Activities calendar

03 February 2018

22:17 - February 3, 2018

నల్గొండ : శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు తిరిగివచ్చి విధుల్లో చేరారు. నిన్నటి నుంచి ఆయన అదృశ్యమయ్యాడని కలకలం చెలరేగింది. గత కొన్ని రోజులుగా నిద్రలేమితో ఉండటం వల్ల విశ్రాంతి కోసమే వెళ్లినట్లు తెలిపారు. అందువల్లే ప్రభుత్వం ఇచ్చిన సిమ్, రివాల్వర్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు చెప్పారు. తనపై ఎలాంటి రాజకీయ, అధికారుల ఒత్తిళ్లు లేవని పేర్కొన్నారు. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన సీఐని పోలీసులు... గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో కనుగొన్నారు. మధ్యాహ్నం అతన్ని బాపట్ల నుంచి నల్గొండ తీసుకొచ్చారు. జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం.. సీఐ విధుల్లో చేరారు.

 

22:14 - February 3, 2018

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ.. ఈ నెల 8న రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదానికీ బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగే చర్యలేవీ బడ్జెట్‌లో తీసుకోలేదన్నారు. 8వ తేదీన తలపెట్టిన బంద్‌కు  వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని మధు కోరారు. 
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం..
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం.. విభజన చట్టంలోని హామీలన్నీ తూచ్‌.. కేంద్రం తీరుపై కామ్రెడ్ల కన్నెర్ర...ఈ నెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపు.... కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 8వ తేదీన రాష్ట్రబంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమరావతిలోని కాట్రగడ్డ శ్రీనివాసరావుభవన్‌లో లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌ అధ్యక్షతన వామపక్ష నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌, అనంతర తాజా పరిణామాల్ని నేతలు సమీక్షించారు. మన రాష్ట్రానికి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, లోటుబడ్జెట్‌ భర్తీగానీ, రైల్వేజోన్‌, కడపకు ఉక్కు పరిశ్రమ, రాజధానికి నిధులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేటాయింపులు గానీ చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగే చర్యలేవీ బడ్జెట్‌లో తీసుకోలేదన్నారు. ఇది అన్నివర్గాల ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం రాయితీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఈ నెల 8న నిర్వహించే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని మధు విజ్ఞప్తి చేశారు. 
వామపక్షాల బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు 
అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌లో కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌,.. పవన్‌కల్యాణ్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 8వ తేదీన వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్‌ సైతం మద్దతు తెలిపింది. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక సంఘాలు 8వ తేదీ తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని లెఫ్ట్‌పార్టీలు కోరుతున్నాయి. వామపక్షాల ఉద్యమంతోనైనా కేంద్రం దిగివచ్చి.. ఏపీకి నిధులు కేటాయిస్తుందో చూడాలి. 

22:10 - February 3, 2018

గుంటూరు : అమరావతి మెడికల్ హబ్‌గా మారుస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి.. గుంటూరులో ఒమేగా ఆసుపత్రిని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అమరావతి అంతర్జాతీయంగా మెడికల్ హబ్ అవుతుందని బాబు తెలిపారు. అమరావతికి 14 మెడికల్ కాలేజీలు, 14 ఆసుపత్రులు వచ్చే అవకాశముందన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ టూరిజంకు అమరావతి కేరాఫ్‌ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

22:07 - February 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌ శాఖలో కొలువుల జాతర మొదలైంది. పోలీస్‌ ఉద్యోగాల నియామకాలకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 14 వేల 177 పోలీస్‌ పోస్ట్‌లకు రిక్రూట్‌మెంట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్  బోర్డు.. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 
14,177 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. మరోసారి పోలీస్‌శాఖలో భారీఎత్తున రిక్రూట్‌మెంట్‌  చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను నియమించుకునేందుకు  తెలంగాణ సర్కార్‌ ... ఆమోదం తెలిపింది. ఈ మేరకు పోలీస్‌ శాఖ 14 వేల 177 ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది. 
ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 
పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతస్థాయి పోస్ట్‌ల నుంచి..కిందిస్థాయి వరకూ.. ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పడనుంది. ఈ మేరకు 710 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌లు, 275 సబ్ ఇన్ స్పెక్టర్ ఆర్ముడ్ రిజర్వ్‌ పోస్ట్‌లు, ఐదు సబ్ ఇన్ స్పెక్టర్ సీపీఎల్ పోస్ట్‌లు, 191 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీఎస్‌ఎస్‌పీ పోస్ట్‌లు, 29 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కమ్యూనికేషన్స్‌ పోస్ట్‌లు భర్తీ కానున్నాయి. అలాగే 26 అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్  ఫింగర్‌ప్రింట్ బ్యూరో పోస్ట్‌లు, 5 వేల 2 పోలీస్‌ కానిస్టేబుల్స్‌ పోస్టులు,  రెండు వేల 283 పోలీస్‌ కానిస్టేబుల్స్ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోస్ట్‌లు, 53 పోలీస్‌ కానిస్టేబుల్స్‌ సీపీఎల్‌ పోస్ట్‌లు, 5 వేల 372 పోలీస్‌ కానిస్టేబుల్స్ టీఎస్‌ఎస్‌పీ పోస్ట్‌లు, 89 పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ పోస్ట్‌లు, 142 కమ్యూనికేషన్స్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. త్వరలోనే తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించనుంది. 

22:05 - February 3, 2018

నల్లగొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో కాల్‌ డేటా కీలకంగా మారింది. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేముల బ్రదర్స్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. హత్యకు ముందు తర్వాత నిందితులతో వేముల సుధీర్‌, రంజిత్‌ సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌ హత్యకేసులో ఏ-1 నిందితుడు చింతకుంట్ల రాంబాబు.. వేముల రంజిత్‌, సుధీర్‌కు అనేక ఫోన్‌ కాల్స్‌ చేసినట్లుగా కాల్‌డేటాలో తేలింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

22:02 - February 3, 2018

రాష్ట్ర అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలు అభివృద్ధి కాకుండా రాష్ట్రం అభివృద్ధి ఎలా అవుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే స్పష్టమైన విధానం ఉండాలని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి అంటే ప్రజల బతుకులు మారాలన్నారు. గతం కంటే మెరుగైన జీవనాన్ని గడపాలని, విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాల్లో సమాన అవకాశాలు రావాలన్నారు. ప్రత్నామ్నాయ విధానం అభివృద్ధి కావాలన్నారు. అందుకు బీఎల్ ఎఫ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల్లో చైతన్యం, బహుజనులకు రాజ్యాధికారం సాధించాలనేదే బీఎల్ ఎఫ్ లక్ష్యమన్నారు. 2019లో దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలకు వ్యతిరేక గాలి ముందుకొస్తుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎదురు గాలి వచ్చే అవకాశం ఉందన్నారు. దక్షిణ భారతంలో బీజేపీకి అవకాశం లేదని చెప్పారు. జమిలి ఎన్నికల్లు వస్తే ప్రాంతీయ పార్టీలకు నష్టం కలుగుంతుందని అభిప్రాయపడ్డారు. తమ్మినేనితో టెన్ టివి వన్ టూ వన్ నిర్వహించింది. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
గత ప్రభుత్వాల విధానాలతో అభివృద్ధి శూన్యం 
'70 స.రాలు అనుభవం ఉన్న కాంగ్రెస్ తోపాటు గత ప్రభుత్వాలు, పాలకులు అవలంభించిన విధానాలతో రాష్ట్రం అభివృద్ధి కాలేదు. ప్రజల జీవన విధానంలో మార్పు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారతాయని భావించారు. కానీ వచ్చాక కూడా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదు. ప్రత్నామ్నాయ విధానం అభివృద్ధి కావాలన్నారు. టీఆర్ ఎస్ ఏర్పడిన సంవత్సరానికే ప్రత్యామ్నాయం విధానం ఎలా ఉండాలనేది రూపొందించామని...ఈ అంశంపై మహాజన పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. ప్రజల బతుకులు మారాలంటే కార్పొరేట్ శక్తుల దోపిడీని నిర్మూళించాలి. అన్నింటిపై కార్పొరేట్ శక్తుల ఆధీపత్యం నడుస్తోంది.. దోపిడీ, అసమానతలు పెరుగుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు పెద్ద పీట వేయాలి. కమ్యూనిస్టులను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించకపోవవడంలో ప్రజలను తప్పుబట్టలేమని... కమ్యూనిస్టులు చేపట్టే కార్యక్రమాల్లోనూ లోపాలు ఉండొచ్చని...ప్రజలకు నచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తే ఆదరిస్తారు. కొన్ని సార్లు నెగెటివ్ విధానాలతో ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొంటేనే అవి పోరాటాలు అనిపించుకుంటాయని.. విజయవంతం అవుతాయి. కార్యకర్తలు మాత్రమే పాల్గొంటే అవి పోరాటాలు కావు. 
బీఎల్ ఎఫ్ ఎన్నికల కోసమే కాదు... 
బీఎల్ ఎఫ్ ఎన్నికల కోసమే కాదు... చివరికి వరకు ఉంటుంది. ప్రజా సమస్యలపై పోరాడుతుంది. చట్టాల ద్వారా మాత్రమే కుల వివక్షను పారదోలేం. బీఎస్ ఎఫ్.. ఎన్నికలను సాధనంగా చేసుకుని ప్రజా చైతన్యానికి ప్రాధన్యత ఇస్తాం. టీఆర్ ఎస్ వ్యతిరేకత ఓటు బీఎల్ ఎఫ్ కు పడే అవకాశం ఉంది. ఎవరి అంచనాలనైనా ప్రజలే తేల్చుతారు. బీఎల్ ఎఫ్ చెప్పేది ఏది తప్పో టీఆర్ ఎస్, కాంగ్రెస్ చెప్పాలి... లేదా కాంగ్రెస్, టీఆర్ ఎస్ అనుసరిస్తున్న విధానాల్లో తప్పులను తాము చూపిస్తాం. అందరూ బీఎల్ ఎఫ్ లోకి రావాలి. బీఎల్ ఎఫ్ లోకి సీపీఐ రావాలని కోరుకుంటున్నాం. వస్తే మరింత బలం చేకూరుతుంది.  ఇదే విషయంపై సురవరంను ఏచూరి కలిసి వచ్చారు. సీపీఐ కలుస్తుందని.. ఆశా భావంతో ఉన్నాం. పాదయాత్రలో తీసుకెళ్లిన ఎజెండాపై చర్చ జరగాలనేది ఉద్ధేశం. 
బహుహజనులు రాజ్యాధికారంలోకి రావాలనేది బీఎల్ ఎఫ్ లక్ష్యం...
సామాజిక న్యాయంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందుతుంది. టీఆర్ ఎస్ మాటలకు చేతలకు పొంతన లేదు. చరిత్రలో టీమాస్ ద్వారా 280 సంఘాలు ఒకే వేదికపై వచ్చాయి. చొరవ చేసింది నేను కావచ్చు... నడుపుతున్నది చాలా మంది బహుహజనులు రాజ్యాధికారంలోకి రావాలనేది బీఎల్ ఎఫ్ లక్ష్యం. ఈ ఎన్నికల్లోనే మాకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. ఎన్నికల గురించి పూర్తిగా ఆలోచన చేయలేదు. 119 స్థానాల్లో పోటీ చేస్తాం. మేము కాంగ్రెస్, టీఆర్ ఎస్, బీజేపీకి వ్యతిరేకం.. కానీ మిగతా వాటికి వ్యతిరేకం కాదు. 
నిబద్ధత వున్న అభ్యర్థులు పోటీ 
విధానపరమైన, నిబద్ధత వున్న అభ్యర్థులను పోటీలో ఉంచుతాం.. అన్ని నియోజకవర్గంలో పర్యటిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీఎల్ ఎఫ్ మొదటి కన్వెన్షన్ నిర్వహిస్తున్నాం.. మే 1 తర్వాత అన్ని నియోకవర్గాల్లోకి వెళ్తామని చెప్పారు. బహుజనులు అంటే..బడగు, బలహీన వర్గాల వారే కాదు..అగ్రకుల కుల ఆధిపత్యంలో నలుగుతున్న ప్రజలందరూ, అగ్రకులాల్లో ఆర్థిక దోపిడీ గురయ్యే వారు కూడా బహుజనులే అన్నారు. సామాజిక పీడనతో అణిచివేత, ఆర్థిక దోపిడీ గురయ్యే వారందరూ బహుజనులు అన్నారు. హిందు మతాన్ని, కులాలకు వ్యతిరేకం కాదు...మతం వ్యక్తిగత విషయంగా ఉండాలి. అగ్రకులాకు వ్యతిరేకం కాదు. అగ్రకుల ఆధిపత్యం, భావజాలానికి వ్యతిరేకం అన్నారు.
సీపీఎం రాష్ట్ర మహాసభలు చాలా కీలకం
నల్గొండలో జరుగునున్న మహాసభలు చాలా కీలకం. బీఎల్ ఎఫ్ బలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని ఎజెండాగా ఉంది. ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానంపై, బీఎల్ ఎఫ్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చించాలి. గతంలో బూర్జువా పార్టీలతో పొత్తుల వల్ల నష్టం పోయాం. రాష్ట్రంలోని కీలక అంశాలు విద్యా, వైద్యం దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాయి. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేవు. మహిళలు, యువకుల సమస్యలపై చర్చించాం. మహిళలకు చేయూతనిచ్చే విధంగా కార్యక్రమాలు ఉండాలి. బేసిక్ విధానంలో కాంగ్రెస్ కు టీఆర్ ఎస్ తేడా లేదు. బేసిక్ గా ప్రజల బతుకలు మారడం లేదు. అట్టడుగు ప్రజలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో అవకాశాలు ఇవ్వాలి. మాటలు మ్రాతమే కాదు ఆచరిస్తామని చెప్పారు. పార్టీలో విధానపరమైన, సిద్ధాంతపరంగా అభిప్రాయాలుంటాయి. అభివృద్ధి అంటే జీడీపీ లెక్కలు కాదన్నారు. ప్రజల బతుకులు మారాలి. 
పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్ గందరగోళం 
పవన్ కళ్యాణ్.. ప్రజల్లోకి వెళ్లడం మంచిది. అయితే పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్ గందరగోళం ఉంది. స్పష్టమైన రాజకీయ విధానం ప్రకటిస్తే పవన్ తో కలిసి వెళ్లానే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలు అవకాశవాదంతో ఉన్నారు.
ప్రస్తుతం రాజకీయాలు తుచ్చ రాజకీయాలు
ప్రస్తుతం రాజకీయాలు తుచ్చ రాజకీయాలుగా ఉన్నాయి. ప్రజలు, ప్రజల సేవ కనిపించడం లేదన్నారు. రాజకీయాలు, వ్యాపారాలు కలిసి పోయాయి. శతకోటీశ్వరులు పేదల గురించి ఆలోచిస్తారా ? కార్పొరేట్ రాజకీయాలు అయిపోయాయి.
ప్రజలకు రాజకీయ, ఆర్థిక ప్రత్యామ్నాయం కావాలన్నారు. ఎన్నికలే లేకుండా చేయాలనే దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక గాలి..
2019 లో దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలకు వ్యతిరేకత ముందుకొస్తుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎదురు గాలి వచ్చే అవకాశం ఉందన్నార. దక్షిణ భారతంలో బీజేపీకి అవకాశం లేదు. జమిలి ఎన్నికల్లు వస్తే ప్రాంతీయ పార్టీలకు నష్టం కలుగుతుంది'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

21:29 - February 3, 2018

అనంతపురం : ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి .. గుడ్‌ మార్నింగ్‌ పుట్టపర్తి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరు, ఏడు వార్డుల్లో ఆయన పర్యటించి.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు వద్దకు నేరుగా వెళ్లి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు విన్నవించుకున్న సమస్యలను.. వెంటనే పరిష్కరించాలని.. అధికారులను ఆదేశించారు. పల్లె రఘునాథ్‌రెడ్డి వెంట.. స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ చలపతి, వుడా చైర్మన్‌ కడియాల సుధాకర్‌, రాము, కౌన్సిలర్లు ఉన్నారు.

 

21:02 - February 3, 2018

'భాగమతి' మూవీ డైరెక్టర్ అశోక్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా అశోక్ సినిమా విశేషాలు, అనుభవాలు, షూటింగ్ విశేషాలు తెలిపారు. పలు ఆసక్తిరమైన విషయాలు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:42 - February 3, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ మాటల గారడిగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మద్దతు ధర కల్పిస్తామని మరో రైతాంగాన్ని మోసం చేసేలా కేంద్రం తీరు ఉందన్నారు. ఈమేరకు బీవీ రాఘవులుతో గోపి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించారు. గతంలో పంటలకు ప్రకటించిన మద్దతు ధరే అమలు చేయలేదన్నారు. తాజాగా మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పబ్బం గడుపుకునే విధంగా బడ్జెట్‌ ఉందని ఎద్దేవా చేశారు. 

 

19:53 - February 3, 2018

గుంటూరు : జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఒకే కారులో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రయాణించారు. ఓమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి  వచ్చిన ముఖ్యమంత్రితో ముస్తఫా భేటీ అయ్యారు. రాయపాటి.. ముస్తఫాను.. బాబు దగ్గరుకు తీసుకెళ్లారు. హెలిఫ్యాడ్ వద్ద కాసేపు సీఎంతో ముస్తఫా భేటీ అయ్యారు. ఈ సమావేశంతో... ముస్తఫా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. 

 

19:48 - February 3, 2018

భద్రాద్రి : జిల్లాలోని పాల్వంచలో మధ్యాహ్నం భోజనం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్నం సరిగా ఉడకకపోవడంతో చిన్నారులు... తినకుండా వదిలేయాల్సి వచ్చింది. మూడురోజులుగా ఇదే తంతు జరుగుతున్నా... ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని.. ఇటీవలే మధ్యాహ్నం భోజనం కాంట్రాక్ట్‌ను అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆహారం సరిగా ఉండటం లేదని స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

 

19:44 - February 3, 2018

కొమ్రం భీం అసిఫాబాద్ : జిల్లాలో మొన్న జరిగిన దళిత మహిళ సావంత్‌ భాయ్‌ హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వతీరును నిరసిస్తూ... ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద టీమాస్‌ నేతలు నిరసన తెలిపారు. జనవరి 31న మర్తిడి గ్రామంలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పటించారని.. వారు అధికార పక్షంకి చెందిన వారవడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని టీమాస్‌ నేతలు ఆరోపించారు. వెంటనే నిందుతులను రిమాండ్‌కి పంపి అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని టీమాస్ నేతలు డిమాండ్‌ చేశారు.

 

19:42 - February 3, 2018

హైదరాబాద్ : టీఆర్‌టిలో టెట్‌ పాసైన అభ్యర్థులందరిని అనుమతించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎంకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రగతి భవన్‌కి వచ్చారు. కానీ సీఎం లేకపోవడంతో వినతి పత్రాన్ని పోలీసులకు అందజేసి వెనుతిరిగారు. టీఆర్‌టి 2017 నోటిఫికేషన్ లో బీ-ఈడిలో 45శాతం.. డీ-ఈడిలో 50శాతం.. నిబంధన పెట్టడం వల్ల టెట్‌ పాసైకూడా చాలామంది విద్యార్ధులు నష్టపోతున్నారని.. వారు ఆందోళన చెందుతున్నారు. టెట్ రాసేందుకు లేని ఉత్తీర్ణత శాతాలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

 

19:36 - February 3, 2018

నల్లగొండ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలకు ఉద్యమాల గడ్డ నల్లగొండ వేదిక కానుంది. మూడేళ్ల కార్యక్రమాలను సమీక్షించుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయిలో భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ఈ మహాసభల్లోనే రూపొందించనున్నారు. గత ఉద్యమాలకు భిన్నంగా తెలంగాణలో లాల్‌ నీల్‌ జెండాలతో సామాజిక, వర్గ పోరాటాలకు సీపీఎం శ్రీకారం చుట్టిన తర్వాత తొలిసారిగా మహాసభలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇప్పటికే చాలా ఉద్యమాలు చేపట్టామని.. భవిష్యత్తులో చేయబోయే పోరాటాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 

 

19:00 - February 3, 2018

కరీంనగర్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల్లో ఫార్మ డీ పట్టభద్రులకు అవకాశం కల్పించాలని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద ఫార్మ డీ విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పొన్నం మద్దతు ప్రకటించి.. దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మ డీ పట్టభద్రులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

 

18:44 - February 3, 2018

సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ నిమ్జ్ భూ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. వేలాది ఎకరాల భూముల్ని సరైన పరిహారం ఇవ్వకుండా అధికారులు చట్ట విరుద్ధంగా తీసుకుంటున్నారని ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శి భీరం మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ రాములు వీరికి మద్దతు తెలిపారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

18:40 - February 3, 2018

హైదరాబాద్ : మిష‌న్ భగీరథ దేశంలోనే అతి పెద్ద కుంభకోణ‌మ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి. తాగునీటి పేరుతో ప్రభుత్వమే అడ్డగోలుగా... కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. క‌మీష‌న్ల కోస‌మే ఆంధ్రా గుత్తేదారుల‌కు కాంట్రాక్టులు అప్పగించారన్న జీవ‌న్ రెడ్డి.. దీనిపై న్యాయ విచార‌ణ జ‌రిపిస్తే.. వాస్తవాలు బయటికొస్తాయని తెలిపారు. 

 

18:32 - February 3, 2018

హైదరాబాద్ : ఉప్పల్‌ చిలుకానగర్‌ చిన్నారి బలి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బుచ్చమ్మ, లక్ష్మమ్మ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్షుద్రపూజలు చేశారని అనుమానిస్తున్న నరహరికి, అతని కొడుకు రంజిత్‌కి చిన్నారిని అమ్మినట్టు తెలుస్తోంది. తల దొరికిన ఇంటి యజమాని కారు డ్రైవర్‌ రాజశేఖర్‌ని సైతం పోలీసులు విచారిస్తున్నారు. 

 

18:30 - February 3, 2018

నల్లొండ : సీఐ అదృశ్యం మిస్టరీ వీడింది. నిన్న అజ్ఞాతంలోకి వెళ్లిన సీఐ వెంకటేశ్వర్లు గుంటూరుజిల్లా బాపట్లలో గుర్తించిన పోలీసులు.. నల్గొండకు తీసుకొస్తున్నారు. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ముందు సీఐ వెంకటేశ్వర్లును ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:25 - February 3, 2018

ఢిల్లీ : బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావత్‌ సినిమాపై కర్ణిసేన యూటర్న్‌ తీసుకుంది. ఈ సినిమాను వ్యతిరేకిస్తూ ఇకపై ఆందోళనలు చేయరాదని నిర్ణయించింది. కర్ణిసేనకు చెందిన కొందరు ప్రముఖులు పద్మావత్‌ సినిమాను చూసి మనసు మార్చుకున్నారు. సినిమాలో రాజ్‌పుత్‌ల శౌర్యాన్ని గొప్పగా చూపారని ప్రశంసించారు. ప్రతి రాజ్‌పుత్‌ ఈ సినిమా చూసి గర్వపడతారని కర్ణిసేనకు చెందిన ముంబై నేత యోగేంద్ర సింగ్‌ కటార్‌ వెల్లడించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లతో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనకు సహకరిస్తామని ప్రకటించారు. రాణి పద్మిని జీవిత చరిత్ర వక్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

18:16 - February 3, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఎన్నికల పబ్బం గడుపుకునేలా బడ్జెట్‌ ఉందని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ.. బీజేపీని ప్రశ్నించకపోవడం వల్లే కేంద్రం తీరు ఈ విధంగా ఉందంటున్న బీవీ రాఘవులుతో టెన్ టివి ఫేస్‌టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చేసిన అన్యాయంలో టీడీపీ పాలు పంచుకుందన్నారు. బీజేపీ, టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేశాయని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు అని  పేర్కొన్నారు. యుద్ధం ప్రకటిస్తామని చంద్రబాబు నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు యుద్ధం చేస్తే టీడీపీ ముందుకొస్తుందో.. బీజేపీ భజన చేస్తుందో తేలుతుంది అని అన్నారు. టీడీపీకి రాష్ట్రం పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. బడ్జెట్‌పై వామపక్షాలు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాయని తెలిపారు.

 

ప్రజలు మద్దతు తెలపాలి : రఘువీరారెడ్డి

గుంటూరు: ఫిబ్రవరి 8న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తలపెట్టిన బంద్ కు ప్రజల మద్దతు తెలిపి విజయబంతం చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్, బీజేపీ, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు అన్ని మండలకేంద్రాల్లో నిరసనలు చేస్తామని ఆయన తెలిపారు. 

18:08 - February 3, 2018

హైదరాబాద్ : ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలు ఫీజుల దోపిడితో విద్యార్ధుల ప్రాణాలు బలితీసుకుంటున్నారని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ విమర్శించింది. నెక్లెస్‌ రోడ్‌.. పీపుల్స్‌ ప్లాజాలో పేరెంట్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. గురువారం సాయి దీప్తి అనే అమ్మాయి రెండు వేల రూపాయల ఫీజు చెల్లించలేక సూసైడ్‌ లెటర్‌ రాసి చనిపోయిందని.. అయినా ప్రైవేటు స్కూల్స్‌ తీరుమారటం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వం కళ్లు తెరచి .. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. 

 

18:02 - February 3, 2018

హైదరాబాద్ : మోతీలాల్‌ అనే వ్యక్తి అనుమానంతోనే బండరాయితో మోది అనూషను చంపాడని.. డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తొమ్మిది నెలల క్రితం మోతీలాల్‌కు, అనూషకు నిశ్చితార్థం అయిందని అయితే  ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో.. మోతీలాల్‌ తరచూ వేధించేవాడని డీసీపీ తెలిపారు. అనూషపై ద్వేషం పెంచుకుని మోతీలాల్‌..ఆమెను హత్య చేశాడని డీసీపీ తెలిపారు.

 

17:57 - February 3, 2018

హైదరాబాద్ : సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీ కనకాల మృతి చెందారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. తల్లి మరణంతో.. నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హీరో జూనియర్‌ ఎన్‌టీఆర్‌, శివాజీరాజా, సమీర్‌లు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అమ్మది పరిపూర్ణమైన జీవితమని.. నటులుగా చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరిని తన కన్నబిడ్డలా చేరదీసిందని రాజీవ్‌ కనకాల అన్నారు. తనను కోడలిగా కాకుండా ... కన్న కూతురిలా చూసుకున్నారని.. ప్రముఖ యాంకర్‌ సుమ... అత్తగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో లక్ష్మీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. యాక్టింగ్‌ స్కూల్‌ ద్వారా అనేక మందికి నటనలో ఓనమాలూ దిద్దించిన లక్ష్మీదేవి.. పలు చిత్రాల్లో నటించారు.

 

17:52 - February 3, 2018

అనంతపురం : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 8న ఆంధ్రప్రదేశ్‌ బంద్‌ పాటించనున్నట్లు అనంతపురంలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంపూర్ణ బంద్‌ పాటించాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌,.. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్‌ ఎందుకు స్పందించలేదని రామకృష్ణ ప్రశ్నించారు. వెంటనే వారు స్పష్టమైన వివరాలతో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

 

17:50 - February 3, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బడ్జెట్‌ తీరును నిరసిస్తూ ఈనెల 8వ తేదీన ఏపీ బంద్‌కు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు, రాజధానికి నిధులు, లోటు బడ్జెట్‌,  నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభానికి కేటాయింపులు... వీటన్నింటిలో ఏ ఒక్కదానికీ నిధులు ప్రకటించలేదన్నారు.ఇది అన్నివర్గాల ప్రజలకు అన్యాయం చేయడమేనని మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం రాయితీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఈ నెల 8న నిర్వహించే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని మధు విజ్ఞప్తి చేశారు. 

17:45 - February 3, 2018

ఢిల్లీ : తమ డిమాండ్ల కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఉత్తరాంధ్ర చర్చా వేదిక నేతలు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక డిమాండ్లు న్యాయసమ్మతమైనవని... వారికి పూర్తిస్థాయి మద్దతిస్తున్నట్లు సీతారాం ఏచూరి తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత వెనకబడిన ప్రాంతాలు మరింత వెనకబడ్డాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పటికీ.. దానిని పట్టించుకోలేదని సీతారాం ఏచూరి అన్నారు. 

 

 

హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి అనుమతి

హైదరాబాద్ : హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి టీఎస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో సివిల్ కానిస్టేబుల్-5,002, స్పెషల్-3,372, ఏఆర్ కానిస్టేబుళ్ల-2,283, ఎస్సై(సివిల్)-710, ఎస్సై(ఏఆర్)-275, ఎస్సై(స్పెషల్ పోలీస్)-191 పోస్టులు, ఎస్సై(కమ్యూనికేషన్)-29, కానిస్టేబుళ్లు(కమ్యూనికేషన్)-142, సీపీఎల్ కానిస్టేబుళ్లు-53, సీటీవో కానిస్టేబుళ్లు-89, ఫంగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై-26 పోస్టులకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

17:32 - February 3, 2018

ఢిల్లీ : రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్‌ విధానాన్ని సిపిఎం తప్పుపట్టింది. ఈ విధానం వల్ల బిజెపి, కాంగ్రెస్‌ లాంటి పెద్ద పార్టీలకే లాభం చేకూరనుందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దీంతో చిన్న చితకా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టతరంగా మారుతుందని... ఇది ప్రజాస్వామ్యానికి క్షేమం కాదని ఏచూరి హెచ్చరించారు.  కార్పోరేటర్ల ద్వారా పార్టీలకు వచ్చే ఎన్నికల విరాళం క్రోనీ కాపిటలిజానికి దారి తీస్తుందన్నారు. 2016-17లో 89 శాతం కార్పోరేట్‌ ఎన్నికల ఫండ్‌ అధికారంలో ఉన్న బిజెపికి వచ్చాయని ఏచూరి తెలిపారు. షెల్‌ కంపెనీల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతున్నాయని... నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుతున్నారని ఏచూరి వెల్లడించారు. విదేశీ కంపెనీల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకునే విధానానికి స్వస్తి పలకాలన్నారు.  

 

17:15 - February 3, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ బేగంపేట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ చెస్ట్‌లో మిస్‌ ఫైర్ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు జరపుతున్నారు. క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగి పలు కీలక అధారాలు సేకరించాయి. గురుమూర్తికాలనిలోని యాక్సిస్‌ బాంకులో బేగంపేట్‌ ఏసీపీ రంగారావు, సీఐ అశోక్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

కాసేపట్లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి సీఐ వెంకటేశ్వర్లు

నల్లగొండ : కాసేపట్లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి సీఐ వెంకటేశ్వర్లును పోలీసులు తీసురానున్నారు. వెంకటేశ్వర్లు నిన్న ఉదయం నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 

17:12 - February 3, 2018

హైదరాబాద్ : గతనెల 29తేదీన జరిగిన బీటెక్‌ విద్యార్థిని అనూష హత్య కేసును ఛేదించిన పోలీసులు .. నిందితుడు మోతీలాల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో బండరాయితో మోది హత్య చేసినట్టు మోతీలాల్‌ ఒప్పుకున్నాడు. వేరేవారితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే మోతీలాల్‌ ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని.. ఈ కేసులో ఎంతటి వారున్న వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది.

 

17:05 - February 3, 2018

హైదరాబాద్ : ఉప్పల్‌ చిలుకానగర్‌ చిన్నారి బలి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చనిపోయిన పాపను కొనుగోలు చేశారా? లేదా కిడ్నాప్‌ చేశారా? అన్నది  ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. క్షుద్రపూజలు చేసి అనంతరం ఆ పాపను చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

తహశీల్దార్ అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు : మంత్రాలయం తహశీల్దార్ ఆఫీస్ అధికారులు విధులకు లేట్ గా వస్తుండడంతో ప్రజల పడిగాపులు కాస్తున్నారు. దీనిపై ఉన్నధికారలు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

17:00 - February 3, 2018

విజయవాడ : ఎన్టీఆర్ స్టేడియం వద్ద వినూత్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బీజేపీతో పొత్తు-ఇంటికి రాదు విత్తు.. మన గింజలు కూడా మనకు దక్కవు.. అనే స్లోగన్‌తో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తెలుగు దేశం అభిమానుల పేరుతో వెలసిన ఈ ఫ్లెక్సీని నగర వాసులు...ఆసక్తిగా తిలకిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. 

రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ కలిశారు

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని మందకృష్ణ కలిశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానికి రాహుల్ తో లేఖ రాయించాలని మందకృష్ణ కోరారు. వర్గీకరణకు తనవంతు సహకారం అందిస్తామని రేవంత్ మందకృష్ణకు తెలిపారు. 

16:53 - February 3, 2018

విజయవాడ : అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సర్వీసులు ప్రారంభించాలని  వ్యాపార, వాణిజ్య వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి బహుళ ప్రయోజనాలు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. దీనిని గుర్తించిన అధికారులు కార్గో సేవలందించేందుకు ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు. కానీ ఇంతవరకూ  సేవలు ప్రారంభం కాలేదు. వీలైనంత త్వరగా కార్గో సర్వీసులను ప్రారంభించాలని వ్యాపారవర్గాలు కోరుతున్నాయి.  
కార్గో సర్వీసులను ప్రారంభించాలని డిమాండ్‌ 
అంతర్జాతీయ స్థాయిలో తయారైన గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సర్వీసులను ప్రారంభించాలని వర్తక, వాణిజ్య వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  అందుకోసం త్వరగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  ఈమేరకు వర్తక, వ్యాపార, పారిశ్రామిక ఛాంబర్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులను కోరుతున్నారు. 
ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌  ఆసక్తి
అంతర్జాతీయ బ్రాండ్‌ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ సైతం గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో రవాణాకు ఆసక్తి చూపిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోనే  గోడౌన్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్న యోచనలో కూడా ఉంది. వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాల నుంచి వస్తున్న స్పందనతో ఇక్కడి నుంచి  కార్గో రవాణాకు ఊతమిస్తోంది. 
ఎయిరిండియా విమానాల్లో 3నుంచి 4టన్నులు తీసుకెళ్ళే అవకాశం
ఎయిరిండియా విమానాల్లో 3నుంచి 4టన్నుల వరకూ సరుకులను తీసుకెళ్ళే అవకాశం ఉంది. స్పైస్‌జెట్  బంబార్డ్‌ విమానాల్లో 750-800 కేజీల వరకూ తీసుకెళ్ళే అవకాశం ఉంది. సాధారణ ఏటీఆర్‌ విమానాల్లో కూడా 500 కేజీల వరకూ సరుకుల రవాణా చేసే అవకాశం ఉంది. కార్గో రవాణా ద్వారా  లాభాలు కూడా బాగానే ఉంటాయి..  
రవాణా చేసేందుకు వీలు
కార్గో ఫ్లైట్‌ సర్వీసు ప్రారంభమైతే.. మిషనరీ విడిభాగాలు, డాక్యుమెంట్లు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, చేపలు, రొయ్యలు, మత్స్య సంపద, కూరగాయలు, పండ్లు, పూలు వంటివి ఎన్నో రవాణా చేసేందుకు వీలుంటుంది.
కొత్తగా కార్గో టెర్మినల్‌ నిర్మాణం 
కార్గో సర్వీసులకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా...   కార్గో సేవలు అందించడానికి వీలుగా కొత్తగా కార్గో టెర్మినల్‌ నిర్మాణం చేపట్టారు. అన్ని వసతులు అందులో కల్పించారు. పాసింజర్‌ విమానాల్లోనే కార్గో సేవలను అందించడానికి టెండర్లు కూడా పిలిచారు.  దీనికోసం ఐదు సంస్థలు పోటీ పడగా.... వీటిలో   శ్రీప లాజిస్టిక్స్‌  కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ఆ సంస్థకు ఆరు నెలల క్రితం సేవలు ప్రారంభించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. కానీ  ఇప్పటికీ  పనులు ప్రారంభించలేదు. సకల సదుపాయాలు ఉన్నా ఇంతవరకూ సిబ్బందిని కూడా నియమించలేదు. అన్ని విధాలా అభివృద్ధికి ఉపయోగపడే కార్గో సేవలపట్ల నిర్లక్ష్యం సరైంది కాదని పలువురు అంటున్నారు. అధికారులు సత్వరం స్పందించి కార్గోసేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

 

బీహార్ దొంగల ముఠా అరెస్ట్

విశాఖ : పలు దొంగతనాలకు పాల్పడుతున్న 17 మంది సభ్యులను బీహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 తపంచాలు, 7 రౌండ్ల బుల్లెట్లు, 3కిలోల గంజాయి, 10 తులాల బంగారం, 1.2కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. 

ఆదోనీలో విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో ఆర్ట్స్ ఆండ్ సైన్సు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విజయలక్ష్మి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

16:45 - February 3, 2018

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో ఆర్ట్స్ ఆండ్ సైన్సు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విజయలక్ష్మి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:41 - February 3, 2018

హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. దీనికితోడు పార్కింగ్‌  వ్యవహారం మరింత  తలనొప్పిగా మారింది.ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు బల్దియా అధికారులు సన్నద్దమవుతున్నారు. ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
రోజురోజుకూ పెరిగిపోతోన్న ట్రాఫిక్‌ సమస్య 
గ్రేటర్‌ హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడు ఎక్కడ  ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందో ట్రాఫిక్‌ పోలీసులు కూడా చెప్పలేరు. గ్రేటర్‌ పరిధిలో నిత్యం 45 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి. ఇలా వచ్చిన వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు సరైన స్థలం లేదు. దీంతో రోడ్లమీదే వాహనాలు నిలుపుతున్నారు.   కొన్ని చోట్ల  ఫుట్‌పాత్‌ మీదే టూవీలర్స్‌ పార్కింగ్‌ చేస్తున్నారు. 
అమలు కాని మల్టీ లెవల్‌ పార్కింగ్‌
పార్కింగ్‌ సమస్యను గుర్తించిన అధికారులు... ఇప్పటికే మల్టీ లెవల్‌ పార్కింగ్‌ భవనాల నిర్మాణానికి ప్రణాళిక  రూపొందించారు.  కానీ... అది అమలు కాలేదు. దీంతో మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు.. గ్రేటర్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పలు శాఖల స్థలాలను పార్కింగ్‌ యార్డులుగా ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. 
ప్రైవేటు స్థలాల్లోనూ పార్కింగ్‌ అవకాశం 
ఈ అంశంపై ఇప్పటికే  కసరత్తు చేసిన బల్దియా, ట్రాఫిక్‌ అధికారులు....  56,660 స్థలాలను గుర్తించారు. ఇందులో 41, 550 ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు... 15,110 స్థలాల్లో ఫోర్‌వీలర్స్ తోపాటు భారీ వాహనాలు కూడా పార్క్‌ చేసేందుకు వీలుంటుందని తేల్చారు. ఐతే పలు విభాగాలకు చెందిన స్థలాలు కావడంతో  సంబంధిత అధికారులతో  చర్చలు జరుపుతున్నారు. అలాగే  ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో కూడా పార్కింగ్‌ అవకాశం కలిపిస్తున్నారు. 
టూ వీలర్స్‌కు  2 గంటలకు రూ.10 
టూ వీలర్స్‌కు  2 గంటలకు 10 రూపాయలు, ఆ పైన ప్రతి రెండు గంటలకు ఐదు రూపాయలు వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫోర్‌ వీలర్స్‌కు మొదటి రెండు గంటలకు 20 రూపాయలు, ఆపైన ప్రతి 2 గంటలకూ ఐదు రూపాయలు వసూలు చేసుకోవచ్చు. 
ట్రాఫిక్ అడ్డుగా విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు 
మరోవైపు  విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారినట్లు అధికారులు గుర్తించారు.  490 విద్యుత్‌ స్థంభాలు, 61 ట్రాన్స్‌ఫార్మర్లు అడ్డంకిగా ఉన్నట్లు తేల్చారు..  వాటన్నింటినీ తొలగించాలని విద్యుత్‌ శాఖ అధికారులను బల్దియా కోరింది.

 

16:22 - February 3, 2018

సంగారెడ్డి : తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెబుతామన్నారు.. మంత్రి హరీశ్‌రావు. సంగారెడ్డిజిల్లా నల్లవాగు వద్ద 25 కోట్లతో చేపడుతున్న కాల్వల ఆధునీకరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో వెయ్యికోట్లతో ఇప్పటికే పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం అందడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. 

 

16:17 - February 3, 2018

హైదరాబాద్‌ : బేగంపేట్‌లోని గురుమూర్తినగర్‌లో గన్‌ మిస్‌ఫైరయ్యింది. యాక్సిస్‌ బ్యాంక్‌లో డబ్బులు తీసుకెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాస్‌, మహేశ్వరరావు అనే ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ శ్రీనివాస్‌, మహేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. దీంతో సైంటిఫిక్‌ క్లూస్‌ టీం దర్యాప్తు చేపడుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని  
వీడియోలో చూద్దాం.. 

తమిళనాడులో దారుణం

చెన్నై : కృష్ణగిరి జిల్లాలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వలేదని హిజ్రాలు నడుస్తున్న రైలు నుంచి ఇద్దరిని తోసేశారు.. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా మరోకరు గాయపడ్డారు. బాధితులు విజయవాడ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

15:39 - February 3, 2018

ఢిల్లీ : అండర్‌ 19 క్రికెట్‌లో యువభారత్‌ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. నాలుగోసారి అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ను సాధించింది. న్యూజిలాండ్‌లోని మౌంట్‌ మౌంగనుయ్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 8వికెట్లతో చిత్తుచేసింది. పృథ్వీషా నేతృత్వంలోని యువభారత్‌ టోర్నీ యావత్తు చెలరేగి ఆడింది. లీగ్‌దశ నుంచి ఫైనల్స్‌ వరకు ఒక్క మ్యాచ్‌లోకూడా ఓడిపోకుండా మరోసారి కప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ మన్‌జోత్‌కల్రా చెలరేగి ఆడాడు. 102 బంతుల్లో 101 పరుగులుచేసిన మన్‌జోత్‌ నాటౌట్‌గా నిలిచాడు. అంతకు ముందు మొదట బ్యాంటింగ్ చేసిన ఆసీస్‌ టీమ్‌ భారత్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 47.2 ఓవర్లలో 216 పరగులు చేసి ఆలౌట్‌ అయింది. మరోసారి ప్రపంచకప్‌ సాధించిన యువభారత్‌ టీమ్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఆటగాళ్లకు 20 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. అటు జట్లు విజయప్రస్థానంలో కీలకంగా వ్యవహరించిన కోచ్‌ ద్రవిడ్‌కు 50లక్షల రూపాయలను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్‌కప్‌ సాధించిన యువభారత్‌ టీమ్‌కు సర్వత్రా ప్రశంశలు అందుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ కుర్రాళ్లను అభినందలను తెలిపారు. 
 
 

విజయవాడలో కాంగ్రెస్ మహాధర్నా

కృష్ణా : విజయవాడ ధర్నాచౌక్ లో కాంగ్రెస్ మహాధర్నా చేసింది. దుర్గగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ధర్నాలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. 

గుంటూరు లో ఫ్లెక్సీ కలకలం

గుంటూరు : ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఫ్లెక్సీ కలకలం రేగింది. బీజేపీతో పొత్తు-ఇంటికి రాదు విత్తు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్థానికంగా అందరు ఈ ఫ్లెక్సీ పై చర్చించుకుంటున్నారు. 

అండర్-19 జట్టుకు బీసీసీఐ నజరానా

ముంబై : అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టుకు బీసీసీఐ నజరానీ ప్రకటించింది. కోచ్ ద్రవిడ్ కు రూ.50 లక్షలు, ఆటగాళ్లకు రూ.20 లక్షల చొప్పున చేటాయించింది. 

యువభారత్ పై ప్రశంసల వర్షం

ఢిల్లీ : అండర్ -19 వరల్డ్ కప్ గెలిచిన యువభారత్ ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొనసాగించాలని వారు అన్నారు. 

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం

న్యూజిలాండ్ : అండర్-19 వరల్డ్ కప్ యువ భారత్ దుమ్ముదులిపింది. మంజోత్ సెంచరీతో ఫైనల్ లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాంధించింది.

13:26 - February 3, 2018

న్యూజిలాండ్ : అండర్-19 వరల్డ్ కప్ యువ భారత్ దుమ్ముదులిపింది. మంజోత్ సెంచరీతో ఫైనల్ లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాంధించింది.

13:19 - February 3, 2018
13:15 - February 3, 2018

హైదరాబాద్ : రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:06 - February 3, 2018
12:50 - February 3, 2018
12:48 - February 3, 2018

విశాఖపట్టణం : నాలుగేళ్ళ తర్వాత నోటిఫికేషన్‌ వెలువడింది.. అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇక తుది ఫలితాలు రావడం... జాబ్‌లో జాయిన్‌ కావడమే మిగిలింది. ఇంతలోనే పరిశోధక సీట్ల కేటాయింపులకు సడన్‌ బ్రేక్‌ పడింది. ఏయూ అనాలోచిత నిర్ణయాలతో పరిశోధక నియామకాలు గందరగోళంగా తయారయ్యాయి. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం గతేడాది ఏయూ నోటిఫికేషన్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించారు. 13275 మంది పరీక్ష రాశారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఎంపికైన వారు ఫిబ్రవరి 5వతేదీలోపు ఫీజు చెల్లించి జాయిన్‌ కావాలని ఏయూ అధికారులు ప్రకటించారు. ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా... డిసెంబర్‌ 27 న జరిగిన సమావేశంతో కథ పూర్తిగా మారిపోయిది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పరిశోధక సీట్లభర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరైన వీసీ ఎలాంటి అభ్యంతరం చెప్పక పోవడం గమనార్హం.

సీట్ల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని ఆ మరుసటిరోజే రాష్ర్ట ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు లేఖ పంపింది. గతేడాది జూన్‌లోనే నోటిఫికేషన్‌ ఇచ్చి... అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేశామని ఏయూ అధికారులు ఉన్నత విద్యామండలికి వివరించారు. సానుకూలంగా స్పందించిన ఉన్నత విద్యామండలి సీట్లను భర్తీ చేసుకోవచ్చని సూచించింది. కానీ... రాత పూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో ఇంటర్వ్యూలు జరపడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆచార్యులు.. అభ్యర్థుల మార్కులను పంపలేదు. ఫలితంగా పుల్‌టైమ్‌ పీహెచ్‌డీ సీట్లకు ఎంపికైన వారిపట్ల తాత్సారం చేశారు. ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ సీట్ల అభ్యర్థుల ఎంపిక కొంతమేరకు పూర్తైనా... పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ, పార్ట్‌ టైమ్‌ ఎంపిల్‌ అభ్యర్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

మరోవైపు ఎంపికైన అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. అందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థుల నుంచి వెయ్యి, ఎస్సీ, ఎస్టీలనుంచి 500 రూపాయలు వసూలు చేశారు. కానీ... డబ్బులు దండుకున్న అధికారులు ప్రవేశాలపై మాత్రం నోరు మెదపడం లేదు. ఈ వ్యవహారంపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు.. స్పష్టమైన ప్రకటన ఇచ్చి త్వరగా పరిశోధక సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

12:46 - February 3, 2018

విజయవాడ : చట్టాన్ని కాపాడాల్సింది ఒకరైతే... మరొకరు న్యాయాన్ని కాపాడాల్సిన వారు. వీరిద్దరిమధ్యా బెజవాడలో ఆధిపత్య పోరు రగులుతోంది. పోలీస్‌ స్టేషన్లలో సెటిల్‌మెంట్లు చేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారని లాయర్లు ఆరోపిస్తుంటే.. క్లైంట్లను రక్షించేందుకు పోలీసులపై న్యాయవాదులు నిందలు వేస్తున్నారని పోలీసులు కౌంటర్‌ ఇస్తున్నారు. బెజవాడలో ఖాకీ వర్సెస్‌ నల్లకోటు వార్‌ రక్తికడుతోంది.

ఓ మహిళపై వేధింపుల కేసు పోలీసులు-న్యాయవాదుల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. ప్రవీణ్‌ అనే వ్యక్తి ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వీరి వ్యవహారం పెళ్ళి దాకా వెళ్ళింది. ఆ మహిళనుంచి అప్పుడప్పుడు డబ్బు కూడా తీసుకుంటున్న ప్రవీణ్‌ పెళ్ళి చేసుకునే విషయంలో మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

ప్రవీణ్‌ మోసపూరితనాన్ని పసిగట్టిన బాధితురాలు సింగినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టులో లొంగిపోయి బెయిల్‌పై విడుదలయ్యాడు. కావాలనే ఆ మహిళ తనను ఇబ్బింది పెడుతోందని ప్రవీణ్‌ ఆరోపిస్తున్నాడు. ఈ కేసు న్యాయవాదులు- పోలీసుల మధ్య చిచ్చురేపింది. పోలీసులు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ పోలీసులు ముద్దాయిలను వేధిస్తున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే... న్యాయవాదులు తమ క్లైంట్లను కేసులనుంచి రక్షించుకునేందుకే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. న్యాయవాదుల బెదిరింపులకు భయపడకుండా తమ విధులను నిర్వర్తిస్తామని పోలీసులు అంటున్నారు.

12:44 - February 3, 2018

హైదరాబాద్ : భాగ్యనగరానికి మెట్రో రైలు రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎంతో ఆశపడి ప్రయత్నించినా కొందరినే అవి వరించాయి. తీరా ఉద్యోగాల్లో చేరి రెండు నెలలు కాకుండానే కాంట్రాక్టు ఏజెన్సీ వారిని ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. ఉద్యోగం పేరుతో భారీ మొత్తంలో దండుకున్న కాంట్రాక్టు సంస్థ ముందస్తు సమాచారం ఇవ్వకుండా రోడ్డుపైకి నెట్టేయడంతో బాధితులంతా ఆందోళన బాట పట్టారు. మెట్రో మెగాఇక్కడ ఆందోళన చేస్తున్న వీరంతా హైదరాబాద్‌ మెట్రోలో పనిచేసిన స్టేషన్ అసిస్టెంట్స్.. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే వీరికే ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. ఉద్యోగం వచ్చిన రెండు నెలల్లోనే ఊడిపోవడంతో ఇలా ఆందోళన బాట పట్టారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ఎల్‌ అండ్‌ టీ సంస్థ స్టేషన్ అసిస్టెంట్స్‌ని నియమించింది. వీరి నియామకం బాధ్యతలను ట్రిగ్, ఈజీవే అనే ప్రైవేటు సంస్ధలకు అప్పగించింది. సిటీలోని 24 మెట్రో స్టేషన్స్‌లో సహాయపడేందుకు గానూ ..ఒక్కో స్టేషన్‌కు 30 మంది చొప్పున 600కు పైగా ఉద్యోగులు రెండు షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు. వీరిలో 300 మందిని అకస్మాత్తుగా తొలగించడంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.

ముంబైకి చెందిన ట్రిగ్ అనే సంస్థ మెట్రోలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను భారీగా నియమించుకుంది. ఒక్కొక్కరి నుంచి రూ.20వేలు దండుకుని 3 ఏళ్ల కాంట్రాక్టుతో ఉద్యోగాల్లో నియమించింది. ప్రతి నెల 18 వేల జీతం అని చెప్పినప్పటికీ కేవలం 10 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పేరుతో రూ.2 వేలు కట్ అవుతున్నాయని.. కానీ ఇప్పటి వరకూ ఈఎస్ఐకార్డు కానీ.. పీఎఫ్‌ నంబర్ కానీ కేటాయించలేదని వారు చెబుతున్నారు. ఇచ్చే అరా కొరా జీతం కూడా సమయానికి ఇవ్వడం లేదంటున్నారు బాధితులు. కొంతమందికి పర్మనెంట్ ఉద్యోగాల ఆశ చూపి లక్షల్లో డబ్బులు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.

మెట్రోలో ఉద్యోగుల నియామకాల్లో స్ధానికులకు అవకాశం కల్పించాలని మొదటి నుంచి చెబుతున్నా.. ఇలా ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేసి.. నిరుద్యోగుల నుంచి భారీగా దోచుకుని రెండు నెలల్లోనూ ఉద్యోగాలు తీసేవేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. మరి వీరికి సదరు కాంట్రాక్టు ఏజెన్సీ.. ఎల్‌ అండ్‌ టీ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి. 

దేశభక్తి అంటే ప్రజానీకాన్ని గౌరవించడం : వెంకయ్య

గుంటూరు : జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండు సైన్స్ కాలేజీ స్వర్ణోత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. దేశభక్తి అంటే అన్ని రకాల ప్రజానీకాన్ని  గౌరవించాలని, విద్య నేర్చుకోవడంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు.

12:18 - February 3, 2018

హైదరాబాద్ : బేగంపేటలో తుపాకీ మిస్ ఫైర్ ఘటన కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బేగంపేట గురుమూర్తి కాలనీలోని స్ట్రీట్ నెంబర్ 4లో యాక్సిస్ బ్యాంకు సమీపంలో సెక్యూర్ సంస్థ ఉంది. ఇందులో మాజీ సైనిక ఉద్యోగి సురేష్ కుమార్ సెక్యూర్టీగా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం బ్యాంకు ఏటీఎంలో డబ్బులు వేసేందుకు సిబ్బంది వెళ్లారు. ఆ సమయంలో సురేష్ కుమార్ చేతిలో ఉన్న తుపాకీ పేలింది. రెండు బుల్లెట్లు శ్రీనివాస్, మహేశ్వరరావుల శరీరాల్లోకి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడనే కుప్పకూలిపోయారు. వెంటనే సంస్థ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నల్లగొండ టూ టౌన్ సీఐ ఆచూకీ లభ్యం

నల్లగొండ :  టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్ల ఆచూకీ లభ్యమైంది. అధికారులు గుంటూరు జిల్లా బాపట్లలో సీఐని గుర్తించారు. ఆయనను సహచార పోలీసులు నల్లగొండ తీసుకొస్తారు. 

భార్యను హత్య చేసిన భర్త

పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం మండలం మండావారిగరువులో దారుణం జరిగింది. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి భార్యను ఇనుపరాడ్ తో కొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. 

11:35 - February 3, 2018

 

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా చిన్న కందుకూరు గ్రామంలో దళితులపై దాడి జరిగి నెల రోజులవుతోంది..ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఆ దళిత వాడల్లో ఉన్న దళితులు ఎప్పుడు ఏం జరగుతుందా ? అని బిక్కుబిక్కుమంటున్నారు. దళితులకు అభయం కల్పించేందుకు..వారికి ధైర్యం చెప్పేందుకు బీఎల్ఎఫ్...టీ మాస్ నేతలు నడుం బిగించారు. శుక్రవారం వారి గ్రామానికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టెన్ టివి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.

గో మాంసం తిన్నారనే నెపంతో ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారని దళితులు పేర్కొంటున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా తమపైనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారని దళితులు వాపోతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:28 - February 3, 2018

నల్గొండ : జిల్లా టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రెండు రోజులుగా ఆయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. జిల్లా ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డు పల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఈయన విచారణ అధికారిగా ఉన్నారు. విచారణ జరుగుతుండగానే ఈయన కనిపించకపోవడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. ఆయన ఆచూకి కనుక్కొనేందుకు పోలీసులు గాలించారు.

సెల్ ఫోన్, గన్ ను అప్పగించిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు బాపట్లకు కారులో వెళుతున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వెంకటేశ్వర్లు బాపట్లలో ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నల్గొండ జిల్లాకు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని డీఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లంచారు. ఎస్పీ ఎదుట సీఐను హాజరు పరుచనున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న సీఐ కుటుంబసభ్యులు నల్గొండకు బయలుదేరారు.

రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ వెంకటేశ్వర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా శ్రీనివాస్ హత్య కేసులో రాజకీయ వత్తిళ్లు తట్టుకోలేక...మరోవైపు ఎస్పీ మందలించడాని తట్టుకోలేక..హైకోర్టు మూడు రోజుల్లో శ్రీనివాస్ హత్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పని ఒత్తిడితోనే సీఐ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

11:25 - February 3, 2018

తూర్పుగోదావరి : నీట్ కాలేజీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జూనియర్లు..సీనియర్ల మధ్య ర్యాగింగ్ ఘటన కలకలం రేగింది. ఓ బీహార్ విద్యార్థినిని సీనియర్లు రాగ్యింగ్ చేశారని తెలుస్తోంది. దీనితో శుక్రవారం రాత్రి జూనియర్లు..సీనియర్లు ఘర్షణ పడ్డారు. వీరిలో కొంతమందికి గాయాలయినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ర్యాగింగ్ కు పాల్పడిన కొంతమంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

యాంకర్ సుమ ఇంట్లో విషాదం

హైదరాబాద్ : దేవాదస్ కనకాల సతీమణి, రాజీవ్ కనకాల అమ్మ లక్ష్మీదేవి కన్నుమూశారు. ఆమె గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

 

తాడేపల్లిగూడెం నిట్ ముందు బీహార్ విద్యార్థుల ఆందోళన

పశ్చిమగోదావరి : జిల్లా తాడేపల్లిగూడెం మండలం నిట్ కాలేజీ వద్ద బీహార్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ పై విచారణ చేస్తామని యాజమాన్యం విద్యార్థులకు హామీ ఇచ్చింది. తాము కోరిన వ్యక్తినే విచారణధికారిగా విద్యార్థులు డిమాండ్ చేశారు. 

తాడేపల్లి నిట్ ర్యాగింగ్ కలకం

పశ్చిమగోదావరి : జిల్లా తాడేపల్లి నిట్ లో ర్యాగింగ్ కలకం రేగింది. బీహార్ చెందిన ఫస్టియర్ విద్యార్థిని ఆంధ్రా థర్డ్ ఇయర్  విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. సీనియర్లు, జూనియర్ల మధ్య నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. 

11:13 - February 3, 2018

హైదరాబాద్ : ఉప్పల్‌ చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి తల దొరికిన ఘటనలో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం పేర్కొంటోంది. చంద్రగ్రహణం తెల్లారి రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి తల దొరికిన సంగతి తెలిసిందే. క్షుద్రపూజలు నిర్వహించి చిన్నారి తలను వేరు చేశారని పుకార్లు షికారు చేశాయి. కానీ చిన్నారి మృతదేహం మాత్రం ఇంకా లభించలేదు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల దొరికిన ఇంటి యజమాని కారు డ్రైవర్ రాజశేఖర్ ని, బుచ్చమ్మ, లక్ష్మమ్మ అనే ఇద్దరు మహిళలను పోలీసులు విచారిస్తున్నారు. కానీ వీరికి ఎలాంటి సంబంధం లేదని కుటుంబసభ్యులు టెన్ టివికి తెలిపారు. తమకు సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

11:06 - February 3, 2018

మేడారంలో గన్ మెన్ తుపాకీ గల్లంతు

భూపాలపల్లి : మేడారం జాతరలో గన్ మెన్ తుపాకీ గల్లంతైయింది. నిన్నటి నుంచి పోలీసులు గన్ కోసం గాలిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

సెక్యూరిటీ సర్వీస్ సెంటర్ లో మిస్ ఫైర్

హైదరాబాద్ : బేగంపేట సీఎస్ పరిధిలో గురుమూర్తినగర్ సెక్యూరిటీ సర్వీస్ సెంటర్ లో గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. 

10:27 - February 3, 2018

వరంగల్ : సమ్మక్క, సారాలమ్మలు వనవాసం వదిలి జనావాసంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అడవితల్లి పులకించిపోతోంది. పూనకాలతో పరవశిస్తోంది.. శివసత్తుల నర్తనలతో అదిరిపోతుంది. గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానం అగ్నిపర్వతంలా బద్దలై అమ్మకు సాష్టాంగ నమస్కారం పెడుతుంది. ఆడవాళ్లను ఆదిపరాశక్తిగా పూజిస్తామనడానికి ఈ జాతరే తార్కాణం.

నేడు సమ్మక్క - సారలమ్మ వన ప్రవేశం కార్యక్రమం జరుగనుంది. వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో మేడారానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. దాదాపు 40 కి.మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్దెల పై నుండి సమ్మక్క..సారలమ్మను తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ను చిలుకలగుట్టకు...,సారలమ్మను కన్నెపల్లి గుడికి సాగనంపనున్నారు. సమ్మక్క..సారలమ్మ వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. వన ప్రవేశానికి సంబంధించిన ఏర్పాట్లను గిరిజన పూజారులతో అధికారులు చర్చించారు. 

వన జాతరలో భారీ జనం

భూపాలపల్లి : మేడారంలో వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పొటెత్తారు. ఈ రాత్రికి సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేయనున్నారు. అమ్మల వనప్రవేశంతో జాతర ముగియనుంది. 

భారత్ విజయలక్ష్యం 217

న్యూజిలాండ్ : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ ముందు 217 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాటింగ్ మెరో 76, పరమ్ ఉప్పల్ 34 పరుగులు చేశారు. 

చిన్నారి బలి కేసులో విచారణ వేగవంతం

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ చిన్నారి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే బుచ్చమ్మ, లక్ష్మమ్మ అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరు నరహరికి, అతని కొడుకు రంజిత్ కు చిన్నారిని అమ్మినట్టు సమాచారం. తల దొరికిన ఇంటి యజమాని కారు డ్రైవర్ ను సైతం పోలీసలు విచారిస్తున్నారు.

10:15 - February 3, 2018

హైదరాబాద్ : ఉప్పల్‌ చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి తల దొరికిన కేసులో మిస్టరీ వీడడం లేదు. చిన్నారి శరీరం ఎక్కడ దాచారు ? ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. పోలీసులు మాత్రం ఈ కేసులో అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. తల దొరికిన ఇంటి యజమాని కారు డ్రైవర్ రాజశేఖర్ ని, బుచ్చమ్మ, లక్ష్మమ్మ అనే ఇద్దరు మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.

చిలుకానగర్ లో రాజశేఖర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు జరిగినట్టు వదంతులు వ్యాపించాయి. స్థానికంగా ఉంటున్న మెకానిక్‌ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నరహరి, అతని కొడుకు రంజిత్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. పోలీసులు విచారణలో వాస్తవాలు బయటపడనున్నాయి. 

10:10 - February 3, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో ఉన్న 'నీట్' కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేగింది. జూనియర్లు..సీనియర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొంతమందికి గాయాలయినట్లు సమాచారం. దీనితో ఇతర విద్యార్థులు తీవ్ర భయాందోనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఈ కాలేజీలో చదువుతుంటారు. వివిధ రాష్ట్రాల నుండి రావడంతో విద్యార్థులు వారి వారి భాషల్లో మాట్లాడుతుంటారు. ఇదిలా ఉంటే

బీహార్ రాష్ట్రానికి చెందిన ఫస్టియర్ విద్యార్థిడిని థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. సీనియర్..జూనియర్ల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఓ జూనియర్ ను సీనియర్లు చితకబాదారు. తాడేపల్లి గూడెం రూరల్ పీఎస్ లో 15 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాలేజీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నీట్ కాలేజీలో ఘర్షణ..

తూర్పుగోదావరి : నీట్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఫస్టియర్ విద్యార్థిడిని థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. సీనియర్..జూనియర్ల మధ్య నిన్న రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఓ జూనియర్ ను సీనియర్లు చితకబాదారు. తాడేపల్లి గూడెం రూరల్ పీఎస్ లో 15 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాలేజీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

09:58 - February 3, 2018

హైదరాబాద్ : ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తాననే.. పవన్‌ ఎక్కడ ? హామీలను అమలు చేయకపోతే.. ప్రభుత్వాలను ప్రశ్నిస్తా..? రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలకులను నిలదీస్తా..? అంటూ ప్రకటనలు చేసే.. జనసేనాని ఏమయ్యాడు? కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా.. స్పందించడేమి? పవన్‌ సైలెన్స్‌లో అంతరార్థమేమిటి? బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపడంపై.. రాష్ట్రం ఒక్కసారిగా హీటెక్కింది. విమర్శలు, నిరసనలతో.. గరంగరంగా మారింది. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంత దూరమైన వెళ్తానన్న పవన్‌ మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. దీంతో ఆయన అజ్ఞాతంపై చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన జనసేనాని ఇప్పుడు ఏమయ్యారనే పలువురు అనుకుంటున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్‌ వంటి అంశాల ప్రస్తావనే లేదు. విభజన హామీల ఊసే లేదు. దీంతో ఏపీ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతిపక్ష నాయకులు కొన్ని చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు కూడా కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. జనసేన అధినేత పవన్‌ మాత్రం ఇంతవరకూ దీనిపై స్పందించలేదు.

మరోవైపు ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్‌ నుంచి స్పందన రాకపోవడంతో.. జనసేన కార్యకర్తలు కూడా నిరాశకు గురవుతున్నారు. ఈ కీలక సమయంలో అధినేత స్పందించకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు కూడా తప్పుబడుతున్నారు. రాజకీయపార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా..? అనే పవన్‌ ఈ కీలక సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లడంపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా.. ఆ అజ్ఞాతవాసి మౌనాన్ని వీడుతారా? లేదో? వేచి చూడాలి.

09:14 - February 3, 2018

నల్గొండ : జిల్లా టూ టౌన్ ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లు ఆచూకీ ఇంకా లభించలేదు. జిల్లా ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డు పల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఈయన విచారణ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం నుండి ఈయన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్లతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలిస్తున్నారు. మూడు పోలీసు బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి.

ముఖ్యంగా శ్రీనివాస్ హత్య కేసులో రాజకీయ వత్తిళ్లు తట్టుకోలేక...మరోవైపు ఎస్పీ మందలించడాని తట్టుకోలేక..హైకోర్టు మూడు రోజుల్లో శ్రీనివాస్ హత్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పని ఒత్తిడితోనే సీఐ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ?

మహారాష్ట్ర : రాష్ట్ర కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

08:18 - February 3, 2018

ఏలూరు : మద్యం మత్తులో కారు నడిపి ప్రాణాలు కోల్పోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్..నిర్లక్ష్యంగా నడుపవద్దని ఎన్నిమార్లు హెచ్చరికలు జారీ చేసినా మార్పు రావడం లేదు. కారులో నలుగురు వ్యక్తులు వెళుతున్నారు. అతివేగంగా వెళుతుండడంతో కారు అదుపు తప్పి పాలకొల్లు రైల్వే గేట్ ను ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణా జిల్లాకు చెందిన అనీల్, మనోజ్ కుమార్, శేషు మృతి చెందగా, సాయిలు చికిత్స పొందుతున్నాడు. అదుపు తప్పి రైల్వేగేటును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరికి గాయలయ్యాయి. 

08:14 - February 3, 2018

నల్గొండ : జిల్లాలో పలు విషాదఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను ఇటీవలే హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇతని సంతాప సభ కోసం జిల్లాకు వచ్చిన క్యాటరింగ్ యువకులు దుర్మరణం పాలయ్యారు.

సంతాప సభ ఏర్పాట్లను ఓ ఈవెంట్ సంస్థకు ఇచ్చారు. ఈవెంట్ లో పనిచేసే నలుగురు యువకులు జిల్లాకు వచ్చారు. బస్సులో ఎక్కిన వారు గమ్య స్థానం కంటే ముందుకు వెళ్లారు. తిరిగి బస్సు దిగి రోడ్డుపై నడుస్తుండగా అత్యంత వేగంగా వచ్చిన ఓ డీసీఎం వారిని ఢీకొంది. స్పాట్ లోనే ముగ్గురు యువకులు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

నల్గొండలో ప్రమాదం..ముగ్గురు మృతి...

నల్గొండ : అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మర్రిగూడ బైపాస్ వద్ద రోడ్డు దాటుతున్న యువకులను డీసీఎం ఢీకొంది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. బొడ్డుపలిల్ శ్రీనివాస్ సంతాప సభకు క్యాటరింగ్ ఏర్పాట్లు కోసం యువకులు వచ్చారు.

 

 

07:39 - February 3, 2018

కేంద్రబడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అటు విపక్షాలతోపాటు ... ఇటు ప్రభుత్వంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిత్రపక్షమంటూ మౌనంగా ఉంటుంటే... రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్న జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలోనూ.... కేబినెట్‌ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వచ్చింది. ఈ అంశంపై టెన్ టివి చర్చ చేపట్టింది. విజయవాడ స్టూడియోలో రమేష్ (వైసీపీ), పట్టాభిరామ్ (టిడిపి), ముత్యాల ప్రసాద్ (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

26 రైళ్ల రద్దు...

ఢిల్లీ : దేశ రాజధానిలో పొగమంచు దట్టంగా అలుముకొంటోంది. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతారయం కలుగుతోంది. 32 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 1 రైళు సమయంలో మార్పు చేయగా 26 రైళ్లను రద్దు చేశారు. 

నేడు వామపక్ష నేతల సమావేశం..

ఢిల్లీ : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వామపక్ష నేతల సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను లెఫ్ట్ పార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. 

06:47 - February 3, 2018

ముంబై : దలాల్ స్ట్రీట్‌లో మరో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. జైట్లీ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. బడ్జెట్ రుచించని ఇన్వెస్టర్లు... భారీగా అమ్మకాలకు దిగడంతో.. సెన్సెక్స్ కుప్పకూలింది. వారం ప్రారంభంలో 36వేల మార్క్ దాటి జోశ్ మీదున్న సెన్సెక్స్ ఇవాళ ఒక్కరోజే 840 పాయింట్లు నష్టపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో నాలుగున్నర లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోగా.. సెన్సెక్స్ చరిత్రలో ఏడో అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. ఒక్క ప్రతిపాదన.. ఒకే ఒక్క ప్రతిపాదన దలాల్‌ స్ట్రీట్‌ను కుదిపేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బడ్జెట్‌ కాస్తా మదుపర్ల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఇన్వెస్టర్‌కు కోపమొచ్చింది. ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రతిపాదనకు... పెరుగుతున్న ద్రవ్యలోటు తోడైంది. ఫలితం బడ్జెట్‌కు ముందు వరుస లాభాలతో రికార్డులను లిఖించిన స్టాక్‌ మార్కెట్.. బడ్జెట్‌ మరుసటి రోజే భారీగా పతనమైంది.

ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్ పతనం మొదలైంది. విదేశీ సంస్థాగత మదుపుదారులకు, దేశీయ ఇన్వెస్టర్లు తోడవడంతో... సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టాలతో మొదలైంది. ఆ పతనం అలాగే కొనసాగింది. మిడ్ సెషన్ తరువాత.. సెల్లింగ్ ప్రెషర్ పెరిగింది. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తికి తోడు.. వీకెండ్ కావడంతో... చివర్లో అమ్మకాలు జోరుగా సాగాయితం. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్లకు పైగా పతనమైంది. చివర్లో.. 840 పాయింట్ల నష్టంతో 35వేల 67 వద్ద సెన్సెక్స్ ముగిసింది. వారం ప్రారంభంలో... 11వేల 171 పాయింట్లకు చేరి ఆల్‌టైమ్ నమోదు చేసిన నిఫ్టి.. శుక్రవారం 256 పాయింట్ల నష్టంతో 10వేల 761 వద్ద క్లోజైంది. ఐటీ సెక్టార్ మినహా అన్ని రంగాల్లో భారీగా అమ్మకాలు సాగాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 4శాతానికి పైగా పడిపోయాయి. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, ఫార్మా, మెటల్స్ సూచీలు 3శాతం వరకు పతనమయ్యాయి. మార్కెట్ దిగ్గజం రిలయన్స్ 4శాతం పడిపోవడం మార్కెట్‌ను దెబ్బతీసింది. నిఫ్టీలో...బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 6శాతం పతనమైంది. టాటాపవర్, బజాజ్ ఆటో 5శాతం నష్టపోయాయి. అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్,స మారుతీ సుజ్‌కీ, రిలయన్స్, గెయిల్ 4శాతానికి పైగా క్షీణించాయి. ఐటీ, FMCG షేర్లలో కొన్ని మాత్రమే లాభాలు చూశాయి. టెక్ మహీంద్ర, HCL, TCS, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ స్వల్పలాభాల్లో ముగిశాయి. పరిస్థితి చూస్తుంటే.. కేంద్రం స్పందించకుంటే.. సెన్సెక్స్ మరో 500 పాయింట్లకు పైగా పతనమయ్యే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

06:45 - February 3, 2018

ఉత్తర ప్రదేశ్‌ : రాష్ట్రంలోని కాస్‌గంజ్‌లో చెలరేగిన అల్లర్లపై రాజ్యసభ అట్టుడికింది. కాస్‌గంజ్‌లో ముస్లింలను టార్గెట్‌ చేస్తున్నారని ఎస్‌పి మండిపడింది. అక్కడ హిందువును హిందువే చంపాడని...ముస్లింలపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. మరోవైపు బడ్జెట్‌లో ఏపికి జరిగిన అన్యాయంపై కెవిపి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. యుపీ ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొడుతోందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. కాస్‌గంజ్‌లో హిందువును హిందువే చంపితే ముస్లింలపై ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ బిజెపిపై ధ్వజమెత్తారు. ముస్లింల ఇళ్లలోకి వెళ్లి వారిని కొడుతున్నారని...తప్పుడు ఆరోపణలతో అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముస్లింల ఆస్తులను తగలబెడుతూ తీవ్ర నష్టం కలిగించారని పేర్కొన్నారు. ఎవరు ఎవరిని చంపారో తుపాకి పేల్చిన వీడియోలో స్పష్టంగా ఉందని రామ్‌గోపాల్‌ యాదవ్‌ అన్నారు.

కాస్‌గంజ్‌పై చర్చకు ముందస్తు నోటీసు ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎస్పీ నేతకు మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపి కేవీపీ రామచంద్రరావు ఆందోళన చేశారు. సభ ప్రారంభం కాగానే వెల్‌లోకి వెళ్లి 'సేవ్‌ ఆంధ్రప్రదేశ్' ప్లకార్డుతో నిరసన తెలిపారు.

నిరసన విరమించి సీట్లో కూర్చోవాలని డిప్యూటి చైర్మన్‌ ఎంత చెప్పినా కేవీపి వెనక్కి తగ్గలేదు. దీంతో సహనం కోల్పోయిన కురియన్‌ ఈయనకేమైనా పిచ్చిపట్టిందా అంటూ వ్యాఖ్యానించారు. ఆప్‌ నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యుల సైతం వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన తెలిపారు. దేశరాజధానిలో చేపట్టిన సీలింగ్ డ్రైవ్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్య రాజ్యసభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రశ్నొత్తరాలు కొనసాగాయి.

06:41 - February 3, 2018

వరంగల్ : మేడారానికి వీఐపీల తాకిడి పెరిగింది. శుక్రవారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమ్మక్కల, సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా.. జాతర ఏర్పాట్లపై వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. జాతరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఉత్సవాలు, పండగలు అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.

మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌ అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రెండు వందల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్‌ చెప్పారు. అమ్మవారి గద్దెల వద్ద సౌకర్యాల కోసం 200 నుంచి 300 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని ప్రధానిని కోరుతానని చెప్పారు.

అయితే వీఐపీల రాకతో.. సాధారణ ప్రజలు గంటల కొద్ది లైన్‌లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భక్తుల మధ్య తోపులాట సంభవించింది. దీంతో దర్శనం కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడ్డారు. గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడలేక... అధికారులపై మండిపడ్డారు.

అలాగే మంచిర్యాల జిల్లా.. మందమర్రి సింగరేణి ఏరియా.. పాలవాగు సమీపంలో నిర్వహించిన సమ్మక్కసారలమ్మ జాతరలో .. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, మాజీ మంత్రి జి .వినోద్, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్‌లు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని బెల్లం సమర్పించుకున్నారు.

06:38 - February 3, 2018

గుంటూరు : నూతన సంవత్సరం రోజున అగ్రకులాల వారి చేతిలో దాడికి గురైన గుంటూరు జిల్లా గొట్టిపాడులోని దళితులను ఎట్టకేలకు సీపీఎం, దళిత సంఘాల నేతలు పరామర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు కేవీపీఎస్‌ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. దళితవాడలో ఏర్పాటు చేసిన సభకు దళితులంతా హాజరై.. తమ సమస్యలు నేతలతో మొరపెట్టుకున్నారు.

గొడవ జరిగిన తర్వాత అగ్రకులాల వారు తమను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో దళితులు సీపీఎం, కేవీపీఎస్‌ నేతలకు తెలిపారు. అనేక రకాలుగా హింసిస్తున్నారని వాపోయారు. దళితులను ఎవరూ పొలం పనులకు పిలవకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మొరపెట్టుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దళితుల పిల్లలతో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదని, అగ్రకులాల వారు ఉంటున్న వీధుల్లోకి దళితులను రానివ్వడం లేదని.. మహిళలు సీపీఎం నేతలకు వివరించారు. నెల రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నట్టు తెలిపారు.

గొట్టిపాడు దళిత మహిళలు చెప్పిన సమస్యలను విన్న సీపీఎం, కేవీపీఎస్‌ నేతలు... దళితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. అగ్రకులాల వారు అహంకారపూరితంగా దాడులు చేస్తోంటే.. పోలీసులు, అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు చేసిన వారు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారని... అసలు దోషులపై 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గొట్టిపాడు దళితులకు న్యాయం కోరుతూ ఈ నెల 23 ఛలో గుంటూరు నిర్వహిస్తామని, రాష్ట్రంలోని దళితులు అందరూ గుంటూరు వస్తారని ఆయన చెప్పారు.

నెల రోజులుగా గొట్టిపాడులోకి ఎవరినీ అనుమతించని ప్రభుత్వం ఎట్టకేలకు సీపీఎం, దళిత సంఘాల నేతలను అనుమతించింది. దళితుల పోరాటానికి తలవంచింది. గ్రామంలోకి ప్రవేశించిన నేతలు... దళితులపై దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం దళితులతో కలిసి భోజనం చేశారు. సీపీఎం, కేవీపీఎస్‌ నేతల రాకతో తమకు ధైర్యం వచ్చిందని, భరోసా లభించిందని గొట్టిపాడు దళితులు తెలిపారు.

06:36 - February 3, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి న్యాయం జరుగుతుందని అందరూ భావించిన తరుణంలో పూర్తి నిరాశ ఎదురైంది. రాష్ట్రానికి రావాల్సిన విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణంతోపాటు విభజన చట్టం హామీలపై బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడం అందర్నీ తీవ్రంగా బాధించింది. బీజేపీ మిత్రపక్షమైనా అధికార టీడీపీ కేంద్ర తీరుపై మండిపడింది. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం భవిష్యత్ కార్యాచరణపై ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఏపీకి నిధులు తీసుకురావడంలో అధికార పార్టీ విఫలమైందని నిన్నటి దాకా వైసీపీ నేతలు ఆరోపించారు. తీరా బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అధికార పార్టీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులకు భయపడే వైసీసీ అధినేత జగన్ ప్రశ్నించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ కేంద్రాన్ని ఎదిరిస్తే కేసులు తిరగదోడతారనే ఆందోళనలో ఉన్నారు వైసీపీ నేతలు. ఇదే సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ప్రజల నుంచి ఇబ్బందులు తప్పవనే భావన పార్టీలో కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానని జగన్ గతంలో ప్రకటించారు. అయితే జగన్ కానీ, ఎంపీలు కానీ రాజీనామా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు బడ్జెట్‌పై స్పందిస్తున్నా... ఏం చేయబోతున్నామనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వం లేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ వైసీపీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. దీనిని అధిగమించేందుకు ప్రతిపక్ష వైసీపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. 

06:33 - February 3, 2018

విజయవాడ : కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌పై అన్ని పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగిస్తుందా? లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తుందో తేల్చుకోవాలని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం అన్యాయం చేస్తుంటే నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎందుకు గగ్గోలు పెడుతోందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేంద్రం చేసిన వాటికి ధన్యవాదాలు చెబుతామని.. చేయని వాటిపై యుద్ధం ప్రకటిస్తామని టీజీ.వెంకటేష్ ప్రకటించారు. చంద్రబాబుని అండర్ ఎస్టిమేట్ వేయవద్దని బీజేపీ నేతల్ని హెచ్చరించారు.

 

06:32 - February 3, 2018

విజయవాడ : బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదన్న విషయం వాస్తవమని.. అయితే.. సీఎం చంద్రబాబునాయుడు.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి.. వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తారని మంత్రి నారాయణ అన్నారు. అలాగే 2019 మార్చి కల్లా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి.. పేదలకు అందించడం జరుగుతుందని.. ఆయన చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా.. ఇళ్లు నిర్మించి .. అందిస్తామని ఆయన చెప్పారు.

06:30 - February 3, 2018

విజయవాడ : కేంద్రబడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అటు విపక్షాలతోపాటు ... ఇటు ప్రభుత్వంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిత్రపక్షమంటూ మౌనంగా ఉంటుంటే... రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్న జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలోనూ.... కేబినెట్‌ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారన్న వాదన పాలకుల నుంచి వ్యక్తమవుతోంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ, కేబినెట్‌ భేటీలోనూ వాడీవేడీగా చర్చ సాగింది. బడ్జెట్‌ ప్రకంపనలు కొనసాగాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపే విషయంలో మాత్రమే వేగంగా స్పందించిందని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత అన్నీ ఎదురు చూపులే మిగిలాయని అన్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన మాదిరే బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటామని మోదీతోసహా బీజేపీ నేతలంతా హామీనిచ్చారని.. అది ఆచరణలో కనిపించడంలేదని వ్యాఖ్యానించారు.

కొంతమంది బీజేపీ నేతలు ఏపీకి అన్నీ చేశామని... ప్రతీదాన్ని తేలిగ్గా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా... ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి.. దానికీ ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. లోటుబడ్జెట్‌ కింద 16వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం 4వేల కోట్లే ఇచ్చారని చెప్పారు. రెండు యూనివర్సిటీలకు ఇంకా పార్లమెంట్‌లో బిల్లుపెట్టలేదని తెలిపారు. బెంగళూరు మెట్రోరైలు కోసం 17వేల కోట్లు ఇచ్చారని.. అమరావతికి 2వేల కోట్లు ఇచ్చి సర్దుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు.

బీజేపీతో పొత్తుపై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశించారు. అన్ని కోణాల నుంచి ఆలోచించి అందరితో మాట్లాడి ఓ నిర్ణయానికి వద్దామన్నారు. ఇది రాజకీయ సమస్యకాదని... మన పోరాటం బీజేపీపై కాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలన్నదే మన ప్రయత్నమంటూ నేతలకు సర్దిచెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై తమ తమ అభిప్రాయాలు చెప్పాలని పార్టీ నేతలను చంద్రబాబు కోరారు.

రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలనే తాము కోరుతున్నామని... చంద్రబాబు అన్నారు. అవికూడా కేంద్రం చేయడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీకి తాము నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్నామని.. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ అందరినీ కలుస్తున్నా పనులు కావడం లేదన్నారు. ఏపీపట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదన్నారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌ ఏపీ ప్రభుత్వంతో అసంతృప్తిని రాజేసింది.

06:27 - February 3, 2018

విజయవాడ : పట్టణ పేదల ఇళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏడాది కాలంలో 5లక్షల ఇళ్లను పట్టణ ప్రాంతాల్లో నిర్మించాలని నిర్ణయించింది. 2019 మార్చి నాటికి వీటిని పూర్తి చేయాలని సంకల్పించింది. నిన్న అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఏడాదిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు టార్గెట్‌గా పెట్టుకుంది. 2019 మార్చి నాటికి వీటిని పూర్తి చేసేందుకు.. అవసరమైన రుణాలకు ప్రభుత్వ హామీ ఇవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 18వేల కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి పొందేందుకు మార్గం సుగమమైంది. పట్టణ పేదలకు మొత్తం 38, 265 కోట్లతో ఇళ్లు నిర్మిస్తున్నట్టు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా కంటెంట్‌, డ్రోన్‌ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫైబర్‌ నెట్‌ ద్వారా అందించే కార్యక్రమాల్లో ఏయే అంశాలను ప్రసారం చేయాలన్న విషయంలో స్పష్టత తీసుకొచ్చేందుకు వీలుగా కంటెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజ్ఞానం, సాంకేతికం, విద్య, ఆరోగ్యం, రాజకీయ రంగాలపై నిరంతరం అధ్యయనం చేసి సరైన సమాచారాన్ని ప్రజలకు అందించడమే కంటెంట్‌ కార్పొరేషన్‌ ప్రధాన ఉద్దేశం. అంతేకాదు.. డ్రోన్ల వినియోగంపై పర్యవేక్షణ, నియంత్రణ కోసం డ్రోన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పోలీసు, మైనింగ్‌, వ్యవసాయం, జలవనరులు, పర్యాటకం తదితర సేవలకు దీనిని వినియోగించనున్నారు.

గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 597 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 65 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రవాసాంధ్రులు సహకారం అందించనున్నారు. ప్రపంచబ్యాంకు సహకారంతో రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించే బాలామృతం తయారీని టాటా ట్రస్టుకు అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టు పనులకు ప్రత్యేక ముందస్తు నిధులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు పలు సంస్థలకు భూములను ప్రభుత్వం కేటాయించింది.

నేడు సమ్మక్క - సారలమ్మ వన ప్రవేశం...

వరంగల్ : నేడు సమ్మక్క - సారలమ్మ వన ప్రవేశం కార్యక్రమం జరుగనుంది. వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగియనుంది. శుక్రవారం సీఎం కేసీఆర్ దంపతులు సమ్మక్క - సారలమ్మను దర్శించుకున్న సంగతి తెలిసిందే. 

జగన్ 78వ రోజు పాదయాత్ర...

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 78వ రోజుకు చేరుకుంది. నేడు సర్వేపల్లి నియోజకవర్గం మరుపూరు నుండి జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

ఎయిర్ ఇండియా వేలం...

న్యూఢిల్లీ : నష్టాల్లో నడుస్తోందని పేర్కొంటున్న ప్రభుత్వ విమానయాన సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. నష్టాల్లో కూరుకపోయిన ఎయిర్ ఇండియాకు తిరిగి మహర్దశ తీసుకొచ్చేందుకు దీనికింద ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్ లోగా బిడ్డింగ్ నిర్వహించి డిసెంబర్ కల్లా చట్టబద్ధమైన ముగింపు పలకాలని భావిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. 

దుబాయికి వెళ్లనున్న బాబు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 8న దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ కానున్నారు. 

సోప్ కేసుల్లో హెరాయిన్ తరలింపు...

అసొం : గౌహతిలోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 38 సోప్ కేసుల్లో తరలిస్తున్న 500 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మధురై మీనాక్షి దేవాలయం వద్ద అగ్నిప్రమాదం...

చెన్నై : తమిళనాడులో మధురై మీనాక్షి దేవాలయం వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. 

అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు పరిహారం...

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించనుంది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 96 కుటుంబాలకు ఈ పరిహారం సీఎం బాబు అందించనున్నారు. 

కేంద్ర బడ్జెట్ పై ఏపీ కేబినెట్ లో చర్చ...

విజయవాడ : కేంద్ర బడ్జెట్ పై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్ లో శాఖా వారీ కేటాయింపులపై ఆర్థిక శాఖ కార్యదర్శి రవి చంద్ర వివరించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాజకీయ నిర్ణయం తీసుకుందామని బాబు పేర్కొన్నారు. తొందరపడి ఎవరూ ఏదీ పడితే అది మాట్లాడవద్దని, జరిగిన అన్యాయంపై పోరాటం ఉంటుందని బాబు తెలిపారు. విశాఖకైనా మెట్రో ఇస్తే బాగుండేదని మంత్రి గంటా పేర్కొనగా విశాఖ కన్నా చిన్న నగరాలకు మెట్రో ఇచ్చారని బాబు వివరించారు. 

Don't Miss