Activities calendar

25 January 2018

22:15 - January 25, 2018

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను స్వాగతిస్తున్నామని వక్తలు అన్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలో బీఎల్ ఎఫ్ ఆవిర్భా సభ జరిగింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బి.వెంకట్, టీఆర్ ఎస్ నేత తాడూరు శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. బీఎల్ ఎఫ్ ఏర్పాటు శుభపరిణామం అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:06 - January 25, 2018

హైదరాబాద్ : తెలంగాణలో సరికొత్త రాజకీయ ఫ్రంట్‌ ఆవిర్భవించింది. బడుగులకు రాజ్యాధికారం.. తద్వారా సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటైంది. ఆర్థిక, సామాజిక దోపిడీ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని  బీఎల్‌ఎఫ్‌ నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి.. పేదలకు రాజ్యాధికారం అందించాలని బీఎల్ ఎఫ్ ప్రతిపాదించింది. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం, సాగునీరు అందిస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ ఆవిర్భావ సభలో నేతలు ప్రకటించారు. 

తెలంగాణలో  కొత్త రాజకీయ వేదిక.. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించింది. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎంవీఆర్‌ గార్డెన్‌లో జరిగిన బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభలకు 28 పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయ వేదికగా పనిచేస్తుందని బీఎల్‌ఎఫ్‌ నేతలు ప్రకటించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల గొంతుకగా బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని నేతలు చెబుతున్నారు. 
 
రాష్ట్ర స్థాయిలో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ పూర్తవడంతో వచ్చే నెల నుంచి జిల్లాల్లో బీఎల్‌ఎఫ్‌ శాఖల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని నేతలు నిర్ణయించారు. వచ్చే రెండు నెలల్లో 31 జిల్లాల్లో ఆవిర్భావ సభలను పూర్తి చేయాలని తీర్మానించారు. మే 1 నుంచి నియోజకవర్గ జైత్రయాత్రల పేరుతో బీఎల్ఎఫ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించే విధంగా బీఎల్‌ఎఫ్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. గద్దర్‌ నేతృత్వంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ సాంస్కృతిక విభాగం ఏర్పాటవుతోంది. ప్రజల్లో  చైతన్యం తీసుకొచ్చేందుకు టీ మాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ అన్ని రకాల బాధ్యతలను పంచుకుంటూ బీఎల్‌ఎఫ్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 41 మందితో బీఎల్‌ఎఫ్‌ కమిటీని ప్రకటించారు. చైర్మన్‌గా నల్లా సూర్యప్రకాశ్‌ వ్యవహరిస్తారు, వీఎల్‌ విశ్వేశ్వరరావు, జలజం సత్యనారాయణ, వనజ, సున్నం రాజయ్య వైస్‌ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వహిస్తారు. తమ్మినేని వీరభద్రం, మజీదుల్లా ఖాన్‌, మద్దికాయల అశోక్‌, జానకిరాములు, గొర్రె రమేశ్‌, మన్నారం నాగరాజు, చంద్రమౌళి కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 

బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావం తెలంగాణలో రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బీఎల్‌ఎఫ్‌ వంటి బలమైన రాజకీయ పత్యామ్నాయం అవసరమని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భావ సభకు హాజరైన సామాజిక ఉద్యమ జాతీయ నేత  ప్రకాశ్‌ అంబేడ్కర్‌ చెప్పారు. 

రాజకీయ అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాలను పోటీ చేయాలని నిర్ణయించినట్టు బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. పూలే, అంబేడ్కర్‌, మార్క్స్‌ ఆశయ సాధన కోసమే బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందని టీ మాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య చెప్పారు. సామాజిక న్యాయ సాధన కోసం పనిచేసే అన్ని శక్తులను కలుపుకుని ముందుకుసాగాలని బీఎల్‌ఎఫ్‌ నిర్ణయించింది. మొత్తంమీద బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావం తెలంగాణ రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

22:03 - January 25, 2018

తెలంగాణ రాజకీయంల కొత్త ఫ్రంట్.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు పురుడుపోసిండ్రు, పురిటినొప్పులకాన్నే ఆగిన జనసేన... సిద్ధాంతం లేని పార్టీ అని కీర్తిస్తున్న జనం, అర్ధరాత్రి సిద్ధిపేట దిక్కు అంబేద్కర్ మనుమడు, మున్సిపల్ చైర్మన్ భర్త హత్య కేసులో అరెస్టు, చట్టానికి సావుజేసిన గుంటూరు పోలీసులు, కుల పెద్దలకు విందియ్యలేదని బహిష్కరణ.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:28 - January 25, 2018

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేటలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌, నకిలీ సర్టిఫికెట్ల కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుతో 9 మందికి సంబంధం ఉన్నట్టు  తేల్చారు. వీరిలో నలుగుర్ని అరెస్టు చేశారు.  దుగిరాలకు చెందిన కొడాలి బాబూరావు, నరసరావుపేట వాసులు ఇండ్ల నాగేశ్వరరావు, అర్వపల్లి ఏడుకొండలు, తెనాలికి చెందిన నీలా ప్రసాద్‌బాబు అరెస్టు  అయ్యారు. పారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడు కపిలవాయి విజయ్‌కుమార్‌ పాత్రపై మరింత విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కిడ్నీ రాకెట్‌లో పలు ఆస్పత్రుల ప్రమేయం ఉన్నట్టు తేల్చారు. వేదాంత ఆస్పత్రి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రెవెన్యూ సిబ్బంది పాత్రపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

 

21:05 - January 25, 2018

స్విట్జర్లాండ్ : దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఫిలిప్స్ ఎల‌క్ట్రానిక్స్ సంస్థ మార్కెటింగ్ చీఫ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. మెడిక‌ల్ డివైస్‌లు, ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల ఉత్పత్తి కోసం తెలంగాణలో ఉన్న లాభ‌దాయ‌క‌మైన ప‌రిస్థితుల కోసం మంత్రి కేటీఆర్‌.. ఫిలిప్స్ సంస్థకు వివ‌రించారు. తరువాత ట్రినా సోలార్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోంగ్‌ఫాంగ్‌తోనూ భేటీ అయ్యారు. సౌర విద్యుత్తు కోసం ఫ‌ల‌కాలు త‌యారు చేసే అతి పెద్ద సంస్థకు గుర్తింపు ఉంది. సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తికి తెలంగాణ‌ అనువైన ప్రదేశమని.. మంత్రి కేటీఆర్ ట్రినా సంస్థకు తెలియ‌జేశారు. తరువాత బల్గేరియా పర్యాటక శాఖ మంత్రి నికోలినా అంగ్లికోవాతోనూ భేటీ అయ్యారు. పర్యాటకంలోనూ ఇద్దరి మధ్య పరస్పర సహకారం ఉండాలని నేతలు నిర్ణయించారు.

 

అభయ్ హత్య కేసులో ముగ్గురు మైనర్లకు యావజ్జీవ కారాగార శిక్ష

హైదరాబాద్ : మైనర్ హత్యకేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాతబస్తీకి చెందిన పదవ తరగతి విద్యార్ధి అభయ్ హత్య కేసులో ముగ్గురు మైనర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2016 మార్చి 18న అభయ్‌ను ఇందుగమల్లి శేషకుమార్, నంబూరి మోహన్, పొందర రవి అనే మైనర్లు కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారు. అభయ్‌ మృతదేహాన్ని  ఓ సూట్‌కేసులో పెట్టి పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిపై విచారణ అనంతరం కోర్టు యావజ్జీవిత ఖైదు విధించింది. 

 

21:01 - January 25, 2018

హైదరాబాద్ : మైనర్ హత్యకేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాతబస్తీకి చెందిన పదవ తరగతి విద్యార్ధి అభయ్ హత్య కేసులో ముగ్గురు మైనర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2016 మార్చి 18న అభయ్‌ను ఇందుగమల్లి శేషకుమార్, నంబూరి మోహన్, పొందర రవి అనే మైనర్లు కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారు. అభయ్‌ మృతదేహాన్ని  ఓ సూట్‌కేసులో పెట్టి పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిపై విచారణ అనంతరం కోర్టు యావజ్జీవిత ఖైదు విధించింది. 

 

20:54 - January 25, 2018

హైదరాబాద్ : పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు.. బీఎల్ ఎఫ్ ఛైర్మన్‌గా ఎంపికైన నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. పేదలకు విద్య, వైద్యం ఉచితంగా ఉండేలా తమ అజెండా రూపొందిస్తునట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయంలో స్వామినాథన్ కమిటీ రిపోర్టు యథాతథంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటున్న నల్లా సూర్యప్రకాశ్‌ 10 టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:51 - January 25, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఆవిర్భవించిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాష్ట్రంలో రాజకీయ మార్పుకు నాందిపలుకుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభంలో ఏచూరి పాల్గొన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా ఈ  ప్రత్యామ్నాయ రాజీయ వేదిక పోరాడాలని ఏచూరి పిలుపు ఇచ్చారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాలని సీపీఎం జాతీయ కార్యదర్శి పిలుపు ఇచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో శతాబ్దాల దోపిడీకి తెరదించాల్సిన అవసరం ఉందన్నారు.
అవినీతిపరులకు నిలయంగా మోదీ ప్రభుత్వం : ప్రకాశ్‌ అంబేద్కర్‌ 
అవినీతి నిర్మూలన, దేశగౌవరం అంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. అవినీతిపరులకు నిలయంగా మారిందన్నారు ప్రకాశ్‌ అంబేద్కర్‌. అసమర్థ మంత్రులతో అభివృద్ధినిమరిచి ప్రజల మధ్య కుల, మతాల చిచ్చుపెడుతున్నారని  ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌లాంటి ప్రాంతీయపార్టీలు కూడా ప్రజల మధ్య విభజన సృష్టిస్తూనే పబ్బం గడుపుకుంటున్నాయని ప్రకాశ్‌ అంబేద్కర్‌ విమర్శించారు. గతీ ఎన్నికల్లో బీజేపీని విమర్శించిన టీఆర్‌ఎస్‌పార్టీ.. అధికారం చేపట్టాక కమలం పార్టీతో చేతులు కలిపి ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యంగాన్ని మార్చేందుకు బేజీఏపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని.. ఆ కుట్రలను సాగనీయకుండా అడ్డుకోడానికి వామపక్ష- దళిత , బహుజన శక్తులు ఐక్యం కావాలన్నారు.. ప్రకాశ్‌ అంబేద్కర్‌. దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికోసం బలమైన రాజకీయ పత్యామ్నాయం అవసరం అన్నారు.. ప్రకాశ్‌ అంబేద్కర్. దేశంలో సెక్యులర్‌ శక్తులు ఐక్యం కాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయన్నారు. భారత్‌లో వేల సంవత్సరాలుగా దళిత, బహుజనుల పట్ల కొనసాగిన వివక్ష ఇక చెల్లదన్నారు. ప్రస్తుతం యువతరం మేల్కొందని.. అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తోందన్నారు. దీనికోసమే తెలంగాణలో రాజ్యధికారమే లక్ష్యంగా ఇవాళ బహుజన- వామపక్షాల ఐక్యవేదిక ఏర్పడిందన్నారు.  దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థ నశించినపుడే సమసమాజం ఏర్పడుతుందన్నారు. అణగారిని కులాలన్నీ ఐక్యం అయితే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందన్నారు ప్రకాశ్‌ అంబేద్కర్‌. దేశంలో అణగారిన కులాల మధ్య ఐక్యత ఉంటేనే పేదల రాజ్యం వస్తుందన్నారు.
అన్ని సీట్లకు పోటీ : తమ్మినేని  
రాజ్యాధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ తెలంగాణలోని అన్ని సీట్లకు పోటీ చేస్తుందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు సీట్లు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, సాగునీరు అందించడమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ లక్ష్యమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  ప్రకటించారు. బీఎల్‌ఎప్‌ అధికారంలోకి వస్తే కార్పొరేట్‌ విద్య, వైద్య విధానాలకు స్వస్తిపలుకుతుందని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భావ సభలో చెప్పారు. 
బలహీన వర్గాల అభ్యున్నతే బీఎల్‌ఎఫ్‌ ధ్యేయం : కంచ ఐలయ్య 
ఎస్, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందని టీ మాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య చెప్పారు. గ్రామ, గ్రామాన బీఎల్‌ఎఫ్‌ లక్ష్యాలను ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు  బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భావ సభలో ప్రకటించారు. పూలే, అంబేడ్కర్‌, కారల్‌ మార్క్స్‌ ఆశయాలను సాధించే పోరాటం బీఎల్‌ఎఫ్‌తో ఆరంభమైందన్నారు. 

 

20:39 - January 25, 2018

అనంతపురం : ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలియ చెప్పడమే తనముందున్న లక్ష్యమంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ముందుకు వెళ్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటా అని చెప్పిన పవన్.. చెప్పిన విధంగా ఏపీలో జనసేన పార్టీ కార్యాలయానికి ఈనెల 27న భూమి పూజ చేయనున్నారు. అనంతరం మూడు రోజులపాటు కరువుయాత్ర పేరుతో కదిరి, గుత్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

ఆడ ఉంటా.. ఈడ ఉంటా అన్న పవన్‌ కల్యాణ్‌ ఆ దిశగానే ముందుకెళ్తున్నాడు. మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించిన పవన్‌... ఈనెల 27న అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కార్యకర్తలతో చర్చించనున్నారు. కదిరి, గుత్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక రెండవ రోజు కదిరి నియోజక వర్గంలో కరవుతో వలస వెళ్ళిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని జనసేన నేతలు చెప్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలతో విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలుపుతున్నారు.

మూడోరోజు ధర్మవరం నియోజక వర్గంలో చేనేత కార్మికులను కలవనున్నారు. వారి సమస్యల మీద కూడా పోరాటం చేసి చేనేత కార్మికులకు న్యాయం చేసే విధంగా ఈ పర్యటనను పవన్‌ కొనసాగించన్నున్నారు. చివరి రోజు గుత్తిలోని అనారోగ్యంతో మృతిచెందిన గేట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 

అనంతపురము జిల్లా నుంచే పవన్‌ తన రాజకీయ పర్యటనను ప్రారంభిస్తుండటంతో..  అటు అభిమానుల్లో.. ఇటు జనసేన పార్టీ కార్యకర్తల్లో ఆనందం కనిపిస్తొంది. జనసేన పార్టీ కోసం అందరం సైనికుల్లా కష్టపడి పనిచేస్తామని.. పవన్‌ అభిమానులు, కార్యకర్తలు అంటున్నారు.

20:37 - January 25, 2018

విజయవాడ : అదో పేరు గాంచిన కూరగాయల మార్కెట్‌.... అక్కడ వ్యాపారులు చెప్పిందే శాసనం... ఎవరైనా ప్రశ్నిస్తే...   దాడులే...  ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో... మూడు కూరగాయలు... ఆరు ఆకుకూరలుగా   సాగుతున్న విజయవాడ కేఆర్‌ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారుల దౌర్జన్యంపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.. 

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం... దీనికితోడు దూరప్రాంతాలనుంచి ఇక్కడికి  ఎందరో వస్తుంటారు.   వారంతా పనిలోపనిగా కూరగాయలు కొనడానికి కేఆర్‌ మార్కెట్‌కు వస్తారు. ఇదే అదనుగా తీసుకున్న  వ్యాపారులు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలే నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేఆర్‌ మార్కెట్‌లో దగా. రైతు బజార్లో పది రూపాయలకు దొరికే టమాటాలు.. ఇక్కడ 50 రూపాయాలకు పైగానే అమ్ముతున్నారు.

కేఆర్‌ మార్కెట్లో ఒక దుకాణానికి మరో దుకాణానికి  రేట్లలో పొంతన ఉండదు. ఎవరు ఎంత ధరకు అమ్ముకున్నా అడిగే నాథుడే ఉండరు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే... వారిపై వ్యాపారులు దాడులకు తెగబడుతున్నారు. వీరివల్ల తీవ్రంగా నష్టపోయేది మాత్రం పేద, మధ్యతరగతి  ప్రజలే.   కూరగాయల ధరల పట్టిక ఉండదు... వాటిపై ప్రశ్నించే నాథుడూ ఉండడు..

ఇక్కడి కమిటీకి స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి... అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు.... అధికారులకు ఫిర్యాదు చేసినా అవి బుట్టదాఖలు అవుతాయి. కాదూ కూడదూ అని ఏ అధికారైనా తనిఖీలకు వస్తే... లంచాలతో వారి చేతులు కట్టేస్తున్నారు. 

ఒకవేళ అధికారులకు- వ్యాపారులకు మధ్య బేరం కుదరకుంటే...  సయోధ్య  చేయడానికి ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దీంతో వీరి వ్యాపారం మూడు కూరగాయలు ఆరు ఆకుకూరలుగా సాగిపోతోంది. రైతుబజార్‌ తోపాటు బయటి ప్రాంతాల్లో అమ్మే కూరగాయలకంటే కేఆర్‌ మార్కెట్లో నాణ్యమైన కూరగాయలు ఉంటాయి... కాబట్టి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు  సమర్థించుకుంటున్నారు.

20:32 - January 25, 2018

హైదరాబాద్ : భాగ్యనగరం.. హైదరాబాదులో  ప్రయాణం అంటే నరకమే... అన్న విషయం తెలియని వారుండరు. అందునా ఆర్టీసీ బస్సులో ఐతే  ప్రత్యక్ష నరకమే. బస్సులోపలే కాదు.. బస్సు ఎక్కడానికి ముందు కూడా సమస్యలే...  సరైన షెల్టర్లు లేక  ఎండకు ఎండుతూ... వానకు నానుతూ... వచ్చిన బస్సును అందుకోలేక  నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మోడరన్‌ బస్టాపులు... ప్రత్యేక బస్‌బేలంటూ.. బల్దియా చెబుతున్న మాటలు నీటి మూటలను తలపిస్తున్నాయి.
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు
టెక్నాలజీ ఎంత పెరిగినా... హైదరాబాద్‌ ప్రయాణంలో మాత్రం అవస్థలు తీరడంలేదు.. ఓవైపు కాలంచెల్లిన ఆర్టీసీ బస్సులు... మరోవైపు గతుకుల రోడ్లు... ఇవి చాలవన్నట్లు  ట్రాఫిక్‌ జామ్‌లు.
బస్సుల కోసం రోడ్లపైనే పడిగాపులు..
అసలు తాము ఎక్కాల్సిన బస్సుకోసమే ప్రయాణీకులు గంటల పాటు ఎదురు చూడాలి.  పోనీ... ఓపిక పట్టి ఎదురు చూద్దామనుకున్నా... సరైన షెల్టర్ ఉండదు. ఎండాకాలంలో మండుటెండలో.. వర్షాకాలంలో జోరువానలో ప్రయాణీకులకు తిప్పలు తప్పడంలేదు..  చాలా చోట్ల రోడ్లపైనే   పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
తీవ్రంగా వేధిస్తున్న బస్‌బేల కొరత
నగరంలో బస్‌ బేల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి రోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణీకులను... గమ్యస్థానాలకు చేర్చడానికి 3800  బస్సులు తిరుగుతున్నాయి.  కానీ వాటిని నిలపడానికి ఏదో కొన్ని చోట్ల మినహా... మరెక్కడా స్థలం లేదు. అటు డ్రైవర్లతోపాటు ఇటు ప్రయాణీకులకు కూడా  ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే సారి ఎక్కువ బస్సులు వచ్చాయంటే.. పరుగులు తీసే ప్రయాణీకుల అవస్థలు మాటల్లో చెప్పలేం.
ఏళ్ళు గడుస్తున్నా.. పూర్తికాని షెల్టర్లు
ఎన్నేళ్ళు గడుస్తున్నా.. నగరంలో బస్‌షెల్టర్ల నిర్మాణం పూర్తికావడం లేదు. పదేళ్ళక్రితం బస్‌షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది ఆర్టీసీ.  1832 బస్టాపులు అవసరమని బల్దియాకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 
యాడ్‌ ఏజెన్సీలకు నిర్మాణ బాధ్యతలు  
బస్టాపుల నిర్మాణాన్ని యాడ్‌ ఏజెన్సీ ద్వారా బిల్ట్‌ ఆపరేట్‌  అండ్‌ ట్రాన్స్‌పర్‌ పద్ధతిలో  చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు.. ఐదు సార్లు టెండర్లు నిర్వహిస్తే... కేవలం 840 బస్‌ షెల్టర్ల నిర్మాణమే జరిగింది. పలు ప్రాంతాల్లో  షెల్టర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన యాడ్‌ ఏజెన్సీలు..   యాడ్స్‌పై ఎక్కువ ఆదాయం  వచ్చే ప్రాంతాల్లో మాత్రమే నిర్మించారు. 
1200 బస్‌షెల్టర్ల కొరత : అధికారులు
బస్‌షెల్టర్ల నిర్మాణాలు అతివృష్టి.. అనావృష్టి తీరులో చేపట్టారు. ఒకటీ లేదా రెండు షెల్టర్లు మాత్రమే  అవసరమైన చోట్ల అవసరానికి మించి నిర్మించాయి యాడ్‌ కంపెనీలు. ప్రస్తుతం 1200 ప్రాంతాల్లో బస్‌ షెల్టర్ల కొరత ఉందంటున్నారు అధికారులు. 
55 ప్రాంతాల్లో   స్థలాల గుర్తింపు
బస్‌బేల నిర్మాణంకోసం... దాదాపు రెండేళ్ళ క్రితం నుంచీ అధికారులు  కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో 55 ప్రాంతాల్లో బస్‌బేల నిర్మాణానికి అధికారులు ప్రాథమికంగా స్థలాలను గుర్తించారు. వాటిని తమకు అప్పగించాలంటూ సంబంధిత శాఖలకు అర్జీలు కూడా పంపారు. బస్‌బేలు, బస్టాపుల నిర్మాణం, నిర్వహణల అధ్యయనం కోసమంటూ... ప్రజా ప్రతినిధులు, అధికారులు  స్టడీ టూర్‌లకు  తిరిగి వస్తున్నారు కానీ.... సమస్యకు మాత్రం చెక్‌ పెట్టడం లేదు..  మరికొద్ది నెలల్లో రానున్న వేసవి కాలానికైనా... ఈ సమస్య తీరుతుందో లేదో అధికారులు చెప్పాలి..

20:29 - January 25, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. పాపులేషన్‌ సర్టిఫికేట్‌ జారీ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా బుక్కయ్యాడు కుశాలపురం పంచాయితీ కార్యదర్శి కుర్మారావు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయితీకి చెందిన సీపాన దిలీప్‌ కుమార్‌ పాపులేషన్‌ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కుర్మారావు పదివేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో దిలీప్‌ కుమార్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు కుర్మారావును లంచం తీసుకుంటుంగా పట్టుకున్నారు. ఇతనితో పాటు గుమస్తాను కూడా అదుపులోకి తీసుకొని ఆరువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

 

20:27 - January 25, 2018

విశాఖ : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కాకుండా ఆపాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి వినతిపత్రం అందించారు సీపీఎం నాయకులు. లాభాల్లో ఉన్న డీసీఐ, స్టీల్‌ ప్లాంట్‌లను అమ్మితే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. 

 

20:24 - January 25, 2018

హైదరాబాద్ : దేశ భవిష్యత్‌ను మార్చే శక్తి ఓటు హక్కుకు మాత్రమే ఉందన్నారు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓటర్‌ కార్డ్‌ ఎన్‌రోల్‌మెంట్‌లో ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్లను అభినందించారు. ఎన్‌రోల్‌మెంట్‌  ద్వారా కార్డులు పొందిన వారికి గవర్నర్‌ ఓటరు కార్డులను అందజేశారు. 

20:22 - January 25, 2018

విజయవాడ : ఏపీలో అధికార పార్టీ వైఫల్యాలు ఎండకట్టేందుకు వచ్చే 6నెలల పాటు కార్యాచరణ రూపొందించినట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిన తరువాత.. చంద్రబాబుకు ఇప్పుడు విభజన సమస్యలపై కోర్టుకు వెళ్లాలని ఆలోచన వచ్చిందని ఎద్దేవా చేశారు. వచ్చే 6నెలల్లో టీడీపీ, బీజేపీ అవినీతిని బయటపెడతామని రఘువీరా తెలిపారు. 

20:20 - January 25, 2018

విశాఖ : దర్శకుడు రాంగోపాల్ వర్మపై విశాఖలో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. స్త్రీలను కించపరిచేలా రామ్‌గోపాల్‌ వర్మ తీసిన జీఎస్టీ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గాడ్ సెక్స్ విత్ ట్రూత్‌  పేరుతో తీసిన సినిమాను వర్మ శుక్రవారం యూ ట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాను నిషేధించడంతో పాటు.. వర్మపై నిర్భయ కేసు నమోదు చేయాలని కోరుతూ మహిళా సంఘ నేతలు విశాఖ సీపీకి కంప్లైంట్ చేశారు. మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న  వర్మను అరెస్టు చేసేవరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 

20:18 - January 25, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్‌ బస్సు డ్రైవర్‌పై కాల్పులు జరిపి విద్యార్థిని కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది.  బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు బస్సును  అటకాయించి, డ్రైవర్‌ పై కాల్పులు జరిపారు. అనంతరం ఒక నర్సరీ విద్యార్థిని బలవంతంగా ఎత్తుకొని పారిపోయారు. బాధిత బాలుడిని  వివేకానంద పాఠశాలలో చదువుతున్న నర్సరీ విద్యార్థిగా గుర్తించారు. విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన సమయంలో బస్సులో 22 మంది పిల్లలున్నారు. వీరంతా స్కూలుకు వెళ్తున్నారు.  దిల్షాద్‌ గార్డెన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

20:13 - January 25, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న గులాబీ పార్టీ అందుకు అనుగుణంగా ఇప్పటినుంచే వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తమకు కలిసి వస్తాయనే ధీమా నేతల్లో వ్యక్తం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఒంటరిగానే ఎదుర్కోనే విధంగా గులాబీ దళపతి కేసీఆర్‌ ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం
టీఆర్‌ఎస్‌ ఎన్నికల కోసం పక్కా ప్లాన్‌
తెలంగాణలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్లాన్‌ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు నాలుగేళ్లుగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు.. రాజకీయంగా కూడా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే అంటున్న టీఆర్‌ఎస్‌
రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచే తమకు ప్రధాన పోటీ ఉంటుందని అంచానా వేస్తున్నారు కేసీఆర్‌. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితో కలిసి పోటీ చేసేది లేదని ఓ పక్క చెబుతునే.. ఎవరైనా తమతో కలిసి రావాల్సిందే అంటున్నారు గులాబీ బాస్‌. టీ -జాక్ ఓ రాజకీయ పార్టీగా అవతరించడం ఖాయమన్న సంకేతాలు రావడంతో.. అధికార పార్టీని ఎదుర్కోనేందుకు విపక్షాలన్నీ ఏకం కాకుండా సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 
సీఎం కేసీఆర్‌ని కలిసిన పవన్‌
మరోవైపు సీఎం కేసీఆర్‌ని కలిసిన పవన్‌ కళ్యాణ్‌.. తెలంగాణలో కూడా తన రాజకీయ యాత్రను మొదలుపెట్టారు. సినీ గ్లామర్‌ ఉండటంతో పవన్‌ కళ్యాణ్‌కు అధికార పార్టీ నేతల నుండి పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో మిగిలిన కొద్ది మంది నేతలు కూడా గులాబీ పార్టీతో చేయి కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో  జనసేనతో పాటు టీడీపీ కూడా గులాబీ పార్టీతో కలిసే ఎన్నికల రంగంలో దిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆ రెండు పార్టీలతో అవగాహనతోనే ఎన్నికల బరిలో అభ్యర్థులు ఉండే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందన్న సమాచారంతో టీఆర్‌ఎస్‌ పార్టీతో.. ఇతర రాజకీయ పార్టీలు అవగాహనకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. జనసేన, టీడీపీ పార్టీలు కలిసినా.. వేర్వేరుగా రంగంలోకి దిగినా ఎన్నికల్లో తమకే కలిసి వస్తోందన్న ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

 

20:11 - January 25, 2018

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌  టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్న టెన్‌టీవీ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె.శ్రీనివాస్, తాహెర్, శంకరయ్య స్వామి, బాల్‌కిషన్, ఆనంద్‌స్వరూప్ షెట్కార్‌తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

20:06 - January 25, 2018

హైదరాబద్ : గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌(జీఎస్టీ) సినిమాపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ సినిమా విడుదలను ఆపాలని సీసీఎస్‌లో మహిళా సంఘాలు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాయి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు వర్మపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘం నాయకురాలు దేవి డిమాండ్‌ చేశారు.

 

20:02 - January 25, 2018

చిత్తూరు : జిల్లాలోని నగరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగికి ఇంజెక్షన్‌ వికటించింది. రోగి పిరుదులపై తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ రావడంతో బాధితుడిని చెన్నై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. 

 

19:59 - January 25, 2018

నల్గొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. హత్య విషయం తెలిసిన వెంటనే ఆయన మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీని పరామర్శించారు.  నేరచరిత్ర కలిగిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. ప్రాణాపాయం ఉందని చెప్పినా.. శ్రీనివాస్‌కు రక్షణ కల్పించలేకపోయారని రాజగోపాల్ రెడ్డి  అన్నారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందంటున్న ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

దేశాన్ని ఆవు పరిపాలిస్తుంది : కంచ ఐలయ్య

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధించేవరకు పోరు చేస్తామని టీమాస్ చైర్మన్ అన్నారు. వనస్థలీపురంలో నిర్వహించిన బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం సాధించేవరకు నిద్రపోదన్నారు. టీమాస్ సాంస్కృతి ఉద్యమాన్ని తీసుకొచ్చిందన్నారు. దేశాన్ని ఆవు పరిపాలిస్తుందని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. 

దేశాన్ని ఆవు పరిపాలిస్తుంది : కంచ ఐలయ్య

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధించేవరకు పోరు చేస్తామని టీమాస్ చైర్మన్ అన్నారు. వనస్థలీపురంలో నిర్వహించిన బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం సాధించేవరకు నిద్రపోదన్నారు. టీమాస్ సాంస్కృతి ఉద్యమాన్ని తీసుకొచ్చిందన్నారు. దేశాన్ని ఆవు పరిపాలిస్తుందని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. 

19:45 - January 25, 2018
19:42 - January 25, 2018

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధించేవరకు పోరు చేస్తామని టీమాస్ చైర్మన్ అన్నారు. వనస్థలీపురంలో నిర్వహించిన బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం సాధించేవరకు నిద్రపోదన్నారు. టీమాస్ సాంస్కృతి ఉద్యమాన్ని తీసుకొచ్చిందన్నారు. దేశాన్ని ఆవు పరిపాలిస్తుందని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. టీసర్కార్ క్యాబినెట్ లో ఒక మహిళ కూడా లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్... దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెయ్యలేదని.. కనీసం బీసీ అభ్యర్థిని కూడా చెయ్యలేదన్నారు. టీసర్కార్ రాగానే మొట్టమొదటగా ఎమ్మెల్యేలకు జీతాలు పెంచారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల ఎమ్మెల్యేలే పేదవారుగా ఉంటారని అన్నారు. బీఎల్ ఎఫ్ 119 ఎమ్మెల్యే స్థానాలను కాకుండా 17 మంది ఎంపీలను గెలిపించుకోవాలన్నారు. ఇవాళ రాజకీయ విప్లవం వచ్చిందన్నారు. దేశంలో మార్పును ఎవరూ ఆపలేరని అన్నారు. మార్క్స్, నీల్ జెండాలను ఎవరూ ఆపలేరని తెలిపారు. 

 

19:30 - January 25, 2018
19:28 - January 25, 2018
17:52 - January 25, 2018
17:50 - January 25, 2018
17:47 - January 25, 2018

హైదరాబాద్ : బీఎల్ ఎఫ్ దేశానికి ఒక ఆశా కిరణంగా నిలబడుతుందని ఎంసీసీఐ(యూ) నేత ఎండీ గౌస్ అన్నారు. బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఈ వేదిక ప్రత్యామ్నాయ రాజకీయాలను సూచిస్తుందన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అమలు కాకుండా ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. కుల సమస్యలు, వర్గపోరాటాలను మిలితం చేయాలని ఓంకార్ అన్నారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం, కాషాయ దళం బడుగు, బలహీన, నిమ్న జాతులపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలు కమ్యూనిస్టులే నిజమైన మిత్రలని భావిస్తున్నాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పని చేయాలన్నారు. 

 

17:23 - January 25, 2018

హైదరాబాద్ : రాబోయే కాలంలో ఎర్రజెండాలు, నీలి జెండాలు అధికారంలోకి వస్తేనే ప్రజల బతుకుల్లో మార్పు వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అన్నారు. వనస్తలీపురంలో జరిగిన బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ వచ్చాక కూడా పేదల బతుకుల్లో మార్పు లేదన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలన్నారు. ప్రజలు కోరుకున్న కేసీఆరే సీఎం అయ్యారని తెలిపారు. తెలంగాణ వచ్చాక గిరిజనుల లక్షల ఎకరాలు లాక్కొంటున్నారని తెలిపారు. దళితులపై దాడులు పెరిగాయన్నారు. పదువులు, అధికారం కోసం బీఎల్ ఎఫ్ ఏర్పాటు కాలేదన్నారు. 

 

తెలంగాణ వచ్చినా ప్రజలకు మేలు జరగలేదు : ఏచూరి

హైదరాబాద్ : తెలంగాణ వచ్చినా ప్రజలకు మేలు జరగలేదని సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమమన్నారు. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందని చెప్పారు. ఆర్థిక, సామాజిక న్యాయం కోసం ప్రజల్లో చైతన్యం వస్తోందన్నారు. దేశంలో ఆహారం పేరిట ప్రజలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సంఘ్ పరివార్ శక్తులు చెప్పే ఆహారమే ప్రజలు తినాలా అని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ నేతలు ఉన్న కుంభకోణాలపై సీబీఐ విచారణ లేదన్నారు. 

తెలంగాణ వచ్చినా ప్రజలకు మేలు జరగలేదు : ఏచూరి

హైదరాబాద్ : తెలంగాణ వచ్చినా ప్రజలకు మేలు జరగలేదని సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమమన్నారు. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందని చెప్పారు. ఆర్థిక, సామాజిక న్యాయం కోసం ప్రజల్లో చైతన్యం వస్తోందన్నారు. దేశంలో ఆహారం పేరిట ప్రజలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సంఘ్ పరివార్ శక్తులు చెప్పే ఆహారమే ప్రజలు తినాలా అని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ నేతలు ఉన్న కుంభకోణాలపై సీబీఐ విచారణ లేదన్నారు. 

కార్పొరేట్ల దోపిడీపై సీబీఐ విచారణ లేదు : ఏచూరి

హైదరాబాద్ : నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదని సీతారాం ఏచూరి అన్నారు. కార్పొరేట్ల దోపిడీపై సీబీఐ విచారణ లేదని చెప్పారు. కార్పొరేట్లు బ్యాంకులకు రూ.11 లక్షల కోట్లకు పైగా ఎగ్గొట్టారని తెలిపారు. రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లపై ఒక్క కేసు కూడా లేదన్నారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రూ. 11 లక్షల కోట్లలో సగం డబ్బులు వెనక్కి తీసుకొచ్చినా... నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి : ఏచూరి

హైదరాబాద్ : దేశంలో సామాజిక, ఆర్థిక దోపిడీ జరుగుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వనస్థలీపురంలో నిర్వహించిన బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని కావాలన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. 

15:20 - January 25, 2018

హైదరాబాద్ : దేశంలో సామాజిక, ఆర్థిక దోపిడీ జరుగుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వనస్థలీపురంలో నిర్వహించిన బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని కావాలన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదన్నారు. కార్పొరేట్ల దోపిడీపై సీబీఐ విచారణ లేదని చెప్పారు. కార్పొరేట్లు బ్యాంకులకు రూ.11 లక్షల కోట్లకు పైగా ఎగ్గొట్టారని తెలిపారు. రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లపై ఒక్క కేసు కూడా లేదన్నారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రూ. 11 లక్షల కోట్లలో సగం డబ్బులు వెనక్కి తీసుకొచ్చినా... నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చినా ప్రజలకు మేలు జరగలేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమమన్నారు. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందని చెప్పారు. ఆర్థిక, సామాజిక న్యాయం కోసం ప్రజల్లో చైతన్యం వస్తోందన్నారు. దేశంలో ఆహారం పేరిట ప్రజలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సంఘ్ పరివార్ శక్తులు చెప్పే ఆహారమే ప్రజలు తినాలా అని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ నేతలు ఉన్న కుంభకోణాలపై సీబీఐ విచారణ లేదన్నారు. 

 

రాజకీయ యాత్ర పేరు ప్రకటించిన కమల్

చెన్నై : తను చేయబోయే రాజకీయ యాత్ర పేరును కమల్ హసన్ ప్రకటించారు. యాత్ర పేరు రేపు మనేదే అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 21 నుంచి కమల్ తమిళనాడులో పర్యటించనున్నారు. 

రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య

హైదరాబాద్ : కామటిపురా పీఎస్ పరిధిలోని మహారజ్ గంజ్ లో రిటైర్డ్ ఆర్మీ జవాన్ వేణుగోపాల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాశాడు. 

యూపీలో జంట హత్యలు

యూపీ : మేరఠ్ జిల్లా సోర్ఖాలో జంట హత్యలు కలకలరేపుతున్నాయి. దుండగులు వృద్ధురాలిని, కుమారుడిని కాల్చిచంపారు. హత్య దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

13:31 - January 25, 2018
13:27 - January 25, 2018

పెద్దపల్లి : జిల్లాలో కంగ్రెస్‌ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నీటివిడుదలను డిమాండ్‌చేస్తూ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకు దిగిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

13:26 - January 25, 2018

కర్నూలు : జిల్లా మంత్రాలయం మండలం సుగుర్‌ గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. గ్రామంలో బుధవారం అర్థరాత్రి దాదాపు 30 గడ్డివాములకు నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరువుకాలంలో పశువుల మేత కోసం నిల్వచేసిన గడ్డిని దగ్ధంచేశారని రైతులు వాపోతున్నారు. ఈ ఘటనలో దాదాపు 20లక్షల రూపాయల వరకు పశుగ్రాసం బుగ్గిపాలయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా గ్రామంలో పత్తి, కందిలాంటి పంటలకు కూడా నిప్పుపెట్టారని.. ఇప్పటికైనా అధికారులు నిప్పుపెడుతున్న వారిని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.  

13:25 - January 25, 2018

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌నేతలు ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నందిఎల్లయ్య ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. రాహుల్ పార్టీ అధ్యక్షబాధత్యలు చేపట్టాక తొలిసారికి కలిసిన నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నదానిపై డీకే అరుణ, నందిఎల్లయ్య సమాధానం దాటవేశారు. 

13:22 - January 25, 2018

ఏయూ క్వార్టర్స్ లో వ్యక్తి హత్య

విశాఖ : ఏయూ క్వార్టర్స్ ఇన్ గేటు వద్ద వ్యక్తి హత్య గురైయ్యాడు. స్నేహితులే హత్యచేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

వర్మపై దేవి ఫిర్యాదు

హైదరాబాద్ : తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12:25 - January 25, 2018

హైదరాబాద్ : తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

 

టీటీడీ చైర్మన్ పదవి స్పందించిన రాఘవేంద్రరావు

చిత్తూరు : టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు వస్తున్న వార్తల పై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. తను టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నట్టు గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో వాస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. 

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో ఆప్గాన్ సంచలనం

ఆస్ట్రేలియా : అండర్-19 వరల్డ్ కప్ లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. ఆప్గాన్ న్యూజిలాండ్ పై 202 పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ చేరింది. 

10:23 - January 25, 2018

హైదరాబాద్ : ఇవాళ బహుజన లెఫ్ట ఫ్రంట్ ఆవిర్భావ సభ జరగనుంది. వనస్థలిపురంలోని ఎంవీఆర్ గార్డెన్ లో ఈ సభ జరగనుంది. బీఎల్ఎఫ్ అణగారిన వర్గాలకు గొంతుకగా నిలువనుందని, పూలే, అంబేద్కర్, మార్క్స్ ఆలోచనలే బీఎల్ఎఫ్ సిద్ధాంతాలుగా ఉంటాయని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నేడు భారత్ బంద్ పిలుపునిచ్చిన కర్ణిసేన

ఆహ్మాదాబాద్ : కర్ణి సేన పద్మావత్ సినిమా విడుదలకు నిరసనగా భారత్ బంద్ పిలుపునిచ్చారు. పద్మావత్ ప్రదర్శిస్తున్న సినిమాహాల్స్, మల్టిప్లెక్స్ ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుర్గావ్, ఆహ్మాదాబాద్, ముంబై, ఢిల్లీలో థీయేటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. మధ్యప్రదేశ్ లో మాత్రం పద్మావత్ విడుదల కాలేదు. 

09:33 - January 25, 2018

చత్తీస్ గఢ్ భారీ ఎన్ కౌంటర్

రాయ్ పూర్ : చత్తీస్ గఢ్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని రాయ్ పూర్, జగదల్ పూర్ ఆసుపత్రులకు తరలించారు. 

08:04 - January 25, 2018

రాయ్ పూర్ : చత్తీస్ గఢ్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని రాయ్ పూర్, జగదల్ పూర్ ఆసుపత్రులకు తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ దారుణ హత్య

నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురైయ్యాడు. శ్రీనివాస్ ఇంటివద్ద గుర్తుతెలియని దుండగులు బండరాయితో శ్రీనివాస్ ను కొట్టి చంపారు. హత్య అనంతరం మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. నల్లగొండ ఎస్పీ ఘటనస్థలానికి చేరుకుని అక్కడ పరిశీలిస్తున్నారు. 

07:44 - January 25, 2018

నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురైయ్యాడు. శ్రీనివాస్ ఇంటివద్ద గుర్తుతెలియని దుండగులు బండరాయితో శ్రీనివాస్ ను కొట్టి చంపారు. హత్య అనంతరం మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. నల్లగొండ ఎస్పీ ఘటనస్థలానికి చేరుకుని అక్కడ పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి విషయం తెలియడంతో ఆయన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరొ వైపు ఐదుగురు వ్యక్తులు శ్రీనివాస్ తమే హత్య చేశామంటూ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:36 - January 25, 2018

పక్క పార్టీల్లో గెలిచిన వారిని తీసుకుని మంత్రి పదువులు ఇచ్చి రాజ్యంగాన్ని అవమానిస్తున్నారని, దేశ చరిత్రంలో ఇటువంటి మంచిది కాదని, కొంద మంది స్వార్ధం కోసం పార్టీని వీడారని వైసీపీ నేత శ్రీనివాస్ అన్నారు. విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతారని, పార్టీల్లో గెలవడం గతం నుంచి జరుగుతుందని, గతంలో వైసీపీ అంటే కాంగ్రెస్ చేసిన పనినే ఇప్పుడు కొనసాగుతుందని టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్ అన్నారు. బీజేపీ చేసిన వ్యాఖ్యలు యాదృశ్చికమని, విష్ణుకుమార్ రాజు తన్ వ్యక్తిగతం అయిన్పట్టికి ఇది ప్రజల్లో ఉందని ఆయన అన్నారని బీజేపీ నేత లక్ష్పిపతి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:35 - January 25, 2018

ఈ వారంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగిందని, ఈ సమావేశాల్లో బోగపురం పోర్ట్ టెండర్లను రద్దు చేసిందని, మరో పోర్ట్ అదానీ గ్రూప్ అప్పగించాలని నిర్ణయించారని సీపీఎం నేత నర్సింగరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

07:34 - January 25, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. నగర శివార్లలోని జవహర్‌నగర్‌కు చెందిన మహేందర్‌, సోనీ ప్రేమించుకున్నారు. విషయం సోనీ కుటుంబ సభ్యులకు తెలియడంతో మాట్లాడేందుకని మహేందర్‌ను పిలిపించారు. భరత్‌నగర్‌లోని ఓ రూములో బంధించి చిత్రహింసలకు గురిచేయడంతో తప్పించుకుని ఆస్పత్రిలో చేరాడు. సోని కుటుంబ సభ్యులు మహేందర్‌పై హత్యాయత్నం చేశారని బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

07:33 - January 25, 2018

హైదరాబాద్ : కేంద్రంగా బోగస్ బర్త్ సర్టిఫికేట్స్ సృష్టిస్తూ దందాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. గత కొన్నేళ్లుగా బోగస్ జనన పత్రాలు సృష్టిస్తూ ముఠా సభ్యులు కోట్లకు పడగలెత్తారు. నిరుద్యోగులు, విదేశాలకు వెళ్లేవారిని టార్గెట్‌గా చేసుకుని వీరు బర్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 1991 నుంచి దందా మొదలుపెట్టిన ఈ ముఠా ఇప్పటివరకూ 2 వేల 122 సర్టిఫికెట్లు తయారు చేసినట్లు వెల్లడైంది.

పోలీసులు ప్లాన్ ప్రకారం
ఈ చీకటి బాగోతానికి సంబంధించి రాచకొండ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో నిఘా పెట్టారు. తమకి కూడా బర్త్ సర్టిఫికేట్ కావాలంటూ ఓ డెకాయ్ ఆపరేషన్‌కి ప్లాన్ చేశారు. పోలీసులు ప్లాన్ చేసుకున్నట్లే 5వేలు ఇస్తే మూడురోజుల్లో సర్టిఫికేట్ ఇస్తామన్నారు ముఠా సభ్యులు. ఒప్పందం ప్రకారం సర్టిఫికేట్ సిద్ధం చేసి పోలీసుల చేతిలో పెట్టి అడ్డంగా బుక్కయ్యారు. ముఠా సభ్యులను అరెస్టు చేశాక తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ రాకెట్ బాగోతం బట్టబయలైంది. ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందాలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఐదు విభాగాలకు చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇందులో జీహెచ్ఎంసీ సిబ్బంది , హెల్త్ అసిస్టెంట్లు , మీసేవా నిర్వాహకులు , డాటా ఎంట్రీ ఆపరేటర్లు అందరు కలిసి ఏజెంట్లను ఏర్పాటు చేసి ఈ దందా చేస్తున్నట్లు విచారణలో తేటతెల్లమైంది. ఈ ముఠా 19 ఏళ్లుగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఏజెంట్ కం బ్రోకర్‌గా ఉన్న సునీల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం విషయం బయటకొచ్చింది. ఈ ముఠాలో మొత్తం 30 మంది దాకా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 13 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.

రాకెట్‌లో మీసేవ కమిషనరేట్ చర్యలు
మరోవైపు నకిలీ బర్త్ సర్టిఫికేట్ రాకెట్‌లో మీసేవ కమిషనరేట్ చర్యలు ప్రారంభించింది.ఆరోపణలు వచ్చిన మీ సేవ సెంటర్ల గుర్తింపు రద్దు చేసినట్లు మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ సర్టిఫికేట్ స్కాంలో పోలీసులకు సహకరిస్తామని కమిషనర్ తెలిపారు.ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న మరో 14 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరితో పాటు ఇంకెవరైనా ఈ కేసులో ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ ముఠా ద్వారా బర్త్ సర్టిఫికేట్లు పొందిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

07:31 - January 25, 2018

హైదరాబాద్ : సోమాజిగూడ డెక్కన్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. హార్ట్‌ స్టంట్‌ ఆపరేషన్‌ కోసం వచ్చిన లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆపరేషన్‌ విఫలం కావడంతోనే లక్ష్మీనారాయణ చనిపోయాడంటూ ఆస్పత్రి ముందు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సిద్దిపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఐదు రోజుల క్రితం హార్ట్‌ స్టంట్‌ కోసం డెక్కన్‌ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయన మృతిచెందాడు. మరోవైపు వైద్యులు స్టంట్‌ వేయకుండానే వేశామని అబద్దం చెబుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఆస్పత్రిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు. 

07:30 - January 25, 2018

హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక ఆవిర్భానికి రంగం సిద్ధమైంది. వామపక్ష, సామాజిక శక్తుల కలయికతో రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రజల ముందుకు వస్తోంది. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎంవీఆర్‌ గార్డెన్‌లో గురువారం జరిగే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ ఆవిర్భావ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ అంబేద్కర్‌, ఎంసీపీఐ జాతీయ కార్యదర్శి గౌస్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. టీ మాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య, గద్దర్‌, వామపక్ష, సామాజిక, దళిత సంఘాల నేతలు పాల్గొంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గోనున్నారు.

బహుజనులను ఐక్యం చేయడం
బహుజనులను ఐక్యం చేయడం ద్వారా రాజకీయాల్లో అగ్రకుల ఆధిపత్యానికి అంతంపలికే లక్ష్యంతో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పనిచేస్తుందని బీఎల్‌ఎఫ్‌ నేతలు చెబుతున్నారు. పూలే, అంబేడ్కర్‌, మార్క్స్‌ ఆలోచనా విధానాలకు అనుగుణంగా బీఎల్‌ఎఫ్‌ సిద్ధాంతాలను రూపొందిస్తున్నారు. 21 వామపక్షాలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం అవుతున్నాయి. సీపీఐతోపాటు కోదండరామ్‌ నేతృత్వంలోని టీ జేఏసీని కూడా కలుపుకుపోయేందుకు చర్చలు జరుపుతున్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే విధంగా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.

బీఎల్‌ఎఫ్‌ విధివిధానాలు
ఆవిర్భావ సభ తర్వాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించాలని బీఎల్‌ఎఫ్‌ నాయకులు నిర్ణయించారు. ఆరు నెలల్లో ప్రభిప్రాయాన్ని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు అనుకూంగా మలిచే విధంగా ప్రణాళికులు రూపొదిస్తున్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ ఆవిర్భావ సభలో బీఎల్‌ఎఫ్‌ విధివిధానాలు, సిద్ధాంతాలను ప్రకటించాలని నాయకులు నిర్ణయించారు. 

07:28 - January 25, 2018

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్లాన్‌ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు నాలుగేళ్లుగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు.. రాజకీయంగా కూడా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచే తమకు ప్రధాన పోటీ ఉంటుందని అంచానా వేస్తున్నారు కేసీఆర్‌. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితో కలిసి పోటీ చేసేది లేదని ఓ పక్క చెబుతునే.. ఎవరైనా తమతో కలిసి రావాల్సిందే అంటున్నారు గులాబీ బాస్‌. టీ -జాక్ ఓ రాజకీయ పార్టీగా అవతరించడం ఖాయమన్న సంకేతాలు రావడంతో.. అధికార పార్టీని ఎదుర్కోనేందుకు విపక్షాలన్నీ ఏకం కాకుండా సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

సినీ గ్లామర్‌ ఉండటంతో
మరోవైపు సీఎం కేసీఆర్‌ని కలిసిన పవన్‌ కళ్యాణ్‌.. తెలంగాణలో కూడా తన రాజకీయ యాత్రను మొదలుపెట్టారు. సినీ గ్లామర్‌ ఉండటంతో పవన్‌ కళ్యాణ్‌కు అధికార పార్టీ నేతల నుండి పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో మిగిలిన కొద్ది మంది నేతలు కూడా గులాబీ పార్టీతో చేయి కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు టీడీపీ కూడా గులాబీ పార్టీతో కలిసే ఎన్నికల రంగంలో దిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆ రెండు పార్టీలతో అవగాహనతోనే ఎన్నికల బరిలో అభ్యర్థులు ఉండే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా మొదలైంది.నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందన్న సమాచారంతో టీఆర్‌ఎస్‌ పార్టీతో.. ఇతర రాజకీయ పార్టీలు అవగాహనకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. జనసేన, టీడీపీ పార్టీలు కలిసినా.. వేర్వేరుగా రంగంలోకి దిగినా ఎన్నికల్లో తమకే కలిసి వస్తోందన్న ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

07:27 - January 25, 2018

కరీంనగర్/పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను కేంద్ర అటవీ, పర్యాటక శాఖ కార్యదర్శి సి.కె. మిశ్రా పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు చెందిన అన్నారం బ్యారేజీ, ప్యాకేజీ 11టన్నెల్‌, రంగానాయకి సాగర్‌ రిజర్వాయర్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్ట్‌ వల్ల ప్రజలకు సాగు నీరు, త్రాగు నీరు ఎంతో ఉపయోగపడటమే కాకుండా.. పచ్చదనం, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రాజెక్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

పర్యావరణానికి నష్టం జరగకుండా చూడడం
సిద్ధిపేట జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాలను మిశ్రా పరిశీలించారు. అటవీశాఖ చేస్తున్న బ్లాక్‌ ప్లాంటేషన్‌ వల్ల అటవీ విస్తీర్ణం పెరుగుతుందన్నారు. హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టినప్పుడు పర్యావరణానికి నష్టం జరగకుండా చూడడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని మిశ్రా తెలిపారు. తెలంగాణ ప్రజల త్రాగు నీరు సాగు నీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. పనులు వేగంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అడవుల పెంపకం, అటవీ పరిరక్షణ పట్ల టీఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్ట్‌ పూర్తయితే లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మిశ్రా అన్నారు. ఆయన వెంట ప్రభుత్వ చీప్‌ సెక్రటరీ జోషి, కాళేశ్వరం సీఈ హరిరామ్‌ ఉన్నారు.

07:25 - January 25, 2018

నెల్లూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు వద్ద హైవేపై ముందు వెళ్తున్న లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులంటున్నారు. 

07:23 - January 25, 2018

హైదరాబాద్ : గులాబీ సర్కార్‌పై అంశాలవారీగా కాలుదువ్వుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు మరింత జోష్‌ కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు పడడంతో.. అదే అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని టీ-కాంగ్రెస్‌ భావిస్తోంది. కేజ్రీవాల్‌ సర్కార్‌ మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన లాభదాయక పదవుల నియామకాల్లో గులాబీ బాస్‌కు చుక్కలు చూపించాలని వ్యూహాలు రచిస్తోంది.

పార్లమెంటరీ సెక్రటరీలుగా
కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంతరెడ్డి, గ్యాదరి కిషోర్‌, కోవా లక్ష్మి, వినయ్‌భాస్కర్‌, జలగం వెంకట్రావ్‌లను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. అయితే వారికి రాజ్యాంగ విరుద్దంగా కేబినెట్‌ హోదా కల్పించారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వారిని ఆ పదవుల నుండి తొలగించింది.

కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశంగా
అయితే.. అదే తరహాలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు లాభదాయక పదవులు కట్టబెట్టడంపై సీఈసీ సీరియస్‌ కావడం.. వారిపై అనర్హత వేటు వేయడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. అదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తోంది. గతంలో హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌.. ఇప్పుడు సీఈసీని ఆశ్రయించారు. ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలతో పాటు.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్‌ ఫిర్యాదు చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు వేసినట్లే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే తమకు రాజకీయంగా కలిసి వస్తుందని టీ-కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే... దీనిపై సీఈసి నిర్ణయం ఎలా ఉంటుంది.. హస్తం నేతల ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

07:22 - January 25, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలైనప్పటికీ.. వారి మధ్య గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది. కొది రోజుల వరకు వీరి కాపురం సరిగ్గానే సాగినా.. తర్వాత తర్వాత విభేదాలు బయటపడుతున్నాయి. ఇరు పార్టీల అధిష్టానాలు నేతలను ఎప్పటికప్పుడు కంట్రోల్‌ చేస్తున్నప్పటికీ... బీజేపీ నేతలు మాత్రం టీడీపీని టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి మాణిక్యాలరావుకు, జడ్పీ చైర్మన్‌ల మధ్య జరిగిన వివాదంలో చంద్రబాబు కూడా.. జడ్పీ చైర్మన్‌ బాపిరాజుపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఎవరూ బీజేపీపై విమర్శలు చేయవద్దని ఆదేశించారు. బీజేపీని విమర్శిస్తే చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. దీంతో కొన్ని రోజులపాటు ఇరు పార్టీల నేతలు సైలెన్స్‌గా ఉన్నారు. కానీ... తాజాగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ వేడెక్కింది.

నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారంటూ
అమరావతిలో జరిగిన పీఏసీ సమావేశం సందర్బంగా విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీఎల్పీ కార్యాలయంలోనే పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన విష్ణుకుమార్‌రాజు... వైసీపీ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం దారుణమన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు కూడా మంత్రులు కావచ్చనే కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు.

ఇరుపార్టీల మధ్య మరోసారి వైరం
విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలతో ఇరుపార్టీల మధ్య మరోసారి వైరం పెరిగి అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా విష్ణుకుమార్‌రాజు వ్యవహరించారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటివరకు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి లాంటి వాళ్లు టీడీపీ టార్గెట్‌ చేయగా... ఇప్పుడు అదేబాటలో విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మళ్లీ రాజుకుంది. విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలపై టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే... ఆ వ్యాఖ్యలు విష్ణుకుమార్‌రాజు వ్యక్తిగతమని టీడీపీ నేతలంటున్నారు. చంద్రబాబు దావోస్‌ టూర్‌ నుంచి వచ్చిన తర్వాత చర్చించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే... రోజురోజుకు టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న మాటల యుద్దానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందా ? లేదా చినికి చినికి గాలివానగా మారి.. రాజకీయంగా పెను మార్పులు సంభవిస్తాయా ? అనేది కాలమే చెబుతుంది. 

07:21 - January 25, 2018

ఖమ్మం : తెలంగాణలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మూడురోజుల పర్యటన ముగిసింది. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కొండగట్టు నుంచి ప్రారంభించిన రాజకీయ యాత్ర.. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొనసాగింది. ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టిపెట్టాలన్నారు. ఉడుకు నెత్తురుతో ఉన్న యువత తమతో కలిసి రావాలని కోరారు.

నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య కూడా కారణమని
తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య కూడా ఓ కారణమని పవన్‌ అన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌, ఫూలే విధానాలతో ముందుకెళ్తానని చెప్పారు. తనకు కులం, మతం లేదన్న పవన్‌.. మానవత్వం, జాతీయతను గౌరవిస్తానన్నారు. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉందని.. కులవ్యవస్థను గౌరవించాలన్నారు. తనపై దాడులు చేసినా ఎదురుదాడి చేయనని పవన్‌ అన్నారు. ప్రజల కోసం ఏమైనా భరిస్తానని చెప్పారు. జనసేన ద్వారా ప్రజా సేవ చేసేందుకే ప్రజల్లోకి వచ్చానని పవన్‌ చెప్పారు. 'జై తెలంగాణ' 'జైహింద్‌' అన్న నినాదాలు తనకెంతో ఇష్టమన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు పరిష్కారాలు చూపేందుకు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఏళ్లు గడిచినా నల్గొండ జిల్లావాసుల ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నారు. ఫ్లోరైడ్‌ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల కోసం వచ్చిన వ్యక్తిపై కొందరు దుందుడుకు స్వభావం ప్రదర్శిస్తున్నారని, అయితే తమకు పూర్తి సహనం ఉందన్నారు.

వ్యక్తి చెప్పుతో దాడి..
అంతకు ముందు పవన్‌ ఖమ్మం పట్టణంలోకి చేరుకోగానే.. గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్న పవన్‌పై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. అయితే అదృష్టవశాత్తూ అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.అటు పవన్‌ సభ ముగింపు దశలో అభిమానుల తోపులాట చోటుచేసుకుంది. తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు బారికేడ్లు దాటి ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. మొత్తానికి పవన్‌ పర్యటన అభిమానులు, జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. మళ్లీ వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు వస్తానని పవన్‌ చెప్పడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. 

07:20 - January 25, 2018

దావోస్ : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం.. నోవార్టిస్ సంస్థ... రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణకు అంగీకరించింది. ప్రస్తుతమున్న ల్యాబోరేటరీ వ్యవస్థ, సిబ్బందిని రెట్టింపు చేయనుంది. కంపెనీ విస్తరణ జీనోమ్ వ్యాలీ అభివృద్ధికి తోడ్పడుతుందన్న మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మాసిటీ గురించి వివరాలు తెలిపారు. తరువాత ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంథోనీ ఫెర్నాండెస్‌తో సమావేశమయ్యారు. మిత్సుబిషి హెవీ ఇండ్రస్ట్రీస్ ప్రతినిధి కెన్ కవాయి బృందంతో కూడా కేటీఆర్ బృందం సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, తెలంగాణలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించి హైదరాబాద్‌లో జపనీస్ ఎంటర్ ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

07:19 - January 25, 2018

దావోస్ : దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... వివిధ సంస్థల అధిపతులు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. ముందుగా ఎయిర్‌బస్ డిఫెన్స్ సీఈవోతో సమావేశమయ్యారు. సంస్థకు చెందిన ట్రాన్స్‌పోర్టు ఎయిర్ క్రాఫ్ట్‌ C-295 తయారీని ప్రారంభించడానికి.. అనుమతులను సమకూర్చుకునే ప్రయత్నంలో ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ విషయంలో గత ఏడాది ఏపీ ప్రభుత్వంతో ఎయిర్‌బస్‌ సంస్థ సంప్రదింపులు జరిపింది. ఏపీలో అడుగుపెట్టడానికి సహకరిస్తామని సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. అనంతరం... సింగపూర్‌కు చెందిన నన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేశ్‌తో సమావేశమయ్యారు. సింగపూర్‌లోని వర్సిటీ క్యాంపస్‌ను సందర్శించాలని వారు బాబును ఆహ్వానించారు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

నెల్లూరు : జిల్లా కావాలి మండలం ముద్దూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు లారీని డీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ప్రణిత్, సూర్యకుమారి, రామదాసు అన్నారు. 

Don't Miss