Activities calendar

24 January 2018

నకిలీ సర్టిఫికేట్ల స్కాం పై విచారణ

హైదరాబాద్ : నకిలీ బర్త్ సర్టిఫికేట్ల స్కాం వ్యవహారంలో మీ సేవ కమిషనర్ చర్యలకు దిగారు. ఆరోపణలు వచ్చిన మీ సేవ సెంటర్ల గుర్తింపు రద్దు చేశామని మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరావు తెలిపారు. 

వివాదాలోకెక్కిన బాలయ్య

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వివాదాలోకెక్కారు. బాలయ్య సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలయ్య సీఎం సీట్లో కూర్చోడాన్ని చూసి అధికారుల విస్తు పోయారు.

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

గుంటూరు : పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాషనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం అనైతికమని, పార్టీ మారి మంత్రులుగా కొనసాగుతున్న నేతల రాజీనామ చేయాలని ఆయన అన్నారు. లేకపోతే పార్టీ ఫిరాయించి మంత్రుల కావచ్చు అనే కొత్త చట్టం తీసుకురావాలని ఆయన ఎద్దేవా చేశారు.

పాక్ పై అమెరికా దాడులు

వాషింగ్టన్ : పాక్ పై అమెరికా డ్రోన్ లతో దాడులకు దిగింది. ఉత్తర వజీరిస్థాన్ లో హక్కానీ నెట్ వర్క్ పై దాడి చేసింది ఈ దాడుల్లో హక్కాని కమాండర్ ఇషన్ నోరీ మృతి చెందాడు.

పోలీస్ స్టేషన్ లో బాలకార్మికులు

గుంటూరు : తాడేపల్లి పోలీస్ ష్టేషన్ లో పోలీసులు పిల్లలతోని పని చేయించుకుంటున్నారు. పోలీసులు బాలురతో స్టేషన్ ను శుభ్రపరచడం, టీలు, టిఫిన్లు తెప్పింకుంటున్నారు. 

గజల్ శ్రీనివాస్ కు బెయిల్

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు కోర్టు రూ.10వేల పూచికత్తు తో పాటు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏ 2 నింధితురాలు పార్వతికి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. 

16:55 - January 24, 2018

ఖమ్మం : జనసేన అధినేత పవన్ కాన్వాయ్ పై గుర్తుతెలియని దుండగుడు చెప్పు విసిరాడు. ఖమ్మం పట్టణంలోకి కాన్వాయ్ ప్రవేశిస్తుండగా ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:01 - January 24, 2018
13:56 - January 24, 2018
13:51 - January 24, 2018

హైదరాబాద్ : ఈనెలాఖరులో తెలంగాణ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ తప్పదా..? అధికారులు, మంత్రులు, సందర్శకులు.. ఇలా.. సచివాలయంలో ఏ నలుగురిని కలిసినా ఇప్పుడు ఈ అంశంపైనే హాట్‌హాట్‌గా చర్చ సాగుతోంది. ఈ చర్చలో వాస్తవం ఎంత..? ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌ మంత్రివర్గాన్ని సరికొత్తగా కూర్చుతారా..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
ఎవరికి ఉద్వాసన చెప్పనున్నారు..? 
ఈనెల చివర్లో తెలంగాణలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ.. సచివాలయం వర్గాల్లో హాట్‌హాట్‌ చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గంలో ఎవరికి ఉద్వాసన చెప్పనున్నారు..? దానికి కారణాలేంటి..? కొత్తగా ఎవరిని తీసుకోనున్నారు..? ఈ అంశాలపై విస్తృత చర్చ సాగుతోంది.  
2014 జూన్‌ 2న కొలువుదీరిన రాష్ట్ర క్యాబినెట్ 
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. 2014 జూన్‌ రెండున.. రాష్ట్ర క్యాబినెట్ కొలువుదీరింది. కొంత కాలానికి కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనంతరం, ఓ నలుగురైదుగురు మంత్రుల శాఖలు మార్చడం తప్ప.. కేబినెట్‌లోకి కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. 
కేబినెట్‌లో మహిళలు లేకపోవడంపై విమర్శలు 
అయితే మొదటి నుంచి కేబినెట్‌లో మహిళలు లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. నిజామాబాద్‌ ఎంపీ, కేసీఆర్‌ తనయ కవిత, తనయుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌  కూడా కొన్నిసార్లు ఈ లోపాన్ని ఎత్తి చూపారు. ముఖ్యమంత్రి అందరికీ న్యాయం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. పునర్వస్థీకరణలో మహిళలకు స్థానం కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం ఉపందుకుంది. మంత్రివర్గ పునర్వస్థీకరణలో అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, కోవా లక్ష్మికి స్థానం కల్పించే అవకాశం  ఉందని భావిస్తున్నారు. ఇటీవలే టీడీపీలో నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. 
నాయినికి రాజ్యసభ సీటు ?
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది.  వివిధ కారణాలతో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాయిని రాజ్యసభకు పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. శాఖపై పట్టు సాధించకుండా పద్మారావు సికింద్రాబాద్‌కే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అనారోగ్యంలో చందూలాల్‌ సక్రమంగా విధులు హాజరుకాకపోవడంతో పర్యాటక శాఖ ప్రగతి దెబ్బతింటోందన్న వాదనలు ఉన్నాయి. వైద్యోరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పీడు తగ్గించారన్న విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో వీరిని మంత్రివర్గం నుంచి తొలిగించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తంమీద మంత్రివర్గ పునర్వస్థీకరణకు కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారన్న సమాచారంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరోవైపు ఉన్నవారిలో ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

13:46 - January 24, 2018

హైదరాబాద్ : అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించిన మోత్కుపల్లికి షోకాజ్‌ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే చర్యలు తీసుకోవాలని పార్టీ యోచిస్తోంది. అయితే... పార్టీకి మోత్కుపల్లి సంజాయిషీ ఇస్తారా ? లేక పార్టీకి గుడ్‌బై చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. 
జరిగిన పరిణామాలపై చంద్రబాబుకు నివేదిక
తెలంగాణా తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను ఆత్మర‌క్షణ‌లో పడేసిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై తెలుగుదేశం పార్టీ పెద్దలు సీరియ‌స్‌గా ఉన్నట్లు స‌మాచారం. పార్టీ క్రమ‌శిక్షణ ఉల్లంఘించార‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన టీ-టీడీపీ నేత‌లు జ‌రిగిన ప‌రిణామాల‌పై పూర్తి  సమాచారాన్ని అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక ద్వారా అందించారు. రాజ‌కీయంగా దూమారం రేపిన విలీనం వ్యాఖ్యల‌పై పార్టీ నేత‌లు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పార్టీ మారిన చాలా మంది నేతలు
ఇప్పటికే  భారీ ఎత్తున నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స వెళ్లడంతో... ఉన్న కొద్ది మంది నేత‌ల మ‌నో స్థైర్యం దెబ్బతీసేలా ఆయ‌న వ్యాఖ్యలు ఉన్నాయ‌న్న అభిప్రాయం నేత‌ల్లో వ్యక్తమయ్యింది. ఈ ప‌రిణామాల‌పై పార్టీ నేత‌లు సుదీర్ఘంగా చ‌ర్చించడంతో పాటు అమ‌రావ‌తి నుంచి వ‌చ్చే ఆదేశాల‌ను పాటించాల‌న్న నిర్ణయానికి వ‌చ్చారు.
పోలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరుకాని మోత్కుపల్లి
పార్టీ పోలిట్‌ బ్యూరో స‌మావేశంలోనే మోత్కుప‌ల్లిని  వివ‌రణ కోరాల‌ని నిర్ణయం తీసుకున్నా.. వ్యక్తిగ‌త కార‌ణాల‌తో మోత్కుప‌ల్లి స‌మావేశానికి హాజ‌రు కాలేదు. దీంతో ఆయ‌న వ్యవ‌హారం పార్టీలో మ‌రింత చ‌ర్చనీయంశంగా మారింది. క్రమ‌శిక్షణ‌కు మారు పేరుగా ఉండే పార్టీలో క్రమ‌శిక్షణను ఉల్లంఘిస్తే స‌హించేది లేద‌ని టీ-టీడీపీ అధ్యక్షులు ర‌మ‌ణ హెచ్చరిస్తున్నారు. పార్టీ నేతలు అభద్రతకు లోను కాకుడదని.. పార్టీకి చంద్రబాబు అండదండలు ఉన్నాయని అన్నారు. విలీనం వ్యాఖ్యల‌ను మెత్కుప‌ల్లి ఉప‌సంహ‌రించుకోక పోతే చ‌ర్యలు తప్పవ‌న్న సంకేతాల‌ను టీ- టీడీపీ నేత‌లు ఇస్తున్నారు.  పార్టీ ఇచ్చే షోకాజ్‌ నోటీసుకు మోత్కుప‌ల్లి స్పందిస్తారా లేదంటే.. పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తారా అని ఉత్కంఠ  రేగుతోంది.

 

గులాబీ కూలీపై ఢిల్లీ హై కోర్టులో విచారణ

ఢిల్లీ : టీఆర్ఎస్ నేతల గులాబీ కూలీపై ఢిల్లీ హై కోర్టులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీల నిధుల సేకరణ చట్టం లోపాలపై దృష్టిసారించాలని సీఈసీని హైకోర్టు ఆదేశించింది. 

13:39 - January 24, 2018

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలోని హసన్‌పర్తిలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకోవడమే ఆ యువతి నేరమైపోయింది. తల్లిదండ్రులే ఆమెపై కక్షకట్టారు. యువకుడిని ప్రేమ వివాహం చేసుకుందని కూతురికి తల్లిదండ్రులు గుండు కొట్టించారు. దీనిపై యువతి భర్త ప్రవీణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:36 - January 24, 2018

గుంటూరు : జిల్లాలోని గొట్టిపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమస్యలను తెలుసుకునేందుకు బయల్దేరిన సీపీఎం, దళిత సంఘాలనేతలను అడ్డుకోవడంపై దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితవాడలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. లెఫ్ట్‌ నేతలను గ్రామంలోకి అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ ఉందంటూ మహిళలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:31 - January 24, 2018

చిత్తూరు : తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చినశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రాత్రి వరకు 7 వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఒక్కరోజు వేడుకగా భావించే ఈ రథసప్తమి పర్వదినాన... ఒక్కరోజే ఏడు వాహనాలపై శ్రీవారు కనువిందు చేస్తారు. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తారు. 

 

13:12 - January 24, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ సిద్దమవుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కారెక్కడం తప్పనిసరా ? ముఖేష్‌గౌడ్‌ గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ఎంఐఎం కారణమా ? ముఖేష్‌ పార్టీ మారేందుకు ఒవైసీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారు. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
ముఖేష్‌గౌడ్‌ వ్యవహారం కాంగ్రెస్ లో చర్చనీయాంశం 
కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీమంత్రి ముఖేష్‌గౌడ్‌ వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాటి నుంచి ఇప్పటివరకు గాంధీభవన్‌ మెట్లు ఎక్కని ముఖేష్‌గౌడ్‌... ఆ పార్టీని వీడుతారా అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. 
వారి బాటలోనే ముఖేష్‌గౌడ్‌ ?
ఇప్పటికే ఎంతోమంది నేతలు టీఆర్‌ఎస్‌లో చేరగా... వారి బాటలోనే ముఖేష్‌గౌడ్‌ కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గులాబీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని... పార్టీలో చేరే ముహూర్తం మిగిలివుందని ముఖేష్‌గౌడ్‌ సన్నిహితులంటున్నారు. అంతా ఓకే అయితే... వచ్చే నెలలో ముఖేష్‌ గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
ముఖేష్ టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు ?  
అయితే.. ముఖేష్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నా రనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తమ్‌, భట్టి విక్రమార్క, జానారెడ్డిలతో పాటు ఎవరితో విభేదాలు లేని ముఖేష్‌.. మూడున్నరేళ్ల తర్వాత టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే.. పీసీసీ నాయకత్వంతో మంచి రిలేషన్‌ ఉన్న ముఖేష్‌గౌడ్‌ పార్టీ మారేందుకు ఎంఐఎం కారణమని తెలుస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సలహాతోనే ముఖేష్‌ కారెక్కనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేయనున్న ముఖేష్‌.. అక్కడ గెలవాలంటే మైనారిటీల ఓట్లు కీలకం. గతంలో కాంగ్రెస్‌-ఎంఐఎం పొత్తుతో ముఖేష్‌గౌడ్‌ ఈజీగా గెలిచారు. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజాగా టీఆర్‌ఎస్‌-ఎంఐఎంల దోస్తీ కొనసాగుతుండడంతో.. ముఖేష్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే... టీఆర్‌ఎస్‌లో చేరితే గెలుపునకు సహకరిస్తానని అసదుద్దీన్‌ ముఖేష్‌గౌడ్‌కు మాటిచ్చినట్లు సమాచారం. అలాగే ముఖేష్‌ కారెక్కెందుకు కేసీఆర్‌తో అసదుద్దీన్‌ మంత్రాంగం నడిపినట్లుగా తెలుస్తోంది. 
వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి
అయితే... టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముఖేష్‌గౌడ్‌ అయిష్టంగానే ఉన్నప్పటికీ... వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే... కారెక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న ముఖేష్‌గౌడ్‌ ముహూర్తం చూసుకొని గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలావుంటే... ఎంఐఎం ఆపరేషన్‌లో ముఖేష్‌ ఒక్కరే ఉన్నారా ? లేక ఇంకేవరైనా ఉన్నారా ? అన్నది ఇప్పుడు హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

 

13:06 - January 24, 2018
13:03 - January 24, 2018

వనపర్తి : జిల్లాలో ఎత్తుపెరగాలన్న కోరిక ఓ యువకుడిని బలితీసుకుంది. బసవన్నగడ్డకు చెందిన ఖాజీ నజీర్‌ అహ్మద్‌ కురచగా ఉండేవాడు. ఎత్తుపెరగాలన్న కోరిక అతడిలో బలంగా నాటుకుపోయింది. తమ మందులు వాడితే ఎత్తుపెరుగుతారన్న టీవీ ప్రకటన చూసిన నజీర్‌... వెంటనే ఆర్డర్‌ ఇచ్చాడు. రెండు నెలలుగా ఆ మందులు వాడుతున్నాడు. అయితే మందులు వికటించి వాంతులు, విరోచనాలతో మంచం పట్టాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో నజీర్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. 

 

13:00 - January 24, 2018

గుంటూరు : లెఫ్ట్‌ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల నేటి ఛలో పెదగొట్టిపాడు పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులపై పోలీసులు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఎక్కడికక్కడే సీపీఎం, దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. గొట్టిపాడు, పత్తిపాడు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిన్న అదుపులోకి తీసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రితోపాటు ఇతర నేతలను నల్లపాడు పీఎస్‌లో ఉంచారు. పత్తిపాడులో సీపీఎం, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన సీపీఎం, దళిత సంఘాల నేతల అరెస్ట్‌ చేశారు.గుంటూరు అర్బన్‌ పరిధిలోని వివిధ పీఎస్‌లకు తరలించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవిని ఈడ్చుకుంటూ వెళ్లారు.  

 

సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాలకృష్ణ సమీక్ష

గుంటూరు : సీఎం క్యాంప్ కార్యాలయంలో బాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. హిందుపురం నియోజవర్గం అభివృద్ధిపై ఆయన సమీక్ష చేశారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో బాలకృష్ణ చర్చలు జరిపారు. 

కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన

వరంగల్ : నూతన కలెక్టరేట్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, ఈటల, ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. 

12:39 - January 24, 2018

హైదరాబాద్‌ : సోమాజిగూడలోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంమంతా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కార్యాలయంలోని ఫైల్స్‌ అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. 

 

12:34 - January 24, 2018

ఖమ్మం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో ఖమ్మం పట్టణం చేరుకోనున్నారు. ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. కొత్తగూడెంలో బయలుదేరే ముందు పవన్‌ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసుకోవడానికే తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తనకు అద్భుత ఆథిత్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కొత్తగూడెం వచ్చానని చెప్పారు. శ్రీజ ఆరోగ్యంగా ఉండడం సంతోషం కలిగించిందన్నారు. 

 

మూడో కేసులో దోషిగా తేలినా లాలూ

పాట్నా : బీహర్ దాణా కుంభకోణం మూడో కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ దోషగా తేలారు. చాయ్ బసా ట్రెజరీ కేసులో రాంచీ సీబీఐ కోర్టు  తీర్పు వెల్లడించింది. 

12:22 - January 24, 2018

గుంటూరు : లెఫ్ట్‌ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల నేటి ఛలో పెదగొట్టిపాడు పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులపై పోలీసులు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఎక్కడికక్కడే సీపీఎం, దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. గొట్టిపాడు, పత్తిపాడు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిన్న అదుపులోకి తీసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రితోపాటు ఇతర నేతలను నల్లపాడు పీఎస్‌లో ఉంచారు. పత్తిపాడులో సీపీఎం, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన సీపీఎం, దళిత సంఘాల నేతలను అరెస్ట్‌ చేశారు. గుంటూరు అర్బన్‌ పరిధిలోని వివిధ పీఎస్‌లకు తరలించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారు.  
రమాదేవి
పోలీసుల నిరంకుశ వైఖరి ఎంతో కాలం ఉండదు. దళితులకు అన్యాయం చేస్తే సరైన ప్రభుత్వం అనిపించుకోదు. దళితులను అణిచివేస్తే ప్రభుత్వం మనుగడ సాగించలేదు. దళితుల హక్కులను అగ్రకులాలకు తాకట్టు పెడుతున్నారు.

కూతురి గుండుకొట్టించిన తల్లిదండ్రులు...

వరంగల్ : జిల్లా హసన్ పర్తి లో అమానుషం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురుపై తల్లిదండ్రులు కర్కశత్వం చూపారు. కూతురికి గుండు కొట్టించారు. దీంతో కూతరి భర్త ప్రవీణ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 

11:50 - January 24, 2018

గుంటూరు : లెఫ్ట్‌ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల నేటి ఛలో పెదగొట్టిపాడు పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులపై పోలీసులు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఎక్కడికక్కడే సీపీఎం, దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. గొట్టిపాడు, ప్రత్తిపాడు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిన్న అదుపులోకి తీసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రితోపాటు ఇతర నేతలను నల్లపాడు పీఎస్‌లో ఉంచారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొట్టిపాడుకు వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పోలీస్‌రాజ్యం నడుపుతున్నారని ధ్వజమెత్తారు.  నియంత పాలనకు దళితులే చరమగీతం పాడుతారని వారు హెచ్చరించారు.

అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత

బెంగుళూర్ : అలనాటి సినీనటి కృష్ణ కుమారి కన్నుమూశారు. 1951లో నవ్వితే నవరత్నాలు చిత్రంలో కృష్ణ కుమారి తెరంగేట్రం చేశారు. ఆమె 110పైగా చిత్రాలు నటించారు. 

11:47 - January 24, 2018

ఖమ్మం : పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వెళ్తే బాడీగార్డ్స్ నెట్టేశారని పవన్ అభిమాని గుబ్బల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్తారింటికిదారేది సినిమా సందర్భంగా సినిమా ఫ్లెక్సీని కట్టేక్రమంలో గొడమీది నుంచి జారి కింద పడడంతో సతీష్  తీవ్రంగా గాయడడంతో కాళ్లు విరిగి పోయాయి. ఘటన తర్వాత కనీస పవన్ కళ్యాణ్ సతీష్ ను పరామర్శించలేదు. ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా పవన్ అతన్ని పరామర్శించకపోవడం గమనార్హం. 
పవన్ ను కలిసేందుకు సతీష్ ను స్ట్రెచర్ నలుగురు వ్యక్తులు మోసుకొచ్చారు. సతీష్ ను పవన్ ఆదుకోవాలని, అతనికి చికిత్స చేయించాలని పలువురు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

నిరంకుశం ఎంతో కాలం ఉండదు : రమాదేవి

గుంటూరు : పోలీసుల నిరంకుశ వైఖరి ఎంతో కాలం ఉండదని, దళిత వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందని ఐద్యా నాయకురాలు రమాదేవి అన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేసిన గొట్టిపాడు దళితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని ఆమె తెలిపారు. 

11:36 - January 24, 2018

భద్రాద్రికొత్తగూడెం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొత్తగూడెం నుంచి ఖమ్మం బయలుదేరారు. కాసేపట్లో ఖమ్మం పట్టణం ఆయన చేరుకోనున్నారు. ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలో సమావేశం అవుతారు. కొత్తగూడెంలో బయలుదేరే ముందు పవన్‌ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసుకోవడానికే తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తనకు అద్భుత ఆథిత్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారాయన.  

11:30 - January 24, 2018

బెంగళూరు : అలనాటి మేటి నటి కృష్ణకుమారి (83) కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులో మృతి చెందారు. సుమారు 110కిపైగా తెలుగు సినిమాల్లో కృష్ణకుమారి నటించారు. కృష్ణకుమారి ప్రముఖు అలనాటి నటి షావుకారు జానకి సోదరి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల చిత్రాల్లోను నటించి మెప్పించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

సినీ నటి టి.కృష్ణకుమారి మృతి

బెంగుళూరు : ప్రముఖ నటి టి.కృష్ణకుమారి కన్నుమూశారు. కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్నారు. ప్రముఖ నటి షావుకారు జానకి సోదరి కృష్ణకుమారి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల చిత్రాల్లో నటించారు.  110 కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. 

11:14 - January 24, 2018

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌  వ్యవహారం నేడు తేలనుంది.  మంగళవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు  ఈ రోజుకు  వాయిదా వేసిన విషయం తెలిసిందే..  గజల్‌కు బెయిల్‌ ఇవ్వొద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ పిటిషన్‌ చేశారు.  బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.  మరో వైపు ఇదే కేసులో  రెండో నిందితురాలిగా ఉన్న పార్వతిని ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు పోలీసులను ప్రశ్నించింది.   కాగా... పార్వతి కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గజల్‌ బెయిల్‌తోపాటు పార్వతి ముందస్తు బెయిల్‌ పై కూడా తుదితీర్పు నేడు వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:07 - January 24, 2018

గుంటూరు : లెఫ్ట్‌ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల నేటి ఛలో పెదగొట్టిపాడు పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులపై పోలీసులు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఎక్కడికక్కడే సీపీఎం, దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. గొట్టిపాడు, ప్రత్తిపాడు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

మహిళను ఈడ్చుకెళ్లిన పోలీసులు

గుంటూరు : జిల్లా ఛలో గొట్టిపాడుకు బయల్దేరిన ఐద్వా నేతను రమాదేవిని పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఓ మహిళను ఇలా ఈడ్చుకెళ్లడం దారుణమని మహిళ సంఘాలు అంటున్నారు. 

పత్తిపాడులో ఉద్రిక్తత

గుంటూరు : జిల్లా పత్తిపాడులో ఛలో గొట్టిపాడుకు బయల్దేరిన సీపీఎం, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం, దళిత నేతలు రోడ్డు పై బైఠాయించారు. వారిని గుంటూరు అర్బన్ పరిధిలో వివిధ పీఎస్ లకు తరలించారు. 

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో అగ్నిప్రమాదం జరిగింది.  షాట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. 

ఫోజులివ్వడానికి రాలేదు : పవన్

భద్రాద్రి : ప్రజా సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే సంతోషిస్తానని, ఫోటోలకు ఫోజుల్విడం కాదు సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని, మీడియా ద్వారానే శ్రీజ విషయం తెలిసిందని జనసేన అధినేత పవన్ అన్నారు. 

10:52 - January 24, 2018

ఢిల్లీ : పద్మావత్‌ సినిమా విడుదల సందర్భంగా గుజరాత్‌లో హింస చెలరేగింది. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్‌, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై దాడులకు దిగింది. సినిమా విడుదలకు సిద్దమౌతున్న హిమాలయ, అహ్మదాబాద్‌ వన్‌ మాల్స్‌, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలపెట్టేశారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు  నిప్పు పెట్టారు. ఇక గురుగ్రామ్‌లో అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్‌ విధించారు.  పరిస్థితి అదుపు తప్పడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరకొట్టారు. దీనిపై రాష్ట్ర డీజీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు.  సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు సెక్యూరిటీ పెంచారు. కర్ణిసేన ఆందోళనలపై స్పందించిన గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ...  శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 

10:45 - January 24, 2018

గంటూరు జిల్లాలో జరిగిన పెద్దగొట్టుపాడు ఘటనపై వక్తలు చర్చించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్.బాబురావు, టీడీపీ రాష్ట్ర నాయకులు పట్టాభిరామ్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:36 - January 24, 2018

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ఎం.బాలకాశీ డిమాండ్ చేశారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, పీస్‌ రేటు రద్దు తదితర డిమాండ్లతో గత కొన్నాళ్లుగా విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేస్తున్న ఆందోళన తెలిసిందే. ఇంత ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈ రోజు నుండి నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఈ నెల 27 నుండి సమ్మెకు కూడా వారందరూ సిద్ధమయ్యారు. వీటిపై ఆయన చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:15 - January 24, 2018

ఢిల్లీ : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అరుదైన క్యాచ్‌ నమోదైంది. ఓ అద్భుతమైన క్యాచ్‌కు ఆస్ట్రేలియన్‌ ధనా ధన్‌ టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ వేదికగా నిలిచింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌,మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎన్నడూ చూడనటువంటి  క్యాచ్‌ నమోదైంది. రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో రెనెగేడ్స్‌ బ్యాట్స్‌మెన్‌ కరీబియన్‌ స్టార్‌ డ్వేన్‌ బ్రావో ఆఫ్‌ సైడ్‌ వైపు షాట్‌ కొట్టగా...బంతి బౌండరీ లైన్‌ దాటడం ఖాయమనుకున్న దశలో సమయస్పూర్తితో బెన్‌ లాలిన్‌ చేసిన సాహసం....వీక్షకులను ఉర్రూతలూగించింది.బెన్‌ లాలిన్‌ మెరుపు వేగంతో బంతిని పట్టి  బౌండరీ లైన్‌ లోపలి వైపు విసరగా....10 మీటర్ల దూరంలో ఉన్న జేక్‌ వెదరాల్డ్‌ డైవ్‌ చేసి మరీ క్యాచ్‌ అందుకుని అందరినీ ఆశ్చర్యపరచాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లోనే కాదు....అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ తరహాలో క్యాచ్‌ పట్టడం ఇదే తొలి సారి కావడం విశేషం.బెన్‌ లాలిన్‌ ,  జేక్‌ వెదరాల్డ్‌ కలిసి పట్టిన ఈ కళ్లు చెదిరే క్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కలకాలం గుర్తుండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 

10:13 - January 24, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని అరసవెల్లిలోని సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి పట్టు వస్ర్తాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు.   సూర్యజయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యేడాదికి ఒక్కసారి మాత్రమే ఈ మహాదర్శనం కలుగుతుంది. దీంతో ఆదిత్యుడి దర్శననానికి భక్తులు పోటెత్తారు.  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న పవన్‌కళ్యాణ్‌

ఖమ్మం : చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జిల్లావ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు  మూడు జిల్లాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఉదయం కొత్తగూడెం నుంచి  సుజాతనగర్‌, జూలురుపాడు, ఏన్కూరు, తల్లాడ, వైరా మీదుగా ఖమ్మం నగరం చేరుకుని...  రోడ్‌షో నిర్వహిస్తారు.. తర్వాత ఎంబీ గార్డెన్‌లో పూర్వ ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమవుతారు.

 

10:07 - January 24, 2018

గుంటూరు : లెఫ్ట్‌ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల నేటి ఛలో పెదగొట్టిపాడు పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీపీఎం నేతలతోపాటు ప్రజాసంఘాలపై పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. నాయకులపై పోలీసులు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఎక్కడికక్కడే సీపీఎం, దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచే పోలీసులు నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నిన్నటి నుంచి నల్లపాడు పీఎస్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఉన్నారు. మధుతోపాటు పీఎస్‌లోనే సీపీఎం, కేవీపీఎస్‌, దళిత సంఘాల నేతలు ఉన్నారు. పోలీసుల తీరుపై లెఫ్ట్‌, ప్రజాసంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొట్టిపాడు, ప్రత్తిపాడు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు

గుంటూరు : లెఫ్ట్‌ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల నేటి ఛలో పెదగొట్టిపాడు పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులపై పోలీసులు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఎక్కడికక్కడే సీపీఎం, దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. గొట్టిపాడు, ప్రత్తిపాడు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. 

09:58 - January 24, 2018

ఢిల్లీ : పద్మావత్‌ సినిమా విడుదల సందర్భంగా గుజరాత్‌లో హింస చెలరేగింది. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్‌, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై దాడులకు దిగింది. సినిమా విడుదలకు సిద్దమౌతున్న హిమాలయ, అహ్మదాబాద్‌ వన్‌ మాల్స్‌, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలపెట్టేశారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు  నిప్పు పెట్టారు. ఇక గురుగ్రామ్‌లో అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్‌ విధించారు.  పరిస్థితి అదుపు తప్పడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరకొట్టారు. దీనిపై రాష్ట్ర డీజీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు.  సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు సెక్యూరిటీ పెంచారు. కర్ణిసేన ఆందోళనలపై స్పందించిన గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ...  శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

 

పద్మావత్‌ సినిమా విడుదల సందర్భంగా హింస

ఢిల్లీ : పద్మావత్‌ సినిమా విడుదల సందర్భంగా గుజరాత్‌లో హింస చెలరేగింది. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్‌, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై దాడులకు దిగింది.

09:46 - January 24, 2018

ఢిల్లీ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా...దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌కు సన్నద్ధమైంది. వాండరర్స్ ఫాస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌పై భారత బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. తొలి రెండు టెస్ట్‌ల్లో  తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్‌ టెస్ట్‌తోనే సిరీస్‌ దక్కించుకున్న సఫారీ టీమ్‌ కొహ్లీ సేనపై క్లీన్‌ స్వీప్‌ సాధించాలని తహతహలాడుతోంది. 
మూడో టెస్ట్‌కు వాండరర్స్‌లో రంగం సిద్ధం 
భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టెస్ట్‌కు వాండరర్స్‌లో రంగం సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న సౌతాఫ్రికా...ఆఖరి టెస్ట్‌లోనూ భారత్‌కు అసలే మాత్రం అవకాశమిచ్చేలా లేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో  తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్‌ టెస్ట్‌తోనే సిరీస్‌ దక్కించుకున్న సఫారీ టీమ్‌ కొహ్లీ సేనపై క్లీన్‌ స్వీప్‌ సాధించాలని తహతహలాడుతోంది. 
బ్యాటింగ్‌లో భారత్ దారుణంగా విఫలం  
టెస్టు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా రెండు టెస్ట్‌ల్లోనూ బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించినా....బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది.  విరాట్‌,పుజారా,విజయ్‌,ధావన్‌ ,రోహిత్‌ శర్మ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నా స్వల్ప లక్ష్యాలను కూడా చేధించలేక చేతులెత్తేసింది.సఫారీ పేస్‌ బౌలర్లను చెక్‌ పెట్టడంలో భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమవుతూనే ఉన్నారు.
సౌతాఫ్రికా రెట్టించిన ఉత్సాహం
మరోవైపు సౌతాఫ్రికా జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. భారత్‌పై క్లీన్‌ స్వీప్‌ సాధించడమే లక్ష్యంగా దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగనుంది.బ్యాటింగ్‌లో అంతంతమాత్రంగానే రాణిస్తోన్నా....వెర్నోర్‌ ఫిలాండర్‌, మోర్నీ మోర్కెల్‌, కగిసో రబడ, లుంగి నంగ్డీ వంటి టాప్‌ క్లాస్‌ పేస్‌ బౌలర్లు సమిష్టిగా చెలరేగుతుండటంతో సఫారీ టీమ్‌కు తిరుగేలేకుండా పోయింది.ఆఖరి టెస్ట్‌లోనూ పేస్‌ బౌలింగ్‌తోనే భారత్‌ను బోల్తా కొట్టించాలని సఫారీ టీమ్‌ ప్లాన్‌లో ఉంది.
టెస్ట్‌ రికార్డ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా పై చేయి 
టెస్ట్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ భారత్‌పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 35 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.భారత్‌ 10 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. వాండరర్స్ ఫాస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాలే అనడంలో అనుమానమే లేదు.

09:41 - January 24, 2018

ఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్‌ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.  పద్మావత్‌ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాము ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పు ఉండదని...తమ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమాలో చరిత్రను వక్రీకరించే దృశ్యాలు ఏమి లేవని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తెలిపారు. ఇష్టం లేనివారు సినిమాను చూడొద్దని ఆయా రాష్ట్రాలు ప్రజలకు సూచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓవైపు సమస్యలు సృష్టిస్తూ మరోవైపు కోర్టు రావడమేంటని కర్ణిసేన తరపు న్యాయవాదిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మండిపడ్డారు. పద్మావత్‌ సినిమా ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వాలే చూడాలని సుప్రీం కోర్టు సూచించింది. 

 

నేడు నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు

హైదరాబాద్ : నేడు నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు జరుగుంది. వాండరర్స్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

07:59 - January 24, 2018

ఢిల్లీ : లాభదాయక పదవులు చేపట్టారని అనర్హత వేటుకు గురైన 20 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీ రాష్ట్రపతికి ఇచ్చిన సిఫారసు నివేదికను రద్దు చేయాలని... రాష్ట్రపతి ద్వారా జారీ అయిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని ఆప్‌ నేతలు పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. లాభదాయక పదవులు చేపట్టారన్నదానిపై ఆప్ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఆప్‌ కోర్టులో మొదట దాఖలు చేసిన పిటిషన్‌ను నిన్న వెనక్కి తీసుకుంది. రాష్ట్రపతి ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసింది.  దీనిపై కోర్టు బుధవారం విచారణ జరపనుంది. ఒకవేళ హైకోర్టు తమ పిటిషన్‌ తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఆప్‌ వెల్లడించింది.  

 

07:56 - January 24, 2018

హైదరాబాద్ : ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో మిషన్‌ భగీరథను సమర్దంగా నిర్వహించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అన్నారు. రాష్ట్ర గ్రామీణ ఆర్ధిక, సామాజిక వ్యవస్థలో మిషన్‌ భగీరథతో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమన్నారు. 'భగీరథలో ప్రజల భాగస్వామ్యం' అనే అంశంపై ఎర్రమంజిల్‌ ఆర్ డబ్ల్యుఎస్ కార్యాలయంలో వర్క్‌షాపును సీఎస్‌ ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ దేశానికే రోల్‌మోడల్‌ నిలుస్తుందని ఎస్పీ సింగ్‌ అన్నారు.

 

07:53 - January 24, 2018

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సికింద్రాబాద్‌ కోర్టు ఆయనకు షరతులతో
కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. అనుమతి లేకుండా ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేసినందుకు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని మందకృష్ణపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

 

07:51 - January 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీ అవతరిస్తామని టీ జేఏసీ,.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. 
అప్పుడే ఎన్నికల వేడి 
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలు ప్రజాక్షేత్రంలోకి తమ కార్యక్రమాలను తీసుకెళ్తున్నాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు అ్రస్తాలను సిద్దం చేస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. మారుతున్న రాజకీయ పరిణామాలతో మరో రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికలపై కన్నేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
త్వరలో రాజకీయ పార్టీగా టీజేఏసీ  
తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి ఉద్యమం చేసిన టీ-జేఏసీ త్వరలో రాజకీయ పార్టీగా ఆవిర్బవించనుండడంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. టీ-జేఏసీ చైర్మన్‌గా గుర్తింపు పొందిన ప్రొ.కోదండరామ్‌ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పార్టీలో అసంతృప్తి నేతలంతా ఆ వైపునకు వెళ్లే అవకాశం ఉందని నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారనే సంకేతాలను టీ-జేఏసీ ఇవ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఓవైపు కోదండరామ్‌ బృందం పార్టీ వేదికను సిద్దం చేసుకునే పనిలో పడగా... ఇప్పటివరకు ఏపీకే పరిమితమనుకుంటున్న జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించడంతో రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. 
టీజేఏసీలో చర్చ 
అయితే... పవన్‌ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు టీజేఏసీలో చర్చ మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుందామని యోచిస్తున్న తరుణంలో... ఇప్పుడు పవన్‌ తెలంగాణలోనూ పోటీ చేస్తానని ప్రకటించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీజేఏసీని అడ్డుకునేందుకే అధికార పార్టీ పవన్‌ను రంగంలోకి దింపిందనే అభిప్రాయం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
రాబోయే ఎన్నికలకు పార్టీలు వ్యూహాలు 
ఇదిలావుంటే... జరుగుతున్న పరిణామాలను అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. టీ జేఏసీ, జనసేన ఎన్నికల రంగంలో ఉంటేనే తమకు రాజకీయంగా కలిసివస్తుందనే ధీమా నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే... రాబోయే ఎన్నికలకు ఇప్పుడిప్పుడే పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా భవిష్యత్‌లో రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి. 

 

07:46 - January 24, 2018

స్విట్జర్లాండ్ : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫోటోలను  కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

70 వ రోజు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర

నెల్లూరు : 70 వ రోజు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. నేడు ఉమ్మపేట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. నాయుడు పేట వరకు ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. 

తిరుమలలో నేడు రథసప్తమి వేడుకలు

చిత్తూరు : తిరుమలలో నేడు రథసప్తమి వేడుకలు. ఉదయం 5.30 గంటల నుంచి వాహన సేవలుప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు 7 వాహనాలపై భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. 

 

అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం : అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అర్ధరాత్రి రథసప్తమి వేడుకలు ప్రారంభయ్యాయి. భారీగా భక్తులు తరలివచ్చారు. 

 

Don't Miss