Activities calendar

15 February 2018

22:12 - February 15, 2018

హైదరాబాద్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఏర్పాటైన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈనెల 20 నుంచి జిల్లాల్లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా సంగారెడ్డిలో సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈనెల 25న మహబూబ్‌నగర్‌లో ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై భారీ ఉద్యమాలు చేపట్టాలని బీఎల్‌ఎఫ్‌ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించిన బీఎల్‌ఎఫ్‌... కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ రూపొందించింది. 
 

22:09 - February 15, 2018

ఢిల్లీ : కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధి నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ నీటిపారుదల మంత్రులు, అధికారుల సమావేశంలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీపై చర్చించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న విధంగా ఈ రెండు నదుల పరిధిని తేల్చాలని ఏపీ కోరింది. అలాగే దశాబ్దం క్రితం ప్రారంభించిన ఎనిమిది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 
 

22:05 - February 15, 2018

ఢిల్లీ : పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి  నుంచి కృష్ణానదికి తరలిస్తున్న నీటిలో  తెలంగాణ వాటా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్‌ బోర్డుల పరిధి నిర్ణయించాలన్న ఏపీ అధికారుల వాదనపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ అవార్డు తర్వాతే కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకురావాలని కోరారు. పట్టిసీమ ఎత్తిపోతలలో తెలంగాణ వాటా 45 టీఎంసీలు ఇవ్వాలని కోరారు.

22:00 - February 15, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని తొమ్మిది పాత జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించినందుకు జైట్లీకి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి 2017 వరకు రాష్ట్రానికి రావాల్సిన 1350 కోట్లు విడుదల చేయడంపట్ల కృతజ్ఞతలు చెప్పారు. 2017-18 నిధులను కూడా విడుదల చేయాలని కేసీఆర్‌ కోరారు. ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలన్న కేసీఆర్‌ విన్నపంపై జైట్లీ సానుకూలంగా స్పందించారు. 2018-19 వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 
 

21:56 - February 15, 2018

గుంటూరు : వైసీపీ రాజీనామాల లోగుట్టును.. ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ నాయకులకు సూచించారు. అదే సమయంలో జనసేన చేస్తోన్న ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ జేఏసీ ప్రయత్నాలను విమర్శించవద్దని ఆదేశించారు. జగన్‌ను, జనసేనానిని ఒకేగాటన కట్టవద్దన్న చంద్రబాబు.. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదని, నాయకత్వ లోపం ఉన్నచోట్ల ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ మళ్లీ రగిలిన నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ సీనియర్లతో, గురువారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రనికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీని జ‌న‌సేన‌ను ఒకే గాటన క‌ట్టవద్దని, రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం జనసేనాని ప‌నిచేస్తుంటే.. జ‌గ‌న్ కేసుల మాఫీ  కోసం పాట్లు పడుతున్నారని చంద్రబాబు నేతలతో అన్నారు. వాడ‌వాడ‌లా జ‌గ‌న్ చేస్తున్న  అవ‌కాశ‌వాద  రాజ‌కీయాల్ని  ఎండ‌గ‌ట్టాల‌ని, వైసీపీ నేతల రాజీనామా నిర్ణయం వెనుక కుట్రను ప్రజలకు వివరించాలని సూచించారు. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తలపెట్టిన జేఏసీ గురించీ సమావేశంలో చర్చించారు. శ్వేత పత్రాలు విడుదల చేయాలన్న పవన్‌ డిమాండ్‌పైనా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.కొన్ని లెక్కలు కావాల‌ని జ‌న‌సేనాని అడుగుతుఉండ‌టంతో పంపేందుకు త‌మ‌కు ఏమీ అభ్యంత‌రం లేద‌ని బాబు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్వేత ప‌త్రాల ద్వారా పలు వివ‌రాలు ప్రజ‌ల ముందుం ఉంచామ‌ని,  కావాలంటే మరోసారి వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌నే క్లారిటి పవన్‌కు ఇచ్చారని టీడీపీ నేతలు అంటున్నారు.  పవన్‌ చేస్తున్న ప్రయత్నాలన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అభిప్రాయపడుతున్న టీడీపీ నాయకత్వం... ఆయన కాంగ్రెస్‌ను చర్చలకు ఆహ్వానించడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఇక వైసిపి అధినేత వైఖ‌రిని బాబు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర ప్రయోజ‌నాల కోసమే తాను 29సార్లు హ‌స్తిన వెళ్లానని.. అయితే జగన్‌... బిజెపి అడ‌గ‌కుండానే రాష్ట్రప‌తి, ఉప రాష్ట్రప‌తి అభ్యర్థుల‌కు ఎందుకు మద్దతు ప్రకటించారని సీఎం ప్రశ్నించారు. స్వార్థంతో బీజేపీకి చేరువవుతున్న జగన్‌.. తన చిత్తశుద్ధిని ప్రశ్నించడమేంటని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కాపుల అంశంపై కూడా స‌మావేశంలో చ‌ర్చించినట్లు సమాచారం. కాపు రిజర్వేష‌న్ బిల్లు  విష‌యంలో కేంద్రాన్నిఓప్పిస్తామ‌ని... కేంద్రం అనుమానాల‌ను బీసీ సంక్షేమ శాఖ నివృత్తి చేస్తుందని అన్నారు. షెడ్యుల్ 9లో కాపు రిజర్వేషన్‌ అంశాన్ని చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువ‌స్తామ‌ని ముఖ్యమంత్రి  హ‌మీ ఇచ్చారని తెలుస్తోంది.

మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కూడా చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా కొంద‌రు నేత‌ల తీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.  ప‌ద‌వులు తీసుకుని సొంత ప‌నుల్లో బిజీ అయిపోయార‌ని, ఇక నుంచి ఆధోరణి మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హెచ్చరించారు. కొందరు మంత్రులు  ఇక మనం అయిపోయాం  అనే భావ‌నలో ఉన్నారని.. అది మంచి ప‌రిణామం కాద‌ని హిత‌బోధ చేశారు. 

 

21:53 - February 15, 2018

గుంటూరు : మార్చి ఐదున బీజేపీతో కటీఫ్‌ అన్నారు.. అంతలోనే తూచ్‌.. అట్లాంటిదేమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటామని చెప్పుకొచ్చారు. గంట వ్యవధిలోనే మారిన మంత్రి ఆదినారాయణరెడ్డి స్వరమిది. 

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత.. ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటనలు.. రాష్ట్రంలో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. మార్చి ఐదులోగా.. విభజన హామీల అమలుకు రోడ్‌మ్యాప్‌ ఇవ్వకుంటే.. అదేరోజు.. బీజేపీ ప్రభుత్వం నుంచి తమ మంత్రులు వైదొలుగుతారని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. 

ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించడంతో.. చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆదినారాయణరెడ్డికి తీవ్ర అక్షింతలు వేశారు. దీంతో ఆదినారాయణరెడ్డి వెనక్కి తగ్గారు. మళ్లీ మీడియా ముందుకు వచ్చి.. అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని ప్రకటించారు. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలకు తన అభిప్రాయాన్ని జోడించానని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ఆదినారాయణరెడ్డి ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ గంటపాటు.. పెను ప్రకంపనలనే సృష్టించింది. 


 

21:17 - February 15, 2018

మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలు..అమలుపై మాట్లాడారు. విభజన చట్టంలో 108 సెక్షన్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయన్నారు. కేంద్రంలోని ఎన్ డీఏ ప్రభుత్వం ఆరు కోట్ల ఆంధ్రులను చాలా దారుణంగా మోసం చేసిందని తెలిపారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలతో విభజన చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీజేపీ ఏపీ ప్రజలకు అన్యాయం చేసిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

20:59 - February 15, 2018

నరబలితో నరకం నుంచి తప్పించుకోవచ్చా..? కాలం మారినా..మనిషి మారలేదా.. ఈ నమ్మకాల నుంచి సమాజాన్ని బయటపడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ..? 'మూఢత్వమా ఇంకెన్నాళ్లు' అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమేష్ పాల్గొని, మాట్లాడారు.  చిన్నారి నరబలి దారుణమైన ఘటన అని అన్నారు. మూఢనమ్మకాలను పాటించవద్దని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...   

 

బోర్డు పరిధిని నిర్ణయించాలని కోరాం : దేవినేని ఉమ

ఢిల్లీ : వీపీ సింగ్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీర్ చీఫ్ లతో సమావేశం అయ్యారు. కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ల బోర్డులపై చర్చ జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో వాదనలు ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు అన్నారు. విభజన చట్టం ప్రకారం బోర్డు పరిధిని నిర్ణయించాలని కోరామని తెలిపారు. త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించే అవకాశముందన్నారు. 

తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీర్ చీఫ్ లతో భేటీ

ఢిల్లీ : వీపీ సింగ్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీర్ చీఫ్ లతో సమావేశం అయ్యారు. కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ల బోర్డులపై చర్చ జరిగింది.

మూసీ నదితోపాటు చెరువుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మూసీ నదితోపాటు నగరంలోని చెరువుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. మూసీ నది డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై చర్చించారు. మూసీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. 

 

మంత్రి ఆదినారాయణరెడ్డిని తీవ్రస్థాయిలో మందలించిన చంద్రబాబు

గుంటూరు : మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రులు రాజీనామా, బీజేపీతో తెగదెంపులు అన్న ప్రకటనపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డిని తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. 

20:12 - February 15, 2018

గుంటూరు : మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రులు రాజీనామా, బీజేపీతో తెగదెంపులు అన్న ప్రకటనపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డిని తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

నిజామాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రూ.30 వేలకు శిశువును ఓ మహిళ అమ్మకానికి పెట్టింది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. 

ఈనెల 20న సంగారెడ్డిలో బీఎల్ ఎఫ్ భారీ సభ : నల్లా సూర్యప్రకాశ్

హైదరాబాద్ : ఈ నెల 20న సంగారెడ్డిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్) భారీ సభ నిర్వహిస్తామని ఫ్రంట్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. శేరిలింగంపల్లి నుంచి సంగారెడ్డికి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న మహబూబ్ నగర్ లో భారీ సభ ఉంటుందని చెప్పారు. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ కు భారీ కార్ల ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. రాబోయే 6 నెలల్లో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ కు బీఎల్ ఎఫ్ ప్రత్యామ్నాయ శక్తి అని అన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

19:30 - February 15, 2018

బ్యాంకింగ్ రంగం పనిచేసేదే ప్రజల నమ్మంపై అని, దేశంలో ఇప్పటి వరకు అనేక స్కామ్ లు జరిగాయని, అయిన కూడా బ్యాంకింగ్ పై ప్రజలకు నమ్మకం పోలేదని, పంజాబ్ నేషనల్ బ్యాంకు వ్యవహారం వెనక రాజకీయ నాయకులు ఉండే ఆవకాశం ఉందని బ్యాంకింగ్ విశ్లేషకులు వెంట్రామయ్య అన్నారు. ఆర్థిక సంస్కరణల పేరుతో బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతుందని, బ్యాంకులు ఉండబట్టే ఇండియా ముందుకెళ్తుందని, నీరవ్ మోడీ కుంభకోణానికి సంబంధించి 2011లో బీజాలు పడ్డాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ అన్నారు. 2011లోనే అండర్ టెకింగ్ లెటర్ ఇచ్చిందని, అడిటింగ్ అధికారులు ఇన్ని రోజులు ఏం చేశారని, నీరజ్ మోడీ దేశం వెళ్లాడాని, 2018లో ప్రధాని మోడీ తో కలసి నీరవ్ ఫొటో దిగారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. నీరవ్ మోడీ చాలా మందితో ఫొటో దిగాడని అందులో భాగంగా మోడీ తో ఫొటో దిగారని బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:15 - February 15, 2018

ఢిల్లీ : నిన్న మొన్నటి వరకు నీరవ్‌ మోది అంటే ఎవరో ఎవరికీ తెలియదు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో స్కాం బయట పడడంతో నీరవ్‌ మోది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. బ్యాంకుకు 280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నీరవ్‌ మోదీపై ఫిబ్రవరి 5న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వారం రోజులకే పిఎన్‌బి ముంబై బ్రాంచ్‌లో 11,300 స్కాం బయటపడింది. ఈ భారీ స్కాంతో నీరవ్‌ మోదీకి లింకులున్నట్లు పిఎన్‌బి ఆరోపించింది.

విదేశాల్లో వ్యాపారాలు
వజ్రాల వ్యాపారుల కుటుంబంలో పుట్టిన నీరవ్‌ మోదీ, అదే వృత్తిని తన వ్యాపారంగా ఎంచుకున్నారు. 1999లో 2.3 బిలియన్‌ డాలర్ల ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీ నెట్‌వర్క్‌ను ఆసియాలోని చైనా నుంచి నార్త్‌ అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాలలో ఆయన తన వ్యాపారాలను విస్తరించారు. భారత్‌లోనే కాకుండా రష్యా, ఆర్మేనియా, దక్షిణ ఆఫ్రికాలో మానుఫాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయి. 2013లో ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2016 ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నీరవ్‌మోదీకి 1,067 ర్యాంకు ఉండగా... భారత్‌లో ఆయన 46వ బిలీనియర్‌గా నిలిచారు. గతేడాది భారత్‌ నుంచి ఫోర్బ్స్‌ జాబితాలో 82వ ర్యాంకును పొందారు.

తొలి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌
2014లో ఢిల్లీలో తన తొలి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను లాంచ్‌ చేశారు. అనంతరం 2016లో న్యూయార్క్‌లో కూడా ఒక స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ముంబై, లండన్‌, సింగపూర్‌, పెడ్చింగ్‌లో నీరవ్‌కు చెందిన బొటిక్‌లున్నాయి. ఇలా తన వ్యాపారాలను, స్టోర్లను గ్లోబల్‌గా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జువెల్లరీ డిజైన్లకు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్లలో ఫ్యాషన్‌కు ఐకాన్‌గా నీరవ్‌ మోదీ జువెల్లరీస్‌ గుర్తింపు పొందింది. లగ్జరీ డైమాండ్‌ జువెల్లరీ డిజైనర్‌గా ఆయనకు పేరుంది.

వైసీపీ కంటే ముందే మా ఎంపీలే రాజీనామా చేస్తారు : మంత్రి ఆదినారాయణరెడ్డి

అమరావతి : వైసీపీ కంటే ముందే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కేంద్రం పరిష్కరించాల్సిన 19 అంశాలు నెరవేర్సాల్సిందే అన్నారు. పరిష్కారం లభించకుంటే మార్చి 5నే రాజీనామాలు చేస్తామని అన్నారు. వైసీపీ డెడ్ లైన్ ఏప్రిల్ 6 అయితే మాది మార్చి 5 డెడ్ లైన్ అన్నారు.  

 

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై మంత్రి కామినేని స్పందన

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం వెలుగు చూసింది. ప్రమాదంలో గాయపడ్డ ఓ రోగికి సెల్‌ ఫోన్‌ వెలుగులో ప్రభుత్వ ఆస్పత్రివైద్యులు ఆపరేషన్‌ నిర్వహించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఈ ఆస్పత్రిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి కానినేని శ్రీనివాస్ స్పందించారు. ఈ వ్యవహారంలో పూర్తి విచారణ జరిగి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి డీఎంఈని ఆదేశించారు. ఆసుపత్రిని రేపు మంత్రి కానినేని పరిశీలించనున్నారు. 

 

18:44 - February 15, 2018

గుంటూరు : అమరావతిలో జరుగుతోన్న టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు పవన్ జేఏసీ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ పోరాటంలో అర్ధం ఉందని.. రాష్ట్రానికి మేలు జరగాలని పవన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. శ్వేతపత్రాలు అడిగితే సున్నితంగా చెప్పే బాధ్యత అందరిపై ఉందన్న చంద్రబాబు .. పవన్ ప్రభుత్వ లెక్కలు ఏవి అడిగినా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. 

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం వెలుగు చూసింది. ప్రమాదంలో గాయపడ్డ ఓ రోగికి సెల్‌ ఫోన్‌ వెలుగులో ప్రభుత్వ ఆస్పత్రివైద్యులు ఆపరేషన్‌ నిర్వహించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఈ ఆస్పత్రిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

18:43 - February 15, 2018

ఢిల్లీ : కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధి నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ నీటిపారుదల మంత్రులు, అధికారుల సమావేశంలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీపై చర్చించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న విధంగా ఈ రెండు నదుల పరిధిని తేల్చాలని ఏపీ కోరింది. అలాగే దశాబ్దం క్రితం ప్రారంభించిన ఎనిమిది ప్రాజెక్టలుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 

18:42 - February 15, 2018

నెల్లూరు :రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి రేణమాలలో జరిగిన వైసీపీ మహిళా సదస్సులో రోజా పాల్గొన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికియిన బాబు... కేంద్రతో లాలూచీపడి ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా మండిపడ్డారు. 

18:41 - February 15, 2018

ప్రకాశం : 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ ఇప్పుడు రాజీనామాలంటూ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు దామచర్ల జనార్దనరావు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.

18:41 - February 15, 2018

హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం మా పార్టీ ఎంపీలం రాజీనామాలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ రాద్ధాంతం చేయడం మంచిది కాదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. గతంలో మమ్మల్ని రాజీనామాలు చేయలేదని అడిగారు.. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజీనామాలపై తాము వెనకడుగు వేసిది లేదని.. ఉప ఎన్నికలకు సిద్ధమేనన్నారు.

18:40 - February 15, 2018

హైదరాబాద్ : కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ల నేతృత్వంలో జేఎఫ్‌సీ ఏర్పాటైన జేఎఫ్‌సీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల వివరాలు కోరింది. ఇందుకు ఈనెల 15వ తేదీ గడువు విధించింది. అయినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో భవిష్యత్‌ కార్యచరణపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి పెట్టారు.

శుక్రవారం జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీ కీలక సమావేశం
శుక్రవారం జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీ కీలక సమావేశం జరుగనుంది. పవన్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కమిటీ సభ్యులు జయప్రకాశ్‌ నారాయణ్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు కాంగ్రెస్‌, వామపక్ష నేతలు హాజరుకానున్నారు. సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గోనున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డికి ఫోన్‌ చేసిన జేఎఫ్‌సీ భేటీకి హాజరుకావాలని కోరగా ఇద్దరు ప్రతినిధులను పంపుతానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ జేఎఫ్‌సీ భేటీకి హాజరవుతారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం తర్వాత టీడీపీ, బీజేపీ నేతల మధ్య ముదిరిన మాటల యుద్ధం... ఎవరికి వారు లెక్కలు ప్రకటించే వరకు వచ్చింది. ఏపీకి కేంద్ర భారీగా నిధులు ఇచ్చిందని బీజేపీ నాయకులు 17 పేజీల నివేదిక విడుదల చేశారు. దీనికి కౌంటర్‌గా కేంద్రం... రాష్ట్రానికి ఇచ్చింది చాలా తక్కువ మొత్తమేని టీడీపీ నేతలు లెక్కలు ప్రకటించారు. ఈ రెండు గణాంకాలు ప్రజలను ఆయోమయానికి గురి చేశాయి. దీంతో స్పష్టత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్వేతపత్రం కోసం డిమాండ్‌ చేసినా ఫలితం లేకపోవడంతో జేఎఫ్‌సీలో చర్చించి భవిష్యత్‌ కార్యాచణ ప్రకటించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.

ఇదే మొదటిసారికాదు.
జనసేనాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం కోరడం ఇదే మొదటిసారికాదు. ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో వైట్‌ పేపర్‌ ప్రకటించాలన్న పవన్‌ డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం నిర్మాణ పురోగతిని సమీక్షించి.. జరుగుతున్న పనుల వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నప్పుడు శ్వేతపత్రం అవసరంలేదన్న వాదాన్ని చంద్రబాబు వినిపించారు. శ్వేతపత్రం విషయంలో పవన్‌కు రెండుసార్లు చేదు అనుభవం ఎదురడంతో.. ఏపీ ప్రభుత్వంపై సీరియస్‌గా ఉన్నారు. దీంతో శుక్రవారం జరిగే సంయుక్త నిజనిర్ధారణ కమిటీ భేటీ కీలకం కాబోతోంది. 

చిన్నారి నరబలి కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ : ఉప్పల్లో సంచలనం సృష్టించిన  చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 1న చిలుకానగర్‌లో జరిగిని ఈ సంఘటనలో ఇంటి ఓనరే నిందితుడని పోలీసులు తేల్చారు. ఈమేరకు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ వివరాలు  తెలిపారు. 

18:30 - February 15, 2018

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్లకు కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందని వస్తున్న వార్తలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా స్పందించారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపితే బాగుండేదన్నారు. ఈ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి, నిబద్ధతను అనుమాన్సించాల్సి వస్తోందని విమర్శిస్తూ.. లేఖ రాశారు. గవర్నర్‌ సంతకంతో కాపు రిజర్వేషన్లను అమలు చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. 1910 నుంచి అమల్లో ఉన్న కాపు రిజర్వేషన్లు.... ఆ తర్వాత తొలగించిన అంశాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. కాపు జాతిని మోసపుచ్చి, నష్టపెట్టొద్దని కోరారు. తక్షణం రిజర్వేషన్లను అమలుచేయకుండా మోసపుచ్చాలని చూస్తే.. కాపులు కూడా అదేపని చేస్తారని చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ హెచ్చరించారు. 

18:05 - February 15, 2018

గుంటూరు : ప్రభుత్వ ఆసపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు సెల్ ఫోన్ వెలుగులో శస్త్ర చికిత్స చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి కామినేని విచారణకు ఆదేశించారు. ఆయన డీఎంఈకి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరింతా సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:40 - February 15, 2018

కామారెడ్డి : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ 61వ జన్మదినోత్సవాన్ని కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మకుంట కాలనీలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు చేయించుకున్నవారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. 

17:39 - February 15, 2018

హైదరాబాద్ : షంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు స్కూల్‌ ప్రిన్సిపల్‌ కూచీపూడి సునితా తెలిపారు. ఎగ్జిబిషన్‌తో అనేక విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు చెప్పారు.  

17:37 - February 15, 2018

హైదరాబాద్ : కార్పొరేట్ కంపెనీలకు రుణాలను మాఫీ చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం. దేశ వ్యాప్తంగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేయకుంటే.. కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో వెంటనే రైతులను రుణ విముక్తులను చేసే బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ఆలిండియా కిసాన్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో సమితి కేంద్ర నాయకులు యోగేంద్ర యాదవ్ తో కలిసి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ... రైతు రుణ విముక్తి బిల్లు, కనీస మద్దతు ధరలపై నమూనా బిల్లును ప్రవేశపెట్టారు.

17:36 - February 15, 2018

సిద్దిపేట : జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఏసీబీకి చిక్కాడు. లంచం తీసుకుంటుండగా దాడిచేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చేర్యాల మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్‌ రహీం ఫిర్యాదు మేరకు డీఈఈ చంద్రప్రకాశ్‌ను ఏసీబీ పట్టుకుంది. బిటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 74 లక్షల బిల్లును ఇచ్చేందుకు డీఈఈ లక్షా 20వేల లంచం డిమాండ్‌ చేశాడు. అయితే తాను అంత ఇవ్వలేనని.. ఓ 50వేలు ఇస్తానన్నాడు కాంట్రాక్టర్‌. చివరికి 85వేలకు ఒప్పందం కుదిరిందని కాంట్రాక్టర్‌ రహీం తెలిపాడు. విషయాన్ని కాంట్రాక్టర్‌... ఏసీబీ దృష్టికి తీసుకెళ్లడంతో డీఈఈ చంద్రప్రకాశ్‌ను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. 

17:36 - February 15, 2018

హైదరాబాద్ : ఉప్పల్లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 1న చిలుకానగర్‌లో జరిగిని ఈ సంఘటనలో ఇంటి ఓనరే నిందితుడని పోలీసులు తేల్చారు. ఈమేరకు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ వివరాలు తెలిపారు. కేరుకొండ రాజశేఖర్‌ తనకు, తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో భూతవైద్యులను ఆశ్రయించారు. భూతవైద్యుల సూచనలతో మూడు నెలల వయుసున్న చిన్నారిని బలి ఇచ్చినట్టు పోలీసులు ఇన్వేస్టిగేషన్‌లో తేల్చారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు నిందితుడు కేరుకొండ రాజశేఖర్‌ మొదట నుంచి ప్రయత్నించాడని సీపీ తెలిపారు. చివరికి నిందితుడి ఇంట్లో దొరికిన చిన్నారి రక్తకు చుక్కతో కేసులో నిందితులను గుర్తించామని మహేశ్‌భగవత్‌ తెలిపారు. 

17:32 - February 15, 2018

కోర్టు తీర్పు పౌర హక్కుల సంఘం పోరాట ఫలితం : రఘునాథ్

ఆదిలాబాద్ : కోర్టు తీర్పు పౌర హక్కుల సంఘం పోరాటం ఫలితమని ఆ సంఘం నేత రఘునాథ్ తెలిపారు. ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండే ఎన్ కౌంటర్లు బూటకమన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే పోలీసులే ముద్దాయిలుగా తేలుతారని చెప్పారు.

17:25 - February 15, 2018

ఆదిలాబాద్ : జిల్లాలో మావోయిస్టు నేత ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 29 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలని జిల్లా సెషన్స్ కోర్టు అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పు పై ఆజాద్ భార్య పద్మ హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కోర్టు తీర్పు సంతోషకరం : ఆజాద్ భార్య పద్మ

ఆదిలాబాద్ : కోర్టు తీర్పు సంతోషకరమని ఆజాద్ భార్య పద్మ అన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని తెలిపారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

ఆదిలాబాద్ : ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆదేశించింది. 

చిన్నారి నరబలి కేసులో కీలక మలుపు

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ చిన్నారి నరబలి కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందింది. మేడపై లభించిన తల ఆడ శిశువుదిగా నిర్ధారణ అయ్యింది. రాజశేఖర్ ఇంట్లోని రక్తనమూనాలతో తల రక్తనమూనాలు సరిపోయినట్లు సమాచారం. బోయగూడలో ఫుట్‌పాత్‌పై పడుకున్న వారి నుంచి శిశువును అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజశేఖర్ దంపతులు ఇంట్లో నగ్నపూజలు నిర్వహించిన అనంతరం శిశువును బలి ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 

17:02 - February 15, 2018

ఢిల్లీ : నిన్న మొన్నటి వరకు నీరవ్‌ మోది అంటే ఎవరో ఎవరికీ తెలియదు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో స్కాం బయట పడడంతో నీరవ్‌ మోది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. బ్యాంకుకు 280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నీరవ్‌ మోదీపై ఫిబ్రవరి 5న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వారం రోజులకే పిఎన్‌బి ముంబై బ్రాంచ్‌లో 11,300 స్కాం బయటపడింది. ఈ భారీ స్కాంతో నీరవ్‌ మోదీకి లింకులున్నట్లు పిఎన్‌బి ఆరోపించింది.వజ్రాల వ్యాపారుల కుటుంబంలో పుట్టిన నీరవ్‌ మోదీ, అదే వృత్తిని తన వ్యాపారంగా ఎంచుకున్నారు. 1999లో 2.3 బిలియన్‌ డాలర్ల ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీ నెట్‌వర్క్‌ను ఆసియాలోని చైనా నుంచి నార్త్‌ అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాలలో ఆయన తన వ్యాపారాలను విస్తరించారు. భారత్‌లోనే కాకుండా రష్యా, ఆర్మేనియా, దక్షిణ ఆఫ్రికాలో మానుఫాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయి.

ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో తొలిసారి చోటు
2013లో ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2016 ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నీరవ్‌మోదీకి 1,067 ర్యాంకు ఉండగా... భారత్‌లో ఆయన 46వ బిలీనియర్‌గా నిలిచారు. గతేడాది భారత్‌ నుంచి ఫోర్బ్స్‌ జాబితాలో 82వ ర్యాంకును పొందారు. 2014లో ఢిల్లీలో తన తొలి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను లాంచ్‌ చేశారు. అనంతరం 2016లో న్యూయార్క్‌లో కూడా ఒక స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ముంబై, లండన్‌, సింగపూర్‌, పెడ్చింగ్‌లో నీరవ్‌కు చెందిన బొటిక్‌లున్నాయి. ఇలా తన వ్యాపారాలను, స్టోర్లను గ్లోబల్‌గా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జువెల్లరీ డిజైన్లకు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్లలో ఫ్యాషన్‌కు ఐకాన్‌గా నీరవ్‌ మోదీ జువెల్లరీస్‌ గుర్తింపు పొందింది. లగ్జరీ డైమాండ్‌ జువెల్లరీ డిజైనర్‌గా ఆయనకు పేరుంది.

17:01 - February 15, 2018

గుంటూరు : ప్రత్యేక హోదాపై చాలా మంది నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అమరావతిలో చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రత్యేకహోదా పరిణామాలను చర్చించామన్నారు. వైసీపీ నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోమే ప్రత్యే హోదా అంటున్నారని వర్ల విమర్శించారు. అటు జనసేన ఏర్పాటు చేస్తామంటున్న జేఏసీపై వర్లరామయ్య వ్యంగాస్త్రాలు సంధించారు. జేఏసీలోనికి కాంగ్రెస్‌ను ఆహ్వానించడాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహాంపై కూడా పవన్‌ నిలదీస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జేఏసీలోకి టీడీపీని ఆహ్వానించలేదని.. ఒకవేళ పవన్‌ నుంచి ఆహ్వానం అందితే ఆలోచిస్తామని వర్ల రామయ్య తెలిపారు. 

17:00 - February 15, 2018

గుంటూరు : అమరావతి సమన్వయ కమిటీ భేటీలో కాపు రిజర్వేషన్లపై కేంద్రం అభ్యంతరాల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన చంద్రబాబు... కాపు రిజర్వేషన్‌ బిల్లు విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. కేంద్రం అనుమానాలకు బీసీ సంక్షేమశాఖ అధికారులు వివరణ ఇచ్చారని తెలిపారు. షెడ్యూల్‌-9లో కాపు రిజర్వేషన్ల బిల్లు పొందుపరచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

16:52 - February 15, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకా నగర్ నరబలి కేసులో కీలక ముందడుగు పడింది. నరబలి కేసులో డీఎన్ఏ రిపోర్ట్ ను పోలీసులు చేతికి చిక్కింది మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జగన్ ది అవగాహన రాహిత్యం : వర్ల రామయ్య

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ ది అవగాహన రాహిత్యమని టీడీపీ నేత వర్ల రామయ్య  అన్నారు. జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు రాజీపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు... జగన్ లా రిమాండ్ ఖైదీగా లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా జగన్నాటకం అన్నారు.

 

రఘువీరారెడ్డికి పవన్ కళ్యాణ్ ఫోన్

విజయవాడ : ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జెఎఫ్ సీకి పవన్ కాంగ్రెస్ మద్దతు కోరారు. రేపు హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీస్ లో జరుగనున్న సమావేశానికి హాజరుకావాలని పవన్ కోరారు. కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, గౌతమ్ హాజరవుతారని రఘువీరారెడ్డి పవన్ కు తెలిపారు. 
 

15:31 - February 15, 2018

నిజామాబాద్ : జిల్లా ఆర్మూరులో ఎర్రజొన్న రైతులు దీక్షకు దిగారు. ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల దీక్షకు పోలీసులు నిరాకరించడంతో ఆర్మూరులో భారీగా పోలీసులను మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏపీ టెట్ నిర్వహణపై మంత్రి గంటా శ్రీనివాస్ సమీక్ష

అమరావతి : ఏపీ టెట్ నిర్వహణపై మంత్రి గంటా శ్రీనివాస్ సమీక్ష చేపట్టారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. టెట్ నిర్వహణ, పరీక్షా కేంద్రాల కేటాయింపుల గందరగోళంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల కేటాయింపుపై ఫైర్ అయ్యారు. టెట్ నిర్వహణలో మొదటి నుంచి అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 21 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయని తెలిపారు. అవసరమైతే మరోసారి టెట్ వాయిదా వేసే ఆలోచన ఉందన్నారు. అధికారులతో సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం బయటపడింది. తాడేపల్లి మండలం చినరావూరుకు చెందిన వ్యక్తికి సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్యులు శస్త్ర చికిత్స అందించారు. వైద్యుల నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఆస్పత్రిపై అనేక ఫిర్యాదులు వచ్చినా... వైద్యశాఖ అధికారులు పట్టించుకోలేదు. 
 

చేర్యాలలో పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడులు

సిద్ధిపేట : చేర్యాలలో పంచాయతీరాజ్ డీఈ చంద్రప్రకాష్ ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. కాంట్రాక్టర్ నుంచి రూ.85 వేలు లంచం తీసుకుంటూ డీఈ చంద్రప్రకాష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

 

ప్రతిరోజు పార్టీకి కొంత సమయం కేటాయిస్తా : సీఎం చంద్రబాబు

అమరావతి : ప్రతిరోజు పార్టీకి కొంత సమయం కేటాయిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు జరిపినట్లే ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు జరిపారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏపీకి చేసిందేమీ లేదన్నారు. 'మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ..అనవసరంగా ఒకరినిందించం' అని అన్నారు. నోట్లరద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామని చెప్పారు. 

 

15:02 - February 15, 2018

ముగిసిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

అమరావతి : టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. పులివెందుల విద్యార్థులపై ట్రాఫిక్ ఎస్సైలు, చిరంజీవి, గోపినాథ్ దాడి ఘటన సీఎం దృష్టికి చేరింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా నేతలు విద్యార్థులను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. దాడిపై విచారణ చేపట్టి పోలీసుల తప్పుంటే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

జేఎఫ్ సీ ఇబ్బంది లేదు : చంద్రబాబు

గుంటూరు : పవన్ జేఎఫ్ సీతో తమకు ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో అన్నారు. పవన్ పోరాటంలో అర్థం ఉందని, రాష్ట్రానికి మేలు జరగాలను కాంక్షతో ఆయనకు తోచిన విధంగా పవన్ వెళ్తున్నాడని చంద్రబాబు తెలిపారు. 

యువకుడిపై ఆర్పీఎఫ్ పోలీసుల ప్రతాపం

అనంతపురం : జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లో యువకుడిపై ఆర్పీఎఫ్ పోలీసులు ప్రతాపం చూపారు. ట్రైన్ కదులుతున్న సమయంలో స్లీపర్ కోచ్ ఎక్కాడని యువకుడిని పోలీసులు చితకబాదారు. యువకుడు బెంగళూరు నుంచి కాచీగూడ వెళ్లే రైలులో యువకుడు అనంతపురంలో ఎక్కడానకి ప్రయత్నించాడు.

14:37 - February 15, 2018

మహిళలు ఆకాశంలో సగం అన్నారు..! స్త్రీ, పురుషులిద్దరు సమానమేనని రాజ్యంగం చెబుతుంది. సమానావకాశాలు కల్పిస్తామని పాలకులు తరుచు చెబుతారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అసమానతలు తొలిగిపోయి, పురుషులతో స్త్రీలకు సమానత్వం రావాలంటే 170 సంవత్సర కాలం పడుతుందని సాక్ష్యాత్ వరల్డ్ ఎకానమీక్ ఫోరం నివేదిక పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.  

14:31 - February 15, 2018

అనంతపురం : జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లో యువకుడిపై ఆర్పీఎఫ్ పోలీసులు ప్రతాపం చూపారు. ట్రైన్ కదులుతున్న సమయంలో స్లీపర్ కోచ్ ఎక్కాడని యువకుడిని పోలీసులు చితకబాదారు. యువకుడు బెంగళూరు నుంచి కాచీగూడ వెళ్లే రైలులో యువకుడు అనంతపురంలో ఎక్కడానకి ప్రయత్నించాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:18 - February 15, 2018

ఆ తల ఆడ శిశువుదే...!

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉప్పల్ చిలుకా నగర్ నరబలి కేసులో పోలీసులు దర్యాప్తు కీలక ముందడుగు వేశారు. ఆడ శిశువు నరబలి ఇచ్చిట్టు డీఎన్ఏ రిపోర్ట్ తెలింది. రాజశేఖర్ దంపతులు నరబలి అనంతరం మొండాన్ని మూసీ నదిలో వేసినట్టు తెలుస్తోంది.

14:07 - February 15, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉప్పల్ చిలుకా నగర్ నరబలి కేసులో పోలీసులు దర్యాప్తు కీలక ముందడుగు వేశారు. ఆడ శిశువు నరబలి ఇచ్చిట్టు డీఎన్ఏ రిపోర్ట్ తెలింది. రాజశేఖర్ దంపతులు నరబలి అనంతరం మొండాన్ని మూసీ నదిలో వేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:35 - February 15, 2018

గుంటూరు : జిల్లా వైద్యులు మారరా ? తాము ఇలానే ఉంటాం అని అనుకుంటున్నారా ? గతంలో జిల్లా ఆసుపత్రిలో పలు ఘటనలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లో వైద్యులు ఆపరేషన్ చేస్తున్న దృశ్యాల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గతంలో ఎలుకలు శిశువును కొరికిన సంగతి తెలిసిందే. తాడేపల్లి మండలం చినరావూరుకు చెందిన వ్యక్తికి వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెల్ ఫోన్ వెలుతురులో శస్త్ర చికిత్స అందించడం..ఈ దృశ్యాలు బహిర్గతం కావడంతో విమర్శలు పెరిగిపోతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

13:27 - February 15, 2018

ఇంట్లో వంటిల్లు అత్యంత కీలకం. ఈ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. లేనిపక్షంలో అనారోగ్యాలు దరి చేసే అవకాశం ఉంది. వంటింట్లో బొద్దింకలు మాయమవ్వాలంటే కొద్దిగా బేరిక్ పౌడర్ ను వంటింటి మూలలో ఉంచాలి. ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్లైసర్ తో కోస్తే ముక్కలు చక్కగా వస్తాయి. పుదీనా పచ్చడి చేసే సమయంలో కొద్దిగా పెరుగు కలిపితే రంగు..రుచి బాగుంటాయి. మెక్రో ఓవెన్ లో దుర్వాసన రాకుండా బేకింగ్ సోడా ముంచిన స్పాంజిని వాడి చూడండి. 

13:25 - February 15, 2018

ఉల్లిపాయలను మెత్తగా నూరి ఆ ముద్దను నుదుటి మీద పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల తలనొప్ని నుండి ఉపశమనం పొందుతారు.

ఇంగువ జీర్ణశక్తికి ఎంతగానే ఉపయోగపడుతుంది. భోజనం చేసిన అనంతరం చిటికెడు ఇంగువ..చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణమవుతుంది.

కొద్ది నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకుని తాగి చూడండి. ఇలా చేయడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందుతుంది. ఇలా రోజుకి రెండు..మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.

అల్లం ముక్కను నిప్పులో మీద కాల్చి తింటే వికారం తగ్గే అవకాశం ఉంది. 

పవన్ జేఎఫ్ సీపై బాబు వ్యాఖ్యలు..

హైదరాబాద్ : పవన్ పోరాటంలో అర్థం ఉందని, రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తోచిన విధంగా పవన్ వెళుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ ఉద్దేశ్యమూ రాష్ట్రానికి మేలు జరగాలనే అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. శ్వేతపత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, కేంద్రం ఏం చేసిందనే దానిపై బిజెపి శ్వేతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు. 

రఘువీరాకు పవన్ ఫోన్...

హైదరాబాద్ : ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానిక హాజరు కావాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హాజరవుతారని రఘవీరా తెలిపారు. 

13:16 - February 15, 2018

హైదరాబాద్ : విభజన సమయంలో ఎలాంటి హామీలిచ్చారు..ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చింది ? ప్రభుత్వం ఏమి ఖర్చు చేసింది..నిజ నిజాలు తెలుసుకొనేందుకు జనసేన అధినేత 'పవన్' స్పీడు పెంచారు. ఇప్పటికే ఉండవల్లి...జయ ప్రకాష్ నారాయణ్ తో జేఎఫ్ సీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇతర మేధావులు..కీలక నేతలు ఉంటారని పవన్ పేర్కొన్నారు. అందులో భాగంగా పలువురు నేతలు..మేధావులతో పవన్ మాట్లాడారు.

గురువారం ఉదయం ఏపీ సీపీఎం, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శులతో పవన్ మాట్లాడారు. శుక్రవారం నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదే విధంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కూడా పవన్ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హాజరవుతారని రఘవీరా తెలిపారు. ఈ సమావేశం అనంతరం పవన్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తారో వేచి చూడాలి.

13:15 - February 15, 2018

విజయవాడ : ఏపీ టిడిపి సమన్వయ కమిటీ భేటీ ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు లీకులు పంపుతున్నారు. గురువారం ఉదయం జరుగుతున్న ఈ భేటీ కొనసాగుతోంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలు..ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలు..పవన్ జేఎఫ్ సీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా బాబు పలు వ్యాఖ్యలు చేశారు.

పవన్ పోరాటంలో అర్థం ఉందని, రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తోచిన విధంగా పవన్ వెళుతున్నారని, తమ ఉద్దేశ్యమూ రాష్ట్రానికి మేలు జరగాలనే అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. శ్వేతపత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, కేంద్రం ఏం చేసిందనే దానిపై బిజెపి శ్వేతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు. 

12:55 - February 15, 2018

వెరైటీ పాత్రలతో అలరిస్తున్న యంగ్ హీరో నటుడిగా క్లిక్ అయి ఇప్పుడు ప్రొడక్షన్ లో అడుగు పెట్టి ఇంటరెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు. అటు నటుడిగా ఇప్పుడు ప్రేసెంటెర్ గా రెండు రోల్స్ లో కనిపించబోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ లో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న 'నాని' కెరీర్ స్టార్టింగ్ లో వెరైటీ పాత్రలతో అలరించాడు. 'ఈగ' సినిమాలో తన పాత్ర మొత్తం 'ఈగ' లాగ మారిపోయినా కానీ అభ్యంతరం చెప్పకుండా ఆ రోల్ చేసాడు నాని. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ తెలుగు ఆడియన్స్ మైండ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. పెర్ఫార్మన్స్ వైజ్ గా 'జండాపై కపిరాజు' లో యాక్టింగ్ కి అద్దం పెట్టె సినిమా అని చెప్పొచ్చు.

నటుడిగా కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు 'నాని'. రెండు చేతుల డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉన్నపుడు ఎవరు మాత్రం కాదంటారు. వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా 'అ’. నాచురల్ స్టార్ నాని ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. 'అ!’ సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా కెసాండ్రా.. ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్.

12:48 - February 15, 2018
12:47 - February 15, 2018

జగన్ పై బాబు విమర్శలు...

విజయవాడ : రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని తమకు తెలియకుముందే జగన్ వెళ్లి ఫొటో దిగారని, అడగకుండానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు ప్రకటించారని ఏపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ కోసం ఎందుకు వెళుతున్నామో..జగన్ ఎందుకు వెళుతున్నారో ప్రజలకు తెలియచేయాలని సూచించారు. 

అనంతలో స్పీకర్..అడ్డుకున్న వామపక్షాలు...

అనంతపురం : జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వామపక్ష నేతలు..న్యాయవాదులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.

12:29 - February 15, 2018

అనంతపురం : జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వామపక్ష నేతలు..న్యాయవాదులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అక్కడనే ఉన్న పోలీసులు వామపక్ష నేతలు, న్యాయవాదులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పీకర్ రావడం జరిగిందని, కార్యక్రమం అనంతరం స్పీకర్ ను కలిపించే ప్రయత్నం చేస్తానని హామీనివ్వడంతో వామపక్షాలు..న్యాయవాదులు శాంతించారు.

అనంతరం కార్యక్రమం ముగిసిన అనంతరం స్పీకర్ కోడెల వచ్చి వామపక్షాలు..న్యాయవాదులతో మాట్లాడారు. వారు ఇచ్చిన వినతిపత్రం స్వీకరించారు. వెనుకబడి ఉన్న రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే లాభం ఉంటుందని..దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళుతానని స్పీకర్ కోడెల వారికి తెలిపారు. 

12:22 - February 15, 2018
12:18 - February 15, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో రాజకీయాల వేడి ఇంకా తగ్గలేదు. ప్రత్యేక హోదా..విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందంటూ..ప్రభుత్వం వత్తిడి చేయడం లేదంటూ పార్టీలు విమర్శలు గుప్పిస్తోంది. ఇచ్చిన హామీలు అమలు సాధించేందుకు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొనడంతో టిడిపి తర్జనభర్జనలు పడుతోంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలు జరుపుతూ నేతల సూచనలు..సలహాలు తీసుకుంటున్నారు.

తాజాగా గురువారం ఉదయం టిడిపి సమన్వయ కమిటీ భేటీ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు సమావేశంలో పాల్గొనగా వివిధ జిల్లాల నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంపై పలు విమర్శలు గుప్పించినట్లు సమాచారం. వైసీపీ చేస్తున్న ఆరోపణలు..విమర్శలకు సరియైన విధంగా తిప్పికొట్టలేకపోతున్నారంటూ నేతలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తిన సమయంలో కేంద్రానికి అండగా నిలబడడం జరిగిందని, కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు జరిపినట్టే ఏపీకి కేటాయింపులు జరిపారని బాబు పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం రాజీ లేకుండా చేస్తామన్నారు.

రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని తమకు తెలియకుముందే జగన్ వెళ్లి ఫొటో దిగారని, అడగకుండానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. ఢిల్లీ కోసం ఎందుకు వెళుతున్నామో..జగన్ ఎందుకు వెళుతున్నారో ప్రజలకు తెలియచేయాలని సూచించారు.

జగన్ ఏదీ చసినా కేసుల మాఫీ..లాలూచీ కోసమేనని, తానేదో కేసులకు భయపడుతాననే ప్రచారం చేస్తుంటే నేతలు సమర్థంగా ఎందుకు తిప్పికొట్టడం లేదని నిలదీసినట్లు సమాచారం. అందరూ కేసులని భయపడుతున్నారా ? జగన్ కేసులు తుది దశలో ఉన్నాయని..అదే అతని భయమన్నారు. దానిని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లడం లేదని, నిండా మునిగి తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నించినట్లు టాక్. 

ఒడిశా రాష్ట్ర పిటిషన్ పై సుప్రీం విచారణ...

ఢిల్లీ : పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. అన్ని రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు కట్టుబడి ఉండాలని సుప్రీం పేర్కొంది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘన, తదతర అంశాలను తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ మార్చి 17కి వాయిదా వేసింది. 

పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఈడీ సోదాలు...

ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఈడీ ముమ్మరంగా విచారణ జరుపుతోంది. వ్యాపారవేత్త నీరవ్ మోడీ ఇంటిపై దాడులు నిర్వహించింది. 12 పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఈడీ సోదాలు జరిపింది. 

11:58 - February 15, 2018

సినీ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం లో పోటీ పెరిగింది. బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం ఎక్కువే ఉంది. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలిలో 'నందమూరి ఫామిలీ' ఒకటి. ఈ నందమూరి యంగ్ హీరోల జాబితా తక్కువనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండి హీరోగా ట్రై చేస్తూ 'పటాస్' సినిమాతో హిట్ ట్రాక్ పట్టిన హీరో 'నందమూరి కళ్యాణ్ రామ్'. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'కళ్యాణ్ రామ్' హీరోగానే కాకుండా 'ఎన్ టి ఆర్ ఆర్ట్స్' నుండి నిర్మాతగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్నాడు.

'కళ్యాణ్ రామ్' ఇప్పుడు ట్రెండ్ ని కాచ్ చేసి హిట్ కంటిన్యూ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ప్రొడ్యూసర్ గా క్లిక్ అయిన ఈ టైం లో హీరోగా కూడా మరో మంచి ట్రెండీ లవ్ స్టోరీ తో రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. ప్రెజెంట్ 'కళ్యాణ్ రామ్- తమన్నా' జంటగా నటిస్తున్న 'నా నువ్వే' సినిమా టీజర్ యూత్ ని ఆకట్టుకొంటోంది. అలానే 'ఎం ఎల్ ఏ' అంటూ మాస్ ఎంటర్టైనర్ తో రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఇలా డిఫెరెంట్ స్టోరీ లైన్స్ తో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఈ ఏ చిత్రంతో ఆకట్టుకుంటాడో చూడాలి. 

11:55 - February 15, 2018

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ మళ్లీ తన సత్తా చాటుతున్నాడు. మాస్ పల్స్ ని పట్టుకోవడం లో ముందుండే డైరెక్టర్ క్లాస్ హీరోతో సినిమాకి ప్లాన్ చేస్తున్న అని తన మనసులో మాట చెప్పాడు. 'స్పైడర్' సినిమాతో కొంచెం ఆలోచనల్లో పడ్డాడు 'మహేష్ బాబు’. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ ని ప్లాన్ చేస్తున్నాడు ఈ సూపర్ స్టార్. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ప్లేస్ తెచ్చుకున్న 'మహేష్ బాబు'కి క్లాస్..ఫ్యాన్స్ ఎక్కువ. తన సినిమాలు ఆల్మోస్ట్ అబ్రాడ్ లో ఎక్కువ కలక్షన్స్ తెచ్చుకుంటాయి. ‘స్పైడర్' సినిమా టాక్ ఎలా ఉన్న మురగదాస్ టేకింగ్ పైన పూర్తి నమ్మకం మాత్రం పోలేదట మహేష్ బాబుకి. నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు మహేష్.

'ఖైదీ నెంబర్ 150’తో తన టేకింగ్ లో మాస్ ఎలెమెంట్స్ తగ్గలేదు అని నిరూపించుకున్నాడు 'వి వి వినాయక్'. 'చిరంజీవి' రీ ఎంట్రీ ఒక రేంజ్ లో ప్లాన్ చేసుకుని తమిళ్ సినిమా 'కత్తి'ని నేటివిటీ టచ్ చెయ్యకుండా తెలుగులో 'ఖైదీ నెంబర్ 150’అని తీశారు. హిట్ కొట్టారు. ఈ మధ్య 'వి వి వినాయక్' తన మనసులో మాటను బయట పెట్టాడు. ఒక టైంలో 'మహేష్' తో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించాడు. అప్పుడు కొన్ని కథల మీద పని చేశామని.. కానీ ఏ కథా సెట్టవ్వలేదని.. అందుకే తామిద్దరం కలిసి సినిమా చేయలేకపోయామని.. భవిష్యత్తులో తమ కాంబినేషన్లో సినిమా ఉంటే ఉండొచ్చని అన్నాడు. మరి ఈ మాస్ డైరెక్టర్ మహేష్ ని ఎలా హేండిల్ చేస్తాడో చూడాలి.

11:51 - February 15, 2018

తెలుగు ఇండస్ట్రీ లో క్రేజీ కాంబినేషన్స్ ఫామ్ అవుతున్నయి. తన యాక్టింగ్ స్కిల్స్ తో ఫామిలీ హీరో అనిపించుకున్న హీరో ఇప్పుడు విలన్ గా మారి ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఒకప్పుడు తన సినిమాలో నటించి సపోర్టింగ్ రోల్ చేసిన నటుడు సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో 'రవితేజ'. గత కొంతకాలం గా ఫ్లాప్ సినిమాలతో ఉన్న 'రవి తేజ' 'రాజా ది గ్రేట్' తో మల్లి హిట్ ట్రాక్ ఎక్కాడు అని ఫాన్స్ భావించారు. 'రాజా ది గ్రేట్' సినిమా కథలో కొత్తదనం వల్ల కామెడీ మిక్స్ వల్ల ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. రవితేజ నటన కూడా అదే స్థాయిలో ఉంది. అందుకనే సినిమా హిట్ అయింది.

ఒకప్పటి ఫామిలీ హీరో రీసెంట్ గా విలన్ గా మారి యమ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు జగపతి బాబు. హీరోగా చేసిన సినిమాలు ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే ఇప్పుడు విలన్ గా చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 'శ్రీమంతుడు' సినిమాలలో 'మహేష్ బాబు'కి ఈక్వెల్ గా నటించి మెప్పించాడు జగపతి బాబు. అలానే 'పటేల్ సర్' అంటూ హీరోగా కూడా చేసి క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు జగపతిబాబు. 'రవితేజ' రీసెంట్ సినిమా 'టచ్ చేసి చూడు'. ఈ సినిమా రెగ్యులర్ కధాంశంతో ఉండటం వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదు అనే టాక్ ఉంది. ఇప్పుడు 'రవి తేజ' సినిమాలో 'జగపతి బాబు' కనిపించబోతున్నాడు. ఈ ఇద్దరు కలిసి 'బడ్జెట్ పద్మనాభం' సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ని రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. 'జగపతి బాబు' ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో మంచి ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.

11:50 - February 15, 2018

టాలీవుడ్ లో సినిమాల స్పీడ్ పెరిగింది. కొత్త టాలెంట్ ఎంట్రీ కూడా పెరిగింది. హీరో అయినా హీరోయిన్ అయినా కొన్ని సినిమాల వరకే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డిఫెరెంట్ కధలను...డిఫెరెంట్ రోల్స్ ని ట్రై చెయ్యట్లేదు కాబట్టి ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తున్నారు. ఇది ఇలా ఉంటె కొత్తగా వచ్చి అప్పుడే టాప్ రేంజ్ లో ఉన్న కొంతమంది హీరోయిన్స్ హై రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

ఈ మధ్య తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కీలకం అయిపోయారు. ఫస్ట్ సినిమాతోనే క్రేజ్ తెచ్చుకొని యూత్ ని ఫాన్స్ గా మార్చేసుకుంటున్నారు. అదే కోవలోకి వచ్చిన హీరోయిన్ 'సాయి పల్లవి'. 'ఫిదా'తో అందరిని ఫిదా చేసిన 'సాయి పల్లవి' తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాదు, ఆ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పుకుని సినిమా ఇండస్ట్రీని కూడా 'ఫిదా' చేసేసుకుంది. రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది అనే టాక్ ఉంది. ఇప్పుడు 'నాగ సౌర్య' 'కణం' అనే సినిమాలో నటిస్తోంది.

'డీజే' సినిమాలో 'అల్లు అర్జున్' నటనకి..అతని డాన్స్ లకి మంచి టాక్ వచ్చింది. అలానే ఈ 'డీజే' సినిమాలో హీరోయిన్ గా చేసిన 'పూజ హెగ్డే' కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది అట పూజ. ప్రెజెంట్ ఒక కుర్ర హీరో పక్కన హీరోయిన్ గా చేస్తున్న పూజ అక్షరాలా కోటిన్నర డిమాండ్ చేసిందని టాక్. బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన 'పూజ' పెద్ద హిట్ సినిమాలు అయితే ఎం లేవు అని చెప్పుకుంటున్నారు. 'హృతిక్' తో మొహంజదారో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

నేపాల్ ప్రధాని రాజీనామా..

ఢిల్లీ : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ రాజీనామా చేశారు. తదుపరి ప్రధానిగా కేపీ ఓలి వ్యవహరించనున్నారు. 2015 అక్టోబర్ 11 నుండి 2016 ఆగస్టు 3 వరకు నేపాల్ ప్రధానిగా కేపీ ఓలి పనిచేశారు. 

11:33 - February 15, 2018

కమర్షియల్ కధలను తెరకెక్కించడం లో క్లిక్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తన ప్రీవియస్ సినిమా హిట్ అవ్వడంతో మరో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. కానీ సినిమా సినిమా కి ఇంత లేట్ ఏంటో అని అనుకుంటున్నారు ఇండస్ట్రీ పీపుల్. ఎవరా డైరెక్టర్ ?

'పవన్ కళ్యాణ్' తో 'సర్ధార్ గబ్బర్ సింగ్' తీసిన డైరెక్టర్ గుర్తున్నాడు కదా ..అతనే 'బాబీ'. రీసెంట్ గా 'ఎన్ టి ఆర్' సినిమా 'జై లవకుశ'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. 'పవన్ కళ్యాణ్' లాంటి స్టార్ హీరో సినిమా అంటే ఆడియన్స్ కి క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలంటి క్రేజ్ ని సినిమాలో పెట్టి పర్ఫెక్ట్ గా తీస్తే హిట్ ఖాయం. కానీ 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో తడబడింది. 'పవన్' ఫాన్స్ ని కూడా నిరాశ పరిచింది.

పట్టువిడవకుండా మంచి స్క్రిప్ట్ తో 'జై లవకుశ' సినిమా డైరెక్ట్ చేసాడు బాబీ. మూడు భిన్నమైన పాత్రలను తెరమీద చూపించి సగటు ఆడియన్స్ కి కావలసిన కంటెంట్ ని ఇచ్చాడు. 'బాబీ' డైరెక్షన్ తో పాటు 'ఎన్ టి ఆర్' నటన కూడా 'జై లవకుశ' సినిమాను హిట్ చేశాయి. స్టార్ హీరోలతో వర్క్ చేసిన 'బాబీ' మాత్రం ఇంకా హిట్ కోసం చూస్తున్నాడు. డైరెక్టర్ గా తన సత్తా చూపడానికి రెడీ గా ఉన్నాడు కానీ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చెయ్యలేదు. హిట్ కొట్టినా కానీ నెక్స్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే. 

11:29 - February 15, 2018

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫిక్స్ అవ్వాలి అంటే ముందు మాస్ ఆడియన్స్ మీద ఫోకస్ పెట్టాలి. మొదటి నుండి మాస్ ని ఆకట్టుకునే సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు అదే పంథాని కంటిన్యూ చేస్తున్నాడు. సినిమాల్లో డిఫెరెంట్ తో పాటు భారి తారలతో జతకడుతున్న ఈ యంగ్ హీరో అప్ డేట్స్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?

మాస్ ఆడియన్స్ మీద ఫోకస్ పెట్టి మాస్ సినిమాలు చేస్తున్న హీరో 'సాయి శ్రీనివాస్' బెల్లంకొండ’. ఈ యంగ్ హీరో ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఉన్న సిట్యుయేషన్స్ కి తగ్గట్టుగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. 'జయ జానకి నాయక'తో మాస్ ఆడియెన్స్ లో క్రేజ్ మరింత తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

ప్రెజెంట్ 'బెల్లంకొండ సాయిశ్రీనివాస్' ఒక డిఫెరెంట్ స్టోరీ లైన్ తో 'సాక్ష్యం' అంటూ రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అన్ని ఇంటరెస్టింగ్ ఎలెమెంట్స్ ఉంటాయట. మంచి హిట్ సినిమాలని తన బ్యానర్ నుండి రిలీజ్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఈ 'సాక్ష్యం' సినిమాను నిర్మిస్తోంది. అభిషేక్ నామ నిర్మాతగా ఈ 'సాక్ష్యం' సినిమా రాబోతుంది. అభిషేక్ పిక్చర్స్ ఇంతకు ముందు 'కేశవ' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరి బెల్లంకొండ ఈ సినిమా ద్వారా ఆకట్టుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి. 

11:24 - February 15, 2018

సినీ ఇండస్ట్రీలో సినిమాల స్పీడ్ పెరిగింది. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు స్టార్ హీరోలు చక చక సినిమాలు చేస్తున్నారు. తన సినిమాల్లో వైవిధ్యంతో పాటు స్పీడ్ కూడా పెంచాడు మెగా హీరో. డిఫెరెంట్ పాత్రలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంటున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా లిరికల్ వీడియో రిలీజ్ చేసి ఫాన్స్ కి వేలంటైన్ గిఫ్ట్ ఇచ్చాడు. మెగా ఫామిలీ నుండి వచ్చిన మరో హీరో 'అల్లు అర్జున్'. డాన్స్ లో యాక్టింగ్ లో వైవిధ్యం చూపుతూ దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. తన ప్రీవియస్ సినిమా 'డీజే' తో యాక్టింగ్ లో ఈజ్ చూపించి డిఫెరెంట్ రోల్ లో కనిపించాడు. సినిమా టాక్ ఎలా ఉన్న సరే ఈ 'డీజే' సినిమాలో అల్లు అర్జున్ నటనకి, అతని డాన్స్ లకి మంచి టాక్ వచ్చింది. ఎలాంటి పాత్ర అయినా 'అల్లు అర్జున్' న్యాయం చేస్తాడు అనే భరోసా డైరెక్టర్స్లో ఉంది.

ప్రెజెంట్ 'అల్లు అర్జున్' 'నా పేరు సూర్య' చేస్తున్న సంగతి తెలిసిందే. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకు ఆల్రెడీ విశాల్ శేఖర్ సంగీతం కంపోజ్ చేస్తున్నారంటేనే చాలా కొత్తగా అనిపించింది. అయితే గతంలో ఈ సంగీత ద్వయంలో విశాల్ మనోడి కోసం అతిలోక సుందరి (సరైనోడు) పాట పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు విశాల్ మనోడి కోసం ఈ లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాట పాడేశాడు. ఈ పాట రిలీజ్ అయింది నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని అల్లు అర్జున్ చాటుకున్నాడు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

టిడిపి సమన్వయ కమిటీ ప్రారంభం...

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు..ప్రత్యేక హోదా..విభజన హామీలు..తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 

11:15 - February 15, 2018
11:14 - February 15, 2018

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ లో సంచలనం సృష్టించిన 'చిన్నారి నరబలి' కేసు మిస్టరీ వీడిపోయింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును చేధించారు. చనిపోయింది ఆడ శిశువుగా నిర్ధారించారు. రాజశేఖర్ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్...శిశువు బ్లడ్ ఒక్కటే అని అధికారులు తేల్చారు.

భార్య అనారోగ్యం కారణంగానే నరబలి ఇచ్చినట్లు రాజశేఖర్ అంగీకరించాడు. ఓ తండాలో రూ. 40వేలకు ఆడశిశువును తీసుకొచ్చి ఇంట్లోనే నరబలి ఇచ్చాడు. అనంతరం రసాయనాలతో ఇంటిని రాజశేఖర్ శుభ్రం చేశాడు. ఈ కేసులో మొత్తం పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజశేఖర్..భార్య శ్రీలతతో పాటు ఆరుగురు అరెస్టయ్యారు. ఈ కేసులో నిందితులను సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. 

ఇదిలా ఉంటే ఏ తండా నుండి తీసుకొచ్చారు ? ఆ శిశువు ఎవరిది ? వారికి ఎవరు విక్రయించారు ? వీరికి మధ్య వర్తిత్వం వహించింది ఎవరు ? నరబలి ఇవ్వాలని పురిగొల్పింది ఎవరు ? నిందితులకు ఎవరెవరు సహకరించారు ? తదితర ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. 

11:13 - February 15, 2018
10:41 - February 15, 2018

నాంపల్లిలో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : నాంపల్లి నీలోఫర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

10:39 - February 15, 2018

విజయవాడ : విభజన హామీల సాధన కోసం ఏపీలో పోరు తీవ్రమైంది. విభజన లెక్కలు తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. లెక్కలు తనకు తెలుపాలని, తాను ఏర్పాటు చేసిన జేఎఫ్ సి కమిటీకి అందచేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు 15వ తేదీ డెడ్ లైన్ గా పవన్ విధించారు. ప్రస్తుతం ఆ తేదీలోపు ప్రభుత్వం వివరాలు అందిస్తుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ స్పందన ఆధారంగా శుక్రవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇప్పటికే జేఎఫ్ సీ కమిటీ ఏర్పాటు చేసిన్ పవన్..అందులో ఉండవల్లి..జేపీలకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఈ కమిటీలో పలువురు మేధావులు..ఇతరులు కూడా ఉన్నారని వారిని సంప్రదింపులు జరుపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు కూడా. తాజాగా ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్లలతో 'పవన్' మాట్లాడారు. శుక్రవారం ఏర్పాటు చేయబోయే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లు సమాచారం. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

10:37 - February 15, 2018
10:27 - February 15, 2018

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారా ? బిజెపి పొత్తుపై ఏదో ఒకటి తేల్చుకోవాలని..కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని టిడిపి యోచిస్తోందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విభజన హామీలు..తదితర అంశాలపై కేంద్రం మెతకవైఖరి కనబరుస్తోందంటూ ఏపీ టిడిపి గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై బిజెపి..టిడిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై బాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు..ఎమ్మెల్యేలు..సీనియర్ నేతలతో భేటీ అవుతూ పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు సమన్వయ భేటీ నిర్వహించిన బాబు తాజాగా మరోసారి భేటీ నిర్వహించనున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు నివాసం పక్కనే ఉన్న గ్రీవెన్స్ సెల్స్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాబు మాట్లాడనున్నారు. సీనియర్ నేతలు..ఇతరులతో చర్చించిన అనంతరం బాబు ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా ? అదే వేచి చూద్దామే అనే ధోరణిలో ఉంటారా ? అనేది తెలియనుంది. 

నరబలి కేసులో పురోగతి...

హైదరాబాద్ : ఉప్పల్ నరబలి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును చేధించారు. చనిపోయింది ఆడ శిశువుగా నిర్ధారించారు. రాజశేఖర్ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్...శిశువు బ్లడ్ ఒక్కటే అని అధికారులు తేల్చారు. నరబలి కేసులో మొత్తం పది మంది నిందితులను అరెస్టు చేశారు. 

10:16 - February 15, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మరో వార్త సంచలనంగా మారబోతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాపు రిజర్వేషన్లకు కేంద్రం బ్రేకులు వేసింది.

కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తామని ఎన్నికల్లో టిడిపి హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పలు పోరాటాలు..ఆందోళనలు నిర్వహించారు. వివిధ ఆందోళనలు..విమర్శల నేపథ్యంలో జస్టిస్ మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నివేదిక అందించిన అనంతరం అసెంబ్లీలో కాపులలను బీసీల్లో చేర్చుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది.

కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం నిలిపివేసింది. రిజర్వేషన్లపై కేంద్ర సిబ్బంది..శిక్షణ వ్యవహారాల శాఖ అభ్యంతరం తెలిపింది. కాపుల రిజర్వేషన్ కు చెందిన లేఖలో ఏపీ ప్రభుత్వం అని రాయాల్సిన చోట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని రాయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లేఖ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సుప్రీం ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని డీవోపీసీటీ సూచించింది. రిజర్వేషన్లపై ఏపీ రాష్ట్రం సరైన ప్రాతిపదికగా చెప్పలేదని పేర్కొంటోంది. కేంద్రం తాజా నిర్ణయంతో టిడిపి..బిజెపి మధ్య మరింత చిచ్చు రేగడం ఖాయమని తెలుస్తోంది.

కాపు రిజర్వేషన్లకు కేంద్రం బ్రేకులు...

విజయవాడ : ఏపీలో కాపు రిజర్వేషన్లకు కేంద్రం బ్రేకులు వేసింది. కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం నిలిపివేసింది. కాపుల రిజర్వేషన్ కు చెందిన లేఖలో ఏపీ ప్రభుత్వం అని రాయాల్సిన చోట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని రాయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లేఖ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

 

బాబు అధ్యక్షతనలో టిడిపి సమన్వయ కమిటీ భేటీ...

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ఉదయం 10.30గంటలకు టిడిపి సమన్వయ కమిటీ భేటీ కానుంది. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల టిడిపి అధ్యక్షులు పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిణామాలు..కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించనున్నారు. 

ఆర్మూర్ లో 144 సెక్షన్...

ఆర్మూర్ : ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కానీ రైతుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించి 144 సెక్షన్ విధించారు. 

ముగియనున్న 'పవన్' డెడ్ లైన్...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధించిన డెడ్ లైన్ నేటితో ముగియనుంది. విభజన హామీల సాధనలో అమలైన నిధులు..ఖర్చు పెట్టిన నిధులు..ఇతరత్రా వివరాలను తనకు అందించాలని..ఈ వివరాలను తాను ఏర్పాటు చేసిన కమిటీకి ఇస్తానని పవన్ ఇటీవలే పేర్కొన్నారు. ఇందుకు 15వ తేదీ డెడ్ లైన్ విధిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

09:21 - February 15, 2018

హైదరాబాద్ : వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. హబీబ్ నగర్ పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో 68 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.

గోషామహల్ పరిధిలోని గ్రూపులుగా విడిపోయిన పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాత్రి 11గంటల తరువాత రోడ్లపై మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు...వ్యాపారం చేస్తున్న హోటల్స్ యజమానులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వారి వద్దనుండి ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న అనంతరం 50 మందిని విడిచి పెట్టినట్లు సమాచారం. 

09:17 - February 15, 2018

ఢిల్లీ : స్కూల్లో కాల్పులు..థియేటర్ లో కాల్పులు..యూనివర్సిటీ క్యాంపస్ లో కాల్పులు.. మ్యూజిక్ కాన్సర్ట్ లో కాల్పులు ..నడిరోడ్డుపై కాల్పులు..ఎవడు ఎప్పుడు ఎందుకు ఎలా చెలరేగిపోతాడో, ఏ తుపాకీ ఎప్పుడు పేలుతుందో, ఏ వేలు ట్రిగ్గర్ నొక్కుతుందో ఊహించలేరు.. ఫలితం.. తుపాకీ గుళ్లు అమాయకుల దేహాలనుంచి దూసుకెళ్తున్నాయి..నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. అమెరికాలో నానాటికి పెరుగుతున్న గన్ కల్చర్ ఫలితంతో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు.

పార్క్ ల్యాండ్ లోని మర్జోరీ స్టోన్ మన్ డగ్లస్ పాఠశాలలో నికోలస్ క్రూజ్ (19) విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కొల్పోగా మరికొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా రక్తధారలతో భయానకరంగా మారిపోయింది. నికోలస్ అనే విద్యార్థిపై కొద్ది రోజుల క్రితం స్కూల్ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకొంది. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరుగుతోంది. ఇదే అదనుగా భావించిన నికోలస్ తుపాకీతో స్కూల్ కు చేరుకుని ముగ్గురు భద్రతా సిబ్బందిని కాల్చిపారేశాడు. అనంతరం ఫైర్ అలారం మోగించాడు. ఏమైందో అనుకున్న విద్యార్థులు బయటకు వెళ్లేందుకు పరుగలు తీశారు. ఒక్కసారిగా నికోలస్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఈ ఘటన చూపిస్తోంది. ఇలాంటి గన్ కల్చర్ కు చెక్ పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

వెస్ట్ జోన్ పరిధిలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో 68 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జగన్ 88వ రోజు..

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 88వ రోజుకు చేరుకుంది. ఉదయ్ గిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం జంగాలపల్లి నుండి పాదయాత్ర కొనసాగనుంది. 

ఏపీ టిడిపిలో తర్జనభర్జనలు...!

విజయవాడ : ప్రత్యేక హోదా..విభజన హామీల అంశంపై ఏపీ టిడిపి తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న వైసీపీ ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. తాము కూడ రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై టిడిపి ఎంపీలు..మంత్రులు యోచిస్తున్నట్లు సమాచారం. 

త్రిపురకు మోడీ...

త్రిపుర : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్రిపురకు రానున్నారు. అక్కడ జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

08:21 - February 15, 2018

ప్రకాశం : జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. లారీ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. కర్నాటక రాష్ట్రంలోని బిలాస్ పూర్, తర్లి గ్రామానికి చెందిన కొంతమంది శివరాత్రి సందర్భంగా వివిధ ఆలయాల దర్శనకు బయలుదేరారు. 40 మందికిపై గా లారీలో వెళుతున్నారు. వివిధ ఆలయాలను దర్శించిన వీరు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచల శ్రీరాముడి దర్శనం కోసం బయలుదేరారు. నల్లగుంట్ల వద్ద మలుపులుగా ఉండే రోడ్డులో జాగ్రత్తగా నడపాల్సిన లారీ డ్రైవర్ వేగంగా పోనిచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి కావడంతో...అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతలో ఆర్తనాదాలు వినిపించాయి. లారీ బోల్తా పడిపోయింది. నలుగురు మృతి చెందగా 32 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

08:13 - February 15, 2018

పార్క్ ల్యాండ్ : అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. ఓ విద్యార్థి 17 మందిని పొట్టన పెట్టుకున్నాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. హాహాకారాలతో మిన్నంటాయి. పార్క్ ల్యాండ్ లోని మర్జోరీ స్టోన్ మన్ డగ్లస్ పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. పాఠశాల అంతా రక్తంతో భీకరంగా మారిపోయింది.

కాల్పులు జరిపింది పూర్వ విద్యార్థి నికోలస్ క్రూజ్ (19) గా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం స్కూల్ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో ఆగ్రహానికి గురై ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:05 - February 15, 2018

ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు కోసం వివిధ రాజకీయ పార్టీలు నాలుగేళ్ల తరువాత గళమెత్తుతున్నాయి. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ ప్రకటనతో టిడిపి అప్రమత్తమయ్యింది. వైసీపీ పార్టీపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మొదటి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు మరింత పోరాటాలు ఉధృతం చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. టిడిపి..వైసిపిలు కేవలం మాటలు వరకే మాత్రమే పరిమితమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో కరణం ధర్మశ్రీ (వైసీపీ), చందు సాంబశివరావు (టిడిపి) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మిఠల్ ఎస్టేట్ లో అగ్నిప్రమాదం...

ముంబై : మిఠల్ ఎస్టేట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

07:05 - February 15, 2018

ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు అలాగే ఉండిపోయాయి. పెట్టిన పథకాలు అమలుకు నోచుకోలేదు, ఇచ్చిన కేటాయింపులు ఖర్చు కాలేదు. ఇది చేనేత రంగం పట్ల ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుంది. ఒకవైపు చేనేత రంగానికి చేయూత నివ్వడం కోసం విశేషమైన కృషి చేస్తున్నామన్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం దాన్ని చూపించలేక పోతుంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో చేనేత కార్మిక సంఘం నాయకులు రమేశ్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:43 - February 15, 2018

నిజామాబాద్ : ఎర్రజొన్నకు మద్ధతు ధర ప్రకటించాలంటూ నిజామాబాద్‌ జిల్లాలో రైతులు ఆందోళన చేస్తున్నారు. చేతికొచ్చిన పంటకు సరైన ధర పెట్టి కొనుగోలు చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ... ఆవేదన చెందుతున్నారు.. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని... ప్రభుత్వం ఆదుకోకుంటే.... తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌లో 1985 నుంచి ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. 18వేల హెక్టార్లలో సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఖరీఫ్‌లో నవంబర్‌ మొదటివారం నుంచి చివరి వారం వరకూ జొన్న సాగు చేస్తారు. ఫిబ్రవరి చివరి వారంలో పంట చేతికొస్తుంది. వాణిజ్య పంట అయిన ఎర్రజొన్న సాగుకు పెట్టుబడితోపాటు నీటి అవసరం కూడా తక్కువగా ఉండడంతో రైతులు ఈ పంటనే ఎక్కువగా సాగు చేస్తున్నారు.

వాణిజ్య పంట అయిన ఎర్రజొన్నలు దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగవుతుంది. ప్రధానంగా మోర్తాడ్‌ కమ్మర్‌పల్లి ముప్కాల్‌ మెండోరా బాల్కొండ వేల్పూరు ఏర్గట్ల నందిపేట, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, దర్సల్లి, ఆర్మూరు తదితర ప్రాంతాల్లో ఈపంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ సాగును ఏటికేడు పెంచుతూ వస్తున్నారు.

జొన్న పంట సాధారణంగా ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. కానీ ఈ సారి 30 క్వింటాళ్ళకు పైగానే దిగుబడి వచ్చినా... సరైన ధరలేదని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మోర్తాడ్‌ మండల కేంద్రంలో ఎర్రజొన్న రైతులకు మద్ధతుగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులే స్వచ్ఛందంగా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 43 జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు.

ఈ పంటను కేంద్రప్రభుత్వం ధాన్యంగా గుర్తించడంలేదు. దీంతో ప్రతీసారి జొన్నలకు వ్యాపారులు చెప్పిందే ధర. మార్కెట్‌ డిమాండ్‌కు అనుకూలంగా వారు కొనుగోలు చేస్తారు. ఆర్మూర్‌ డివిజన్‌లో ప్రతి యేడాది 40 నుంచి 50 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుంది. గత ఏడాది క్వింటాలుకు సుమారు 4,900 రూపాయల ధర పలికిన ఎర్రజొన్న ఈ సారి సగానికిపైగా ధర తగ్గింది. ప్రస్తుతం 2200 వరకూ మాత్రమే ధరపెట్టడానికి వ్యాపారులు ముందుకొస్తున్నారు. ఈ రేటు తమకు గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ముందుకొచ్చి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఆర్మూర్‌ ప్రాంతంలో వ్యాపారుల బృందం ఈ కొనుగోళ్ళను శాసిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2008లో మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్ళ వివాదం రైతులపైకి కాల్పులకు దారితీసింది. కాగా ఎర్రజొన్న రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి.. వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు. సగానికి సగం ధర తగ్గించటంపై రైతులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతన్నలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్న రైతును ఆదుకోకుంటే.. పెద్దఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరవకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు.

06:40 - February 15, 2018

హైదరాబాద్ : బల్దియా అప్పుల వేట వేగం పెంచింది. ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మూడు సార్లు ముంబై చుట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చక్కర్లు కొట్టగా... తాజాగా బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ ఇన్వెస్టర్లతో నగర మేయర్‌, కమిషనర్‌ భేటీ అయ్యారు. ఇంతకీ బల్దియా ఆదాయం పెంచుకుంటుందా.. అప్పుల ఊబిలో కూరుకుపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

జీతాలు, మెయింటెనెన్స్‌ వెళ్లదీయడమే కష్టంగా మారింది బల్దియాకు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అమ్మో ఒకటో తారీఖు అంటూ బెంబేలు పడే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.. ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రాజెక్టులు బల్దియాతో చేయిస్తుండడంతో ఖజానాకు గండిపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం చేస్తామంటూ.. ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందించింది. సమగ్ర రోడ్‌ డెవలప్‌ మెంట్‌ ప్లాన్ కింద నగరంలోని ప్రముఖ జంక్షన్లలో స్కైవేలు, మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్లు, గ్రేడ్‌ సపరేటర్లు వంటి భారీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీనికి 23వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని లెక్కలువేసింది. మరోవైపు ఆర్టీసీ నష్టాలను కూడా భరించాలని ఆదేశించడంతో... 334 కోట్లు చెల్లించింది. ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ... ఖర్చులు బల్దియాపై వేయడమే ఈ కష్టాలకు కారణం అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
మున్సిపల్‌ బాండ్లను విక్రయించి నష్టాలను అధిగమించాలని నిర్ణయించింది బల్దియా. వెయ్యికోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ మొదటి విడతలో 200 కోట్లు రాబట్టనుంది. దీంతో త్వరలోనే బల్దియా ఖజానాకు 200కోట్ల నిధులు చేరనున్నాయి. దీనికి 8.9శాతం వడ్డీరేటు చెల్లించనుంది. ఈ విధంగా నిధులు సేకరించిన 2వ స్థానిక సంస్థగా జీహెచ్‌ఎంసీ నిలవనుంది. గతంలో పూణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇలాగే నిధులు సేకరించింది.

అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను చేస్తామన్న ప్రభుత్వం అప్పుల నగరంగా తయారు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాటర్‌ బోర్డు వేలాది కోట్లు అప్పులు చేయగా... ఇప్పుడు బల్దియా అదే దారిలో నడుస్తోంది.. మూసీ కార్పొరేషన్, హైదరాబాద్‌ రోడ్‌ కార్పొరేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిద్వారా కూడా అప్పులు చేసేందుకు స్కెచ్‌ వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ నిండు ఖజానాతో ఉన్న బల్దియా... ఇక నుంచి అప్పుల్లోకి వెళ్లనుంది. ప్రభుత్వం తమ రాజకీయ లబ్దికోసం కార్పరేషన్‌ను ఊబిలోకి దించుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

06:36 - February 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం కోసం అలుపెరగని పోరాటం చేశారు... ఉద్యోగం ఊడినా.. ఉపాధి పోయినా సరే... ప్రత్యేక రాష్ర్టం కావాల్సిందేనని పెన్‌డౌన్‌ చేశారు... కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు... తమ సమస్యలపై స్పందించే నాథుడే లేక ఆందోళన చెందుతున్నారు.. మూడున్నళ్లుగా సర్కార్‌ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సకలజనుల సమ్మెలో పిడికిలి బిగించి చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు... సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేర్చడంలో కూడా వారిదే ముఖ్య పాత్ర . అలాంటి ఉద్యోగులు నేడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.. తమ సమస్యల పరిష్కారానికి సర్కార్‌పై పోరాటానికి వారంతా సిద్ధపడుతున్నారు.

తెలంగాణ ఏర్పాటైన కొత్తలో ఇచ్చిన ఫిట్‌మెంట్‌ తప్ప ప్రభుత్వం తమకేమీ చేయలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం అన్ని సర్కార్‌ ఉద్యోగులకే అన్న ప్రచారం సాగుతుందంటున్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయించిన ప్రభుత్వం... ఇంతవరకూ పర్మినెంట్‌ విధులు కేటాయించలేదంటున్నారు. అలాగే హెచ్‌ఆర్‌ కూడా ఫైనల్‌ చేయలేదంటున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ అంటూ అట్టహాసంగా హెల్త్‌ కార్డులు పంపిణీ చేశారు. కానీ ఆ కార్డ్‌ పట్టుకునిపోతే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయడం లేదని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. హెల్త్‌ మినిస్టర్‌ మాత్రం ఈ సమస్య ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు.. ఆసుపత్రుల యాజమాన్యంతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

రాష్ర్ట విభజన సమయంలో 600 మంది స్థానిక ఫోర్త్‌ క్లాస్‌ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. వారంతా మూడున్నరేళ్లనుంచి ఏపీ రాజధానిలో పనిచేస్తున్నారు. ఇందులో 238 మంది సెక్రటేరియట్‌కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వారంతా చాలా సార్లు సెక్రటేరియట్‌ ముందు ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించ లేదని విమర్శిస్తున్నారు. 

సర్కార్‌ ఉద్యోగుల సమస్యలపై ఎంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా... ప్రభుత్వం, అధికారులు  స్పందించడం లేదన్న  ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.  ఇవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

06:34 - February 15, 2018

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై భారీ ఉద్యమం చేపట్టాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి వర్గం నిర్ణయించింది. ఈ విషయంలో నోరుమెదపని సీఎం కేసీఆర్‌ తీరును కార్యదర్శి వర్గం తప్పుపట్టింది. ఈ అంశంపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సీపీఎం కార్యదర్శి వర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిని సీపీఎం కార్యదర్శి వర్గం తప్పు పట్టింది. గురువారం జరిగే బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో చర్చించి దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు 20 కమిటీలు ఏర్పాటు చేస్తూ కార్యదర్శి వర్గం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు పార్టీ మహాసభల ఏర్పాట్లు చూస్తూనే మరో వైపు బీఎల్‌ఎఫ్‌ను బలోపేతంపై దృష్టి పెట్టింది. బీఎల్‌ఎఫ్‌లోఎవరైనా నేరుగా చేరొచ్చని, ఫ్రంట్‌లోని ఏదోఒక పార్టీలో చేరాలన్న నిబంధన ఏదీలేదని సీపీఎం తెలంగాణ కార్యరద్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

జిల్లాల్లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభలు నిర్వహించాలని సీపీఎం కార్యదర్శి వర్గం నిర్ణయించింది. ఈనెల 20న సంగారెడ్డి, 25న మహబూబ్‌నర్‌లో ఫ్రంట్‌ సదస్సులు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు బీఎల్‌ఎఫ్‌ ఒక్కటే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

06:31 - February 15, 2018

హైదరాబాద్ : గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం గట్టిగా పోరాటం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ చేసే ప్రతిపాదనలు ఎలా తిప్పి కొట్టాలనే అనే అంశాలపై జలసౌధలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో హరీష్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణాలో తెలంగాణ వాటాగా 575 టీఎంసీల నీటి కేటాయింపునకు డిమాండ్‌ చేయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల కలిగే ముంపు సమస్యలపైనా సమీక్షించారు. 

06:30 - February 15, 2018

హైదరాబాద్ : గనుల రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లో 'మైనింగ్‌ టుడే' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తవ్వకాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌తోమర్‌తో పాటు.. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌... దేశ విదేశాల నుంచి 500 ప్రతినిధులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం గనుల రంగానికి అధిక ప్రాధాన్యతినిస్తుందన్నారు. హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ మైనింగ్‌ టుడే సదస్సును గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌తోమర్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు దేశ విదేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

ఖనిజాల అన్వేషణ, తవ్వకాలలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందన్నారు కేటీఆర్‌. తెలంగాణలో బొగ్గు గనులతో పాటు గ్రానైట్‌, ఇనుప గనులు కూడా ఉన్నాయన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా మైనింగ్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. గనుల్లో కార్మికుల రక్షణ కోసం కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు. ఖమ్మంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కేటీఆర్‌ కోరారు.

మైనింగ్‌ రంగం ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తుందన్నారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. దేశ జీడిపిలో మైనింగ్‌దే అగ్రస్థానమన్నారు. ఎక్కువ ఖనిజాలున్న చోటే పేదరికం కూడా ఉందన్నారు. ఈ అసమానతలను తొలగించాల్సిన అవసరముందన్నారు. మైనింగ్‌ తవ్వకాల్లో ఎలాంటి సమస్య వచ్చినా రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందన్నారు తోమర్‌.

మైనింగ్‌ సందర్బంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారమివ్వాలన్నారు గవర్నర్‌ నరసింహన్‌. ఎవరెవరికి ఎంత ఇచ్చారో వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు. మైనింగ్‌ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలన్నారు. మైనింగ్‌ ప్రాంతాల్లోని ప్రజలకు పునరావాసం కల్పించడం పెద్ద చాలెంజ్‌ అని.. గిరిజనులు నష్టపోకుండా సరైన పాలసీ రూపొందించాలన్నారు గవర్నర్‌. మైనింగ్‌ టుడే సందర్బంగా ఏర్పాటు చేసిన గ్రానైట్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 

06:27 - February 15, 2018

హైదరాబాద్ : తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన గులాబి పార్టీ....ఇప్పుడు రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వాదనను తెరపైకి తెస్తోంది. ఇప్పటికే కేంద్రంపై ఏపీ విరుచుకు పడుతుండడగా.. అదేబాటలో తెలంగాణా కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు ఏడాది ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌లో రేగిన రాజకీయ దుమారం తెలంగాణకు కూడా పాకుతోంది. ప్రత్యేక హోదా అంశం ఏపీలో హీట్ పుట్టిస్తుండగా.. నిధుల కేటాయింపు, విభజన చట్టంలోని హామీలు తెలంగాణాలోనూ ఇప్పుడు హాట్‌హాట్‌గా తెరపైకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు అంశాల వారిగా సంపూర్ణ మద్దతు తెలిపిన గులాబి పార్టీ ఇప్పుడు కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఎలాంటి నిధులు కేటాయించలేదన్న వాదనను తెరపైకి తెచ్చిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కేంద్ర వైఖరినే ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే తెలంగాణా రాష్ట్రంలో పలు సమస్యలకు కారణమనే అభిప్రాయాన్ని మంత్రులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులు అందకపోవడంతో కంది రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. ఇందుకనుగుణంగానే మరో మంత్రి NREGS నిధుల విడుదలలో కేంద్రం తీవ్రంగా జాప్యం చేస్తోందని, ఈ కారణంగానే ఉపాధి హామీ కూలీలకూ జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి క్రిష్ణారావు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చిలో మొదలు కానున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించే పనిలో అధికార పార్టీ నేతలు పడ్డట్లు తెలుస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో విరుచుకు పడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఫ్లోరిడా హై స్కూల్ లో విద్యార్థి కాల్పులు...

ఢిల్లీ : ఫ్లోరిడా హై స్కూల్ లో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో 17 మంది మృతి చెందగా 14మందికి గాయాలయ్యాయి. క్రమశిక్షణా చర్యలు తీసుకున్నందుకు పూర్వ విద్యార్థి నికోలస్ (19) ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. విద్యార్థి నికోలస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

లారీ బోల్తా...

ప్రకాశం : ఒంగోలు జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నేడు హైదరాబాద్ కు ఇరాన్ అధ్యక్షుడు...

హైదరాబాద్ : ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డా.హసన్ రౌహానీ నగరానికి రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. బేగంపేట విమానాశ్రయంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ కు కేంద్ర మంత్రి ఆర్పీసింగ్ స్వాగతం పలుకనున్నారు. 

6నుండి ఓయూ డ్రిగీ కోర్సుల పరీక్షలు..

హైదరాబాద్ : ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారయ్యాయి. డిగ్రీ కోర్సుల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

నేడు పాక్షిక సూర్య గ్రహణం...

హైదరాబాద్ : నేడు పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:25 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4:17 గంటల వరకు గ్రహణం ఉండనుందని తెలుస్తోంది. 

నేడు ఢిల్లీకి హరీష్ రావు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. కృష్ణా, గోదావరి నదుల వాటాపై సమావేశం జరుగనుంది. బుధవారం జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు. 

ఏపీ ప్రీ బడ్జెట్...

విజయవాడ : 2018-19 ఏపీ ప్రీ బడ్జెట్ పై కసరత్తు ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. పలు శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. 

Don't Miss