Activities calendar

29 January 2018

తమిళనాడు ప్రతిపక్షాల ఆందోళన...

తమిళనాడు : ఆర్‌టిసి బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షపార్టీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. కొలత్తూరులో డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ నేతృత్వంలో అఖిలపక్ష కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఘనంగా బీటింగ్ రిట్రీట్...

ఢిల్లీ : బీటింగ్ రిట్రీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరిగింది. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో జరిగిన ఈ వేడుకలో... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 

గుడుంబా పునరావాసన యూనిట్ల పంపిణి కార్యక్రమంలో గందరగోళం

హైదరాబాద్ : గుడుంబా పునరావాసన యూనిట్ల పంపిణి కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. కొందరికి మాత్రమే లబ్ది చేకూర్చుతున్నారంటూ హైదారాబాద్ పీపుల్స్‌ ప్లాజాలో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. 

గుడుంబా పునరావాసన యూనిట్ల పంపిణి కార్యక్రమంలో గందరగోళం

హైదరాబాద్ : గుడుంబా పునరావాసన యూనిట్ల పంపిణి కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. కొందరికి మాత్రమే లబ్ది చేకూర్చుతున్నారంటూ హైదారాబాద్ పీపుల్స్‌ ప్లాజాలో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. 

21:23 - January 29, 2018

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల చట్టబద్ధతపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాప అధ్యక్షులు కృష్ణ మాదిగ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదని.. మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని.. దానికి అన్ని పార్టీలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ఎమ్మార్పీఎస్‌ పోరాటానికి టీజేఏసీ మద్దతు ఎప్పుడూ ఉందని... చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికీ ఒక నిర్ణయం రాకపోవడం చాలా బాధకరమైన విషయమన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం సామాజిక ఉద్యమమని.. సీపీఎం నేత జి.రాములు అన్నారు. అన్ని పార్టీల మద్దతు ఉన్నా.. వర్గీకరణ ఎందుకు జరగడం లేదో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టడానికి సీపీఎం సిద్ధంగా ఉందని రాములు అన్నారు.

ఎస్సీ వర్గీకరణ అనేది అట్టడుగు వర్గాల అంశమని.. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు ఉండడం వల్లే పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి విమర్శించారు. మంద కృష్ణ మాదిగ చేస్తున్న వర్గీకరణ ఉద్యమానికి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. రాహుల్‌ గాంధీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని.. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతమైనందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ అన్నారు. అయితే జాతీయ స్థాయిలో కూడా.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకులకు ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రజా గాయకుడు గద్దర్‌, ఎల్‌. రమణ తదితరులు పాల్గొని.. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

21:20 - January 29, 2018

హైదరాబాద్ : ఒక కుటుంబం.. మూడు హత్యలు. జాలి లేకుండా చిన్నారిని, వృద్ధురాలిని హతమార్చాడు ఓ కిరాతకుడు. ఇంతకీ.. అంత కిరాతకంగా ప్రాణం తీయాల్సిన అవసరం ఏముంది. సహజీవనం చేస్తున్న అపర్ణ, మధుల మధ్య విభేదాలే హత్యలకు కారణమా ? లేక మధు భార్య వేధింపులతో ఈ హత్యలు చేశాడా ? ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది ? పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అపర్ణకు మధు అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది.. అయితే కొంతకాలంగా మధుకు అపర్ణకు మధ్య వివాదాలు తలెత్తాయి దీంతో అపర్ణ.. తల్లి విజయమ్మ, కూతురు కార్తికేయలతో కలిసి విడిగా నివాసం ఉంటోంది. అపర్ణ చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో పని చేస్తుంది... రెండు రోజులుగా అపర్ణ నివాసం ఉంటున్న ప్లాట్ డోర్ తాళం వేసి ఉండడం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని స్థానిక చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు డోరు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా అపర్ణ దారుణహత్యకు గురై రక్తపు మడుగులో పడిఉండగా... కార్తికేయ, విజయలక్ష్మి బెడ్‌పై విగతజీవులుగా పడి

ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయగా మధునే హంతకుడై ఉంటాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.. దీంతో విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే మధు రామచంద్ర పురం పోలిస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు .. దీంతో మధుని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో.. తానే హత్య చేసినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం.

అపర్ణను తాను పెళ్లి చేసుకోలేదని.. సహజీవనం మాత్రమే చేసినట్లు పోలీసుల ముందు మధు చెప్పినట్లు సమాచారం. అయితే.. మధుకు గతంలోనే పెళ్లి అయినట్లు అపర్ణ బంధువులు పోలీసులకు తెలిపారు. మరోవైపు మధు భార్య వేధింపులకు గురి చేయడం వల్లే ఈ హత్యలు జరిగినట్లు కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అపర్ణ, విజయలక్ష్మి ఆస్తిలో వాటా కావాలని.. మధు భార్యను వేధింపులకు గురి చేస్తున్నారని.. ఆ నేపథ్యంలోనే హత్యలు జరిగాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే... అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం వల్లే మర్డర్‌ చేసినట్లు పోలీసుల విచారణలో మధు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే... మంగళవారం ప్రెస్‌మీట్‌లో పోలీసులు అన్ని వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికి ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో మధు భార్య వేధింపులు... అపర్ణకు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే హత్యలు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. అయితే... వీటిపై మంగళవారం క్లారిటీ రానుంది. 

21:18 - January 29, 2018

నెల్లూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఇందుకోసం 74రోజుల సమయం తీసుకున్నారు. వేయి కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. నవంబర్‌ 6న ఇడుపుల పాయలో యాత్ర ప్రారంభమైంది.

21:17 - January 29, 2018

అనంతపురం : 2019 ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందన్నారు పవన్‌కల్యాణ్‌. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని... ప్రజాసమస్యలపై పోరాడేవారికి అండగా ఉంటామన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధిస్తుందన్నారు. సీమ అభివృద్ధి సాధించేవరకు తాను అండగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. హిందూపురంలో కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో పవన్‌కల్యాణ్‌ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ దృష్టి సారించాలన్నారు. స్పెషల్‌ స్టేటస్‌ కేటగిరిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు పవన్‌.

ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న సమస్యలపై మూడున్నరేళ్ల క్రితం పుట్టిన జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్‌కల్యాణ్‌. రాయలసీమ అభివృద్ధి సాధించేవరకు అండగా ఉంటానన్నారు. కష్టాలను ఎదుర్కొందాం... సమస్యలపై పోరాడుదాం... కన్నీళ్లను తుడుచుకుందామన్నారు జనసేనాని. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని... ఎవరితో పొత్తు పెట్టుకోదన్నారు. అయితే.. ప్రజాసమస్యలపై పోరాటం చేసే వారికి అండగా ఉంటుందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ప్రతి జనసేన కార్యకర్త.. ఓ సైనికుడిగా మారాలన్నారు జనసేనాని.

అంతకుముందు ధర్మవరంలో చేనేత కార్మికుల కుటుంబాలతో సమావేశమయ్యారు. చేనేత సమస్యలపై పోరాడుతామన్నారు పవన్‌. అంతరిస్తున్న చేనేత కళను మరింత ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. చేనేతలకు ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరానికి బ్రాండ్‌ పెంచే విధంగా జనసేన బాధ్యత తీసుకుంటుందని.. ప్రపంచ దృష్టి ధర్మవరం వైపు మళ్లే విధంగా కృషి చేస్తామన్నారు పవన్‌. చేనేత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పవన్‌ హామీ ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ మూడు రోజుల పర్యటనతో అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. ఈ సందర్బంగా పవన్‌ను కలిసిన లాయర్లు.. వెనకబడిన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు.

దీనికి పవన్‌కల్యాణ్‌ మద్దతిచ్చారు. ఇక చివరిరోజు పర్యటనలో పవన్‌ ఉదయం .. పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్న పవన్‌.. ట్రస్ట్‌ చేస్తున్న సేవలను కొనియాడారు. తాను సత్యసాయి స్ఫూర్తితో రాజకీయాల్లో ముందుకెళ్తానన్నారు. మొత్తానికి అనంతపురం జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ చేసిన కరవు యాత్ర సక్సెస్‌ కావడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

21:14 - January 29, 2018

ఢిల్లీ : ఎన్డీయే సమావేశంలో.. జమిలీ ఎన్నికలపై తమ అభిప్రాయాలు అడిగినట్లు కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. దీనిపై చంద్రబాబుతో సంప్రదించి తమ వైఖరి చెప్తామని తెలిపినట్లు ఆయన తెలిపారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా సుజనా చౌదరి స్పందించారు. మిత్రపక్ష ధర్మాన్ని పాటించడంపై అమిత్ షా తో చర్చిస్తామన్నారు. త్వరలో అమిత్‌ షాతో సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లు సుజనా చౌదరి తెలిపారు. ఈ భేటీలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కూడా చర్చిస్తామన్నారు.

21:13 - January 29, 2018

ఢిల్లీ : 2017-18 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జిఎస్‌టి వంటి పలు సంస్కరణలు ప్రవేశ పెట్టిన తరుణంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 6.75 శాతంగా ఉండనున్నట్లు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 7 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత మూడేళ్లుగా సరాసరి వృద్ధిరేటు 4 శాతంగా ఉందని సర్వే పేర్కొంది. భవిష్యత్తులో చమురు ధరలు ప్రధానంగా ఆందోళన కలిగించే అంశమని సర్వే అభిప్రాయపడింది. చమురు ధరలు సుమారు 12 శాతం పెరిగే అవకాశముంది. ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసిన క్రమంలో బడ్జెట్‌లో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం కనిపిస్తోంది. 2017-18 వ్యవసాయరంగం వృద్ధి 2.1 శాతంగా ఉంటుందని సర్వే అంచనా.

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి ఫలితంగా 18 లక్షల మంది కొత్తగా పన్నులు కడుతున్నారని, పరోక్ష పన్నుదారుల సంఖ్య 50 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది. సామాజిక భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐసీల చెల్లింపులు 31 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. 2017-18లో ఎగుమతుల వృద్ధిరేటు 12.1 శాతం ఉంటుంది. తయారీ రంగంలో దేశ చరిత్రలో తొలిసారి తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదు చేసినట్లు సర్వే ప్రకటించింది.

2018లో సేవల వృద్ధి 8.3 శాతం, పరిశ్రమల వృద్ధి 4.4 శాతం ఉంటుంది. ఉత్పత్తి రంగం ఈ ఏడాది 8 శాతం వృద్ధి చెందుతుందని సర్వే అంచనా వేసింది. ప్రయివేటు పెట్టుబడులు పుంజుకుంటాయని సర్వే అంచనా వేసింది. విదేశీమారక నిల్వలు వార్షిక ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి 409.4 బిలియన డాలర్లుగా నమోదైనట్లు ఆర్థిక సర్వే తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 8 శాతం పెరిగాయి. నోట్లరద్దు కారణంగా ఆర్థికంగా పొదుపరుల సంఖ్య పెరిగింది. పొదుపు పెరిగినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నమోదు కావడంలేదు. పెట్టుబడులు పెరిగితేనే వృద్ధి నమోదవుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది.

21:11 - January 29, 2018
21:09 - January 29, 2018

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలిసారిగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై విస్తృత చర్చ జరగాలని.... దీనిపై రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రపతి. రైతులు, కార్మికులు, మధ్యతరగతి వర్గాలు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సామాజిక న్యాయం గురించి ప్రస్తావించారు. దేశంలో పేదలు, ఉన్నత వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తన ప్రసంగంలో రైతులు, కార్మికులు, మధ్యతరగతి వర్గాలు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సామాజిక న్యాయం గురించి ప్రస్తావించారు. నవభారత కలలను సాకారం చేసేందుకు 2018ని ముఖ్యమైన సంవత్సరంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. 2019లో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భారత్‌ను స్వచ్ఛదేశంగా మారుద్దామని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై విస్తృత చర్చ జరగాలని.... దీనిపై రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి తెలిపారు. ముస్లిం మహిళల ఏళ్ల నాటి ఆవేదన నుంచి విముక్తి కోసం తలాక్ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. దేశంలో పేదలు, ఉన్నత వర్గాల మధ్య అంతర్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలుకు చేకూర్చేందుకు ఆరోగ్య బీమా, జన ఆషాదీ పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. యువత స్వయం ఉపాధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం... ముద్రా యోజన ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల మందికి లబ్ది చేకూరిందని కోవింద్‌ చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి కోవింద్‌ తెలిపారు. సాగునీటి పారుదల వ్యవస్థను విస్తరించి రైతులకు చేయూతనిస్తామన్నారు. ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లకుండా నిరోధించగలిగామన్నారు. ప్రధాన్‌మంత్రి కిసాన్ బీమా, ఫసల్‌ బీమా పథకాళు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు.

దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం పోరాటం కొనసాగుతుందని రాష్ట్రపతి తెలిపారు. గత ఏడాది 3.50 లక్షలకు పైగా అనుమానస్పద కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. దళారీ విధానాన్ని రూపుమాపేందుకు, పేదల హక్కులకు ఆధార్‌ దోహద పడుతోందన్నారు. ఆధార్‌తో 57 వేల కోట్లు ప్రభుత్వానికి మిగిలాయన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన ద్వారా 3 కోట్ల 30 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా పేద మహిళల కష్టాలు తీరిపోయాయని రాష్ట్రపతి అన్నారు. మెటర్నిటీ బెనిఫిట్‌ కింద గర్భిణీలకు 26 వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడం జరిగిందన్నారు. బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని గ్రామాలకు విస్తరిస్తున్నామని రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. భారత్ నెట్ పథకం ద్వారా రెండు లక్షల గ్రామాలు బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధానం జరిగిందని...రెండున్నర లక్షల పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మైనార్టీ, పేద ప్రజలను బుజ్జగించేందుకు ప్రభుత్వం పనిచేయడం లేదని.. వారి సాధికారతే తమ ప్రభుత్వ మంత్రమని రాష్ట్రపతి తెలిపారు.

21:02 - January 29, 2018

దేశం మొత్తంగా ఎన్నికలు వస్తే బీజేపీ గెలవదని ప్రొ.నాగేశ్వర్ అంచనా వేశారు. జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.నాగేశ్వర్ పాల్గొని విశ్లేషించారు. దేశంలో మాత్రమే అధికారంలో ఉండాలని బీజేపీ యోచిస్తోందని తెలిపారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బాగా పెరిగాయని, 77 శాతం ఒకే పార్టీకి ఓట్లు వేస్తున్నారనే అంచనా అని తెలిపారు. గ్రామ వార్డు నుండి లోక్ సభ వరకు ఎన్నికలకు పెడితే ప్రజలపై ఏ అంశం ప్రభావితం పడుతుందో ఆలోచించాలన్నారు. ఇది ఒక విధంగా ప్రాంతీయ పార్టీలకు గొడ్డలి పెట్టు అని, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలన్నదే వ్యూహమన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే లాభం జరుగుతుందని, మొత్తం ఓట్లలో 50 శాతం నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఓట్లు పడ్డాయన్నారు. బీజేపీ రాజకీయ ప్రాజెక్టులో భాగమని, బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం..ఒకే ఆహారం..ఒకే సంస్కృతి..ఒకే జీఎస్టీ...అనుసరించడం అందులో భాగమన్నారు. ఇది ఒక విధంగా రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఆచరణ సాధ్యం కాదన్నారు. దేశ సమైక్యత కు విఘాతం కాదా ? అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ మెజార్టీ వచ్చి లోక్ సభలో ఎవరికీ మెజార్టీ రాని సమయంలో ఎలా వ్యవహరిస్తారు ? అని సూటిగా ప్రశ్నించారు. మోడీ కేబినెట్ మొత్తం ఢిల్లీ వదిలి గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు అయితే రాష్ట్రాలకు..పంచాయతీ ఎన్నికలు అయితే..ఆయా పంచాయతీలకు వదిలేయాలన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నారని..భారత రాజ్యాంగ నిర్మాతలు భిన్నమైన వ్యవస్థలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాజకీయ అధికారం ఒకే చోట కేంద్రీకృతమైతే ఇతర పరిణామాలు చోటు చేసుకొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గుజరాత్ లో బిజెపి బాగా దెబ్బ తింటుందని, 2014లో 165 అసెంబ్లీ సీట్ల మెజార్టీ వస్తే 2018లో 99 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. 2019లో బిజెపి గెలవడం కష్టమని, రాజస్థాన్..మధ్యప్రదేశ్..ఓడిపోతే 2019లో యాంటీ మోడీ మూడ్ వస్తుందని నాగేశ్వర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:58 - January 29, 2018

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2017-18 ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. 2017-18లో వృద్ధి రేటు 6.7గా నమోదైందని..2018-19కి 7.0 నుండి 7.5గా ఉండవచ్చునని...కానీ భవిష్యత్ లో మాత్రం చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. సెకండ్ క్వార్టర్ లో 2017-18 సంవత్సరానికి 6.3గ్రోత్ గా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 1.7వృద్ధి రేటుగా ఉందన్నారు. మేకిన్ ఇండియా...విదేశీ పెట్టుబడులు..స్వదేశీ పెట్టుబడులు వస్తాయని చెప్పారని మరి వృద్ధి రేటు అంతే ఎందుకుందని సూటిగా ప్రశ్నించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.8 శాతంగా నమోదైందన్నారు. సాధారణ రుతుపవనాలు ఉంటేనే వ్యవసాయ వృద్ధి రేటు ఇంత దారుణంగా పడిపోయిందన్నారు. దీనికి నోట్ల రద్దు ముఖ్య కారణంగా చెప్పవచ్చని తెలిపారు. పన్నులు కట్టే వారు 5 లక్షల లోపేనని, పన్ను కట్టకుండా ఉన్నవాడు...ఇప్పుడు కడుతున్నారని తెలిపారు. ట్యాక్స్ కడుతారు..కానీ రిటర్స్ దాఖలు చేయరు..నల్లధనం ఎవరూ కూడా పన్నులు కట్టడం లేదన్నారు. పరోక్ష పన్నులు పెరిగాయని సంపన్నులు పన్నులు కట్టడం లేదని..65 శాతం సామాన్యుడు కడుతున్నాడని తెలిపారు. 67 కోట్ల మంది ప్రజలకు జాతీయ సంపదలో 1 శాతం మాత్రమే వాటా ఉందన్నారు. ఎకనామి బాగా ఉందా ? ఆయిల్ ధరలు తగ్గుముఖంగా ఉన్నా ఎకనామి ఇలాగే ఉంది ? ఎక్స్ పోర్టు పెరగలేదు...ప్రభుత్వాలు అంచనాలు తప్పాయని తెలిపారు. ఎకనామీ ఎక్కడ పెరిగిందని అని నాగేశ్వర్ ప్రశ్నించారు. 

19:35 - January 29, 2018

 

విజయవాడలో భూ కబ్జాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఓ స్వతంత్ర సమర యోధుడి భూమి కబ్జా కావడం నగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఎమ్మెల్యే బోండా ఉమపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1951లో పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు కొంతమంది పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ రెడ్డి సురేష్ మనువడు ఖంగుతిన్నాడు. మాగంటి బాబు, బొండా ఉమ భార్య సుజాత కొన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. అర్బన్ ఎమ్మార్వోతో పాటు పోలీసులకు మనుమడు సురేష్ ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని సురేష్ డీజీపీని వేడుకున్నాడు. దీనితో భూ కబ్జాకు పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కబ్జా వ్యవహారంలో రామిరెడ్డి కోటేశ్వరరావు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. కార్పొరేటర్ మహేష్, మాగంటి బాబు ఇరికించారని కోటేశ్వరరావు ఆరోపిస్తున్నాడు. తనకు ప్రాణహాని ఉందని కోటేశ్వరరావు పేర్కొంటున్నాడు. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన ప్రత్యేక చర్చలో బాబురావు (సీపీఎం), రవీందర్ రెడ్డి (న్యాయవాది), రామారెడ్డి వెంకట సురేందర్ కుమార్ (ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి) పాల్గొని అభిప్రాయాలు పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

'నిషేధించిన వస్తువులు కనబడితే చర్యలు'...

హైదరాబాద్ : ప్రభుత్వం నిషేధించిన వస్తువులు ఎక్కడ కనిపించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కృష్ణన్ పేర్కొన్నారు. పెళ్లి వేడుకల్లో తల్వార్ విన్యాసంలో మరణించిన ఘటనను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు చేయడం జరుగుతోందని, స్పాప్ డీల్ ఎండీపై కేసు నమోదు చేస్తామని..డెలివరీ బాయ్స్ స్టేట్ మెంట్ రికార్డు చేయడం జరుగుతుందన్నారు.

 

జగన్ @ 1000 కిలోమీటర్లు...

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. సోమవారం నాటికి ప్రజా సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్లు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

లాలూను కలిసిన జేడీయూ లీడర్..

రాంచీ : సీనియర్ జేడీయూ లీడర్ ఉదయ్ నారాయణ్ రాంచీకి వెళ్లారు. బిర్సా ముండా జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన పరామర్శించారు. 

షాతో భేటీ కానున్న సుజనా బృందం...

ఢిల్లీ : మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షాతో టిడిపి కేంద్ర మంత్రి సుజనా బృందం భేటీ కానుంది. బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య విభేదాలపై చర్చిస్తారని తెలుస్తోంది.

పోలవరంపై బాబు రివ్యూ...

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమతో పాటు అధికారులు పాల్గొన్నారు. 

ప్రధానిపై ఎన్డీయే ఫ్లోర్ లీడర్ల ప్రశంసలు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఎన్డీయే ఫ్లోర్ లీడర్లు ప్రశంసించారు. ఇటీవల జరిగిన దావోస్ లో పాల్గొన్న ప్రధాని ఏషియన్ ప్రతినిధులను దేశానికి ఆహ్వానించడం పట్ల వారు ప్రశంసించారు. 

ప్రజల్లోనే ఉంటా - పొన్నం..

కరీంనగర్ : ఎన్నికలున్నా లేకపోయినా తానెప్పుడూ ప్రజల్లోనే ఉంటానని, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు కచ్చితంగా తనను గెలిపిస్తారని జోస్యం చెప్పారు. 

18:48 - January 29, 2018
18:35 - January 29, 2018

విజయవాడ : సీఏ ఐపీసీసీ పరీక్షా ఫలితాల్లో మాస్టర్‌ మైండ్‌ విద్యార్ధులు విజయకేతనం ఎగరేశారు. ఆల్‌ ఇండియా మొదటి 50 ర్యాంకులలో 8 ర్యాంకులు తమ విద్యార్ధులు సాధించినట్లు మాస్టర్ మైండ్‌ డైరక్టర్‌ మట్టుపల్లి మోహన్‌ తెలిపారు. అడ్మిషన్స్‌లోనే కాకుండా.. ప్రతిభ కనబరచడంలో కూడా అతిపెద్ద విద్యాసంస్థగా మాస్టర్‌ మైండ్స్‌ ఉందన్నారు. సీఏ ఐపీసీసీ ఫలితాల్లో సుమారు ముప్పై వేల మంది విద్యార్ధుల్లో పద్నాలుగా వందల మంది మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్ధులు ఉన్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు.. వారికి సహకరించిన తల్లిదండ్రులకు మోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

18:32 - January 29, 2018
18:28 - January 29, 2018

రాజమండ్రి : శిరోమండనం కేసులో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు కేషపాగుల రాములు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలాపురం పరిసర ప్రాంతాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునెదుర్కొంటున్న వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం సరైంది కాదని.. వెంటనే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్‌ చేశారు.

18:28 - January 29, 2018

రాజమండ్రి : శిరోమండనం కేసులో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు కేషపాగుల రాములు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలాపురం పరిసర ప్రాంతాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునెదుర్కొంటున్న వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం సరైంది కాదని.. వెంటనే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్‌ చేశారు.

18:25 - January 29, 2018

విజయవాడ : టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఇప్పటికీ బలంగానే ఉందని.. ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ. విశాఖలో జీవీఎంసీ పనులపై సమీక్ష అనంతరం మాట్లాడిన నారాయణ.. ఒక పార్టీలోనే అంతర్గతంగా భిన్న అభిప్రాయాలుంటాయని... అలాంటిది రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమేనన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు చంద్రబాబు, అమిత్‌షా లాంటి నేతలు వాటిపై చర్చిస్తున్నారన్నారు. బీజేపీపై కామెంట్స్‌ చేసినవాళ్లను చంద్రబాబు మందలించారన్నారు నారాయణ. 

18:07 - January 29, 2018

అనంతపురం : జిల్లా 'పవన్' పర్యటనలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. 'పవన్' అభిమాని ఒకరు మృతి చెందారు. జిల్లాలో గత మూడు రోజులుగా పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. మూడో రోజు హిందూపురంకు వచ్చిన పవన్ అభిమానులనుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లారు. పవన్ చూసేందుకు హిందూపురం..అంబేద్కర్ నగర్ కు చెందిన రామకృష్ణ వచ్చాడు. ఇతను ప్రయాణిస్తున్న వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనితో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

17:45 - January 29, 2018
17:42 - January 29, 2018

హైదరాబాద్ : టీటీడీ నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలు వితరణ చేసిన మండవ ధనుంజయ, కుటుంబరావులు అభినందనీయులన్నారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. హైదరాబాద్‌ నుండి తిరుమలకు కూరగాయలు తీసుకెళ్తున్న వాహనానికి మండవ వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ నుంచి టీటీడీ నిత్యాన్నదాన పథకానికి తొలిసారి కూరగాయలు పంపిస్తున్నారని... ఇది నిరాటంకంగా కొనసాగాలన్నారు మండవ వెంకటేశ్వరరావు. 

17:40 - January 29, 2018

మెదక్ : పెట్రోల్‌లో నీరు కలుస్తుందంటూ మెదక్‌ జిల్లా రామాయంపేటలోని పెట్రోల్‌ బంక్‌పై ఎమ్మార్వో, పోలీసులకు వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఈ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకుని కొద్ది దూరం పోయేసరికి బైక్‌లు ఆగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. పెట్రోల్‌లో నీరు కలవడంతోనే ఈ సమస్య వచ్చిందని మోకానిక్‌ తెలిపారు. దీంతో బాధితులు బంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

గోరక్షక్ సేనలపై సుప్రీం సీరియస్

ఢిల్లీ : గోరక్షక్ సేనలపై సుప్రీం సీరియస్ గా స్పందించింది. యూపీ, పంజాబ్, రాజస్థాన్ ప్రధాన కార్యదర్శులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 3లోగా సమాధానం ఇవ్వాలని సీఎస్ లను సుప్రీం ఆదేశించింది. 

17:14 - January 29, 2018

హైదరాబాద్ : చందానగర్ పీఎస్ పరిధిలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో భర్త మధు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జయలక్ష్మీ..కూతురు అపర్ణ, పాప కార్తికేయలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. వంటింట్లో అపర్ణ..బెడ్ రూంలో జయలక్ష్మీ..పాప మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు వాసులుగా నిర్ధారించారు. మధు..అపర్ణలు కొన్ని ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని నగరంలో జీవనం సాగిస్తున్నారు. కూకట్‌పల్లిలో మొబైల్‌ టెక్నీషియన్‌గా భర్త మధు పని చేస్తుండగా అపర్ణ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాపులో పనిచేస్తోంది. కానీ గతం కొంతకాలంగా భర్తతో విడిగా అపర్ణ నివాసం ఉంటోంది.

ఈ నేపథ్యంలో సోమవారం వీరు మృతి చెందారన్న వార్త ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఘటన జరిగిన అనంతరం భర్త మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం సోమవారం సాయంత్రం మధు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మధు..అపర్ణలకు సంబంధించిన ఫోన్స్ కాల్స్..సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. 

ఆప్ పిటిషన్ పై విచారణ జరిపిన హై కోర్టు

ఢిల్లీ : ఆప్ అనర్హతను సవాల్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కు బదిలీ చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వద్దని ఈసీకి హైకోర్టు ఆదేశించింది. 

16:29 - January 29, 2018
16:24 - January 29, 2018

హైదరాబాద్ : చందానగర్ లో జరిగిన ట్రిపుల్ మర్డర్ వెనుక ఎవరున్నారు ? వారిని చంపాల్సిన అవసరం ఏముంది ? అత్యంత దారుణంగా చంపేసింది భర్త ? లేక వేరే వారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలవడం లేదు. చందానగర్ పీఎస్ పరిధిలో తల్లి జయలక్ష్మి, కూతురు అపర్ణ, పాప కార్తికేయలు విగతజీవులుగా మారిపోవడం పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రెండు రోజుల క్రితం వీరు హత్యకు గురయ్యారని పోలీసులు నిర్ధారించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసును దర్యాప్తు చేపడుతున్నారు. హత్య జరిగిన అనంతరం భర్త మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం కేపీహెచ్ బీ పోలీసుల ఎదుట మధు లొంగిపోయాడు. కూకట్‌పల్లిలో మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భర్త మధుతో అపర్ణ కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త మధుపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

16:21 - January 29, 2018

కేపీహెచ్ బీ పీఎస్ లో లొంగిపోయిన అపర్ణ భర్త

హైదరాబాద్ : కేపీహెచ్ బీ పీఎస్ లో అపర్ణ భర్త మధు లొంగిపోయాడు. 2 రోజుల క్రితం అపర్ణ, ఆమె తల్లి జయలక్ష్మి, కూతురు హత్య జరిగిన విషయం తెలిసిందే. మధు స్టేట్ మెంట్ తర్వాత హత్య చేసిందేవరనేది తెలుతుందాని పోలీసులు చెబుతున్నారు. 

16:07 - January 29, 2018

అనంతపురం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. పలు రంగాల వారితో ఆయన నేరుగా మాట్లాడారు. వారి వారి సమస్యలను ఆలకించి ఆయా సమస్యలపై ఆయన స్పందించారు. జిల్లాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని, పలు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతానని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు నిర్మాణం అయ్యే విధంగా చూస్తానని పవన్ పేర్కొన్నారు. అసలు పవన్ పర్యటనపై జనసేన కార్యకర్తలు, అభిమానులు ఏమనుకుంటున్నారు ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:45 - January 29, 2018

విజయవాడ : నీటి నిల్వకోసం ఆంధ్రప్రదేశ్‌లో వంతెనలు, బ్యారేజీల నిర్మాణానికి ప్రభుత్వ యంత్రాంగం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. తొలిగా గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో నీటికి ఇబ్బందులు లేకుండా కృష్ణా నదిలో వాటర్‌ స్టోరేజ్‌ వంతెన నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పులిచింతల దిగువన, ప్రకాశం ఆనకట్టకి ఎగువన మరో కొత్త వంతెన నిర్మాణం చేసేలా ఏపీ జలవనరుల శాఖ నిపుణులు సమాయత్తం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికర్ల మండలం గని ఆత్కూరు, గుంటూరు జిల్లాలో వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇదివరకే ప్రాథమిక సర్వే పూర్తి చేశారు.

ప్రకాశం బ్యారేజీలో రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వాటర్‌ స్టోరేజీ నిర్మాణానికి ఆవశ్యకత ఏర్పడింది. వర్షాకాలంలో దిగువ ప్రాంతంతో పాటు మున్నేరు నుంచి వచ్చే వరద నీరు ఆధారంగా ఈ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. వరద నీరు ప్రతి ఏడాది ప్రకాశం బ్యారేజీ గుండా సముద్రంలోకి వృథాగా పోతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువన యనమలకుదురు సమీపంలో చోడవరం వద్ద, మరీ దిగువన ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద బ్యారేజీల నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రాజెక్ట్‌ కోసం నివేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన నిర్మించే బ్యారేజీ వల్ల దాదాపు 10నుంచి 12 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేయొచ్చు. దీంతో సుమారు 22 టీఎంసీల వరకూ వినియోగించుకునే అవకాశం ఉంటుందని లెక్క గట్టారు. దీనివల్ల 50 లక్షలమ మంది తాగు నీటికి గానీ... లేదా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు గానీ ఈ నీటిని వాడుకోవచ్చు.. 3, 278కోట్లతో ఈ బ్యారేజీ నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. 1900 కోట్లతోనే నిర్మించవచ్చని నిర్ధారించారు.

నీటి నిల్వకు మునేరు వాగే పెద్ద ఆధారం. ఈ వాగులో ప్రతి యేడాది దాదాపు రెండు నెలల్లో 50 టీఎంసీల లభ్యత ఉందని లెక్కగట్టారు. గతంలో అన్ని చోట్లా వర్షాలు కురిసిన సమయంలో ఈ మునేరు నీరే సముద్రంలోకి వృథాగా పోతోంది. పాలేరు వాగు నుంచి కూడా కొన్ని ప్రవాహాలు సముద్రం పాలవుతున్నాయి. కృష్ణానదిలో కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, అమరావతి మండలాల్లో సుమారు 8లంకలు ఉన్నాయి. ఈ లంకలను తొలగిస్తే నదిలో పూడిక తీసేందుకు వీలుంటుంది. అలాగే నదిగట్టు పటిష్టం చేయడంతోపాటు.. నదిలో అదనంగా మూడు టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యారేజీల నిర్మాణాల వల్ల లంక గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందడంతోపాటు... సముద్ర ఆటుపోట్లతో భూములు ఉప్పుకయ్యలుగా మారే సమస్య తీరుతుంది. 

15:43 - January 29, 2018

కరీంనగర్‌ : జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఇక్కడ ఒకే ఒక్కడుగా వెలిగిన మంత్రి ఈటెల రాజేందర్‌కు గట్టిపోటీ నెలకొంది. ప్రస్తుత టీడీపీనేత... మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటెలకు చెక్‌ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. హుజురాబాద్‌ రసవత్తర రాజకీయాలపై టెన్‌టీవీ కథనం..హుజురాబాద్‌ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంతుచిక్కని రీతిలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా ముక్కోణ పోటీ ఉన్న హుజురాబాద్‌లో ఇప్పుడు సీన్‌ మొత్తం మారిపోయింది. మంత్రి ఈటెల వర్సెస్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నట్టు పరిస్థితి మారిపోయింది. రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందన్న చర్చ సాగుతోంది.

మంత్రి ఈటల టార్గెట్‌గా పెద్దిరెడ్డి ఈ మధ్య బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనం భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో పెద్దిరెడ్డి మరోసారి ఇక్కడి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో... పెద్దిరెడ్డి కూడా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అందుకే ఇటీవల తన అనుచరులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో పెద్దిరెడ్డి సమావేశం నిర్వహించి, అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం మంత్రి ఈటలకు గెలుపు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ క్షేత్ర స్థాయి క్యాడర్‌ అంతా ఆయనతో నడిచే అవకాశముంది. అంతేకాదు.. అటు టీ టీడీపీ కార్యకర్తలు సైతం పెద్దిరెడ్డికే అండగా ఉండనున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ద్విముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లే నేతల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ఈనేపథ్యంలో వారంతా పెద్దిరెడ్డికే మద్దతిచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.... ఈటల బీసీ నేత కావడం కూడా మైనస్‌ పాయింట్‌గానే భావిస్తున్నారు.

ఈటెల ఇంతకాలం ఒకేఒక్కడుగా చక్రం తిప్పినా.. పట్టు మాత్రం సాధించలేదు.. అంతేగాక.. ఈటల తీరుతో విసిగిపోయిన జమ్మికుంట జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌కు రాజీనామా కూడా చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు వ్యతిరేక గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జడ్పీటీసీ వీరేశం ఈటల భవిష్యత్‌పై చెప్పిన జోతిష్యాన్ని ఓ సారి వీడియోలో చూడండి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నది కేసీఆర్‌ సంకల్పం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సుమారు 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని నిఘా వర్గాలు సీఎంకు నివేదికను ఇచ్చాయి.

అలాగే.. హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు.. కెప్టెన్‌తో ఈటలకు ఉన్న విబేధాలను బేరీజు వేస్తూ రిపోర్టు టీఆర్ఎస్ అధినేతకు అందించినట్లు సమాచారం. దీంతో ఈటలకు స్థానం అనుమానమే అన్నసాగుతోంది. ఎటొచ్చి ఎటుపోయినా... ఇంతకాలం ఉద్యమ పార్టీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి ఈటెలకు రానున్న ఎన్నికలు గట్టి సవాల్‌ విసరనున్నాయి. మరి రాజకీయ ఎత్తులను చిత్తు చేస్తారో... లేదా ప్రత్యర్థుల ధాటికి చిత్తవుతారో వేచి చూడాల్సిందే...

15:36 - January 29, 2018

ఢిల్లీ : భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2017-18 ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2017-18లో వృద్ధి రేటు 6.7గా నమోదైందని..2018-19కి 7.0 నుండి 7.5గా ఉండవచ్చునని అంచనా వేశారు. కానీ భవిష్యత్ లో మాత్రం చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని జైట్లీ అంచనా వేశారు. విద్య, ఉపాధి, వ్యవసాయం రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లోక్ సభ గురువారానికి వాయిదా పడింది. 

15:30 - January 29, 2018

విజయవాడ : పోలవరం ఇతర ప్రాతినిధ్య ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల నిర్మాణ పనుల గురించి అధికారుల నుండి ఆరా తీశారు. ఇప్పటి వరకు 774 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలు జరిగాయని, 281 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు చేపట్టాల్సి ఉందని బాబు పేర్కొన్నారు. 3826 క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే పనులు పూర్తయాయ్యని తెలిపారు.

 

అక్రమాయుధాల కేసులో 10 మంది అరెస్ట్

హైదరాబాద్ : అక్రమ ఆయుధాలను కలిగి ఉన్న10 మంది సభ్యుల ముఠాను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నింధితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

15:26 - January 29, 2018

హైదరాబాద్ : రాజ్యాంగ పునాదులపై దాడి జరుగుతోందని..ఇప్పటికైనా మేధావులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, బహుజనులు, రచయితలు, కళాకారులు ఐక్యమై ప్రతిఘటించాలని టీమాస్ ఛైర్మన్ ప్రొ. కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. ఎల్ బినగర్ లో బహుజన ప్రతిఘటన సభ జరిగింది. 80 శాతం ఉన్న బహుజనులపై 20 శాతం ఉన్న వారు ఎలా దాడులు చేస్తారని, బహుజనులు, మైనార్టీలు అందరూ ఐక్యం కావాలని మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు సూచించారు. ఈ సదస్సులో ప్రజా సంఘాలు, ఇతరులు పాల్గొన్నారు.

 

ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ పేరు మార్పు

గుంటూరు : ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ పేరు  మార్చాలని నిర్ణయించామని మంత్రి మణిక్యాలరావు అన్నారు. దేవాదాయ అంటే దేవునితో ఆదాయాన్ని సంపాదించడం అందుకే ఇకై దేవాదాయ, ధర్మదాయ శాఖగా మార్పు చస్తున్నామని ఆయన తెలిపారు. 

15:11 - January 29, 2018

ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్ కానిస్టేబుల్

కడప : జిల్లా ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ లో రూ.9వేలు లంచలం తీసుకుంటూ రైల్వే హెడ్ కానిస్టేబుల్ దేవానందం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ మహిళ నుంచి ఆమె కుమారుడి డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కానిస్టేబుల్ లంచం డిమాండ్ చేశాడు. 

14:58 - January 29, 2018

వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలను శక్తియుక్తులను దశదిశలా చాటుతూ పలు అవార్డులను అందుకున్న మహిళా మణులకు 'మానవి' అభినందనలు తెలియచేస్తోంది. అందుకోసం 'మానవి' ‘ఫోకస్' కార్యక్రమం నిర్వహించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:52 - January 29, 2018

హైదరాబాద్ : సభలుపెట్టి మరీ తెలుగు ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు. భాషాభివృద్ధికి కృషి చేస్తామంటూ సంబురాలు జరిపారు. కొత్త ఏడాదిలో కొంగొత్తగా తెలుగు భాషకు పట్టంకడతామని ప్రకటనలు గుప్పించారు. నెల రోజులు గడిచింది. భాషాభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. భాషాభివృద్ధికి పాటుపడతామని ఘనంగా చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసి నెలరోజులైనా... కార్యరూపం దాల్చని తెలుగు భాషాభివృద్ధిపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. ప్రపంచంలోని తెలుగు భాషాభిమానులంతా ఒకచోటచేరి తెలుగు భాష అభివృద్దిపై చర్చలు జరిపారు. సభలు, సమావేశాలు, చర్చాగోష్టులు, అవధానాలు... ఇలా ఒకటేమిని అన్నిరకాలుగా తెలుగు భాషగొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సభల నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే తెలుగుభాషకు పట్టంగడతామంటూ ప్రకటనలు గుప్పించారు. కొత్త ఏడాదిలో సరికొత్తగా భాష అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి నెలరోజులు దాటింది. మహాసభల ముగింపు సభల్లో గొప్ప వాగ్దానాలు చేసిన సీఎం... వాటి ఆచరణకు పూనుకోలేదు. అమ్మభాషకు పట్టం కడతామన్న నేతలు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. జనవరి మాసంలో తెలుగు భాషాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్పారు. కానీ నేటికి ప్రభుత్వం ఎజెండానే రూపొందించలేదు. అసలు సాహితీ ప్రియుల నుంచి ప్రతిపాదనలు, ఆలోచనలు పంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడటం లేదని తెలుస్తోంది. దీంతో సాహితీ అభిమానులు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ వరకు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సిలబస్‌ రూపకల్పన కోసం తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. మరోవైపు ఈ నెలలో ప్రభుత్వం భాషా సాహితీవేత్తల సదస్సు నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అడుగుపడలేదు. తెలుగు భాషాభివృద్ధిపై కృషిని తెలుగు సాహిత్య అకాడమీ కొనసాగిస్తుందని కేసీఆర్‌ చెప్పారు. అయితే సాహిత్య అకాడమీ నుంచిగానీ... సాంస్కృతిక శాఖ నుంచిగానీ ఎలాంటి ప్రయత్నమే లేదు. దీంతో సీఎం ప్రకటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు భాషాభివృద్దిపై వందల, వేల సూచనలు వచ్చాయని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. అర్థాంతరంగా ప్రకటన సరికాదనీ.. మరిన్ని సూచనలు అందరి నుంచి స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసి నెల కావొస్తున్నా... నేటికీ కార్యాచరణ ముందుకు పడలేదు. దీంతో అసలు సూచనలు స్వీకరిస్తారా.. అనే అనుమానాలు మొదలయ్యాయి. సాహితీవేత్తలకు సమాచారం ఇచ్చి.. సమావేశం నిర్వహించాలన్నా కనీసం వారం , పదిరోజులు పట్టే అవకాశముంది. జనవరి మొదటి వారంలో ఆ ప్రయత్నాలు ప్రభుత్వం ప్రారంభిస్తుందని అందరూ ఆశించారు. కానీ నెలరోజులైనా ఆదిశగా ప్రయత్నాలే మొదలుకాలేదు. దీనిపై ఎవ్వరూ నోరు మెదపకపోవడం.. అసలు సదస్సు జరుగుతుందా అన్న సందేహాల వ్యక్తమవుతున్నాయి.

తెలుగు భాషాభివృద్ధి అంటే గొప్పగొప్ప ప్రకటనలు చేయడంకాదని.. ఆ ప్రకటనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సాహితీవేత్తలంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సాహితీవేత్తలతో సదస్సు నిర్వహించి తెలుగు భాషాభివృద్దికి బాటలు వేయాలని కోరుతున్నారు.

14:49 - January 29, 2018

విజయవాడ : దుర్గగుడి నూతన ఈవోగా ఎమ్‌.పద్మ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ...భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

14:48 - January 29, 2018

విశాఖపట్టణం : రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన రైతు సంఘం నేతపై మండిపడ్డారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. వేతనం డబ్బులు అడిగిన తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ రైతులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిలుగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఎనమిది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. 

ఫిబ్రవరి 2న ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 3గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, తదితర అంశాలపై చర్చించనున్నారు. 

14:46 - January 29, 2018

హైదరాబాద్‌ : చందానగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఇద్దరు మహిళలు, ఓ పాప దారుణ హత్యకు గురి కావడం కలకలం సృష్టిస్తోంది. తల్లి జయలక్ష్మి, కూతురు అపర్ణ, పాప కార్తికేయని విగతజీవులుగా మారిపోవడం పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు వాసులుగా గుర్తించారు. కూకట్‌పల్లిలో మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భర్త మధుతో అపర్ణ కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త మధుపైనే అనుమానాలు అవ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:43 - January 29, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే బొడ్డుపల్లి శ్రీను హత్యకేసును పోలీసులు నీరుగార్చారని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శ్రీను హత్యకేసులో ముఖ్యమంత్రి తన పాత్రలేదని రుజువు చేసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పటికైన బొడ్డుపల్లి శ్రీను హత్యకేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా ఉంటే.. కాంగ్రెస్‌ నేత చిరుమర్తి లింగయ్యను కూడా త్వరలోనే చంపేసే అవకాశం ఉందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  

టీడీపీ జనరల్ బాడీ సమావేశం

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి  రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ  హాజరైయ్యారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. 

14:40 - January 29, 2018

అనంతపురం : సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' జిల్లా పర్యటన కొనసాగుతూనే ఉంది. సోమవారం హిందూపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పవన్ సీఎం అంటూ నినాదాలు చేయడం..కేరింతలు..విజిల్స్ తో సభలో గందరగోళం ఏర్పడింది. పవన్ చూసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తీసుకొచ్చారు. పవన్ చాలామార్లు వారించినా పరిస్థితిలో మార్పు రాలేదు. కొద్దిసేపు బయటకు వెళ్లి వచ్చిన తరువాత 'పవన్' తన స్పీచ్ ను మొదలు పెట్టారు.

రాయలసీమకు అండగా ఉంటానని, కరవు ప్రారదోలేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుకొచ్చే వారితో కలుస్తామని తేల్చిచెప్పారు. జనసేనలో ఉండే వారు జనసైనికులై దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 

పార్లమెంట్ లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ

ఢిల్లీ : పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. 2017-18లో వృద్ధిరేటు 6.75 శాతంగా నమోదు అయింది. 2018-19లో వృద్ధిరేటు 7-7.5గా ఉండొచ్చని అంచనాగా ఉంది. 

పార్లమెంట్ లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ

ఢిల్లీ : పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. 2017-18లో వృద్ధిరేటు 6.75 శాతంగా నమోదు అయింది. 2018-19లో వృద్ధిరేటు 7-7.5గా ఉండొచ్చని అంచనాగా ఉంది. 

13:51 - January 29, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వాక్‌ విత్‌ జగన్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా వాక్‌ విత్‌ జగనన్న ర్యాలీ నిర్వహిస్తున్నామంటున్న వైసీపీ ఎంపీతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

గ్రంథాలయాల అభివృద్ధిపై తలసాని సమీక్ష

హైదరాబాద్ : నగరంలోని గ్రంథాలయాల అభివృద్ధిపై అధికారులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ యోగిత రాణా పాల్గొన్నారు. 

13:47 - January 29, 2018

నల్గొండ : జిల్లాలో వరుస హత్యలు కలకలంరేపుతున్నాయి. ఐదురోజుల క్రితం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్య మరువకముందే.. జిల్లా కేంద్రంలో మరో ఘటన పట్టణవాసులను ఉలికిపడేలా చేసింది. పాలకూరి రమేష్‌ అనే వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేయడమే కాక.. తల, దేహాన్ని వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో వేయడం కలకలం సృష్టించింది. తెల్లవారుజామునే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ భేటీ

ఢిల్లీ : మధ్యాహ్నం 2.30లకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహల గురించి చర్చించే అవకాశం ఉంది. 

13:45 - January 29, 2018

 అనంతపురం : చేనేత కళాకారుల సమస్యలపై పోరాడుతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులతో భేటీ సందర్భంగా పవన్‌ పలు హామీలు ఇచ్చారు. చేనేతకళను అంతరిస్తున్న కళల్లో చేర్చి, మరింతగా ఆదుకోవాలని పవన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు చేనేతలకు ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని పవన్‌ అన్నారు. 

 

13:43 - January 29, 2018

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌లోని ఆదర్శనగర్‌లో నివాసం ఉండే నాగరాజు, స్నేహ దంపతులు ఒకరిపై మరోకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. గతకొంత కాలంగా తన భార్య స్నేహ మొఘల్‌పూర పీఎస్‌లో పనిచేస్తున్న సందీప్‌ అనే కానిస్టేబుల్‌తో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తు అతనితో ప్రేమయాణం నడుపుతుందంటూ ఫిర్యాదు చేశాడు. తీరు మార్చుకోవాలంటూ ఎన్నిసార్లు హెచ్చరించిన  తీరుమారకపోవడంతో గత నవంబర్‌లో పోలీసులకు భర్త నాగరాజు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో మరోసారి జనవరి 21న పోలీసులకు భర్త నాగరాజు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది.

 

13:40 - January 29, 2018

హైదరాబాద్‌ : చందానగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఇద్దరు మహిళలు, ఓ పాప దారుణ హత్యకు గురయ్యారు. తల్లి జయలక్ష్మి, కూతురు అపర్ణ, పాప కార్తికేయని ఒకేసారి హత్యకు గురికావడం కలకలంగా మారింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు వాసులుగా గుర్తించారు. కూకట్‌పల్లిలో మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భర్త మధుతో అపర్ణ కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త మధుపైనే అనుమానాలు అవ్యక్తం అవుతున్నాయి. 

 

13:29 - January 29, 2018

సంగారెడ్డి : ఇచ్చిన హామీలను టీసర్కార్ నెరవేర్చడం లేదని ఇంటర్ జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. తెలంగాణలో విద్యావ్యవస్ధ ఆశించిన స్ధాయిలో లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టూ పీజీ అన్న అంశం కనీసం అధ్యయనం చేయకుండా ఇచ్చిన ఆర్భాటపు హామీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, డీఎస్సీ, ఉపాధ్యాయనియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. 

 

13:21 - January 29, 2018

రంగారెడ్డి : పచ్చని కాపురంలో ఫేస్‌బుక్‌ చిచ్చుపెట్టింది. జిల్లాలోని శంషాబాద్‌లోని ఆదర్శనగర్‌లో నివాసం ఉండే నాగరాజు, స్నేహ దంపతులు ఒకరిపై మరోకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. గతకొంత కాలంగా తన భార్య స్నేహ మొఘల్‌పూర పీఎస్‌లో పనిచేస్తున్న సందీప్‌ అనే కానిస్టేబుల్‌తో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తు అతనితో ప్రేమయాణం నడుపుతుందంటూ ఫిర్యాదు చేశాడు. తీరు మార్చుకోవాలంటూ ఎన్నిసార్లు హెచ్చరించిన తీరుమారకపోవడంతో గత నవంబర్‌లో పోలీసులకు భర్త నాగరాజు ఫిర్యాదు చేశారు. మరోసారి జనవరి 21తేదీన భర్త నాగరాజు భార్యపై ఫిర్యాదు చేశారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య స్నేహ ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:12 - January 29, 2018

నల్లగొండ : జిల్లా కేంద్రంలో హత్య కలకలం రేపుతోంది. బొట్టుగూడలో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. తల నుండి మొండెం వేరు చేశారు. మృతుడు కనగల్‌ గ్రామానికి చెందిన పాలకూరి రమేష్‌గా గుర్తించారు. రమేశ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే తల మాత్రమే లభించడంతో మొండేన్ని ఎక్కడ పడవేశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్‌ సెర్చింగ్‌ మొదలు పెట్టింది. పట్టణంలోని హైటెక్‌ కాలనీలో ఓ ఇంటిపైకి వెళ్లిన డాక్‌స్క్వాడ్‌ ఆగిపోవడంతో ఆ ఏరియాలో విస్తృతంగా గాలిస్తున్నారు. తలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

 

పచ్చని కాపురంలో ఫేస్ బుక్ చిచ్చు

హైదరాబాద్ : పచ్చని కాపురంలో ఫేస్ బుక్ చిచ్చుపెట్టింది. స్నేహ అనే వివాహితురాలు ఫేస్ బుక్ లో కానిస్టేబుల్ తో పరిచయం పెంచుకుని ఆ తర్వాత కానిస్టేబుల్ తో ప్రేమయాణం సాగిస్తోంది. ఇది గమనించిన భర్త తీరుమార్చుకోవాలంటూ స్నేహను హెచ్చరించాడు. ఆయన తీరుమారకపోవడంతో గత నవంబర్ లో స్నేహ పై భర్త నాగరాజు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఫిర్యాదును పట్టించుకోలేదు. మరోసారి జనవరి 21వ తేదీన భర్త నాగరాజు ఫిర్యాదు చేశాడు. 

13:07 - January 29, 2018

హైదరాబాద్ : చందానగర్‌ పీఎస్‌ పరిధిలో ముగ్గురి అనుమానాస్పద మృతి చెందారు. తల్లి జయలక్ష్మి, కూతురు అపర్ణ, పాప కార్తికేయని మృతి చెందారు. కొంతకాలంగా అపర్ణ భర్తకు దూరంగా ఉంటున్నారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందినవారిగా గుర్తించారు.

13:04 - January 29, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు పరచాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు మాజీ మంత్రి కొణితల రామకృష్ణ. ఐదు రోజుల పాటు చర్చావేదిక జరపుతామంటున్న కొణితలరామకృష్ణతో 10 టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

చేనేత కార్మికులతో పవన్ భేటీ

అనంతపురం : జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. చేనేత కార్మికులకు జనసేన అండగా ఉంటుందని ఆయన తెలిపారు. 

పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : కోదండరాం

హైదరాబాద్: పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

12:57 - January 29, 2018

ఢిల్లీ : రాబోయే బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు సహరించాలని మోదీ కోరారు. భారత్‌ వృద్ధి రేటులో దూసుకుపోతోందని అన్నారు.

 

12:52 - January 29, 2018

ఢిల్లీ : సామాజిక న్యాయం సాధించడం కంటే ప్రభుత్వానికి మరో లక్ష్యం ఉండదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతి అయిన తరువాత ఉభయసభలను ఉద్ధేశించి కోవింద్ తొలిపారి ప్రసంగించారు. ఈసారి గణతంత్ర వేడుకల్లో 10 దేశాల ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు. పేద మహిళల అభ్యున్నతి కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. తలాక్ బిల్లును సభ ఆమోదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. జన్ ధన్ పథకం కింద 21 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారని తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాల కోసం ముద్రా పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. 2022 కల్లా దేశంలో రైతుల ఆదాయం రెండు రెట్లు పెరగనుందన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశంలో రికార్డు స్థాయిలో పప్పు ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను కేంద్ర ప్రభుత్వం అరికట్టిందని చెప్పారు. ప్రధాని మంత్రి పసల్ భీమా యోజన ద్వారా  రైతులకు మేలు జరుగుతోందన్నారు. ఇ..హెల్త్, ఇ..ఎడ్యుకేషన్ ద్వారా గ్రామాలను డిజిటలైజ్ జరుగుతోందన్నారు. అటల్ పెన్షన్ ద్వారా కోటి 80 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. బాలికల సంరక్షణ కోసం బేటీ బచావో...బేటీ పడావో కార్యక్రమం రూపొందించారని తెలిపారు. దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

చందానగర్ లో ముగ్గురి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : చందానగర్ పీఎస్ పరిధిలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో తల్లి విజయలక్ష్మి,  కూతురు అపర్ణ, పాప కార్తికేయ ఉన్నారు. అపర్ణ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 

ముస్లిం మహిళా విముక్తే ట్రిపుల్ తలాక్ : రాష్ట్రపతి

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళలను ఆవేదన నుంచి విముక్తి కల్పించేందుకే అని ఆయన అన్నారు. 

12:15 - January 29, 2018

కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన క్లైమాక్స్ దృశ్యాలను కొరటాల శివ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భరత్ అనే నేను ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

12:10 - January 29, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సుజాతానగర్‌ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొద్ది సేపటి క్రింతం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

 

12:09 - January 29, 2018

నల్లగొండ : జిల్లా కేంద్రంలో కలకలం రేపిన హత్యపై పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఉదయం తలమాత్రమే కనిపించగా.. తాజాగా మిగీతా శరీర భాగాన్ని గుర్తించారు. పట్టణంలోని హైటెక్‌ కాలనీలో విస్తృతంగా గాలింపు చేపట్టిన  డాక్‌స్క్వాడ్‌ మొండెం భాగాన్ని గుర్తించింది. ఇప్పటికే తలభాగాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా.. ప్రస్తుతం మొండెం భాగాన్ని కూడా స్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ రమేష్‌ హంతకుల కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 
 

 

12:07 - January 29, 2018

ఇంటిలిజెంట్ దర్శకుడు అనగానే మకు గుర్తోంచే పేర్లలో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ కథనాయకుడిగా రంగస్థలం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు సుకుమార్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్యాన్స్ మాస్టర్ లాగా సుకుమార్ స్టెప్పులున్నాయి ఆయన వీడియోకి కామెంట్ పెడుతున్నారు ప్రేక్షకులు.

2018 నవ భారతానికి నాంది : రాష్ట్రపతి

ఢిల్లీ : 2018 సంవత్సరం నవ భారతానికి నాంది పలకబోతోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఈ సంవత్సరం జరిగిన గణతంత్ర వేడుకల్లో 10 దేశాల ప్రముఖులు పాల్గొన్నారని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. 

11:59 - January 29, 2018
11:58 - January 29, 2018
11:54 - January 29, 2018

టీడీపీ, బీజేపీ నేతల పరస్పర వ్యాఖ్యలపై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, బీజేపీ నేత అద్దెపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై భిన్నవాదనలు వినిపించారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పేద మహిళల అభ్యున్నతి కోసం కేంద్రం కృషి : రాష్ట్రపతి

ఢిల్లీ : సామాజికన్యాయ సాధించడం కంటే ప్రభుత్వానికి మరో లక్ష్యం ఉండదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పేద మహిళల అభ్యున్నతి కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. తలాక్ బిల్లును సభ ఆమోదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

11:34 - January 29, 2018

అనంతపురం : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మూడోరోజూ కొనసాగుతోంది. ఇవాళ పుట్టపర్తిలోని సత్యసాయి భవన్‌లో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సత్యసాయి ట్రస్ట్ స్ఫూర్తితో అనంతపురం జిల్లాలో కరువుపై పోరాడుతానని తెలిపారు. అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో భేటీ అవుతారు. చేనేతల సమస్యలపై చర్చిస్తారు. తర్వాత మధ్యహ్నం హిందూపురంలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:26 - January 29, 2018

విశాఖ : విశాఖ ఆర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(వుడా) ఏవో ప్రదీప్ కుమార్ నివాసంపై ఏసీబీ దాడులు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న అభియోగం ఆయనపై ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ప్రదీప్ కుమార్ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తోంది. ప్రదీప్ కుమార్ కు సబంధించి హైదరాబాద్, అనంతపురం, ఒంగోలు, విశాఖలో సోదాలు నిర్వహించారు. విశాఖ, విజయవాడలోని ప్రదీప్ కుమార్ ఇళ్లల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతోంది. మొత్తం 12 చోట్ల అధికారులు సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి  ప్రసంగం చేస్తున్నారు. రాంనాధ్ రాష్ట్రపతి అయిన తర్వాత ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడడం ఇదే మొదటి సారి. 

11:01 - January 29, 2018

ఇవాళ పుట్టపర్తి సత్యసాయి భవన్‌లో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు

అనంతపురం : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటన మూడోరోజూ కొనసాగుతోంది. ఇవాళ పుట్టపర్తిలోని  సత్యసాయి భవన్‌లో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.  సత్యసాయి ఆస్పత్రి సందర్శిస్తారు.  అనంతరం ధర్మవరం చేరుకుని  చేనేత కార్మికులతో  భేటీ అవుతారు. చేనేతల సమస్యలపై చర్చిస్తారు. తర్వాత  మధ్యహ్నం హిందూపురంలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. 

 

10:11 - January 29, 2018

అనంతపురం : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటన అనంతపురంజిల్లాలో మూడోరోజూ కొనసాగుతోంది. ఇవాళ  పుట్టపర్తిలోని  సత్యసాయి భవన్‌లో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.  సత్యసాయి ఆస్పత్రి సందర్శిస్తారు.  అనంతరం ధర్మవరం చేరుకుని  చేనేత కార్మికులతో  భేటీ అవుతారు. చేనేతల సమస్యలపై చర్చిస్తారు. తర్వాత మధ్యహ్నం హిందూపురంలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఇళ్ల పైకి దూసుకెళ్లిన కారు

కర్నూలు : జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాలలోని చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న ఇళ్ల పైకి కారు దూసుకెళ్లింది. మహానంది మండలం గాజుల పల్లె గ్రామం నుండి వస్తున్న డాక్టర్‌ శరత్ మద్యం మత్తులో కారు నడపడం ఈ ప్రమాదానికి కారణమైంది. డాక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 
 

 

10:05 - January 29, 2018

ఢిల్లీ : నేటి నుండి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు  సమావేశం ప్రారంభం కానుంది. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి సారిగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 2018-19 సంవత్సరం ఆర్థిక సర్వేను కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పార్లమెంట్‌ బీఎసీ సమావేశం కానుంది. సాయంత్రం ఎన్డీఏ పక్షనేతలు సమావేశం కానున్నారు. 

 

09:44 - January 29, 2018

నల్లగొండ : జిల్లా కేంద్రంలో హత్య కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, మున్సిసల్ చైర్ సర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఘటన మరువకుమందే మరో వ్యక్తి హత్య గావించబడ్డారు. బొట్టుగూడలో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. తల నుండి మొండెం వేరు చేశారు. దుండగులు తలను పడేసి వెళ్లారు. మొండెం లభ్యం కాలేదు. మృతుడు కనగల్‌ గ్రామానికి చెందిన పాలకూరి రమేష్‌గా గుర్తించారు. రమేశ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే తల మాత్రమే లభించడంతో మొండేన్ని ఎక్కడ పడవేశారన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:35 - January 29, 2018

ఢిల్లీ : ఇవాళ్టి నుండి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు  సమావేశం ప్రారంభం కానుంది. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి సారిగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 2018-19 సంవత్సరం ఆర్థిక సర్వేను కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పార్లమెంట్‌ బీఎసీ 
సమావేశం కానుంది. సాయంత్రం ఎన్డీఏ పక్షనేతలు సమావేశం కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : ఇవాళ్టి నుండి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు  సమావేశం ప్రారంభం కానుంది. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి సారిగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.

09:31 - January 29, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఫిలిం ఇండస్ట్రీలో ఉద్యోగం ఇప్పిస్తానని నలుగురు వ్యక్తుల నుండి 14 లక్షలు వసూలు చేశారు కేటుగాళ్లు. సినీనటుడు చిరంజీవి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి బాధితులను మోసం చేశారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు బహుదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హైదరాబాద్‌ పాతబస్తీలో ఘరానా మోసం

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఫిలిం ఇండస్ట్రీలో ఉద్యోగం ఇప్పిస్తానని నలుగురు వ్యక్తుల నుండి 14 లక్షలు వసూలు చేశారు కేటుగాళ్లు. సినీనటుడు చిరంజీవి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి బాధితులను మోసం చేశారు. 

08:35 - January 29, 2018

ఎఫ్‌ఆర్డీఐ బిల్లుతో ముప్పు వాటిల్లుతుందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు రాంబాబు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'రాబోయే రోజుల్లో బ్యాంక్‌ల్లో దాచుకునే సొమ్ముకు భద్రత ఉండదా..? బ్యాంకుల కష్ట నష్టాలకు అసలు కారణాలను, కారకులను వదిలేసి.. డిపాజిటర్లను బాదితులుగా చేసే పరిస్థితులు రానున్నాయా.. కేంద్రం ఆలోచిస్తున్న ఎఫ్ఆర్డీఐ బిల్లు కేంద్రంగా చాలా మందిలో కలుగుతున్న ఆందోళన ఇది. అసలు కేంద్రం ఎఫ్ఆర్డీఐ బిల్లును ఎందుకు తీసుకురాబోతుంది. చాలా మందిలో వినిపిస్తున్న వాస్తవమెంత. ఆ బిల్లులో ఏం ఉండబోతుందనే అంశంపై రాంబాబు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:28 - January 29, 2018

నల్లగొండ : జిల్లాలోని నార్కట్‌ పల్లి మండలం చెరువుగట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. రెండో శ్రీశైలంగా పిలిచే చెరువుగట్టు ఆలయంలో నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు కాలే నిప్పులపై నడుచుకుంటూ వెళ్ళి మొక్కులు తీర్చుకున్నారు. ఇలాచేస్తే అరిష్టాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ఆలయ అధికారులు, భక్తులకు ఆలయ ఛైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

08:13 - January 29, 2018

హైదరాబాద్ : ఏపీలో కోడిపందేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకాలేదు. ఉన్నత న్యాయస్థానం  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. పందేలు నియంత్రించడంలో అధికారులు విఫలం అయ్యారు. అధికారపార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. దీంతో ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. ఇవాళ  హైకోర్టు కోడి పందేలపై విచారణ చేపట్టనుండడంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కోడి పందేలు
కోడి పందేలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. సంక్రాంతి పండుగకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఏపీలో కోడిపందేలు జోరుగా సాగాయి. బరుల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరిగాయి. గుండాట, పేకాటతోపాటు ఇతర ఆటలు కొనసాగాయి. మద్యం ఏరులైపారింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కోడి పందేలు యథేచ్చగా జరిగాయి. వీటిని కట్టడి చేయాల్సిన పోలీసులు.. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. బరుల్లో కోడిపందేలు జరుగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగాయి. కోళ్ల కాళ్లకు కత్తులుకట్టి నిర్వాహకులు పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పందేలకు దూరంగా ఉండాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోలేదు. అధికారపార్టీకి చెందిన నేతలే స్వయంగా పందేలు నిర్వహించారు. 
కోడిపందేలపై హైకోర్టు అసహనం
సంక్రాంతి సమయంలో ఏపీలో యథేచ్చగా కోడిపందేలు జరగడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము సూచించిన  సూచనలు, ఆదేశాలను అధికారులు అవహేళన చేశారని కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా విచ్చలవిడిగా కోడిపందేలు జరిగాయని... అధికారులు ఎక్కడా అడ్డుకున్న దాఖలాలు కూడా లేవని మండిపడింది.  కోడిపందేలకు ప్రజాప్రతినిధులే హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది.  కోడిపందేల విషయంలో సరైన చర్యలు చేపట్టలేమని కోర్టుకు వివరిస్తే బాగుండేదంటూ ఏపీ సీఎస్‌, డీజీపీలను ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  తమ ఆదేశాలను అమలుచేయకపోగా.. నివేదికలు ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. తమ ఆదేశాల మేరకు నివేదికలు సమర్పించనందుకు సీఎస్‌, డీజీపీలను స్వయంగా కోర్టుముందు హాజరుకావాలని ఆదేశించింది. జనవరి 29కి విచారణను వాయిదా వేస్తూ ఈనెల 22న ఆదేశాలిచ్చింది.
కోర్టుముందు హాజరుకు డీజీపీకి మినహాయింపు
29న డీజీపీల అంతరాష్ట్ర సమావేశం ఉండడంతో తనకు కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని డీజీపీ అభ్యర్థించారు. దీంతో డీజీపీ అభ్యర్థనను కోర్టు మన్నించి మినహాయింపు ఇచ్చింది. సీఎస్‌ మాత్రం 29న తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 29న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

 

నల్గొండలో వ్యక్తిని హత మార్చిన దుండగులు

నల్గొండ : జిల్లా కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేగింది. బొట్టగూడలో కనగల్ వాసి పాలకూర రమేష్ దారుణంగా హత్య చేశారు. తలను పడేసి వెళ్లిన దుండగులు, మొండెం లభ్యం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. రమేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 

07:55 - January 29, 2018

నల్గొండ : జిల్లాలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో 11 మంది నిందితులు కాగా... 8 మందిని అరెస్ట్ చేశారు. మిర్చి బండి దగ్గర పంచాయితీనే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హత్యలో రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చారు. పోలీసుల తీరుపై  శ్రీనివాస్‌ భార్య లక్ష్మీ, కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బజ్జీలబండి నాటకమాడారని ఆరోపించారు. ఎస్పీ చెప్పిన విషయాలు వాస్తవ దూరంగా ఉన్నాయని దుయ్యబట్టారు.
హత్యలో రాజకీయ కుట్ర ఏం లేదన్న ఎస్పీ 
నల్గొండలో ఈ నెల24న జరిగిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును పోలీసులు చేధించారు. హత్యలో రాజకీయ కుట్ర ఏం లేదని.. కేవలం చిన్న గోడవనే ఈ హత్యకి దారితీసిందని ఎస్పీ తెలిపారు. ఈ నెల 24న మాండ్ర మహేశ్‌ తమ్ముడు రాంబాబు క్యాన్సర్‌ వ్యాదితో చనిపోయాడు. దీంతో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మహేశ్‌ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లాడు. రాత్రి అంత్యక్రియలు ముగిసిపోయాక.. మహేశ్‌ స్నేహితులైన చింతకుంట్ల రాంబాబు, శరత్‌ మిర్చి బండి దగ్గరికి వెళ్లారు. అక్కడ సదరు మిర్చి బండి యజమానికి రాంబాబు స్నేహితులకు మధ్య ఘర్షణ జరిగింది. విషయం పోలీసులకు తెలువడంతో నిందుతులను చెదరగొట్టారని, పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ గుమిగూడారని, శ్రీనివాస్ మందలించడంతో ఆగ్రహంతో దాడికి పాల్పడి హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు. 
8మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
ఈ హత్యకేసులో నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  కేసుకు సంబంధించి 11మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో ఏ-1గా చింతకుంట్ల రాంబాబు సహా 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు నిందితులున్నారని పోలీసులు తెలిపారు. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయని, నిబంధనల కారణంగానే శ్రీనివాస్‌కు గన్‌మ్యాన్‌ కల్పించలేదని ఎస్పీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు.  హత్యలో రాజకీయ నేతల ప్రమేయం లేదని ఎస్పీ తేల్చిచెప్పారు.
ఎస్పీపై శ్రీను భార్య లక్ష్మీ ఆగ్రహం 
బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో రాజకీయకోణం లేదన్న ఎస్పీపై శ్రీను భార్య లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే తన భర్త హత్యకేసులో బజ్జీలబండి నాటకమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ చెప్పిన విషయాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. నిజానిజాలు తేలాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని.. లేకుంటే తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు 
పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు. ఫోన్‌ చేసి పిలిచిన వ్యక్తి అక్కడ లేకపోవడాన్ని పోలీసులు ఎందుకు అనుమానించడం లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సరికొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు. శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి బెదిరించారని ఆరోపించారు. వేముల వీరేశం గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయం జరగకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మొత్తానికి పోలీసులు కేసును ఛేదించిన విధానమంతా ఓ కట్టుకథని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి జగదీష్‌రెడ్డిని విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి కాంగ్రెస్‌ ఆరోపణలపై  ఇటు పోలీసులు, అటు గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

నేడు ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు జరుగనున్నాయి. నేడు ఉభయసభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు జరుగనున్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత బడ్జె సమావేశాలు, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. 

నేడు దివ్యాంగులకు, వృద్ధులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుమల : నేడు దివ్యాంగులకు, వృద్ధులకు టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించనుంది. 

నేడు అనంతపురం జిల్లాలో పవన్ మూడో రోజు పర్యటన

అనంతపురం : నేడు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. సత్యసాయి ఆస్పత్రిని సందర్శించనున్నారు. 

నేడు యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

యాదాద్రి : యాదాద్రిలో నేడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించనున్నారు. 

Don't Miss