Activities calendar

05 February 2018

21:37 - February 5, 2018

తెలంగాణలో త్వరలో రాబోయే మరో కొత్త రాజకీయ పార్టీపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఎల్ ఎఫ్ కో కన్వీనర్ చెరుపల్లి సీతారాములు పాల్గొని, మాట్లాడారు. కొంతమంది వక్తలు కొత్త రాజకీయ పార్టీని స్వాగతించాలని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...   

 

20:57 - February 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర నిర్వహించిన తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. జేఏసీ సమావేశంలో కొత్త పార్టీ విధివిధానాలను రూపొందించాలని నిర్ణయించారు. 
రాజకీయ పార్టీ ఏర్పాటుపై కోదండరామ్‌ కీలక నిర్ణయం 
రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో జరిగిన టీ జేఏసీ విస్తృత సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. 
టీ జేఏసీని రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఒత్తిడి 
ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజల బతుకులు మారలేదన్న నిర్ణయానికి  కోదండరామ్‌  వచ్చిన తర్వాత టీ జేఏసీని రాజకీయ పార్టీగా మార్చాలన్న డిమాండ్‌ వచ్చింది. కానీ  ఉద్యమం సంస్థగా కొనసాగించడానికి నిర్ణయించారు. కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడం మొదలుపెట్టిన తర్వాత టీ జేఏసీని  రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఒత్తడి వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలని ప్రజలు కోరినా ముందు సున్నితంగా తిరస్కరించిన కోదండరామ్‌.. మారిన పరిస్థితులు నేపథ్యంలో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలన్ని నిర్ణయానికి వచ్చారు. టీ జేఏసీని యథావిధిగా కొనసాగిస్తూ.. కొత్త  రాజకీయ పార్టీ ఏర్పాటును కోదండరామ్‌ ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు కోసం పార్టీ పెట్టాలని టీ జేఏసీ నిర్ణయించింది. ప్రజల సహకారంతో పార్టీని నడుపుతూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 
తెలంగాణ ఉద్యమంలో టీ జేఏసీ కీలక పాత్ర 
తెలంగాణ ఉద్యమంలో టీ జేఏసీ కీలక పాత్ర నిర్వహించింది. ప్రజాభిప్రాయాన్ని ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా మలచడంతో ముఖ్య భూమిక పోషించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ వంటి పోరాటాల్లో జేఏసీ ముందుంది. తెలంగాణ సాధనోద్యమంలో పలుసార్లు  అరెస్టయ్యారు. తెలంగాణ ఆవిర్భావం 2014లో జరిగిన ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీ జేఏసీతోపాటు కోదండరామ్‌ను పక్కన పెట్టారు. ఏడాదిన్నరపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్‌... ప్రత్యేక రాష్ట్రంలో కూడా  పరిస్థితులు మారలేదన్న నిర్ణయానికి వచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు లేవంటూ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణలకు వ్యతిరేకంగా పోరాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్య బాట పట్టిన అన్నదాత కుటుంబాల ఆవేదనను చూసి చలించిపోయారు. ఊరూరు తిరుగుతూ కేసీఆర్‌ సర్కారు విధానాలను ఎండగట్టారు. ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడంపై  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను కూడగట్టి కొలువుల కోసం కోట్లాట నిర్వహించారు. కొలువు కొట్లాట నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా నిర్బంధకాండ విధించడంతో హైకోర్టును ఆశ్రయించి  అనుమతి తెచ్చుకుని సభ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ విధానాలపై పోరాడే క్రమంలో అధికార  పార్టీ నేతలు కోదండరామ్‌ను కాంగ్రెస్‌ ఏజెంటుగా  విమర్శించినా ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో ఎక్కడా వెనుకుంజ వేయలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం అవనుసరిస్తున్న ఇలాంటి విధానాలతో విసిపోయిన టీ జేఏసీ ఇప్పుడు కొత్త రాజకీయని ప్రకటించి, ఎన్నికల క్షేత్రంలో దిగాలని నిర్ణయించడం టీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందేనని భావిస్తున్నారు. 
 

20:43 - February 5, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రి రావులపాళెంలో హర్షవర్దన్‌ లిటిల్‌ఫ్లవర్‌ స్కూల్‌ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అండర్ 19 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో  నాలుగోసారి వరల్డ్‌ కప్‌ సాధించి రికార్డ్‌ సృష్టించిన భారత జట్టు విజేతలకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. 

 

20:33 - February 5, 2018

హర్యాణా : ప్రేమించి, పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించిన వ్యక్తి మోసం చేస్తే ఎలా ఉంటుంది. చాలామంది.. నిరాశలో కూరుకుపోతారు. మరికొందరైతే అతనికి బుద్ధిచెప్పేందుకు ప్రయత్నిస్తారు. అయితే హ‌ర్యాణాకు చెందిన ఓ యువ‌తి మాత్రం వినూత్నంగా ఆలోచించింది. పీకలదాకా తాగి అత‌డి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసింది. హ‌ర్యాణా ప‌టౌడికి చెందిన ఓ యువ‌తి, యువ‌కుడు కొంత‌కాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడు ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. దీంతో ఆ యువతికి కోపం కట్టలు తెంచుకుంది. ఎలాంటి హాని తలపెట్టకుండా అతడికి బుద్ధి చెప్పాలని డిసైడైంది. పీకల దాకా తాగి ప్రియుడి ఇంటికి వెళ్లింది. త‌న‌తోపాటు ఓ డీజేను కూడా వెంట‌పెట్టుకుని వెళ్లి అక్కడ 'రాజా హిందూస్థానీ' సినిమాలోని 'తేరే ఇష్క్ మే' పాట‌కు చిందులేసింది. చుట్టూ జనం చూస్తున్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయి వీరంగం సృష్టించింది. యువ‌తి డ్యాన్స్‌ను ఓ యువ‌కుడు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

 

20:26 - February 5, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రౌడీయిజాన్ని అణగదొక్కడానికి పోలీసులు ఎన్‌కౌంటర్లు చేస్తున్నా వారి ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లక్నోలో గూండాల నుంచి తన భర్తను రక్షించుకోవడానికి ఓ ఇల్లాలు చూపిన తెగువపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాకోరీ పిఎస్‌ పరిధిలో నివసిస్తున్న ఆబీద్‌ అలీని ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. అనంతరం అతనిపై కర్రలతో బాదారు. ఈ దృశ్యాన్ని చూసిన ఆ ఇల్లాలు ఇంట్లో నుంచి అపర కాళిలా మారింది. ఇంట్లో నుంచి లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ తెచ్చి తన భర్తపై దాడి చేస్తున్న రౌడీలపై  కాల్పులు జరిపింది. ఆ కాల్పులకు భయపడి గూండాలు పారిపోయారు.  రివాల్వర్‌లో కాల్పులు జరిపిన ఆ మహిళ ఓ న్యాయవాది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సిసిటివీలో రికార్డ్‌ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆబిద్‌ దంపతులు ఆరోపించారు. 

 

20:24 - February 5, 2018

ఢిల్లీ : పరువు హత్యల వంటి తీవ్ర చర్యలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఖాప్‌ పంచాయితీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు మేజర్లు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రులు, సమాజం, ఎవరైనా సరే మేజర్ల పెళ్లి అంశంలో  కలిగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పేర్కొన్నారు.  పెళ్లి జంటను బలవంతంగా విడదీయడం తప్పని తెలిపింది. వయోజనులు వివాహం చేసుకుంటే ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరని ఖాప్‌ పంచాయత్‌ తరపు లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. 'ఖాప్ పంచాయత్‌'ల పేరిట చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్న వారిపైనా, పరువు హత్యలపైనా నిషేధం విధించాలంటూ శక్తి వాహిని అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

 

20:22 - February 5, 2018

కృష్ణా : మూడున్నరేళ్లుగా విజయవాడలో మెట్రోకు మోక్షం కలగడంలేదు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో మెట్రోపై ఆశలు వదులుకోక తప్పడంలేదు. దీంతో బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
విజయవాడకు మెట్రోపై అనుమానాలు
రాష్ట్ర విభజన హామీలను నెరవేరుస్తామంటూ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను విస్మరిస్తోంది. ఇదిగో అదిగో అంటూ మూడున్నరేళ్లుగా ప్రభుత్వం విజయవాడకు మెట్రో అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య మెట్రోను ఎట్టిపరిస్థితుల్లో నిర్మించి తీరుతామని నేతలు ప్రజల్లో ఆశలు గుప్పించారు. ఇందుకోసం 2017 ఆర్థిక బడ్జెట్‌లో 101 కోట్లు ప్రతిపాదించారు. కాని 2018 లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో  నిధులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అసలు విజయవాడకు మెట్రో ఉంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మెట్రోకు రూ.6వేల కోట్లు కేటాయించాలని నిర్ణయం
దేశంలో మెట్రో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత నిస్తున్నామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే విజయవాడ మెట్రోకు 6వేల కోట్ల కేటాయించాలని నిర్ణయించారు.ఇందులో 20 శాతం కేంద్రం అందించనుంది. రాష్ట్రం 20 శాతం నిధులు అందించాల్సి ఉండగా మిగిలిన 60 శాతం నిధులు విదేశీ రుణ సంస్థల నుండి సమీకరించుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లు భూసేకరణకు విడుదల చేసింది. తాజాగా కేంద్రం మెట్రో నిధులపై ప్రకటన చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. 
కేంద్రం వైఖరిపై సీఎం అసహనం
ఏపీకి దక్కాల్సిన నిధులు, హామీలపై కేంద్రం వైఖరిని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోకు కనీస నిధుల అంశాన్ని బడ్జెట్‌లో చేర్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు నగరాలకు బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అటు ప్రతిపక్షం, వామపక్షాలు కూడా కేంద్ర బడ్జెట్‌ ఆమోదయోగ్యంగా లేదంటున్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించడమే కాకుండా తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయంలో ఉన్నారు ప్రజలు. ఏది ఏమైనప్పటికీ ఏపీ రాజధాని అమరావతి, విజయవాడలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. 

 

20:18 - February 5, 2018

దుబాయ్ : ఎడారి దేశంలో.. శ్రీనివాసుడి కల్యాణం..! అత్యంతం కమనీయం... కడు రమ్యం..! వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య... అన్నమయ్య గీతాలాపనల నడుమ.. అంగరంగ వైభవంగా సాగే మహోత్సవం... శ్రీనివాసుని వివాహం..! ఎడారి దేశంలో కూడా  ఆ ఏడుకొండలవాడి పెళ్లి.. కన్నులవిందుగా సాగింది.     

ప్రవాస భారతీయులు ముచ్చటగా జరుపుకునే మహోన్నత వేడుక శ్రీవారి కల్యాణం. దేశమేదైనా... ఆ ఏడుకొండలవాడి వివాహ మహోత్సవం వైభవంగా సాగాల్సిందే.. దీనికి ఏడారి దేశం కూడా  మినహాయింపు కాదు. దుబాయ్‌లో శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం ఓ పండుగగా జరిగింది. తిరుమల క్షేత్రంలో  జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి ఏ మాత్రం తీసిపోకుండా.. సంప్రదాయబద్ధంగా ఇక్కడ కూడా ఈ వేడుకను నిర్వహించారు. 

దుబాయ్‌ నగరానికి సమీపంలో అజ్మన్‌ అనే ప్రాంతంలో వెంకటేశ్వరస్వామి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.  భక్తుల గోవింద నామస్మరణతో దుబాయ్‌ నగరం మారుమోగింది.  పండితుల మంత్రోచ్ఛరణలు, వేల సంఖ్యలో  భక్తులు, చిన్నారుల అన్నమయ్య గీతాలాపనల మధ్య.. శ్రీవారి పెళ్లి కడు రమ్యంగా సాగింది.  తిరుపతి వేద పండితుల మంత్రాల నడుమ శ్రీవారు తమ ఉభయ దేవేరులకు మంగళసూత్రధారణ చేశారు. 

వేల సంఖ్యలో భక్తులు సతీసమేతంగా..ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యునైటెడ్‌ ఎమిరేట్స్ ప్రాంతాలైన దుబాయ్‌, అబుదాబి, అజ్మన్‌, పుజైరా, రస్‌ ఆల్‌ఖైమా, షార్జా, ఉమల్‌ క్వైన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు ఈ వేడుకను వీక్షించారు.  శ్రీవారి పెళ్లితో.. అజ్మన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. శ్రీనివాసుడి వివాహ వేడుకను వీక్షించిన భక్తులు..ఆనందోత్సహంలో మునిగిపోయారు. ఎంతో సంతోషంగా ఉందని.. తిరుపతిలో ఉన్నట్టే ఉందని.. సంతోషం వ్యక్తం చేశారు. అజ్మన్‌లో శ్రీవారి కల్యాణంతో పాటు.. పుష్ఫయాగాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. 

20:10 - February 5, 2018

నెల్లూరు : రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. గౌహతీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ ప్రయాణీకుడి నుంచి సుమారు నాలుగు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటీ 43 లక్షలు దాకా ఉంటుందని అధికారుల అంచనా. ఎలక్ర్టిక్‌ స్టవ్‌లో బంగారు అమర్చి... అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ యాక్ట్1962 ప్రకారం కేసునమోదు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. 

 

కీచక టీచర్‌కు దేహశుద్ధి

సంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌ మల్లికార్జున్‌కు గ్రామస్తుల దేహశుద్ధి చేశారు. గత కొంత కాలంగా పదో తరగతి విద్యార్థినులను.. మల్లికార్జున్‌ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇవాళ టీచర్‌ను చితకబాదారు. 

20:01 - February 5, 2018

సిద్దిపేట : ఆర్థిక వ్యవస్థకు వేరులాంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే... ఆర్థిక రంగమే కుప్పకూలిపోతుందని టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ అన్నారు. దుస్థితిలో ఉన్న వ్యవసాయరంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మంచిర్యాల రైతు సదస్సుకు వెళ్తూ మార్గమధ్యంలో సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా వద్ద మాట్లాడారు. రైతుకు భరోసా కలిపించి అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

 

19:57 - February 5, 2018

సంగారెడ్డి : జిల్లా పుల్కల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌ మల్లికార్జున్‌కు గ్రామస్తుల దేహశుద్ధి చేశారు. గత కొంత కాలంగా పదో తరగతి విద్యార్థినులను.. మల్లికార్జున్‌ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇవాళ టీచర్‌ను చితకబాదారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:55 - February 5, 2018

నల్గొండ : బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఈమేరకు మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ ప్రయత్నాలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై ఈనెల 10 నుంచి భీమవరంలో జరిగే రాష్ట్ర సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. 

 

19:50 - February 5, 2018

శ్రీకాకుళం : కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. గడిచిన 55 రోజలుగా మత్స్యకారులు ఎస్టీ జాబితాల్లో చేర్చాలని నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ప్రతిగా.. మత్స్యకారులను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని వేలాది మంది ఆదివాసీలు కలెక్టరేట్‌ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. విషయం  తెలుసుకున్న కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, ఎస్పీ తివిక్రమ వర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

19:48 - February 5, 2018

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో టీడీపీ ఎంపీల భేటీ ముగిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని రాజ్‌నాథ్‌కు ఎంపీలు వివరించారు. విభజన హామీల అమలుతో పాటు.. రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్ వివరణ అడిగారు. అనంతరం.. మరోసారి అన్ని విషయాలు, పెండింగ్‌ అంశాలపై చర్చిద్దామని రాజ్‌నాథ్ ఎంపీలకు సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 
 

 

మత్స్యకారుల సమస్యలు తెలుసన్న పవన్

హైదరాబాద్ : మత్స్యకారులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ తో మత్స్యకార సంఘాలు భేటీ అయ్యారు. మత్స్యకారులు పవన్ కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసు అన్నారు. మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

18:50 - February 5, 2018

హైదరాబాద్ : మత్స్యకారులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ తో మత్స్యకార సంఘాలు భేటీ అయ్యారు. మత్స్యకారులు పవన్ కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసు అన్నారు. మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మత్స్యకారులు ఎస్టీ జాబితాలో ఉండాల్సిన వారేనని అన్నారు. శాంతియుతంగా చేస్తున్న మత్స్యకారుల దీక్షలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. ఈనెల 21న శ్రీకాకుళంలో పర్యటిస్తానని చెప్పారు. శ్రీకాకుళం చాలా చైతన్యం ఉన్న జిల్లా అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినదానికి నేతలు కట్టుబడి ఉండాలన్నారు. మ్యానిఫెస్టో ఓటు బ్యాంకులా ఉండకూడదని తెలిపారు. 

 

18:23 - February 5, 2018
18:21 - February 5, 2018

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌ సామాన్యులపై మరింత భారం మోపనుందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రెండు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం మరోవైపు సెస్సు రూపంలో 2 శాతం వడ్డిస్తోందని కరత్‌ విమర్శించారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. 

 

18:05 - February 5, 2018

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో టీడీపీ ఎంపీల భేటీ ముగిసింది. 25 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. విభజన చట్టంలోని హామీలపై రాజ్‌నాథ్‌తో టీడీపీ ఎంపీలు చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:01 - February 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.   సచివాలయంలో తెలంగాణ మున్సిపల్‌ కమిషనర్ల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా... పాలనా వికేంద్రీకరణతో  ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. మున్సిపాల్టీలో ఇప్పటికే సంస్కరణలు చేపట్టామని..  పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించాలన్నది సీఎం ఉద్దేశమన్నారు.. సంస్కరణలు అమలు చేయడంలో మున్సిపల్‌ కమిషనర్లు కీలక పాత్ర వహించాలని కేటీఆర్ సూచించారు. 
-

17:59 - February 5, 2018

నల్గొండ : ఇవాళ రెండో రోజూ.. సీపీఎం ద్వితీయ రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. అంశాల వారీగా పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల్లో అన్ని రంగాల వారూ చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళావిభాగం.. రాష్ట్ర సమస్యలపై తమదైన అవగాహనను కనబరుస్తోంది. మహిళా సమస్యలకు పరిష్కారాలనూ మహిళా విభాగం నాయకులు ప్రతిపాదించారు. చర్చ సందర్భంగా.. మహిళా విభాగం ప్రతినిధులంతా.. వేదికపైకి వచ్చి.. సందడి చేశారు.

17:49 - February 5, 2018

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చిచినట్లు సమాచారం. అలాగే.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీకి బడ్జెట్‌ కేటాయింపులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

సోము వీర్రాజు వ్యాఖ్యలపై సంయమనం పాటించాలి : సీఎం చంద్రబాబు

గుంటూరు : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై రియాక్ట్‌ కావద్దని నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సోము వీర్రాజు వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. విమర్శల విషయంలో బీజేపీకి, టీడీపీకి తేడా ఉండాలన్నారు. జిల్లాల్లో సోము వీర్రాజు దిష్టిబొమ్మలు దహనం చేయవద్దని ఆదేశించారు. 

17:46 - February 5, 2018

గుంటూరు : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై రియాక్ట్‌ కావద్దని నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సోము వీర్రాజు వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. విమర్శల విషయంలో బీజేపీకి, టీడీపీకి తేడా ఉండాలన్నారు. జిల్లాల్లో సోము వీర్రాజు దిష్టిబొమ్మలు దహనం చేయవద్దని ఆదేశించారు. 

 

17:43 - February 5, 2018

ప.గో : సీపీఎం ఏపీ రాష్ట్ర 25వ మహాసభలను పురస్కరించుకుని భీమవరంలో జనకవనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్త తెలకపల్లి రవి, ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సుమారు 200 మంది కవులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈమేరకు తెలకపల్లి రవితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో సాహిత్యాభిరుచి ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు. సమాజంలో మార్పు యువత ద్వారానే సాధ్యమని చెప్పారు.

 

17:39 - February 5, 2018

గుంటూరు : ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాజీలేని పోరాటం చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడితేవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేంద్ర వైఖరిపై టీడీపీ పార్లమెంట్‌ సభ్యులు సభ లోపలా వెలుపలా నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించలేని  ప్రతిపక్షపార్టీ ఏపీలో ఉండడం  దౌర్భాగ్యమన్నారు. జగన్‌కు తనమీదున్న కేసులు, ముఖ్యమంత్రి పదవి తప్ప వేరేమీ పట్టడం లేదని విమర్శించారు. 

 

17:36 - February 5, 2018

కరీంనగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ హాయాంలో ప్రవేశపెట్టిన ఫార్మా డీ కోర్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని.. ఫలితంగా విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ఫార్మా డీ విద్యార్థులకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ సంఘీభావం ప్రకటించి.. దీక్షలో పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

ముగిసిన రాజ్ నాథ్ సింగ్, టీడీపీ ఎంపీల భేటీ

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో టీడీపీ ఎంపీల భేటీ ముగిసింది. విభజన చట్టంలోని హామీలపై రాజ్ నాథ్ తో టీడీపీ ఎంపీలు చర్చించారు. 

 

ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించనున్నారు. 

 

రైల్వే స్టేషన్ లో భారీగా బంగారం పట్టివేత

నెల్లూరు : రైల్వే స్టేషన్ లో భారీగా బంగారం పట్టుకున్నారు. గౌహతి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రయాణికుల వద్ద 4.6 కేజీల బంగారం పట్టుకున్నారు.

 

కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు : మంత్రి కాల్వ

అమరావతి : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆవేదన చెందుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించుకుంటున్నారని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 

 

16:24 - February 5, 2018
16:21 - February 5, 2018

విశాఖపట్టణం : విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం ఎన్నికలు  కొనసాగుతున్నాయి. ఎఐటియూసి, ఐఎన్ డీటీయూసీ, సీఐటియూ మిత్ర పక్షాలు వేర్వేరుగా పోటీకి దిగాయి. మొత్తం 10వేల 15 వందల 42 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎన్నికలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

16:17 - February 5, 2018
16:10 - February 5, 2018

ఢిల్లీ : ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలంటూ కేవీపీ డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో ఆందోళన చేపట్టిన కేవీపీ... విభజన హామీలను నెరవేర్చాలంటూ రెండు నోటీసులిచ్చినట్లు తెలిపారు. మరోవైపు టీడీపీ ఆందోళనలపై స్పందించిన కేవీపీ... వారి తీరును అందరూ గమనిస్తున్నారన్నారు. 

16:08 - February 5, 2018

సోము వీర్రాజు ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన

తూర్పుగోదావరి : రాజమండ్రిలో సోము వీర్రాజు ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేశారని నిరసిస్తూ వీర్రాజు ఇంటిని ముట్టడించారు. సామరస్యంగా నిరసన తెలియజేస్తున్న తమపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని విద్యార్థులంటున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. 

16:05 - February 5, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలో సోము వీర్రాజు ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేశారని నిరసిస్తూ వీర్రాజు ఇంటిని ముట్టడించారు. సామరస్యంగా నిరసన తెలియజేస్తున్న తమపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని విద్యార్థులంటున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో భూస్థాపితం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:32 - February 5, 2018

ఖమ్మం : జిల్లా అశ్వారావుపేటలో టెన్ టీవీ క్యాలెండరన్ సీఐ అబ్బయ్య, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్ టీవీ ప్రజ సమస్యలకు గొతుకగా ఉందని వారు కొనియాడారు. 

13:28 - February 5, 2018
13:26 - February 5, 2018
13:25 - February 5, 2018

కృష్ణా : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు పై వీర్రాజు చేసిన వ్యాఖ్యలను బుద్దా ఖండించారు. ఎవరి ఎజెండాతో వీర్రాజు పని చేస్తున్నారని, టీడీపీది అవినీతి ప్రభుత్వమైతే మేమిచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారని బుద్దా ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

తెలంగాణ స్టడీ సర్కిల్ ఎదుట విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : తెలంగాణ స్టడీ సర్కిల్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టడీ సర్కిల్ కు వచ్చిన నిధులను అధికారులు నొక్కెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ నేత వీహెచ్ సంఘీభావం తెలిపారు.

చెట్టును ఢీకొన్న దివాకర్ ట్రావెల్స్

అనంతపురం : జిల్లా బెలుగప్ప మండలం కాల్పపల్లి వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. 

బీసీసీఐకి సుప్రీకోర్టు నోటీసులు

ఢిల్లీ : సుప్రీం కోర్టు బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. క్రికెటర్ శ్రీశాంత్ సస్పెన్షన్ పై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులో సుప్రీం ఆదేశించింది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

రాజ్ నాథ్ ను కలవనున్న టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : నేడు సాయంత్ర కేంద్రం హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ టీడీపీ ఎంపీలు కలవనున్నారున. ఎంపీలు విభజన హామీల అమలు చేయాలని రాజ్ నాథ్ ను కోరనున్నారు.

13:12 - February 5, 2018

ఢిల్లీ : నేడు సాయంత్ర కేంద్రం హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ టీడీపీ ఎంపీలు కలవనున్నారున. ఎంపీలు విభజన హామీల అమలు చేయాలని రాజ్ నాథ్ ను కోరనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:29 - February 5, 2018
12:18 - February 5, 2018

హైదరాబాద్ : మీర్ పేట్ లో దారుణం జరిగింది, భార్యతో పాటు ఇద్దరు పిల్లలను భర్త హరీందర్ హత్య చేశాడు. మృతుల్లో భార్య జ్యోతి(33), కూతురు సహస్ర(5), కొడుకు అభితేజ్(6) ఉన్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. హరీందర్ డెంటల్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

సూర్యాపేటలో కాంగ్రెస్ పాదయాత్ర

ఖమ్మం : జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి  సూర్యాపేట కలెక్టరేట్ కు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టారు. మోతె మండలంలోని అన్ని చెరువులు, కుంటలను ఎస్సార్ ఎస్సీ, పాలేరు జలాలతో నింపాలని వారు డిమాండ్ చేశారు. 

12:11 - February 5, 2018

ఢిల్లీ : రాజ్యసభలో గందరగోళం ఏర్పాడింది. రాజ్యసభ ఎంపీలు చైర్మన్ చైర్ వద్దకు వచ్చి నినాదాలు చేశారు. చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంత వారించిన సభ్యుల ఆందోళన కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 

12:07 - February 5, 2018

పార్లమెంట్ అవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

ఢిల్లీ : పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. బీజేపీ మిత్రధర్మాన్ని పాటించాలని వారు ప్లకార్డులను ప్రదర్శించారు.

11:32 - February 5, 2018
11:29 - February 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. బీజేపీ మిత్రధర్మాన్ని పాటించాలని వారు ప్లకార్డులను ప్రదర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:06 - February 5, 2018

నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెల్లీకాన్ఫరెన్స్

గుంటూరు : నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు పాల్గొన్నారు. 

నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెల్లీకాన్ఫరెన్స్

గుంటూరు : నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు పాల్గొన్నారు. 

ఓదెల రైల్వేస్టేషన్ లో నిలిచిపోయిన కాగాజ్ నగర్ ఇంటర్ సిటి

కరీంనగర్/పెద్దపల్లి : ఓదెల రైల్వేస్టేషన్ లో కాగాజ్ నగర్ ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పాడింది. 

సెల్ టవర్ పేల్చేసిన మావోయిస్టులు

భూపాలపల్లి : జిల్లా వెంకటాపూరం మండలం ఎదిరలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను మావోయిస్టులు పేల్చేశారు. తెలంగాణ బంద్ ను విజయవంత చేయాలని వారు పోస్టర్లు అతికించారు. అటు చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా కిరండోల్ లో ప్రొక్లయినర్ తో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. 

మీర్ పేట్ దారుణం

హైదరాబాద్ : మీర్ పేట్ లో దారుణం జరిగింది, భార్యతో పాటు ఇద్దరు పిల్లలను భర్త హరీందర్ హత్య చేశాడు. మృతుల్లో భార్య జ్యోతి(33), కూతురు సహస్ర(5), కొడుకు అభితేజ్(6) ఉన్నారు. 

10:30 - February 5, 2018

భూపాలపల్లి : జిల్లా వెంకటాపూరం మండలం ఎదిరలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను మావోయిస్టులు పేల్చేశారు. తెలంగాణ బంద్ ను విజయవంత చేయాలని వారు పోస్టర్లు అతికించారు. అటు చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా కిరండోల్ లో ప్రొక్లయినర్ తో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:29 - February 5, 2018

ఢిల్లీ : విభజన హామీలపై చర్చకు లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎంపీ తోట నరసింహం నోటీసు ఇచ్చారు. టీడీపీ 193 ప్రకారం నోటీసు ఇచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:28 - February 5, 2018

హైదరాబాద్ : మీర్ పేట్ లో దారుణం జరిగింది, భార్యతో పాటు ఇద్దరు పిల్లలను భర్త హరీందర్ హత్య చేశాడు. మృతుల్లో భార్య జ్యోతి(33), కూతురు సహస్ర(5), కొడుకు అభితేజ్(6) ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

గుంటూరు : టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్న నిర్వహించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

09:37 - February 5, 2018

నల్లగొండ : నల్లగొండ ఎర్రగొండగా మారింది. సీపీఎం మహాసభలు నేడు రెండో రోజు కొనసాగున్నాయి. నేడు సభలో భవిష్యత్ ఉద్యమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

09:36 - February 5, 2018

గుంటూరు : టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్న నిర్వహించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

ఢిల్లీలో కాల్పులు

ఢిల్లీ : ఓక్లామండిలో పోలీసులుకు, షార్ప్ షూటర్ తన్వీర్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం పోలీసులు తన్వీర్ ను అదుపులోకి తీసుకున్నారు. తన్వీర్ హత్య, దోపిడీ కేసుల్లో నింధితుడిగా ఉన్నారు.

సంగీత దర్శకుడు మణిశర్మ ఆఫీస్ లో చోరీ

హైదరాబాద్ : సంగీత దర్శకుడు మణిశర్మ ఆఫీస్ లో చోరీ జరిగింది. ఆఫీస్ నుంచి రూ.4.50 లక్షలు అపహరించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నేడు రైల్వే జీఎం ప్రెస్ మీట్

హైదరాబాద్ : నేడు రైల్వే జీఎం వినోద్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపుల పై నేడు సాయంత్రం ఆయన విలేకర్లకు వివరించనున్నారు. 

నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ నిరసనలు

గుంటూరు : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేటి నుంచి 15 వరకు మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. 

08:25 - February 5, 2018

గుంటూరు: నర్సారావుపేటలోని నుదురుపాడు వద్ద కారులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటన అప్రమత్తమై కారులోంచి బయటకు దూకారు. దీంతో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. బెంగళూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:22 - February 5, 2018

విశాఖ : జిల్లా అత్యుతాపురం మండలం పుడిమడకలో పారిశ్రామీకరణ వేగం పుంచుకుంది. పరిశ్రమల స్థాపనను ఎవరూ వ్యతిరేకించడంలేదు. కానీ ఈ పేరుతో కాలుష్యవ్యర్థాలను సముద్రంలో కలిపే ప్రయత్నాలనే అందరూ వ్యతిరేకిస్తున్నారు. పుడికమక 10 వేల మంది జనాభా ఉన్న పెద్ద గ్రామం. ఈ చుట్టుపక్కల ఉన్న మరో 25 గ్రామాల్లో 30 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. చేపల వృత్తే జీవనాధారం. పారిశ్రామీకరణ పేరుతో గంగపుత్రలను తరిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఈ పరిశ్రమలు విడుదల చేస్తున్నా కాలుష్యంతో పుడిమడక సముద్రతీప్రాంతమంతా కాలుష్యంగా మారింది. దీంతో మత్ససంపద హరించుకుపోయి జీవనోపాధి లభించక గంగపుత్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీఐఐసీ పైపులైను నిర్మాణ పనులు
పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలో కలిపేందుకు ఏపీఐఐసీ పైపులైను నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఒకటి కాదు... రెండు కాదు.. దాదాపు 500 పరిశ్రమల కాలుష్యవ్యర్థాలను సముద్రంలో కలిపేందుకు పైపులైను నిర్మిస్తున్నారు. కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా ఉప్పుటేరుద్వారా సముద్రంలో కలిపే ప్రయత్నాలను ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళన చేసిన వారిని అరెస్టులు చేస్తూ, బెదిరించేందుకు పాతకేసులను బయటకుతీసి లొంగతీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా వదిలితే సముద్రంలో 7డిగ్రీల వరకు అదనపు ఉష్ణోగత్రలు పెరిగే అవకాశం ఉంది. ఇది మత్స్యసంపదకు నష్టం కల్గిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పైపులైను నిర్మాణం కోసం సహకరిస్తే మత్స్యకారులకు లక్షా పాతికవేల రూపాయల వరకు ప్యాకేజీ ఇస్తామని ఏపీఐఐసీ ఆశ పెడుతోంది.

అంగీకార పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి
ఇందుకు ఒప్పుకుంటే అంగీకార పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోంది. ఇదేజరిగితే మత్స్యకారులను కంపెనీలకు తాకట్టు పెట్టడమే అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పైపులైన నిర్మాణంతో తమ పొట్టకొట్టొద్దని మత్స్యకారులు అభ్యర్థిస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. పుడిమడక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీల వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో 131 ఇవ్వడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. మత్స్యకారులు పొట్టొకట్టే పైపులైన్లకు వ్యతిరేకంగా ఆందోళన తప్పదని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీఐఐసీ పైపులైను వ్యతిరేకంగా ఉద్యమించేందుకు పుడిమడక మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. 

08:21 - February 5, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ విజ్ఞాన్ ఉత్సవాలకు సిద్ధమైంది. గార్డెన్ లో వివిధ రకాల పువ్వులు అందరిని ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:20 - February 5, 2018

నల్లగొండ : నల్లగొండ పట్టణం ఎర్రగొండగా మారింది. ప్రధాన వీధులన్నీ అరుణవర్ణశోభితమయ్యాయి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం ఎరుపెక్కింది. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సీపీఎం మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ
మహాసభల ప్రారంభసూచికగా నగరంలో సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. రెడ్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ఎర్రజెండాలు చేతబూని రెడ్‌షట్‌ వాలంటీర్లు నిర్వహించిన కవాతు ప్రధాన వీధుల గుండా సాగింది. స్థానిక సీపీఎం కార్యాలయం దొడ్డికొమురయ్య భవన్‌ నుంచి ప్రారంభమైన ఈ కవాతు...మహాసభలు జరుగుతున్న ప్రాంగణం లక్ష్మీ గార్డెన్స్‌ వరకు కొనసాగింది. ఈ కవాతులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతోపాటు రాష్ట్ర సీపీఎం నాయకత్వం పాల్గొంది.లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులపై పన్నుల భారం మోపారని విమర్శించారు. ధనికులపై పైసా పన్నువేయలేదని... కార్పొరేట్‌ శక్తులకు, సంపన్నులకు మోదీ ప్రభుత్వం వత్తాసుపలుకుతోందని దుయ్యబట్టారు. రైతుల రుణాల మాఫీ చేయమంటే డబ్బులు లేవన్న కేంద్ర ప్రభుత్వం... సంపన్నులు తీసుకున్న రెండు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం సిగ్గుచేటన్నారు.

దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు లైంగిక దాడులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ నుంచి భారత దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.రాన్నున్న రోజుల్లో వామపక్షాలు అధికారంలోకి రావడం తథ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నంగా ఎదుగుతున్నామన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా సీపీఎం కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఇందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడిందన్నారు.సీపీఎం మహాసభలు 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భవిష్యత్‌ ఉద్యమ కార్యక్రమాలపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు.

08:16 - February 5, 2018

నల్లగొండ : ఇటీవల దారుణ హత్యకు గురైన మున్సిపల్ చైర్‌ పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభ నల్గొండ పట్టణంలో జరిగింది. సభకు పార్టీ సీనియర్ నేతలతో పాటు... కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. శ్రీనివాస్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.బొడ్డుపల్లి శ్రీనివాస్‌ది ముమ్మాటికి టీఆర్‌ఎస్‌ నాయకులు చేయించిన హత్యేనని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. హత్యలు పిరికివారే చేస్తారని... తాను హత్యలు చేయడం ప్రారంభిస్తే నల్లగొండ మురికి కాలువల్లో అన్ని మొండాలే ఉంటాయన్నారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. తాను చంపాలనుకుంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎవరూ మిగలరని కేసీఆర్‌పై మండిపడ్డారు. కాని తాను అలాంటి వ్యక్తిని కాదని కాంగ్రెస్‌ పార్టీ తనకు ఆ తత్వం నేర్పలేదన్నారు.

జోలికొస్తే ఊరుకునేది లేదు
కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో జిల్లా మంత్రికి సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్‌ సీఎంను కోరినప్పటికీ ఎవరూ స్పందించాలేదన్నారు. శ్రీనివాస్‌ హత్య వెనకాల రాజకీయ కుట్ర ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు మరోసారి డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లైనా పోరాడతామన్నారు. 

08:13 - February 5, 2018

రంగారెడ్డి : జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఫోర్డ్‌ ఫియాస్టా కారులో అకస్మికంగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు. 

08:12 - February 5, 2018

సంగారెడ్డి : రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో జరిగిన టీ జేఏసీ విస్తృత సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజల బతుకులు మారలేదన్న నిర్ణయానికి కోదండరామ్‌ వచ్చిన తర్వాత టీ జేఏసీని రాజకీయ పార్టీగా మార్చాలన్న డిమాండ్‌ వచ్చింది. కానీ ఉద్యమం సంస్థగా కొనసాగించడానికి నిర్ణయించారు. కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడం మొదలుపెట్టిన తర్వాత టీ జేఏసీని రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఒత్తడి వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలని ప్రజలు కోరినా ముందు సున్నితంగా తిరస్కరించిన కోదండరామ్‌.. మారిన పరిస్థితులు నేపథ్యంలో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలన్ని నిర్ణయానికి వచ్చారు. టీ జేఏసీని యథావిధిగా కొనసాగిస్తూ.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును కోదండరామ్‌ ప్రకటించారు.

కోదండరామ్‌ను పక్కన పెట్టారు
రాజకీయాల్లో మార్పు కోసం పార్టీ పెట్టాలని టీ జేఏసీ నిర్ణయించింది. ప్రజల సహకారంతో పార్టీని నడుపుతూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో టీ జేఏసీ కీలక పాత్ర నిర్వహించింది. ప్రజాభిప్రాయాన్ని ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా మలచడంతో ముఖ్య భూమిక పోషించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ వంటి పోరాటాల్లో జేఏసీ ముందుంది. తెలంగాణ సాధనోద్యమంలో పలుసార్లు అరెస్టయ్యారు. తెలంగాణ ఆవిర్భావం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీ జేఏసీతోపాటు కోదండరామ్‌ను పక్కన పెట్టారు. ఏడాదిన్నరపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్‌... ప్రత్యేక రాష్ట్రంలో కూడా పరిస్థితులు మారలేదన్న నిర్ణయానికి వచ్చారు.

బలవంతపు భూసేకరణలు
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు లేవంటూ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణలకు వ్యతిరేకంగా పోరాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్య బాట పట్టిన అన్నదాత కుటుంబాల ఆవేదనను చూసి చలించిపోయారు. ఊరూరు తిరుగుతూ కేసీఆర్‌ సర్కారు విధానాలను ఎండగట్టారు. ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను కూడగట్టి కొలువుల కోసం కోట్లాట నిర్వహించారు. కొలువు కొట్లాట నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా నిర్బంధకాండ విధించడంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుని సభ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ విధానాలపై పోరాడే క్రమంలో అధికార పార్టీ నేతలు కోదండరామ్‌ను కాంగ్రెస్‌ ఏజెంటుగా విమర్శించినా ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం అవనుసరిస్తున్న ఇలాంటి విధానాలతో విసిపోయిన టీ జేఏసీ ఇప్పుడు కొత్త రాజకీయని ప్రకటించి, ఎన్నికల క్షేత్రంలో దిగాలని నిర్ణయించడం టీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందేనని భావిస్తున్నారు. 

08:11 - February 5, 2018

హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ముసాయిదా బిల్లు పురోగతి, నూతన గ్రామ, నగర పంచాయతీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీలకు నిధులు కేటాయింపు, ఆర్థిక సంఘం నిధుల విడుదల, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ఆస్తి పన్ను వసూలు ద్వారా వచ్చే నిధులు తదితర అంశాలపై కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఎలా పొందాలో అధ్యయనం చేయాలని అధికారుల దృష్టికి తెచ్చారు.

వచ్చే నెల 11న పాస్ బుక్ లు
వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాపు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో వీటి ముద్రణను వేగవంతం చేయలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. త్వరతగతిన అనుకున్న సమయానికి పూర్తయ్యేటట్టు చూడాలిన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ విషయంలో ఇసక్తి ఉన్న ప్రభుత్వేతర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

అటవీ భూములను రక్షణ
రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధిపథంలో పయనిస్తూ, భౌగోళికంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరాన్ని అన్ని విధాల కాపాడుకోవాల్సిన అవసరాన్ని కేసీఆర్ అధికారుల దృష్టికి తెచ్చారు. నగరానికి అన్ని వైపుల 50 నుంచి 60 కి.మీ.పరిధిలో లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధిచేసి, కేబీఆర్‌ పార్క్‌ తరహాలో వాక్‌ వేని నిర్మించాలని కేసీఆర్‌ ఆదేశించారు. సేవ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేపట్టాలని కోరారు. 

నేడు మావోయిస్టుల బంద్

ఖమ్మం : భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. భూ సేకరణ బిల్లుతో రైతులను ప్రభుత్వం ముంచుతుందని వారు ఆరోపించారు. 

కారులో మంటలు

గుంటూరు : నర్సారావుపేటలోని నుదురుపాడు వద్ద కారులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటన అప్రమత్తమై కారులోంచి బయటకు దూకారు. దీంతో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. 

07:53 - February 5, 2018

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, టీఆర్ఎస్ ఏర్పాడిన నుంచి ఎన్నో పార్టీలు వచ్చి వెళ్లాయని, విద్యార్థి జేఏసీ మొదట ఓయూలో మొదలైందని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితిల్లో కోదండరాం కొత్త పార్టీ పెడుతున్నట్టు తెలుస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫెలయ్యాయని, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చని కానీ ఆ పార్టీ మనుగడ ఎలా ఉంటుందో ఆలోచించాలని టీడీపీ నేత దుర్గప్రసాద్ అన్నారు. నిన్నటివరకు కేంద్రంపై పోరాడుతుందని అందరు భావించారని, కానీ టీడీపీ మాట మార్చిందని సీపీఎం నేత బాబు రావు అన్నారు. బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, చంద్రబాబు ఆవేశం ఒక్కరోజు మాత్రమే ఉంటుందని, కేవలం చంద్రబాబు తనపై కేసుల నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రప్రయోజనాలను విస్మరిస్తున్నారని వైసీపీ నేత గోపిరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:38 - February 5, 2018

స్కూల్ యాజమాన్యం వేధించడం వల్లే సాయి దీప్తి ఆత్మహత్య చేసుకుందని, దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని, సాయిదీప్తి ప్రభుత్వా హత్యనా లేక ఆత్మహత్య అని, ప్రతి ఆ ఆమ్మాయి చదువుకున్న స్కూల్ ఒక్క ఫ్లోర్ లో ఉందని, ఆమ్మాయిని స్కూల్ యాజమాన్యం కుల దూషణ చేసిందని హైదరాబాద్ స్కూల్ పెరెన్స్ ఆసోసియెషన్ నాయకులు వెంకట్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss