Activities calendar

30 January 2018

21:58 - January 30, 2018

అగర్తల : త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌.. దేశంలోనే అత్యంత నిరుపేద ముఖ్యమంత్రి. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఇది అక్షరాలా నిజం. ఆయన చేతిలో ఇప్పుడున్న నగదు కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా.. నమ్మిన సిద్ధాంతాలకోసమే సంపాదనను ఖర్చు చేస్తోన్న ఆదర్శ రాజకీయవేత్త మాణిక్‌ సర్కార్‌పై 10టీవీ కథనం.  
స్వచ్ఛంగా జీవిస్తున్న మాణిక్‌ సర్కార్
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కారు.. తనదైన విభిన్నశైలితో.. నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం దక్కితేనే.. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను కూడబెట్టే ఈ రోజుల్లో.. నమ్మిన సిద్ధాంతాలతోనే.. ముఖ్యమంత్రి హోదాలోనూ నిజాయితీతో.. స్వచ్ఛంగా.. జీవిస్తున్నారు మాణిక్‌ సర్కార్.
1998లో తొలిసారిగా త్రిపుర ముఖ్యమంత్రి
త్రిపుర రాష్ట్రానికి 1998లో తొలిసారి ఎన్నికైన మాణిక్‌ సర్కార్.. అప్రతిహతంగా ఐదు పర్యాయాలూ ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల వేళ... ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో.. తనవద్ద కేవలం తొమ్మిది వేల ఏడువందల రూపాయలు మాత్రమే నగదు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా.. అప్పట్లోనే.. దేశంలోనే పేద ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. 
గడచిన ఐదేళ్లలో అత్యంత నిరుపేదగా మారిన సీఎం
ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో జరుగుతోన్న ఎన్నికల్లో మాణిక్‌సర్కార్‌ ధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదేసందర్భంలో.. ఆయన ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. అందులో.. తన బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అంటే, 2013 ఎన్నికల నాటితో పోలిస్తే.. ఆయన వద్దనున్న బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గణనీయంగా తగ్గిపోయింది. అంటే గడచిన ఐదేళ్లలో ఆయన మరింత పేదవాడిగా మారిపోయారని అర్థమవుతోంది. 
సీఎం హోదాలో తనకు వచ్చే వేతనం పార్టీ నిధులకు జమ
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగుతోన్న మాణిక్‌ సర్కార్.. ముఖ్యమంత్రిగా తనకు వచ్చే వేతనం 26వేల 315 రూపాయలను పార్టీ నిధుల కిందే జమ చేస్తూ వస్తున్నారు. తన జీవనానికి గాను, పార్టీ నుంచి ప్రతి నెలా 9వేల ఏడు వందల రూపాయలు పొందుతున్నారు. మాణిక్‌ సర్కార్‌ సతీమణి పాంచాలి భట్టాచార్జీ రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి. ఆమె చేతిలో మాత్రం 20వేల నగదు ఉంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూపంలో వచ్చిన పన్నెండు లక్షల 15వేల రూపాయల నగదు ఆమె బ్యాంకు ఖాతాలో ఉంది. 
సాధారణ జీవనం సాగిస్తోన్న మాణిక్‌ సర్కార్‌
మాణిక్‌సర్కార్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ... అతి సాధారణవ్యక్తి మాదిరిగా జీవిస్తున్నారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్‌ సర్కార్‌కు కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడగా లేదు. బయటికి వెళ్లేప్పుడు, రిక్షాల్లోనూ.. రైల్వే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. రాజకీయాలు అనగానే.. దోపిడికి దగ్గర దారి అని భావించే ఎందరో నాయకులకు.. మాణిక్‌ సర్కార్‌ నిబద్ధత.. జీవనశైలి నిస్సందేహంగా ఆదర్శప్రాయమే. 

 

21:51 - January 30, 2018

వరంగల్ : ప్రతి పల్లె... అక్కడకు భాగమయ్యేందుకు .. తహతహలాడుతున్నాయి..! పట్టణాలు ఆ వైపుగా పయనిస్తున్నాయి..! నగరాలకు నగరాలు అడవి బాట పట్టాయి. ఇదంతా.. కన్నుల పండువగా.. సాగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం. రేపటి నుంచి ప్రారంభమయ్యే... మేడారం జాతర... ఇప్పటికే జనసంద్రమైంది.
భారీ ఏర్పాట్లు 
రెండేళ్లకోసారి .. అత్యంత వైభవంగా జరిగే ... మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. సమ్మక్క, సారలమ్మల ఆశీస్సుల కోసం.. పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ జాతర సందడి నెలకొంది. 
31వ తేదీన సారలమ్మకు ప్రత్యేక పూజలు
మేడారం గద్దెల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను గద్దెల మీదకి తీసుకు రావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ మేరకు 31వ తేదీన ఆరుగురు పూజారులు.. గిరిజన సంప్రదాయంలో.. సారలమ్మను గద్దెకు  తీసుకువచ్చి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  రెండో రోజైన గురువారం ఉదయం సమ్మక్క పూజారులు చిలకల గుట్టపై కుంకుమ భరిణ రూపంలో సమ్మక్కను  తెచ్చి విశేష పూజలు నిర్వహిస్తారు. అదే రాత్రి పడిగిద్దరాజు, సమ్మక్కకు పెళ్లి చేస్తారు. దీంతో జాతర ఊపందుకుంటుంది. ఫిబ్రవరి 3న మహోత్సవం ముగియనుంది.
పోటెత్తుతున్న భక్తులు
ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోతెత్తుతున్నారు.  వనదేవతల ప్రసన్నం కోసం తండోప తండాలుగా వస్తున్నారు.  ఇప్పటికే అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు గద్దెల లోపలికి వెళ్లే ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. జంపన్నవాగు వద్ద రద్దీ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏడాది మేడారం జాతర రెండు కోట్ల మంది భక్తులు  ఈ జాతరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. 

 

21:49 - January 30, 2018

నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో ముమ్మాటికీ పోలీసులు, టీఆర్‌ఎస్ పెద్దల పాత్ర ఉందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హత్యపై జిల్లా ఎస్పీ చెప్పినది కట్టుకధగా తేలిపోయిందని ఆయన అన్నారు. హత్య జరిగిన సమయంలో కాల్ డేటా కావాలని అడిగితే, ఇస్తామని చెప్పి తమను పోలీసులు మోసం చేశారని కోమటిరెడ్డి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు కేసును నీరు గార్చారన్న కోమటిరెడ్డి ..సీబీఐకి దర్యాప్తు  అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. 

 

21:46 - January 30, 2018

ఢిల్లీ : ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం ఢిల్లీకి చేరింది. 18 డిమాండ్లతో కూడిన నివేదికను ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కేంద్రమంత్రి సుజనాచౌదరికి అందించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, ఎయిమ్స్ ఏర్పాటు, హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే  అంశాలపై కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ అంశాలపై ఇప్పటికే నివేదిక అందించామని .. ప్రధానితో కూడా మరోసారి ఈ డిమాండ్లపై విజ్ఞప్తి స్పష్టం చేశారు. 

21:43 - January 30, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. స్పిల్‌వే కాంట్రాక్టు పనులను నవయుగకు అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పిల్‌వే కాంక్రీట్, స్పిల్‌వే చానల్ పనులను ఇక నవయుగ సంస్థే చేపట్టనుంది. పాత ధరలకే ఈ పనులను చేయనుంది. ఢిల్లీలో ఏపీ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి ప్రాజెక్టు పనులు అప్పగింత 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర జలవనరులశాఖ, జలసంఘం అధికారులతో గడ్కరీ భేటీ అయ్యారు. ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్‌ ఛానల్‌ పనులను కొత్త కాంట్రాక్టరుకు అప్పగించే అంశంపై చర్చించారు. పోలవరం ప్రధాన కాంట్రాక్టరుగా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‌ .. ఇప్పటి వరకు అనుకున్నవిధంగా నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయలేదు. దీంతో ఈ పనులను నవయుగ సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. పాత ధరలతోనే 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నవయుగతో అంగీకారం కుదుర్చుకున్నారు.
అవగాహన ఒప్పందం 
నవయుగ కంపెనీకి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువు ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొనేందుకు అవగాహన ఒప్పందం కుదరనుంది. దీనిప్రకారం స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌ పనుల్ని నవయుగ సంస్థ వారం రోజుల తర్వాత చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్రం ముందే కొత్త కాంట్రాక్టరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉంటే ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన మూడు నెలల సమయం వృధా అయ్యి ఉండేది కాదని నీటి పారుదల నిపుణులు అంటున్నారు.  

అంబర్‌పేటలో నకిలీ వ్యాక్సిన్ తయారీ

హైదరాబాద్‌ : నగరంలో అంబర్‌పేట పరిధిలో నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ ముఠా గుట్టును ఛేదించారు. చిన్నపిల్లలకు ఇచ్చే టెటనస్ వ్యాక్సిన్‌ను రీసైకిల్ చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చి కొత్తవ్యాక్సిన్‌గా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 

21:38 - January 30, 2018

హైదరాబాద్‌ : నగరంలో అంబర్‌పేట పరిధిలో నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ ముఠా గుట్టును ఛేదించారు. చిన్నపిల్లలకు ఇచ్చే టెటనస్ వ్యాక్సిన్‌ను రీసైకిల్ చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చి కొత్తవ్యాక్సిన్‌గా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కొత్త డేట్‌తో తయారు చేసిన నకిలీ వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికే విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు యజమానితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:35 - January 30, 2018

హైదరాబాద్ : ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఒకే ఆకాశంలో ముగ్గురు చంద్రులను వీక్షించే అవకాశం కలుగనుంది. సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌, బ్లడ్‌ మూన్‌.. ఇలా మూడు రక్షాల చంద్రులను చూసే అద్భుత ఖగోళ ఘట్టం రేపు ఆవిష్కృతం కానుంది. ఇది 150 ఏళ్ల తర్వాత తొలిసారిగా వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  
ఖగోళంలో అద్భుతం ఘట్టం 
బుధవారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఖగోళంలో అద్భుతం ఘట్టం ఆవిష్కృతం కానుంది. 150 ఏళ్ల తర్వాత సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌ ఏర్పడుతోంది. ఆకాశంలో మూడు రకాల చంద్రులను చూసే అవకాశం వస్తోంది. సూపర్‌ మూన్‌, బ్లడ్‌ మూన్‌, బ్లూ మూన్‌.. ఇలా మూడు రకాల చంద్రులు కనువిందు చేయనున్నారు. 
చంద్ర గ్రహణం సూపర్‌ మూన్‌ 
చంద్రుడు వృత్తాకారంగా తిరిగే క్రమంలో భూమికి దగ్గరగా వస్తాడు. పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడటాన్ని సూపర్‌  మూన్‌గా పిలుస్తారు. ఒకే నెలలో రెండుస్లారు పౌర్ణమి వస్తే, చివరి పౌర్ణమినాటి చంద్రుణ్ని బ్లూ మూన్‌గా పిలుస్తారు. రెండున్నరేళ్లకు ఒకసారి ఇలా సంభవిస్తుంది. ఈనెల 1న, 31న రెండుసార్లు పౌర్ణమి వచ్చింది. సూపర్‌ మూన్‌ సంరద్భంగా చంద్రగహణం ఏర్పడితే చంద్రుడు ఎర్రగా కనిపించడాన్ని బ్లడ్‌ మూన్‌గా పిలుస్తారు. ఇలాంటి ఖగోళ ఘట్టం 1866 తర్వాత ఆవిష్కృతం అవుతోంది. 
రేపు సా 5.20 గంటలకు గ్రహణం 
చంద్రోదయం సమయంలో ఈ గ్రహణం కనిపిస్తుంది. మన దేశంలో బుధవారం సాయంత్రం 5.20 నుంచి రాత్రి 8.41 గంటల  వరకు  గ్రహణం కనిపిస్తుంది. ఇది 14 శాతం పెద్దగా, 31 శాతం కాంతివంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో ముందుగా సాయంత్రం 4.47 గంటలకే గ్రహణం కనిపిస్తుంది. కోల్‌కతాలో 5.16 గంటలకు, పాట్నాలో 5.25 గంటలకు కనిపిస్తుంది. ఢిల్లీలో 5.53 గంటలకు, చెన్నైలో 6.04 గంటలకు, ముంబైలో 6.27 గంటలకు గ్రహాన్ని చూడొచ్చు. సూపర్‌ మూన్‌, బ్లడ్‌ మూన్‌, బ్లూ మూన్‌ను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 
ప్రధాన దేవాలయాలు మూసివేత  
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలను మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి దేవాలయాన్ని  ఉదయం 10.45 గంటల నుంచి రాత్రి 9.30 గంటలకు మూసివేస్తారు. ఈ సమయంలో అన్న ప్రసాదాలు కూడా నిలిపివేస్తారు. సంప్రోక్షణ, శుద్ధి, పుణ్యావచనం తర్వాత రాత్రి 9.30 గంటల తర్వాత తెరుస్తారు. అలాగే సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ, బెజవాడ కనకదుర్గ, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, సిరిసిల్లా రాజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను కూడా మూసి ఉంచుతారు. 

21:28 - January 30, 2018

150 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుత చంద్రగ్రహణాన్ని చూడకూడదా? జోతిష్యులు చెబుతున్న అరిష్టాల్లో ఉన్న నిజమెంత ? అసలు గ్రహణాలు ఎందుకు వస్తాయి ? గ్రహణం..వాస్తవం అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమేష్ పాల్గొని, మాట్లాడారు. చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు అన్నారు. ఎలాంటి ఇబ్బంది, నష్టం లేదన్నారు. ఎలాంటి దోషం ఉండదన్నారు. గ్రహణాలు ఆకాశంలో సహజంగా జరుగుతుంటాయన్నారు. సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ గా చూడలేమని..కానీ చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:11 - January 30, 2018
21:09 - January 30, 2018
21:06 - January 30, 2018

ఇది అభివృద్ధి ఎలా అవుతుంది ? కుల లేదు... మతం లేదు.. నాది పేదల కులమంటున్న చంద్రాలు, ఘర్షణపడ్డ వైసీపీ కార్యకర్తలు, సర్కార్ బడి సార్ల సంగతి చెప్పబోతున్న ప్రభుత్వం... ఉపాధ్యాయులకు ఆన్ లైన్ హాజరు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని బదునామ్ చేస్తున్నరంట, పద్మ పురస్కారాల కథ, మద్యం కారు నడిపిన సీఐ, స్కూల్ రెనివల్స్ కోసం వెళ్తే లంచం అడిగిన అధికారి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

20:28 - January 30, 2018

కేంద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ జాతీయ కార్యదర్శి రాంబాబు, అలిండియా ఇన్సూరెన్స్ ఎంపాయిస్ అసోసియేషన్ జాతీయ ట్రెజరర్ రవి, ప్రముఖ చార్ట్ ఆండ్ అకౌంటెంట్, ఆర్ పీ రంగ నిపుణులు లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మహిళలు, సీపీఎం నాయకులతో పోలీసుల దురుసు ప్రవర్తన

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన మద్యంషాపు వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయని... మహిళలు, సీపీఎం కార్యకర్తలు..మద్యం షాపును ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... మహిళలు, సీపీఎం నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

19:44 - January 30, 2018

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన మద్యంషాపు వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయని... మహిళలు, సీపీఎం కార్యకర్తలు..మద్యం షాపును ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... మహిళలు, సీపీఎం నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్‌.ఐ. చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్య పదజాలం వాడిన పోలీసులపై మహిళలు మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:42 - January 30, 2018

తూర్పుగోదావరి : దళితుల సమస్యలపై స్పందిస్తున్న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాములుకు అమలాపురంలో సన్మాన కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేత హర్షకుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా హర్షకుమార్ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. రాములు జాతికి ఉపయోగపడే నాయకుడని అన్నారు. రాములును సన్మానించుకోవడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:38 - January 30, 2018

పశ్చిమగోదావరి : ఏలూరులో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్మికులు.. కలెక్టర్‌ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కార్మికుల మస్యలను పరిష్కరించాలంటూ.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రభుత్వం హామీలకు మాత్రమే పరిమితమవుతుందని విమర్శించారు. ఆందోళనలో పాల్గొన్న కార్మికులను, సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

19:37 - January 30, 2018

విజయనగరం : కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరంలో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నాయని కార్మిక నేతలు విమర్శించారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

19:35 - January 30, 2018

విజయవాడ : కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా.. విజయవాడలో  కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సత్యాగ్రహం, జైల్‌బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలంకార్‌ సెంటర్‌లో బైఠాయించి.. ఆందోళన చేశారు. దీంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

 

19:33 - January 30, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని పలాస కాశీబుగ్గలో ఆత్మహత్య చేసుకున్న హరీష్‌ కేసు నిముషానికో మలుపు తిరుగుతోంది. హరీష్ మృతికి పలాస మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ పైల చక్రధరరావుతో పాటు సీఐ అశోక్‌ కుమార్ వైఖరి కారణమంటూ స్ధానికులు హరీష్‌ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. భారీ ర్యాలీ తీసి రోడ్డుపై బైఠాయించారు. డిగ్రీ చదువుతున్న హరీష్‌ పలాస కాశీబుగ్గలోని లక్ష్మీ స్వీట్ షాపులో పనిచేస్తున్నాడు. స్వీట్ షాపుకు వెళ్లిన కౌన్సిలర్ చక్రధర్‌ను శాంపిల్స్ పేరుతో స్వీట్‌ను ఎంగిలి చేయవద్దని హరీష్‌ వారించాడు. వెంటనే కౌన్సిలర్ చక్రధర్ హరీష్ పై దాడి చేశాడు. అనంతరం రైల్వే ట్రాక్‌పై హరీష్‌ మృతదేహం గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 14వ వార్డు కౌన్సిలర్ చక్రధర్‌తో పాటు.. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న సి.ఐ అశోక్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. 

 

19:30 - January 30, 2018

ప్రకాశం : కాల్‌మనీ మరోసారి బుసలుకొట్టింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని వడ్డీ వ్యాపారికి ఇళ్లు తనఖా పెట్టి 7 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. రెండేళ్లుగా రోజుకు 7 వందలు చొప్పున చెల్లిస్తున్నారు. ఐతే ఎంతకూ అప్పు తీరక పోవడంతో.... ఆ ఇంటిని బ్యాంకులో తనఖా  పెట్టి ఋణం తీసుకుని మొత్తం చెల్లిస్తామన్నారు. తనఖా పెట్టుకున్న కాల్‌మనీ కేటుగాడు బ్యాంకు నుంచి వచ్చిన రుణం మొత్తాన్ని కూడా దిగ మింగాడు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే  ...తాము టీడీపీకి చెందిన వారమని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:27 - January 30, 2018

ఢిల్లీ : పోలవరం నిర్మాణం పనులకు అడ్డంకి తొలగిపోయింది. సెక్షన్ 60సి ప్రకారం పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో పోలవరంపై ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లతో కేంద్రమంత్రి గడ్కరీ సమావేశం నిర్వహించారు. గడ్కరీ సమక్షంలో సమిష్టి చర్చలు నిర్వహించారు. ట్రాన్స్‌ ట్రాయ్‌ నుంచి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్ పనులను నేరుగా నవయుగ కంపెనీకే  కేటాయించేలా గడ్కరీ ఆమోదం తెలిపారు.  నవయుగ కన్‌స్ట్రక్షన్‌తో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఒప్పందం పూర్తైన వారం రోజుల్లో నవయుగ కంపెనీ పనులు ప్రారంభిస్తుందని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ చెప్పారు. 

 

ప్రకాశం జిల్లా కందుకూరులో కాల్‌మనీ

ప్రకాశం : కాల్‌మనీ మరోసారి బుసలుకొట్టింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని వడ్డీ వ్యాపారికి ఇళ్లు తనఖా పెట్టి 7 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. రెండేళ్లుగా రోజుకు 7 వందలు చొప్పున చెల్లిస్తున్నారు. ఐతే ఎంతకూ అప్పు తీరక పోవడంతో.... ఆ ఇంటిని బ్యాంకులో తనఖా  పెట్టి ఋణం తీసుకుని మొత్తం చెల్లిస్తామన్నారు. తనఖా పెట్టుకున్న కాల్‌మనీ కేటుగాడు బ్యాంకు నుంచి వచ్చిన రుణం మొత్తాన్ని కూడా దిగ మింగాడు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే  ...తాము టీడీపీకి చెందిన వారమని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించారు.

 

18:45 - January 30, 2018

ఢిల్లీ : గ్రామ పంచాయితీల బలోపేతం కొరకు.. 15వ ఆర్థిక సంఘంలో నిధులు పెంచాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పంచాయితీ రాజ్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన జూపల్లి... గతంలో 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను రెండింతలు చేయాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. 

 

18:42 - January 30, 2018

నల్గొండ : ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నల్గొండలో జరగబోయే సీపీఎం రాష్ట్ర మహాసభల ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు  జిల్లా నాయకత్వం పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించింది. ఈ మహాసభలకు సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని.. తొలి రోజు పట్టణంలో రెడ్ షర్ట్‌ వాలంటీర్ల కవాత్‌ ఉంటుందంటున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

18:39 - January 30, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌ నటుడు  సామ్రాట్‌రెడ్డి తన కుమార్తె హర్షితారెడ్డిని చంపటానికి ప్రయత్నించాడని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. సామ్రాట్ ఓ సైకో అని తన కూతురిని తీవ్రంగా వేధించాడని అంటున్నారు. అతను మారతాడని చాలా ప్రయత్నించి విఫలమయ్యామని చివరికి కాంప్రమైజ్ అయ్యి విడాకులకు సిద్ధమైనట్లు చెబుతున్న హర్షిత తండ్రితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:37 - January 30, 2018

హైదరాబాద్ : బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌.. బిఎల్‌ఎఫ్‌ ఏర్పాటును నిజామాబాద్‌ ఎంపీ కవిత స్వాగతించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తామన్నారు. అయితే.. బిఎల్‌ఎఫ్‌ వల్ల.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని కవిత అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా.. ఆమె బిఎల్‌ఎఫ్‌పై స్పందించారు. బీఎల్ ఎఫ్, టీమాస్ లేవనెత్తిన హేతుబద్ధమైన సమస్యలపై సీఎం సానుకూలంగానే స్పందిస్తున్నారని కవిత అభిప్రాయపడ్డారు. గడచిన కొన్ని ఎన్నికల ఫలితాలను బట్టి.. లెఫ్ట్ పార్టీల ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలుస్తూనే ఉందని.. వీటిపై తాము ఆందోళన చెండదం లేదని అన్నారు. అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయిన ప్రతిపక్ష పార్టీలు సిఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే కుంటిసాకులు చూపడం సరికాదన్నారు.

 

18:31 - January 30, 2018

వరంగల్ : జనజాతర సంబురం మొదలైంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గిరిజన వేడుకకు మేడారం ముస్తాబైంది. జాతర రేపటి నుంచే అయినా.. మేడారం ఇప్పటికే జన సంద్రమైంది. ఇప్పటికే లక్షల మంది మేడారం చేరుకొని... మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు పగిడిద్దరాజు పెళ్లికొడుకై కదిలాడు. సమ్మక్కగద్దెకు సపరివార సమేతంగా పయనమయ్యాడు. పగిడిద్దరాజును పెళ్లికొడును చేసి.. భాజా భజంత్రీలతో ' ఆరెం ' వంశీయలు  మేడారానికి బయలుదేరారు. ఆట పాటలతో.. ముందుకు సాగారు. 
జనజాతరకు పెళ్లికొడుకై కదిలిన పగిడిద్దరాజు
మేడారం జాతరలో భాగంగా భద్రాద్రి జిల్లా.. వేపలగడ్డ గ్రామం నుంచి .. పగిడిద్దరాజు పయనమయ్యాడు.  ఈ సందర్భంగా పగిడిద్ద రాజు ఆలయంలో ఉన్న పడగలకు, శివసత్తులకు గిరిజనులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండాలు, నగలు, గజ్జెలను చేతబట్టి .. గిరిజన వాయిద్యాలను మోగిస్తూ.. పగిడిద్దరాజును.. మేడారం సమ్మక్క గద్దెకు ఊరేగింపుగా తరలించారు. ఆట, పాటలతో.. అంగరంగ వైభవంగా..ఈ ఊరేగింపు సాగింది. దీంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. 
గర్భగుడిలో విశేష పూజలు
పగిడిద్దరాజు ఊరేగింపు.. వేపలగడ్డ- గుండాల- పస్త్రా  మీదుగా రెండు రోజులకు మేడారం చేరుకోవడం జరుగుతుంది. మొత్తం 80 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకతోనే చేరుకుంటారు.  బుధవారం రోజు పగిడిద్దరాజుతో పాటు, కొండాయిగూడెం నుంచి గోవిందరాజు, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల ఆదివాసీలు, పూజారులు తీసుకువస్తారు. ఆ ముగ్గురు వన దేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురువారం నాటికి సమ్మక్కను చిలకల గుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదే రాత్రి పడిగిద్దరాజు సమ్మక్క దేవతలకు పెళ్లి చేస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. 

 

17:55 - January 30, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌ నటుడు సామ్రాట్‌రెడ్డిపై దొంగతనం కేసు నమోదయింది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సామ్రాట్‌ తన ఇంట్లో దొంగతనం చేశాడని భార్య హర్షితా రెడ్డి ఫిర్యాదు చేసింది. తనపై పలు మార్లు దాడి చేశాడని చెప్పారు. సామ్రాట్ కు లేని అలవాటు అంటూ లేదని ఆమె ఆరోపించింది. హుక్కా సెంటర్ లో డ్రగ్స్ తీసుకుండాడని...అతనికి ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయంటున్న హర్షితారెడ్డితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహిచింది. ఎంత నచ్చచెప్పే పయత్నం చేసినా వినలేదన్నారు. తనను వదిలించుకోవాలి అని చూడటమే కాకుండా మా ఇంట్లో వస్తువులు ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. తనతో కలిసి ఉండే ఉద్దేశం లేదన్నారు. పెద్దలతో రాజీ ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడంతోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

 

17:49 - January 30, 2018

విశాఖ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా... అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. సరస్వతి పార్క్‌ నుంచి  జగదాంబ వరకూ ర్యాలీ సాగింది. అయితే కార్మిక సంఘాల నేతలను జగదాంబ జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకుని.. కార్మికులు కలెక్టరేట్‌ వద్దకు దూసుకెళ్లారు. కలెక్టరేట్‌ వద్ద కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

17:42 - January 30, 2018

నవయుగ సంస్థకు పోలవరం పనుల అప్పగింత

ఢిల్లీ : పోలవరం పనుల్లో ముందడుగు పడింది. స్పిల్‌ వే, స్పిల్ ఛానల్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన భేటీలో కేంద్రమంత్రి గడ్కరీ ఈ అనుమతులు జారీచేశారు. నవయుగ సంస్థకు ఈ నిర్మాణ పనులు అప్పగించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:39 - January 30, 2018

ఢిల్లీ : పోలవరం పనుల్లో ముందడుగు పడింది. స్పిల్‌ వే, స్పిల్ ఛానల్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన భేటీలో కేంద్రమంత్రి గడ్కరీ ఈ అనుమతులు జారీచేశారు. నవయుగ సంస్థకు ఈ నిర్మాణ పనులు అప్పగించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:37 - January 30, 2018

రాజమండ్రి : చంద్రబాబు ప్రభుత్వంపై దళితులు విశ్వాసం కోల్పోయారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాయని ఆరోపించారు. దళితుల సమస్యలపై స్పందిస్తున్న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు ఘన సన్మాన కార్యక్రమం సందర్భంగా హర్షకుమార్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:35 - January 30, 2018
17:34 - January 30, 2018
17:32 - January 30, 2018
17:30 - January 30, 2018
17:15 - January 30, 2018

నల్లగొండ : జిల్లాలో హత్యారాజకీయాలకు ఆద్యం పోసిం కాంగ్రెస్ పార్టీ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. జిల్లాలో చాలామందిని చంపించిన చరిత్ర కోమటిరెడ్డిదని వ్యాఖ్యానించారు. ఈమేరకు వీరేశంతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ భర్త హత్య తరువాత ఆయన మొదటిసారి స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం తనపై అభియోగాలు మోపుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ పై ఫిర్యాదు చేస్తానని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ని చట్టపరంగా ఎదుర్కుంటానని తెలిపారు. 

 

16:46 - January 30, 2018

అనంతపురం : జిల్లాలోని లేపాక్షి మండలం నాయినపల్లిలో విషాద ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మృతులు కల్పన(29), మేఘన(6), భవ్య(4) గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఎంపీలు సహకరిస్తే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుంది : జాన్ బాబు

విశాఖ : ఎంపీలు సహకరిస్తే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని జెడ్ ఆర్ సీసీ సభ్యులు జాన్ బాబు అన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రత్యేక రైల్వే జోన్ పై పైగా టెక్నీకల్ కమ్యూనిటీ ఫీజిబులిటీ లేదని ఈ నేతలే చెబుతున్నారని తెలిపారు. 

 

16:18 - January 30, 2018

పద్మ అవార్డుల సిగలో తెలుగువారు, సౌది అరేబియాలో యోగా నిర్వహిస్తున్న నవ్ మర్వాయి, సాహిత్యంలో మహిళల పాత్ర విశిష్టమైనది.. జనపదాలకు ప్రత్యేక స్థానం.. పద్మ అవార్డుకు ఎంపికైన విజయలక్ష్మీ, కూలీ డబ్బులతో ఆస్పత్రి కట్టించిన మిస్త్రీ... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:16 - January 30, 2018

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి ఆస్తుల పంపకాల వ్యవహారం ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలపై ఇరు రాష్ర్టాల కమిటీలు ముచ్చటగా మూడు సార్లు భేటీ అయినా ఒక్క సమస్యకూ పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదు. ఇరువైపులా అంతా సుముఖమే అంటున్నా అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి? దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా?
నేటికీ పరిష్కారం కాని సమస్యలు
రెండు తెలుగు రాష్ర్టాలు విడిపోయి దాదాపు నాలుగేళ్ళు కావొస్తోంది. మరోసారి ఎన్నికలకు కూడా సిద్ధ పడుతున్నారు. 
విభజన సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయం,  వివిధ కార్పొరేషన్‌ భవనాలు, ప్రభుత్వ ఆఫీస్‌ బిల్డింగ్స్‌తోపాటు...  న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన నేటికీ తెగలేదు. ఇక జలవివాదాలు, విద్యుత్‌ వివాదాలు, ఆర్టీసి ఆస్తులు సరేసరి. 9, 10వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన అలాగే ఉంది.   హై కోర్టు, విద్యుత్‌ ఉద్యోగులు, ఎస్పీఎఫ్, నాలుగోతరగతి ఉద్యోగుల సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 
కాలం గడిచే కొద్దీ  చల్లబడ్డ రాష్ర్టాలు
నీటి పంపకాల విషయంలోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ సమస్యలపై  రెండు రాష్ర్టాలు కోర్టు మెట్లెక్కడంతో కాలయాపన జరిగింది. దీంతో  కాలం గడిచే కొద్దీ రెండు రాష్ర్టాలు చల్లబడ్డాయి.  సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమన్న  నిర్ణయానికి వచ్చాయి. ఉమ్మడి గవర్నర్‌ మధ్యవర్తిగా.. ఇరు రాష్ట్రాలకు చెందిన కేబినెట్‌  మంత్రులతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో చర్చలకు ముందడుగు పడింది.
9వ షెడ్యూల్‌లోని 12 ఉమ్మడి సంస్థలపై ఏకాభిప్రాయం 
రాజ్‌భవన్‌ వేదికగా రెండు రాష్ర్టాల మంత్రులు గవర్నర్‌ సమక్షంలో మూడు సార్లు భేటీ అయ్యారు.  కీలకమైన 9వ షెడ్యూల్‌లోని 12 ఉమ్మడి సంస్థలపై ఏకాభిప్రాయం కుదిరిందని కూడా అప్పట్లో ప్రకటించారు. సమావేశం ఎప్పుడూ  హైదరాబాద్‌లోనే కాకుండా.. విజయవాడలోనో.. అమరావతిలోనో జరపాలని కూడా అనుకున్నారు. ఈ నిర్ణయం మాటలకే పరిమితమైంది. 
శిథిలమవుతోన్న ఏపీ ఆధీనంలోని భవనాలు
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలన్నీ నిర్వహణలేక పాడైపోతున్నాయి.   హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సచివాలయంలో మాత్రం 15మంది విధులకు హాజరవుతున్నారు. వీటికి విద్యుత్‌, నీటి బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. నిర్వహణలేక ఈ భవనాలు  దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యవహారంలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ముందు సెంటిమెంట్‌  పాలిటిక్స్‌ చేసేందుకు ఇరు రాష్ర్టాల సీఎంలు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.

16:08 - January 30, 2018

హైదరాబాద్ : బల్దియాలో ఇప్పుడంతా బిజీబిజీ... ఎవరిని కదిలించినా ఆస్తిపన్ను వసూళ్ళమాటే... టార్గెట్‌ రీచ్‌ కావడం కోసం అన్ని పనులనూ పక్కన పెట్టేశారు. టైమ్‌ టు టైమ్‌ రివ్యూ చేస్తూ... పన్ను వసూళ్ళు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆదాయంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ వాటా ఎక్కువే... ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బల్దియా ఏ చేయబోతోంది. వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
రోజు వారీ వసూళ్ళపై దృష్టి
జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయంలో ప్రధానమైంది ఆస్తి పన్ను... బల్దియాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చడంలో అగ్రభాగం ఆస్తిపన్నుదే. బిల్‌ కలెక్టర్‌ మొదలుకుని కమిషనర్‌ వరకూ.. అందరూ ట్యాక్స్‌ కలెక్షన్లకు పెద్ద పీఠ వేస్తారు. జనవరి వచ్చిందంటే చాలు.. రోజు వారీ వసూళ్ళపై దృష్టి పెడతారు. దీంతో ఈ మధ్య  జీహెచ్‌ఎంసీలో ఏ అధికారిని కదిలించినా... ట్యాక్స్‌ వసూళ్ళ ముచ్చటే వినిపిస్తున్నారు. 
ఈసారి రూ. 1400 కోట్లు లక్ష్యం  
జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం డిమాండ్‌, ఎరియర్స్ కలిపి 2400 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఆస్తిపన్నుగా దాదాపు 1200కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈసారి 1400 కోట్లు వసూలు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
గ్రేటర్‌ పరిధిలో 14లక్షల 72వేల మంది ఆస్తి పన్ను చెల్లింపు దారులు ఉన్నారు.  అందులో కమర్షియల్‌ ఎస్టాబ్లిష్మెంట్స్‌ 2లక్షలా 40వేలు కాగా... రెసిడెన్సియల్‌ తోపాటు కమర్షియల్‌ కలిగినఆస్తులు 20వేలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా 1235కోట్లు ఈ ఏడాది ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. అయితే ఇప్పటివరకున్న ఎరియర్స్, వడ్డీ కలిపి మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్‌ డిమాండ్‌ 2400 కోట్లు ఉంటుంది. 
చివరి రెండు రోజుల్లో వంద కోట్లు వసూలు
ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ  లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మరో 532 కోట్ల రూపాయలు వసూలు చెయ్యాల్సి ఉంది. బల్దియాలో సాధారణ రోజుల్లో ప్రతిరోజు కోటీ 50 లక్షల నుంచి 2కోట్ల వరకూ వసూలవుతుంది. కాగా స్పెషల్‌ ఫోకస్‌  పెట్టడంతో అది రెండు నుంచి మూడు కోట్లకు పెరిగింది. సాధారణంగా చివరి రెండు రోజుల్లో వంద కోట్లు వసూలు అవుతుంటాయి. ఈ రెండు నెలల్లో 430 కోట్లు వసూలు చెయ్యాల్సి ఉంది.  అంటే ప్రతి రోజు ఏడు కోట్ల వరకు  వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఆర్థిక ఇబ్బందుల్లో బల్దియా
బల్దియా అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. నాలాల విస్తరణ, సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా నిధుల అవసరం ఉంది. అయితే రెగ్యులర్ మెయింటినెన్స్ పనులు, జీతాలకే ఇప్పుడు కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వసూలవుతున్న ఆస్థిపన్నును అన్ని పనులకూ సర్దుబాటు చేస్తున్నారు.  
బల్దియాకు మరో ముఖ్యమైన ఆదాయం పర్మిషన్‌ ఫీజు
బల్దియా ఆదాయంలో మరో ముఖ్యమైన వనరు పర్మిషన్‌ ఫీజు. టౌన్‌ప్లానింగ్ ద్వారా నిర్మాణ అనుమతులకోసం ప్రతి ఏటా హైదరాబాద్‌లో  దాదాపు 500 కోట్ల ఆదాయం వస్తుంది.  ఈ ఏడాది ఇప్పటివరకూ 400 కోట్ల ఆదాయం రాగా.. మరో వంద కోట్లు వసూలయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కానీ... ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా రావాల్సిన ఆదాయం ఈ సారి తగ్గడం కూడా సమస్యగా మారింది. క్షేత్ర స్థాయిలో డే టు డే రివ్యూలు చేస్తూ... వసూళ్ళపై దృష్టి పెట్టారు బల్దియా అధికారులు. కానీ..  లక్ష్యాన్ని చేరుకుని ఇబ్బందులను అధిగమిస్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

 

16:03 - January 30, 2018

నిజామాబాద్ : ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఫాల్కన్‌ పంపులను రైతులు బాగా ఆదరిస్తున్నారని.. ఫాల్కన్‌ యామాన్యం అంటోంది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఫాల్కాన్‌పంపులపై జరిగిన అవగాహన సదస్సులో స్థానిక రైతులు, మెకానిక్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో పంప్‌సెట్‌లో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంది. దీనికి సరైన పరిష్కారం ఫాల్కన్‌ పంపులేనని.. ఏపీ , తెలంగాన ఫాల్కన్‌ పంపుల డిస్ట్రిబ్యూటర్‌ నల్లపాటి బసంత్‌ అన్నారు. 

 

15:59 - January 30, 2018

వరంగల్ : గిరిజన దైవం మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అమ్మల చెంత పెట్టిన దృష్టిని ఇతర ఆలయాలపై ఉంచడంలేదు. దీంతో మేడారం జాతరకు వచ్చి తిరుగుముఖం పడుతోన్న భక్తులు నిరాశకు గురవుతున్నారు. 
ఈ నెల 31న మేడారం జాతర ప్రారంభం 
ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న మేడారం జాతర ఈ నెల 31న ప్రారంభం కానుంది. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు నెల రోజుల ముందు నుండే భక్తులు తరలివస్తున్నారు. దీంతో పాటు పచ్చనైన అడవి అందాలను వీక్షించేందుకు పక్కా ప్రణాళికతో మేడారానికి చేరుకుంటారు. అయితే మేడారంపై పెట్టిన దృష్టిని అధికారులు పరిసర ప్రాంతాల్లో పెట్టకపోవడంతో సమస్య మొదలైంది. 
సేద తీరేందుకు కనీ సదుపాయాలు లేవు
మేడారంలో మొక్కులు తీర్చుకున్న భక్తులు పరిసర ప్రాంతమైన ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో సేద తీరేందుకు కనీ సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక అవసరాల కోసం చేపట్టాల్సిన విద్యుత్తు ఏర్పాట్ల పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 
సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న రామప్ప దేవాలయం  
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రామలింగేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. రామప్పకు చేరుకునేందుకు ఆర్టీసీ సౌకర్యం కూడా లేకపోవడంతో పర్యటకులు అద్దె వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో భక్తులపై అధిక భారం పడుతోంది. బస్సు సదుపాయంలేకపోవడంతో పాలంపేట వద్ద నుండి భక్తులు కాలినడకన రామప్పకు చేరుకోవాల్సి వస్తుంది. ఇక రామప్ప సరస్సుకు చేరుకోవాలంటే కిలో మీటరు దూరం నడవాల్సి ఉంటుంది. రోజుకు వందల మంది పర్యటకులు సందర్శించే రామప్పలో ప్రత్యేకమైన రోజుల్లో తప్ప వైద్య సదుపాయాలు లేవు. ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న రామప్పలో  సేదతీరేందుకు వసతి సౌకర్యాలు లేవు. ప్రైవేటు గదులను ఆశ్రయిస్తే అద్దె ధరలు విపరీతంగా ఉన్నాయి. ఇక పార్కింగ్‌ సౌకర్యం కూడా లేకపోవడంతో పర్యటకుల ఇక్కట్లు వర్ణణాతీతం.
దేవాలయంలో మౌలిక సదుపాయాల కొరత 
మంగపేట మండలం మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి మేడారం భక్తులు చేరుకుంటారు. స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. గుట్టపై నిర్వహించే కల్యాణాన్ని వీక్షించేందుకు ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. ఇంతటి మహా పుణ్యక్షేత్రంమైన దేవాలయంలో మౌలిక సదుపాయాల కొరత భక్తులను ఇబ్బందులకు గురి చేస్తుంది. విశ్రాంతి గదులు, నీటి సౌకర్యం సరిగా లేవు. అన్నదానం సత్రం ఇరుగ్గా ఉండి భక్తులకు సమస్యగా మారింది.
భక్తులను వెక్కిరిస్తున్న సమస్యలు 
గోవిందరావు పేట మండలంలో సుందర జలాశయంగా విరాజిల్లుతోన్న లక్నవరంకు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకున్న భక్తులు జలాశయం అందాలు వీక్షించేందుకు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ వసతుల లేమి భక్తులను వెక్కిరిస్తోంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యటకులు ఇక్కడ బస చేయడానికి కనీస వసతి గృహ సౌకర్యాలు లేవు. దీంతో పర్యటకులు గుడారాలలో బస చేయాల్సి ఉంటుంది. ఇక తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాల సమస్య గురించి చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన పల్లెల్లో కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపేందుకు వచ్చే మేడారం భక్తులకు సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను తీర్చాలను భక్తులు కోరుతున్నారు. 

 

15:54 - January 30, 2018

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్‌ వెనకడుగు వేసిందా? వీలైనంత త్వరగా జరపాలని పావులు కదిపిన గులాబీబాస్‌ పునరాలోచనలో పడ్డారా? నిర్ణీత సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోవా ? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...
స్థానిక సంస్థల చట్టంలో సవరణలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయని విస్తృత ప్రచారం జరిగింది. కేసీఆర్‌ సర్కార్‌ ఎన్నికల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనతో ఉందన్న విశ్లేషణలు జరిగాయి. ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గులాబీ బాస్‌ యోచించారు. ఇందుకోసం స్థానిక సంస్థల చట్టంలో సవరణలు చేయాలని భావించారు.  ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఆమోదించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. అన్ని పార్టీలు కూడా స్థానిక సమరానికి సిద్ధమయ్యాయి. 
స్థానిక సమరంపై కేసీఆర్‌ సైలెంట్‌
స్థానిక సమరం హీట్‌ పెంచిన గులాబీ బాస్‌ ప్రస్తుతానికి సైలెంట్‌ అయిపోయారు. స్థానిక సంస్థల చట్టానికి  బడ్జెట్‌ సమావేశాల్లోనే సవరణలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఆ తర్వాత కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు గులాబీబాస్‌ సుముఖంగా లేన్నట్టు తెలుస్తోంది. దీంతో లోకల్‌బాడీ సమరానికి మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలకు సంబంధించి పార్టీలో తర్జనభర్జనలు జరుగుతుండడంతో ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు మిగిలింది ఏడాదే
సాధారణ ఎన్నికలకు ఇక మిగిలింది ఏడాది మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి.. అదే ఊపుతో  సార్వత్రిక సమరానికి వెళ్లాలని గులాబీబాస్‌ యోచించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత జాప్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే... కొత్తగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం, ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లడం పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందన్న అభిప్రాయం ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే... గ్రామాల్లో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్టవుతుందన్న ఆందోళన గులాబీ నేతలను వెంటాడుతోంది. దీంతో గులాబీబాస్‌ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది.  మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల సమయం మరికొంత జాప్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

 

15:46 - January 30, 2018

 ఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా నేషనల్‌ ఫోరం ఏర్పాటైంది. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలకు  దీనిలో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌కు చెందిన మనీశ్‌ తివారీ, టీఎంసీ నేత దినేశ్‌ త్రివేది, ఆప్‌ నాయకుడు అశుతోశ్‌, ఆశిష్‌ ఖైతాన్‌, ఎన్‌సీపీకి చెందిన మజీద్‌ మెమన్‌  తదితరులు నేషనల్‌ ఫోరంలో సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ప్రధాని మోదీ ఆర్థిక విధానాలను విమర్శించిన యశ్వంత్‌ సిన్హా     నేషనల్‌ ఫోరంకు నేతృత్వ వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 

 

15:41 - January 30, 2018

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌లో యువతి హత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. డాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. హత్యజరిగిన ప్రదేశాన్ని ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు సందర్శించారు. దేవరకొండకు చెందిన అనూష కొంతకాలంగా హయత్‌నగర్‌లో ఉంటోంది. ఒంటరిగా రూంలో ఉంటూ పోలీస్‌జాబ్‌కోసం కోచింగ్‌ తీసుకుంటోంది. కాగా అనూషకు ఇంతకు ముందే మోతీలాల్‌ అనే యువకుడితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. మోతీలాల్‌ హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలు అనూషకు చెందిన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

 

15:37 - January 30, 2018

హైదరాబాద్‌ : కొండాపూర్‌లో మహిళ హత్య కలకలం రేపింది. హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గోనెసంచిలో కట్టి పడవేశారు. శ్రీరామ్‌నగర్‌ కాలనీ గోనెసంచి నుంచి దుర్వాసన వస్తుండటంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:59 - January 30, 2018

కృష్ణా : విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన స్థలాన్ని కాపాడుకుంటామంటున్నారు కళాశాల పూర్వ విద్యార్థులు.. కళాశాల స్థలం ఆక్రమణకు గురైందన్న విషయం తెలిసి పూర్వ విద్యార్థులంతా ఒక్కటయ్యారు. ప్రస్తుత విద్యార్థులతో కలసి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని స్థలాన్ని తిరిగి కళాశాలకు చెందేలా చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ బీఎస్టీ రోడ్డులోని ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలం వద్ద తాజా పరిస్థితిని వీడియోలో చూద్దాం... 

 

సీఎం ఆదేశాల మేరకే శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చారు : కోమటిరెడ్డి

నల్లగొండ : సీఎం ఆదేశాల మేరకే పోలీసులు శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఆరోపించారు. ఎస్పీ అధికార పార్టీ తొత్తుగా మారారని ఘాటుగా విమర్శించారు. 

13:55 - January 30, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జనజాతరకు పగిడిద్దరాజు పెళ్లికొడుకై కదిలాడు. భద్రాద్రిజిల్లా వేపలగడ్డ నుంచి వరంగల్‌జిల్లా మేడారం సమ్మక్కగద్దెకు సపరివార సమేతంగా పయనం అయ్యాడు. పగిడిద్దరాజును పెళ్లికొడును చేసి.. భాజా భజంత్రీలతో ' ఆరెం ' వంశీయలు మేడారానికి బయలుదేరారు. వేపలగడ్డ గ్రామంలోని పగిడిద్ద రాజు ఆలయంలో ఉన్న పడగలకు, శివసత్తులకు గిరిజనులు సోమవారం రోజు పూజలు నిర్వహించారు. అనంతరం జెండాలు, నగలు, గజ్జెలను చేతబట్టి .. గిరిజన వాయిద్యాలను మోగిస్తూ.. అట్టహాసంగా బయలు దేరారు. వేపలగడ్డ- గుండాల- పస్త్రా మీదుగా రెండు రోజులకు మేడారం చేరుకుంటారు. మొత్తం 80 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకతోనే చేరుకుంటారు. పగిడిద్దరాజు వస్తున్న మార్గంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణ నెలకొంది. వేపలగడ్డ నుంచి పగిడిద్దరాజు, అటు కన్నెపల్లి నుంచి సారలమ్మ, తర్వాత గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కదేవతను గద్దెకు తీసుకు వచ్చిన తర్వాతే.. మేడారంలో అసలు జాతర ప్రారంభం అవుతుంది. 

13:54 - January 30, 2018

కృష్ణా : జిల్లా టీడీపీలో నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరింది. పలు నియోజకవర్గాల్లో నేతలకు ఒకరంటే మరొకరికి గిట్టడం లేదు. ఈ మధ్య ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమమే ఇందుకు మంచి ఉదాహరణ. నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుండడంతో చాలా నియోజకవర్గాల్లో నేతలు డుమ్మా కొట్టారు. ఒకరు పాల్గొంటే మరొకరు గైర్హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు తీవ్రమవుతున్న విభేదాలు
గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఎమ్మెల్యే వంశీ నిర్వహించే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలకు దాసరి బాలవర్ధనరావు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గ కార్యాలయం ఎమ్మెల్యే ఆధీనంలో ఉండడంతో దాసరి వర్గం ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. దాసరి ట్రస్ట్‌ పేరుతో ఆయన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకుండా పోయింది.పామర్రు నియోజకవర్గంలోనూ ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వర్ల రామయ్య మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ల రామయ్య నియోజకవర్గాన్ని వదిలివేసినప్పటికీ స్థానిక నేతలతో టచ్‌లోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరాకు మధ్య సఖ్యత ఉండడం లేదు. వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో కేవలం రెండు డివిజన్ల అధ్యక్ష పదవులను మాత్రమే మీరాకు ఇచ్చారు. మిగతా వారంతా జలీల్‌ఖాన్‌ చెప్పినమాటే వేదంగా పనిచేస్తున్నారు. దీంతో తటస్థంగా ఉన్న కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.బెజవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, దేవినేని అవినాష్‌ మధ్య వర్గపోరు నడుస్తోంది. అవినాజ్‌ పార్టీ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నది గద్దె రామ్మోహనరావు వర్గం వాదన.

బహిరంగంగానే బాహాబాహీ
ఇక గుడివాడ నియోజకవర్గంలో ఇంచార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు సోదరుడు పూర్ణవీరయ్య వర్గాల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. రెండు వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నాయి. అంబేద్కర్‌ జయంతి రోజున పార్టీ కార్యాలయంలో ఇరువర్గాలు రచ్చరచ్చ చేశాయి. దీంతో నేతల మధ్య వైరం మరింతగా పెరిగింది.నూజివీడులో ఎంపీ మాగంటిబాబు.. నియోజకవర్గ ఇంచార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఒకరంటే ఒకరికి అసలు గిట్టడం లేదు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి తన వర్గానికి చెందిన నేతకు ఇప్పించుకునేందుకు మాగంటి బాబు తీవ్రంగా ప్రయత్నించారు. దీన్ని ముద్దరబోయిన వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో విభేదాలు రచ్చకెక్కాయి. ఒకానొక దశలో ముద్దరబోయిన వర్గం నాయకులు తమ పదవులకు రాజీనామా చేసే స్థాయి వరకు వెళ్లారు. మొత్తానికి కృష్ణా జిల్లా టీడీపీలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఏ నియోజకవర్గంలో చూసినా నేతల మధ్య కుంపట్లు పార్టీకి చెడ్డపేరును తీసుకొస్తున్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తుండడం పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యవేక్షణ లేకపోవడం, నేతల్లో గూడుకట్టుకుంటున్న అసంతృప్తిపై దృష్టిసారించకపోవడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పెద్దలు కలిగించుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.

13:52 - January 30, 2018

కృష్ణా : ఏపీ రాజధాని విజయవాడలో భూ కబ్జాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు చెందిన ఏడు ఎకరాల స్థలం కబ్జాకు పాల్పడిన వ్యవహారం వెలుగుచూసింది. పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో స్థలం వద్దకు చేరుకుని ప్రొక్లైనర్ల సహాయంతో ఆక్రమణలను కూల్చే ప్రయత్నం చేశారు. కళాశాలకు చెందిన స్థలాన్ని తిరిగి కళాశాలకు అప్పగించేలా ప్రభుత్వం తీసుకోవాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

13:26 - January 30, 2018

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హనుమాన్ నగర్, బంగారుగడ్డలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. 3 బెల్ట్ షాపుల్లో 47 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 65 బైక్ లు, 6 కార్లు, 3 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు. 

13:21 - January 30, 2018

గుంటూరు : అమరావతిలో తెలుగు తమ్ముళ్లు కృష్ణమ్మ మట్టిని తోడేస్తున్నారు. అమరలింగేశ్వర స్వామి ఆయలస్థాన ఘాట్ వద్ద మట్టిని తవ్వేస్తున్నారు. స్థానిక నేతలు ఘాట్ చదును పేరుతో మట్టిని దర్జాగా అమ్ముకుంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:57 - January 30, 2018

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామంలో మద్యం ప్రవాహం కొనసాగుతుంది. సాక్షాత్ గ్రామ సర్పంచ్ బెల్టుషాపు నిర్వహిస్తుంది. హైవే పై జోరుగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సర్పంచ్ మద్యం అమ్మకాలు

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామంలో మద్యం ప్రవాహం కొనసాగుతుంది. సాక్షాత్ గ్రామ సర్పంచ్ బెల్టుషాపు నిర్వహిస్తుంది. హైవే పై జోరుగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. 

రాజ్ ఘాట్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

ఢిల్లీ : మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధాని రాజ్ ఘాట్ సందర్శించి నివాళులర్పించారు. ఇటు హైదరాబాద్ లోను గవర్నర్, మంత్రులు బాపుఘాట్ లో నివాళులర్పించారు.

12:25 - January 30, 2018
12:23 - January 30, 2018
11:50 - January 30, 2018

భూపాలపల్లి : ఎక్కడో మారుమూలన ఏటూరు నాగారం అడవుల్లోని మేడారం. గిరిజనానికే కాదు.. నాగరిక సమాజానికీ ఇది పవిత్ర క్షేత్రం..సమ్మక్క-సారలమ్మల పేరిట ప్రకృతితో మమేకమయ్యే అద్భుత ఘట్టం..అవును.. గిరిజన మహాకుంభమేళగా పిలుచుకునే ఆసియా అతిపెద్ద జాతరకు ఆతిథ్యమిచ్చే మేడారమంటే గిరిజన తెగలకు ప్రాణం. మేడారం గాలి సోకితే చాలు జీవితం ధన్యమవుతుందనుకుంటారు. ఇదే సమ్మక్క సారలమ్మల జాతరకున్న గొప్పతనం.ఎర్రబడ్డ ఆకాశం.. ఆకుపచ్చదనాన్ని పులుముకుని.. స్వచ్చంగా.. నిర్మలంగా ఉండే మేడారం.. ఎర్రని ధూళిని అద్దుకుని.. సింధూరవర్ణ కాంతులను ఈనుతుంటుంది. మేడారం.. గాలి కూడా చొరబడదేమో అన్న రీతిలో జన సందోహంతో కిక్కిరిపోతోంది. చిన్నా..పెద్దా...ముసలి..ముతక.. ఒక్కరేమిటి తారతమ్యాలు మరిచిపోయి... బాహ్య ప్రపంచానికి దూరంగా.... తమను తాము త్యజించి .. అద్భుత పారవశ్యానికి గురయ్యే మనోహర ఘట్టం అక్కడ ఆవిష్కారమవుతుంది. రెండేళ్లకో సంబరం.. పదేళ్లకు సరిపడా ఆనందం ఈ మేడారం జాతర గొప్పతనం. కాకతీయుల కళాతృష్ణ ...చారిత్రక వరంగల్‌ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో ఏటూరు నాగారం అడవుల్లో ఉంది ఈ మేడారం. గ్రామంలో రెండు గద్దెలను దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. రెండెళ్లకోసారి జరిగే.. జాతర మహాకుంభమేళాను తలపిస్తుంది. 13వ శతాబ్దంలో కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడికి ఎదురొడ్డి నిలిచిన వీరవనితలు సమ్మక్క సారక్కలు. ఆ మగువల తెగువను మనసారా.. తలుచుకోవడానికి.. ఆ తల్లుల త్యాగనిరతికి ప్రణామాలు చేయడానికే ఈ జాతర.. ప్రతి రెండేళ్ల కోసారి పెద్ద ఎత్తున.. నిర్వహిస్తుంటారు.. ఈ సందర్భంగా.. ప్రజలు ఆ తల్లుల్లకు నీరాజనాలు అర్పిస్తారు.

 

శత్రువుపై కత్తిదూసిన వీరవనితలు...
సమ్మక్క, సారలమ్మలు పురాణ దేవతలు కాదు. తమ జాతి కోసం, తమవారి కోసం శత్రువుపై కత్తిదూసిన వీరవనితలు. ప్రత్యర్థితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అడవి ఆడపడుచుల యదార్థ గాధ ఇది. తమతో మెలిగి, తమతో కలిసి, తమవారికోసం ప్రాణాలు విడిచిన విషాద గాధ ఇది. అది 11వ శతాబ్దం. కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి ప్రతాపరుద్రుడి కాలం. ఈ కాలంలోనే ఓ అపురూప, అద్భుత ఘట్టం జరిగింది. ఇప్పటి కరీంనగర్‌ జిల్లా జిగిత్యాల ప్రాంతంలోని పోలవలసను పాలించే గిరిజనదొర మేడరాజు కూతురు సమ్మక్క. ఈమెను మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. వీరికి పుట్టిన బిడ్డలే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. అప్పటి వరకు ప్రతాపరుద్రుడికి సామంతులుగా ఉంటూ కప్పం కడుతూ వచ్చిన మేడారం పాలకులు ఆ ఏడాది కరువు కాటకాల వల్ల కప్పం కట్టలేకపోతారు. దీంతో రాజ్యంతో ఘర్షణ ఏర్పడుతుంది.కాకతీయుల సైన్యం, సమ్మక్క సైన్యం మధ్య జరిగిన యుద్ధం కాకతీయ చరిత్రలోనే మరపురాని ఘట్టం. గెరిల్లా యుద్ధానికి నాంది పలికింది కూడా ఇక్కడే. ప్రతాపరుద్రుడి సైన్యంతో వీరోచితంగా పోరాడారు సమ్మక్క, సారలమ్మలు. పగిడిద్దరాజు, సారలమ్మ యుద్ధ భూమిలోనే మరణిస్తారు. ఓటమిని జీర్ణించుకోలేని జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగానే పిలుస్తారు. సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తుంది కాకతీయ సైన్యం. వెనుక నుంచి బళ్ల్లెంతో పొడుస్తుంది. రక్తధారలతో సమ్మక్క యుద్ధ భూమి నుంచి నిష్ర్కమిస్తూ మేడారానికి ఈశాన్యాన ఉన్న గుట్ట దగ్గర అదృశ్యమౌతుంది. అదే చిలుకలగుట్టగా నేడు సుప్రసిద్ధం.

చిలుకలగుట్ట వెనుక కుంకుమ భరిణి
సమ్మక్క అంతర్ధానమైన చోట ఓ కుంకుమ భరిణి లభించిందన్నది స్థానికుల నమ్మకం. ఆ భరిణను పూజారులు చిలుకలగుట్ట వెనుక భద్రపరిచారు. ఆ భరిణనే సమ్మక్క అని గిరిజనుల అపార నమ్మకం. వీరవనితే దేవతగా మారి తమకోసం మళ్లీ తిరిగి వచ్చిందన్నది వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే సమ్మక్క, సారలమ్మలంటే గిరిజనులకింత మమకారం. అందుకే అమ్మను నెత్తినపెట్టుకొని పూజిస్తారు. సంబరం చేస్తే అంబ పలుకుతుందని నమ్ముతారు. ఈ అచంచలమైన విశ్వాసంలోంచి పుట్టిందే గిరజన కుంభమేళ. సమ్మక్క, సారాలమ్మల శౌర్యానికి, త్యాగానికి ప్రతీకయే ఈ మేడారం జాతర. చిక్కగా పరుచుకున్న పచ్చదనం. కింద ఎర్రని మన్ను..ఎత్తైన కొండ..కొండ దిగువన వాగు..వాగు చట్టూ అడవి. అడవి మధ్యలో పల్లె. పల్లె మధ్యలో గద్దె..ఈ గద్దె గిరిజనులకు దేవి శక్తిపీఠం. గద్దె చుట్టూ లక్షల జనం. అన్ని అద్భుతాలు కలిస్తే మేడారం. అందరి మనసులు కలిస్తే మేడారం. ప్రకృతిని తమలో మమేకం చేసుకుంటే మేడారం. రెండేళ్ల కోసారి మాఘశుద్ధపౌర్ణమి గడియల్లో మేడారం జాతర జరుగుతుంది. మేడారం గద్దెల నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను గద్దెల మీదికి తీసుకు రావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇదే రోజున ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి ఆమె తండ్రి పగిడిద్దరాజులు కూడా గద్దెల వద్దకు చేరుకుంటారు.

జాతర ప్రాంగణంలో నాలుగు గద్దెలు
మొత్తంగా మేడారం జాతర ప్రాంగణంలో నాలుగు గద్దెలు కనిపిస్తాయి. మొదటి రోజు 31వ తేదీన సారలమ్మకు గద్దెకు తీసుకువచ్చే క్రమం గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది. కన్నెపల్లి గ్రామంలో గిరిజనులు మేళతాళాలతో, డోలు వాయిద్యాలతో సారలమ్మను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరుతారు. మొత్తం ఆరుగురు పూజారులు సారలమ్మకు పూజలు నిర్వహిస్తారు. కాక వంశీయులు సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. పోలీసు అధికారుల తుపాకీ కాల్పుల గౌరవ వందనాలు, సంప్రదాయ ఎదురుకోళ్ల ఘట్టంతో భక్తులు సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. రెండో రోజైన గురువారం అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయమే సమ్మక్క పూజారులు వనదేవత గుట్టకు వెళ్లి వెదురు కర్రలు తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సమ్మక్క పూజారులు ఐదుగురు. సిద్ధబోయిన, కొక్కెర, చందా వంశీయులు సమ్మక్క పూజారులుగా కొనసాగుతారు. చిలుకల గుట్టపై నార చెట్టుకింద ఉన్న కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. ప్రధాన పూజారి ఒక్కడే గుట్టపైకి వెళ్లి సుమారు 3గంటల పాటు అతి రహస్యంగా పూజలు చేస్తారు. గుట్టపై నుంచి పూజారి కిందకు రాగానే జిల్లా ఎస్పీ తన ఆయుధంతో గాల్లోకి మూడు సార్లు కాల్పులు జరిపి అధికార వందనంతో సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. మాఘశుద్ధ పౌర్ణమి సమయానికి లక్ష్మీ దేవరలు కూడా మేడారం చేరుకుంటారు. నాయకపోడ్‌ల ఆరాధ్య దైవమైన లక్ష్మీ దేవరలు గుర్రపు మూతితో రంగురంగుల వస్త్రాలు అలంకరించుకుని తాడ్వాయి నుంచి మేడారం వరకు సాగుతాయి. ఆ ప్రాంగణమంతా.. అశేష జనంతో.. కిటకిటలాడుతుంది. రాష్ట్రంతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి.. వచ్చే భక్తులతో.. కిక్కిరిసిపోతుంది. జయజయ ధ్వానాలతో.. మారుమోగిపోతుంది. పూనకాలతో ఊగిపోతారు.

సుమారు పది రకాల మొక్కుబడులు
వనదేవతలు గద్దెలపై కూర్చున్నారు. ఇక సమ్మక్క, సారలమ్మలకు మోకరిల్లితే తల్లి సల్లంగా చూస్తుందని భక్తులకు విశ్వాసం. అందుకే ఆమెకు తీరొక్కగా మొక్కుతారు. ఒకటి కాదు రెండు కాదు ఎవరికి తోచినట్టుగా వారు, ఎవరి సామర్థ్యానికి తగ్గట్టుగా వారు మొక్కులు చెల్లిస్తారు. ఎందుకంటే ఎలా పిలిచినా అమ్మపలుకుతుందని, భక్తిగా ఎంత సమర్పించుకున్నా సంతోషిస్తుందని గిరిజనుల నమ్మకం.సమ్మక్క, సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. జాతరలో సుమారు పది రకాల మొక్కుబడులు ఉంటాయి. ఇవి నాగరికులకు వింతగా అనిపించినా విశేషంగా ఆకట్టుకుంటాయి. వరం పట్టటం, తలనీలాలు, వడిబియ్యం, తొట్టెలు, బంగారం, పిట్ట, బాషింగం, కోడెను కట్టటం, ఎదురుకోళ్లు, తులాభారం వంటి మొక్కులను భక్తులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా గిరిజనుల ఇంట ఏ బిడ్డ క్యార్‌మన్నా తొలుత ఆ చంటిబిడ్డ మేడారానికి రావల్సిందే. జంపన్నవాగు దగ్గర తలనీలాలు సమర్పించి అమ్మవార్ల దర్శనం చేసుకోవల్సిందే. తమ పిల్లల తలవెంట్రుకలు ఇక్కడ తీస్తే వాళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు గిరిజనులు. అందుకే ఆమెకు తలనీలాలు ఇచ్చి మొక్కుబడి చెల్లించుకుంటారు.

సంతానం లేని వాళ్లు తొట్టె కడతారు 
సంతానం లేని వాళ్లు తొట్టె కడతామని మొక్కుకుంటారు. జంపన్న గద్దెను ఆనుకొని ఉన్న ఒద్దిమాను చెట్టుకు తొట్టె కట్టి మొక్కును చెల్లించుకుంటారు. ఇలా వేల సంఖ్యలో తొట్టెలు దర్శనమిస్తాయి.కోడెను కట్టే సంప్రదాయం మేడారం జాతరలో ప్రత్యేకమైంది. సమ్మక్క గద్దెకు పడమర వైపు కోడెను కడతారు. ఆ తరువాత కోడెతో మూడు సార్లు సమ్మక్క గద్దె దగ్గర ప్రదక్షిణం చేస్తారు. కోడిపిల్లను అమ్మవార్ల గద్దెల ఎదుట ఎగుర వేస్తారు. దీన్నే ఎదురుకోళ్ల మొక్కు అంటారు. అలా అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు.ఇక వడిబియ్యం మొక్కు. కిలోంపావు బియ్యంలో ఖర్జూరపండ్లు, తమలపాకులు, కొత్త వస్ర్తాన్ని ఉంచి దాన్ని నడుముకు కట్టుకుంటారు. నడుముకు కట్టుకున్న బియ్యంతోనే అమ్మవారి గద్దెలకు వచ్చి ఆ మొక్కును సమర్పిస్తారు.ఇక మరో ప్రధానమైన మొక్కుబడి బంగారం సమర్పించుకోవడం ఒకటి. బంగారం అంటే బంగారం కాదు.. బెల్లం.. అమ్మవార్లకు మొక్కులు ఉన్నా లేకపోయినా బెల్లం సమర్పించుకోవడం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీ చాలా అబ్బురంగా జరుపుకుంటారు గిరిజనులు. దీంతో వందల క్వింటాళ్ల కొద్ది బెల్లం మేడారం బాట పడుతుంది. కేవలం 70 ఇళ్లు మాత్రమే ఉండే మేడారం గ్రామం. కోట్ల మందికి తాత్కాలికంగా నీడనిస్తోంది. జాతర సమయంలో భక్తులు ఉండేందుకు ప్లాట్ల కింద కిరాయికి కేటాయిస్తున్నారు. 1968 వరకు మేడారం జాతర రెవెన్యూ ఆధీనంలో ఉండగా, ఆ తర్వాత దేవాదాయ శాఖ పరిధికి తీసుకువచ్చారు. 1996లో మేడారం జాతరను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేపట్టింది.

జాతరకు వంద కోట్ల నిధులు
ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు వంద కోట్ల నిధులు కేటాయించగా ఇందులో తాత్కాలిక పనులకే పెద్ద పీట వేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం.. క్యూలైన్లు, టాయ్ లెట్స్, వాటర్ ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం మూడు నెలలుగా కసరత్తు చేస్తోంది. పనులను జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మేడారం జాతరకు సంబంధించి ఆదాయం కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుండటంతో ఈ ఏడాది 250 ఐరన్ హుండీలు, మరికొన్ని క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. వైద్యం, పారిశుధ్యం, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే జాతర కోసం వెళ్లిన భక్తులు.. చిన్నచిన్న ఇబ్బందులను ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా నీటి సరఫరా సరిగా లేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. ప్రతి ఏటా.. జాతరకు వచ్చే.. భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. ప్రభుత్వం మౌలిక వసతులు సంపూర్ణంగా.. ఏర్పాటు చేయాలని.. భక్తులు కోరుతున్నారు. నేషనల్ ఫెస్టివల్‌గా ప్రకటించాలని, గిరిజనుల సంప్రదాయానికి పెద్ద పీట వేయాలని పలువురు కోరుతున్నారు. జాతరకు సర్వంసిద్ధమైంది.. భక్త జనసందోహంతో.. ఆ నేల పులకించనుంది. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి కోట్లాది మంది భక్తులు ఒళ్లంత కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. రెండేళ్లకోసారి సంబరం. పదేళ్లకు సరిపడా ఆనందం. ఇదే మేడారం జాతరలోనే గొప్పతనం..కమ్మదనం. నాలుగు రోజుల పాటు ఆనందోత్సాహాల మధ్య జరిగే మేడారం జాతర సమ్మక్కల సారాలమ్మల వనవాస ప్రవేశంతో ముగుస్తుంది. కాని ఈ నాలుగు రోజుల పారవశ్యాన్ని గుండెల నిండా నింపుకొని తిరుగు బయలెల్లుతారు గిరిజనులు. మళ్లీ రెండేళ్లకు వస్తామని చెప్తూ అమ్మవార్లను కన్నీళ్లతో సాగనంపుతారు. మళ్లీ మార్గశిర పూర్ణిమ ఎప్పుడు వస్తుందా అని ఆ గద్దెలవైపు చూస్తూఉంటుంది ఏటూరునాగారం.

11:41 - January 30, 2018
11:40 - January 30, 2018

విశాఖ : సబ్బవరంలో పాత నేరస్తుడు చంద్రశేఖర్ దారుణ హత్యకు గురైయ్యాడు. దుండగులు చంద్రశేఖర్ ను కత్తులతో పొడిచి చంపారు. చంద్రశేఖర్ పలు కేసుల్లో నింధితుడిగా ఉన్నాడు. విశాఖలో వారం రోజుల వ్యవధిలో ఇది ఐదో హత్య జరగడంతో విశాఖవాసులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:37 - January 30, 2018

హైదరాబాద్ : కొండాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో గోనెసంచిలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ముక్కలుగా నరికిన దుండగులు గోనెసంచిలో ఉంచారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఆక్రమణలపై విద్యార్థుల ఆగ్రహం

కృష్ణా : విజయవాడలో ఆక్రమణలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ స్థలంలో విద్యార్థులు ఆక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రక్తంగా మారింది. 

హయత్ నగర్ లో దారుణం

హైదరాబాద్ : హయత్ నగర్ లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు అనూష యువతినబండరాయితో మోది హతమార్చారు. మృతారాలు దేవరకొండకు చెందినది గా పోలీసులు గుర్తించారు. అనూష బీటెక్ పూర్తి చేసి పోలీస్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

11:27 - January 30, 2018

కృష్ణా : విజయవాడలో ఆక్రమణలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ స్థలంలో విద్యార్థులు ఆక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రక్తంగా మారింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:24 - January 30, 2018

హైదరాబాద్ : హయత్ నగర్ లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు అనూష యువతినబండరాయితో మోది హతమార్చారు. మృతారాలు దేవరకొండకు చెందినది గా పోలీసులు గుర్తించారు. అనూష బీటెక్ పూర్తి చేసి పోలీస్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:30 - January 30, 2018

హైదరాబాద్: సినీనటుడు సామ్రాట్ పై ఆయన భార్య దొంగతనం కేసు పెట్టింది. మాదాపూర్ పీఎస్ ఆయన పై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా సామ్రాట్ కు అతని భార్య దూరంగా ఉంటుంది. సామ్రాల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. సామ్రాట్ ఆయన భార్య గతంలో వరకల్న వేధింపుల కేసు పెట్టింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:19 - January 30, 2018

సినీనటుడు సామ్రాట్ పై దొంగతనం కేసు

హైదరాబాద్ : సినీనటుడు సామ్రాట్ పై ఆయన భార్య దొంగతనం కేసు పెట్టింది. మాదాపూర్ పీఎస్ ఆయన పై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా సామ్రాట్ కు అతని భార్య దూరంగా ఉంటుంది. సామ్రాల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. సామ్రాట్ ఆయన భార్య గతంలో వరకల్న వేధింపుల  కేసు పెట్టింది. 

10:04 - January 30, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టులపై నేడు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు రాష్ట్రప్రభుత్వా నీటి పారుదల అధికారులు హాజరుకానున్నారు. ట్రాన్స్ ట్రాయ్ నుంచి పనులు వడదీసి నవయుగకు అప్పగించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:21 - January 30, 2018

న్యూజిలాండ్ : అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరింది. సెమీస్ లో పాక్ పై 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన భారత్

న్యూజిలాండ్ : అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరింది. సెమీస్ లో పాక్ పై 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

క్రమంగా తగ్గుతున్న మెట్రో రద్దీ

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రెండు నెలులు పూర్తి చేసుకుంది. మొట్రోలో మొదట్లో రద్దీ ఉన్న క్రమేపీ ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. డ్యూటీ, స్కూల్ వేళల్లో తప్పితే అంతగా ప్రయాణికుల రద్దీ కనిపించడం లేదు.

09:08 - January 30, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రెండు నెలులు పూర్తి చేసుకుంది. మొట్రోలో మొదట్లో రద్దీ ఉన్న క్రమేపీ ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. డ్యూటీ, స్కూల్ వేళల్లో తప్పితే అంతగా ప్రయాణికుల రద్దీ కనిపించడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:36 - January 30, 2018

ఢిల్లీ : గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను నియంత్రించడంలో విఫలమయ్యాయని పేర్కొంటూ రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై సెప్టెంబర్‌ 3వ తేదీలోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటిషన్‌ ఆధారంగానే గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులను ఆపాలని... ప్రతిజిల్లా నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని 26 రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశించినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయంటూ ఇటీవల జరిగిన ఏడు ఘటనలను పిటిషన్‌లో పేర్కొన్నారు. 

08:35 - January 30, 2018

చిత్తూరు : తిరుమ శ్రీవారి మెట్ల అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు భారీగా బయటపడ్డాయి. అందులో రెసిస్టర్లు, కెపాసిటర్లు, సర్య్కూట్ బోర్డులు ఉన్నాయి. వాటితో పాటు పోలీసులు సెల్ ఫోన్, వాకీటాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

తిరుమల శ్రీవారి మెట్ల వద్ద కూబింగ్

చిత్తూరు : తిరుమ శ్రీవారి మెట్ల అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు భారీగా బయటపడ్డాయి. అందులో రెసిస్టర్లు, కెపాసిటర్లు, సర్య్కూట్ బోర్డులు ఉన్నాయి. వాటితో పాటు పోలీసులు సెల్ ఫోన్, వాకీటాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

చౌటుప్పలో పోలీసుల కార్డన్ సెర్చ్

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హనుమాన్ నగర్, బంగారుగడ్డలో పోలీసులు తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  3 బెల్ట్ షాపుల్లో 47 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 

నేడు పోలరవంపై కీలక సమావేశం

గుంటూరు : నేడు ఢిల్లీలో పోలరంపై కీలక సమావేశం జరగనుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో పోలవరంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జలవనరుల శాక అధికారులు, కాంట్రాక్టర్లు హాజరుకానున్నారు.

07:44 - January 30, 2018

రాష్ట్రపతి గారు ప్రసంగం పై అధికార పార్టీ ప్రభావం ఉంటుందని, బీజేపీ దేశంలో జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని, ఏ దేశాల్లో అయిన ప్రజలకు ఉన్నటువంటి అత్యున్నత హక్కు ఓటు హక్కు అని సీపీఎం తెలంగాణ కార్యవర్గ కార్యవర్గ సభ్యుడు వెంకట్ అన్నారు.ఇవాళ జమిలి ఎన్నికలు మాట్లాడుకుంటే గతంలో 1970 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోయడం వల్ల జమిలి ఎన్నికలు గడి తప్పాయని బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి అన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ అమ్ములపొదిలో ఉన్న అస్త్రమని, దీని ద్వారా దేశాన్ని బీజేపీ తన చేతులోకి తీసుకునేందుకు ప్రయత్సిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

07:43 - January 30, 2018

టీ మాస్ స్వయంగా గ్రామల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుకున్నామని. 2 తేది నుంచి 10 తేది వరకు 1000 టీమ్ లు గ్రామల్లో పర్యటించాయని, భూపాలపల్లి జిల్లా పోలంపల్లిలో మేము వెళ్లినప్పుడు అక్కడ టాయిలెట్లు లేవని, రోడ్లు కూడా లేవని టీ మాస్ రాష్ట్ర నాయకులు రమణ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:42 - January 30, 2018

మహబూబ్ నగర్ : -మన్యం కొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం పలు రాష్ర్టాల నుంచి తిరుమలకు వెళ్ళే స్థోమత లేని పేదలు... మన్యంకొండలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని... మొక్కులు తీర్చుకుంటారు. అందుకే ఈ కొండ పేదల తిరుపతిగా పేరుగాంచింది.ఎత్తైన కొండపై గుహల్లో స్వయంభూగా వెలిసిన స్వామికి ఏడాదికి ఓసారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 15రోజుల పాటు సాగే ఉత్సవాల్సో భక్తులు లక్షలాదిగా పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కొండపైకి చేరుకునేందుకు రోడ్డు మార్గాన్ని నిర్మించారు. 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం, తాగు నీటికోసం కుళాయిలు, క్యూ లైన్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆళహరి వంశీయులు స్వామివారికి సేవలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ నెల 31న రథోత్సవం, గరుడ సేవ నిర్వహిస్తారు. నిండు పున్నమినాడు జరిగే రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతారు. మొక్కులు తీర్చుకునేందుకు దసాంగాలను సమర్పిస్తారు. మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగానూ ప్రసిద్ధి చెందారు.. ఆయన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. స్వామి వారి దివ్యరూపాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంతో తరిస్తున్నారు.

07:41 - January 30, 2018

హైదరాబాద్ : నగర శివారులోని చందానగర్‌లో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురి కావడం సంచలనం రేకెత్తించింది.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అపర్ణకు మధు అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది.. అయితే కొంతకాలంగా మధుకు అపర్ణకు మధ్య వివాదాలు తలెత్తాయి దీంతో అపర్ణ.. తల్లి విజయమ్మ, కూతురు కార్తికేయలతో కలిసి విడిగా నివాసం ఉంటోంది. అపర్ణ చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో పని చేస్తుంది... రెండు రోజులుగా అపర్ణ నివాసం ఉంటున్న ప్లాట్ డోర్ తాళం వేసి ఉండడం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని స్థానిక చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు డోరు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా అపర్ణ దారుణహత్యకు గురై రక్తపు మడుగులో పడిఉండగా... కార్తికేయ, విజయలక్ష్మి బెడ్‌పై విగతజీవులుగా పడి ఉన్నారు.

మధునే హంతకుడై ఉంటాడు..
ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయగా మధునే హంతకుడై ఉంటాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.. దీంతో విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే మధు రామచంద్ర పురం పోలిస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు .. దీంతో మధుని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో.. తానే హత్య చేసినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. అపర్ణను తాను పెళ్లి చేసుకోలేదని.. సహజీవనం మాత్రమే చేసినట్లు పోలీసుల ముందు మధు చెప్పినట్లు సమాచారం. అయితే.. మధుకు గతంలోనే పెళ్లి అయినట్లు అపర్ణ బంధువులు పోలీసులకు తెలిపారు. మరోవైపు మధు భార్య వేధింపులకు గురి చేయడం వల్లే ఈ హత్యలు జరిగినట్లు కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్తిలో వాటా కావాలని..
అపర్ణ, విజయలక్ష్మి ఆస్తిలో వాటా కావాలని.. మధు భార్యను వేధింపులకు గురి చేస్తున్నారని.. ఆ నేపథ్యంలోనే హత్యలు జరిగాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే... అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం వల్లే మర్డర్‌ చేసినట్లు పోలీసుల విచారణలో మధు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే... మంగళవారం ప్రెస్‌మీట్‌లో పోలీసులు అన్ని వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికి ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో మధు భార్య వేధింపులు... అపర్ణకు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే హత్యలు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. అయితే... వీటిపై మంగళవారం క్లారిటీ రానుంది. 

07:39 - January 30, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడానికి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు విద్యాశాఖ, తెలుగుభాష అమలు సబ్‌కమిటీతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఫస్ట్‌క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలన్నారు. తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాలలో మాతృభాషను తప్పనిసరిగా అమలు చేస్తున్న విధానాన్ని ఈ సందర్భంగా చర్చించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సబ్‌ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి తమ ప్రతిపాదనలను కడియం శ్రీహరికి అందజేసింది.

ఐదో తరగతి వరకు తెలుగు భాష
ఐదో తరగతి వరకు తెలుగు భాషను చదువుకోని విద్యార్థులకు ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్దతిలో తెలుగు నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నట్టు సమావేశంలో చర్చించారు. ఏడో తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి ఎనిమిదో తరగతిలో... పది వరకు తెలుగురాని వారికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సులభంగా నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని సబ్‌కమిటీ కడియంకు వివరించింది. తెలుగు భాష అమలులో వారికెలాంటి అభ్యంతరం తేదని చెప్పినట్టు కడియం దృష్టికి తీసుకొచ్చింది. తెలుగు భాష అమలుకు కావాల్సిన సిలబస్‌, పుస్తకాలను వెంటనే తయారు చేయాలని కడియం ఆదేశించారు.భాషా పండితుల అప్‌ గ్రెడేషన్‌పై అధికారులతో కడియం శ్రీహరి చర్చించారు. భాషా పండితులకు తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం న్యాయ సలహా తీసుకుని.. అప్‌గ్రెడేషన్‌ జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలన్నారు.

07:38 - January 30, 2018

హైదరాబాద్ : దావోస్‌ స‌ద‌స్సులో పాల్గొన‌డం కేటీఆర్‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా ప్రభుత్వం చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌న్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఏ ప్రభుత్వం రిజిస్ట్రేష‌న్‌ చేసుకున్నా.. ఆ స‌ద‌స్సుకు ఆహ్వానిస్తార‌ని ఆయ‌న అన్నారు. దావోస్‌ స‌ద‌స్సుతో తెలంగాణ‌కు భారీగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని కేటీఆర్‌ ప్రక‌టించ‌డం ప‌చ్చి బూట‌క‌మ‌న్నారు. కేటీఆర్‌ చెబుతున్న బీఆర్‌ శెట్టి... గ‌తంలో ప్రక‌టించిన పెట్టుబ‌డులు ఎటు పోయాయ‌ని ప్రశ్నించారు. కేటీఆర్‌కు చిత్త శుద్ది ఉంటే.. దావోస్‌కు వెళ్ళేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేష‌న్ చేసుకుందో లేదో స్పష్టం చేయాల‌ని డిమాండ్‌ చేశారు. ఉత్తమ్‌ స‌మ‌క్షంలో ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలోని మాల్‌ టీఆర్ఎస్‌ స‌ర్పంచ్‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

07:36 - January 30, 2018

మేడ్చల్ : ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం తాగి కారు డ్రైవింగ్‌ చేయడమే తప్పు కాగా... రాంగ్‌ రూట్లో వచ్చి వాహనాల మీదకు దూసుకెళ్ళాడు. యాక్టివా వాహనంపై వెళ్తున్న దంపతుల కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా నిందితుడు గిరీష్ పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న జవహర్‌నగర్ పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. గిరీష్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు.

07:35 - January 30, 2018

చిత్తూరు : జిల్లా వైసీపీ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్‌ సుబ్రమణ్యం రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశంపార్టీలోచేరారు. మునిస్వామిరెడ్డిగారి సుబ్రమణ్యంరెడ్డికి పార్టీ కండువా కప్పి సీఎం సాదరంగా ఆహ్వానించారు. 654 మందితో టీడీపీలోకి వచ్చిన సుబ్రమణ్యంరెడ్డి గతంలో చంద్రబాబుపై మూడు సార్లు పోటీచేశారు. పార్టీలో చేరినవారిందరిని మనస్పూర్తిగా.. సాదరంగా ఆహ్వానిస్తున్నానని సీఎం అన్నారు. తనపై మూడు సార్లు పోటీచేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుబ్రమణ్యం రెడ్డి మాత్రమే అని చెప్పారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తూ... హుందాగా వ్యవహరించే వ్యక్తి పార్టీలో చేరడంపట్ల సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను సీఎం ఐతే కుప్పం లోని ప్రతి ఒక్కరూ సీఎం అయినట్లుగా భావిస్తూ... తనను ఆదరించిన కుప్పం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

07:34 - January 30, 2018

హైరదాబాద్ : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి చీవాట్లు పెట్టింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేలపై న్యాయస్థానం సీరియస్‌ అయ్యింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా... ఏపీలో కోడి పందేలు యథేచ్చగా సాగడంపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌, లా సెక్రెటరీలకు చీవాట్లు పెట్టింది. కోడి పందేలను ఎందుకు కట్టడి చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

దినేష్‌కుమార్‌ వ్యక్తిగతంగా కోర్టుకు
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఎంఎస్‌కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కోడిపందేలపై విచారణ జరిపింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఎస్‌ దినేష్‌కుమార్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలని కోర్టు కోరింది. నిందితులు ఎవరు, కోడి పందేలను ఎవరు నిర్వహించారన్నదానిపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. కోడిపందేలను నిర్వహించిన నాయకుల పేర్లు , వివరాలు, వారి అడ్రస్‌లతో సహా ఇవ్వాలని.. సీఎస్‌, డీజీపీలను కోర్టు ఆదేశించింది. లేకపోతే టీవీల ఫుటేజీ తెప్పించుకుని కోడిపందేలు ఆడిన నేతలపై చర్యలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలను అడ్డుకోవడంలో విఫలమైన తహసీల్దార్లు, ఎస్‌ఐలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ఆదేశించింది. కోడిపందేల నిర్వహణలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా పందేలను ప్రజాప్రతినిధులే ప్రోత్సహిస్తోంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కోడి పందేలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

కొంత సమయం కావాలి
హైకోర్టు అడిగిన వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని సీఎస్‌ కోరడంతో అందుకు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇక తదుపరి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎస్‌ కోరగా.. అందుకు హైకోర్టు అనుమతించింది. మొత్తానికి కోడి పందేలను హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడం ఒక ఎత్తైతే.. కోడిపందేలను ప్రోత్సహిస్తున్న నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది మరోఎత్తు. తదుపరి విచారణలో ఏం జరుగుతుందో వేచిచూడాలి మరి.

Don't Miss