Activities calendar

10 February 2018

21:26 - February 10, 2018

కరీంనగర్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు నిలిపేందుకు సహకరించిన కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌కు అపోలో ఆసుపత్రి యాజమాన్యం అభినందనలు తెలిపింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌ పల్లికి చెందిన మేకల నవీన్‌కుమార్‌కు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్ అయింది. అతని గుండెను... హైదరాబాద్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరోవ్యక్తికి అర్చేందుకు సహకరించాలని ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులను కోరింది. దీంతో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రెండు గంటల్లోనే తరలించారు. ఇందుకు సహకరించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డికి అపోలో ఆసుపత్రి ఛైర్మన్‌ అభినందనలు తెలిపారు.

జమ్మూలో ఉగ్రదాడిపై రాజ్ నాథ్ ఆరా...

జమ్ము కాశ్మీర్ : సున్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. జమ్మూ నగరంలోని సుంజ్‌వాన్‌ ప్రాంతంలో క్యాంపునకు దాదాపు 500మీటర్ల దూరంలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ముకశ్మీర్‌ డీజీపీకి ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో జమ్ము నగరంలో భద్రతను మరింత పెంచారు. 

కర్నాటకలో రాహుల్ ప్రచారం...

కర్నాటక : ప్రధానమంత్రి నరేంద్ర మోది తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్‌ ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. మోది మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

జయ మేనకోడలు ఇంట్లో నకిలీ ఐటీ అధికారి...

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ నివాసంలో నకిలీ ఐటి అధికారి కలకలం సృష్టించాడు. ఉదయం టినగర్‌లోని దీప నివాసానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ఆదాయపు పన్నుశాఖ అధికారినని...సోదాలు చేయాలని బెదిరించాడు. 

బాన్స్‌వాడాలో 11.48 కోట్ల టన్నుల బంగారం

రాజస్థాన్‌ : ఉదయపూర్‌ జిల్లా బాన్స్‌వాడాలో 11.48 కోట్ల టన్నుల బంగారం నిధులను శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 3 వందల మీటర్ల అడుగున బంగారం నిధులను గుర్తించినట్లు పేర్కొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఇక్కడ 2 వందల టన్నుల బంగారం ఉందని దాని విలువ 40 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతోపాటు 35 కోట్ల టన్నుల సీసం నిధులు కూడా పరిశోధనలో వెల్లడైంది.

21:09 - February 10, 2018

రాజస్థాన్‌ : ఉదయపూర్‌ జిల్లా బాన్స్‌వాడాలో 11.48 కోట్ల టన్నుల బంగారం నిధులను శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 3 వందల మీటర్ల అడుగున బంగారం నిధులను గుర్తించినట్లు పేర్కొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఇక్కడ 2 వందల టన్నుల బంగారం ఉందని దాని విలువ 40 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతోపాటు 35 కోట్ల టన్నుల సీసం నిధులు కూడా పరిశోధనలో వెల్లడైంది.

21:07 - February 10, 2018

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ నివాసంలో నకిలీ ఐటి అధికారి కలకలం సృష్టించాడు. ఉదయం టినగర్‌లోని దీప నివాసానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ఆదాయపు పన్నుశాఖ అధికారినని...సోదాలు చేయాలని బెదిరించాడు. దీపా ఆయనకు సంబంధించి ఐడి వివరాలు అడిగారు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నకిలీ అధికారి అక్కడి నుంచి ఉడాయించాడు. దీప అతని ఐడి కార్డు ఫొటో తీయగా...దానిపై మితేష్‌ కుమార్‌ అని ఉంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

21:06 - February 10, 2018

కర్నాటక : ప్రధానమంత్రి నరేంద్ర మోది తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్‌ ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. మోది మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ఏదైతో చెబుతుందో అదే చేసి చూపిస్తుందని రాహుల్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగమంతా కాంగ్రెస్‌ను తిట్టడానికే సరిపోయిందని...భవిష్యత్తు గురించి ఏమి చెప్పలేదని ధ్వజమెత్తారు. యువతకు ఉపాధి, రైతులకు మద్దతుపై మోది మాట్లాడలేదన్నారు. . బళ్లారిలో 'డు ఆర్‌ డై' పేరుతో రాహుల్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాఫెల్‌ డీల్‌ ఒప్పందం కాంట్రాక్ట్‌ను మార్చడం ద్వారా మోది ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 

21:04 - February 10, 2018

ఢిల్లీ : పాలస్తీనాను స్వతంత్ర దేశంగా చూడాలని ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా పాలస్తీనాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదికి ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి మహమూద్‌ అబ్బాస్‌ను కలుసుకున్న అనంతరం ప్రధాని మోది సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత విదేశాంగ విధానంలో పాలస్తీనాకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. పాలస్తీనాలో శాంతి సుస్థిరతలను నెలకొల్పేందుకు భారత మద్దతు ఎప్పుడూ ఉంటుందని మోది స్పష్టం చేశారు. రమల్లాలో టెక్నికల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మోది ప్రకటించారు. పాలస్తీన అత్యున్నత పురస్కారం 'గ్రాండ్‌ కాలర్‌'తో మోదిని అబ్బాస్‌ సత్కరించారు. అంతకుముందు పాలస్తీనా ప్రధాని రమీ హమదల్లాహ్‌తో కలిసి పాలస్తీనా నేత యాసర్‌ అరాఫత్‌ సమాధి వద్ద మోది నివాళులర్పించారు. పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం.  

21:03 - February 10, 2018

జమ్మూ కాశ్మీర్ : జమ్మూలోని సున్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఓ సైనికుడి కుమార్తె కూడా ఉంది. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుంజ్‌వాన్‌ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ గ్రనేడ్స్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులు కాగా...మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కల్నల్‌ ర్యాంక్‌ అధికారితో పాటు ఓ జవాను కుమార్తె కూడా ఉంది. సుబేదార్‌ మగన్‌లాల్‌, సుబేదార్‌ మొహమ్మద్‌ అష్రఫ్‌ ఉగ్రదాడిలో అమరులైనట్లు జమ్ముకశ్మీర్‌ మంత్రి అబ్దుల్‌ రెహమాన్‌ వెల్లడించారు.

ఉగ్రవాదులు తొలుత ఓ ఫ్యామిలీ క్వార్టర్‌లోకి చొరబడ్డారు. క్యాంపులో ఏ కుటుంబాన్ని ఉగ్రవాదులు బంధించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులను భద్రతబలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్‌ కొనసాగుతోంది. మహిళలను, పిల్లలను రక్షించేందుకు జెసిఓ ఎమ్‌ అష్రఫ్ మీర్‌ తన ప్రాణాలను అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురైదుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు..

ముందు జాగ్రత్త చర్యగా జమ్ము నగరంలోని సుంజ్‌వాన్‌ ప్రాంతంలో క్యాంపునకు దాదాపు 500మీటర్ల దూరంలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ముకశ్మీర్‌ డీజీపీకి ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో జమ్ము నగరంలో భద్రతను మరింత పెంచారు. 

21:01 - February 10, 2018

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్... టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కవిత... రెండురోజుల క్రితం పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు.

21:00 - February 10, 2018

హైదరాబాద్ : మహానగరాన్ని మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో... మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలో మురికివాడల రూపురేఖలను సమూలంగా మారుస్తామని కేటీఆర్ తెలిపారు. స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు వస్తే నగరంలో ఎన్ని ఇండ్లయినా కట్టిస్తామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదన్నారు. కంటోన్మెంట్ ఆస్పత్రిని తమకు అప్పగిస్తే అభివృద్ధి చేస్తమన్నారు కేటీఆర్. పూణె తరహాలో ఇక్కడ ఆర్మ్‌డ్‌ఫోర్స్ మెడికల్ కాలేజీ వచ్చేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

20:58 - February 10, 2018

పశ్చిమగోదావరి : బీజేపీ-టీడీపీ మిత్రబంధం వల్ల సాధించిందేమీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను ఈ రెండు పార్టీలూ మోసం చేశాయని విరుచుకుపడ్డారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. అల్లూ‌రు సీతారామ‌రాజు న‌గ‌ర్‌ ప్రాంగ‌ణంలో జరిగిన బ‌హిరంగ స‌భలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ-టీడీపీ మిత్రబంధంతో సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేద ప్రజలపై మరింత భారాలు మోపుతుందని ఏచూరి మండిపడ్డారు. 73 శాతం ధనం ఒక్క శాతం ప్రజల వద్దే ఉందని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని అన్నారు. ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని ఏచూరి అన్నారు.

రైతాంగం పోరాటాల్లోకి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు పిలుపునిచ్చారు. బడ్జెట్లో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రైతుల అప్పులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం విభజన హామీలను విస్మరించి ప్రజలను మోసగించిందని రాఘవులు మండిపడ్డారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయాలన్నారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వా పరిశ్రమ, యనమదుర్రు డ్రెయిన్‌, గరగపర్రు, పెద్దగొట్టిపాడు దళితులపైదాడుల వంటి సమస్యలపై సీపీఎం ఉద్యమాలు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఏయూ ప్రొపెసర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదని మధు మండిపడ్డారు.

రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ మండిపడ్డారు. సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా రానున్నకాలంలో కార్మిక, కర్షక, దళిత, బహుజన, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసే వేదికగా ఈ మహాసభలు జరగనున్నాయ‌ని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని గఫూర్‌ హెచ్చరించారు.

రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని.. వారి సమస్యలూ ఒకేలా ఉన్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజలు భూమి కోసం భుక్తి కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అన్ని పోరాటాల్లోనూ సిపిఎం ప్రజలకు అండగా ఉంటోందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసేది ఎర్రజెండా మాత్రమే అని తమ్మినేని స్పష్టం చేశారు.

అంతకు ముందు భీమవరం పట్టణంలో సీపీఎం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 20 వేల మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కామ్రేడ్స్‌ కదం తొక్కడంతో.. భీమవరం వీధులన్నీ అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. సీపీఎం రాష్ట్ర మహాసభలు సోమవారం వరకూ సాగనున్నాయి. 

20:54 - February 10, 2018

ఢిల్లీ : విభజన హామీల అమలుపై టీడీపీ ఎంపీల ఒత్తిడి ఇవాళ కూడా కొనసాగింది. శుక్రవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్.. ఈరోజు అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్రం తమ హామీలు అమలుచేయకుంటే.. ఎంతకైనా తెగిస్తామని ఒకరిద్దరు టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. ఇంకోవైపు... హామీల అమలు కోసం సంయుక్త నిజనిర్థారణ కమిటీ వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. విభజన హామీల అమలు కోసం... వారం రోజులుగా పోరాటం చేస్తున్న టీడీపీ సభ్యులు.. శనివారం, మరోమారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సి.ఎం. రమేశ్‌... జైట్లీని కలిసి.. పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం.... త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. శని, ఆదివారం సెలవు రోజులు కావడంతో... సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఆయా శాఖల అధికారులతో చర్చించి చర్యలు ముమ్మరం చేద్దామని జైట్లీ వారితో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ.. ఇవన్నీ హెవీ ఇండ్రస్టీకి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి ఆ శాఖకు చెందిన కార్యదర్శులను పిలిపించి వీలైనంత త్వరలో ఆదేశాలు జారీ చేస్తామని అరుణ్‌జైట్లీ చెప్పినట్లు టీడీపీ వర్గాల సమాచారం.

మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమని తెలుగు దేశం ఎంపీ కొనకళ్ల నారాయణ హెచ్చరించారు. కేంద్రం పదేపదే మోసపూరిత ప్రకటనలు చేసిన నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా.. కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే మార్చి 5 నుంచి పార్లమెంట్‌ ఉభయ సభలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు తమ వైఖరి ఉంటుందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఏపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పందించారు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థలు, ప్రాజెక్టులు, నిధులపై 27 పేజీల నోట్‌ను హరిబాబు దిల్లీలో విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇప్పటికే రూ.4 వేల కోట్లకు పైగా ఇచ్చారని వెల్లడించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజనిర్థారణ కమిటీ-JFC ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలతో పాటు సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, తదితరులతో జేఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని ట్విటర్‌లో తెలిపారు. విభజన హామీల అమలు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృతంగా చర్చించాలని పవన్‌ పేర్కొన్నారు.

అటు తాజా పరిస్థితులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ కోసం బేరం పెట్టి.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను అమ్మేసుకునే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన వివరాలు కూడా ఎవరికీ తెలియవన్నారు. ఇలాంటి కంటి తుడుపు చర్యలను ఇప్పటికైనా కట్టిపెట్టాలని, ఏపీ ప్రజల కోసం ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పాలని వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది విభజన సమయంలోనే ఇచ్చిన హామీ అని, అప్పటి పాలక పక్షం, ప్రతిపక్షం పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాను సమర్థించాయని ఆయన ట్వీట్‌లో గుర్తుచేశారు. 

20:52 - February 10, 2018

కేంద్ర బడ్జెట్...కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై సంతృప్తిగా లేదని, కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ప్రభుత్వం వత్తిడి తేలేదని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు..తదితర అంశాలపై టెన్ టివి ముచ్చటించింది. 8వ తేదీన వామపక్షాలు బంద్ కు పిలుపునిస్తే తాము మద్దతు తెలియచేయడం జరిగిందన్నారు. టిడిపి డ్రామాల్లాగా చేయడం లేదని, ప్రధాన మంత్రి స్పీచ్ సమయంలో తమ సభ్యులు వాకౌట్ చేయడం జరిగిందన్నారు. బిజెపి పొత్తుకు తాము తహ తహ ఆడడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు...

కర్నూలు : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారికి ప్రభుత్వం తరపున మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. శివస్వాములతో శ్రీశైలం ఆలయం పోటెత్తింది. వేకువజాము నుండి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. రావణ వాహనంలో మల్లన్న ఊరేగారు. 

20:09 - February 10, 2018

పవన్ కళ్యాణ్ సారు ఎవ్వలి రుణం ఉంచుకోడమ్మా..? రెండువేల పందొమ్మిది ఎన్నికలళ్ల... మళ్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాల్నంటే వందల కారణాలు జెప్తాంటున్నడు మాన్య మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీషు రావుగారు.. చెర్కురైతులు ఎన్నిరోజుల సంది దీక్షలు జేస్తున్నరు.. యాష్టకొచ్చి వాళ్లే దీక్షలు విరమించిండ్రు నిన్న... కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులు రెండేండ్ల సంది భూ పరిహారం అందక పరేషాన్ల ఉండి లొల్లివెడ్తున్నరు.. అబ్బా ఇంటిరా ఈ ముచ్చట.. అంతర్జాతీయ ఏతుల పుంజుల సంఘం అధ్యక్షుడు శ్రీ గౌరవ నరేంద్రమోడీగారు ఏమంటున్నడట..పక్వానికి రాని అర్టిపండ్లను దీస్కొచ్చి అవ్వి ఎర్రగ అయ్యెతందుకు ఏమేం పనులు జేస్తున్నరో సూడుండ్రి.. హైద్రావాద్ రోడ్ల మీద గుంత జూపెట్టుండ్రి వెయ్యిరూపాలిస్తాని అప్పట్ల జీహెచ్ఎంసీ కమీషనర్ ప్రజలకు సవాలు ఇశిరిండుగదా..?ఎవ్వడన్న తాగి పంచాదికి దిగితె.. సూశినోళ్లు ఏమంటరు.. గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

కోహ్లీ సెంచరీ..నిలిచిన మ్యాచ్...

జోహాన్నెస్ బర్గ్ : భారత్..సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ చెలరేగి ఆడి సెంచరీ సాధించాడు. 99 బంతుల్లో ధావన్ సెంచరీ నమోదు చేశాడు.

 

తిరుమలలో మంత్రి హరీష్ రావు...

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. 

మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఘంటా చక్రపాణి..

జయశంకర్ భూపాలపల్లి : ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం స్టార్టింగ్ పాయింట్ మేడిగడ్డ బ్యారేజీని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల ప్రొఫెసర్ల బృందం కూడా ఉంది. 

ఆందోళన వద్దన్న జైట్లీ...

ఢిల్లీ : అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంపై ఆందోళన చెందాల్సినవసరం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆర్ బిఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం సరైందన్నారు. 

పాలస్తీనాలో మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలస్తీనాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ ఘన స్వాగతం పలికారు. పాలస్తీనా దేశం తరపున ఇచ్చే అత్యంత గౌరవాత్మకంగా ఇచ్చే ప్రశంసా పత్రంతో అబ్బాస్ సత్కరించారు. 

జైట్లీతో సుజనా..సీఎం రమేష్..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్ లు సమావేశమయ్యారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో నిర్వహించిన భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చర్యలు చేపట్టాలని జైట్లీని కోరారు.

ఏఎన్ యూలో హైకోర్టు న్యాయమూర్తుల బృందం..

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్ యూ) లో హైకోర్టు న్యాయమూర్తుల బృందం శనివారం పర్యటించింది. ఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు నిమిత్తం అక్కడి భవనాలను పరిశీలించింది. ఈ బృందం వెంట కలెక్టర్ శశిధర్ కూడా ఉన్నారు.

18:55 - February 10, 2018

జగిత్యాల : జిల్లాలోని అంబారిపేట వద్ద D-56 కాలువ తూమును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తెరవడంతో నీరు పంటపొలాల్లోకి చేరింది. తూము నీరు భారీగా పొలాల్లోకి రావడంతో సుమారు మూడెకరాల్లో నీరు భారీగా చేరి నష్టం వాటిల్లింది. వీటితో పాటు పొలాలకు నీరు అందించే బావులు కూడా కూలిపోయాయి. ఈ నష్టానికి SRSP అధికారులే బాధ్యత వహించి...తమకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. 

18:53 - February 10, 2018

జగిత్యాల : తమ పాఠశాలలో కనీస వసతుల సమస్యను.. అక్కడి బాలికలు చాలా తెలివిగా పరిష్కరించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల జడ్పీ హైస్కూల్‌లోని 9వ తరగతి విద్యార్థులు.. తమ పాఠశాల సమస్యలపై హైకోర్ట్‌ న్యాయమూర్తికి లేఖ రాశారు. లెటర్ అందుకున్న ఉన్నత న్యాయమూర్తి.. వెంటనే ఈ సమస్యపై స్పందించారు. వెంటనే పాఠశాలలో సమస్య పరిష్కరింలాంటూ... ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి.. హుటాహుటిన ఇంజనీర్లతో కలిసి పాఠశాలను పరిశీలించారు. వసతుల కల్పనకు 11లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసిన ఇద్దరు విద్యార్థుల ప్రతిభను స్థానికులు హర్షిస్తున్నారు.

18:52 - February 10, 2018

కర్నూలు : సీపీఎస్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో..కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి... ఓపీఎస్ సిస్టమ్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కర్నూలు ఉద్యోగ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ.. పెన్షన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో... విజయవాడ అలంకార్‌ ధర్నా చౌక్‌లో మహాధర్నాచేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, వెస్ట్ కృష్ణా ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్‌ పాల్గొన్నారు. రాష్ర్టంలో లక్షా 86వేల మంది ఉద్యోగులు సీపీఎస్‌ విధానం వల్ల భద్రత కోల్పోయారన్నారు. పాత విధానాన్నే కొనసాగిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. 

18:50 - February 10, 2018

విజయవాడ : రాష్ర్టాభివృద్ధికి అన్ని రాజకీయ పక్షాలు తమ జెండాలు ఎజెండాలు పక్కనబెట్టి సమిష్టిగా ఉద్యమించాలని.. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కోరారు. ఈనెల 8న బంద్‌ను విజయవంతం చేయడంలో రాజకీయ పార్టీలన్ని కీలకంగా వ్యవహరించాయన్నారు. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఈనెల 12న ఉత్తరాంధ్ర జన ఘోష పేరుతో ప్రతి పాఠశాల, కాలేజీకి వెళ్ళి విద్యార్థులకు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వివరిస్తామని కొణతాల తెలిపారు. 

18:48 - February 10, 2018

వరంగల్ : జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో కులబహిష్కరణ ఘటన వెలుగుచూసింది. చిట్టీ విషయంలో జరిగిన చిన్న వివాదాన్ని కొందరు కుల పెద్దలు పెద్దగా చూపించి... 3 కుటుంబాలను బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వారికి 500 రూపాయల జరిమానా, 5 చెప్పుదెబ్బలని తీర్మానం చేశారు. దీంతో బాధిత కుటుంబాలు... తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నాలుగేళ్లు..ఎక్కడ అభివృద్ధి - తమ్మినేని...

పశ్చిమగోదావరి : తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్టాలు విడిపోయి నాలుగేళ్లు గడిచిపోయాయన..ఎక్కడ అభివృద్ధి అంటూ తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

'ఏపీ ప్రయోజనాలు బాబు తాకట్టు'..

పశ్చిమగోదావరి : ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర టిడిపి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆనాటి నుండి తాము చెబుతూ వస్తున్నామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గుర్తు చేశారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

జైట్లీ..బాబు నాటకాలు - రాఘవులు...

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాటకం జరగుతోందని..నాటికలకు నంది అవార్డులు ఇచ్చినట్లే..జైట్లీ..సీఎం చంద్రబాబు నాయుడులకు అవార్డులు ఇవ్వొచ్చని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు

ఏపీలో త్వరలో పెనుమార్పు - ఏచూరి...

పశ్చిమగోదావరి : రాబోయే రోజుల్లో ఏపీ రాష్ట్రంలో పెద్దమార్పు వస్తుందని..మరో ప్రత్యామ్నాయం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు...దోపిడి..దౌర్జన్యం లేని సమాజాన్ని సృష్టించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

18:27 - February 10, 2018

పశ్చిమగోదావరి : తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్టాలు విడిపోయి నాలుగేళ్లు గడిచిపోయాయన..ఎక్కడ అభివృద్ధి అంటూ తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోతే అభివృద్ధి అవుతుందని ఆనాడు చెప్పారని, నీళ్లు..నిధులు..నియామకాలు వస్తాయని ఆనాడు ఉద్యమం చేసిన కేసీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజలు నమ్మి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారని, అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారని..ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు.

ఏపీ, తెలంగాణలో కొత్త సీఎంలు వచ్చారని..ఇరు రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. కానీ ప్రజల బాధలు..కష్టాలు తీరలేదని..హక్కులు..సమస్యల కోసం ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో 7.5 శాతం అభివృద్ధిలో ఉన్నామని మోడీ..తెలంగాణలో పది శాతం వృద్ధి సాధించామని కేసీఆర్ పేర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన జీడీపీలో 73 శాతం సంపద ధనికుల..కుబేరుల చేతుల్లోకి వెళుతోందని..ఇదే నా అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం..దేశం అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేశారు.

ఎర్రజెండాను అధికారంలోకి తీసుకరావాలని..అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తాము చెప్పడం జరుగుతోందని...ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందట పెట్టాలని సూచించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ ఏర్పాటయ్యిందని, ఆనాటి చరిత్రను పునరావృతం చేస్తామని..ఎర్రజెండా రాజ్యాధికారం కోసం పోరాడుతామన్నారు. సకల అట్టడుగుల మీద అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని..అగ్రకులాల ఆధిపత్యం అణగదొక్కడానికి పోరాటం చేస్తున్నట్లు..ఇందుకు 28 పార్టీలతో బిఎల్ఎఫ్ ఏర్పాటైందన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో బిఎల్ఎఫ్ స్పష్టంగా ప్రజలకు చెబుతోందన్నారు. 

18:22 - February 10, 2018

పశ్చిమగోదావరి : ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర టిడిపి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆనాటి నుండి తాము చెబుతూ వస్తున్నామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గుర్తు చేశారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.54 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేయాలని చెప్పినా..ఇంతవరకు కదలిక లేదన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ కింద ఎంతో మంది పనిచేస్తున్నారని..వీరిని రెగ్యులర్ చేస్తామని ఆనాడు చెప్పారని...కానీ చేయలేదన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

23వ తేదీన సమ్మె జరుగుతుంటే జిల్లాకు చెందిన అంగన్ వాడీలు..మధ్యాహ్న భోజన కార్మికులు..ఇతరులు సమ్మె చేస్తుంటే వారిని తొలగించాలంటూ ప.గో. కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. సమ్మె చేస్తే ఉద్యోగాలు తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. అంగన్ వాడీలకు ఇచ్చిన సంజాయిషీ నోటీసును..ఉద్యోగుల తొలగింపు నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్ ను జిల్లా నుండి పంపించే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఇందుకు మంత్రి పితాని సత్యనారాయణ బాధ్యత తీసుకోవాలని..కార్మికులకు సమ్మె హక్కు ఉందా ? లేదా ? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. 

18:20 - February 10, 2018

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నిప్పులు చెరిగారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పోలవరంలో అయితే...గిరిజనులు మునిగిపోతా ఉంటే ..మునిగిపోతున్న గిరిజనులకు ప్రత్నామ్యాయం చూపెట్టకుండా తగాదా పెడుతుంటే ఖబడ్దార్ చంద్రబాబు అని నినదించామని తెలిపారు. సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కొంటారని ప్రశ్నించిన ఒకరిపై 90 కేసులు నమోదు చేశారని..రౌడీ షీట్ నమోదు చేశారని తెలిపారు.

రొయ్యల పరిశ్రమ వద్దని..1500 తుందుర్రు నుండి లారీలు కట్టుకుని కలెక్టర్ దగ్గరకు వెళ్లారని..మంత్రులు..ప్రజాప్రతినిధులు..వైసీపీ దగ్గరకు వెళ్లారని తెలిపారు. సీపీఎం దగ్గరకు వెళుదామని వచ్చారని...17వ తేదీన చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ దిగుతుంటే నిరసన వ్యక్తం చేశామన్నారు. 40వేల ఎకరాలున్న గ్రామాల్లో మత్స్యకార్మికుల పనులు పోతున్నాయని, ఉపాధి దెబ్బతింటోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమను అణిచివేసేవిధంగా చూశారని తెలిపారు.

900 కోట్ల రూపాయలు కేటాయిస్తామని..కాలుష్యం ప్రారదోలుతామని చెప్పి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. బాబు..టిడిపి ప్రభుత్వం చెప్పేవన్నీ నీటిమూటలేనని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఓ కమిటీ వేసిందని..రొయ్యల చెరువులను మూసివేయాలని..8 నెలల పాటు మూసివేయాలని ఉప్పు నీళ్లు లేకపోతే రొయ్యల చెరువు ఏర్పాటు చేయవద్దని కమిటీ సూచించిదన్నారు.

దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..వారి తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. 60 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కార్మికుల సమస్యలపై వైసీపీ ఏనాడు గళమెత్తలేదన్నారు. పోలీసులను ముందర పెట్టి పాలన కొనసాగిస్తున్నారని.. ఏ కార్యక్రమం పెట్టినా తమను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం పేదవాడి కోసం పుట్టిందని..13, 14 సమావేశంలో వామపక్షాలు ఒక ఉమ్మడి అభిప్రాయానికి వస్తామన్నారు. బీజేపీ సంగతి తేలేదాక పోరాటం చేస్తామని..ఆంధ్రుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని..ఇందుకు మహాసభలో చర్చిస్తామని మధు తెలిపారు. 

18:15 - February 10, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాటకం జరగుతోందని..నాటికలకు నంది అవార్డులు ఇచ్చినట్లే..జైట్లీ..సీఎం చంద్రబాబు నాయుడులకు అవార్డులు ఇవ్వొచ్చని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో విభజన హామీలు సాధించేందుకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జేఏసీ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారని..ఇప్పటికే ఎన్నో జేఏసీలున్నాయని..పవన్ జేఏసీ అవసరమా ? అని ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్ లో చాల విషయాలు ప్రస్తావించారని, కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని తెలిపారు. రైతుల గిట్టుబాటు ధర చట్టంగా రూపొందించాలని సీపీఎం మొదటి నుండి కోరుతోందని..బడ్జెట్ లో ఈ అంశం ప్రస్తావన తేలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని..రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని..ఈ సమస్య పరిష్కారం కావాలంటే గిట్టుబాటు ధర చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రంలో రైతులు పోరాటంలో భాగస్వాములు కావాలని..రాష్ట్ర విభజన ఎలాంటి నినాదాలు..ఎలాంటి హామీలిచ్చారో..వాటికి కేంద్ర బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని..సీపీఎం మొదటి నుండి చెబుతూ వచ్చిందని...విభజన జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆనాటి నుండి చెబుతూ వస్తున్నామని..విభజన చేస్తామని..మంచి జరుగుతుందని..స్పెషల్ స్టేటస్..రాయితీలు ఇస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. స్పెషల్ స్టేటస్ అవసరం లేదని..స్పెషల్ ప్యాకేజీ అంటూ మొదటి మోసం చేశారని తెలిపారు. ఎక్కువ సాధిస్తామని..ఎక్కువే సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని తెలిపారు.

రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ అని పేర్కొన్నారని..రూ. 3వేల కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇనుప ఖనిజం స్వతంత్రంగా ఇస్తామని చెప్పారని..రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని..కడపలో స్టీల్ ప్టాంట్ నిర్మాణం..కాకినాడ రీఫైనరీ ఏర్పాటు..ఇలా ఎన్నో చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమి చేయలేదన్నారు.

మొత్తంగా ఏపీలో రాజకీయ నాటకం..మోసపూరితమైన నాటకం ఆడుతున్నారని..వీరందరికీ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో టిడిపి పేరు ఎత్తలేదని..బిజెపి పేరు మాత్రమే ఎత్తుతున్నారని, బిజెపి..టిడిపి తోడుదొంగలని..గ్రహించాలని సూచించారు. వైసీపీ కూడా బిజెపి పార్టీ పేరును ఎత్తడం లేదని..చిత్తశుద్ధి ఉంటే పోరాటం చేయాలని సూచించారు.

పవన్ జేఏసీ అంటూ కొత్తది తెరపైకి తెచ్చారని..ఇప్పటికీ ఎన్నో జేఏసీలున్నాయన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోకుండా పరిశ్రమలకు అనుమతులిస్తున్నారని, పశ్చిమ..తూర్పు గోదావరిలో ఎక్కడా చూసిన నీళ్లే ఉంటాయని..కానీ డబ్బులు చెల్లించి నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఏడు మండలాలు మునిగిపోతాయని..నష్టపరిహారం ఇవ్వరా ? పేదలను ఆదుకోరా ? అంటూ ప్రశ్నించారు. పొలాలకు..ఉపాధి..నివాసాలకు నష్టపరిహారం ఇవ్వాలనే దానిపై మాట్లాడాలని..పోలవరం నిర్మాణం గురించి పదే పదే మాట్లాడడం సరికాదన్నారు.

ఏపీ రాష్ట్రంలో చదువు..వైద్యం పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చదువులో 30శాతం..వైద్యంలో 26వ స్థానంలో ఏపీ ఉందన్నారు. ఆరోగ్యం కూడా వ్యాపారమయంగా చేసేశారని తెలిపారు. దళిత హక్కులు..బలహీన వర్గాల హక్కులు..మైనార్టీ..గిరిజన హక్కులు..కోసం సీపీఎం పోరాటం చేస్తోందన్నారు.

అమెరికాలో ఇక్కడి నుండి వెళ్లిన వారిని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అవమానపరుస్తున్నారని పేర్కొంటున్నారని..కేంద్రం టిడిపిని అవమనపరచలేదా ? ఎందుకు మాట్లాడలేదన్నారు. కుల వ్యవస్థ ఉన్నంత కాలం సూపర్ పవర్ కాదని...సామాజిక న్యాయం ఉంటేనే అది పరిష్కారమౌతుందన్నారు. ఏపీలో కార్మికుల పరిస్థితి ఏంటీ ? అని ప్రశ్నించారు. టిడిపి..వైసిపి..బిజెపి ఏ పార్టీలకు ప్రత్యామ్నాయ విధానం లేదని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరించాలని రాఘవులు పిలుపునిచ్చారు. 

18:09 - February 10, 2018

పశ్చిమగోదావరి : రాబోయే రోజుల్లో ఏపీ రాష్ట్రంలో పెద్దమార్పు వస్తుందని..మరో ప్రత్యామ్నాయం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు...దోపిడి..దౌర్జన్యం లేని సమాజాన్ని సృష్టించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

నాలుగేళ్ల క్రితం తాము ఇలాంటివి జరుగుతాయని ఊహించడం జరిగిందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం..ఏపీలో టిడిపి ప్రభుత్వం ఉంటుందని..తామిద్దరం కలిసి అభివృద్ధి సాధిస్తామని ఆనాడు పేర్కొనడం జరిగిందని గుర్తు చేశార. కానీ ప్రస్తుతం అలాంటిది జరుగుతుందా ? అని ప్రశ్నించారు. ఈ అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తాలని టిడిపి తమకు సూచించడం జరుగుతోందని, కానీ కేంద్రంలో మిత్రపక్షం ఉంది కదా అని తాము తెలపడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు నాలుగేళ్లు గడిచిపోయాయని..ఇప్పటి వరకు ఏం జరగలేదని..జరగబోదని తేల్చిచెప్పారు. ప్రభుత్వాలు చేసిన వాగ్ధానాలపై వెనక్కి వెళ్లేందుకు పాలకులు మొగ్గు చూపుతున్నాయని, వాగ్ధానాలను ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రం..ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు బలపడితే ఇవన్నీ సాధ్యమని నొక్కి చెప్పారు. ప్రజలపై పడుతున్న భారాలు..దాడులు..ఇతరత్రా వాటిని ప్రారదోలాలంటే ఉద్యమాలే శరణ్యమని ఏచూరి తెలిపారు. 

కాంగ్రెస్ ఛలో పార్లమెంట్

గుంటూరు : రాహుల్ పిలునకు అందరు కలిసిరండి. మార్చి6,7,8 తేదీల్లో ఛలో పార్లమెంట్ నిర్వహిస్తామని ఏపీ పీసీసీ చీప్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 20-28 వరకు రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ల ముందు దీక్షకు దిగుతామని ఆయన ప్రకటించారు. 

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

జోహన్నెస్ బర్గ్ : దక్షిణాఫ్రికా, భారత్ క్రికెట్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. నాలుగో వన్డే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 

మార్చి 8న పార్లమెంట్ ముట్టడి - రఘువీరా...

విజయవాడ : మార్చి 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలోనే ఉండి తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. విభజన హామీలు..ఇతరత్రా దానిపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నామని, ఢిల్లీ వెళ్లి దీక్ష చేద్దామని తెపారు. అన్నారు. మార్చి 6, 7 తేదీల్లో ఢిల్లీలో దీక్ష...8వ తేదీన పార్లమెంట్ ను ముట్టడిస్తామని పేర్కొన్నారు. 

16:30 - February 10, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో సీపీఎం నేతలు..కార్యకర్తలు కదం తొక్కారు. 25వ రాష్ట్ర మహాసభల సందర్భంగా 20వేల మంది భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరుగనున్నాయి. ఈ ర్యాలీలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలు..కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభలో ప్రజా సమస్యలపై చర్చిస్తామని, పరిష్కారం కోసం తమ పోరాటాలు కొనసాగిస్తామని మధు తెలిపారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం...

మెదక్ : ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్‌ మండలం శివంపేట శివారులో చోటు చేసుకుంది. 50 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 

16:16 - February 10, 2018

విజయవాడ : రూ. 24 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించింది శూన్యమని, దీనిపై ఏపీ ప్రభుత్వం సరియైనే విధంగా స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వ ఎంపీలు స్పందిస్తున్నారు. పార్లమెంట్ లో సాక్షిగా ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నానితో టెన్ టివి మాట్లాడింది. విభజన హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 19 అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, అవి సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశార. పార్లమెంట్ లో తాము చేపట్టిన ఆందోళన ప్రారంభం మాత్రమేనని..దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని ఎంపీ కేశినేని స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:10 - February 10, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా..ఇటీవలే ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపిన కేంద్రంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాలపై ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వైసీపీ అధ్యక్షుడు జగన్ ట్విట్టర్ లో స్పందించారు. విభజన చేసిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించడం జరిగిందని గుర్తు చేవారు. పాలక..విపక్షాలు కలిసి మాటిచ్చాయని, హోదా అమలు అంశాన్ని ప్రణాళిక సంఘానికి కూడా పంపారని తెలిపారు. ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. కంటి తుడుపు చర్యలు ఆపాలని, ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ట్వీట్స్ పై ఏపీ ప్రజాప్రతినిధులు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. 

మూడు కుటుంబాలకు కుల బహిష్కరణ...

వరంగల్ : రూరల్ లోని గీసుకొండ మండలం మనుగొండలో దారుణం చోటు చేసుకుంది. మూడు కుటుంబాలను గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేశారు. మూడు కుటుంబాలకు వీఆర్ ఏ ఉద్యోగాలు వచ్చినందుకు పొలం..రూ. 10 లక్షలు ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ఆ కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పెద్దలు శిక్ష విధించారు. మూడు కుటుంబాలకు చెందిన సభ్యులుతో ఎవరూ మాట్లాడినా వారికి రూ. 500 జరిమాన..5 చెప్పు దెబ్బలు అంటూ తీర్పును వెలువరించారు. దీనితో బాధితులు గీసుకొండ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఆర్ బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లతో జైట్లీ భేటీ

ఢిల్లీ : ఆర్ బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లతో కేంద్రమంత్రి జైట్లీ భేటీ అయ్యారు. వారు 2018-19 బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలపై చర్చించారు. 

టిడిపి - బిజెపి మిత్రపక్షాలే - ఎంపీ హరిబాబు...

ఢిల్లీ : టిడిపి - బిజెపి మిత్రపక్షాలేనని, బిజెపితో ఉంటారో..పోతారో వాళ్ల ఇష్టమని బిజెపి ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ఉన్నంత వరకు భాగస్వాములేనని, సమస్యలుంటే చర్చించుకోవాలని సూచించారు. 

చంద్రబాబు నివాసం వద్ద రాలయసీమ లాయర్ల ఆందోళన

గూంటురు : అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద రాయలసీమ జిల్లాల న్యాయవాదులు ఆందోళనకు దిగారు. వారు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

పూండిలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు...

చెన్నై : తిరువళ్లూరు జిల్లా పూండి సమీపంలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడిపై దాడి ఘటనలో వీరు ప్రధాన నిందితులుగా తెలుస్తోంది. 

15:39 - February 10, 2018
15:38 - February 10, 2018

ఎర్రమంజిల్ ఆశ్రమ పాఠశాలలో దారుణం

హైదరాబాద్ : నగరంలోని ఎర్రమంజిల్ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. 40 మంది విద్యార్థులు ఎన్ జీవోకి తరలించేందుకు యత్నించారు. విద్యార్థులు వెళ్లడానికి నిరాకరించడంతో మెస్ నిలిపివేశారు. 

15:10 - February 10, 2018

హైదరాబాద్ : నగరంలో కార్పొరేటర్స్ ఉత్సవ విగ్రహాలుగా మారారని టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్లు వేసే వారు...ప్రజా సమస్యలు పట్టించుకోకుండా..మౌలిక వసతులు కల్పించడం లేదని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ చేసింది శూన్యమని, మంత్రి కేటీఆర్ గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. 

15:08 - February 10, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం సహాయం చేయడం లేదని...విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏ రాష్ట్రానికి చేయని సహాయం కేంద్రం చేసిందని బిజెపి పేర్కొంటోంది. ఇటీవలే ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని టిడిపి ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో పేర్కొటూ 27పేజీలతో కూడిన నివేదికను శనివారం బిజెపి ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా కంభంపాటితో టెన్ టివి మాట్లాడింది. తాను విడుదల చేసిన నివేదికలో ఏ అంశమైనా తప్పుంటే చెప్పాలని సూచించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని, రూపాయి నష్టం లేకుండా కేంద్రం చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకొంటుందని కంభంపాటి స్పష్టం చేశారు. 

హైకోర్టు న్యాయమూర్తికి విద్యార్థినిల లేఖ...

జగిత్యాల : పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తికి కోరుట్ల జిల్లా పరిషత్ పాఠశాల 9వ తరగతి విద్యార్థినిలు లేఖ రాశారు. 9వ తరగతి పాఠ్యాంశం ఆధారంగా ఈ లేఖ రాశారు. విద్యార్థినిల సమస్యలు..వసతులపై నివేదిక అందించాలని విద్యాశాఖకు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది. 

వెలగపూడిలో హైకోర్టు జడ్జీల బృందం...

విజయవాడ : వెలగపూడి సచివాలయాన్ని ఆరుగురు సభ్యుల హైకోర్టు జడ్జీల బృందం సందర్శించింది. నేలపాడు వద్ద నిర్మించబోయే శాశ్వత హైకోర్టు ప్రాంతాన్ని జడ్జీలకు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చూపించారు. 

14:56 - February 10, 2018
14:36 - February 10, 2018
14:34 - February 10, 2018

పశ్చిమగోదావరి : ఏపీలో బాబు పాలనపై సీపీఐ నేత రామకృష్ణ విరుచకపడ్డారు. బాబు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని తెలిపారు. భీమవరంలో జరుగుతున్న 25వ సీపీఎం రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చట్టసభలో కూమ్యనిస్టులు ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బాబు పాలన ఏకపక్షంగా సాగుతోందని, ఏ సమస్యపై కూడా అఖిలపక్షం వేయలేదని విమర్శించారు. కేంద్రం సహాయం చేయడం లేదని..ప్రత్యేక హోదా కావాలని ఒకవైపు చెబుతూనే రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 

14:32 - February 10, 2018

పశ్చిమగోదావరి : మోడీ పాలనలో మతోన్మాద దాడులు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. భీమరంలో జరుగుతున్న 25వ సీపీఎం రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడులు జరుగుతున్నాయని, అన్ని రంగాల్లో సంక్షోభం పెరిగిపోయిందన్నారు. ప్రజలు దోపిడికి గురవుతున్నారని తెలిపారు. మూడు సంవత్సరాలు..నాలుగు సంవత్సరాల్లో అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాసోహం అయ్యిందని విమర్శించారు. 

14:30 - February 10, 2018
14:28 - February 10, 2018

హైదరాబాద్ : కేజీబీపీ, యూఆర్ఎస్ ఉద్యోగులు కదం తొక్కారు. డీఎస్సీ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. వారు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఉద్యోగుల భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భధ్రత..పనికి తగిన వేతనం కల్పించాలని కోరారు. సొంత రాష్ట్రంలో తమ డిమాండ్లు నెరవేర్చడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాక పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

వీరు చేస్తున్న పోరాటానికి ప్రొ.నాగేశ్వర్ మద్దతు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తోందని, వారు చేస్తున్న పని వెట్టిచాకిరీతో సమానమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:24 - February 10, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు నిరసన తెగ తగిలింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఆందోళన కారులు అడ్డుకున్నారు. జిల్లాకు శనివారం కొప్పుల ఈశ్వర్ వచ్చారు. ఈ జిల్లాలోని జరుగుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారస్తులు..ఇతరులు పేర్కొంటున్నారు. కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందించారు. 

బాబుపై జగన్ ఫైర్..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ పలు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. విభజించే సమయంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ హామీలు ఇచ్చాయని తెలిపారు. 

14:16 - February 10, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం సహాయం చేయడం లేదని...విభజన హామీలు అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఏపీ టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏపీకి ఎంత సహాయం చేశామో పేర్కొంటూ బిజెపి అధ్యక్షుడు కంభంపాటి 27 పేజీల నోట్ ను విడుదల చేశారు. అందులో ఎలాంటి సహాయం చేశామో...ఎంత నిధులు విడుదల చేశామో పేర్కొన్నారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని..ఇప్పటికే రూ. 4వేల కోట్లు కేటాయించారని తెలిపారు. పోలవరం ఏడు ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కమిటీ వేశారని, త్వరలో ఈ సమస్య తీరుతుందన్నారు. దుగ్గరాజు పట్నం పోర్టు ఏర్పాటుకు ఇస్రో వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ. లక్ష కోట్లు కేటాయించిందని తెలిపారు. 

13:28 - February 10, 2018

ప.గో : దేశానికి ప్రత్యామ్నాయం అవసరమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఆధారంగా ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలను ఆకర్షించాలన్నారు. పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకోవాలని, వామపక్షాల ఐక్యతను పెంపొందించాలని తెలిపారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభల్లో ప్రారంభ ఉపన్యాసం చేశారు. దేశానికి నాయకులు కాదు...విధానాలు కావాలన్నారు. వామపక్ష ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయాలన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నిర్మాణాన్ని బలపర్చుకోవడం అనివార్యమన్నారు. మనది విప్లవకర, రెవెల్యూషనరీ, మాస్ లైన్ పార్టీ అని అన్నారు. మాస్ లైన్ ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. నీళ్లల్లో చేప వెళ్లినట్లు ప్రజల్లో కూడా కమ్యూనిస్టులు వెళ్లాలని తెలిపారు. ప్రజా ఉద్యమాలను బలపర్చాలన్నారు. స్వతంత్ర శక్తి, వామపక్ష ఐక్యత, ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించాలన్నారు. మతతత్వ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీలో వామపక్షాలు బలపడేందుకు పెద్ద ఎత్తున అవకాశాలు పెరిగాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఆర్థిక విధానాలు ఒకటేనని తెలిపారు. బీజేపీ కేరళను టార్గెట్ చేసి ఎల్ డీఎఫ్ ను బలహీనపర్చడం ధ్యేయంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. సీపీఎంకు సిద్ధాంతం ఉంది.. ప్రత్యామ్నాయ విధానాలలతో ముందుకు వెళ్తుంది కనుక అందుకే మన పార్టీని మెయిన్ టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. భారత్ మాతాకీ జై అంటూ, దేశభక్తి గురించి చెప్పే బీజేపీ త్రిపురలో దేశ ఐక్యతకు వ్యతిరేకమైన సంస్థతో పొత్తు పెట్టుకుందన్నారు. కేరళలో హింస, హత్యలు మొదలుపెట్టింది బీజీపీయే.. కానీ సీపీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ఐదు సం.రాల్లో ప.బెంగాల్ లో 175 మంది సీపీఎం కార్యకర్తలను హత మార్చారని తెలిపారు. ఉత్తర కేరళలో ఆర్ ఎస్ ఎస్ ఘర్షణలకు పాల్పడుతుందన్నారు. పెద్ద ఎత్తున ముస్లింలు ఉన్నచోట్ల రాజకీయ ఘర్షణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ హింస లేకుండా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లకు సామాజిక ఆధారం లేదన్నారు. బీజేపీకి ఉన్న 280 ఎంపీల్లో 112 మంది
కాంగ్రెస్, మిగత పార్టీల నుంచి వెళ్లిన వారేనని తెలిపారు. తాము ఏపీ ప్రజలకు మద్దతుగా ఉంటామని చెప్పారు. గతంలో తాము ఏపీకి ప్రత్యేహోదా 5 ఏళ్లు ఉండాలని కోరామని...కానీ ఏపీకి 10 సం.రాలు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. నాలుగు సం.రాలు గడిచినా ఏపీకి ఏమీ ఇవ్వలేదన్నారు. కేంద్రం ఏపీ ప్రజలకు చేసిన వాగ్దానాలకు ద్రోహం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

 

కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

శ్రీనగర్ : కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సున్ జ్వాన్ ఆర్మీ క్యాంపు పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల్లో కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులు సమీపంలోని క్వార్టర్స్ లో దాగి ఉంటారని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బీజేపీ, కాంగ్రెస్ ఆర్థిక విధానాలు ఒకటే : ఏచూరి

ప.గో : బీజేపీ, కాంగ్రెస్ ఆర్థిక విధానాలు ఒకటేనని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కేరళను టార్గెట్ చేసి ఎల్ డీఎఫ్ ను బలహీనపర్చడం ధ్యేయంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 

11:26 - February 10, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం మనుబోతుల చెరువు కాలనీ దారుణం జరిగింది. మతిస్థిమితం లేని యువతిపై వీసంపల్లి రాంబాబు అనే కారు డ్రైవర్ 4 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. యువతి గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దారుణానికి ఒడిగట్టిన రాంబాబుకి దేహశుద్ధి చేసిన కాలనీ వాసులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

 

భీమవరంలో సీపీఎం మహాసభలు

పశ్చిమగోదావరి : జిల్లా సీపీఎం మహాసభలకు తెలంగాణ సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి వీరభంద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరైయ్యారు. 

11:23 - February 10, 2018

విశాఖ : ఆశీలమెట్టలో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాశారు. ఈ ప్రమాదంలో విద్యార్థుల సర్టిఫికెట్లు, పుస్తకాలు దగ్ధం కావడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలోపడ్డారు. 

 

11:15 - February 10, 2018

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సున్‌జ్వాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులను భద్రతా బలగాలు గుర్తించాయి. భద్రతా బలగాల కాల్పులతో ఉగ్రవాదులు పారిపోయారు. అయితే... సమీపంలోని క్వార్టర్స్‌లో ఉగ్రవాదులు దాగి ఉంటారని అనుమానిస్తున్నారు. భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టారు. ఫిబ్రవరి 9న అఫ్జల్‌గురికు ఉరిశిక్ష వేసిన రోజు కాబట్టి ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. 2006లో ఇదే క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ప్రారంభమైన సీపీఎం మహాసభలు

పశ్చిమగోదావరి : భీమవరంలో సీపీఎం 25వ మహాసభలు ప్రారంభమైయ్యాయి. పార్టీ సీనియర్ నేత రుద్రరాజు సత్యనారాయణ పతాకావిష్కరణ చేశారు. సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి అమరవీరులకు నివాళులర్పించి సభను ప్రారంభించారు. 

11:09 - February 10, 2018

పశ్చిమగోదావరి : నేటి నుంచి భీమవరంలో సీపీఎం ఏపీ 25వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ మహాసభల్లో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు మహాసభలను సీతారాం ఏచూరి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భీమవరంలో 20 వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం లూథరస్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరగనుంది. 

మ్యాన్ హోల్ లో పడిపోయిన వాహనదారుడు

హైదరాబాద్ : సచివాలయం వద్ద ఓ వాహనదారుడు మ్యాన్ హోల్ లో పడిపోయాడు. రోడ్డు మధ్యలో ఓపెన్ చేసి ఉన్న మ్యాన్ హోల్ కు ఎలాంటి రక్షణ రక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని కాపాడారు. 

ఎంపీ కవితకు పవన్ కల్యాణ్ ట్వీట్

హైదరాబాద్ : ఎంపీ కవితకు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కవితకు పవన్ ట్వీట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు. విభజన హామీలపై మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు అని పవన్ ట్వీట్ చేశారు. 

10:49 - February 10, 2018

పశ్చిమగోదావరి : నేటినుంచి భీమవరంలో సీపీఎం ఏపీ 25వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ మహాసభల్లో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు మహాసభలను సీతారాం ఏచూరి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భీమవరంలో 20 వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం లూథరస్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత వి.శ్రీనివాస్ రావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై రాబోయేకాలంలో సమరశీల చేస్తామని చెప్పారు. పోరాటాలు, ఉద్యమాలతో మాత్రమే సమస్యలు పరిష్కారం కావావని...ప్రత్యామ్నాయం రాజకీయ వేదిక ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు. ఏపీలో వామపక్షాల ఆధ్వర్యంలో తలపెగ్టిన రాష్ట్ర బంద్ విజయవంతం అయిందనన్నారు. ప్రజలు అపూర్వంగా స్వాగతించారని తెలిపారు. 'ప్రత్యేకోహోదా ఆంధ్రుల హక్కు' అనే ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. 

 

డబుల్ బెడ్ రూంలకు కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ : సికింద్రాబాద్ సిక్ విలేజ్ మడ్ ఫోర్డ్ లో 260 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న, ఎంపీ మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి హాజరైయ్యారు. 

పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

మేడ్చల్ : జిల్లాలోని మేడిపల్లి పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్‌ ఉదయం 4 గంటల నుంచి ఇందిరానగర్, రాజీవ్‌నగర్, అంబేడ్కర్ నగర్, దేవేందర్‌నగర్‌ కాలనీల్లో తనిఖీలు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పోలీసుల డ్రంకన్ డ్రైవ్

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనం నడుపుతున్న  85 మందిపై కేసులు నమోదు చేశారు. 42 కార్లు, 43 బైక్‌లు సీజ్‌ చేశారు. డ్రంకన్ డ్రైవ్‌లో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. వీడియో తీస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మద్యం సేవించి వాహనం నడుపుతున్న మరో యువతి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని... కారు సీజ్‌ చేశారు. 

 

10:40 - February 10, 2018

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనం నడుపుతున్న  85 మందిపై కేసులు నమోదు చేశారు. 42 కార్లు, 43 బైక్‌లు సీజ్‌ చేశారు. డ్రంకన్ డ్రైవ్‌లో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. వీడియో తీస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మద్యం సేవించి వాహనం నడుపుతున్న మరో యువతి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని... కారు సీజ్‌ చేశారు. 

పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

మేడ్చల్ : జిల్లాలోని మేడిపల్లి పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్‌ ఉదయం 4 గంటల నుంచి ఇందిరానగర్, రాజీవ్‌నగర్, అంబేడ్కర్ నగర్, దేవేందర్‌నగర్‌ కాలనీల్లో తనిఖీలు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

10:27 - February 10, 2018

మేడ్చల్ : జిల్లాలోని మేడిపల్లి పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్‌ ఉదయం 4 గంటల నుంచి ఇందిరానగర్, రాజీవ్‌నగర్, అంబేడ్కర్ నగర్, దేవేందర్‌నగర్‌ కాలనీల్లో తనిఖీలు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

 

09:44 - February 10, 2018

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత పట్టాభీరామ్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన హామీ ఇవ్వాలని తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..   

 

09:29 - February 10, 2018
08:49 - February 10, 2018

ఢిల్లీ : విరాట్‌ కొహ్లీ అండ్‌ కో సౌతాఫ్రికా గడ్డపై సంచలనం సృష్టించడానికి సన్నద్ధమైంది. సఫారీ ల్యాండ్‌లో తొలి వన్డే సిరీస్‌ విజయానికి టీమిండియా తహతహలాడుతోంది. తొలి 3 వన్డేల్లో తిరుగులేని టీమిండియా ఇవాళ జరిగే 4వ వన్డేలోనూ నెగ్గి.. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

దక్షిణాఫ్రికాలో భారత జట్టు చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. జోహన్నెస్‌బర్గ్‌లో భారత్..సౌతాఫ్రికా 4వ వన్డేకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. తొలి 3 వన్డేల్లో తిరుగులేని టీమిండియా 4వ వన్డేతోనే సిరీస్‌ నెగ్గాలని  పట్టుదలతో ఉంది. డర్బన్‌, వాండరర్స్‌, కేప్‌టౌన్‌ వన్డేల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ ఆతిధ్య సౌతాఫ్రికా జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. 6 మ్యాచ్‌ల సిరీస్‌లో 3..0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌....సౌతాఫ్రికాలో తొలి వన్డే సిరీస్‌ విజయం సాధించి చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో విరాట్‌ కొహ్లీ, శిఖర్ ధావన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు స్పిన్‌ ట్విన్స్‌ యజ్వేంద్ర చహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో ఇప్పటివరకూ వన్డే సిరీస్‌లో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది. 

ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా డామినేట్‌ చేస్తోన్నా...వన్డే ఓవరాల్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 80 వన్డేల్లో పోటీ పడగా...భారత్‌ 32 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 45 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ పవర్‌తో అన్ని విభాగాల్లో ఆతిధ్య దక్షిణాఫ్రికా కంటే పటిష్టంగా ఉన్న టీమిండియాకే 4వ వన్డేలోనూ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. 

08:12 - February 10, 2018

కృష్ణా : విజయవాడలో గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు దివ్యబలిపూజ అనంతరం ఆలయ నిర్వాహకులు ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజే ఉత్సవాలకు క్రైస్తవులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుణదల చర్చ్‌ బిషప్‌ జోసఫ్‌ రాజారావు తెలిపారు.

 

08:09 - February 10, 2018

కర్నూలు : గుప్త నిధులంటూ కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలతో... చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల కోసం అధికారులు చేపట్టిన తవ్వకాలలో నిధుల మాటేమోగాని కోటంతా గుంతలమయం అయింది. దీంతో భవిష్యత్‌ తరాలకు చరిత్ర తెలియకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

 

08:08 - February 10, 2018

ప్రకాశం : సమస్యలు పరిష్కరించాలంటూ ఒంగోలులో ఆశావర్కర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించారు. 6వేల రూపాయల కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్ల ఆందోళనపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

08:05 - February 10, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని.. పార్లమెంట్‌లో గొడవ చేయడం సరికాదంటున్నారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. కేంద్రం నుంచి నిధులు కావాలని కోరే ముందు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలంటున్నారు. ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో చంద్రబాబు ప్రభుత్వం  శ్వేతపత్రం విడుదల చేయాలంటున్న ఎంపీ కొత్తపల్లి గీతతో టెన్ టివి ఫేస్‌టూఫేస్‌ నిర్వహించింది. తాను బీజేపీకి అనుకూలం కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంటులో గొడవ సృష్టించలేదని స్పష్టం చేశారు. 

08:00 - February 10, 2018

విజయవాడ : కేంద్రప్రభుత్వంపై ప్రత్యేక హోదా సాధన సమితి నిరసన గళం వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని  నేతలు ప్రకటించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్, ముప్పాళ్ళ నాగేశ్వరరావుతో పాటు పలు రాజకీయపార్టీల నేతల, ప్రముఖులు పాల్గొన్నారు. విభజన హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తే... బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనని హెచ్చరించారు. 

07:56 - February 10, 2018

ఢిల్లీ : తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌పై సీఎల్పీనేత జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌పైన, రాహుల్‌గాంధీపైనా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేటీఆర్‌వి సంస్కారహీనమైన వ్యాఖ్యలని ధ్వజమెత్తారు. అధికార అహంకారంతో మాట్టాడుతున్నారని దుయ్యబట్టారు. తాను కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలనని.. కానీ అందుకు  తనకు సంస్కారం అడ్డొస్తుందన్నారు.  కాంగ్రెస్‌ లోఫర్‌ పార్టీ అయితే... టీఆర్‌ఎస్‌ బ్రోకర్ల పార్టీనా అని ప్రశ్నించారు.

 

07:54 - February 10, 2018

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు విరామం ప్రకటించారు. మొదటిదశ బడ్జెట్‌ భేటీ పూర్తైంది. ఉభయ సభలు వచ్చే నెల 5 వతేదీకి వాయిదా పడ్డాయి. పార్లమెంటురీ స్థాయీ సంఘాలు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా లోక్‌సభ, రాజ్యసభలకు మార్చి 4 వ తేదీ వరకు విరామం ప్రకటించారు. 
ఎన్డీయే విధానాలను ప్రస్తావించిన రాష్ట్రపతి 
గత  నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రంసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగించినా...భారత జీడీపీ వృద్ధి దిశలో కొనసాగుతోందని చెప్పారు. విదేశీమారక ద్రవ్య నిల్వలు 410 బిలియన్‌ డార్లకు చేరుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ఘన కార్యాలను ఉదహరించారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టామని చెప్పిన రాష్ట్రపతి,  జీఎస్‌టీ  అమలు ఆర్థిక సంస్కరణ పథంలో ముందడుగన్న విషయాన్ని ప్రస్తావించారు.  రాష్ట్రపతి ప్రసంగం రోజే  2018-19 ఆర్థిక సర్వేని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏడు నుంచి ఏడున్నర శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. 
రూ.24 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ పద్దులు 
ఆ తర్వాత ఈనెల 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 వార్షిక బడ్జెట్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మొత్తం 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారీ  పద్దులతో సమర్పించిన బడ్జెట్‌లో రైల్వేలకు 1.48 లక్షల కోట్లు కేటాయించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు, రాజ్యసభలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేశారు. ఐదు రోజుల పాటు నిరసన తెలిపారు. ఏపీ ఎంపీల నిరసన మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీ పునర్విభజన బిల్లును  ఆమోదించిన అప్పటి యూపీఏ తీరును  మోదీ ఎండగట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ఏపీ ఎంపీలు... బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ ఎంపీల నిరసనల మధ్య పార్లమెంటు మొదటి దశ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి.

 

అరబ్ దేశాల్లో కొనసాగుతోన్న ప్రధాని మోడీ పర్యటన

అమ్మాన్ : అరబ్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. మోడీ నేడు పాలస్తీనాకు వెళ్లనున్నారు. వాణిజ్య సంబంధాల పటిష్టమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. 

సన్ జ్వాన్ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి

జమ్మూకాశ్మీర్ : సన్ జ్వాన్ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జవాన్, పౌరుడికి గాయాలు అయ్యాయి. 

 

మద్యం మత్తులో యువకుడి హల్ చల్

హైదరాబాద్ : నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో ఓ యువకుడి హల్ చల్ చేశాడు. యువకుడు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 20 కార్లు, 25 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. 

07:28 - February 10, 2018

ఢిల్లీ : పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. రెవెన్యూలోటు భర్తీ, విశాఖ రైల్వే జోన్‌ సహా విభజన చట్టంలోని హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయడానికి ముందుకొచ్చింది. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 
హామీల అమలుకు ముందుకొచ్చిన కేంద్రం 
పార్లమెంటు ఉభయ సభల్లో ఐదురోజుల పాటు ఏపీ ఎంపీలు చేసిన పోరాటం కొంతవరకు ఫలించింది. విభజన చట్టంలోని హామీలన్నింటీని అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పదించిన బీజీపీ అధ్యక్షుడు అమిత్‌ షా.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రైల్వే మంత్రి పియూష్‌  గోయల్‌, ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజనచట్టంలోని హామీలు కోసం ఎంపీలు చేస్తున్న ఆందోళనపై రెండున్నర గంటపాటు చర్చించారు. రాష్ట్రానికి వ్వాల్సిన నిధులు, సంస్థలు, రైల్వే జోన్‌ ప్రకటన, దుగరాజపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల అమలుపై ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. పార్లమెంటు నిబంధనల ప్రకారం పలు మంత్రిత్వ శాఖల అంశాల ప్రస్తావన చేయకూడదన్న విషయాన్ని అరుణ్‌ జైట్లీ ప్రస్తావించారు. వచ్చే నెల 5 నుంచి పార్లమెంటు రెండవ దశ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా అన్ని ప్రకటనలు పూర్తి చేసి కార్యారణకు వెళ్లాలని నిర్ణయించారు. 
రెవెన్యూ లోటు భర్తీకి ఒప్పుకున్న కేంద్రం  
రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 10 నెలల కాలానికి ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఒప్పుకున్నారు. దీంతోపాటు మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఇచ్చేందుకు అంగీకరించింది. ఇవి త్వరలోనే ఏపీకి అందే అవకాశం ఉందని  భావిస్తున్నారు. ఇకపై ప్రతిఏటా ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సూత్రప్రాయంగా ఒప్పుకుంది.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ..!
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ఏ నిమిషంలో నైనా రైల్వే జోన్‌ ప్రకటించాలని అరుణ్‌ జైట్లీ ... రైల్వే మంత్రిని ఆదేశించడంతో పియూష్‌ గోయల్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు.   అలాగే ఇంకా ప్రకటించాల్సిన సంస్థలతోపాటు ఇప్పటికే మంజూరు చేసిన సంస్థలకు నిధులు విడుదలకు కేంద్రం ఒప్పుకుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన ఖర్చుల వివారాలపై నివేదిక ఇస్తే,  నిధుల విడుదలకు అంగీకరించింది. ప్రత్యేక  హోదాతో వచ్చే నిధులను ఒకేసారి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఈఏపీ నిధుల సర్దుబాటుకు కేంద్రం సిద్ధమైంది. అలాగే దుగరాజపట్నం పోర్టు విషయంలో ఇస్రో నుంచి  అభ్యంతరాలు  ఉన్న విషయంపై చర్చించారు. దుగరాజపట్నంకు బదులు మరో ప్రాంతంలో ఓడరేవును రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదిస్తే కేంద్రం ఆమోదిస్తుందని మంత్రులు చెప్పారు. కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించే అంశాన్నిసూత్రప్రాయంగా అంగీకరించారు. దీనిపై అధ్యయనం చేస్తున్న మెకాన్‌ సంస్థ ఈనెల 12న నివేదిక ఇస్తుందని అరుణ్‌ జైట్లీ సుజనాచౌదరి దృష్టికి తెచ్చారు.  పెట్రో రసాయనాల సముదాయం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అరుణ్‌జైట్లీ గుర్తు చేశారు. ఈ అంశాలపై కేంద్ర  ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. మూడున్నరేళ్లుగా చేస్తున్న ఉత్తుత్తి ప్రకటనలతో విసిగిపోయిన ప్రజలు నిర్దిష్ట కార్యాచరణను ప్రకటించిన అమలు చేస్తేనే కేంద్రాన్ని నమ్ముతారు. 

07:22 - February 10, 2018

ఢిల్లీ : పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. రెవెన్యూలోటు భర్తీ, విశాఖ రైల్వే జోన్‌ సహా విభజన చట్టంలోని హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయడానికి ముందుకొచ్చింది. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌, రాష్ట్రానికి ఏపీకి చెందిన కేమ్ర మంత్రి సుజనాచౌదరి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

నేటి నుంచి సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు

ప.గో : నేటి నుంచి మూడు రోజులపాటు భీమవరంలో సీపీఎం రాష్ట్ర 25 వ మహాసభలు జరుగనున్నాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ.రాఘవులు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. 

నేడు భారత్, దక్షిణాఫ్రికా నాల్గో వన్డే మ్యాచ్

జోహెన్స్ బర్గ్ : నేడు భారత్, దక్షిణాఫ్రికా నాల్గో వన్డే మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు ఆర్బీఐ, సెబీ బోర్డులతో అరుణ్ జైట్లీ సమావేశం

ఢిల్లీ : నేడు ఆర్బీఐ, సెబీ బోర్డులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం కానున్నారు. బడ్జెట్ లో ప్రతిపాదించిన ఆర్థిక సంస్కరణల గురించి జైట్లీ వివరించనున్నారు. 

 

Don't Miss