Activities calendar

06 February 2018

అమెరికా నివేదిక..కుప్పకూలిన స్టాక్ మార్కెట్...

ముంబై : స్టాక్ మార్కెట్‌లో మరోసారి వణికిపోయింది. అయితే ఈసారి మార్కెట్ పతనానికి బడ్జెట్ భయాలు కాదు.. అమెరికాలో వచ్చిన నివేదిక. అమెరికాలో... వేతనాలు పెరుగుతున్నాయన్న నివేదికకు తోడు బాండ్లపై వడ్డీ పెరగడం, ప్రతిగా ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు అక్కడి మార్కెట్లను కుప్పకూలింది. 

అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం...

ముంబై : అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లో ఉన్న అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.

22 మంది భారతీయ సెయిలర్లు విడుదల...

ఢిల్లీ : దక్షిణ ఆఫ్రికాలోని సముద్రపు దొంగల చెర నుంచి 22 మంది భారతీయ సెయిలర్లు సురక్షితంగా విడుదలయ్యారు. దక్షిణ ఆఫ్రికాలో ఫిబ్రవరి 1న భారత్‌కు చెందిన మెరైన్‌ ఎక్స్‌ప్రెస్‌ షిప్‌ను సముద్రలు దొంగలు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే.

20:59 - February 6, 2018

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర అటవీశాఖ మంత్రి హర్షవర్థన్‌ను కలిసి.. సీతారామ ప్రాజెక్ట్‌కు పూర్తి అనుమతులపై చర్చించారు. అనంతరం... కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధి, నిధుల మంజూరు అంశాలను చర్చించారు. గతంలో 3వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కోసం ఇచ్చిన హామీలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని తుమ్మల కోరారు. తెలంగాణలో 10వేల కోట్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను మార్చిలోగా పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు. 

20:57 - February 6, 2018

విశాఖపట్టణం : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా గతించిన అంశమన్నారు. హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్నది కేవలం ఊహ మాత్రమేనని కొట్టిపారేశారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో వచ్చిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రత్యేకహోదా పట్టించుకోకుండానే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని గుర్తు చేశారు. ఈ విషయం స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషే చెప్పారన్నారు. 

20:55 - February 6, 2018

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ ముఠా కలకలం రేపింది. విద్యార్థులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తోన్న ముఠా పోలీసులకు చిక్కింది. ముగ్గురు డ్రగ్స్‌ సప్లయర్స్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బాగ్‌ అంబర్‌పేటకు చెందిన యశ్‌సుంకర అనే విద్యార్థి డ్రగ్స్‌ అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, నారాయణగూడ పోలీసులు రంగంలోకి దిగారు. మధుశాల బార్‌ దగ్గర డ్రగ్స్‌ విక్రయిస్తున్న యశ్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 75 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌, 30 గ్రాముల చారస్‌, 40 గ్రాముల గంజాయితోపాటు ఓ ఫోర్డ్‌ ఎండీవర్‌ కారు, 4సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

బాగ్‌ అంబర్‌పేటకు చెందిన యశ్‌సుంకర నగరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. యశ్‌సుంకర తరచూ గోవాకు వెళ్లే అలవాటుంది. అక్కడే ఇతడినికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు ఏర్పడ్డాయి. నైజీరియాకు చెందిన అగలా అలుమా ప్రైడే, అబిద్‌ నజీర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి... గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

నైజీరియాకు చెందిన అగలా అల్మా ప్రైడే... గడువు ముగిసిన వీసాతో ఇండియాలోనే ఉంటున్నాడు. ఈజీ మని కోసం స్నాప్‌చాట్‌ యాప్‌ ద్వారా పరిచయాలు పెంచుకున్నాడు. యశ్‌ గోవా వెళ్లినప్పుడు స్నాప్‌చాట్‌ ద్వారా అతనికి డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. ఆ తర్వాత వీరికి అబిద్‌ నజీర్‌ జతకలిశాడు. ముగ్గురూ కలిసి నగరంలో కొన్నాళ్లుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు వీరి కార్యకలాపాలపై పక్కా సమాచారం అందడంతో ఎట్టకేలకు చిక్కారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. బాబీ వెంట ఆయన స్నేహితులు అషీర్ అలీ, ప్రశాంత్, వినయ్‌లు కూడా జైలుకి వచ్చారు. జైలు నిబంధనలు, ఖైదీల ఆహార నియమాలను పాటించిన వారంతా తమ చిరకాల కోరికను తీర్చిన సంగారెడ్డి జైలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

20:42 - February 6, 2018

రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన న్యాయమెంత ? తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు ఏంటీ ? వైజాగ్ రైల్వే జోన్ పరిస్థితి ఏంటీ ? తదితర విషయాలపై టెన్ టివి చర్చను చేపట్టింది. ఈ చర్చలో కుమార్ (సౌత్ సెంట్రల్ రైల్వేస్ మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:34 - February 6, 2018

ప్రేమలు కరవవుతున్నాయి.... బంధాలు భారమవుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కిరాతకులుగా మారుతున్నారు. కన్నపేగు ప్రేమను మరచి తమలోని కర్కశత్వాన్నిబయటపెడుతున్నారు. ఇటీవల విశ్వనగరంలో వెలుగు చూసిన హృదయవిదార ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఇంతకు ఎందుకీ అప్యాయతలు గాడితప్పుతున్నాయి... పైశాచిక హత్యలు పెరిగిపోటానికి కారణమేంటి... రోజురోజుకు పెరుగుతున్న బలవన్మరణాలను ఆపేదెలా... ఈ నగరానికి ఏమైంది అనే దానిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త), రెడ్డన్న (మాజీ పోలీస్ అధికారి), నగేష్ (సైకాలజిస్టు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తెలంగాణకు రూ. 1813 కోట్లు..ఏపీకి రూ. 3670 కోట్లు...

హైదరాబాద్ : 2018-19 లో తెలంగాణలో 5 శాతం...ఏపీలో 8 శాతం కేటాయింపులు పెరిగాయి. రైల్వే బడ్జెట్ లో తెలంగాణలో రూ. 1,813 కోట్లు..ఏపీకి రూ. 3670 కోట్లు కేటాయించారు. ఏపీ, తెలంగాణలో పలు మార్గాల్లో విద్యుదీకరణకు కేటాయింపులు చేశారు. లింగంపేట - నిజామాబాద్ విద్యుదీకరణకు రూ. 80.29 కోట్లు..వికారాబాద్ - పర్లి వైజనాథ్ విద్యుదీకరణకు రూ. 262.12 కోట్లు...గద్వాల - రాయచూర్ విద్యుదీకరణకు రూ. 46.10 కోట్లు...తెనాలి - రేపల్లే విద్యుదీకరణకు రూ. 25.98 కోట్లు...నంద్యాల - ఎర్రగుంట్ల విద్యుదీకరణకు రూ. 111.48 కోట్లు...ధర్మవరం - పాకాల విద్యుదీకరణకు రూ. 210.47 కోట్లు...

పీయూష్ ను కలిసిన కొణతాల బృందం...

ఢిల్లీ : ఎంపీ సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడం జరిగిందని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చామని, సమావేశాలు పూర్తయ్యే లోపు నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగిందని, ఒడిశాతో చర్చించి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. 

రైల్వేజోన్ పై హామీనిచ్చారు. - ఎంపీ సుబ్బిరామిరెడ్డి...

ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్ పై పీయూష్ గోయల్ హామీనిచ్చారని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. రైల్వే జోన్ అంశం ఒడిశాతో లింక్ అయ్యిందని, ఒడిశా రాష్ట్రంతో చర్చలు జరిపి రైల్వే జోన్ తెప్పిస్తామన్నారు. 

తెలంగాణలో రాహుల్ సభలు...

హైదరాబాద్ : జూన్ 2వ తేదీలోపు తెలంగాణలో మూడు చోట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలు ఉంటాయని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. హైదరాబాద్..వరంగల్ లో సభలు ఉండే అవకాశం ఉంది. 

సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందించని కామినేని...

విజయవాడ : సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు బీజేపీ నేత, మంత్రి కామినేని విముఖత వ్యక్తం చేశారు. సోము వీర్రాజు పట్ల పార్టీ అంతర్గత సమావేశంలో చర్చిస్తామని, తన శాఖకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. కేంద్రం ఏపీకి తప్పకుండా న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

18:33 - February 6, 2018

హైదరాబాద్ : బీజేపీకి మద్దతిచ్చినంతకాలమే తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు..కేసీఆర్ లు బయట ఉంటారని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. వ్యతిరేకిస్తే ఇద్దరికీ జైల్లో ఉంటామన్న భయం ఉందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై బాబువి పై పై విమర్శలు అని తెలిపారు. 

అమరావతిలో బౌద్ధ ఆలయం..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని థాయ్‌లాండ్ బృందం కలిసింది. అమరావతి ప్రాంతంలో బౌద్ధ ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు థాయలాండ్ బృందం వెల్లడించింది. 

18:10 - February 6, 2018

ఢిల్లీ : విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చేసిన ప్రకటనపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఉభయసభల్లో టిడిపి ఎంపీలు గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి న్యాయం చేయాలని..విభజన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనితో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ లోక్ సభ..రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. విభజన హామీలు అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని..ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం టిడిపి ఎంపీలు సాయంత్రం భేటీ అయ్యారు. జైట్లీ చేసిన ప్రకటనపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఉదయం నుండి జరుగుతున్న పరిణామాలను ఏపీ సీఎం, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు టిడిపి ఎంపీలు వివరిస్తున్నారు. ప్రధానితో జరిగిన భేటీ వివరాలను సుజానా చౌదరి వివరించారు. జైట్లీ ప్రకటన అనంతరం ఆందోళనలు విరమించాలా ? వద్దా ? అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చర్చిస్తున్న టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : ఉభయసభల్లో ఆర్థిక మంత్రి జైట్లీ చేసిన ప్రకటనపై టిడిపి ఎంపీలు చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

పాలమూరు పనులు జరగుతున్నాయి : జితేందర్ రెడ్డి

ఢిల్లీ : పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి పంపు-1 దగ్గర పనులు సాగుతున్నాయని ఎంపీ జతేందర్ రెడ్డి తెలిపారు. అంజనగిరి రిజర్వాయర్ -నార్లాపురం మధ్య పనులను అడ్డుకునేలా కాంగ్రెస్ నాయకులు కేసు వేశారని ఆయన ఆరోపించారు. 

కేంద్ర మంత్రి హర్షవర్థన్ తో టీఆర్ఎస్ నేతల భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ టీఆర్ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. సీతారామ ప్రాజెక్ట్ అంశంలో వైల్డ్ లైఫ్ కు సంబంధించి అనుమతులు రావాల్సి ఉందని తుమ్మల కేంద్ర మంత్రికి వివరించారు. 

2002 దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు విచారణ

హైదరాబాద్ : 2002 దిల్ సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ పేలుళ్ల కేసులో నింధితుడు మహ్మద్ షఫీక్ ముజ్వార్ ను నాంపల్లి మెట్రో పాలిటన్ కోర్టులో సీఐడీ హాజరుపరిచింది. నింధితుడు షఫీక్ ను ఢిల్లీకి తరలించాలని సీఐడీ పోలీసులు కోర్టును కోరారు. 

నిరుద్యోగ చైతన్య యాత్ర ప్రారంభించిన ఉత్తమ్

హైదరాబాద్ : గాంధీభవన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య యాత్రను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, భట్టి, అనిల్ యాదవ్, పొన్నం పాల్గొన్నారు. ఈ యాత్ర 49 రోజులపాటు అన్ని నియోజవర్గాల్లో నడుస్తుందని ఉత్తమ్ తెలిపారు. 

ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావనలో లేదు : సోము

తూర్పుగోదావరి : ప్రస్తుతం ప్రత్యేక హోదా ప్రస్తావనలో లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు హోదాతో పనేంటని ఆయన ప్రశ్నించారు. 

డీజిల్ ట్యాంకర్ లో మంటలు

మేడ్చల్ : జిల్లా శ్రీరంగవరం వద్ద డీజిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్టు 

తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.  

17:29 - February 6, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఓ డ్రగ్స్‌ ముఠా పోలీసులకు చిక్కింది. విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ సెంట్రల్‌జోన్‌ డీసీపీ రాధాకృష్ణ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:25 - February 6, 2018

ఢిల్లీ : ఉభయసభల్లో టిడిపి ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్రం స్పందించింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు..ప్రత్యేక హోదా..తదితర విషయాలపై స్పందించాలని ఏపీ టిడిపి ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్ సభ..రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేశారు. హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని, రెండేళ్ల క్రితమే స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉందని, కొన్ని విషయాల్లో ఏపీ ఫైనాన్స్ సెక్రటరీతో తమ అధికారులు చర్చిస్తారని అరుణ్ జైట్లీ తెలిపారు.

అంతకుముందు రాజ్యసభలో కూడా జైట్లీ ప్రకటన చేశారు. విభజన చట్టంలోని హామీలకు కట్టుబడి ఉన్నట్లు, అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగిందని జైట్లీ తెలిపారు. ఈఏపీ నిధుల మంజూరుపై చర్చిస్తున్నట్లు, రెవిన్యూ లోటు కింద ఏపీకి రూ. 3900 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. రైల్వే జోన్ విషయంపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

 

16:58 - February 6, 2018

విజయవాడ : ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారు. బాబు అధ్యక్షతన టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టిడిపి పెట్టిన వత్తిడితో కేంద్రంలో కదలిక వచ్చిందని, వైసీపీ డిఫెన్స్ లో పడిందని సమన్వయ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీనియర్ నేతలతో బాబు చర్చించారు. ప్రధానితో జరిపిన భేటీ వివరాలను బాబుకు సుజనా చౌదరి వివరించారు. సీఎంతోనే మాట్లాడుతానని మోడీ పేర్కొన్నట్లు సుజాన చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల మేలు కోసం రాజీ పడబోమని బాబు పేర్కొన్నట్లు, ఆయా విషయాలపై ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బాబు సూచించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:54 - February 6, 2018

రాజ్యసభలో ఆర్థిక మంత్రి ప్రకటన

ఢిల్లీ : రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి బడ్జెట్ లో అన్యాయంపై ప్రకటన చేశారు. విభజన చట్టంలోఓని హామీలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా జైట్లీ అన్నారు. అందుకే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, ఈఏపీ నిధుల మంజూరుపై చర్చిస్తున్నామని జైట్లీ తెలిపారు. 

16:32 - February 6, 2018

రాజ్యసభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్

ఢిల్లీ : రాజ్యసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారు వాకౌట్ చేశారు. 

16:17 - February 6, 2018
16:16 - February 6, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై టిడిపి గుస్సాగా ఉన్న సంగతి తెలిసిందే. విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు లోక్ సభ..రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. మంగళవారం ఎప్పటిలాగానే టిడిపి ఎంపీలు నిరసన చేపట్టారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశారు. విభజన చట్టంలోని హామీలకు కట్టుబడి ఉన్నట్లు, అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగిందన్నారు. ఈఏపీ నిధుల మంజూరుపై చర్చిస్తున్నట్లు, రెవిన్యూ లోటు కింద ఏపీకి రూ. 3900 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. రైల్వే జోన్ విషయంపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 

16:08 - February 6, 2018

విద్యార్థి ఆత్మహత్య

కడప : జమ్మలమడుగులో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు భారం తట్టులేక నవీన్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ కుమార్ పద్మావతి హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. 

విద్యార్థి ఆత్మహత్య

కడప : జమ్మలమడుగులో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు భారం తట్టులేక నవీన్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ కుమార్ పద్మావతి హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. 

15:59 - February 6, 2018

ఢిల్లీ : మన్మోహన్ సింగ్ చేసేది సరిపోదని..తన కాళ్లపై నిలబడే విధంగా చేస్తామని అధికారంలోకి రాకముందు బీజేపీ ఎన్నో హామీలిచ్చిందని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అప్పట్లో వాగ్ధానాలు ఇచ్చారని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్యసభలో తాను ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లు సభ ఎదుట పెట్టలేమని..తిరిగి బిల్లును తనకు పంపించారని తెలిపారు. అయినా ఎలాంటి వెనకడుగు వేయకుండా తన పోరాటం చేస్తానని హామీనిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపనకు నీళ్లు..మట్టి తీసుకొచ్చారని, తాము అప్పట్లోనే తగిన సూచనలు చేయడం జరిగిందన్నారు. సభలో..సభ బయట ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబుకు ఇలాంటి ఆలోచన తట్టిందని..ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యినందుకు తనకు సంతోషం కలిగిందన్నారు. 

15:57 - February 6, 2018

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి పరిస్థితి మేడిపండు చందంగా మారిందంటున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం కోట్ల గుమ్మరించి ల్యాబ్ లు ఏర్పాటు చేస్తే ప్రైవేటు టెక్నిషియన్లు వచ్చి రక్త నమూనాలు తీసుకుంటున్నారని అందుకు సూపరింటెండెంట్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమపై లేనిపోని నిందలు వేసి ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌తో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నామని ఆరోపించడం సరైంది కాదన్నారు. అందుకు గాంధీ సూపరిండెంట్ తమకు క్షమాపణ చెప్పాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా గాంధీలో జరుగుతున్న జూడాల ఆందోళనలపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:56 - February 6, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్నాయన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. హరీష్‌రావు ఇంట్లో వేడుక ఉంటే.. కేటీఆర్‌ బెంగళూరుకు వెళ్లి సినిమా చూసి వచ్చారన్నారు. వేడుకకు వెళ్లకుండా హరీష్‌రావును కేటీఆర్‌ అవమానించారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు నాలుగు ఓట్లు పడుతున్నాయంటే అది హరీష్‌వల్లేనని చెప్పారు. కేసీఆర్‌ రాజకీయాల నుంచి రిటైర్డ్‌ అయితే బావ, బావమరిది, కవిత రోడ్డుపైనపడి కొట్టుకుంటారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోష్యం చెప్పారు. రీజినల్‌ పార్టీలోనే ఇన్ని కుమ్ములాటలు ఉంటే.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చిన్న మనస్పర్థలు ఉండటం సహజమేనని కోమటిరెడ్డి అన్నారు.

15:53 - February 6, 2018

హైదరాబాద్ : మంత్రి జగదీష్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో కాల్‌డేటాను తయారు చేశారని మంత్రి అవగాహణ లేకుండా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. హత్యలో అధికారపార్టీ ప్రమేయం లేకపోతే.. సీబీఐ విచారణకు ఒప్పుకోవాలన్నారు. జగదీశ్‌రెడ్డిపై పలు నేరాల ఆరోపణలు ఉన్నాయని వాటన్నింటినీ వెలికితీస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగదీష్‌రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

15:51 - February 6, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన అంశం చాలా సున్నితమైనదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ లోక్‌సభలో అన్నారు. ఇప్పటికే ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. మిత్రపక్షమైన టిడిపి సభ్యులు, వైసిపి సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సహకరించాలని సభ్యులను కోరారు. లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

పాల ప్యాకెట్లు నెలపాలు

పశ్చిగోదావరి : జిల్లా కొవ్వూరులో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అంగన్ వాడీ సెంటర్లకు పాల ప్యాకెట్లు సరఫరా చేయలేదు. పాల ప్యాకెట్లకు గోదాంలోనే చెదలు పట్టడంతో వాటిని బయట పారేశారు. 

15:16 - February 6, 2018

ఢిల్లీ : లోక్ సభలో టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విభజన హామీలపై ప్రధాన మంత్రి నుండి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదని తెలుస్తోంది. టిడిపి ఎంపీలు జరుపుతున్న ఆందోళనలను విరమింప చేసే విధంగా చూడాలని సుజనాకు మోడీ సూచించినట్లు సమాచారం. తన చేతుల్లో లేదని సుజనా పేర్కొనడంతో నేరుగా సీఎం బాబుతో మాట్లాడుతానని మోడీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోక్ సభ వాయిదా పడగా మళ్లీ సమావేశం ప్రారంభమైంది. కానీ ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 3.30గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభలో కూడా టిడిపి ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ వెల్ లోకి వచ్చి ప్లకార్డులతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై నేరుగా ప్రధాన మంత్రి..సంబంధిత మంత్రితో చర్చించాలని డిప్యూటి ఛైర్మన్ సూచించారు. కానీ ఎంపీలు ఏ మాత్రం వినిపించుకోలేదు. చివరకు కొద్దిసేపటి అనంతరం ప్రభుత్వం సమాధానం ఇచ్చే అవకాశం ఉందని..చూద్దామని..అంతవరకు ఆందోళన విరమించాలని డిప్యూటి ఛైర్మన్ సూచించడంతో టిడిపి ఎంపీలు శాంతించారు. 

కాంగ్రెస్, టీడీపీ ఎంపీల వాగ్వాదం

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా కాంగ్రెస్, టీడీప ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి కారణం కాంగ్రెస్ అంటూ టీడీపీ ఎంపీలు ఆరోపించారు. 

14:58 - February 6, 2018

వ్యవసాయం..ఈ పనుల్లో దాదాపు 80 మంది మహిళలే. మరి మహిళలు రైతులుగా గుర్తింపబడుతున్నారా ? ప్రభుత్వాలు ప్రకటిస్తున్న లబ్దిని వారు అందుకోగలుగుతున్నారా ? వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర..స్థితి గతులు ఎలా ఉన్నాయి ? 2018-19 వ్యవసాయ బడ్జెట్ లో మహిళా రైతులకు లబ్ది చేకూరుతుందా ? ఈ అంశంపై టెన్ టివి 'వేదిక' చర్చను చేపట్టింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:55 - February 6, 2018
14:49 - February 6, 2018

ఢిల్లీ : విభజన చట్టం హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేపడుతున్నారు. వెల్ లోకి వెళ్లి ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీనితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నారు. ప్రధాన మంత్రితో ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఎంపీల ఆందోళనలు విరమింప చేయాలని సుజనాకి మోడీ సూచించినట్లు తెలుస్తోంది. తన చేతుల్లో ప్రస్తుతం లేదని సుజనా పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై నేరుగా సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడుతానని పీఎం మోడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

14:32 - February 6, 2018

విజయవాడ : అమరావతి...రాజధాని నిర్మాణం..సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మూడేండ్లు అయిపోయాయి..కానీ రాజధాని నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే రాజధానికి భూమి ఇవ్వకుండానే కొంతమంది ప్రయోజనాలు పొందుతుండడం గమనార్హం. ల్యాండ్ పూలింగ్ పేరిట ఘరానా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక రైతులు బహిర్గపరచడంతో మోసం వెలుగు చూసింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

గౌస్ ఖాన్ అనే వ్యక్తికి సీఆర్డీఏ అధికారులు భూమి కేటాయించారు. కానీ ఈ గౌస్ ఖాన్ స్థానికుడు కూడా కాదు. అంతేగాకుండా ఇతనికి ఇక్కడ భూమి లేకుండానే భూమి ఉన్నట్లు కాగితాలు సృష్టించాడు. గౌస్ ఖాన్ కుమారుడికి రూ. 3 కోట్లకు పైగా అధికారులు ప్రయోజనాలు కల్పించారు. సీఆర్డీఏ అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

ఇందులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కౌలు ఎలా చెల్లించారు ? జరీబు పొలానికి 1400 స్థలం ఎలా కేటాయించారు ? మూడు రకాల ప్లాట్లు ఎలా కేటాయించారు ? ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ల్యాండ్ లు సృష్టించి..రిజిస్ట్రేషన్ చేయించడంలో సీఆర్డీఏ అధికారుల హస్తం తప్పకుండా ఉంటుందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 29 గ్రామాలున్న సీఆర్డీఏ కార్యాలయంలో ఉంటూ ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

14:24 - February 6, 2018

హైదరాబాద్ : ఇటీవలే జరిగిన ఘటనతో చిలుకానగర్ వాసులు భయపడుతున్నారని టీఆర్ఎస్ నేత పేర్కొన్నారు. ఇటీవలే ఉప్పల్ లోని చిలుకానగర్ లో ఓ ఇంటిపై చిన్నారి తల లభ్యమైన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తున్న ఇంటి యజమాని రాజశేఖర్, భార్య శ్రీలత, పూజారితో పాటు కరీంనగర్‌కు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ తండా నుంచి పాపను తీసుకొచ్చినట్లు నిందితుడు వెల్లడించాడు. రాజశేఖర్ భార్య శ్రీలత ఆరోగ్యం బాగుపడుతుందనే నరబలి ఇచ్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీనిపై టీఆర్ఎస్ నేత మీడియాతో మాట్లాడారు. 

14:18 - February 6, 2018

మేడ్చల్ : ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.. ఆర్థిక ఇబ్బందులు..ఇతరత్రా కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..ఒక్కోసారి కుటుంబం కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరం. తాజాగా మరొక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కీసర మండలంలో చోటు చేసుకుంది. పెద్దమ్మ చెరువులోకి ఒక కుటుంబం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో భార్య భర్తలు..ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరందరూ ఘట్ కేసర్ మండలం కొండాపూర్ వాసులుగా గుర్తించారు. కుటుంబ తగాదాలున్నాయా ? లేక ఆర్థిక పరమైన సమస్యలున్నాయా ? అనేది తెలియరావడం లేదు. 

బాబు సహనం కొంపముంచుతోంది - జేసీ...

ఢిల్లీ : చట్టంలో ఉన్నది ఒకటి..అమలు చేస్తోంది మరొకటి అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తీవ్రంగా వ్యవహరించకపోతే లాభం లేదని, సీఎం ఆశావాది..నిరాశాపరుడు కాదన్నారు. ఇంకా ఎన్డీయేలో కొనసాగుదాం అంటున్నారని, బాబు సహనం కొంపముంచుతోందన్నారు. బాబు ఎప్పుడు సయ్యాంటారో చూడాలన్నారు. 

కీసరలో విషాదం...

మేడ్చల్ : కీసర మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెద్దమ్మ చెరువులోకి ఒకే కుటుంబం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో భార్య భర్తలు..ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరందరూ ఘట్ కేసర్ మండలం కొండాపూర్ వాసులుగా గుర్తించారు. 

13:39 - February 6, 2018

నల్గొండ : బీజేపీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో బీజేపీ నేతలు ఎన్నికల ప్రసంగం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు పకోడీ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఉపాధి కల్పన, ఉద్యోగాలు సృష్టించడంలో బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్ర విజభన చట్టం హామీలు అమలు జరపడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను బీజేపీ వమ్ము చేసిందన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలం చెందిందన్నారు. ఏపీకి కేంద్రం మూడేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ ఊసేలేదన్నారు. చంద్రబాబు, కేసీఆర్ లు కేంద్రంతో స్నేహం చేస్తూ.. నాలుగు సం.రాలు కాలక్షేపం చేశారని.. కేంద్రం హామీలను అమలు చేయించుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాటకం ఆడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఆ నాటకం కూడా చేయడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. కేంద్రం ఏ ఏ వాగ్ధానాలు ఇచ్చిందో... వాటిలో ఎన్ని అమలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 

13:24 - February 6, 2018

మలయాళ సినీ నటి, నృత్యకారిణి దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకున్నారు. ఈమె ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైయ్యారు. ఈమె దక్షణాదిలో 50పైగా సినిమాలు చేశారు. దివ్యకు గతంలో అమెరికాకు చెందిన వైద్యుడిని పెళఙ్ల చేసుకున్నారు. ఆమె అరుణ్, మీనాక్షి అనే ఇద్దరు పిల్లకు జన్మనిచ్చారు. అనంతరం దివ్య భర్తతో విడిగా ఉంటున్నారు. తాజాగా దివ్య హ్యూస్టన్ లోని గురువయప్పన్ ఆలయంలో అమెరికాకు చెందిన సాప్ట్ వేరు ఇంజనీర్ ను పెళ్లీ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. 

13:21 - February 6, 2018
13:14 - February 6, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ భేటీలో టీడీపీ నేతలకు హామీ దక్కలేదు. ప్రధానితో సమావేశం టీడీపీ నేతలకు సంతృప్తినివ్వలేదు. నిరసనలు కొనసాగించాలని టీడీపీ నిర్ణయిచింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, హౌస్ లీడర్ ఆరుణ్ జైట్లీ టీడీపీని చర్చలకు పిలిచారు. చర్చలకు వెళ్లేందుకు టీడీపీ విముఖత చూసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

హామీలపై చర్చకు నోటీసిచ్చాము : విజయసాయి

ఢిల్లీ : విభజన హామీలపై చర్చకు రాజ్యసభలో నోటీసు ఇచ్చామని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి తెలిపారు. విభజన హామీలు సాధించేవరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు. 

పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల ఆందోళన

ఢిల్లీ : విభజన హామీలు అములుపరచాలని పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ హామీలు అమలు పరచకుండా చట్టాన్ని అపహాస్యం చస్తున్నారని వారు విమర్శించారు. విభజన హామీలు సాధించేవరకు పోరాటం చేస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. 

ఎంపీల ఆందోళనపై స్పందించిన మంత్రి

ఢిల్లీ : టీడీపీ ఎంపీల ఆందోళనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారల శాఖ మంత్రి అనంతకుమార్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అంశం చాలా సున్నితమైందని, ఏపీ పై ప్రధాని మోడీ దృష్టి పెట్టారని ఆయన అన్నారు. సభ్యులు సంయమనం పాటించాలని అనంతకుమార్ కోరారు. 

టీడీపీ నిరసన శుభపరిణామం : మిథున్ రెడ్డి

ఢిల్లీ : ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని టీడీపీ ఎంపీలు నిరసన తెలపడం శుభపరిణామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మోడీ వద్ద, పార్లమెంట్ లో ఇదే తరహాలో నిరసన తెలపాలని హితవు పలికారు. టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరించకూడదని ఆయన విమర్శించారు. 

12:55 - February 6, 2018

నల్గొండ : ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. నల్గొండలో జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయన సౌహార్ధ సందేశం ఇచ్చారు. ఆనంతరం ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ఏపీలో ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలో చేపట్టిన సామాజిక, వర్గ పోరాటాల వల్ల ప్రజా పోరాటాలు ఊపందుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు అవకాశం ఉందన్నారు. 

 

విభజన హామీలు సాధిస్తాము : మురళీ మోహన్

ఢిల్లీ : ఎవరిని నొప్పించకుండా విభజన హామీలు సాధిస్తామని, మా నిరసన ద్వారా కచ్చితంగా విజయం సాధిస్తామని తెలుగుదేశం ఎంపీ మురళీ మోహన్ అన్నారు. విభజన హామీలు సాధించికుండా విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

12:45 - February 6, 2018

ఢిల్లీ : లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. వెల్ లోకి వెళ్లి ఎంపీలు నిరసన తెలిపారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని ఆందోళన చేపట్టారు. ఏపీకి రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.  

12:40 - February 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేస్తుశారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. చిడతలు చేతపట్టి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని శివప్రసాద్ వివరించారు. మరోవైపు ప్రధాని మోదీతో కేంద్రమంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. 

టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచిన వెంకయ్య

ఢిల్లీ : టీడీపీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చర్చలకు పిలిచారు. కానీ టీడీపీ ఎంపీలు చర్చలకు వెళ్లేందుకు విముఖత చూపారు. 

12:33 - February 6, 2018

హైదరాబాద్ : హైటెక్ మెట్రో రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్  కారణమా లేదా ఇతర కారాణాలేమైన ఉన్నాయా తెలియాల్సి ఉంది. ఇరువైపుల ట్రాఫిక్ జాం అయింది. భారీగా వాహనాలు నిలిచాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:31 - February 6, 2018

హైదరాబాద్ : ఉప్పల్ నరబలి కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ చిలకనగర్‌లో చంద్రగ్రహణం నాడు పాపను బలి ఇచ్చిన కేసులో ఇంటి యజమాని రాజశేఖర్, భార్య శ్రీలత, పూజారితో పాటు  కరీంనగర్‌కు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ తండా నుంచి పాపను తీసుకొచ్చినట్లు నిందితుడు వెల్లడించాడు. రాజశేఖర్ భార్య శ్రీలత ఆరోగ్యం బాగుపడుతుందనే నరబలి ఇచ్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే మంచి జరుగుతుందని పూజారి చెప్పడం వల్లే పాపను బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

నగరంలో మరోసారి డగ్స్ కలకలం

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్త్ జోన్ పోలీసులు ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నింధితుల నుంచి ఎల్ఎస్ డీ, హెరాయిన్, చారస్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

మోడీని కలిసిన సుజనా చౌదరి

ఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కలిశారు. ఆయన దాదాపు 20 నిమిషాలు మోడీతో చర్చించారు. విభజన హామీలపై మోడీతో సుజనా చర్చించినట్టు సమాచారం. 

రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడింది. చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. సభలో టీడీపీ ఎంపీలో ఆందోళన చేస్తుండడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. 

12:07 - February 6, 2018
12:01 - February 6, 2018

ఢిల్లీ : ఏపీ విభజన చట్టం హామీలను అమలు చేయాలని ఢిల్లీలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీకి ప్యాకేజీ లేదు..పాకేజీ లేదు అని మండిపడ్డారు. మిత్రపక్షంలో ఉండాలో లేదో తాము ఆలోచించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహనం ఎక్కువగా ఉందన్నారు. సహనం కొంప ముచ్చతుందని... సహనానికి కూడా హద్దు ఉండాలని చెప్పారు. 

 

లోక్ సభ వెల్ లోకి వెళ్లి ఎంపీల నిరసన

ఢిల్లీ : ఏపీ విభజన హామీల కోసం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు మిన్నంటాయి. లోక్ సభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. వెల్ లోకి వెళ్లి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. 

టీడీపీ సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : ఏపీ విభజన హామీల కోసం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ సభ్యుల ఆందోళనలతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. టీడీపీ సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ వాయిదా పండింది. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. లోక్ సభ 10 నిమిషాలు వాయిదా పడింది.  

 

11:46 - February 6, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీల కోసం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు మిన్నంటాయి. లోక్ సభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. వెల్ లోకి వెళ్లి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. 

 

11:42 - February 6, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీల కోసం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యుల ఆందోళనలతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ వాయివా పండింది. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. లోక్ సభ 10 నిమిషాలు వాయిదా పడింది.  

 

11:40 - February 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా వాడీవేడీగా సమావేశాలు కొనసాగనున్నాయి. శుక్రవారంతో పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ లోక్ సభలో ప్రెసిడెంట్ ప్రసంగానికి ఎంపీలు ధన్యవాదాలు తెలపనున్నారు. ఏపీకి కేటాయింపుల్లో అన్యాయం, విభజన చట్టం అమలుపై టీడీపీ ఆందోళనలు చేపట్టనుంది. అదేబాటలో వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, అమిత్ షాను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించనున్నారు. 

 

11:26 - February 6, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్ బీనగర్, మందుల బస్తి, కోయబస్తి, గంగపుత్ర కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వమించారు. 37 మంది అనుమానితులను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కిలో 25 పైసలకు పడిపోయిన టమాటా ధర

కర్నూలు : వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర పడిపోయింది. కిలో 25 పైసలకు పడిపోవడంతో టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ధర లేకపోవడంతో రైతులు రోడ్డుపైనే టమాటాలు పారబోశారు. టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోలనకు దిగారు.

10:47 - February 6, 2018

కర్నూలు : వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర పడిపోయింది. కిలో 25 పైసలకు పడిపోవడంతో టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ధర లేకపోవడంతో రైతులు రోడ్డుపైనే టమాటాలు పారబోశారు. టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోలనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:39 - February 6, 2018

హైదరాబాద్ : ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఆడిట్ విభాగంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:32 - February 6, 2018

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వర్చువల్ రివ్యూలో ప్రాజెక్ట్ తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.స్పిల్‌ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, రేడియల్ గేట్లు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 4వేల 375కోట్లు ఖర్చవుతుందని అధికారులు సమావేశంలో తెలిపారు. పోలవరం పనుల పురోగతిపై.. చంద్రబాబు 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. 
పోలవరంపై 50వ సారి ముఖ్యమంత్రి వర్చువల్‌ రివ్యూ
పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 50వసారి సమీక్ష నిర్వహించడంతో.. మంత్రులు ఆయన్ని కొనియాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం అహోరాత్రులు అంకితభావంతో.. పనిచేస్తున్నారంటూ..పొగడ్తలతో ముంచెత్తారు.
53శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్ 
అమరావతి సచివాలయంలో సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. పోలవరం ప్రాజెక్ట్ 53 శాతం పూర్తైందని.. అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. కుడి ప్రధాన కాలువ 91 శాతం, ఎడమ ప్రధాన కాలువ 60శాతం నిర్మాణం జరిగాయని వివరించారు. హెడ్‌ వర్క్స్‌ 39శాతం పూర్తి కాగా, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 66 శాతం పూర్తైందని తెలిపారు. 71 శాతం వరకు స్పిల్‌వే, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు, 14 శాతం మేర కాంక్రీట్ నిర్మాణం , 58శాతం రేడియల్ గేట్ల ఫ్రాబ్రికేషన్ పూర్తైందని చెప్పారు. 82 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఎర్త్‌వర్క్ తవ్వకం పనులు జరిగాయని  సీఎంకు వివరించారు.
రాష్ట్రానికి 4,329.06  కోట్లు ఇచ్చిన కేంద్రం
అలాగే.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం మొత్తం 12వేల 9 వందల 15 కోట్లకు పైగా.. ఖర్చు చేయగా.. ఇందులో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన తర్వాత ఏడు వేల 7 వందల 79 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ మొత్తంలో గతేడాది డిసెంబర్‌ 31 వరకు కేంద్రం, రాష్ట్రానికి నాలుగు వేల 329 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్ట్ సాధనే ధ్యేయంగా.. కృషి చేస్తున్నారంటూ.. ముఖ్యమంత్రిని.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు అభినందించారు. 

 

మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌

కరీంనగర్‌ : మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది. జయశంకర్‌ జిల్లా మహాదేవ్‌పూర్‌ మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో అధికార పార్టీ నాయకులను టార్గెట్‌ చేసినట్లు సమాచారం ఉండడంతో... స్థానిక నేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసుల సూచిస్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

10:20 - February 6, 2018

కరీంనగర్‌ : మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది. జయశంకర్‌ జిల్లా మహాదేవ్‌పూర్‌ మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో అధికార పార్టీ నాయకులను టార్గెట్‌ చేసినట్లు సమాచారం ఉండడంతో... స్థానిక నేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసుల సూచిస్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

 

10:18 - February 6, 2018

విశాఖ : జిల్లాలోని అనకాపల్లి మండలం మామిడిపాలెంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గానికి చెందిన మేకల మందను మరో వర్గం వారు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో తలెత్తిన వివాదాన్ని పెద్దలు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఓవైపు చర్చలు జరుగుతుండగానే  రెండు వర్గాల వారు కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో కోటి అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

10:15 - February 6, 2018
10:08 - February 6, 2018

హైదరాబాద్ : పదిలంగా అల్లుకున్న పొదరిల్లు ఒక్కసారిగా కుప్పకూలింది..!  కేరింతలతో.. ఆటపాటలతో అలరారిన ఆ ఇల్లు..శ్మశానంగా మారింది..! అనుమానమో..? ఆర్థిక ఇబ్బందులో ? ఆ కుటుంబాన్ని ఛిద్రం చేశాయి..! కట్టుకున్న భర్తే.. భార్యను.. కడతేర్చాడు..! కడుపున పుట్టిన బిడ్డలను హతమార్చాడు..! ఆపై నేనే హత్య చేశానంటూ.. లొంగిపోయాడు. 
జిల్లెలగూడలో దారుణం 
హైదరాబాద్‌లోని...  జిల్లెలగూడలో దారుణం చోటుచేసుకుంది. హరీందర్‌ గౌడ్‌ అనే వ్యక్తి.. తన భార్య, తన ఇద్దరి బిడ్డల ప్రాణాలు తీశాడు. దీంతో.. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డెంటల్‌ టెక్నీషియన్‌గా పనిచేసే హరీందర్‌గౌడ్‌కు  ఎనిమిది సంవత్సరాల క్రితం జ్యోతితో వివాహం జరిగింది. వీరికి  ఆరేళ్ల అభిజిత్‌ గౌడ్‌, నాలుగేళ్ల సహస్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో సొంత ఇల్లు కట్టుకుని.. అక్కడే నివాసం ఉంటున్నారు.  ఏమి జరిగిందో ఏమో కానీ.. సోమవారం తెల్లవారుజామున.. హరీందర్‌ .. తన ఇద్దరి పిల్లలను.. గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం భార్య జ్యోతి తలను గోడకేసి కొట్టి.. చంపేశాడు. అక్కడ నుంచి నేరుగా మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చేసిన దారుణాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. 
పోలీసుల అదుపులో హరీందర్‌
దీంతో పోలీసులు హరీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యలకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. 
బంధువులు కన్నీరుమున్నీరు 
రోజూ తమ కళ్ల ముందే తిరిగే చిన్నారులు, జ్యోతిల హత్యలు.. కుటుంబ సభ్యులను, కాలనీవాసులకు కలవరానికి గురిచేసింది. నెత్తుటి మడుగులో.. చిన్నారులను చూసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. హరీంద్‌ర్‌ గౌడ్, జ్యోతి ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారని.. వారి మధ్య ఎటువంటి గొడవలు లేవని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. వారికి ఆర్థిక ఇబ్బందులు అసలే లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే.. హరీందర్‌ గౌడ్... కొద్దిరోజుల క్రితం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు.. ఈ మేరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  

 

10:01 - February 6, 2018

హైదరాబాద్ : ప్రజల ఆరోగ్యాన్ని హరించే కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఫుడ్‌ సేఫ్టీ పేరుతో వాహనాన్ని ఏర్పాటు చేసింది. నారాయణగూడలోని  ఐపీఎంలో శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు ఈ వాహనాన్ని ప్రారంభించారు. 
ఫుడ్‌ సేఫ్టీ వెహికిల్‌ ఏర్పాటు 
కలుషిత ఆహారంతో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫుడ్‌ సేఫ్టీ వెహికిల్‌ను మండలి చైర్మన్ స్వామిగైడ్, రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. ఆహార కల్తీని నివారించే ఈ వ్యాన్‌ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 54 ఆహార పదార్థాలను పరీక్షిస్తుంది. 50 లక్షల రూపాయలతో ఆహార పదార్థాలను పరీక్షించేలా ఈ వ్యాన్‌ను రూపొందించారు. 
ఆహార కల్తీ నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి : మంత్రి 
ఆహార కల్తీ నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో అన్ని రకాల ఆహార పరీక్షలకు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. పాలు, వంటనూనెలు, నెయ్యి, మసాలాలు వంటి అనేక ఆహార పదార్థాలు వాటి నాణ్యతలను పరీక్షించే సదుపాయాలు ఈ వ్యాన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కల్తీ ఆహారం నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  
ఐపిఎంలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేస్తాం : మంత్రి లక్ష్మారెడ్డి  
కార్యక్రమానికి విచ్చేసిన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఐపిఎంలో మాజీ ఉద్యోగి కావడంతో దశాబ్దాలుగా పేరుకుపోయి వున్న సమస్యలన్నింటిని మంత్రికి వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ శాఖలో నియామకాలే చేపట్టలేదన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులకు వాహనాలు లేక నానావస్థలు పడుతుంటారని వారికి వాహనాల సౌకర్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. ఈ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌  చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఐపిఎంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.  
 

 

09:56 - February 6, 2018

అనంతపురం : ఎక్కడో దేశం కాని దేశం. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, ఆచార వ్యవహారాలు వేరు. విభిన్నవాతావరణ పరిస్థితులు. కూల్‌  కంట్రీ నుంచి హాట్‌ ఇండియాకు వచ్చారు. ఏపీలోని కరవు సీమలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్న దక్షిణ కొరియా విద్యార్థులపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
కియా మోటార్స్‌ సామాజిక కార్యక్రమాలు 
వీరంతా దక్షిణ కొరియా విద్యార్థులు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్మాణంలో ఉన్న దక్షిణ కొరియా కార్ల దిగ్గజ సంస్థ కియా మోటార్స్‌...  కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా వీరిని ఇక్కడకు తీసుకొచ్చింది. జిల్లాలోని పాఠశాలల్లో సేవలు చేస్తున్నారు. 
గత నెల 29న ప్రారంభమైన సేవా కార్యక్రమాలు 
గత నెల 29 ప్రారంభమైన దక్షిణ కొరియా విద్యార్థుల సేవా కార్యక్రమాలు ఈనెల 7 వరకు కొనసాగుతాయి. మొత్తం నాలుగుటీములగా ఏర్పడి దక్షిణ కొరియా విద్యార్థులు రాప్తాడు, పెనుకొండ  స్కూళ్లలో మరుగుదొడ్లు, ప్రహరీగోడల నిర్మాణం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇసుక జల్లించడం నుంచి సిమెంటు కలపడం వరకు అన్ని పనులు చేస్తున్నారు. విద్యార్థులకు మరుగుదొడ్ల ఆవశ్యకత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి బోధిస్తున్నారు.  ఆట, పాటలు నేర్పిస్తున్నారు. సాంస్కృతి కార్యక్రమాలతో అలరిస్తున్నారు.  భారత్‌లో ఎండ, వేడిమి అధికంగా ఉన్నా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని కొరియా విద్యార్థులు చెబుతున్నారు. 
విద్యార్థులకు జేఎన్‌టీయూ ఎస్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సహకారం 
అనంతపురంలోని జేఎన్‌టీయూ ఎస్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు దక్షిణ కొరియా విద్యార్థులకు సహకరిస్తున్నారు. అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. బెంగళూరు కేంద్రగా పనిచేస్తున్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇండియా భాగస్వామ్యంలో కియా మోటార్స్‌ జిల్లాలోని స్కూళల్లో వంట గదుల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈనెల 7న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమక్షంలో దక్షిణ కొరియా, భారత్‌ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. 

09:49 - February 6, 2018

హైదరాబాద్ : ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరైన ఆ కాలనీ ఇప్పుడు రణగొణధ్వనులతో దద్దరిల్లుతోంది. నిత్యం కార్ల  సైరన్లతో హోరెత్తుతోంది. కార్యకర్తల నినాదాలు, నేతల భేటీలతో ప్రశాంతకు భగ్నం కలుగుతోందని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయం చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 10 టీవీ ప్రత్యేక కథనం...
అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రశాసన్‌నగర్‌ 
ఇది హైదరాబాద్‌లో అత్యంత ప్రశాంతంగా ఉండే జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌. సంపన్నులు, కార్పొరేట్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లతోపాటు ఇతర ఉన్నతాధికారులు నివసించే ప్రాంతం. ఒకప్పుడు ప్రశాంత జీవనం గడిపిన ప్రశాసన్‌నగర్‌ వాసులు...  జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు రణగొణధ్వనులు, సైరన్లహోరు, కార్యకర్తలు, నేతల నినాదాల హోరుతో ఇబ్బందులు పడుతున్నారు. శబ్దకాలుష్యంతో ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లుతోందని ప్రశాసన్‌నగర్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ప్రశాసన్‌నగర్‌ వాసులు ఆందోళన 
పవన్‌ను కలిసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం భారీగా కార్యకర్తలు, నేతలు వస్తున్నారు. వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇరుకు గల్లీలో ఉన్న జనసేన కార్యాలయానికి మీడియా ప్రతినిధుల తాకిడీ పెరిగింది. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోందని ప్రశాసన్‌నగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పవన్‌ అభిమానులు, నేతలు, కార్యకర్తల హడావుడి 
జనసేనాని ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు పవన్‌ అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన హడావుడి ఇంతా... అంతా.. కాదు. పవన్‌ వాహనశ్రేణిలోని ఓ కారు.... నిలిపివున్న మరో కారును ఢీ కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయాన్ని  ఆ కారు యజమాని జనసేన పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 
మరో చోటుకు మార్చేందుకు అన్వేషణ 
జనసేన పార్టీ కార్యాలయం చాలా చిన్నదిగా ఉంది. మీడియా ప్రతినిధుల కూర్చునేందుకు కూడా స్థలం లేదు. పార్టీ కార్యాలయంతో ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి వెళ్లడంతో విశాలంగా ఉండే మరో చోటుకు మార్చేందుకు అన్వేషణ జరుగుతోంది. 

 

09:44 - February 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకానికి సాయం అందించాలంటూ...మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి స్టీల్‌ కంపెనీ యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నాణ్యతతో కూడిన విశాలమైన పడకగదులను నిర్మిస్తుందని, ఇంతటి మహత్తర కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా సిమెంట్‌ కంపెనీలు తోడ్పాటునందించాలని మంత్రులు కోరారు.
డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌లు స్టీల్‌ కంపెనీ యాజమాన్యాలతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఉక్కు కంపెనీ ఆల్‌ ఇండియా స్టీల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సురేష్‌ కుమార్‌ సింఘాల్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, జిందాల్‌, శాలినీ స్టీల్‌ కంపెనీతో పాటు 8 స్టీల్‌ కంపెనీ యాజమాన్యాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. 
రూ.230కు బస్తా సిమెంట్‌ను విక్రయిస్తున్న కంపెనీలు 
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సిమెంట్‌ కంపెనీలు మార్కెట్‌లో హెచ్చు తగ్గులతో సంబంధంలేకుండా బస్తా సిమెంట్‌ను 230 రూపాయలకు విక్రయిస్తున్నారని మంత్రులు తెలిపారు. అయితే ఉక్కు కంపెనీ యాజమాన్యాలు ఉక్కును  తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం 2.60 లక్షల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు 1.45 లక్షల మెట్రిక్‌ టన్నులు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు 1.04లక్షల మెట్రిక్‌ టన్నులు అలాగే జీహెచ్‌ఎమ్సీ పరిధిలో నిర్మించే ఇళ్లకు 2.78 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉక్కు అవసరం ఉందని కంపెనీ యాజమాన్యాలకు మంత్రులు వివరించారు.  
ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపులు
ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రులు చెప్పారు. ఉక్కు విక్రయించిన కంపెనీలకు ఎలాంటి జాప్యం లేకుండా ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపులు ఉంటాయని వారికి స్పష్టం చేశారు. లాభాపేక్షతో కాకుండా సానుకూల ధృక్పథంతో అందుబాటు ధరలో ఉక్కును విక్రయించాలన్నారు. మంత్రుల విన్నపంపై ఉక్కు కంపెనీల యాజమాన్యాలతో చర్చించి ప్రభుత్వానికి తమ నిర్ణయం చెబుతామని యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంపై మరోసారి భేటీ కావాలని స్టీల్‌ కంపెనీ యాజమాన్యాలను మంత్రులు కోరారు. మూడు రోజుల్లో ఉక్కు కంపెనీ యాజమాన్యాలతో మరోసారి సమావేశమై నిర్దిష్టమైన ధరను నిర్ణయించాలని మంత్రులు గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. 

సామాజిక, వర్గ పోరాటాలు చేయాలి : చెరుపల్లి

నల్గొండ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత చెరుపల్లి సీతారాములు టెన్ టివితో మాట్లాడుతూ సీపీఎం పార్టీ పునాది పెరగాలన్నారు. పార్టీకి ప్రజా పునాది పెరగాలని కాంక్షించారు. బీఎల్ ఎఫ్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సామాజిక, వర్గ పోరాటాలు చేయాలని తెలిపారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది నినాదంతో మహాజన పాదయాత్ర నిర్వహించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎంబీసీ, అగ్ర వర్గాల్లోని పేదలందరినీ కలుపుకొని సామాజిక, వర్గ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 

 

09:39 - February 6, 2018

నల్గొండ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతున్నాయి. నేడు మూడో రోజు మహాసభలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ప్రతినిధుల సభ జరుగనుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత చెరుపల్లి సీతారాములు టెన్ టివితో మాట్లాడుతూ సీపీఎం పార్టీ పునాది పెరగాలన్నారు. పార్టీకి ప్రజా పునాది పెరగాలని కాంక్షించారు. బీఎల్ ఎఫ్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.  వర్గ, సామాజిక ఉద్యమాలు చేయాలని తెలిపారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది నినాదంతో మహాజన పాదయాత్ర నిర్వహించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎంబీసీ, అగ్ర వర్గాల్లోని పేదలందరినీ కలుపుకొని సామాజిక, వర్గ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక, వర్గ పోరాటాలు చేయకపోతే ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

మూడో రోజు సీపీఎం రాష్ట్ర మహాసభలు

నల్గొండ : జిల్లాలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతున్నాయి. నేడు మూడో రోజు మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు. 

 

జీహెచ్ ఎంసీ కార్యాలయంలో మంటలు

హైదరాబాద్ : ఖైరతాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. జీహెచ్ ఎంసీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఆడిట్ విభాగంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. 

08:45 - February 6, 2018

అనంతపురం : జిల్లాలోని కూడేరు మండలం ముద్దలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్‌ ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని ఆసత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను అరవకూరు వాసులుగా గుర్తించారు. ఈ  ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

08:43 - February 6, 2018

నల్గొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యను కోమటిరెడ్డి సోదరులు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  విమర్శించారు. శ్రీనివాస్‌ సంస్మరణ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ హత్యను అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

08:40 - February 6, 2018

హైదరాబాద్ : మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌ న్యాయమైనేదే అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్న పవన్‌.. ఈనెల 21న శ్రీకాకుళంలో మత్స్యకారులతో సమావేశమవుతానన్నారు. 
పవన్ కళ్యాణ్, మత్స్యకారుల సంఘం నేతలు భేటీ 
మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ న్యాయబద్ధమైనదేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పవన్‌ను ఆయన నివాసంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, మత్స్యకారుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లాలని వారు పవన్‌ను కోరారు. 
మత్స్యకారుల పోరాటానికి అండగా ఉంటా : పవన్‌
మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసన్న పవన్‌.. వారి పోరాటానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆక్వాఫుడ్‌ పార్క్‌ కాలుష్యంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. అటు ఉద్ధానంలోనూ మత్య్సకారుల జీవితాలు నలిగిపోతున్నాయని పవన్‌ అన్నారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చడంపై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మత్స్యకారులు శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని పవన్‌ తప్పుబట్టారు.
ఈనెల 21న శ్రీకాకుళంలో పర్యటన
అలాగే ఈనెల 21న శ్రీకాకుళంలో పర్యటించి..మత్స్యకారుల సమస్యలపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను నిలబెట్టుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం బడ్జెట్‌లో పెట్టే 380 కోట్ల రూపాయలలో 30 నుంచి 35 కోట్లు కూడా మత్స్యకారులకు చేరడం లేదని పుదుచ్చేరి ఫిషరీస్‌ మినిష్టర్‌ మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. అసలైన మత్స్యకారులకు లబ్దిచేకూరేలా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పవన్‌ను ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు దానిపై మాట్లాడుతానని పవన్‌ అన్నారు. 

 

08:34 - February 6, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రను సద్వినియోగం చేసుకోవడంలో నేతలు విఫలమవుతున్నారా...? పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చినట్లు కనిపిస్తున్నా... పార్టీ అధిష్టానం ఎందుకు భయపడుతోంది... వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వేలో తేలిందేంటి...?
అధికారమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర
సుమారు వెయ్యి కిలోమీటర్లు... ఎనభై రోజులు.. ఆరు జిల్లాలు, 36కు పైగా నియోజకవర్గాలు.. అడుగడుగునా జనంతో కలయిక.. ప్రజా సమస్యలపై ఆరా.. ఇలా కొనసాగుతోంది వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతోందీ పాదయాత్ర..  ప్రజా సమస్యలను అధ్యాయనం చేస్తూ ముందుకు వెలుతున్నారు జగన్. కానీ.... దానివల్ల వస్తున్న స్పందనను నేతలు  సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. 
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వే 
కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని...  నెల్లూరు రూరల్‌లో కొనసాగిస్తున్నారు. ఇంతవరకూ పాదయాత్ర ముగిసిన ప్రాంతాల్లో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ సర్వే చేసింది. పాదయాత్ర సమయంలో ఉన్న జోష్‌ తర్వాత కనిపించడంలేదని ఆ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై స్థానిక కార్యకర్తలు హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి వారే అన్నచందంగా నేతల తీరు
జగన్ పాదయాత్ర సమయంలో కలిసికట్టుగా కనిపించే నేతలు ఆ తర్వాత ఎవరికి వారే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.  క్షేత్ర స్థాయిలో జోష్‌ వచ్చిందని సంబరాలు చేసుకున్న నేతలు... దాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఆయా ప్రాంతాల్లో సమన్వయకర్తలే  అభ్యర్థులమని భావిస్తున్నారు. ఈవిషయం  కిషోర్‌ టీమ్‌ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.  దీంతో ఆయా నేతల వ్యవహార శైలిపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇకపై స్థానిక నేతలపై దృష్టి పెట్టకపోతే.. పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వైసీపీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై అలాంటి నేతలపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

 

08:31 - February 6, 2018

హైదరాబాద్‌ : అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలనక సంఘాలుగా మార్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పదిహేను వేలకు పైగా జనాభా  ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా ఆలోపు ప్రజలు ఉన్న ఊళ్లను నగర పంచాయతీలుగా  ప్రకటించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.
పురపాలక సంఘాలుగా పెద్ద పంచాయతీలు 
అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అంశంపై మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరైన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడం వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. పెద్ద పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చినా... రెండేళ్ల వరకు పన్నులు పెరగబోవన్న భరోసా కల్పించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం అధించే నిధులతో మెరుగైన రోడ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు  ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని పాలకులు ఆశిస్తున్నారు.  మెట్రోవాటర్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటారు. డబుల్‌ బెడ్‌ రూము ఇళ్ల నిర్మాణం చేపడతారు. 
కొన్ని గ్రామాల విలీనంతో పురపాలక సంఘాటు 
అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 167 గ్రామాలను నైసర్గిక స్వరూపాన్ని బట్టి మున్సిపాటీలు, నగర పంచాయతీలుగా మారుస్తారు. కొన్ని గ్రామాలను విలీనంచేసి పురపాలక సంఘాలు ఏర్పాటు చేస్తారు. అమీన్‌పూర్‌, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడ, ప్రగతినగర్‌, తెల్లాపూర్‌, కొల్లూరు, తుర్కయాంజాల్‌తోపాటు మరికొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్పుచేసే అంశంపై చర్చించారు. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులన ఆదేశించారు.   

 

08:27 - February 6, 2018

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వర్చువల్ రివ్యూలో ప్రాజెక్ట్ తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.స్పిల్‌ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, రేడియల్ గేట్లు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 4వేల 375కోట్లు ఖర్చవుతుందని అధికారులు సమావేశంలో తెలిపారు. పోలవరం పనుల పురోగతిపై.. చంద్రబాబు 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు.

 

08:25 - February 6, 2018

హైదరాబాద్ : 2018, 19 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, సంక్షేమానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ రంగాలకు గతంలో కంటే 20 శాతం ఎక్కువ నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలపై మొదటిసారి సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌... పద్దులను శాస్త్రీయంగా రూపొందించాలని కోరారు. శాఖలవారీగా కేటాయింపులు పక్కాగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, ఇతర నిధులు, ఇతరితర నిధుల సమీకరణ వంటి అంశాలపై సమీక్షించారు. 2017-18లో 1.49 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదించారు. ఈ బడ్జెట్‌లోజరిగిన ఖర్చుల వివరాలపై కేసీఆర్‌ ఆరా తీశారు. 
 

08:21 - February 6, 2018

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఏపీని బీజేపీ, టీడీపీలు మోసగించాయని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం సుబ్బారావు, సీపీఎం నేత మురళీకృష్ణ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విశాఖ జిల్లాలో ఘర్షణ..ఒకరు మృతి

విశాఖ : అనకాపల్లి మండలం మామిడిపాలెంలో పాతకక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

 

తిరుపతిలో నేటి నుంచి కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి : నేటి నుంచి కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

08:06 - February 6, 2018

మనిషి ఆలోచనలో ప్రాణం విలువు తగ్గుతువస్తోందా ?, చావడం చంపడం ఈజీ అయిపోయిందా ? హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు మనిషి ఇంత విలన్ గా ఎందుకు మారుతున్నాడు ? క్రైమ్ ఇంత విపరీతంగా ఎందుకు పెరుగుతోంది ? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డా.జవహర్ లాల్ నెహ్రూ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయం వేరు, ఆందోళన వేరు అని అన్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:58 - February 6, 2018

హైదరాబాద్ : నిన్నటి వరకు వారు మంచి మిత్రులు. కానీ ఇప్పుడు వారి మధ్య వైరం పెరుగుతోంది. ఒకపక్క మిత్రులుగా ఉంటూనే... మరోపక్క విమర్శల దాడికి దిగుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. వారే టీడీపీ - బీజేపీ నేతలు. నిన్నటి వరకు పాలు నీరుగా కలిసిపోయిన ఈ మిత్రులు... ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు. కేంద్ర బడ్జెట్‌ వీరి మధ్య చిచ్చు రాజేసింది.
బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
ఏపీలో మిత్రులుగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌ ఈ రెండు పార్టీల మధ్య నిగూఢంగా దాగున్న  వైరాన్ని బహిర్గత పర్చింది. దీంతో రెండు పార్టీల నాయకుల స్వరాలు మారుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరిస్థితి సవాళ్లు - ప్రతి సవాళ్లు చేసుకునే దాకా వెళ్లింది. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది.
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీని టార్గెట్‌ చేసిన టీడీపీ
కేంద్ర బడ్జెట్‌ అనంతరం బీజేపీని టీడీపీ టార్గెట్‌ చేసింది. ఏపీకి బీజేపీ నాలుగేళ్లుగా అన్యాయం చేస్తోందన్న అభిప్రాయాన్ని  టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా ప్రతివిమర్శలకు దిగారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు సంధించారు. రెండెకరాల పొలం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర పథకాలు టీడీపీ నేతలకు ఆదాయ వనరులుగా మారిపోయాయని విమర్శించారు. 
సోము వీర్రాజుపై టీడీపీ నేతల ఫైర్‌
నేరుగా చంద్రబాబుపైనే సోము వీర్రాజు విమర్శలు సంధించడం టీడీపీలో కలకలం రేపింది. దీంతో టీడీపీ నేతలు సోము వీర్రాజుపై ఒంటికాలుతో లేస్తున్నారు. సోము వీర్రాజుకు చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ భిక్షతో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు..మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకుంటే కార్యకర్తలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. సోము వీర్రాజు మిత్రధర్మాన్ని మరచి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని... పద్దతి మార్చుకోకపోతే ఊరుకునేది లేదని మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదన్న అక్కసుతోనే సోము వీర్రాజు టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. సోము వీర్రాజు వైసీపీ తొత్తుగా మారి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని గుంటూరు టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. సోము వీర్రాజు మిత్రద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రంగంలోకి దిగిన చంద్రబాబు
సోము వీర్రాజుపై టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టడంతో చంద్రబాబు వారిని అదుపుచేసే చర్యలు చేపట్టారు. ఆయన వ్యాఖ్యలపై ఎవరూ ప్రతిస్పందించొద్దంటూ నేతలను ఆదేశించారు. వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. విమర్శల విషయంలో బీజేపీకి, టీడీపీకి తేడా ఉండాలన్నారు. సోము వీర్రాజు దిష్టిబొమ్మలు దహనం చేయవద్దని ఆదేశించారు. టీడీపీ, బీజేపీ నేతల మధ్య రోజురోజుకు మాటలయుద్ధం పెరుగుతోంది. దీంతో మిత్రబంధం చెడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వైరం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి. 

 

07:49 - February 6, 2018

టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు ఏపీ ప్రయోజనాల కంటే పార్టీల రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలు, బడ్జెట్ లో ఏపీకి అన్యాయం, కేంద్ర ప్రభుత్వం వైఖరి, జనసేన పార్టీలపై విశ్వేషణ చేశారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... 'జగన్ మొదటి నుంచి కేంద్రాన్ని నిలదీయడం లేదు. జగన్ మొదటి నుంచి ఇదే వైఖరితో ఉన్నారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. చంద్రబాబును విమర్శించారు. బీజేపీకి, వైసీపీకి మధ్య అప్రకటిత ఒప్పందం ఉందా అన్న అనుమానం కలుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ వెంటపడుతున్న సీబీఐ...జగన్ ను పట్టించుకోవడం లేదు. బీజేపీతో వెళ్లేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. వైసీపీని కలుపుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. బీజేపీపై జగన్ పల్లెత్తు మాట అనడం లేదు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నాడు.. కానీ మోడీపై మాట్లాడడం లేదు. కేంద్రం, మోడీపై కొట్లాడేందుకు ఎంపీలు సిద్ధంగా లేరు. బీజేపీతో కలిసివెళ్లేందుకు ఇప్పుడు వైసీపీ సిద్ధంగా లేదు. తర్వాత కలిసి వెళ్లాలని చూస్తున్నారు. బీజేపీ బలం తగ్గితే కాంగ్రెస్ కు ఓటింగ్ పెరుగుతుంది. వైసీపీ, టీడీపీలకు ఏపీ ప్రయోజనాల కంటే పార్టీ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు బీజేపీకి గాయం తగలకుండా కొట్టాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన బిల్లు పెట్టింది. పవన్ కళ్యాణ్ అధ్యయన పర్వంలో ఉన్నాడు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడవచ్చు కానీ నోరు మాట్లాడడం లేదు. టీడీపీ, వైసీపీలకు రాజకీయ సమీకణలు ఉన్నాయి' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

07:46 - February 6, 2018

త్వరలో కోదండరామ్ కొత్త పార్టీ, వైఖరీమార్చుకున్న చంద్రబాబు, గడ్డాలు, మీసాలు పెంచితే గెలువరంటున్న తలసాని, అమెరికాలో టీడీపీ గెలుస్తుందంటున్న లోకేశం, గొర్ల సబ్సిడీ పథకంలో గోల్ మాల్, అచ్చేదిన్ అంటూ సచ్చేదిన్..మోడీ పాలన, స్కైవిన్ మొబైల్ గెలుచుకున్న దెవరు ? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...  

 

కారు, బైక్ ఢీ...నలుగురి మృతి

అనంతపురం : కూడేరు మండలం ముద్దలాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

 

నేడు ఆత్మకూర్ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర ప్రారంభం

చిత్తూరు : నేడు జిల్లాలోని ఆత్మకూర్ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.  

నేటి నుంచి మోఘల్ గార్డెన్స్ సందర్శనకు అనుమతి

ఢిల్లీ : నేటి నుంచి ఉద్యానోత్సవ్ పేరుతో రాష్ట్రపతి భనవ్ లోని మోఘల్ గార్డెన్స్ సందర్శనకు అనుమతి ఇచ్చారు. 

Don't Miss