Activities calendar

28 January 2018

21:18 - January 28, 2018

ప్రొఫెసర్ కంచ ఐలయ్య...ఇటీవలే ఆయన రాసిన పుస్తకం తీవ్ర వివాదస్పదమయిన సంగతి తెలిసిందే. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే పలు సంఘాలతో ఏర్పడిన టీ మాస్ ఫోరంకు ఛైర్మన్ గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన..ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు పేదలకు చేరుతున్నాయా ? ఇతర అంశాలపై టెన్ టివి 'కంచ ఐలయ్య'తో ముచ్చటించింది. టీజేఏసీలో ప్రొ.కోదండరాం తప్ప మాట్లాడే వారే లేరా ? పవన్ కు సామాజిక న్యాయం అంటే ఏంటో తెలియదా ? త్వరలో తెలంగాణలో సామాజిక విప్లవం రాబోతుందా ? తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జయదేవ్ ఉనద్కట్ రూ. 11.5 కోట్లు...

ముంబై : ఎంతగానో ఆసక్తి రేపిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇవాళ్టి వేలంలో... ఇండియన్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కట్ పదకొండున్నర కోట్లతో సత్తాచాటారు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. 

ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు...

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సాగే ఈ సమావేశాలు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్ తలాక్, FRDA, ఓబీసీ బిల్లులతో పాటు... సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మధ్య వివాదం కూడా ఈసారి సమావేశాల్లో చర్చకు రానున్నాయి. 

సిలిచ్ పై నెగ్గిన ఫెదరర్...

ఢిల్లీ : స్విస్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియ‌న్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న తొలి మెన్స్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇవాళ జ‌రిగిన ఆస్ట్రేలియన్‌ ఫైన‌ల్లో ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో పోరాడి విజ‌యం సాధించాడు. 

ముగిసిన పవన్ అనంత పర్యటన..

అనంతపురం : ఆదివారంతో పవన్ అనంతపురం జిల్లా కరవు సమస్యలపై మూడురోజుల పర్యటన ముగిసింది. ఈ మూడు రోజుల పర్యటనకు సంబంధించి తన దృష్టికి వచ్చిన అంశాలపై హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో చర్చిస్తామని పవన్ చెప్పారు. 

21:04 - January 28, 2018

అనంతపురం : ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఓట్లడగటానికి వచ్చిన నేతల్ని నిలదీయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీనికి తాను కూడా అతీతుడిని కాదన్నారు. తేడా వస్తే దెబ్బలు, దాడులు ఎదుర్కునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ స్పష్టం చేశారు. సీమ అభివృద్ధికి తన జీవితాంతం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతపురంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కదిరిలో మంత్రి పరిటాల సునీతను కలిశారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. వాళ్లింట్లో అల్పాహారం అనంతరం... కరువుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం కరువు సమస్యలపై ప్రధానమంత్రికి ఇచ్చిన నివేదికలో పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రిని కలిసినట్లు పవన్‌ తెలిపారు. ప్రాజెక్టు వివరాలు అన్ని సేకరించానని పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కొంత సమయం పడుతుందని పవన్ చెప్పారు.

మంత్రి సునీతను కలిసిన అనంతరం పవన్ కదిరి కరవు సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ సమస్యలను పవన్‌కు విన్నవించుకున్నారు. పంట నష్టాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెందిన మహిళలతో పవన్ మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పెషల్ కేటగిరి స్టేటస్‌లో రాయలసీమకు కేటాయించిన నిధుల నుంచి రైతులు చనిపోయిన వారి కుటుంబాలకు నిధులు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పవన్ హామీ ఇచ్చారు. అదే విధంగా జిల్లాలో పూర్తి కాని ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఓటుకోసం వచ్చినపుడు తనతో సహా అందర్నీ నిలదీయమని పవన్ చెప్పారు. ఈ విషయంలో తాను దెబ్బలు.. దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ చెప్పారు.

గల్ఫ్ బాధితుల సమస్యలపైనా పవన్ స్పందించారు. ప్రభుత్వం వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. గల్ఫ్‌లో ఉన్న తన కొడుకును తన వద్దకు రప్పించేందుకు సాయం చేయమంటూ ఓ మహిళ పవన్‌కు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన పవన్ వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తను ప్రధానికి ఇచ్చే నివేదికలో కూడా గల్ఫ్‌లో బాధపడుతున్న వారి సమస్యలపై ప్రత్యేకంగా విన్నవిస్తానని చెప్పారు.

ఆడపడుచులపై జరుగుతున్న దారుణాలు చాలా సున్నితమైన అంశమన్నారు పవన్ కల్యాణ్. అక్కాచెల్లెళ్లందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు పవన్ . తాను అక్కచెల్లెళ్లు.. వదినలతో పెరిగిన వాడినని తల్లి బాధేంటో తనకు తెలుసునని పవన్ అన్నారు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. ఆడపడుచుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్‌ కదిరిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తరువాత కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాను ఆయన నివాసంలో పవన్ కలిశారు. రైతుల ఆత్మహత్యలు, వితంతువుల పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చిస్తానని పవన్ చెప్పారు. పుట్టపర్తిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతున్న అక్కడి ప్రజల ఆకాంక్షకు తాను పూర్తి మద్దతు ఇస్తానన్నారు పవన్ కల్యాణ్. భగవాన్ సత్యసాయిబాబా స్ఫూర్తితో తాను, జనసేన పార్టీ పనిచేస్తాయని పవన్ చెప్పారు. కొండకమర్ల వద్ద పవన్ కాన్వాయ్ ఓ అభిమానిని ఢీకొన్న ఘటనపై పవన్ స్పందించారు. ఉత్సాహం చూపించండి కానీ మితిమీరిన వేగంతో బైక్‌లు నడిపి కుటుంబాన్ని తనను బాధపెట్టవద్దని పవన్ సూచించారు. ఇక ఆదివారంతో పవన్ అనంతపురం జిల్లా కరవు సమస్యలపై మూడురోజుల పర్యటన ముగిసింది. ఈ మూడు రోజుల పర్యటనకు సంబంధించి తన దృష్టికి వచ్చిన అంశాలపై హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో చర్చిస్తామని పవన్ చెప్పారు. 

21:01 - January 28, 2018

ఢిల్లీ : స్విస్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియ‌న్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న తొలి మెన్స్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇవాళ జ‌రిగిన ఆస్ట్రేలియన్‌ ఫైన‌ల్లో ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో పోరాడి విజ‌యం సాధించాడు ఫెడెక్స్‌. కెరీర్‌లో ఇది ఆరో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్. ఈ విజయంతో... ఆరుసార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన రాయ్ ఎమర్సన్, జొకోవిచ్‌ల స‌ర‌స‌న ఫెడెక్స్ నిలిచాడు. ఫైనల్‌ పోరులో తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచి టైటిల్ వేట మొద‌లుపెట్టిన ఫెదరర్.. గెలిచేందుకు 5 సెట్లు ఆడాల్సి వచ్చింది. గతంలో ఫెదరర్ 2004, 2006, 2007, 2010, 2017లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. 

20:59 - January 28, 2018

ముంబై : ఎంతగానో ఆసక్తి రేపిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇవాళ్టి వేలంలో... ఇండియన్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కట్ పదకొండున్నర కోట్లతో సత్తాచాటారు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఈ వేలంలో.. బెన్ స్టోక్స్ తరువాత అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా ఉనద్కట్ నిలిచాడు. భారత ప్లేయర్లలో మనీష్ పాండే, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, కృనాల్ పాండ్యాలాంటి స్టార్స్ కూడా సత్తా చాటారు. మనీష్ పాండేను సన్ రైజర్స్, కేఎల్ రాహుల్‌ను పంజాబ్‌.. 11 కోట్లకు కొనుగోలు చేశాయి. ప్రజ్ఞాన్‌ ఓజాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఒకప్పటి పరుగుల సునామీ క్రిస్ గేల్‌ అతికష్టం మీద పంజాబ్ టీమ్‌లో చేరాడు. ప్రారంభ ధర 2కోట్లకు అతడిని ప్రీతీజింటా ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

 

20:56 - January 28, 2018

నల్గొండ : జిల్లాలో ఈ నెల24న జరిగిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును పోలీసులు చేధించారు. హత్యలో రాజకీయ కుట్ర ఏం లేదని.. కేవలం చిన్న గోడవనే ఈ హత్యకి దారితీసిందని ఎస్పీ తెలిపారు. ఈ నెల 24న మాండ్ర మహేశ్‌ తమ్ముడు రాంబాబు క్యాన్సర్‌ వ్యాదితో చనిపోయాడు. దీంతో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మహేశ్‌ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లాడు. రాత్రి అంత్యక్రియలు ముగిసిపోయాక.. మహేశ్‌ స్నేహితులైన చింతకుంట్ల రాంబాబు, శరత్‌ మిర్చి బండి దగ్గరికి వెళ్లారు. అక్కడ సదరు మిర్చి బండి యజమానికి రాంబాబు స్నేహితులకు మధ్య ఘర్షణ జరిగింది. విషయం పోలీసులకు తెలువడంతో నిందితులను చెదరగొట్టారని, పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ గుమిగూడారని, శ్రీనివాస్ మందలించడంతో ఆగ్రహంతో దాడికి పాల్పడి హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు.
 

ఈ హత్యకేసులో నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించి 11మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో ఏ-1గా చింతకుంట్ల రాంబాబు సహా 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు నిందితులున్నారని పోలీసులు తెలిపారు. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయని, నిబంధనల కారణంగానే శ్రీనివాస్‌కు గన్‌మ్యాన్‌ కల్పించలేదని ఎస్పీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. మునిసిపల్‌ చైర్మన్‌ లక్ష్మి..తనకు రక్షణ కావాలని కోరలేదన్నారు. నిందితుల కాల్‌లిస్టు ఆధారంగా విచారణ జరిపామన్నారు. హత్యలో రాజకీయ నేతల ప్రమేయం లేదని ఎస్పీ తేల్చిచెప్పారు.

20:53 - January 28, 2018

హైదరాబాద్ : అట్టడుగు కులాలను అణచివేసే విధంగా రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాజ్యాంగం మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు ప్రజాగాయకుడు గద్దర్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగంపై దాడి ఎవరి కోసం? అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది మహమూద్ అలీ, కేయూ ప్రొఫెసర్ మురళి మనోహర్ పాల్గొన్నారు.

రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పౌరుల మధ్య ఆర్థిక సమానత్వం సాధించాలంటే.. అంబేద్కర్‌ చూపిన మార్గంలో సాగాలన్నారు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజల మధ్య సమానత్వానికి అడ్డుగోడగా ఉన్న కులవ్యవస్థను తొలగించాలంటే.. ముందుగా ఆర్థిక సమానత్వం రావాలన్న అంబేద్కర్‌ మాటలను గుర్తుచేశారు. అట్టడుగు కులాలను అణచివేసే విధంగా రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తుల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అంబేద్కర్‌ చూపిన మార్గంలో సాగాల్సిన అవసరం ఉందన్నారు తమ్మినేని.

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి పౌరుడిపై ఉందన్నారు.. ప్రజా గాయకుడు గద్దర్‌. రాజ్యాంగం మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రాజ్యాంగంపై సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఊరూరా ప్రచారం నిర్వహిస్తామన్నారు గద్దర్‌. ప్రజా ఉద్యమాల ద్వారా అంబేడ్కర్ ఆశయాలను.. ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మేధావులు అందరూ పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. 

20:51 - January 28, 2018

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సాగే ఈ సమావేశాలు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్ తలాక్, FRDA, ఓబీసీ బిల్లులతో పాటు... సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మధ్య వివాదం కూడా ఈసారి సమావేశాల్లో చర్చకు రానున్నాయి. సమావేశాల్లో సహకరించాలని కోరుతూ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా.. సాయంత్రం స్పీకర్ అధ్యక్షతన అన్ని పార్టీలతో మరో భేటీ జరిగింది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి జరిగే సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో సహకరించాలని కోరుతూ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి అన్ని పార్టీల ప్లోర్ లీడర్లు హాజరయ్యారు. హోంమంత్రి రాజ్‌నాథ్, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, విజయ్ గోయల్‌తో పాటు కాంగ్రెస్ తరపున గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింథియా, సీపీఎం నుంచి కరుణాకరన్, సీపీఐ నుంచి డి. రాజా, ఎస్పీ నుంచి ములాయం సింగ్ యాదవ్, టీడీపీ నుంచి తోట నర్సింహాం, సీఎం రమేశ్, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన సభ్యులు... తమ డిమాండ్లను ప్రస్తావించారు. విభజన హామీలు అమలు చేయాలని ఇరు రాష్ట్రాల ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని.. సమావేశం అనంతరం... కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు.ఈ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీలాగే ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం సాధిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాలపై విపక్షాల సలహాలను స్వీకరించామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం... సాయంత్రం లోక్‌సభా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. బడ్జెట్‌ సమావేశాలకు సహకరించాలని.. కీలక బిల్లులకు చర్చించి సహకరించాలని సభా మర్యాదలను కాపాడాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు.

సోమవారం సమావేశాల మొదటి రోజు ... ఉభయ సభలను ఉద్ధ్యేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో తన తొలి ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాలను వివరిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం... సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం ఒకటిన్నరకు BAC సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే చర్చకు రాగానే అంశాలు, బిల్లులు, తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం.. ప్రధాని అధ్యక్షతన మూడున్నర గంటలకు NDA సమావేశం జరుగుతుంది. సభలో ప్రభుత్వానికి మిత్రపక్షాలు సహకరించాలని మోదీ.. విజ్ఞప్తి చేయనున్నారు. తరువాత 30, 31 తేదీలు సభకు సెలవు. తిరిగి ఫిబ్రవరి ఒకటిన సభలో అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 9 వరకు తొలి దశ బడ్జెట్‌ సమావేశాల అనంతరం విరామం ఇవ్వనున్నారు.

తిరిగి మార్చి 5 నుండి ఏప్రిల్‌ 6వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను చర్చకు తీసుకురానున్నారు. ఎఫ్‌ఆర్డీఐ బిల్లు, త్రిపుల్‌ తలాక్‌ బిల్లు, ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా వంటి కీలక బిల్లులను ఆమోదం చేసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు దేశంలో నెలకొన్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న వివాదం, సుప్రీం కోర్ట్‌ న్యాయ మూర్తుల వివాదం, వంటి వాటిని చర్చకు తీసుకురావాలని విపక్షాలు చూస్తున్నాయి.

పుట్టపర్తికి జనసేన...

అనంతపురం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి సేవలకు గుర్తింపుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని, సత్యసాయి స్పూర్తితో జనసేన ముందుకు పోతుందన్నారు.

సహకరించాలని కోరాం - అనంత్ కుమార్...

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ చాలా ముఖ్యమని ప్రధాని పేర్కొనడం జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల సూచనలను స్వీకరించాలని ప్రధాని సూచించడం జరిగిందని, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభళోనూ ఆమోదం పొంతుందనే నమ్మకం ఉందన్నారు. బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాలని విపక్షాలను కోరడం జరిగిందన్నారు. 

కేంద్రం హామీనిచ్చిందన్న - తోట నరసింహం...

ఢిల్లీ : విభజన అంశాలను త్వరగా పూర్తి చేయాలని కోరడం జరిగిందని టిడిపి లోక్ సభా పక్ష నేత తోట నరసింహం తెలిపారు. విశాఖ రైల్వే జోన్, అసెంబ్లీ స్థానాల పెంపు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని పేర్కొనడం జరిగిందన్నారు. పార్లమెంట్ లో ఏపీ అంశాలను ప్రస్తావించేందుకు టిడిపి ఎంపీలకు సమయం ఇవ్వాలని అఖిలపక్షంలో కోరినట్లు తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు పరుస్తామని కేంద్రం హామీనిచ్చిందన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగదని భావిస్తున్నట్లు, అన్యాయం జరిగితే పార్లమెంట్ లో ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం నుండి రావాల్సినవన్నీ రాబట్టేందుకు కృషి చేస్తామని తోట వెల్లడించారు. 

సహకరించాలని కోరాం - అనంత్ కుమార్...

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ చాలా ముఖ్యమని ప్రధాని పేర్కొనడం జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల సూచనలను స్వీకరించాలని ప్రధాని సూచించడం జరిగిందని, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభళోనూ ఆమోదం పొంతుందనే నమ్మకం ఉందన్నారు. బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాలని విపక్షాలను కోరడం జరిగిందన్నారు. 

450 కిలోల గంజాయిని స్వాధీనం...

విజయవాడ : ఏలూరు రోడ్డులో టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. విశాఖ నుండి వాహనంలో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. 

పలు అంశాలను లేవనెత్తామన్న ఆర్జేడీ నేత...

ఢిల్లీ : నిరుద్యోగం, దళితులపై దాడులు.. రైతు ఆత్మహత్యలపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని ఆర్జేడీ నేత జయ ప్రకాష్ నారాయణ్ యాదవ్ పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దాడులు పెరిగాయన్నారు. 

ఎస్పీని కలిసిన రాజ గోపాల్ రెడ్డి....

నల్గొండ : జిల్లా ఎస్పీని ఎమ్మెల్సీ రాజ గోపాల్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ హత్య కేసులో న్యాయం జరుగకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని, హత్య కేసుపై పోలీసులు చెప్పిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఫోన్ చేసి పిలిపించిన వ్యక్తి ఘటనా స్థలంలో లేకపోవడంపై పోలీసులకు ఎందుకు అనుమానం కలుగలేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మిర్చి బండి గొడవగా చిత్రీకరిస్తుండడం దారుణమని, పోలీసులు ప్రభుత్వాన్ని కాపాడేందుకు చూస్తున్నారని విమర్శించారు.

విద్యార్థినిని చితకబాదిన లెక్కల మాస్టర్...

కృష్ణా : కంచికచర్లలోని రవీంద్రభారతి స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. వెంకటనంద అనే ఏడో తరగతి విద్యార్థినిని లెక్కల మాస్టర్ సైదేశ్వరరావు చితకబాదాడు. నవ్వాడనే కారణంతో విచక్షణారహితంగా కొట్టినట్లు బయటపడింది. విద్యార్థి వెంకటనందకు తీవ్రగాయాలు కావడంతో ప్రిన్స్ పాల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

దిగొచ్చిన జేఎన్టీయూ అధికారులు...

తూ.గో. : విద్యార్థుల ఆందోళనతో కాకినాడ జేఎన్టీయూ అధికారులు దిగొచ్చారు. విద్యార్థినిని వేధించిన కీచక ప్రొఫెసర్ బాబులుపై చర్యలు తీసుకుంటామని వీసీ హామీనిచ్చారు. 

18:37 - January 28, 2018

విజయవాడ : సిటీ కేబుల్‌ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 54వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. కేబుల్‌ రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత రామకృష్ణకే దక్కుతుందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. సామాన్యుడికి టీవీ ప్రసారాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతో మందికి ఉపాధి చూపించారన్నారు. ఆయన ఆశయ సాధనలో పయనించాల్సిన అవసరముందని మంత్రి ఉమా అన్నారు. జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

18:36 - January 28, 2018

పశ్చిమగోదావరి : జిల్లా బొట్టాయిగూడెంలోని తోగొండ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. శివ, గణపతి అనే ఇద్దరు యువకులు లోతు తెలియక.. లోనికి దిగడంతో మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు.. ఇద్దరి మృతదేహాలను వెలికి తీయించారు. మృతులను జంగారెడ్డి గూడెం వాసులుగా గుర్తించారు. 

18:35 - January 28, 2018

కర్నూలు : రాయలసీమ జిల్లాలో సాగు, తాగు నీరు సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తుంగభద్ర నదిలో సుంకేశుల ప్రాజెక్ట్‌ పై భాగాన ఉన్న గుండ్రేవుల ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు, రాయలసీమ సాధన సమితి నాయకులు మండిపడ్డారు. రైతుల ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:33 - January 28, 2018

ఢిల్లీ : సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనితో ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి ఆయా పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోవడంతో ఇతర రాష్ట్రాల వారిగా అభివృద్ధి చెందదని, దీనిపై పునరాలోచించాలని కోరడం జరిగిందన్నారు. రైల్వే జోన్ విషయంలో జరుగుతున్న కాలాయాపన తగదని, దుగరాజ పోట్నం, విశాఖ పెట్రో కెమికల్స్ ప్లాంట్, ట్రైబల్..సెంట్రోల్ యూనివర్సిటీల కేటాయింపు విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొనడం జరిగిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను పూర్తి చేయాలని, 2014 కంటే పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు..2014 తరువాత ప్రాజెక్టులో పెరిగిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని..కేంద్రమే భరించాలని పేర్కొనడం జరిగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు తీసుకొచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. 

18:28 - January 28, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూర్యుడే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున సన్‌ రైజ్‌ స్టేట్‌గా నినాదమిచ్చామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సూర్యారాధన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి ఏటా రథసప్తమి రోజున ప్రతి ఒక్కరు సూర్యారాధన చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రథసప్తమి అయిపోవడంతో ఈసారి నేడు సూర్యారాధన పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచంలో అన్ని మతాల వారు సూర్యునికి ప్రాధాన్యత ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ప్రకృతిని ఆరాధించడంలో భాగంగానే జలహారతి, సూర్యారాధన, అమ్మకు వందనం కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. హిందువులు సూర్యడిని సూర్య భగవాన్‌గా పూజిస్తారని.. అదే విధంగా అరబ్‌ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ అనే పేరుతో ఆరాధిస్తారన్నారు. అటు క్రైస్తవులూ బైబిల్‌లో సూర్యునికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

ప్రపంచంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసేది సూర్యడేనన్నారు. 460 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు నుంచి మనం రోజూ శక్తిని పొందుతూనే ఉన్నామన్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని.. ప్రకృతిని, సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రెండూ మానవ మనుగడకు అవసరమేనని అన్నారు. సూర్యారాధన ఏ మతానికి సంబంధించిన అంశం కాదని... దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సౌరశక్తితోనే 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అందుకే సూర్యభగవానుడిని బ్రాండ్‌అంబాసిడర్‌గా ఏంపిక చేస్తున్నానన్నారు. మరో వైపు సీఎం చేస్తున్న కార్యక్రమాలపై పలువురు విమర్శిస్తున్నారు. వయసుపై బడుతున్న కొద్ది చంద్రబాబుకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైందని.. వాస్తుకు, పూజలకు, హైందవ సాంప్రదాయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శిస్తున్నారు.  

అనంతరం సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యారాధన కార్యక్రమాన్ని సీఎం ఆరంభించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆచారాలను అనుసరించి ప్రార్ధనలు నిర్వహించారు. సూర్యారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్ధులు హాజరై 12 రకాల ఆసనాలతో సూర్యారాధన చేశారు.

18:26 - January 28, 2018

అనంతపురం : ఆడపడుచులపై జరుగుతున్న దారుణాలు చాలా సున్నితమైన అంశమని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంత జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కదిరిలో రోడ్ షో నిర్వహించారు. అక్కడ నర్సింహ స్వామిని దర్శించుకున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషాను కలుసుకుని చర్చించారు. మహిళల సమస్యలు చాలా సున్నితమైన అంశమని అధికారులు..సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడుతానని, వితంతువులకు పెన్షన్ అందడం లేదని ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, వితంతువుల పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చిస్తానని పవన్ చెప్పారు. 

పవన్ పర్యటనలో అపశృతి...

అనంతపురం : పవన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కదిరి నుండి పుట్టపర్తికి వెళుతుండగా కొండకమర్ల వద్ద పవన్ కాన్యాయ్ లోని ఓ వాహనం అభిమానిని ఢీకొట్టింది. దీనితో అతడి కాలు విరిగిపోయింది. స్పందించిన పవన్ అతడిని కారులో ఆసుపత్రికి తరలించారు. 

17:47 - January 28, 2018
17:19 - January 28, 2018

వరంగల్ : చదువు పూర్తయితే వారు డాక్టర్లతో సమానం..చదువుతున్న చదువుకు ఫలితం లేకుండా పోతోందని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...జిల్లాలో ఫార్మా - డీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఫార్మా - డీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టెన్ టివి వారితో మాట్లాడింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన ఆపమంటూ హెచ్చరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:14 - January 28, 2018

రాజన్న సిరిసిల్ల : బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు...వారికి సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలు వట్టివేనని పలు ఘటనలు చూపిస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరులో బీసీ విద్యార్థులు రోడెక్కారు. సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ ప్రాతినథ్యం వహిస్తున్న సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హాస్టల్ లో ఎన్నో సమస్యలున్నా అధికారులు, యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆదివారం 150 మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగు గంటల పాటు ఆందోళన చేసినా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. భోజనం సరిగ్గా లేదని..నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని..తాగునీటి సమస్య అధికంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కలుషితమైన నీటిని సేవించడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. 150 మంది ఉన్న ఒక్కో గదిలో 30 మందిని ఉంచుతున్నారని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

17:09 - January 28, 2018

హైదరాబాద్ : నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును చేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించని వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కేసులో మొత్తం 11మందికి సంబంధం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో 8మందిని అరెస్టు చేయడం జరిగిందని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఏ 1గా రాంబాబు, ఏ 2 మల్లేష్, ఏ 3 శరత్, ఏ 4 దుర్గయ్య, ఏ 5 చక్రి, ఏ 6 సతీష్, ఏ 7 మహేష్, ఏ8 సాయి, ఏ 9 మెరుగు గోపి, ఏ 10 మోహన్, ఏ 11 గా ప్రసాద్ లున్నారని తెలిపారు. మిర్చి బండి వద్ద జరిగిన గొడవ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని, ఇందులో రాజకీయ కోణం లేదని ఎస్పీ వెల్లడించారు. గతంలో ప్రాణాపాయం ఉందని బొడ్డుపల్లి కోరారా ? లేదా ? అని మీడియా ప్రశించగా అతనిపై 9 కేసులున్నాయని..నిబంధనల ప్రకారం తాము గన్ మెన్ కల్పించలేదని తెలిపారు. ఇందులో ఎలాంటి దురేద్దేశ్యం లేదన్నారు. ఎస్పీ మీడియా సమావేశంపై టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి స్పందించారు. హత్య వెనుక టీఆర్ఎస్ పెద్దలున్నారని మరోసారి ఆరోపించారు. 

అఖిలపక్ష సమావేశం...

ఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. అధికార..విపక్ష పార్టీల సభ్యులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాన్ని కేంద్రం కోరింది. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రెండు విడతులుగా బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి నుండి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత...మార్చి 5 నుండి ఏప్రిల్ 6 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. 

బీసీలకు అన్యాయం జరుగకుండా బిల్లు -ఎంపీ అవంతి...

విశాఖపట్టణం : కాపులను బీసీల్లో చేర్చాలనే అంశంపై జనవరి 18న పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టడం జరిగిందని, బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగకుండా బిల్లు పెట్టామని ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలిపారు. లోక్ సభలో కాపుల రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని సూచించారు. 

తోగొండ రిజర్వాయర్ లో యువకుల మృతి...

ప.గో : బొట్టాయిగూడెంలోని తోగొండ రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పడి శివ..గణపతి అనే యువకులు మృతి చెందారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి మృతదేహం కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. మృతులు శివ..గణపతి..జంగారెడ్డి గూడెం వాసులుగా గుర్తించారు. 

శంకరమఠం వద్ద ఉద్రిక్తత...

చెన్నై : కంచి శంకర మఠం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మఠాన్ని ముట్టడించేందుకు భారీగా యువత తరలివచ్చింది. తమిళ తల్లి గీతాన్ని అవమానించారని విజయేంద్ర సరస్వతిపై ఆరోపణలున్నాయి. 

16:40 - January 28, 2018
16:38 - January 28, 2018
16:36 - January 28, 2018
16:21 - January 28, 2018

గుంటూరు : ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లడం మంచి పరిణామమని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 70 ఏళ్ల వయస్సులో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే రాష్ట్రాభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకొంటోందన్నారు. చనిపోయిన వ్యక్తికి సంతాపం తెలియకుండా చేసే సంప్రదాయం ఉందా ? అని వైసీపీని ఉద్దేశించి ప్రశ్నించారు. 

16:18 - January 28, 2018

కడప : ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి చింత రామచంద్రయ్య పలు ప్రశ్నలు సంధించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టిడిపి..బిజెపి పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చారని, ఈ పర్యటన ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయో తెలుపాలని డిమాండ్ చేశారు. కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రధాని మోడీని బాబు కలుస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆరోపించారు. 

16:14 - January 28, 2018

అనంతపురం : ఇంటి నుండి బయటకెళ్లిన మహిళ క్షేమంగా మరలా ఇంటికి చేరుకొనే సమాజం కావాలని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం కదిరి కరవు సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...అక్కల బాధ..తల్లి బాధ..అడపడుచుల బాధేంటో తనకు తెలుసని, తనకు ఇద్దరు కూతుళ్లున్నారని తెలిపారు. అడపడుచుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, అక్కచెల్లెళ్లందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. తనకు అండగా నిలబడాలని..జనసేనకు ఓట్లు వేయాలని రాలేదన్నారు. అనంత కరువు పారదోలడానికి పోరాటం చేయడానికి మాత్రమే వచ్చానని పవన్ తెలిపారు. 

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో 11 మంది..

హైదరాబాద్ : నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో మొత్తం 11మందికి సంబంధం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో 8మందిని అరెస్టు చేయడం జరిగిందని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఏ 1గా రాంబాబు, ఏ 2 మల్లేష్, ఏ 3 శరత్, ఏ 4 దుర్గయ్య, ఏ 5 చక్రి, ఏ 6 సతీష్, ఏ 7 మహేష్, ఏ8 సాయి, ఏ 9 మెరుగు గోపి, ఏ 10 మోహన్, ఏ 11 గా ప్రసాద్ లున్నారని తెలిపారు. 

గేల్ ను కొనుగోలు చేయడం లేదు..

ఢిల్లీ : విధ్వంసకర బ్యాటింగ్ కు చిరునామాగా నిలిచే 'క్రిస్ గేల్' ను మాత్రం ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు కోట్లు వెచ్చించి గేల్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.  

15:50 - January 28, 2018
15:37 - January 28, 2018
15:36 - January 28, 2018

హైదరాబాద్ : సినీ నటీ నటులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఫ్యాన్ చేసే అత్యుత్సాహంతో నటులు ఇబ్బందులు పడుతుంటారు. సినీ తమన్నాకు హైదరాబాద్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం హిమాయత్ నగర్ లో మల్ బార్ గోల్డ్ షాపు ప్రారంభోత్సవానికి 'తమన్నా' వచ్చింది. 'తమన్నా'ను చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. అందరిలాగే వచ్చిన ముషిరాబాద్ కు చెందిన కరీముల్లా అనే వ్యక్తి ఏకంగా 'తమన్నా'పైకి చెప్పు విసిరేశాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను తమన్నాకు వీరాభిమాని..కలిసేందుకు అవకాశం రావడం లేదని..ఇలా చేయడం వల్ల అవకాశం వస్తుందోమోనని చేసినట్లు కరీములా పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

15:32 - January 28, 2018

ఢిల్లీ : ఐపీఎల్ 2018 వేలం కొనసాగుతోంది. జూనియర్ క్రికెటర్లు హాట్ కేకులా కొనుగోలు అయిపోయారు. ముంబైలో రెండో రోజు వేలం పాట కొనసాగుతున్నాయి. వివిధ ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొని భారీగా డబ్బులు ప్రకటిస్తూ క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ విధ్వంసకర బ్యాటింగ్ కు చిరునామాగా నిలిచే 'క్రిస్ గేల్' ను మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు కోట్లు వెచ్చించి గేల్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

 

15:30 - January 28, 2018

విశాఖపట్టణం : ఫిరాయింపులకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టబద్ధత చేయాల్సినవసరం ఉందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కొత్త చట్టంతో పార్టీ మారే వారికి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని, విశాఖ రైల్వే జోన్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 

15:27 - January 28, 2018

హైదరాబాద్ : పార్లమెంట్ లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందని..2014 సంవత్సరానికి 82 శాతం ఎంపీలు శతకోటీశ్వరులున్నారని...484 మంది శతకోటీశ్వర్లుంటే పేద..మహిళలు..ఇతర చట్టాల గురించి ఆలోచిస్తారా ? అంటూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ఎస్వీకేలో రాజ్యాంగంపై దాడి...ఎవరి కోసం జరిగిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పౌరుల మధ్య ఆర్థిక సమానత్వం సాధించాలంటే అంబేద్కర్ చూపిన మార్గంలో సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య సమానత్వానికి అడ్డుగోడగా ఉన్న కుల వ్యవస్థ ను తొలగించాలంటే ముందుగా ఆర్థిక సమానత్వం రావాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆర్ఎస్ఎస్ ...బిజెపి శక్తుల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అంబేద్కర్ చూపిన మార్గంలో సాగాల్సినవసరం ఉందన్నారు.  

15:16 - January 28, 2018

కదిరి ఎమ్మెల్యేతో పవన్..

అనంతపురం : కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా ఇంటికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. కేవలం మర్యాద పూర్వకంగా అత్తర్ చాంద్ బాషాతో పవన్ భేటీ అయినట్లు సమాచారం. 

14:45 - January 28, 2018

నల్గొండ : జిల్లా మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు ఓ కుదుపు కుదుపుతోంది. ఈ హత్య వెనుక టీఆర్ఎస్ పెద్దలున్నారని టి.కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు శ్రీనివాస్ ను హత్య చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం లక్ష్మీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస్ హత్యపై తీవ్ర మనోవేదనకు గురైన ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ ఈ ఘటనకు పాల్పడ్డాడు. కార్యకర్తలు..శ్రీనివాస్ బంధువులు అడ్డుకున్నారు. అక్కడనే ఉన్న కార్యకర్తలు..శ్రీనివాస్ కుటుంబసభ్యులు వారించారు. 

14:39 - January 28, 2018

నాగర్ కర్నూలు : ఓ కుటుంబంలో చెలరేగిన భూ వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. కుటుంబంలోని తండ్రి..ఇద్దరు సోదరులను ఓ అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘోరమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో చోటు చేసుకుంది. భాస్కరయ్య వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు మల్లేష్..తండ్రి సోదరుల మధ్య భూ వివాదం చెలరేగుతోంది. పొలం దగ్గరకు వెళ్లిన చిన్న తమ్ముడితో మల్లేష్ వాదనకు దిగాడు. వెంటనే తెచ్చుకున్న గొడ్డలితో నరికి చంపేశాడు. వెంటనే రెండో తమ్ముడికి దగ్గరకు చేరుకుని అతడిని నరికివేశాడు. తండ్రిని కూడా ఇదే విధంగా హత్య చేసిర పరారయ్యాడు. మల్లేష్ సైకోగా వ్యవహరిస్తుంటాడని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా తల్లిపై మల్లేష్ ఘర్షణకు పాల్పడ్డాడని, దీనితో వీరందరినీ వదిలేసిన ఆ తల్లి పుట్టింట్లో ఉంటోందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

పెద్ద వంకలో రోడ్డు ప్రమాదం...

చిత్తూరు : శాంతిపురం (మం) పెద్దవంకలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నారాయణమ్మ, మమత, యశ్వంత్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి విక్రమార్క...

నల్గొండ : మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ కుటుంబాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పరామర్శించారు. శ్రీనివాస్ హత్య వెనుక పెద్దల హస్తం ఉందని, పోలీసు వ్యవస్థ ఉందో లేదో అనుమానం కలుగుతోందన్నారు. 

14:26 - January 28, 2018

అనంతపురం : ప్రజా సమస్యలపై పోరాడానికి ఎన్ని దెబ్బలైనా పడుతానని, ప్రజాక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం కదిరి కరవు సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్టి నిర్వహిస్తున్నారు. వలసల నిమిత్తం తన కొడుకు విదేశాలకు వెళ్లి ఇరుక్కపోయాడని..తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడని ఓ తల్లి వాపోయింది. తన కొడుకును రక్షించాలని వేడుకుంది. సమస్యల పరిష్కారంం కోసం తీసుకెళ్లే విధానం చూడాలని..తన దగ్గర మంత్రదండం లేదని..తన దగ్గర చిత్తశుద్ధి ఉందన్నారు.

2009లో తిరుగుతున్న సమయంలో వలసలతో వెళ్లిన వ్యక్తుల బాధలు పరిష్కరించాలంటూ వారి కుటుంబాలు..బాధితుల తరపు అభ్యర్థలను వచ్చాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని ఎంతో మంది చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సమస్యకు ఒక విధి విధానాలు ప్రకటించారని, కానీ ఇక్కడ అలాంటిది చేయలేదని తెలిపారు. అక్కడ వెళ్లిపోయి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని కాపాడే విధంగా ఏపీ ప్రభుత్వం పలు విధానాలు రూపొందించాలని సూచించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తానని, సినిమాల్లోగా రెండు గంటల్లో పూర్తి కాదని తెలిపారు. ప్రధాన మంత్రి ఇచ్చే నివేదికలో ఈ సమస్య కూడా జోడిస్తానన్నారు. కానీ ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేరకపోతే వారిని నిలదీయాలని..అందులో తనను కూడా నిలదీయవచ్చన్నారు. 

ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరితే నిధులు లేవని ప్రభుత్వాలు పేర్కొంటాయని, అనంతపురం వెనుకబడి ఉన్న జిల్లా అని, రాష్ట్రం విడిపోయిన అనంతరం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సినవసరం ఉందన్నారు. దళారీ వ్యవస్థ వల్ల నలిగిపోతున్నామని, కష్టపడి పండించిన పంటలు రక్షించుకోవాలంటే శీతలగిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. బెంగళూరులో తాను స్పోర్ట్స్ ట్రైనింగ్ లో పాల్గొనే సమయంలో జిల్లాకు వచ్చిన వారు కనబడుతుంటారని, అనంతలో నిరక్షరాస్యత అధికంగా ఉందన్నారు. అనంత జిల్లాకు ఎన్నో ప్రాజెక్టులు కేటాయించారని, కానీ పనులు కనబడడం లేదన్నారు. 

లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి విక్రమార్క...

నల్గొండ : మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ కుటుంబాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పరామర్శించారు. శ్రీనివాస్ హత్య వెనుక పెద్దల హస్తం ఉందని, పోలీసు వ్యవస్థ ఉందో లేదో అనుమానం కలుగుతోందన్నారు. 

ప్రజాక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చా - పవన్...

అనంతపురం : ప్రజా సమస్యలపై పోరాడానికి ఎన్ని దెబ్బలైనా పడుతానని, ప్రజాక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కదిరి కరవు సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్టి నిర్వహిస్తున్నారు. సమస్యలు తీసుకెళ్లే విధానం చూడాలని..తన దగ్గర మంత్రదండం లేదని..తన దగ్గర చిత్తశుద్ధి ఉందన్నారు.

 

బొడ్డుపల్లి లక్ష్మీ ఇంటి వద్ద ఉద్రిక్తత...

నల్గొండ : మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్యకర్తలు..శ్రీనివాస్ బంధువులు అడ్డుకున్నారు. 

తమన్నాపై చెప్పు విసిరిన ఆకతాయి...

హైదరాబాద్ : సినీ నటి తమన్నాపై ఆకతాయి చెప్పు విసిరాడు. నారాయణగూడలో గోల్డ్ షాప్ ఓపెనింగ్ వచ్చిన తమన్నాపై కిరీమొద్దీన్ అనే యువకుడు చెప్పు విసిరాడు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:56 - January 28, 2018

జీఎస్టీ సినిమాను నిలిపి వేయాలని వక్తలు అన్నారు. జీఎస్టీ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలను ఆపాల్సిన అవసరముందన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామాదేవి, సైకాలజీ డాక్టర్ శైలజ, ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొని, మాట్లాడారు. సెక్స్ సినిమాలను సెన్సార్ చేయాలన్నారు. స్త్రీ లైంగిక దోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది మానవ శరీరాన్ని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేనివారు మనుషుల మధ్య ఉండే హక్కు లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

బెంగళూరులో రెండో రోజు కొనసాగుతోన్న ఐపీఎల్ వేలం

కర్నాటక : బెంగళూరులో రెండో రోజు ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. మన్ దీప్ సింగ్ రూ.1.4కోట్లు (ఆర్ సీబీ), మనోజ్ తివారీ రూ.కోటి(పంజాబ్), వాషింగ్టన్ సుంధర్ రూ.32కోట్లు (ఆర్ సీబీ), పవన్ నెగి రూ.కోటి ( ఆర్ సీబీ), డానియల్ క్రిస్టియన్ రూ.1.5 కోట్లు (ఢిల్లీ).  

ప్రజాస్వామ్యం అపహాస్యం అమలవుతుంది : తమ్మినేని

హైదరాబాద్ : ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎస్ వీకే లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సమానత్వం మ్రాతమే కాదు...ఆర్థిక, సామాజిక సమానత్వాలు సాధించాలని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ఓటు హక్కు వక్రీకరించబడుతుందన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని వాపోయారు. 

12:52 - January 28, 2018

హైదరాబాద్ : ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎస్ వీకే లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సమానత్వం మ్రాతమే కాదు...ఆర్థిక, సామాజిక సమానత్వాలు సాధించాలని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక, సామాజిక సమానత్వాలు రాకుండా రాజకీయ సమానత్వం మాత్రమే కొనసాగితే..చివరికి రాజకీయ సమానత్వం కూడా మిగలదని చెప్పారని తెలిపారు.  
ఆర్థిక, సామాజిక సమానత్వాలు రాకుంటే రాజకీయ సమానత్వం కొల్లగొట్టబడుతుందన్నారు. ఓటు హక్కు వక్రీకరించబడుతుందన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని వాపోయారు. 'రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు సంక్రమించడతాయి..కొత్త దేశాన్ని చూడబోతున్నాం.. ఆ దేశంలో ప్రతి మనిషికి ఓటు ఉంటుంది..ప్రతి ఓటుకు సమాన విలువు ఉంటుంది.. కానీ మనుషుల మధ్య మాత్రం సమాన విలువులుండవని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ఓటుకు మాత్రం సమాన విలువు ఉంది...ఆ ఓటున్న మనుషులు మాత్రం సమానం కాదన్నారు. అందరికీ ఒకటే ఓటని అంబానీకి, అదానికి, రిక్షా కార్మికుడికి ఒకటే ఓటు ఉంటుందని చెప్పారు. ఓడించడంలో, గెలిపించడంలో అంబానీకి, రిక్షా కార్మికుడికి సమానమైన విలువ ఉందన్నారు. కానీ అంబానీని, రిక్షా కార్మికుడిని సమాజం సమానంగా గౌరవించదన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ పెరగడానికి ఉన్న అవకాశాలన్ని రాజ్యాంగంలో ఉన్నాయన్నారు. మన రాజ్యాంగం ప్రైవేట్ ప్రాపర్టీని అదుపు చేసే రాజ్యాంగం కాదన్నారు. రాజ్యాంగంలో ఆర్థిక, సామాజిక సమానత్వాలకు అవకాశం లేదని తెలిపారు. 

 

12:36 - January 28, 2018

ఢిల్లీ : రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం  ఇవాళ సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటరీ వ్యవవహారాల మంత్రి అనిల్‌కుమార్‌ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో అన్నిపార్టీల లోక్‌సభాపక్షనేతలు పాల్గొంటున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో  సహకరించాలని అన్నిపార్టీల నేతలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయానున్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి దశ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే 2018-19 ఆర్థికసర్వేను  అరుణ్‌జైట్లీ  పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 

12:23 - January 28, 2018

రంగారెడ్డి : జిల్లాలోని ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వైఎస్సార్‌ నగర్‌లో ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. 29 బైక్‌లు, 2 ఆటోలు, 1 మారుతి ఓమ్ని, 46 లిక్కర్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎనమిది మంది నిందితులను అదుపులోకి తీసుకునట్లు డీసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. మొత్తం 235 మంది పోలీస్‌ సిబ్బంది ఈ కార్డెన్‌ సర్చ్‌లో పాల్గొన్నారు. 

12:20 - January 28, 2018

మేడ్చల్ : ప్రతి మనిషికి శారీరక, మానసిక ఉల్లాసం శారీరక శ్రమతోనే సాధ్యమవుతుందన్నారు సినీ సంగీత దర్శకులు అనూప్‌రూబెన్స్‌. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లోని సిమ్‌ లయన్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ ఆధ్వర్యంలో ఉత్తమ ఫిట్‌నెస్‌ అవార్డుల ప్రదానోత్సవానికి అనూప్‌ రూబెన్స్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ ఫిట్‌నెస్‌ సాధించిన మహిళలకు, పురుషులకు బెస్ట్‌ వెయిట్‌ లాస్‌, బెస్ట్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, బెస్ట్‌ ట్రైనర్‌ అవార్డులను అందజేశారు. 


 

12:19 - January 28, 2018

కరీంనగర్ : సాంకేతిక ఉద్యోగాలవైపు యువత పరిగెడుతుంటే కరీంనగర్‌ యువత మాత్రం ఆర్మీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఆర్మీలో చేరడానికి ఇప్పటికే ఫిజికల్‌, మెడికల్‌ పరీక్షల్లో అర్హత సాధించిన 205 మంది, రేపు జరగబోయే రాత పరీక్షల్లో విజయం సాధిస్తామంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీలో కఠోర సాధన చేస్తూ.. దేశాన్ని కాపాడే జవాన్‌గా తయారవ్వడమే తమ లక్ష్యం అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:16 - January 28, 2018

చిత్తూరు : తిరుపతిలో ఆర్టీసీ బస్సులు  బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బాలాజీలింక్‌ బస్టాండ్‌లో ఓ భక్తునిపైకి ఆర్టీసీబస్సు దూకెళ్లిన ఘటలనో ఓ భక్తుడు మృతి చెందాడు. అయితే భక్తునివద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు అన్నమయ్యసర్కిల్‌ వద్ద కోమలమ్మ అనే వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 

12:14 - January 28, 2018

ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 తొలి రోజు వేలంలోనే పెద్ద సంచలనాలు నమోదయ్యాయి.టాప్‌ క్లాస్‌  ఆల్‌రౌండర్లు, లెగ్‌ స్పిన్నర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మరోసారి జాక్‌ పాట్‌ కొట్టగా....భారత అంతర్జాతీయ ఆటగాళ్లు మనీష్‌ పాండే, రాహుల్‌లను సన్‌రైజర్స్ , కింగ్స్ పంజాబ్‌ జట్లు రికార్డ్‌ ధరకు దక్కించుకున్నాయి.   
కొంతమంది క్రికెటర్లు జాక్‌ పాట్‌ 
ధనా ధన్‌ ట్వంటీ ట్వంటీ లీగ్‌...ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 సీజన్‌ వేలంలో కొంతమంది క్రికెటర్లు జాక్‌ పాట్‌ కొట్టగా....మరికొంత మంది క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. అందరూ ఊహించినట్టుగానే ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడగా......రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు 12.5 కోట్లకు దక్కించుకుంది. మనీష్‌ పాండే, రాహుల్‌ వంటి భారత అంతర్జాతీయ ఆటగాళ్ల కోసం సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్‌ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. క్రిస్‌ గేల్‌, జో రూట్‌, జేమ్స్‌ ఫాక్నర్‌, లసిత్‌ మలింగా, జోష్‌ హేజిల్‌వుడ్‌, హషీమ్‌ ఆమ్లా, మార్టిన్‌ గప్తిల్‌ ,టిమ్‌ సౌథీ వంటి ఇంటర్నేషనల్‌ స్టార్‌ క్రికెటర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.  
ఆటగాళ్ల వివరాలు 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 ఆక్షన్‌ తొలి రోజు 5 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంతో ఫ్రాంచైజీలు సొంతంచేసుకున్న ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
బెంజమిన్ స్టోక్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌- 12.5 కోట్లు
మనీష్‌ పాండే - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - 11 కోట్లు
కె ఎల్‌ రాహుల్‌ - కింగ్స్ పంజాబ్‌ - 11 కోట్లు 
క్రిస్‌ లిన్‌ - కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ -9.60 కోట్లు 
మిషెల్‌ స్టార్క్‌ - కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ -9.40 కోట్లు
గ్లెన్‌ మాక్స్‌వెల్‌ -ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ - 9 కోట్లు
రషీద్‌ ఖాన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - 9 కోట్లు 
సంజూ శాంసన్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ -8 కోట్లు 
కేదార్‌ జాదవ్‌ -చెన్నై సూపర్‌ కింగ్స్- 7.8 కోట్లు
అశ్విన్‌ - కింగ్స్ పంజాబ్‌ - 7.6 కోట్లు
క్రిస్‌ ఓక్స్‌ - రాయల్‌ చాలెంజర్స్‌ - 7.4 కోట్లు
దినేష్‌ కార్తీక్‌ - కోల్‌కతా నైట్‌రైడర్స్ - 7.4 కోట్లు 

డ్వేన్ బ్రావో - సూపర్‌ కింగ్స్‌ - 6.4 కోట్లు
రాబిన్‌ ఉతప్ప- కోల్‌కతా నైట్‌రైడర్స్ - 6.4 కోట్లు 
ఆరోన్‌ ఫించ్‌- కింగ్స్ పంజాబ్‌ - 6.2 కోట్లు
మార్కస్ స్టోయినిస్‌- కింగ్స్ పంజాబ్‌ - 6.2 కోట్లు
యజ్వేంద్ర చహాల్‌ -రాయల్‌ చాలెంజర్స్‌ -6 కోట్లు 
కుల్దీప్‌ యాదవ్‌ - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - 5.8 కోట్లు
కరుణ్‌ నాయర్‌- కింగ్స్ పంజాబ్‌ - 6.2 కోట్లు
ప్యాట్‌ కమిన్స్‌ - ముంబై ఇండియన్స్‌ - 5.4 కోట్లు 
కీరన్ పోలార్డ్‌ - ముంబై ఇండియన్స్‌ - 5.4 కోట్లు 
శిఖర్‌ ధావన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - 5 కోట్లు 
కర్న్‌ శర్మ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ - 5 కోట్లు 
సాహా - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - 5 కోట్లు 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 వేలంలోనూ ఎప్పటిలానే టాప్‌ క్లాస్‌  ఆల్‌రౌండర్లు, లెగ్‌ స్పిన్నర్ల కోసం పోటీలు పడ్డ  ఫ్రాంచైజీలు...కోట్లు వెచ్చించడం విశేషం. 

11:54 - January 28, 2018

అనంపతపురం : పట్టణంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కదిరిలోని మంత్రి పరిటాల సునీతను జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ కలిశారు. కరువుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం కరువు సమస్యలపై ప్రధానమంత్రికి ఇచ్చిన నివేదికలో పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రిని కలిసినట్లు పవన్‌ తెలిపారు. ప్రాజెక్టు వివరాలు అన్ని సేకరించానని పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు. అందరూ కలిసి వస్తేనే అనంతపురం కరువు సమస్యను ఎదుర్కోగలమని పవన్‌ చెప్పారు. అనంతపురంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పరిటాల సునీత. ఇందుకోసం చంద్రబాబు తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే అనంతపురంకు 90 శాతం నీరందుతుందని తెలిపారు. 

 

11:50 - January 28, 2018

విజయవాడ : దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని మొదటగా ప్రమోట్‌ చేసింది తానే ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ప్రకృతిలో మమేకం కావడం కోసం విజయవాడలో సూర్య ఆరాధనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సూర్యుని ప్రాముఖ్యత మతానికో కులానికో పరిమితం కాలేదని, అందుకే సన్‌ రైస్‌ ఆంధ్రప్రదేశ్‌గా నామకరణం చేశామన్నారు. ప్రజాహిత వేడుకగా, రాష్ట్ర ఉత్సవంగా సూర్య ఆరాధన చేపట్టాలన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు సూర్యనమస్కారాలు చేశారు.

 

11:48 - January 28, 2018

కర్నూలు : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. కర్నూలు పట్టణంలో ఉండే రిజ్వాన్‌, హినా కు ఏడాది క్రితం వివాహం అయింది. వీరికి మూడునెలల పాపకూడా ఉంది. కాగా మూడు రోజుల క్రితం భార్యపై కిరోసిన్‌పోసి నిప్పంటించి చంపేశాడని భర్త రిజ్వాన్‌పై మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు నెలల పసిపాపతో రిజ్వాన్‌ ఇంటిముందు నిరసనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

11:44 - January 28, 2018

రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్‌ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఇవాళ  ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు కాచిగూడకు చెందిన ప్రవీణ్‌ , మహబూబ్‌నగర్‌కు చెందిన డేవిడ్‌గా పోలీసులు గుర్తించారు. మరో మృతుడు అర్జున్‌ వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా  ఫేస్‌బుక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన శ్రావణ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  హైదారాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించారు. చేవెళ్ల  పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

11:33 - January 28, 2018
11:33 - January 28, 2018
11:23 - January 28, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సుజాతనగర్ గ్రామపంచాయతీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అక్రమాలకు పాల్పడుతుందని.. విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల కోడ్‌ను పట్టించుకోని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. డబుల్‌బెడ్‌రూ ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్లు కట్టిస్తామని.. ఓటర్లనుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల అధికారపార్టీ కార్యకర్తలు  ఓటర్లకు  డబ్బు పంచుతుండగా కెమెరాకు చిక్కారు. దీనిపై ప్రశ్నించగానే సమాధానం దాటవేసిన ఎమ్మెల్యే జలగం వెంట్రావు అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై సుజాతానగర్‌ గ్రామస్తులు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:58 - January 28, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సుజాతనగర్ గ్రామపంచాయతీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అక్రమాలకు పాల్పడుతుందని.. విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల కోడ్‌ను పట్టించుకోని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. డబుల్‌బెడ్‌రూ ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్లు కట్టిస్తామని.. ఓటర్లనుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల అధికారపార్టీ కార్యకర్తలు  ఓటర్లకు  డబ్బు పంచుతుండగా కెమెరాకు చిక్కారు. దీనిపై ప్రశ్నించగానే సమాధానం దాటవేసిన ఎమ్మెల్యే జలగం వెంట్రావు అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై సుజాతానగర్‌ గ్రామస్తులు మండిపడుతున్నారు. 

 

10:54 - January 28, 2018

కడప : జిల్లా విద్యుత్‌శాఖ అధికారి లంచావతారం బయటపడింది. పుల్లంపేట విద్యుత్‌శాఖలో లైన్‌ఇన్‌స్పెక్టర్‌ శివయ్య లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. కొత్తగా ఇల్లుకట్టుకోవాలని, అడ్డంగా ఉన్న విద్యుత్‌ లైన్లను తొలగించాలని అర్జీపెట్టుకున్నా  విద్యుత్‌ అధికారి స్పందించలేదు. చివరికి 15వేలు లంచం ఇస్తే విద్యుత్‌ వైర్లను తొలగిస్తానని చెప్పడంతో.. ఆమేరకు 12వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అనుకున్న ప్రకారం బాధితులు లంచం ముట్టజెప్పారు. అధికారి డబ్బు తీసుకుంటుండగా సెల్‌ఫోన్‌తో రికార్డు చేశారు. సీక్రెట్‌ కెమెరా సాక్షిగా లంచం తీసుకుంటూ దొరికిపోయినా.. లైన్‌ఇన్‌స్పెక్టర్‌ శివయ్య తాను ఎలాంటి డబ్బు డిమాండ్‌ చేయలేదని బుకాయించడం కొసమెరుపు. 

అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతా : పవన్ కళ్యాణ్

అనంతపురం : జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతానని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చెప్పారు. జిల్లాలో రెండు, మూడు పర్యటనలు చేస్తానని చెప్పారు. ఏపీలోని సమస్యలపై ప్రధానికి నివేదిక ఇస్తానని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలు సాధ్యం కానప్పుడు ప్రజలను మభ్యపెట్టకుండా నిజాయితీగా చెప్పాలన్నారు. పొత్తులపై ఎన్నికల సమయంలో మాట్లాడుతానని తెలిపారు. 

 

అందరూ కలిసివస్తేనే సమస్యలు ఎదుర్కోగలం : పవన్ కళ్యాణ్

అనంతపురం : ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఎవరికి మద్దతు ఇవ్వాలి.. ఎవరితో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పరిటాల సునీతతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురంలోని సమస్యలను అర్థం చేసుకునేందుకే పరిటా సునీతను కలిశానని తెలిపారు. అందరూ కలిసి వస్తేనే జిల్లాలోని సమస్యలను ఎదుర్కోగలమని చెప్పారు. 

10:44 - January 28, 2018

ఢిల్లీ : 69గణతంత్ర వేడుకలను  ఘనంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. అసాధారాణ రీతిలో భద్రతా చర్యలను తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితోపాటు ఈసారి వేడుకలకు ముఖ్యఅతిధులుగా హాజరైన ఆసియాన్‌ దేశాల అధినేతలకు కూడా భారీస్థాయిలో భద్రతను కల్పించింది. అతిధులు గణతంత్ర వేడుకలను వీక్షించిడానికి ఏర్పాటు చేసిన స్టేజ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగినా ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా.. కదిలే స్టేజ్‌ను ఏర్పాటు చేసింది. వేడుకలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం స్టేజిని తొలగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:39 - January 28, 2018

అనంతపురం : ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఎవరికి మద్దతు ఇవ్వాలి.. ఎవరితో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పరిటాల సునీతతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురంలోని సమస్యలను అర్థం చేసుకునేందుకే పరిటా సునీతను కలిశానని తెలిపారు. అందరూ కలిసి వస్తేనే జిల్లాలోని సమస్యలను ఎదుర్కోగలమని చెప్పారు. అందరు కలిసివస్తేనే అనంతపురం జిల్లాలోని కరువును నిర్మూలించవచ్చన్నారు. అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. జిల్లాలో రెండు, మూడు పర్యటనలు చేస్తానని చెప్పారు. ఏపీలోని సమస్యలపై ప్రధానికి నివేదిక ఇస్తానని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలు సాధ్యం కానప్పుడు ప్రజలను మభ్యపెట్టకుండా నిజాయితీగా చెప్పాలన్నారు. పొత్తులపై ఎన్నికల సమయంలో మాట్లాడుతానని తెలిపారు. 

 

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. 

 

రాష్ట్రానికి అంబాసిడర్ గా సూర్యుడు : సీఎం చంద్రబాబు

విజయవాడ : సూర్య ఆరాధన కోసం శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి అంబాసిడర్ గా సూర్యుడిని చేశామని తెలిపారు. సూర్యుడిని నమ్ముకున్న రాష్ట్రం ఏపీ అని.. అందుకు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేశామని చెప్పారు. సన్ లైట్ వల్ల క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్ తగ్గడంతోపాటు అనేక రోగాలు నయం అవుతాయని వైద్యులు తెలిపారని చెప్పారు. సన్ లైట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. 

అమ్మకు వందనం పెట్టాలి : సీఎం చంద్రబాబు

విజయవాడ : అమ్మకు వందనం పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. మనది తల్లిని గౌరవించే సంస్కృతి అని తెలిపారు. అందుకే అమ్మకు వందనం తీసుకొచ్చామని తెలిపారు. 

రైతు చేసే కృషికి సంఘీభావం తెలపాలి. : సీఎం చంద్రబాబు

కృష్ణా : అందరికీ తిండి పెట్టే రైతును గౌరవించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సూర్య ఆరాధన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. రైతు చేసే కృషికి అందరం సంఘీభావం తెలపాలన్నారు. అందుకే ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మనకు తిండి వచ్చేది ఫ్యాక్టరీ నుంచి కాదు.. పొలం నుంచి వస్తుందన్నారు. తిండిని రైతు ఉత్పత్తి చేస్తాడని చెప్పారు. రైతు పవిత్రభావంతో ముందుకు పోతాడని  తెలిపారు. వ్యవసాయ సీజన్ లో రైతు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తాడని చెప్పారు. 

10:04 - January 28, 2018

అనంతపురం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. పవన్ కు పరిటాల శ్రీరామ్ స్వాగతం పలికారు. సునీతతో పవన్ సమావేశం అయ్యారు. జిల్లాలోని సమస్యలు, నీటి ప్రాజెక్టులపై మంత్రితో పవన్ చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ రెండోరోజు పర్యటన

అనంతపురం : జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ తాము జనసేన పార్టీతో ఉంటామని చెప్పారు. యువతకు జనసేన మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పవన్ జిల్లా సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. 

10:00 - January 28, 2018

కృష్ణా : అందరికీ తిండి పెట్టే రైతును గౌరవించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సూర్య ఆరాధన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. రైతు చేసే కృషికి అందరం సంఘీభావం తెలపాలన్నారు. అందుకే ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మనకు తిండి వచ్చేది ఫ్యాక్టరీ నుంచి కాదు.. పొలం నుంచి వస్తుందన్నారు. తిండిని రైతు ఉత్పత్తి చేస్తాడని చెప్పారు. రైతు పవిత్రభావంతో ముందుకు పోతాడని  తెలిపారు. వ్యవసాయ సీజన్ లో రైతు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తాడని చెప్పారు. అమ్మకు వందనం పెట్టాలన్నారు. మనది తల్లిని గౌరవించే సంస్కృతి అని తెలిపారు. అందుకే అమ్మకు వందనం తీసుకొచ్చామని తెలిపారు. సూర్య ఆరాధన కోసం శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రానికి అంబాసిడర్ గా సూర్యుడిని చేశామని తెలిపారు. సూర్యుడిని నమ్ముకున్న రాష్ట్రం ఏపీ అని.. అందుకు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేశామని చెప్పారు. సన్ లైట్ వల్ల క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్ తగ్గడంతోపాటు అనేక రోగాలు నయం అవుతాయని వైద్యులు తెలిపారని చెప్పారు. సన్ లైట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. 

 

09:52 - January 28, 2018

అనంతపురం : జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ తాము జనసేన పార్టీతో ఉంటామని చెప్పారు. యువతకు జనసేన మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పవన్ జిల్లా సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:48 - January 28, 2018

మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్

అనంతపురం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. పవన్ కు పరిటాల శ్రీరామ్ స్వాగతం పలికారు. సునీతతో పవన్ సమావేశం అయ్యారు. జిల్లాలోని సమస్యలపై మంత్రితో చర్చించారు. 

నేడు విజయవాడలో సూర్య ఆరాధన కార్యక్రమం

విజయవాడ : ఇందిరా గాంధీ స్టేడియంలో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. 

నేడు అనంతపురం జిల్లాలో రెండోరోజు పవన్ కళ్యాణ్ పర్యటన

అనంతపురం : నేడు అనంతపురం జిల్లాలో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 

నేడు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్ ఫైనల్

హైదరాబాద్ : నేడు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్ ఫైనల్ జరుగనుంది. ఫైనల్ లో ఫెదరర్, మారిన్ సిలిచ్ తలపడునున్నాయి. 

07:20 - January 28, 2018

బీజేపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కీలక పరిణామమని వక్తలు అన్నారు. బీజేపీపై చంద్రబాబు వ్యాఖ్యలు, అనంతపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన అనే అంశాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు, విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్, టీడీపీ నేత రామకృష్ణ, వైసీపీ నేత కొణిజేటి రమేష్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ, టీడీపీ పొత్తు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:13 - January 28, 2018
07:11 - January 28, 2018

కృష్ణా : జిల్లాలోని పెడన మున్సిపాలిటీ అక్రమ లేఅవుట్లకు అడ్డగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేయడం, ప్లాట్లను ప్రజలకు విక్రయించి కొంతమంది సొమ్ముచేసుకుంటున్నారు. పనిలో పనిగా ప్రభుత్వ భూములనూ వదలకుండా విక్రయిస్తున్నారు. పెడన మున్సిపాలిటీలో జోరుగా సాగుతున్న అక్రమ లేఅవుట్ల దందాపై 10టీవీ ప్రత్యేక కథనం..
జోరుగా అనధికార లేఅవుట్ల దందా
కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపాలిటీ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్ల దందా జోరుగా సాగుతోంది. రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల విడిగా అనధికార లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేయడమో.. లేదంటే ప్లాట్లుగా చేసి విక్రయించమో జరుగుతోంది.
ప్రభుత్వ భూములనూ స్వాహా చేస్తున్న రియల్టర్లు
పెడన పురపాలక సంఘం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్నాళ్లుగా కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. లేఅవుట్లను ఆనుకుని ప్రభుత్వ భూములు ఉంటే వాటిని స్వాహా చేస్తున్నారు. మున్సిపాలిటీ స్థలాలను ప్లాట్లుగా చేసి యథేచ్చగా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్ననాథుడే కరువయ్యాడు.
మున్సిపాలిటీ పరిధిలో 33 అనధికార లేఅవుట్లు
పెడన మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 33 అనధికార లేఅవుట్లు ఉన్నట్టు రెవెన్యూ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  పెడనలో అక్రమ లేఅవుట్లపై 2014 నవంబర్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీ నేతలు అధికారపక్షాన్ని నిలదీశారు. దీంతో అధికారపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కేసింది. కాలం గిర్రున తిరిగింది. సీన్‌ రివర్స్‌ అయ్యింది.  వైసీపీకి చెందిన బండారు ఆనంద్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో మరోసారి అక్రమ లేఅవుట్ల అంశం తెరపైకి వచ్చింది.
విజిలెన్స్‌ విచారణతో అక్రమ లేఅవుట్ల దందా బట్టబయలు
పెడన మున్సిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆనంద్‌ ప్రసాద్‌ అక్రమ లేఅవుట్లపై దృష్టిసారించారు. దీనిపై విజిలెన్స్‌ డీజీ అనురాధను కలిసి ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలను సమర్పించారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు అక్రమ లేఅవుట్ల బాగోతం బట్టబయలు చేశారు. పెడనలో అక్రమ లేఅవుట్లు రాజ్యమేలుతున్నాయని నిర్దారించారు. 
ప్రత్యేక అధికారి పాలనలో రియల్‌ దందా
అక్రమ లేఅవుట్లు ఉన్నట్టు తేల్చిన విజిలెన్స్‌... దీనికి బాధ్యులు ఎవరన్న దానిపైనా దృష్టిసారించింది. పురపాలక సంఘానికి పాలకవర్గం లేని సమయంలో ఈ దందా కొనసాగినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. ప్రత్యేక అధికారి పాలనలో కొంతమంది ఉద్యోగుల సహకారంతో అనధికార లేఅవుట్లకు బీజం పడింది. అక్కడి నుంచి ఈ దందా మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్ల మాదిరిగా విస్తరించింది. ఈ అంశాలన్ని విజిలెన్స్‌ తన నివేదికలో పొందుపర్చి ప్రభుత్వానికి అందజేసింది. విజిలెన్స్‌ విచారణలో అక్రమాలు రుజువుకావడంతో ఇద్దరు మున్సిపల్‌ కమిషనర్లతోపాటు మరో నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్‌వేటు పడింది. 
పురపాలక సంఘానికి కోట్లలో నష్టం
ఇప్పటి వరకు విజిలెన్స్‌ పరిశీలించింది కేవలం నాలుగు లేఅవుట్లే. ఇప్పటి వరకు పరిశీలించిన నాలుగు లేఅవుట్లతోనే పురపాకల సంఘానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అనధికార లేఅవుట్ల కారణంగా పెడన మున్సిపాలిటీ సుమారు ఆరుకోట్ల ఆదాయం కోల్పోయింది. వ్యవసాయ భూములను నివాస భూములుగా మార్చితే రెవెన్యూ విభాగానికి కన్వర్షన్‌ ఫీజు కింద ఎకరానికి 4లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డెవలప్‌మెంట్‌ చార్జీల కింద 14శాతం ఫీజు చెల్లించాలి. అనుమతులు లేకుండా అనధికారికంగా లేఅవుట్లు వేయడంతో మున్సిపాలిటీ ఈ ఆదాయాన్ని కోల్పోయింది. విజిలెన్స్‌ ఇంకా 26 లేఅవుట్లను పరిశీలించాల్సి ఉంది.  ఇందులోనూ విచారణ చేపడితే పెద్దమొత్తంలో పురపాలకసంఘానికి నష్టం వాటిల్లినట్టు వెలుగుచూసే అవకాశముంది.
18సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన చైర్మన్‌  
పెడన మున్సిపాలిటీకి గతంలో చైర్మన్‌గా పనిచేసిన వేణుగోపాల్‌ 18 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. ప్రజలకు మేలు చేయాల్సిన చైర్మనే ప్రజల ఆస్తిని కాజేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. తనపై కావాలనే వైసీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని మాజీ చైర్మన్‌ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
చైర్మన్‌ చర్యలు ఏమేరకు ఫలితాన్నిస్తాయో ?
పురపాలక సంఘానికి సంబంధించిన విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కావడంపైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ ప్రసాద్‌ చెబుతున్నారు. అనధికార అలేవుట్లు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మరి చైర్మన్‌గారి చర్యలు ఏమేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.

 

07:03 - January 28, 2018

హైదరాబాద్ : ఏపీలో కోడిపందేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకాలేదు. ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. పందేలు నియంత్రించడంలో అధికారులు విఫలం అయ్యారు. అధికారపార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. దీంతో ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. రేపు హైకోర్టు కోడి పందేలపై విచారణ చేపట్టనుంది. దీంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కోడి పందేలు
కోడి పందేలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. సంక్రాంతి పండుగకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఏపీలో కోడిపందేలు జోరుగా సాగాయి. బరుల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరిగాయి. గుండాట, పేకాటతోపాటు ఇతర ఆటలు కొనసాగాయి. మద్యం ఏరులైపారింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కోడి పందేలు యథేచ్చగా జరిగాయి. వీటిని కట్టడి చేయాల్సిన పోలీసులు.. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. బరుల్లో కోడిపందేలు జరుగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగాయి. కోళ్ల కాళ్లకు కత్తులుకట్టి నిర్వాహకులు పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పందేలకు దూరంగా ఉండాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోలేదు. అధికారపార్టీకి చెందిన నేతలే స్వయంగా పందేలు నిర్వహించారు. 
కోడిపందేలపై హైకోర్టు అసహనం
సంక్రాంతి సమయంలో ఏపీలో యథేచ్చగా కోడిపందేలు జరగడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము సూచించిన  సూచనలు, ఆదేశాలను అధికారులు అవహేళన చేశారని కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా విచ్చలవిడిగా కోడిపందేలు జరిగాయని... అధికారులు ఎక్కడా అడ్డుకున్న దాఖలాలు కూడా లేవని మండిపడింది.  కోడిపందేలకు ప్రజాప్రతినిధులే హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది.  కోడిపందేల విషయంలో సరైన చర్యలు చేపట్టలేమని కోర్టుకు వివరిస్తే బాగుండేదంటూ ఏపీ సీఎస్‌, డీజీపీలను ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  తమ ఆదేశాలను అమలుచేయకపోగా.. నివేదికలు ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. తమ ఆదేశాల మేరకు నివేదికలు సమర్పించనందుకు సీఎస్‌, డీజీపీలను స్వయంగా కోర్టుముందు హాజరుకావాలని ఆదేశించింది. జనవరి 29కి విచారణను వాయిదా వేస్తూ ఈనెల 22న ఆదేశాలిచ్చింది.
ఈనెల 29న తదుపరి విచారణ
29న డీజీపీల అంతరాష్ట్ర సమావేశం ఉండడంతో తనకు కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని డీజీపీ అభ్యర్థించారు. దీంతో డీజీపీ అభ్యర్థనను కోర్టు మన్నించి మినహాయింపు ఇచ్చింది. సీఎస్‌ మాత్రం 29న తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 29న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

 

Don't Miss