Activities calendar

27 January 2018

21:26 - January 27, 2018

హైదరాబాద్ : నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ అగ్ర నాయకత్వం.. శ్రీనివాస్‌ది ముమ్మాటికీ రాజ‌కీయ‌ హ‌త్య అని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో ష‌బ్బీర్ అలీ, వీహెచ్, కోమ‌టిరెడ్డి సోద‌రులు, మ‌ల్లు ర‌వి అక్కడ నుంచి డీజీపీ ఆఫీస్‌ వ‌ర‌కు పాదయాత్రగా వెళ్లి ఫిర్యాదు చేశారు.

నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశమే ... శ్రీనివాస్‌ను హత్య చేయించారని కాంగ్రెస్‌ నాయకులు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి వివ‌రించారు. గ‌త కొన్ని రోజులుగా వీరేశం కాంగ్రెస్ నేత‌ల‌ను బెదిరిస్తున్నార‌ని.. పార్టీలో చేర‌క పోతే.. చంపేస్తామ‌ని బెదిరించార‌ని డీజీపీకి తెలిపారు. తక్షణమే దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సీబీఐతో విచార‌ణ చేయించాలని డిమాండ్ చేశారు. రాజకీయ హత్యలను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోందని.. దీనికి పోలీసులు సహకరిస్తున్నారని.. కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలపై న్యాయస్థానానికి వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. టీఆర్‌ఎస్‌ ఆగడాలను అడ్డుకుంటామని .. హస్తం నేతలు హెచ్చరించారు. 

21:24 - January 27, 2018

అనంతపురం : తుది శ్వాస వరకూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను ఓటు అడగటానికి రాయలసీమకు రాలేదని.. త్రికరణ శుద్ధిగా తాను రాయలసీమకు పనిచేస్తానని భావిస్తే తనను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. 'చలోరే.. చలోరే చల్‌' కార్యక్రమంలో భాగంగా పవన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. 2019 ఎన్నికల్లో యువత ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందనేది బలంగా వినిపించేలా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు.

రాయలసీమ కరవు సమస్యలను తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతలో కరవు పరిస్థితులపై పలువురు రైతులు, వ్యవసాయ, నీటిపారుదల రంగ నిపుణులతో సమావేశం నిర్వహించారు పవన్ కల్యాణ్. కరువు నివారణ చర్యలపై రైతులు, నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్ హామీ ఇచ్చారు. తాను నటుడు కాకముందు ఒకరైతునని రైతుల కష్టాలు తనకు తెలుసునని పవన్ చెప్పుకొచ్చారు. రైతు కన్నీరు పెడితే.. అది పాలకులకు శాపంగా మారుతుందని పవన్ కల్యాణ్‌ అన్నారు. తనకు ప్రాణం ఉన్నంతవరకూ రాయలసీమకు అండగా ఉంటాన్నారు పవన్ కల్యాణ్. రాయలసీమను కరవునేలగా కాకుండా సస్యశ్యామలమైన నేల అని అందరూ చెప్పుకునేంత వరకూ కృషి చేస్తానన్నారు. రాయలసీమ అభివృద్ధికి త్రికరణశుద్ధిగా తన శక్తి మేరకు కృషి చేస్తానన్నారు పవన్ కల్యాణ్. తాను ఓట్లు అడిగేందుకు రాలేదని.. రాయలసీమను, ఏపీకి అండగా ఉంటానని అందరూ బలంగా నమ్మితే చాలాన్నారాయన. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ సమస్యలపై ప్రధానిని కలవడానికైనా సిద్ధమన్నారు పవన్ కల్యాణ్. తన పద్ధతి చాలామందికి నచ్చదని అన్నారు. తను ఏ పార్టీకీ తొత్తులా పనిచేయట్లేదని.. సమస్య పరిష్కారం కోసం ఒక్కోసారి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పవన్ అన్నారు. ఇక చివరి అస్త్రంగా పోరాటాలకు దిగాలని పవన్ అన్నారు.

యువతకు ఆవేశం తప్ప ఆలోచన లేదని చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉందన్నారు పవన్ . తాను నమ్మేది యువరక్తాన్నేనని 2019 ఎన్నికల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారనేది యువత బలంగా వినిపించేలా పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మరోవైపు పవన్ పర్యటనకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫ్యాన్స్‌ను కట్టడి చేస్తున్న పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు హత్తుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు షాకయ్యారు. అతనిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. అయితే పవన్‌తో సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని ఉత్సాహాన్ని చూపి పవన్ అతని ఫోన్ తీసుకుని సెల్ఫీ తీశారు. ఆదివారం పవన్ అనంతపురం జిల్లా కదిరిలో పర్యటిస్తారు. కదిరి నర్సింహస్వామిని దర్శించుకున్న అనంతరం కరవు పరిస్థితులపై స్ధానికులతో చర్చిస్తారు. 28 సాయంత్రం 4:30 గంటలకు పుట్టపర్తి సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న అనంతరం పవన్ రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు. 

టెట్ వాయిదా..

హైదరాబాద్ : టెట్ ను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీలో ఫిబ్రవరి 21 నుండి మార్చి 3 వరకు టెట్ నిర్వహించనుంది. మార్చి 4న కీ విడుదల చేయనున్నారు. 4-9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 

21:08 - January 27, 2018

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. విజయం దిశగా దూసుకెళుతున్న సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అదరగొట్టారని చెప్పవచ్చు. 241 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్‌ ఆరంభించారు. హషీమ్ ఆమ్లా (52) రాణించగా ఓపెనర్ ఎల్గర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 86 (నాటౌట్) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ వీరి పోరాటం నెరవేరలేదు. భారత బౌలర్లు రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్లలో షమీ 5 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్‌కి ఒక వికెట్ దక్కాయి. దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్‌మెన్‌లో మార్క్‌రం 4, ఆమ్లా 52, డివిల్లియర్స్ 6, డుప్లెసిస్ 2, డికాక్ 0, ఫిలెండర్ 10, ఆండిలె 0, రబాడా 0, మార్కెల్ 0, ఎన్గిడీ 4 పరుగులు చేశారు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులు.. దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 247 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 177 పరుగులకి ఆలౌట్ అయింది. కాగా, మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులను దక్షిణాఫ్రికా గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

21:02 - January 27, 2018

'కొత్తపల్లి గీత' ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు మరియు అరకు లోక్ సభ సభ్యురాలు. వైసీపీ పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ నుండి బయటకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుపై ఆమెతో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆమె అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వ్యక్తికి ఎలాంటి కష్టం..సమస్యలు ఎదురైనా పార్టీ అధ్యక్షుడు స్పందించాల్సి ఉంటుందని, ఈ విషయంలో జగన్ స్పందించలేదని ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు త్యాగం చేయాల్సిందేనని, తాను కూడా ఎంతో కోల్పోయానని తెలిపారు. 2015 సెప్టెంబర్ లో తన పేరు సీబీఐ చేర్చిందని, ఫేక్ డాక్యుమెంట్ అనుకుంటుంటే డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉండేదని..ఎందుకు క్యాన్సిల్ చేయలేదని ప్రశ్నించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో తాము చిన్న లోన్ తీసుకోవడం జరిగిందని..మిగతా రూ. 500 నుండి రూ. 2000 వేల కోట్లు ఉన్నాయన్నారు. తాను ఇంతవరకు అమరావతిలో అడుగు పెట్టలేదని..సీంఎ అందరి వాడని..అందులో ఆయనను కలవడంలో తప్పేంటీ ? అని ప్రశ్నించారు. అమరావతిపై చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారని, కానీ ఇతర అంశాలపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వ పనితీరు బాగాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అసలు అప్పేమి లేదని, తలసాని విషయం ఏమి మాట్లాడదలుచుకోలేదన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

భారత్ విజయం...

ఢిల్లీ : మూడో టెస్టులో భారత్ విజయం సాధించింది. 63 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో నలుగురిని భారత బౌలర్లు డకౌట్ చేశారు. 

భారత్ విజయం...

ఢిల్లీ : మూడో టెస్టులో భారత్ విజయం సాధించింది. 63 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో నలుగురిని భారత బౌలర్లు డకౌట్ చేశారు. 

20:32 - January 27, 2018

'మల్లన్న ముచ్చట్లు' టెన్ టివి కార్యక్రమంలో ప్రసారమవుతూ వస్తోంది. ప్రజల కష్టాలు..వారి బాధలు..వారి సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బడుగు..బలహీన వర్గాలకు జరిగే అన్యాయాన్ని టెన్ టివి ఎలుగెత్తి చాటెత్తుతోంది. అందులో ప్రధానంగా 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో ఎన్నో సమస్యలను 'మల్లన్న' వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. మరి ప్రజలు ఏమి చెప్పారు ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:47 - January 27, 2018

సాయి ధరమ్‌ తేజ్‌ నెక్ట్స్ మూవీ ఇంటెలిజెంట్‌ టీజర్ రిలీజైంది. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి కథానాయిక. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ శనివారం విడుదల చేశారు. టీజర్‌ మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో నిండిపోయింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

19:46 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ద్రవిడ పార్టీ నేతలు... జీయర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. హిందూ దేవుళ్లపై డిఎంకె ఎంపి కనిమొళి చేసిన వ్యాఖ్యలను జీయర్లు తీవ్రంగా ఖండించారు. హిందూ మతం, సాంప్రదాయాలపై దాడులు జరుగుతుంటే మౌనం వహించకుండా ఎదురుదాడికి దిగాలని శ్రీవిల్లీపుత్తూరిలోని ఆండాల్‌ సన్నిధికి చెందిన ఓ జీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. దీనిపై కనిమొళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీయర్లంటే తమకు గౌరవం ఉండేదని...సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్లే ఇపుడు రాళ్లు, కత్తులు పట్టుకుని హింసకు దిగుతామని హెచ్చరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 

19:44 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిఎంకెతో పాటు వామపక్షాలు, తమిళ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సామాన్యులకు భారంగా మారిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్, సిపిఎం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ కార్యదర్శి ముత్తరన్, ఎండిఎంకె వైగో, విసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్‌ నేత తిరునావుక్కరసు నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

19:42 - January 27, 2018

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థానికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానివ్వమంటూ దర్శకుడు, తమిళన్‌ పార్టీ నేత సీమన్ హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్‌కు నిజంగా దమ్ముంటే కర్ణాటకకు వెళ్లి తాను తమిళుడినని ప్రకటించాలని సవాల్‌ విసిరారు. 44 ఏళ్లపాటు తమిళనాడులో ఉన్నంత మాత్రాన రజనీ తమిళుడు కాదని సీమన్‌ స్పష్టం చేశారు. సినిమాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇపుడు రాజకీయాలంటూ ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కనిమొళి వ్యాఖ్యలను ఖండించిన జీయర్లు...

చెన్నై : తమిళనాడులో ద్రవిడ పార్టీ నేతలు... జీయర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. హిందూ దేవుళ్లపై డిఎంకె ఎంపి కనిమొళి చేసిన వ్యాఖ్యలను జీయర్లు తీవ్రంగా ఖండించారు.

బస్సు ఛార్జీలు పెంచడంపై విపక్షాల ఆందోళన...

చెన్నై : తమిళనాడులో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిఎంకెతో పాటు వామపక్షాలు, తమిళ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. 

రజనీకాంత్ పై విమర్శలు...

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థానికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానివ్వమంటూ దర్శకుడు, తమిళన్‌ పార్టీ నేత సీమన్ హెచ్చరిస్తున్నారు

19:37 - January 27, 2018

నల్గొండ : మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ హత్యపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలంటూ కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జడ్పీటీసీలంతా నల్ల బ్యాడ్జీలు ధరించి జడ్పీ సమావేశానికి హాజరై తన నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ హత్యకు టీఆర్ఎస్ నేతలే కారణమంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీలు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన జడ్పీ ఛైర్మన్ తుల ఉమ.. కాంగ్రెస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించిన విషయం కానప్పుడు సమావేశంలో ఎలా చర్చిస్తారంటూ మండిపడ్డారు. 

కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశం రసాభాస..

నల్గొండ : మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ హత్యపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలంటూ కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. 

19:34 - January 27, 2018

విశాఖపట్టణం : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకై ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేపట్టిన 48 గంటల రైలు దీక్షకు సీపీఎం, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌లో కొణతాలను కలిసిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. కేంద్రం విభజన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలన్నారు.

19:32 - January 27, 2018

కామారెడ్డి : బిచ్కుంద మండల్‌ వాజిదనగర్‌లో ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా డబ్బులు కోసం రైతులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 2016 మార్చ్‌లో వచ్చిన వడగండ్ల వాన వల్ల నేలకొరిగిన పంటకు తాము ముందుగానే ప్రీమియం చెల్లించినా.. ఇప్పటికీ తమకు బీమా రాలేదని రైతులు వాపోయారు. తమ బాధను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పంట నష్టాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.

19:30 - January 27, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను నష్టపరుస్తున్న కేంద్ర విధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎంలతో దోస్తీ చేస్తూ కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆర్ధిక వ్యవస్థను పురోగమనం దిశగా వెళ్లాలంటే కేంద్రం తమ తప్పుడు నిర్ణయాలను సవరించుకుని ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు డిమాండ్ చేశారు.

తెలంగాణ సీపీఎం రాష్ట కమిటీ సమావేశాలు హైదరాబాద్ ఎంబీ భవన్ లో జరిగాయి . ఈ సమావేశానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డిలతో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట, జాతీయ మహాసభల నిర్వహణపై చర్చ జరిగింది.

కేంద్రం ఆర్ధిక విధానాల్లో తీసుకొస్తున్న ప్రైవేటైజేషన్ చర్యల్ని తెలంగాణ ప్రభుత్వం సమర్ధిస్తూ వస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఓవైపు బీజేపీతో దోస్తీ చేస్తూనే.. మరోవైపు ఎంఐఎంతో దోస్తీ చేస్తూ కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసమే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు అన్న తమ్మినేని... ఫిబ్రవరిలో నల్లగొండలో జరిగే సభల్లో ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.. సీపీఏం పొలిట్‌బ్యూరో సభ్యలు బీవీ రాఘవులు. రాష్ట్రంలో ఎగుమతులు దిగుమతులను పెంచడానికి డ్రైపోర్టులపై దృష్టిపెట్టాలన్నారు. డ్రైపోర్టుల ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ఉన్న సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాఘవులు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు తెచ్చుకునేందుకు కేసీఆర్‌ కృషిచేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం కోసం ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలోపేతానికి సీపీఎం ప్రయత్నాలు ప్రారంభించింది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నల్గొండలో జరుగనున్న ఈ సభలకు సంబంధించిన పోస్టర్‌ను సీపీఎం నేతలు ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ అభివృద్ధి జరగదని సీపీఎం అభిప్రాయపడుతోంది. ఇపుడు బీఎల్‌ఎఫ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 

19:28 - January 27, 2018

విజయవాడ: బీజేపీ పొత్తుపై ఏపీసీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని. ఈ విషయంలో కమలనాథులే ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. తమ పార్టీ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని చెప్పారు. బీజేపీ వాళ్లు పొత్తు వద్దనుకుంటే నమస్కారం పెట్టి తమ దారి తాము చూసుకుంటామని చంద్రబాబు అన్నారు. జగన్‌ తనపైన వచ్చిన కేసులు మాఫీ చేయించుకోవడం కోసమే బీజేపీతో కలిసివెళ్లేందుకు సిద్ధపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జగన్‌ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేస్తామనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. జగన్‌ ఏ మాట మీదా నిలబడరని వ్యాఖ్యానించారు. హోదా కోసం గతంలో ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారని మరి ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి ఎలా మద్దతిచ్చారని అన్నారు. జగన్‌ తనపైన వచ్చిన కేసులు మాఫీ చేయించుకోవడం కోసమే బీజేపీతో కలిసివెళ్లేందుకు సిద్ధపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి పరులు దోచుకున్న సొమ్ము ప్రజలకు చెందాలని సీఎం అన్నారు.

తనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా.. దావోస్‌ పర్యటనకు వెళ్లానని సీఎం చంద్రబాబు అన్నారు. తన కుడి చేయి పనిచేయలేదని.. ఫిజియోథెరఫీ చేసుకుని మరీ దావోస్‌ వెళ్లానన్నారు. ప్రజల కోసం తాను కష్టపడుతుంటే విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయన్నారు. మొత్తంగా దావోస్‌ పర్యటన సక్సెస్‌గా ముగిసిందని సీఎం చంద్రబాబు అన్నారు. మెడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా సింగపూర్ నుంచి 50సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయని వివరించారు. వినూత్న ఆవిష్కరణల వేదికగా విశాఖపట్నంలో మెడ్ టెక్ సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. ఇన్నోవేషన్ వ్యాలీగా ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రకృతిని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ప్రకృతి ఆరాధన కోసం పలు కార్యక్రమాలు చేపట్టామని.. తాజాగా సూర్య ఆరాధనను చేపట్టనున్నట్లు చెప్పారు. ఇక నుంచి రాష్ట్ర అభివృద్ధికి సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో కొత్త నినాదం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. 

మళ్లీ ఓలా క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు పిలుపు..

హైదరాబాద్ : మళ్లీ ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టనున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు సన్నద్ధమయ్యారు. ముందస్తుగా ఓలా యాజమాన్యం బౌన్సర్లను రంగంలోకి దింపింది. బౌన్సర్లతో కార్యాలయం నడిపిస్తున్నారని కేపీహెచ్ బి పోలీసులకు ఓలా డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. 

జగన్ 72వ రోజు పాదయాత్ర ముగింపు..

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. గూడురు నియోజకవర్గం తిమ్మసముద్రం క్రాస్‌ వద్ద 72వ రోజు ప్రజా సంకల్ప యాత్రను ముగించారు. 

ఆగని అల్లర్లు...

ఉత్తర్ ప్రదేశ్ : కాస్ గంజ్ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున చెలరేగిన అల్లర్లు శనివారం రోజున తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు పలు దుకాణాలకు, బస్సులకు నిప్పు పెట్టారు. 

బాబు వ్యాఖ్యలపై పురంధేశ్వరీ స్పందన..

హైదరాబాద్ : ఏపీ సీఎం బాబు వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. తాము మిత్రధర్మం పాటించలేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని, తమతో కలసి ఉంటారో, ఉండరో అనే విషయాన్ని టీడీపీనే తేల్చుకోవాలని తేల్చిచెప్పారు. 

19:09 - January 27, 2018
18:28 - January 27, 2018

విజయవాడ : 2019లోనూ మోదీనే ప్రధానమంత్రి అవుతారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. NDA పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగాయన్న వార్తలను ఆయన ఖండించారు. గతంలోనూ దళితులపై దాడులు జరిగాయని.. ఇప్పుడు కొత్తగా ఏం జరగడం లేదన్నారు . 

ఇద్దరు నక్సల్స్ మృతి...

సుక్మా : జిల్లాలో కోబ్రా 201, జిల్లా ఫారెస్టు భద్రతా సిబ్బంది జరిపిన జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. వీరివద్ద రెండు గన్స్, ఇతర సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. 

17:53 - January 27, 2018

హైదరాబాద్ : భాగ్యనగరం.. హైదరాబాదులో ప్రయాణం అంటే నరకమే... అన్న విషయం తెలియని వారుండరు. అందునా ఆర్టీసీ బస్సులో ఐతే ప్రత్యక్ష నరకమే. బస్సులోపలే కాదు.. బస్సు ఎక్కడానికి ముందు కూడా సమస్యలే... సరైన షెల్టర్లు లేక ఎండకు ఎండుతూ... వానకు నానుతూ... వచ్చిన బస్సును అందుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మోడరన్‌ బస్టాపులు... ప్రత్యేక బస్‌బేలంటూ.. బల్దియా చెబుతున్న మాటలు నీటి మూటలను తలపిస్తున్నాయి. అసలు తాము ఎక్కాల్సిన బస్సుకోసమే ప్రయాణీకులు గంటల పాటు ఎదురు చూడాలి. పోనీ... ఓపిక పట్టి ఎదురు చూద్దామనుకున్నా... సరైన షెల్టర్ ఉండదు. ఎండాకాలంలో మండుటెండలో.. వర్షాకాలంలో జోరువానలో ప్రయాణీకులకు తిప్పలు తప్పడంలేదు.. చాలా చోట్ల రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.

నగరంలో బస్‌ బేల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి రోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణీకులను... గమ్యస్థానాలకు చేర్చడానికి 3800 బస్సులు తిరుగుతున్నాయి. కానీ వాటిని నిలపడానికి ఏదో కొన్ని చోట్ల మినహా... మరెక్కడా స్థలం లేదు. అటు డ్రైవర్లతోపాటు ఇటు ప్రయాణీకులకు కూడా ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే సారి ఎక్కువ బస్సులు వచ్చాయంటే.. పరుగులు తీసే ప్రయాణీకుల అవస్థలు మాటల్లో చెప్పలేం.

ఎన్నేళ్ళు గడుస్తున్నా.. నగరంలో బస్‌షెల్టర్ల నిర్మాణం పూర్తికావడం లేదు. పదేళ్ళక్రితం బస్‌షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది ఆర్టీసీ. 1832 బస్టాపులు అవసరమని బల్దియాకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. బస్టాపుల నిర్మాణాన్ని యాడ్‌ ఏజెన్సీ ద్వారా బిల్ట్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌పర్‌ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు.. ఐదు సార్లు టెండర్లు నిర్వహిస్తే... కేవలం 840 బస్‌ షెల్టర్ల నిర్మాణమే జరిగింది. పలు ప్రాంతాల్లో షెల్టర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన యాడ్‌ ఏజెన్సీలు..యాడ్స్‌పై ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాల్లో మాత్రమే నిర్మించారు. బస్‌షెల్టర్ల నిర్మాణాలు అతివృష్టి.. అనావృష్టి తీరులో చేపట్టారు. ఒకటీ లేదా రెండు షెల్టర్లు మాత్రమే అవసరమైన చోట్ల అవసరానికి మించి

నిర్మించాయి యాడ్‌ కంపెనీలు. ప్రస్తుతం 1200 ప్రాంతాల్లో బస్‌ షెల్టర్ల కొరత ఉందంటున్నారు అధికారులు.
బస్‌బేల నిర్మాణంకోసం... దాదాపు రెండేళ్ళ క్రితం నుంచీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో 55 ప్రాంతాల్లో బస్‌బేల నిర్మాణానికి అధికారులు ప్రాథమికంగా స్థలాలను గుర్తించారు. వాటిని తమకు అప్పగించాలంటూ సంబంధిత శాఖలకు అర్జీలు కూడా పంపారు. బస్‌బేలు, బస్టాపుల నిర్మాణం, నిర్వహణల అధ్యయనం కోసమంటూ... ప్రజా ప్రతినిధులు, అధికారులు స్టడీ టూర్‌లకు తిరిగి వస్తున్నారు కానీ.... సమస్యకు మాత్రం చెక్‌ పెట్టడం లేదు.. మరికొద్ది నెలల్లో రానున్న వేసవి కాలానికైనా... ఈ సమస్య తీరుతుందో లేదో అధికారులు చెప్పాలి..

17:48 - January 27, 2018

నిజామాబాద్ : జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కు కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా.. వివిద శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నెలల తరబడి ఈ పనులు కొనసాగుతుడంటంతో నిత్యం వాహనదారలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు కొన్ని ప్రాంతాల్లొ పూర్తి అయినప్పటికి అక్కడ రోడ్లు వేయకపోవడంతో.. దుమ్ము, ధూళీతో జనం సతమతమవుతున్నారు. నిజామాబాద్‌ నగరంలో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం ప్రభుత్వం 145 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ పనులు వచ్చే జూన్‌ నెల వరకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల జేబులు నింపుతూ.. ఇష్టారీతిన రోడ్లను తొవ్వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మొదటగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పైపులు వేసి.. ఆ వెంటనే మిషన్‌ భగీరథ పనులు మొదలు పెట్టారు. ప్రధాన మార్గాల గుండా ఈ పైపు లైన్లు వేయటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. పనులు పూర్తి అయిన ప్రాంతాలలొ రోడ్లు వేయకుండా.. మరమ్మత్తులు చేపట్టకపొవటంతొ వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో బీజేపీ-టీ మాస్‌ ఫోరం నేతలు పనులు త్వరగా పూర్తి చేయాలంటూ.. మున్సిపల్‌, కలెక్టరేట్‌ కార్యాలయ ఎదుట ఆందోళనలు చేపట్టారు.

ఆందోళనలు చేపట్టినా సంబంధిత శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. నగరంలో పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారులు నిర్ణీత సమయాన్ని నిర్ణయించి పనులను పూర్తిచేయించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరగడంలేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమావేశమై.. పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్లు ఎలాంటి సూచనలు లేకుండానే పనులు మొదలు పెట్టారు. పగటి సమయంలో పనులు చేస్తుండటంతో దుమ్ము, ధూళి ఎగసిపడుతుందని.. దీంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడుతున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 75కోట్లు మంజూరు చేసినా.. పాలక మండలి, మున్సిపల్‌ అధికారులు పనుల్ని ఎందుకు త్వరగా చేయడంలేదో అర్ధం కావడం లేదని.. నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్‌ చేశారు. నగరంలో ఎటు చూసినా దుమ్ము, ధూళి ఎగిసిపడుతుండటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి.. పనులు వేగంగా జరిగేలా చూడాలని ప్రజలుకోరుకుంటున్నారు.

17:43 - January 27, 2018

మహబూబ్ నగర్ : ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఊపుమీదున్న కాంగ్రెస్‌లో... ఇప్పుడు ఆ చేరికలే సెగ రేపుతున్నాయి... పార్టీబలోపేతానికి పీసీసీ చేస్తున్న ప్రయత్నాలకు.... స్థానిక నేతల ఆదిపత్య పోరు అడ్డంకిగా మారింది. తాజాగా పాలమూరు జిల్లాలో చేరికల గొడవ హస్తినకు చేరడం కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్న వరంగల్‌.. నిన్న నల్గొండ జిల్లాల్లో రేగిన చేరికల లొల్లి... తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు పాకింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని నేతగా వెలిగిన నాగం జనార్దన్‌ రెడ్డి.... కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.. అందుకోసం సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి ద్వారా ఢిల్లీనుంచి లైన్‌ క్లియర్‌ చేయించుకున్నారు.

మార్చి నెలలో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు నాగం... కానీ ఆయన చేరికను ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వినిపిస్తున్న వ్యతిరేక గళానికి మాజీ మంత్రి డీకే అరుణ మద్దతు కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. నాగం చేరికను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్న డీకే అరుణ... నేతలను కూడగట్టి హస్తినలో మకాం వేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉంటూ.. ముఖ్య నేతల ముందు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉండి... కాంగ్రెస్‌ పార్టీపైనా, కార్యకర్తలపైనా పోరాటాలు చేసిన వారు... ఇప్పుడు తమ స్వార్థానికి కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీకే అరుణ వాదిస్తోంది. తమ కృషి వల్లే పార్టీ బలంగా ఉందంటున్నారు డీకే. మరోవైపు పీసీసీ ముఖ్యనేతలు డీకే అరుణ వాదనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాగర్‌ కర్నూలులో ఇప్పటివరకూ నాలుగు సార్లు పోటీ చేసి ఓడినా కూడా... దామోదర్‌రెడ్డికి జడ్పీ ఛైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌ పార్టీ కట్టబెట్టిందని గుర్తు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ గా గెలిపించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

దామోదర్‌రెడ్డి తనకోసం కాకుండా తన కుమారునికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటే..... అందుకు అరుణ మద్ధతు పలకడం విడ్డూరంగా ఉందంటున్నారు పీసీసీ ముఖ్య నేతలు. నాగం లాంటి సీనియర్‌ నేత చేరికతో పార్టీకి ఉపయోగమే అంటున్నారు. కాబట్టి ఆయన రాకను అడ్డుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తున్నారు. నాగం చేరిక అభ్యంతరాలపై స్పందించిన హై కమాండ్‌... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను హస్తినకు పిలిపించి చర్చించినట్లు సమాచారం. మొత్తానికి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

17:42 - January 27, 2018
17:40 - January 27, 2018

నిజామాబాద్ : జిల్లాలో వీడీసీలు, గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో ఫ్యూడల్ రాజకీయాలు చేస్తున్నారని టీ-మాస్ జిల్లా కన్వీనర్‌ పెద్ది వెంకటరాములు విమర్శించారు. వీడీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే గ్రామ బహిష్కరణ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వీడీసీలను, గ్రామ అభివృద్ధి కమిటీలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ముందు టీ మాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లేదంటే ఉద్యమిస్తామని పెద్ది వెంకటరాములు హెచ్చరించారు. 

17:35 - January 27, 2018

సంగారెడ్డి : వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సంగారెడ్డి జైలు మ్యూజియంగా మారాక సందర్శకుల తాకిడి మొదలైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 500రూపాయలు చెల్లించి 24 గంటలపాటు ఇక్కడ జైలులో గడిపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న కింగ్ యాంగ్ అనే డెంటిస్ట్.. కెల్విన్ ఓంగ్ అనే రెస్టారెంట్ ఓనర్‌ మలేషియా నుంచి ఒకరోజు జైలు జీవితం గడిపేందుకు సంగారెడ్డికి వచ్చారు. ఇలా గడిపే అవకాశం రావడం ఆనందంగా ఉందంటున్నారు వారిద్దరూ. ఇప్పటి వరకూ దేశంలోని నలుమూలల నుంచి టూరిస్టులు వచ్చారని.. ఇప్పుడు విదేశీ టూరిస్టుల రాక మొదలైందని జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్ చెప్పారు. 

17:33 - January 27, 2018

సంగారెడ్డి : సుమారు రెండువందల సంవత్సరాల చరిత్ర ఉన్న సంగారెడ్డి జైలు మ్యూజియంగా మారి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో వేల సంఖ్యలో టూరిస్టులు మ్యూజియంను సందర్శించారు. సంగారెడ్డి జైలుకి సంబంధించిన విశేషాలు.. జైలుకి సందర్శకులు పెరిగేలా జైలు సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌తో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:19 - January 27, 2018
17:18 - January 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎగుమతులు..దిగుమతులను పెంచడానికి డ్రై పోర్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రై పోర్టుల నిర్మాణాలకు కేంద్రం అనుకూలంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణక్ష్యంగా వ్యవహరించారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజానాలను తెచ్చే విధంగా కృషి చేయాలన్నారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాలంటే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే ప్రత్యేక చట్టం తీసుకరావాలని రాఘవులు డిమాండ్ చేశారు. 

17:13 - January 27, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ నేత రేవంత్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నించిన వారిని అన్యాయంగా నిర్భందిస్తున్నారని విమర్శించారు. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణపై ప్రశ్నించిన మందకృష్ణ మాదిగపై అక్రమ కేసులు బనాయించి జైలులో వేశారని గుర్తు చేశారు. ఈ ప్రజ్యాతిరేక పాలనపై పోరాటం తప్పదని తెలిపారు. పరిపాలనను ప్రజా ఆమోదం మేరకు నడపాలని, విలాసవంతమైన జీవితం..దోపిడి కోసం చట్టాలను కాలరాసే విధంగా పాలన సాగించవద్దని సూచించారు. 

16:49 - January 27, 2018

ముంబై : పద్మావత్ సినిమాను వ్యతిరేకించడం వెనుక రాజకీయ శక్తులున్నాయని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ వ్యాఖ్యానించారు. సినిమాకు..హింసాత్మక నిరసనలకు...ఎలాంటి పొంతన లేదన్నారు. రాజ్ పుథ్ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలుచుకోవడానికి జరుగుతున్న ప్రయాసే అని విమర్శించారు. సినిమాను వ్యతిరేకిస్తున్న వారు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 1988లో దూరదర్శన్ లో ప్రసారమయిన సీరియల్ 'భారత్ ఏక్ కోజ్' లో పద్మావత్ ను రూపొందించడం జరిగిందని అప్పుడు ఎలాంటి వ్యతిరేకత రాలేదన్నారు. భన్సాలీ..దీపికాలను బెదిరించడాన్ని ఆయన ఖండించారు. 

16:44 - January 27, 2018

ముంబై : సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన తాజా చిత్రం 'పద్మావత్' చిత్రం కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోంది. కర్ణిసేన తదితర హిందూ సంస్థల నిరసనలు ఎదుర్కొన్న ఈ చిత్రం కలెక్షన్లు సాధిస్తూ దూసుకపోతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు సాధించింది. తొలి రోజు సుమారు రూ. 17 కోట్లు, రిపబ్లిక్ డే రోజున దేశ వ్యాప్తంగా రూ. 32 కోట్లు సాధించింది. రివ్యూపై రూ. 4 కోట్లు వచ్చాయి. ఈ రకంగా ఇప్పటివరకు పద్మావత్ సినిమా రూ. 50 కోట్లు సాధించినట్లైంది. ఒక్క ముంబైలోనే రూ. 11 కోట్లు సాధించడం ద్వారా బాహుబలి సరసన నిలిచింది. వీకెండ్ కావడంతో సోమవారం నాటికి రూ. 100 కోట్లు సాధించడం ఖాయమని తెలుస్తోంది.

16:40 - January 27, 2018

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో కాస్ గంజ్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా విధ్వంస కారులు ఆందోళనకు దిగారు. పలు షాపులు..వాహనాలకు నిప్పంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందుత్వ సంస్థలు ఓ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర రెండు వర్గాల మధ్య వివాదానికి తెరలేపింది. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. పరిస్తితి విషమించడంతో సమీప జిల్లాల నుండి పోలీసులు చేరుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. తమ తిరంగా యాత్రపై రాళ్లు రువ్వడంతో ఈ ఘర్షణ తలెత్తిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. తాము జాతీయ పతాకం ఎగురేస్తున్న సమయంలో ఒక వర్గం వారు రెచ్చగొట్టారని మరో వర్గం ఆరోపిస్తోంది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుండడంతో కాస్ గంజ్ లో కర్ఫ్యూ విధించారు. 

16:29 - January 27, 2018

కర్నూలు : జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు. పత్తిని రోడ్డుపై పారబోసి..చేతుల్లో పత్తి కొమ్మలను పట్టుకుని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పత్తి రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనకుండా అన్యాయం చేశారని బిటి విత్తన సంస్థలపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

16:28 - January 27, 2018
16:20 - January 27, 2018

విజయవాడ : మరో సంవత్సరంలో ఎన్నికలు...అప్పుడే ఎన్నికల వేడి రాజుకొంటోంది. ఏపీ రాష్ట్రంలో పార్టీలు ముందస్తు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా అధికారపక్షం పలు కార్యక్రమాలు..పథకాలు తీసుకొస్తోంది. ప్రధానంగా బిజెపి - టిడిపి పొత్తు ఉంటుందా ? లేదా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. బిజెపి పార్టీకి చెందిన నేతలు పలువురు టిడిపి పార్టీపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే తాము బిజెపితో కలవడానికి సిద్ధమని వైసీపీ ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బిజెపితో తాము మిత్ర ధర్మం పాటిస్తున్నామని, మిత్రధర్మంపై బిజెపి నేతలే ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా..తమ పార్టీ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నట్లు, బిజెపి వాళ్లు పొత్తు వద్దని అనుకుంటే..నమస్కారం పెట్టి తమ దారి తాము చూసుకుంటామనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మాఫీ కోసమే జగన్ బిజెపితో కలిసి వెళ్లేందుకు సిద్ధ పడుతున్నారని తెలిపారు. 

బిజెపి పొత్తుపై బాబు వ్యాఖ్యలు...

విజయవాడ : బిజెపితో తాము మిత్ర ధర్మం పాటిస్తున్నామని, మిత్రధర్మంపై బిజెపి నేతలే ఆలోచించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా..తమ పార్టీ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నట్లు, బిజెపి వాళ్లు పొత్తు వద్దని అనుకుంటే..నమస్కారం పెట్టి తమ దారి తాము చూసుకుంటామనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మాఫీ కోసమే జగన్ బిజెపితో కలిసి వెళ్లేందుకు సిద్ధ పడుతున్నారని తెలిపారు. 

జగన్ పై బాబు గుస్సా...

విజయవాడ : ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలిసి పనిచేస్తానని, జగన్ కొత్తగా చెప్పింది ఏమీ లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్ ఏ మాట మీద నిలబడడని, జగన్ వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పుడు జగన్ కు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదన్నారు. కేసుల నుండి బయటపడేందుకు..ఆస్తుల రక్షణ కోసమే జగన్ ప్రయత్నాలని బాబు ఆరోపించారు. 

కుడి చెయి సరిగ్గా పనిచేయడం లేదన్న బాబు...

విజయవాడ : అనారోగ్యంగా ఉన్నా తాను దావోస్ వెళ్లడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తన కుడి చేయి సరిగ్గా పనిచేయడం లేదని..ఇప్పటి వరకు పది సార్లు ఫిజియోథెరపీ చేయించుకోవడం జరిగిందన్నారు. డాక్టర్లు దావోస్ వెళ్లవద్దని చెప్పినా వినకుండా వెళ్లడం జరిగిందని, ఇదంతా ప్రజల కోసమేన చేస్తున్నట్లు తెలిపారు. 

కర్నూలు నగర ఆఫీసుపై ఏసీబీ దాడి..

కర్నూలు : నగర కార్పొరేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 15వేలు లంచం తీసుకుంటున్న ఇంజనీరింగ్ విభాగం అధికారి బాల సుబ్రమణ్యం ఏసీబీకి పట్టుబడ్డాడు. 

ఆ హత్యకు టీఆర్ఎస్ కు సంబంధం లేదు - కర్నె ప్రభాకర్...

హైదరాబాద్ : నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ హత్యకు టీఆర్ఎస్ కు సంబంధం లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. నిందితులంతా కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉన్నవారేనన్నారు. ఈ హత్య ఘటనపై ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. ఏడాది కాల్ డేటా అయినా పరిశీలించుకోవచ్చని, కోమటిరెడ్డి కాల్ డేటాను తీయాలని తెలిపారు. 

15:55 - January 27, 2018
15:38 - January 27, 2018
15:37 - January 27, 2018

విశాఖపట్టణం : విభజన హామీలు..విశాఖకు రైల్వే జోన్ ఉద్యమం తీవ్రతరం కాబోతోంది..ఈ మేరకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం రైలులో కొణతాలతో పాటు పలువురు రైలులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కొణతాలతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:35 - January 27, 2018

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక విధానాల్లో తీసుకొస్తున్న ప్రైవేటేజేషన్ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తూ వస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. హైదరాబాద్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో పాటు పలువురు సీపీఎం నేతలు హాజరయ్యారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఫిబ్రవరి 4 నుండి 7 వ తేదీ వరకు నల్గొండలో రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతాయని తమ్మినేని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసమే బిఎల్ ఎఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని, బిఎల్ఎఫ్ ను బలోపేతం చేసే విధంగా అనుసరించాల్సిన వ్యూహంపై మహాసభలో చర్చిస్తామన్నారు. ఓ వైపు బీజేపీతో దోస్తీ చేస్తూనే మరో వైపు ఎంఐంఎ తో దోస్తీ చేస్తూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు. 

15:17 - January 27, 2018

అనంతపురం : జిల్లాలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం రైతులు..నిపుణలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ ముందుంచారు. ముందు తాను ఒక రైతు అని..తరువాత నటుడని తెలిపారు. రైతు సరైన పంట పండించి పది మందికి అన్నం పెడితే ఇతర పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నారు. రైతు కన్నీరు పెడితే పాలకులకు శాపం కలుగుతుందని, రైతు కన్నీరు పెట్టకుండా ఉండేందుకు తాను కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..మంత్రి పరిటాల సునీత..ఇతర వ్యక్తులను తాను కలవడం జరుగుతుందన్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు పొగొట్టే విధంగా..రైతుల సమస్యలు తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై వారితో చర్చించడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలను దత్తతగా తీసుకున్నానని, ఓట్ల కోసం రాలేదన్నారు. మూడు..నాలుగు దశాబ్దాలు మాత్రం ప్రజలకు అండగా ఉంటానన్నారు. 

రైతులతో సమావేశమైన పవన్...

అనంతపురం : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. జిల్లాని కరువుపై అధ్యయనం..జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ ఆరా తీస్తున్నారు. 

ఫిబ్రవరి 4 నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు..

హైదరాబాద్ : ఫిబ్రవరి 4 నుండి 7 వరకు నల్గొండలో రాష్ట్ర మహాసభలు జరుగనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 

ఐపీఎల్ -2018 ఆటగాళ్ల వేలం వివరాలు...

బెంగళూరు : ఐపీఎల్ -2018 ఆటగాళ్ల వేలం కార్యక్రమం కొనసాగుతోంది. శిఖర్ ధావన్ రూ. 5.25 కోట్లకు హైదరాబాద్ ...అశ్విన్ ను రూ. 7.6 కోట్లకు పంజాబ్...పోలార్ట్ ను రూ. 5.4 కోట్లకు ముంబై ఇండియన్...బెన్ స్టోక్స్ ను రూ. 12.5 కోట్లకు రాజస్థాన్...డుప్లెసిస్ ను రూ. 1.6 కోట్లకు చెన్నై...రహానెను రూ. 4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్..మిచెల్ స్టార్క్ ను రూ. 9.4 కోట్లకు కోల్ కతా...హర్బజన్ సింగ్ ను రూ. 2 కోట్లకు చెన్నై...మాక్స్ వెల్ ను రూ. 9 కోట్లకు ఢిల్లీ...గౌతమ్ గంభీర్ ను రూ. 2.8 కోట్లకు...బ్రావో ను రూ. 6.4 కోట్లకు చెన్నై..సన్ విలియమ్స్ ను రూ. 3 కోట్లకు హైదరాబాద్...యువ రాజ్ సింగ్ ను రూ.

'కేంద్ర బడ్జెట్ లో మరింత సంస్కరణలకు అవకాశం'...

హైదరాబాద్ : ఎంబీ భవన్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. త్వరలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో మరింత వేగంగా సంస్కరణలు చేయనున్నట్లు సమాచారం వస్తోందని మీడియాతో తెలిపారు. సంక్షేమ పథకాల సబ్సిడీ కోతను పెంచేందుకు ప్రతిపాదనలు తెస్తున్నారని, ద్రవ్యలోటు మరింత పెరుగనుందని హెచ్చరించారు. వ్యవసాయానికి భరోసా ఇచ్చేలా నిధులు కేటాయించాలని, జహీరాబాద్..జడ్చర్ల..దామరచర్లలో..డ్రైపోర్టుల మంజూరులో కేంద్రం విఫలం చెందిందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం నుండి రూ.

కరువు సమస్యలపై అధ్యయనం చేస్తానన్న పవన్...

అనంతపురం : కరువు సమస్యలపై అధ్యయనం చేస్తానని, పరిష్కారాల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబులను కలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఎవరికీ తొత్తునుకానని, రాజకీయాల్లో శత్రువులంటూ ఎవరూ లేరన్నారు. అంశాలను బట్టి మద్దతు ఇస్తానని, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపారు. 

కరువు సమస్యలపై అధ్యయనం చేస్తానన్న పవన్...

అనంతపురం : కరువు సమస్యలపై అధ్యయనం చేస్తానని, పరిష్కారాల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబులను కలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఎవరికీ తొత్తునుకానని, రాజకీయాల్లో శత్రువులంటూ ఎవరూ లేరన్నారు. అంశాలను బట్టి మద్దతు ఇస్తానని, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపారు. 

తెలంగాణలో డ్రైపోర్టులు నిర్మించాలి : బివి.రాఘవులు

హైదరాబాద్ : తెలంగాణకు సముద్ర తీరం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తెలంగాణలో డ్రైపోర్టులు నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టులు నిర్మించే అవకాశముందన్నారు. జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్ల వద్ద డ్రైపోర్టులను నిర్మించవచ్చన్నారు.

మాంధ్యంలోకి నెట్టిన ప్రధాని మోడీ నిర్ణయాలు : బివి.రాఘవులు

హైదరాబాద్ : బడ్జెట్ లో ప్రతిపాదనలకు వాస్తవ కేటాయింపులకు 15 శాతం కత్తిరింపులు చేశారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పేర్కొన్నారు. ప్రధాని మెడీ తీసుకున్న నిర్ణయాలు మాంధ్యంలోకి నెట్టాయన్నారు. వ్యవసాయరంగాన్ని విస్మరించారని, వ్యవసాయరంగానికి పెట్టే ఖర్చును కత్తిరించారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని చెప్పారు. 

దేశవ్యాప్తంగా తీవ్ర నష్టాల్లో రైతులు : బివి.రాఘవులు

హైదరాబాద్ : రైతుకు గిట్టుబాటు ధర కోసం చట్టం తీసుకురావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని తెలిపారు. పెట్టుబడికి రెండున్నరరెట్లు గిట్టుబాట ధర కల్పించాలన్నారు. ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోందని.. ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉండాలన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలతో ఉన్నారని రైతుకు న్యాయం చేకూరే విధంగా బడ్జెట్ లో వ్యవసాయానికి నిధుల కేటాయింపులు ఉండాలన్నారు. 

14:14 - January 27, 2018
14:14 - January 27, 2018
14:12 - January 27, 2018

అనంతపురం : జిల్లాలో పవన్ పర్యటన ప్రారంభమైంది. తొలుత పవన్‌ కల్యాణ్‌ గుత్తిలోని జనసేన కార్యాలయానికి భూమి పూజ చేశారు. పవన్‌ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో గుత్తికి తరలివచ్చారు.
ప్రజాసేవలోనే నాకు ఆనందం
ప్రజాసమస్యల పరిష్కారం కోసం త్రికణశుద్ధిగా కృషిచేస్తానన్నారు.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. ప్రజాసేవలోనే తనకు ఆనందం ఉందన్నారు. జీవిత ప్రయాణాన్ని గెలుపోటములతో చూడనని.. లక్ష్యం చేరడం కోసమే నిరంతరం ప్రయత్నిస్తాన్నారు పవన్‌ కళ్యాణ్‌. తాను రైతునని, రైతు, యువత, ఆడపడచుల బాధలు తెలుసునన్నారు. ప్రజల కష్టమే తనకష్టమని.. తనకు సపోర్టు ఉంటే ప్రజాసమస్యలను పరిషారనికి కృషిచేస్తాన్నన్నారు జనసేన అధ్యక్షుడు. తాను ఓటుబ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకినన్న పవన్‌ కల్యాణ్‌.. తాను ప్రజారాజకీయాలు మాత్రమే చేస్తానన్నారు. ప్రజల మేలుకోసమే నిరంతరం శ్రమిస్తాన్నారు.  
రాయలసీమలో కరువును తరమడానికి కృషి చేస్తా 
రాయలసీమలో కరువును తరమడానికి తాను కృషిచేస్తానన్నారు జనసేన అధినేత. రాయలసీమ అంటే తనకు తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి కనిపిస్తారని పవన్‌ అన్నారు. రాయలసీమను ముఠాకక్షలకే పరిమితం అనే ధోరణిలో చూసే నేతలంటే తనకు గిట్టదన్నారు పవన్‌కల్యాణ్‌. ఆఖరి శ్వాసవరకు రాయలసీమక అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. 

 

14:05 - January 27, 2018

హైదరాబాద్ : రైతుకు గిట్టుబాటు ధర కోసం చట్టం తీసుకురావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని తెలిపారు. పెట్టుబడికి రెండున్నరరెట్లు గిట్టుబాట ధర కల్పించాలన్నారు. ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోందని.. ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉండాలన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలతో ఉన్నారని రైతుకు న్యాయం చేకూరే విధంగా బడ్జెట్ లో వ్యవసాయానికి నిధుల కేటాయింపులు ఉండాలన్నారు. బడ్జెట్ లో ప్రతిపాదనలకు వాస్తవ కేటాయింపులకు 15 శాతం కత్తిరింపులు చేశారని పేర్కొన్నారు. ప్రధాని మెడీ తీసుకున్న నిర్ణయాలు మాంధ్యంలోకి నెట్టాయన్నారు. వ్యవసాయరంగాన్ని విస్మరించారని, వ్యవసాయరంగానికి పెట్టే ఖర్చును కత్తిరించారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని చెప్పారు. తెలంగాణకు సముద్ర తీరం లేదన్నారు. తెలంగాణలో డ్రైపోర్టులు నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టులు నిర్మించే అవకాశముందన్నారు. జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్ల వద్ద డ్రైపోర్టులను నిర్మించవచ్చన్నారు.
   

 

జగన్ పాదయాత్రలో ఘోర అపశృతి...

నెల్లూరు : జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. జగన్ తో కలిసి నడుస్తున్న వైసీపీ నేత రంగారెడ్డి కుప్పకూలి సృహ కూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. 

అండగా ఉంటాననిపిస్తే ఓటేయండి - పవన్..

అనంతపురం : తాను రైతు కుటుంబం నుండి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతోంది. రైతు కష్టాలు..యువత ఆశయాలు తెలుసని, త్రికరణశుద్ధిగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సినిమా కంటే ప్రజా సేవలోనే తనకు తృప్తి అని, ఏపికి అండగా ఉంటాననిపిస్తే బలంగా ఓటేయాలని..ఓటు వేసినా..వేయకపోయినా తన పోరాటం కొనసాగిస్తానన్నారు. ఓటు బ్యాంకు..కుల..మత రాజకీయాలు చేయనన్నారు. 

13:46 - January 27, 2018

గుంటూరు : ప్రతొక్కరూ సూర్య ఆరాధన చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. సూర్యుడు ప్రాణకోటికి జీవనాధారమన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సూర్యుడు శ్రమైక జీవన సౌందర్యం అని తెలిపారు. సూర్యుడు.. జస్టిస్ చక్రవర్తి, ఏమీ ఆశించడని చెప్పారు. అన్ని మతాల వారు కలిసి సూర్య భగవానుడిని ఆరాధించాలని సూచించారు. సూర్యుడికి 4వందల 60 కోట్ల సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. సూర్యుని వల్ల పవర్ రేటు తగ్గుతుందని, కాలుష్యం ఉండదని, మనిషి ఎక్కువకాలం బతుకుతాడని తెలిపారు. డి విటమిన్ వస్తుందన్నారు. కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించి ఆక్సిజన్ ను పెంచాలన్నారు. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన వారమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సూర్య ఆరాధన చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు సూర్యుడి దగ్గర నిలబడితే అన్ని ఉపయోగాలు ఉంటాయన్నారు. సూర్య ఆరాధన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. సూర్యుడితోపాటు భూమిని కూడా ఆరాధించాలన్నారు. భూమిని కూడా కాపాడుకోవాలన్నారు. తల్లిని గౌరవిచండం మన సంప్రాదాయం అన్నారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని పేర్కొన్నారు. రియాల్టిటికి ఉపయోగం పడుతుందన్నారు.

13:38 - January 27, 2018
13:37 - January 27, 2018
13:36 - January 27, 2018

కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ టీసర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సీఎం కేసీఆర్ బలుపును చూసి వాపనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. టిఆర్ ఎస్ కు గవర్నర్ నరసింహన్ భజన చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డిలతో గొడవ పడ్డానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

13:17 - January 27, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి అపార్ట్‌ మెంట్‌ ఐదో అంతస్తునుంచి కిందపడ్డ లాడ్లీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది.సోమాజిగూడకు చెందిన రాజేష్‌ కుమార్తె లాడ్లీ 2015లో సాయిప్రసాద్‌ ముదిరాజ్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుందిఅపార్ట్‌మెంట్‌ మీదనుంచి ప్రమాద వశాత్తు పడిందని మృతురాలి భర్త అంటున్నాడు.. కానీ ఆమె భర్తే  చంపేశాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.  

 

విషాదం పంచిన క్రికెట్‌ ఆట

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌లో క్రికెట్‌ ఆట విషాదం పంచింది. మ్యాచ్‌లో బౌలింగ్‌చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నిముషాల్లోనే మృతి చెందాడు. ఆంథోని అనే యువకుడు బౌలింగ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయి మృతి చెందాడు. హార్ట్‌ ఎటాక్‌తో మృతిచెందినట్టు అనుమానిస్తున్నారు.  

13:14 - January 27, 2018

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌లో క్రికెట్‌ ఆట విషాదం పంచింది. మ్యాచ్‌లో బౌలింగ్‌చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నిముషాల్లోనే మృతి చెందాడు. ఆంథోని అనే యువకుడు బౌలింగ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయి మృతి చెందాడు. హార్ట్‌ ఎటాక్‌తో మృతిచెందినట్టు అనుమానిస్తున్నారు. 

13:11 - January 27, 2018

ఢిల్లీ : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2018 వేలానికి తెరలేచింది. వేలానికి వచ్చిన మొదటి ఆటగాడు శిఖర్‌ ధావన్‌. ఆ తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌, కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ గేల్‌, బెన్‌ స్టోక్స్‌ వచ్చారు. టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను కొనుగోలు చేసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. గత ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్‌ ఈ ఏడాది ఆ స్థాయి ధర పలకలేదు. రూ.12.5 కోట్లకే రాజస్థాన్‌ రాయల్స్‌ స్టోక్స్‌ను సొంతం చేసుకుంది.కనీస ధర రూ.2కోట్లతో ధావన్‌ వేలానికి వచ్చాడు. అయితే ధావన్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పోటీపడ్డాయి. మధ్యలో ముంబయి ఇండియన్స్‌ కూడా పోటీలోకి వచ్చింది. చివరికి రూ.5.2 కోట్లకు కింగ్స్‌ ఎలెవన్‌ అత్యధిక ధర వెచ్చించింది. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు రైట్‌ టు మ్యాచ్‌ కార్డు అవకాశం ఉండటంతో అదే మొత్తంతో ధావన్‌ను తిరిగి సొంతం చేసుకుంది.

 

13:00 - January 27, 2018

విజయవాడ : నూతన సంవత్సం నుండి ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను నిషేధిస్తామంటూ విజయవాడ నగరపాలక సంస్థ ప్రలోభాలు పలికింది. ఇందుకోసం కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. అమలును మాత్రం గాలికి వదిలేసింది.  
కాగితాలకే పరిమితమైన తీర్మాణాలు
ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తాం, క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతాం, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని విజయవాడ నగర పాలక సంస్థ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధంపై చెప్పిన మాటలు. అంతేకాదు 2018 నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి దీన్ని పక్కాగా అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కాని జనవరి మాసం ముగుస్తున్నా ఆ తీర్మాణాలు కేవలం కాగితాలకే పరిమతమయ్యాయి. ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రచారం చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారు. 
15 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు
విజయవాడలో 15 టన్నులకుపైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, సంచులు, గ్లాసులు, ప్లేట్లు, సీసాలు ఇతర అనుబంధ వస్తువులను నిత్యావసరాల కోసం వినియోగించుకుంటున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజూవారీ ఉత్పత్తి అయ్యే 550 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాల్లో 9-20 శాతం ప్లాస్టిక్‌ వస్తువులే ఉంటాయి. ఈ వ్యర్థాలు రోజూ 5 నుండి 10 టన్నుల వరకు నేరుగా డ్రెయిన్‌లలో చేరిపోతూ పలు రకాల సమస్యలు తీసుకువస్తున్నాయి. రైల్వే, బస్‌, ఇతర రవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణం సాగించేవారి ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ వ్యర్థాలు మరిన్ని సమస్యలను తీసుకువస్తున్నాయి. 
50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌పై నిషేధాజ్ఞలు
పర్యావరణ పరిరక్షణ చట్టం 2011 ప్రకారం 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులైన క్యారీ బ్యాగులు, టీ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, సీసాలు, తోరణాలు, బ్యానర్లపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. 2013లో జారీ చేసిన నెంబర్‌ 46 ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్ల కన్న తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం, వినియోగించడం, చివరకు కొనుగోలు చేయడం కూడా నిషేధం విధించారు. అయితే నిషేధపు ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయించే వ్యాపారుల నుండి 2500 మొదలు 5వేల వరకూ అపరాధ రుసుము విధించే అధికారం అధికారులకు ఉంది. ఈ ఉత్పత్తులు తయారు చేసేవారి నుండి 25 నుండి 50 వేల వరకు జరిమానా విధించవచ్చు. అయితే కొందరు క్షేత్ర స్థాయి సిబ్బంది, వ్యాపారుల నుండి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
అనేక వ్యాధులకు కారణమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు 
ప్లాస్టిక్‌ వ్యర్థాలు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. క్యారీబ్యాగుల దహనం వల్ల వచ్చే పొగతో ప్రాణవాయువు విషతుల్యమై ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల వచ్చే దుష్ప్రభావలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికైనా ప్రజల సంరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

 

నాకు ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ముఖ్యం : పవన్ కళ్యాణ్

అనంతపురం : తనకు ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ఏజెంట్, బానిస అంటున్నారని.. తాను అలా కనిసిస్తానా అని అడిగారు. అనంతపురం అతిపెద్ద జిల్లా అని.. జిల్లాలో తీవ్ర కరువు సమస్య ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకుంటానని అన్నారు. ఈరోజు నుంచి ప్రజల్లోనే ఉంటానని పేర్కొన్నారు. పవన్ ప్రసంగిస్తుండగా అభిమాని అత్యుత్సాహం చూపారు.  

 

ప్రతి ఒక్కరికి సమాన విద్య రావాలి : పవన్

అనంతపురం : ఎవరూ తనకు శత్రువులు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. శత్రుత్వం పెట్టుకుంటే అభివృద్ధి జరగదన్నారు. వ్యక్తిగతంగా నాపై ఎవరూ దాడి చేసిన పట్టించుకోనన్నారు. విద్య అంటే కార్పొరేట్ విద్య కాదని... ప్రతి ఒక్కరికి సమాన విద్య రావాలన్నారు. మెరుగైన వైద్యం కావాలన్నారు. 

'నేను మీ భవిష్యత్ కోసం వచ్చాను' : పవన్

అనంతపురం : రాయలసీమ ప్రజలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. 2008నుంచి రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. జైలులో పాతిక సంవత్సరాలు పెట్టినా.. మడమ వెనక్కి తిప్పనని తేల్చి చెప్పారు. 'నేను మీ భవిష్యత్ కోసం వచ్చాను..
నేను నమ్మేది యువత, ఉడుకు రక్తాన్ని' అని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో యువత ఎలాంటి మార్పు తెస్తారో చూస్తారని చెప్పారు. 

12:42 - January 27, 2018

అనంతపురం : రాయలసీమ ప్రజలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. 2008నుంచి రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. జైలులో పాతిక సంవత్సరాలు పెట్టినా.. మడమ వెనక్కి తిప్పనని తేల్చి చెప్పారు. 'నేను మీ భవిష్యత్ కోసం వచ్చాను.. నేను నమ్మేది యువత, ఉడుకు రక్తాన్ని' అని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో యువత ఎలాంటి మార్పు తెస్తారో చూస్తారని చెప్పారు. ఎవరూ తనకు శత్రువులు కాదన్నారు. శత్రుత్వం పెట్టుకుంటే అభివృద్ధి జరగదన్నారు. వ్యక్తిగతంగా నాపై ఎవరూ దాడి చేసిన పట్టించుకోనన్నారు. విద్య అంటే కార్పొరేట్ విద్య కాదని... ప్రతి ఒక్కరికి సమాన విద్య రావాలన్నారు. మెరుగైన వైద్యం కావాలన్నారు. తాను ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. తనను ఏజెంట్, బానిస అంటున్నారని.. తాను అలా కనిసిస్తానా అని అడిగారు. అనంతపురం అతిపెద్ద జిల్లా అని.. జిల్లాలో తీవ్ర కరువు సమస్య ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకుంటానని అన్నారు. ఈరోజు నుంచి ప్రజల్లోనే ఉంటానని పేర్కొన్నారు. పవన్ ప్రసంగిస్తుండగా అభిమాని అత్యుత్సాహం చూపారు.  

 

కూకట్ పల్లిలో విషాదం

హైదరాబాద్ : కూకట్ పల్లిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. ఐదో అంతస్తు నుంచి లాడ్లీ అనే మహిళ కింద పడిపోయింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. 

11:47 - January 27, 2018

విశాఖపట్నం : నగరంలో దారుణహత్య జరిగింది. ఉడా కాలనీలో యోగా మాస్టర్‌ వెంకటరమణను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. హత్య చేస్తున్న దృశ్యాలు సీసీకెమెరాలో రాకార్డు అయ్యాయి. సీసీఫుటేజి ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటరమణ హత్యవెనుక ఓ దినపత్రిక విలేఖరి ఉన్నట్టు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:42 - January 27, 2018
11:39 - January 27, 2018

తూర్పుగోదావరి : కాలుష్యం ఆ గ్రామాలను కమ్మేస్తోంది. గాలి, నీరు, కాలుష్యమయమవుతోంది. చెరువులు, కుంటలు, పంట పొలాలు నాశనమవుతున్నాయి. అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రజాప్రతినిధులకు కానీ... అధికారుల కళ్లకు కనిపించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో సీతానగరం చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తున్న గోద్రెజ్‌ కాలుష్యంపై 10టీవీ ప్రత్యేక కథనం.
పచ్చని పల్లెలపై పగబట్టిన కాలుష్యం
పచ్చని పల్లెలపై పగబట్టిన కాలుష్యం. తాగేనీటిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు. అంతు చిక్కని రోగాలతో అవస్థలు పడుతున్న ప్రజలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. పశ్చిమగోదావరి జిల్లా అంటే.. పచ్చని పొలాలకు పుట్టినిల్లు. కానీ.. పారిశ్రామికీకరణ పేరుతో పల్లెల్లో పరిశ్రమలు పెడుతూ గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలో కొన్నేళ్ల క్రితం గోద్రెజ్‌ ఫామాయిల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్యాక్టరీలో ప్రతి రోజు వేల లీటర్ల నీటిని వాడుతుంటారు. వాడిన నీటిని శుద్ది చేసి చెరువుల మాదిరి ట్యాంక్‌లు ఏర్పాటు చేసి.. ఇంకిపోయేలా చేయాలి. కానీ ఫ్యాక్టరీ నిర్వాహకుల వాటినేమీ పట్టించుకోకుండా... వ్యర్థాలను పైపుల ద్వారా బయటకు వదులుతున్నారు. దీంతో వ్యర్థాలన్నీ సమీపంలోని చెరువుల్లో కలుస్తున్నాయి. ఆ చెరువులు నిండి.. ఇతర చెరువుల్లోకి వ్యర్థాలు చేరుతున్నాయి. 
ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థాలు 
ఆ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థాలు నల్లగా ఉంటాయి. ఆ వ్యర్ధాలు చెరువుల్లో కలవడంతో... నీరంతా నల్లగా మారుతున్నాయి. దీంతో ఆ నీళ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. అంతేకాకుండా.. చెరువుల్లో ఆ వ్యర్ధాలు కలవడం వల్ల సమీప ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ ఒక్కటే పరిశ్రమ ఉండేదని.. ఇప్పుడు మరో యూనిట్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని గ్రామస్తులంటున్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న వ్యర్థాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. మరో యూనిట్‌ ఏర్పాటు చేస్తే తమ పరిస్థితి ఏంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులంటున్నారు. ఈ వ్యర్ధాల వల్ల తాము అంతుచిక్కని రోగాల బారిన పడడమే కాకుండా.. కొందరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉందంటున్నారు. 
పచ్చని గ్రామాల్లో కాలుష్యపు పడగ 
ఒక్క నీళ్లే కాదు.. దుర్గంధం, పొగతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. అంతుచిక్కని రోగాలతో ప్రాణాలు వదులుతున్నారు. ఇప్పటివరకు ఒక్క యూనిట్‌ మాత్రమే ఉండగా... తాజాగా మరో యూనిట్‌ను ప్రారంభిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గోద్రెజ్‌ ఫామాయిల్‌ ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న వ్యర్ధాలే కాకుండా.. పొగ, దుర్గంధంతో అనేక ఇబ్బందులు దుర్కొంటున్నామని గ్రామస్తులంటున్నారు. భూగర్బ జలాలన్నీ కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని గ్రామస్తులంటున్నారు. 
దుర్గంధం, పొగతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు 
ఫ్యాక్టరీ నుంచి వెదజల్లే దుర్గంధం, పొగతో అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు గ్రామస్తులు. వాసన పీల్చడం ద్వారా అనేక రోగాలు వస్తున్నాయంటున్నారు. మొత్తం ఈ ఫ్యాక్టరీ విడుదల చేసే కాలుష్యం వల్ల పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు గ్రామాలు, తెలంగాణలోని ఖమ్మంజిల్లాలో నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతుచిక్కని రోగాలతో విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇక ఈ కాలుష్యం ప్రజలనే కాదు... చెట్లు, పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నాయి. ఫ్యాక్టరీ సమీపంలోని కోకో, మొక్కజొన్న మామిడి పంటలన్నీ నాశనమవుతున్నాయని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
గ్రామాల ప్రజలు ఆగ్రహం 
తాజాగా మరో యూనిట్‌ ఏర్పాటు చేయడం పట్ల పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయం సేకరించకుండా పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడిగినా... పోరాటం చేసినా అణిచివేస్తున్నారంటున్నారు. మీడియాను కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ అవస్థలు చూసి ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విషతుల్యం నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

 

యోగా మాస్టర్‌ వెంకటరమణ హత్య

విశాఖపట్నం : నగరంలో దారుణహత్య జరిగింది. ఉడా కాలనీలో యోగా మాస్టర్‌ వెంకటరమణను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. హత్య చేస్తున్న దృశ్యాలు సీసీకెమెరాలో రాకార్డు అయ్యాయి. సీసీఫుటేజి ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటరమణ హత్యవెనుక ఓ దినపత్రిక విలేఖరి ఉన్నట్టు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

 

11:28 - January 27, 2018

పవన్ కరవుయాత్రకు వచ్చిన పవన్‌ అభిమానులు

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ్టి నుంచి అనంతంపురం జిల్లాలో పర్యటించనున్నారు. మూడురోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో జిల్లాలో నెలకొన్న కరవును అధ్యయనం చేయనున్నారు. దాంతోపాటు  పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కూడా పవన్‌ పాల్గొంటారు. కరవు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులు, నీటిపారుదల రంగ నిపుణులతో వపన్ చర్చిస్తారు. 

 

11:11 - January 27, 2018

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ్టి నుంచి అనంతంపురం జిల్లాలో పర్యటించనున్నారు. మూడురోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో జిల్లాలో నెలకొన్న కరవును అధ్యయనం చేయనున్నారు. దాంతోపాటు  పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కూడా పవన్‌ పాల్గొంటారు. కరవు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులు, నీటిపారుదల రంగ నిపుణులతో వపన్ చర్చిస్తారు. 

 

అనంతపురంలో కరవును అధ్యయనం చేయనున్న పవన్ కళ్యాణ్

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ్టి నుంచి అనంతంపురం జిల్లాలో పర్యటించనున్నారు. మూడురోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో జిల్లాలో నెలకొన్న కరవును అధ్యయనం చేయనున్నారు. దాంతోపాటు  పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కూడా పవన్‌ పాల్గొంటారు. కరవు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులు, నీటిపారుదల రంగ నిపుణులతో చర్చిస్తారు.

11:04 - January 27, 2018

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ్టి నుంచి అనంతంపురం జిల్లాలో పర్యటించనున్నారు. మూడురోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో జిల్లాలో నెలకొన్న కరవును అధ్యయనం చేయనున్నారు. దాంతోపాటు  పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కూడా పవన్‌ పాల్గొంటారు. కరవు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులు, నీటిపారుదల రంగ నిపుణులతో చర్చిస్తారు.
 

 

ఐపీఎల్..2018 ఆటగాళ్ల వేలం

బెంగళూరు : ఐపీఎల్..2018 ఆటగాళ్ల వేలం జరిగింది. శిఖర్ ధావన్ ను రూ.5.2 కోట్లకు హైదరాబాద్ దక్కించుకున్నారు. అశ్విన్ ను రూ.7.6కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. పోలార్డ్ ను రూ.5.4 కోట్లకు ముంబై ఇండియన్స్, బెన్ స్టోక్స్ ను రూ.12.5 కోట్లకు రాజస్థాన్, డుప్లెసిస్ ను రూ.1.6 కోట్లకు చెన్నై దక్కించుకుంది. 

 

శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య వివాదం

తిరుమల : శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య వివాదం నెలకొంది. తనపై పరువు నష్టం వ్యాఖ్యలు చేశారంటూ ఆలయ ఓఎస్ డీ శేషాద్రికి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు లీగల్ నోటీసులు జారీ చేశారు. శ్రీవారి ఆలయంలో అర్చకుల ఆధిపత్య పోరు. 

శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య వివాదం

తిరుమల : శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య వివాదం నెలకొంది. తనపై పరువు నష్టం వ్యాఖ్యలు చేశారంటూ ఆలయ ఓఎస్ డీ శేషాద్రికి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు లీగల్ నోటీసులు జారీ చేశారు. శ్రీవారి ఆలయంలో అర్చకుల ఆధిపత్య పోరు. 

ఢిల్లీ బయల్దేరిన కొణతాల రామకృష్ణ

విశాఖ : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఢిల్లీ బయల్దేరారు. రెండు రోజులపాటు ఢిల్లీలో దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. రైల్వే జోన్ కోసం సీపీఎం నేతలు రక్త సంతకాలు చేశారు.

09:53 - January 27, 2018

మహారాష్ట్ర : కొల్హాపూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివాజి బ్రిడ్జి మీద నుంచి పంచగంగ నదిలో మినీ బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సులో 17 మంది ప్రయాణిస్తున్నారు. గణపతిపూలే నుంచి పూలే వెళ్తుండగా శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగతంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ 
కొనసాగుతోంది. 

 

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

మహారాష్ట్ర : కొల్హాపూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివాజి బ్రిడ్జి మీద నుంచి పంచగంగ నదిలో మినీ బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 

09:40 - January 27, 2018

హైదరాబాద్‌ : పటాన్‌చెరువు పీఎస్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది. పోచారం ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆగిఉన్న క్రేన్‌ను టొమేటో లోడుతో వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా..  లారీలో మరో వ్యక్తి  ఇరుక్కుపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 

 

09:37 - January 27, 2018

హైదరాబాద్ : స్వచ్‌సర్వేక్షణ్‌ సర్వేలో అగ్రస్థానం కోసం జీహెచ్‌ఎంసీ వేగంగా అడుగులు వేస్తోంది. పారిశుద్యం పట్ల పౌరుల్లో చైతన్య కలిగించేందుకు ప్రచార కార్యక్రమాలను  చేపట్టింది. దీనిల్లో భాగంగా గచ్చిబౌలీస్టేడియం వద్ద సైకిర్యాలీని జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టారు. ఈ ర్యాలీలో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

 

09:33 - January 27, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో మావోయిస్టులు అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో ఒకరిని పొట్టనపెట్టుకున్నారు. పినపాక మండలం భూపతిరావుపేట, సుందరయ్యనగర్‌లో అర్థరాత్రి మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు. పొడియం జోగయ్య అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. మడివి రమేష్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రమేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. భూపతిరావుపేటలో నాలుగు లారీలు, రెండు జేసీబీలను సైతం దహనం చేశారు. ఇసుక క్వారీలోని ఇద్దరు కూలీలను తీసుకెళ్లి మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. 

 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘన పాకిస్తాన్

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. నౌషెరా సెక్టార్ లో పాక్ రేంపర్ల కాల్పులు, పౌరుడికి గాయాలు అయ్యాయి. 

నేటినుంచి ఢిల్లీలో కొణతాల రామకృష్ణ రైలు దీక్ష

హైదరాబాద్ : ఢిల్లీలో నేడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రైలు దీక్ష చేపట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్, విభజన హామీల అమలుకై కొణతాల దీక్ష చేట్టనున్నారు. 

 

09:14 - January 27, 2018

దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న, సీపీఎం నేత ఉమామహేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. దళితులపై దాడి చేసిన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:10 - January 27, 2018
09:09 - January 27, 2018

వాషింగ్టన్ : అమెరికా ఫస్ట్‌ అంటే అమెరికా ఒంటరిగా ఉండడం కాదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా అభివృద్ధి చెందితేనే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం'లో ప్రసంగిస్తూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వ్యాపారానికి తలుపులు బార్లా తెరిచామని...పెట్టుబడులకు ఇది సరైన సమయమని ట్రంప్‌ చెప్పారు. అమెరికా భద్రతకు ఏ చర్యకైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు.  ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి మిత్రదేశాలతో కలిసి పనిచేస్తున్నామని ట్రంప్‌ తెలిపారు.

 

09:06 - January 27, 2018

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆరవ వరసలో సీటు కేటాయించడంపై ఆ పార్టీ మండిపడింది. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి  చౌకబారు రాజకీయాలకు మోది ప్రభుత్వం పాల్పడిందంటూ దుయ్యబట్టింది.  రాహుల్ గాంధీ తనకు కేటాయించిన ఆరో వరుసలో రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తో కలిసి కూర్చుకున్నారు. రాహుల్ గాంధీకి మొదటి వరుసలో చోటు కేటాయించకపోవడాన్ని పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తప్పుపట్టారు. అహంకారులైన పాలకులు అన్ని సంప్రదాయాలకు తిలోదకలిచ్చారని పేర్కొన్నారు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడికి నాలుగో వరుసలో సీటు కేటాయించినప్పటికీ ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఆరో వరుసకు మార్చారని...మాకు మాత్రం రాజ్యాంగపరమైన సెలబ్రేషన్స్ చాలా ముఖ్యమని సూర్జేవాలా ట్వీట్ చేశారు.

 

08:57 - January 27, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో మహిళా ఆత్మాహుతి దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. శ్రీనగర్‌లో మహిళా సుసైడ్‌ బాంబర్‌తో పాటు ఆమె సన్నిహితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళా ఉగ్రవాదిని పుణెకు చెందిన 18 ఏళ్ల సదియా అన్వర్‌ షేక్‌గా గుర్తించారు. గురువారం అర్ధరాత్రి దాటాకా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. శ్రీనగర్‌లో సుసైడ్‌ బాంబర్‌ సంచరిస్తున్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

 

08:54 - January 27, 2018

జైపూర్ : రాజస్థాన్‌లో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు సౌదీ అరేబియా పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైసల్మేర్‌ జిల్లా పోఖరాన్‌లోని ఓ హోటల్‌లో ఇద్దరు సౌదీవాసులతో పాటు తెలంగాణకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి శాటిలైట్‌ ఫోను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఇద్దర్నీ 40 ఏళ్ల అల్‌ తలా మొహమ్మద్, ఎల్‌ సామ్రీ మొహమ్మద్‌గా... మరో వ్యక్తి తెలంగాణకు చెందిన సయ్యద్‌ మోహసీన్‌గా గుర్తించినట్లు...వారిని విచారించనున్నట్లు  జైసల్మేర్‌ ఎస్‌పి గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు.

 

08:48 - January 27, 2018

తూర్పుగోదావరి : అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. నేడు రాత్రి 11.27నిమిషాలకు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. తెలుగు రాష్ట్రాలనుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆరు రోజుల పాటు సాగనున్న వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అంతర్వేది. ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వారికి నేటి నుండి ఆరు రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ రాత్రి 11.29నిమిషాలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగనుంది. 28వ తేదీ ఆదివారం రోజున భీష్మేకాదశి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.  ఈనెల 31న మాఘ పూర్ణమి సందర్భంగా స్వామి వారికి చక్రస్నానం  జరుపనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ మాఘ బహుళ పాడ్యమి నాడు తెప్పోత్సవంతో కార్యక్రమం క్రతువు ముగియనుంది.
స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్న టీటీడీ
స్వామి వారి కళ్యాణం కోసం  టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం రాత్రి 11.29నిమిషాలకు వేదపండితులు కళ్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి కళ్యాణం సందర్భంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను ఘనంగా చేపట్టారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు రానుండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖాధికారులు ఏర్పాటుచేశారు. సముద్రపు స్నానాలకు.. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా షెడ్‌లను ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, బారీకేడ్ల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక పాసులు, వీఐపీ దర్శనాలను నిలిపివేశారు. భక్తుల కోసం కళ్యాణ పాసులు, ప్రసాదాలు సిద్ధం చేశారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు 50తో కళ్యాణ పాసులను ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టారు. 

 

08:29 - January 27, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ నెపంతో కిరాతానికి తెగబడ్డారు. పినపాక మండలం భూపతిరావుపేట, సుందరయ్యనగర్ లో సీపీఎం కార్యకర్త జోగయ్యను గొడ్డలితో నరికి చంపారు. మరో కార్యకర్త మడివి రమేష్ పై కాల్పులు జరిపారు. అతను తప్పించుకున్నాడు. రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. 4 లారీలు, 2 జేసీబీలను దహనం చేశారు. ఘటనా స్థలంలో మణుగూరు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖలు వెలిశాయి. తామే కాల్చిచంపినట్లు మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారు. మావోయిస్టుల కిరాతకంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన, పేదల తరపున పోరాడుతున్న సీపీఎం నేతలపై దాడులు చేసి, హత్య చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:06 - January 27, 2018

హైదరాబాద్ : ఎఫ్ ఆర్ డీఐ బిల్లుతో కేంద్రం దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ఆరోపించారు. అది పాసైతే లక్షల కోట్ల డిపాజిటర్లకు భద్రత లేకుండా పోతుందని రాఘవులు అన్నారు. అందరం కలిసి దీనిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో రాఘవులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఎఫ్ ఆర్ డీఐ బిల్లును బ్యాంకు ఉద్యోగులు సంఘటితంగా అడ్డుకోవాలని ఈ సందర్భంగా రాఘవులు సూచించారు. 
 

 

08:03 - January 27, 2018

శ్రీకాకుళం : ముందేమో హార్బర్‌ నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత మాటమార్చారు. హార్బర్‌ స్థానంలో ఓడరేవు నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏపీ కేబినెట్‌లో నిర్ణయం కూడా జరిగింది. దీంతో సర్కార్‌పై సమరానికి శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ప్రజలు రెడీ అవుతున్నారు. ప్రజాభిప్రాయం లేకుండా ముందుకు సాగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు.
మంత్రివర్గ తీరుపై స్థానికులు మండిపాటు 
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాళి మండలాల పరిధిలో గల భావనపాడు ప్రాంతీయులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఓడరేవు నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నారు. ప్రజాభిప్రాయసేకరణ జరుగకుండా... సోషల్‌ ఇంపాక్ట్‌ సర్వే చేపట్టకుండా ఓడరేవు నిర్మించాలన్న మంత్రివర్గ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. దేవునల్తాడ గ్రామంలోని పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేబినెట్‌ నిర్ణయంపై అవసరమైతే  సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. 
2013లో భూసేకరణ చట్టం తుంగలోకి తొక్కి పర్యావరణ అనుమతులు లేకుండా ముసాయిదాలను ప్రకటించకుండా సర్కారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాన్ని వారు ఖండిస్తున్నారు. మత్స్యకారులకు అవసరమైన  ఫిషింగ్ హార్బర్ తప్ప.. మరేఇతర అవసరాల కోసమూ భావనపాడు ప్రాంతాన్ని వాడుకోవద్దని కోరుతున్నారు. ఓడరేవు నిర్మాణానికి సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులతో పాటు, మత్స్యకారులు ఎంతగానో నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఎవరి ఇళ్లకు నష్టముండదని గతంలో చెప్పిన పాలకులు
దేవునల్తాడ, భావనపాడు ప్రాంతాలలో ఎవరి ఇళ్లకు నష్టం ఉండదని  గతంలో పాలకులు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఏడువేల మందికి పునరావాసం కల్పించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కేబినెట్‌ నిర్ణయం  వెనుక మతలబు ఏమిటో చెప్పాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతరేకంగా సర్కారు ఏకపక్షంగా హార్బర్ కాదని ఓడరేవు నిర్మించాలని చూస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వైకాపా నేతలు హెచ్చరిస్తున్నారు.  
పోర్టు నిర్మాణం కోసం పాలకుల అత్యుత్సాహం
ఎన్‌వోసీ  లేకుండా పోర్టు నిర్మాణం కోసం పాలకులు చూపిస్తున్న అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే భావనపాడు ప్రాంతాలలో క్రయవిక్రయాలు నిలిచిపోయి  బాధితులకు ఎంతగానో నష్టం కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గం ఫిషింగ్ హార్బర్ కాకుండా ఓడరేవు నిర్మిస్తామని ఆదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందంపై  పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 

07:58 - January 27, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో దళిత వర్గాలకు చేరువయ్యేందుకు టీడీపీ మాస్టర్‌ ప్లాన్‌తో వెళుతోంది. దళిత తేజం-తెలుగుదేశం పేరుతో దళిత వాడలలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అమరావతిలో లాంఛనంగా ప్రారంభించారు. 
దళిత తేజం-తెలుగుదేశం పేరుతో ప్రణాళికలు
బలహీన వర్గాల పార్టీగా ముద్ర ఉన్న తెలుగుదేశం.. దళిత వర్గాలనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. దళిత తేజం-తెలుగుదేశం పేరిట దళితులకు దగ్గరయ్యే కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. శుక్రవారం, అమరావతిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 
ఎన్టీఆర్‌ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు 
ఆంధ్రా ప్రాంతంలో దళితులు.. మొదట్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ హయాంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల కారణంగా.. దళితులు.. సైకిల్‌ పార్టీకి దన్నుగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ పట్ల దళితుల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని తమ ప్రతినిధిగా భావించి.. దళితులు పెద్ద ఎత్తున ఫ్యాన్‌ గుర్తుకు ఓటేశారని.. ఆమేరకు, ఈవర్గం టీడీపీకి గంపగుత్తగా దూరమైందన్నది 2014 అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను బట్టి తెలుస్తోంది. 
దళితులకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు 
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భావిస్తోన్న తెలుగుదేశం పార్టీ.. దూరమైన దళితులకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈక్రమంలో కొన్ని దళిత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాదు ఎస్సీల్లో బాగా పట్టున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. ఒకప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న జూపూడి ప్రభాకర్‌, కారెం శివాజి లాంటి నేతలను కూడా పార్టీలోకి తీసుకువచ్చి ప్రాధాన్యతను కల్పించింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం కూడా ఈ వ్యూహంలో భాగమేనన్నది విశ్లేషకుల భావన. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జూపూడిని నియమించి ఎన్నడూ లేని విధంగా ఆ కార్పొరేషన్‌కు ఎక్కువ నిధులు కేటాయించారు. అంబేద్కర్‌ స్మృతివనం పేరుతో భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దళిత తేజం-తెలుగుదేశం పేరుతో సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. 
దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం 
దళితులకు చేరువయ్యేందుకు శ్రీకారం చుట్టిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటోతేదీనుంచి అంబేడ్కర్‌ జయంతినాటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ 20 మంది దళిత నేతలతో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి దళిత వాడలో పాదయాత్ర చేయడంతో పాటు దళిత వాడల్లోనే సహపంక్తి భోజనాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం దళిత మహాసభలు
ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 5వేల మందితో తెలుగుదేశం దళిత మహాసభలు నిర్వహించారు. అంబేద్కర్‌ జయంతిరోజున లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముగించాలని సీఎం భావిస్తున్నారు. దళితులకు చేరువయ్యేందుకు టీడీపీ అనుసరిస్తోన్న వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

 

07:53 - January 27, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా సాగుతోందని టీ కాంగ్రెస్‌ నేతలు.. మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ది ముమ్మాటికి రాజకీయ హత్యేనని.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 
శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్ నేతలు 
నల్గొండలో దారుణ హత్యకు గురైన మున్సిపల్ చైర్మన్‌ లక్ష్మి భర్త శ్రీనివాస్ కుటుంబాన్ని టీ-కాంగ్ నేతలు పరామర్శించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్‌ నేతలు షబ్బీర్ అలీ, హనుమంతురావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి... శ్రీనివాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ లక్ష్మిని ఓదార్చారు. 
ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం 
శ్రీనివాస్‌ హత్య విషయంలో... ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ది ముమ్మాటికి రాజకీయ హత్యేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.. నరిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం... శ్రీనివాస్‌ హత్య కేసులో ప్రధాన సూత్రదారిగా ఉన్నారని.. ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని సీఎల్పీ నేత జానారెడ్డి, వీహెచ్‌ హనుమంతరావు అన్నారు. టీఆర్‌ఎస్.. ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న.. కాంగ్రెస్‌ నాయకులను మట్టుబెట్టే మార్గంలో పయనిస్తుందనడానికి .. ఈ హత్య నిదర్శనమని.. వారు అన్నారు. చాలా కాలం నుంచి.. శ్రీనివాస్‌ను చంపేస్తాననంటూ.. బెదిరింపులు వస్తున్నాయని.. దీనిపై చాలాసార్లు.. ముఖ్యమంత్రికి తెలియజేశానని.. వారు పట్టించుకోలేదని.. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. తనను వేధించడానికే.. తమ్ముడిలాంటి శ్రీనివాస్‌ను హత్య చేశారని.. ఆయన వాపోయారు.     
డీజీపీ దగ్గరకు తీసుకెళ్లే యోచనలో కాంగ్రెస్‌ నేతలు 
బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లే యోచనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారనే ఆరోపణతో.. డీఎస్పీని తప్పించాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. 
 

 

 

నేటి నుంచి అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

అనంతపురం : నేటి నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్నారు. చలోరె..చలోరె కార్యక్రమంలో భాగంగా పర్యటించనున్నారు. 

భద్రాద్రి జిల్లాలో వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు

భద్రాద్రి : పినపాక మండలంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జోగయ్య అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. రమేష్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 4 లారీలు, జేసీబీకి నిప్పుపెట్టారు. మణుగూరులో మావోయిస్టు పేరుతో లేఖలు వెలిసాయి. 

Don't Miss