Activities calendar

09 February 2018

21:43 - February 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రికి ఢిల్లీ వెళ్లారు. నాలుగు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలవనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై ఆయన కేంద్రమంత్రులకు వినతిపత్రం అందజేయనున్నారు. ఫార్మాహబ్ నిర్మాణానికి సహకారం, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. వీటితో పాటు నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ ముందస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికలపై కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకునే అవకాశముంది.

21:41 - February 9, 2018

ఢిల్లీ : 

పార్లమెంట్‌లో ఐదోరోజు ఏపీ ఎంపీలు ఆందోళనను ఉధృతం చేశారు. సమాశాలకు చివరి రోజు కావడంతో నినాదాలతో హోరెత్తించారు. లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన గళం వినిపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుమట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ పలుమార్లు వారించినా వినకపోవడంతో సభను వాయిదా వేశారు.

 

టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళన
తిరిగి సభ ప్రారంభమైనా టీడీపీ, వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. స్పీకర్‌ పోడియం ముందు నిరసన తెలిపారు. పెద్దగా నినాదాలు సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సభను మార్చి 5కు వాయిదా వేశారు.అటు రాజ్యసభలోనూ ఏపీ ఎంపీల నిరసన కొనసాగింది. టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఏపీకి న్యాయం చేయాలని కోరారు. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది.

రాజ్యసభ 12గంటలకు తిగిరి ప్రారంభమైనా టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు వెనక్కితగ్గలేదు. ఏపీకి న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్‌ పదేపదే వారించినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది.

మధ్యాహ్నం 2.30కు మళ్లీ రాజ్యసభకాగానే టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన చేపట్టారు. టీడీపీ సభ్యులు ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎంపీల తీరును తప్పుపట్టారు. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో ఒకవైపు భాగస్వామిగా ఉంటూ... మరోవైపు ఆ ప్రభుత్వ నిర్ణయాన్నే తప్పుపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయడంపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే వారు చేసే ఆందోళనకు నైతికత ఉంటుందని స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీ మద్దతు
కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై 5 రోజులుగా ఏపీ ఎంపీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ ఏపీ ప్రజలు చేస్తున్న డిమాండ్లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్లకు ఆయన మద్దతు తెలిపారు. ఏపీకి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని సూచించారు.ఏపీకి న్యాయం చేసేంత వరకు ఎంతవరకైనా వెళ్తామని ఎంపీలు తేల్చి చెబుతున్నారు. ఢిల్లీలోనేకాదు.. ఇక నుంచి గల్లీల్లోనూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఏపీకి న్యాయం చేయకపోతే కాంగ్రెస్‌కు పట్టినగతే బీజేపీకి పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

21:40 - February 9, 2018

ఢిల్లీ : ఏపీ ప్రజల మనోభావాలు కేంద్రానికి ఏమాత్రం పట్టలేదని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా నిరసనలు చేపట్టినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మూడోసారి ఏపీపై అరుణ్‌జైట్లీ ప్రకటన చేసినా.. ఎలాంటి నిధుల ప్రస్తావనే లేదన్నారు. దీంతో జైట్లీ ప్రకటనత తమలో అసంతృప్తి నెలకొందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. రేపు మరోసారి అరుణ్‌జైట్లీని కలిసి విభజన హామీలపై చర్చిస్తామని స్పష్టం చేశారు.

21:39 - February 9, 2018

ఢిల్లీ : అరుణ్‌జైట్లీ మరోసారి పాతపాటే పాడారు. మూడోసారి హామీలతోనే సరిపెట్టారు. ఐదు రోజులుగా ఏపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్నా అవేవీ జైట్లీ పట్టించుకోలేదు. బడ్జెట్‌ చర్చలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ విభజన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. కొత్తగా ఎలాంటి నిధులు ప్రకటించలేదు. జైట్లీ ఈసారైన ఏపీకి న్యాయం చేసేలా నిధులు ప్రకటిస్తారని అందరూ ఊహించారు. కానీ వారందరి ఆశలపై నీళ్లు చల్లుతూ కొత్తగా నిధుల కేటాయింపులేమీ ప్రకటించలేదు. విభజన హామీల అమలుకోసం సంబంధిత మంత్రిత్వశాఖలు కృషి చేస్తున్నాయి చెప్పారు. రైల్వేజోన్‌, ఉక్కు పరిశ్రమతోపాటు ఇతర డిమాండ్లు కేంద్రం పరిశీలనలో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని... వాటికి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఏపీకి కేంద్రం ఐదేళ్లపాటు సాయం చేస్తుందని పాత హామీనే మరోసారి ఇచ్చారు. జైట్లీ ప్రసంగంలో ఎలాంటి హామీలు లేకపోవడంతో ఏపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా పోరాడుతున్నా కేంద్రానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హామీలన్ని పరిశీలనలో ఉన్నాయి : జైట్లీ

ఢిల్లీ : దుర్గరాజుపట్నం, కడప స్టీల్ ప్లాంట్, పెంట్రోలియం కాంప్లెక్స్, విశాఖ రైల్వేజోన్, విశాఖ-చెన్నై-బెంగళూరు కారిడార్ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. 

పాల్వంచ కేటీపీఎస్ 7వ దశ నిర్మాణంలో అపశృతి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. వెల్డింగ్ చేస్తూ సంతోష్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. 

బోదకాలు బాధితులకు పెన్షన్

హైదరాబాద్ : రాష్ట్రంలో బోదకాలు బాధితులకు రూ.1000 పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోదకాలు బాధితులు 47 వేల మంది బోదకాలు బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇచ్చేలా బడ్జెట్ నిధులు కేటాయించాలని నిర్ణయం. 

20:34 - February 9, 2018

గడిచిన మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, మన వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు అప్పుల ఊబీలో కూడుకుపోయారని, మరోవైపు పరిశ్రమాల్లో పని చేసే కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడంలేదని ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

కొత్త పాస్ పుస్తకాల నమూనాల పరిశీలన

హైదరాబాద్ : కొత్త పాస్ పుస్తకాల నమూనాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్ పుస్తకాన్ని ఎంపికచేసిన సీఎం ఆకుపచ్చ రంగులో ఉంది. పాస్ పుస్తకాలపై రైతు ఫొటో, రాష్ట ప్రభుత్వం ముద్ర ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. 

20:02 - February 9, 2018

గుంటూరు జిల్లాలో విషాదం

గుంటూరు : జిల్లా మాజెండ మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. గుండ్లకమ్మలో ఈతకెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

19:18 - February 9, 2018

ప్రధాని మాట్లాడిన, ఆర్థిక మంత్రి మాట్లాడిన అతి కంటితుడుపు చర్యగా భావించాలని, రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో అనాటి ప్రధాన మంత్రి ప్రకటన చేశారని, అది జరిగి ఐదేళ్లైందని, ఇప్పుడు ప్రత్యేక హోదా కాస్త స్పెషల్ ప్యాకేజీ మారిందని టెన్ టీవీ ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:10 - February 9, 2018

ఢిల్లీ : రాజ్య సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ విభజన హామీలపై ప్రకటన చేశారు. జైట్లీ మళ్లీ పాత మాటలే మాట్లాడారు. దీంతో ఏపీ ఎంపీలు నిరాశ చెందారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

19:07 - February 9, 2018

డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా మదన్. ఆర్ డైరెక్షన్ వచ్చిన యాక్షన్, ఎంటటైనర్ మూవీ గాయత్రి. మోహన్ బాబు తన సత్తా చాటే రోల్ కనిపించిన సినిమా గాయత్రి హీరో మాత్రమే కాకుండా స్పెషల్ రోల్స్ లో మెరుస్తూ తనదైనా డైలాగ్ డెలవరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు మోహన్ బాబు నటించి నిర్మించిన సినిమా గాయత్రి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొంత విరామం తర్వాత గాయత్రి కోసం మోహానికి మళ్లీ మేకప్ వేశారు. టీజర్, ట్రైలర్స్ తో తన స్టైల్లో కంటెంట్ ఉన్న డైలాగ్స్ తో ఈ సినిమాపై ఆసక్తి కలించాడు. భారీ కస్టింగ్, హై స్టండెడ్ టెక్నికల్ ఉన్న టీమ్ కలయికలో రూపొందడంతో గాయత్రి పై అంచనాలు ఏర్పాడ్డాయి. కథ విషయానికొస్తే..

అనాథ అయిన శివాజీకి నటన అంటే ప్రాణం. చిన్నతనం నుంచి నటకాలు వేస్తూ మంచి స్టేజ్ అర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు. అలా నటకాల కోసం ఊరు తిరుగుతూ శారద అనే ఆమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ గర్భవతి అయిన ఆమెకు కాన్యర్ అని తెలియడంతో డబ్బు కోసం చేయని తప్పును తన మీద వేసుకుని జైలు వెళ్తాడు. భార్య చనిపోయి, కూతరు తప్పిపోవడంతో తప్పులు చేసిన వాళ్ల గెటప్ లో జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవిస్తూ వస్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో శారద సదనాన్ని నడుపుతుంటాడు. అయితే పాతికేళ్ల తర్వాత తన కూతరు బతికే ఉంది. తనను అసహ్యాంచుకుంటుందని తెలుకుంటాడు. దానితో మంచివాడిగా మారుదామనుకునే టైమ్ లో శివాజీ గాయత్రి పటేల్ లవ్ చేస్తాడు. అసల్ గాయత్రి పటేల్ ఎవరు..?శివాజీకి అతనికి సంబంధం ఏమిటి..? తెర మీద చూడాల్సిందే...

18:52 - February 9, 2018

పశ్చిమగోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం రాష్ట్ర 25వ మహా సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. రేపు ప్రారంభం కానున్న ఈ మహా సభల్లో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, B.V.రాఘవులు సహా సీపీఎం నాయకులు పాల్గొంటున్నారన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని మధు అన్నారు.

18:52 - February 9, 2018

కృష్ణా : చదువు, మార్కులే కాకుండా విద్యార్థులను మంచి వక్తలుగా తీర్చిదిద్దేందుకు నారాయణ విద్యాసంస్థ ఆరేటర్‌ కాంటెస్ట్‌కు శ్రీకారం చుట్టింది. వక్తల ఎంపిక కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఉన్ని 35 బ్రాంచ్‌లలో రెండు దశల్లో సెలక్షన్స్‌ నిర్వహించి 45 మంది విద్యార్థులను వక్తలుగా ఎంపిక చేశారు. వీరికి తుది దశ ఎంపిక పోటీని విజయవాడ కానూరులోని ఒలంపియాడ్‌ స్కూల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వాక్‌చాతుర్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. 

18:51 - February 9, 2018

శ్రీకాకుళం : జిల్లా పాతపట్నం మండలం తారమ గ్రామానికి చెందిన ఇతని పేరు మామిడి గోవిందరావు.. ముద్దుగా అందరూ ఎంజీఆర్‌ అని పిలుచుకుంటారు... పేదరికంలో పుట్టిపెరిగిన ఈ యువకుడు.. కొంత కాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడు.. ఆ తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి రాణించాడు. ఐనా ఏదో తెలియని వెలితి అతన్ని వెంటాడింది... అంతే తన మాతృభూమికి ఏదో చేయాలన్న ఆలోచనతో ముందగుడు వేశాడు. ప్రజలకు ఆసరాగా నిలిచాడు ప్రజాప్రతినిధులు ఎందరు మారినా... తామర, తీమర ప్రాంతాల్లో సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న అవస్థలపై ఏ ఒక్కరూ స్పందించలేదు.. కానీ.. ఏ పదవీ లేకపోయినా.. జన్మభూమిలో సేవ చేసేందుకు ఎంజీఆర్‌ నడుంబింగించాడు. తన ప్రాంతవాసులకు నేనున్నానంటూ... ఆ పన్నహస్తం అందించాడు ఈ యువకుడు..

3 కిలోమీటర్ల దూరంలోని వంశధార నది
సొంత ఊరికి ఏదో చేయాలన్న తపనతో.. స్థానిక సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకున్నాడు ఎంజీఆర్... తాగునీటి కోసం దశాబ్దాలుగా ప్రజలు 3 కిలోమీటర్ల దూరంలోని వంశధార నదికి వెళ్తుండడం అతనికి తీవ్ర మనస్తాపం కలిగించింది.. తన చిన్న తనం నుంచి వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు సొంత నిధులను ఖర్చు చేశాడు. ఊళ్లోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలు వేయించాడు. మామిడి గోవిందరావు చొరవ పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎంజీఆర్‌కు ఎలాంటి అధికారం, పదవి లేకున్నా.. ప్రజల్లో మాత్రం ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి. ప్రజాసేవకు పదవులు అవసరం లేదు.. మంచి చేయాలన్న తపన ఉంటే చాలు... సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయని నిరూపించాడు ఎంజీఆర్‌. గుడి, బడి, విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ... అన్ని విధాలా ప్రజలకు చేరువయ్యాడు. అలాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.

తామర, తీమర గ్రామాలను దత్తత
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తామర, తీమర గ్రామాలను దత్తత తీసుకున్నాడు మామిడి గోవిందరావు.... వీటితో పాటు.. మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోని సమస్యలపై స్పందించారు ఎంజీఆర్. పరిష్కారం చూపిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్న ఇలాంటి వారు.. ఊరికొక్కరుంటే.. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగిపోయి.

18:48 - February 9, 2018

తూర్పుగోదావరి : ఏపీలో.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజలను అయోమయంలో పడేసే చర్యలు చేపట్టాయని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. తనను అమిత్‌షా తిట్టినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనను వైసీపీ కోవర్ట్‌ అనడాన్ని కూడా సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. 

18:47 - February 9, 2018

మెగా స్టార్ మేనాల్లుడు సాయి ధరంతేజ్ హీరోగా వీ.వీ. వినాయక్ దర్శకత్వంలో వచ్చి మూవీ ఇంటలిజెంట్ ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి చేశారు. ఇక కథ విషయానికొస్తే...

చిన్నతనం నుంచి తన ఇంటిజెన్స్ తో చిన్న చిన్న సమస్యలను పరిష్కారిస్తూ ఇంటలిజెంట్ అనిపించుకుంటాడు తేజ. అలాంటి ఇంటలిజెంట్ పెరిగి పెద్దైయ్యాక సాప్ట్ వేర్ ఎప్లాయి అవుతాడు. అయితే సాప్ట్ వేర్ తో పాటు అన్ని రంగాల్లో భయాన్ని క్రియోట్ చేస్తూ ఆస్తులను ఆక్రమించుకుంటున్న విక్కీ భాయ్ తేజ పని చేస్తున్న కపెంనీ ఓనర్ నందకిషోర్ ను బెదిరించి కంపెనీని తనకు హాండోవార్ చేయాని బెదిరిస్తాడు. అందుకు నంద కిషోర్ విక్కీ భాయ్ మాటలను తిరస్కరించడంతో బలవంతంగా ఆ కంపెనీని తన పేరునా రాయించుకొని నందకిషోర్ ను చంపేస్తాడు. అప్పుడు తేజ తన ఇంటిజెన్స్ తో తను పనిచేస్తున్న కంపెనీని తిరిగి ఎలా దక్కించుకున్నాడు. విక్కీ భాయ్ ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే....

ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయల్దేరారు. ఆయన రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. రేపు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

హెచ్ఐసీసీలో క్రెడాయ్ యూత్ కాస్ 2018

హైదరాబాద్ : హెచ్ఐసీసీలో క్రెడాయ్ యూత్ కాస్ 2018 కాన్ఫరెన్స్ జరగుతోంది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా హాజరైయ్యారు. 

17:42 - February 9, 2018

హైదరాబాద్ : 

ఇపుడు దేశ వ్యాప్తంగా ప‌ట్టణాలు, న‌గ‌రాలు పెద్ద ప‌రీక్షను ఎదుర్కోంటున్నాయి. కేంద్రం నిర్వహిస్తున్న స్వచ్ స‌ర్వేక్షన్ ర్యాంకింగ్ లో అగ్రస్థానం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. గ‌తేడాది మెట్రో న‌గ‌రాల్లో ప్రథ‌మ స్థానం కైవ‌సం చేసుకున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఈ సారికూడా టాప్ లిస్ట్ లో నిల‌వ‌డం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ప్రత్యేకంగా ప్రచారం...
టాప్‌ర్యాంకే లక్ష్యంగా సాగుతున్న జిహెచ్ఎంసి స్వచ్ స‌ర్వేక్షన్ కోసం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. కాని సిటి ప్రజ‌ల‌కు మాత్రం స్వచ్ స‌ర్వేక్షన్ అంటే ఏంటో ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన కలిగడంలేదు. గ‌త సర్వేక్షణ్‌లో ఎంతగా ప్రచారం చేసినా.. సిటిజ‌న్స్ ఫిడ్ బ్యాక్, వ్యక్తిగ‌త మ‌రుగుదోడ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల పెద్ద మెత్తంలో మార్కులు కోల్పోయింది జీహెచ్‌ఎంసీ. అందుకే ఈసారి పౌరుల నుంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ రావాలని బల్దియా అధికారులు గత మూడు నెలలుగా స్వచ్‌సర్వేక్షణ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆయా స్థానిక సంస్థల్లో చేపట్టిన స్వచ్చతా కార్యక్రమాల‌పై కేంద్రం బృందం అభిప్రాయాలు సేక‌రించ‌డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. బల్దియా అధికారులు అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ప్రజ‌లు నుంచి మాత్రం స్వచ్‌ సర్వేక్షణ్‌ అంటే ఏంటనే సమాధానాలే వ‌స్తున్నాయి.

3వేల 500 ట‌న్నుల చెత్త..
అయితే.. స్వచ్‌తా కార్యక్రమాల ప్రచారంపై జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్యంపై ప్రజల్లో అవగాహన వచ్చిందంటున్నారు. గ‌తంలో సిటివ్యాప్తంగా 3వేల 500 ట‌న్నుల చెత్తను సేక‌రిస్తుండ‌గా.. ప్రస్తుతం అది 4,500 ట‌న్నుల వ‌ర‌కు చేరిందంటున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేక‌రించ‌డం, వీదుల్లో చెత్త వేయకుండా తీసుకున్న చ‌ర్యల వ‌ల్ల ఇలాంటి మెరుగుద‌ల సాధ్యమైందంటున్నారు. ఇక గ‌తేడాది 434 ప‌ట్టణాల‌తో పోటి ప‌డ్డ హైద‌రాబాద్ 22వ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. కాని ఈ సారి 4296 ప‌ట్టణాలు న‌గ‌రాల‌తో పోటీ ప‌డుతోంది. అయితే స్వచ్ స‌ర్వేక్షన్ పై ప్రజ‌ల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవ‌గా రాలేదు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారుల్లో కలవరం మొదలైంది. ప్రజల్లో అవగాహనా రాహిత్యంవల్ల హైద‌రాబాద్‌కు వ‌చ్చే ర్యాంక్ పై ప్రభావం ప‌డే అవ‌కాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

17:41 - February 9, 2018

హైదరాబాద్ : మరోసారి అధికార పగ్గాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్ కు వచ్చే ఎన్నికలు కొత్త సమస్యలు సృష్టించేలా కనిపిస్తున్నాయి. పార్టీ పరంగా పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవడంతో కింది స్థాయి కార్యకర్తల నుంచి మెజార్టీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలు కేసీఆర్‌కు పెద్ద సవాలేనని పార్టీ నేతలు భావిస్తున్నారు.

పునర్విభజన జరగలేదు....
కేసీఆర్‌ చాలాసార్లు చెప్పినట్టు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు నీరుకారిపోతున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తల్తో స్తంబ్దత నెలకొంది. టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కోదండరామ్‌ చేసిన ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో గుబులు మొదలైంది. ఈ పరిణామం గులాబీ నేతలకు రుచించడం లేదు. ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉంది. అయినా పార్టీ నిర్మాణంపై గులాబీ బాస్‌ ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదు. మరోవైపు వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఇప్పటికే అధికార పార్టీపై విమర్శల దాడిని పెంచాయి. ఇలాంటి పరిణామాలు గులాబీ నేతల్లో కొత్త ఆలోచనల్లోకి నెట్టివేస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని అన్నీ తానై నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో తనదైన మార్క్‌ కోసం పలు పథకాలు ప్రేవేశపెట్టినా... పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని మాత్రం చల్లార్చడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీజాక్ పార్టీ ఏర్పాటు చేయడం
ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో నడిచిన టీజాక్ పార్టీ ఏర్పాటు చేయడం ఖరారు కావడంతో... గులాబీ దళంలోని అసంతృప్తిగా నేతలు, ఉద్యమకారులు కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే 10 నుంచి 15 మంది శాసనసభ్యులు తమతో టచ్ ఉన్నారని ప్రకటనలు చేస్తున్న కోదండరాం వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ నేతల్లో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

17:40 - February 9, 2018

హైదరాబాద్ : లోక్‌పాల్‌, లోకాయుక్త, స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 23న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆమరణ దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్షకు మద్దతుగా ఇండియా అగెనెస్ట్ కరప్షన్‌ వాలంటీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్నాహక సభను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ నెల 17 ఏవీ కాలేజీ గ్రౌండ్‌లో జరగబోయే సభకు అన్నాహజారే హాజరవనున్నట్లు తెలిపారు. 

17:39 - February 9, 2018

నిజామాబాద్ : ఎర్రజొన్న, పసుపు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. నిజమాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఎర్రజొన్న రైతులకు మద్దతుగా రైతు జేఏసీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. దళారుల దోపిడి నుండి ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలన్నారు. 

17:39 - February 9, 2018

హైదరాబాద్ : సీఐటీయూ అనుబంధమైన తెలంగాణ ఎలక్ట్రిషియన్‌ ప్రైవేట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ లైన్‌మెన్‌ శిక్షణ ఇస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు నక్కా యాదగిరి తెలిపారు. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని అంబేద్కర్‌ స్పూర్తి భవనంలో ఈ శిక్షణ కొనసాగుతోంది. జూనియర్‌ లైన్‌మెన్ ఉద్యోగాలకు సిద్ధమవుతోన్న వారికి ప్రాక్టికల్స్‌తో పాటు హౌస్‌ వైరింగ్‌, మోటర్స్‌ అండ్‌ గెనెటర్స్‌ విభాగాలలో ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. 

17:38 - February 9, 2018

ఢిల్లీ : ఏపీలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానైన హైదరాబాద్‌లో నిర్వహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర బృందాలతో భద్రత కల్పించాలన్నారు. కేంద్ర పరిశీలకులను పంపాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా స్పందించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. 

17:37 - February 9, 2018

ఢిల్లీ : మొదటి విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఏపీ విభజన హామీలపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై బీజేపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నామంటున్నారు.

17:12 - February 9, 2018

రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాత్రి ఢిల్లీకి వెళ్లబోతున్నాడు. రేపు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు కేసీఆర్ వినతి పత్రం ఇవ్వనున్నారు. 

17:05 - February 9, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాత్రి ఢిల్లీకి వెళ్లబోతున్నాడు. రేపు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు కేసీఆర్ వినతి పత్రం ఇవ్వనున్నారు. బడ్జెట్ లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించడంతో ఈ పర్యటకు ప్రాధాన్యత సంతరించుకోనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రేపటి నుంచి భీమవరంలో సీపీఎం మహాసభలు

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో రేపటి నుంచి సీపీఎం 25 వ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, బీవీ రాఘవులు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. 

మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

కొత్తగూడెం : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. వారు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అక్షయ పాత్ర సంస్థకు కాంట్రాక్ట్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

16:53 - February 9, 2018

కొత్తగూడెం : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. వారు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అక్షయ పాత్ర సంస్థకు కాంట్రాక్ట్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:52 - February 9, 2018

హైదరాబాద్ : నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. బంజారాహిల్స్ రోడ్ నెం.10 లో డ్రగ్స్ విక్రయిస్తున్నా ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

బంజారాహిల్స్ లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గరు ఆఫ్రికన్లు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది : హరీష్ రావు

సిద్దిపేట : జిల్లా తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్ కత్తా, ఢిల్లీ నగరాల స్థాయిలో జరగాల్సిన మ్యాచ్ లు సిద్దిపేటలో జరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 

15:26 - February 9, 2018
15:24 - February 9, 2018

హైదరాబాద్ : ఉద్యోగుల, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఐటీయూ అఖిలభారత నాయకురాలు హేమలత అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ జాతీయ కౌల్సిల్‌ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. యాజమాన్యాలు వారిచేత గొడ్డు చాకిరీ చేయిస్తున్నాయని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం పోరాటమే ఏకైక మార్గమని ఆమె వారికి సూచించారు. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, FMRAI జాతీయ అధ్యక్ష, కార్యదర్శలు విశ్వనాథ్‌, శంతనుఛటర్జీ పాల్గొన్నారు. 

15:23 - February 9, 2018

విజయనగరం : జిల్లా నెల్లిమర్ల జూట్‌ మిల్లు యాజమాన్యం వేధింపులకు రెడ్డి గురునాయుడు అనే కార్మికుడు బలయ్యాడు. తమ స్థలంలో ఇల్లు కట్టుకున్నాడని గురునాయుడిని మిల్లు యాజమాన్యం వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. తెల్లకాగితంపై సంతకాలు తీసుకుని ఇల్లు ఖాళీ చేయమని బెదిరించడంతో మనో వేదనకు గురైన గురునాయుడు మరణించాడు. గురునాయుడు మృతికి మిల్లు యాజమాన్యమే కారణమంటూ మృతదేహంతో కార్మికులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు చేపట్టారు.

 

15:15 - February 9, 2018

ఢిల్లీ ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రం నుంచి సరైన ప్రకటన రాకపోతే మార్చిలో జరిగే లోక్‌సభ కార్యక్రమాలను తిరిగి అడ్డుకుంటామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా కేంద్రం చిత్తశుద్ధితో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు ఆదేశాల మేరకు పోరాటం కొనసాగించడమైనా.. లేదంటే బీజేపీతో పొత్తుకు గుడ్‌బై చెప్పడమైనా జరుగుతుందని టీజీ.వెంకటేష్ చెప్పారు. 

15:15 - February 9, 2018

ఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అన్ని పార్టీలు కలసి ఏకమై బీజేపీని తరిమికొడదామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పిలుపు ఇచ్చారు. చంద్రబాబు, జగన్‌లు మోడీకి భయపడకుండా ఎంపీలతో రాజీనామాలు చేయించి ముందుకు రావాలని కోరారు. ఢిల్లీ ఏపీభవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఏపీ హక్కుల సాధన కోసం కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఏపీకి న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. 

15:14 - February 9, 2018

ఢిల్లీ : ఏపీ సమస్యలపైనా.. విభజనలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సవరించడానికి ప్రధాని మోడీ ఎటుంటి మార్గం చూపించలేకపోయారని ఎంపీ కేవీపీ.రామచంద్రరావు మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉపన్యాసం ఇచ్చి నెపమంతా కాంగ్రెస్‌పై నెట్టే ప్రయత్నం చేశారని కేవీపీ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలను మర్చిపోయి.. మరోసారి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కేవీపీ ఆరోపించారు. 

15:13 - February 9, 2018

ఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ పోతురాజు వేషధారణలో నిరసన తెలిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ పూనినట్లు నిరసన ప్రదర్శన చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని శివప్రసాద్‌ అన్నారు. 

15:13 - February 9, 2018

ఢిల్లీ : ఏపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ దద్ధరిల్లింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సమావేశంలోను ఎంపీలు ఆందోళన కొనసాగించారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ వాదించినా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ సజావుగా జరగకపోవడంతో స్పీకర్ సభను మార్చి 5 తేదీ వరకూ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోను ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగాయి. వాయిదా అనంతరం ప్రారభమైన సభలోను ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను రెండోసారి వాయిదా వేశారు. సభ మళ్లీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానుంది. 

15:09 - February 9, 2018

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు అమలు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో కేంద్రాన్ని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

విభజన హామీలు కేంద్రం నెరవేర్చాలి : జానా రెడ్డి

హైదరాబాద్ : విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని కాంగ్రెస్ నేత జానా రెడ్డి అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ నాయకులకు పూనకం వచ్చిట్లుంది : పల్లా

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులు పూనకం వచ్చినట్లు మంత్రి కేటీఆర్ పై తిట్ట పురాణం అందుకున్నారని, తెలంగాణ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే కేటీఆర్ కాంగ్రెస్ దద్దమ్మ అన్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 

14:39 - February 9, 2018

ఆడపిల్ల పుడితే చంపేసే కాలం పోయిందా. మగపిల్లాడితో పాటు ఆడపిల్ల రావానుకుంటున్నారా అంటే అవుననే ఆర్యోగ శాఖ తెలుపుతుంది. ఆడపల్లి పుడితే భారమన్న భావన భారతీయుల్లో క్రమంగా తగ్గుతుంది. ఈ విషయంలో పలు విధాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఆడపిల్ల పుడితే పుట్టకుండానే చంపేసే రోజులు పోయయాని ఆడపిల్లే కావాలనుకున్న రోజులు వాస్తున్నాయని అంటుంది ఆరోగ్య సర్వే. మరిన్ని మహిళా వార్తలకు వీడియో క్లిక్ చేయండి.

14:07 - February 9, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిన్నారి నరబిలి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ నివాసాల్లో పోలీసులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. చిన్నారి తల భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపారు. ఆ చిన్నారి గతేడాది నవంబర్ లో పాతబస్తీ బహుదూర్ పురాలో కిడ్నాపైనా చిన్నారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:01 - February 9, 2018
13:59 - February 9, 2018

ఢిల్లీ : చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు కలిసి ఢిల్లీలో పోరాడితే తాను ఏ త్యాగానికైనా సిద్ధం అన్నారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. కేవలం రాజకీయ లబ్ది కోసమే అన్ని రాజకీయ పార్టీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. తన నియోజకవర్గానికి కేంద్రం నుండి 25వేల కోట్లు తీసుకువస్తే రాష్ట్రం ఒక్క పైసాకు లెక్క ఇవ్వలేదన్నారు. మిత్రపక్షమైన టీడీపీ అడిగితేనే ఇవ్వని ప్రత్యేక హోదా వైసీపీ ఎన్డీఏతో కలిస్తే ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 

 

13:56 - February 9, 2018

ఢిల్లీ : బడ్జెట్‌ విషయంలోనూ .. ఇటు ఏపీ ప్రత్యేక హోదా అంశంలోనూ ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. అరుణ్‌జైట్లీ ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించిన ప్రజలకు చివరకు నిరాశే మిగిలిందన్నారాయన. ప్రజల్ని మభ్యపెడుతూ టీడీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని వైసీపీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాను పక్కన  పెట్టి టీడీపీ ఎంపీలు ప్రత్యేక ప్యాకేజ్‌ గురించి మాట్లాడటం దారుణమన్నారు. 

 

13:53 - February 9, 2018

ఢిల్లీ : వైసీపీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. టీడీపీ ఎంపీలు ప్రత్యేక ప్యాకేజ్‌పైనే దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. కేసుల భయంతోనే టీడీపీ కేంద్రంతో లాలూచీ పడుతోందని వరప్రసాద్ విమర్శించారు. భవిష్యత్‌లో ఏపీ ప్రయోజనాల కోసమే వైసీపీ పనిచేస్తుందంటున్న ఎంపీ వరప్రసాద్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. కేసుల భయంతోనే టీడీపీ కేంద్రంతో లాలూచీ పడుతోందని ఆరోపించారు. ఏపీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే వైసీపీ పనిచేస్తుందన్నారు.

 

13:49 - February 9, 2018

ఢిల్లీ : పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ పోతురాజు వేషధారణలో నిరసన తెలిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ పూనినట్లు నిరసన ప్రదర్శన చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని శివప్రసాద్‌ అన్నారు. 

 

13:47 - February 9, 2018

ఢిల్లీ : రాజ్యసభలోను ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగాయి. వాయిదా అనంతరం ప్రారభమైన సభలోను ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో  రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను రెండోసారి వాయిదా వేశారు. సభ మళ్లీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానుంది. 

 

13:43 - February 9, 2018

ఢిల్లీ : ఏపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ దద్ధరిల్లింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సమావేశంలోను ఎంపీలు ఆందోళన కొనసాగించారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌  వాదించినా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ సజావుగా జరగకపోవడంతో స్పీకర్ సభను మార్చి 5 తేదీ వరకూ వాయిదా వేశారు.  

13:28 - February 9, 2018

ఢిల్లీ : ఫ్రెండ్లీ అలయెన్స్ పోగ్గొట్టుకుంటే బీజేపీకి పుట్టగతులుండవని టీడీపీ ఎంపీ వెంకటేష్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి 'సేయింగ్ గుడ్ బై' చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పారు. కమిట్ మెంట్స్.. కమింట్స్ గానే ఉండిపోయాయన్నారు. గత నాలుగు రోజులు సభను జరపకుండా ఆందోళన చేస్తునేవున్నామని తెలిపారు. హామీలు అమలు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. తమకు చంద్రబాబు నుంచి స్పష్టమైన గైడ్ లైన్స్ వస్తున్నాయని తెలిపారు. కేంద్రంపై దశలవారిగా యుద్ధం చేస్తామని...లేదా బీజేపీకి సెలవు ప్రకటిస్తామని చెప్పారు. మాటలు కాదు... చేతలు కూడా ఉంటాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే ప్రత్యేక హోదా కోరుతామని చెప్పారు. మాటలతో చింతకాయలు రాలవన్నారు. రాజీనామాలతో లాభం చేకూరదని చెప్పారు. సభలో చేసే పోరాటమే రియల్ పోరాటం లాగా ఉంటుందన్నారు.

 

13:10 - February 9, 2018

హైదరాబాద్ : మెఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌... మెయిల్‌ సంస్థ.. అరుదైన ఘనతను సాధించింది. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా ఆవిష్కరించిన భారీ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుకు.. దేశంలోనే తొలిసారిగా.. జీఐఎస్‌ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ ఘనతను సాధించింది. 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే.. మెఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌.. మెయిల్‌.. విజయ పరంపరలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాము చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకం.. దేశంలోనే అతి పెద్దదీ అయిన.. వెస్టర్న్‌ ఉత్తరప్రదేశ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రాజెక్టును నిర్ణీత కాలావధిలోనే పూర్తి చేసి.. జాతికి అంకితం చేసింది. 

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగులు పంచేందుకు.. 13,220 ఎంవీయే సరఫరా సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును నాలుగు వేల నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. 2011లో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టును, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి, నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి, బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులో దేశంలోనే తొలిసారిగా జీఐఎస్‌ టెక్నాలజీని వినియోగించారు. 

ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతంలో గతంలోని ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా.. విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయాలు.. అది కూడా గంటల తరబడీ విద్యుత్‌ కోతలూ ఉండేవి. మెయిల్‌ సంస్థ నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని విద్యుత్‌ సమస్యలన్నీ తొలగినట్లే. గతంలో ఇంత భారీ ప్రాజెక్టులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. దేశంలోనే తొలిసారిగా.. ఈ డబ్ల్యుయూపీపీటీసీఎల్ ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేటు నిర్వహణలో ఉండబోతోంది. వచ్చే 35 సంవత్సరాల పాటు.. మెయిల్‌ సంస్థ.. ఈ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. 

మెయిల్‌ సంస్థ నిర్మించిన డబ్ల్యుయూపీపీటీసీఎల్ ప్రాజెక్టులో.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. అత్యల్ప వ్యయంతో.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే విద్యుత్‌ పునరుద్ధరణ చేపట్టేలా ఏర్పాట్లూ చేశారు. 

ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్ : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. సభలో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు. సస్పెండ్ అయితే బయటకు వచ్చి ఆందోళన చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే అవకాశం లేదని తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని, అవసరమైతే మంత్రులను అడ్డుకోండని చెప్పినట్లు తెలుస్తోంది. 

బీజేపీకి ఏపీకి న్యాయం చేసే ఉద్దేశం లేదన్న కేవీపీ

ఢిల్లీ : ఏపీపై వైఖరి మార్చుకోకపోతే దేశంలో బీజేపీ కనుమరుగు కాక తప్పదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ అన్నారు. ఏపీపై కేంద్రానికి సానుభూతి కూడా లేకుండా పోయిందన్నారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగడం వారికి ఇష్టం లేదన్నారు. బీజేపీ అంగీకారంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఇది ఇప్పుడు నేషనల్ అంశం అయిందన్నారు. బీజేపీకి ఏపీకి న్యాయం చేసే ఉద్దేశం లేదని చెప్పారు. 

 

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఉప్పల్ చిన్నారి తల భాగం

హైదరాబాద్ : ఉప్పల్ చిన్నారి నరబలి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చిన్నారి తల భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బలి ఇచ్చిన చిన్నారి గతేడాది నవంబర్‌లో పాతబస్తీ బహదూర్‌పురాలో కిడ్నాపైన శిశువుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన పాప తల్లిదండ్రులు బబ్లూ, షానాజ్‌ల రక్తనమూనాలను సేకరించిన పోలీసులు ల్యాబ్‌కు పంపారు. మరో మూడురోజుల్లో పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక అందనుంది. ఇద్దరి డీఎన్‌ఏ మ్యాచ్‌ అయితే కేసు మిస్టరీ వీడనుంది. 

12:44 - February 9, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ఏపీ ప్రజలు నిరాశపడ్డారని తెలిపారు. కేంద్రం రాష్ట్రాన్ని చాలా నిరాశపర్చిందన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు పర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తాము అంశాల వారిగా ఆందోళన చేశామని తెలిపారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉందని... ఏపీ రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉందన్నారు. 

 

లోక్ సభ మార్చి 5వరకు వాయిదా వేసిన స్పీకర్

ఢిల్లీ : లోక్ సభ మార్చి 5వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభమైంది. సభలో ఏపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో లోక్ సభ మరోసారి వాయిదా పడింది. స్పీకర్ ఎంత చెప్పినా ఎంపీలు ఆందోళన విరమించలేదు. దీంతో సభను మార్చి 5 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. 

మరోసారి రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. సభలో ఏపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో రాజ్యసభ  మరోసారి వాయిదా పడింది. చైర్మన్ ఎంత చెప్పినా ఎంపీలు ఆందోళన విరమించలేదు.. దీంతో సభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

 

12:28 - February 9, 2018
12:22 - February 9, 2018

ఢిల్లీ : లోక్ సభ మార్చి 5వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభమైంది. సభలో ఏపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో లోక్ సభ మరోసారి వాయిదా పడింది. స్పీకర్ ఎంత చెప్పినా ఎంపీలు ఆందోళన విరమించలేదు. దీంతో సభను మార్చి 5 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. 

12:17 - February 9, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. సభలో ఏపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో రాజ్యసభ  మరోసారి వాయిదా పడింది. చైర్మన్ ఎంత చెప్పినా ఎంపీలు ఆందోళన విరమించలేదు.. దీంతో సభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

 

12:13 - February 9, 2018

ఢిల్లీ : వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ఏపీ ఎంపీలు ఆందోళన కొనసాగుతోంది. అంతకముందు ఎంపీల ఆందోళనతో లోక్ సభ, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. 

11:58 - February 9, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిన్నారి నరబలి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చిన్నారి తల భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బలి ఇచ్చిన చిన్నారి గతేడాది నవంబర్‌లో పాతబస్తీ బహదూర్‌పురాలో కిడ్నాపైన శిశువుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన పాప తల్లిదండ్రులు బబ్లూ, షానాజ్‌ల రక్తనమూనాలను సేకరించిన పోలీసులు ల్యాబ్‌కు పంపారు. మరో మూడురోజుల్లో పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక అందనుంది. ఇద్దరి డీఎన్‌ఏ మ్యాచ్‌ అయితే కేసు మిస్టరీ వీడనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మోడీకి భయపడుతున్న టీడీపీ, వైసీపీ నేతలు : రఘువీరా రెడ్డి

ఢిల్లీ : 'మోడీ అంటే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి' అని టీడీపీ, వైసీపీ నేతలను ఉద్ధేశించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ఏపీ భవన్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా ఏపీ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు మోడీకి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేకహోదా, ప్యాకేజీ అంశం రాష్ట్ర ఎజెండాగా తయారయిందన్నారు. నిన్న జరిగిన వామపక్షాల బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చామని.. మిగిలిన పార్టీలు తోకముడుసుకొని బంద్ లో పాల్గొన్నాయని తెలిపారు.

11:52 - February 9, 2018

ఢిల్లీ : 'మోడీ అంటే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి' అని టీడీపీ, వైసీపీ నేతలను ఉద్ధేశించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ఏపీ భవన్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా ఏపీ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు మోడీకి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేకహోదా, ప్యాకేజీ అంశం రాష్ట్ర ఎజెండాగా తయారయిందన్నారు. నిన్న జరిగిన వామపక్షాల బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చామని.. మిగిలిన పార్టీలు తోకముడుసుకొని బంద్ లో పాల్గొన్నాయని తెలిపారు. విభజన సందర్భంగా తాము రాజకీయంగా నష్టపోయి... రాష్ట్రానికి న్యాయం చేశామని తెలిపారు. రాష్ట్ర విభజనలో బీజేపీ, టీడీపీలు కూడా భాగమనే అని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు కేంద్రంపై ఒత్తిడి చేయలేవని...తాము చేసే పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. 

 

మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభలో ఏపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.  

11:38 - February 9, 2018

హైదరాబాద్ : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. సభలో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు. సస్పెండ్ అయితే బయటకు వచ్చి ఆందోళన చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే అవకాశం లేదని తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని, అవసరమైతే మంత్రులను అడ్డుకోండని చెప్పినట్లు తెలుస్తోంది. 

 

11:33 - February 9, 2018

ఢిల్లీ : ఏపీపై వైఖరి మార్చుకోకపోతే దేశంలో బీజేపీ కనుమరుగు కాక తప్పదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ అన్నారు. ఏపీపై కేంద్రానికి సానుభూతి కూడా లేకుండా పోయిందన్నారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగడం వారికి ఇష్టం లేదన్నారు. బీజేపీ అంగీకారంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఇది ఇప్పుడు నేషనల్ అంశం అయిందన్నారు. బీజేపీకి ఏపీకి న్యాయం చేసే ఉద్దేశం లేదని చెప్పారు. అరుణ్ జైట్లీకి అవగాహన రాహిత్యంతో ఉన్నారని అనుకోవడానికి వీల్లేదని చెప్పారు. జైట్లీ అబద్దాన్ని వల్లించి... వల్లించి దాన్ని నీజం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకతీతంగా పోరాడాలన్నారు. మిత్రపక్షాలతోటి సంప్రదించి, కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. 

11:22 - February 9, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో ఏపీ ఎంపీలు నిరసన తెలిపారు. లోక్ సభలో ఏపీ ఎంపీల నిరసన చేపట్టారు. దీంతో ప్రారంమైన ఐదు నిమిషాలకే లోక్ సభ వాయిదా పడింది. స్పీకర్ సుమిత్రమహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఏపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:10 - February 9, 2018

ఢిల్లీ : రాజ్యాంగానికి విఘాతం జరిగిందని ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ను తృణీకరించారని తెలిపారు. కాబినెట్ నిర్ణయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రజలను నమ్మంచి మోసం చేశారని విమర్శించారు. ఏపీ బంద్ విజయవంతం అయిందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని.. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఏకమవుదామని పిలుపునిచ్చారు. బీజేపీని ఒంటరి చేయాలని.. రాష్ట్రం నుంచి బీజేపీని తరిమికొడదామని చెప్పారు. టీడీపీ, వైసీపీ మోడీకి భయపడవద్దన్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని సూచించారు. 

 

11:01 - February 9, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. ఆందోళన కొనసాగించానలని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలకు సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

అమరావతి : టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం తీరు, పార్లమెంట్ లో ఆందోళన లాంటి అంశాలపై చర్చిస్తున్నారు. 

 

టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. ఆందోళన కొనసాగించానలని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలకు సూచించారు. 

నేడు ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీల ధర్నా

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. 10 గంటలకు ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్న టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. ఆందోళన కొనసాగించానలని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలకు సూచించారు. 

09:48 - February 9, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. ఆందోళన కొనసాగించానలని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలకు సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. 10 గంటలకు ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ధర్నా చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

09:42 - February 9, 2018
09:39 - February 9, 2018

విజయవాడ : గుణదల మేరీమాత ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు  అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో.. వేడుకల్లో భాగంకానున్నారు. చర్చ్‌ల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింస్తున్నారు.  
ముస్తాబైన గుణదల చర్చ్‌
విజయవాడలో గుణదల మేరీ మాత ఉత్సవాలు తొమ్మిదో తేదీన ఘనంగా ప్రారంభం కానున్నాయి.  9, 10, 11 తేదీలలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుణదల చర్చ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని..  విశ్వాసాన్ని.. భక్తిని చాటుకోనున్నారు. 1947 నుంచి ప్రతిఏటా గుణదల మేరీమాత ఉత్సవాలు  నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మేరీమాత ఉత్సవాల ప్రారంభానికి ముందు తొమ్మిది రోజులపాటు నవ దిన ప్రార్థనలు, ఆరాధనలు  నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8వ తేదీతో ఈ ప్రత్యేక ప్రార్థనలు ముగుస్తాయి. 9వ తేదీ ఉదయం ఏడు గంటలకు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా.. చర్చ్‌ నిర్వాహకులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
13లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా
ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల నుంచి 13లక్షల మందికిపైగా భక్తులు రానున్న ఈ ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్‌లను నడుపుతోంది. రైల్వే స్టేషన్‌, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి ప్రత్యేక సర్వీసులను నడపనుంది.  సింగ్ నగర్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, పోరంకి తదితర దూర ప్రాంతాల నుంచి గుణదలకు బస్ సర్వీసులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈసారి జరిగే మేరీమాత ఉత్సవాలు శుక్ర, శనివారం, ఆదివారాలు కావడంతో పోలీస్ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 
ఉత్సవాలకు ఏళ్ల చరిత్ర
ఎంతో వైభవంగా.. జరిగే గుణదల మేరీమాత ఉత్సవాల వెనుక.. ఏళ్లనాటి చరిత్ర ఉంది.  దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఈ చర్చ్‌ ఘనతకెక్కింది.  1925లో గుణదల కొండపై ప్రకృతి సిద్ధంగా  ఏర్పడిన గుహలో మేరీమాత స్వరూపాన్ని స్థాపించారు. 1933లో ఫాదర్‌ అర్లాటి గుణదల కొండ శిఖరాగ్రన ఓ శిలువను ప్రతిష్టించారు. 1951లో కొండదిగువ నుంచి ఎగువ భాగం వరకూ శిలువ మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. కాలినడక నడిచే మార్గంలో క్రీస్తు జీవిత ఘట్టాలు తెలియజేసే 14 రకాల రూపాలు, క్రైస్తవ మదిని తాకేలా రూపొందించారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యమున్న గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రశాంతంగా ముగించేందుకు.. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

 

09:37 - February 9, 2018

హైదరాబాద్ : పాతబస్తీలోని షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 300 వందల మంది పోలీసులు ఆ ఏరియాను జల్లెడ పట్టారు. జుమ్మేరాత్ బజార్, లంబీగల్లీ, మేదర్ గల్లీ ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఈ తనిఖీలను జరిగాయి. ఈ సందర్భంగా 28 మంది రౌడీషీటర్లను, 59 మంది అనుమానితులన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 54 బైకులకు పోలీసులు సీజ్ చేశారు. మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్న భజరంగ్ సింగ్, కమల్ సింగ్‌ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

09:35 - February 9, 2018

కర్నూలు : ప్రైవేట్ కాలేజీలో ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కాలేజీ యాజమాన్యాలు డబ్బులే పరమావధిగా భావిస్తున్నారు. ఫీజుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ కాలేజీ ధన దాహానికి విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా కర్నూలులో ఫీజుల జులుంకి బీటెక్ విద్యార్ధిని ప్రశాంతి బలైంది. ప్రశాంతి కర్నూలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఇంజనీరింగ్ కాలేజ్‌ యాజమాన్యం వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే మనస్తాపం చెందిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

కర్నూలులో విద్యార్ధిని ఆత్మహత్య

కర్నూలు : పట్టణంలో ఫీజుల జులుంకి బీటెక్ విద్యార్ధిని ప్రశాంతి బలైంది. ప్రశాంతి కర్నూలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఇంజనీరింగ్ కాలేజ్‌ యాజమాన్యం వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే మనస్తాపం చెందిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

09:23 - February 9, 2018

హైదరాబాద్‌ : నగరంలోని చింతల్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చెరుకుపల్లి కాలనీకి చెందిన అపర్ణ గోకరాజు గంగరాజు కాలేజీలో బీటెక్‌ 4వ సంవత్సరం చదువుతోంది. కాగా రాత్రి చింతల్‌లోని ఇంటికి వచ్చిన అపర్ణ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డం కలకలంగా మారింది. జీడిమెట్ల పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

చింతల్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ : నగరంలోని చింతల్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చెరుకుపల్లి కాలనీకి చెందిన అపర్ణ గోకరాజు గంగరాజు కాలేజీలో బీటెక్‌ 4వ సంవత్సరం చదువుతోంది. కాగా రాత్రి చింతల్‌లోని ఇంటికి వచ్చిన అపర్ణ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డం కలకలంగా మారింది. జీడిమెట్ల పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం

హైదరాబాద్ : ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు. నాలుగేళ్లు సహజీవనం చేశాడు. మతం మార్చాడు. తీరా మోజు తీరాక ముఖం చాటేశాడు. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతుంటే ఆ ప్రియురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. 

పాతబస్తీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కొంతమంది మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:30 - February 9, 2018

బీజేపీ ఎన్నికలకు ముందు వాగ్ధానాలు చేసి తర్వాత మొండిచేయి చూపిస్తుందని నేతలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమలో విశ్లేషకులు, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, టీడీపీ నేత చందూసాంబశివరావు, బీజేపీ నేత కోటేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. బీజేపీకి మాట తప్పడం సహజ లక్షణం, అలవాటని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా చట్టబద్ధమైన అంశం అని అన్నారు. టీడీపీ కేంద్రంపై పోరాడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:26 - February 9, 2018

కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు ఉపయోగకరంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు బి.ప్రసాద్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో వ్యవసాయానికి అరకొర నిధులు కెటాయించారని విమర్శించారు. బడ్జెట్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 
  

07:21 - February 9, 2018

నాగర్ కర్నూలు : రాజకీయాల్లో అపార అనుభవం.. గల్లీ నుంచి ఢిల్లీదాకా పెద్దలతో పరిచయాలు... అలాంటి నేతను గెలిపించుకుంటే ఇక తమ ఊళ్లు బాగుపడతాయనుకున్న ప్రజలకు నిరాసే ఎదురైంది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య కోసం నియోజకవర్గ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 
ఎల్లయ్య పనితీరుపై వ్యతిరేకత 
మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటులో ఆయా నేతల పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్య పనితీరుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఎంపీ నంది ఎల్లయ్యపై విమర్శలు  
ఎంపీ నంది ఎల్లయ్య పట్టుమని పదిసార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన నాగర్‌కర్నూలు సెగ్మెంట్‌లో 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మందా జన్నాథంపై  కాంగ్రెస్‌ అభ్యర్థి నంది  ఎల్లయ్య గెలుపొందారు. నంది ఎల్లయ్య గెలుపుతో నారగర్‌కర్నూలు ప్రజలు సంతోషపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశించారు. కాని ప్రజలకు నిరాశే మిగిలింది. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీరు, విద్య, వైద్యం, రైల్వే లైన్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. అభివృద్ధి మాట అటుంచి.. అసలు ఎంపీగారు నియోజకవర్గానికి చుట్టుపు చూపుగా కూడా రావడం మానేశారని ప్రజలు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఎంపీ నంది ఎల్లయ్య పట్టుమని పదిసార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. 
దత్తత గ్రామానికి నిరాశ
ఇదిగో ఈ గ్రామాన్ని చూడండి.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు..గతుకుల రోడ్లు.. ఎండిపోయన బోర్లు. ఇంత అధ్వాన్న స్థితిలో ఉన్న ఈ గ్రామంపేరు అమరవాయి. గద్వాల నియోజకవ ర్గంలోని మల్దకల్‌ మండలంలో ఉన్న  అమరవాయి గ్రామాన్ని ఎంపీ నంది ఎల్లయ్య దత్తత తీసుకున్నారు. ఎంపీగారు దత్తత తీసుకోవడంతో ఇక తమ ఊరిలో అభివృద్ధి పరుగులు పెడుతుందనుకున్న వారికి నిరాశే మిగిలింది.  దత్తత తీసుకుని మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎంపీ గారు ఇప్పటివరకు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
పట్టించుకునే నాథుడే కరువు 
ఎంపీ నంది ఎల్లయ్య అమరవాయిని దత్తత తీసుకున్న తర్వాత గ్రామాలోని పలు సమస్యల పరిష్కారానికి వ్యూహాలు  రూపొందించారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మహిళా కళాశాల, రైతులకు పంట నూర్పిళ్ల కోసం కల్లాలు, తాగునీటి పథకం, పశువైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, గ్రామంలో పాడుబడ్డ ఆరు ఊర బావులను పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ  ఏ ఒక్క సమస్య  కూడా  పరిష్కారానికి నోచుకోలేదు. 4,500 జనాభా ఈ గ్రామంలో   కనీసం 300 మరుగుదొడ్లు కూడా లేవు. వ్యక్తిగత నల్లాలు లేవు. ఊరు మొత్తంగా 30 మాత్రమే ఉన్నాయి. ఇన్ని సమస్యలతో సతమతమ వుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 
సమస్యలపై నంది ఎల్లయ్య దృష్టిపెట్టాలి : ప్రజలు  
మొత్తానికి ఎంపీ నంది ఎల్లయ్య తనను గెలిపించిన ప్రజలనే పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తుంటే.. ప్రతిపక్షపార్టీకి చెందిన నియోజకవర్గాల్లో కావాలనే అభివృద్ధి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇప్పటికైనా గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలపై ఎంపీ నంది ఎల్లయ్య దృష్టిపెట్టాలని నాగర్‌కర్నూలు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 

 

07:07 - February 9, 2018

హైదరాబాద్ : రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణాగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నామని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మెడికల్‌ అండ్ హెల్త్  గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీని ఆయన ఆవిష్కరించారు. రాష్ర్టంకోసం ఉద్యమ సమయానికి మించి  కష్టపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడంలో... ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగుతామన్నారు. 

 

07:03 - February 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ గతంలో అన్న మాటల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో  వారి కుటుంబం పోటీ చేయడానికి వీలు లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథపై.. 25 వేల ఆవాసాలకు నీళ్లు ఇవ్వకపోయినా.. డిసెంబర్‌ 18, 2017 నాటికి రెండు లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టివ్వకపోయినా.. ఎన్నికల్లో ఓట్లు అడగనని.. కేసీఆర్‌ చెప్పారని..ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాటలను కేసీఆర్‌ కుటుంబం నిలబెట్టుకోలేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్ ఎస్ లత్కోర్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

07:00 - February 9, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే... ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు తానుకూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తాము చేసిన మాటలకు కట్టుబడి ఉంటామని... మరి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉంటారో లేదో చెప్పాలన్నారు. ఇక తాను టీఆర్‌ఎస్‌లో చేరడానికి ప్రయత్నించినట్టు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు వెళ్లలేదని చెప్పారు. కేటీఆరే తమ కార్యాలయానికి వచ్చారని చెప్పారు. అవసరమైతే సీసీ ఫుటేజీ చూపిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ, రాహుల్‌గాంధీపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

 

06:56 - February 9, 2018

విజయవాడ : రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై.. ప్రజా దండు కదిలింది. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలతో... ఏపీ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ వామపక్షాలు చేపట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. దీంతో ఏపీలో బంద్‌ విజయవంతమైంది. 
వామపక్షాల బంద్‌  
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు కదంతొక్కారు..! ఏపీకి జరిగిన అన్యాయంపై.. ఒక్కటిగా కదిలారు..! రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ఆందోళనకు దిగారు..! వామపక్షాల బంద్‌ పిలుపుకు వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. దీంతో బంద్‌ విజయవంతమైంది. 
ఉత్తరాంధ్రలో 
ఉత్తరాంధ్రలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.  విశాఖపట్నంలో  స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. బస్సుల రాకపోలు నిలిచిపోయాయి. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా బంద్‌లో పాల్గొని.. ధర్నాలు చేపట్టారు. జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు బైఠాయించారు. ఆంధ్ర యువత బీచ్‌రోడ్డులోని భగత్‌సింగ్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. విజయనగరం జిల్లాలోనూ.. సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష పార్టీలతో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు బస్‌ల రాకపోకలను అడ్డుకున్నారు. ఎస్ ఎఫ్ఐ నాయకులు పట్టణంలోని.. పాఠశాలలను, కళాశాలలను మూసివేయించారు. 
శ్రీకాకుళం జిల్లాలో 
అటు శ్రీకాకుళం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు.. ధర్నాలు చేపట్టారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. ఐదు ఆర్టీసీ డిపోల వద్ద సుమారు 350 బస్సులు నిలిచిపోయాయి. 
ఉభయ గోదావరి జిల్లాల్లో 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ  బంద్‌ ప్రశాంతంగా సాగింది. సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు  ఆందోళనలు చేపట్టారు.  సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని  శ్యామలా సెంటర్ నుంచి కోటిపల్లి  బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి..  మానవహారం చేశారు. తుని ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర సీపీఐ, వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురంలోనూ.. ఆయా పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. అనపర్తిలో ఎమ్మెల్యే  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు.  అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రశాంతంగా బంద్‌ కొనసాగింది. 
పశ్చిమగోదావరి జిల్లాలో 
పశ్చిమగోదావరి జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఏలూరులో ఆర్టీసీ బస్సులు డిపోలకే  పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.  షాపులన్నీ మూతపడ్డాయి.  పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్‌లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. 
కృష్ణా జిల్లాలో  
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమల కోసం... కృష్ణా జిల్లాలోనూ బంద్‌ కొనసాగింది.  విజయవాడలో సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు  ఒకే తాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
గుంటూరులో 
గుంటూరు నగరంలోని బస్టాండ్ వద్ద నుంచి శంకర్ విలాస్ వరకు వామపక్షాల  నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  శంకర్ విలాస్ సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. నరసరావుపేటో వైసీపీ ఆధ్వర్యంలో  బంద్‌ నిర్వహించగా.. రేపల్లెలో సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. అదే విధంగా.. ఏపీ రాజధాని  అమరావతిలోనూ వామపక్షాల బంద్‌ విజయవంతంగా సాగింది.  స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు మూతబడ్డాయి. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వామపక్షాల నేతలు రోడ్డుపై ర్యాలీతో పాటు.. ధర్నా చేపట్టారు. కాగా బంద్‌ ప్రభావం వల్ల నిత్యం సందర్శకులతో కళకళలాడే సచివాలయం సందర్శకులు లేక వెలవెలబోయింది. పలు జిల్లాల్లో బంద్‌లో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

06:50 - February 9, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ చేస్తున్నామంటూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనపై ఏపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి నిర్దిష్ట సాయాన్ని ప్రకటించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. నాలుగేళ్లుగా పాతపాటే పాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు.  
ఎంపీల ఆందోళనపై జైట్లీ స్పందన 
ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ఆందోళనపై లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించిన తీరుపై రాష్ట్ర ఎంపీలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశామని, కొన్ని అమలు దశలో ఉన్నాయని, ఏపీకి ప్రకటించిన జాతీయ సంస్థలకు నిధుల కేటాయించామని జైట్లీ చెప్పడాన్ని ఎంపీలు తప్పుపడుతున్నారు. ఏపీకి లబ్ధి చేకూర్చేలా జైట్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం తప్పు పట్టారు. లోక్‌సభ సాక్షింగా అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మరోసారి అవమానించారని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు  విమర్శించారు. ఏపీకి చేసే సాయంపై అరుణ్‌ జైట్లీ నిర్దిష్ట ప్రకటన చేయకపోవడాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తప్పుపట్టారు. అరుణ్‌ జైట్లీ మళ్లీ పాత పాటే పాడారని అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. 
చంద్రబాబు, టీడీపీ ఎంపీలవి నాటకాలు : ఎంపీ మేకపాటి 
మరోవైపు కేంద్రం నుంచి సాయాన్ని రాబట్టే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు నాటకాలు అడుతున్నారని నెల్లూరు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం వెనక్కి తగ్గుతోందిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. దీనికి టీడీపీ, బీజేపీ రెండూ బాధ్యత వహించాలని హెచ్చరించారు. 
అన్ని పార్టీలు పోరాడాలి : మంత్రి పళ్లంరాజు 
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు మొదటిదశ బడ్జెట్‌ సమావేశాలకు ఇవాళ చివరిరోజు. దీంతో  బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఉభయ సభలను స్తంభింప చేయాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. 

 

06:42 - February 9, 2018

ఢిల్లీ : అదే వేదిక! అదేపట్టు! అదేపోరు! పార్లమెంటులో ఏపీకి చెందిన ఎంపీలు కేంద్రంపై పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. పార్లమెంట్‌ లోపలా, బయటా నిరసన తెలుపుతూ న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉభయసభల్లో నిరసన చేపట్టిన ఎంపీలు....ఏపీకి న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. 
4వ రోజూ కొనసాగిన ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలపై ఏపీ ఎంపీలు పోరు మరింత ఉధృతం చేశారు. పార్లమెంట్‌ వేదికగా నాలుగోరోజూ ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌లోపలా బయటా నిరసన తెలిపారు. 
రాజ్యసభలో నిరసన గళాన్ని వినిపించిన ఎంపీలు
విభజన హామీల అమలుకోసం రాజ్యసభలో ఎంపీలు నిరసన గళాన్ని వినిపించారు. విభజన హామీల అమలుపై 15 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రి సుజనాచౌదరి డిమాండ్‌ చేశారు. ఆర్థికమంత్రి తన ప్రసంగంలో విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, అమరావతి నిధులపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. సభసాక్షిగా చేసిన హామీలనూ అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలుచేసి ప్రజాస్వామ్య కాపాడాల్సిన బాధ్యత సభకు ఉందన్నారు. 
లోక్‌సభలో ఉధృతమైన టీడీపీ, వైసీపీ పోరు
అటు లోక్‌సభలోనూ ఏపీ ఎంపీల నిరసనలు కొనగాయి. సభ ప్రారంభంకాగానే.. టీడీపీ, వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. కేంద్ర  ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.  గోవిందా గోవిందా అంటూ టీడీపీ ఎంపీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఎంపీ శివప్రసాద్‌ ఏకంగా పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు. టేబుల్‌పై ఉన్న పుస్తకాలను తీసుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే బీజేపీ నేతలు అడ్డుకోవడంతో శివప్రసాద్‌ అక్కడే ఉండిపోయారు.
టీడీపీ ఎంపీల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం
టీడీపీ ఎంపీల తీరుపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే నినాదాలు ఇతర సభ్యులకు ఇబ్బందికరంగా ఉంది, నిరసన తెలపండికానీ గట్టిగా నినాదాలు చేయవద్దన్నారు. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించారు. అయితా టీడీపీ ఎంపీలు వెనక్కితగ్గకపోవడంతో  స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఈ సమయంలో సభలోనే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు... ఏపీలోని పరిస్థితులు వివరించారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
పార్లమెంట్‌ ఆవరణలోనూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనకు 
పార్లమెంట్‌ ఆవరణలోనూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గాంధీజీ విగ్రహం ఎదుటు నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని కోరారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ డప్పుకొడుతూ పాటపాడుతూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
రాజ్యసభలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన 
మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు అనుమతించాలంటూ ఎంపీలు సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు నినాదాలు చేశారు. వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో శుక్రవారం  కూడా తమ ఆందోళన కొనసాగుతుందని ఏపీ ఎంపీలు స్పష్టం చేశారు. 

నేడు రాష్ట్ర ఎన్నికల అధికారితో వైసీపీ నేతలు సమావేశం

అమరావతి : ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారితో వైసీపీ నేతలు సామావేశం కానున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపుపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు. 

నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు

విజయవాడ : నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. దేశ, విదేశాల నుంచి 13 లక్షల మంది వస్తారని అంచనా. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. గుణదలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Don't Miss