Activities calendar

14 February 2018

21:35 - February 14, 2018

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ కార్యదర్శి వర్గ సమావేశం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఎంబీ భవన్‌లో జరిగింది. నల్గొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఎన్నికైన కార్యదర్శి వర్గ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌ లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల ఏర్పాట్లతోపాటు, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ బలోపేతం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించారు.

నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిని సీపీఎం కార్యదర్శి వర్గం తప్పు పట్టింది. గురువారం జరిగే బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో చర్చించి దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు 20 కమిటీలు ఏర్పాటు చేస్తూ కార్యదర్శి వర్గం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు పార్టీ మహాసభల ఏర్పాట్లు చూస్తూనే మరో వైపు బీఎల్‌ఎఫ్‌ను బలోపేతంపై దృష్టి పెట్టింది. బీఎల్‌ఎఫ్‌లోఎవరైనా నేరుగా చేరొచ్చని, ఫ్రంట్‌లోని ఏదోఒక పార్టీలో చేరాలన్న నిబంధన ఏదీలేదని సీపీఎం తెలంగాణ కార్యరద్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. జిల్లాల్లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభలు నిర్వహించాలని సీపీఎం కార్యదర్శి వర్గం నిర్ణయించింది. ఈనెల 20న సంగారెడ్డి, 25న మహబూబ్‌నర్‌లో ఫ్రంట్‌ సదస్సులు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు బీఎల్‌ఎఫ్‌ ఒక్కటే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

21:34 - February 14, 2018

కృష్ణా : హోదా పోరాటాన్ని మహాఉద్యమంగా మలిచేందుకు వామపక్షాలు సిద్ధం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కదిలించేందుకు కార్యాచరణను రెడీ చేస్తున్నాయి. విజయవాడలో జరిగిన భేటీలో 10 కమ్యూనిస్ట్‌పార్టీలు ఉద్యమానికి సిద్ధం అని ప్రకటించాయి. ఏపీ విభజన చట్టంలో హామీలను నెరవేర్చేలా కేంద్రం మెడలు వంచుతామంటున్నారు కమ్యూనిస్టుపార్టీల లీడర్లు. ఇప్పటికే రాష్ట్ర బంద్‌తో ప్రజలను కదిలిచిన నేపథ్యంలో ఉద్యమ కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చేందుకు కార్యాచరణ రూపొందించారు. మార్చి 6న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర 10 వామపక్ష పార్టీలతోపాటు, రాష్ట్రంలోని విద్యార్థి, యువజన సంఘాలతో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి విద్య, వైద్య సంస్థలు, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్‌తోపాటు సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణానికి నిధులపై కేంద్రం దిగిరావాల్సిందే అంటున్నారు.

ఫిబ్రవరి 8న రాష్ట్రబంద్‌ విజయవంతం
వాస్తవానికి ఫిబ్రవరి 8న రాష్ట్రబంద్‌ విజయవంతం కావడంతో టీడీపీ, వైసీపీ నేతల్లో గుబులు మొదలైందని వామపక్షాల భేటీలో నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదాపై బలమైన ఆకాంక్షను ప్రజలు బంద్‌ విజయవంతం చేయడం

ద్వారా నిరూపించారని గ్రహించిన పార్టీలు ఒక్కసారిగా హోదా పోరును నెత్తికెత్తుకున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. . తమ ఎంపీల రాజీనామాకు సంబంధించి జగన్‌ ప్రకటనపై టీడీపీ సెటైర్లు.. వైసీపీ నేతల విసుర్లు చూస్తే.. ఉభయ పార్టీలూ.. హోదా పోరును పక్కదారి పట్టిస్తున్నాయని వామపక్షాలు అనుమానిస్తున్నాయి. అందుకే విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జవసత్వాలు రావాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని, అది సాధించే వరకు ఆగరాదని కమ్యూనిస్ట్‌పార్టీలు తీర్మానించాయి. ఉద్యమకార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 18న విశాఖలో పది వామపక్షపార్టీలతోపాటు, ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి, విద్యార్థి, యువజన సంఘాలతో సదస్సు నిర్వహించి.. తర్వాత 24న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించాయి.

దీక్షలు, పికెటింగ్‌లు, ధర్నాలతోపాటు
ఉద్యమానికి ప్రజలను సన్నద్ధం చేసేపనిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో దీక్షలు, పికెటింగ్‌లు, ధర్నాలతోపాటు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో భారీ సభలు నిర్వహిస్తామని లెఫ్ట్‌నేతలు ప్రకటించారు. ఇలా 20రోజులపాటు రాష్ట్రంలో ప్రజలను కదిలించి.. మార్చి 6న ఢిల్లీలో మహాధర్నాతో కేంద్రానికి ఆంధ్రుల సత్తా అర్థమయ్యేలా చేస్తామంటున్నాయి ఎర్రజెండాపార్టీలు. మోదీకి భయపడడం మాని.. సంకుచితంగా ఆలోచించకుండా.. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఉద్యమంలో కలిసి రావాలని ఇతర పార్టీలకు కమ్యూనిస్టులు పిలుపునిస్తున్నారు.  

21:32 - February 14, 2018

ఖమ్మం : ఇది ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌. ఈనెల 11న రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, హరీశ్‌రావు దీనిని హట్టహాసంగా ప్రారంభించారు. పనులు పూర్తి కాకపోయినా లకారం ట్యాంక్‌ బండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రులు ఊదరగొట్టారు. కానీ ప్రారంభించిన మూడు రోజులకే నిర్మాణాల్లో డొల్లతనం బయటపడింది. లకారం ట్యాంక్‌ బండ్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రోడ్డు మధ్యలో వేసిన డివైడర్‌ పగిలిపోయింది. టైల్స్‌ను సిమెంటుతో అతికించకుండా పక్క పక్కనే పెట్టి కాంట్రాక్టర్‌ చేతులు దులుపుకోవడంతో.. ఇప్పుడు పాదచారులు నడుస్తుంటే కదిలిపోతున్నాయి. మొక్కులు నాటేందుకు ఉంచిన ఖాళీ ప్రదేశంలో సిమెంటు పడేయడంతో కాంక్రీటుగా మారిపోయింది. పాదచారుల కోసం వేసిన వాకింగ్‌ ట్రాక్‌ మరీ అధ్వాన్నంగా తయారైంది. రళ్లుతేలడంతో వాకర్స్‌ తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారు. లకారం ట్యాంక్‌ బండ్‌ పనుల్లో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

మురుగునీరు అంతా లకారం ట్యాంక్‌ బండ్‌ చుట్టూనే
నగరంలోని మురుగునీరు అంతా లకారం ట్యాంక్‌ బండ్‌ చుట్టూనే చేరుతోంది. దీంతో ఆహ్లాదంగా గడుపుదామని వచ్చినవారు దుర్వాసన భరించలేక వెంటనే తిరిగి వెళ్లిపోతున్నారు. లకారం చెరువులో సాగర్‌ నీరు నింపామని చెప్పిన పాలకులు... చేపలు వదలి హడావుడి చేశారు. మురుగునీటికి ఆ చేపలు మూడు రోజుల్లోనే మృత్యవాతపడటంతో దుర్వాసన మరింత పెరిగింది. లకారం ట్యాంక్‌ బండ్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ మొగిలి శ్రీనివాసరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్వహించిన పనుల్లో కూడా నాణ్యత లోపించిందని గుర్తించినా, మళ్లీ పనులు అప్పగించడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాలేరు పంట కాల్వల తవ్వకాల్లో లోపాలును గుర్తించినా... లకారం ట్యాంక్‌ బండ్‌ పనులు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంలో వాటాలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూర్చునేందుకు ఇంకా బల్లలు వేయలేదు.
లకారం ట్యాంక్‌ బండ్‌ వద్ద సౌకర్యాలు ఏమాత్రం సరిగా లేవు. కూర్చునేందుకు ఇంకా బల్లలు వేయలేదు. సరదాగా ఏదైనా తినాలనుకున్నా క్యాంటీన్లు లేవు. మంచినీటి సౌకర్యం మృగ్యం. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తవేసేందుకు డస్ట్‌ బిన్లు కూడా లేకపోవడంతో పాలిథిన్‌ కవర్లు, వాటర్‌ బాటిళ్లను చెరువులో పారవేస్తోండటంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం లకారం ట్యాంక్‌ బండ్‌ అద్భుతమంటూ లకారం ట్యాంక్‌ బండ్‌ నిర్మాణ లోపాలపై విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పనుల నాణ్యతపై రాజీపడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఉద్యమం తప్పదని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

21:30 - February 14, 2018

హైదరాబాద్ : ఈ చూపులే ఇప్పుడు అబ్బాయిల మతి పోగోట్టాయి. ఈ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కే కోట్ల హృదయాల గుండెలు ప్రియా .. ప్రియా అని కొట్టుకుంటున్నాయి. ప్రియ ప్రకాష్‌ వారియర్.. బీకామ్ చదువుతున్న 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఫేస్‌బుక్.. ట్విట్టర్.. వాట్సాప్.. ఎక్కడ చూసినా ప్రియ వీడియోలో హల్‌చల్ చేస్తున్నాయి. కేరళ త్రిసూర్‌కు చెందిన ప్రియ 'ఒరు ఆధార్‌ లవ్‌' సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలోని 'మాణిక్య మలయ పూవి'పాటకొ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలోని పాటను కొంచెం ముందుగా విడుదల చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన లభించింది. కన్ను గీటుతూ ఆ పాటలో ప్రియ పలికించిన హావభావాలకు నెటిజన్లంతా ఫిదా అయిపోయారు.

క్లాస్‌రూంలో చిలిపి సైగలతో
ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియ నటించిన మరో వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. క్లాస్‌రూంలో చిలిపి సైగలతో మరోసారి యూత్‌ను ఊపేసింది ప్రియ. ఒరు ఆధార్‌ లవ్ మూవీకి ముందు ప్రియ ప్రకాశ్.. మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌ లో నటించింది. కొన్ని ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నది. మోడల్‌గా ర్యాంప్‌ వాక్స్‌ చేసింది. అంతేకాదు మోహినీ అట్టం కళాకారిణి కూడా. స్కూల్‌ డేస్‌లో నాటకాల్లో నటించిన ప్రియ ప్రకాశ్ కు మలయాళ మూవీలో అనుకోకుండా అవకాశం వచ్చింది. సీబీఎస్‌సీ ప్లస్‌ 2 బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి ముందు ప్రియ ఈ సినిమా ఆడిషన్స్‌ కి వెళ్ళింది. అయితే, ఈ మూవీలో తనకు అవకాశం వస్తుందని ప్రియ ఊహించనే లేదట.. ఈ మూవీ అవకాశంతో ప్రియ ప్రకాష్‌ ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ప్రియ ప్రకాశ్ హావభావాలకు నెటిజన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎంతో మంది హీరోలు ప్రియ ప్రకాష్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యూటెస్ట్ వీడియోను చూడలేదంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కొందరైతే ఏకంగా ప్రియ వీడియోకు డోనాల్డ్ ట్రంప్, మోడీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, చంద్రబాబు వంటి రాజకీయ నేతలతోపాటు హీరోలు మహేష్‌బాబు, పవన్ కల్యాణ్, రజనీకాంత్‌లతో పాటు సల్మాన్‌ ఖాన్‌, షారూక్ ఖాన్‌ వంటి బాలీవుడ్ నటులను యాడ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రియ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రియ ధాటికి సన్నిలియోన్.. కత్రినా కైఫ్‌..అనుష్క శర్మ..దీపికా పదుకోన్‌లూ గూగుల్‌ సెర్చ్‌లో వెనుకబడ్డారు. నిన్న ఒక్కరోజే ఇన్‌స్టా గ్రామ్లో ప్రియను అనుసరించే వారి సంఖ్య 6 లక్షలు పెరిగింది. ఒక్కరోజులో అత్యధిక ఫాలోయర్లను సాధించుకున్న సెలబ్రిటీగా ప్రియ చరిత్ర సృష్టించింది.

మరోవైపు ప్రియపై కొందరు విమర్శలు
ఓవైపు ప్రియకి ఇంత పాపులారిటీ వచ్చిపడుతుంటే.. మరోవైపు ప్రియపై కొందరు విమర్శలు వెదజల్లుతున్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రియ ఆ పాటలో నటించిందని హైదరాబాద్ ఫలక్‌నుమాకు చెందిన పలువురు ముస్లిం యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రియ నటించిన వీడియోని పరిశీలించే పనిలో పడ్డారు. ఇక ప్రియను పాటలో చూసి ఇంతలా ఫిదా అయిపోతున్న కుర్రకారు ఏప్రియల్ రిలీజ్ అవుతున్న 'ఒరు ఆధార్‌ లవ్' సినిమాలో ఆమె పూర్తి నటనను చూసి ఏమైపోతారో ఏంటో?

21:29 - February 14, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇపుడు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించింది. మంగళవారం నెల్లూరు జిల్లా కలికిరి సభలో.. జగన్‌ చేసిన రాజీనామా కామెంట్లు రాజకీయ కాకను పెంచేస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ - వైసీపీ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. ద్రోహులు మీరంటే.. మీరేనంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఎంపీల రాజీనామాలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారన్న జగన్‌ ప్రకటన నేపథ్యంలో.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పార్టీ నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయం.. వైసీపీ తీసుకున్న రాజీనామాల నిర్ణయంపై విస్తృతంగా చర్చించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు జగన్‌పార్టీపై ఘాటు విమర్శలకు దిగారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఏప్రిల్‌ ఆరువరకు ఆగకుండా తక్షణమే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్‌ విసిరారు. వైసీపీ ఎంపీల రాజీనామా బెదిరింపులు కేంద్రాన్ని కదిలించలేవని.. ఎద్దేవా చేశారు.

త్యాగానికి సిద్ధపడుతున్న వైసీపీ ఎంపీలపై నిందలా
టీడీపీ నేతల విమర్శలను వైసీపీ నాయకులు అంతేస్థాయిలో తిప్పికొట్టారు. రాజీనామాలతో రాష్ట్ర ప్రజలకోసం త్యాగానికి సిద్ధపడుతున్న వైసీపీ ఎంపీలపై నిందలు తగదంటూనే.. పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేక.. సభ బయటికొచ్చి మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా... సుదీర్ఘ విరామం తర్వాత మరోమారు సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రాన్ని సంధించారు. జనసేన అధినేత భుజంపై ప్రత్యేక హోదా తుపాకీ పెట్టి మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసే డ్రామాకు తెరతీశారని ముద్రగడ తన లేఖలో ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అంటూ తమరు వ్యాఖ్యానించలేదా అని ముద్రగడ లేఖలో ప్రశ్నించారు. తనతోపాటు బీజేపీ నేతలు సోమువీర్రాజు, పురంధ్రీశ్వరి లాంటి వారు.. జగన్‌కు అమ్ముడుపోయారన్న టీడీపీ నేతల విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని పాలకపక్షం విమర్శించడంపైనా ముద్రగడ అభ్యంతరం తెలిపారు. మొత్తానికి వైసీపీ ఎంపీల రాజీనామాల ప్రకటనతో ..ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నా.. అధికార- ప్రతిపక్షాలు మాటల యుద్ధాన్ని ముమ్మరం చేశాయి.  

ఏసీబీకి చిక్కిన వార్డెన్

కరీంనగర్ :   ఏసీబీకీ సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ చిక్కారు. రాంనగర్ లో రూ.లక్ష లంచం తీసుకుంటూ వార్డెన్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కూరగాయాలు సప్లై చేసే కాంట్రాక్టర్ ను సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య రూ.1.50 లక్షలు డిమాండ్ చేశాడు. సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య కు మధ్యవర్తిగా వార్డెన్ వెళ్లి ఏసీబీకి చిక్కారు. 

20:50 - February 14, 2018

టెన్ టీవీ దెబ్బకు దయ్యందిగినట్టుంది అశ్వారాపుపేట ఎమ్మెల్యేకు.. నీళ్ల కోసం జనం తన్లాడుతున్నరని మనం జెప్తిమిగదా..? అమ్మో జనం ఎగవడి కొట్టగాళ్ల రేపుపొద్దుగాళ్ల అని భయపడ్డట్టుండు ఎమ్మెల్యేగారు.. ఎంబడే నీళ్లు లేని

అంటెనేమో మా దేవున్ని అన్నడని ఫీలైతరుగని.. వాడు జేస్తున్న చాతలు జూస్తె మరి అనకపోతె ఆగమైతరు జనం.. బాలసాయిబాబనట.. నోట్లెకెళ్లి లింగాలు దీస్తున్నడు.. వారీ బాలసాయి.. నీకు ధమ్ముంటే లింగాలు దీసుడు గాదు.. ఒక గుమ్మడికాయ దీయి సూద్దాం.. అప్పుడు నీకు నిజంగ మహిమలున్నయని మేము గూడ ఒప్పుకుంటం..

నిన్న ముఖేష్ అంబానీ మన చంద్రాలు ఇలాకకొచ్చిండు.. అమరావతిల కనిపించని కట్టడాలు సూశి అహా.. ఎంత అద్భుతం అని కొనియాడి. ఇగ నేను బిజినెసు జేయాల్నంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే కరక్టే.. మీరు కాయిదాలు తయ్యారు జేస్కోండ్రి.. నేను కంపిండ్లు ఏస్కుంట.. ఇగ పేదల భూములు గుంజుకునుడు సుర్వు జేస్తె శుభం అని చెప్పుకొచ్చిండట..

వాస్తవానికి చంద్రబాబుకు గానీ.. జగన్ మోహన్ రెడ్డికి గానీ.. వీళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని లేదు.. కావాల్సిందే అని కొట్లాడుకునెతందుకు మాత్రమే ఈ టాపిక్ అవుసరం బడ్తున్నది.. ప్రత్యేక హోదా.. ప్రజల సెంటిమెంటు ఎటుదిక్కుంటే.. వీళ్లు అటుదిక్కు ఆటాడ్తరు.. ప్రత్యేక హోదా కాయిదాల మూట ఎన్నడో అట్కుమీదికి ఎక్కిచ్చిన మోడీ.. ఈ నాయకుల నాట్కానికి ఓ ఆర్టీస్టు మాత్రమే..

కొమిరెల్లి మల్లన్న జాతర ప్రజల కోసం అయితదో.. పోలీసోళ్ల కోసం అయితదో తెల్వది.. భక్తుల కంటె ఎక్వ ఎగవడి వాళ్లే పరేషాన్ జేస్తున్నరు.. పట్నాలు గీస్తరు గదా..? ముగ్గులు పస్పు బండారు ఏశి.. ఇగ నిన్న పొద్దుమీకంగ పెద్ద పట్నం ఏశిండ్రట.. ఆ పెద్ద పట్నం కాడికి భక్తులు ఎగవడకుంట కావలుండవల్సిన పోలీసోళ్లు ఏం జేశిండ్రో సూడుండ్రి..

నిన్ననేగాదు మనం చెప్పుకున్నది కంట్రోల్ బియ్యం కథ.? ఇగో ఇయ్యాళ ఇంకోటొచ్చింది.. నిన్ననేమో ఏలుముద్రల ఏశంగదా.? ఇయ్యాళ తక్కెడ పంచాది.. ఇర్వై నాల్గు కిలోల బియ్యం అని జోకిస్తున్నడు డీలరు.. వేరేతాన జోకితె ఇర్వై రెండు కిలోలే ఉంటున్నయ్.. మళ్ల ఆ కంట్రోలు దుక్నపాయిన ఎట్ల జోకుతున్నడు.. బాట్లతోని గాదు.. ఉశ్కె మూటలతోని..

ఓటమి అనే పదాన్ని ఇంకోమాటల జెప్పాల్నంటే.. రైతు.. జీవితంల ఎన్నడు గెల్పంటె ఎట్లుంటదో తెల్వని ఓటమిసారి ఒక్క రైతే.. దున్నెకాడ ఓడిపోతడు.. నాటేశెకాడ ఓడిపోతడు.. ఎర్వులు కొనెకాడ ఓడిపోతడు.. నీళ్ల కాడ ఓడిపోతడు.. కోతకాడ ఓటమే.. మోత కాడ ఓటమే.. ఆఖరికి అమ్ముకుందామనొచ్చిన మార్కెట్ల గూడ ఓటమే.. ఈ ఓటములకు ఇంకోటి తోడు.. అకాల వర్షాలు.. ఇగ ఎట్ల బత్కుతడు రైతు..?

ముందే శివరాత్రి జనం భక్తి ఎట్లుంటదో మీకు తెల్సిన ముచ్చట.. ఇగ ఈ భక్తిల మున్గిన జనానికి శివుని గుడిలె పాము గనిపిస్తె ఏంది పరిస్థితి..? మొగులు మీదికెళ్లి శంకరుడు దిగొచ్చినట్టు ఫీలైపోతరుగదా..? అగో అంతే పని అయ్యింది నిర్మల్ జిల్లాల.. శివరాత్రి పూజలళ్ల భక్తులుంటే.. ఒక పాము గర్భగుడిలె గనిపిచ్చింది.. ఖతం.. భక్త జనం ఊకుంటరా..?

 

20:43 - February 14, 2018
20:40 - February 14, 2018

మోహన్ భగవత్ యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు గానీ, వారి వాఖ్యల వెనక వారి వద్ద ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోందని, వర్ణవ్యవస్థను పాటించడానికి అర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని, ఆర్ఎస్ఎస్ వెజిటెబుల్ ఆర్గనైజేషనని, భారత్ సైన్యం లో రెండు రకాల వారు ఉంటారని టీమాస్ ఫోరం చైర్మన్ కంచె ఐలయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఇంటర్నేషనల్ మైనింగ్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్

హైదరాబాద్ : మైనింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మైనింగ్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ జరగుతుంది. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలనే తెలంగాణలో బొగ్గు గనులు, గ్రానైట్, ఇనుము గనులు ఎక్కువగా ఉన్నాయన్నారు.  

19:07 - February 14, 2018

గుంటూరు : నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రకటన తర్వాత ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. దీనిపై టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఏపీలో తాజా సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

సీఆర్డఈఏ, ఏడీసీ అధికారులతో సీఎం భేటీ

గుంటూరు : అమరావతి సచివాలయంలో సీఆర్ డీఏ, ఏడీసీ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 15 రోజులకోసారి డ్రోన్లతో తీసిన చిత్రాలను సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

18:43 - February 14, 2018

కడప : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జేఏసీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు మాజీ మంత్రి రామచంద్రయ్య. పెద్ద పెద్ద నేతలను జేఏసీ ఏర్పాటు కోసం వాడుకోవడం సమంజసం కాదన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంత వరకు సీఎం చంద్రబాబు నాయుడు అఖిలపక్షం భేటీ నిర్వహించకపోవడం దారుణమన్నారు. తక్షణం రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి పార్టీలకతీతంగా ఢిల్లీకి వెళ్లి పోరాడదామని పిలుపునిచ్చారు రామచంద్రయ్య. 

18:42 - February 14, 2018

హైదరాబాద్ : మొన్నటి వరకూ మీడియా సమావేశంలోనో.. సోషల్ మీడియా ద్వారానో తన స్పందన తెలిపిన జనసేనాని పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా పంథాను మార్చుకున్నారు. ముఖ్యంగా ఏపీ విభజన హామీల సాధన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఒంటరిపోరుతో కేంద్రాన్ని కదిలించలేమని భావించారో ఏమో... విభజన హామీల లెక్కలు తేల్చేందుకు జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ పార్టీ పెట్టిన పవన్ తెలుగు రాష్ట్రాల్లో పలుమార్లు సుడిగాలి పర్యటనలు చేశారు. స్ధానిక సమస్యల పరిష్కారం పోరాటం చేశారు.

కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్ర
రాజధాని నిర్మాణం కోసం ఏపీ సర్కార్ బలవంతపు భూసేకరణ చేపట్టినపుడు తుళ్లూరు రైతులకు బాసటగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్ని బాధితుల సమస్యలపై గ‌ళ‌మెత్తారు..ఆత‌రువాత మంగ‌ళ‌గిరి చేనేత కార్మికుల స‌మ‌స్యలపై స‌భను పెట్టి వారి సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేశారు. ఓవైపు సమస్యలపై స్పందిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడిపారు. అటు తరువాత కొంతకాలం ట్విట్టర్ వేదికగా ట్వీట్స్‌కి పరిమితం అయ్యారు. 2014 ఎన్నిక‌ల త‌రువాత అడపా దడపా జనంలోకి వచ్చిన పవన్ ఉన్నపళంగా అజ్ఞాతవాసం వీడారు. ఇకపై పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటానని .. ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పేసినట్లేనని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తున్నానని ప్రకటించిన పవన్ ఇటు తెలంగాణ.. అటు ఏపీల్లో పర్యటించి రైతులు.. విద్యార్ధులు.. నిరుద్యోగులతో పలు సమస్యలపై చర్చలు కూడా జరిపారు. తాజాగా ఏపీ విభజన హామీల సాధన దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిన పవన్ ఉండవల్లితో భేటీ అయ్యారు. విభజన హామీలు సాధన కోసం జే.ఎఫ్.ఎఫ్.సీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడమే కాకుండా దాని బాధ్యతలను రాజకీయాల్లో తలపండిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అప్పగించారు.

రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు
తాజాగా పవన్ తీరుపై రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ జేఏసీ ఏర్పాటు వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నారని భావిస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్రంతో పాటు.. అటు కేంద్రాన్ని విభజన హామీల చిట్టాతో పవన్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే పవన్ తాజా నిర్ణయాల వెనుక కర్త..కర్మ..క్రియ ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. 

18:40 - February 14, 2018

హైదరాబాద్ : టీడీపీ నేతల విమర్శలను వైసీపీ నాయకులు సైతం అంతేస్థాయిలో తిప్పికొడుతున్నారు. రాజీనామాలతో రాష్ట్ర ప్రజల కోసం త్యాగానికి సిద్ధపడుతున్న వైసీపీ ఎంపీలపై నిందలు తగదంటున్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేక.. సభ బయటికొచ్చి విచిత్ర వేషధారణలతో డ్రామాలాడుతుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

18:40 - February 14, 2018

శ్రీకాకుళం : రోజుకో మాట మారుస్తూ వైసీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యులు కింజారపు రామ్మోహన్‌ నాయుడు. పాదయాత్రకే ఆదరణ లేని సమయంలో ఎంపీల రాజీనామ పేరుతో పార్టీ మైలేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ కోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ఢిల్లీలో తమ గళాన్ని వినిపించగలిగామన్నారు రామ్మోహన్‌ నాయుడు. 

ఇంధిరాగాంధీ ఎయిర్ పోర్టులో హెరాయిన్

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ తాంజానియా నాసి ప్రయాణికుడి నుంచి 4.8 కిలోల హెరాయిన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది : జూపల్లి

హైదరాబాద్ : త్వరలో సామాజిక భద్రత పెన్షర్ల కోసం అభయ హస్తం కన్నా మించిన పథకం తీసుకొస్తామని, విధి విధానాల రూకల్పన చివరిదశలో ఉందని పంచాయితి రాజ్ శాఖ మంత్రి జూపల్లి అన్నారు. పెన్షనర్ల బీమా పథకానికి ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. 

18:14 - February 14, 2018

బుల్లి రామయ్య పార్థివదేహాన్ని సందర్శించిన సీఎం

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో మాజీ కేంద్ర బోళ్ల బుల్లి రామయ్య పార్థివదేహాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. రామయ్య కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

చంద్రబాబుతో మాజీ క్రికెటర్ లక్ష్మణ్ భేటీ

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుపై లక్ష్మణ్ సీఎంతో చర్చించారు. 

అప్రమత్తంగా ఉండండి : సీపీఎం పొలిట్ బ్యూరో

ఢిల్లీ : యూపీలో నిన్న విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించిన రామరాజ్య రథ యాత్ర పట్ల అప్రమత్తమవ్వాలని సీపీఎం పొలిట్ బ్యూరో ప్రజలకు పిలుపునిచ్చింది. 

17:44 - February 14, 2018
17:44 - February 14, 2018

హైదరాబాద్ : ప్రేమికుల రోజును భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు అడ్డుకోవడంతో హైదరాబాద్‌లో పలు పర్యాటక కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతిసారి కళకళ్లాడే నెక్లెస్‌రోడ్డు బోసిపోతోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:43 - February 14, 2018

నిర్మల్ : జిల్లా కడం మండలంలో విషాదం జరిగింది. రేషన్‌ బియ్యం కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు అక్కడే మృతి చెందిన ఘటన గంగాపూర్‌లో చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ అయిన లస్మవ్వ బియ్యం కోసం రేషన్‌ డీలర్‌ ఇంటికి వెళ్లగా ఈ పాస్‌ బయోమెట్రిక్‌ సిగ్నల్‌ లేకపోవడంతో నెట్‌ వర్క్‌ కోసం బిల్డింగ్‌ పైకి ఎక్కారు. వేలిముద్రల కోసం బిల్డింగ్‌ పైకి ఎక్కి దిగుతుండగా జారి పడి లస్మవ్వ అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే గిరిజన గ్రామాల్లో ఈ పాస్‌ విధానాన్ని తొలగించి పాత పద్దతినే కొనసాగించాలని గిరిజనులు కోరుతున్నారు. 

17:42 - February 14, 2018

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌ కామెంట్లపై టీడీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాకోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారన్న వైసీపీ అధినేత ప్రకటనను టీడీపీ ఎద్దేవా చేస్తోంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న తమ ఎంపీలు మాత్రమే పార్లమెంటులో నిరసన తెలిపారంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఎమ్మెల్యే చింతమనేనికి బెయిల్

పశ్చిమగోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చంతమనేని ప్రభాకర్ కు భీమడోలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భీమడోలు కోర్టు వద్దకు చింత అభిమానులు భారీగా చేరుకున్నారు. 

ఎమ్మెల్యే చింతమనేనికి బెయిల్

పశ్చిమగోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చంతమనేని ప్రభాకర్ కు భీమడోలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భీమడోలు కోర్టు వద్దకు చింత అభిమానులు భారీగా చేరుకున్నారు. 

21 నుంచి కమల్ రాజకీయ యాత్ర

చెన్నై : తమిళనాడులో ఈనెల 21 నుంచి కమల్ రాజకీయ యాత్ర చేయనున్నారు. మహానాడుతో కమల్ హాసన్ రాజకీయ యాత్ర ప్రారంభం కానుంది. మహానడుకు మదురై అరసడి యూసీ మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

రబీ ఆయకట్టుపై హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్ : శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్ రబీ ఆయకట్టుపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. 13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

నకిలీ డాక్టర్ గుట్టురట్టు

కర్నూలు : జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ డాక్టర్ గుట్టురట్టైంది. శకుంతల సర్కిల్ లో శ్రీనరహరిక్లీనిక్  పేరుతో నరహరి అనే నకిలీ వైద్యుడు నడుపుతున్నాడు. విద్యార్హత లేకున్నా నరహరిరెడ్డి 20 ఏళ్ల నుంచి వైద్య వృతి కొనసాగిస్తున్నారు. ఇన్ని ఏళ్లకు డాక్టర్ బాగోతాన్ని విజిలెన్స్ అధికారలు బయటపెట్టారు. 

16:07 - February 14, 2018

కర్నూలు : జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ డాక్టర్ గుట్టురట్టైంది. శకుంతల సర్కిల్ లో శ్రీనరహరిక్లీనిక్  పేరుతో నరహరి అనే నకిలీ వైద్యుడు నడుపుతున్నాడు. విద్యార్హత లేకున్నా నరహరిరెడ్డి 20 ఏళ్ల నుంచి వైద్య వృతి కొనసాగిస్తున్నారు. ఇన్ని ఏళ్లకు డాక్టర్ బాగోతాన్ని విజిలెన్స్ అధికారలు బయటపెట్టారు. మరింత సమాచారం కోసం వీడియ క్లిక్ చేయండి. 

15:42 - February 14, 2018
15:42 - February 14, 2018

ఢిల్లీ : ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ్టికి మూడేళ్లు పూర్తయింది. ఆప్‌ సర్కార్‌ మూడేళ్లలో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరించారు. ఢిల్లీలో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. విద్య, వైద్య రంగంలో తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని కేజ్రీవాల్‌ తెలిపారు. 164 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేశామని...మరి కొద్దిరోజుల్లో 950 మొహల్లా క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 70 ఏళ్లలో 10 వేల పడకలుంటే...ఈ ఏడాది చివరికల్లా మరో 3 వేల పడకలను సమకూర్చుతున్నామని వెల్లడించారు. 20 కొత్త స్కూళ్లను నిర్మించినట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. గత మూడేళ్లలో విద్యుత్‌ చార్జీలను పెంచలేదన్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలను ఆప్‌ గెలుచుకుని రికార్డ్‌ సృష్టించింది.

15:41 - February 14, 2018

విశాఖ : రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రైల్వే జోన్ కేటాయింపులో ఆలస్యం చేస్తే సహించబోమని.. పోరాటాలను ఉధృతం చేస్తామని అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:40 - February 14, 2018

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ ఉదాసీన వైఖరి అవలంభించడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు కేసీఆర్‌ తిలోదకాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15:39 - February 14, 2018

కృష్ణా : విభజన చట్టంలోని హామీల అమలుకు భారీస్థాయిలో ఉద్యమం చేపట్టబోతున్నట్టు వామపక్ష పార్టీల నేతలు తెలిపారు. దీనిపై దశలవారీగా ఉద్యమం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను సమీకరిస్తామన్నారు. విభజన చట్ట హామీల అమలుకు మార్చి 6న పార్లమెంట్‌ ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ తెలిపారు. ఇవాళ విజయవాడలో 10వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. విభజన చట్టం హామీల అమలుకు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. విజయవాడలో కాసేపట్లో వామపక్ష పార్టీల నేతలు భేటీకానున్నారు. ఈ భేటీకి 10 లెఫ్ట్‌పార్టీల నేతలు హాజరుకానున్నారు. విభజన చట్టంలోని హామీలు సాధించడానికి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.  

15:38 - February 14, 2018

విశాఖ : ఏప్రియల్ 6న రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్.జగన్ బూటకపు ప్రకటన చేసారంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రెండేళ్లుగా రాజీనామాలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్న జగన్ తిరిగి పాతపాటే పాడుతున్నారని విమర్శించారు. 2016లో నిజంగా రాజీనామా చేసి ఉంటే వైసీపీ నేతల చిత్తశుద్ధిని ప్రజలు నమ్మేవారని గంటా అన్నారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉండి కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు రాజీనామా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో ప్రజలకు చెప్పాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 

మట్టిపాలైన రూ.25 కోట్లు

ఖమ్మం : లకారం చెరువు పనుల్లో డొల్లతనం బయపడింది. మినీ ట్యాంక్ బండ్ పనుల్లో కాంట్రాక్టర్ల కక్కుర్తితో లకారం చెరువు మినీ ట్యాంక్ బండ్ నాసిరకంగా నిర్మించారు. రోడ్డు ప్రారంభించిన రోజు నుంచే గోతులు పడ్డాయి. వాకింగ్ ట్రాక్ కూడా రాళ్ళుతేలడంతో వాకర్స్ వాకింగ్ రావడానకి భయపడుతున్నారు.

15:14 - February 14, 2018

ఖమ్మం : లకారం చెరువు పనుల్లో డొల్లతనం బయపడింది. మినీ ట్యాంక్ బండ్ పనుల్లో కాంట్రాక్టర్ల కక్కుర్తితో లకారం చెరువు మినీ ట్యాంక్ బండ్ నాసిరకంగా నిర్మించారు. రోడ్డు ప్రారంభించిన రోజు నుంచే గోతులు పడ్డాయి. వాకింగ్ ట్రాక్ కూడా రాళ్ళుతేలడంతో వాకర్స్ వాకింగ్ రావడానకి భయపడుతున్నారు. కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు కుమక్కై పనులు నాసికరంగా చేశారని స్థానికులు అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

రాష్ట్ర మహాసభలు విజయవంతం : తమ్మినేని

హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏప్రిల్ లో హైదరాబాద్ జరగనున్న జాతీయ మహాసభల నిర్వహణకు 20 కమిటీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

14:36 - February 14, 2018

ప్రేమికుల రోజు పార్క్ లకు వచ్చే జంటలకు బలవంతంగా పెళ్లి చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే కిందకు వస్తుందని, పార్కులకు కేవలం లవర్స్ మాత్రమే రాలేరని ఎవరైనా వస్తారని ప్రముఖ అడ్వకేట్ పార్వతీ అన్నారు. 

నరబలి కేసులో నేడు రానున్న డీఎన్ఏ రిపోర్ట్

హైదరాబాద్ : రబలి కేసులో నేడు పోలీసులకు డీఎన్ఏ నివేదిక అందనుంది. కొద్ది రోజుల క్రితం చిన్నారి తల నమూనాలను పోలీసులు డీఎన్ఏ పరీక్షకు పంపారు.

14:27 - February 14, 2018

హైదరాబాద్ : నరబలి కేసులో నేడు పోలీసులకు డీఎన్ఏ నివేదిక అందనుంది. కొద్ది రోజుల క్రితం చిన్నారి తల నమూనాలను పోలీసులు డీఎన్ఏ పరీక్షకు పంపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

యశోదా ఆసుపత్రిలో దారుణం

హైదరాబాద్ : మలక్ పేట యశోద ఆసుపత్రిలో దారుణం జరిగింది. డెలీవరీ కోసం వచ్చిన మహిళ యశోదలో జాయిన్ అయింది. ఆపరేషన్ కోసం రూ.10లక్షలు కట్టించుకుని పేషెంట్ చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. డబ్బుల కోసం ఆసుపత్రి యాజమాన్యం నటకం అడినట్టు తెలుస్తోంది.

బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసులో మరో నింధితుడు అరెస్ట్

హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసులో మరో నింధితుడు వికాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికాసన్ మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

14:09 - February 14, 2018

విభజన హామీల అమలు కోసం ఉద్యమం - మధు...

విజయవాడ : రాష్ట్రంలో విభజన హామీల అమలు కోసం...ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ 5వ తేదీన పార్లమెంట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. మార్చి 2 ,3, 4 జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలుంటాయని, రాష్ట్ర వ్యాప్త సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని సంప్రదింపులు జరిపిన తరువాత సదస్సు తేదీని ఖరారు చేస్తామని, 18వ తేదీన రౌండౌ టేబుల్ సమావేశం జరుగుతుందన్నారు.

పదేళ్ల పాటు హోదా ఇవ్వాలి - రామకృష్ణ...

విజయవాడ : విభజన హామీలపై నిర్ణక్ష్యం..కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం చేయకపోవడంతో వామపక్షాలు ముందుగా స్పందించి బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. బంద్ విజయవంతమైందని, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 

సముద్ర స్నానానికి వెళ్లి...

విశాఖపట్టణం : సాగర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందగా మరొకరిని స్థానికులు కాపాడారు. ముగ్గురు కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. 

విద్యార్థులను కొట్టిన పోలీసు..

పశ్చిమగోదావరి : ఆచంటలో శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మహిళల పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులు వారిని చితకబాదారు. చితకబాదిన దృశ్యాలు బహిర్గతమయ్యాయి. 

నరబలి కేసులో దర్యాప్తు ముమ్మరం...

హైదరాబాద్ : చిలుకానగర్ నరబలి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చిన్నారి తల నమూనాలను డీఎన్ఏ పరీక్షకు..మూడు రోజుల ముందే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. శాస్త్రీయంగా లింగ నిర్ధారణపై పోలీసులు దృష్టి సారించారు. నేడు డీఎన్ ఏ నివేదిక పోలీసులకు అందనుంది. 

ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ భేటీ...

హైదరాబాద్ : జలసౌధాలో ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగే కేంద్ర జలవనరుల సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. 

13:12 - February 14, 2018

పశ్చిమగోదావరి : శివరాత్రి సందర్భంగా ఆచంటలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలకు హాజరైన మహిళల పట్ల కొంతమంది ఆకతాయి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించడం..కామెంట్స్ చేశారని కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తీసుకొచ్చి విద్యార్థులను విచారించారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఓ పోలీసు విద్యార్థులను చితకబాదాడు. అక్కడకు చేరుకున్న మీడియా చితక్కొడుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. దీనిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఉత్సవాల్లో తమ ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తించారని...విద్యార్థులు పొంతనలేని సమాధానం చెబుతున్నారని పోలీసులు పేర్కొంటున్నట్లు సమాచారం. 

13:10 - February 14, 2018

పశ్చిమగోదావరి : ఏడేళ్ల పాటు కేసు నడించింది..చివరకు కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆయనో ఎవరో కాదు..పలు వివాదాలకు కారణమైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ 2011లో దెందులూరులో జరిగిన జన్మభూమి సభలో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై చింతమనేని చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. వేదికపైనే చేయి చేసుకోవడంతో కోర్టులో కేసు నమోదైంది. 2011 నుండి ఇప్పటి వరకు కేసు నడుస్తోంది.

కోర్టు ఎదుట బుధవారం హాజరు కావాలని భీమడోలు మెజిస్ట్రేట్ ఆదేశించింది. కానీ వట్టి వసంత కుమార్ కోర్టుకు హాజరు కాగా చింతమనేని గైర్హాజయ్యారు. అనంతరం కోర్టు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష...రూ. 3,000 జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

చింతమనేని ప్రభాకర్ కు జైలు శిక్ష...

పశ్చిమగోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. 2011లో దెందులూరులో జన్మభూమి సభలో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై చేయి చేసుకున్న కేసులో భీమడోలు మెజిస్ట్రేట్ శిక్ష ఖరారు చేసింది. 

12:39 - February 14, 2018

విజయవాడ : ఏపీలో సోలార్ విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతోంది. విద్యాసంస్థలు.. వ్యాపార సముదాయాలు సైతం ఇప్పుడు సోలార్‌ పవర్‌పై దృష్టి పెట్టాయి. విజయవాడలో అతి పెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయోగాత్మకంగా 150 వాట్స్ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్‌ ఇది... ఈ కాలేజ్‌ ప్రాంగణంలో 10 వేల చదరపు అడుగులతో కూడిన భవన సముదాయాలు ఉన్నాయి. నిత్యం ఈ కాలేజ్‌లో 500 వాట్ల విద్యుత్‌శక్తిని వినియోగిస్తున్నారు. విద్యుత్ సంస్ధ బిల్లులు మోత మోగిస్తుండటంతో ఆ భారం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్ ఒకటే పరిష్కారమని కళాశాల అధ్యాపకులు భావించారు. ఈ విషయాన్ని పాలకవర్గం కూడా అంగీకరించడంతో ప్రయోగాత్మకంగా సోలార్‌ విద్యుత్ పవర్‌ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిని ప్రముఖ వ్యాపార వేత్త మలినేని రాజయ్య ప్రారంభించారు.

సోలార్ పవర్ ప్లాంట్‌ ఏర్పాటుకు కళాశాల పాలకవర్గం రూ.50 లక్షలు ఖర్చు పెట్టింది. దీనికి నెడ్ క్యాప్ 30శాతం సబ్సిడీ కూడా తోడవ్వటంతో ఇందులో అనుభవం ఉన్న సాఫ్ట్‌ టెక్‌ సంస్థను సంప్రదించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు తక్కువ ఖర్చుకి సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అనేక సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టిన సాఫ్ట్ టెక్ సంస్ధ స్వల్పకాలంలోనే కళాశాలలో తొలివిడతగా 150 వాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న కళాశాల భవనాల పై అంతస్ధుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్యానల్స్ ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వం కూడా దీనిని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కళాశాల సిబ్బంది సూచిస్తున్నారు. 

హరీష్ లాంటి మంత్రిని చూడలేదన్న సీఎస్...

హైదరాబాద్ : 31 ఏళ్ల సర్వీస్ లో హరీష్ లాంటి మంత్రి చూడలేదని సీఎస్ జోషి తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి సెలవులు..పండుగలు లేకుండా మంత్రి హరీష్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 

ఎంతో బాధ్యతగా పనిచేసిన సీఎస్ జోషి - హరీష్...

హైదరాబాద్ : రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇరిగేషన్ వ్యవహారాలను పర్యవేక్షించి జోషి ఎంతో బాధ్యతగా పనిచేశారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. జోషి చిత్తశుద్ధి, నిబద్ధత, కృషిని సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు. అనేక క్లిష్టమైన పనులను జోషి సునాయసంగా పరిష్కరించారని తెలిపారు. 

సీఎస్ ను సన్మానించిన మంత్రి హరీష్...

హైదరాబాద్ : జలసౌధలో సీఎస్ ఎస్ కే జోషిని మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

12:26 - February 14, 2018

కృష్ణా : విభజన చట్టాల హామీలు ఎలా సాధించుకోవాలి..ప్రత్యేక హోదాకు అనుసరించాల్సిన వ్యూహం..కేంద్రం మెడలు ఎలా వంచాలే దానిపై వామపక్షాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటి వరకు జరుగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలని యోచిస్తున్నాయి. విభజన హామీలు అమలుకు టిడిపి వత్తిడి చేయకపోవడం..కేంద్రం స్పందించకపోవడంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.

నాలుగేళ్లు దాటిపోవడంతో ఇక భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని వామపక్షాలు నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా పది వామపక్ష పార్టీ నేతలు భేటీ అవుతున్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు..ఇతర వామపక్ష నేతలు..ప్రజా సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. విభజన హామీల అమలు..నిధుల లెక్కలు..తదితర వివరాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణనపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

పది వామక్ష పార్టీల సమావేశం..

కృష్ణా : విజయవాడలో పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో ప్రత్యేక సమావేశమైంది. 

11:53 - February 14, 2018
11:25 - February 14, 2018

విజయవాడ : గత కొన్ని రోజులుగా ఏపీలో విభజన హామీల అమలు..ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ కేంద్రంపై అధికార..విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిదే. దీనిపై ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షమైన వైసీపీ ఒక్కసారిగా వ్యూహం మార్చేసింది. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటనతో రాజకీయ వేడి మరింత రగులుకుంది. దీనితో టిడిపి అప్రమత్తమైంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అందుబాటులో ఉన్న కీలక నేతలు, ఎంపీలు, మంత్రులతో సమావేశమయ్యారు. జగన్ వ్యాఖ్యలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విభజన హామీలు..భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. కానీ ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమి ఉంటుందనే దానిపై చర్చించనున్నారు. 

వైసీపీ ది రాజీనామా నాటకం - గంటా..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పుడూ మాటలపై నిలబడరని, గతంలో కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని చెప్పి నిలుపుకోలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. జగన్ పాదయాత్రకు స్పందన రావడం లేదని అనిపించి ఇలాంటి రాజీనామా డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. రాజీనామాలు చేసే వారైతే 2016లో చేసేవారని, వైసీపీ చిత్తశుద్ధిని అందరూ నమ్మే వారని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయని, ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేయడంలో ఆంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు. స్పీకర్ రాజీనామాల పరిశీలన..తదితర పనులు చూడటానికి సమయం పడుతుందన్నారు. 

ప్రకాష్ నగర్ లో కానిస్టేబుల్ సూసైడ్...

కడప : ప్రకాష్ నగర్ లో కానిస్టేబుల్ బాల రంగయ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే కోడూరు పీఎస్ లో బాల రంగయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

11:13 - February 14, 2018

హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసులో నిందితుడు అమర్ కాంత్ ఝాను పోలీసులు బీహార్ లో అరెస్టు చేశారు. గర్భిణీ బింగీ హత్య కేసును పోలీసులు చేధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమర్ షాను బీహార్ లో అరెస్టు చేసి బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. కీలక నిందితుడైన వికాస్ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపులు చేపడుతున్నారు.

బిహార్‌కు చెందిన బింగీ, మొదటి భర్తతో విభేదాల వల్ల, వికాస్‌ఝాకు దగ్గరైంది. అతను, మమతాఝాతో కలిసి హైదరాబాద్‌ వచ్చేశాడని తెలుసుకున్న బింగీ, ఇక్కడికి వచ్చింది. ఆర్థిక ఇక్కట్లకు తోడు, తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా కూడా ఉండడంతో.. వికాస్‌, మమతలు ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

11:07 - February 14, 2018

హైదరాబాద్ : యూ ట్యూబ్ లో సంచలనంగా మారిన మలయాళ నటి 'ప్రియా ప్రకాష్ వారియర్' వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఓ సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన హావభావాలకు యువత ఫిదా అయిపోయింది. కానీ హైదరాబాద్ ఫలక్ నుమా పీఎస్ లో ఆమెపై ఓ వర్గం వారు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ పై చిత్రీకరించిన సాంగ్ అభ్యంతకరంగా ఉందని, తమ మనోభావాలు దెబ్బతీశారని ఓ వర్గం ఫలక్ నుమా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పాటను వెంటనే తొలగించాలని, చిత్ర యూనిట్ లేదా హీరోయిన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 

టిడిపి ముఖ్య నేతలతో బాబు భేటీ...

విజయవాడ : తెలుగుదేశం ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రంతో సంబంధాలు, విభజన హామీల సాధన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

10:35 - February 14, 2018

హైదరాబాద్ : ప్రేమ...రెండు మనుషులను ఏకం చేసి...ఒకే శ్వాసగా నిలిచేది..ప్రతి మనిషిని ప్రేమించగలగడం...ప్రతి జీవిలో ప్రేమను చూడడం..ఎంత ఉన్నతమోనని పలువురు పేర్కొంటుంటారు...కానీ ఆ ప్రేమ నేడు కుంచించుకపోతోంది..ప్రేమించకపోతే దాడులు...ప్రేమించడం లేదని హత్యలు...ఇద్దరూ ప్రేమించుకుంటే పెద్దల అడ్డంకులు...ప్రేమికుల దినోత్సవం ఇక్కడి సంప్రదాయం కాదని హెచ్చరికలు...ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటూ ఉంటోంది...

హైదరాబాద్ లోని ప్రముఖంగా పేరొందిన ఇందిరా పార్కు బుధవారం ఉదయం బోసిపోయింది. ఫిబ్రవరి 14..ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పోలీసులు మూసివేశారు. ఉదయం కేవలం మాకింగ్ వార్నింగ్ వారికే మాత్రమే అనుమతినిచ్చారు. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దని..ప్రేమికులు కనిపిస్తే వివాహాలు చేస్తామని భజరంగ్ దళ్, వీహెచ్ పీ నేతలు హెచ్చరికలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిపార్కుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు వస్తారనే సమాచారంతో మఫ్టీలో పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రేమికుల రోజున చట్టపరిధి దాటి ప్రవర్తిస్తే చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

సంజీవయ్య పార్కులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు పార్కులు బోసిపోయాయి. పలు పార్కులను మూసివేసిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రేమికుల దినోత్సవం ఇక్కడి సంస్కృతి కాదని పేర్కొంటూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భజరంగ్ దళ్ నేతలు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

భజరంగ్ దళ్ కార్యకర్తల ర్యాలీ...

మహారాష్ట్ర : భజరంగ్ దళ్ కార్యకర్తలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ చేశారు. 

అమర్ కాంత్ ఝా అరెస్టు...

హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసులో నిందితుడు అమర్ కాంత్ ఝాను పోలీసులు బీహార్ లో అరెస్టు చేశారు. కాసేపటి క్రితం అమర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. ప్రధాన నిందితుడైన వికాస్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

ఇందిరాపార్కు మూసివేత...

హైదరాబాద్ : ఫిబ్రవరి 14వ దినోత్సవం సందర్భంగా ఇందిపార్కును పోలీసులు మూసివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రేమికుల రోజున చట్టపరిధి దాటి ప్రవర్తిస్తే చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇందిపార్కుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు వస్తారనే సమాచారంతో మఫ్టీలో పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

జగన్ 87వ రోజు పాదయాత్ర...

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 87వ రోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కనిగిరి శివారు నుండి పాదయాత్ర జరుగుతోంది. కృష్ణారెడ్డిపాలెం, కుడుములదిన్నెపాడు, తెల్లపాడు క్రాస్, చిన్న ఆన్నలూరు, మావిడాళ్ల పాలెం, జంగాలపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. 

నటి ప్రియా ప్రకాష్ పాటపై ఫిర్యాదు...?

హైదరాబాద్ : మలయాళీ నటి ప్రియ ప్రకాష్ పాటపై ఫిర్యాదు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా పాట..సాహిత్యం ఉందంటూ ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

నటి ప్రియా ప్రకాష్ పాటపై ఫిర్యాదు...

హైదరాబాద్ : మలయాళీ నటి ప్రియ ప్రకాష్ పాటపై ఫిర్యాదు నమోదైంది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా పాట..సాహిత్యం ఉందంటూ ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

స్టాక్ మార్కెట్ లో స్వల్ప నష్టాలు...

 

ముంబై : స్టాక్ మార్కెట్ లలో బుధవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 21 పాయింట్ల నస్టంతో 34279 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ స్వల్పంగా 3 పాయింట్ల నష్టంతో 10536 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

 

ప్రజలతో కలెక్టర్ లక్ష్మీకాంతం ముఖాముఖి...

కృష్ణా : కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వివిధ వర్గాల నుండి వచ్చిన సమస్యలపై కలెక్టర్ స్పందించారు. పలు సమస్యలపై తక్షణ చర్యలను ఆదేశాలు జారీ చేశారు. వివిధ ఫిర్యాదులపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. 

08:59 - February 14, 2018
08:56 - February 14, 2018

ఢిల్లీ : టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంది. గతంలో ఆరుసార్లు పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌ను గెలవని భారత్... ఈసారి ఆ ఘనతను సాధించి వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో కొనసాగుతోంది. పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరిగిన చివరి వన్డే భారత్‌ దక్షిణాఫ్రికా 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల చేసింది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌శర్మ ఈ వన్డేలో చెలరేగి ఆడాడు. శిఖర్‌ ధావన్‌ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 105 పరుగుల వద్ద సమన్వయలోపంతో కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత రహానే కూడా రనౌట్‌ అయి వెనుదిరిగాడు. మరోవైపు రోహిత్‌ మాత్రం చెలరేగి ఆడడంతో భారత్‌ మంచి స్కోర్‌ చేయగలిగింది. ఈ వన్డే రోహిత్‌ 126 పరుగులు చేయడంతో... వన్డే కెరీర్‌లో 17 సెంచరీలు నమోదయ్యాయి.

అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఆమ్లా, మార్‌క్రమ్‌ రెచ్చిపోయారు. ఆరో ఓవర్‌లో శ్రేయాస్‌ క్యాచ్‌ వదిలేయడంఓ 9 పరుగల వద్ద ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న మార్‌క్రమ్‌ వెంటవెంటనే మూడు బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. అయితే.. పదో ఓవర్‌లో బూమ్రా మార్‌క్రమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత డుమిని, డివిల్లీర్స్‌ల వికెట్లను హర్దిక్‌ పడగొట్టి దక్షిణాఫ్రికాను టెన్షన్‌లో పడేశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఆమ్లాకు డేవిడ్‌ మిల్లర్‌ తోడయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఒకానొక దశలో గెలుస్తుందేమోనని అనిపించింది. కానీ... చాహల్‌ అద్భుత బంతితో మిల్లర్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌లో ఆనందం నిండింది. ఆ తర్వాత ఆమ్లాను పాండ్యా డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆమ్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి.. తన జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ.. 71 పరుగుల చేసి రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత 42వ ఓవర్‌లో కుల్దీప్‌ మూడు వికెట్లు తీసి భారత్‌ను గెలుపునకు చేరువ చేశాడు. ఆ తర్వాత 42.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా 201 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. మొత్తానికి వన్డే ఓటమితో కసి పెంచుకున్న కోహ్లీ సేన ఐదో వన్డేలో ఘన విజయం సాధించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని టీమిండియా రికార్డ్‌ సాధించింది. 

నగరానికి రానున్న ఇరాన్ అధ్యక్షుడు...

హైదరాబాద్ : ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ ఈ నెల 15న హైదరాబాద్‌ నగర పర్యటనకు రానున్నారు. ఆయన భారత దేశ పర్యటనలో భాగంగా తొలుత నగరానికి వస్తున్నారు.

కడప..రాజంపేట నేతలతో బాబు భేటీ..

విజయవాడ : కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు. 

08:04 - February 14, 2018

పాలకులకు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ నిర్వాసితులకు న్యాయం చేయడంలో లేదు. అది పోలవరం అయినా.. వంశధార అయినా కనపడేది ఒకటే. ప్రాజెక్టు ఏదైన నిర్వాశితులు సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదు. పైగా నిర్వాశితుల సమస్యలను ప్రస్తావిస్తున్న వారిని అభివృద్ధి నిరోధకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ప్రాజెక్టు నిర్వాశితు సంఘం నాయకులు కృష్ణమూర్తి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:30 - February 14, 2018

విభజన హామీలు..ప్రత్యేక హోదా కోసం వైసీపీ కీలక నిర్ణయం వెలువరించింది. పార్టీకి సంబంధించిన ఎంపీలతో రాజీనామా చేయిస్తామని జగన్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగేళ్లు అయిన పోయిన అనంతరం విభజన హామీలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి. కేంద్రం నిధులు ఇచ్చిందని..ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియచేయాలని బిజెపి పేర్కొంటోంది..కానీ నిధులు అంతగా రాలేదని టిడిపి పేర్కొంటుండడంతో లెక్కలపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీరాములు (టిడిపి), బి.వి.కృష్ణ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్...

ఢిల్లీ : పోర్టు ఎలిజబెత్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 73 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

 

సినిమా టికెట్ ధరల పెంపుపై...

విజయవాడ : సినిమా టికెట్ ధరల పెంపుపై నేడు సబ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నిర్మాతలు..ఎగ్జిబిటర్లు..డిస్ట్రిబ్యూటర్లు పాల్గొననున్నారు. 

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు...

చిత్తూరు : తిరుమలలో నేడు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు టిటిడి అధికారులు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. 

06:52 - February 14, 2018

హైదరాబాద్ : సంచలనం.. కలకలం సృష్టించిన బొటానికల్‌ గార్డెన్‌ మహిళ హత్య కేసు.. ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దాదాపు రెండు వారాల పాటు.. ముప్పుతిప్పలు పెట్టిన ఈ కేసును.. పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరిష్కరించారు. కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జనవరి 28వ తేదీ రాత్రి వికాస్‌ఝా, మమతాఝాలు, బింగీతో కావాలనే గొడవ పెట్టుకుని, ఆమెను గట్టిగా గోడవైపు తోశారని, తలకు గట్టిగా దెబ్బతగలడంతో.. అసలే 8నెలల గర్భిణి కూడా అయిన.. బింగీ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని పోలీసులు గుర్తించారు. ఆమె ఊపిరి ఆగేంతవరకూ నిందితులు సున్నితభాగాల్లో పిడిగుద్దులు కురిపించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

బింగీ మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు అత్యంత పకడ్బందీ ప్రణాళికను అమలు చేశారని పోలీసులు తెలిపారు. బింగీని చంపాక, ఉదయాన్నే.. వికాస్‌ఝా, ఎలెక్ట్రికల్‌ కటింగ్‌ మిషన్‌ను కొని తెచ్చి, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని దర్యాప్తులు వెల్లడైంది. బింగీ మృతదేహపు ముక్కల నుంచి రక్తం కారకుండా.. హత్య చేసిన మర్నాడంతా ఇంట్లోనే ఆరబెట్టి, 30వ తేదీన ఉదయాన్నే.. ఆ ముక్కలను రెండు ప్లాస్టిక్‌ కవర్లలో సర్ది.. వాటిని.. ఓ గోనెసంచిలో వేసుకుని.. బైక్‌మీద తీసుకు వెళ్లి.. బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేశారని పోలీసులు తేల్చారు. బొటానికల్‌ గార్డెన్‌ మర్డర్‌ కేసు ఛేదనలో.. పోలీసులకు మళ్లీ సీసీ టీవీలు సహకరించాయి. దాదాపు వారం రోజుల పాటు.. సీసీటీవీ ఫుటేజీలో.. కార్లు, బైక్‌ల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. వికాస్‌ఝా, మమతాఝా ప్రయాణించిన బైక్‌ను గుర్తించారు. దాని నంబర్‌ ఆధారంగా, బైక్‌ యజమాని వివరాలు సేకరించారు. బండిని 30వ తేదీన అమర్‌కాంత్‌ఝా వాడినట్లు గుర్తించారు. నిందితుడి వివరాలు లభ్యం కావడంతో.. పోలీసులు సుమారు 400 మందితో సిద్దిఖ్‌నగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అయితే, నిందితులు ముందే పసిగట్టి అక్కడి నుంచి పారిపోయారు.

పోలీసులు మమతాఝ, అనిల్‌ఝా దంపతులను అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. మృతదేహాన్ని ముక్కలు చేసి.. డస్ట్‌బిన్‌లో వేస్తే.. చెత్త తరలించే వాహనాలు ఆ మూటను యథాతథంగా ఎత్తుకు వెళ్లిపోతాయని.. డంప్‌యార్డ్‌ చేరాక, ఆ మృతదేహం ఆనవాళ్లే లేకుండా పోతాయని నిందితులు భావించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బిహార్‌కు చెందిన బింగీ, మొదటి భర్తతో విభేదాల వల్ల, వికాస్‌ఝాకు దగ్గరైంది. అతను, మమతాఝాతో కలిసి హైదరాబాద్‌ వచ్చేశాడని తెలుసుకున్న బింగీ, ఇక్కడికి వచ్చింది. ఆర్థిక ఇక్కట్లకు తోడు, తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా కూడా ఉండడంతో.. వికాస్‌, మమతలు ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

06:49 - February 14, 2018

ఆదిలాబాద్‌ : జిల్లా మంచిర్యాల మండలంలోని లింగాపూర్‌, కన్నాల పరిధిలోని బుగ్గ శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు వైభంగా జరిగాయి. అతిపురాతమైన ఈ రెండు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణాలు శివనామ స్మరణతో మార్మోగాయి. భక్తులకు పలు స్వచ్చంధ సంస్థలు మంచినీరు, మజ్జిగ అందించాయి. మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జనగామ జిల్లా చీటకోడూరు గ్రామంలో శివరాత్రి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. గ్రామంలోని పంచకోసు రామలింగేశ్వర, మల్లికార్జునస్వామి ఆలయంలో జరిగిన ఏకాదశ రుద్రాభిషేకానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఆలయంలో పూజలు నిర్వహించారు. జడ్జి పద్మావతి దేవీ, ఏసీపీ బాపురెడ్డి, జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని దేవలాయ కమిటీ చైర్మన్‌ కరుణాఖర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు రాజేశ్వరాచార్యులు తెలిపారు. 

06:48 - February 14, 2018

హైదరాబాద్ : త్వరలో జరుగనున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలపై అధికార పార్టీలో చర్చ మొదలైంది. మూడు స్థానాలు తెలంగాణాకు దక్కనుండడంతో ఆ స్థానాలు అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. పెద్దల సభకు ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చలు గులాబి పార్టీలో మొదలయ్యాయి. ఈ విడత జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో తెలంగాణాకు దక్కే మూడు స్థానాలు అధికార పార్టీకే దక్కనున్నాయి. విపక్ష పార్టీలన్నీ కలిసినా రాజ్యసభ స్థానం దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మూడు స్థానాలు గులాబి పార్టీ నేతలకే వరించనున్నాయి. ఏప్రిల్‌లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చలు మొదలయ్యాయి.

తెలంగాణాకు దక్కే మూడు స్థానాలను మూడు వర్గాలకు కేటాయించాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల లేదా కురమ కులస్తులో ఒకరికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని కేసిఆర్ వెల్లడించారు. దీంతో పార్టీలో ఆ వర్గానికి చెందిన ఐదుగురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్యతో పాటు రాజయ్యయాదవ్ , మురళీ యాదవ్‌లలో ఒకరికి రాజ్యసభ స్థానం దక్కునుందన్న ప్రచారం జరుగుతోంది. అగ్రవర్ణాలకు చెందిన ఎంతో మంది నేతలు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నా.. ముఖ్యమంత్రి సమీప బంధువు.. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ వెంట ఉన్న సంతోష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

మరో స్థానాన్ని దళితులు లేదా మైనార్టీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి పార్లమెంట్ సభ్యులుగా మైనార్టీలు పార్టీ తరపున ప్రస్తుతం ప్రాతినిథ్యం లేకపోవడంతో మైనార్టీ నేతకు అవకాశం కల్పించే చాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి మూడు రాజ్యసభ స్థానాలకు చాలామంది ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి.. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

06:47 - February 14, 2018

హైదరాబాద్ : జనాభాలో 50శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతోందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వీహెచ్‌. ప్రస్తుతం 27శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతున్నా..వాటిలో బీసీలకు చేరేది మాత్రం 9శాతంగా మాత్రమే ఉందన్నారు. అత్యంత వెనుకపడిన కులాలు అంటూ బీసీలకు సీఎం కేసీఆర్‌ మరింత అన్యాయం చేస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. క్రీమిలేయర్‌ నిబంధనలతో బీసీల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ప్రధాని మోదీ బీసీలపై ఉన్న క్రీమిలేయర్‌ నిబంధనలు ఎత్తివేయాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

 

06:45 - February 14, 2018

కర్నూలు : మహా శివరాత్రికి శ్రీశైలం ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఓం నమోః శివాయ నామస్మరణతో శ్రీ గిరి పొంగిపోయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నంది వాహనంపై విహరించారు. సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం అద్యంతం కన్నుల పండువగా సాగింది. పాగాలంకరణతో వరుడైన మల్లన్న కల్యాణోత్సవం అర్ధరాత్రి దాటిన తర్వాత అట్టహాసంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మల్లన్న పాగాలంకరణ ఘట్టాన్ని చూసి తరించేందుకు వచ్చిన వేలాది మంది భక్తజనంతో శ్రీశైలాలయం పోటెత్తింది. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి నిన్న రాత్రి 10గంటల తర్వాత లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం పంచామృతాలతో జల, క్షీర, ఫలరసాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

మల్లన్న వరుడయ్యే సమయం ప్రారంభం కావడంతో రోజుకో మూర చొప్పున నియమ నిష్టలతో పాగాను నేసిన పృథ్వీ వెంకటేశ్వర్లు ఒంటిపై నూలుపోగు లేకుండా గర్భాలయ కలశ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చేసే పాగాలంకరణ ఘట్టాన్ని ఆరంభించారు. రాత్రి పాగాలంకరణోత్సవంతో మల్లన్న వరుడిగా మారి భ్రమరాంబతో కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. పాగాలంకరణ సాగుతున్నంత సేపు ఆలయ ప్రాంగణంలోని అన్ని విద్యుత్‌ దీపాలను ఆర్పేశారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం చెందుతూ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ నామ భజన చేశారు.

ఘట్టం పూర్తవుతుండగానే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి కనుల పండువగా పుష్పాలంకరణతో సిద్ధమయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవ ఘడియలు రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి రోజున కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని.. మహా విష్ణువు కన్యాదానం.. బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తాడని శైవాగమం చెబుతోంది. శివమాలధారణ.. ఉపవాస దీక్షలు.. భక్తుల పుణ్య స్నానాలు.. పాగాలంకరణ సహిత స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంతో దీక్ష ముగిసిందని, తమ తనువులు పులకించాయంటూ శివస్వాములు మాల విరమణ చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రదక్షిణ చేసి తిరిగి నందివాహన సమేతులైన స్వామి వార్ల ఉత్సవమూర్తులను యథాస్థానానికి చేర్చారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Don't Miss