Activities calendar

12 February 2018

21:26 - February 12, 2018

మారుమోగుతున్న శైవక్షేత్రాలు...

హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినానికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. అన్ని ఆలయాలనూ విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. శివనామస్మరణలతో.. శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. 

జమ్మూలో నిర్మాలా సీతారామన్...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని సంజ్వాన్‌లో ఆర్మీ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఎ-మహ్మద్‌ హస్తం ఉందని మంత్రి పేర్కొన్నారు. 

దళిత విద్యార్థి మృతిపై ఆందోళనలు...

ఢిల్లీ : దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్‌ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. 

తమిళనాడు అసెంబ్లీలో జయలలిత ఫొటో...

చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. స్పీకర్‌ ధన్‌పాల్‌ జయలలిత ఫొటోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎం పళనిస్వామి, డిప్యూటి సిఎం పన్నీర్‌ సెల్వం, అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

వసుంధరా రాజే ఎన్నికల వరాలు...

రాజస్థాన్‌ : ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి వసుంధరా రాజే రైతులు, పేదలు, యువకులపై వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీలో ఆఖరు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సిఎం.. రైతులకు 50 వేల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

టీమిండియా నాలుగో వన్డే...

హైదరాబాద్ : విరాట్‌ కొహ్లీ అండ్‌ కో సౌతాఫ్రికా గడ్డపై సంచలనం సృష్టించడానికి సన్నద్ధమైంది. తొలి 3 వన్డేల్లో తిరుగులేని టీమిండియా...4వ వన్డే విజయంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్లు పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరుగనున్న 5 వన్డేలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. 6 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌....సౌతాఫ్రికాలో తొలి వన్డే సిరీస్‌ విజయం సాధించి చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది.

21:15 - February 12, 2018

చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. స్పీకర్‌ ధన్‌పాల్‌ జయలలిత ఫొటోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎం పళనిస్వామి, డిప్యూటి సిఎం పన్నీర్‌ సెల్వం, అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డిఎంకె, కాంగ్రెస్‌, శశికళ మేనల్లుడు దినకరన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ జయలలిత ఫొటోను అసెంబ్లీలో ఏర్పాటు చేయడంపై డిఎంకె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జయలలిత ఫొటోను తక్షణమే తొలగించాలంటు డిఎంకె ఎమ్మెల్యే అన్భళగన్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తమిళనాడు అసెంబ్లీలో తిరుళ్లువర్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్, ముత్తు రామలింగదేవర్, అన్నాదురై, రాజాజీ, ఎంజీఆర్‌ తదితర నేతల ఫొటోలు ఉన్నాయి.

21:14 - February 12, 2018

ఢిల్లీ : సిపిఎం సీనియర్‌ నేత, సిఐటియూ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మహ్మద్‌ అమీన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. ప్రస్తుతం సిపిఎం కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అమీన్‌ మృతి పట్ల సిపిఎం సంతాపం వ్యక్తం చేసింది. అమీన్‌ అందించిన సేవలు కార్మిక వర్గ చైతన్యానికి ప్రతీకగా నిలిచాయని కొనియాడింది. కోల్‌కతాలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన మహ్మద్‌ అమీన్ 14 ఏళ్ల వయసులోనే జూట్‌ మిల్లులో పనిచేశారు. 1946లో ఆయన కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరిన ఆయన వివిధ పదవులు నిర్వహించారు. కార్మిక నేతగా సేవలందించిన అమీన్‌- పశ్చిమబెంగాల్‌ సిపిఎం ప్రభుత్వంలో రవాణా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1988-94 మధ్య రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.

21:12 - February 12, 2018

ఢిల్లీ : దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్‌ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.....ఓ బస్సును తగలబెట్టారు. హింసను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

లా చదువుతున్న 26 ఏళ్ల దిలీప్‌ శుక్రవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలోనే లగ్జరి కారులో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులకు దిలీప్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతే...వారు దిలీప్‌ను రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్‌తో చితకబాదారు.

తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం కన్నుమూశాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో ప్రధాన ఆరోపితుడు రైల్వే ఉద్యోగి విజయ్ శంకర్ సింగ్‌ పరారీలో ఉన్నాడు. విజయ్‌ శంకర్‌సింగ్‌ డ్రైవర్‌తో దిలీప్‌పై హాకీ స్టిక్‌తో దాడి చేసిన రెస్టారెంట్ వెయిటర్‌ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు నమోదైంది.

దళిత విద్యార్థి హత్యపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి దుఃఖాన్ని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత విద్యార్థి హత్యను సిపిఎం ఖండించింది. దిలీప్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. యూపిలో యోగి సర్కార్‌ పగ్గాలు చేపట్టాక మతతత్వ శక్తుల మనోబలం మరింత పెరిగిందని...భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

21:10 - February 12, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని సంజ్వాన్‌లో ఆర్మీ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఎ-మహ్మద్‌ హస్తం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని... ఉగ్రవాద నేత మసూద్‌ అజహర్‌ కశ్మీర్‌కు టెర్రరిస్టులను స్పాన్సర్‌ చేస్తున్నారని సీతారామన్‌ స్పష్టం చేశారు. త్వరలో ఎన్‌ఐఏ ఆధారాలను సేకరిస్తోందని మంత్రి చెప్పారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. 

21:08 - February 12, 2018

హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ 2017 అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ప్రముఖ తెలుగు కవి, రచయిత దేవిప్రియ రచించిన 'గాలిరంగు' కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. పురస్కారం కింద తామ్రపత్రం, లక్షరూపాలయ నగదును అందజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబాల్‌ ఈ వార్డులను అందజేశారు. అవార్డు అందుకోవడం తనకు చాల సంతోషం కలిగించిందని కవి, రచయిత దేవీప్రియ అన్నారు. 

21:05 - February 12, 2018

హైదరాబాద్ : నల్గొండలో తమ ఆధిపత్యం కోసం కోమటిరెడ్డి సోదరులు నీచ రాజకీయాలు చేస్తున్నారమని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో కాల్‌ డెటాను పోలీసులు విడుదల చేయలేదన్నారు. ఆరోపణలు చేస్తున్న వారే రిలీజ్‌ చేశారని చెప్పారు. వీటిపై విచారణ చేయాలని పోలీసులను కోరినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. 

21:03 - February 12, 2018

పశ్చిమగోదావరి : పేద వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే లక్ష్యమని సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహాసభలు స్పష్టం చేశాయి. వామపక్ష, అభ్యుదయ శక్తుల ఐక్యతతో బడుగులకు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా.. కొత్త శకానికి నాంది పలుకుతామని మహాసభలు ప్రతినబూనాయి. మూడు రోజుల పాటు సాగిన మహాసభల చివరిరోజైన నేడు.. పి.మధును రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో జ‌రుగుతున్న సిపిఎం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన సమావేశాల్లో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశాల చివరి రోజైన సోమవారం... పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. పి. మ‌ధును మహాసభ రెండోసారి ఎన్నుకుంది. ఆయనతో పాటు.. 14 మంది స‌భ్యుల‌తో కార్యద‌ర్శివ‌ర్గాన్ని, 60 మంది సభ్యుల‌తో రాష్ట్ర కార్యవ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితోపాటు.. 10 మంది స‌భ్యుల‌తో ఆహ్వానితుల క‌మిటీని ఏర్పాటు చేశారు.

మూడు రోజుల పాటు సాగిన మహాసభల్లో.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత చర్చ సాగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వే జోన్‌ ఏర్పాటు, ఉక్కు పరిశ్రమ నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాలని మహాసభ కేంద్ర, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి నిధులు, బడ్జెట్‌ లోటు భర్తీకి నిధుల విడుదల వంటి హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందని మహాసభ అభిప్రాయపడింది. బిజెపికి మిత్ర పక్షంగా ఉంటూ విభజన హామీలను సాధించడంలో టిడిపి ఘోరంగా విఫలమైందని కూడా మహాసభ అభిప్రాయపడింది.

సామాన్య రైతుల భూములను, అసైన్డ్‌ భూములను బలవంతంగా గుంజుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు వత్తాసు పలుకుతోందని.. మహాసభలో నేతలు ఆరోపించారు. పారిశ్రామిక రంగంలో మూసివేతలు పెరుగుతున్నాయని, కార్మిక హక్కులను కాలరాసే చట్టాలు చేస్తున్నారని, విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్లకు అండగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన నామమాత్రంగా ఉందని, విద్య, వైద్యం, మానవాభివృద్ధి సూచికలలో రాష్ట్రం బాగా వెనకబడి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి పాలనలో అగ్రకుల దురహంకార దాడులు, దళిత, ఆదివాసీ, బలహీనవర్గాలపై పెరుగుతున్నాయని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక నవరత్నాల పేరుతో ఓట్లకోసం ప్రజాకర్షక వాగ్దానాలను గుప్పించడం తప్ప మౌలిక విధానాలలో వైసిపికీ, ఇతర పాలక పార్టీలకూ తేడా లేదని సీపీఎం మహాసభలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని ఉపయోగించుకుని మతోన్మాద శక్తులు బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, అభ్యుదయ, లౌకిక విధానాలతో ప్రజలకు ఊరట కలిగించగలిగే ప్రత్యామ్నాయం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అన్నారు. ఈదిశగా.. ఇప్పటిదాకా చేపట్టిన ఉద్యమాలకు మించిన కార్యాచరణను రూపొందిస్తున్నామని పార్టీ కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన మధు వెల్లడించారు. తెలుగు ప్రజల సమైక్యతకోసం నిలిచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందన్న నేతలు.. అలాంటి ఘన వారసత్వాన్ని కొనసాగించి.. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల చేతికి అధికారం వచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 

21:00 - February 12, 2018

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది జీహెచ్‌ఎమ్‌సీ. ఒకే సమయంలో వేలాది మందితో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించి గిన్నిస్‌ రికార్డును కైవసం చేసుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌ రాంనగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగర ప్రజలను ఏకం చేసేందుకు సన్నద్ధమైంది GHMC. గుజరాత్‌లోని వడోదరా మున్సిపల్‌ కార్పొరేషన్‌ 5వేల 820 మందితో రోడ్లను శుభ్రం చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డును బ్రేక్‌ చేసేందుకు GHMC ఆధ్వర్యంలో నగరంలోని రాంనగర్‌ డివిజన్‌లో 15వేల 320 మంది విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి రోడ్లను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మహముద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, బల్దియా కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. భారీ సంఖ్యలో జీహెచ్‌ఎమ్ సి కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

గతేడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. అయితే అన్ని నగరాలతో పోల్చినప్పుడు 22వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది నగరంలోని పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ, ఓపెన్‌ యూరినేషన్‌ అంశాల్లో మెరుగుదల సాధించడంతో మెట్రో నగరాల్లో ముంబయి తర్వాత హైదరాబాద్‌కు ఓడిఎఫ్‌గా గుర్తింపు లభించింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో కూడా హైదరాబాద్‌కు మంచి గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో కృషి చేస్తుంది బల్దియా. అందులో భాగంగానే నిర్వహించిన కార్యక్రమంలో హైరేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుకుందామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

పారిశుధ్యం విషయంలో GHMC భారీ మార్పులు తీసుకువస్తుందన్నారు బల్దియా కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి. ఈ నెల 15 నుండి 21 వ తేది వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కాంపిటిషన్‌ జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో నిలిచేందుకు సినీతారలు, మంత్రులతో ప్రచారం చేపట్టింది బల్దియా. మరి ఈ ఏడాది GHMCకి ఏ గుర్తింపు దక్కుతుందో వేచి చూడాలి. 

20:57 - February 12, 2018

హైదరాబాద్ : రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా పోరు ఉధృతమవుతోంది. దీనికోసం జనసేన అధినేత తీసుకుంటున్న చొరవకు రాష్ట్రంలో రాజకీయ, మేధావి వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. జేఏసీ ఏర్పాటుకు చర్యలు వేగం అందుకున్నాయి. దీనిలో భాగంగా సీనియర్‌ రాజకీయనేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లో భేటీ అయిన జయప్రకాశ్‌ నారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సీపీఐ నేత రామకృష్ణ జేఏసీ ఏర్పాటుపై చర్చించారు. దాంతోపాటు కేంద్రంనుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల అంశాన్ని తేల్చేందుకు నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు తదిత అంశాలపై చర్చించారు. చర్చల సారాంశాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు వివరించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు.

మరోవైపు ఇప్పటికే వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఇదే ఊపుతో ప్రత్యేక హోదా పోరును మరింత ఉధృతం చేస్తామంటున్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. దీనికోసం ఈనెల 18న విజయవాడలో వివిధ రాజకీయపార్టీలు, పార్లమెంట్‌ సభ్యులు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే అంశాన్ని జేపీ, ఉండవల్లితో చర్చించామన్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ తలపెట్టిన జేఏసీ ఏర్పాటు హైదరాబాద్‌లో నేతల భేటీతో మరింత ఊపందుకుందని జనసేన ప్రతినిధులు అంటున్నారు. 

20:56 - February 12, 2018

కేంద్రం, రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఆందోళనకారంగా మారుతోంది..దళితులపై దాడులు కొనసాగుతున్నాయి. ఆగడాలు పెరగడమే కాదు...దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాడులు..వివక్ష ఘటనలు జరుగుతున్నాయి. గోరక్షక్ దళాల పేరిట ప్రైవేటు ఆర్మీ బయలుదేరి కొట్టి చంపిన ఘటనలున్నాయి. ఈ అంశంపై టెన్ టివి విజయవాడలో స్టూడియోలో జరిగిన ప్రత్యేక చర్చలో దళిత సోషల్ ముక్త్ మంచ్ జాతీయ కార్యదర్శి, సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

ముగిసిన వైసీపీ కీలక సమావేశం...

నెల్లూరు : వైసీపీ కీలక సమావేశం ముగిసింది. భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ లో ఏపీకి అన్యాయంపై సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హోదా మన హక్కు - ప్యాకేజీతో మోసపోవద్దని పేర్కొంటూ అన్ని కలెక్టరేట్ల ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 5వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. 

20:20 - February 12, 2018

రెండు వేల పదిహేడు వర్కళ్ల.. తెలంగాణ రాష్ట్రంల ఏ ఆడబిడ్డనన్న నీళ్ల బిందె వట్కోని రోడ్ల పొంట గనిపిస్తె నేను ఊకునె మన్షిని గాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిన కొత్తల గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జెప్పిన ముచ్చట.. ఇగ సారువారి ముచ్చట్లు ఎట్లుంటయో ఎర్కేగదా..? రెండువేల పదిహేడు వొయ్యింది.. ఇప్పుడు పద్దెన్మిది.. పాండ్రి ఊర్లపొంటి పరిస్థితి జూద్దాం..గీ ముచ్చట జూడాలంటే వీడియో సూడుండ్రి...

20:13 - February 12, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా..? ఈ తెల్గుదేశం పార్టీ ఎంపీలను పొరపాటున గూడ నమ్మేరు సుమా..? చంద్రబాబు రాశిన నాట్కమే ప్రదర్శిస్తున్నరు..అమ్మరే కొడ్క నిన్న పొద్దుందాముల.. తెలంగాణ జేఏసోళ్లకు జర్రంతల గుండాగినంత పనైంది.. ఒకప్పుడు యుద్దాలు ఒక గ్రౌండుల అయ్యేటియి.. సైనికులు గుర్రాలు ఏస్కోని కత్తులు వట్కోని పొడ్సుకుందురు...రైతుకు మద్దతు ధర దొర్కితె.. రైతులే సర్కారుకు ఉల్టా నాల్గువేలు ఇస్తరుగదా..? రెండువేల పదిహేడు వొయ్యింది.. ఇప్పుడు పద్దెన్మిది.. పాండ్రి ఊర్లపొంటి పరిస్థితి జూద్దాం..నల్లగొండ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి.. ఆయన ప్రజలకు సేవ జేయవల్సింది ఇడ్సిపెట్టి ప్రజలతోని చెప్పులు మోపిచ్చుకుంటున్నడు..పక్వానికి రాని అర్టిపండ్లను దీస్కొచ్చి అవ్వి ఎర్రగ అయ్యెతందుకు ఏమేం పనులు జేస్తున్నరో సూడుండ్రి.. ఇవ్వి మనకు తెల్వయ్ గదా..? ముద్దుగున్నయని డజన్ డజన్ కొని తింటా ఉంటం..గిసొంటి ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

19:47 - February 12, 2018

విభజన చట్టం హామీల రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం..ప్రధానపక్షం మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. ఏపీకి చాలా నిధులు ఇచ్చామని బీజేపీ పేర్కొంటుండగా బీజేపీ లెక్క‌ల‌న్నీ త‌ప్పేనని టీడీపీ పేర్కొంటోంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసి లెక్క తేలేందుకు..నిజాలు బయటకు చెప్పేందుకు జేఎఫ్ సీని ఏర్పాటు చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో నగేష్ (విశ్లేషకులు), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), శ్రీధర్ (బిజెపి), పట్టాభిరామ్ (టిడిపి) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కరన్ నగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ వీరమరణం...

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లోని కరన్ నగర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు..భారత బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ వీరమరణం పొందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బిజెపి..టిడిపి వంచించాయి - ధర్మాన...

నెల్లూరు : ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపి ప్రజలను వంచిచాయని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. హోదా ఇస్తామన్న బిజెపి, తెస్తామన్న టిడిపి చేతులెత్తేశాయన్నారు. హోదా కుదరదని ప్యాకేజీ ఉత్తమమని చంద్రబాబు పేర్కొనడం జరిగిందని, ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదన్నారు. ఎన్డీయేలో కొనసాగుతూ ప్రజలను టిడిపి మోసం చేస్తోందన్నారు. 

అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు అపోహలే - ఉత్తమ్...

హైదరాబాద్ : సోషల్ మీడియాలో వస్తున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టుతో పార్టీకి సంబంధం లేదని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ లిస్టును నమ్మవద్దని, ఆ లిస్టుకు ఎలాంటి పీసీసీ అధికారిత లేదని..అవి అపోహలేనన్నారు. 

తంగేళ్లమూడి వద్ద రోడ్డు ప్రమాదం...

పశ్చిమగోదావరి : ఏలూరు వద్ద తంగేళ్లమూడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - బైక ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. తల్లికుమారుడు మంగ..సాయిగా గుర్తించారు. 

18:57 - February 12, 2018
18:55 - February 12, 2018

పశ్చిమగోదావరి : వివిధ రంగాల్లో సేవలందించిన 150మంది మహిళలను ఒకే వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని తాడేపల్లి గూడెంలోని మాధవవరంలో మనోజ్ఞ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగింది. మహిళా మణులను మనోజ్ఞ ట్రస్టు నిర్వాహకులు సత్కరించారు. రాజకీయ..సామాజిక..సేవా రంగాలే కాకుండా ఇతర రంగాల్లో ఉన్న మహిళలను సత్కరించడం విశేషం. ఈ ప్రాంతంలో మొదటి సారి కార్యక్రమం కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 

18:42 - February 12, 2018
18:42 - February 12, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు కాసేపటి క్రితం ముగిశాయి. గత మూడు రోజులుగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ, రాష్ట్రీయ..ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి రోజైన సోమవారం పార్టీ కార్యదర్శి..ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాగా 14 మంది సభ్యులతో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. 10 మంది సభ్యులతో ఆహ్వానితుల కమిటీగా రాష్ట్ర కార్యవర్గం రూపొందింది. 

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో రానున్నకాలంలో పోరాటాలు..ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన పెనుమల్లి మధు తెలిపారు. కాసేపటి క్రితం భీమవరంలో జరుగుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా మధుతో టెన్ టివి ముచ్చటించింది. ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా..విభజన చట్టం తదితర సమస్యలు ఎన్నో ఉన్నాయని, ఈ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం జరపాల్సినవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పునరంకితం కావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. కౌలు రౌతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని..ఎన్నో సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, ప్రజల పక్షం నిలవాలని మహాసభ పిలుపునివ్వడం జరిగిందన్నారు. 14వ తేదీన ఉదయం వామపక్షాల సమావేశం జరుగుతుందని, ఇప్పటిదాక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం చాలా కాలంపాటు పోరాటం చేస్తున్నామని..వివిధ జిల్లాల్లో విభజన హామీల కోసం పోరాటం చేస్తామని తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటం చేయాలి ? ఎవరెవరిని కలుపుకొని పోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భం కాదని..ప్రజా ఉద్యమాల సందర్భమని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తామన్నారు. గతంలో ఎలాంటి పోరాటాలు చేశామో అంతకంటే ఉధృతంగా పోరాటం చేస్తామని, తొందరలో పోరాట కార్యచరణనను ప్రకటిస్తామని మధు తెలిపారు. 

ముగిసిన ఏపీ సీపీఎం రాష్ట్ర మహాసభలు..

పశ్చిమగోదావరి : భీమవరంలో సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ముగిశాయి. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాగా 14 మంది సభ్యులతో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. 10 మంది సభ్యులతో ఆహ్వానితుల కమిటీగా రాష్ట్ర కార్యవర్గం రూపొందింది. 

సీపీఎం సీనియర్ నేత కన్నుమూత...

న్యూఢిల్లీ : సీపీఎం సీనియర్ నేత, సీఐటీయూ పూర్వ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అమీన్ (90) కన్నుమూశారు. ప్రస్తుతం సీపీఎం కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అమీన్ కార్మిక నేతగా విస్తృత సేవలందించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అమీన్ మృతి పట్ల సీపీఎం పొలిట్ బ్యూరో సంతాపం వ్యక్తం చేసింది. ఆయన సేవలు కార్మిక వర్గ చైతన్యానికి అమీన్ సేవలు ప్రతీకగా నిలిచాయని సీపీంఎ, సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీలు సంతాపం ప్రకటించాయి. 

18:31 - February 12, 2018

రాజమహేంద్రవరం : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడం ఇప్పుడు జాతీయ అంశంగా మారిందని ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎన్డీయే మిత్రపక్షాలు ఆందోళనలో ఉన్నాయని, రాష్ట్ర బంద్ తో కేంద్రంపై ఏపీ ప్రజలు ఆగ్రహం ప్రకటించారని తెలిపారు. మార్చి 5వ తేదీ వరకు ఆశగా ఎదురు చూస్తామని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోయే కమిటీపై ఆయన వ్యాఖ్యలు చేశారు. పనిలేక ఖాళీగా ఉన్న నాయకులతో జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. 

18:27 - February 12, 2018

సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశం...

హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి జోగు రామన్న సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు పలు పరిశోధనలు నిర్వహించనున్నట్లు, ఇందుకు పది ప్రాజెక్టులు ఎంపిక చేసి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న వెల్లడించారు. 

ఏవోబీలో కాల్పులు...

విశాఖపట్టణం : ఏవోబీలో పోలీసులు..మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మల్కన్ గిరి జిల్లా జోబండ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. కటాఫ్ ఏరియాలో 70 మంది మావోయిస్టులు సమావేశమయ్యారు. పక్కా సమాచారం మేరకు ఒడిశా - ఆంధ్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ల్యాండ్ మైన్స్, తుపాకులు, ఇతర సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. 

జమ్మూకు చేరుకున్న రక్షణ శాఖ మంత్రి...

జమ్మూ కాశ్మీర్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూకు చేరుకున్నారు. ఇటీవలే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించనున్నారు. 

18:09 - February 12, 2018

నెల్లూరు : ఏపీకి విభజన హామీలు అమలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే పలు వ్యాఖ్యలు చేస్తుండడం..పవన్ ఇందులో జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు కారణంగా వైసీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని..కేంద్ర బడ్జెట్ లో కూడా వైసీపీ అధినేత జగన్ స్పందించడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా పాదయాత్రలో ఉన్న జగన్ అత్యవసర భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం పెద్దకొండూరుకు చేరుకుంది. వైసీపీ ఎంపీలు..ముఖ్య నేతలు..అందుబాటులో ఉన్న నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటం చేయాలి ? కేంద్రంపై వత్తిడి ఎలా తేవాలనే దానిపై చర్చించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు...కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చించనున్నారు. 

పవన్ 'జేఎఫ్ సి' లోగో విడుదల...

హైదరాబాద్ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలు..నిధుల కేటాయింపు..అమలు ఇతరత్రా వాటిపై పవన్ 'జేఎఫ్ సీ' ( జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన లోగో విడుదల చేశారు. 

బిజెపిపై టిడిపి ఎమ్మెల్సీ బాబు వ్యాఖ్యలు...

విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము మాట్లాడుతున్నట్లు రాజకీయాల కోసం కాదని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీ నేతల బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చాలాసార్లు ప్రధానికి సీఎం లేఖ రాశారని, నాలుగేళ్లలో రాష్ట్రానికి ముష్టి రూ. 1500 కోట్లు ఇచ్చారన్నారు. బీజేపీ దయా దాక్షిణ్యాలతో తాము బ్రతుకుతున్నామా ? అని ప్రశ్నించారు. సంవత్సరానికి రూ. 80 కోట్లు పన్ను కడుతున్నామని పేర్కొన్నారు. 

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు...

హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువును పెంచారు. దరఖాస్తుల గడువు ఈనెల 25 వరకు పెంచుతున్నట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు మరో 12 కోర్సుల అభ్యర్థులకు అవకాశం కలుగనుంది. 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గతంలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

పార్టీ నేతలతో భేటీ కానున్న జగన్...

నెల్లూరు : పార్టీ నేతలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశం కానున్నారు. కలిగిరి మండలం పెద్దకొంటూరులో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు...కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చించనున్నారు. 

వరవరరావును ఆదర్శంగా తీసుకోవాలి - జస్టిస్ చంద్రకుమార్...

హైదరాబాద్ : వరవరరావుని ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. నయీం బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వాలు నరహంతకుడిని పెంచి పోషించాయన్నారు. హైకోర్టులో జడ్సీల పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయన్నారు. 

నయీం బాధితులకు న్యాయం చేయాలి - చాడ...

హైదరాబాద్ : నయీం బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ వల్ల ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదని, చిన్న చేపలను పట్టుకుని పెద్ద వాళ్లను విడిచిపెట్టారని పేర్కొన్నారు. 

17:39 - February 12, 2018

హైదరాబాద్ : గంగిరెద్దుల వారు భిక్షాటన ద్వారా వచ్చిన బియ్యాన్ని తీసుకుని వెళుతున్న వారిపై సివిల్ సప్లయి అధికారులు ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కీసర వద్ద వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీనితో వీరంతా ఎంబీసీ నేత ఆశయ్యను కలిసి తమ గోడును వెళ్లేబోసుకొసుకున్నారు. స్సందించిన ఆశయ్య నేరుగా సివిల్ సప్లయి కమిషనర్..మంత్రి జోగు రామన్నలు కలిసి విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించి అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయిస్తామని హామీనిచ్చినట్లు ఆశయ్య తెలిపారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వారిని వదిలేసి సంచార జీవనం సాగిస్తున్న వారిపై పోలీసులు ప్రతాపం చూపెట్టడంపై ఆశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 

17:34 - February 12, 2018

హైదరాబాద్ : హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డికి బినామీగా వ్యవహరించిన యాదవరెడ్డికి చెందిన సంస్థల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఫీర్జాదీగూడలోని హరిహర రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని పురుషోత్తమ్ రెడ్డి భారీ ఎత్తున్న అవినీతి ఆరోపణలు వచ్చాయి. వ్యవహారం వెలుగుకి వచ్చిన తరువాత పురుషోత్తమ్ రెడ్డి పరారయ్యాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

17:30 - February 12, 2018

హైదరాబాద్ : ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ హైదరాబాధ్ సాధ్యమౌతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రామ్ నగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో 'స్వచ్చ సర్వక్షణ్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వేల మంది విద్యార్థులు..ఉపాధ్యాయులు పాల్గొని మూడు నిమిషాల పాటు రోడ్డు ఊడ్చి గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు. దేశంలో పరిశుభ్ర నగరంగా హైదరాబాద్ వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. 

17:21 - February 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి టి.కాంగ్రెస్ నేత రేవంత్ విరుచకపడ్డారు. ఈసారి భూముల కబ్జాలపై ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ బంధువులు కబ్జా చేసిన అసైన్ మెంట్ భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నాలు చేస్తోందని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ బంధువులు..ఇతరులు ఆక్రమించిన అసైన్ మెంట్ భూముల వివరాలపై నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.

శంషాబాద్ మహేశ్వరం మండలంలో రామేశ్వరరావు..ఆయన బంధువులు అనేక వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. అసైన్ మెంట్ భూములు ఎంత ? రామేశ్వర్ ఆధీనంలో ఉన్న భూముల వివరాలను చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ చట్టాలను చుట్టాల కోసం సవరించి వందల..వేల ఎకరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని..దీనిపై సుదీర్ఘ పోరాటం జరుపుతామన్నారు. నిషేధం ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూముల వివరాలను చెప్పాలన్నారు. 

17:10 - February 12, 2018

కర్నూలు : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. 4వ టౌన్ పోలీస్ స్టేష్ పరిధిలో చోరీలు పెరిగిపోతున్నాయి. వారానికి ఒకసారి దొంగలు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కృష్ణా నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉన్న రాధా అనే మహిళ మెడలో నుండి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:07 - February 12, 2018
17:03 - February 12, 2018

హైదరాబాద్ : స్వాతంత్రం అనంతరం గ్రామీణ భారతంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన చట్టాల్లో నరేగా చట్టం ఒకటని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకం సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా వేతనాలు ఇవ్వాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడం లేదని తెలిపారు. ఈ పద్ధతిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని, నరేగా చట్టం అమలయ్యే విధంగా కాంగ్రెస్, ఐఎన్ టీయూసీ పోరాటం చేస్తుందన్నారు. 

16:58 - February 12, 2018

విజయవాడ : పోలవరం పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు అందరూ వారంలోగా నివేదికలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం పోలవరంలో జరుగుతున్న నిర్మాణ పనులపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఇప్పటి దాక జరిగిన పనులు..జరుగుతున్న పనులను వివరించాలని సూచించారు. పనుల్లో వేగం పెంచాలని..పనుల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలని సూచించారు. వచ్చే వారం పోలవరాన్ని సందర్శిస్తానని తెలిపారు. 

16:54 - February 12, 2018

హైదరాబాద్ : అనైతిక సంబంధం కలిగి ఉందనే కారణంతో సస్పెండ్ కు గురైన ఏఎస్పీ సునీతారెడ్డి కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఓ సీఐతో ఏఎస్పీ సునీత అక్రమ సంబంధం కలిగి ఉందని భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఏఎస్పీ..సీఐలను సస్పెండ్ చేశారు. 

ఇదిలా ఉంటే తాజాగా మరొకటి వెలుగు చూసింది. సురేందర్ రెడ్డిని వివాహం చేసుకోవడానికి ముందే ఏఎస్పీ సునీతారెడ్డికి పెళ్లి జరిగిందని తెలుస్తోంది. తెలుగు యాంకర్ సోదరుడు లెనిన్ ను వివాహం చేసుకున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రెండు నెలల అనంతరం లెనిన్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి సురేంద్ రెడ్డిని వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ట్విస్ట్ తో సురేంద్ రెడ్డి షాక్ తిన్నాడని సమాచారం. మొదటి పెళ్లి వివాహం రహస్యంగా ఉంచి ఎందుకు పెళ్లి చేసుకుంది ? సురేంద్ రెడ్డితో ఎలాంటి విబేధాలు వచ్చాయి ? సీఐతో అక్రమ సంబంధం..ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది. 

సస్పెండ్ అయిన ఏఎస్పీ సునీత కేసులో ట్విస్ట్...

హైదరాబాద్ : ఏఎస్పీ సునీతారెడ్డి వివాహేతర కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ తెలుగు యాంకర్ తమ్ముడు లెనిన్ ను సునీత వివాహం చేసుకుందని తేలింది. అతనిపై వరకట్నం కేసు పెట్టి విడాకులు తీసుకున్నట్లు, అనంతరం సురేందర్ రెడ్డిని వివాహం చేసుకుంది. కానీ సునీత సీఐతో అనైతిక సంబంధం పెట్టుకుందన్న విషయాన్ని భర్త సురేంద్ రెడ్డి గుట్టురట్టుని చేశాడు. ప్రభుత్వం ఏఎస్పీ సునీతారెడ్డిని సస్పెండ్ చేసింది. 

నల్గొండ హత్యపై మంత్రి జగదీష్ స్పందన...

హైదరాబాద్ : నల్గొండ హత్యపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. తాము హత్యా రాజకీయాలు చేయమని, జానారెడ్డి నియోజకవర్గంలో లేని గొడవలు..ఘర్షణలు..ఎందుకు నల్గొండలోనే జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేమని టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోందన్నారు. శ్రీనివాస్ హత్య కేసుకు ఎమ్మెల్యే వీరేశానికి సంబంధం లేదని తెలిపారు. 

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం...

విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారానికి ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి రూ. 5లక్షలు ఇవ్వనుంది. ఆత్మహత్య...ఒత్తిడి..గుండెపోటు కారణాలతో మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

15:54 - February 12, 2018

ఢిల్లీ : తాము తలుచుకొంటే కేవలం మూడు రోజుల్లో ఆర్మీని తయారు చేయగలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ స్పందించారు. భగవత్ చేసిన వ్యాఖ్యలు భారత సైనికులను అవమానపరిచేవిగా ఉన్నాయని, దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను..జాతీయ జెండాను అగౌరవపరిచాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోహన్ భగవత్ సిగ్గు పడాలని తెలిపారు. ఇదిలా ఉంటే భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్మీని..ఆర్ఎస్ఎస్ తో పోల్చలేదని..బీహార్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సమావేశంలో మోహన్ భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ తమ జవాన్లను సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పడితే అదే ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇస్తే మూడు రోజుల్లో స్వయం సేవక్ తయారవుతారని వ్యాఖ్యానించారు. 

15:48 - February 12, 2018

ఢిల్లీ : హర్యానా రాష్ట్రంలో జాట్ లపై నమోదైన కేసులను ఖట్టర్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జాట్ నేతలతో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ నిర్నయం తీసుకున్నారు. దీనితో ఫిబ్రవరి 15వ తేదీన తలపెట్టిన ర్యాలీని జాట్ ఉపసంహరించుకుంది. కేసులను తొలగించకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభను అడ్డుకుంటామని జాట్లు హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఖట్టర్ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. 2016లో రిజర్వేషన్ల కోసం జాట్ సామాజిక వర్గం చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 

15:33 - February 12, 2018

కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండి మండలం కేంద్రంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పట్టా భూములు లాక్కొని వేరే వారికి ఆ స్థలంలో డబుల్ బెడ్ రూం నివాసాలు కట్టించడానికి ఏర్పాటు చేస్తున్నారని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఇందులో ఎమ్మెల్యే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

వైఎస్ హాయంలో చొప్పదండి మండల కేంద్రంలో 150 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద పట్టాలు ఇచ్చారు. కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా మరికొంతమంది ఇళ్లు నిర్మించకపోవడంతో ఆ స్థలాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఖాళీ స్థలాలను గుర్తించి అందులో డబుల్ బెడ్ రూం నివాసాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ లబ్దిదారులు ఎవరనున్నారో వారికి కాకుండా టీఆర్ఎస్ అనుచరులు..ఇతరులకు డబుల్ బెడ్ రూం నివాసాలు కట్టబెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15:29 - February 12, 2018
15:24 - February 12, 2018
15:22 - February 12, 2018

విజయవాడ : విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఏపీ మంత్రి కామినేని వెల్లడించారు. అందుకు తగిన న్యాయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, టిడిపి ఎంపీలు మాట్లాడే దానిపై తాను సమాధానం చెప్పలేనని తెలిపారు. రైల్వేజోన్ తో పాటు ఇతర ప్రాజెక్టులకు ఎంత నిధులు ఇవ్వాలనే దానిపై కేంద్రం యోచిస్తోందని మంత్రి కామినేని తెలిపారు. 

15:19 - February 12, 2018

విజయనగరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తాను స్పందించలేనని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...బడ్జెట్ పై చర్చ జరుగుతోందని..కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించడం జరిగిందని, ఎయిర్ పోర్టు ఆదాయ..ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏ పని చేసినా ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పని చేస్తామని పేర్కొన్నారు. 

15:15 - February 12, 2018

హైదరాబాద్ : ఎప్పుడూ వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' ఈసారి టిడిపి ఎంపీలను టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా..ఇతర హామీలు అమలుపరచాలని టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న ఆందోళనపై 'వర్మ' వివాదాస్పద ట్వీట్లు చేశారు. టిడిపి ఎంపీలను బ్రోకర్ తో పోల్చారు. వారి వల్ల పరువు పోతోందని ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఇలాంటి ఎంపీలను చూసి ప్రధాన మంత్రి మోడీ జోక్ గా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టిడిపి ఎంపీలు బ్రోకర్లకు తక్కువగా అంటూ ట్వీట్ చేసిన వర్మ మరో ట్వీట్ కూడా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన టిడిపి పార్టీ పరువును జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారంటూ వర్మ పేర్కొన్నారు. వర్మ చేసిన ట్వీట్ పై టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

15:10 - February 12, 2018

విజయవాడ : నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం నుండి జూన్ 7వ తేదీ వరకు 116 రోజుల పాటు 'జలసంరక్షణ' ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ...ప్రస్తుతం 1.15 లక్షల నీరు ఇస్తున్నట్లు, కొత్తగా 75 లక్షల ఆయుకట్టు ఎకరాలకు నీరందించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీటి సంరక్షణనను ఉద్యమంలా ముందుకు తీసుకపోవాలని సూచించారు. శ్రీకాకుళం వంశధార..నాగావళి నదులను అనుసంధానం చేసి నీరందిస్తున్నట్లు తెలిపారు. 116 రోజులు వీలైనన్నీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు.

 

14:52 - February 12, 2018
14:50 - February 12, 2018

విజ్ఞానాభివృద్ధి వల్ల మానవ భౌతికస్థితి గతులు మెరుగవుతాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో సైన్స్...సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర ఏ మాత్రం తక్కువ కాదని కొంతమంది మహిళా శాస్త్రవేత్తలు నిరూపించారు. మరి వారి గురించి పెద్దగా తెలియదు. సాధారణంగా శాస్త్రవేత్తలంటే అందరికీ న్యూటన్..ఐన్ స్టీన్...ఇతరులు గుర్తుకొస్తారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా శాస్త్రవేత్తల గురించి తెలుసా ? చరిత్ర గతిని మార్చేవేసిన కొంతమంది మహిళా శాస్త్రవేత్తల కథనాలతో మానవి 'స్పూర్తి' ప్రత్యేక కార్యక్రమం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

అందరితో కలుస్తామన్న ఉండవల్లి...

హైదరాబాద్ : అందరితో కలుస్తాం..ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వేత్త ఉండవల్లి పేర్కొన్నారు. జేపీతో ఆయన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జేపీ దగ్గర సమాచారం అంతా ఉంది... నిపుణుల నుండి సమాచారం తీసుకోవాలని తెలిపారు. ఇంకా ఎవరెవరిని పిలవాలన్నది ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 

రాజమండ్రి ఎస్పీ..విజయనగరం అదనపు డీఎస్పీగా...

విజయవాడ : రాజమండ్రి అదనపు ఎస్పీగా వి.ఎస్.ఆర్.మూర్తి, విజయనగర అదనపు డీఎస్పీగా ఎం.రాజశేఖర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

14:27 - February 12, 2018
14:26 - February 12, 2018

హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్ మహిళ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యను అమర్ కాంత్ అనే వ్యక్తి చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అమర్ కాంత్ గురించి బార్ సిబ్బంది ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఏడాది కాలంగా ది లాల్ స్ట్రీట్ బార్ లో అమర్ కాంత్ పనిచేస్తున్నాడని, ఇతను తమందరితో సన్నిహితంగా ఉండేవాడని...ప్రతి శుక్రవారం బార్ లో పూజ చేసి అందరికీ ప్రసాదం ఇచ్చేవాడన్నారు. మద్యం సేవించడం..మాంసం తినే అలవాటు అమర్ కాంత్ కు లేదని పేర్కొన్నారు. ఇతనిది బీహారీ బ్రాహ్మణ కుటుంబం అని, మొదటి ఐదు నెలలు ఆఫీసు గెస్ట్ హౌస్ లోనే ఉన్న ఇతను అనంతరం రెంట్ రూమ్ లోకి మారిపోయాడన్నారు. గర్భిణీనిని అమర్ కాంత్ హత్య చేశాడన్నట్లు టీవీల్లో వచ్చిన వార్తలు చూడడం జరిగిందని, ఇంతటి ఘోరానికి ఒడిగడుతాడని ఊహించలేదని బార్ సిబ్బంది తెలిపారు. జనవరి 25 నుండి పనిలో రావడం లేదన్నారు. యాజమాన్యం ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ చేసి ఉందన్నారు. 

అమరావతిలో జల సంరక్షణ...

విజయవాడ : అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా జల సంరక్షణ కార్యక్రమం జరుగుతోంది. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పాలవాగు పూడికతీత పనులను సీఎం బాబు ప్రారంభించారు. జలంతోనే జగతి - జలంతోనే ప్రగతి అనే నినాదంతో ఉద్యమం చేపట్టనున్నట్లు, ఈనెల 12 నుండి జూన్ 7 వరకు ఉద్యమంలా సాగించనున్నట్లు బాబు తెలిపారు. 

14:16 - February 12, 2018

హైదరాబాద్ : విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది ? ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది ? నిధులు ఎన్ని వచ్చాయి ? ఎంత ఖర్చయ్యాయి ? ఇతరత్రా అంశాలపై పవన్ వేసిన కమిటీ అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై లోక్ సత్తా అధినేత జేపీ, రాజకీయ వేత్త ఉండవల్లితో పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కమిటీ వేయనున్నట్లు ఇందులో జేపీ, ఉండవల్లితో పాటు ఇతర మేధావులు, నిపుణులుంటారని పవన్ పేర్కొన్నారు.

అందులో భాగంగా సోమవారం లోక్ సత్తా అధినేత జేపీని ఉండవల్లి కలిశారు. వీరు జరిపన భేటీలో సీపీఐ నేత రామకృష్ణ కూడా ఉన్నారు. పవన్ తో జరిపిన భేటీ అంశాలపై చర్చించారు. విభజన హమీలు..ప్రత్యేక హోదా..అమలుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి ? నిధులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఉండవల్లి..జేపీ..రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కమిటీ పని స్టార్ట్ అయ్యిందని..ఎవరెవరితో మాట్లాడాలి ? ఎవరితో మాట్లాడితే నిజం బయటకొస్తుందనే దానిపై కూలంకుషంగా చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే వివరాలు తెలియచేస్తామన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలపై ఉండవల్లి..జేపీలు చాలా హోం వర్క్ చేశారని, మరికొంత మంది నిపుణులతో కలిసి ఎలాంటి అంశాలు ముందుకు తీసుకరావాలి ? అనే దానిపై చర్చించినట్లు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అంశాలు..ఏ అంశాలు అమలు చేయాలనే దానిపై చర్చించాల్సి ఉందన్నారు. తాము గత మూడేళ్లుగా పదే పదే పోరాటాలు చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.

ముగిసిన జేపీ..ఉండవల్లి..రామకృష్ణ భేటీ...

హైదరాబాద్ : లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణతో ఉండవల్లి..సీపీఐ నేత రామకృష్ణ..లు జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. 

ఫెనో ప్లాస్ట్ పరిశ్రమ మూసివేత...

సంగారెడ్డి : పటన్ చెరు పారిశ్రామిక వాడలో ఫెనో ప్లాస్ట్ పరిశ్రమను మూసివేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యంపై మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా సింపోని పార్క్ హోమ్స్ వాసులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పీసీబీకి ఆదేశాలు జారీ చేశారు. 

హైకోర్టును ఆశ్రయించిన హెచ్ఎండీఏ డైరెక్టర్ బినామీలు...

హైదరాబాద్ : ఏసీబీ అధికారులు వేధిస్తున్నారంటూ హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి బినామీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వేర్వేరుగా నిపుణ్ రెడ్డి..శ్రీనివాస్ రెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ పై విచారణ 14కు వాయిదా వేయగా నిపుణ్ రెడ్డి పిటిషన్ పై విచారణ 19కి వాయిదా వేసింది. 

13:45 - February 12, 2018

తూర్పుగోదావరి : ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న పాలకుల హామీలు మాటలకే పరిమతమయ్యాయి. అందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలోని ప్రభుత్వ ఆస్పత్రి. సామర్లకోట పట్టణం, మండలంలో మొత్తం కలిపి లక్షా 50వేల మంది జనాభా ఉన్నారు. కాని వీరికి తగిన వైద్యసదుపాయాలు మాత్రం అందడలేదు. సామర్లకోట ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితిపై మరింత సమాచారం వీడియో చూడండి.

13:21 - February 12, 2018

హైదరాబాద్ : ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ హైదరాబాద్‌ సాధ్యమని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే... ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాంగనర్‌ కార్పొరేటర్‌ వి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 15వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. మూడు నిమిషాలపాటు రోడ్లు ఊడ్చి గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌...స్వచ్ఛనగరంగా హైదరాబాద్‌ను దేశంలో మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌, వినోద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితోపాటు పలువురు ప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.  

జూబ్లీహిల్స్ లో పేలుడు

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ లో పేలుడు జరిగింది. రోడ్డు నెం.48లో ఓ ఇంటి నిర్మాణం కోసం జిలెటిన్ స్టీక్స్ తో పారిశ్రామిక వేత్త పేలుళ్లకు పాల్పడ్డాడు. పేలుడు దాటికి ఓ ఇల్లు కూలింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి పోలీసులు, బాంబ్ స్క్వాడ్ చేరుకున్నారు. 

13:11 - February 12, 2018

హైదరాబాద్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణను కలిశారు. వీరి మధ్య విభజన హామీలు గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:10 - February 12, 2018

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ లో పేలుడు జరిగింది. రోడ్డు నెం.48లో ఓ ఇంటి నిర్మాణం కోసం జిలెటిన్ స్టీక్స్ తో పారిశ్రామిక వేత్త పేలుళ్లకు పాల్పడ్డాడు. పేలుడు దాటికి ఓ ఇల్లు కూలింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి పోలీసులు, బాంబ్ స్క్వాడ్ చేరుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:17 - February 12, 2018

హైదరాబాద్ : నగరంలో హవాల గుట్టురట్టైంది. అబిడ్స్, బంజారాహిల్స్, అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పోలీసులు అదుపులో గుజరాత్ చెందిన వ్యాపారి పటేల్ ఉన్నారు. వారి వద్ద నుంచి కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

టీడీపీ ఎంపీలు జోకర్లు : వర్మ

గుంటూరు : రామ్ గోపాల్ వర్మ మరో ట్విట్ చేశారు. టీడీపీ ఎంపీల పోరుపై వర్మ సెటైర్లు వేశారు. వర్మ ఎంపీలను జోకర్లుగా పోల్చారు. ఎంపీల వల్ల టీడీప పరువుపోతుందని ఆర్ జీవీ అన్నారు.

12:07 - February 12, 2018

గుంటూరు : రామ్ గోపాల్ వర్మ మరో ట్విట్ చేశారు. టీడీపీ ఎంపీల పోరుపై వర్మ సెటైర్లు వేశారు. వర్మ ఎంపీలను జోకర్లుగా పోల్చారు. ఎంపీల వల్ల టీడీప పరువుపోతుందని ఆర్ జీవీ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్

గుంటూరు : నీరు, ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సన్ లో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

11:23 - February 12, 2018

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. హెలికాప్టర్లు, డ్రోన్లు ద్వారా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, రక్షణ, హోంశాఖ సమీక్షిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

11:04 - February 12, 2018
10:29 - February 12, 2018

హవాలా రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ : నగరంలో హవాలా రకెట్ గుట్టురట్టైంది. అబిడ్స్, బంజారాహిల్స్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇన్ కం ట్యాక్స్ అధికారుల సాయంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ని సూన్ జ్వాన్ ఆర్మీ క్యాంప్ లో ఉగ్రవాదుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

10:11 - February 12, 2018
09:03 - February 12, 2018

మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్ మహిళ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇంట్లోనే మహిళను కుటుంబ సభ్యులు ముక్కలుగా నరికారు. ఆ తర్వాత గోనెసంచిలో మూటగట్టి బొటానికల్ గార్డెన్ లో పడేశారు. ఆ వెంటనే అమర్ కాంత్ ఝూ, కుటుంబ సభ్యులు బీహార్ పారిపోయారు. కుటుంబ గొడవలతోనే మహిళ హత్య జరిగినట్టు తెలుస్తోంది.

08:21 - February 12, 2018

హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్ మహిళ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇంట్లోనే మహిళను కుటుంబ సభ్యులు ముక్కలుగా నరికారు. ఆ తర్వాత గోనెసంచిలో మూటగట్టి బొటానికల్ గార్డెన్ లో పడేశారు. ఆ వెంటనే అమర్ కాంత్ ఝూ, కుటుంబ సభ్యులు బీహార్ పారిపోయారు. కుటుంబ గొడవలతోనే మహిళ హత్య జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

అనంతలో దారుణం

అనంతపురం : జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లులో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేటకొడవళ్లతో దాడి చేయడంతో చౌడయ్య అనే వ్యక్తి మృతి చెందాడు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

08:04 - February 12, 2018

అనంతపురం : జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లులో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేటకొడవళ్లతో దాడి చేయడంతో చౌడయ్య అనే వ్యక్తి మృతి చెందాడు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ప్రకాశంలో పామూరులో అగ్నిప్రమాదం

ప్రకాశం : జిల్లా పామూరులో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి టింబర్ డిపో దగ్ధం అయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి రూ.30 లక్షలు ఆస్తినష్టం జరిగింది. 

శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

కర్నూలు : శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గజబాహన సేవ చేయనున్నారు. 

07:51 - February 12, 2018

బీజేపీ అధ్యక్షుడు కొన్ని లెక్కలు చెప్పారని, గల్లా జయదేవ్ కొన్ని లెక్కలు చెప్పారని, కానీ నాలుగేళ్ల పాటు ఈ లెక్కలు ఎక్కడికి వెళ్లాయని, టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని సపోర్ట్ చేశాయని, రాకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఏపీ ప్రజలకు జవాబు చెప్పె బాధ్యత తెలుగు దేశం ప్రభుత్వానికి ఉందని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజల కోసమే బీజేపీతో కొనసాగుతుందని, కేంద్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉండడం వల్లే బీజేపీ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏపీకి సపోర్ట్ చేస్తున్నామని, టీఆర్ఎస్ కూడా కేంద్రంపై పోరాడుతుందని, పెద్ద నోట్ల రద్దు అప్పుడు తము కేంద్రానికి సపోర్ట్ చేశామని టీఆర్ఎస్ నేత మన్నే గోవర్థన్ రెడ్డి అన్నారు.టీడీపీ, వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారని, ప్రాంతీయతత్వాన్ని రెచ్చెగొట్టె ప్రయత్నాలు చేస్తున్నామని, బీజేపీ నేత రాకేష్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

గుంటూరులో రౌడీషీటర్ హత్య

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో రౌడీషీటర్ దారుణ హత్య గురైయ్యాడు. రామిరెడ్డిపేటలో నాగరాజు అనే రౌడీషీటర్ ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. 

నెల్లూరులో కొనసాగుతున్ జగన్ యాత్ర

నెల్లూరు : వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర నెల్లూరు కొనసాగుతుంది. ఆయన రోజు పలు సభల్లో పాల్గొననున్నారు. 

07:37 - February 12, 2018

కేజీబీవీ టీచర్స్ ఉద్యమం 13 ఏళ్లుగా కొనసాగుతుంది. కానీ కాస్తుర్భగాంధీ స్కూల్లో ప్రతి ఒక్కరు మహిళలే ఉండాలని, కానీ అక్కడ సెక్యూరిటీ లేదని, తము రూ.6వేల జీతం నుంచి పని చేస్తున్నామని, ప్రస్తుతం మా జీతం రూ.20 వేలు ఉన్నాయని, తమకు సంవత్సరానికి 15 లీవ్ లు మాత్రమే ఉంటుందని సీఐటీయూ నాయకురాలు రాజకుమారి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:36 - February 12, 2018

మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మొత్తం 71 మంది మృతి టేకాఫ్‌ అయిన 10 నిమిషాల్లోనే ప్రమాదం.. దట్టమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని అధికారుల ప్రాథమిక అంచనా రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విమాన సిబ్బందితో పాటు.. 65 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. AN-148 విమానం మాస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన పది నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్గునోవ్‌ గ్రామ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానం గాల్లో ఉండగానే మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం ముక్కలు ముక్కలుగా అయిపోయి.. వాటి శకలాలు మంచులో చెల్లాచెదురుగా పడిపోయాయి. మంచు దట్టంగా ఉండడంతో సహాయ సిబ్బంది చేరుకోవడం ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికి ఉండకపోవచ్చని అధికారులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన వెంటనే రంగంలోకి దిగిన సిబంది.. దాదాపు 10 గంటల పాటు విమానం కోసం అన్వేషించారు. సరబోవ్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తున్న AN 148 ఆర్గునోవ్‌ గ్రామ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు.

సర్వీసులోకి తీసుకుని 8 ఏళ్లే
కూలిన AN 148 విమానం కొత్తది అని ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెబుతున్నారు. దీనిని సర్వీసులోకి తీసుకుని 8 ఏళ్లే అవుతుందన్నారు. ఈ విమానం అంతర్జాతీయ సర్వీసులకు నడిపినట్లు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సంతాపం తెలిపారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన రష్యా రవాణా మంత్రి మాక్సిమ్‌ సోకలోప్‌ విమానంలోని సిబ్బంది సహా ప్రయాణికులందరూ మృతి చెందినట్లు ధృవీకరించారు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమానయాన అధికారులంటున్నారు. గతంలోనూ మంచు వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయంటున్నారు. 

07:34 - February 12, 2018

హైదరాబాద్ : టైమ్‌.. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనది. మనం ఏ పని చేయాలన్నా.. ప్రతి పని టైమ్‌ టూ టైమ్‌ కావాలంటే మనకు తెలియాల్సింది సమయం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ గడియారాన్ని చూడాల్సిందే. ఇప్పుడైతే... సెల్‌ఫోన్లు, వాచీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ... గతంలో ఆ పరిస్థితే వేరుగా ఉండేది. గడియారం అంతగా ప్రాచుర్యం రోజుల్లో అందరూ టైమ్‌ తెలుసుకునేందుకు బ్రిటీష్‌ పాలకులు పలు ప్రాంతాల్లో ఎత్తైన టవర్లు కట్టి వాటిలో గడియారాలు ఏర్పాటు చేశారు. గంట గంటకు అవి చేసే శబ్ధంతో ప్రజలు టైమ్‌ తెలుసుకుని తమ కార్యకలాపాలు నిర్వహించుకునేవారు. ప్రతి ప్రాంతంలో ఇలాంటి గడియారాలు ఏర్పాటు చేశారు. ఈ టవర్లు ఉన్న ప్రాంతాలన్నీ క్లాక్‌టవర్‌ ఏరియాలుగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న క్లాక్‌ టవర్లు ఇప్పుడు ఆదరణ లేక వెలవెలబోతున్నాయి.

1865 తొలిసారి క్లాక్‌టవర్‌
హైదరాబాద్‌ నగరంలో 1865లో బ్రిటీష్‌ రెసిడెన్సీ ఆస్పత్రి ప్రాంగణంలో బ్రిటీష్‌ పాలకులు తొలిసారి క్లాక్‌టవర్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది సుల్తాన్‌బజార్‌గా మారింది. ఆ తర్వాత ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ప్రజల సౌకర్యార్ధం 1889లో ప్రముఖ కట్టడమైన చార్మినార్‌లో నాలుగువైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. అలాగే పాలకుల మన్ననలు పొందేందుకు సంస్థాన అధికారులు, పారిశ్రామికవేత్తలు నగరంలోని ఇతర ప్రాంతాల్లో క్లాక్‌ టవర్లు నిర్మించి నిజాం పాలకులకు కానుకగా ఇచ్చేవారు. లండన్‌లో తయారైన గడియారాలను తెప్పించి క్లాక్‌ టవర్లలో అమర్చేవారు. చార్మినార్‌లో ఉన్న గడియారం విలువ అప్పట్లోనే 60 వేల రూపాయలు ఉండేదట. ప్రస్తుతం సుల్తాన్‌బజార్‌లో ఉన్న తొలి క్లాక్‌టవర్‌ ఇప్పుడు పని చేయడం లేదు. ఇక ఆరో నిజాం సంస్థానంలో విధులు నిర్వహించిన నవాబ్‌ జఫర్‌జంగ్‌ బహదూర్‌ 1903లో పతేమైదాన్‌ క్లాక్‌టవర్‌ను నిర్మించి నవాబుకు బహూకరించారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అదికూడా కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఇక నగరంలో ఉన్న 22 క్లాక్‌ టవర్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. 1890లో మహబూబ్‌ క్లాక్‌ టవర్‌, 1935 మోజంజాహీ మార్కెట్‌లో క్లాక్‌ టవర్లు ఏర్పాటు చేశారు.

ఎత్తైన టవర్లలో మూడోది
సికింద్రాబాద్‌లో ఉన్న క్లాక్‌టవర్‌ బ్రిటీష్‌ కంటోన్మెంట్‌ ప్రగతి చిహ్నంగా 1896లో ఏర్పాటు చేశారు. ఈ టవర్‌ దేశంలోని ఎత్తైన టవర్లలో మూడోది. దీనిని దివాన్‌ బహదూర్‌ లక్ష్మీనారాయణ రాంగోపాల్‌ బహుకరించారు. దీనికి 2005లో హెరిటేజ్‌ అవార్డు దక్కింది. సికింద్రాబాద్‌ జేమ్స్‌ స్ట్రీట్‌లో ఉన్న క్లాక్‌టవర్‌ను సంఘసేవకుడు రాంగోపాల్‌ 1900లో నిర్మించారు. వీటితోపాటు కాచిగూడ రైల్వేస్టేషన్‌, నాంపల్లి రైల్వేస్టేషన్‌, ఫలక్‌నుమా, మోండామార్కెట్‌, చౌ మొహల్లా ప్యాలెస్‌, అబిడ్స్‌ చర్చ్‌ ఇలా మొత్తం 22 క్లాక్‌ టవర్లు నగరంలో ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా మారాయి. వీటి నిర్వహణ చూడాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఎంతో చరిత్ర గల క్లాక్‌టవర్లకు పునర్‌వైభవం తేవాల్సిన అవసరముందని నగరవాసులంటున్నారు. ఒకప్పుడు ఎంతో దర్జాగా దర్పాన్ని వెలగబెట్టిన క్లాక్‌టవర్లు.. అనేక కారణాలతో నిరాధరణకు గురికావడం బాధాకరం. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి క్లాక్‌టవర్లను పునర్‌వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. 

07:33 - February 12, 2018

చిత్తూరు : తిరుపతికి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకృష్ణదేవరాయకాలంలో నిర్మించబడింది. ప్రాచీన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం నిదర్శనంగా నిలిచింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

పెద్ద సంఖ్యలో భక్తులు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు వారంపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రి ఉత్సవ సమయంలో ఆలయం లోపలే కాకుండా బయట ప్రధాన వీధులైన నెహ్రూ వీధి కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనతో కిటకిటలాడుతుంటాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి శివుడు ఊరేగుతుంటే ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక.

తెప్పలపై స్వామి వారిని
అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోలేని పేదలు .. స్వామి అమ్మవారి కళ్యాణంతో పాటు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి ఆలయం అందంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతులలో శ్రీకాళహస్తీశ్వరుని మూలవిరాట్టు కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు 8 వ తేదీనుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 

07:31 - February 12, 2018

సిద్దిపేట : ప్రభుత్వ విద్యాలయాలు నేటికీ కనీస వసతులు లేక కునారిల్లుతున్నాయి. సౌకర్యాల లేమి, ఉపాద్యాయుల కొరతతోపాటు.. సరిపడా తరగతి గదులు కూడా లేని దుస్థితిలో విద్యా బోధన కొనసాగుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వల్ల చాలా మంది విద్యార్థులు పాఠశాల విద్యతోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్ధులకు ఉచిత బస్‌పాస్‌లు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని యోచిస్తోంది. విద్యార్థులకు ఉచిత పథకాలను అమలు చేస్తే ఎందరో విద్యార్థులు విద్యావంతులయ్యే అవకాశం ఉంటుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారుగా పన్నెండు వేల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు.. సంగారెడ్డి జిల్లాలో ఇరవై కళాశాలల్లో ఐదువేల మంది, మెదక్‌లో పదహారు కళాశాలల్లో మూడు వేల మంది, సిద్దిపేట జిల్లాలో ఇరవై కళాశాలల్లో ఐదు మేలమంది విద్యార్థులు ఉచిత పథకాలతో ఉన్నత విద్య వైపు వెళ్ళగలుగుతారు.

జూనియర్‌ కళాశాలల్లో తగ్గిన చేరికలు
ప్రభుత్వం విద్యార్థులకు చేయూత ఇవ్వకపోతే... ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తగ్గిన చేరికలు మరింత తగ్గుముఖం పడతాయి. పాఠశాల విద్య నుంచే ఇబ్బందులు లేకుండా ఇంటర్‌ విద్యను అందించాలన్న సంకల్పంతో... ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ రుసుము రద్దు చేసింది. ఇదే పరంపరలో బస్‌ పాస్, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆచరణలో పెట్టాలని అద్యాపకులు కూడా కోరుతున్నారు. గతంలో అనేక సమీక్షా సమావేశాల్లో లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.ప్రభుత్వం అందించే గోరంత సాయంతో... విద్యార్థులకు కొండంత లాభం కలుగుతుందన్న అభిప్రాయాన్ని ఇటు విద్యార్థులు, అటు లెక్చరర్లు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థుల మంచి కోసం చేస్తున్న ఆలోచనను అందరూ స్వాగతిస్తున్నారు. 

07:30 - February 12, 2018

హైదరాబాద్ : భాగ్యనగర మణిహారం హుస్సేన్ సాగర్ పర్యాటకంగానే కాదు బతుకుపై విరక్తి చెందిన వారికి చివరి మజిలీగా కూడా మారుతోంది. నిత్యం వేలాది మంది పర్యాటకులు, ఏదో ఒక సాంస్కృతిక, క్రీడా సంరంభాలు జరిగే స్థలమిది. వీటన్నిటి పర్యవేక్షణ, రక్షణ కోసం లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు అయింది. ఇక్కడి పోలీసులు సాగర్‌ పరిధిలో ఉన్న ప్రాంతానికే పరిమితమై శాంతి భద్రతలతో పాటు సాగర్‌లో ఆత్మహత్యకు పాల్పడే వారిని రక్షిస్తున్నారు.

అనేక కారణాలతో
ఆర్థిక కారణాలతో, పిల్లలు ఆదరించలేదని తల్లిదండ్రులు, భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మహిళలు, ప్రేమ వైఫల్యం ఇలా కారణాలేవైనా సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇలా బలవన్మరణానికి పాల్డడేందుకు వస్తున్న వారిని గుర్తించి పోలీసులు అడ్డుకుంటున్నారు. తాజాగా హుస్సెన్ సాగర్ లో ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కానిస్టేబుల్, స్థానికుడు కాపాడారు. ఓ యువకుడిని ప్రేమించిన యువతి... ఇంట్లో వాళ్లు బలవంతంగా వేరే పెళ్లి చేస్తుండడంతో మనస్థాపానికి గురై హుస్సెన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యం చేసింది. దీనిని గమనించిన కొందరు యువతిని కాపాడి... లేక్ పోలీసులకు అప్పగించారు. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

2015 సంవత్సరంలో 207 మంది
ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిని 2015 సంవత్సరంలో 207 మందిని కాపాడారు లేక్‌ పోలీసులు. 2016 లో 222 మందిని, 2017లో 168 మందిని, ఈ ఏడాది ఇప్పటి వరకు 24 మందిని కాపాడారు. 2015లో 47 మంది సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో 39 మంది, 2017లో 28 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.అయితే 7 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించిన సాగర్‌ చుట్టూ శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కేవలం 39 మంది సిబ్బందే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిబ్బందిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం చర్యలు కూడా చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

07:28 - February 12, 2018

హైదారబాద్ : కొండాపూర్‌లో సంచలనం సృష్టించిన గర్భిణి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి... భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గర్భం దాల్చిన ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో.. అడ్డుతొలగించుకునేందుకు అంత్యంత పాశవికంగా హత్య చేశాడు. కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పలు కీలక ఆధారాలతో మృతురాలి వివరాలను సేకరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసులో నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. బైక్‌ నెంబర్ ఆధారంగా.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఉద్యోగం
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నిందితుడు... భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. గర్భందాల్చిన ఆమె పెళ్లికి ఒత్తిడి తేవడంతో అడ్డుతొలగించుకునేందుకు గతనెల 28న హత్య చేశాడు. చిన్న చిన్న ముక్కులుగా నరికి, గోనెసంచిలో కుక్కి బైక్‌పై తీసుకొచ్చి బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. హత్య చేసిన రెండు రోజులకే నగరం విడిచివెళ్లిపోయాడు. బైక్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... బౌద్ధనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని నిందితునిగా అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో మరో వ్యక్తి సహకరించినట్టు పోలీసులు తేల్చారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

07:26 - February 12, 2018

నిజామాబాద్ : జిల్లా జక్రాన్‌పల్లిలో పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. పసుపుకు క్వింటాకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలకు 4 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఎర్రజొన్నలకు 1500 రూపాయలు కూడా ఇవ్వని దళారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేయించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Don't Miss