Activities calendar

26 January 2018

21:32 - January 26, 2018

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆరవ వరసలో సీటు కేటాయించడంపై ఆ పార్టీ మండిపడింది. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి చౌకబారు రాజకీయాలకు మోది ప్రభుత్వం పాల్పడిందంటూ దుయ్యబట్టింది. రాహుల్ గాంధీ తనకు కేటాయించిన ఆరో వరుసలో రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తో కలిసి కూర్చుకున్నారు. రాహుల్ గాంధీకి మొదటి వరుసలో చోటు కేటాయించకపోవడాన్ని పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తప్పుపట్టారు. అహంకారులైన పాలకులు అన్ని సంప్రదాయాలకు తిలోదకలిచ్చారని పేర్కొన్నారు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడికి నాలుగో వరుసలో సీటు కేటాయించినప్పటికీ ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఆరో వరుసకు మార్చారని...మాకు మాత్రం రాజ్యాంగపరమైన సెలబ్రేషన్స్ చాలా ముఖ్యమని సూర్జేవాలా ట్వీట్ చేశారు.

రాహుల్ సీటు కేటాయింపుపై కాంగ్రెస్ ఆగ్రహం...

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆరవ వరసలో సీటు కేటాయించడంపై ఆ పార్టీ మండిపడింది. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి చౌకబారు రాజకీయాలకు మోది ప్రభుత్వం పాల్పడిందంటూ దుయ్యబట్టింది.  

21:28 - January 26, 2018

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. విందుకు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ మంత్రులు, నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు వినోద్, దత్తాత్రేయ హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, రాపోలు ఆనంద భాస్కర్‌ ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత కాంగ్రెస్ నేతలు గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. విందుకు వెళ్లకూడదని నిర్ణయించారు. అయితే వీరు మాత్రం కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని.. అందుకే హాజరయ్యామని చెప్పారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి...

కర్నూలు : జిల్లా కల్లూరు వెంకటరమణ కాలనీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనివాసులపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసారు. అందరూ చూస్తుండగానే నలుగురు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

21:26 - January 26, 2018

కర్నూలు : జిల్లా కల్లూరు వెంకటరమణ కాలనీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనివాసులపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసారు. అందరూ చూస్తుండగానే నలుగురు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

21:23 - January 26, 2018

హైదరాబాద్ : కుషాయిగూడలోని ఈసీ నగర్ లో కాల్పుల ఘటన కలకలం రేగింది. సంతలో స్థల విషయంలో వివాదం చెలరేగడం..కాల్పులు చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈసీ నగర్ లో సంత జరుగుతుంటుంది. ఈ సంతలో బీహార్ కు చెందిన గజరాజ్ సింగ్...మౌలాలికి చెందిన తులసి బాబుతో స్థల విషయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా ముదిరిపోయింది. వెంటనే గజరాజ్ సింగ్ గన్ తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. అక్కడున్న స్థానికులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజరాజ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

చివరి ఆయుకట్టు రైతులకు నీరందించాలి - హరీష్..

హైదరాబాద్ : నాగార్జున సాగర్ (ఎన్ఎస్పీ), నిజాంసాగర్ ప్రాజెక్టులలో చివరి ఆయకట్టు రైతులకు కూడా నీరందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

21:13 - January 26, 2018

విజయవాడ : గుణదల మేరీమాత మహోత్సవాలకు విజయవాడ చర్చ్‌ ముస్తాబవుతోంది. ఫిబ్రవరిలో జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి భక్తులు ఈ ఉత్సవాలకు తరలిరానున్నారు. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా భావించే విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. మామూలు రోజుల్లోనే అంటే... ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లోనూ భక్తులు గుణదలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగ సమయాల్లోనైతే ఈ క్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు. మేరీమాత ఉత్సవాలకైతే జనం ఇసుకేస్తే రాలనంతగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు.. ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు.

మేరీ మాత ఉత్సవాలు.. దాదాపు 85 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 1933లో ఫాదర్ అర్లాటి... గుణదల కొండ శిఖరాగ్రాన ఓ శిలువను ప్రతిష్ఠించారు. 1947లో విజయవాడలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కేథలిక్కులు, ఫాదర్ అర్లాటి నేతృత్వంలో... కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నాటి నుంచీ గుణదలలో మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. ఉత్సవాలకు ముందు తొమ్మిదిరోజులపాటు ప్రార్థనలు, ఆరాధనలు వైభవంగా జరుగుతాయి.

ఈ సారి జరిగే ఉత్సవాలకు కూడా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు జరిగే మహోత్పవాలకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను, ముఖ్యమంత్రికి ఆలయ నిర్వాహకులు ఆహ్వానం అందించనున్నారు. అటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు గుణదల మేరీ మాత ఉత్సవాలకు రానున్నారు. దీనికి తగ్గట్లే పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. -

21:08 - January 26, 2018

హైదరాబాద్ : తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పోలీసులు చేపట్టిన సమగ్ర సర్వే తుది దశకు వచ్చింది. ఇప్పటివరకూ జరిపిన పోలీసుల సర్వే ప్రకారం.. జంటనగరాల్లో దాదాపు 40 వేల మంది నేరస్థులున్నారు. వీరందరి వివరాలనూ.. జియో ట్యాగింగ్‌ ద్వారా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీనివల్ల.. భవిష్యత్తులో నేరాలు గణనీయంగా తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. జంటనగరాల్లో నేరస్థుల సర్వే పూర్తైంది. మొత్తం 60 పోలీసు స్టేషన్ల పరిధిలోని క్రిమినల్స్‌ వివరాలను పోలీసులు సేకరించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఐదు జోన్లలో ఈనెల 18న చేపట్టిన సర్వే వారం పాటు కొనసాగింది. హంతకులు, దోపిడీ దొంగలు, ఆస్తి దొంగలు, రౌడీషీటర్లు, సైబర్‌ క్రిమినల్స్‌, గొలుసు దొంగలు... ఇలా అందరి వివరాలు సేకరించారు.

పాత నేరస్థుల ఇల్లిల్లూ తిరిగిన పోలీసులు.. వారి నుంచి ఆధార్‌ కార్డులు, ప్రస్తుత ఫోటోలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. పాత, కొత్త నేరాల రికార్డులను పరిశీలించారు. తెలంగాణ పోలీసులందరికీ వీరి వివరాలు అందుబాటులో ఉండేలా.. ప్రత్యేక కాప్‌ యాప్‌లో వాటిని నిక్షిప్తం చేశారు. ఇకపై ఒక్క మౌస్‌ క్లిక్‌తో కమిషనర్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకు నేరస్థులందరి సమాచారాన్నీ తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుంది.

జంట నగరాల్లో 40 వేల మంది నేరస్థులు ఉన్నట్టు పోలీసుల సర్వేలో తేలింది. సౌత్‌ జోన్‌ పరిధిలో 11 వేల మంది నేరస్థులు ఉన్నారు. సెంట్రల్‌ జోన్‌లో 9 వేల మంది క్రిమినల్స్‌ ఉన్నట్టు లెక్కతేలింది. హైదరాబాద్‌లో ఉంటూ నగరంలోనే నేరాలు చేసేవారు 31 వేల మందిని గుర్తించారు. హైదరాబాద్‌లో ఉంటూ బయట నేరాలకు పాల్పడేవారు 9 వేల మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ హైదరాబాద్‌లో నేరాలు చేసేవారు 7 వేల మంది ఉన్నారని సర్వేలో తేలింది. నగరంలో ఉంటూ ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడేవారు 3 వేల మంది ఉన్నట్టు గుర్తించారు. నేరస్థుల డెటాబేస్‌తో క్రైమ్‌ రేట్‌ తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేరస్థుల సమగ్ర సర్వే ఆధారంగా ఎవరెవరు నేరాలు మానేశారో తెలుసుకునే అవకాశం కలిగింది. ఇలాంటి వారికి ఉపాధి కల్పించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. నేరస్థులు నడత మార్చుకునేందుకు ఈ సర్వే దోహదపడుతుందని ప్రజాసంఘాలు నాయకులు, సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. నేరస్థుల సమగ్ర సర్వేతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, నేరాలు ఎంతవరకు తగ్గుతాయో వేచి చూడాలి. 

21:03 - January 26, 2018

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం నుంచి మూడు రోజుల పాటు అనంతంపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నెలకొన్న కరవును అధ్యయనం చేయడంతోపాటు పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. కరవు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులు, నీటి పారుదల రంగ నిపుణులతో చర్చిస్తారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్‌ పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులు పాటు జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో జనసేనాని పాల్గొంటారు.

చలోరె.. చలోరె..చల్‌ కార్యాక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటించే పవన్‌ కల్యాణ్‌... మొదటిరోజు నగరంలోని గుత్తి రోడ్డులో నిర్మించే జనసేన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సీమ కరవుకు పరిష్కార మార్గాలు అన్న అంశంపై నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. గుత్తి రోడ్డులోని కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయరంగ నిపుణులతో చర్చిస్తారు. ఆహ్వానితులను మాత్రమే ఈ కార్యకమ్రానికి అనుమతిస్తారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈనెల 28న కదిరిలో పర్యటిస్తారు. కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత కరవు పరిస్థితులపై స్థానికులతో సమావేశం అవుతారు. పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కదిరి నుంచి పుట్టపర్తి వెళ్తారు. మార్గమధ్యంలో హనుమాన్‌ జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించిన ప్రసంగిస్తారు. పుట్టపర్తి చేరుకున్న తర్వాత సత్యసాయి మందిరాన్ని దర్శిస్తారు. సత్యసాయి మంచినీటి పథకం, ఆస్పత్రిని కూడా పవన్‌ సందర్శిస్తారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు.

ఈనెల 29న చివరిరోజు ధర్మవరంలో పర్యటిస్తారు. చేనేత కార్మికులతో సమావేశమవుతారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటారు. ధర్మవరం నుంచి హిందూపురం వెళ్తారు. హిందూపురంలో జిల్లా స్థాయి జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. హిందూపురం నుంచి కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వెళ్లి, సీవీవీ ఇనిస్టిట్యూట్‌ని సందర్శిస్తారు. చిక్‌బళ్లాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు పయనమవుతారు. 

21:00 - January 26, 2018

విజయవాడ : దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఎం సూచనలతో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు టీడీపీ నేతలు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన దళితుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. దళిత మహానేతలు పుట్టిన నేలలో పుట్టడం తన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. షెడ్యూల్డు కులాలను అభివృద్ధి చేసేందుకు 84 రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ టీడీపీ నేత ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని దళితులకు చేరవేయాలని సీఎం సూచించారు. దళిత నిరుద్యోగులకు ఎస్సీ కార్పొరేషన్‌ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ యువత పారిశ్రామికవేత్తగా ఎదిగేలా పథకాలు రూపొందించామన్నారు సీఎం. దళితుల్లో ఐక్యత పెంచేదిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం. వారికి ఎందులోనూ అన్యాయం జరగదని హమీ ఇచ్చారు.

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను స్మరించుకుంటూ దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. దళితులపై దౌర్జన్యాలను నిరోధించి, వారి అభ్యున్నతికి చంద్రబాబు కృషి చేశారని కొనియాడారు. టీడీపీ నేతలు దళిత వాడల్లో పర్యటిస్తూ టీడీపీ ఆశయాలను దళితుల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

తెలుగుదేశం ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిందన్నారు ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. ఈ మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల ఎస్సీ కాలనీలో దళితతేజం-తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు టీడీపీ నేతలు. 

20:58 - January 26, 2018

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్‌ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. ముఖ్యమంత్రి అధికార నివాసం.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. హైకోర్టులో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టీస్‌ రమేశ్‌ రంగనాథన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో ఘంటా చక్రపాణి.. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఈవో ఎస్‌జీకే కిషోర్‌ జెండాను ఆవిష్కరించారు.

రిపబ్లిక్‌ డే.. సందర్భంగా.. చంచల్‌గూడ జైళ్ల శాఖ మైదానంలో డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి.. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అలాగే గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రఘునందన్ రావు.. జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అదేవిధంగా... సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. భాగమయ్యారు. జాతీయజెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషిని కొనియాడారు. టీజేఏసీ కార్యాలయంలోనూ రిపబ్లిక్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్‌ కోదండరామ్‌ జాతీయజెండాను ఎగురవేశారు. జనసేన పార్టీ కార్యాలయంలోనూ రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా... తెలంగాణాలోని అన్ని జిల్లాలలో... ప్రభుత్వ కార్యాయాల్లో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా.. నిజాంసాగర్‌ మండలకేంద్రంలో .. మనకోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల జాతీయజెండాను ఊరేగించారు.

ఏపీలోనూ... ప్రజలు జాతీయ జెండా ఆవిష్కరించి.. గణతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా వినూత్నంగా భారీ జాతీయ జెండాలను ఊరేగించారు. నెల్లూరు జిల్లా.. ఓజిలి మండలం సగుటూరులో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం చేశారు. స్వీట్స్‌ పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కడపలో .. నారాయణ పాఠశాల విద్యార్థులు దాదాపు 365 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. కర్నూలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోనూ, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనూ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా.. పశ్చిమగోదావరి జిల్లా.. జంగారెడ్డి గూడెంలో విద్యా వికాస్‌ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 400 అడుగుల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా.. ఒంగోలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ రిపబ్లిక్‌ డేను.. ఘనంగా నిర్వహించారు.

ప్రతి చోట గణతంత్ర దినోత్సవం .. ఉత్సాహంగా జరిగినప్పటికీ... కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో.. శానిటేషన్ కార్మికులు రాకుండానే.. కమిషనర్‌ జెండా ఎగురవేయడంపై.. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు కూర్చోని నిరసన తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా.. ఎల్లారెడ్డిలో ఆర్డీవో కార్యాయలంలో జెండా ఎగురకపోవడంతో... ఆవిష్కరణలో కాస్త ఆలస్యం జరిగింది.

20:53 - January 26, 2018

మొన్నటి వరకు మోడీ జీఎస్టీ కుదిపేస్తే..ప్రస్తుతం వర్మ 'జిఎస్ టి' కుదిపేస్తోంది. సమాజాన్ని కుదిపేస్తున్న ఈ జి.ఎస్.టి ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ? దీనిపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో జవహార్ లాల్ నెహ్రూ (సైకాలజిస్టు) విశ్లేషించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

భారతమాతకు మహా హారతి...

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు వద్ద భారతమాతకు మహా హారతి కార్యక్రమం జరిగింది. 20వేల మంది బాలికలు పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు. 

భారతమాతకు మహా హారతి...

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు వద్ద భారతమాతకు మహా హారతి కార్యక్రమం జరిగింది. 20వేల మంది బాలికలు పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు. 

ఈసీనగర్ సంతలో కాల్పులు..

మేడ్చల్ : చర్లపల్లి ఈసీ నగర్ లో సంతలో కాల్పులు కలకలం రేగింది. సంతలో ఇద్దరిపై బీహార్ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

20:36 - January 26, 2018

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు జోహార్లు..రిపబ్లిక్ డే అందరిదా ? కొందరిదా ? తిట్లు తిట్టారా ? అంతే..పోలీసులకు పర్మిషన్ ఇచ్చేసిండు..పెద్దపల్లి దికు మంత్రులు వెళితే..కంది రైతుల పంట ఆగచాట్లు...గొర్రెల సబ్సిడీ ఏమో కానీ అసలు పైకం ఆగమవుతుందంట...హిజ్రాలకు ఆడ లక్షణాలతో ఉంటుంటరు..కానీ వీరు అన్నింటి దాంట్లో వేలు పెడుతున్నరు..ఆడోళ్లను పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు అరెస్టు..గీ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి....

20:10 - January 26, 2018

తెలంగాణ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చకు కాలం చెల్లినట్లైనా ? విమర్శకులు నోటికి తాళాలు వేసుకుని సైగలతో కాలం గడిపేయాలా ? ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్వర్వులు చూస్తే నిజమనిపిస్తోంది. కోపంలో దురుసుగా..కఠిన పదాలు వాడారో కేసు పెట్టేస్తారు....ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), దాసోజు శ్రవణ్ (టి.కాంగ్రెస్), శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), పార్థసారధి (న్యాయవాది) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

19:22 - January 26, 2018

తెలంగాణ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చకు కాలం చెల్లినట్లైనా ? విమర్శకులు నోటికి తాళాలు వేసుకుని సైగలతో కాలం గడిపేయాలా ? ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్వర్వులు చూస్తే నిజమనిపిస్తోంది. కోపంలో దురుసుగా..కఠిన పదాలు వాడారో కేసు పెట్టేస్తారు....దూషణలు విచారించదగిన నేరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. పరుష పదజాలంతో తిట్టినా, కించపరిచినా ఇక నేరంగా భావిస్తారు. ఐపీసీలోని 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టింగులూ పెట్టినా శిక్షార్హమైనదిగా నిర్ణయించారు. నిందితులుగా నిర్ధారించి వారిని జైలుకే పంపేలా చట్ట సవరణలు చేస్తోంది. అరెస్టుకు కోర్టు అనుమతి అవసరం లేకుండా సవరణలు చేశారు. 

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితుల అరెస్టు ?

నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లేశ్, శరత్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా పోలీసులు నిర్ధారించడం లేదు.

 

18:54 - January 26, 2018

అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరి లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకున్న 'అనుష్క' లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన థ్రిల్లర్‌ మూవీ 'భాగమతి’. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జయరామ్, ఆషాశరత్ లు కూడా ఈ చిత్రంలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ? నటీ నటుల ఫెర్మామెన్స్ ఎలా ఉంది ? టెన్ టివి ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి హాయాంలోనే దళితులు బాగుపడ్డారు - నక్కా ఆనంద్ బాబు...

విజయవాడ : తెలుగుదేశం హయాంలోనే దళితుల జీవితాలు బాగుపడ్డాయని, అర్నిశలు దళితుల కోసం శ్రమిస్తున్న ఏకైక పార్టీ టిడిపియేనని తెలిపారు. గత ప్రభుత్వాలు దళితులను చిన్న చూపు చూశాయన్నారు. తెలుగుదేశంతోనే దళితులంతా ఉన్నారని చాటి చెబుదామన్నారు. 

సూరత్ లో అగ్నిప్రమాదం..

సూరత్ : పిప్లోడ్ ఏరియాలో ఓ షాపింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. 

18:25 - January 26, 2018

హైదరాబాద్ : జనసేన పార్టీ కార్యలయంలో రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రోహింగ్యా ముస్లింల వేదన చూస్తే బాధ కలిగిస్తోందని.. ఏదైనా కోల్పోయినపుడే దేశం విలువ తెలుస్తుందని పవన్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎవరూ మర్చిపోకూడదని పవన్ చెప్పారు. పద్మ అవార్డు గ్రహీతలకు జనసేన తరపున శుభాకాంక్షలు చెప్పిన పవన్ మరికొంతమంది తెలుగువారికి పద్మ అవార్డులు వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో సావిత్రీ, ఎస్వీఆర్‌ లాంటి ప్రముఖులకు కూడా కేంద్రం పద్మ అవార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

18:18 - January 26, 2018

విజయవాడ : 'దళిత తేజం - తెలుగు తేజం' అనే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దావోస్ పర్యటన ముగించుకుని అమరావతికి బాబు చేరుకున్నారు. అనంతరం మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో దళిత నేతలు బాబు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు.

జగ్జీవన్ రాంను, అంబేద్కర్ ను దివంగత ఎన్టీఆర్ గౌరవించారని, కాంగ్రెస్ ప్రభుత్వాలు వారిని విస్మరించారని ఆరోపించారు. దళిత నాయకత్వంలో ముందుకు పోవాలని, ఆత్మవిశ్వాసానికి శ్రీకారం చుట్టాలని ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. దళితులు అన్ని రంగాల్లో పైకొచ్చే వరకు తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. 

బాబు ఇంటికి దళిత నేతలు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఇంటికి దళిత నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో దళిత నేతలు చేరుకున్నారు. దళిత తేజం - తెలుగుతేజం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 

17:40 - January 26, 2018
17:39 - January 26, 2018
17:39 - January 26, 2018
17:22 - January 26, 2018

నల్గొండ : జిల్లా చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెసు నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్యెల్యే వీరేశం పాత్ర ఉందని టి.కాంగ్రెస్ ఆరోపిస్తోంది. శుక్రవారం బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను టి.కాంగ్రెసు నేతలు పరామర్శించారు. శ్రీనివాస్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, కేసును సీబీఐకి అప్పగించాలని టిపిసిసీ చీప్ ఉత్తమ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడడం సిగ్గు చేటని జానారెడ్డి పేర్కొనగా హత్య జరిగి 48 గంటలు జరుగుతున్నా నిందితులను ఎందుకు పట్టుకోలదని సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ఈ కేసుపై శుక్రవారం డీజీపీని కలుస్తామని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

17:14 - January 26, 2018

రంగారెడ్డి : ఆచూకి కనిపించకుండా పోయిన తమ కొడుకు ఆచూకి చెప్పాలని ఓ కుటుంబం దీనంగా ఆర్థిస్తోంది. ఈనెల 23వ తేదీన తమ కొడుకును కనిపించకుండా పోయాడంటూ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటన గాజులరామారంలో చోటు చేసుకుంది. చిత్తారామ్మ జాతరకు నాలుగేళ్ల కుమారుడు ఉదయ్ తేజతో ఓ కుటుంబం వెళ్లింది. తల్లి ఒడిలో ఉన్న ఉదయ్ తేజ కొద్దిసేపటి తరువాత కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం కనిపించలేదు. చివరకు ఫిర్యాదు చేయడంతో జీడిమెట్ల పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

బాలుడు అదృశ్యం ? కిడ్నాప్ ?

రంగారెడ్డి : జిల్లాలో ఓ బాలుడు కనిపించకపోవడం కలకలం రేపుతోంది. గాజులరామారాంలో చిత్తారామ్మ జాతరకు ఉదయ్ తేజ అనే మూడేళ్ల బాలుడితో ఓ కుటుంబం వచ్చింది. భారీగా జనాలు జాతరకు వచ్చార. ఇదిలా ఉంటే తమ కుమారుడు కనిపించడం లేదని ఉదయ్ తేజ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రాష్ట్రపతి నివాసంలో ఎట్ హోం

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన 'ఎట్ హోం' కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. 

16:41 - January 26, 2018

ఢిల్లీ : రాజ్‌పథ్‌లో జరిగిన రిపబ్లిక్‌ వేడుకల్లో మహిళల బైక్‌ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బైక్‌లపై అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేశారు. ఎస్‌ఐ స్టాంజింగ్‌ నోర్యాంగ్‌ ఆధ్వర్యంలో మహిళలు బైకింగ్‌ స్టంట్స్‌ అదరగొట్టారు. 350 సిసి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ మోటార్‌ సైకిళ్లపై వీళ్లు వివిధ స్టంట్స్‌, ఆక్రోబాటిక్స్‌ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బిఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా బైకర్స్‌ బృందం 'సీమా భవాని' తొలిసారిగా రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొంది. దుర్గాదేవిలాగా సరిహద్దులో రక్షిస్తున్నందున ఈ బృందానికి సీమా భవాని పేరు పెట్టినట్లు డిప్యూటి కమాండెంట్‌ రమేశ్‌చంద్ర తెలిపారు.

16:39 - January 26, 2018

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ రేంజర్ల నుంచి స్వీట్లు, శుభాకాంక్షలను అందుకోవడానికి బిఎస్‌ఎఫ్‌ నిరాకరించింది. సరిహద్దులో పాకిస్తాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండడమే ఇందుకు కారణం. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లతో పాటు స్థానిక పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. రిపబ్లిక్‌ డే సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం చేయరాదని పాక్‌ ఆర్మీకి గురువారమే బిఎస్‌ఎఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరుదేశాల్లో జాతీయ పండగల సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ.

16:38 - January 26, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రిపబ్లిక్‌డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌, అమరావతిలో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌ కోడెలశివప్రసాదరావు, తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ మధుసూదనాచారి త్రివర్ణపతాకాలు ఆవిష్కరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌడ్స్‌లో 69వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి. గవర్నర్‌ నరసింహన్‌ ఉదయం. 9గంటల 15 నిముషాలకు జాతీయజెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

అటు అమరావతిలోనూ గవర్నర్‌ నరసింహన్‌ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ఉదయం 11.55 నిముషాలకు జాతీయ చెండాను ఆవిష్కరించిన గవర్నర్‌..పోలీస్‌దళాల గౌవరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్శ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అంతకు మందు ఉదయం 7గంటల 45 నిముషాలకు ఏపీ అసెంబ్లీప్రాంగణంలో స్పీకర్‌ కోడెల, మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఇటు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ మధుసూదనాచారి త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ప్రజాప్రతినిధులకు, అసెంబ్లీ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణతంత్ర వేడుకల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి. పాఠశాలల విద్యార్థులు ఆట పాటలతో అలరించారు.  

16:36 - January 26, 2018

హైదరాబాద్ : గులాబీ పార్టీ నేతల్లో భవిష్యత్తుపై గుబులు పట్టుకుంది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సర్వే వివరాలు వెల్లడిస్తారన్న ప్రచారంతో... ఆ పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది.. ఎమ్మెల్యేలు,ఎంపీల పనితీరుపై కూడా సమగ్ర సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో భవిష్యత్తుపై బెంగపట్టుకుంది. పార్టీ అధినేత కేసీఆర్‌ చేపట్టే సర్వేలే వారి ఆందోళనకు కారణం..

సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే నేతలను కూడా సిద్ధం చేయనున్నట్లు సమాచారం. అందుకే సర్వేలను మరింత సమగ్రంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి... ఆ వివరాలను పార్టీ నేతలకు అందించారు. ఇలా అంతర్గత సర్వేలతో కేసీఆర్‌ నాయకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

తాజాగా చేసిన సర్వేను పక్కా శాస్ర్తీయంగా నిర్వహించారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల, ఎంపీల పనితీరుపై అభిప్రాయాలను సర్వే సంస్థలు సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. సుమారు నెల రోజులపాటు జరిగిన తాజా సర్వే... ఇటీవలే పూర్తైనట్లు తెలుస్తోంది. ఒకటీ రెండు రోజుల్లోనే ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉందంటున్నారు నేతలు. సర్వేలో అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించినట్లు తెలుసుకున్న నేతల్లో ఉత్కంఠ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 శాతం మందికి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెల్లడికానున్న సర్వే వివరాలే గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  

16:35 - January 26, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో 69వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఉదయం 9.గంటలకు ఇండియాగేట్‌ వద్ద అమరజవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ.. అనంతరం 9.15 నిముషాలకు రాజ్‌పథ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు, ఆయుధసంపత్తి ప్రదర్శన నభూతో అన్నట్టుగా సాగింది. ఈ సారి వేడుకలకు థాయ్‌లాండ్‌, కంబోడియా, లావోస్‌, వియత్నాం, బ్రునై, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌, సింగపూర్‌ దేశాధినేతలు హాజరయ్యారు. సైనిక దళాల కవాతు, ఆయుధసంపత్తి ప్రదర్శనలను తిలకించారు. వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. ఆటపాటలో సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా వైమానికి దళం ప్రదర్శన అబ్బుర పరిచింది. ఆకాశంలో దూసుకుపోయిన సుఖోయ్‌ ఎంకేఐ -30, రాఫెల్‌ఫైటర్ల అబ్బుర పరిచాయి.

గణతంత్ర వేడుకల సందర్భంగా రాజ్‌పథ్‌ పరిసరాలు సందర్శకులతో కిక్కిరిశాయి. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు కాంగ్రెస్‌నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చివరిలో వివిధ పాఠశాల విద్యార్థుల ఆటపాటలు వీక్షకులను అలరించాయి.  

బిజెపి ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు...

తూర్పుగోదావరి : రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమలు జరుగుతోందని, ప్యాకేజీ పేరిట హోదాను అమలు చేయడం జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలపడం గమనార్హం. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించిన అనంతరం పలు వ్యాఖ్యలు చేశారు.

16:09 - January 26, 2018

తూర్పుగోదావరి : ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా అమలు జరుగుతోందని, ప్యాకేజీ పేరిట హోదాను అమలు చేయడం జరుగుతోందని తెలపడం గమనార్హం. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించిన అనంతరం పలు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదానే కాకుండా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు కోరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సోము వీర్రాజు మాట్లాడుతూ...ఏటా రూ. 3వేల కోట్లు అదనంగా కేంద్రం అందిస్తోందని, దీని ఫలితంగా ఏపీ రాష్ట్రం లబ్ది పొందుతోందన్నారు. ఏ రాష్ట్రానికి అందని ప్రయోజనాలు ఏపీ రాష్ట్రానికి దక్కుతోందని పేర్కొన్నారు. కానీ ప్రత్యేక హోదాపై అధికారపక్షం..విపక్ష సభ్యులు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. హోదా కోసం వైసీపీ నేతలని టిడిపి నాయకులు రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. మరి దీనిపై టిడిపి ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

'ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాల అమలు చేస్తోంది'...

విజయవాడ : విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంతంగా ఎదుర్కొంటోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. 

మున్సిపల్ ఛైర్మన్ కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ..

నల్గొండ : మున్సిపల్ ఛైర్ పర్సన్ కుటుంబాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, వీహెచ్ లు పరామర్శించారు.

 

15:56 - January 26, 2018

కర్నూలు : జిల్లాలో బేతంచర్ల మండలం గూటుపల్లేలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న సొంత కొడుకుపై తండ్రి సోమన్న దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులోఉ న్న సోమన్న కొడుకు పరుశురాం తలపై గొడ్డలితో కొట్టడంతో కాకుండా రోకలి బండతో చేయిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

15:52 - January 26, 2018
15:50 - January 26, 2018

రిపబ్లిక్ డే నిజంగానే వచ్చిందా ? అసలు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు జరుగుతున్నాయా ? నేటి సమాజ ప్రస్తుత పరిస్థితులను బట్టి నేటి యువతరం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...  

15:29 - January 26, 2018

సమాజ సేవ కోసం పాటు పడాలనే తపన..ఆరాటం అందరికీ ఉండదు..తమ కుటుంబం శ్రేయస్సు కోసం పాటుపడుతుంటారు. కానీ అందరూ బాగుండాలి..అందులో మనముండాలి అనే కోరుకొనే వారు చాలా అరుదుగా ఉంటుంటారు. అలాంటి పెద్ద మనస్సు కలిగిన ఓ చిన్నారి అత్యంత సాహసోపేతమైన పని చేసి సాహస బాలల అవార్డుకు ఎంపికైంది. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

15:26 - January 26, 2018

అనంతపురం : తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' ఇక ఏపీ రాష్ట్రంపై దృష్టి సారించనున్నారు. అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 27వ తేదీ నుండి పర్యటన మొదలు కానుందని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. చలోరె..చలోరె..చల్ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలో పర్యటించి కరవుపై అధ్యయనం..అవగాహ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

27వ తేదీ అనంతపురంకు చేరుకుని 11.20 జనసేన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ప్రజా వేదిక జరుగనుంది. కరవుకు పరిష్కార మార్గాలు అనే అంశంపై రైతులు..వ్యవసాయ, నీటి పారుదల నిపుణులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం స్థానిక పార్టీ ముఖ్యులు..కార్యకర్తలతో మాట్లాడుతారు. 28న ఉదయం కదిరికి వెళ్లి అక్కడ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం కరవు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న వారితో పవన్ మాట్లాడనున్నారు. అక్కడి నుండి పుట్టపర్తికి చేరుకుని మధ్యాహ్నం 2.30గంటలకు హనుమాన్ జంక్షన్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4.30గంటలకు పుట్టపర్తి చేరుకుని అక్కడ సత్యసాయం మందిరం..మంచినీటి పథకం..ఆసుపత్రిని పవన్ సందర్శించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న పవన్ 29వ తేదీ ఉదయం 8గంటలకు ధర్మవరానికి ప్రయాణం కానున్నారు. అక్కడ చేనేత కళాకారులతో మాట్లాడనున్నారు. హిందూపురంలో మధ్యాహ్నం 2గంటలకు జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం సి.వి.వి. ఇనిస్టిట్యూట్ లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు. 

15:16 - January 26, 2018

'పద్మ' అవార్డులపై జనసేనానీ స్పందన...

హైదరాబాద్ : పద్మ అవార్డులపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ స్పందించారు. పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. కిదాంబి శ్రీకాంత్, ఇళయరాజాకు అభినందనలు తెలిపారు. తెలుగు వారికి ఇంకొన్ని అవార్డులు ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. సావిత్రి, ఎస్వీఆర్ లకు పద్మ అవార్డులు ఇస్తే బాగుండేదన్నారు. 

13:57 - January 26, 2018

సిద్దిపేట : గణతంత్ర వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోహెడ మార్కెట్‌ యార్డులో విద్యుత్‌ షాక్‌ తగిలి కాంట్రాక్ట్‌ ఉద్యోగి మృతి చెందాడు. జాతీయ జెండాను సవరించే సమయంలో కరెంట్‌ షాక్‌ తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

 

13:52 - January 26, 2018

హైదరాబాద్‌ : నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉందని తమ్మినేని అన్నారు. 

 

13:50 - January 26, 2018

కృష్ణా : ఏపీలోను గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఎగురవేశారు. ఉదయం 11.55 నిముషాలకు జాతీయ చెండాను ఆవిష్కరించిన గవర్నర్‌..పోలీస్‌దళాల గౌవ వందనాన్ని స్వీకరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి గణతండ్ర వేడుకలకు హాజరుకాలేదు. సీఎం సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌  గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్‌ అన్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో 
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పవులురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

 

13:47 - January 26, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనూ 69వ రిపబ్లిక్‌డే ఉత్సవాలు  ఘనంగా  జరుగుతున్నాయి. ఉదయం 9.15 నిముషాలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు  పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులు నిర్వహించిన కవవాతు ఆకట్టుకుంది.   పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. 

 

13:44 - January 26, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో మువ్వన్నెల పతాక రెపరెపలాడింది.  ఉదయం 9 గంటల నుంచి తర్వాత అన్నిచోట్ల జెండా ఆవిష్కరణలు జరిగాయి.  ఢిల్లీ రాజ్‌పధ్‌లో వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.  ఈసారి గనతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధులుగా 10 ఆసియాన్‌ దేశాలనుంచి ప్రతినిధులు  వచ్చారు. రిపబ్లిక్‌డే పరేడ్‌ వేడుకలను  తిలకించారు. సైనిక దళాల వాతు ఆకట్టుకుంది. భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన నభూతో అన్నట్టుగా సాగింది. 
ఆకట్టుకున్న సైనిక దళాల పరేడ్‌
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో సైనిక దళాల పరేడ్‌ ఆకట్టుకుంది. టీ-90 యుద్ధ ట్యాంకర్ల ప్రదర్శనతో పరేడ్‌ ప్రారంభమైంది. వేడుకల్లో ముఖ్యఅతిథులుగా హాజరైన పది దేశాలకు సంబంధించిన జెండాలను ప్రదర్శించారు. ఆర్మీ, వాయు సేన, నావికా దళాలలకు చెందిన శకటాలతో పాటు బీఎస్‌ఎఫ్‌ దళాలు, ఇండో టిబెటిన్‌ బార్డర్‌ పోలీసు బలగాలు, సశస్త్ర సీమబల్‌ బ్యాండ్, దిల్లీ పోలీసులు, ఎన్‌సీసీ బృందాల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఆకాశ్‌ క్షిపణి, బ్రహ్మోస్‌ క్షిపణులను కూడా ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.

బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్ పరామర్శించారు.  

గ్రామాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు : గవర్నర్

గుంటూరు : గ్రామీణ ప్రాంతాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశామని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రూ.7621 కోట్లతో 10,270 కిమీ పొడవైన రహదారులు నిర్మించారని చెప్పారు. విశాఖ..చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో 172 ప్రాజెక్టులను అమృత పథకం కింద చేపట్టామన్నారు. బీసీల్లో ఎఫ్ కేటగిరి కింద కాపులకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

 

విభజన కష్టాలను సమర్థంగా ఎదుర్కొంటోన్న ప్రభుత్వం : గవర్నర్

గుంటూరు : ఎందరో మహనీయుల త్యాగఫలం ఈ గణతంత్ర వేడుకలని గవర్నర్ నరిసింహన్ అన్నారు. అమరావతిలోని ఇందిరా మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నరసింహన్ పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌవరవందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందనిచెప్పారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి స్థాయికి చేరుకునేలా కృషి చేస్తోందని చెప్పారు. 

13:02 - January 26, 2018

గుంటూరు : ఎందరో మహనీయుల త్యాగఫలం ఈ గణతంత్ర వేడుకలని గవర్నర్ నరిసింహన్ అన్నారు. అమరావతిలోని ఇందిరా మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నరసింహన్ పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌవరవందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందనిచెప్పారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి స్థాయికి చేరుకునేలా కృషి చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రూ.7621 కోట్లతో 10,270 కిమీ పొడవైన రహదారులు నిర్మించారని చెప్పారు. విశాఖ..చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో 172 ప్రాజెక్టులను అమృత పథకం కింద చేపట్టామన్నారు. బీసీల్లో ఎఫ్ కేటగిరి కింద కాపులకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

 

దళితులపై సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా చర్యల్లేవు : మధు

హైదరాబాద్ : దళితులపై దాడుల పట్ల ఇప్పటివరకు స్పందించలేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. దళితులపై సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా చర్యలు లేవని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ ఊసే లేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. విభజన హామీల అమలుపై చంద్రబాబు కోర్టు కెళ్తాననడం అవకాశవాద రాజకీయమన్నారు. 

 

రాజ్యాంగంలో లోపం లేదు..పాలకుల్లో లోపం ఉంది : కోదండరాం

హైదరాబాద్ : టీజేఏసీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. కోదండరాం జాతీయ జెండాను ఎగురవేశారు. రాజ్యాంగంలో లోపం లేదని. పాలకుల్లో లోపం ఉందన్నారు. అందుకే మారుస్తామన్న ప్రతిసారి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు. రాజకీయాలు మారకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవన్నారు. 

టీజేఏసీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్ : టీజేఏసీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. కోదండరాం జాతీయ జెండాను ఎగురవేశారు. 

 

రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా సీఎం చంద్రబాబు

గుంటూరు : రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం చంద్రబాబు దూరంగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం దావోస్ నుంచి సీఎం బయలుదేరారు. అబుదాబిలో వాతావరణం అనుకూలించక విమానం ఆలస్యం అయింది. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు అమరావతి చేరుకోనున్నారు.
 

అండర్ 19 వరల్డ్ కప్... సెమీ ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా

హైదరాబాద్ : అండర్ 19 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు చేరింది. క్వార్టల్ ఫైనల్ లో బంగ్లాదేశ్ పై 131 పరుగుల తేడాతో గెలుపొందింది. 30న రెండో సెమీస్ లో పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. 

 

రాజ్ పథ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఢిల్లీ : రాజ్ పథ్ లో 69 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. 

రాజ్ పథ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఢిల్లీ : రాజ్ పథ్ లో 69 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. 

12:19 - January 26, 2018
12:15 - January 26, 2018

గుంటూరు : అమరావతిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్శర్ నరసింహన్ పాల్గొన్నారు. అమరావతిలో గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌవరవందనం స్వీకరించారు. త్రివిద దళాలు కవాతు నిర్వహించాయి. వివిధ శాఖల శకటాలు ఆకర్షించాయి.  

మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు : స్పీకర్ కోడెల

అమరావతి : మార్చి మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. రాష్ట్రం కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. సవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. 

11:44 - January 26, 2018

పశ్భిమగోదావరి : జిల్లాలోని నల్లజర్లమండలం అనంతపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రకాల్వ వంతెనపై ఆర్టీసీబస్సు, లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 8మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుత్రికి తరలించారు. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు తూ.గో.జిల్లా తునికి చెందిన లక్ష్మీ, జ్యోతి, శివసాయి, సత్య తోపాటు మరో మృతురాలు ఒడిశాకు చెందిన సావిత్రమ్మగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో వేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సును ఢికొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 

 

11:40 - January 26, 2018

ఢిల్లీ : ఒక్కటా.. రెండా... వెయ్యికి పైగా చిత్రాలు.. 6 వేలకు పైగా పాటలకు స్వరాలు అందించిన మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజాకు అత్యున్నత పద్మ పురస్కారం లభించింది. కేంద్రం తాజాగా ఆయనకు పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించింది. సాధారణ కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థానానికి ఎదిగి... అత్యున్నత పురస్కారానికి ఎంపికైన మ్యూజిక్‌ మాస్ట్రోకు పలువురు అభినందనలు తెలిపారు. 
ఇళయరాజా సంగీతం అనితర సాధ్యం...
ఆయన సంగీతం అనితర సాధ్యం...ఆయన పాట మృదు మధుర శ్రవణా వినోదం.. సంప్రదాయ, పాశ్చాత్య సంగీతాలను మేళవించి ఆయన సృష్టించిన బాణీలు అపూర్వం. ఓ సాధారణ వాద్య కళాకారుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. సంగీత దర్శకుడిగా ఇళయరాజా సాధించిన విజయాలు అనిర్వచనీయం. 
6 వేలకు పైగా పాటలకు స్వరాలు... 
వెయ్యికి పైగా చిత్రాలు... 6 వేలకు పైగా పాటలకు స్వరాలు... లెక్కలేనన్ని అవార్డులు... కోట్ల మంది సంగీతాభిమానుల నీరాజనాలు... వీటన్నిటినీ మించి ఇప్పుడు సంగీతానికి ఇళయరాజా చేసిన సేవలకుగాను కేంద్రం పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించింది.
పేద కుటుంబం నుంచి వచ్చిన ఇళయరాజా  
ఇళయరాజా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవారు. తమిళనాడులోని తేని జిల్లాలో పన్నైపురమ్‌ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి రామస్వామి, తల్లి చిన్న తాయమ్మాళ్‌. తల్లిదండ్రులు ఆయనకు జ్ఞానదేశికన్‌ అనే పేరు పెట్టారు. ఎటుచూసినా పచ్చని పంటపొలాలు... రైతులు పాడుకునే జానపద పాటలు ఇవే ఇళయరాజాకు సంగీతాన్ని పరిచయం చేశాయి. రాజయ్య పేరుతో ఇళయరాజా తండ్రి ఆయనను పాఠశాలలో చేర్పించారు. అయితే గ్రామస్తులు, స్నేహితులు ఆయనను రాసయ్య అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులో సోదరుడు పావలార్‌ వరదరాజన్‌, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడిగా ఉండేవారు. ఆ సంగీత బృందంతో కలిసి ఇళయరాజా ఊరూరా తిరిగేవాడు. 
ఇళయరాజా సంగీత ప్రస్థానం
సంగీతాన్ని వృత్తిగా స్వీకరించి అందులో స్థిరపడాలంలే సరిగమల్లో శిక్షణ అవసరమని గ్రహించి 1968లో మద్రాస్‌కు చేరుకున్నారు. అక్కడ ధనరాజ్‌ మాస్టర్‌ వద్ద పలు వాద్యాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. ఇళయరాజా ఒక్కసారిగా సినిమా రంగంలో ధ్రువతారగా ఆయన మెరిసిపోలేదు. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా చేరడం ద్వారా తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. పలు బెంగాలీ సినిమాలకు గిటారిస్టుగా, కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. ఆ తరవాత కన్నడ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేషన్‌ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలనచిత్ర పరిశ్రమవైపు అడుగులు వేశారు. వెంకటేషన్‌ దగ్గర దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఒకపక్క 
అప్రతిహతంగా ఇళయరాజా ప్రస్థానం 
సహాయకుడిగా పనిచేస్తూనే మరోపక్క సంగీత సాగరంలోని లోతుపాతులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. 1976లో పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇవ్వడంతో ఇళయరాజా పూర్తి సంగీత దర్శకుడిగా అవతరించారు. ఇక అక్కడి నుంచి ఇళయరాజా ప్రస్థానం అప్రతిహతంగా సాగింది.
ఆస్థాన విద్వాంసుడిగా పేరుతెచ్చుకున్న ఇళయరాజా  
కన్నదాసన్‌, వాలి, వైరముత్తు, ఒ.ఎన్‌.వి.కురుప్‌, శ్రీకూర్మన్‌ తంపి, వేటూరి సుందరామ్మూర్తి, ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఉదయ్‌శంకర్‌, గుల్జార్‌ వంటి ఎంతోమంది సుప్రసిద్ధ గీత రచయితలతో ఇళయరాజా కలిసి పనిచేశారు. పలువురు దర్శకులకు ఆయన ఆస్థాన విద్వాంసుడిగా పేరుతెచ్చుకున్నారు. ఎంతోమంది గొప్ప దర్శకుల సినిమాల్లోని ఆయన పాటలు అజరామరం. నేటి యువతరానికీ ఆ పాటలు నిత్యనూతనంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 
ఇళయరాజా సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు 
ఆయన ఇప్పటివరకూ వేయికి పైగా సినిమాలకు, ఆరున్నర వేలకు పైగా గీతాలకు సంగీతం అందించారు. ఆయన సంగీత సారథ్యంలోనే ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.జె.ఏసుదాసు, కె.ఎస్‌.చిత్ర, ఎస్‌.జానకి వంటి ఎంతోమంది గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పాశ్చాత్య సంగీత వాద్యాలతో చేసిన ప్రయోగాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 
జాతీయ చలన చిత్ర పురస్కారాలు 
ఇళయరాజా సంగీతం అందించిన నాలుగు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలన చిత్ర పురస్కారాలు లభించాయి. 1984లో సాగరసంగమం, 1986లో సింధుభైరవి, 1989లో రుద్రవీణ, 2009లో పజ్హస్సి రాజా చిత్రాలకు పురస్కారాలు లభించాయి. ఇవేకాక ఫిలింపేర్‌ జీవిత సాఫల్య పురస్కారంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చే నంది పురస్కారాలు ఆయనకు దక్కాయి. 

 

గాంధీభవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : గాంధీభవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ, మల్లుభట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

10:35 - January 26, 2018

రాజ్యంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం : తమ్మినేని

హైదరాబాద్ : రాజ్యంగాన్ని రక్షించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత రాజ్యంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. రాజ్యాంగంలోని మౌళిక అంశం సెక్యులరిజాన్ని తొలగించాలని అధికారంలో ఉన్న కాషాయ మూకలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సామాజిక న్యాయాన్ని తీసేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. అందరికీ ఒకే ఓటు హక్కు ఉందని..కానీ మనుషుల్లో వ్యత్యాసం ఉందన్నారు. ఆర్థిక, సామాజిక హోదా వ్యత్యాసం ఉందని చెప్పారు.

10:23 - January 26, 2018

హైదరాబాద్ : రాజ్యంగాన్ని రక్షించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత రాజ్యంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. రాజ్యాంగంలోని మౌళిక అంశం సెక్యులరిజాన్ని తొలగించాలని అధికారంలో ఉన్న కాషాయ మూకలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సామాజిక న్యాయాన్ని తీసేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. అందరికీ ఒకే ఓటు హక్కు ఉందని..కానీ మనుషుల్లో వ్యత్యాసం ఉందన్నారు. ఆర్థిక, సామాజిక హోదా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆర్థిక సమానత్వం సాధించుకోవాలని.. అందుకు కృషి చేయాలన్నారు. 

 

ఏపీ శాసనసభ భవనంపై జాతీయజెండా ఆవిష్కరించిన స్పీకర్

అమరావతి : అసెంబ్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ శాసనసభ భవనంపై జాతీయ జెండాను స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. 

ఏపీ శాసనమండలి భవనంపై జాతీయ జెండా ఆవిష్కరించిన ఎన్ఎండీ ఫరూఖ్

అమరావతి : ఏపీ శాసన మండలి భవనంపై జాతీయ జెండాను శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూఖ్ ఆవిష్కరించారు. 

 

సిద్దిపేట గణతంత్ర వేడుకల్లో విషాదం

సిద్దిపేట : గణతంత్ర వేడుకల్లో విషాదం నెలకొంది. కోహెడ మార్కెట్ యార్డులో జాతీయ జెండాను సరిచేస్తూ విద్యుత్ షాక్ తో కాంట్రాక్టు ఉద్యోగి చంద్రయ్య మృతి చెందారు. 

 

10:04 - January 26, 2018

పద్మావత్ సినిమా వివాదంపై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత ఎన్ వీ. సుభాష్, టీఆర్ ఎస్ నేత నారాయణ గుప్తా పాల్గొని, మాట్లాడారు. గణతంత్ర దినోత్సవానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. రాజ్యాంగంపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

09:57 - January 26, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకులు జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. సైనిక, పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు. అంతకముందు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. 

09:55 - January 26, 2018
09:40 - January 26, 2018

అశ్లీలతను సినిమాగా తీస్తూ.. దానిని వ్యతిరేకిస్తున్న మహిళా నేతలపై కామెంట్స్‌ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ తీసిన జీఎస్టీ సినిమాపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అశ్లీలతను సినిమాగా తీస్తూ.. దానిని వ్యతిరేకిస్తున్న మహిళా నేతలపై వర్మ చేసిన కామెంట్స్‌పై వారు మండిపడుతున్నారు. మహిళను ఒక వస్తువుగా చూసే వర్మ మైండ్‌సెట్‌ మారాలని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

09:34 - January 26, 2018

దక్షిణాఫ్రికా : వాండరర్స్‌ టెస్ట్‌ రెండో రోజు సైతం బౌలర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోగా...రెండో రోజు భారత బౌలర్ల ధాటికి సఫారీ  బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. డీన్‌ ఎల్గార్‌, ఐడెన్‌ మర్కామ్‌, డివిలియర్స్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ బోల్తా కొట్టించగా...నైట్‌ వాచ్‌మన్‌ రబడను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు.కెప్టెన్‌ డు ప్లెసీ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.క్రీజ్‌లో పాతుకుపోయిన హషీమ్‌ ఆమ్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టెస్టుల్లో 37వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఆమ్లా 121 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.లోయర్ ఆర్డర్‌లో వెర్నోర్‌ ఫిలాండర్‌  కీలక  ఇన్నింగ్స్‌ ఆడాడు.194 పరుగులకు ఆలౌటైన  సఫారీ టీమ్‌ ..7 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా...భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశాడు.

 

09:30 - January 26, 2018

విశాఖ : జిల్లాలో సాప్ట్‌వేర్‌ మహిళా ఉద్యోగులు ఫ్లాష్‌ మాబ్‌ డ్యాన్సులతో దుమ్మురేపారు. ఉరుకులు పరుగుల జీవన గమణంలో ఉల్లాసానికి నోచుకొక నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే యువతీ యువకులు ఆటవిడుపుకోసం ఫ్లాష్‌ మాబ్‌ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఉదయం నుండి యాంత్రిక జీవనం గడుపే ఒత్తిడిని ఎదుర్కోనేందుకే ఈ ఈవెంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు కంపెనీల నుండి అందరూ కలిసి ఉల్లాసంగా డ్యాన్స్‌లు చేస్తూ విశాఖ వాసులసు ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌కి విశాఖ కూడా ఏ మాత్రం తీసిపోదంటూ పలువురు తెలిపారు.

 

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకులు జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. అంతకముందు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకులు

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకులు జరుగుతున్నాయి. అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. 

07:38 - January 26, 2018

చెన్నై : ఫిబ్రవరి 21న పార్టీ పేరును ఖరారు చేయనున్నట్లు  ప్రముఖ తమిళ నటుడు కమల్‌హసన్ తెలిపారు. పార్టీ చిహ్నం, విధి విధానాలను కూడా అదేరోజు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి రాజకీయ పర్యటన ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్‌గా నిలుస్తామని చెప్పారు. సినిమాలోనే కాదు...రాజకీయాల్లోనూ తానేంటో నిరూపించుకుంటానని కమల్‌ చెప్పారు. రజనీకాంత్‌, తాను తమిళ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు.

 

07:36 - January 26, 2018

ఢిల్లీ : కర్ణిసేన నిరసనల నడుమ పద్మావత్‌ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైంది. రాజ్‌పుత్‌లు ఎక్కువగా ఉన్న రాజస్థాన్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాల్లో మాత్రం సినిమా విడుదల కాలేదు. ఈ 4 రాష్ట్రాలు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాయని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు సినిమా విడుదలను నిరసిస్తూ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. 

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన వివాదస్పద సినిమా 'పద్మావత్‌'  దేశవ్యాప్తంగా విడుదలైంది.
సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్‌ వద్ద రికార్డు క్రియేట్‌ చేసింది. కేవలం ప్రివ్యూల ప్రదర్శనలతోనే 5 కోట్లు వచ్చాయి. ప్రివ్యూల ద్వారా సినిమాకు 5 కోట్లు రావడం గొప్ప విషయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో  ఈ సినిమా కలెక్షన్లు రికార్డ్‌ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. 2 వందల కోట్ల ఖర్చుతో భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు.

రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో 'పద్మావత్‌' సినిమా విడుదల నిలిచిపోయింది. సినిమా విడుదల చేయని 4 రాష్ట్రాల ప్రభుత్వాలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

పద్మావత్‌ రిలీజ్‌ను వ్యతిరేకిస్తూ రాజ్‌పుత్‌ కర్ణిసేన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాను నిషేధించాలని తమిళనాడులో శ్రీరామ్‌సేన థియేటర్ల వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు రావడంతో కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లో నిరసనకారులు ఆందోళన చేశారు.  లక్నోలో కర్ణిసేన కార్యకర్తలు పద్మావత్‌ సినిమాను బహిష్కరించాలని కోరుతూ ప్రేక్షకులకు గులాబీ పువ్వులను ఇచ్చారు. యూపీలో థియేటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వారణాసిలో సినిమా విడుదలను నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పద్మావత్‌ సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు.. భన్సాలీ చాలా చక్కగా సినిమా తెరకెక్కించారని మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉందని ప్రశంసిస్తున్నారు.

07:33 - January 26, 2018

హైదరాబాద్ : చాలా గ్యాప్‌ తర్వాత మీడియా ముందుకొచ్చిన రాములమ్మ.. గులాబీ బాస్‌పై సమరానికి సై అంటోంది. రాహుల్‌ ఆదేశిస్తే.. పార్టీ కోసం దేనికైనా సిద్దమంటోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేసీఆర్‌ పాలన సాగుతుందని... గులాబీ బాస్‌ను గద్దె దించేందుకు ఊరూరా తిరిగేందుకు సై అంటోంది. 
ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేసీఆర్‌ పాలన : విజయశాంతి 
విజయశాంతి అలియాస్‌ రాములమ్మ. 20 ఏళ్ల రాజకీయ ప్రస్తానం పూర్తయిన సందర్బంగా... చాలారోజుల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేసీఆర్‌ పాలన సాగుతుందన్నారు విజయశాంతి. తెలంగాణ కోసం పోరాడిన తనకు ప్రస్తుత పాలన చూస్తుంటే బాధేస్తుందన్నారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించినవారిపై నిర్బందాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నందుకే కోదండరామ్‌, మందకృష్ణ మాదిగలను అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. కోదండరామ్‌ పర్యటనకలు అనుమతివ్వని సర్కార్‌... పవన్‌కల్యాణ్‌ టూర్‌కు ఎలా అనుమతిచ్చారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు... కేసీఆర్‌ ఇత్తడి తెలంగాణగా మార్చారన్నారు విజయశాంతి.
పవన్‌పై విరుచుకుపడ్డ విజయశాంతి 
ఇక పవన్‌పై కూడా ఆమె విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పాలన బాగుందంటున్న పవన్‌.. ఇంకెవరిని ప్రశ్నిస్తారని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై కల్తీ ప్రేమ చూపిస్తే మూసీలో కలుపుతారన్నారు. కేసీఆర్‌ ఎందులో స్మార్ట్‌గా కనిపించారో పవన్‌ చెప్పాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్‌ పోరాడితే బాగుంటుందని విజయశాంతి సలహా ఇచ్చారు. 
కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆయన క్యారెక్టర్‌ మారిందన్న విజయశాంతి 
అలాగే కేసీఆర్‌పై కూడా ఆమె విమర్శలు చేశారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆయన క్యారెక్టర్‌ మారిందన్నారు. అధికారం శాశ్వతం కాదని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలన్నారు. ఇక మోదీపై కూడా ఆమె విమర్శలు చేశారు. అద్వానీని మోదీ వెన్నుపోటు పొడిచారన్నారు. ఇది తనకు ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందన్నారు విజయశాంతి. తెలంగాణలో బీజేపీ కథ ముగిసిందని... ఇక కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్యే పోటీ ఉంటుందన్నారు విజయశాంతి. ఇన్నాళ్లు అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. పార్టీ కోసం పని చేస్తానన్నారు. రాహుల్‌ ఆదేశాల మేరకు వేచి చూస్తున్నానన్నారు. తమిళనాడు రాజకీయాల్లో తాను యాక్టివ్‌ అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను తెలంగాణ బిడ్డనని... కేసీఆర్‌ను గద్దె దించేవరకు ఊరూరా తిరిగేందుకు సిద్దమన్నారు రాములమ్మ. మొత్తానికి చాలా గ్యాప్‌ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రాములమ్మ... గులాబీ సర్కార్‌పై సమరానికి సై అంటున్నారు. 

 

07:27 - January 26, 2018

హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దావోస్‌లో పర్యటిస్తున్న కేటీఆర్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కంపెనీలు ప్రారంభించడానికి పలు కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
ఆనంద్‌ మహీంద్రతో కేటీఆర్‌ సమావేశం 
దావోస్‌లో మహీంద్ర గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రతో కేటీఆర్‌ సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం- మహీంద్ర  సంస్థల మధ్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. వరంగల్ పట్టణంలో టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించాలన్న కోరడంతో.. అనంద్‌ మహీంద్రతో పాటు.. టెక్‌ మహీంద్ర కంపెనీ సీఆవో సిపి గుర్నానీలు అంగీకరించారు. మహీంద్ర సంస్ధ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో రెండవ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమలను తీసుకెళ్లడంలో ప్రేరకంగా పనిచేస్తుందని, ఈ నిర్ణయం తీసుకున్న అనంద్ మహీంద్రకు, సిపి గుర్నానిలకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 
సీఏ సంస్థ గ్లోబల్‌ సిఈవో మైక్‌ గ్రెగోరీతో భేటీ
మూడో రోజు ప్రముఖ కంపెనీ సిఏ సంస్ధ, గ్లోబల్ సియివో మైక్‌ గ్రెగోరీతో మంత్రి సమావేశం అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుందని, నగరంలో తమ కంపెనీ వృద్ది పట్ల తాము పూర్తి సంతృప్తికరంగా గ్రెగోరీ తెలిపారు. తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలు నగరాలతో పొల్చితే హైదరాబాద్ అత్యుత్తమ నగరమని, ముఖ్యంగా ట్రాఫిక్, ఏయిర్ పొర్ట్‌ కనెక్టీవీటీ, చౌకైన మౌళిక వసతులున్నాయని గ్రెగరీ ప్రసంశలు కురిపించారు. ఖచ్చితంగా తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కి ప్రాధాన్యత ఇస్తామన్నారు. 
ఫైజర్‌ వాక్సిన్‌ అధ్యక్షురాలుతో సమావేశం
ఫైజర్‌ వాక్సిన్‌ అధ్యక్షురాలు సుసాన్‌ సిలబెర్మన్‌తో కూడా కేటీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సినేషన్‌ మ్యాన్యూఫాక్చరింగ్‌ హబ్బుల్లో ఒకటిగా ఉందని.. దాదాపు 25 శాతం ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారు అవుతున్నాయని సుసాన్‌కు తెలిపారు. నగరంలో ఉన్న జినోమ్‌ వ్యాలీ, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మసీటీల గురించి వివరించారు. ఫైజర్‌ సంస్థ వాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరమైన అధ్యాయనానికి ఫైజర్‌ బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు.
ఎయిరో స్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఉపాధ్యక్షుడు రిచర్డ్‌తో భేటీ
ఎయిరో స్సేస్‌ దిగ్గజం లాక్‌ హీడ్‌ మార్టిన్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు  రిచర్డ్‌ అంబ్రోస్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. సంస్ధ ఇప్పటికే నగరంలో టాటాల భాగస్వామ్యంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని.. లాక్ హీడ్ మార్టిన్ స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరం అయిన ఈకో సిస్టమ్ ఉందని తెలిపారు. బల్గేరియా టూరిజం శాఖ మంత్రి నికోలినా అంగేల్‌ కోవాతో మంత్రి సమావేశం అయ్యారు. ఇరు ప్రాంతాల మధ్య స్టార్ట్‌ అప్‌, ఇన్నోవేషన్‌, టూరిజం రంగాల్లో ప్రొమోషన్‌ పైన చర్చించారు. 
ప్రముఖులను కలిసిన మంత్రి కేటీఆర్‌ 
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ప్యానెళ్ల తయారీ సంస్థ ట్రినా సోలార్‌ ఉపాధ్యక్షులు రొంగ్‌ ఫాంగ్‌ యిన్‌,  ఫీలీప్స్‌ సంస్థ ప్రతినిధులు,  అబ్రాజ్‌ గ్రూపు మేనేజింగ్‌ పార్టనర్‌ కీటో డి బోయర్‌లతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌, ఆదాని గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ ఆదాని, బజాజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌,  హీరో మోటో కార్ప్‌  సియివో పవన్‌ ముంజాల్‌, ఉదయ్ కోటక్, వెల్ స్పన్ గ్రూపు చైర్మన్ బికె గోయెంకా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వంటి ప్రముఖులను మంత్రి కేటీఆర్‌ కలిసారు.


 

07:23 - January 26, 2018

హైదరాబాద్ : ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఆయన సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిశారు. అలాగే ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ 'డస్సాల్ట్' గ్రూపుతో చంద్రబాబు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. విమానయాన రవాణాలో జీరో యాక్సిడెంట్స్ నమోదు చేసే సాంకేతికత అంశంపై తమకు సహకరించాలని ఈ సమావేశంలో  చంద్రబాబు కోరారు. రహేజా గ్రూపుకు చెందిన రవి రహేజాతో కూడా చంద్రబాబు సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్ తరహాలో అమరావతి, విశాఖ, హిందూపూర్‌లలో ఆఫీస్ భవనాలను నిర్మించాలని చంద్రబాబు రహేజాకు సూచించారు. సిరామిక్ ఉత్పత్తులలో అగ్రగణ్యులైన లిగ్జిల్‌ గ్రూప్‌కు చెందిన కిన్యా సెటో సీఈవోతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తానికి నవ్యాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. 

 

07:21 - January 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని.. ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సరళమైన విధంగా ఉండే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీల రూపకల్పన, భూ రికార్డుల ప్రక్షాళన తదనంతర కార్యక్రమాలు, ధరణి నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. 
పట్టణ, నగర ప్రాంతాల్లో సర్వే చేయాలని సూచన
తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని.. ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సిఎం సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీప్రక్షాళన చేయడంతో పాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు. మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5 నాటికే పాస్‌ పుస్తకాలు జిల్లాలకు చేరే విధంగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని చెప్పారు.
పాస్‌ పుస్తకాల మార్పులు
పాస్‌ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్‌ ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం చాలా కాలమ్స్‌ అనవసరమైనవే ఉండటంతో గందరగోళం ఏర్పడేది. ఏ కాలమ్స్ ఉంచాలి, ఏ కాలమ్స్ తీసేయాలి అనే విషయంలో విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. దానికనుగుణంగానే కొత్త పాస్‌ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్‌ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్‌ పుస్తకానికి ప్రత్యేక నెంబరు కేటాయించాలని నిర్ణయించారు.
భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం : కేసీఆర్‌
భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించిందని.. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంచు భూమి లెక్క దొరికిందన్నారు. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్‌-బి లో నిర్ణయం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నెంబర్ల తరహాలో ప్రత్యేక నెంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. 
భూ వివాదాలు తగ్గుతాయంటున్న ప్రభుత్వం
భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తున్నది. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావడానికి ఏమి చేయాలనే విషయంపై అధ్యయనం చేయాలని భావిస్తోంది. తెలంగాణ భూభాగంలోని ప్రతీ భూమి ఎవరి ఆధీనంలో ఉంది.. అందులో ఎలాంటి కార్యకలాపం జరుగుతుంది.. తదితర అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలని అధికారులకు సిఎం సూచించారు. దీనికోసం పాస్ పుస్తకాల తయారీ, రవాణా తదితర కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు. మార్చి 5 నాటికి జిల్లాలకు పాస్ పుస్తకాలు అందాలి అని..మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త పాస్‌ పుస్తకాలను పంపిణీ జరగాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

ముగిసిన సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. నేడు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 

07:10 - January 26, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 85 మందికి పద్మ పురస్కారాలు  ప్రకటించారు. సంగీతంలో మ్యూజిక్‌ మాస్ట్రోకు పద్మ విభూషణ్‌ ప్రకటించారు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు పద్మభూషణ్‌ అవార్డులు ప్రకటించారు. 
2018 ఏడాదికిగాను పద్మ అవార్డులు
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 2018 ఏడాదికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. విద్య, వైద్యం, కళలు, సామాజిక సేవ, సాహిత్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసినవారికి గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అవార్డులు ప్రకటించి గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 85 మందికి ఈ పద్మ పురస్కారాలు లభించాయి. 
పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు 
ఇక కళారంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకులు, తమిళనాడుకు చెందిన ఇళయరాజాకు,.. మహారాష్ట్రకు చెందిన గులాం ముస్తఫాఖాన్‌తో పాటు... సాహిత్యం, విద్యారంగంలో కేరళకు చెందిన పరమేశ్వరన్‌ను కేంద్రం పద్మవిభూషణ్‌ కేంద్రం ప్రకటించింది. ఇక భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో పాటు..  కర్ణాటకకు చెందిన పంకజ్‌ అద్వానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. అలాగే ఆధ్మాత్మికంలో కేరళకు చెందిన ఫిలిపోస్‌ మార్‌ క్రిసోస్టామ్‌, తమిళనాడులో పురావస్తుశాఖకు రామచంద్రన్‌ నాగస్వామి, కళలు, చిత్రలేఖనంలో గోవాకు చెందిన లక్ష్మణ్‌పయ్‌, కళలు, సంగీతంలో మహారాష్ట్రకు చెందిన అరవింద్‌ పారిఖ్‌, బీహార్‌కు చెందిన శారదా సిన్హాలకు పద్మ భూషణ్‌లు ప్రకటించారు. ఇక రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ కడకిన్‌, వేదప్రకాశ్‌ నందలకు కూడా పద్మభూషణ్‌లు దక్కాయి.
73 మందికి పద్మశ్రీ పురస్కారాలు 
ఇక 73 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. అవార్డు గ్రహీతల్లో 14 మంది మహిళలు ఉన్నారు. విద్యారంగంలో మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్‌గుప్తా, వైద్యరంగంలో కేరళకు చెందిన ఎం.ఆర్‌.రాజగోపాల్‌, లక్ష్మి కుట్టి, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి దోడెన్‌, కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మలకు పద్మశ్రీ ప్రకటించారు. అలాగే కళారంగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జ శ్యామ్‌, మహారాష్ట్రకు చెందిన విజయలక్ష్మి నవనీత కృష్ణన్‌లకు పద్మశ్రీ లభించింది. ఇక సామాజిక సేవారంగంలో బంగాల్‌కు చెందిన 98 ఏళ్ల సుదాను్ష బిశ్వాస్‌, సుబాషిణి మిస్త్రీలకు క్రీడారంగంలో మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్‌ పేట్కర్‌, సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రంగంలో తమిళనాడుకు చెందిన రాజగోపాల్‌ వాసుదేవన్‌ తదితరులకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 

 

07:04 - January 26, 2018

ఉమ్మడి కరీంగనర్‌ : జిల్లా వ్యాప్తంగా జాతీయ భావం ఉట్టిపడుతోంది. జిల్లాలోని పలు చోట్ల జనగణమన గీతాలపనతో సరికొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలోనే ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాలకు జమ్మికుంట వేదికగా శ్రీకారం చుట్టారు. నిత్య జనగణ పాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిత్యజనగణపై 10 టివి స్పెషల్‌ స్టోరీ... 
జమ్మికుంట వేదికగా నిత్య జాతీయగీతాలాపన
ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంచాలన్న తలంపుతో వినూత్న ప్రయత్నానికి కరీంనగర్ జిల్లా జమ్మికుంట వేదికగా నిలిచింది. అక్కడి సీఐ పింగిలి ప్రశాంత్‌ రెడ్డి తన ఆలోచనలతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి నిత్యజనగణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్‌ 
గతేడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సామూహిక నిత్య జనగణమన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జమ్మికుంటలో చేపట్టిన ఈ కార్యక్రమంతో జాతీయ స్థాయి గుర్తింపు కరీంనగర్‌ జిల్లాకే వచ్చిందనే చెప్పాలి. ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణమంతా జనగణమన గీతాలపాన జరుగుతుంటే పట్టణ వాసులు నిలబడి గీతం పూర్తయ్యే వరకు తమలోని గౌరవాన్ని చాటుకుంటున్నారు.                 జాతీయ మీడియాని ఆకట్టుకున్న కార్యక్రమం
జమ్మికుంట స్పూర్తితో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా నిత్యం జాతీయ గీతం ఆలపించే సంస్కృతి క్రమేపీ పెరుగుతోంది. జాతీయ మీడియా ప్రశంసలు అందుకోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమంపై చర్చ సాగుతోంది. దీంతో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో జనగణమన కార్యక్రమం నిత్యం కొనసాగుతోంది.
సోషల్‌ మీడియాలో విస్త్రత ప్రచారం
సోషల్‌ మీడియాలో కూడా ఈ కార్యక్రమం పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రభావం గ్రామాలకు కూడా చేరుకోవడం విశేషమనే చెప్పాలి. రాజన్న జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో అక్కడి కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ నిత్య జనగణమన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 
గోదావరి ఖని, కరీంనగర్‌లో నిత్య జాతీయగీతాలాపన
మరోవైపున జాతికి వెలుగులనందించడంతో పాటు.. నల్ల బంగారు గని  గోదావరిఖని పట్టణం.. చైతన్య స్పూర్తిని అందించే కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌ లోని వ్యాపారస్థులు కూడా ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. నిత్యం ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
యావత్‌ దేశానికే ఆదర్శం
ఏది ఏమైనా స్వతంత్రం కోసం నాడు ప్రాంతీయోద్యమంతో పాటు.. జాతీయోద్యమంలో పోరాటం చేసేందుకు ఎందరో యోధులను అందించిన కరీంనగర్‌.. నేడు జాతీయ గీతం నిత్యం ఆలపించే సంస్కృతిని ఆరంభించి.. యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమనే చెప్పాలి. ఒక సీఐగా పనిచేస్తున్న ప్రశాంత్‌ రెడ్డి ఆలోచన యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణం. రానున్న కాలంలో ప్రతి పల్లె.. పట్టణం జాతీయ గీతం ఆలపించడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం పెంపొందాలని మనమూ ఆశిద్దాం.

 

07:00 - January 26, 2018

గుంటూరు : గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమరావతి విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతోంది. అసెంబ్లీ, సచివాలయం రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉదయం 7.45గం.లకు అసెంబ్లీ ప్రాంగణంలోని లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ వద్ద రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు ఎన్‌.ఎం.డి ఫరూక్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే ఉదయం 8గం.లకు అసెంబ్లీ ప్రాంగణంలోని అసెంబ్లీ హాల్‌ వద్ద శాసన సభాపతి డా.కోడెల శివ ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం 11.30 గం.లకు వెలగపూడి సచివాలయం మొదటి బ్లాకు ఎదుట ప్రభుత్వ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

 

06:57 - January 26, 2018

విజయవాడ : గణతంత్ర వేడుకల కోసం విజయవాడ నగరం ముస్తాబయింది. వేడుకలకు విచ్చేసే అతిథుల కోసం అధికారులు దగ్గరుండి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకల్లో 16వేల మంది చిన్నారులు, విద్యార్థులు త్రివర్ణ పతాక వర్ణాల దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధం 
ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమయ్యింది. ఇందుకోసం వారం రోజుల నుండే పోలీసులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్  నరసింహన్ తో పాటు ఇతర వీఐపీలు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. దళాల కవాతు, ఇతర కార్యక్రమాలకు రిహార్సల్స్‌ను నిర్వహిస్తున్నారు. 
ఏర్పాట్లను స్వతహాగా పరిశీలించిన గౌతం సవాంగ్‌ 
నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ ఏర్పాట్లను స్వతహాగా పరిశీలించి, పలు సూచనలు చేశారు. రాష్ట్రం నలు మూలల నుండి వచ్చే అతిథులను ప్రోటోకాల్‌ విధానం, వారి సదుపాయాల విషయంలో తీసుకునే జాగ్రత్తలను ఇప్పటికే సంబంధిత అధికారులను వివరించారు. అతిథుల భద్రత కోసం సుమారు వేయి మందికి పైగా పోలీసు బలగాలను నగరానికి రప్పించారు. అదనపు బలగాలను బృందాలుగా విభజించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, బయట ప్రత్యేకమైన బాంబు స్క్వాడ్‌, నిఘా వర్గాలు అనుక్షణం పహారా కాసేలా చర్యలు తీసుకున్నారు. 
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శకటాలు      
రిపబ్లిక్ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వివిధ శాఖలకు చెందిన శకటాలను సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 16వేల మంది విద్యార్ధులు తివర్ణ పతాకాన్ని తలపించేలా చిన్నారులు దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఒడిస్సా నుంచి ప్రత్యేక బృందం కవాతు ప్రదర్శనలో పాల్గోనున్నారు. గణతంత్ర్య వేడుకల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్ట్‌ చేశామన్నారు విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌. ఈ వేడుకలకు నగర ప్రజలు పాల్గొనవచ్చని వారికోసం ప్రత్యేకంగా గ్యాలరీలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

 

06:53 - January 26, 2018

ఢిల్లీ : 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూలమార్పులు అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఇందుకు కోసం భారీగా నిధులు కేటాయించాలని కోరారు. 69 రిపబ్లిక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని  రాష్ట్రపతి దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. 21వ శతాబ్దంలో రోబోటిక్స్‌, జెనెటిక్స్‌, ఇన్ఫర్మాటిక్స్‌ రంగాలే కీలకమని, ఇందుకు అనుగుణంగా మన యువతను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. నైఫుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మరో వైపు పేదరికం,  పిల్లల్లో పోషకారలోపం దేశానికి శాపంగా పరిణమించాయని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

 

10 టివి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్ : నేడు 69వ గణతంత్ర దినోత్సవం. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం జరుపనున్నారు. 10 టివి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 

Don't Miss