Activities calendar

02 February 2018

21:41 - February 2, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దాడికి గురైన దళితులకు టీమాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అండగా నిలిచింది. దళితులపై దాడి జరిగి నెలరోజులవుతున్నా... ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన బాటపట్టింది. వెంటనే బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి టీ-మాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు ర్యాలీగా కందుకూరుకు బయల్దేరారు. అనంతరం బాధిత దళితులకు అండగా... గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టీ-మాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య, కన్వీనర్‌ జాన్‌వెస్లీ, బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, టీమాస్‌ నేతలు పాల్గొన్నారు.

దళితులు, మైనారిటీలపై దాడులు 
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కవయ్యాయన్నారు తమ్మినేని. తెలంగాణలోనూ కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. అయితే... ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దళితులకు అండగా నిలిచి మనోదైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకునేందుకు ప్రయత్నించారని... పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు తమ్మినేని. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు కంచ ఐలయ్య. బాధ్యులను అరెస్ట్‌ చేసే వరకు దళితులకు అండగా నిలబడతామన్నారు. మరోవైపు బాధ్యులను అరెస్ట్‌ చేయని పోలీసులు.. బాధితులను బెదిరిస్తూ కేసులు పెడుతున్నారన్నారు నల్లా సూర్యప్రకాశ్‌. ఇకపై ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదన్నారు. సభకు హాజరైన టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలంతా దళితవాడలో పర్యటించి.. దళితులతో కలిస సహపంక్తి బోజనాలు చేశారు. టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలు అండగా నిలబడడంతో.. తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం బాధిత దళితుల్లో వ్యక్తమవుతోంది. 

21:38 - February 2, 2018

గుంటూరు : అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకువచ్చారు. ఇక 13 జిల్లాల నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి... నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చేద్దామంటూ పలువురు నేతలు బాబుకు తేల్చిచెప్పారు. పొత్తు వల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నామని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు. మరోవైపు హామీలన్నీ నెరవేర్చామనే భావనలో బీజేపీ వాళ్లు ఉన్నారని పలువురు మంత్రులు తెలిపారు. ప్రజలంతా కోపంగా ఉన్న నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాలని బాబుకు సూచించారు.

పొత్తు వ్యవహరంపై
అయితే... పొత్తు వ్యవహరంపై చంద్రబాబు స్పందించారు. పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని.. పాలసీ మేటర్లపై బయట ఎవరూ చర్చించవద్దని నేతలకు బాబు సూచించారు. ఏ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో నేతలకు వివరించారు. విభజన వల్ల రాష్ట్రానికి అన్యాయం జరగడంతో.. కేంద్రంతో సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగకరమని ఎన్నికల ముందు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే... కేంద్ర బడ్జెట్‌ దారుణంగా ఉందని.. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లకు బాగానే కేటాయింపులు చేసి.. ఏపీ పట్ల చిన్నచూపు చూడటం బాధాకరమని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

హామీలు ఎంతమేరకు సాధించుకున్నామనేదే
విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడకుండా... అన్ని రాష్ట్రాలతో పాటే కేటాయింపులు చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే... విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఎంతమేరకు సాధించుకున్నామనేదే ముఖ్యమన్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న వైసీపీ డిమాండ్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడైనా.. వైసీపీ విభజన హామీల కోసం పోరాటం చేసిందా ? అని ప్రశ్నించారు. మనం రాజీనామా చేస్తే... హక్కుల సాధన కోసం ఎవరు పోరాడుతారన్నారు. రాష్ట్ర హక్కులు సాధించుకోవలసిన బాధ్యత మనపై ఉందని... దానికి ఏం చేయాలో ఆలోచిద్దామన్నారు చంద్రబాబు. కేంద్రంలో మనకు రెండు మంత్రి పదవులు నామమాత్రంగానే ఉన్నాయని... పదవుల కోసం పొత్తు సాగించడం లేదని స్పష్టం చేశారు చంద్రబాబు. పార్టీలో లోతైన అధ్యయనం చేశాక తుది నిర్ణయం తీసుకుందామని సమన్వయ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే... ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 

21:09 - February 2, 2018

గుంటూరు : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చింనట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర కేంద్ర బడ్జెట్ శాఖలవారి కేటాయింపులను కేబినెట్ కు వివరించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాజకీయ నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు మంత్రులతో అన్నట్టు తెలుస్తోంది. ఎవరు తొందరపడి మాట్లాడకండి అని ఆయన నేతలకు సూచించారు. విశాఖకైనా మెట్రో ఇస్తే బాగుండేదని మంత్రి గంటా అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ విశాఖ కన్నా చిన్న నగరాలకు మెట్రో ఇచ్చారని అన్నారు.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కేంద్ర బడ్జెట్ పై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చింనట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ ను శాఖవారీ కేటాయింపులను ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర కేబినెట్ వివరించారు. 

కొండచరియలు విరిగిపడి జవాన్ల మృతి

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని మాచిల్ సెక్టార్ లో కొండచరియలు విరుచుకుపడ్డ ప్రమాదంలో మగ్గురు జవాన్లు మృతి చెందారు. మరోకరు గాయపడ్డారు. 

20:35 - February 2, 2018

బడ్జెట్ స్పీచ్ విన్నట్టైతే బాగుంది కానీ దానికి కేటాయించిన నిధులెన్ని, ఎవరికి ఈ బీమా సౌకర్యాం కల్పిస్తున్నారు. ఇది కొత్తగా తెచ్చిన పథకం కాదని ఆర్థిక నిపుణులు శశికుమార్ అన్నారు. ఇంతవరకు ఎవరికైనా ఆర్యోగబీమా వర్తించదా అని ఆయన అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

20:19 - February 2, 2018

విద్యుత్ ఉద్యోగుల విభజనపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజనపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 నెలల్లో విభజన పూర్తి చేయాలని కోర్టు విభజన కమిటీ ఆదేశించింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన 58 శాతం వేతనాలను టీఎస్ సర్కార్ తిరిగి చెల్లంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

19:16 - February 2, 2018

మమూలుగా బీజేపీ వారు బడ్జెట్ ఎలా తయారు చేశారంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇచ్చారని. కానీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు నిధులు ప్రకటించారని బెంగళూర్ మెట్రో ఏకంగా 17 వేల కోట్లు ఇచ్చారని టీడీపీ నాయకురాలు అనురాధ అన్నారు. నాలుగు సంత్సరాలు గడిచిపోయింది. మిత్రధర్మ అంటే ఇక కాలం లేదని వైసీపీ నేత హనుమంత రావు అన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు వచ్చిన బడ్జెట్ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని, బడ్జెట్ లో మహిళల కోసం, యువత కోసం ఈ బడ్జెట్ ను రూపొందించారని బీజేపీ నేత బాజీ రావు అన్నారు. బీజేపీకి అన్యాయం జరగలేదని ఆయన అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

19:15 - February 2, 2018

మాస్ మహారాజా రవితేజ హీరోగా రశిఖన్నా, సియత్ కపూర్ హీరోహిన్స్ గా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్ నుంచి వచ్చిన యాక్షన్ యంటర్ టైనర్ టచ్ చేసి చూడు...

మాస్ మహారాజా అంటూ ఆడియన్స్ నుంచి మంచి పేరు తెచ్చుకున్న రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చి రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టాడు. ప్రివియస్ ఫ్లాప్ తో సఫర్ అవుతున్న రవితేజ మళ్లీ తన టాలెంట్ ను ప్రజెంట్ చేస్తూ సెలక్టివ్ స్టోరీస్ చేస్తున్నాడు. ఇక కథ వియానికొస్తే పాండిచేరిలో ఇండస్ట్రీయలిస్ట్ కార్తీకేయ తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తుంటాడు. తన ఫ్యామిలీ అంటే అతనికి ప్రాణం. ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అనుకునే కార్తీకేయ తన దగ్గర పని చేసే వర్కర్స్ ను కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. అలాంటి తన ఎంప్లాయి కొడుకుని తన మెడికల్ కాలేజీ ఓనర్ మర్డర్ చేస్తాడు. హత్య చేసిన వ్యక్తిని ప్రత్యేక్షంగా చూస్తుంది కార్తీకేయ చెల్లి కానీ ఇన్ వెస్ట్ గేషన్ లో ఐదు సంవత్సరాల ముందే తెలుస్తుంది. అంత షాక్ తిట్టారు. కానీ అదే వీళ్లకు ఎదురు పడతాడు. తర్వాత ఏం జరుగుతుంతో థీయేటర్లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

18:52 - February 2, 2018
18:50 - February 2, 2018

గుంటూరు : మాణిక్యాలరావు చెప్పారు. బడ్జెట్‌లో కొన్ని అపోహలు వచ్చిన మాట వాస్తవమేనని.. రెండు మూడురోజులు బడ్జెట్‌ను స్టడీ చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయని మాణిక్యాలరావు చెప్పారు. ఏపీ అభివృద్ధికి టీడీపీ ఏ విధంగా కోరుకుంటుందో.. తాము అదే విధంగా కోరుకుంటున్నామని అంటున్నారు.

18:50 - February 2, 2018

ఢిల్లీ : ఏపీకి చెందిన కేంద్రమంత్రులు.. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నాలుగు సంవత్సరాలుగా కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తేలేకపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు అన్యాయం జరిగిందంటే జనం నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన ఎద్దేవా చేశారు. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో టీడీపీ గేమ్ ప్లాన్ తప్ప మరోటి కాదని విజయ్‌సాయిరెడ్డి ఆరోపించారు. 

18:49 - February 2, 2018

గంటూరు : రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు ఏపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. కేంద్రం చేసిన అన్యాయంపై రాజీనామాకు సిద్ధమన్నారు. అయితే రేపు చంద్రబాబుతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని... ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పినట్లు కేంద్రం నడుచుకుంటుందన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందన్నారు.

18:45 - February 2, 2018

ఒక మనసు సినిమా తరువాత సోలో హీరోగా నాగశౌర్య కొంచెం గ్యాబ్ తీసుకుని ఇప్పుడు ఛలోతో మన ముందుకు వచ్చాడు. నాగశైర్యకు యుతులో మంచి క్రేజ్ ఉంది. ఇందులో శౌర్య సరసన కన్నడ నటి రష్మీక నటించింది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికొస్తే... చిన్నతం నుంచి గొడవలంటే విపరీతమైన ఇట్రెస్ట్ తో ఉంటాడు హరి. అతని గొడవల వీక్ నెస్ భరించరాని స్థితికి చేరడంతో అతన్ని డైవర్ట్ చేయడం కోసం నిత్యం గొడవలు జరిగే తిరుప్ పురమనే ప్రాంతానికి పంపిస్తాడు వాళ్ల నాన్న తిరుప్ పురం నిత్యం గొడవుల జరిగిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ స్ట్రిక్ట్ వల్ల ఇంటర్నల్ గా గొడవ పడుతుంటారు తెలుగు, తమిళ్ స్టూండెట్స్ అలాంటి కాలేజీలో జాయిన్ అయిన హరి ఏం చేస్తాడన్నది తెర పై చూడాల్సిందే...

18:24 - February 2, 2018

గుంటూరు : జిల్లా గొట్టిపాడులో ఎట్టకేలకు సీపీఎం, దళిత సంఘాల నేతలు పర్యటించారు. పర్యటించిన వారిలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, కృష్ణయ్య, దళిత నేతలు ఉన్నారు. వారు దళితులను పరామర్శించారు. దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుంటే ఛలో గుంటూరుకు పిలుపునిస్తామని మధు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

అనుమానంతో భార్యపై భర్త యాసిడ్ దాడి

నెల్లూరు : కసుమూరులో వివాహిత షబానాపై యాసిడ్ దాడి జరిగింది. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనుమానంతో భార్యపై భర్త కరీముల్లా యాసిడ్ దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన తమ్మినేని, కంచ ఐలయ్య

నల్గొండ : చిన్నకందూరులో దళితులతో కలిసి తమ్మినేని వీరభద్రం, కంచ ఐలయ్య సహపంక్తి భోజనం చేశారు.

 

18:16 - February 2, 2018

సిరిసిల్ల : డబ్బు కోసం తల్లీ.. బిడ్డలే తన్నుకుచస్తున్న ఈరోజుల్లో.. ఓ పేద మహిళ ఇల్లు ఇస్తామంటే...వద్దంది. తనకన్న పేదవారు ఉన్నారని.. వారికిస్తే బాగుంటుందని.. మంత్రి కేటీఆర్‌నే ఆశ్చర్యపరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా.. ముస్తాబాద్‌లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను .. అక్కడ ఓ పూరి గుడిసెలో నివశిస్తున్న షరీఫా అనే మహిళ కలిసింది. తన సమస్యలను, ఇబ్బందులను కేటీఆర్‌కు చెప్పుకుంది. దీంతో కేటీఆర్‌.. ఆమెకు డబుల్ బెడ్‌ రూమ్‌ ఇప్పిస్తానని అన్నారు. అయితే షరీఫా.. తనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. స్థలం వచ్చిందని అక్కడే గుడిసె వేసుకుని జీవిస్తున్నానని.. తనకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ వద్దని..సున్నితంగా తిరస్కరించింది. తన కన్న బీదవారు చాలామంది ఉన్నారని.. వారికిస్తే.. బాగుపడతారని అంది. దీంతో మంత్రి కేటీఆర్‌తో సహా అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. తన గుడిసెపైకి రేకులు ఇప్పిస్తే చాలని అనడంతో.. కేటీఆర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. రేకులు వేయిస్తానని.. మాట ఇచ్చారు.ధనదాహంతో కుంభకోణాలకు పాల్పడే.. కోటీశ్వరుల ముందు.. తనకున్నదాంతో.. తృప్తిగా బతికే.. షరీఫాలాంటి వారు ఉండడం.. సమాజంలోని మంచి, చెడులకు సూచికనే చెప్పుకోవాలి. 

18:15 - February 2, 2018

హైదరాబాద్ : బల్దియా బొక్కసం వెలవెలపోతోంది. ఖజానా ఒట్టిపోవడంతో అష్టకష్టాలు పడుతోంది. కనీస అవసరాలకు కూడా కాసులు లేకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. వచ్చే పన్నులు, అప్పులతో బండిలాగిస్తూ అతికష్టంమీద కాలం గడుపుతూ వస్తోంది. ఒకప్పుడు కాసులతో గలగల్లాడిన బల్దియా ఖజానా ఇప్పడు వెలవెలపోతోంది. పన్నుల వసూళ్లు మందగించాయి. మొత్తం 1400 కోట్ల రూపాయల ఆస్తి పన్నుకు గాను 868 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైంది. ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతులేదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు హారతి కర్పూరంలా హరించుకుపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రారంభించే కొత్త పథకాల అమలు భారాన్ని హెచ్‌ఎంసీపై మోపుతోంది. దీంతో బల్దియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు చెల్లించడం కూడా కష్టంకావొచ్చన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా నిలిచిపోయాయి
చాలాకాలంగా బల్దియా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ ఆర్థిక విభాగంలో 250 కోట్ల రూపాయల బిల్లులు పెడింగ్‌లో ఉన్నాయి. నాలాల విస్తరణ, పూడిక తీసే కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తామంటూ హెచరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో చేపట్టిన పనులకు కూడా ఇంతవరకు బిల్లులు చెల్లించపోవడంపై కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చలు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఈ ఆర్థిక కష్టాల నుంచి బల్దిలా ఎలా బయటపడుతుందో చూడాలి. 

18:14 - February 2, 2018

హైదరాబాద్ : ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం, అభిరుచులతో రకరకాల ఫొటోలు, స్టేట్‌మెంట్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సాధారణ విషయంగా మారిపోయింది. కానీ... ఇకపై అభ్యంతరకరమైన పోస్టింగ్‌లపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. అశ్లీలం, కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు, ఫొటోలు అప్‌లోడ్‌ చేసేవారిపైనా, వాటిని షేర్‌, లైక్‌లు చేసేవారిపైనా హైదరాబాద్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాల తీరు, సంఖ్య కూడా పెరిగిపోతోంది.... ఈ క్రమంలో నేరాలను అదుపుచేసేందుకు పోలీసులు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా స్నాప్‌డీల్‌లో కొనుగోలు చేసిన నిషేధిత మారణాయుధాల ఫొటోలు పేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన వారిని నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పాడిందే పాట అన్నచందంగా
సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆట.. పాడిందే పాట అన్నచందంగా ఇష్టమొచ్చిన పోస్టింగ్‌లు, ఫొటోలు అప్‌లోడ్‌ చేసేవారు. కానీ... ఇకమీదట అలాంటి వారి ఆటలు సాగవు. ఎందుకంటే పోలీసులు డేగ కళ్ళ నిఘా పెట్టారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.సోషల్‌ మీడియాలో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయిన యువత వేగానికి పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. కామెంట్, షేర్‌ లైక్‌ ఇలా ఏదైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి.. లేదంటే జైలుపాలు కావాల్సిందే.. అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

18:13 - February 2, 2018

సిద్దిపేట : జిల్లా కేంద్రం హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి చైన్‌ స్నాచింగ్‌ యత్నించారు. ఓ మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారం గొలుసు ఎత్తుకెళ్లడానికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి.. ఒకరిని పట్టుకుని చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

18:12 - February 2, 2018

యాదాద్రి : జిల్లా చిన్నకందుకూరులో దళితులపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల దాడికి నిరసరగా గ్రామంలో ప్రతిఘటన సభ నిర్వహిస్తున్న టీ మాస్ ఫోరం, బీఎల్‌ఎఫ్‌ నేతలపై యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కుమార్‌ జులుం ప్రదర్శించారు. ప్రతిఘటన సభకు అనుమతిలేదంటూ మైక్‌ కట్‌ చేసి దురుసుగా ప్రదర్శించారు. దుర్భాషలాడారు. సీఐ బెదిరింపులకు ఫోన్‌లో చిత్రీకరిస్తున్న నవతెలంగాణ రిపోర్టర్‌ రామకృష్ణపై దాడికి దిగారు. ఫోన్‌ లాక్కున్నారు. 

18:12 - February 2, 2018

సంగారెడ్డి : సింగూర్‌ జలాశయం నుండి మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. యాసంగికి కాలువ ద్వారా ఆయకట్టు చివరి ప్రాంతాల వివరాలను సంబంధిత శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ట్రయల్‌ రన్‌ అనంతరం తాగునీటిని ప్రతి ఇంటికి చేరేలా చేస్తామన్నారు.

18:11 - February 2, 2018

హైదరాబాద్ : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ మూవీ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో వరుణ్‌ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో... వరుణ్‌ లవర్‌ బ్యాయ్‌గా నటిస్తున్నాడు.ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

18:10 - February 2, 2018

తూర్పుగోదావరి : జిల్లా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ప్రజా సమస్యలపై పోరాటానికి ఎప్పుడు ముందు ఉంటారు. సమస్య ఏదైనా తనదిగా భావించి, పరిష్కారమయ్యే వరకు బాధితులకు బాసటగా నిలుస్తారు. గరగపర్రు దళితుల వెలివేత ఉద్యమమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అలాంటి హర్షకుమార్‌ ఇప్పుడు మరో ఉద్యమాన్ని ప్రకటించారు. దళితుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్యక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ అమలాపురం నుంచి అమరావతి వరకు పాదయాత్ర ప్రకటించారు. బాధితులకు బాసటగా నిలుస్తున్న తనను టీటీపీ ప్రభుత్వం 28 సార్లు గృహనిర్బంధంలో ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అకమ్ర కేసులు బనాయించి వేధిస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగానే పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించానని హర్షకుమార్‌ చెబుతున్నారు. హర్షకుమార్‌ ప్రకటించిన పాదయాత్ర ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2004, 2009 లో అమలాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన హర్షకుమార్‌... రాష్ట్ర విభన తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు.

టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర
2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని జై సమైన్యాంధ్ర పార్టీ తరుపున పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఏదో ఒక ప్రజా సమస్యపై పోరాడుతూనే ఉన్న హర్షకుమార్‌... ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర ప్రకటించడంలోని రాజకీయ ఆంతర్యం ఏంటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో సన్నిహితంగా మెలుగుతున్న హర్షకుమార్‌.. ఏ రాజకీయ వ్యూహంతో పాదయాత్ర ప్రకటించాలన్న అంశంపై రాజకీవర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం... హర్షకుమార్‌ ఆందోళనకు పర్మిషన్‌ ఇస్తుందా ? అన్న ప్రశ్న వస్తోంది. పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తే అండగా నిలవాలంటూ ఇప్పటికే ఎస్సీ కమిషన్‌ను కోరారు. 

18:09 - February 2, 2018

విశాఖ : నారా బ్రాహ్మణి సందడి చేశారు. మహిళా పారిశ్రామిక వేత్తల వర్క్‌ షాప్‌లో ఆమె పాల్గొన్నారు. లిస్టెడ్‌ కంపెనీలలో ఒక మహిళ ఉండాలని నిబంధన వల్ల మహిళలకు మేలు జరుగుతోందన్నారు. బోర్డ్‌ రూం కంట్రిబ్యూషన్‌ మన దేశంలో చాలా తక్కువగా ఉందని.. ఇతర దేశాల్లో చాలా ఎక్కువ ఉంటుందని నారా బ్రాహ్మణి అన్నారు.

18:08 - February 2, 2018

హైదరాబాద్ : తార్నాక హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌ పురుషోత్తం రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 11 చోట్ల నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా పురుషోత్తంరెడ్డి నెలరోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

18:07 - February 2, 2018

గుంటూరు : కేంద్ర బడ్జెట్‌పై ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే... ఎంపీలంతా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, జగన్‌లు రాష్ట్ర ప్రయోజనాలను మోదీకి తాకట్టు పెట్టడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఏపీకి తీరని అన్యాయం చేసిందంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింగ రావు అన్నారు. ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే బడ్జెట్‌లా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు కేటాయించకుండా.. 80వేల కోట్ల ప్రభుత్వ వాటాలు అమ్మాలని నిర్ణయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాసే విధంగా ఉందని.. మాజీ ఎంపీ మిడియం బాబూరావు వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగబోతున్న బీజేపీ రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులపై ఆర్ ఎస్ ఎస్ దాడిని నిరసిస్తూ బీఎల్ ఎఫ్, టీమాస్ ప్రతిఘటన సభ

నల్గొండ : దళితులపై ఆర్ ఎస్ ఎస్ దాడిని నిరసిస్తూ చిన్నకందుకూరులో బీఎల్ ఎఫ్, టీమాస్ ప్రతిఘటన సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్యప్రకాశ్, ఐలయ్య, జాన్ వెస్లీ హాజరయ్యారు. పోలీసులు దళితులను బెదిరించడం మానుకోవాలని బీఎల్ ఎఫ్, టీమాస్ నేతలు తమ్మినేని, కంచ ఐలయ్య హితవు పలికారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎవరిపక్షమో అర్థమవుతోందన్నారు.

 

17:27 - February 2, 2018

సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ హీరో హీరోయిన్స్ గా నీరజ్ పాండే దర్శకత్వంలో 'అయ్యారీ' అనే హిందీ సినిమా రూపొందింది. రకుల్ హిందీ మూవీ సెన్సార్ కి అడ్డంకులు కలిగాయి. ఈ సినిమాను జనవరి 26వ తేదీనే విడుదల చేయాలనుకున్నారు. కానీ 'పద్మావత్' రిలీజ్ కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మిలటరీ విభాగంలో తెర వెనుక జరిగే కొన్ని సంఘటనలు, ఆయుధాల ఒప్పందాలు, కుట్రలు మొదలైనవి ఈ సినిమాలో చూపించారట. దాంతో ఈ సినిమాను తాము చూసిన తరువాతనే సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేయాలని రక్షణ శాఖ సెన్సార్ అధికారులను కోరినట్టుగా వార్తలు వచ్చాయి. రక్షణ శాఖ అధికారులు ఈ సినిమాను ఎప్పుడు చూస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఈ కారణంగా విడుదల తేదీ విషయంలో అయోమయం ఏర్పడిందని అంటున్నారు. అయితే సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియకపోవడంతో, యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

17:04 - February 2, 2018

హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ లో రద్దైన నోట్ల కలకం రేగింది. పోలీసులు పాత నోట్ల మార్పిడి ముఠాను పట్టుకున్నారు. నింధితుల నుంచి రూ.99 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:00 - February 2, 2018

నాగార్జున .. నాని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుంది. నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చేనెల 24వ తేదీన సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, నాని డాక్టర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఎంపిక చేసిన కథానాయికల పేర్లను వెల్లడించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

16:56 - February 2, 2018

హీరో విజయ్ ఆంటోని 'రోషగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాధారణంగా తమిళంలో సినిమా పూర్తయిన తరువాత తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేసే ఆయన, ఈసారి తమిళంతోపాటు తెలుగులో తన తదుపరి సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశాడు. తన సినిమాకి ఆయన 'రోషగాడు' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఈ నెల 7వ తేదీన షూటింగ్ మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆయన విడుదల చేశాడు. ఈ సినిమాకి గణేశ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ అనే విషయం పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. విజయ్ ఆంటోని ఇంతకుముందు చేసిన సినిమాకి చిరంజీవి పాత్ర పేరైన 'ఇంద్రసేన' అనే టైటిల్ పెట్టాడు. ఇప్పుడేమో గతంలో చిరంజీవి చేసిన 'రోషగాడు' టైటిల్ ను ఫిక్స్ చేయడం గమనార్హం.

 

ఉప్పల్ లో రూ.99 లక్షల విలువైన పాతనోట్ల పట్టివేత

హైదరాబాద్ : ఉప్పల్ లో రూ.99 లక్షల విలువైన పాతనోట్లు పట్టుకున్నారు. ఉప్పల్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

 

తార్నాక హెచ్ ఎండీఏలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ : తార్నాక హెచ్ ఎండీఏలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ప్లానింగ్ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రూ.40 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు. 

16:27 - February 2, 2018

హైదరాబాద్ : వెస్ట్ జోన్ పరిధిలో డీసీపీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి శాంతి ర్యాలీ చేస్తున్నమని డీసీపీ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:24 - February 2, 2018

నెల్లూరు : జిల్లా లో భర్త భార్యపై యాసిడ్ దాడి చేశాడు. కరిముల్లా, షబానాల మధ్య గతకొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:23 - February 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఇప్పకటి దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాజస్థాన్ లో కాంగ్రెస్ రెండు లోక్ సభ స్థానాలు గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. 

తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖలో 1463 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్ : తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1463 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించింది. అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు 14 పోస్టులు 
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 42, వైద్య విధాన పరిషత్ మెడికల్ ఆఫీసర్ ఆండ్ లెక్చరర్స్ 183, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు 1224 పోస్టుల భర్తీ, డిపార్ట్ మెంట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాన ఎజెండాగా చర్చించనుంది. ఉద్యోగులకు ఒక నెల డీఏ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ లో చర్చ జరుగనుంది. 

16:16 - February 2, 2018

హైదరాబాద్ : దాదాపు 15 సంవత్సరాలుగా రాంకీ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని ప్రజలు ఎన్నో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రజల బాధలను పట్టించుకోకుండా పోరాటం చేస్తున్న ఎంతో మందిపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. జవహర్‌నగర్ కాలనీతో పాటు, బాలాజీ నగర్‌, రాజీవ్ గాంధీ నగర్, గబ్బిలా పేట, శాంతి నగర్, మల్కారం కాలనీ, కె.సి.ఆర్ కాలనీ, అరుణ్ జ్యోతి నగర్,పరానగర్, నందమూరి నగర్, కలుపుకొని సుమారు 2 లక్షల మంది జనాభా ఇక్కడ నివాసం ఉంటున్నారు. రాంకీ నిర్వహిస్తున్న చెత్త డంపింగ్ యార్డు కారణంగా తాము ఈ చుట్టు పక్కల జీవనం సాగించలేకపోతున్నామని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా..ప్రయోజనం శూన్యమని .. ఓట్ల కోసం వచ్చి హడావుడి చేసే పార్టీలు తప్ప.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని జవహర్‌నగర్ వాసులు దీనంగా వాపోతున్నారు.

రాంకీకి 361 ఎకరాల స్థలం
గ్రేటర్ పరిధిలోని చెత్తను తరలించేందుకు రాంకీకి 361 ఎకరాల స్థలంతో పాటు, 3 డంపింగ్ యార్డులను, కార్పొరేషన్ సొంత వాహనాలను రాంకీకి ధారాదత్తం చేసారు. ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ. 1431 రూపాయలు చెల్లించే విధంగా కుదుర్చుకున్న ఈ అగ్రిమెంట్ లో చెత్తను ఇంటి నుండి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు పంపించడానికి 40శాతం, ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ నుండి జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు కు తరలించేందుకు 20శాతం, తరలించిన చెత్తను ప్రాసెస్ చేయడానికి మిగిలిన 40శాతం డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందులో ప్రతి ఏటా 5శాతం పెంపు ఉంటుందనేది కాంట్రాక్టు నిబంధన. పై స్థాయిలో పలుకుబడితో దీనికి బల్దియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో 60శాతం చార్జీలు రాంకీకి చెల్లించాల్సి ఉంటుంది బల్దియా.

టన్నుకు రూ.572 రూపాయల చొప్పున
ఇప్పటివరకు టన్నుకు రూ.572 రూపాయల చొప్పున 4వేల టన్నులకు ప్రతి రోజు రూ.23లక్షలు ఖర్చుచేస్తున్న బల్దియా, ట్రాన్స్ పోర్టు కోసం టన్నుకు రూ.286రూపాయల చొప్పున ప్రతి రోజు రూ.12లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంటే రాంకీకి చెత్త తరలింపును అప్పగించడం వల్ల ఏడాదికి రూ.45కోట్లు అదనపు భారం బల్దియాపై పడుతుంది. జీహెచ్‌ఎంసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి పర్యావరణానికి హాని కలగకుండా చెత్త డంపింగ్ యార్డు నిర్వహణ చేపట్టాలి. రాంకీ సంస్ధ మాత్రం చెత్త రీసైకిలింగ్‌ విషయంలో శాస్త్రీయ పద్ధతులను అవలంభించకుండా.. ఉన్నతాధికారుల అండదండలతో నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. దీని కారణంగా జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డు పరిసర ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. రాంకీ సంస్ధ చెత్త డంపింగ్ యార్డు నిర్వహణకు గడువు మరో రెండేళ్లలో ముగిసిపోనున్నా..ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేస్తూ ప్రజల నివాసాల మధ్యలో రాంకీ సంస్థ పవర్ ప్లాంట్‌ను నిర్మించడానికి సెప్టెంబర్ 22, 2017 నాడు పవర్ ప్లాంట్ నిర్మించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. 

16:14 - February 2, 2018

హైదరాబాద్ : జీవించడం ప్రతీ పౌరుడి హక్కు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని హరించే అధికారం ఎవరికి లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారి జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే విధంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు పెట్టుబడిదారులకూ పారిశ్రామికవేత్తలకు ఇక్కడి వనరులను, సంపదలను, భూమిని అప్పనంగా అప్పగిస్తున్నారు. మానవ జాతి మనుగడనే శూన్యంలోకి నెడుతూ జీవించే హక్కును నిలువెల్లా కాలరాస్తున్నారు. ఒక ప్రయివేటు సంస్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అవును.. హైదరాబాద్‌ శివారు.. జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతపు దయనీయ స్థితి ఇది.ఇది నగరాన్ని అనుకుని ఉన్న జవహర్ నగరంలో ఉన్న డంపింగ్ యార్డు. గ్రేటర్ హైదారాబాద్ తో పాటు చుట్టు పక్కల నుంచి నిత్యం ఇక్కడకు 4వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తారు. ఇక్కడికి చేర్చిన చెత్త నుంచి తడి పొడి చెత్తను వేరు చేసి ఈ వ్యర్ధాల నుంచి రసాయ ఎరువులను సైతం తయారు చేస్తారు. ఈ యార్డు నిర్వాహణను హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ రాంకీ సంస్థకు అప్పగించింది.

2009లో ఒప్పందం..
2009లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతంలో చెత్త రీసైకిలింగ్ చేసేందుకు 25 ఏండ్ల పాటు రాంకీ ఎన్విరో సంస్థకు అనుమతులు ఇచ్చారు. దీని కోసం 361 ఎకరాల భూమిని కేటాయించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను యార్డుకు తీసుకువచ్చిన తర్వాత వ్యర్థాలను గ్రేడింగ్ చేసి ఒక వరస చెత్త మరో వరస మట్టి పోసి లేయర్‌లుగా చేయాలి. ఇలా చేస్తేనే కాలుష్యాన్ని నివారించవచ్చు. ఎరువులు తయారు చేయవచ్చు. కానీ రాంకీ సంస్థ తన లాభాపేక్షతో నిబంధనలకు నీళ్లొదిలింది. శాస్త్రీయ పద్ధతిలో చెత్తను రీసైకిల్ చేయాల్సి ఉండగా ఖర్చును తప్పించుకునేందుకు అవకతవకలకు పాల్పడుతోంది రాంకీ సంస్థ. అన్ని రకాల చెత్తను ఒకే చోట కలిపి డంప్ చేస్తుండటంతో అందులోని వ్యర్థాలలో రసాయన క్రియలు జరిగి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయి. చెత్తలోని రసాయనాలు భూమిలోకి ఇంకడంతో భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి. బోర్లలో నుండి వచ్చిన నీరు కూడా నురగతో కూడిన దుర్గంధాన్ని వెదజల్లుతోంది. మనిషి జీవనానికి కీలకమైన గాలి డంపింగ్ యార్డు నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం వరకు కలుషితం అయింది. ఇక్కడి గాలిలో ప్రమాదకర విషవాయులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ గాలి పీల్చడం వల్ల ఇక్కడకు సమీపంలో ఉన్న ప్రజలకు టీబీ, ఉబ్బసం , చర్మ వ్యాధులు.. మహిళలకు గర్భస్రావాలు కావడం నిత్యకృత్యమయ్యాయి. పుట్టే పిల్లలు అంగవికలురుగా పుడుతున్నారు.

గొలుసుకట్టు చెరువులు
ఈ డంపింగ్ యార్డు రాకముందు ఇక్కడి చెరువులు జలసిరితో, మత్స్య సంపదతో కళకళలాడేవి. రైతులు రెండు పంటలూ పండించుకునే వారు. కొండలతో నిండిన కీసర ప్రాంతం నుండి వాగులు వంకల ద్వారా వచ్చే నీటి ఆధారంగా గొలుసు కట్టు చెరువులు శతాబ్దాల క్రితమే నిర్మించారు. కీసరలో మొదలయ్యే గొలుసుకట్టు చెరువులు శామీర్ పేట, కాప్రా, ఘట్‌కేసర్, అల్వాల్ మండలాల పరిధిలో సాగు, తాగునీరందించేవి. చెత్త డంపింగ్ యార్డు రావడం వల్ల కాప్రా ప్రాంతం నుండి అల్వాల్ వరకూ పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారాయి. చెత్త నుండి వచ్చే ద్రవ వ్యర్ధాలతో చెరువులు పూర్తిగా పాడయ్యాయి. ఆయా చెరువుల్లో జీవజాలం మనుగడ సాగించడం లేదు. కనీసం గడ్డి కూడా మొలవని పరిస్థితి నెలకొందంటే కాలుష్య స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  జవహర్‌నగర్ వాసివర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చుట్టు పక్కల ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. చెత్త డంపింగ్ యార్డు కారణంగా భూగర్బంలో నీరు పూర్తిగా కలుషితం అవుతుంది. డంపింగ్ యార్డులో గుట్టలమీద చెత్త గుట్టలుగుట్టలుగా నిల్వచేయడంతో మరో వైపు వర్షపు నీటితో చుట్టు పక్కల సుమారు 20కిలో మీటర్ల ప్రాంతం భూగర్బం జలం పూర్తిగా విషతుల్యం.. బోర్లు, బావులలోని నీరు పూర్తి ఎరుపు, నలుపు రంగులో దర్శనం ఇస్తుంది. ఈనీరు తాగితే ప్రాణాంత వ్యాధుల బారిన పడాల్సిందే. 

విభజన హామీల అమలు కోసం పోరాటం చేశా : ఎంపీ కేవీపీ

ఢిల్లీ : పార్లమెంట్ లో ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ విభజన హామీల అమలు కోసం పోరాటం చేశానని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ తెలిపారు. ఎన్ డీఏ చిట్టచివరి బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. స్వార్థం కోసమే కొందరు ఏపీకి న్యాయం జరిగిందంటున్నారు. సీఎం స్వార్థం కోసమో లేక అవగాహనరాహిత్యమో ప్రత్యేక ప్యాకేజీకి బల్లలు చరిచారని పేర్కొన్నారు. 

 

 

16:06 - February 2, 2018

ముంబై : జైట్లీ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గ్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పై మదుపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ 840 నష్టంతో 35067పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10761 వద్ద ముగిసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

తుందుర్రులో ఉద్రిక్త

పశ్చిమగోదావరి : తుందుర్రులో ఉద్రిక్త నెలకొంది. తుందుర్రులో భారీగా పోలీసులు మోహరించారు. పంటపొలాల్లోంచి ఆక్వా పుడ్ పార్క్ ఫ్యాక్టరీకి 33/కేవీ విద్యుత్ లైన్ వేస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. మేయర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను నేలకేసి కొట్టి వైసీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ నిరసన తెలిపారు. 

సమ్మక్క, సారలమ్మ గద్డెను దర్శించుకున్న సీఎం కేసీఆర్

వరంగల్ : మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్డెను సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. మేడారంలో శాశ్వత ఏర్పాట్ల భూసేకరణ చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం తరపున రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం తెలిపారు. జంపన్నవాగులో స్నానాల కోసం డ్యాం నిర్మిస్తామని చెప్పారు. 

 

విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో రసాభాస

కృష్ణా : విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా సాగింది. బడ్జెట్ గురించి తెలియకపోతే తెలుసుకోవాలంటూ వైసీపీ కార్పొరేటర్లకు మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారు. మేయర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను నేలకేసి కొట్టి వైసీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ నిరసన తెలిపారు. విజయ్ ను సస్పెండ్ చేయాలని టీడీపీ కార్పొరేటర్ల నినాదాలు చేశారు. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. 

 

15:20 - February 2, 2018

కృష్ణా : జిల్లా విజయవాడ మన్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్ గురించి తెలియపోతే తెలుసుకోవాలని మేయర్ అనడంతో వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైసీపీ కార్పొరేటర్ పోడియం వద్దకు దూసుకురావడంతో సభలో గందరగోళ ఏర్పాడింది. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

కలుషిత ఆహారం తిని ఒకరు మృతి

గుంటూరు : తుళ్లూరు మండలం నెక్కళ్లులో విషాదం నెలకొంది. నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని ఒకరు మృతి చెందారు. మరో 20 మందికి అస్వస్థ కలిగింది. బాధితులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

15:15 - February 2, 2018

నల్లగొండ : నగర్ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న సీఐ అజ్ఞాతంలోకి వెళ్లారు. కానిస్టేబుల్ ద్వారా ఆయన పిస్టల్ సరెండర్ చేశారు. రాజకీయ ఒత్తిడితోనే అతను ఇలా చేశాడని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:10 - February 2, 2018
15:03 - February 2, 2018

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర బడ్జెట్ పై చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:57 - February 2, 2018
14:56 - February 2, 2018
14:24 - February 2, 2018
14:23 - February 2, 2018

గుంటూరు : కేంద్ర బడ్జెట్ లో ఏపీ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ అన్నారు. బీజేపీ సర్కార్ వివక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని ఆయన అన్నారు. 

14:20 - February 2, 2018
14:03 - February 2, 2018

ఇలా అయితే ప్రజల్లోకి ఎలా వెళ్తామన్న మంత్రులు

అమరావతి : చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. నిన్నటి కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి సహా మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల్లోకి ఎలా వెళ్తామని మంత్రులు అంటున్నారు. హామీలన్నీ నెరవేర్చామన్న భావనలో బీజేపీ వాళ్లు ఉన్నారని, నిన్నటి అమిత్‌షా సమావేశంలోను ఇదే వ్యక్తమయిందని చెప్తున్నారు.

13:30 - February 2, 2018

యాదాద్రి : యాదగిరిగుట్ట సీఐ అశోక్ కుమార్ జులుం ప్రదర్శించారు. బీఎల్ఎఫ్..టీమాస్ నేతలపై దురుసుగా ప్రవర్తించారు. చిన్నకందుకూరు టీ మాస్..బీఎల్ఎఫ్ సభకు అనుమతి లేదంటూ సీఐ మైక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ చర్యలను నేతలు ఖండించారు. సీఐ దురుసు ప్రవర్తనను నవతెలంగాణ రిపోర్టర్ పై కూడా సీఐ జులుం ప్రదర్శించారు. దీనిపై నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సీఐని మందలించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు వెనక్కి తగ్గడంతో సభ ప్రశాంతంగా జరుగుతోంది.

జనవరి 14 వ తేదీన ఆర్ఎస్ ఎస్ కు చెందిన కొంతమంది దళిత కుటుంబాలపై దాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఎల్ఎఫ్, టీ మాస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రతిఘటన సభ ఏర్పాటు చేసి..దళితులకు మద్దతు తెలియచేయాలని...బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ మాస్..బీఎల్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. 

13:24 - February 2, 2018
13:21 - February 2, 2018

విజయవాడ : ఏపీ టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో టిడిపి సమన్వయ కమిటీ భేటీ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్..బిజెపి మిత్రధర్మం..ఇతరత్రా విషయాలపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. నిన్నటి బడ్జెట్ దారుణంగా ఉందని, ఏపీ పట్ల చిన్న చూపు చూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబంరాలు కూడా జరుపుకోలేని పరిస్థితి ఉందని మంత్రులు సీఎం బాబు దృష్టికి తీసుకొచ్చారు. హామీలన్నీ నెరవేర్చామనే భావనలో బిజెపి వాళ్లున్నారని పేర్కొన్నారు. పరిపాలన బాగా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరని, ఇందుకు ఇందుకు రాజస్థాన్ ఉప ఎన్నికలే కారణమని బాబు పేర్కొన్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని బాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పక్షాన నిలుస్తా..అని కేసీఆర్ అన్నారని...ఏపీలో జగన్ తో ఒప్పందం చేసుకున్నారని,రెండు రాష్ట్రాల్లో టిడిపిని దెబ్బతీసేందుకు ప్రణాళికలు వేశారని సభ్యులు ఎదుట బాబు వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి.

12:47 - February 2, 2018

నల్గొండ : జిల్లాలో ఇటీవల జరిగిన వరుస హత్యలు హఢలెత్తిస్తున్నాయి. ఇందులో రాజకీయ కోణం దాగి ఉందని ప్రజాప్రతినిధులు ఆరోపణలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇన్స్ పెక్టర్ అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపుతోతంది. వరుస హత్యల నేపథ్యంలో పని ఒత్తిడి జరగడం వల్లే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. నల్గొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆయన కనిపించకుండా పోవడం ఆ శాఖలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసు శాఖ ఇచ్చిన సిమ్ ను మడుగపల్లి పోలీసు స్టేషన్ లో సరెండర్ చేశారు.

పని ఒత్తిడి తట్టుకోలేక, ఉన్నతాధికారుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు అజ్ఞాత విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

12:42 - February 2, 2018

సీబీఐ కోర్టుకు హాజరైన జగన్

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. జగన్ తోపాటు సబితా ఇంద్రారెడ్డి కోర్టులో హాజరయ్యారు. 78 వ రోజు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. 

 

12:25 - February 2, 2018

విజయవాడ : బిజెపితో పొత్తును సీఎం చంద్రబాబు నాయుడు విరమించుకుంటారా ? బిజెపితో కటీఫ్ చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ రాష్ట్రంలో చిచ్చు రేపింది. ఏపీ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఇక మిత్రధర్మం పాటించాల్సినవసరం లేదని...బిజెపితో పొత్తు వదులుకోవాలని పార్టీ నేతలు బాబుపై వత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో బాబు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన కృషి..సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకొన్నాననే దానిపై బాబు సభ్యులకు వివరించినట్లు సమాచారం. తాను మాత్రం ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని జరగాలని చూసినట్లు తెలిపారు. పరిపాలన బాగా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరని, ఇందుకు ఇందుకు రాజస్థాన్ ఉప ఎన్నికలే కారణమని బాబు పేర్కొన్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని బాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పక్షాన నిలుస్తా..అని కేసీఆర్ అన్నారని...ఏపీలో జగన్ తో ఒప్పందం చేసుకున్నారని,రెండు రాష్ట్రాల్లో టిడిపిని దెబ్బతీసేందుకు ప్రణాళికలు వేశారని సభ్యులు ఎదుట బాబు వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బీజేపీతో పొత్తుపై ఎంపీ టీజీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ : బీజేపీతో పొత్తుపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదా అడిగితే ప్యాకేజీ ఇస్తామన్నారని..మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మళ్లీ హోదా అడుగుతామని అన్నారు. చంద్రబాబును ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని తెలిపారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది అందుకే ఎవర్నీ లెక్క చేయడం లేదన్నారు. 

 

అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

అమరావతి : టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాన చర్చ జరిగింది. 

12:18 - February 2, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టిడిపి ఎంపీ టి.జి.వెంకటేష్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏపీని ముంచాయని, విభజన సమయంలో పలు హామీలు గుప్పించారని గుర్తు చేశారు. నాలుగేళ్ల సమయంలో కొన్ని సాధించుకున్నామని..ఇంకా సాధించుకోవాల్సి ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు తమకు చెయ్యి చూపుతున్నారని...తాము కూడా చెయ్యి చూపించే పరిస్థితి ఏర్పడిందన్నారు. టిడిపి కమాండర్ చంద్రబాబు నాయుడు తీసుకొనే నిర్ణయాలపై ఆధార పడి ఉంటుందని, బిజెపితో యుద్ధం చేయడం ఆషామాషి కాదని...చక్రం తిప్ప గల బాబును తక్కువగా అంచనా వేయవద్దన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

విభజన సమయంలో ముఖ్య నేతలందరినీ కలిశా : సీఎం చంద్రబాబు

అమరావతి : విభజన సమయంలో ముఖ్య నేతలందరినీ కలిశానని తనతో చర్చించారే తప్ప బహిరంగంగా పని చేయలేదని సీఎం చంద్రబాబు అన్నారు. మోదుగుల, నామా లాంటి వారిపై దాడులకు తెగబడ్డారని తెలిపారు. పెద్దమ్మనే కాదు చిన్నమ్మనూ గుర్తుంచుకోవాలి అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చర్చించలేదని పేర్కొన్నారు. రాజ్యసభలో హోదా కోసం వెంకయ్య పట్టుబట్టి వదిలేశారని చెప్పారు. అనాడు టీడీపీ ఎంపీల నిరసనను పట్టించుకోలేదన్నారు. 

 

12:15 - February 2, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ లోని ఓ ఇంటి భవనంపై చిన్నారి తల దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అసలు పాప ఎవరు ? ఎవరు చంపేశారు ? పాప మృతదేహం ఇంకా ఎక్కడుంది ? అనే మిస్టరీ వీడడం లేదు. రాజశేఖర్ ఇంటిపై ఈ ఘటన చోటు చేసుకుందనే సంగతి తెలిసిందే. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మిస్టరీని చేధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలి ఇచ్చారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న మెకానిక్ నరహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:08 - February 2, 2018

అన్యాయంగా రాష్ట్ర విభజన : సీఎం చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. విభజనప్పుడు కేసీఆర్ స్పష్టంగా అభిప్రాయం చెప్పారని..తాను మాత్రం రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరానని తెలిపారు. జగన్ స్పష్టమైన వైఖరి చెప్పకుండా తప్పించుకున్నారని పేర్కొన్నారు. 

12:04 - February 2, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2018-19 ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేంద్రం..పలు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపడం పట్ల ప్రజాప్రతినిదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడంపై టిడిపి సీఎం చంద్రబాబు, మంత్రులు అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, కేంద్రంపై దశలవారీగా యుద్ధాన్ని ప్రకటిస్తామన్నారు. టిడిపి కమాండ్ చంద్రబాబు యుద్ధ దశలను వెల్లడిస్తారని తెలిపారు. ఆదివారం నాడు జరిగే మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. 

11:56 - February 2, 2018
11:55 - February 2, 2018

వరంగల్ : మేడారం జాతర దేశ వ్యాప్తంగా గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మేడారంలోని సమ్మక్క..సారలమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, ఇతరులున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. గతంలో తాను సాధారణ పౌరుడిగా ఇక్కడకు వచ్చి వన దేవతలను దర్శించుకోవడం జరిగిందని..అప్పటికీ..ఇప్పటికీ ఎంతో మార్పు జరిగిందన్నారు. జాతరకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు బాగున్నాయన్నారు. మేడారం జాతరకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడకు రావడం వల్ల దేశం యొక్క దృష్టి పడుతందని తెలిపారు. ఆదివాసీ, గిరిజన కుంభమేళాగా పేర్కొన్నవచ్చునని, తమ సంప్రదాయ దుస్తులతో జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. జాతర..పండుగలు..అన్నా సంతోషాలు అందరితో పంచుకోవడం..పూర్వీకులను గుర్తు పెట్టుకోవడం జరుగుతుందన్నారు. వనదేవతలు చూపించిన మార్గంలో నడవాల్సి ఉందని వెంకయ్య పేర్కొన్నారు. 

కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : మరికాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై పార్టీ నేతలు, మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు.  

11:47 - February 2, 2018

వరంగల్ : మేడారం జాతర కొనసాగుతోంది. జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్నవాగు వద్ద జనాలతో కిటకిటలాడుతోంది. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం జాతరలో పరిస్థితులు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా శివసత్తులతో మాట్లాడింది. మేడారం జాతరకు తాము కొన్ని ఏళ్లుగా వస్తున్నామని, కోర్కెలు తీరాలని మొక్కుకుంటామని పేర్కొన్నారు.

మూడు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు భారీగా తరలివస్తుండడంతో అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జాతరకు వీఐపీలు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

11:42 - February 2, 2018
11:41 - February 2, 2018

హైదరాబాద్ : ‘తాము ఏదో కష్టపడి..కూడబెట్టుకున్న సొమ్ముతో తమ బిడ్డను చదివించుకున్నాం...కానీ స్కూల్ యాజమాన్యం చేసిన నిర్వాకంతో తమ బిడ్డను కోల్పోయాం.....స్కూల్స్ చేస్తున్న ఆగడాలు ఎన్నో..ఫీజులు కట్టలేదని ఎంతో వేధిస్తున్నరు...ఏమీ చేయాలే ? ఏం చేస్తే నా బిడ్డ వస్తుంది' ? అంటూ సాయిదీప్తి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మల్కాజ్ గిరిలోని జెఎల్ఎన్ఎస్ నగర్ లో ఉన్న జ్యోతి మోడల్ స్కూల్ లో సాయి దీప్తి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి చదువుతున్న సాయిదీప్తిని స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించింది. తీవ్ర మనస్థాపానికి గురైన సాయి దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై బాలల సంఘం..విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. యాజమాన్యంపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఉప్పల్ చిలుకానగర్ లో క్షుద్రపూజలు కలకలం

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి.  రాజశేఖర్ భవనంపై నిన్న చిన్నారి తల దొరికింది. ఇంటి సమీపంలోనే నరహరి ఇంట్లో క్షుద్ర పూజలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలి ఇచ్చారని స్థానికులు అంటున్నారు. మెకానిక్ నరహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాప మొండెం ఇంకా దొరకలేదు. 

11:35 - February 2, 2018

యాదాద్రి : యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరులో దళితులపై ఆర్ఎస్ఎస్ దాడిని బీఎల్ఎఫ్, టీ మాస్ తీవ్రంగా ఖండించింది. దాడిని నిరసిస్తూ నేడు బీఎల్ఎఫ్..టీ మాస్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రం నుండి 50 కార్లలో బీఎల్ఎఫ్, టీ మాస్ ర్యాలీ చేపడుతోంది. ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ మాస్ ఛైర్మన్ కంచ ఐలయ్య, బీఎల్ ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ పలువురు నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా టీమాస్ నేత జాన్ వెస్లీ 10టివి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో సమ్మక్క..సారలమ్మ గద్దెను దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

వరంగల్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చందూలాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మేడారం చేరుకున్నారు. కాసేపట్లో సమ్మక్క..సారలమ్మ గద్దెను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకోనున్నారు. 

 

11:29 - February 2, 2018

విజయవాడ : టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో టిడిపి సమన్వయ కమిటీ భేటీ కానుంది. తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చ జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రులు...పార్టీ నేతలు హాజరు కానున్నారు. బిజెపితో పొత్తు కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

2018-19 సంవత్సరానికి లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం తీరుపై మంత్రులు..ప్రజాప్రతినిధులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిర్ణయాలు తీసుకొనేందుకు టిడిపి సమన్వయ భేటీ కానుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటుందో వేచి చూడాల్సిందే. 

09:12 - February 2, 2018

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని ఓ స్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు..విద్యార్థుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం తీరు వల్లే ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్ గిరిలోని జెఎల్ఎన్ఎస్ నగర్ లో ఉన్న జ్యోతి మోడల్ స్కూల్ లో సాయి దీప్తి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి చదువుతున్న సాయిదీప్తిని స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించింది. తీవ్ర మనస్థాపానికి గురైన సాయి దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణం తట్టుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బాలల సంఘం..విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. యాజమాన్యంపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం బాలల హక్కుల సంఘం..విద్యార్థుల సంఘాలు..తల్లిదండ్రులు మల్కాజ్ గిరి పీఎస్ కు చేరుకోనున్నారు. 

09:04 - February 2, 2018
09:02 - February 2, 2018

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగంగా నడపడం...నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏలూరులో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఏపీ 05జెడ్ 5060 నెంబర్ గల ఆర్టీసీ బస్సు అమలాపురం నుండి హైదరాబాద్ బస్సు వెళుతోంది. వట్లూరు వద్ద రాగానే బస్సు బోల్తా పడింది. వేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం. బస్సులో ఉన్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఆర్టీసీ బస్సు బోల్తా...

పశ్చిమగోదావరి : ఏలూరు సమీపంలోని వట్లూరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అమలాపురం నుండి హైదరాబాద్ బస్సు వెళుతోంది. వేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

4లక్షల బంగారు ఆభరణాల అపహరణ...

మేడ్చల్ : జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని సుమా రెసిడెన్సీ కాలనీలో చోరీ జరిగింది. రూ. 4లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

08:58 - February 2, 2018

మేడ్చల్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సుమా రెసిడెన్సీ కాలనీలో ఉన్న ఓ ఇంటికి తాళం వేసింది. శుక్రవారం తెల్లవారుజామున దొంగలు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రూ. 4లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. చోరీ జరగిన ప్రదేశంలో ఆధరాలు సేకరించే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఢిల్లీలో అగ్నిప్రమాదం...

ఢిల్లీ : దేశ రాజధానిలోని పీరగర్హి ప్రాంతంలోని ఓ షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 20 ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి ఒకరికి గాయాలయ్యాయి. 

మహారాష్ట్రలో భూ ప్రకంపనాలు...

మహారాష్ట్ర : రాష్ట్రంలోని సతారా జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 3.4 గా నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అమృతసారధి పిటిషన్ పై విచారణ...

చెన్నై: నేడు అమృతసారధి పిటిషన్ పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగనుంది. తాను జయలలిత కూతురినో కాదో తేల్చాలంటూ అమృతసారధి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

07:38 - February 2, 2018

కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందంటున్నారు అన్ని పక్షాల నేతలు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో కొంతమేర అయినా న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రభుత్వాలకు నిరాశే ఎదురైంది. అయితే.. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి ఇచ్చింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో వీరయ్య (విశ్లేషకులు), నరేష్ (బిజెపి) పాల్గొని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:47 - February 2, 2018

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. కౌలు రైతులకు వ్యవసాయ రుణాల్ని పెంచుతాం. వ్యవసాయాభివృద్ధి మా ముఖ్యమైన ధ్యేయం. ఇది బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ.. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన మాటలు. మరి నిజంగానే వ్యవసాయానికి ఆ బడ్జెట్‌ కేటాయింపులు చేశారా.. ఆచరణలో కేంద్రం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందా.. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి సాగర్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:46 - February 2, 2018

ఢిల్లీ : డర్బన్‌ వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. కోహ్లీసేన సఫారీ జట్టుకు చుక్కులు చూపించింది. 6వికెట్లతేడాతో ఆతిథ్యజట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. మొత్తం ఐదువన్డేల సిరీస్‌లో 1-0తో టీమ్‌ఇండియా ముందంజవేసింది. విరాట్‌ ఆర్మీ మరోసారి దుమ్మురేపింది. కోహ్లీసేన దూకుడు ముందు డూప్లెసిస్‌ బ్యాచ్‌ విలవిల్లాడింది. 270 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఈజీగా ఛేదించింది. భారత్‌ విజయంలో విరాట్‌ మరోసారి కీలకంగా మారాడు. మొత్తం 119 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 10ఫోర్లతో 112 రన్స్‌ సాధించాడు. అటు రహానే 86 బంతుల్లో 5ఫోర్లు, 2భారీ సిక్స్‌లతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 79 పరుగులు సాధించిన రహానే కెప్టెన్‌ కోహ్లీకి సరిజోడు అనిపించుకున్నాడు.

కోహ్లిసేన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ20 పరుగులు, శిఖర్‌ ధవన్‌ 35 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సారధి కోహ్లి రహనేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రహనే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహనే 79 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఫెలూక్వాయో వేసిన బంతికి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అల్‌రౌండర్‌ హార్దిక్‌​పాండ్యా కోహ్లితో కలిశాడు. సారథి విరాట్‌ తన అద్బుతమైన ఆటతీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. 45 ఓవర్లో ఫెలూక్వాయో వేసిన మూడో బంతికి రబడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 112 పరుగులు చేసిన కోహ్లి తన కెరీర్‌లో 33వ సెంచరీని సాధించాడు.
అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీకాక్‌, హషీమ్‌ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఆమ్లా16 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. బూమ్రా బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-డు ప్లెసిస్‌లు కొనసాగించారు. జట్టు స్కోరు 83 వద్ద 34 పరుగులు డీకాక్‌ రెండో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌ కు వచ్చిన మర్‌క్రామ్‌, డుమినీ, మిల్లర్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఇదే సమయంలో క్రిస్‌ మోరిస్‌-డు ప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. ఈ ఇద్దరూ 74 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా జట్టు సఫారీలు రెండొందల మార్కును చేరింది. మోరీస్‌ 37 పరుగులు చేసి అవుటవ్వగా టెయిలెండర్ ఫెలూక్వాయో27 పరుగులు చేశాడు. కాగా.. సఫారీల ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఒంటిచేత్తో నడిపించాడు. 112 బంతుల్లో 120 పరుగుల చేసిన డూప్లెసిస్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 269 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్‌లకు తలో వికెట్‌ దక్కింది. అటు దక్షిణాఫ్రికా బౌలర్లలో బౌలర్లలో ఫెలూక్వాయో రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్‌ ఒక వికెట్‌ దక్కాయి. ధోని విన్నింగ్‌ షాట్‌ తో భారత్‌ విజయాన్ని సాధించింది. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది.దీంతో 5 వన్డేల సిరీస్‌లో విరాట్‌ ఆర్మీ 1-0తో ముందజ వేసింది. 

విజయవాడ కౌన్సిల్ బడ్జెట్...

విజయవాడ :  నగరపాలక సంస్థలో 2018-2019 కౌన్సిల్‌ బడ్జెట్‌ ఇవాళ ప్రవేశపెట్టనున్నారు. నగర అభివృద్ధి, నిధుల విడుదల, ఖర్చులు, ప్రజా సమస్యల పరిష్కారంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.  

06:39 - February 2, 2018

హైదరాబాద్ : సాధారణంగా బడ్జెట్‌ అనగానే అందరి చూపు ధరలపైనే... ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి? ఏ వస్తువుల ధరలు పెరగుతున్నాయన్న ఆసక్తి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఇపుడు మరింత ప్రియం కానున్నాయి. మొబైల్‌ ఫోన్లు, టీవీలు తదితర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. బడ్జెట్‌లో రైతులు, యువతకు వరాల జల్లు కురిపించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మధ్యతరగతి వర్గాలకు మాత్రం షాకిచ్చారు. ప్రస్తుతం కొన్ని వస్తువులపై జిఎస్‌టి అమలవుతున్నప్పటికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం కేంద్రం కస్టం సుంకాన్ని విధిస్తోంది.

మేక్‌ ఇన్‌ ఇండియాకు ప్రాధాన్యతనిచ్చిన కేంద్రం... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగానే వడ్డించింది. కస్టం సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీంతో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు, లగ్జరీ కార్లు, మోటార్‌బైక్‌లు, టీవీలు, స్మార్ట్‌ వాచీలు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ పరికరాలు తదితర వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఆపిల్‌, సామ్‌సంగ్ లాంటి విదేశీ కంపెనీల స్మార్ట్‌ ఫోన్ల ధరలు భారీగా పెరుగుతాయి.

విదేశాల నుంచి తెప్పించుకునే లగ్జరీ కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 5 శాతం కస్టం విధించడంతో ఈ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. వజ్రాలు, ఆభరణాలు, జ్యూస్, ట్రక్కులు-బస్సుల రేడియల్ టైర్లు, ల్యాంపులు, సిల్కు దుస్తులు, చెప్పులు, టూత్‌పేస్టులు మొబైల్‌ ఫోన్ల పరికరాలు ధరలు మండనున్నాయి. బ్యూటీ మేకప్‌ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్‌లు, డియెడెరెండ్లు, షేవింగ్‌ ఉత్పత్తులు, సన్‌ గ్లాసెస్‌, పాన్‌ మసాలా, బీడీ, సిగరెట్‌ లైటర్లు, క్యాండిల్స్, వీడియో గేమ్స్‌, పిల్లల ఆటవస్తువుల ధరలు పెరగనున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా ఆకాశ్శనంటనున్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని ఎంత తగ్గించిందో అంతమేర సెస్సు రూపంలో వడ్డించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గినపుడు కూడా ప్రభుత్వం వీటి ధరలు తగ్గించకపోవడం గమనార్హం. కాజు, సిల్వర్‌ ఫాయిల్, పిఓసి యంత్రాలు, ఫింగర్‌ స్కానర్, దేశీయ వజ్రాలు, సౌర విద్యుత్‌ బాటరీల ధరలు కాస్త తగ్గనున్నాయి. మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడనుంది. విదేశాల్లో తయారు చేస్తున్న సెల్‌ఫోన్స్, టీవీలను ఇక్కడే తయారు చేయడం వల్ల.. ఇక్కడి యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉందనే కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

06:33 - February 2, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై టిడిపి సర్కార్ సీరియస్ అయ్యింది. ముంబై..బెంగుళూరుకు నిధులు కేటాయించి ఏపీ రాజధాని అమరావతికి ఎందుకు నిధులు కేటాయించలేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ పై ఆయనతో టెన్ టివి మాట్లాడింది. బడ్జెట్ లో ఏపీ పేరు లేక పోవడం బాధాకరమన్నారు. మంత్రులు..ఎమ్మెల్యేలతో మూడు రోజుల పాటు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ప్రొఫెసర్ బాబులు అరెస్టు...

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ JNTUలో విద్యార్ధినులను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రొఫెసర్ బాబులును పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 24, 25 తేదీలలో జరిగిన ఇంజనీరింగ్ పీజీ వైవా పరీక్షల్లో 20 మంది విద్యార్ధినుల పట్ల బాబులు అనుచితంగా ప్రవర్తించినట్లు విద్యార్ధినులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌లకు ఫిర్యాదు చేశారు. 

జీఎస్టీ సినిమా బ్యాన్..?

హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ సినిమా జీఎస్టీ సినిమా ఇండియాలో బ్యాన్‌ చేయాలని సైబర్ క్రైం పోలీసులు వీన్యూ వెబ్‌ సైట్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన వెబ్ సైట్ నిర్వాహకులు సినిమాను సైట్‌ నుంచి తొలగించినట్లు సైబర్ క్రైం అడిషనల్ డీసీపీ రఘువీర్ చెప్పారు. 

భారత్ విజయం...

ఢిల్లీ : డర్బన్ వన్డేలో సౌతాఫ్రికా జట్టుపై భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేయగా భారత్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 270 పరుగులు చేసింది. 

మేడారానికి సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్ మేడారానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టు నుండి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారానికి చేరుకొని మధ్యాహ్నం 1.25 గంటలకు సమ్మక్క - సారలమ్మను దర్శించుకోనున్నారు. 2.20 గంటలకు పోలీసు క్యాంపు ఆఫీసును కేసీఆర్ ప్రారంభించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉప రాష్ట్రపతి పర్యటన...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి మూడు రోజుల పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమ్మక్క - సారలమ్మను వెంకయ్య దర్శించుకోనున్నారు. 

ఏపీలో నేటి నుండి నంది నాటకోత్సవాలు..

విజయవాడ : ఏపీలో నేటి నుండి నంది నాటకోత్సవాలు జరుగనున్నాయి. తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలు వేదికగా ఉత్సవాలు జరుగనున్నాయి. 12వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 

Don't Miss