Activities calendar

01 February 2018

22:12 - February 1, 2018

హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ సినిమా జీఎస్టీ సినిమా ఇండియాలో బ్యాన్‌ చేయాలని సైబర్ క్రైం పోలీసులు వీన్యూ వెబ్‌ సైట్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన వెబ్ సైట్ నిర్వాహకులు సినిమాను సైట్‌ నుంచి తొలగించినట్లు సైబర్ క్రైం అడిషనల్ డీసీపీ రఘువీర్ చెప్పారు. అయితే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ డాట్‌ కామ్ వెబ్‌ సైట్‌లో ఈ సినిమా అందుబాటులో ఉందని తెలిసి .. ఆ సైట్ వారికి కూడా లెటర్‌ రాశామని.. రిప్లై కోసం వెయిట్ చేస్తున్నామని రఘువీర్ చెప్పారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత రాంగోపాల్‌ వర్మను విచారిస్తామని డీసీపీ రఘువీర్ చెప్పారు.

 

22:09 - February 1, 2018

రాజన్నసిరిసిల్ల : తాను ఇచ్చిన అప్పు కట్టే వరకు అప్పు తీసుకున్న షేక్‌ హలీమా అనే వృద్ధురాలి శవం తీసుకెళ్లోద్ధంటూ రాజన్న సిరిసిల్ల పట్టణ మున్సిపల్‌ కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ అడ్డుకుంది. తాను ఇచ్చిన డబ్బును ఎవరు తిరిగి ఇస్తారంటూ.. శవాన్ని తీసుకోకుండా అడ్డుకుంది. తనకు న్యాయం చేయాలంటూ.. అక్కడి పెద్దమనుషులను కోరుతుంది. మరోవైపు వృద్ధురాలి కొడుకులు తరువాత మాట్లాడుదామన్న వినకుండా కౌన్సిలర్‌ భీష్మించి కూర్చుంది. దీంతో మరో కౌన్సిలర్‌ వచ్చి.. వృద్ధురాలి పేరుపై ఉన్న స్థలాన్ని రాసివ్వాలని కోరాడు. దీనిని ఆమె కొడుకులు ఒప్పుకోకుండా.. ఆరు నెలల్లో అప్పు తీర్చేస్తామని చెప్పారు. అయినా కూడా వినకుండా కౌన్సిలర్‌ అక్కడే కూర్చోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

22:06 - February 1, 2018
22:05 - February 1, 2018
22:03 - February 1, 2018

హైదరాబాద్‌ : మల్కాజిగిరిలో దారుణం చోటు చేసుకుంది. జెఎల్ ఎన్ ఎస్ నగర్‌లోని జ్యోతి మోడల్‌ స్కూల్‌ నిర్వాకంతో ఓ విద్యార్థిని ప్రాణాలు గాల్లో కలిశాయి. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి విద్యార్ధిని సాయిదీప్తిని స్కూల్‌ యాజమాన్యం ఇంటికి పంపించింది. దీంతో మనస్తాపం చెందిన... సాయిదీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణం తట్టుకోలేని తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌ యాజమాన్యంపై హత్యానేరం నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. రెండు వేల రూపాయల ఫీజు కోసం చిన్నారి ప్రాణాలు హరించడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. 

 

22:02 - February 1, 2018

ఢిల్లీ : బడ్జెట్‌ రోజు స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఉదయం దాదాపు 100 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడైన సెన్సెక్స్‌..  బడ్జెట్‌ ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే మార్కెట్‌ నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 463 పాయింట్లు నష్టపోయింది. ఆశించిన స్థాయిలో కార్పొరేట్ పన్నులు తగ్గించకపోవడం, సంస్కరణల ప్రస్తావన లేకపోవడం, భయపెట్టిన ద్రవ్యలేటు, మందగించిన పెట్టుబడుల ఉపసంహరణతో.. మదుపరులు  అమ్మకాలకు దిగారు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 58 పాయింట్ల నష్టంతో 35వేల 907 వద్ద ముగియగా... నిఫ్టీ 11 పాయింట్లు స్వల్ప నష్టంతో క్లోజైంది. ఫార్మా, బ్యాంకింగ్, మెటల్ సెక్టార్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. 

22:00 - February 1, 2018

హైదరాబాద్ : కేంద్ర రైల్వే బడ్జెట్‌... తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది.  అరకొర కేటాయింపులతో... మమ అనిపించేశారు.  విశాఖ రైల్వే జోన్‌కు మోక్షం లభించలేదు. ప్లాట్‌ఫామ్‌ల వృద్ధి.. స్టేషన్‌ల అభివృద్ధి.. అంటూ అరకొర హామీలిచ్చారు. ఈ ఏప్రిల్‌లో ఎన్నికలను ఎదుర్కోబోతున్న కర్నాటక రాజధాని బెంగళూరులోని మెట్రోకు 17వేల కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల మెట్రోల ఊసే ఎత్తలేదు. మొత్తమ్మీద, రైల్వే బడ్జెట్‌ తెలుగు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. 

కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ .. ఏపీ, తెలంగాణ ఆశలపై నీళ్లు జల్లింది. లక్షా 48 వేల 515 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో.. తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమి లేదు. చాలీచాలని నిధులు కేటాయించి.. కేంద్రం తెలుగు ప్రజలకు... నిరుత్సాహాన్ని మిగిల్చింది. విశాఖ రైల్వే జోన్ గురించి.. బడ్జెట్‌లో అసలు ప్రస్తావించలేదు. ఏపీ ప్రజల ప్రధాన డిమాండైన  విశాఖ రైల్వే జోన్‌ గురించి.. కేంద్రం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో.. విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ.. వైసీపీ విశాఖలో ఆందోళనకు దిగింది. లాభదాయకం కాకపోవడం వల్లే.. కేంద్రం మొండిచేయి చూపిందని.. ఆరోపిస్తున్నాయి.  

ఇక రైల్వేలైన్ల పునరుద్ధరణ, రైల్వే స్టేషన్‌ల అభివృద్ధిలో భాగంగా.. ఏపీ తెలంగాణాలకు  అరకొర నిధులు కేటాయింపే జరిగింది.  విజయనగరం, సబల్‌పూర్‌ మూడో రైల్వే లైన్‌  కోసం 90 కోట్లు, కాజీపేట-విజయవాడ మూడో రైల్వే లైన్‌కు వంద కోట్లు, నల్లపాడు-గుంతకల్‌ లైన్‌కు 150 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్‌ కొత్త రైల్వే లైన్‌కు 430 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు 340 కోట్లను కేటాయించారు. 

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా.. కడప, తిరుపతి, మచిలీ పట్నం, మార్కాపూర్‌ , విజయవాడ, విశాఖ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రాయనపాడు, గుంతకల్‌, పలాస, ఎస్‌. కోట, అరకు, బొర్ర గుహల  ప్లాట్‌ఫామ్‌లను విస్తరించనున్నారు.  రాజమండ్రి, తునిలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు నిర్మించనున్నారు. వినుకొండ, మంత్రాలయం, ఆదోని, విశాఖ, దువ్వాడ, బొబ్బిలి, పార్వతీపురం, గుంటూరు, మంత్రాలయం రోడ్డు, దొనకొండ, ఒంగోలు, రాజమండ్రి, మార్కాపూర్‌ రోడ్డు రైల్వే స్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్‌లుగా తీర్చిదిద్దనున్నారు. ఇవి కాకుండా .. సికింద్రాబాద్‌-విశాఖల మధ్య వీక్లి ఎక్స్‌ ప్రెస్‌, మరో ఇంటర్‌ సిటి వేయనున్నారు. 

అరకొర హామీలతో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపిన రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెప్పుకోదగ్గట్టుగా.. ఏపీ, తెలంగాణాలకు రైల్వే బడ్జెట్‌లో.. కేటాయింపులు జరగలేదని.. రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.  

21:58 - February 1, 2018

ఢిల్లీ : వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పడం ద్వారా.. అరుణ్‌ జైట్లీ,  రైతులను హిప్నటైజ్‌ చేసే ప్రయత్నాలు చేశారు. వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, కనీస మద్దతు ధరను అందించి తీరతామని చెప్పారు. క్లస్టర్‌ విధానంలో సేద్యాభివృద్ధి చేస్తామన్నారు. మొత్తానికి.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న వ్యవసాయాధారిత 8 రాష్ట్రాల రైతాంగానికి వల విసిరారన్నది దీని ద్వారా స్పష్టమవుతోంది. 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ.. తన బడ్జెట్‌ ప్రసంగంలో.. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలయ్యేలా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. రైతుల కనీస మద్దతు ధర విషయంలోనూ నిరుటి వ్యాఖ్యలనే జైట్లీ పునరుద్ఘాటించారు.  రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను 150 శాతం పెంచుతామని, ఈ రబీ సీజన్‌ నుంచే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. నీతి ఆయోగ్ దీనిపై స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తుందని జైట్లీ చెప్పారు. 

వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం.. క్లస్టర్‌ మోడల్‌ను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని, 42 మెగాఫుడ్‌ పార్కులను పటిష్టం చేస్తామని... ఆపరేషన్‌ గ్రీన్‌ కోసం 500కోట్ల రూపాయలూ కేటాయిస్తున్నామని జైట్లీ తెలిపారు. గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌లకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్న జైట్లీ.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు 14 వందల కోట్లు ప్రతిపాదించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తామన్న జైట్లీ.. వ్యవసాయ ఉత్పాదక సంస్థలకు నూరుశాతం పన్ను రాయితీ ప్రకటించారు. 

క్లస్టర్‌ విధానంలో భాగంగా.. వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న అరుణ్‌జైట్లీ.. వ్యవసాయాధారిత రంగాలనూ టార్గెట్‌ చేశారు. ఉద్యానతోటల వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖలకు, పదివేల కోట్ల రూపాయలిస్తామన్నారు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం 1290 కోట్ల రూపాయలు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు. మత్స్య, పశు పెంపకం దారులకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందిస్తామన్నారు. వ్యవసాయ రుణాలకు పదకొండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. 

21:52 - February 1, 2018

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గంపెడాశలు పెట్టుకున్న తమను నిరాశపర్చడంతో కేంద్రంపై టీడీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌పై ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... నిధుల కోసం కేంద్రంతో గట్టిగా పోరాడాలని ఆదేశించినట్లు సమాచారం. 
ప్రజలకు నిరాశ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు రాజకీయ నేతలు, ఆర్థికశాస్త్ర నిపుణులు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో... మేలు జరుగుతుందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆశించాయి. కానీ... బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తర్వాత అన్ని పార్టీల నేతలు, అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారు. 
ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 10 కోట్లు 
తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 10 కోట్లు కేటాయించారు. అలాగే.. గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు, NITకి 54 కోట్లు, IITకి 50 కోట్లు, ట్రిపుల్‌ ఐటీకి 30 కోట్లు, IIMకు 42 కోట్లు, IISCRకు 49 కోట్లు, విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు 108 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి 32 కోట్లు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు 19.62 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అలాగే తెలంగాణలో హైదరాబాద్‌ ఐఐటీకి 75 కోట్లు, తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు మాత్రమే కేటాయించారు. 
బడ్జెట్‌ నిరాశపరిచిందంటున్న అన్ని పక్షాల నేతలు
అయితే.. కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందంటున్నారు అన్ని పక్షాల నేతలు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు సాయం, పారిశ్రామిక ప్రోత్సహకాలు, రైల్వేజోన్‌ ప్రకటన.. ఇలా పలు హమీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఊహించగా... వాటి ఊసే ఎత్తలేదంటున్నారు. ఇక విభజన హామీలకు బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందన్న ఆశలకు కూడా గండిపడిందంటున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు.. నిర్మాణానికి నిధుల ఊతంపై బడ్జెట్‌లో భరోసా కల్పిస్తారన్న అంచనాలను కూడా కేంద్రం విస్మరించిందంటున్నారు. మొత్తానికి కేంద్రం బడ్జెట్‌ నిరాశపర్చిందంటున్నారు టీడీపీ ఎంపీలు. నిధులు కేటాయించకపోవడంతో... గత నాలుగేళ్లుగా అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. మిత్రపక్షం కావడంతో మరోసారి కేంద్రంతో చర్చిస్తామన్నారు. అలాగే.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అనేక విధాలుగా కృషి చేస్తామన్నారు. 
బడ్జెట్‌పై ఆదివారం చంద్రబాబుతో జరిగే సమావేశంలో చర్చించి.. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మరోవైపు చంద్రబాబు బడ్జెట్‌పై ఎంపీలతో చర్చించారు. న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో గట్టిగా పోరాడాలని సూచించినట్లు సమాచారం. 
బడ్జెట్‌పై ఎంపీ హరిబాబు సంతృప్తి 
ఇదిలావుంటే... కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ హరిబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన రెండు హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. విశాఖ రైల్వేజోన్‌పై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ... సానుకూల నివేదిక ఇవ్వలేదని అయినా ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తుందన్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు హరిబాబు. 
తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి
ఇక తెలంగాణలో ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకునోచుకుంటాయనుకున్నా.. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అలాగే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొంది. మొత్తానికి ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో కొంతమేర అయినా న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రభుత్వాలకు నిరాశే ఎదురైంది. అయితే.. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి ఇవ్వడంతో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాలి! 

 

తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో విషాదం నెలకొంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయిదీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం బయటనిలబెట్టారనే మనస్తాపంతో ఆత్మహత్యకు చేసుకుంది. 

 

ఘనంగా మేడారం జాతర

వరంగల్ : మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారులు తీసుకొచ్చారు. గౌరవసూచకంగా ఏకే 47 తో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.  

21:19 - February 1, 2018

తెలుగు రాష్ట్రాలంటే మోదీకి ఎందుకు అంత చిన్నచూపు ? విభజన చట్టంంలో హామీలను ఎందుకు నెరవేర్చలేదు ? అటు కేసీఆర్..ఇటు చంద్రబాబు మోదీని గట్టిగా నిలదీయలేకపోతున్నారు ? విభజన చట్టం హామీలు నెరవేకపోతే ఏపీలో టీడీపీ పరిస్థితి ఏమిటి ? ఇప్పటికైనా వైసీపీ ఎన్డీఏ సర్కార్ పై గట్టిగా మాట్లాడుతుందా ? ఇదే అంశంపై మాకేమిచ్చారు అనే పేరుతో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి ప్రత్యేక విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నిరాశపర్చిందన్నారు. బడ్జెట్ తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. బడ్జెట్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

సికింద్రాబాద్ లో దారుణం

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. ప్రశాంతి థియేటర్ లో స్నేహితురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యుకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

20:58 - February 1, 2018

మేడారం సమ్మక్క సారక్క జాతర...పోటెత్తిన భక్తులు, బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య పంచాదిని ముందలేకుంటున్న కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీళ్లు.. నా హత్య స్కెచ్ ఏసిండ్రంటున్న వీరేశం, తెలంగాణల రైతుల పరిస్థితి ఆగమాగం... రైతులకు గిట్టుబాట ధర కావాలంటున్న జేఏసీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల భాగోతం..డబుల్ బెడ్ రూం ఇళ్లు మాకొద్దంటున్న జనం, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పంటే ప్రజలకు చాలా ఇష్టమంట, దేశంలోనే పేద సీఎం మాణిక్ సర్కార్, జాయ్ అలూకాస్ లో బయటపడ్డ బండారం... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

20:40 - February 1, 2018

కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అన్ని రంగాల ప్రజల గురించి మాట్లాడారు..కానీ మాటల్లో ఉంది...గణాంకాల్లో లేదన్నారు. ప్రకటించిన మేరకు ఆయా రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవన్నారు. మాటలకు కేటాయింపులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బీజేపీ ఎన్నికల సమయంలో అవు, రామమందిరం, పాకిస్తాన్, పద్మావత్ సినిమా, అల్లావుద్ధీన్ ఖిల్జీ వంటి అంశాలను ముందుకు తెస్తారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

భారత్ విజయలక్ష్యం 270 పరుగులు

సౌతాఫ్రికా : డర్బన్ వన్డేలో దక్షిణాఫ్రికా 50 వోవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. భారత్ విజయలక్ష్యం 270 పరుగులుగా ఉంది. 

20:12 - February 1, 2018

కడప : ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ కళాశాల అది. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన కళాశాల ప్రాంగణం పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. పగలు పందుల స్వైర విహారానికి, రాత్రి మందుబాబులకు అడ్డాగా మారింది కడప జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. 

ఇదే ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేసిన కడప జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఇందులోనే ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎందరో పెద్ద పెద్ద ఉద్యోగాలలో రానిస్తున్నారు. పచ్చపచ్చని చెట్లు, పూలమొక్కలతో నిండి ఉండాల్సి ప్రాంగణం పిచ్చి మొక్కలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. చెత్తా చెదారం నిండి పోయి పందుల స్వైర విహాంతో కంపుకొడుతోంది. 

చూసేందుకు అరణ్యంలా తలపిస్తున్న ఈ కాలేజీ గ్రౌండ్‌ను కాలేజీ యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఇదే ఆసరాగా తీసుకున్న మందుబాబులు రాత్రి అయ్యే సరికి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు మందుబాబులు గ్రౌండ్‌లోకి చేరి జల్సాలు చేస్తున్నారు. తరగతి గదుల్లో మందు బాటిళ్లు దర్శనమివ్వడంతో  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఈ కలేజీ కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి క్రీడల కోసం బిల్డింగ్‌ను అసంపూర్తిగా కట్టి వదిలేశారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్‌ గొర్రెలు, మేకలు సేద తీరేందుకు పనికివస్తుంది. కాలేజీ గ్రౌండ్‌ పెద్దగా ఉండటంతో ఉదయంపూట నడక కోసం స్థానికులు వస్తుంటారు. చిన్న పిల్లలు, విద్యార్థులు ఆటలు ఆడేందుకు గ్రౌండు సౌకర్యంగాలేదు. దీంతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇక కళాశాల భవనం విషయానికి వస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. తలుపులు కిటికీలు చెదలు పట్టి ఊడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితి చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలో చేర్పించడంలేదు. ప్రైవేటు కాలేజీలను ఆశ్రయించడంతో అధిక ఫీజుల బారిన పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కాలేజీని అభివృద్ధి చేయాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. 

20:07 - February 1, 2018

ప్రకాశం : కష్టపడి తల్లిదండ్రులు చదివించిన దానికి ఉద్యోగం సాధించినప్పుడే నిజమైన సార్ధకతని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మోగా జాబ్‌ మేళాను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ ప్రారంభించారు. ఈ మేళాలో 1100కు పైగా ఉద్యోగాలు కల్పించడానికి.. 18కార్పోరేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. దాదాపు 2వేల నాలుగువందల మంది  జాబ్‌ మేళాకి హాజరైనారు.

 

20:06 - February 1, 2018

వరంగల్ : మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేవలందిస్తోంది. జాతరలో శుభ్రత పాటించడానికి గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున సేవలందిస్తున్నారు. పనులను సమీక్షించడానికి వరంగల్‌ మేయర్‌ కూడా మేడారంలోనే ఉన్నారు. మేడారంలో సేవలనందిస్తున్న వరంగల్‌ మేయర్‌తో మా ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:56 - February 1, 2018

విజయవాడ : కేంద్రం ప్రకటించిన బడ్జెట్  రాజకీయ లబ్ధి పొందేందుకు వాగ్దానం చేసే బడ్జెట్‌లా ఉంది తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించేలా లేదని  సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ కింద రెండేళ్లు నిధులను ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేయడం దారుణమని మధు ఆరోపించారు. అసంఘటిత రంగంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై స్పందించని ప్రభుత్వం ఎంపీలు, గవర్నర్ల జీతాలు ఎలా పెంచుతుందని మధు మండిపడ్డారు. కార్మిక చట్టాలను నీరుగారుస్తూ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వం రాష్ట్ర హక్కులను ఎందుకు సాధించలేకపోయిందని మధు ప్రశ్నించారు.

19:54 - February 1, 2018

గుంటూరు : కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే పూర్తిగా రైతులకు మద్దతు పలికే విధంగా ఉందన్నారు ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను పెట్టారా? లేక రైతులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెట్టారా? అనేది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఏపీకి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా ఉంటుందని ఆశించామన్న యనమల బడ్జెట్ పూర్తి వివరాలను చూశాక స్పందిస్తామన్నారు. 

 

19:49 - February 1, 2018

ఢిల్లీ : వేతన జీవులకు నిరాశ.. ఉన్నత పదవుల్లోని వారికి వేతనాల పండుగ...! జైట్లీ పద్దులో కీలక విశేషమిది. కోట్లాది వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పూ చేయని జైట్లీ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ఎంపీల వేతనాల పెంపులో జోరు చూపారు. ఎంపీలకైతే.. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాన్ని పెంచుతామని భరోసా కూడా ఇచ్చారు. 

కేంద్ర బడ్జెట్‌లో సగటు వేతన జీవికి జైట్లీ ఎలాంటి ఊరటనూ ఇవ్వలేదు. ఈసారైనా ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మంది వేతన జీవులకు జైట్లీ పద్దు నిరాశనే మిగిల్చింది. పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు లేదని  అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎన్నో సానుకూల మార్పులు చేశామని, ఈసారి మాత్రం స్లాబుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని జైట్లీ చెప్పారు. గతంలో మాదిరిగానే, వేతన జీవుల వార్షిక ఆదాయం రెండున్నర లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. అయితే.. ఉద్యోగుల  ప్రయాణ, వైద్య ఖర్చుల నిమిత్తం 40 వేల రూపాయల స్టాండర్డ్‌ డిడక్షన్‌ను మాత్రం ప్రకటించారు.

సీనియర్‌ సిటిజన్‌లకు జైట్లీ కొంత ఊరటనిచ్చారు. వారి వార్షికాదాయంలో.. 3లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లు పోస్టాఫీసుల్లో డిపాజిట్లు 50వేల రూపాయల వరకు పన్ను మినహాయింపునిచ్చారు. 50 వేల వరకు వైద్యబీమా ప్రీమియంనకు పన్ను మినహాయింపు లభించనుంది. సెక్షన్‌ 80డి కింద 60 వేల వరకు సీనియర్‌ సిటిజన్లకు, 80 వేల వరకు వెరీ సీనియర్‌ సిటిజన్లకు వైద్యఖర్చులకు మినహాయింపు ఇచ్చేవారు. దీనిని ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచారు. ఈ రాయితీల వల్ల ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది.

ఇక కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కొత్త పేస్కేల్ ప్రకారం రాష్ట్రపతికి నెలకు 5 లక్షలు, ఉపరాష్ట్రపతికి 4 లక్షలు, గవర్నర్లకు 3.5 లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. వీళ్లతోపాటు ఎంపీల జీతాలు కూడా పెరగనున్నాయి. ఇక ఎంపీల జీతాలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకోసారి ఆటోమేటిగ్గా పెరిగేలా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రపతి జీతం 1.5 లక్షలు ఉండగా.. దానిని ఒకేసరి ఐదు లక్షలకు పెంచారు. ఇక ఉపరాష్ట్రపతి ఇప్పటివరకు 1.25 లక్షలు అందుకుంటుండగా.. ఇక నుంచి 4 లక్షలు ఇవ్వనున్నారు.

దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 85.51లక్షలకు చేరినట్లు జైట్లీ తెలిపారు. గత రెండేళ్లలో ఆదాయపు పన్ను వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైనట్లు చెప్పారు. పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 40శాతానికి పెరిగిందన్నారు. ప్రత్యక్ష పన్నుల్లోనూ 12.6శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. మొత్తానికి వేతన జీవులకు మాత్రం కేంద్ర బడ్జెట్‌లో నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో మార్పు చేయకపోవడం ఆ వర్గాలను నిరుత్సాహపరిచింది.

19:47 - February 1, 2018

ఢిల్లీ : మోది సర్కార్‌ 2018..19 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బడ్జెట్‌ను రూపొందించింది. ఈ బడ్జెట్‌లో పేదలు, రైతులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ద కనబరిచిన ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులకు మొండి చేయి చూపింది. 

2018..19 ఆర్థికసంవత్సరానికి గాను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన ఐదవ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసారి జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం హిందీ, ఇంగ్లీష్‌లో భాషల్లో కొనసాగింది. మోది ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. 

24 లక్షల కోట్ల అంచనాతో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మూలధన వ్యయం 7 లక్షల 78 వేల 712 కోట్లుగా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు 7 లక్షల 8 వేల 934 కోట్లు, ఇతర వ్యయాలు, వడ్డీ చెల్లింపులకు 5 లక్షల 75 వేల 975 కోట్లు కేటాయించింది. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి 1.38 లక్షల కోట్లు కేటాయించారు. హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల కోసం బడ్జెట్‌లో 1200 కోట్లు కేటాయించింది. జాతీయ ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పేర్కొంది. దీన్ని 10 లక్షల కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ నిధులతో నడిచే కార్యక్రమం ఇది. హెల్త్‌ కేర్ ప్రోగ్రాం ద్వారా 50 కోట్ల ప్రజలకు మేలు కలుగుతుంది. గిరిజన రోగులకు కార్పస్‌ ఫండ్‌ కింద ప్రత్యేకంగా 600 కోట్లు కేటాయించారు. 

ఎస్సీల సంక్షేమం కోసం 56 వేల 619 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 39 వేల 135 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆదీవాసీల కోసం ఏకలవ్య పేరిట స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలు ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనుంది. 18 కొత్త ఐఐటిలు, ఎన్ఐఐటిలు స్థాపించనున్నారు. డిజిటల్‌ విద్యా విధానానికి మరింత చేయూతనిచ్చేందుకు 13 లక్షల మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. వడోదరలో రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది నుంచి టాప్‌ వెయ్యి మంది బిటెక్‌ విద్యార్థులకు ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ఇవ్వనున్నారు. 

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్ద పీట వేసింది. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉత్పాదన వ్యయానికంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని నిర్ణయించింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని పేర్కొంది. వ్యవసాయ రుణాలకు 11 లక్షల కోట్లు కేటాయించింది. ఆలు, టమాట, ఉల్లి ఉత్పత్తుల పెంపుకోసం ఆపరేషన్‌ గ్రీన్‌ కింద 5 వందల కోట్లు కేటాయించింది. 42 మెగా ఫుడ్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆహార శుద్ధి రంగానికి 14 వందల కోట్లు కేటాయించారు. చేపల పెంపకం, పశు సంవర్ధకానికి 10 వేల కోట్లు కేటాయించారు.

గ్రామీణ ప్రాంతాలు, పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతులకు 14.34 లక్షల కోట్లు, గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి 16 వేల713 కోట్లు కేటాయించారు. 2022 నాటికి ప్రతి పేద వారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన కింద 2018-19లో కోటికి పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. పట్టణ ప్రాంతాల్లో 37 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. 

ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు 1600 కోట్లు కేటాయించారు. ఈ పథం కింద 4 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్‌ ఇవ్వాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. ఉజ్వల యోజన పథకం 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావించారు.

స్వచ్ఛభారత్‌లో భాగంగా  ఇప్పటివరకు 6 కోట్ల టాయ్‌లెట్లను నిర్మించడం జరిగిందని కేంద్రం పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు జైట్లీ ప్రకటించారు. గంగా ప్రక్షాళనకు 16, 700 కోట్లు కేటాయించారు. ఇంటింటికి తాగునీటి పథకానికి బడ్జెట్‌లో 77 వేల, 5 వందల కోట్లు కేటాయించారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో 10 వేల కోట్లు కేటాయించారు. గ్రామాల్లో 5 లక్షల హాట్‌ స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్‌ ఇండియా ప్రోగ్రాం కోసం 3 వేల 37 కోట్లు కేటాయించారు.

కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన ఉత్తమ్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సవాల్ ను టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. టీఆర్ ఎస్ అధికారంలోకి రాకపోతే కేసీఆర్ కుటుంబం రాజకీయ సన్యాసం చేయాలన్నారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కుటుంబం కమీషన్ల కోసం పనిచేస్తోందన్నారు. 

 

భారత ఎంబసీ వద్ద తీరుతున్న తెలుగువారు బారులు

కువైట్ సిటీ : కువైట్ లో ఎంబసీకి ప్రవాసులు, తెలంగాణ వాసులు క్యూ కడుతున్నారు. సరైన పత్రాలు లేనివారికి కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. స్వదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి కోసం భారత ఎంబసీ వద్ద తెలుగువారు బారులు తీరుతున్నారు. వేలాదిమంది రావడంతో దౌత్య కార్యాలయ అధికారులు, కువైట్ అధికారులు అవాక్కైయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఇంత ఘోరమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు : సీహెచ్ బాబురావు

విజయవాడ : ఇది జనాన్ని ముంచిన బడ్జెట్ అని సీపీఎం  ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు అన్నారు. విశాఖ రైల్వే జోన్ లేదు. అమరావతికి రైలు లేదు. ఇంత ఘోరమైన బడ్జెట్ ను ఎప్పుడూ చూడలేదు. జనాన్ని ముంచిన బడ్జెట్. ఏపీ ప్రజలకు అన్యాయం చేశారు. ఎంపీల జీతాలు పెంచారు. మోడీ, చంద్రబాబు కుమ్మక్కు అయి రాష్ట్రానికి మోసం చేశారని తెలిపారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటికి రావాలన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని సూచించారు.

అన్నింటికి మొండిచెయ్యి : మధు

విజయవాడ : కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఏపీకి మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. కానీ అన్నింటికి మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. ప్రజలను గాలికొదిలేశారని..కార్పొరేట్ లకు నిధులను కేటాయించారని పేర్కొన్నారు.

 

ఏపీకి అన్యాయం : నారాయణ

ఢిల్లీ : ఏపీకి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చట్టంలోని నిధులను కూడా ఇవ్వ లేదన్నారు. కేంద్ర ఇస్తున్న హామీలు ఆచరణయోగ్యం కాని విధానాలు అన్నారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కేంద్రంపై పోరాటానికి టీడీపీ వస్తే కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.

భారత ఎంబసీ వద్ద బారులు తీరుతున్న తెలుగువారు

కువైట్ సిటీ : కువైట్ లో ఎంబసీకి ప్రవాసులు, తెలంగాణ వాసులు క్యూ కడుతున్నారు. సరైన పత్రాలు లేనివారికి కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. స్వదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి కోసం భారత ఎంబసీ వద్ద తెలుగువారు బారులు తీరుతున్నారు. వేలాదిమంది రావడంతో దౌత్య కార్యాలయ అధికారులు, కువైట్ అధికారులు అవాక్కైయ్యారు. 

18:45 - February 1, 2018

కువైట్ సిటీ : కువైట్ లో ఎంబసీకి ప్రవాసులు, తెలంగాణ వాసులు క్యూ కడుతున్నారు. సరైన పత్రాలు లేనివారికి కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. స్వదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి కోసం భారత ఎంబసీ వద్ద తెలుగువారు బారులు తీరుతున్నారు. వేలాదిమంది రావడంతో దౌత్య కార్యాలయ అధికారులు, కువైట్ అధికారులు అవాక్కైయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:39 - February 1, 2018

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సవాల్ ను టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. టీఆర్ ఎస్ అధికారంలోకి రాకపోతే కేసీఆర్ కుటుంబం రాజకీయ సన్యాసం చేయాలన్నారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కుటుంబం కమీషన్ల కోసం పనిచేస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

18:33 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పై టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. బడ్జెట్ చాలా నిరాశపర్చిందన్నారు. విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

18:31 - February 1, 2018

ఢిల్లీ : ఏపీకి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చట్టంలోని నిధులను కూడా ఇవ్వ లేదన్నారు. కేంద్ర ఇస్తున్న హామీలు ఆచరణయోగ్యం కాని విధానాలు అన్నారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కేంద్రంపై పోరాటానికి టీడీపీ వస్తే కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.

 

18:24 - February 1, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఏపీకి మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. కానీ అన్నింటికి మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. ప్రజలను గాలికొదిలేశారని..కార్పొరేట్ లకు నిధులను కేటాయించారని పేర్కొన్నారు.
జనాన్ని ముంచిన బడ్జెట్ : సీహెచ్ బాబురావు 
ఇది జనాన్ని ముంచిన బడ్జెట్. విశాఖ రైల్వే జోన్ లేదు. అమరావతికి రైలు లేదు. ఇంత ఘోరమైన బడ్జెట్ ను ఎప్పుడూ చూడలేదు. జనాన్ని ముంచిన బడ్జెట్. ఏపీ ప్రజలకు అన్యాయం చేశారు. ఎంపీల జీతాలు పెంచారు. మోడీ, చంద్రబాబు కుమ్మక్కు అయి రాష్ట్రానికి మోసం చేశారని తెలిపారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటికి రావాలన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని సూచించారు.

 

18:15 - February 1, 2018
18:12 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పూర్తిస్థాయిలో నిరాశపర్చిందని టీడీపీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని కరివేపాకు మాదిరి చూస్తున్నారని వాపోయారు. మెడికల్, వ్యవసాయం అంశాలపై తృప్తి కలిగిందన్నారు. రాష్ట్రానికి రెండు లాభాలు చేశారని చెప్పారు. చంద్రబాబు నిరాశపరుడు కాదు.. నాలాంటి వాడికైతే ఓపిక లేదన్నారు. ఈ విధానాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

 

17:50 - February 1, 2018

వరంగల్ : మేడారం జాతరకు భక్తుల పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనం కంటే ముందుగా జంపన్న వాగులో పవిత్ర స్నానాల్ని ఆచరిస్తున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినప్పటికి భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. శౌచాలయాలకి ఇబ్బంది కలుగుతుందని.. భక్తులు వాపోతున్నారు. జంపన్న వాగులో భక్తులతో మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:44 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో చర్చించిన అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

17:38 - February 1, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత టీడీపీ ప్రభుత్వం ఇంకా బీజేపీతో కొనసాగాలనుకుంటోందా? లేక ప్రజల పక్షాన నిలబడుతుందా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ  సీపీఎం కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే సీఎం చంద్రబాబు లక్ష్యమైతే బీజేపీ ఎడల తన వైఖరిని మార్చుకోవాలని మధు సూచించారు. మరోవైపు 24 ప్రభుత్వ రంగ కంపెనీల పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడాన్ని మధు తప్పుబడ్డారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోందని మధు అన్నారు. 

 

17:34 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ హరిబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన రెండు హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. విశాఖ రైల్వేజోన్‌పై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ... సానుకూల నివేదిక ఇవ్వలేదని అయినా ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తుందన్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు హరిబాబు. 

17:32 - February 1, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మంత్రులు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించారు. బడ్జెట్‌పై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పోలవరం నిధుల విషయాన్ని బడ్జెట్‌లో పెట్టకపోవడం పైన సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న డిమాండ్‌ను.. కేంద్రం ముందు పెట్టాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. న్యాయపరంగా రావల్సిన వాటిపైన కేంద్రంతో గట్టిగానే మాట్లాడాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీవాన్ఫరెన్స్

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో కేంద్ర బడ్జెట్ పై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని సీఎం అన్నారు. 

16:59 - February 1, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ లో దారుణం జరిగింది. 3నెలల చిన్నారి తలను భవనంపై గుర్తు తెలయని వ్యక్తులు ఉంచి వెళ్లారు. తలను గుర్తించిన భవన యజమాని హనుమంతు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న మల్కాజ్ గిరి డీసీపీ ఉమామహేశ్వర్ రావు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:56 - February 1, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్ పై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ నిరాశపర్చిందన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 

16:51 - February 1, 2018

ఢిల్లీ : రైతాంగానికి, వ్యవసాయ శాఖకు ఇది ఎన్నికల బడ్జెట్‌ అనుకోవచ్చని .. కానీ.. అనుకున్నంత స్థాయిలో కేటాయింపులు జరగలేదని.. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  రైతాంగానికి 11 లక్షల కోట్లు కేటాయించారని..ఆయన అన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి మిషన్‌ భగీరథ, కాకతీయ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించి ఫండ్స్‌ వస్తాయని తెలియజేశారు. అలాగే ఎంపీల జీతాల పెంపునకు సంబంధించి కమిటీ వేసి నిర్ణయిస్తారని అన్నారు.

16:49 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి. పోలవరం నిర్మాణానికి నిధులు, కడప స్టీల్ ప్లాంట్, పెట్రో కారిడార్‌ లాంటి హామీలను నిలబెట్టుకోలేకపోయారని మిథున్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఏపీ సర్కార్ ప్రేక్షకపాత్ర వహించిందని ఎంపీ విజయ్‌సాయి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలకి బాధ కలిగించిందన్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. రాజధాని నిధులు, ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణాలకు సంబంధించిన ఎటువంటి ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరమన్నారు అవినాష్‌రెడ్డి.

 

16:47 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌తో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు రాజకీయ, ఆర్ధిక నిపుణులు. ఏపీ, తెలంగాణకు ఆశించిన మేర కేటాయింపులు జరగలేదన్నారు. తాజా బడ్జెట్‌లో ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 10 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు, ఎన్ ఐటీకి 54 కోట్లు, ఐఐటీకి 50 కోట్లు, ట్రిపుల్‌ ఐటీకి 30 కోట్లు, ఐఐఎమ్ కు 42 కోట్లు, ఐఐఎస్ సీఆర్ కు 49 కోట్లు, విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు 108 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి 32 కోట్లు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు 19.62 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అలాగే తెలంగాణలో హైదరాబాద్‌ ఐఐటీకి 75 కోట్లు, తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే.. కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు సాయం, పారిశ్రామిక ప్రోత్సహకాలు, రైల్వేజోన్‌ ప్రకటన.. ఇలా పలు హమీలపై బడ్జెట్‌ సాయాన్ని ఆశించగా వాటి ఊసే లేదన్నారు. విభజన హమీలకు బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందన్న ఆశలకు గండిపడిందన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు.. నిర్మాణానికి నిధుల ఊతంపై బడ్జెట్‌లో భరోసా కల్పిస్తారన్న అంచనాలను కూడా కేంద్రం విస్మరించిందన్నారు. ఇక తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయనుకున్నా... ఆశలు ఫలించలేదు. అలాగే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ప్రజల్లో నిరాశ నెలకొంది. 

 

16:45 - February 1, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెరిగాయి. రాష్ట్రపతికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఉపరాష్ట్రపతికి నాలుగు లక్షలు ఇస్తారు. గవర్నర్లరకు మూడున్నర లక్షలు చెల్లించేవిధంగా జీతభత్యాలు సవరించారు. ఎంపీలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జీతాలు సవరించే విధంగా చట్ట సవరణ తీసుకురావాలని నిర్ణయించారు.
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ ఉపాధి రంగాలకు పెద్దపెట వేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో 14.34 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌కు 14 వందల కోట్లు మంజూరు చేసినట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అగ్రి ఉత్పత్తుల కోసం 42 ఫుడ్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులందరికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు ఉజ్వల యోజన పథకం 
ఉజ్వల యోజన పథకం 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు. పేదల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద మహిళల పొగ పొయ్యి నుంచి విముక్తి కల్పించేందుకు ఉజ్వల యోజన పథకం కేంద్ర తెచ్చిందని పేర్కొన్నారు.
రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థికమంత్రి
రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.  2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడు వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో ఉన్నాయని తెలిపారు. పంటలకు గిట్టుబాటుల ధర కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుతామన్నారు. 
స్వచ్ఛభారత్‌తో పేదల జీవితాల్లో మార్పు 
స్వచ్ఛభారత్‌తో పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 6 కోట్ల టాయ్‌లెట్లను నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. వీటి వళ్ల మహిళలకు భద్రత, ఆరోగ్యాలు మెరుగు పడ్డాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు జైట్లీ ప్రకటించారు.
రైల్వేల్లో భద్రతకు ప్రాధాన్యత 
రైల్వేల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెక్నాలజీకి పెద్దపీట వేస్తారు. దేశవ్యాప్తంగా 600 స్టేషన్లను ఆధునీకరిస్తారు. అన్ని ప్రధాన రైళ్లలో వైఫై, టీవీ సౌకర్యం కల్పిస్తారు. వచ్చే రెండేళ్లలో 4,267 కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగిస్తారు. 
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట 
కేంద్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కొత్త  వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదు లక్షల రూపాయల వరకు వైద్య బీమా వర్తించే విధంగా దీనిని తీసుకొస్తున్నారు. 
నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత 
కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ ఉపాధి రంగాలకు పెద్దపెట వేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో 14.34 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. 

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ నిరాశాజనకమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. రైల్వే బడ్జెట్ పెద్ద కేటాయింపులేం లేవని ఆయన పెదవి విరిచారు. 

ఏపీ ప్రజలను నిరాశపర్చిన బడ్జెట్ : సుజనా చౌదరి

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడారు. ఏపీ ప్రజలను బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్నారు. రైల్వే బడ్జెట్ లో పెద్ద కేటాయింపులేం లేవన్నారు. విజయవాడ, విశాఖ, అమరావతి మెట్రో ప్రాజెక్టుల ఊసే లేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన చేయకపోవండం నిరాశ కలిగించిందన్నారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న సమస్యల ప్రస్తావన లేదని వాపోయారు. ఏపీ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ తెచ్చి తీరతామని స్పష్టం చేశారు. 

16:31 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడారు. ఏపీ ప్రజలను బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందన్నారు. రైల్వే బడ్జెట్ లో పెద్ద కేటాయింపులేం లేవన్నారు. విజయవాడ, విశాఖ, అమరావతి మెట్రో ప్రాజెక్టుల ఊసే లేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన చేయకపోవండం నిరాశ కలిగించిందన్నారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న సమస్యల ప్రస్తావన లేదని వాపోయారు. ఏపీ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ తెచ్చి తీరతామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

16:16 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు లక్షా 48 వేల 515 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్తలైన్లు నిర్మిస్తారు. స్టేషన్లు ఆధునీకరిస్తారు. కొన్ని లైన్లు డబ్లింగ్‌ చేస్తారు. విద్యుదీకరణకు ప్రాధాన్యత ఇస్తారు.
2022 నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు : జైట్లీ
2022 నాటికి ప్రతి పేద వారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జైట్లీ తెలిపారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. 2018..19లో కోటికి పైగా ఇళ్లను కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే నిర్మించనున్నట్లు చెప్పారు.

16:11 - February 1, 2018

ఢిల్లీ : టీడీపీ నేతలు తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై మాట్లడనని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం జరుగుతున్నట్లు తనకు అనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. యుద్ధం చేసుకుంటే ఆయుధాలతో చేసుకోవాలని.. కానీ తనకు ఇరుపార్టీల మధ్య అలా కనిపిచండం లేదన్నారు.  

15:36 - February 1, 2018

ఢిల్లీ : ఎలాంటి మెరుపులు .. అద్భుతాలు లేకుండానే 2018-19 వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో అంకెల గారడి తప్ప తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం.. విశాఖకు రైల్వే జోన్‌.. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ విస్తరణ, తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు.. ఇలాంటి అంశాలేవీ జైట్లీ పద్దులో కనిపించలేదు. అలాగే వేతనజీవులకు మరోసారి నిరాశే ఎదురైంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. అటు ప్రజా ప్రతినిధుల వేతనాలను మాత్రం కేంద్రం ఘనంగా పెంచుకుంది. రాష్ట్రపతి వేతనాన్ని 5లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని 4లక్షలకు, గవర్నర్‌ వేతనాన్ని 3.5లక్షలకు పెంచారు. అంతే కాకుండా ప్రతి ఐదేళ్లకొకసారి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వేతనాలపై సమీక్ష జరపనున్నారు. ఎంపీల జీతాల పెంపుపై రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. ప్రతి ఐదేళ్లకొకసారి ఎంపీల వేతనాన్ని పెంచనున్నారు. గత ఏడాది పన్ను చెల్లించే వారి సంఖ్య ఏకంగా 40శాతం పెరిగిందని జైట్లీ చెప్పారు. 

ఉప్పల్ లో దారుణం

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకా నగర్ లో దారుణం జరిగింది.  ఓ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు 3 నెలల చిన్నారి తలను పడేశారు. ఇంటి యాజమాని హన్మంతు పోలీసులకు సమాచారం అందించారు. 

15:09 - February 1, 2018

ప్రభుత్వ స్కూల్స్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్నాలు ప్రయత్నాలు చేస్తున్నాయని వక్తలు అన్నారు. ప్రభుత్వం పాఠశాలల మూసివేత బాలిక విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో నేషనల్ ఉమెన్ టీచర్స్ ఫోరమ్ కన్వీనర్ సంయుక్త, తెలంగాణ టీచర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ మళ్లీశ్వరీ పాల్గొని, మాట్లాడారు. విద్య వ్యాపారమయం అయిందని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:53 - February 1, 2018

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని వక్తలు అన్నారు. ఇవాళ బడ్జెట్ 2018 ను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యాక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు,  విశ్లేషకులు నాగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు బెల్యా నాయక్, మనోహర్ రావు పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదన్నారు. బడ్జెట్ వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. వనరుల సమీకరణలో మొత్తంగా విఫలం అయ్యారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలను పూర్తిగా మరిచిపోయిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్ : మోడీ

ఢిల్లీ : ఇది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. బడ్జెట్  దేశ ప్రగతికి దిశా నిర్దేశం చేస్తుందని ఆయన తెలిపారు.

దళిత కాలనీకి విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు

ప్రకాశం : జిల్లా వలేటిపాలెం మండలం నందలపూరులో అధికారులు దళితులపై వివక్ష చూపుతున్నారు. ఎస్సీ కాలానికి నాలుగు రోజులుగా అధికారులు విద్యత్ సరఫరా నిలిపివేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్ సూచన మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు అంటున్నారు. 

13:40 - February 1, 2018

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశ పెట్టిన 2018-19 బడ్జెట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. బడ్జెట్ పై ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల ఆశలకు బడ్జెట్ అద్దం పట్టిందని, సామాన్యులు..రైతుల బడ్జెట్ అని కొనియాడారు. దేశ పురోభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అనేక అంశాలకు ప్రాతినిధ్యం కల్పించారని, జాతీయ రహదారులు..ఇళ్ల నిర్మాణం..విద్యుత్..రైతులకు ప్రోత్సాహాకాలు..మహిళల అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రాలతో కేంద్రం చర్చించి ఒక పథకం తీసుకరావడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:16 - February 1, 2018

పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ 2018-19 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, తమ పాలనలో నిజాయితీ, పారదర్శక విధానాలతో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ సంస్కరణలతో వృద్ధి రేటు పెరిగిందని, మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయన్నారు. తొలి మూడేళ్లలో సగటున 7.5 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో శివకుమార్ (సామాజిక విశ్లేషకులు), నగేష్ (సీనియర్ విశ్లేషకులు), ప్రకాష్ రె డ్డి (బిజెపి), తులసీరెడ్డి (కాంగ్రెస్), మనోహర్ (ఆర్థిక రంగ నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనం పెంపు

ఢిల్లీ : రాష్ట్రపతి వేతనం 5 లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం రూ.4 లక్షలు, గవర్నర్ జీతం రూ. 3.5 లక్షలకు పెంచుతున్నమని బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ఎంపీ వేతనం ప్రతి 5 ఏళ్ల ఒకసారి ద్రవ్యోల్బణం బట్టి సవరిస్తామని జైట్లీ అన్నారు. 

తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు  నిరాశ ఎదురైంది. బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ తెలుగు కనీసం తెలుగు రాష్ట్రాల పేరు ఎత్తలేదు. త్వరలో ఎన్నికలు రానున్న కర్ణాటకలో బెంగళూరు మెట్రోలకు రూ.17 వేల కోట్లు కేటాయించారు. 

ప్రతి 3 పార్లమెంట్ నియోజవర్గలకు వైద్య కళాశాల

ఢిల్లీ : దేశంలో ప్రతి 3 పార్లమెంట్ నియోజవర్గాలకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే రూ.1200 కోట్లతో పేదల కోసం ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. 

మహిళా సంఘాలకు 75 వేల కోట్లు

ఢిల్లీ : 2018-19 బడ్జెట్ లో మహిళా సంఘాలకు 75 వేల కోట్లు, క్షయరోగులకు పౌష్టికాహారం కింద రూ.600కోట్లు కేటాయించారు. అలాగే కొత్తగా 24 మెడికల్ కాలేజీల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ తెలిపారు. 

రూ.330 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా

ఢిల్లీ : రూ.330 ప్రీమయంతో ప్రతి ఒక్కరికి రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, 10 కోట్ల పేద కుటుంబాలకు జాతీయ ఆరోగ్య భద్రత కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు కేంద్రాలకు రూ.1200 కోట్లు కేటాయించామని ఆయన అన్నారు. 

గిరిజన విద్యార్థులకు ఏకలవ్య పాఠశాలలు

ఢిల్లీ : గిరిజన విద్యార్థులకు ఏకలవ్య పాఠశాలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డిజిటల్ బోర్డుల దిశగా విద్యావ్యవస్థను మారుస్తామని ఆయిన అన్నారు. 

ఈ ఏడాది 51 లక్షల ఇళ్లు

ఢిల్లీ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఏడాది 51 లక్షల ఇళ్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2022 నాటికి ప్రతి పౌరునికి ఇల్లు ఉండేల చూస్తామని ఆయన అన్నారు. దిగువ తరగతి ప్రజల ఇంటికల నెరవెర్చేందుకు కట్టుబడి ఉన్నామని జైట్లీ స్పష్టం చేశారు. 

బడ్జెట్ కేటాయింపులు

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు, వెదురు పెంపకానికి రూ.1290 కోట్లు, సాంఘీక భద్రతకు రూ.9975 కోట్లు కేటాయించారు. 

సంస్కరణలు దేశాన్ని ఉన్నతంగా నిలిపాయి

ఢిల్లీ : ప్రధాని నేతృత్వంలో తీసుకున్న సంస్కరణలు దేశాన్ని ఉన్నతంగా నిలిపాయని బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ పెర్కొన్నారు. జీఎస్ టీ ద్వారా పన్నులను సరళతరం చేశామని ఆయన తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని జైట్లీ అన్నారు. 

పారదర్శక ప్రభత్వాన్ని అందిస్తాం : జైట్లీ

ఢిల్లీ : పారదర్శక ప్రభుత్వాన్ని అందిస్తామని నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చామని, ఆ హామీని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన హామీలు ఇచ్చామని కూడా జైట్లీ గుర్తు చేశారు. 

మాతృత్వ సెలవు 3 నుంచి 6 నెలలకు పెంపు

ఢిల్లీ  : కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులను 3 నెలల నుంచి 6 నెలలకు పెంచింది.  అలాగే ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాడుతుందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 

బడ్జెట్ 2028-19..

ఢిల్లీ :  పర్యాటక రంగంలో పోత్సాహం కోసం 10 చారిత్రక నగరాల అభివృద్ది చేయనున్నారు. చిన్న పరిశ్రమల మొండి బకాయిల సమస్య పరిష్కరిస్తామని, 2020 నాటికి 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. 

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ

ఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మంత్రివర్గం బడ్జెట్ ఆమోదించిన అనంతరం ఆయన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

11:36 - February 1, 2018

ఢిల్లీ : 2018-19 సంవత్సరానికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. నాలుగేండ్ల క్రితం పారదర్శకమైన పాలన..ప్రజల క్షేమం కోసం చర్యలు తీసుకుంటామని ఆనాడు హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అనుకున్న విధంగా పాలన జరుగుతోందన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని హామీనిచ్చామన్నారు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, జీఎస్టీ ద్వారా పన్నుల వ్యవస్థను సరళీతరం చేయడం జరిగిందని, విదేశృ మారక నిల్వలు పెరిగాయని తెలిపారు. తమ పాలనలో 7.5 శాతం వృద్ధి రేటును సాధించడం జరిగిందని, ప్రపంచంలో భారత్ ఏడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. త్వరలోనే ఐదో స్థానానికి చేరుకొనే అవకాశం ఉందన్నారు.

7.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం జరిగిందని, పెట్టుబడులు 8 శాతానికి పైబడి సాధిస్తామని నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు, మౌలిక వసతుల కల్పన, విద్య మెరుగుదలపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ కు 42వ స్థానం దక్కిందని, ఈ దిశగా కృషి చేసిన ప్రతొక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. స్టెంట్ ల ధరలు తగ్గించినట్లు, పేదల కోసం విశేషమైన పథకాలు తెచ్చినట్లు సభకు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆన్ లైన్ సేవలు..గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగార్థులకు మేలు చేసినట్లు చెప్పుకొచ్చారు. మధ్యవర్తిత్వం బెడద లేకుండా లబ్దిని నేరుగా ప్రజల ముంగిటకే అందిస్తున్నట్లు, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది ప్రధాని సూచన అని, రైతుల ఉత్పాదనలకు మెరుగైన గిట్టుబాటు ధర అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమన్నారు.

 • 2017-18 లో ద్రవ్యలోటు అంచనా జీడీపీలో 3.5 శాతం.
 • 2017-18 సవరించిన బడ్జెట్ రూ. 21.54 లక్షల కోట్లు.
 • ఆహార ధాన్యాల మద్దతు ధర ఒకటిన్నర శాతం పెంపు.
 • మద్దతు ధరలు నిర్ణయించడానికి వ్యవస్థీకృత యంత్రాంగం ఏర్పాటు.
 • ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటు. ఇందులో మహిళలకు పోత్రాహం.
 • అగ్రో ప్రాసెసింగ్ కోసం నిధులు పెంపు.
 • ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 500 కోట్లు.
 • వ్యవసాయ మార్కెట్ ఫండ్ రూ. 200 కోట్లు.
 • మార్కెట్ యార్డుల ఆధునీకరణకు రూ. 2వేల కోట్లు.
 • డైరీ, ఫిషరీ, అక్వా కల్చర్, పశుగణాభివృద్ధి కోసం రూ. 10వేల కోట్లు.
 • వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు కేటాయింపు.
 • వెదురు పెంపకానికి రూ. 1290 కోట్లు.
 • సాంఘీక భద్రతకు రూ. 9975 కోట్లు.
 • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఏడాది 51 లక్షల ఇళ్లు నిర్మాణం.
 • 2022 నాటికి ప్రతి పౌరుడికి ఇళ్లు. దిగువ తరగతి ప్రజల ఇంటికల నెరవేర్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు.
 • గ్రామీణ వ్యవసాయ మార్కెట్ లకు రూ. 2వేల కోట్లు.
 • మార్చి 2022 లోపు అన్ని యార్డులను ఆధునీకరిస్తాం.
 • అన్ని మార్కెట్ యార్డులను త్వరలోనే నామ నెట్ వర్క్ కు అనుసంధానిస్తాం.
 • మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు. వెదురు పరిశ్రమకు రాయితీలు.
 • వ్యవసాయ వృద్ధికి క్లస్టర్ ఆధారిత వ్యవస్థ.. వ్యవసాయ ఎగుమతుల సరళీకరణ.
 • విద్యకు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం.
 • నేషనల్ బ్యాంబూ మిషన్ ను ప్రతిపాదన.
 • సోలార్ విద్యుదుత్పాదనను ప్రోత్సాహిస్తాం.
 • సౌభాగ్య పథకంతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం.
 • మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఇస్తామని నిరుడు చెప్పడం జరిగింది. 
 • వడోదరలో రైల్వే యూనివర్సిటీ ప్రతిపాదన.
 • ఢిల్లీలో కాలుష్యం ఆందోళన. కాలుష్యాన్ని అధిగమించేందుకు సబ్సిడీ ధరలతో యంత్రాల ఏర్పాటు.
 • మత్య్స పరిశ్రమ అభివృద్ధి..పశువృద్ధి కోసం రూ. 10000 కోట్లు.
 • గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి రూ. 2000 కోట్లు.
 • కనీస మద్దతు ధర అందరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం. నీతి ఆయోగ్ నేతృత్వంలో కమిటీ పనిచేస్తుంది.
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం.
 • ఉజ్వల పథకం కింద 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు. 
 • విద్య పరిశోధనకు రూ. లక్ష కోట్లు..కొత్తగా 18 ఆర్కిటెక్చర్ కాలేజీలు.
 • త్వరలో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు,
 • వ్యవసాయ ఉత్పత్తులకు 42 ఫుడ్ పార్కులు.
 • ఫుడ్ ప్రాసెసింగ్ కు రూ. 1400 కోట్లు కేటాయింపు
 • జాతీయ వైద్య ఆరోగ్య రక్షణ పథకం కింద 50 కోట్ల మందికి లబ్ది.
 • వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు.
 • కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్.
 • గ్రామీణ ప్రాంతాల్లో గృహ విద్యుత్ కు రూ. 16వేల కోట్లతో ప్రధాన మంత్రి సౌభాగ్య
 • 8లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు.
 • వచ్చే ఏడాదిలో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం.
 • సాంఘీక భద్రతకు రూ. 9,975 కోట్ల రూపాయలు.
 • గ్రామీణ రహదారుల నెటవర్క్ తో 3.32 లక్షల ఉద్యోగాల సృష్టి.
 • ప్రధాని గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్లలో కోటి మందికి ఇళ్లు.
 • విద్యా రంగంలో మౌలిక వనరుల అభివృద్దికి లక్ష కోట్ల రూపాయలతో రైజ్ నిధి.
 • స్కూల్ టీచర్ల శిక్షణకు కొత్త స్కూళ్లు.
 • నవోదయ స్కూళ్ల తరహాలో ఏకలవ్య స్కూళ్లు. ఆరోగ్య భారత్...అభివృద్ధి భారత్.
 • 96 జిల్లాలకు రూ. 2600 కోట్లతో తాగునీటి సౌకర్యం.
 • జాతీయ ఆరోగ్య రక్ష పథకం కింద పేదలకు రూ. 10 కోట్లు కుటుంబాలకు కవరేజ్.
 • క్షయ రోగులకు పౌష్టిహారానికి నెలకు రూ. 500...600 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు.
 • రూ. 330 ప్రీమియంతో ప్రతొక్కరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమ.
 • 10 కోట్ల పేద కుటుంబాలకు జాతీయ ఆరోగ్య భధ్రత పథకం. 
 • 2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు.
 • కొత్తగా 24 మెడికల్ కాలేజీల ఆసుపత్రుల ఏర్పాటు.
 • జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5750 కోట్లు.
 • ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు.
 • మాతృత్వ సెలవు 3 నుండి 6 నెలలకు పెంపు.
 • ప్రధాని జన్ ధన్ యోజన పథకం విస్తరణ.
 • గ్రామీణ పారిశుధ్యానికి రూ. 16713 కోట్లు.
 • విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఏటా రూ. 25000 కోట్లు.
 • గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య పాఠశాలలు..డిజిటల్ బోర్డుల దిశగా విద్యా వ్యవస్థ.
 • వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు.
 • మహిళా స్వయం సహాయక బృందాలకు రూ. 75వేల కోట్లు.
 • గంగానది ప్రక్షాళన కోసం రూ. 187 కోట్లు.
 • ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు రూ. 56,000 కోట్లు.
 • ముద్ర స్కీమ్ కు రూ. 3 లక్షల కోట్లు.
 • రోడ్లు మౌలిక వసతులకు రూ. 9.64 లక్షల కోట్లు.
 • ఇంటింటికి తాగునీటి పథకానికి రూ. 77500 కోట్లు.
 • చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం రూ. 3790 కోట్లు.
 • స్మార్ట్ సిటీలకు రూ. 2లక్షల 4 కోట్లు.
 • జనధన్ పథకంలోకి 60 కోట్ల బ్యాంకు అకౌంట్లు.
 •  
 • ఎస్సీలకు రూ. 32,500 కోట్లతో 305 పథకాలు.
 • ​వస్త్ర పరిశ్రమకు రూ. 7148 కోట్లు.
 • పర్యాటక రంగంలో ప్రోత్సాహం కోసం 10 చారిత్రక నగరాల అభివృద్ధి.
 • కార్పొరేట్ పన్ను 2 శాతం తగ్గింపు.
 • సౌభాగ్య పథకానికి రూ. 16000 కోట్లు.
 • చిన్న పరిశ్రమల మొండి బకాయిల సమస్య పరిష్కరిస్తాం.
 • 2020 నాటికి 50 లక్షల మంది యువతకు శిక్షణ.
 • రైల్వేలకు రూ. 1.48 కోట్లు
 • రెండేళ్లలో కాపలాలేని 4267 లెవల్ క్రాసింగ్ లు తొలగింపు.
 • అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో వైఫై, సీసీ కెమెరాలు.
 • 2019 నాటికి 4 వేల కి.మీ. రైట్వే లైన్ల ఏర్పాటు లక్ష్యం.
 • రైల్వే విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యం.
 • 600 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.
 • 36 వేల కి.మీ. రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ. అన్ని రైల్వేస్టేషన్ లలో ఎస్కలేటర్లు.
 •  
 • దళిత సంక్షేమానికి రూ. 56 వేల కోట్లు. ఆదివాసీ సంక్షేమానికి రూ. 32,508 కోట్లు.
 • ఈపీఎఫ్ 8.33 శాతం నుండి 12 శాతానికి పెంపు. ఈపీఎఫ్ మూడేళ్ల పాటు అమలు.
 • నమామి గంగ పథకం కింద 187 ప్రాజెక్టులు. 10 పర్యాటక కేంద్రాల అభివృదిధ. పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్దికి కృషి.
 • టోల్ ప్లాజాలో సులభతర ప్రయాణీకానికి వీలుగా ఎలక్ట్రానిక్ చెల్లింపులు.
 • 900 కొత్త విమానాల కొనుగోలు. వంద కోట్ల ప్రయాణీకుల వీలుగా విమనాశ్రయాల విస్తరణ.
 • భారత్ నెట్ వర్క్ కార్యక్రమం కోసం రూ. 10 వేల కోట్లు. గ్రామాల్లో 5లక్షల వైఫై రూటర్ల సదుపాయం.
 • స్టాక్ మార్కెట్ల లిస్టులో 14 ప్రభుత్వ రంగ సంస్థలు.
 • పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 80వేల కోట్లు.
 • స్టాంప్ డ్యూటీల విషయంలో కొత్త విధానం.. పలు రాష్ట్రాలతో సంప్రదింపులు.
 • ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్ ఐడి. సులభతర వాణిజ్యంలో పారదర్శకత కోసం ప్రతి వ్యాపార సంస్థకు గుర్తింపు.
 • రాష్ట్రపతి గౌరవ వేతనం రూ. 5 లక్షలు.. ఉప రాష్ట్రపతి గౌరవ వేతనం రూ. 4 లక్షలు...గవర్నర్ల గౌరవ వేతనం రూ. 3.5 లక్షలు..ఐదేళ్లకొకసారి ఎంపీ వేతనాల్లో మార్పు.
 • వేతన ఉద్యోగులకు రూ. 40వేల స్టాండర్డ్ డిడక్షన్. ఫించన్ దారులకూ వర్తింపు. 

 

 • బెంగళూరు మెట్రోకు రూ. 17 వేల కోట్లు.
 • దేశ వ్యాప్తంగా గ్రామాల్లో 5 లక్షల వైఫై స్పాట్లు.
 • క్రిప్టో కరెన్సీ లావాదేవీల నిర్మూలనకు చర్యలు.
 • స్టాంప్ డ్యూటీల విషయంలో కొత్త విధానం
 • ముంబై నగరంలో అర్బన్ రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు రూ. లక్ష కోట్లు.
 • ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 80 వేల కోట్లు.
 • గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పునర్ వ్యవస్థీకరణ.
 • 2017-18 లో ద్రవ్యలోటు 3.5 శాతం.
 • వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా రూ. 90 వేల కోట్ల అదనపు వసూళ్లు
 • 8.72 కోట్లకు చేరిన పన్ను చెల్లింపు దారులు.
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.3 శాతానికి తగ్గించాలని లక్ష్యం.
 • రైతు ఉత్పాదన కంపెనీలకు వంద శాతం పన్ను మినహాయింపు.
 • ఆదాయపన్ను శ్లాబులో జైట్లీ మార్పులు ప్రతిపాదించలేదు.
 • వేతన జీవులకు స్వల్ప ఊరటగా భావించాలి.
 • రూ. 40 వేల వరకు అదనంగా పన్ను మినహాయింపు.
 • స్టాండర్డ్ డిడక్షన్ కింద 2.5 కోట్ల మందికి లబ్ది.
 • ఆరోగ్య బీమా పన్ను పరిమితి పెంపు.
 • వృద్ధులకు 80 డి కింద రూ. 35 వేల పన్ను పరిమితి రూ. 50 వేలకు పెంపు.
 • సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై రూ. 50 వేల వరకు టీడీఎస్ ఉండదు.
 • సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చుల అదనపు రాయితీ రూ. 40 వేల నుండి రూ. లక్షకు పెంపు. 

రాజస్థాన్ లో బీజేపీకి షాక్

జైపూర్: రాజస్థాన్ లోని  అల్వార్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 39 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. 

పార్లమెంట్ కు చేరుకున్న అరుణ్ జైట్లీ

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ పత్రులతో పార్లమెంట్ చేరుకున్నారు. కేబినెట్ మంత్రివర్గం బడ్జెట్ అనంతరం ఆమోదం అనంతరం జైట్లీ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

 

09:56 - February 1, 2018

అండర్-19 వరల్డ్ కప్ లో శుభ్ మాన్ గిల్ పేరు మార్మోగుతుంది. భారత్ తరుపున నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాడు ప్రపంచకప్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేశాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ 94 బంతల్లో 7 ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. గిల్ పంజాబ్ లోని ఫాజిల్కా పట్టణంలో 1999, సెప్టెంబర్ 8న జన్మించాడు. అతని తండ్రి రైతు. గిల్ తను క్రికెటర్ కావాలన్న కలను సాకారం చేసుకోవడం కోసం తండ్రిని ఒప్పించి కుటుంబంతో సహా మొహాలీ తరలి తరలివెళ్లారు.  

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ప్రధానోపాధ్యాయుడి కారు

మహబూబ్ నగర్ : జిల్లా జడ్చర్ల స్కూల్ లో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్ధులపైకి ప్రధానోపాధ్యాయుడి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి మిషమంగా ఉంది. 

09:39 - February 1, 2018

ఢిల్లీ : కంటి తుడుపుగా నిధులు కేటాయించకుండా మహిళల రక్షణ కోసం..రాయితీలు ప్రకటించే విధంగా బడ్జెట్ ఉండాలని మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. టెన్ టివితో ఆమె మాట్లాడారు. మహిళా విభాగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని అంచనా ఉందన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏపీ రాష్ట్రంలో సమస్యల్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం రూ. 30 లక్షల వరకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే సేవలో కేంద్రం సహాయం చేయాలని కోరారు. రైల్వే లైన్ లు ఏర్పాటు చేయాలని...మహిళా కోర్టు..మహిళా పీఎస్ లు..సిబ్బంది ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీలో మహిళా ప్రసూతీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అంగన్ వాడీ..టీచర్స్..వర్కర్ల వేతనాలు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలన్నారు. 

మహిళా విభాగానికి నిధులు కేటాయించాలి - నన్నపనేని...

ఢిల్లీ : కంటి తుడుపుగా నిధులు కేటాయించకుండా మహిళల రక్షణ కోసం..రాయితీలు ప్రకటించే విధంగా బడ్జెట్ ఉండాలని మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. టెన్ టివితో ఆమె మాట్లాడారు. 

09:29 - February 1, 2018

రాజస్థాన్, బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం...

ఢిల్లీ : రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ప్రారంభమైంది. రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. బెంగాల్ రాష్ట్రంలోని నోపారా అసెంబ్లీ స్థానానికి, ఉల్‌బేరియా లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి.

బడ్జెట్ టీంతో జైట్లీ...

 

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ కాసేపట్లో రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈసందర్భంగా కాసేపటి క్రితం బడ్జెట్ టీంతో జైట్లీ ఫొటోలు దిగారు. 

 

09:08 - February 1, 2018

ఢిల్లీ : కాసేపట్లో కేంద్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 11గంటలకు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 9గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుండి రాష్ట్రపతి భవన్ కు జైట్లీ వెళ్లనున్నారు. 10.15 నిమిషాలకు పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 1.30కి రాజ్యసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను టేబుల్ చేయనున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇది కీలక బడ్జెట్ గా ఉంది. జీఎస్టీ అమలు తరువాత మోడీ సర్కార్ ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ నిర్ణయాలపై వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే బడ్జెట్ ఎలాంటి అంశాలు జోడించనున్నారో దానిపై ఉత్కంఠ నెలకొంది. 2016-17తో పొలిస్తే పెట్టుబడుల అంచనాలు 60 శాతంగా తెలుస్తోంది. వస్తు సేవల పన్నులో మార్పులు చేసే దిశగా ఉండనున్నట్లు టాక్. గ్రామీణ కార్యక్రమాలు, ఉద్యోగ హామీ, గ్రామీణ గృహ పథకాలకు అధిక నిధులు...పంటల బీమా వంటి పథకాలకు సమృద్ధిగా నిధులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాధాన్యత ఉద్యోగాల సృష్టి, వ్యవసాయ, చిన్న వ్యాపార రంగాలకు ప్రోత్సాహకాలు..గ్రామీణ ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకోవడం కోసం బడ్జెట్ లో ప్రత్యేక కసరత్తు చేయనునున్నట్లు ప్రచారం జరుగుతోంది. రహదారుల నిర్మాణం, రైల్వేల ఆధునీకరణ, మౌలిక సదుపాయాలకు తగినన్ని నిధులు కేటాయిస్తారని సమాచారం. ఈ సందర్భంగా టెన్ టివి బీజేపీ సమన్వయ కర్త రఘుతో ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:27 - February 1, 2018
08:24 - February 1, 2018

11 గంటలకు కేంద్ర బడ్జెట్...

ఢిల్లీ : నేడు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 11గంటలకు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 9గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుండి రాష్ట్రపతి భవన్ కు జైట్లీ వెళ్లనున్నారు. 10.15 నిమిషాలకు పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 1.30కి రాజ్యసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను టేబుల్ చేయనున్నారు. 

08:07 - February 1, 2018

నేడు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 11గంటలకు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 9గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుండి రాష్ట్రపతి భవన్ కు జైట్లీ వెళ్లనున్నారు. 10.15 నిమిషాలకు పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 1.30కి రాజ్యసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను టేబుల్ చేయనున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), గోస్లా శ్రీనివాస్ (కాంగ్రెస్), చింతా సాంబమూర్తి (బిజెపి), సీతారాం నాయక్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:25 - February 1, 2018
07:25 - February 1, 2018
07:24 - February 1, 2018
07:23 - February 1, 2018
07:10 - February 1, 2018

మహబూబాబాద్ : రెండేండ్ల ఎదురు చూపుల తర్వాత మేడారంలో వన దేవతల సంబురాలు మిన్నంటాయి. జంపన్నవాగు జన సందోహంతో పరవళ్లు తొక్కింది. కన్నెపల్లి నుంచి సారక్క మేడారం గద్దెకు చేరుకోవడంతో మహాజాతరలో తొలిఘట్టం పూర్తయ్యింది. ఇక పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి దగ్గర సారక్కకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురు దేవతల రాకతో మేడారం సంబూరంలో మునిగిపోయింది. ఇక తల్లి సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి స్వాగతించేందుకు మేడారం ఒళ్లంతా కండ్లుగా ఎదురుచూస్తున్నది.

మేడారం జనసంద్రమైంది. వనదేవతల దర్శనానికి జన ప్రవాహం తరలివచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తకోటి... సారక్క రాకతో పులకించింది. తల్లీ సారక్క నీవే దిక్కంటూ నలుదిక్కులు పిక్కటిల్లేలా జాతరకొచ్చిన జనం.. దాడిపొడవునా పొర్లుదండాలు పెడుతూ ప్రణమిల్లారు. తెలంగాణ కుంభమేళా... మేడారం మహాజాతరలో తొలిఘట్టం సారక్కరాకతో ముగిసింది.

తెల్లవారుజాము నుంచే కన్నెపల్లికి సారక్క కోసం భక్తజనం భారీగా తరలివచ్చారు. సారక్కను తోడ్కొని వచ్చే ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సమయానికిఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ కోయ గిరిజనుల పూజా విన్యాసాలతో కన్నెపల్లి మార్మోగింది. పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఆనవాయితీ ప్రకారం కన్నెపల్లి నుంచి 16మంది ఆడబిడ్డలు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం డోలీ విన్యాసాలతో మేడారం వచ్చారు. తల్లీబిడ్డలైన సమ్మక్క - సార్కలు కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంకవనానికి కంకణాలు కట్టారు.

ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా సారక్క మేడారం పయనం ఈసారి చాలా ఆలస్యమైంది. రాత్రి 8.12 గంటలకు కన్నెపల్లి గుడి నుంచి సారక్క మేడారం బయల్దేరింది. 8.45 గంటలకు కన్నెపల్లి వాడవాడలా సారక్కకు మంగళహారతులు పట్టారు. 9.20కి కన్నెపల్లి ఊరు సారక్కను సాగనంపింది. 9.35 గంటలకు సారక్క జంపన్నవాగుకు చేరుకుంది. 9.40గంటలకు వాగునుంచి బయటికి వచ్చిన సారక్కకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మొక్కులు చెల్లించుకున్నారు. 10.05 గంటలకు మేడారం గుడికి సారక్క చేరుకుంది.

సారక్క మేడారానికి బయల్దేరిందన్న సమాచారం తెలియగానే మేడారం జాతర ప్రాంగణం నుంచి భక్తులు తండోపతండాలుగా కన్నెపల్లికి పరుగులు తీశారు. గుడినుంచి బయటికి రాగానే సారక్క కన్నెపల్లి వాడవాడ తిరుగుతూ తన బిడ్డలకు దీవెనలిచ్చింది. ఇల్లిల్లు సారక్కకు చీరెసారె పోసి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అత్యంత నియమనిష్టలతో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ప్రధాన వడ్డె సారయ్య ఆధ్వర్యంలో సారక్క మేడారం గద్దెకు పయనమైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున దారికిరువైపులా జన సందోహం పోటెత్తింది. సిగాలూగె సివసత్తుల పూనకాలతో జాతర మారుమోగింది. ఎదుర్కోళ్లు సమర్పిస్తూ ఒడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారక్కకు నీరాజనం పలికారు.

మేడారం పొలిమేరల్లోకి సారక్క రాగానే సంబూర వాతావరణం వెల్లవిరిసింది. అప్పటికే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చారు. ఆ ఇద్దరూ సారక్కకోసం ఎదురు చూస్తున్న తరుణంలో మేడారానికి సారక్క వచ్చిందన్న సంకేతంతో గుడి ప్రాంగణం సందడిగా తయారైంది. సారక్క మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సంప్రదాయ విన్యాసాలతో డోలీ మోతలు, కొమ్ము బూరల నాదాలు దద్దరిల్లాయి. ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి మేడారం గద్దెల ప్రాంగణానికి బయలుదేరారు. రాత్రి 12.22 గంటలకు సారక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజు వారివారి గద్దెలపై ఆసీనులయ్యారు.

ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గుట్టదిగి వచ్చి భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెపై రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో ప్రతిష్ఠించనున్నారు. పూజారులు చాలా జాగ్రత్తగా తల్లిని తీసుకొని ప్రధాన ద్వారం గుండా గద్దెపైకి చేరుకొని ప్రతిష్ఠిస్తారు. ఈసారి మేడారం జాతరకు జనం పోటెత్తారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో గంటలకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో దాదాపు 12 గంటలకుపైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.  

06:48 - February 1, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వ్యయం తడిసిమోపెడవుతోంది. ఇప్పటికే అంచనా వ్యయం 58 వేల కోట్ల రూపాయలు మించిపోయింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలవరం.. ఏపీ ప్రజల జీవనాడి. ప్రాజెక్టు అంచనా వ్యయం అంతకంతకు పెరగడం ఆందోళనకర పరిణామం. మొదట్లో 2 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక అందజేసింది. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 45 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటందని అంచనా వేస్తున్నారు. దీనిలో ఎక్కువ భాగం నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణానికే వెచ్చించాల్సి ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు, పునరావాసానికి 30 వేల కోట్లు అవుతుందని అంచాన వేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టైనా ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు కేంద్ర సుముఖంగా లేదు. ప్రధాన ప్రాజెక్టుపై చేసిన ఖర్చులు ఇవ్వడానికే కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది.

పోలవరంలో జరుగుతున్న పనులతో పోలిస్తే ఖర్చే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. కుడి కాల్వ పనులు 91 శాతం పూర్తయ్యాయి. ఎడవ కాల్వ పనులు 60 శాతం చేసినట్టు కేంద్రానికి నివేదిక పంపారు. హెడ్‌ వర్క్స్‌ పనులు 34 నుంచి 39 శాతం పనులు పూర్తియ్యాయి. స్పిల్‌ వే పనులు 73 శాతం పూర్తయ్యాయి. డయాఫ్రం వాల్‌ పనుల్లో 62 శాతం పురోగతి ఉందని లెక్క చూపించారు. నత్త నడకన సాగుతున్న పోలవరం పనులను చూస్తే ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో సాగునీరు ఇచ్చే అవకాశంలేదని అధికారులే చెబుతున్నారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి సాగునీరు అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు కూడా నీటిమూటలుగానే మిగిలిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనుల్లో కొంత భాగాన్ని ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి తప్పించి, మరో సంస్థకు అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తాజా నిర్ణయం తర్వాతైనా పనుల్లో పురోగతి ఉంటుందో లేదో చూడాలి. 

06:46 - February 1, 2018

హైదరాబాద్ : అండగా ఉండాల్సిన వాళ్లే... కుట్రలు పన్నుతున్నారు. వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు.. పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. రియల్‌ మాఫియాతో చేతులు కలిపి బడుగు జీవుల భూములను కైంకర్యం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. మొహం చాటేస్తున్నారు. హయత్‌ నగర్‌లోని పేదల భూముల కబ్జాపై 10టీవీ కథనం..

హయత్‌ నగర్‌లోని హాదీగూడాలో నిరుపేదల భూములపై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. అధికారులు, ప్రజా ప్రతినిధుల అండతో.. వారి భూములను, ఇళ్లను సొంతం చేసుకునేందుకు.. కుట్రపన్నుతున్నారు. దీంతో.. ఆ పేద ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు..హాదీగూడాలో నాలుగు వందలకుపైగా కుటుంబాలు.. 30 ఏళ్లుగా జీవిస్తున్నారు. వీరంతా రోజువారి కూలి పనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం వీరంతా హాదీగూడాతో పాటు.. శ్రీనివాస్‌ నగర్‌లో ప్లాట్లను కొనుగోలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది ఇళ్లు కట్టించుకున్నారు. అయితే ఈ పేదలు జీవిస్తున్న ఈ ప్రాంతానికి కోట్ల రూపాయల డిమాండ్‌ ఉండడంతో.. కొందరు అక్రమార్కులు.. ఆ ప్రాంతాన్ని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఆ భూములకు అక్రమంగా జీపీఏలు సృష్టించి .. రాత్రికి రాత్రే 130 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన గడ్డం బాబయ్య కుటుంబ సభ్యులు తమ భూములను ఆక్రమించుకునేందుకు కుట్ర చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు, రెవెన్యూ అధికారులకు తెలియజేశామని.. అయితే వారు తమకు సంబంధం లేదని.. అంటున్నారని స్థానికులు వాపోతున్నారు.

ప్రజాప్రతినిధులు , అధికారులే ..పేదలకు అన్యాయం చేస్తున్నారని.. సీపీఎం నేతలు అంటున్నారు. ఎంతో కష్టపడి కొనుగోలు చేసుకున్న భూములను స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. 440 మందికి న్యాయం జరిగే వరకూ.. వారికి అండగా నిలిచి.. పోరాటం చేస్తామని సీపీఎం నేతలు తేల్చి చెప్పారు.

06:41 - February 1, 2018

హైదరాబాద్ : కాదేదీ కల్తీకి అనర్హమంటూ.. కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వ్యాక్సిన్‌లను తయారు చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంబర్‌పేటలో నకిలీ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు పట్టుకున్నారు. వ్యాలిడిటీ అయిపోయిన వ్యాక్సిన్‌ను రీసైకిలింగ్‌ చేస్తున్న కర్మాగారంలో అధికారులు సోదాలు నిర్వహించి.. లక్షల సంఖ్యలో నకిలీ వ్యాక్సిన్‌ బాటిల్స్‌ను సీజ్‌ చేశారు. యజమానితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డానో కంపెనీ అడ్డాగా నకిలీ వ్యాక్సిన్ల ఉత్పత్తి సాగుతోంది. కంపెనీ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రాజు ఆధ్వర్యంలో ఈ దందా సాగుతున్నట్టు తేలింది. మేడ్చల్‌ జిల్లా.. ఘట్కేసర్‌లోని నేషనల్‌ హైవే పక్కన ప్రధాన కార్యాలయం ఉంది. డానో వ్యాక్సిన్స్‌ అండ్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో 30 ఏళ్లుగా టీటీ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నట్టు తేలింది. దీంతో కంపెనీని సీజ్‌ చేశారు. ఇక్కడ కూడా డ్రగ్స్‌ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఘట్కేసర్‌లోని ప్రధాన కార్యాలయంలో వ్యాక్సిన్లు తయారు చేసేటప్పుడు... మూతలు సరిగా పట్టని వాటిని .. అంబర్‌పేట్‌లోని.. ప్రింటింగ్‌ ప్రెస్‌కు తరలించి.. అక్కడ వాటిని సరిచేసి.. తిరిగి ప్రధాన కార్యాలయానికి పంపిస్తారని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కంపెనీలో స్టిక్కరింగ్‌, ప్యాకింగ్‌ చేసి .. బహిరంగ మార్కెట్‌లో విక్రయాలు జరుపుతున్నారు.  

06:39 - February 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 735 మంది మహిళా కానిస్టేబుళ్ళు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్నారు. దాదాపు తొమ్మిది నెలల శిక్షణ అనంతరం పాసింగ్‌ పెరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఇది చాలా శుభపరిణామం అని హోమ్‌ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారి 735 మంది మహిళా కానిస్టేబుళ్ళు ఒకే సారి శిక్షణ పూర్తి చేసుకున్నారు. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడెమీలో వీరంతా పాసింగ్ పెరేడ్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోమ్‌ మంత్రి నాయిని నరసింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ అకాడెమీ డైరెక్టర్‌ జితేందర్‌తోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలోనే తొలిసారిగా కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్‌ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని హోమ్‌ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హోమ్‌మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పౌరులతో బాధ్యాతాయుతంగానూ... స్నేహపూర్వకంగానూ మెలగాలని కొత్తగా విధుల్లోకి చేరుతున్న మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ఎక్కువ శాతం ఉన్నత విద్యావంతులే ఉండడం విశేషం. దాదాపు 150 మంది పీజీ పట్టభద్రులు ఉన్నారు. ఉన్నతాధికారులు వీరందరి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ... వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ అద్భుత ఘట్టంతో తెలంగాణ రాష్ర్ట పోలీస్‌ శాఖ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు.

ఒకేసారి 735 మంది మహిళా కానిస్టేబుళ్ళు శిక్షణపూర్తి చేసుకుని విధుల్లో చేరడం అభినందనీయం అన్నారు. పోలీస్‌ శాఖలో మహిళలకు 33 శాతం ఇవ్వడం జరిగిందన్నారు. విధుల్లో చేరుతున్న మహిళా కానిస్టేబుళ్ళందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. కానిస్టేబుల్‌ శిక్షణ తీసుకని బయటకు వస్తున్న మహిళా కానిస్టేబుళ్ళు విధుల్లో చేరనున్నారు. వీరంతా సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలతోపాటు పలునేరాలను అదుపుచేయడంలో బాధ్యతాయుతమైన సేవలందిస్తారని ఆశిద్దాం...

06:36 - February 1, 2018

హైదరాబాద్ : రెండు నెలల కిందట ప్రారంభమైన హైదరాబాద్‌ మెట్రోరైల్‌... ప్రయాణీకులకు చేరువయ్యేందుకు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌లో కల్పిస్తామన్న సౌకర్యాలను.. ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ పెంచేందుకు రెంట్‌ ఏ బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది మెట్రోరైల్‌ యాజమాన్యం. పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ పద్దతిలో నిర్మితమవుతున్న అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రోరైల్‌. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మెట్రో ప్రారంభమైన తర్వాత సదుపాయాల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. ప్రారంభంలో కిక్కిరిసిపోయిన మెట్రో ఇప్పుడు వెలవెలబోతోంది. ప్రయాణీంచే ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ముందు ప్రకటించిన సదుపాయాలు కల్పించడంలోనూ వైఫల్యమే కనిపిస్తోంది. దీంతో ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ప్రయాణీకుల ఫిర్యాదులను పరిశీలించిన మెట్రోరైల్‌ యాజమాన్యం కొత్త సదుపాయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మెట్రోస్టేషన్‌ల దగ్గర లాస్ట్‌మైల్‌ కనెక్టివిటి పెంచేలా రెంట్‌ ఏ మోటార్‌ సైకిల్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రోస్టేషన్‌లో దిగిన ప్రయాణీకుడు తమ గమ్యస్థానాన్ని చేరుకునేందుకు స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లేలా ఇంతకుముందు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. అయితే సరిపడ బస్సులు లేక ఆ విధానం ముందుకు వెళ్లలేదు. సైకిల్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అవి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో ఇప్పుడు మెట్రో రెంట్‌ ఏ బైక్‌ పేరుతో మోటారు సైకిళ్లను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో మోటార్‌ సైకిల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. త్వరలోనే అన్ని స్టేషన్లలోనూ మోటార్‌ సైకిళ్లను ప్రారంభించేందుకు మెట్రోరైల్‌ యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ ధరతో.. సులభ పద్దతుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. కిలోమీటర్‌కు 4 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నట్టు వివరించారు. మొత్తానికి మెట్రోరైల్‌ యాజమాన్యం ప్రయాణీకులకు మరింత దగ్గరగా చేరువవ్వడం.. ఎక్కువ మంది ప్రయాణీకులు మెట్రోలో ప్రయాణం కొనసాగేలా చూసేందుకు దారులు వెతుకుతోంది. మరి ఈ ప్రయత్నాలు ఏమేరకు సత్ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.

06:33 - February 1, 2018

విజయవాడ : విజయవాడ విమానాశ్రయం... ఇక అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోనుంది... అత్యాధునిక టెక్నాలజీ.... అంతర్జాతీయ హంగులు ఈ ఎయిర్‌పోర్ట్‌ ప్రత్యేకత. ఇక్కడినుంచి దేశంలోని మహానగరాలతోపాటు... విదేశాలకూ విమాన సర్వీసులు నడిపే దిశలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. టెర్మినల్స్‌ను అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు. 750 కోట్ల రూపాయలతో శాశ్వత టెర్మినల్‌ భవనం ప్రారంభంకానుంది. గత ఐదేళ్ళ కాలంలో దేశంలోనే అత్యధిక ప్రయాణీకులవృద్ధి రేటుగా విజయవాడ ఎయిర్‌ పోర్ట్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు నిత్యం మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో మరో 3నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచినిత్యం 36 సర్వీసులు నడుస్తుండగా... తాజాగా ప్రారంభమైన ముంబై ఫ్లైట్‌ సర్వీసుతో ఆ సంఖ్య 38కి చేరుకుంది.

ఈ ఏడాది మార్చిలో 12 ఇండిగో సర్వీసులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు విస్తరించేందుకు షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. ఇవి ప్రారంభమైతే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మొత్తం 50 విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. స్పైస్‌ జెట్‌ సైతం ఇక్కడనుంచి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నాలుగైదు నెలల్లో దుబాయ్, సింగపూర్, షార్జా దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టారు. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనంలో సిద్ధమయ్యాయి. దీనిని 2 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు.

06:31 - February 1, 2018

విజయవాడ : కేంద్రం ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌ లో ఏపీకి ఈసారైనా న్యాయం జరుగుతుందా...? నిధులతోపాటు విశాఖ రైల్వే జోన్‌, కొత్త రైలు మార్గాలు, కొత్త రైళ్ళకు ఎన్డీయే సర్కార్‌... బడ్జెట్‌లో చోటు కల్పిస్తుందా...? లేదా...? అన్న సందిగ్దం వీడడంలేదు. దశాబ్దాలుగా అనేక ప్రాజెక్టులు పట్టాలు ఎక్కకపోగా.. పలు ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోయాయి. మరి ఈ సారైనా ఏపీపై కేంద్రం కరుణ చూపుతుందా? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.. కేంద్రం ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌లో ఈ సారైనా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారా లేదా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా కొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కనే లేదు. మరికొన్ని ప్రాజెక్టుల ఊసే లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఏపీకి ఈసారైనా న్యాయం జరుగుతుందా లేదా అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. విశాఖ రైల్వే జోన్‌కు అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. రాష్ర్ట విభజన హామీలను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలన్న వాదన కు బలం చేకూరుతోంది. ప్రతియేటా రైల్వే అధికారులతో ఎంపీల సమావేశం నిర్వహించడం మినహా ఏపీకి ఒరిగిందేమీలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిధుల కేటాయింపులు, భూ సేకరణ వంటి కీలక అంశాలపై తొలినుంచీ ప్రతిపాదనలు వెళ్తూనే ఉన్నాయి. ఉత్తరాది ఎంపీలు మంత్రులుగా ఉంటే.. తెలుగు రాష్ర్టాలకు ఎలాంటి కేటాయింపులు ఉండవనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. గతంలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సురేష్‌ ప్రభు కూడా రైల్వే మంత్రిగా ఏపీ, తెలంగాణకు ఏ మాత్రం న్యాయం చేయలేదు. దీంతో రైల్వే బడ్జెట్‌ అంటేనే అన్ని వర్గాల్లోనూ నిరాసక్తి నెలకొంది.

విజయవాడ-నర్సాపూర్‌-నిడదవోలు డబ్లింగ్‌ పనులు, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్‌, కాకినాడ-కోటిపల్లి-నర్సాపూర్‌ లైన్, కాకినాడకు మెయిన్‌ లైన్‌ తీసుకెళ్ళేందుకు పిఠాపురం లైన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రదిపాదన ఉంది. కొత్త మార్గాల్లో విద్యుద్దీకరణ, రైల్వే భద్రత, టెక్నాలజీ, ప్రయాణీకుల సదుపాయాలు, స్టేషన్ల అభివృద్ధి వంటివి చేపట్టాల్సి ఉంది. నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు లైన్‌ పూర్తి చేయాల్సి ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌ క్లాస్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని, గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ సారైనా నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్లను వరల్డ్‌ క్లాస్‌ రైల్వే స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విన్నవించారు.

అమరావతి నుంచి రాయలసీమకు ఫాస్ట్‌ లైన్‌ కోసం ప్రతిపాదించారు. సర్వే పూర్తయినా... పట్టాలు వేసేందుకు నిధులు మంజూరు చేయలేదు. విశాఖపట్నం, అమరావతి ప్రాంతంలో ఎంఎంటీఎస్‌ లైన్‌ వేయాలని, విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో రైల్వే స్టేషన్‌ నిర్మించాలని ప్రయాణీకులు కోరుతున్నారు. విజయవాడ-చెన్నై మధ్యలో మూడో లైన్‌ తీసుకురావాలని కూడా అడుగుతున్నారు. పలు ప్రధాన మార్గాల్లో కొత్తరైళ్ళు, ట్రాక్‌లు, నిధులు కావాలని ఎన్డీయే సర్కార్‌కు ఏపీ పెద్దలు విన్నవిస్తూనే ఉన్నారు. మరి కేంద్రం ఏమేరకు రైల్వే డ్జెట్‌లో ఏపీకి మేలు చేకూరుస్తుందనేది వేచి చూడాల్సిందే.....

బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్..కేసులు నమోదు...

హైదరాబాద్ : హబీబ్ నగర్ బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేస్తున్న 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరినీ నేడు కోర్టులో హాజరు పరుచనున్నారు. 

షాతో భేటీ కానున్న ఏపీ, తెలంగాణ బిజెపి నేతలు..

హైదరాబాద్ : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో నేడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బిజెపి నేతలు సమావేశం కానున్నారు. టిడిపితో పొత్తు, అసెంబ్లీ స్థానాల పెంపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ఫిబ్రవరి 2న సెలవు..

హైదరాబాద్ : పాత వరంగల్ జిల్లా పరిధిలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మేడారం జాతర సందర్భంగా ఈ సెలవును ప్రకటించింది. మార్చి రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం పరిగణించింది. 

నగరానికి చేరుకోనున్న కృష్ణ చైతన్య మృతదేహం...

ఢిల్లీ : అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో ఇటీవల మరణించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వెంకన్నగారి కృష్ణ చైతన్య మృతదేహం గురువారం హైదరాబాద్‌ రానుంది. ఈ విషయాన్ని భారత కాన్సులేట్‌ కార్యాలయ అధికారి వెల్లడించారు.

మేడారానికి ఛత్తీస్ గడ్ సీఎం...

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ మేడారం జాతరకు రానున్నార. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల రాక సందర్భంగా మేడారంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. 

నేడు సమ్మక్క ఆగమనం..

మహబూబాబాద్ : మేడారం జాతర కొనసాగుతోంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్కను గురువారం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుండి గద్దెపైకి అధికారిక లాంఛనాలతో తీసుకరానున్నారు. సాయంత్రం ఈ తంతు మొదలై రాత్రి వరకు కొనసాగనుంది. సమ్మక్కను తీసుకొచ్చే ముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. శనివారం రాత్రి గిరిజన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. 

అంబటిపై నిషేధం..

హైదరాబాద్ : క్రికెటర్ అంబటి రాయుడిపై బీసీసీఐ రెండు మ్యాచ్ ల నిషేధాన్ని విధించింది. దీనితో విజయ్ హజారే ట్రోఫీలో మొదటి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. 

సాధారణ బడ్జెట్..

ఢిల్లీ : 2018-19 సాధారణ బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశ పెట్టనున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, ఉపాధి, మౌళిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు, బడ్జెట్‌లో చిన్న వ్యాపారులకు ప్రోత్సాహకాలు చేయనున్నట్లు సమాచారం. 

శ్రీశైలంలో సొరంగం...

కర్నూలు : జిల్లా శ్రీశైలంలో సొరంగం బయటపడింది. తవ్వకాలు జరుపుతుండగా పురాతన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. రుద్రాక్షమఠంలోని గుహలో అధికారులు నిర్వహిస్తున్న తవ్వకాల్లో పూజా సామాగ్రి, వంటపాత్రలు బయటపడ్డాయి. అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు.

రాహుల్ జాకెట్ పై విమర్శలు..

ఢిల్లీ : మేఘాలయలో ఓ రాక్‌ షో సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వేసుకున్న జాకెట్‌పై బిజెపి విమర్శలు గుప్పించింది. మోది ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కార్‌ అంటూ విమర్శలు చేసే రాహుల్‌గాంధీ...ఏకంగా 70 వేల జాకెట్‌ను ధరించారని ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేసింది. బిజెపి విమర్శలను కాంగ్రెస్‌ తేలిగ్గా కొట్టిపారేసింది.

సౌతాఫ్రికాతో టీమిండియా వన్డే సిరీస్...

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో ఎదురులేని ఇండియా.. సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. వన్డే టాప్ ర్యాంకర్‌ సౌతాఫ్రికా, సెకండ్‌ ర్యాంకర్‌ భారత్‌ మధ్య తొలి వన్డేకు డర్బన్‌లో రంగం సిద్ధమైంది.టెస్ట్‌ సిరీస్‌ ఓడిన విరాట్‌ ఆర్మీ వన్డే సిరీస్‌ నెగ్గి తీరాలని పట్టుదలతో ఉంది. 

Don't Miss