Activities calendar

13 February 2018

21:36 - February 13, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీఐటీయూ నిర్ణయించింది. ఈ నెల 26 న జరిగే ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ తర్వాత ఉద్యమ స్వరూపాన్ని ఖరారు చేస్తామని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత చెప్పారు. సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎస్వీకేలో జరిగిన జాతీయ బ్రూవరీస్‌, డిస్టిలరీస్‌ కార్మిక సంఘాల ప్రతినిధుల సమావేశంలో హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ విధానాలను ఎండట్టారు. 

21:35 - February 13, 2018

గుంటూరు : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ... అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అంబానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో అమరావతి చేరుకుని.. నేరుగా రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రానికి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రియల్‌ టైం గవర్నెన్స్‌ పనితీరును పరిశీలించారు. ఈ భేటీ అనంతరం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాయలసీమలో సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయా కంపెనీలను ఒప్పించాలని ముఖేశ్‌ను మంత్రి లోకేష్‌ కోరారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే.. రెండువారాల్లోగానే సెల్‌ఫోన్‌ల కంపెనీకి శంకుస్థాపన చేస్తామని ముఖేశ్‌ అంబాని తెలిపారు. 

21:35 - February 13, 2018

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ లాలూచీ పడిందని మధు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ టీడీపీ-బీజేపీలు ఎన్నికల స్టంట్‌కు తెరతీశాయని మండిపడ్డారు.

ఏపీకి చాలా నిధులు
మరోవైపు అధికార పార్టీ తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. విభజన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2017 బడ్జెట్‌ తర్వాత ఏపీకి చాలా నిధులు ఇచ్చారని కేంద్రాన్ని మెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అసలు నిధులే ఇవ్వలేదన్నట్టుగా మాట్ల్లాడుతన్నారని బీజేపీ ఎమ్మెల్సీ నిలదీశారు. అసలు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేందుకు 2022 వరకు

అటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరని తప్పుపట్టారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఇస్తానందో రాష్ట్రప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నిధులు ఇవ్వాలని గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చెప్పిన విషయాన్ని ఎంపీ గీత గుర్తుచేశారు.

వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలతో భేటీ
ఒకరు ఇచ్చామంటారు.. మరొకరు ఇవ్వలేదంటారు.. అసలు వారు ఎంత ఇచ్చారో..వీరు ఎంత తీసుకున్నారో లెక్కలు తేలాల్సిందే అంటున్నారు సీపీఎం నేతలు. ఏపీకి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. దీనికోసం ఈనెల 14న విజయవాడలో 10 వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలతో భేటీ నిర్వహిస్తున్నామని.. అనంతరం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. అటు జనసేనపార్టీ చేస్తున్న జేఏసీ ప్రయత్నాలను కూడా తాము స్వాగతిస్తున్నామని సీపీఎం నేతలు ప్రకటించారు. ప్రజలను మోసం చేయడంలో బీజీపీ, టీడీపీలు ఒకదాన్ని మించి మరొకటి పోటీపడుతున్నాయని వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజలను కదిలించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని లెఫ్ట్‌పార్టీలు తేల్చి చెబుతున్నాయి. 

21:33 - February 13, 2018

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్‌.. కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. కేంద్రానికి అల్టిమేటం లాంటిది జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అని. కేంద్రం హోదా ఇచ్చేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు జగన్‌. పార్లమెంటు బడ్జెట్‌ మలివిడత సమావేశాలు ప్రారంభమయ్యే నాటి నుంచి దశలవారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మార్చి 1న పార్టీ ప్రజాప్రతినిధులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. తర్వాత మార్చి 3న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో భేటీ నిర్వహించి... మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు
ఇక మార్చి 5నుంచి మళ్లి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారని జగన్‌ తెలిపారు. ఏప్రిల్ 6వరకు పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సభలో ఎంపీలు నిరసన కొనసాగిస్తారని.. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే.. ఏప్రిల్ 6న తమపార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్‌ చేసిన ఈ ప్రకటనను తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎద్దేవా చేశారు. గతంలోనూ జగన్‌ ఇలాంటి ప్రకటనలు చేసి వెనక్కు తగ్గారని విమర్శించారు. రాజీనామాలకు జగన్‌ ప్రకటించిన తేదీకి రాజీనామాలు సమర్పించినా.. అవి ఆమోదం పొందేందుకు రెండు మూడు నెలలు పడుతుందని ఆలోపే సాధారణ ఎన్నికలు వస్తాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. మొత్తానికి, ప్రత్యేక హోదా నినాదంతో జగన్‌ చేసిన తాజా ప్రకటన.. ఎపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది.

20:43 - February 13, 2018

వైసీపీ నిర్ణయం కీలకమైందని, ఇప్పటికే అన్ని వర్గాల వారు ఏపీ కోసం పోరాటం మొదలు పెట్టారని, జగన్ గత ఏడాది తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారని, జగన్ కేవలం ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారని, జనగ్ చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని మోడీ పై మాత్రం మౌనంగా ఉన్నారని ప్రముఖ విశ్లేషకులు తెలపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:39 - February 13, 2018
20:32 - February 13, 2018

భారత్ 274/7

పోర్ట్ ఎలిజిబెత్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి దక్షణాఫ్రికా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

19:57 - February 13, 2018

ఈ శివరాత్రి ఒక్కపొద్దుల ముచ్చట జూస్తె గమ్మతుంటది.. అంటె నిష్టూరంగని.. అసలు ఆ ఒక్కపొద్దులేంటియి..? ఆ కథ ఏంది..? ఆ అభిషేకాలేంటియి.. ఉపాసం పేరుమీద ఒకాయిన తెల్లారంగ పండ్ల పుల్లేశి.. సాయంత్రందాక తోముకుంటనే గూసుంటడు.. సరే ఇవ్వన్ని ముచ్చట్లు గాదుగని.. కుద్దు ఒక పీఠాధిపతే జెప్తున్నడు మీరు అసలైన శివరాత్రి జేస్కుంటలేరని.. గాయిన మాటలన్న ఇనుండ్రి జర..

రెండువేల పందొమ్మిది అసెంబ్లీ ఎన్నికలళ్ల.. కాంగ్రెస్ పార్టీ తర్పున పోటీ జేశెటోళ్లది అర్వైమంది లిస్టు ఇడ్దల జేశిండ్రని సోషల్ మీడియాల రెండు పత్రాలు సంచారం జేస్తున్నది.. సరే అది ఎవ్వడు జేశింది ఏం కథ అనేది తర్వాతగని.. ఆ చేశే చెడ్పుపనిగూడ సక్కగ జేయరాకపాయే.. సచ్చినోనికి గూడ టికెట్టు ఇచ్చేశిండ్రంటే.. వారీ అవద్దంగూడ సరిగ సర్క్యూలేట్ జేయరాకపోతె ఎట్లరా నీకు అంటున్నడు పొంగులేటి..

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిగారు.. ఇంతకు మీరు కన్ఫ్యూజన్ల ఉన్నరా..? లేకపోతె జనమే కన్ఫ్యూజన్లున్నరా అర్థమైతలేదు.. ఒకసారి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం కెళ్లి ఎమ్మెల్యేగ పోటీ జేస్తాని నీ టికెట్ నువ్వే ప్రకటించుకుంటవ్.. మళ్లొకపారి.. ఈసారి నల్లగొండ పార్లమెంట్ స్థానంల పోటీ జేయవోతున్న అంటవ్..? వారంరోజులళ్లనే ఇంత కన్ఫ్యూజన్లుంటే.. ఏందన్నట్టు..?

తవురో రామన్న.. పేదోళ్ల ఉసురు దల్గి.. పోతవురో రామన్న.. మా బిడ్డల ఉసురు తలిగి.. పశిగుడ్డుల ఉసురుతలిగి.. పేదోళ్ల పొట్టగొట్టినోడు ఎవ్వడు పొడ్గుగాడు.. పుర్గులవడి సచ్చిపోతడు.. ఈ ముచ్చట బోజగుట్ట పేదల ఎంటవడ్డ దొంగ సర్కారు నాయకులదన్నట్టు.. పాపం నిండు గర్భిణి అని గూడ సూడకుంట నూకేశి ఇల్లు గూలగొట్టిండ్రంటే.. ఇంత దుర్మార్ఘమా..?

మీకెందుకు మీ పాతిండ్లన్ని కూలగొట్టుండ్రి.. తెల్లారే ముగ్గువోశి అద్భుతమైన.. ప్రపంచం నివ్వెర పోయే డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టిస్తమని పాపం దళితుల ఇండ్లను కూలగొట్టిచ్చిండ్రు.. మన బంగారు తెలంగాణ సర్కారోళ్లు.. చెర్లున్నోన్ని బాయిలేశినట్టు.. పాపం పాతిండ్లళ్ల బత్కుతున్న జనాన్ని రోడ్ల మీదేశి.. పత్తలేకుంట వారిపోయిండ్రు..

బహుజనుల వీరుడు.. మారోజు వీరన్నకు జన్మనిచ్చిన జాతి అది.. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం జేశిన జయశంకర్ సారుకు జన్మనిచ్చిన కులం అది.. మలిదశ ఉద్యమంల తొలి ఆత్మార్పణ జేశిన శ్రీకాంత చారిని కన్న జాతి అది.. ఎప్పుడు త్యాగాలకే పరిమిత మైన విశ్వబ్రాహ్మణ బిడ్డలు.. ఇప్పుడు ఒక్కటైతున్నరు.. త్యాగాలు మాయి బోగాలు మీయా అని ప్రశ్నిస్తున్నరు..

నీయక లేని ఇకమాతుల వడ్తున్నది ఈ తెలంగాణ సర్కారు.. ఇచ్చేదే ఒక్కటి రెండు సర్కులంటే.. అవ్విటికి మళ్ల ఏలుముద్రలు వెట్టాల్నంట.. రాషను దుక్నంల కథ జెప్తున్ననమ్మా..? పాపం కూలినాలి బంజేస్కోని తిర్గుతున్నం.. మా ముద్రలు కలుస్తలేవని బియ్యమిస్తలేరు అని జనం బాధపడ్తున్నరు.. సూడుండ్రి వాళ్ల గోస..

నిజాంబాదు జిల్లా నవీపేట మండలం జనాన్ని కొన్నిరోజుల సంది చుచ్చువోపిస్తున్న చిర్తపులి మొత్తం మీద జీవిడ్సింది.. గొర్లను మ్యాకలను.. సంపుకుంట సంచరిస్తున్నఈ పులి జెయ్యంగ జనం పాణాలు చేతుల వట్కోని బత్కిండ్రు.. ఎప్పుడు ఊర్లెకొస్తదో ఏం జేస్తదో అని భయపడ్డరు.. మొత్తం మీద మరి ఏబండి తాకిందో జీవిడ్సింది..

గుంటూరు జిల్లాలో విషాదం

గుంటూరు : జిల్లా తాడేపల్లిలో విషాదం నెలకొంది. గుంటూరు కాల్వ వద్ద చెత్తచెదారం తొలగిస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఖాళీ, గుండాలు మంగళగి వాసులుగా గుర్తించారు. 

19:11 - February 13, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరుకు సిద్ధమైన్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న జగన్...మార్చి5 నుంచి ఏప్రిల్ 6 తేదీల్లో నిరసనలతో.. కేంద్రంపై ఒత్తిడి తెస్తామని.. అప్పటికీ సానుకూల స్పందన రాకుంటే.. ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్‌ ప్రకటించారు. నెల్లూరుజిల్లా కలిగిరిలో జరిగిన సభలో జగన్ ఈ ప్రకటన చేశారు. విభజన హామీల అణలు కోసం... కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని జగన్ తేల్చి చెప్పారు. 

 

పాతబస్తీలో బాలురులకు కరెంట్ షాక్

హైదరాబాద్ : పాతబస్తీ ఓల్డ్ మలక్ పేటలో 33కేవీ హైటెన్షన్ వైర్లు తాకి ఇద్దరు బాలురులకు తీవ్ర గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

విజయవాడ చేరుకున్న ముఖేష్ అంబానీ

కృష్ణా : రిలయన్స్‌ అధిపతి ముఖేశ్‌ అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ సందర్శిస్తారు. ఆర్‌టీజీఎస్‌ పనితీరును ముఖేశ్‌ అంబానీ పరిశీలిస్తారు. ఏపీలో జియో ఫోన్ల తయారీ పరిశ్రమ, ఐటీ సంస్థల ఏర్పాటుపై చర్చిస్తారు. 

18:48 - February 13, 2018

ఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి 21 వ తేదీ వరకు సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించే రాజకీయ తీర్మానం ముసాయిదాను పార్టీ నాయకలు విడుదల చేశారు. 80 పేజీల తీర్మానంపై డివిజన్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్‌ పోరాటాలు, సీపీఎం రాజకీయ పంథా... తదితర అంశాలను ముసాయిదాలో చేర్చారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

18:47 - February 13, 2018

గుంటూరు : విలువలతో కూడిన విద్య సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. విద్యార్థులు కష్టపడికాకుండా.. ఇష్టపడి చదవాలన్నారు. అనుకున్నది సాధించనంత మాత్రానా ఎవరూ కుంగిపోకూడదని చెప్పారు. జీవితాన్ని ఎవరూ అర్ధాంతరంగా ముగించవద్దన్నారు. గుంటూరులోని శ్రీవైష్ణవి అభ్యాస్‌ విద్యాసంస్థల వార్షికోత్స వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడెల.... విద్యార్థి భవిష్యత్‌కు ఇంటర్‌ విద్య ఎంతో కీలకమన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌...విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చదవాలని సూచించారు. అనంతరం ఓ పాటపాడి అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

18:47 - February 13, 2018

అనంతపురం :  ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ఇండస్ట్రీ సమావేశం జరిగింది. ఏపీసీఈఐ అధ్యక్షుడు జయశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఈవెంట్‌ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఇతర రాష్ట్రాల సంస్థలు ఏపీలో ఈవెంట్లు నిర్వహించడం వలన స్థానికులు జీవనోపాధి కోల్పోతున్నారని ఏపీసీఈఐ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ఇండస్ట్రీ ఏర్పాటైందని సంఘం అధ్యక్షుడు జయశంకర్‌ చెప్పారు. అన్ని జిల్లాలో శాఖలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

18:47 - February 13, 2018

కృష్ణా : రిలయన్స్‌ అధిపతి ముఖేశ్‌ అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ సందర్శిస్తారు. ఆర్‌టీజీఎస్‌ పనితీరును ముఖేశ్‌ అంబానీ పరిశీలిస్తారు. ఏపీలో జియో ఫోన్ల తయారీ పరిశ్రమ, ఐటీ సంస్థల ఏర్పాటుపై చర్చిస్తారు.  మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:46 - February 13, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరుకు సిద్ధమైన్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న జగన్...మార్చి5 నుంచి ఏప్రిల్ 6 తేదీల్లో నిరసనలతో.. కేంద్రంపై ఒత్తిడి తెస్తామని.. అప్పటికీ సానుకూల స్పందన రాకుంటే.. ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్‌ ప్రకటించారు. నెల్లూరుజిల్లా కలిగిరిలో జరిగిన సభలో జగన్ ఈ ప్రకటన చేశారు. విభజన హామీల అణలు కోసం... కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని జగన్ తేల్చి చెప్పారు. 

18:45 - February 13, 2018

మేడ్చల్ : కీసరగుట్టలో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి.. ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వేగంగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:43 - February 13, 2018

విశాఖ : హా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విశాఖపట్నంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయానికి పోటెత్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

రెండో వికెట్ కోల్పోయిన భారత్

పోర్ట్ ఎలిజిబెత్ : దక్షణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ(36)రనౌట్ అయ్యాడు.

రోహిత్ హాఫ్ సెంచరీ

పోర్ట్ ఎలిజిబెత్ : దక్షణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానం విడుదల

ఢిల్లీ : సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో చర్చించే సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానం విడుదల చేశారు. 80పేజీల బుక్ లెట్ తో సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానం ఉంది. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు హైదరాబాద్ లో జరగనున్న జాతీయ మహాసభల్లో ఈ తీర్మానాన్ని  సీపీఎం ఆమోదించనుంది. 

టీడీపీ కోర్ కమిటీతో చంద్రబాబు భేటీ

గుంటూరు : టీడీపీ కోర్ కమిటీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ ఆందోళనలపై చర్చించారు. వైసీపీ ఆందోళనలను పట్టించుకోవాల్సిన అసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ పోరాడటం లేదనే విషయం ప్రజలకు అర్థమైందని సీఎం చంద్రబాబు అన్నారు. 

ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవిని : జగన్

నెల్లూరు : ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవిని అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఏప్రిల్ 5వరకు హోదా కోసం నిరసన చేస్తామని, హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ స్పష్టం చేశారు.

17:20 - February 13, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవిని అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఏప్రిల్ 5వరకు హోదా కోసం నిరసన చేస్తామని, హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:08 - February 13, 2018
17:07 - February 13, 2018
17:06 - February 13, 2018
17:06 - February 13, 2018
17:05 - February 13, 2018
17:05 - February 13, 2018
17:05 - February 13, 2018

ప్రేమజంట ఆత్మహత్యయత్నం

భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. హిరిప్రియ, సాయికుమార్ అనే ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హరిప్రియ మృతి చెందగా, సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది.

15:01 - February 13, 2018

సిరిసిల్ల : జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆలయా అభివృద్ధికి ఇప్పటికే భూమిని సేకరించమని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:58 - February 13, 2018

ఇతర దేశాల్లో స్మార్ట్ పోర్స్ ఉటుందని దాన్ని ఎవరు పట్టించుకోవడంలేదని, కానీ తాజా చేసిన సర్వేల్లో పోర్న్ కూడా ఒక వ్యసానంగా మారుతుందని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి పోర్న సైట్లను నిషేధించాలని సామాజిక నాయకురాలు దేవి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:51 - February 13, 2018

భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. హిరిప్రియ, సాయికుమార్ అనే ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హరిప్రియ మృతి చెందగా, సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హన్మకొండ హంటర్ రోడ్డు వాస్తవ్యులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:22 - February 13, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని తాడేపల్లి గూడెంలో నిట్ కాలేజీలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే జరిగిన ర్యాగింగ్ ఘటనలో నిట్ ర్యాంగింగ్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను సీనియర్..జూనియర్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నిట్ కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ర్యాగింగ్ ఘటనలో కళాశాల నుండి ఒకరిని బహిష్కరించగా మరో ఐదుగురిపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల బహిష్కరణను ఇతర విద్యార్థులు వ్యతిరేకించారు. ఆ రోజు జరిగింది ఘర్షణ మాత్రమేనని, ర్యాగింగ్ కాదని పేర్కొన్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని, చిన్న తప్పిదానికి కాలేజీ నుండి నుండి బహిష్కరించడం సరికాదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు హెచ్చరించారు. 

ఆత్మహత్య చేసుకుంటామన్న నిట్ విద్యార్థులు...

పశ్చిమగోదావరి : తాడేపల్లి గూడెంలోని నిట్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వ్యవహారంలో ఆరుగురు విద్యార్థులపై వేటు పడింది. ఓ విద్యార్థిని కాలేజీ నుండి బహిష్కరించిన యాజమాన్యం మరో ఐదుగురిపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ విధించారు. సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ సీనియర్, జూనియర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ రోజు జరిగింది ఘర్షణ మాత్రమేనని, ర్యాగింగ్ కాదని బాధితుడు పేర్కొన్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని, చిన్న తప్పిదానికి కాలేజీ నుండి నుండి బహిష్కరించడం సరికాదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు హెచ్చరించారు. 

శ్రీనగర్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్...

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రంతా పోలీసులు..ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కరణ్ నగర్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై నిన్న ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. 

బొటానికల్ మర్డర్..మీడియా ఎదుట నిందితులు...

హైదరాబాద్ : తన ప్రియుడు వికాస్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో గర్భిణీ పింకీని మమత దారుణంగా హత మార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. బొటానికల్ గార్డెన్ లో గర్భిణీ హత్య కేసులో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వికాస్ తో కొంతకాలంగా మమత వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల క్రితం బీహార్ నుండి పింకీ హైదరాబాద్ వచ్చింది. 

12:57 - February 13, 2018
12:46 - February 13, 2018

విజయవాడ : విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇలాంటి హామీలు నాలుగేళ్లుగా నాన్చుతూ వస్తున్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున్న ఉద్యమం నిర్మిస్తామన్నారు. రూ. 6600 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే రూ. 421 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, పోలవరం రూ. 971 కోట్లు ఇచ్చిందని, ఇంకా రూ. 3400 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి నిర్మిస్తామని చెప్పారని..కానీ నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. రాష్ట్ర మహాసభలో చర్చించడం జరిగిందని, రాష్ట్రంలో కలిసొచ్చే వారితో పెద్ద ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఉద్యమం నడిచిందని, 32 మంది యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోతే అప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి నోటి వెంట 'సుప్రీంకోర్టుకు వెళుతాం' అన్న దాని తరువాత రాజకీయ వేడి నెలకొందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నడుమ ఈనెల 8వ తేదీన వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, కానీ బంద్ మంచిది కాదని..ఇబ్బందులు వస్తాయని బాబు పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం అంటూ టిడిపి కొత్త కథలు చెబుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు.

స్వతంత్రంగా ఉద్యమాన్ని పైకి తీసుకపోయే విధంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై బుధవారం ఉదయం 11గంటలకు వామపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఉద్యమంపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు. బిజెపి నిధులు లెక్కలు ప్రస్తావిస్తుంటే ఉన్న విషయాలను టిడిపి స్పష్టంగా చెప్పలేకపోతోందని..రాష్ట్ర ప్రయోజనాలను నేలరాస్తోందన్నారు పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ టిడిపి పట్ల ప్రజా వ్యతిరేకత - మధు..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో టిడిపి పట్ల ప్రజావ్యతిరేకత వ్యక్తమౌతోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇలాంటి హామీలు నాలుగేళ్లుగా నాన్చుతూ వస్తున్నారని విమర్శించారు. రూ. 6600 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే రూ. 421 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, పోలవరం రూ. 971 కోట్లు ఇచ్చిందని, ఇంకా రూ. 3400 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. 

11:33 - February 13, 2018

కేంద్ర నిధులు ఎక్కడ ఖర్చు చెశారు ? - సోము వీర్రాజు...

విజయవాడ : కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఒక సంవత్సరంలోనే ఏపీకి 16 యూనివర్సిటీలు ఇచ్చారని, అమరావతి నిర్మాణానికి రూ. 2500 కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. భవనాల నిర్మాణానికి రూ. 1500 కోట్లు కేంద్రం ఇవ్వగా మరో వెయ్యి కోట్లు వెంకయ్య నాయుడు ఇచ్చారన్నారు. ఏపీపై బిజెపికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని..అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.  

11:21 - February 13, 2018

విజయవాడ : విభజన హామీల రగడ ఇంకా కొనసాగుతోంది. టిడిపి..బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రం అధికంగానే నిధులు ఇచ్చిందని బిజెపి పేర్కొంటుండగా అంతగా నిధులు ఇవ్వలేదని టిడిపి పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో విభజన హామీల వివరాలు..కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించారు.

రాజకీయ దుమారానికి తమ పార్టీ అధ్యక్షుడు తెరదించే ప్రయత్నం చేశారని, ఐదేళ్లు అని బిల్లులో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు. 2022 దాక హామీలు నెరవేర్చడానికి సమయం ఉందన్నారు. ఏపీకి కేంద్రం ఎక్కువగానే ఇచ్చిందని..సంతృప్తిగానే ఉన్నామని..కేంద్రం అన్ని ఇచ్చిందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు..కేంద్ర మంత్రి సుజనా చౌదరి అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీపై సీఎం బాబు మాటమారుస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ఇనిస్టిట్యూట్ వంద శాతం ఇచ్చారని, అదనంగా 8 ఇనిస్టిట్యూట్స్ ఇచ్చారని తెలిపారు. ఇందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీణివాసరావు తెలియచేశారని తెలిపారు. నిట్ కు ప్రారంభంలో వంద సీట్లు మాత్రమే ఇస్తారని, కానీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రత్యేకంగా కోరడంతో నాలుగు వంద సీట్లు తెచ్చుకోవడం జరిగిందన్నారు. క్లాసులు ప్రారంభమయ్యాయని, కేంద్రం యొక్క మేనేజ్ మెంట్ తో ఇనిస్టిట్యూట్ జరుగుతాయన్నారు. ఇక బిల్లులో రాజధాని అంశం కూడా పేర్కొనడం జరిగిందని...రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కట్టాలని బిల్లులో పొందుపర్చడం జరిగిందన్నారు. 

హామీలు నెరవేర్చడానికి 2022 సమయం...

విజయవాడ : హామీలు నెరవేర్చడానికి 2022 సమయం ఉందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నార. విభజన లెక్కలను ఆయన వెల్లడించారు. రాజకీయ దుమారానికి తమ పార్టీ అధ్యక్షుడు తెరదించే ప్రయత్నం చేశారని, ఐదేళ్లు అని బిల్లులో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.

11:12 - February 13, 2018
10:39 - February 13, 2018

హైదరాబాద్ : మహాశివరాత్రి...దేశ..వివిధ రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు ఉదయం నుండే స్వామి దర్శనానికి క్యూ కట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులోని కీసర గుట్ట ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏడు మార్గాలు ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతినిస్తున్నారు. వీఐపీలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. గతంలో సీఎం ప్రకటించిన రూ. 75 కోట్లతో కీసర ఎంతో అభివృద్ధి అవుతుందని తెలిపారు. 

భజరంగ్ దళ్ బృందం హెచ్చరికలు..

హైదరాబాద్ : ఫిబ్రవరి 14 వస్తోంది..ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని వివిధ పబ్ యాజమానులకు భజరంగ్ దళ్ బృందం సూచించింది. ఈ మేరకు వారికి ఓ నోట్ ను అందచేసింది. 

10:27 - February 13, 2018

పశ్చిమగోదావరి : దేవుడు కేవలం వీఐపీల కోసమేనా ? అందరికీ కాదా ? అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు..ముఖ్యమైన దినాల్లో పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి మాటలు వింటూనే ఉంటుంటాం. ప్రముఖ పండుగల్లో స్వామి వారిని దర్శించుకుందామని భక్తులు వివిధ ఆలయాలకు పోటెత్తుతుంటారు. కానీ ఆయా ఆలయాలకు వీఐపీలు కూడా రావడం..వారి సేవలో ఆలయ అధికారులు తరించిపోతుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాలను వ్యక్తపరుస్తుంటారు.

మహాశివరాత్రి పండుగ సందర్భంగా పాలకొల్లు క్షీరామలింగేశ్వరంలో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం వీఐపీల కోసం గంటల తరబడి క్యూ లైన్ లను ఆపివేశారని..తాము కూడా మనుషులమే కదా అని ప్రశ్నిస్తున్నారు. స్వామ వారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఐదు క్యూ లైన్ లు నిండిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:22 - February 13, 2018

క్షీరామలింగేశ్వరం ఆలయంలో భక్తుల ఆవేదన...

పశ్చిమగోదావరి : భీమవరంలోని పాలకొల్లు క్షీరామలింగేశ్వరం ఆలయంలో భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ లు నిండిపోవడంతో స్వామి వారి దర్శనానికి సమయం పడుతోంది. వీఐపీలు అధికంగా రావడంతో దర్శనానికి తమను అనుమతించడం లేదని భక్తులు వాపోతున్నారు. 

10:09 - February 13, 2018

విశాఖపట్టణం : నాతవరం మండలం శృంగవరంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం యూనిట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. క్షణాల్లో మంటలు చుట్టూ వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడం..పొగ దట్టంగా అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా మిషనరీ కాలిపోవడంతో భారీగానే ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు పనిచేస్తున్నారా ? వారు ఎంత మంది ఉన్నారనే తెలియరావడం లేదు. 

శృంగవరంలో అగ్నిప్రమాదం...

విశాఖపట్టణం : జిల్లాలోని నాతవరం మండలం శృంగవరంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్తి భారీగా నష్టం సంభవించిందని తెలుస్తోంది. 

జగన్ 86వ రోజు పాదయాత్ర...

నెల్లూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 86వ రోజు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి (మ) పెద్ద కొండూరు శివారు నుంచి ప్రారంభమైంది. 

ఇంటర్ విద్యార్థిని సూసైడ్...

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని మూసాపేటలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని విద్యార్థిని వైష్ణవి బలవన్మరణానికి పాల్పడింది. మరో విద్యార్థిని ప్రేమ విషయం లెక్చరర్ అడిగాడని వైష్ణవి మనస్థాపానికి గురైనట్లు సమాచారం. 

09:27 - February 13, 2018

చిత్తూరు : జిల్లాలో ఘోరమైన దుర్ఘటన చోటు చేసుకుంది. శివాలయానికి వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకి వెళ్లిపోయారు. బి.ఎన్.కండ్రీగలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురుమ మృత్యువాత పడ్డారు. మయూరా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది శ్రీకాళహస్తీకి వెళ్లడానికి వెళ్లారు. ఆటోలో తిరిగి వస్తున్నారు. బి.ఎన్.కండ్రీగ వద్దకు చేరుకోగానే కంకర లోడ్ తో వెళుతున్న టిప్పర్ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. దీనితో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

09:22 - February 13, 2018

ప్రకాశం : అగ్రవర్ణాలు దారుణాలు పెచ్చరిల్లుపోతున్నాయి..ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు..ఆడవారిపై అతిదారుణంగా ప్రవర్తిస్తున్నారు..సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు ఎన్నో చూస్తున్నా పాలకులు..అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అగ్రవర్ణాలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహా శివ రాత్రి నేపథ్యంలో ఓ వడ్డెర కుటుంబంపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది.

కందుకూరు మండలం రూరల్ పలుకూరులో ఓ వృద్ధురాలు..మగ దిక్కు లేకుండా ఇద్దరు కుమార్తెలతో..పిల్లలతో 20 గజాల స్థలంలో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటోంది. వీరు ఇంటున్న నివాసం పక్కనే శివాలయం ఉంది. గుడి పక్కనే వడ్డెర కుటుంబం ఉండొద్దని..ఉంటే అరిష్టమని గ్రామ పూజారీ చెప్పినట్లు తెలుస్తోంది.

దీనితో అగ్రవర్ణాలు రెచ్చిపోయారు. ఇక్కడి నుండి ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వృద్ధురాలిపై ఇష్టమొచ్చినట్లుగా దాడికి పాల్పడ్డారు. అడ్డుగా వచ్చిన కూతుళ్లపై కామాంధుల్లా రెచ్చిపోయారు. వస్త్రాలును చింపేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఫలితం కనబడడం లేదని సమాచారం.

చివరకు సీపీఎం నేతలను బాధిత కుటుంబం ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని తెలియచేసింది. స్పందించిన సీపీఎం నేతలు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని..వారి తరపున పోరాటం చేస్తామని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి గౌస్ టెన్ టివికి తెలిపారు. ఒకవేళ స్పందన లేకపోతే మహిళా సంఘాలతో కలిసి నిరహార దీక్షలకు సైతం దిగుతామని హెచ్చరించారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

బి.ఎన్.కండ్రీగలో విషాదం...

చిత్తూరు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బి.ఎన్.కండ్రీగలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ట్రాలీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. వీరు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

శివరాత్రి రోజున దారుణం...

ప్రకాశం: జిల్లాలోని కందుకూరు మండలం రూరల్ పలుకూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శివాలయం పక్కనే ఉంటున్న వడ్డెర కుటుంబంపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడ్డారు. ఖాళీ చేసి వెళ్లిపోవాలని భయబ్రాంతులకు గురి చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. పెట్రోల్ పోసి తగులబెడుతామని హెచ్చరించారు.

08:28 - February 13, 2018

స్వదేశానికి మోడీ..

ఢిల్లీ : విదేశీ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. మోడీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఘన స్వాగతం పలికారు. 

08:09 - February 13, 2018

నల్గొండ : జిల్లాలో మరో హత్య జరగడంతో కలకలం రేగుతోంది. వరుసుగా జరుగుతున్న హత్యలతో జిల్లా ఇప్పటికే అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన హత్యలో రాజకీయ కోణం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...తిరుమల గిరి మండలంలోని నాగార్జునపేట తండాలో మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మా నాయక్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి మంచం ధర్మానాయక్ పడుకున్నాడు. మంచం కింద పెట్టిన నాటుబాంబులు పేలడంతో ధర్మానాయక్ శరీరం ఛిద్రం అయిపోయింది. పాతకక్షలే కారణమని తెలుస్తోంది. కుటుంబ వివాదాల మధ్య ఈ హత్య జరిగిందా ? అనేది తెలియాల్సి ఉంది. 

నాగార్జునపేట తండాలో దారుణ హత్య...

నల్గొండ : జిల్లాలో మరో హత్య జరిగింది. నాగార్జున పేట తండాలో మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మా నాయక్ దుండగులు దారుణంగా హతమార్చారు. మంచం కింద నాటుబాంబు పెట్టి పేల్చారు. హత్యకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది. 

వంద కిలోల గంజాయి..తరలిస్తూ...

చిత్తూరు : వంద కిలోల గంజాయిను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు, రెండు మైబైల్స్ లను స్వాధీనం చేసుకున్నారు.

07:56 - February 13, 2018

దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్‌ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్‌ సర్కార్‌ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజ్ మోహన్ (టీఆర్ఎస్), నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కోటప్పకొండకు స్పీకర్ కోడెల...

గుంటూరు : నరసరావుపేట మండలంలోని కోటప్పకొండలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్‌ కోడెల పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 

కేసీఆర్..గవర్నర్ ల మహాశివరాత్రి శుభాకాంక్షలు..

హైదరాబాద్ : మహాశివరాత్రిని పురస్కరించుకొని గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత, సోదరభావాలను ఈ పండుగ పెంపొందిస్తుందని ఆశిస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.

దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి...

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని శైవ క్షేత్రాలకు ఉదయాన్నే భక్తులు పోటెత్తుతున్నారు. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 

భారత్ - సౌతాఫ్రికా ఐదో వన్డే...

ఢిల్లీ : పోర్ట్ఎలిజబెత్ లో మంగళవారం భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదో వన్డే మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 4:30 కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం..

తిరుమల: తిరుమలలో నేడు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం 5 సంవత్సరాలలోపు చంటి బిడ్డలు, తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. 

06:46 - February 13, 2018

రైతుకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని హామీలు గుప్పిస్తున్నా అవి మాటల్లోనే ఉంటున్నాయి తప్ప రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. తాజాగా పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం తెలంగాణలో ఆందోళనకు దిగారు. వాస్తవానికి ఏ పంట చేతికివచ్చినా మద్దతు ధర కోసం ఆందోళన చేయడం గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. మరి రైతుకి ఈ కష్టం ఎందుకు దాపురించింది. పాలకులు చెబుతోన్న మాటలు ఏమవుతున్నాయి. ఈ విషయాలపై టెన్ టివి జనపథంలో రైతు సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సాగర్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:44 - February 13, 2018

విజయవాడ : 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీ మాకొద్దు' అనే నినాదంతో పోరాటానికి వైసీపీ సిద్దమైంది. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 5న ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రానికి హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని.. అవసరమైతే ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు సిద్దమైంది వైసీపీ.

'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో పోరుబాటకు సిద్దమవుతున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించడం.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది వైసీపీ. వచ్చే నెల 1వ తేదీన 'ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజీతో మోసపోవద్దు' అనే నినాదంతో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే మార్చి 5న "ప్రత్యేక హోదా మన హక్కు - ప్యాకేజీ వద్దు' అనే నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. మార్చి 3న జగన్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించబోదన్నారు భూమన. తమ ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఎంపీలు ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నారు భూమన. వైసీపీపై అభాండాలు వేసేందుకు టీడీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. టీడీపీ వైఖరిని ప్రజలందరూ చూస్తున్నారని.. దీనికి సరైన సమయంలో సరైన సమాధానం చెబుతుందన్నారు. మొత్తానికి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. మరి వైసీపీ పోరాటంతో కేంద్రం ఏ మేరకు దిగివస్తుందో చూడాలి !

06:42 - February 13, 2018

హైదరాబాద్ : శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.
కోటప్పకొండ...పశ్చిమగోదావరి..వేములవాడ తదితర జిల్లాల్లో శివరాత్రి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

06:37 - February 13, 2018

హైదరాబాద్ : దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్‌ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్‌ సర్కార్‌ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు.

దేశంలోని ముఖ్యమంత్రులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడని ప్రభుత్వేతర సంస్థ అయిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌-ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించింది. రాజకీయ నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక సిద్దం చేశారు.

దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని సీఎంల వివరాలపై ఈ సంస్థలు నివేదికలు రూపొందించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను ఈ సందర్బంగా పరిశీలించారు. 100 కోట్లకు పైగా ఆస్తులున్నవారిలో ఇద్దరు,.. 10 నుంచి 50 కోట్ల మధ్య ఆరుగురు,.. 10 కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన సీఎంలు 17 మంది ఉన్నట్లు గుర్తించారు. కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తులున్న సీఎంలుగా ఆరుగురు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.

అత్యంత ధనికుడైన సీఎంగా చంద్రబాబు రికార్డ్‌ సృష్టించారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 177 కోట్ల ఆస్తులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ 129 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ 48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల 15 లక్షల 82 వేల ఆస్తులు తన పేరున ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఇక అతి తక్కువ ఆదాయం గల సీఎంగా త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రికార్డ్‌ సాధించారు. సీపీఎం పార్టీకి చెందిన మాణిక్‌సర్కార్‌ పేరుపై కేవలం 26 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అలాగే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 30 లక్షలతో రెండో స్థానంలో, జమ్మూకాశ్మీర్‌ సీఎం మెహబుబా ముఫ్తీ 50 లక్షలతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులను కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్‌ 22 కేసులతో మొదటి స్థానంలో నిలిచారు.

06:33 - February 13, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.

విష్ణు, బ్రహ్మల మధ్య తలెత్తిన ఆధిపత్య తగవును పరిష్కరించే క్రమంలో.. శివుడు లింగరూపంలో అవతరించాడన్నది భక్తుల విశ్వాసం. లింగోద్భవం జరిగిన మాఘ బహుళ చతుర్దశి రోజున.. మహాశివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీ. భక్తులు, పగలంతా ఉపవసించి, రాత్రంతా జాగరణ చేసి.. శివధ్యానంలో మునిగితేలుతుంటారు.

శివుడి సన్నిధిలో జాగరణ చేయాలని ఎక్కువమంది భక్తులు భావిస్తారు. అందుకే.. ముఖ్యమైన శైవక్షేత్రాలకు తరలివెళుతుంటారు. ఈ నేపథ్యంలో చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యత ఉన్న ఆలయాలన్నీ శివభక్తుల కోసం సన్నద్ధమయ్యాయి. ఆలయాల నిర్వాహకులు కూడా భక్తులకు ఎలాంటి ఇక్కట్లూ రాకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. 

వేములవాడ రాజన్న క్షేత్రంలో...

రాజన్న సిరిసిల్ల : శివనామస్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమాగుతోంది. రాజన్ననను దర్శించుకుని ఉపవాసం, జాగరణ చేసేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం 7గంటలకు టిటిడి, ఉదయం 9గంటలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి సమర్పించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు లింగార్చన జరుగనుంది.

 

శ్రీశైలంలో నేడు నంది వాహన సేవ...

కర్నూలు : శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నంది వాహన సేవ జరుగనుంది.

 

Don't Miss