Activities calendar

11 February 2018

20:58 - February 11, 2018

రష్యా : ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏఎన్‌-148 విమానం మాస్కో శివార్లలోని అర్గునోవో సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 65 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. మాస్కోలోని డెమోడెడోవో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓర్‌స్క్‌కు బయలుదేరి కొద్దిసేపటికే రాడార్‌ స్క్రీన్‌తో సంబంధాలు కోల్పోయింది. 

20:54 - February 11, 2018

విజయవాడ : ఖచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు.. అన్నీ ఇచ్చామని కేంద్రం అంటుంటే.. అరకొరగానే ఇచ్చారంటోంది ఏపీ ప్రభుత్వం. విభజన హామీల అమల్లో డొల్లతనం ప్రజలకు తెలియాలన్నారు... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లోని జనసేనపార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో భేటీ సందర్భంగా పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ -బీజేపీ పొత్తువల్ల ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరుగుతుందని భావించానన్న పవన్‌.. ఇదే ఆశతో 2014లో వారికి మద్దతు ఇచ్చానన్నారు. కాని..నాలుగేళ్లు గడిచినా.. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన చొరవ చూపలేదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సమస్యలుంటాయని ప్రతిచిన్న విషయానికి గొడవ చేసి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకనే నాలుగేళ్లుపాటు వేచి చూశానన్నారు జనసేన అధినేత. కాని.. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం తనకు బాధకలిగించిందన్నారు. ఇప్పటికే చాలా ఇచ్చామని కేంద్రం అంటుంటే.. అరకొరగానే సాయం అందుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.. దీంతో సమస్య మరింత గందరోగళంగా తయారైందన్నారు. నిధుల కేటాయింపుపై కేంద్రం, రాష్ట్రాల్లో ఎవరో ఒకరు అబద్ధం ఆడుతున్నారని.. దానికి క్లియర్‌గా ప్రజల ముందు ఉంచేందుకే తాను నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు జనసేన అధినేత స్పష్టం చేశారు.

ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పవన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. తాను గతంలో పోలవరంపై శ్వేతపత్రం కోసం ప్రశ్నిస్తే వెబ్‌సైట్‌లో చూసుకోవాలనే నిర్లక్ష్య సమాధానమే వచ్చిందన్నారు. కాని.. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలేవీ తమకు కనపడలేదన్నారు. బీజేపీ -టీడీపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో అసలు విషయం పక్కదారి పడుతోందన్నారు. రెండుపార్టీలకు తాను గతంలో మద్దతు తెలపిన కారణంగా ప్రజల తరపున ప్రశ్నించే బాధ్యత తనపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని భావించే నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు పవన్‌ కళ్యాణ్. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో కమిటీ అన్ని విషయాలను పరిశీలించి నిష్పాక్షింగా నివేదిక అందిస్తుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఈనెల 15తేదీలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని వాస్తవాలు తేల్చేపనిలో కమిటీ ఉంటుందని పవన్‌ తెలిపారు.

తాను ప్రస్తుతం యాక్టివ్‌ పాలిటిక్స్‌లో లేకున్నా.. పవన్‌ కల్యాణ్‌ ఆహ్వానం మేరకు నిజనిర్దారణ కమిటీకి తాను ఒప్పుకున్నాన్నారు సీనియర్‌ పొలిటీషియన్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఇంతకాలం ప్రజల తరపున ప్రశ్నిస్తా అంటున్న పవన్‌.. నిజనిర్ణారణ కమిటీ ఏర్పాటుతో అసలైన రాజకీయనేతగా మారారని ఉండవల్లి అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి జనసేన అధినేత తీసుకున్న చొరవపై సర్వత్రా అభినందలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. నిజనిర్దారణ కమిటీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన సమాచారం దొరుకుతుందా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. 

20:43 - February 11, 2018

ప్రొ.కోదండరాం...తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు. టీజేఏసీగా ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో గులాబీ దళం ఎదురుదాడికి దిగుతోంది. ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...కోదండరాం మధ్య రహస్య ఒప్పందం జరిగిందా ? అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..ఇతరత్రా వాటిపై టెన్ టివి 'వన్ టు వన్' కోదండరాంతో ముచ్చటించింది. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

బ్యాంకు ఏటీఎం దగ్ధం...

హైదరాబాద్ : కూకట్ పల్లి కేపీహెచ్ బి కాలనీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎంను ఆగంతకుడు తగులబెట్టాడు. 17 పేజీల నోట్ ను వదిలిపెట్టి వెళ్లాడు. ప్రపంచంలో మానవ సమస్యలపై సలహాలు..సూచనలతో నోట్ ఉన్నట్లు తెలుస్తోంది. 

20:04 - February 11, 2018
19:32 - February 11, 2018
19:30 - February 11, 2018

గుంటూరు : అయేషా మీరా హత్య కేసును సిట్ పునర్ విచారిస్తోంది. అందులో భాగంగా సిట్ అధికారులు తెనాలికి వెళ్లారు. అక్కడ నివాసం ఉంటున్న అయేషా మీరా తల్లిదండ్రులను డీఐజీ శ్రీకాంత్ బృందం కలిసింది. సుమారు మూడు గంటల పాటు సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. అనంతరం ఆయేషా మీరా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కూతురి హత్యపై తొలి నుండి జరిగిన విషయాలన్నీ సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారని, హాస్టల్ వార్డెన్ ను విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని అధికారులకు తెలియచేసినట్లు అయేషా తల్లి తెలిపారు. గతంలోలాగా అమాయకుడిని బలి చేయొద్దని వేడుకున్నట్లు, అధికారులకు నిబద్ధత ఉంటే తమకు న్యాయం చేస్తారన్నారు. గతంలో ఈ కేసులో సత్యంబాబుపై కేసు నమోదు చేయగా ఆయనపై వచ్చిన ఆరోపణలను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

19:20 - February 11, 2018

నల్గొండ : టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం రోడ్డు ప్రమాదంలో నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణీస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చేసుకుంది. ఆదివారం నల్గొండ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రొ.కోదండరాం సాయంత్రం హైదరాబాద్ కు బయలుదేరారు. చిట్యాల వద్ద బైక్ ను తప్పించబోయి డివైడర్ ను కోదండరాం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం నుండి ప్రొ.కోదండరాం, అనుచరులు క్షేమంగా బయటపడ్డారు. 

19:00 - February 11, 2018

హాంకాంగ్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్‌ డెక్కర్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు రేస్‌ కోర్స్‌ను తిలకించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు... థాయ్‌ పో నుంచి షాటిన్‌ రేస్‌కోర్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ బస్సును అతివేగంగా నపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. బోల్తా పడిన తర్వాత పక్కనే ఉన్న బస్‌ స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. సహాయ సిబ్బంది బస్సు టాప్‌ కట్‌చేసి బోల్తా పడ్డ బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. 

18:59 - February 11, 2018

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు తిరిగి వచ్చిన పాత నోట్ల లెక్కలు ఇంకా తేలలేదు. పెద్ద నోట్లు రద్దైన 15 నెలల తర్వాత కూడా వీటి లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచార హక్కు చట్టం కింది ఓ పిటిషనర్‌కు ఆర్‌బీఐ సమాధానం ఇచ్చింది. ఎప్పటిలోగా లెక్కింపు పూర్తి అవుతుందన్న పిటిషనర్‌ ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం ఇవ్వలేదు. మొత్తం 59 సీవీపీఎస్‌ యంత్రాలతో లెక్కింపు కొనసాగుతున్నట్టు సమాచారం ఇచ్చింది. గత ఏడాది జూన్‌ 30 నాటికి 15.28 లక్షల కోట్ల రూపాయల రద్దయిన నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నోట్లు రద్దు నాటికి 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 

18:57 - February 11, 2018

తమిళనాడు : మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చెన్నైలో వుమెన్‌ వాక్ నిర్వహించారు. మహిళలపై గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వాక్‌ ఫర్‌ మైల్‌గా సాగిన ఈ కార్యక్రమంలో నటులు శరత్‌ కుమార్, హీరో సిద్ధార్థ్‌, బిందుమాధవితో పాటు 500 మంది యువతులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును బాధిత మహిళలకు ఇవ్వనున్నట్లు నటి వరలక్ష్మి తెలిపారు. 

18:56 - February 11, 2018

ఢిల్లీ : దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్ - యూఏఈ మధ్య ఎప్పట్నుంచో మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు, ఇండియా నుంచి వచ్చిన సుమారు 30 లక్షల మందికి స్వంత దేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.

కోదండరాం సురక్షితం..

హైదరాబాద్ : ప్రొ.కోదండరాంకు ప్రమాదం తప్పింది. నల్గొండ నుండి హైదరాబాద్ కు వాహనంలో కోదండరాం వస్తున్నారు. చిట్యాల వద్ద ఓ కారును కోదండరాం ప్రయాణిస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం నుండి ప్రొ.కోదండరాం, అనుచరులు క్షేమంగా బయటపడ్డారు. 

18:47 - February 11, 2018

పవన్ కమిటీలో చాలా పెద్ద పేర్లు - ఉండవల్లి...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత ఏర్పాటు చేసిన కమిటీలో చాలా పెద్దవారి పేర్లు ఉన్నాయని రాజకీయ వేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి పేర్కొన్నారు. లక్ష కోట్లు ఇచ్చామని కేంద్రం పేర్కొంటుంటే..లక్ష కోట్లు మంజూరయితే చేతుల్లోకి వచ్చిందా ? ఎక్కడ ఇచ్చారు ? అని రాష్ట్రం అటోందన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆనాడే తాను కోరడం జరిగిందని..పవన్ చెబితే ప్రభుత్వం ఇస్తుందని భావించినట్లు తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం పంపించలేదన్నారు. 

ప్రభుత్వాలు అబద్దాలు ఆడవు..నిజం చెప్పవు - ఉండవల్లి....

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ వేత్త ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. ఆదివారం జనసేన కార్యాలయానికి వచ్చిన ఆయన పవన్ తో భేటీ అయ్యారు. విభజన హామీలు..జేఏసీ ఏర్పాటుపై వారివురూ వివరంగా చర్చించారు. అనంతరం ఉండవల్లి..పవన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు ఎప్పుడూ అబద్దాలు ఆడవని..కానీ నిజం మాత్రం చెప్పరని ఉండవల్లి పేర్కొన్నారు.

రైస్ మిల్లులపై ఎస్ వోటి పోలీసుల దాడులు...

హైదరాబాద్ : రైస్ మిల్లులపై ఎస్ వోటీ పోలీసులు దాడులు జరిపారు. బండ్లగూడలోని ఓ రైస్ మిల్లులో 50 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం రేషన్ బియ్యమని తెలుస్తోంది. 

జనసేన కార్యాలయంలో ఉండవల్లి...

హైదరాబాద్ : జనసేన పార్టీ కార్యాలయానికి రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లికి పవన్ సాదర స్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

 

టెన్ టివి కథనాలపై స్పందన...

పశ్చిమగోదావరి : టెన్ టివి ప్రసారమైన వరుస కథనాలతో కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇటీవలే పామాయిల్ కంపెనీ కాలుష్యంపై కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం కంపెనీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చింతలపూడి (మం) సీతానగరంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు..మందులను పంపిణీ చేసింది. 

భిక్షమెత్తుకోవడం లేదన్న గల్లా...

గుంటూరు : అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకి నిధులు ఇచ్చారే కాని ..విభజన చట్టంలోని హామీల ప్రకారం కేటాయింపులు జరగలేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. ఏపీ కేంద్రం ముందు భిక్షమెత్తుకోవడం లేదని.. రాష్ట్రానికి రావాల్సిన హక్కునే డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

వైసీపీ రాజకీయాలు చేస్తోంది - రామ్మోహన్ నాయుడు..

గుంటూరు : రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తాము గళం విప్పుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ టీఆర్‌ఎస్‌, టీఎంసీ లాంటి పార్టీలుకూడా డిమాండ్‌ చేస్తుంటే.. వైసీపీ నేతలు ఢిల్లీలో ప్రధాని కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన విమర్శించారు.

 

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న కళా...

గుంటూరు : తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు టీడీపీ నేత కళావెంకట్రావు. అమరావతిలో చంద్రబాబుతో టీడీపీ ఎంపీల భేటీ అనంతరం కళావెంకట్రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన నోట్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్ర, ఏపీ ప్రభుత్వాలపై కరత్ విమర్శలు...

పశ్చిమగోదావరి : ఏపీ విభజన చట్టంలోని హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోదని.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. 

విభజన నిధుల లెక్కలు పంపించాలి - పవన్...

హైదరాబాద్ : 2014-2017 విభజన లెక్కల డిటైల్స్ 15వ తేదీలోగా పంపించాలని కోరడం జరుగుతోందని జనసేన అధినేత పవన్ తెలిపారు. పొలిటికల్ జేఏసీ కాదని...వాస్తవాలు నిర్ధారించే కమిటీ అని, తాను ఈ కమిటీలో లేనని తెలిపారు. కమిటీలో ఉన్న వ్యక్తుల పేర్లు తాను త్వరలోనే చెబుతానని, విభజన హామీలు..అమలుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యపైనే ఫోకస్ చేస్తుందని..ఇతరత్రా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పవన్ పేర్కొన్నారు.

17:55 - February 11, 2018

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించారు. తాను కోరుతున్న లెక్కలు పంపించాలని, తాను చెప్పిన తేదీల్లోగా పంపించలేకపోతే చేయాల్సిన దానిపై తరువాత వెల్లడిస్తానని తెలిపారు. విభజన హామీలు సాధిండానికి కేంద్రంతో ఎలా పోరాటం చేయాలి..జేఏసీ ఏర్పాటు తదితర అంశాలపై పవన్ చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ తో పవన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

2014-2017 డిటైల్స్ 15వ తేదీలోగా పంపించాలని కోరడం జరుగుతోందని పవన్ తెలిపారు. పొలిటికల్ జేఏసీ కాదని...వాస్తవాలు నిర్ధారించే కమిటీ అని, తాను ఈ కమిటీలో లేనని తెలిపారు. కమిటీలో ఉన్న వ్యక్తుల పేర్లు తాను త్వరలోనే చెబుతానని, విభజన హామీలు..అమలుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యపైనే ఫోకస్ చేస్తుందని..ఇతరత్రా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పవన్ పేర్కొన్నారు. 

17:54 - February 11, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ వేత్త ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. ఆదివారం జనసేన కార్యాలయానికి వచ్చిన ఆయన పవన్ తో భేటీ అయ్యారు. విభజన హామీలు..జేఏసీ ఏర్పాటుపై వారివురూ వివరంగా చర్చించారు. అనంతరం ఉండవల్లి..పవన్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వాలు ఎప్పుడూ అబద్దాలు ఆడవని..కానీ నిజం మాత్రం చెప్పరని ఉండవల్లి పేర్కొన్నారు. పవన్ తో భేటీ కాగానే మొదటి ప్రశ్నతోనే తనను ఇంప్రెస్ అయ్యేలా చేశారని తెలిపారు. రియల్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ ఈ రోజు నుండే స్టార్ట్ చేశారని పేర్కొన్నారు. తనతో రాజకీయాలు మాట్లాడకపోవడం నచ్చిందని..అందుకే పవన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు.

ఆయన ఏర్పాటు చేసిన కమిటీలో చాలా పెద్దవారి పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఇచ్చామని కేంద్రం పేర్కొంటుంటే..లక్ష కోట్లు మంజూరయితే చేతుల్లోకి వచ్చిందా ? ఎక్కడ ఇచ్చారు ? అని రాష్ట్రం అటోందన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆనాడే తాను కోరడం జరిగిందని..పవన్ చెబితే ప్రభుత్వం ఇస్తుందని భావించినట్లు తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం పంపించలేదన్నారు. పవన్ కోరుతున్నట్లుగా లెక్కలు పంపించాలని, ఈ లెక్కలు..కమిటీ అధ్యయనం చేసి నిజం ఏమిటో ప్రజలకు చెబుతుందని ఉండవల్లి తెలిపారు. 

17:40 - February 11, 2018

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీరును మరోసారి జనసేనానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విభజన హామీలు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఆయన మరోసారి తప్పుబట్టారు. విభజన హామీలు..జేఏసీ ఏర్పాటుకు పవన్ రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జేపీతో పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం జనసేన పార్టీ కార్యాలయానికి ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చారు. ఆయనతో పవన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.

రెండు పార్టీల కలయిక వల్ల ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రధాన మంత్రి స్థాయిలో గాని, అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వల్ల మేలు జరుగుతుందని వారికి మద్దతు తెలపడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో...అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదని తెలిపారు. తనను రాజకీయాల్లోకి ఎవరూ రావాలని చెప్పలేదని ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తిరుపతి..కాకినాడ..ఇతర సభల్లో మాట్లాడిన అనంతరం కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వివరణ ఇవ్వడం లేదన్నారు. రెండు పార్టీలు సరిగ్గా స్పందించలేనిపక్షంలో ప్రశ్నించాల్సినవసరం ఉందని భావించినట్లు తెలిపారు. అందులో భాగంగా పోలవరంపై శ్వేతపత్రం అడిగితే వెబ్ సైట్ లో ఉన్నాయని పేర్కొన్నారని..కానీ వెబ్ సైట్ దొరకలేదన్నారు. మిత్రపక్షంగా ఉన్నాను..కానీ తనకే ఇవ్వలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం చాలా నిధులు ఇచ్చామని కేంద్రం పేర్కొంటుంటే...నిధులు అంతగా రాలేదని...అంతా అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇందులో వాస్తవాలు బయటకు రావాలనే జేఏసీ ఏర్పాటు చేయాల్సినవసరం ఉందని భావించినట్లు తెలిపారు.

సొంత పార్టీతో విబేధించి బయటకు వచ్చి రాజకీయ అస్త్రసన్యాసం చేసిన వ్యక్తి ఉండవల్లి గుర్తుకొచ్చారని తెలిపారు. ఉండవల్లితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని..జయ ప్రకాష్ నారాయణ్ కూడా సామాజిక పనులు చేశారని తెలిపారు. మేధావులు..నిపుణులు..ఇతరులతో తాను మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను టిడిపి తనకు పంపించాలని కోరుకుంటున్నట్లు అలాగే రాష్ట్రానికి పంపించిన నిధుల వివరాలను బీజేపీ నేతలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ వివరాలను కమిటీకి పంపించడం జరుగుతుందని ఆ కమిటీ అధ్యయనం చేసి నిజాలు చెబుతుందన్నారు. 

17:05 - February 11, 2018

హైదరాబాద్ : ఏపీలో జేఏసీ ఏర్పాటుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా పలువురు నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలు కావడానికి సిద్ధం అవుతున్నారు. విభజన హామీలు సాధిండానికి కేంద్రంతో ఎలా పోరాటం చేయాలి..జేఏసీ ఏర్పాటు తదితర అంశాలపై పవన్ చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ తో పవన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం సాయంత్రం జనసేన కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పవన్ సాదరస్వాగతం పలికారు. జేఏసీ ఏర్పాటు..విభజన హామీలు అమలుకు ఎలాంటి వ్యూహం రచించాలనే దానిపై చర్చిస్తున్నారు. జేఏసీలో ఎవరు ఉండాలనే దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇరువురూ మీడియాతో మాట్లాడనున్నారు. ఉండవల్లి జేఏసీ ఏర్పాటుకు మద్దతు తెలుపుతారా ? అందులో ఎలాంటి పాత్ర పోషించనున్నారో కాసేపట్లో తెలియనుంది. 

16:51 - February 11, 2018
16:40 - February 11, 2018
16:39 - February 11, 2018
16:38 - February 11, 2018

పశ్చిమగోదావరి : ఏపీ విభజన చట్టంలోని హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోదని.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చుకున్నా సాధించుకోలేకపోయిన టీడీపీని ప్రకాశ్‌ కరత్‌ తప్పుపట్టారు. విభజన చట్టంలోని చాలా హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. 

16:36 - February 11, 2018

మహబూబ్‌నగర్‌ : జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డికి భూత్పూర్‌ మండలం కార్వేన గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు పరిష్కరించలేదని భూములు కోల్పోయిన రైతులు నిలదీశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం సంగతి ఏమైందని ప్రజలు ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి.. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే వెళ్లిపోయారు. 

16:34 - February 11, 2018

గుంటూరు : తమ పార్టీకి రాష్ట్ర ప్రయోనాలే ముఖ్యమన్నారు టీడీపీ నేత కళావెంకట్రావు. అమరావతిలో చంద్రబాబుతో టీడీపీ ఎంపీల భేటీ అనంతరం కళావెంకట్రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన నోట్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్నిరాష్ట్రాలకు జరిగే విధంగానే ఏపీకి కూడా కేటాయింపులు ఇచ్చారే కాని.. విభజన నష్టాలను సరిచేసేలా నిధులు ఇవ్వలేదని కళా వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ హామీలను నెరవేర్చేవరకు కేంద్రంపై తమపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

భిక్షమెత్తుకోవడం లేదన్న గల్లా...
అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకి నిధులు ఇచ్చారే కాని ..విభజన చట్టంలోని హామీల ప్రకారం కేటాయింపులు జరగలేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. ఏపీ కేంద్రం ముందు భిక్షమెత్తుకోవడం లేదని.. రాష్ట్రానికి రావాల్సిన హక్కునే డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఏపీ ప్రజలు ఫూల్స్‌ కాదన్న విషయాన్ని మరోసారి బీజేపీ లీడర్లకు గుర్తు చేస్తున్నామన్నారు గల్లాజయదేవ్‌.

వైసీపీది రాజకీయమన్న రామ్మోహన్ నాయుడు...
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తాము గళం విప్పుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ టీఆర్‌ఎస్‌, టీఎంసీ లాంటి పార్టీలుకూడా డిమాండ్‌ చేస్తుంటే.. వైసీపీ నేతలు ఢిల్లీలో ప్రధాని కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఇటు ఏపీ బీజేపీ నేతల వైఖరిపై కూడా ఎంపీ మండిపడ్డారు. కేంద్రం కేటాయింపులు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన 27 పేజీల నోట్‌ అంతా అసంబద్ధమే అన్నారు. విభజన హామీలను భర్తీచ చేసేలా కేటాయింపులు ఇవ్వలేదన్న విషయం బీజేపీ లీడర్లకు తెలియదా అని టీడీపీ ఎంపీ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలకోసం నిబద్ధతతో వ్యవహరించాలని బీజేపీ , వైసీపీకి నేలకు రామ్మోహన్‌నాయుడు సలహా ఇచ్చారు. 

16:30 - February 11, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ ముగిసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పార్లమెంటులో పరిణామాలపై చర్చించారు. అరుణ్‌జైట్లీ, అమిత్‌షాలతో టీడీపీ నేతల చర్చలు, అనంతర పరిణామాలపై ఎంపీలు బాబుకు వివరించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు విడుదల చేసిన 27 పేజీలపై నోట్‌పై ప్రధానంగా చర్చించిన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన వాస్తవ నిధులపై వివరణ, బీజేపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్‌గా వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ ఎంపీలు.  

14:44 - February 11, 2018
14:43 - February 11, 2018

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. 300 గ్రాముల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. గాజుల విలువ రూ. 9.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యక్తిని..నాలుగు గాజులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

టీడీపీ ముఖ్యనేతలతో సీఎం భేటీ

గుంటూరు : అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సీఎం భేటీ అయ్యారు. సీఎంతో కళా వెంకట్రావు, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, ఇతర నేతలు సమావేశమయ్యారు. 

మచిలీపట్నంలో వైసీపీ నేతల ఆందోళన

కృష్ణా : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మచిలీపట్నంలో వైసీపీ నేతల ఆందోళనకు దిగారు. మచిలీపట్నంలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి ఆర్కే సింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

14:28 - February 11, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగిందని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిందేనని, ప్రత్యేక ప్యాకేజీలోని అన్ని అంశాలు నెరవేర్చాలన్నారు. ఏపీ ప్రయోజనాలకు కావాల్సిన కేటాయింపులు బడ్జెట్ లో లేవని, ప్రతిపక్ష పార్టీ సొంత లాభాల కోసమే పనిచేస్తోందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది : గల్లా

గుంటూరు : విభజన సమయానికి రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు చాలా తక్కువ అని ఆయన అన్నారు. 

14:27 - February 11, 2018

హైదరాబాద్ : బొటానికల్‌ గార్డెన్‌ హత్య కేసులో చిన్న క్లూ ఆధారంగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పది రోజుల క్రితం గర్భిణీ మహిళను దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి గార్డెన్ ప్రాంతంలో పడేసిన సంగతి తెలిసిందే. చంపింది ఎవరు ? చంపబడింది ఎవరు ? అనేది పోలీసులకు తెలియరాలేదు. గత నెల 28వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు మొదలు పెట్టారు.

హత్య చేసింది నాగ పూర్ కు చెందిన విజయ్ కుమార్ గా పోలీసులు అనుమానించారు. కొంతకాలంగా హైదరాబాద్ లోని సిద్ధిక్ నగర్ లో ఇతను నివాసం ఉంటున్నాడు. విజయ్ కుమార్ ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య..కొడుకు ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ తో పాటు మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌, సిద్ధిక్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు చేశారు. సుమారు 350 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో గర్బిణి హత్య నేపథ్యంలో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

అపంబద్దంగా వీడగొట్టారు : కళావెంకట్రావు

గుంటూరు : రాష్ట్రాన్ని అసంబద్దంగా వీడగొట్టారని కళావెంకట్రావు అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో  రాష్ట్రానికి రావల్సిన నిధులు రాలేదని కళా వెంకట్రావు అన్నారు. 

14:07 - February 11, 2018

ప.గో : ఏపికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాని సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్రంతో తాము పోరాడుతామన్నారు. బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్న టీడీపీ... కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ భవిష్యత్‌ కార్యాచణేంటో ప్రజలకు చెప్పాలంటున్న ఏచూరితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. 

 

కూలిన నిర్మాణంలో ఉన్న ఇల్లు..

పంజాబ్ : బటిండాలోని అర్జున్ నగర్ లో నిర్మితమౌతున్న ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మచిలీపట్నంలో వైసీపీ నేతల ధర్నా...

కృష్ణా : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మచిలీపట్నంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆర్కే సింగ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జీ పేర్నీ నానితో సహా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలన్న వెంకయ్య...

హైదరాబాద్ : రోశయ్యకు జీవితకాల పురస్కారం ప్రధానం జరిగింది. రోశయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సన్మానించారు. పార్టీ విధానాలు నచ్చకపోతే ఎవరైనా పార్టీ మారొచ్చని, పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని వెంకయ్య సూచించారు. ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలంటే పార్టీలు మారడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. 

ముఖ్య నేతలతో బాబు భేటీ...

విజయవాడ : అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సీఎంతో కళా వెంకట్రావ్, ఎంపీలు జయదేవ్, రామ్మోహన్ నాయుడు, ఇతర నేతలు భేటీలో పాల్గొన్నారు. కేంద్రంతో సంప్రదింపులు చేస్తూనే హామీలు అమలు కోసం పోరాడే దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు. 

బంజార్ ఘాట్ లో ఫైర్ ఆక్సిడెంట్...

హైదరాబాద్ : నాంపల్లి బంజార్ ఘాట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోండా షోరూంలో మంటలు అంటుకోవడంతో 50కి పైగా బైక్ లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

శంషాబాద్ లో కస్టమ్ తనిఖీలు...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. జెడ్డా నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఏటీఎంలో నకిలీ 500 నోటు...

కాన్పూర్ : మార్బల్ మార్కెట్ లో ఉన్న ఓ ఏటీఎంలో నకిలీ ఐదు వందలు దర్శనమిచ్చాయి. నోటుపై 'చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఫుల్ ఆఫ్ వన్ ఉండడంతో వినియోగదారులు అవాక్కుతిన్నారు.

 

13:58 - February 11, 2018

ఖమ్మం : నగరం పర్యావరణ, పారిశుద్య సమస్యలకు నిలయంగా మారిందని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వర్‌రావు విమర్శించారు. ఖమ్మంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత కనిపిస్తోందన్నారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పర్యావరణ, పారిశుద్ద్య సమస్యలను పరిష్కరించాలంటూ 2కె రన్‌ నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ రన్‌... అంబేద్కర్‌ విగ్రహం వరకు సాగింది. లకారం ట్యాంక్‌ ఖమ్మానికి మణిహారంకాదన్నారు. సినిమా యాక్టర్లను తీసుకొచ్చి ఖమ్మం అంతా అభివృద్ధి చెందినట్టు టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. 

 

13:49 - February 11, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా మోదీ అసత్యాలు, అబద్దాలు చెప్పి.. ప్రధాని పదవి ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. నిండుసభలో కాంగ్రెస్‌ నేతలను తూలనాడటం సరికాదన్నారు. 

 

13:47 - February 11, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు అమరావతిలో టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలపై పీలతో చర్చిస్తున్నారు. బీజేపీ  ఏపీ  అధ్యక్షుడు విడుదల చేసిన 27 పేజీలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ భేటీ ద్వారా వాస్తవ వాస్తవ నిధులను వివరించడంతో పాటు హరిబాబుకి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏంపీలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి సుజనాచౌదరి చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ కానున్నారు. కేంద్ర నిధులు, హామీలపై సుజనాచౌదరి చంద్రబాబుతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

 

ఆయేషామీరా హత్యకేసుపై సిట్ పునర్విచారణ

గుంటూరు : ఆయేషామీరా హత్య కేసుపై సిట్‌ అధికారులు పునర్విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇవాళ సిట్‌ అధికారులు గుంటూరు జిల్లాలోని తెనాలికి చేరుకున్నారు. ఆయేషామీరా తల్లిదండ్రులను కలిశారు. ఆయేషా హత్యపై వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

 

13:42 - February 11, 2018

గుంటూరు : ఆయేషామీరా హత్య కేసుపై సిట్‌ అధికారులు పునర్విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇవాళ సిట్‌ అధికారులు గుంటూరు జిల్లాలోని తెనాలికి చేరుకున్నారు. ఆయేషామీరా తల్లిదండ్రులను కలిశారు. ఆయేషా హత్యపై వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

 

13:39 - February 11, 2018

హైదరాబాద్ : నాంపల్లి బజార్‌ఘాట్‌ హోండా షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50కి పైగా వాహనాలు దగ్ధం అయ్యాయి. పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో అప్రమత్తమైన పోలీసులు షోరూం పై అంతస్థులో ఉన్న 6 కుటుంబాలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. 

 

13:25 - February 11, 2018

పశ్చిమగోదావరి : విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న కేంద్రం.. వాటిని విస్మరించిందన్నారు. 

 

దుబాయ్ లో ప్రధాని మోడీ పర్యటన

దుబాయ్ : ప్రధాని మోడీ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అబుదబిలో మోడీ ప్రసంగించారు. ప్రపంచస్థాయిలో భారత ఖ్యాతి పరిడవిల్లుతోందన్నారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

 

13:10 - February 11, 2018

దుబాయ్ : ప్రధాని మోడీ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అబుదబిలో మోడీ ప్రసంగించారు. ప్రపంచస్థాయిలో భారత ఖ్యాతి పరిడవిల్లుతోందన్నారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

12:54 - February 11, 2018

హైదరాబాద్ : రాగ సప్తస్వరం, టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్యకు ఘన సన్మానం లభించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో తనను సత్కరించడం ఆనందంగా ఉందని రోశయ్య అన్నారు. తనకు పదవులన్నీ యాదృచ్చికంగానే వచ్చాయన్నారు. వచ్చిన పదవులను సద్వినియోగం చేశానన్నారు. అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య... రోశయ్య ఓ బహుముఖ ప్రజ్ఞాశాలంటూ ప్రశంసించారు. కార్యదక్షుడు, సంస్కారం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. 

 

12:51 - February 11, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందులో విషాదం చోటు చేసుకుంది. షాపు యజమాని వేధింపులు తాళలేక వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానికంగా ఉన్న శ్రీవెంకటరమణ కిరాణా షాపులో వెంకటేష్‌ కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే షాపు యజమాని బెల్లం భాస్కర్‌ ..వెంకటేష్‌ను నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో తట్టుకోలేకపోయిన వెంకటేష్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షాపు యజమాని భాస్కర్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు న్యాయం చేయాలంటూ వెంకటేష్ కుటుంబసభ్యులు జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. వారి ఆందోళనకు పలు రాజకీయపార్టీలు మద్దతు పలికాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 
 

 

12:43 - February 11, 2018
12:24 - February 11, 2018

చిత్తూరు : స్వర్ణముఖీ నదీతీరంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ క్షేత్రంగా అలరారుతోంది. 'దక్షిణ కాశీ ' గా పేరు గాంచిన ఈ ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు అందంగా ముస్తాబవుతోంది. తిరుపతికి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకృష్ణదేవరాయకాలంలో నిర్మించబడింది. ప్రాచీన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం నిదర్శనంగా నిలిచింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు వారంపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రి ఉత్సవ సమయంలో ఆలయం లోపలే కాకుండా బయట ప్రధాన వీధులైన నెహ్రూ వీధి కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనతో కిటకిటలాడుతుంటాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. 

మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి శివుడు ఊరేగుతుంటే  ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోలేని పేదలు .. స్వామి అమ్మవారి కళ్యాణంతో పాటు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు  శ్రీకాళహస్తి ఆలయం అందంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతులలో శ్రీకాళహస్తీశ్వరుని మూలవిరాట్టు కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు 8 వ తేదీనుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 

మహిళ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరణ

హైదరాబాద్ : కొండాపూర్‌ సమీపంలోని బొటానికల్ గార్డెన్ వద్ద 10 రోజుల క్రితం మహిళ హత్య కేసుకి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. యమహా బైక్‌పై వచ్చిన నిందితులను సీసీ కెమెరాలో గుర్తించారు. మృతురాలు మహారాష్ట్ర వాసిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆమె పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాంవాసుల్ని పోలీసులు విచారిస్తున్నారు. 

12:12 - February 11, 2018

హైదరాబాద్ : కొండాపూర్‌ సమీపంలోని బొటానికల్ గార్డెన్ వద్ద 10 రోజుల క్రితం మహిళ హత్య కేసుకి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. యమహా బైక్‌పై వచ్చిన నిందితులను సీసీ కెమెరాలో గుర్తించారు. మృతురాలు మహారాష్ట్ర వాసిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆమె పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాంవాసుల్ని పోలీసులు విచారిస్తున్నారు. 10 రోజుల క్రితం మృతురాలిని ముక్కలుగా నరికి చంపిన దుండగులు గోనెసంచిలో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసి పరారయ్యారు. అంజయ్యనగర్, సిద్దిక్‌నగర్‌లలలో కార్డన్ సెర్చ్ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వందల సంఖ్యలో అస్సాంవాసులు నివాసం ఉంటున్నారు. జాయింట్ సీపీ సానవాజ్‌ ఖాసిం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో..350 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:59 - February 11, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు అమరావతిలో టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలపై పీలతో చర్చిస్తున్నారు. బీజేపీ  ఏపీ  అధ్యక్షుడు విడుదల చేసిన 27 పేజీలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ భేటీ ద్వారా వాస్తవ వాస్తవ నిధులను వివరించడంతో పాటు హరిబాబుకి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏంపీలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి సుజనాచౌదరి చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ కానున్నారు. కేంద్ర నిధులు, హామీలపై సుజనాచౌదరి చంద్రబాబుతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

 

చెన్నంపల్లి కోటలో తవ్వకాల నిలిపివేత

కర్నూలు : జిల్లాలోని తుగ్గలిమండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. నాలుగోచోట తవ్వకాల్లో బండరాయి అడ్డుపడటంతో తవ్వకాలు నిలిపివేశారు. 10 అడుగుల లోతులో బండరాయి ఉన్నట్లు జీపీఆర్ స్కానింగ్ ఆధారంగా అధికారులు గుర్తించారు. తిరిగి శివరాత్రి తరువాత అధికారులు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోటను తవ్వకాలతో పాడు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

11:48 - February 11, 2018

కర్నూలు : జిల్లాలోని తుగ్గలిమండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. నాలుగోచోట తవ్వకాల్లో బండరాయి అడ్డుపడటంతో తవ్వకాలు నిలిపివేశారు. 10 అడుగుల లోతులో బండరాయి ఉన్నట్లు జీపీఆర్ స్కానింగ్ ఆధారంగా అధికారులు గుర్తించారు. తిరిగి శివరాత్రి తరువాత అధికారులు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోటను తవ్వకాలతో పాడు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:47 - February 11, 2018

హైదరాబాద్ : రాగ సప్తస్వరం, టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్యకు ఘన సన్మానం లభించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రోశయ్య ఓ కార్యదక్షుడు, సంస్కారవంతుడని అన్నారు.

 

టీడీపీ ఎంపీలతో భేటైన సీఎం చంద్రబాబు

ఢిల్లీ : అందుబాటులో ఉన్న ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పరిణామాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. కేంద్ర నిధులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన 27 పేజీలపై దృష్టి సారించారు. వాస్తవంగా నిధులు చెప్పి హరిబాబుకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంపీలతో భేటీ అనంతరం చంద్రబాబుతో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏకాంత భేటీ కానున్నారు. కేంద్ర నిధులు, హామీలపై చంద్రబాబుతో సుజనా చౌదరి చర్చించారు. 

 

నేడు పవన్ తో భేటీ కానున్న ఉండవల్లి అరుణ్ కుమార్

హైదరాబాద్ : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. 

రౌడీషీటర్ ను హత మార్చిన దుండగులు

కర్నూలు : జిల్లాలోని ప్యాపిలిలో రౌడీషీటర్ దారుణ హత్య గావించారు. రౌడీషీటర్ వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మధు 2009లో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. ఇరువర్గాలు 20 రోజుల క్రితం రాజీపడ్డారు. పాత కక్షలు నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

11:25 - February 11, 2018
10:53 - February 11, 2018
10:52 - February 11, 2018

కర్నూలు : జిల్లాలోని ప్యాపిలిలో రౌడీషీటర్ దారుణ హత్య గావించారు. రౌడీషీటర్ వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మధు 2009లో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. ఇరువర్గాలు 20 రోజుల క్రితం రాజీపడ్డారు. పాత కక్షలు నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:38 - February 11, 2018

హైదరాబాద్ : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:22 - February 11, 2018

ఢిల్లీ : అందుబాటులో ఉన్న ఎంపీలతో కాసేపట్లో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పరిణామాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర నిధులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన 27 పేజీలపై దృష్టి సారించారు. వాస్తవంగా నిధులు చెప్పి హరిబాబుకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంపీలతో భేటీ అనంతరం చంద్రబాబుతో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏకాంత భేటీ కానున్నారు. కేంద్ర నిధులు, హామీలపై చంద్రబాబుతో సుజనా చౌదరి చర్చించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నరబలి కేసు...రాజశేఖర్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్ : ఉప్పల్ నరబలి కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడు రాజశేఖర్ ఇంట్లో 9 గంటలకు పైగా పోలీసులు తనిఖీలు చేశారు. ఓ గది నిండా రక్తపు మరకలు ఉన్నట్లు క్లూస్ టీం నిర్ధారించారు. రక్తపు మరకలు కనిపించకుండా రసాయనాలతో తుడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గదిలో కోడిని కోశామని రాజశేఖర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ కేసులో డీఎన్ ఏ రిపోర్టు కీలకంగా మారింది. మరో 48 గంటల్లో డీఎన్ ఏ రిపోర్టు పోలీసుల చేతికి రానుంది. 

10:05 - February 11, 2018

హైదరాబాద్ : ఉప్పల్ నరబలి కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడు రాజశేఖర్ ఇంట్లో 9 గంటలకు పైగా పోలీసులు తనిఖీలు చేశారు. ఓ గది నిండా రక్తపు మరకలు ఉన్నట్లు క్లూస్ టీం నిర్ధారించారు. రక్తపు మరకలు కనిపించకుండా రసాయనాలతో తుడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గదిలో కోడిని కోశామని రాజశేఖర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ కేసులో డీఎన్ ఏ రిపోర్టు కీలకంగా మారింది. మరో 48 గంటల్లో డీఎన్ ఏ రిపోర్టు పోలీసుల చేతికి రానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

గూడ్స్ ట్రాన్స్ పోర్టు కాంప్లెక్స్ లో మంటలు

ఆదిలాబాద్ : జిల్లాలోని భుక్తాపూర్ లో అగ్నిప్రమాదం జరిగింది. గూడ్స్ ట్రాన్స్ పోర్టు కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో వస్తువులు దగ్ధం అయ్యాయి. మొదటి అంతస్తులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో దట్టంగా పొగ వ్యాపించింది. అలర్ట్ అయిన సిబ్బంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

09:54 - February 11, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని భుక్తాపూర్ లో అగ్నిప్రమాదం జరిగింది. గూడ్స్ ట్రాన్స్ పోర్టు కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో వస్తువులు దగ్ధం అయ్యాయి. మొదటి అంతస్తులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో దట్టంగా పొగ వ్యాపించింది. అలర్ట్ అయిన సిబ్బంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

09:43 - February 11, 2018

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంకన్ డ్రైవ్ లో మందుబాబులు రెచ్చిపోయారు. ఢిల్లీ యువతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తుండగా దాడికి యత్నించారు. కార్లలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు అభ్యమయ్యాయి. మద్యం తాగి వాహనం నడుపుతున్న 105 మందిపై కేసులు నమోదు చేశారు. 42 కార్లు, 61 బైకులను సీజ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:35 - February 11, 2018

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత మన్ను సుబ్బారావు, వైసీపీ నేత మండల హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 105 మందిపై కేసులు నమోదు చేశారు. 

07:21 - February 11, 2018
07:20 - February 11, 2018

హైదరాబాద్ : చీరలంటే ఇష్టపడని మహిళలు ఎవరుంటారు..! అందులోనూ చేనేత చీరలంటే వద్దనే వారు ఉంటారా..?  దేశంలో పేరొందిన బనారస్‌, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, చందేరి లాంటి చేనేత వస్త్రాలన్నీ ఒకే దగ్గర లభిస్తే ఇక ఆడవారి ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి అరుదైన అవకాశం ఇపుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది.. 'గో కాప్‌ హ్యాండలూమ్స్‌ ఎక్స్‌పో సంస్థ'. 

హైదరాబాద్‌లో చేనేతవస్త్రాలు ఎక్స్‌పో ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ బ్రాండ్‌ల చేనేత వస్త్రాలన్నీ ఒకే దగ్గర అందుబాటులోకి తెచ్చింది గో కాప్ హ్యండ్‌లూమ్స్‌ సంస్థ. హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ చేనేత వస్త్ర ప్రేమికులు అమితంగా ఆకట్టుకుంటోంది. 

దేశంలోని ప్రముఖ మైన హ్యాండ్‌లూమ్స్‌ ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. బనారస్,మహేశ్వరీ, చందేరి, బెంగాల్ కాటన్, లినన్స్‌తోపాటు .. ఉప్పాడా, మంగళగిరి,  వెంకటగిరి, పోచం పల్లి, కంచి కాటన్, సంభన్ పూర్,నారాయణపేట్   చేనేత చీరలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. దేశం వ్యాప్తంగా 300 కో-ఆపరేటింవ్ సంస్ధలు ఏర్పాటు చేసి.. దాదాపు  30 వేల మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు గో కాప్‌ హ్యాండ్‌లూమ్స్‌ సంస్థ ఫౌండర్‌ శివదేవి రెడ్డి అంటున్నారు. 

గోకాప్‌ హ్యాండ్‌లూమ్స్‌ సంస్థ గత 6 సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తుల అమ్మకాలు కొనసాగిస్తోంది.  గో కాప్‌ సంస్థ మొత్తం  18 వేల రకాల హ్యాండ్ లూమ్ ఐటమ్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మాకానికి పెట్టింది. అటు ఆన్‌లైన్‌లో నూ ఇటు ఆఫ్‌లైన్‌లోనూ చేనేత వస్త్రాలు విక్రయిస్తోంది. అరుదైన చేనేత కళను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే అన్నిరకాల చేనేత వస్త్రాలను  ఒకే వేదికపైకి తెచ్చామని  గోకాప్‌ హ్యాండ్‌లూమ్స్‌ నిర్వాహకలు చెబుతున్నారు. 

ఇక్కడ చీరలే కాకుండా కేరళా కాటన్‌, ఇక్కత్‌, వరంగల్ దరివ్స్ బెడ్‌షీట్స్‌ లాంటివి కూడా అందుబాటులో ఉంచారు. ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ప్రారంభమైన గోకాప్‌ హ్యాండ్‌లూమ్స్‌ ఎక్స్‌పో.. 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ అవకాశాన్ని చేనేతకళా ప్రేమికులు వినియోగించుకోవాలని సంస్థ నిర్వహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

07:16 - February 11, 2018

ఖమ్మం: మురికి కూపంగా ఉన్న లకారం చెరువును ఖమ్మం నగరానికి మణిహారంగా తయారు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  మంత్రి  ఎలక్ట్రిక్‌ కారులో తిరుగుతూ పార్కును పరిశీలించిన అనంతరం బోట్‌లో షికారు చేశారు. ఈ పార్కుకోసం ఇప్పటికే 24 కోట్ల నిధులు ఇచ్చామని... కావాలంటే మరో రెండు కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

 

07:14 - February 11, 2018

ఖమ్మం : టౌన్‌లోని.. లకారం చెరువు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పుడీ చెరువుకట్ట.. నగరానికి మణిహారంలా భాసిల్లుతోంది. ఆహ్లాదం పంచుతోన్న పచ్చందనాల లకారం ట్యాంక్‌బండ్‌ను ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తోంది.

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం చెరువు సుందరీకరణ పనులు పూర్తైయ్యాయి.. ట్యాంక్ బాండ్ పై వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హట్స్... పాదచారుల కోసం పుట్ పాత్... వాకింగ్ ట్రాక్‌లు... లకారానికి కొత్తఅందాలు తెచ్చి పెట్టాయి. ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా నీటి గలగలలు మరోవైపు లాన్‌.. సందర్శకులను ఆహ్లాదపరుస్తున్నాయి.. ఇక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్ ఆబాలగోపాలన్ని అలరించనుంది. ఇక లకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు..  సందర్శకుల్లో కొత్త ఉత్సహం నింపుతోంది.. 

మిషన్‌ కాకతీయలో భాగంగా ప్రభుత్వం.. లకారం చెరువును సుందరీకరించింది. 150 ఎకరాల ఈ చెరువు.. కబ్జాదారుల కోరలకు చిక్కి.. 90 ఎకరాలకు చేరింది.  అదికూడా.. చెత్తా చెదారంతో, మురికి కంపు కొడుతూ ఉండేది. నగరవాసులకు ఆహ్లాద పరిచే ప్రదేశాలు లేకపోవడాన్ని గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ లకారం చెరువుకు కొత్త శోభను తీసుకు వచ్చారు.. ఆరు కోట్ల రూపాయల వ్యయపు అంచనాతో ప్రారంభించిన లకారం సుందరీకరణ పనులు.. పాతిక కోట్లకు చేరాయి. ఆదివారం నాడు.. రాష్ట్ర్ర మంత్రులు హరీష్ రావు. తుమ్మల నాగేశ్వరావులు 5కే రన్ నిర్వహించి ఈ ట్యాంక్‌బండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఈనెల 11 న మూవీ ఆర్టిస్ట్స్‌ ఆధ్వర్యంలో.. 5కే రన్ నిర్వహించనున్నారు. లకారం చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

07:05 - February 11, 2018

హైదరాబాద్ : లెప్ట్ పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తారు..  రైట్ పార్టీలతో స్నేహానికి సిద్ధమంటారు... ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయరు... రాష్ట్రంలో మాత్రం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలకు మద్దతిస్తారు... ఇంతకీ వైసీపీ అధినేత వైఖరేంటి..? జగన్‌ రెండు పడవల ప్రయాణం ఎంతవరకు సాగనుంది..? 

రాష్ట్ర విభజన,  కేంద్ర బడ్జెట్‌లో అన్యాయానికి వ్యతిరేకంగా ఏపీలోని అన్ని పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన కార్యక్రమాలు చేయపట్టింది.  అయితే కేంద్రంపై పోరాటం విషయంలో జగన్ ఒక్క వైపు కమలంపార్టీతో సానుకూలదొరణతో వ్యవహరిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో  బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఆందోళన నిర్వహించడం.. చర్చనీయాంశంగా మారింది. 

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై  టీడీపీ నేతలు ఎన్డీయే లో బాగ్యాస్వామ్యలుగా ఉన్న అప్పటికి కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. మరివైపు వైసీపీ సైతం పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నా.. విభజన హామీలు అమలు కాకపోవటానికి టీడీపీ కారణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తుందే తప్ప.. కేంద్రాన్ని కాని ప్రధాని మోడిని కాని ఒక్క మాట కూడా అనడంలేదు.  దీంతో కేంద్ర పై జగన్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ జగన్ చేస్తున్న కామెంట్ లు  జగన్ బిజేపికి దగ్గిరయ్యేందుకు సంకేతాలిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయంపై నిర్వహించిన వామపక్షాలు బంద్‌కు వైసీపీ మద్దతు తెలపడంతో పాటు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కూడా  బంద్ లో పాల్గున్నారు. గతంలోనూ అనేక ప్రజా సమస్యలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన ఆందోళనలకు జగన్ పూర్తిగా మద్దతు ప్రకటించారు. అయితే జాతీయ స్థాయిలో పూర్తి వ్యతిరేకులుగా ఉన్న బీజేపీ, వామపక్షాలతో జగన్ రాష్ట్ర స్థాయిలో ఒకేసారి కలిసి పనిచెయ్యడంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో అవకాశాలు బట్టి బీజేపీతో లేదా వామపక్షాలతో పొత్తు దిశగా జగన్ ఇలాంటి విధానం అనుసరిస్తున్నారని పార్టీలోనూ చర్చ జరుగుతోంది.

భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే జగన్‌ ఇలా ద్విముఖవ్యూహంతో వెళుతున్నారని వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు   వామపక్షాల సపోర్టు కీలకమని జగన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎన్నికల అనంతరం  కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీతో చెలిమి ఉపయోగపడతాయని వైసీపీ అధినాయకత్తం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ అనుసరిస్తున్న రెండు పడవల ప్రయాణం మొదటికే మోసం తెచ్చే అవకాశం ఉందన్న  విశ్లేషణలు కూడా రాజకీయవర్గాలనుంచి  వస్తున్నాయి. 

06:57 - February 11, 2018

హైదరాబాద్ : విభజన హామీల సాధనలో పవన్ చెబుతున్న జె.ఏ.సి ఎంత మేరకూ సక్సెస్‌ అవుతుంది..? యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న నాయకులతో విభజన హమిలను సాధించడం సాధ్యమేనా.. ? అసలు జెఏసితో ఏవరి లాభం.. ? జనసేనానితో జట్టుకట్టే నేతలు ఎందరు..? ఒకవేళ జేఏసీ ఏర్పాటయితే దానిలో  పవన్‌ పాత్ర ఏంటి..? ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. 
విభజన చట్టంలోని హామీలు నెరవేరుతాయా..? 
విభజన చట్టంలోని హామీలు నెరవేరుతాయా..? ఏపీకి న్యాయం జరుగుతుందా..? గల్లీ నుంచి డిల్లీ దాక ఇపుడు ఇదే అంశంపై ఆసక్తి కర చర్చ నడుస్తోంది. ఢిల్లీ వేదికగా తెగ హడావిడి చేస్తున్న రాజకీయపార్టీలు కొద్ది రోజుల తర్వాత చప్పబడిపోతాయా అనే అనుమానాలు కూడా జనంలో వక్తం అవుతున్నాయి. పార్లమెంటులో నానా హంగామా చేసి.. కేంద్రాన్ని నిలదీసినా విభజన హామీలపై క్లారిటీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన చెబుతున్న జేఏసీ  ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 
కేంద్రం తీరుపై పవన్‌ మండిపాటు 
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్రం తీరుపై పవన్‌ మండిపడుతున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని పవన్ మీడియా సమావేశం పెట్టి.. మరీ తమ మనస్సులోని బాధను వ్యక్తపరిచారు. అయితే.. ఏపీకి జరిగిన అన్యాయంపై బాధను వ్యక్తం చేస్తున్నారు తప్పితే.. అటు కేంద్ర నాయకులపై కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై గాని తీవ్రస్థాయిలో విమర్శలు మాత్రం జనసేనాని చేయడం లేదు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్రాలపై పోరుబాటపట్టాల్సిన పవన్‌.. ఇలా జేఏసీ  జపం ఎందుకు చేస్తున్నారని జనసేన కార్యకర్తలే  చర్చించుకుంటున్నారు. జనసేన కార్యకర్తలను, ప్రజలను కదిలించి.. పోరాటాన్ని ఉధృతం చేయకుండా.. ఇలా రాజకీయాల నుంచి ఫేడవుట్‌ అవుతున్న నాయకులతో మంతనాలు జరిపితే ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు జనసేనానికి సంధిస్తున్నారు. 
ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ 
తెలంగాణ రాష్ట్ర సాధనలో  జె.ఏ.సి ఎంతగానో దోహదపడిందని, అందుకే తాను కూడా జె.ఏ.సి ఏర్పాటు చేసి విభజన హామీలను సాధించేందుకు మార్గం ఎంచుకున్నట్టు పవన్‌ చెబుతున్నారు. అయితే ప్రయత్నం మంచిదే అయినా.. జనసేనానితో నడవడానికి ముందుకు వచ్చే పార్టీలు, నాయకుల ఎవరనేదానిపైనే ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. 
జేఏసీతో కలిసి రావాలని ఆహ్వానం 
మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఫోన్‌లోనూ, లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణతో భేటీ నిర్వహించిన పవన్‌..  తాను ఏర్పాటు చేస్తున్న జె.ఏ.సితో కలిసి రావాలని ఆహ్వానం పలికారు. దీనికి ఉండవల్లి, జేపీ సానుకూలంగానే స్పందించినా... జేఏసీ ఏర్పాటు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయినా జేఏసీ ఏర్పాటు.. ఉద్యమం నిర్వహించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే విశ్లేషణలూ రాజకీయవర్గాల నుంచి  వస్తున్నాయి. అన్ని పార్టీ, నేతలను కలుపుకుని పోవడం కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చిన  పవన్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. అయినా జనసేనాని ప్రయత్నం ఫలించి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా  రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. 

 

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు పుష్పపల్లికి సేవ

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు పుష్పపల్లికి సేవ నిర్వహించనున్నారు. నేటి నుంచి శ్రీఘ్ర దర్శనం జరుగనుంది. 

నేడు ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం

అమరావతి : నేడు అందుబాటులో ఉన్న ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పరిణామాలపై ఎంపీలతో చర్చ జరపనున్నారు.

Don't Miss