Activities calendar

04 February 2018

తెలంగాణలో ఏఎన్ ఎంల వేతనాలు పెంపు

హైదరాబాద్ : తెలంగాణలో ఏఎన్ ఎంల వేతనాలు టీసర్కార్ పెంచింది. పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. రూ.10 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు. సెకండ్ ఏఎన్ ఎమ్ ల వేతనాల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. 

22:15 - February 4, 2018

2019లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ దే గెలుపు అని బీఎల్ ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ ఎస్ లకు ప్రత్యామ్నాయం బీఎల్ ఎఫ్ అని..వేరే ఫ్రంట్ ఏర్పడే అవకాశమే లేదన్నారు. సైద్ధాంతిక పరంగా బీఎల్ ఎఫ్ ఏర్పాటు అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎల్ ఎఫ్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జ్యోతిబాపూలే, అంబేద్కర్, మార్క్స్ సిద్ధాంతాలు ప్రత్యర్థులను ఎదుర్కొనగలవని అన్నారు. భారత రాజ్యాంగమే బ్రహ్మాండమైన మ్యానిఫెస్టో అని తెలిపారు. విద్య కార్పొరేట్ మయం అయిందని వాపోయారు. ఇవి విలువులు లేని ప్రభుత్వాలు అని విమర్శించారు. కేసీఆర్.. విలువలేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

22:07 - February 4, 2018

దక్షిణాఫ్రికా : టెస్టు సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోంది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందు బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా తర్వాత బ్యాటింగ్‌లో విరుచుకుపడింది. కేవలం ఒక వికెట్ కోల్పోయి.. లక్ష్యాన్ని చేరుకుంది. 

తొలి వన్డేలో ఓటమితో ఆత్మవిశ్వాసం లోపించడం, గాయాలతో సారథి డుప్లెసిస్‌, సీనియర్‌ ఆటగాడు డివిలియర్స్‌ జట్టుకు దూరం కావడంతో... సౌతాఫ్రికా... సొంతగడ్డపైనే కష్టపడుతోంది. తొలి వన్డేలో ఓడిన సఫారీలు.. సెంచూరియన్‌లో జరిగిన రెండోవన్డేలో ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్... సఫారీలను ఏమాత్రం నిలవనీయలేదు. ఆతిథ్యజట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మణికట్టు స్పిన్‌ ద్వయం యజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కకావికలం చేశారు. సఫారీ జట్టును తమ సొంతగడ్డపైనే తొలిసారి అత్యంత తక్కువ స్కోరు 118కి ఆలౌట్‌ చేశారు. ఆరంభంలో హషీమ్‌ ఆమ్లా, డికాక్ దూకుడుగానే బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆమ్లాను ఔట్‌ చేయడం ద్వారా భువనేశ్వర్‌ ఈ జోడీని విడదీశాడు. జట్టు స్కోరు 51 వద్ద మరో ఓపెనర్‌ డికాక్‌ను పెవిలియన్‌ పంపించి చాహల్‌ విజృంభించాడు. ఆ తర్వాత ఓవర్‌లో తాత్కాలిక సారథి మార్కమ్‌, డేవిడ్‌ మిల్లర్‌ ను ఔట్‌ చేసి భారీ దెబ్బ కొట్టాడు కుల్‌దీప్‌. దీంతో 51 వద్దే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు చేజార్చుకుంది. ఆ తరువాత డుమిని, జొండొ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు 99 వద్ద జొండోను, 107 వద్ద డుమినిని చాహలే పెవిలియన్‌కు పంపడంతో సఫారీల కథ దాదాపు ముగిసింది. టెయిలెండర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో... సౌతాఫ్రికా 118 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా చివరి ఆరు వికెట్లను 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకోవడం గమనార్హం. చాహల్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా అవతరించాడు. 

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 15 పరుగుల వ్యక్తిగత స్కోరుకే ఔటైనా... ధావన్, కెప్టెన్ కోహ్లీ... స్కోరుబోర్డును పరుగెత్తించారు. మరో వికెట్‌ పడకుండా 20.3 ఓవర్లలోపే జట్టుకు విజయాన్ని అందించారు. అయితే విజయానికి మరో 2 పరుగులు ఉండగా... లంచ్ బ్రేక్ వచ్చింది. సఫారీల ఇన్నింగ్స్‌ త్వరగా ముగియడంతో టీమిండియా.. లంచ్ కంటే ముందే బ్యాటింగ్‌కు దిగింది. దీంతో మరో రెండు పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా నిబంధనల ప్రకారం అంపైర్లు ఆటకు విరామం ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. ధావన్ 51 పరుగులు చేయగా... కోహ్లీ 46 రన్స్ చేశాడు. 5 వికెట్లు తీసిన చాహల్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

22:03 - February 4, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఏసీబీ అధికారులు అనూహ్యంగా దాడులు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ కట్టా పురుషోత్తమ్‌ రెడ్డి డ్రైవర్‌  ఇంట్లో  సోదాలు చేశారు. ఎల్లమ్మబండలోని ఆగమయ్య ఇంట్లో జరిపిన తనిఖీల వ్యవహారాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ దాడుల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. 

 

22:00 - February 4, 2018

నల్గొండ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని లెఫ్ట్‌ నేతలు స్పష్టం చేశారు. రాజ్యాధికారమే లక్ష్యంగా వామపక్షపార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు నల్లగొండలో ఘనంగా మొదలయ్యాయి. అన్ని వామపక్ష పార్టీలతో కలిసి విశాల ఐక్య ఉద్యమాలు నిర్మించనున్నట్టు సమావేశంలో సీపీఎం నాయకులు తెలిపారు.
సీపీఎం మహాసభలు ఘనంగా ప్రారంభం
నల్లగొండ పట్టణం ఎర్రగొండగా మారింది. ప్రధాన వీధులన్నీ అరుణవర్ణశోభితమయ్యాయి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం ఎరుపెక్కింది. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సీపీఎం మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రెడ్‌ వాలంటీర్లు కవాతు 
మహాసభల ప్రారంభసూచికగా నగరంలో సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. రెడ్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ఎర్రజెండాలు చేతబూని రెడ్‌షట్‌ వాలంటీర్లు నిర్వహించిన కవాతు ప్రధాన వీధుల గుండా సాగింది. స్థానిక సీపీఎం కార్యాలయం దొడ్డికొమురయ్య భవన్‌ నుంచి ప్రారంభమైన ఈ కవాతు...మహాసభలు జరుగుతున్న ప్రాంగణం లక్ష్మీ గార్డెన్స్‌ వరకు కొనసాగింది. ఈ కవాతులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతోపాటు రాష్ట్ర సీపీఎం నాయకత్వం పాల్గొంది.
బడ్జెట్‌లో సామాన్యులపై పన్నుల భారం : ఏచూరీ
లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులపై పన్నుల భారం మోపారని విమర్శించారు. ధనికులపై పైసా పన్నువేయలేదని... కార్పొరేట్‌ శక్తులకు, సంపన్నులకు మోదీ ప్రభుత్వం వత్తాసుపలుకుతోందని దుయ్యబట్టారు. రైతుల రుణాల మాఫీ చేయమంటే డబ్బులు లేవన్న కేంద్ర ప్రభుత్వం... సంపన్నులు తీసుకున్న రెండు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం సిగ్గుచేటన్నారు.
దళితులు, మైనార్టీలపై పెరిగిన దాడులు : బివి.రాఘవులు  
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు లైంగిక దాడులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ నుంచి భారత దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
వామపక్షాలు అధికారంలోకి రావడం తథ్యం : తమ్మినేని 
రాన్నున్న రోజుల్లో వామపక్షాలు అధికారంలోకి రావడం తథ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నంగా ఎదుగుతున్నామన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా సీపీఎం కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఇందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడిందన్నారు. సీపీఎం మహాసభలు 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భవిష్యత్‌ ఉద్యమ కార్యక్రమాలపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు.

 

21:53 - February 4, 2018

విశాఖ : టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై బీజేపీ ఎమ్మెల్సీ  సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అయ్యన్న పాత్రుడు కౌంటర్‌ ఇచ్చారు. సోము వీర్రాజు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిదన్నారు. చంద్రబాబు విమర్శించే అర్హత సోము వీర్రాజుకు లేదన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది హెచ్చరించారు. కేంద్ర నిధుల్లో అవినీతి జరిగితే రుజువు చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. 

 

21:49 - February 4, 2018

కర్నూలు : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై మాటల దాడిని మరింత ఉధృతం చేశారు. సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు సంధించారు. తాము నిప్పులాంటి వారిమని... టీడీపీ నేతలు అవినీతిపరులని ఆరోపించారు. ఏపీలో రూలింగ్‌ లేదని... కేవలం ట్రేడింగ్‌ మాత్రమే జరుగుతుందన్నారు. రెండెకరాల రైతును అంటున్న బాబుకు... లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది తామేనని.... కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థపరులకు ఆదాయ వనరులుగా మారాయన్నారు. సీఎం నియోజకవర్గంలోనే రూ.10కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

 

21:42 - February 4, 2018

గుంటూరు : బీజేపీపై కారాలు.. మిరియాలు దువ్విన టీడీపీ స్వరంలో మార్పు వచ్చింది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్న టీడీపీ నాయకులు... వేచి చూసే ధోరణి రాగం అందుకున్నారు. బీజేపీతో పొత్తు పాటిస్తూనే నిధుల కోసం ఒత్తిడి పెంచాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. అప్పటికే కేంద్రం తీరులో మార్పురాకుంటే పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రజా ప్రయోజనాలే ముఖ్యం: చంద్రబాబు
బీజేపీతో పొత్తు విషయంలో రెండు రోజులుగా సాగిన హైడ్రామాకు టీడీపీ తెరదించింది. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం చేయాలని.. ఈ విషయంలో కేంద్రంతో పోరుకు టీడీపీ రెడీ అయ్యిందన్న వార్తలు వచ్చాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచైనా నిధులు రాబట్టుకోవాలని నిర్ణయం జరిగింది. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై ఎంపీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మిత్రధర్మం పాటిస్తూనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అప్పటికీ కేంద్రంలో మార్పురాకపోతే ఏం చేయాలో ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు వివరించారు. పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై నిరసన తెలపాలని కూడా నిర్ణయించారు. 
ప్రజల ఆకాంక్షలే ప్రజలకు ముఖ్యం: చంద్రబాబు
కేంద్రంతో టీడీపీకి ఎలాంటి లాలూచీ లేదని చంద్రబాబు అన్నారు. రాజీనామాలు చేయడం, మంత్రి పదవులు వదులుకోవడం నిమిషం పనని... ఏది ఎప్పుడు చేయాలన్నది రోజువారీ పరిణామాలే నిర్ణయిస్తాయన్నారు. నిన్నటి వరకు ఒత్తిడి అన్నది అంతర్గతం... రేపటి నుంచి బహిర్గతం అన్నారు. ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వానికి ముఖ్యమని..ఆ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుదామన్నారు. పరుష పదజాలంతోకాకుండా... హుందాగానే వ్యవహరించాలని సూచించారు. తనకు  ఎవరి మీద కోపంలేదని... కేంద్రంపైనా, బీజేపీపైనా వ్యతిరేకత లేదన్నారు. నన్ను నమ్మిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నా ముందున్న కర్తవ్యమన్నారు. మనకు కావాల్సింది హామీలు కాదని.. ఆచరణ కావాలన్నారు. కేంద్రం చర్యలను బట్టే మన ప్రతిచర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. పునర్వ్యస్థీకరణ చట్టం చేసింది కేంద్రమేనని... దానికి కస్టోడియన్‌ కేంద్రమేన్నారు. ఆ చట్టంలోని  హామీలను ఏవి అమలు చేశారో రివ్యూ చేయమని కోరామని గుర్తు చేశారు.  ఇప్పటికి 28సార్లు ఢిల్లీ వెళ్లాలని.. హామీలు అమలు చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 
రంగంలోకి దిగిన బీజేపీ అధిష్టానం
బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంటుండడంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎంపీలతో చంద్రబాబు సమావేశంలో ఉండగానే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మూడుసార్లు రాజ్‌నాథ్‌ ఫోన్‌ చేసినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు మళ్లీ రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్‌ చేశారు. చంద్రబాబును తొందరపడవద్దని రాజ్‌నాథ్‌సింగ్ కోరారు. ఏపీకి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైనా చర్చిద్దామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌తో మెత్తబడ్డ టీడీపీ
అప్పటి వరకు కేంద్రంపై కారాలు మిరియాలు దువ్విన టీడీపీ నేతలు సమావేశం ముగిసేసరికి మెత్తబడ్డారు. టీడీపీ స్వరంలో మార్పు వచ్చింది. కేంద్రంపై యుద్ధానికి సిద్ధమంటూనే వేచిచూసే ధోరణి అవలంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సందర్భాన్ని బట్టి పార్లమెంట్‌లో గళం వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పొత్తు విషయంలోనూ మరికొంతకాలం వేచి చూద్దామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను బీజేపీ ఇవ్వని పక్షంలో తదుపరి కార్యాచరణపై పార్టీ అధినేత చంద్రబాబు  నిర్ణయం తీసుకుంటారని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. 
ఇరకాటంలో బీజేపీ అగ్రనాయకత్వం
జాతీయ స్థాయిలోనూ టీడీపీ- బీజేపీ వివాదం చర్చనీయాంశమైంది. టీడీపీ తీరుతో బీజేపీ అగ్రనాయకత్వం ఇరకాటంలో పడ్డట్టు కనిపిస్తోంది. బడ్జెట్‌పై జరిగే చర్చలో మిత్రపక్షాల నుంచే ఎదురుగాలి తగులుతుందని కమలనాథుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే దిద్దుబాటు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగమే చంద్రబాబుతో రాజ్‌నాథ్‌ మాట్లాడటం. మిత్రులను కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మొత్తానికి కేంద్రంతో తాడోపేడోకు సిద్ధమైన టీడీపీ... చివరకు రాజ్‌నాథ్ ఫోన్ తరువాత వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. 

 

పూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ సైనికులు కాల్పులు

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. నలుగురు భారత జవాన్లు మృతి చెందారు. 

 

21:02 - February 4, 2018

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఏపీపై కేంద్రం అలసత్వం ప్రదర్శించడంతోపాటు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 'బడ్జెట్ లో ఏపీకి అన్యాయం.. కేంద్రప్రభుత్వం తీరుపై టీడీపీ ప్రభుత్వం వైఖరి ఏంటీ? అనే అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఏపీ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:25 - February 4, 2018
20:23 - February 4, 2018
20:18 - February 4, 2018
20:13 - February 4, 2018

విశాఖ : సింహాచలం భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతోంది. సర్వే నెంబర్ 13లోని ఆలయ భూముల్లో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాంకు చెందిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. కూల్చివేతలను ఆపేందుకు మాజీ ఎమ్మెల్యే యత్నంచగా.. అధికారులు అడ్డుకున్నారు. భూములు ఆలయానికి చెందినవని ఈవో వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:10 - February 4, 2018

నల్గొండ : కాంగ్రెస్‌ పార్టీ కోసం, కార్యకర్తలకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధమన్నారు కాంగ్రెస్‌నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్‌యే కిరాయి రౌడీలను పెట్టించి తనను బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. శ్రీనివాస్‌ హత్యతో కేసీఆర్‌ ప్రమేయం లేకపోతే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. లేదంటే ఈ హత్యకు కారణం కేసీఆర్‌ అని ప్రజలు నమ్ముతారన్నారు. నల్లగొండ నడిబొడ్డున శ్రీనివాస్‌ విగ్రహాన్ని చేయించి ప్రజల గుండెల్లో నిలిచే విధంగా విగ్రహావిష్కరణ చేయిస్తామన్నారు. 

 

20:07 - February 4, 2018

నల్గొండ : కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో జిల్లా మంత్రికి సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభను ఇవాళ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీనివాస్‌ హత్య వెనకాల రాజకీయ కుట్ర ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

 

20:05 - February 4, 2018

అనంతపురం : కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తోందని.. ఏపీ సీపీఐ  రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో కూడా నిధుల కేటాయింపులో తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు. కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 8న రాష్ర్ట బంద్‌ చేపడుతున్నామని ప్రకటించారు. కేంద్రబడ్జెట్‌పై సీఎం బాబుతో సహా ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపకపోవడం విచారకరం అన్నారు.  కేంద్రానికి నిరసన తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

 

20:00 - February 4, 2018

అనంతపురం : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశాయని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మండి పడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా... ఈనెల 5నుంచి 15 వరకూ అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే ఈనెల 8న వామపక్షాలు చేపట్టిన బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా తెలిపారు.

 

18:52 - February 4, 2018

దక్షిణాఫ్రికా : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్‌లో సౌతాఫ్రికాను కట్టడి చేసిన భారత్... బ్యాటింగ్‌లోనూ విజృంభించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 20.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. దావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా..కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేశాడు. అంతకుముందు 118 పరుగులకే  సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. చాహల్, కుల్‌దీప్ దెబ్బకు సఫారీలు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చాహల్‌ 5 వికెట్లు తీశారు.  

 

18:41 - February 4, 2018

నల్గొండ : కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో జిల్లా మంత్రికి సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభను ఇవాళ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీనివాస్‌ హత్య వెనకాల రాజకీయ కుట్ర ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

 

18:35 - February 4, 2018

నల్గొండ : రాజ్యాధికారమే లక్ష్యంగా సీపీఎం కార్యకర్తలు పనిచేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఎం ఎదిగేలా కార్యకర్తల పని ఉండాలన్నారు. ఇందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడిందని తెలిపారు. 

18:31 - February 4, 2018

నల్గొండ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలుసహా అన్ని తరగులు ప్రజానీకంపై దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పసి పిల్లలు మొదలుకొని... మహిళల వరకు లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ నుంచి భారత దేశానికి విముక్తి కల్పించాలన్నారు. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. 

 

18:26 - February 4, 2018

నల్లగొండ : ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభసూచికంగా నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్‌షర్ట్‌ వాలంటీర్స్‌ కవాతు నిర్వహించారు. భారీ ఎర్రజెండాలు చేబూని సీపీఎం అగ్రనేతలు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో నల్లగొండ ఎర్రగొండగా మారింది. అనంతరం లక్ష్మీ గార్డెన్స్‌లో బహిరంగ సభ నిర్వహించారు. 

 

దక్షిణాఫ్రికాపై భారత్ విజయం

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 119 పరుగుల లక్ష్యాన్ని 20.1 వోవర్లలోనే ఛేదించింది. 

 

18:06 - February 4, 2018

గుంటూరు : కేంద్ర బడ్జెట్‌ ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున పార్లమెంట్‌లో పోరాడుతామని తెలిపారు. ఏపీకి న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అప్పటికీ కేంద్రంలో మార్పులేకపోతే.. ఏంచేయాలన్నది నిర్ణయించుకుంటామని చెప్పారు. కేంద్రం అంతవరకు పోకుండా ఏపీకి న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోన్న రామ్మోహన్‌నాయుడితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది.

 

జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా టీడీపీ, బీజేపీ వివాదం

గుంటూరు : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ తో ఏపీ సీఎం చంద్రబాబు మెత్తబడ్డారు. మోడీ, అమిత్ షాతో సంప్రదింపుల తర్వాతే కేంద్రం నుంచి తప్పుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక వనరులపై మోడీతో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో టీడీపీ, బీజేపీ వివాదం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకత్వం ఇరకాటంలో పడింది. బడ్జెట్ చర్చలో మిత్రపక్షం నుంచే వ్యతిరేకత వచ్చిందని బీజేపీ ఆందోళన చెందుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.

17:55 - February 4, 2018

గుంటూరు : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ తో ఏపీ సీఎం చంద్రబాబు మెత్తబడ్డారు. మోడీ, అమిత్ షాతో సంప్రదింపుల తర్వాతే కేంద్రం నుంచి తప్పుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక వనరులపై మోడీతో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో టీడీపీ, బీజేపీ వివాదం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకత్వం ఇరకాటంలో పడింది. బడ్జెట్ చర్చలో మిత్రపక్షం నుంచే వ్యతిరేకత వచ్చిందని బీజేపీ ఆందోళన చెందుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. కేంద్రంపై యుద్ధమంటూనే వేచి ఉండే యోచనలో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. పొత్తు విషయంలో మరికొంత సమయం వేచి చూసే ధోరణిలో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 
 

చెన్నంపల్లి కోటలో 15 రోజుల తర్వాత మళ్లీ తవ్వకాలు

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 15రోజుల తరువాత తవ్వకాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. తవ్వకాల్లో ఇవాళ ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. వీటిని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. 

17:46 - February 4, 2018
17:45 - February 4, 2018

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 15రోజుల తరువాత తవ్వకాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. తవ్వకాల్లో ఇవాళ ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. వీటిని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:42 - February 4, 2018

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు వాగ్దానాలేతప్ప... పెద్దగా నిధుల కేటాయింపు జరుగలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శింవచారు. సామాన్యులపై పన్నుల భారం మోపిన కేంద్రం... ధనికులపై పైసా పన్ను వేయలేదన్నారు.  మోదీ ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదని ధ్వజమెత్తారు.  నల్లగొండలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీ చేయాలంటే డబ్బులు లేవని చెప్తోన్న మోదీ ప్రభుత్వం.... సంపన్నులు తీసుకున్న రెండు లక్షల కోట్లను  మాఫీ చేయడం సిగ్గుచేటన్నారు. సంపన్నులు, కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం వంతపాడుతోందని దుయ్యబట్టారు.  బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చాక.. ఆర్థిక, సామాజిక దోపిడీ పెరిగిందన్నారు. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ మతరాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 


 

చంద్రబాబుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌

గుంటూరు : బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై... కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సమయంలోనే.. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్... ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చని.. సూచించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌తో కేంద్రంపై దూకుడుగా వెళ్లాలనుకున్న బాబు... వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపాలని సీఎం నిర్ణయించారు. 

 

17:37 - February 4, 2018

గుంటూరు : తెలుగుదేశం పార్టీకి బీజేపీతో మిత్రబంధంకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో గళం విప్పాలని తమ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని..  వాటి సాధనకు కేంద్రంతో పోరాడుతామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, అమరావతి నిర్మాణం, రైల్వే జోన్‌ డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని కోరారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను బీజేపీ ఇవ్వని పక్షంలో తదుపరి కార్యాచరణపై పార్టీ అధినేత చంద్రబాబు  నిర్ణయం తీసుకుంటారని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం కూడా గుర్తించిందని... న్యాయం చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. 
 

 

17:29 - February 4, 2018

గుంటూరు : బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై... కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సమయంలోనే.. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్... ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చని.. సూచించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌తో కేంద్రంపై దూకుడుగా వెళ్లాలనుకున్న బాబు... వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపాలని సీఎం నిర్ణయించారు. 

 

17:22 - February 4, 2018

దక్షిణాఫ్రికా : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ బౌలింగ్ దెబ్బకు సఫారీలు విలవిలలాడిపోయారు. చాహల్, కుల్‌దీప్ చెలరేగిపోవడంతో... 118 పరుగులకే సౌతాఫ్రికా పెవిలియన్ చేరింది. 32.2 ఓవర్లకే సఫారీలు ఆలౌట్ అయ్యారు. చాహల్ 5 వికెట్లు తీయగా.. కుల్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, బుమ్రా.. చెరో వికెట్ తీశారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డుమిని, జోండో చెరో 25 పరుగులు చేయగా.. ఆమ్లా 23, డికాక్ 20 రన్స్ చేశారు. ఇద్దరు డకౌట్ కాగా.. మరో ఇద్దరు ఒక పరుగుకే ఔటయ్యారు. 

 

17:15 - February 4, 2018

నల్గొండ : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీసర్కార్ విఫలమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చాక ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని కూడా పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. యువతీయువకులకు ఉద్యోగ అశకాశాలు లేవని తెలిపారు. కార్మికవర్గం నిరాశలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కలు లేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో రెండో రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు నిర్వహించామని తెలిపారు. మల్లన్నసాగర్ లో అక్రమ పద్ధతిల్లో ప్రభుత్వం భూములు లాక్కొంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన, పోరాటాలు నిర్వహించామని తెలిపారు. 

 

పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నారు : సీఎం చంద్రబాబు

గుంటూరు : పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ ఇప్పటికీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాల్ డేటాపై సమగ్ర దర్యాప్తు : ఎస్పీ

నల్గొండ : కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాల్ డేటా పై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కోర్టు అనుమతితో నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో పారదర్శకంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. 

దక్షిణాఫ్రికా 118 పరుగులకు ఆలౌట్

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 32.2వోవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయలక్ష్యం 119 పరుగులుగా ఉంది. 

తొమ్మిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 118 పరుగుల వద్ద తాహీర్ ఔట్ అయ్యారు.

 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 117 పరుగుల వద్ద మోర్కెల్ (1) ఔట్ అయ్యారు. 

 

15:33 - February 4, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని గన్నారం పెట్రోల్‌ పంపులో కల్తీ జరుగుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తమ ద్విచక్ర వాహానాలు పాడవుతున్నాయని వారు వాపోతున్నారు. పెట్రోల్‌లో నీరు కలవడంతో బైక్‌ ఆగిపోతుంటే మోకానిక్‌కి చూపించామని.. పెట్రోల్‌ తీసి చూస్తే.. అందలో నీరు కలిసినట్లు గుర్తించామని తెలిపారు. దీంతో వారు బంక్‌ సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించే సరికి బంక్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు బంక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఏడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 110 పరుగుల వద్ద రబడ (1) ఔట్ అయ్యారు. 

ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 107 పరుగుల వద్ద డుమ్నీ (25) ఔట్ అయ్యారు. 

 

ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా : సెంచూరియన్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 99 పరుగుల వద్ద జొండో 25 ఔట్ అయ్యారు. 

15:21 - February 4, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై అధికార తెలుగుదేశం పార్టీ ఏమాత్రం స్పందించడం లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. ఈనెల 8న వామపక్షాలు బంద్‌ తలపెట్టినట్లు తెలిపారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు లభిస్తుందని.. కాంగ్రెస్‌ పార్టీ కూడా బంద్‌కు సహకరిస్తున్నట్లు తెలిపిందని గఫూర్‌ తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తన వైఖరీ ఎంటో స్పష్టం చేయాలన్నారు.

15:18 - February 4, 2018

ఢిల్లీ : విభజన చట్టంలోని హామీలు నెరవేర్చుకోవడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యారని... దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తెలుగు రాష్ట్రాల ఎంపీలు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేవలం ఎన్నికల‌ బడ్జెట్ మాత్రమేనని, అది కార్పొరేట్‌ రంగానికి మేలు చేసేలా ఉందన్నారు. 

 

నల్లగొండలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రారంభం

నల్లగొండ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. మేకల అభినవ స్టేడియం నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రారంభం అయింది. పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు కవాతను ప్రారంభించారు.

సభా స్థలికి చేరుకున్న ఏచూరి, రాఘవులు, తమ్మినేని

నల్లగొండ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, వీరయ్య, జూలకంటి రంగారెడ్డి సభా స్థలికి చేరుకున్నారు. 

14:51 - February 4, 2018

గుంటూరు : రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. విభజన వల్ల అన్యాయం జరిగిందన్నారు. విభజన హామీలపై గట్టిగా పోరాడాలని నిర్ణయించామని తెలిపారు. 

 

పార్లమెంటరీలో మా నిరసన తెలియజేస్తాం : సుజనా చౌదరి

గుంటూరు : అమరావతిలో రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని సుజనాచౌదరి అన్నారు. పార్లమెంటరీలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. 

పార్లమెంటరీలో మా నిరసన తెలియజేస్తాం : సుజనా చౌదరి

గుంటూరు : అమరావతిలో రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని సుజనాచౌదరి అన్నారు. పార్లమెంటరీలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. 

13:44 - February 4, 2018

హైదరాబాద్ : మేడమెట్లు ఎక్కిస్తున్నాడనుకుంటున్న ఈ అమాయకపు తల్లికి తెలీదు.. తన కొడుకు మృత్యువు దగ్గరకు నెట్టేస్తున్నాడని..చితకబాదుతున్నా మౌనంగా భరించిన ఈ తల్లికీ తెలియదు.. తన కొడుకు చితికి చేరవేస్తున్నాడని..కన్నబిడ్డలే తల్లుల పట్ల కర్కశత్వంగా ప్రవర్తించిన ఈ రెండు ఘటనలు దేశ ప్రజల్ని కలచివేశాయి. గుజరాత్‌, రాజస్ధాన్‌లలో ఇద్దరు ఉన్నత విద్యావంతులు తమ తల్లుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. అవసాన దశలో ఉన్న వారికి సపర్యలు చేయాల్సింది పోయి వారిని పొట్టనపెట్టుకున్నారు.గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన ప్రొ.సందీప్‌ తల్లి జయశ్రీబెన్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది సెప్టెంబర్ 27న ఆమె ఇంటి భవనంపై నుంచి కిందపడి చనిపోయింది. ఆరోగ్యం సరిగా లేదన్న బెంగతో తన తల్లి ఆత్మహత్య చేసుకుందని సందీప్ అందర్నీ నమ్మించాడు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులకు వాస్తవం తెలిసింది. సందీప్‌ బలవంతంగా తల్లిని లాక్కెళ్లి మేడపై నుంచి కిందకు తోసేసాడు.

కన్నతల్లిని చిత్రహింసలు పెట్టి
రెండురోజుల క్రితం రాజస్ధాన్‌ రాష్ట్రంలోని అల్వార్‌లో జోగేంద్ర చౌదరి అనే ఉపాధ్యాయుడు కన్నతల్లిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు. పక్షవాతంతో బాధపడుతున్న జోగేంద్ర చౌదరి తల్లి కొద్దిరోజులుగా అతని వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే జోగేంద్రకు అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తల్లిని హింసించడం మొదలుపెట్టాడు. ఆ బాధలు భరించలేకపోయిన ఆ తల్లి కన్నుమూసింది. తల్లిని హింసించిన వీడియో బయటకు రావడంతో జోగేంద్ర వ్యవహారం బట్టబయలైంది. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ...కన్నతల్లుల మరణానికి కారకులైన వీరిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. 

13:43 - February 4, 2018

హైదరాబాద్ : నార్త్‌జోన్‌లో అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 600 ఏళ్ల క్రితం నాటి మూడు కోట్ల విలువైన పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో షేక్‌ హైదర్‌, షేక్‌ అజీజ్‌లు ఉన్నారు. వీరిద్దరు కర్ణాటక రాష్ట్రం బీదర్‌ బాల్కీకి చెందిన వారిగా గుర్తించారు. నిందితులపై గతంలో మహారాష్ట్రలో కూడా రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

13:22 - February 4, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ కు కేవీపీ లేఖ రాశారు. కురియన్ వ్యాఖ్యలపై కేవీపీ ఘాటుగా స్పందించారు. కురియన్ రాజ్యసభ సంప్రదాయాల్ని గౌరవించాలని కేవీపీ సూచించారు. తనను పిచ్చోడిగా సంభోదించినందుకు బాధగా లేదు కానీ ఏపీకి జరిగిన అన్యాయం చూసి నిజంగానే పిచ్చోడినయ్యానని కేవీపీ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పొత్తులపై ఎక్కడా మాట్లాడొద్దు : అమిత్ షా

ఢిల్లీ : పార్టీ  పొత్తులపై ఎక్కడా మాట్లాడవద్దని బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. చంద్రబాబుతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దుతానని ఆయన పార్టీ నేతలకు తెలిపారు. 

13:05 - February 4, 2018

రాజ్యసభ డీప్యూటీ చైర్మన్ కు కేవీపీ లేఖ

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ కు కేవీపీ లేఖ రాశారు. కురియన్ వ్యాఖ్యలపై కేవీపీ ఘాటుగా స్పందించారు. కురియన్ రాజ్యసభ సంప్రదాయాల్ని గౌరవించాలని కేవీపీ సూచించారు. 

ప్రజప్రయోజనాలే ముఖ్యం

గుంటూరు : పరిణామాలు పరిశీలించి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని, తెగదెంపులు గురించి ఇప్పుడే మాట్లాడడం టూ ఎర్లీ అని పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజల ఆందోళన, ఆవేదన ఈ సమావేశంలో ప్రతిఫలిస్తుందని ఆయన తెలిపారు. 

కొనసాగుతున్న టీడీపీ పార్లమెంటరీ భేటీ

గుంటూరు : చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరగడంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

12:48 - February 4, 2018

హైదరాబాద్ : చాదర్ ఘట్ లోని మూసీ కాలువలో స్థానికులు కొండచిలువ పిల్లను పట్టుకున్నారు. దాన్ని వాటర్ బాటిల్ బంధించారు. తల్లి కొండచిలువ ఇదే ప్రాంతంలో ఉండొచ్చని స్థానికులు భయపడుతున్నారు. 

12:45 - February 4, 2018
12:42 - February 4, 2018
11:31 - February 4, 2018
11:23 - February 4, 2018

రాజీనామాలకు సిద్ధం : రవీంద్రబాబు

గుంటూరు : రాజీనామాలకు మేము సిద్ధమని రవీంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల ముందు రాజీనామా చిన్న విషయమని ఆయన తెలిపారు.

11:11 - February 4, 2018

మేడ్చల్ : జిల్లా.. కాప్రా మండలం.. జవహర్‌నగర్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు నవీన్‌పై దాడి చేశాయి. అలాగే మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాయి. రోడ్లపై పందులు, కుక్కలు సంచరిస్తున్నా గ్రామాధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గ్రామాధికారులు తక్షణమే స్పందించి.. చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

11:10 - February 4, 2018

యాదాద్రి : ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గత ప్రభుత్వాలు హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. మేడారం నుంచి తిరిగి వస్తుండగా యాదాద్రి లక్ష్మినరసింహ్మ స్వామి వారిని తలసాని దర్శించుకున్నారు. యాదాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్నారు

హామీలు నెరవేర్చమనే కోరుతున్నాం : అవంతి

గుంటూరు : ఏపీకి అదనంగా అడగంలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్రచమనే కోరుతున్నామని ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. 

10:06 - February 4, 2018
10:05 - February 4, 2018
10:04 - February 4, 2018
09:39 - February 4, 2018

కాసేపట్లో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్

నల్లగొండ : నేటి నుంచి నల్లగొండలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరగునున్నాయి. ఈ మహాసభలు నాలుగు రోజులు పాటు జరుగుతాయి. ఈ సభల్లో సీపీఎం జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాసేపట్లో రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాత్ నిర్వహించనున్నారు. 

09:31 - February 4, 2018

నల్లగొండ : నేటి నుంచి నల్లగొండలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరగునున్నాయి. ఈ మహాసభలు నాలుగు రోజులు పాటు జరుగుతాయి. ఈ సభల్లో సీపీఎం జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాసేపట్లో రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాత్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:20 - February 4, 2018

కర్నూలు : జిల్లా పాణ్యం సమీపంలో బలపనూరు రహదారిపై ఓ మినీ లారీ ఎద్దుల బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందారు. రెండు ఎడ్లు కూడా మరణించాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:13 - February 4, 2018

గుంటూరు : కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశానినికి టీడీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కేంద్రంపై ఒత్తిడి పెంచె అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ జగపతి రాజు, సుజాన చౌదరి కూడా హాజరుకానున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ భేటీ

గుంటూరు : కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశానినికి టీడీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కేంద్రంపై ఒత్తిడి పెంచె అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ జగపతి రాజు, సుజాన చౌదరి కూడా హాజరుకానున్నారు. 

కర్నూలులో రోడ్డు ప్రమాదం

కర్నూలు : జిల్లా పాణ్యం సమీపంలో బలపనూరు రహదారిపై ఓ మినీ లారీ ఎద్దుల బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందారు. రెండు ఎడ్లు కూడా మరణించాయి. 

నేడు బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ

నల్లగొండ : నేడు కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ జరగనుంది. సభలో కుంతియా, ఉత్తమ్, భట్టి, జానా, షబ్బీర్, జైపాల్ పాల్గొననున్నారు. 

08:03 - February 4, 2018

నాలుగు సవంత్సరాల బడ్జెట్ చూస్తే ఏపీ వారు అలుసుగా తీసుకున్నారని, రైల్వే జోన్ ఇస్తామన్నారు, విద్యసంస్థలు ఇస్తామన్నారు, కానీ ఎటువంటి హామీలు కూడా కేంద్ర అమలు చేయండం లేదని, బీజేపీకి రాష్ట్రం పట్ల ప్రేమ లేదని ఇప్పటికైన టీడీపీ మెల్కోనాలని సీపీఎం నేత గఫూర్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేశాయని ఆ సందర్భంగా ప్రజలకు వారు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయలేదని, ఐదు బడ్జెట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ రద్ధాంతం చేస్తోందని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. నూటికి నూరు పాల్లు ఏపీకోసం పనిచేసే పార్టీ టీడీపీ అని టీడీపీ నేత నాగుల అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:00 - February 4, 2018

కోఫై గడ్డి పెంచుతూ రైతులకు ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఈనాటి మట్టి మనిషి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:59 - February 4, 2018

పశ్చిమగోదావరి : జిల్లా పెద్దతాడేపల్లి నిట్‌ కళాశాలలో ర్యాంగింగ్ భూతం పడగవిప్పింది. ఫస్టియర్‌ విద్యార్థిని సెకండియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. శుక్రవారం సాయంత్రం బీహార్‌కు చెందిన ఫస్టియర్‌ విద్యార్థి ముఖుల్‌కుమార్‌, సెకండియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదంలో సీనియర్‌ విద్యార్థులు ముఖుల్‌కుమార్‌ను చితకబాదారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్‌పై కూడా చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో నిట్‌ కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాలేజీలో ఫస్టియర్‌కు చెందిన అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల సస్పెన్షన్
ఇక విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన కళాశాల యాజమాన్యం దాడికి పాల్పడిన థర్డియర్‌కు చెందిన గుణసాయి ప్రకాశ్‌, సెకండియర్‌ విద్యార్థి సుశాంత్‌జోయల్‌, సాకేలు, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్‌లను నెల రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు... దాడికి పాల్పడిన 15 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో విద్యార్థుల ర్యాంగింగ్‌తో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కాలేజీ యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యార్థులపై పూర్తి స్థాయి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కాలేజీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

07:58 - February 4, 2018

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2018-19 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని ఎన్డీఏ, టీడీపీ ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు.. పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతున్న పనులకు పొంతనలేకుండా పోయింది. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతుంది. నిధుల లేమీతో అల్లాడుతోంది. కేంద్రం తామే నిధులు ఇస్తామని చెబుతున్నా.. ఇంతవరకు పెద్దగా విదల్చకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీని వెనుకు రాజకీయ కారణాలు దాగున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పెరిగిన నిర్మాణ వ్యయం
2010, 11లో సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 16010.45 కోట్లుగా అంచనా వేశారు. అది 2013, 14 నాటికి 58వేల కోట్లకు చేరింది. ఇప్పుడు నిర్మాణ వ్యయం మరింతగా పెరిగింది. పోలవరానికి నాబార్డు నిధి నుంచి కేటాయింపులు జరుపుతామని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో తెలిపింది. గతేడాది కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 979.36 కోట్లు మాత్రమే. దీని ప్రకారం ఇప్పటిక ఇచ్చిన నిధులను మినహాయిస్తే.. మరో 44వేల కోట్లు అవసరం అవుతాయి. రానున్న ఏడాదిలోగా ఇంత మొత్తం కేంద్రం విడుదల చేస్తుంతా అంటే... అది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగులుతుంది.

నిధుల కొరత..
పోలవరం ప్రాజెక్ట్‌కు 2010, 11 అంచనాల ప్రకారం నీటి పారుదల ఖర్చుల వాటా 12,294.40 కోట్లు. 2014 మార్చి 31వ తేదీకి అంటే... జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన నాటికి ఇంకా రావాల్సిన నిధులు అక్షరాలా 7,158.53 కోట్లు. 2014 మార్చి నెల తర్వాత ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులు 4,329.06 కోట్లు. జలవనరులశాఖ వాటా కింద రావాల్సి 2,829.47 కోట్లు. ఇప్పటికే 2,803.73 కోట్ల రూపాయలకు బిల్లులు కేంద్రానికి సమర్పించారు. అయినా ఇప్పటి వరకు మొత్తం నిధులు విడుదల కానేలేదు. దీంతో ప్రభుత్వం చెబుతున్నట్టు వచ్చే ఏడాదికల్లా పోలవరం పూర్తవుతుందో లేదో.. కాలమే నిర్ణయించాలి.

07:56 - February 4, 2018

భూపాలపల్లి : గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ముగిసింది. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క- సారలమ్మల వనప్రవేశంతో జాతర సంపూర్ణమైంది. ఈ జాతరకు కోటి 25 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నారని అధికారులంటున్నారు. ముఖ్యంగా వనప్రవేశ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పోటీపడ్డారు. అమ్మలు వనప్రవేశం చేస్తుంటే కంటతడి పెట్టారు.

అత్యంత వైభవంగా
నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన మేడారం జాతర శనివారం సాయంత్రం సంపూర్ణంగా ముగిసింది. చివరి రోజు ఆదివాసీలు సాంప్రదాయ వాయిద్యాల మధ్య సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేసి వనప్రవేశం చేయించారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను పూజారులు తీసుకెళ్లారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాలుగు రోజులపాటు కోటిమందికి పైగా భక్తులు మేడారానికి వచ్చి అమ్మలను దర్శించుకున్నారు. ముఖ్యంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌, చత్తీస్‌గడ్‌ సీఎం రమణ్‌సింగ్‌ కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

వచ్చే జాతర నాటికి మేడారం రూపురేఖలు
ఇక జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిరంతరం పర్యవేక్షించారు. మరోవైపు వచ్చే జాతర నాటికి మేడారం రూపురేఖలు మారుస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 200 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపడతామని కూడా హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేడారం పట్ల కేసీఆర్‌ కృషికి కడియం ధన్యవాదాలు తెలిపారు. ఇక జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్‌, ఎస్పీతో పాటు పలువురు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.మొత్తానికి నాలుగు రోజులపాటు జరిగిన ఈ జాతర భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. చివరిరోజు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. 

07:55 - February 4, 2018

హైదరాబాద్ : వ్యవసాయదారులకు అమలు చేస్తోన్న పథకాలు, ఎరువుల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు పెట్టుబడి పథకం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై కేసీఆర్‌.. మంత్రులు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. మండల సమన్వయ సమితుల సభ్యులు .. గ్రామ సన్వయ సమితుల సభ్యులతో నిరంతరం చర్చిస్తుంటారన్నారు. ఏ పంట ఎక్కడ వేశారో తెలుసుకుని రైతులు పండించిన పంటల మార్కెటింగ్ విషంలో సరైన ధర లభించేలా బాధ్యత తీసుకుంటారన్నారు. గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితులకుతోడుగా.. జిల్లా స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు మంత్రులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు కాబోయే రైతు సమన్వయ సమితి... కార్పొరేషన్‌ తరహాలో పనిచేసేలా.. దానికి ఒక ఉన్నతాధికారిని నియమించేందుకు ఉన్న అవకాశాలను ఆలోచిస్తున్నట్టు సీఎం తెలిపారు.

మార్క్‌ఫెడ్‌ పనితీరు పునర్‌ నిర్వచించాలి
రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని ఒకే విధమైన నియంత్రించే పద్దతిలో మార్కెట్‌కు తీసుకురావాలన్నారు. మార్కెట్లో అమ్మకం జరుగకపోతే రైతు సమన్వయ సమితి దాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సమన్వయ సమితుల పాత్ర నేపథ్యంలో.. మార్క్‌ఫెడ్‌ పనితీరు పునర్‌ నిర్వచించాలని కేసీఆర్‌ సూచించారు. వ్యవసాయ రంగంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే విషయంలో సమన్వయ సమితులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. రైతులకు ప్లాంటేషన్‌ మిషన్లు, వీడర్స్‌ మిషన్లను సబ్సిడీపై సమకూర్చాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా 100 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

రైస్‌మిల్స్‌ క్లస్టర్లు ఏర్పాటు
రైస్‌మిల్స్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌కు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా సమకూర్చుకోవాలో ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఆహార కల్తీ నిరోధానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రోత్సహించడానికి, పంటలకు మద్దతు ధర సాధించడానికి ఏం చేయాలో తేల్చేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఇంకా అందాల్సిన సహాయంపై పట్టుబట్టాలన్నారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని సూచించారు. మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని, ప్రతీ పంటకు ఇవ్వబోయే మద్దతు ధర సభలో ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు నిధులు సమకూర్చే అంశం, మిషన్‌భగీరథ పథకానికి నిధులు, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుసహా ఇతర హామీలపై పట్టుపట్టాలన్నారు. 

07:53 - February 4, 2018

నల్లగొండ : దారుణ హత్యకుగురైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి. ఇది మామూలు హత్యకాదని... పక్కా ప్లాన్‌గా జరిగినట్టు ఆధారాలు రుజువు చేస్తున్నాయి. నిందితుల కాల్‌డేటాతో ఈ వ్యవహారం మొత్తం వెలుగుచూస్తోంది. మొత్తం శ్రీనివాస్‌ మర్డర్‌ మిస్టరీ వీడుతోంది. శ్రీనివాస్‌ది రాజకీయ హత్యేనంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న శ్రీనివాస్‌ భార్య లక్ష్మీ, కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆరోపణలకు మరింత బలం చేకూర్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శ్రీనివాస్ అలా వచ్చీరాగానే చుట్టుముట్టింది...
శ్రీనివాస్‌ హత్య జరిగిన రోజు రాత్రి 7.30కు మిర్చిబండి దగ్గర గొడవ జరిగింది. ఈ గొడవే అదేరాత్రి 11.40 నిమిషాలకు శ్రీనివాస్ హత్యకు దారి తీసింది. కొందరు తనను కొడుతున్నారంటూ మెరుగు గోపీ.. బొడ్డుపల్లి శ్రీనివాస్‌కు ఫోన్ చేశాడు. దీంతో శ్రీనివాస్‌ ... మోహన్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న నిందితుల ముఠా శ్రీనివాస్ అలా వచ్చీరాగానే చుట్టుముట్టింది. ఆ తర్వాత హత్య చేసింది. ఇదే సమయంలో మోహన్ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. శ్రీనివాస్ హత్య జరిగిన ప్రదేశం నుంచి ఉన్నట్లుండి గంటన్నరపాటు అదృశ్యమైన మోహన్.. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లో దర్శనమిచ్చాడు. అయితే మోహన్ ఆ గంటన్నరపాటు ఎక్కిడికి వెళ్లాడు అనేదే సస్పెన్స్‌గా మారింది. శ్రీనివాస్‌ నిందితుల కాల్‌డేటా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నట్టు శ్రీనివాస్‌ హత్యకేసులో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం బయటకు వచ్చింది. ఎమ్మెల్యే మెడకు ఈ కేసు చుట్టుకుంది. ఎమ్మెల్యే వేముల వీరేశం కజిన్‌ సోదరులైన వేముల సుధీర్‌, వేముల రంజిత్‌తో... నిందితులు రాంబాబు, మల్లేశం టచ్‌లో ఉంటున్నారు. రెండు నెలలుగా వీరి మధ్య అనేక ఫోన్‌ సంభాషణలు జరిగాయని కాల్‌డేటా బయటపెట్టింది. 24వ తేదీన హత్య జరిగడానికి ముందు.. ఆ తర్వాత కూడా రాంబాబు, మల్లేష్‌ ఫోన్స్‌ నుంచి రంజిత్‌, సుధీర్‌కు ఫోన్‌కాల్స్‌ వెళ్లాయి. 25వ తేదీన కూడా నిందితులు వేముల బ్రదర్స్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నిందితులు హత్య చేసిన తర్వాత నేరుగా వీరేశం ఇంటికెళ్లి దాచుకుని ఆ తర్వాత లొంగిపోయినట్టు చెబుతున్నారు. శ్రీనివాస్‌ హత్య వివరాలు వేముల వీరేశానికి వేముల బ్రదర్స్‌ రంజిత్‌, సుధీర్‌లు తెలియజేసినట్టు కాల్‌డేటా స్పష్టం చేస్తోంది.

వివాదాస్పదంగా రిమాండ్‌ రిపోర్ట్‌ .. కేస్‌ డైరీ
మరోవైపు శ్రీనివాస్‌ హత్యకేసులో పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ .. కేస్‌ డైరీ వివాదాస్పదంగా మారాయి. రిమాండ్‌ రిపోర్ట్‌, కేస్‌ డైరీని కోట్‌ చేస్తూ ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ శ్రీనివాస్‌ భార్య లక్ష్మీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రిమాండ్‌ రిపోర్టులో పొంతనలేని కథనాన్ని రాయించారని ఆమె ఆరోపించారు. మూడు వారాల్లో కేసు దర్యాప్తు ప్రమాణ పత్రాల్ని సమర్పించాలని ఎస్పీ శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు జోక్యం చేసుకోవడంతో దర్యాప్తులో డొల్లతనం బయటపడక తప్పదనే ఆందోళన పోలీసు వర్గాల్లో వ్యక్తమైంది. అందుకే టూటౌన్‌ సీఐ, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న వెంకటేశ్వర్లును అజ్ఞాతంలోకి పంపినట్టు చర్చ నడుస్తోంది. శ్రీనివాస్‌ కేసును తిరగదోడేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అదే క్రమంలో దర్యాప్తు సక్రమంగా చేయకుండా ఏకపక్షంగా వ్యహరించిన డీఎస్పీ, ఎస్పీలపై వేటుపడే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది.

Don't Miss