దన్‌రెడ్డితోపాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు బెయిల్‌ నిబంధనలను సడలించాలన్న గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ నిబంధనల్లో మార్పులు ఉండవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 
 

07:16 - January 23, 2018

విజయవాడ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవల్లిలో సూర్య జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రథసప్తమి వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన వెలుగుల రేడు ఆదిత్యుని దర్శనానికి లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో.. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సర్వం సిద్దం చేశారు. బుధవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో దాదాపు 36 గంటల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజు రాత్రి 12:15 నిమిషాలకు స్వామివారి క్షీరాభిషేకంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం విశేష పూజలు, ఇతర సేవలు నిర్వహిస్తారు. ...

సూర్య నారాయణ స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వేడుకల్లో మొత్తం ఎనిమిది ప్రభుత్వ శాఖలు సేవలు అందించనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు.. వీఐపీ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్లలో త్రాగునీరు, వైద్య శిబిరాలు, వృద్ధులు, వికలాంగులు కోసం బ్యాటరీ సహాయంతో నడిచే వాహనాలు సిద్ధం చేశారు. ఇంద్ర పుష్కరిణి వద్ద గజ ఈతగాళ్లను ఉంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.రథసప్తమి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం విరివిగా పార్కింగ్ స్థలాలు, చెప్పుల స్టాండులు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 

07:14 - January 23, 2018

సంగారెడ్డి : ఐదు వందల కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. పైసా పైసా పోగేసి కొన్న తమ స్థలాల కోసం ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కబ్జా చెర నుండి మా స్థలాలు మాకు దక్కేలా చేయాలని కోరుతోన్న బాధితులతో 10టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:14 - January 23, 2018

రంగారెడ్డి : సంబంధం లేని కేసులో ఓ నిండు ప్రాణం బలైంది. తనపై లేనిపోని ఆరోపణలు చేయడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు.. పీఎస్‌లోనే పురుగుల మందు తాగాడు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా ఆయన కనీసం పట్టించుకోలేదు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా చూసీచూడనట్లుగా పలాయనం చిత్తగించాడు. దీంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆ రైతు తుదిశ్వాస విడిచాడు. రైతు ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళన బాట పట్టారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఈదుల గోపాల్‌. గతేడాది అక్టోబర్‌ 11న శంకర్‌పల్లి పీఎస్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దశరద్‌ అనే వ్యక్తి మిస్సింగ్‌ కేసులో వికారాబాద్‌ జిల్లా నవ్‌పేట్‌ మండలం అక్నాపూర్‌కు చెందిన రైతు గోపాల్‌ను.. శంకర్‌పల్లి పీఎస్‌కు పోలీసులు విచారణకు పిలిపించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పీఎస్‌కు వచ్చి ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారు తెచ్చారు. దీంతో పోలీసులు విచారిస్తున్న సమయంలో మనస్తాపానికి గురైన గోపాల్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకుండా అక్కడినుంచి జారుకున్నాడు. పోలీసులు గోపాల్‌ను 108లో రంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా... ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.

అయితే... అదృశ్యమైన దశరథ్‌.. గోపాల్‌ చనిపోయిన వారం రోజులకు ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్‌ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఎలాంటి సంబంధం లేని కేసులో గోపాల్‌ను ఇరికించి... ప్రాణాలు పోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాల్‌ చావుకు కారణమైన శంకర్‌పల్లి పోలీసులు, ఎమ్మెల్యే యాదయ్య, దశరథ్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. మృతుడి బంధువుల ఆవేదనను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఈ కేసులో ఎమ్మెల్యే యాదయ్యకు సంబంధం ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సైబరాబాద్‌ కమిషనర్‌ను కలిసినా న్యాయం జరగడం లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఎలాంటి తప్పు చేయని తన తండ్రిని.. శంకర్‌పల్లి పీఎస్‌కు తీసుకువచ్చి చిత్రహింసలకు గురి చేయడం వల్లే మృతి చెందాడని మృతుడి కుమారుడు చంద్రశేఖర్‌ అంటున్నాడు. ఎమ్మెల్యే యాదయ్య మధ్యవర్తిత్వం వహించి.. తన తండ్రి చావుకు కారణమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఎలాంటి సంబంధం లేని కేసులో ఓ వ్యక్తి ప్రాణాలు పోయేందుకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే... ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..! 

07:11 - January 23, 2018

హైదరాబాద్ : వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా కాంగ్రెస్‌ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతుంది. గ్రౌండ్‌లో క్యాడ‌ర్‌ ను స‌మాయ‌త్తం చేస్తూ.. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఇంచార్జ్‌ల‌కు బాధ్యత‌ల‌ను అప్పగించేందుకు రెఢీ అవుతోంది. అంతేకాదు.. గులాబీ పార్టీకి వ్యతిరేక శ‌క్తుల‌ను ఏకం చేస్తూ.. మ‌రోవైపు బ‌స్సు యాత్రతో తెలంగాణ‌ను చుట్టేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ వార్తల నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ అల‌ర్ట్‌ అయ్యింది. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇప్పటి నుండే వ్యూహాలను పదును పెడుతోంది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఎన్నిక‌లు వచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్న హ‌స్తం నేత‌లు.. దీనికోసం పూర్తి స‌మాయ‌త్తంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో నేతల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగా మొద‌ట నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఇంచార్జ్‌ ల‌ను నియ‌మించే ప‌నిలో పడ్డారు. ఇప్పటికే టీఆర్ ఎస్‌ తో ఢీ అంటే ఢీ అంటున్న నేత‌ల‌పై స్పష్టత‌తో ఉన్న పీసీసీ.. వారికి పూర్తి బాధ్యత‌లను అప్పగించాలని నిర్ణయించింది. 65 స్థానాలకు ఇంఛార్జ్‌ల‌ను ప్రక‌టించ‌నుంది. అంతేకాకుండా.. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ల‌ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్లు ఖాయమ‌ని చెప్పడం ద్వారా..వారంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు క‌ష్టప‌డి ప‌నిచేస్తార‌ని..పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తార‌ని పీసీసీ బ‌లంగా న‌మ్ముతుంది. ఎన్నిక‌లకు ముందే అభ్యర్ధులను ప్రక‌టించ‌డం కంటే ఇప్పుడే నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ ల‌ను నియమించ‌డ‌మే క‌రెక్టని భావిస్తుంది. అదే స‌మ‌యంలో అసెంబ్లీ నియోజక‌వ‌ర్గ ఇంఛార్జ్‌ల‌ను స‌మ‌న్వయం చేసే బాధ్యత‌ను జిల్లా పార్టీకి కాకుండా పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంఛార్జ్‌ల‌కు అప్పగించాలని భావిస్తున్నారు. ఎన్నిక‌లు రాక‌ముందే ఎంపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే అభ్యర్ధులు స‌మ‌న్వయంతో ప‌నిచేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయ‌మని పీసీసీ ఛీఫ్ భావిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 సీట్లను గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు బ‌లంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ ను ఓడించాలంటే ప్రజ‌లను నేరుగా క‌ల‌వ‌డంతో పాటు ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్ళాల‌ని డిసైడ్‌ అయ్యారు. ఇందుకోసం ఫిబ్రవ‌రి మూడో వారంలో బ‌స్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ బ‌స్సు యాత్రను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ‌మైన జూన్‌ 2న భారీ బహిరంగ సభ‌తో ముగించనుంది. ఈ స‌భ‌లో రాహుల్‌ పాల్గొనేలా చూస్తున్నారు. ఇదే కాకుండా.. ఫిబ్రవ‌రిలో ఇత‌ర పార్టీల‌నుండి నుండి భారీగా నేత‌ల‌ను చేర్చుకుని పార్టీలో మ‌రింత జోష్ తెచ్చేందుకు ప‌క్కా స్కెచ్‌తో హ‌స్తం పార్టీ ఉంది. దీనికి తోడు.. టీఆర్‌ఎస్‌ శ‌క్తుల‌ను ఏకం చేసే ప‌నిలో ఇప్పటికే నిమ‌గ్నన‌మైన హ‌స్తం పార్టీ.. ఎన్నిక‌ల నాటికి ఈ శ‌క్తుల‌న్నంటితో క‌లిసి.. ఫ్రంట్‌ ఏర్పాటు చేసే యోచ‌న కూడా చేస్తుంది. మ‌రి కాంగ్రెస్‌ వ్యూహాలు ఏ మేర‌కు వ‌ర్కౌట్‌ అవుతాయో వేచిచూడాలి.

07:10 - January 23, 2018

స్విట్జర్లాండ్ : ఉద్యాన పంటల సాగును ఉద్యమస్పూర్తితో కొనసాగిస్తామన్నారు చంద్రబాబు. రానున్న కాలంలో ఏపీని ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.  ప్రపంచ ఆర్ధిక వేదిక ఆహ్వానం మేరకు దావోస్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు.. అనేకమంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. 
పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రపద్రేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్‌ రాన్ పాల్‌.. చీఫ్‌ ఇన్వెస్టర్‌ ఆఫీసర్‌ సందీప్‌రాజ్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 
తక్కువ పెట్టుబడితో దిగుబడులు
తక్కువ పెట్టుబడితో దిగుబడుల సాధనకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 40లక్షల ఎకరాలకు పరిమితమైన ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు విస్తరించాలన్న దార్శనికతతో పని చేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా సెన్సర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నామన్నారు.  ప్రతికూల పరిస్థితుల్లోనూ.. తమ రాష్ట్రం ఒక్క ఉద్యానరంగంలోనే 30శాతం వృద్ధిరేటును నమోదు చేసిందన్నారు. ఆక్వా రంగాన్ని కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేశామని.. ఆక్వాలో దేశంలోనే తమ రాష్ట్రం నంబర్‌-1  అన్నారు చంద్రబాబు. 
పంటలను ప్రోత్సహించేందుకు క్లస్టర్ల ఏర్పాటు
ఇక రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి ప్రణాళికతో వస్తే... అన్ని విధాలా సహకరిస్తామని.. పయనీర్‌ వెంచర్స్‌కు చంద్రబాబు తెలిపారు. సింగల్‌ డెస్క్‌ విధానం ద్వారా అన్ని అనుమతులను మూడు వారాల్లోనే ఇస్తామని.. దానికి నాది భరోసా అన్నారు. 
పెద్ద ఎత్తున సహకార సంస్థల ఏర్పాటు
ఫార్మర్‌ ప్రోడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ తరహాలో పాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా పెద్ద ఎత్తున సహకార సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కుప్పంలో చిన్న పాటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సరుకు రవాణా సులభతరం అయ్యేవిధంగా చేస్తామని తెలిపారు.
వచ్చే 5ఏళ్లలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు
పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని.. రానున్న ఐదేళ్లలో 5000 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు.  ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి భవిష్యత్‌ కార్యాచరణ సవివరంగా ప్రకటిస్తామన్నారు. కాగా సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పయనీరింగ్‌ సంస్థ దేశంలో వెయ్యి కోట్ల పెట్టుబడులను పెట్టింది. కుప్పం, నాందేడ్‌లో ఇప్పటికే కార్యకలాపాలను కూడా ప్రారంభించింది. 

 

07:09 - January 23, 2018

విజయవాడ : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే 2019లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దమని ప్రకటించారు. పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్బంగా ఓ ఇంగ్లీష్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడిన జగన్‌... కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రికి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే.. ఎలాంటి ఆలోచన లేకుండా 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

ఇక గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు జగన్‌. అమరావతి పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను చంద్రబాబు ఫూల్స్‌ చేస్తున్నారన్నారు. అభివృద్ధి అంతా పెద్ద కుంభకోణమని... అమరావతికి వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను లాక్కున్నారన్నారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అబద్దాలతో పాలన చేస్తున్నారన్నారు. ఇక సీబీఐ కేసుల ప్రస్తావనపై స్పందించిన జగన్‌... తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కుట్రపూరితమైనవే అన్నారు. వాటి వెనుక కాంగ్రెస్‌ ఉందన్నారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం కేసులు లేవని... కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చిన తర్వాత నాపై కేసులు పెట్టారన్నారు. అయితే... నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవన్నారు జగన్‌. ఓవైపు బీజేపీ-టీడీపీ మధ్య విభేదాలు తలెత్తుతుండగా.. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దమైనని జగన్‌ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి బీజేపీ అధిష్టానం జగన్‌ నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి ! 

దళిత తేజం - తెలుగుదేశం..

విజయవాడ : ఏపీలోని దళితవాడల్లో ఈ నెల 26 నుంచి దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి జవహర్ తెలిపారు. 

దట్టంగా పొగమంచు..ఢీకొన్న వాహనాలు..

హర్యానా : రాష్ట్రంలో దట్టంగా పొగమంచు అలుముకొంటోంది. దీనితో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. కర్నాల్ లో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. 

అమెరికా ప్రతిష్టంభనపై కుదిరిన సయోధ్య..

అమెరికా : దేశంలో ప్రతిష్టంభన పై సయోద్య కుదిరింది. నేటి నుంచి ప్రభుత్వ సేవల పునరుద్దరణ జరుగనుంది. ఇదిలా ఉంటే అక్రమ వలసలపై చర్చ చేపట్టడానికి ట్రంప్ సర్కార్ అంగీకరించింది. 

కోడీ పందాలపై హైకోర్టు గుస్సా...

హైదరాబాద్ : సంక్రాంతికి కోడిపందేల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 29న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏపీ సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. 

దావోస్ లో బాబు..

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పెట్టుబడుల వేటకు బయలుదేరి వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యారు. 

పవన్ షెడ్యూల్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటన కొనసాగుతోంది. మంగళవారం కరీంనగర్‌ జిల్లా జగిత్యాల రోడ్‌లోని శుభం గార్డెన్స్‌లో 10 గంటల 45 నిమిషాలకు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కొత్తగూడెం బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కొత్తగూడెం చేరుకొని అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

Don't Miss