Activities calendar

08 February 2018

21:46 - February 8, 2018

హైదరాబాద్ : ఏపీలో జేఏసీ ఏర్పాటుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. విభజన హామీలు సాధించడానికి తనశక్తి సరిపోదని.. అందుకు జేఏసీ ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించారు. జేఏసీ ఏర్పాటు ప్రకటించిన 24 గంటల్లోపే తన ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా ప్రకటించినట్టు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణను కలిశారు. బేగంపేట్‌లోని ఆయన కార్యాలయంలో జేపీతో భేటీ అయ్యారు. కలసి పనిచేయడంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అందరం కూర్చొని వేదిక ఏర్పాటు చేయాలన్న పవన్‌ ఆలోచనకు తాను మద్దతిస్తున్నట్టు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. ఒక గంటలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. ప్రజలకు కావాలసినవి రావాలంటే అందరూ సమష్టిగా పోరాడాలన్నారు. ఒకసారి చట్టంలో పెట్టాక ఆశలు, ఆకాంక్షలు అమలు చేయకపోవడం.. ఏరు దాటాక తెప్ప తగలేయడమేనన్నారు. ఇప్పుడు కేంద్రం అదే చేస్తోందన్నారు. ఏపీతో పాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని... ఆర్థికంగా జరగవలసిన హామీలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.

రెండు రాష్ట్రాల నాయకులు
విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హామీల సాధనకు జేఏసీని ఏర్పాటు చేస్తామని... అందుకు సహకరించాలని జేపీని కోరానన్నారు. జేఏసీలో రెండు రాష్ట్రాల నాయకులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. కేంద్రంపై ఒక సమూహంగా పోరాడాల్సిన అవసరం ఉందని...అఖిలపక్ష భేటీ తర్వాత ప్రధానమంత్రిని కలిసి అన్నీ వివరించనున్నట్టు పవన్‌ స్పష్టం చేశారు.మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ .. జేపీని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్‌ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్‌ అవుతాయన్న చర్చ నడుస్తోంది.

21:45 - February 8, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా తెల్లవారుజాము నుంచే అన్ని జిల్లాలలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చి.. ఆందోళనలు చేపట్టారు. వినూత్న నిరసనలతో ఏపీకి జరిగిన అన్యాయంపై నినదించారు. బంద్‌లో భాగంగా అన్ని జిల్లాల్లో.. సీపీఎం, సీపీఐ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తించారు. సీపీఎం నేతలు డిపోల్లో బస్సులను అడ్డుకున్నారు. దుకాణాలు, పాఠశాలలు, కాలేజీలు మూయించారు. కేంద్ర తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనలలో అపశృతులు...
బంద్‌లో భాగంగా.. కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో అపశృతులులు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా.. ఏలూరులో ర్యాలీ తీయబోతున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. అలాగే అనంతపురం, పెనుకొండలో ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ రసాభాసగా మారి... వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీకాకుళలో జిల్లాలో... ముందస్తుగా.. సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు.అలాగే వైసీపీ అధినేత జగన్‌ నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎమ్మెల్యేలు, నాయకులు జిల్లాలలోని బంద్‌లో పాల్గొని.. ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు బంద్‌లో భాగమై... అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లా.. హిందూపురంలో కాంగ్రెస్‌ నేత, పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కార్యకర్తలతో పాటు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మోదీకి భయపడి ప్రత్యేక హోదాపై మాట్లాడడం లేదని రఘువీరారెడ్డి విమర్శించారు.

మోకాళ్లపై నిలబడి..
అలాగే.. ఏపీకి జరిగిన అన్యాయంపై.. జనసేన పార్టీ నాయకులు తమదైన రీతిలో స్పందించారు. వినూత్న నిరసనలతో.. కేంద్రంపై మండిపడ్డారు. విజయవాడలో మోకాళ్లపై నిలబడి..కేంద్ర వైఖరిని ఎండగట్టగా.. ఏలూరులోని బిర్లా భవన్‌ సెంటర్‌ వద్ద ఆకుకూరలు నములుతూ ఆందోళన చేశారుఏపీ బంద్‌లో తాము సైతం అంటూ జర్నలిస్టులు కదం తొక్కారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఏపీకి కేంద్రం నాలుగేళ్లుగా అన్యాయం చేస్తోందని విమర్శించారు. అలాగే అనంతపురంలో ఐద్వా, కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.  

21:43 - February 8, 2018

ఢిల్లీ : లోక్‌సభలో అరుణ్‌జైట్లీ ప్రకటనపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీకి లబ్ది చేకూరేలా ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని టీడీపీ ఎంపీలు అన్నారు. రేపు కూడా పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. మరోవైపు టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రం నష్టపోతున్నా.. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు రాజీనామా చేయడం లేదన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. 

21:42 - February 8, 2018

ఢిల్లీ : కేంద్రం ఇచ్చిన హామీల నుంచి వెనక్కి తప్పుకుంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్ల హోదా ఇవ్వాలన్న బీజేపీ ఇప్పుడు మాటమార్చి ద్రోహం చేసిందన్నారు. ఇప్పటి వరకు ఏపీకి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో బీజేపీతో పాటు మిత్రపక్షమైన టీడీపీ కూడా సమాధానం చెప్పాలని ఏచూరి అన్నారు. 

21:42 - February 8, 2018

ఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మళ్లీ పాతపాటే పాడారు. ఏపీ ఎంపీల ఆందోళనపై స్పందించిన ఆయన.. ఏపీకి సాయంపై ఎలాంటి నిర్దిష్ట ప్రకటనా చేయలేదు. గతంలో మాదిరిగానే ఇస్తున్నాం.. చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాము మద్దతిచ్చినా ఏపీ హక్కుల కోసం తాము పోరాడామన్నారు. రాష్ట్రానికి పలు జాతీయ సంస్థలు కేటాయించామని, వాటికి నిధులు ఇస్తున్నామని, ఇంకా ఇస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులను కేటాయించామని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని నిధులు ఇస్తున్నామన్నారు. గత నెలలో నాబార్డ్‌ ద్వారా నిధులు ఇవ్వాలని ఏపీ సీఎం లేఖ రాస్తే అలానే ఇస్తున్నామని జైట్లీ చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటుకు సంబంధించి ఏపీ అధికారులతో కలిసి లెక్కలు వేస్తున్నామని, రైల్వే జోన్‌, పెట్రో కారిడార్‌కు సంబంధించి చర్చలు జరుపుతున్నాని జైట్లీ తెలిపారు. 

21:37 - February 8, 2018
20:36 - February 8, 2018

విభజన హామీలను కేంద్రం భూ స్థాపితం చేశారు. ఈ రోజు రాష్ట్రంలో బంద్ జరిగిందని అయిన కూడా అరుణ్ జైట్లీ పాత పాటే పాడుతున్నారని, ఇది స్వయంకృతపరాదమేనని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఇక కేంద్రంపై ప్రజలకు నమ్మం లేదని ఇప్పటికైనా టీడీపీ మేల్కోని పోరాటం చేయాల్సిన అవరం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:17 - February 8, 2018

లోక్ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : లోక్ సభ రేపటకి వాయిదా పడింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడిన తర్వాత మిగతా సభ్యులు కూడా మాట్లాడారు. అప్పటికే సమయం మించిపోవడంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభ రేపటికి వాయిదా వేశారు. 

19:26 - February 8, 2018

ఏపీ బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి, కానీ ఈ బంద్ కు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగుతుందని, ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి తము బంద్ కు పిలుపునిచ్చామని సీపీఎం నేత గఫూర్ అన్నారు. రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదలు తెలుపుతున్నామని, రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఇది ఐదో బంద్ అని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏమి లేని రాష్ట్రాన్ని నడిపించాలంటే నిధులు కావాలి దాని కోసమే కేంద్రంతో కలిసి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీ అర్జున్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

 

19:20 - February 8, 2018
17:57 - February 8, 2018

హైదరాబాద్‌ : శతాబ్ది టౌన్‌ షిప్స్‌ సంస్థతో పాటు.. దాని ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఆసియాలోని అత్యున్నతమైన సంస్థలు, లీడర్లను సత్కరించే యునైటెడ్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ ఈ అవార్డుతో సత్కరించింది. శతాబ్ది టౌన్ షిప్స్‌ అత్యుత్తమ సంస్థగానూ.. దాని ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని అత్యుత్తమ లీడర్‌గానూ ఎంపిక చేసింది. ఆసియాలోనే అత్యున్నతమైన లీడర్లుగా ఎంపికైన నలభైమందిలో తెలంగాణనుంచి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే ఉండడం గమనార్హం... ఈ అవార్డు దక్కడంపట్ల శ్రీనివాస్‌రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవార్డుతో తమపైన మరింత బాధ్యత పెరిగిందన్నారు.

17:51 - February 8, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌లో పలు చోట్ల టీడీపీ నేతలు సైతం పాల్గొన్నారు. ప్రజల సెంటిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కేంద్రంతో పోరాటం చేసి రాష్ట్రానికి రావల్సిన నిధులు రాబడుతామని చినరాజప్ప తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:49 - February 8, 2018

నల్గొండ : జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఎం ద్వితీయ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి తమ్మినేని ఎన్నికయ్యారు. మొత్తం 60మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాగా రాష్ట్రకార్యదర్శి వర్గం 13 మందితో ఏర్పాటైంది. తమ్మినేని వీరభద్రంతో పాటు రంగారెడ్డి నుండి జి. నాగయ్య, చుక్కా రాములు, బి.వెంకట్, టి.జ్యోతి, పోతిరెడ్డి సుదర్శన్, జి.రాములు, డి.జి.నర్సింహరావులు కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివితో తమ్మినేని మాట్లాడారు. కాంగ్రెస్...బిజెపిలకు రాష్ట్రంలో మరో ప్రత్నామ్నాయం రావాలని, బిఎల్ఎఫ్ ని కేంద్ర పార్టీ సైతం ప్రశంసిస్తోందన్నారు. అట్టడుగు కులాలు..వర్గాల సమస్యలపై దృష్టి పెడుతామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:38 - February 8, 2018

విజయవాడ : విభజన హామీలను తుంగలో తొక్కారంటూ విజయవాడలో కాంగ్రెస్‌ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ వల్లే సాధ్యమవుతుందంటూ నిరసన తెలుపుతున్నారు. పార్టీలకతీతంగా ఢిల్లీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేద్దామని తెలిపారు.

ఏలూరులో...
ఏలూరులో బంద్‌ సంపూర్ణంగా జరుగుతోంది. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తుండటంతో.. షాపులన్నీ మూతపడ్డాయి. ఏలూరులో బంగారం షాపుల మూతపడటంతో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొనడంతో వ్యాపార సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి. ఏలూరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు.

విశాఖలో...
విశాఖలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. వామపక్షలు పిలుపు మేరుకు వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గోన్నాయి. గాజువాక, చింతపల్లి, అనకపల్లి, పెందుర్తి, ఎజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్నిపార్టీలు బంద్‌ పాటించాయి. ఉదయం నుండి మద్దలపాలెం కూడిలి వద్ద ఏపీకి జరిగిన అన్యాయంపై గళం విప్పారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:35 - February 8, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు బంద్‌ చేపట్టాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఉదయం నుండే బస్సు డిపోల వద్ద వామపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

కడప జిల్లాలో...
వామపక్షాలు చేపట్టిన బంద్ కడప జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలతో పాటు వైసీపీ, కాంగ్రెస్‌లు బంద్‌లో పాల్గొన్నాయి. కడపలో స్టీలు ఫ్యాక్టరీ, హైకోర్టు ఏర్పాటుతో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీలు వెంటనే అమలు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:33 - February 8, 2018

ఢిల్లీ : ఏపీకి విభజన హామీలు నెరవేర్చలేదని.. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని.. ఆందోళనలు జరుగుతున్న వేళ.. కేంద్రం స్పందించింది. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులపై దృష్టిపెట్టింది. ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 417కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

 

17:31 - February 8, 2018

ఢిల్లీ : విభజన హామీలను అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీతోపాటు తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ విభజన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆమె కోరారు. 

17:30 - February 8, 2018

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ విభజన హామీల అమలు కోసం వినూత్నంగా ఆందోళన తెలిపారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట డప్పు కొడుతూ నిరసన తెలిపారు. మోదీ విభజన హామీలు నెరవేర్చకుంటే.. ఆంధ్రుల కోపానికి తలవంచక తప్పదంటూ పాట పాడారు. 

అందుకే కేసీఆర్ మోడీని ప్రశ్నించడం లేదు - రేవంత్...

హైదరాబాద్ : సీబీఐ కేసు భయంతోనే కేసీఆర్ మోడీని ప్రశ్నించడం లేదని, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించకుండా టీఆర్ఎస్ ఎంపీలు మోడీ కాళ్ల దగ్గర మోకరిల్లారని టి.కాంగ్రెస్ నేత రేవంత్ వ్యాఖ్యానించారు. దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకొనేందుకు మంత్రి కేటీఆర్ టూర్స్ చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ పర్యటనలో కేటీఆర్ చేసిన ఖర్చు...పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతలు కల్పించింది. 1993 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ఐఏఎస్‌లు వెంకటేశ్వరరావు, శివశంకర్, పార్థసారథి, విష్ణు, చంద్రవదన్‌లను ముఖ్యకార్యదర్శులుగా నియమించింది.

అవసరమైతే బీజేపీతో పొత్తు వదులకుంటామన్న గంటా...

విశాఖపట్టణం : కేంద్రం ఇచ్రిన హామీలు అమలు చేయాల్సిందేనని మంత్రి గంటా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీతో పొత్తు వదులుకొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

గాలి ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలు..

చిత్తూరు : అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలు చిత్తూరు జిల్లా వెంకట్రామపురంలోని తోటలో జరిగాయి. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావు, అమర్‌నాథ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

పోలవరానికి నిధుల విడుదల..

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.417.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.   

లోక్ సభ ఎన్నికలపై త్వరలో నిర్ణయం - రజనీ...

చెన్నై : లోక్ సభ ఎన్నికలపై త్వరలో నిర్ణయం వెలువరిస్తామని సినీ నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. రాజకీయాల్లో కలిసి ముందుకెళ్లే విషయం కమల్ హాసనే నిర్ణయించాలని తెలిపారు

16:37 - February 8, 2018

విజయవాడ : ఏపీ బంద్ విజయవంతమైందని, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు. పెద్ద స్థాయిలో ఐక్యతను ప్రదర్శించారని, బంద్ విజయంతమైందన్నారు. ముందస్తు అరెస్టులు..బంద్ సందర్భంగా అరెస్టులు జరిగినా ఎక్కువ ప్రాంతంలో స్వచ్చందంగా ప్రజలు సహకరించారని తెలిపారు.

విభజన చట్టంలో బీజేపీ చేసిన హామీలు అమలు జరుపకుండా పార్లమెంట్ లో బుధవారం ప్రధాన మంత్రి చేసిన ఉపన్యాసంలో కాంగ్రెస్ ను తప్పుగా నిర్ధారించారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు జరపడంలో బీజేపీ వైఫల్యం చెందిందని, రైల్వే జోన్ అంశానికి వచ్చే సరికి చర్చలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొనడం జరుగుతోందన్నారు. నాలుగు సంవత్సరాలు సరిపోలేదా ? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరిని చూస్తుంటే జాతీయ విద్యా సంస్థలు పూర్తి కావడానికి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుండి బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని..అలాకానిపక్షంలో టిడిపి చేసే పోరాటం ఉత్తుత్తిదేనని ప్రజలు భావిస్తారన్నారు. జేఏసీ తరహాలనే తాము ఇతరులతో పనిచేయడం జరుగుతోందని, జేఏసీ ఏర్పాటుకు పవన్ ప్రయత్నిస్తుండడం అభినందనీయమన్నారు. మేధావులతో సంప్రదింపులుగా భావించాల్సి ఉంటుందని, కేంద్రంపై పోరాటం..విభజన హామీలు సాధించడానికి ఎవరూ ముందుకొచ్చినా వారిని కలుపుకుంటామన్నారు. 

16:33 - February 8, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై లోక్ సత్తా నేత జయ ప్రకాష్ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని తెలిపారు. కానీ సమాజంలో మార్పు కోసం పవన్ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. బేగంపేటలోని లోక్ సత్తా కార్యాలయానికి 'పవన్' చేరుకున్నారు. అక్కడ జేపీతో భేటీ అయ్యారు. విభజన హామీలు అమలు కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి..జేఏసీ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

కాలు మీద కాలేసుకుని కూర్చొవచ్చు...
పవన్ కాలు మీద కాలేసుకుని బతుకొచ్చని..టాప్ స్టార్ గా లక్షలాది మంది డబ్బులు ఇచ్చి వెళుతారని..కోరి కష్టాలు తెచ్చుకుంటారని జేపీ తెలిపారు. సమాజం పట్ల ఎంత ప్రేమ ఉండడం..మంచి జరగాలనే తపన ఉండడం...ఏ సమాజం పెంచిందో..ఆ సమాజానికి న్యాయం జరగాలని కోరకుంటే ఇంత సాహసం అవసరమన్నారు. పదవులే పరమావధిగా భావించకుండా మార్పును వేగిరం చేయాలంటే ఏమి చేయాలి ? తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పవన్ తో చర్చించినట్లు తెలిపారు. పార్లమెంట్ లో లోతైన చర్చ జరిగిన తరువాత చట్టంలో పెట్టిన తరువాత కూడా ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. దేశ ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా నిర్ధిష్టమైన చర్యలు తీసుకున్నారని, కానీ ప్రస్తుతం చట్టంలో లేవు..తమ ధర్మం కాదనడం పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఏపీ రాష్ట్రానికి ఆర్థికం..అభివృద్ధిలో న్యాయం జరగాలని, తెలంగాణలో అభివృద్ధిలో సహాయం చేస్తామని హామీనిచ్చారని తెలిపారు. కొన్ని జరిగాయి కానీ మరికొన్ని జరగలేదన్నారు. పవన్ చేసిన ప్రతిపాదనను తాను అంగీకరిస్తున్నట్లు, లోతైన వ్యూహంతో ముందుకెళ్లాలని..అదే తరుణంలో తెలుగు ప్రజల ఐక్యాన్ని కాపాడాల్సినవసరం ఉందన్నారు.

జేపీని అభిమానిస్తా - పవన్..
తాను ఎంతో అభిమానించే వ్యక్తుల్లో జేపీ ఒకరని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విభజన సమయంలో జరిగిన అన్యాయంపై దిశా..దశ నిర్ధేశం చేయాలని జేపీని కోరడం జరిగిందన్నారు. ఒక్క రోజులో అయ్యేది కాదని..ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు, భవిష్యత్ లో ఎలా వెళ్లాలనే దానిపై కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. 

బంద్ విజయవంతం - మధు..

విజయవాడ : ఏపీ బంద్ విజయవంతమైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు. పెద్ద స్థాయిలో ఐక్యతను ప్రదర్శించారని, బంద్ విజయంతమైందన్నారు. ముందస్తు అరెస్టులు..బంద్ సందర్భంగా అరెస్టులు జరిగినా ఎక్కువ ప్రాంతంలో స్వచ్చందంగా ప్రజలు సహకరించారని తెలిపారు. 

పవన్ ప్రతిపాదనలకు మద్దతు - జేపీ...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్న ప్రతిపాదనలకు తాను మద్దతినిస్తున్నట్లు లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. విభజన హామీలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, విభజన హామీలపై పవన్ పోరాటానికి తాను మద్దతిస్తున్నట్లు తెలిపారు. 

జేపీ అంటే గౌరవం - పవన్..

హైదరాబాద్ : లోక్ సత్తా నేత జయప్రకాష్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విభజన హామీలు..హోదా పోరాటంపై చర్చించినట్లు తెలిపారు. విభజన సమయంలో జేపీ ఎంతో అధ్యయనం చేయడం జరిగిందని, విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 

ముగిసిన జేపీ..పవన్ భేటీ..

హైదరాబాద్ : లోక్ సత్తా నేత జయ ప్రకాష్ నారాయణ, జనసేన అధినేత పవన్ మధ్య జరిగిన భేటీ కాసేపట్లో ముగిసింది. విభజన హామీలు..జేఏసీ ఏర్పాటుపై చర్చించారు. 

మార్చి 5 నుండి ఏపీ బడ్జెట్..

విజయవాడ : మార్చి 5వ తేదీ నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 8వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టాలని సర్కార్ యోచిస్తోందని తెలిపారు. 

స్పీకర్ తో టి.టిడిపి నేతలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూధనాచారిని టి.టిడిపి నేతలు కలిశారు. ఎల్.రమణ, సండ్ర వెంకట వీరయ్య, రావుల చంద్రశేఖరరెడ్డిలు కలిసిన వారిలో ఉన్నారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం వైషల్యం చెందిందని, వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదని తెలిపారు. రుణమాఫీ జరగని రైతుల జాబితాను స్పీకర్ కు అందచేశారు. సీఎం తక్షణమే రుణమాఫీ రాని రైతులకు న్యాయం చేయాలన్నారు. 

15:57 - February 8, 2018

విజయవాడ : ఏలూరు బిర్లాభవన్ సెంటర్‌ వద్ద జనసేన కార్యకర్తలు ఆకుకూరలు నములుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఏపీని మోడీ ప్రభుత్వం విస్మరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు ఏలూరులో అన్నిచోట్ల బంద్‌ కొనసాగుతోంది. స్కూళ్లు, వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 8 డిపోల్లో 600 బస్సులు నిలిపివేశారు. పలుచోట్ల వామపక్ష, వైసీపీ, కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.

ఏలూరులో బంద్‌ సంపూర్ణంగా జరుగుతోంది. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తుండటంతో.. షాపులన్నీ మూతపడ్డాయి. ఏలూరులో బంగారం షాపుల మూతపడటంతో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొనడంతో వ్యాపార సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి. ఏలూరులో ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:53 - February 8, 2018

హైదరాబాద్ : ఎప్పుడూ వివాదాల్లో ఉండే 'రాం గోపాల్ వర్మ'కు తెలంగాణ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. ‘జీఎస్టీ' సినిమాపై నమోదైన కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన సీసీఎస్ ఎదుట హాజరు కాలేదు. సమాచారం తెలుసుకున్న 'వర్మ' పోలీసులకు తన న్యాయవాది ద్వారా సమాచారం అందించారు.

ఇటీవలే 'జీఎస్టీ' షార్ట్ ఫిలింను ఆయన తన యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలు..మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సామాజిక కార్యకర్త దేవి ఏకంగా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో 'జీఎస్టీ' షార్ట్ ఫిలింపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వెబ్ సైట్ నిర్వాహకులతో మాట్లాడి...తెలంగాణలో షార్ట్ ఫిలింను ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. దీనిపై సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు.

తమ ఎదుట హాజరు కావాలని..వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ముంబైలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే కారణమని, మళ్లీ నోటీసులు పంపితే వచ్చే వారం హాజరువతానని వర్మ తెలిపారు. దీనిపై టెన్ టివి సామాజిక కార్యకర్త దేవి, ఏపీ మహిళా నేత మణితో మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వర్మకు సీసీఎస్ పోలీసుల నోటీసులు..

హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ సీసీఎస్ ఎదుట వర్మ హాజరు కాలేదు. బిజీగా ఉండడం వల్లే తాను రాలేనని న్యాయవాదితో వర్మ సమాచారం అందించారు. మళ్లీ నోటీసు ఇస్తే వచ్చే వారం హాజరు అవుతానని తెలిపారు. 

15:29 - February 8, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతారాహిత్యంగా వల్లే ఏపీకి ప్రస్తుత గతి పట్టిందని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం అమలు కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే సీఎం బాబు బాధ్యతారాహిత్యంగా దుబాయికు వెళ్లడం ఎంతవరకు కరెక్టు అని, బీజేపీతో మిత్రబంధం కొనసాగిస్తూ టిడిపి సాధించిన విజయం ఏమిటీ ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సాధించాల్సిన నిధులు..ప్రత్యేక హోదా సాధించడంలో బాబు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అంబటి విమర్శించారు. 

15:25 - February 8, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో శనివారం చెబుతానని ఎంపీ గోకరాజు గంగరాజు మీడియాతో పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఏమీ జరగలేదనడం కరెక్టు కాదని, విడతల వారీగా కేంద్రం సహాయం అందచేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రంతో చర్చలు జరుపుతామన్నారు. రాష్ట్రానికి ఎంతో చేసిందని..ఇంకా చేస్తుందని మంత్రి కామినేని తెలిపారు. గురువారం జరుగుతున్న బంద్ కు బీజేపీ మద్దతు తెలుపమని, ప్రజా జీవనాన్ని స్తంభించ చేయడం సబబు కాదన్నారు. 

15:19 - February 8, 2018

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో జేఏసీ ఏర్పాటుకు జనసేనానీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకు అన్ని పార్టీలు ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కోరిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉండవల్లి...జయప్రకాష్ లతో మాట్లాడుతానని తెలిపారు. బుధవారం ఉండవల్లితో మాట్లాడిన పవన్ గురువారం మధ్యాహ్నం లోక్ సత్తా కార్యాలయానికి వెళ్లారు. అక్కడ లోక్ సత్తా నేత జయ ప్రకాష్ నారాయణతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జేఏసీ ఏర్పాటు చేయాల్సినవసరం...విభజన హామీల అమలుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే దానిపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

లోక్ సత్తా నేతతో జనసేన అధినేత...

హైదరాబాద్ : లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో జేఏసీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. కాసేపట్లో మీడియాతో పవన్..జయప్రకాష్ మాట్లాడనున్నారు. 

15:13 - February 8, 2018

విజయవాడ : విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు వైసీపీ, ప్రజా సంఘాల పూర్తి మద్దతు పలికాయి. నగరంలోని విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. విభజన హామీలు .. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు ఆపమంటున్న వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్ నేతలతో టెన్ టివి ముచ్చటించింది.

ఒంగోలు...
విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వామపక్షాల బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వినూత్న ప్రదర్శన చేపట్టింది. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

15:10 - February 8, 2018

విజయవాడ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ. వామపక్షాలు ఇచ్చిన పిలుపుకి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఏపీయూడబ్ల్యూజే, ఏజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు పూర్తిస్ధాయిలో బంద్‌లో పాల్గొన్నాయి. గాంధీనగర్‌ ప్రెస్‌ క్లబ్‌ నుంచి జర్నలిస్టులు మహార్యాలీ తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే దిశగా తాము పోరాటం చేస్తామంటున్న జర్నలిస్టు సంఘ నేతలతో టెన్ టివి మాట్లాడింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:08 - February 8, 2018

విజయవాడ : బంద్‌ నేపథ్యంలో ఏపీలో జనజీవన వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నాయి. ఉదయం నుంచి వామపక్ష, ప్రజాసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు కాలేజీలన్నీ మూతపడ్డాయి. మరోవైపు కేంద్ర వైఖరిని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. సామాన్యుడిపై కేంద్రం భారం మోపుతుందని,... ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నిరసనలు తెలుపుతున్నారు. వామపక్షాల బంద్‌కు వైసీపీ మద్దతివ్వడమే కాకుండా.. పలు చోట్ల ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గుంటూరులోని లాడ్జ్‌ సెంటర్‌లో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలిపారు.

మోకాళ్లపై నిలబడిన జనసేన నేతలు..
విజయవాడ :
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల బంద్‌కు మద్దతుగా జనసేన పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మోకాళ్ళపై నిలబడి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎన్నికల్లో హామీలను నెరవేర్చకపోగా.. బడ్జెట్‌లో కూడా ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. జనసేన నేతల మోకాళ్ళ నిరసనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

విశాఖలో..
బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ విశాఖలో వామపక్షాలు చేపట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. చిన్నారులు సైతం బంద్‌లో పాల్గొన్నారు. స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు బైఠాయించారు. రాష్ట్ర హక్కుల సాధనకై ప్రభుత్వం కూడా బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

నెల్లూరులో....
నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. నెల్లూరులో జరుగుతున్న బంద్‌పై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

అనంతపురంలో...
అనంతపురంలో సీపీఎం వినుత్నంగా నిరసన ర్యాలీ చేపట్టింది. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా.. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందంటూ మండిపడింది. ఐద్వా మహిళా సంఘం మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:02 - February 8, 2018

ఢిల్లీ : లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విభజన హామీలు నెరవేర్చాలని ఏపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విభజన హామీలపై 15 రోజుల్లో ఆర్ధికమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని సుజనాచౌదరి కోరారు. హామీలపై స్పష్టత ఇవ్వకపోతే ప్రత్యేక చర్చకు 2 గంటల సమయం ఇవ్వాలని సుజనా చౌదరి కోరారు. సుజనాచౌదరి లేవనెత్తిన అంశాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందన్నారు కేంద్రమంత్రి అనంతకుమార్‌. విభజన హామీల అమలుకు మోదీ చిత్తశుద్దితో ఉన్నారన్నారు అనంతకుమార్‌. అలాగే బడ్జెట్‌పై సమాధానం సమయంలో అన్ని సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం సూచిస్తుందన్నారు.

రాజ్యసభలో...
బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రస్తావించారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. సభలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల లోపు హామీలను నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏపికి స్పెషల్‌ స్టేటస్, రాజధాని అభివృద్ధి, స్టీల్‌ ప్లాంట్‌, ఆసుపత్రులు తదితర హామీలను మంత్రి ప్రస్తావించారు. 15 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే చర్చకు 2 గంటల సమయమివ్వాలని చౌదరి డిమాండ్‌ చేశారు.

15:01 - February 8, 2018

ఢిల్లీ : ఏపి విభజన హామీలపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. విభజన హామీలను అమలుచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. విభజన చట్టాన్ని గౌరవించాలని, బిల్లులో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. కేంద్ర మంత్రులకు సమిష్టి బాధ్యత ఉంటుందని, కేబినెట్‌లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ కాబినెట్‌ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని విజయ్‌సాయిరెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ఆందోళనల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.

సభలో ఇచ్చిన హామీలకే న్యాయం జరగకపోతే ఎలా అని కేవీపీ ప్రశ్నిస్తున్నారు. విభజన హామీలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కేవీపీ డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో తాను ఇచ్చిన నోటీసుపై చర్చకు అంగీకరించకపోవడంతో.. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేసే వరకు తన పోరాటం జరుగుతుందన్నారు కేవీపీ.

లోయలో పడిన కారు..

ఉత్తరాఖండ్ : బగేశ్వర్ ప్రాంతంలో కారు ఓ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

బంద్ లో పాల్గొన్న జగన్...

నెల్లూరు: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం దుండిగం క్రాస్‌ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పాల్గొన్నారు.

పవన్ విమర్శలపై చిన రాజప్ప వ్యాఖ్యలు...

విజయవాడ : సీఎం చంద్రబాబు, బీజేపీపై జనసేన అధినేత పవన్ విమర్శలు సాధారణంగానే చూడాలని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా పవన్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని తెలిపారు. బంద్ ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. 

గుండు గీయించుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్...

విజయవాడ : ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా పోరంకి సెంటర్ లో గుండు గీయించుకుని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిరసన తెలిపారు. 

13:46 - February 8, 2018
13:44 - February 8, 2018

ఢిల్లీ : విభజన చట్టం హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రసంగిస్తుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డుకోవడం సరికాదన్నారు. సమస్య తీరే విరకు పోరాటం చేస్తామని చెప్పారు. 

 

శాంతియుతంగా బంద్ లో పాల్గొనాలన్న పవన్..

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా వివిధ రాజకీయ పక్షాలు గురువారం తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్ కు జనసేన తన మద్దతు తెలుపుతోందని పార్టీ అధినేత పవన్ తెలిపారు. శాంతియుతంగా బంద్ లో పాల్గొనాలని సూచించారు. 

జయప్రకాష్ తో భేటీ కానున్న పవన్..

హైదరాబాద్ : లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాకతీయ హోటల్ లో ఈ భేటీ జరుగనుంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు..పోరాటం గురించి వారు చర్చించనున్నారు. అనంతరం వీరిద్దరూ ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. 

పెనుగొండలో ఉద్రిక్తత

అనంతపురం : పెనుగొండలో ఉద్రిక్తత నెలకొంది. వామపక్ష, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ రాష్ట్రాన్ని ముంచిన టీడీపీ బంద్ లో పాల్గొనకూడదని, టీడీపీ నాయకులను వామపక్షనాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు.

13:14 - February 8, 2018

ఢిల్లీ : లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విభజన హామీలు నెరవేర్చాలని ఏపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. లోక్ సభలో కేంద్రమంత్రి సుజనాచౌదరి సమస్యలను లేవనెత్తారు. విభజన హామీలపై 15 రోజుల్లో ఆర్థికమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. హామీలపై స్పష్టత ఇవ్వకపోతే ప్రత్యేక చర్చకు 2 గంటల సమయం ఇవ్వాలని కోరారు. సుజనాచౌదరి లేవనెత్తిన అంశాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు. విభజన హామీల పరిష్కారానికి మోడీ చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

సెక్రటరీ బల్లపై బుక్ ఎత్తుకెళ్లెందుకు యత్నించిన శివప్రసాద్

ఢిల్లీ : లోక్ సభ సెక్రటరీ జనరల్ బల్లపై ఉన్న పుస్తకాలు తీసుకెళ్లేందుకు ఎంపీ శివప్రసాద్ యత్నించారు. మరోవైపై సోనియా గాంధీ, జ్యోతిరాదిత్యసిందియా టీడీపీ సభ్యులతో మాట్లాడారు.

12:53 - February 8, 2018
12:51 - February 8, 2018

ఏపీ ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నాం : అనంతకుమార్

ఢిల్లీ : సుజనా లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని, ఏపీ ప్రజల ఆందోళన, ఆవేదనను అర్థం చేసుకున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ అన్నారు. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి ప్రసంగంలో విభజన హామీలపై మాట్లాడతారని అనంతకుమార్ అన్నారు. విభజన హామీల అమలుకు మోడీ చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన తెలిపారు. 

12:47 - February 8, 2018

విజయవాడ : బంద్‌ నేపథ్యంలో ఏపీలో జనజీవన వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నాయి.  ఉదయం నుంచి వామపక్ష, ప్రజాసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు కాలేజీలన్నీ మూతపడ్డాయి. మరోవైపు కేంద్ర వైఖరిని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. సామాన్యుడిపై కేంద్రం భారం మోపుతుందని,... ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నిరసనలు తెలుపుతున్నారు. వామపక్షాల బంద్‌కు వైసీపీ మద్దతివ్వడమే కాకుండా.. పలు చోట్ల ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. 
విశాఖలో బంద్‌ సంపూర్ణం
విశాఖలో వామపక్షాలు చేపట్టిన బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఉదయం నుండి వామపక్ష నేతలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరే వరకూ పోరాటం ఆపేది లేదని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

సుజనా చౌదరి పై విపక్షాల అభ్యంతరం

ఢిల్లీ : మంత్రివర్గంలో ఉండి రాష్ట్రపతి ప్రసంగానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని సుజనా చౌదరి ప్రసంగంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

12:42 - February 8, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరులో వామపక్షాలు చేపట్టిన బంద్‌ ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీ తీయడానికి వచ్చిన వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేథ్యంలో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. 

 

12:35 - February 8, 2018

ఏపీపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు కటారి శ్రీనివాస్ రావు, ప్రముఖ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, విశ్లేషకులు లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి న్యాయం చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

12:28 - February 8, 2018

ఏపీపై కేంద్రప్రభుత్వం పాక్షిక చూపు చూస్తోందని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకీ న్యాయం చేయాలన్నారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకరావాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఏపీ బాధను అర్థం చేసుకోండి : కేవీపీ

ఢిల్లీ : ఏపీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని, ఈ సభ చేసిన హామీలను అమలు చేయట్లేదని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ అన్నారు. హామీలను అమలుచేసేలా చూడాల్సిన బాధ్యత సభపై ఉందని, ప్రజాస్వామ్యాన్ని పరిరంక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని కేవీపీ తెలిపారు. 

12:23 - February 8, 2018

హామీలపై స్పష్టతనివ్వాలి : సుజనా చౌదరి

ఢిల్లీ : విభజన హామీల అమలుపై 15 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని సుజనా చౌదరి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక మంత్రి  ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, అమరావతి నిధులపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

లోక్ సభలో కొనసాగుతన్న ఏపీ ఎంపీల నిరసన

ఢిల్లీ : లోక్ సభలో ఏపీ ఎంపీల నిరసన కొనసాగుతోంది. సభ్యులు వెల్ లోకి వెళ్లి ఏపీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. 

ఏసీబీకి చిక్కిన రిమ్స్ అధికారి

కడప : రిమ్స్ లో రూ.60 వేలు లంచం తీసుకుంటూ రిమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ భరత్ మోహన్ సింగ్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అతన్ని అదుపులోకి తీసుకుంది. 

12:12 - February 8, 2018

హైదరాబాద్ : ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. వామపక్షాల బంద్‌కు వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన మద్దతిచ్చాయి. బంద్‌ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అన్ని పక్షాలు నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే భవిష్యత్‌లోఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంద్‌ నేపథ్యంలో జగన్‌ ఈరోజు పాదయాత్రకు వాయిదా వేసుకున్నారు. 

 

11:59 - February 8, 2018

గుంటూరు : జిల్లా  వ్యాప్తంగా వామపక్షాలు బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణ్ రావు మాట్లాడుతూ  ప్రధాని మోడీ క్రూరమైన రాజకీయ నేత అని విమర్శించారు. టీడీపీ దొంగనాటకం ఆడుతుంద మండిపడ్డారు. ఎంపీల చేత రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వంత ప్రయోజనాలకే టీడీపీ ఎంపీలు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:40 - February 8, 2018

విజయవాడ : ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. వామపక్షాల బంద్‌కు వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన మద్దతిచ్చాయి. బంద్‌ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అన్ని పక్షాలు నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే భవిష్యత్‌లోఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంద్‌ నేపథ్యంలో జగన్‌ ఈరోజు పాదయాత్రకు వాయిదా వేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:26 - February 8, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమైంది. ఉభయసభల్లో ఏపీ ఎంపీల ఆందోళనలు చేపట్టారు. ఎంపీల ఆందోళనల మధ్య రాజ్యసభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభను వాయిదా వేశారు. 

 

లోక్ సభలో ఏపీ ఎంపీలు నిరసన

ఢిల్లీ : లోక్ సభలో ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఎంపీలు వెల్ లోకి వెళఙ్ల నినాదాలు చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. 

బంద్ లో పాల్గొన్న ఘువీరరెడ్డి

అనంతపురం : వామపక్షాలు పిలుపునిచ్చిన బంద్ కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనివారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, అధికార, ప్రతిపక్ష పార్టీలు మోడీ ముందు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రాఘువీరరెడ్డి అన్నారు. 

బంద్ లో పాల్గొన్న జగన్

నెల్లూరు : జిల్లా ఏఎస్ పేట మండలం జువ్వలగుండ్లపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ బంద్ లో పాల్గొన్నారు. జగన్ విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని బంద్ సంఘీభావం తెలిపారు. 

రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడింది. కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పాడంది. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12.30లకు వాయిదా వేశారు. 

ప్రాంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

ఢిల్లీ :  పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభల్లో జీరో అవర్ కొనసాగుతుంది. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు. 

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు

గుంటూరు : కేంద్ర బడ్జెట్ లో ఏపీ అన్యాయం జరగడంపై వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మద్దతుగా విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. బంద్ ప్రభుత్వం అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కొనసాగుతున్న వామపక్షాల బంద్

గుంటూరు : ఏపీలో వామపక్షాల ఆధ్వర్యంలో  రాష్ట్ర బంద్ కొనాసగుతోంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయానికి నిరసనగా వామపక్షాలు బంద్ పిలుపునిచ్చారు. బంద్ కు వైసీపీ, జనసేన, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఉదయం నుంచి వామపక్షాలు బంద్ లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ డిపోల ముందు వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. 

మేకపాటి నివాసంలో వైసీపీ ఎంపీల సమావేశం

ఢిల్లీ : మేకపాటి నివాసంలో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. 

రాజ్యసభలో నోటీసు ఇచ్చిన ఎంపీలు

ఢిల్లీ : రాజ్యసభలో చైర్మన్ కు టీడీపీ ఎంపీలు విభజన హామీలపై చర్చకు నోటీసు ఇచ్చారు. సెక్షన్ 193వ నిబంధన కింద చర్చించాలని నోటీస్ ఇచ్చారు. అటు లోక్ సభలో కూడా టీడీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. 

సోము వీర్రాజు పై అమిత్ షా ఆగ్రహం

ఢిల్లీ : సోము వీర్రాజు పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినుట్లు మాట్లాడే అధికారం ఎవరిచ్చారని అమిత్ షా సోమును ప్రశ్నించారు. మిత్రధర్మం, పొత్తుల విషయంలో ఎందుకు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

గుంటూరు : దుబాయ్ నుంచి పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలతో మనది ధర్మపోరాటమని, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పెట్టారని మోడీ చెప్పారని చంద్రబాబు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌవరం కోసమే మన పోరాటమని సీఎం తెలిపారు. 

10:48 - February 8, 2018

ఏపీపై ప్రధాని మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విశ్లేషకులు నాగేశ్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి న్యాయం చేయాలని తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై టీడీపీ నేతలు గట్టిగా పోరాటం చేయాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

10:43 - February 8, 2018

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వంచిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో లోక్ సత్తా నేత శ్రీనివాస్, కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి న్యాయం చేయాలన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:36 - February 8, 2018

విజయవాడ : అపూర్వమైన స్థాయిలో బంద్ జరుగుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. బస్సులను స్వచ్ఛందంగా నిలిపేశారని తెలిపారు. విద్యా సంస్థలను మూసివేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రజలు ఆగ్రహావేశాలు బంద్ వెలిబుచ్చుతున్నారన్నారు. విభజన చట్టంలోని హామీలను బీజేపీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విన్నపాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తారని చెప్పారు.

 

అమరావతిలో వామపక్షాల ఏపీ బంద్

గుంటూరు : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఏపీ బంద్ నిర్వహించాయి. అమరావతిలో వామపక్షాలు బంద్‌ నిర్వహిస్తున్నాయి. 

షెడ్డులోనే నిలిచిపోయిన బస్సులు

కృష్ణా : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల బంద్‌ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్సులు షెడ్డులోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు సిటీ బస్సులను బయటకు రాకుండా వామపక్ష నేతలు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బంద్‌ ప్రభావంతో ప్రధాన బస్టాండ్లన్ని వెలవెలబోతున్నాయి. అమరావతిలో వామపక్షాల ఏపీ బంద్ నిర్వహించాయి. మరిన్ని  సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

తూ.గో జిల్లాలో వామపక్షాల బంద్

తూర్పుగోదావరి : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీలో వామపక్షాలు కదంతొక్కుతున్నాయి. మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినడాలో తెల్లవారజామునుంచే బంద్‌ జరుగుతోంది. 

10:13 - February 8, 2018

తూర్పుగోదావరి : బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే అన్ని వర్గాలు స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నాయి. కాకినాడలో బంద్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం... 
పశ్చిమగోదావరి  
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బంద్‌లో పాల్గొన్న వామపక్ష నేతలతో పాటు వైసీపీ, కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బంద్‌కు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. 8 డిపోల్లో 450 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 
గుంటూరు
కేంద్ర ప్రభుత్వ తీరు, చంద్రబాబు ప్రభుత్వ చేతగాని తనంపై లెఫ్ట్‌పార్టీలు కన్నెర్రజేశాయి. బడ్జెట్‌లో ఏపీకి అరకొర కేటాయింపులపై నిరసనకు దిగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా కేంద్రం మెలికలు పెడుతోందని.. కమ్యూనిస్ట్‌పార్టీలు మండి పడుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్నా.. టీడీపీ మోదీ స్కార్‌ నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయిందని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసరగా ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయి. అయితే గత అర్ధరాత్రి నుంచే ఎక్కడి కక్కడ వామపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్టు చేస్తున్నారు.  మరో వైపు వామపక్షాల బంద్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ , వైసీపీ అధ్యక్షడు జగన్‌ మద్దతు తెలిపారు. బంద్‌ సందర్భంగా ఇవాళ జగన్‌ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్‌డిపోల ముందుకు వామపక్షాల కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. బస్సులను కదల కుండా డిపోల ముందు ధర్నాకు దిగుతున్నారు. 

 

10:08 - February 8, 2018

కృష్ణా : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల బంద్‌ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్సులు షెడ్డులోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు సిటీ బస్సులను బయటకు రాకుండా వామపక్ష నేతలు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బంద్‌ ప్రభావంతో ప్రధాన బస్టాండ్లన్ని వెలవెలబోతున్నాయి. అమరావతిలో వామపక్షాల ఏపీ బంద్ నిర్వహించాయి. మరిన్ని  సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

09:53 - February 8, 2018

సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రైల్వే జోన్ విషయంలో కూడా ఏమీ చేయలేదని తెలిపారు. మోడీ దాట వేసే దోరణి ప్రదర్శించారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఊసేలేదన్నారు. రాజధాని అమరావతికి నిధులు లేవన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు.. 
ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం బాధ్యతారహిత్యంగా వ్యవహరించిందన్నారు. ప్రధాని ప్రత్యేకహోదా కాదు....ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని ఇవ్వలేదని....రైల్వే జోన్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. అభివృద్ధి పేరుతో పదవుల కోసం టీడీపీ కేంద్రంతో అంటకాగుతోందని ఆరోపించారు. మోడీ, చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశరాని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:49 - February 8, 2018

నల్గొండ : దేశానికి వామపక్షాలే ప్రత్యామ్నాయం.. లెఫ్ట్‌పార్టీలు బలపడితేనే దేశంఓ మతోన్మాదధోరణులకు అడ్డుకట్టపడుతుంద్నారు సీపీఎం జాతీయ నేతలు. నల్లగొండలో ముగిసిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర  ద్వితీయ మహాసభల్లో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు. అలాగే 13 మందితో రాష్ట్రకార్యదర్శివర్గం, 60 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.  
రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక 
నల్లగొండలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయమహాసభలు విజయవంతం అయ్యాయి. తమ్మినేని వీరభద్రం మరోసారి తెంగాణ సీపీఎం పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు 13 మందితో రాష్ట్ర కార్యవర్గం, అలాగే 60 మందితో రాష్ట్ర కమిటీని మహాసభల్లో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికయిన రాష్ట్ర కార్యవర్గంలో  తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి కాగా.. కార్యవర్గ సభ్యులు 13 మందిలో ఎస్‌. వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డి, సున్నం రాజయ్యతోపాటు  బి.వెంటకట్‌, టి.జ్యోతి,  జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్‌రావు, జి.రాములు, డిజి నర్సింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే  సీనియర్ నేతలు.. మల్లు స్వరాజ్యం, సారంపల్లి మల్లారెడ్డి , పి.రాజారావును పార్టీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. 
మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, బీవీ. రాఘవులు 
మహాసభల్లో పాల్గొన్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివీ. రాఘవులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. దేశానికి వామపక్షాలే నిజమైన ప్రత్యామ్నాయం అన్నారు. దోపిడీ, అణచివేత, ఆదిపత్యానికి వ్యతిరేకంగా పోరాడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. రాబోయే రోజుల్లో మతోన్మాదం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తమ భవిష్యత్‌ ఉద్యమాలు, పోరాటాలపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించుకున్నామని కొత్త ఎన్నికయిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం అంటోంది. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేందుకు  వామపక్ష, దళిత, బహుజను సంఘాలు  ఐక్యంగా ముందు సాగుతాయని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. 

 

08:51 - February 8, 2018

తూర్పుగోదావరి : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీలో వామపక్షాలు కదంతొక్కుతున్నాయి. మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినడాలో తెల్లవారజామునుంచే బంద్‌ జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:48 - February 8, 2018

ఢిల్లీ : లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోది కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్‌ చేసిన పాపాలే ఇప్పటికీ వెంటాడుతున్నాయన్నారు. రాష్ట్రాలనే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్‌ విభజించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ చరిత్రే విభజించడమని మోది దుయ్యబట్టారు. పార్లమెంట్‌ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. 
టిడిపిని బుజ్జగించేందుకు తెరపైకి విభజన అంశం 
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ఎండగడుతూ మోది ప్రసంగించారు. టిడిపిని బుజ్జగించేందుకు మోది విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారు. వాజ్‌పేయి హయాంలో 3 రాష్ట్రాలను విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని... కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మోది అన్నారు. రాజకీయ లబ్ది కోసం పార్లమెంట్‌ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు.
12వ శతాబ్దంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందన్న మోడీ
కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించలేదని...12వ శతాబ్దంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని...ప్రజాస్వామ్యం పాఠాలు మాకు వల్లించాల్సిన అవసరం లేదని మోది చెప్పుకొచ్చారు. దేశంలో 90 సార్లు 356 ఆర్టికల్‌ను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ చేసిన పాపాలు 70 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు అనుభవించాల్సి వస్తోందని దుయ్యబట్టారు. సర్దార్‌ పటేల్‌ ప్రధాని అయితే కశ్మీర్‌లోని ఓ భాగం పాకిస్తాన్‌లో ఉండేది కాదన్నారు. దళిత ముఖ్యమంత్రి, అంజయ్య, నీలం సంజీవరెడ్డిలను అవమానించిన ఘనత కాంగ్రెస్‌దని పేర్కొన్నారు. 
తాను చెప్పేది వినే ధైర్యం లేక ప్రసంగాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ సభ్యులు : మోడీ 
తాను చెప్పేది వినే ధైర్యం లేకనే కాంగ్రెస్‌ సభ్యులు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. పార్టీలు శాశ్వతం కాదు.. దేశమే శాశ్వతమన్న  విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీల కతీతతంగా తాము అభివృద్ధి చేపట్టామని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ హయంలో రోజుకు 11 కిలోమీటర్లు మేర రోడ్డు వేస్తే.. తమ హయాంలో రోజుకు 22కి.మీల మేర మూడేళ్లలో లక్షా 20 కి.మీ రహదారులు వేసినట్లు చెప్పారు. ఖర్గే ఎంపీగా ఉన్న బీదర్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం 1020 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ వేసిందని... ఖర్గే రైల్వేమంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మోదీ డిమాండ్‌ చేశారు.  లక్షకు పైగా పంచాయతీల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. 
ఆధునిక టెక్నాలజీతో ఆధార్‌ మరింత పటిష్టం : ప్రధాని
ఆధునిక టెక్నాలజీతో ఆధార్‌ను మరింత పటిష్టం చేశామని ప్రధాని తెలిపారు. దీంతో ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు చేరుతున్నాయని, దళారులు, అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందని మోది పేర్కొన్నారు. టిడిపి, వైసిపి ఎంపీలు, కాంగ్రెస్‌ సభ్యుల నినాదాల నడుమ మోది ప్రసంగం కొనసాగింది. 

 

వామపక్షాల బంద్‌కు పవన్‌ కల్యాణ్‌, జగన్‌ మద్దతు

విజయవాడ : ఇవాళ వామపక్షాల ఏపీ బంద్‌ కు పిలుపు ఇచ్చాయి. వామపక్షాల బంద్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, వైసీపీ అధ్యక్షడు జగన్‌ మద్దతు తెలిపారు. బంద్‌ సందర్భంగా ఇవాళ జగన్‌ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్‌డిపోల ముందుకు వామపక్షాల కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. బస్సులను కదల కుండా డిపోల ముందు ధర్నాకు దిగుతున్నారు. 

ప.గో.జిల్లా వ్యాప్తంగా నిలిచిన 450 బస్సులు

ప.గో : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుండే ఆర్టీసీ బస్ డిపోల వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. డిపోల నుండి బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 8డిపోలో 450 బస్సులు నిలిచిపోయాయి. ఏలూరులో ఆందోళన చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను, వైసీపీ, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

08:02 - February 8, 2018

నెల్లూరు : జిల్లాలో వామపక్షాల బంద్‌ ప్రారంభమైంది. కావలిలో ఆర్టీసీ డిపో వద్ద బస్సులు బయటకురాకుండా సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్ని చోట్ల భారీగా పోలీసులను మోహరించారు. 
 

07:56 - February 8, 2018

గుంటూరు : ఇవాళ రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి.  తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా కేంద్రం మెలికలు పెడుతోందని.. కమ్యూనిస్ట్‌పార్టీలు మండి పడుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ..  మోదీ స్కార్‌ నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయిందని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసరగా ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయి. అయితే అర్ధరాత్రి నుంచే ఎక్కడి కక్కడ వామపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్టు చేస్తున్నారు. మరో వైపు వామపక్షాల బంద్‌కు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వైసీపీ అధ్యక్షడు జగన్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏపీకి నష్టం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందన్నారు. బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మరిన్నివివరాలను వీడియోలో చూద్దాం.. 

 

07:50 - February 8, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ తీరు, చంద్రబాబు ప్రభుత్వ చేతగాని తనంపై లెఫ్ట్‌పార్టీలు కన్నెర్రజేశాయి. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై కేటాయింపులపై నిరసనకు దిగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి.  తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా కేంద్రం మెలికలు పెడుతోందని.. కమ్యూనిస్ట్‌పార్టీలు మండి పడుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ..  మోదీ స్కార్‌ నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయిందని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసరగా ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయి. అయితే అర్ధరాత్రి నుంచే ఎక్కడి కక్కడ వామపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్టు చేస్తున్నారు.  మరో వైపు వామపక్షాల బంద్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ , వైసీపీ అధ్యక్షడు జగన్‌ మద్దతు తెలిపారు. బంద్‌ సందర్భంగా ఇవాళ జగన్‌ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్‌డిపోల ముందుకు వామపక్షాల కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. బస్సులను కదల కుండా డిపోల ముందు ధర్నాకు దిగుతున్నారు. 
ప.గో.జిల్లా వ్యాప్తంగా నిలిచిన 450 బస్సులు 
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుండే ఆర్టీసీ బస్ డిపోల వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. డిపోల నుండి బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 8డిపోలో 450 బస్సులు నిలిచిపోయాయి. ఏలూరులో ఆందోళన చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను, వైసీపీ, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ఇవాళ వామపక్షాల ఏపీ బంద్

విజయవాడ : ఇవాళ వామపక్షాల ఏపీ బంద్ మోడీ ప్రభుత్వం తీరుపై లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయంపై వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. బంద్ కు జనసేన, వైసీపీ మద్దతు తెలిపాయి. 

Don't Miss