Activities calendar

16 February 2018

22:10 - February 16, 2018

సిద్ధిపేట : ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించేందుకు జనవిజ్ఞాన వేదిక సభ్యులు, పోలీసులు సిద్దిపేట స్మశాన వాటికలో తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో స్మశానంలో సమాధులపై కూర్చొని విందు చేశారు. అమావాస్య రోజున ప్రజలలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు పోలీసులు. అమావాస్య, పౌర్ణమి అంటే ఖగోళంలో వచ్చే మార్పులేనని జనవిజ్ఞాన వేదిక నాయకులు చెప్పారు. శాస్త్రీయ పద్దతుల్లో జీవించాలి కాని మూఢ నమ్మకాల జోలికి పోవద్దన్నారు. 

22:08 - February 16, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ములకలపల్లి మండలం కమలాపురం గ్రామం వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను రైతులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు నేటికీ పరిహారం అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు రిజర్వాయర్‌ పనులు చేస్తున్న వాహనాలను, యంత్రాలను అడ్డుకుని బయటకు పంపించివేశారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తిస్థాయి పరిహారం అందించే వరకు పనులు జరగనీయమని రైతులు హెచ్చరించారు. 

 

22:07 - February 16, 2018

హైదరాబాద్ : ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించాయి. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏ పరీక్షలను నిర్వహించేది లేదని కేజి టు పీజి విద్యాసంస్థల జేఏసి నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించాల్సిన బకాయిలు, స్వరాష్ట్రం వచ్చాక చెల్లించాల్సిన బకాయిలు వేలకోట్లు పెండింగ్‌ వున్నాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏ ఉద్యమానికైనా సిద్ధమని హెచ్చరించింది. వెంటనే చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్‌ చేశారు. జేఏసీ నిర్ణయంతో ఈ నెల 28 నుండి ఇంటర్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

 

22:05 - February 16, 2018

గుంటూరు : విభజన హామీల కోసం ముఖ్యమంత్రిపై విపక్షాల ఆరోపణలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తిప్పికొట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పలుమార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏపీకి విభజన హామీల అమలు కోసం... అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు.

22:03 - February 16, 2018

గుంటూరు : విభజన హామీల కింద కేంద్రం నిధులు ఇచ్చిందంటూ బీజేపీ చెబుతున్న లెక్కలపై చర్చకు సిద్ధమన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. బీజేపీ నేతలు చెబుతున్నవన్ని తప్పుడు లెక్కలని కొట్టిపారేశారు. రెగ్యులర్‌గా వచ్చే ప్రాజెక్టులు కాకుండా...  విభజన సమయంలో చేసిన హామీలు ఏం చేశారో చెప్పాలని గంటా డిమాండ్ చేశారు. 

22:00 - February 16, 2018

హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని హామీ అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫమయ్యాయని జనసేన ఏర్పాటు చేసిన నిజనిర్ధరణ కమిటీ విమర్శించింది. ప్రజల్లో పెరుగుతున్న అశాంతి, అసహనం... తీవ్రవాదం, వేర్పాటువాదం వంటి విపత్కర పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని జేఎఫ్‌సీ భేటీ ఆందోళన వ్యక్తం చేసింది. హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని నిర్ణయించింది. ఈ మొత్తం ప్రక్రియను కొన్ని వారాల్లోపే పూర్తి చేయాలని ప్రతిపాదించింది.

ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ మొదటి రోజు భేటీ ముగిసింది. పవన్‌ కల్యాణ్‌ ఆహ్వానం మేరకు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులతోపాటు మేధావులు, న్యాయ నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. చట్టంలో పొందుపరిచిన హామీలు, కేంద్రం ఇచ్చిన నిధులపై అధ్యయనం చేసేందుకు ఈ భేటీలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.  కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఏపీ ప్రభుత్వం రిటైర్డ్‌ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మహారాష్ట్ర కేడర్‌ వీఆర్‌ఎస్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.  

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఎదురవుతున్న పరిణామాలపై జేఎఫ్‌సీ భేటీలో ఆందోళన వ్యక్తమైంది. ప్రజల్లో నెలకొన్న అశాంతి, అసహనం తీవ్రవాద సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని జనసేనాని ఆవేదన వెలిబుచ్చారు. 

విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమల్లో కేంద్రం అవలంభిస్తున్న వైఖరి జేఎఫ్‌సీ తప్పుపట్టింది. హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలను కలిసి చర్చించాలని జేఎఫ్‌సీ నిర్ణయించింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వ వెయ్యి కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ సూచించారు. విభజన హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విలమయ్యాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి మరింత పెంచేందుకు భారీ ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 

విభజన చట్టంలోని హామీల అమలుపై  చంద్రబాబు అవలంభించిన మెతక వైఖరితో రాష్ట్ర నష్టపోయిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఏంపీలందరూ పార్లమెంటులో పోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు. శనివారం జరిగే జేఎఫ్‌సీ సమావేశంలో నిధుల అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించారు. 

21:55 - February 16, 2018

జేఎఫ్ సీ కమిటీ భేటీపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్, సీపీఐ సీనియర్ నేత గఫూర్ పాల్గొని, మాట్లాడారు. స్వార్థప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు. ఇది రాజకీయ సమస్యకాదు..ప్రజా సమస్య అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:50 - February 16, 2018

ఆఖరికి బస్త దాక గూడ ఎర్రజొన్నలను ప్రభుత్వం కొనుగోలు జేస్తదని నిజామాబాద్ ఎంపీ దేవనపల్లి కవితమ్మ అంటున్నది.. ఆఖరికి బస్తకొనాల్నంటే.. ముందుగాళ్ల ఫస్టు బస్తగొనాలెగదా..? మేడం..? ఇయ్యాళ ఆర్మూరు కాడ రైతులు రోడ్డెక్కిండ్రని.. ఈ ఏశం గట్టిండ్రు గావొచ్చు.. ఎద్దేడ్సిన ఎవుసం రైతేడ్చిన రాజ్యం ఎట్లుంటదని ఇప్పటి తెలంగాణ రాజ్యం లెక్కుంటదట..

తెలంగాణలున్న బహుజనులు..అంటె బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు.. అంత గల్చి ఒక్కటైతె.. ఈ రాష్ట్రంలున్న సంపదను సమానంగ వంచుకోవచ్చు.. అప్పుడు దొంగలు దోపిడి దారులు ఉండరు.. ఈ పనిగావాల్నంటే.. రాజ్యాధికారం ఒక్కటే మూలం అంటున్నరు.. తెలంగాణ సామాజిక పోరాట సమితోళ్లు.. ఈనెల పద్దెన్మిది తారీఖు నాడు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండుల పెద్ద బహిరంగ సభవెడ్తున్నరట..

రాజు వొయ్యిండ్రు.. రాజ్యాలు వొయ్యినయ్.. దేశం ప్రజాస్వామ్యమైంది.. ప్రజలే పాలకులన్నరు.. ఏది ఏమన్నా..? ఈ దేశంల ఉన్న భూమిమీద మాత్రం అసలైన ప్రజలకు హక్కులు లేకుంట వొయ్యినయ్.. దున్నెటోనిదే భూమిరా అని నినాదాలు జేశ్నా.. భూమి మాత్రం దొరల చెరల కెళ్లి బైటికి రాలేకపోతున్నది.. కరీంనగర్ జిల్లా భూమికోసం జర్గుతున్న పోరాటం ముచ్చట జూడుండ్రి..

ఎమ్మెల్యేలకు, ఎంపీలకు.. ఎమ్మెల్సీలకు.. మంత్రులకు కష్టం బాగైతున్నదని.. కష్టపోతులని.. జీతాలు రెండు మూడు లక్షలకు వెంచుకుంటిరి.. మరి వారంల ఐదురోజులే పనిదొర్కుతున్న బీడీకార్మికులకు గూడ కష్టం ఎక్వైతున్నది.. ఆందాని తక్వైతున్నదిగదా..? వాళ్లకు గూడ జర్రంత సర్కారు జీతాలలో.. భత్యాలో వెంచితె బాగుండదా..? అంటున్నరు 

రైలు ప్రయాణం కోసం జనరల్ టికెట్ గొన్నడు.. రైలు కదిలిపోతున్నది.. జనరల్ బోగీ ముంగటున్నది..   జనరల్ బోగీ కాడికి ఉర్కుతె ఉన్నరైలు వోతది.. అట్లని ఊకుంటమా.?. ఏడబ్బుంటె ఆ డబ్బల ఎక్కి వేరే స్టేషన్ల మళ్ల జనరల్ బోగీలకు వోతంగదా..? అగో రైలు ఎల్లిపోతున్న ఆత్రంల ఒక పిలగాడు రిజర్వేషన్ల ఎక్కితె పోలీసోడు జూడుండ్రి ఎట్ల గొట్టిండో..

అబ్బా గీ ముచ్చట్ల మాత్రం పోలీసోళ్లను మెచ్చుకోవచ్చు సూడుండ్రి.. ప్రజలు మూడ నమ్మకాలతోని అనాగరికంగ బత్కుతున్నరు.. వాళ్ల మూడ నమ్మకాలు వోవాల్నంటే.. ముందుగాళ్ల వాళ్లకు జ్ఞానం ఇయ్యాలే అని.. సిద్దిపేట సీఐ నందీశ్వర్ సారు.. మందిని ఎంటేస్కోని కాష్టాల గడ్డ అంటే స్మశాన వాటిక కాడ విందు జేస్కున్నరు.. 

ఎవ్వలన్న దొంగతనం జేశినోళ్లకు పస్పుబియ్యం దినిపిస్తె దొంగతనం జేశింది చేయంది బైటవడ్తదా..?  ఒకవేళ పస్పుబియ్యానికి అంత పవరుంటే.. మోడీకి గూడ తినిపిచ్చి.. దొంగలకు సద్దిగడ్తున్నడా లేదా అనేది గూడ తెల్సుకోవచ్చుగదా..? పస్పుబియ్యమంటెనే నవ్వొస్తున్నది.. అట్ల దొంగలు దొర్కేదుంటే.. ఈ లై డిటెక్టర్లు.. ఈ పోలీసు విచారణలెందుకు చెప్పుండ్రి.? మూడనమ్మకాల కెళ్లి విద్యార్థులను విజ్ఞానం దిక్కు తీస్కపోవల్చిన సర్కారు టీచరమ్మనే పిల్లలకు పస్పుబియ్యం దినవెట్టిందట..

ఇద్వరకే మనం బొచ్చెడు మాట్లా సూపెట్టుకున్నం.. తిరుమల కొండల మీదికి కోటర్ సీసలు, గుట్కాలు, సిగిరేట్లు తీస్కపోతుంటే.. పట్టుకున్న ముచ్చట.. ఓదిక్కు కేసులు వెడ్తున్నా.. పకడ్బంది చెకింగులు జేస్తున్నా.? వెంకన్న ప్రియ భక్తులు మాత్రం.. తమ సర్కును దీస్కపోతనే ఉన్నరు.. దొర్కుతనే ఉన్నరు.. 

21:46 - February 16, 2018

జేఎఫ్ సీ తేల్చబోయే నిజాలేంటీ ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విభజన చట్టం హామీలు, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్ రావు, టీడీపీ నేత మాణిక్యవరప్రసాద్, వైసీపీ కొణిజేటీ రోశయ్య పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:41 - February 16, 2018

హైదరాబాద్ : జెఎఫ్ సీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ ముగిసిన అనంతరం సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కేంద్రం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు.
పవన్ కళ్యాణ్ ..
రాష్ట్ర విభజన విధానం సక్రమంగా లేదని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. పాలకులు అయోమయంలో ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ధమైన ప్రకటనలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. జేఎఫ్ సీ సబ్ కమిటీలు ఉంటాయన్నారు. 
జయప్రకాశ్ నారాయణ.. 
ఫెడరల్ వ్యవస్థకు భంగం కలగకుండా పోరాడాలని జయప్రకాశ్ నారాయణ అన్నారు. కమిటీ నిర్ణయాలను తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు...అమలు, ప్రధాని లోక్ సభలో గంభీరమైన ప్రసంగం, ఫెడరల్ వ్యవస్థలో చట్టబద్ధంగా పార్లమెంట్ హక్కులు, ఆ భాషను కమిటీ తిరస్కరిస్తుంది, హామీల అమలు, చట్టం అమలు, రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన సమాచారం...అధికారిక ప్రకటన, పద్మనాభయ్య, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రశేఖర్ బృందంతో కమిటీ తోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. కమిటీలో పౌర సమాజానికి, అన్ని పార్టీల పాత్ర ఉండాలన్నారు. అందరూ ఒకే గొంతుతో పోరాడాలని సూచించారు. రేపు 11 అంశాలపై చర్చ ఉంటుందని తెలపారు. ద్రవ్యలోటు, ఓడరేవుల నిర్మాణం, రైల్వే జోన్, ప్రత్యేక ప్రత్తిపత్తితోపాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. 

21:29 - February 16, 2018

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధుల కోరడంలోని ఔచత్యాన్ని కేంద్రం ప్రశ్నిస్తోందని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య చెప్పారు. భవనాల నిర్మాణానికే 42 వేల కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన లెక్కలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని జేఎఫ్‌సీ సమావేశంలో ప్రస్తావించారు. 

 

 

21:18 - February 16, 2018

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల డైరెక్ట్ చేసిన 'మనసుకు నచ్చింది' సినిమా ఇవాళ ప్రేక్షకుల వచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్,త్రిధ హీరో,హీరోయిన్లుగా వచ్చిన మనసుకు నచ్చింది సినిమాకు కూడా ప్రమోషన్స్ తో బాగా హైప్ వచ్చింది. చాలా కాలం గ్యాప్ తర్వాత మంజుల చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గా అందరూ ఈ సినిమాపై కాన్ సన్ ట్రేట్ చేశారు. మరి ఈ మద్య పెద్దగా హిట్లు లేని సందీప్ కిషన్ కు ఈ సినిమా అయినా హెల్ప్ అయ్యిందో లేదో చూద్దాం.

మనసుకు నచ్చింది సినిమాకు మంజుల బ్రదర్ సూపర్ స్టార్ మహేష్  కూడా వాయిస్ఇచ్చాడు. అంతే కాదు..మంజుల కూతురు జాను కూడా ఈ సినిమాలో తెరంగేట్రం చేసింది. మ్యూజిక్ రీసెంట్ సంచలనం రధన్ అందించాడు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో  అందర్నీ ఆకట్టుకుంటుదని మూవీ టీమ్ కాన్ఫిడెన్స్ తో ఉంది. 

రేటింగ్ 1.5/5

20:59 - February 16, 2018

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న ఫస్ట్  సినిమా  అ . న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మరో సారి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో టీజర్స్ నుంచే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాపై స్టార్టింగ్ నుంచే హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఇంట్రస్టింగ్ మూవీ గా వచ్చిన ఈ   సినిమా   ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది.లేట్ లేకుండ  అ సినిమా టాక్ ఏంటో  తెలుసుకుందాం.

అ సినిమా ఇంట్రస్టింగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ స్టార్ కాస్టింగ్. కాజల్,రెజీనా, నిత్యామీనన్,ఈషారెబ్బా  తో పాటు మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్, దర్శి ..లీడ్ రోల్స్ ప్లేచేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందోనని అందరూ ఎగ్జైటింగ్ గానే వెయిట్ చేశారు.  అంతేకాదు..నాని ఈ సినిమాలో చేపకు, మాస్ మహారాజ రవితేజ చెట్టుకు వాయిస్ఓవర్ ఇవ్వడంతో ఇంట్రస్ట్ ఇంకా పెరిగిపోయింది.

ఇక షార్ట్ ఫిల్మ్స్ తో తన కంటూ ఓ డిఫరెంట్ మార్క్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. మరి ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని, స్టోరీ ని ఎలా డీల్ చేశాడో మనం కూడా చూద్దాం.  మరి అ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే విందాం. ఈ అ సినిమాపై టెన్ టివి సినీ డెస్క్  తమ రివ్యూ ఇవ్వడానికి  ఉన్నారు. ఆ రివ్యూ  ఇప్పుడు చూద్దాం. 

రేటింగ్ 2/5 

20:50 - February 16, 2018

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించారని అన్నారు. రాజకీయ నాయకులు బాగానే ఉన్నారని తెలిపారు. న్యాయం జరగనప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు కోపం వస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ప్రజల్లో అసహనం పెరుగుతుందని...తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న భావన కలుగుతుందన్నారు. 

 

20:38 - February 16, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే దేశ సమగ్రతకు భంగం కల్గుతుందని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలపై ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది మనుషుల సమస్య అని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో జరిగిన అన్యాయంపైనే జేఎఫ్ సీ ఏర్పాటు అయిందని తెలిపారు. తనకు చలించే హృదయం ఉందన్నారు. పాలకులు చేసిన తప్పుకు పేద ప్రజలు బాధలు అనుభవిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 'నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడినా' అన్న భావన కలుగుతుందన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోనప్పుడు చట్టాలను ఎందుకు గౌరవించాలనే ధోరణి పౌరుల్లో వస్తుందన్నారు. 

 

20:29 - February 16, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేట్ ముందు సుబాబుల్, జామాయిల్‌కు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. ధర్నాలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, భద్రాచలం ఎమ్మెల్యీ  సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఓదశలో రైతులు ఐటీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతుల మధ్య తోపులాట జరిగింది.

 

20:26 - February 16, 2018

జగిత్యాల : ఎస్సారెస్పీ ఉప కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చౌలమద్ది రైతులు అన్నదాతలు రోడ్డెక్కారు. తమ గ్రామ సరిహద్దుల్లో ఉన్న డీ-34, 35, 36 ఉప కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ.. మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు  ఆందోళన చేయడంతో... కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు ఉన్నతాధికారులు వచ్చి... న్యాయం చేస్తామని తెలపడంతో.. రైతులు ఆందోళన విరమించారు.

 

20:23 - February 16, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని ఆర్మూర్‌ మండలంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న ఎర్రజొన్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు పోలీసులు. రైతుల అరెస్ట్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

కావేరి నీటి తీర్పుపై రజనీకాంత్ ట్వీట్

చెన్నై : కావేరి నీటి తీర్పుపై రజనీకాంత్ ట్వీట్ చేశారు. తమిళనాడుకు జలాలను తగ్గిస్గూ తీర్పు రావడం బాధాకరమన్నారు. నీటిని తగ్గించడం వల్ల డెల్టా రైతులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. తీర్పుపై తమిళ ప్రభుత్వం మరోమారు అప్పీల్ చేయాలని సూచించారు.

 

తమిళనాడు..కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత

చెన్నై : కావేరి జలాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు..కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. తమిళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ప్రతిపక్షాలు అన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే కర్ణాటకకు సానుకూల నిర్ణయమని విపక్షాలు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు. 

కానిస్టేబుల్ పదోన్నతుల మార్గదర్శకాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : కానిస్టేబుల్ పదోన్నతుల మార్గదర్శకాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుళ్ల ప్రమోషన్ల జీవోపై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. రేపటి నంచి వచ్చే నెల 5 వరకు జీవోపై స్టేటస్ కో ఆర్డర్ పాస్ కానుంది. 

పురుషోత్తంరెడ్డి లాకర్లను తెరిచిన ఎసిబి అధికారులు

హైదరాబాద్ : బోయిన్ పల్లి కొటక్ మహీంద్ర బ్యాంకులో హెచ్ ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి లాకర్లను ఎసిబి అధికారులు తెరిచారు. పురుషోత్తంరెడ్డి భార్యకు చెందిన బంగారు అభరణాల గుర్తించారు.

క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : దోమలగూడలో క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో శంకర్ లాల్ ను అరెస్టు చేశారు. పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

19:41 - February 16, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వచ్చేనెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. 8న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై అమరావతిలో సమావేశం జరిగింది. బడ్జెట్‌ రూపకల్పనకు ముందు.. శాఖాధిపతులు, కార్యదర్శులు, మంత్రులతో ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గవర్నర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లక్ష్యాలకు అనుగుణంగా ఎంత నిధులు అవసరమో అంచనాలు సిద్ధం చేసుకోవాలని... చంద్రబాబు అన్ని శాఖలకు సూచించారు.

 

19:39 - February 16, 2018

హైదరాబాద్‌ : నగరంలో జేఎఫ్‌సీ, లెఫ్ట్‌ పార్టీల నేతలతో పవన్‌ భేటీ కొనసాగుతోంది. ఈరోజు భేటీలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌, వామపక్ష నేతలు మధు, రామకృష్ణలతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. హోటల్ దసపల్లాలో జరుగుతున్న ఈ భేటీలో.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చిస్తున్నారు. రెండురోజుల భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీకి ఆహ్వానం అందినా వైసీపీ, టీడీపీ నేతలు గైర్హాజరయ్యారు. 
హామీల అమలుకు ప్రజా ఉద్యమం : మధు 
ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రజా ఉద్యమం నిర్మించాల్సి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  మధు సూచించారు. హోదా కోసం పోరాడుతున్న అన్ని పార్టీలు కలిసి ఆందోళన చేపట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ సమావేశంలో మధు ఈ విషయాలు చెప్పారు. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.
కేంద్రం పట్ల చంద్రబాబు మెతక వైఖరి : రామకృష్ణ
ఎన్డీయే ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన మెతక వైఖరితోనే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జనసేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ సమావేశానికి హాజరైన రామకృష్ణ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీరి నిలదీయలేకపోవడంతోనే నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 
మోదీని కలవాలని జేఎఫ్‌సీ నిర్ణయం -జయప్రకాశ్‌
రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించేందుకు ప్రధాని మోదీతో భేటీ కావాలని జేఎఫ్‌సీ నిర్ణయించింది. ఈ మేరకు మోదీ అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నించాలని ప్రతిపాదించింది. 
పోలవరంకు వెయ్యి కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ పెట్టాలి : నాగేశ్వర్
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌.. ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అలాగే  రాష్ట్రంలో చమురు, సహజవాయువు వెలికితీత ద్వారా కేంద్ర పొందుతున్న రాయల్టీలో 50 శాతం రాష్ట్రానికి ఇవ్వాలన్న 12 వ ఆర్థిక సంఘం సిఫారసుల అమలు కోసం డిమాండ్‌ చేయాలని జేఎఫ్‌సీ మీటింగ్‌ల చెప్పారు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి : ఉండవల్లి
రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసే బదులు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం మరింత ఒత్తిడి పెంచాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సూచించారు. జేఎఫ్‌సీ సమావేశానికి హాజరైన ఉండవల్లి... ఎంపీ రాజీనామాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. 
 

 

19:29 - February 16, 2018
19:28 - February 16, 2018

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్ అప్రజాస్వామిక వాది అని వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు జగన్ ను నాయకత్వాన్ని ఎందుకు దిక్కరించారో గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిని చూసి.. జగన్ నాయకత్వాన్ని వైసీపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు తప్ప.. టీడీపీకి మద్దతు పలకలేదన్నారు. ఎవరు సమాచారం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

19:24 - February 16, 2018
19:22 - February 16, 2018

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌.. ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అలాగే  రాష్ట్రంలో చమురు, సహజవాయువు వెలికితీత ద్వారా కేంద్రం పొందుతున్న రాయల్టీలో 50 శాతం రాష్ట్రానికి ఇవ్వాలన్న 12 వ ఆర్థిక సంఘం సిఫారసుల అమలు కోసం డిమాండ్‌ చేయాలని జేఎఫ్‌సీ మీటింగ్‌ల చెప్పారు. 
 

19:17 - February 16, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసే బదులు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం మరింత ఒత్తిడి పెంచాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సూచించారు. జేఎఫ్‌సీ సమావేశానికి హాజరైన ఉండవల్లి... ఎంపీ రాజీనామాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే సరైన తరుణమన్నారు.

 

19:11 - February 16, 2018

హైదరాబాద్ : ఎన్డీయే ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన మెతక వైఖరితోనే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జనసేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ సమావేశానికి హాజరైన రామకృష్ణ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీరి నిలదీయలేకపోవడంతోనే నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 
 

19:09 - February 16, 2018

హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రజా ఉద్యమం నిర్మించాల్సి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  మధు సూచించారు. హోదా కోసం పోరాడుతున్న అన్ని పార్టీలు కలిసి ఆందోళన చేపట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ సమావేశంలో మధు ఈ విషయాలు చెప్పారు. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. 
 

19:04 - February 16, 2018

చెన్నంపల్లి కోటలో తవ్వకాలు..

కర్నూలు : జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో కొన్ని రోజులుగా పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు  జరుపుతున్నారు. ఈరోజు తవ్వకాల్లో ఆ ప్రాంతంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అందులో సీతారాముడు, లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు రాగిచెంబులు, పళ్లాలు లభ్యమయ్యాయి. జీపీఆర్ స్కానర్ ద్వారా భూమిలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశోధిస్తున్నారు. లభ్యమైన వస్తువులు క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు.  

18:39 - February 16, 2018

కర్నూలు : జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో కొన్ని రోజులుగా పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు  జరుపుతున్నారు. ఈరోజు తవ్వకాల్లో ఆ ప్రాంతంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అందులో సీతారాముడు, లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు రాగిచెంబులు, పళ్లాలు లభ్యమయ్యాయి. జీపీఆర్ స్కానర్ ద్వారా భూమిలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశోధిస్తున్నారు. లభ్యమైన వస్తువులు క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు.  

 

18:27 - February 16, 2018
18:26 - February 16, 2018
18:09 - February 16, 2018

పెద్దపల్లి : జిల్లాలోని కాల్వశ్రీ రాంపూర్‌ మండలం కునారం గ్రామంలో భూములు లేని నిరుపేదలు నిజాం కాలం నాటి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. సర్వే నం.18 లో 2వేల ఎకరాల భూములు అన్యక్రాంతం అయ్యాయి. 2వేల ఎకరాల పైచిలుకు నిజాం భూములను పెత్తం దారులు, పలుకుబడి ఉన్నవారంతా ఆక్రమించుకోవడంతో భూములు కోల్పోయిన వారంతా పోరు బాట పట్టారు. 9 నెలలుగా భూముల కోసం గ్రామస్థులు పోరాటం చేస్తున్నారు. వేలాది ఎకరాలు కబ్జాకు గురైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురైన తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం ఆగదని గ్రామస్థులు అంటున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

సమస్యలు పరిష్కరించకపోతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం : పవన్

హైదరాబాద్ : ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలపై జేఎఫ్ సీ మీటింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకపోతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనప్పుడు చట్టాలను ఎందుకు గౌరవించాలనే ధోరణి వస్తుందన్నారు. 

 

పాలకులు చేసిన తప్పుకు ప్రజలు బాధలు అనుభవిస్తున్నారన్న పవన్

హైదరాబాద్ : ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలపై జేఎఫ్ సీ మీటింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది మనుషుల సమస్య అని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో జరిగిన అన్యాయంపైనే జేఎఫ్ సీ ఏర్పాటు అయిందని తెలిపారు. తనకు చలించే హృదయం ఉందన్నారు. పాలకులు చేసిన తప్పుకు పేద ప్రజలు బాధలు అనుభవిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 'నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడినా' అన్న అనుమానం కలుగుతుందన్నారు.
 

17:17 - February 16, 2018

హైదరాబాద్ : ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహానీతో పాటు పలువురు సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి రౌహానీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వాతంత్య్రానంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేతగా హసన్‌ నిలిచారు. 

 

ఏసీబీ కోర్టులో లొంగిపోయిన హెచ్‌ఎండీఏ డైరెక్టర్ కట్టా పురుషోత్తమ్‌ రెడ్డి

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హెచ్ ఎమ్ డీఏ డైరెక్టర్‌ కట్టా పురుషోత్తమ్‌ రెడ్డి ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. పురుషోత్తంరెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన  పదిరోజుల నుంచి కనిపించకుండా పోయారు. పురుషోత్తంరెడ్డికి సంబంధించిన కొన్ని కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. పురుషోత్తం రెడ్డికి ఏసీబీ కోర్టు మార్చి 1 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

 

ఏసీబీ కోర్టులో లొంగిపోయిన హెచ్‌ఎండీఏ డైరెక్టర్ కట్టా పురుషోత్తమ్‌ రెడ్డి

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హెచ్ ఎమ్ డీఏ డైరెక్టర్‌ కట్టా పురుషోత్తమ్‌ రెడ్డి ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. పురుషోత్తంరెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన  పదిరోజుల నుంచి కనిపించకుండా పోయారు. పురుషోత్తంరెడ్డికి సంబంధించిన కొన్ని కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. పురుషోత్తం రెడ్డికి ఏసీబీ కోర్టు మార్చి 1 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

 

17:08 - February 16, 2018

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హెచ్ ఎమ్ డీఏ డైరెక్టర్‌ కట్టా పురుషోత్తమ్‌ రెడ్డి ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. పురుషోత్తంరెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన  పదిరోజుల నుంచి కనిపించకుండా పోయారు. పురుషోత్తంరెడ్డికి సంబంధించిన కొన్ని కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. పురుషోత్తం రెడ్డికి ఏసీబీ కోర్టు మార్చి 1 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:05 - February 16, 2018

కర్నూలు : జిల్లాలోని కౌతాళం మండలం ఉరకుందలో దారుణం జరిగింది. భార్యను బ్లేడుతో కోసి భర్త కిరాతకంగా హత్య చేశాడు. శివరాత్రి నాడు ఉరుకుంద వీరన్న ఆలయానికి భార్యాభర్తలు కలిసి వచ్చారు. ఆలయానికి చెందిన ట్రస్ట్ రూంలో బస చేశారు. అదే రూంలో భార్యను హతమార్చాడు. మూడురోజులుగా భార్య మృతదేహం అదే రూంలో ఉంచాడు. కొడుకుకి అనుమానం రావడంతో హత్య విషయం వెలుగుచూసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:34 - February 16, 2018

చిత్తూరు : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో తెలుగు యువతిపై కామాంధులు రెచ్చిపోయారు. అత్యాచారానికి ప్రయత్నించి..రాడ్ తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘోర ఘటన కామచిపు జిల్లా తాళంబూరులో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన లావణ్య రెడ్డి తాళంబూరులోని ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తోంది. యదావిధిగా గురువారం రాత్రి విధులు ముగించుకుని హాస్టల్ కు వెళుతుండగా దుండగులు అడ్డుకున్నారు. అత్యాచారానికి ప్రయత్నించడంతో లావణ్య ప్రతిఘటించింది. వెంటనే ఆమెపై దుండుగులు రాడ్ అత్యత దారుణంగా దాడికి పాల్పడ్డారు. తలకు తీవ్రగాయం కావడం..రోడ్డు పక్కన పడిపోయింది. స్థానికులు తాంబరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు తాళంబూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. యువతిపై జరిగిన దాడిని తెలుగు వారు ఖండిస్తున్నారు. 

13:33 - February 16, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి హామీలిచ్చింది. ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు నెరవేరాలి ? కేంద్రం ఎంత నిధులిచ్చింది ? రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టింది తదితర నిజాలు నిగ్గు తేల్చేందుకు పవన్ 'జేఎఫ్ సీ' కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తొలి సమావేశం హోటల్ దస్ పల్లాలో జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ వేత్తలు హాజరయ్యారు.

కమిటీలో ఉన్న కీలక వ్యక్తులు మాట్లాడారు. ఏపీ విభజన చట్టం 2014 చేశారని కమిటీలోని వ్యక్తి తెలిపారు. ఐదో సెక్షన్ లో హైదరాబాద్ 10 ఏళ్ల కాలం రాజధాని నడుపొచ్చుచనని పేర్కొనడం జరిగిందన్నారు. ఇక ఆరో సెక్షన్ లో ఏపీ రాజధాని కోసం భూమిని గుర్తించాలని..ఇందుకు రిపోర్టు చేయాలని పేర్కొనడం జరిగిందన్నారు. అనంతరం దీనిపై నియమించబడిన శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ ..గుంటూరు జిల్లాలో మధ్యలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయం వెలువరించిందన్నారు.

విభజన జరిగి నాలుగేళ్ల సమయం అయిపోయిందని..ఎలాంటి అభివృద్ధి జరిగిందనే దానిపై ఆలోచించాలని తెలిపారు. ఇక్కడ 93, 94 సెక్షన్స్ ముఖ్యమైనవని, ఇందులో ఏపీకి, తెలంగాణ రాష్ట్రాలకు ఎడ్యుకేషన్, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలనే దానిపై 13 వ షెడ్యూల్ లో కేంద్రం పేర్కొనడం జరిగిందన్నారు. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, సెంటర్, పెట్రోల్, అగ్రిలక్చర్ ఇలాంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎయిమ్స్ సూపర్ స్పెషాల్టీ, టీచింగ్ ఇనిస్టిట్యూట్...తెలంగాణకు ట్రైబల్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సెజ్ లో ఈడీ సోదాలు...

హైదరాబాద్ : సెజ్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా రావిరాళ్ల దగ్గర ఈడీ తనిఖీలు జరిపింది. నీరవ్ మోడీ మేనమామ పేరిట 15 ఎకరాల్లో ఉన్న జెమ్స్ సంస్థలో ఈ తనిఖీలు చేసింది. 5 కంపెనీలను ఈడీ సీజ్ చేసింది. రూ. 3వేల కోట్ల విలువైన వజ్రాలు, జెమ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

మీడియాతో పవన్...

హైదరాబాద్ : జేఎఫ్ సీ సమావేశానికంటే ముందు జనసేన అధినేత పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. జేఎఫ్ సీలో చేరేందుకు వైసీపీ, టిడిపి సుముఖత చూపలేదని, బిజెపి నేతలు గతంలో చెప్పినట్లే వెబ్ సెట్ లో లెక్కలు చూసుకోమన్నారని తెలిపారు. ఏపీలో ఇదివరకెప్పుడూ మేధావులంతా ఒకే వేదికపైకి రాలేదన్నారు. సమావేశం అనంతరం సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

 

పురుషోత్తం రెడ్డి లొంగుబాటు...

హైదరాబాద్ : ఏసీబీ కోర్టులో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి లొంగిపోయారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పురుషోత్తమ్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. 

12:59 - February 16, 2018

తెలుగు సినిమాల్లో స్పీడ్ పెరిగింది. కొత్త కొత్త కథలతో న్యూ టాలెంట్ ఫ్లో బాగా వస్తుంది. వెరైటీ సినిమాలతో ఆడియన్స్ అలరించడానికి ఈ వారం కూడా రెండు ఇంటరెస్టింగ్ సినిమాలు ట్రాక్ లో ఉన్నాయ్. మరి ఈ వారం ఈ సినిమాల టాక్ ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ ఛాయిస్.

వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా 'అ!'. కథలో కొత్తదనం ఉన్న సినిమాగ ట్రైలర్ టీజర్ చూస్తే తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని 'అ!' సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. 'అ!' సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా కెసాండ్రా.. ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు అక్కగానే కాక నటిగా కూడా సుపరిచితురాలు 'మంజుల ఘట్టమనేని'. కృష్ణ గారి ముద్దుల కూతురిగా మాత్రమే కాక ఒక మంచి నిర్మాతగా కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తను దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రంగా మన ముందుకు రాబోతోంది 'మనసుకు నచ్చింది'. ఈ సినిమా లో సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ ముఖ్య తారాగణం. ట్రైలర్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. మరి ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందిందో రానున్న రోజుల్లో తెలియనుంది. 

12:55 - February 16, 2018

బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా డిఫెరెంట్ రోల్ లో కనిపించింది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడంలో ముందుండే ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద భయపెట్టడానికి రెడీ అయింది. తన అందంతో అభినయం తో ఆకట్టుకునే బాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరు 'అనుష్క శర్మ'. ఎలాంటి పాత్ర అయిన తన గ్లామర్ తో స్క్రీన్ కి అందాన్ని తెస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. 'అల్లరి దెయ్యం' గా 'అనుష్క' అలరించింది. గ్లామర్ కి మాత్రమే కాదు స్టోరీకి కూడా 'అనుష్క శర్మ' ఇంపార్టెంట్ ఇస్తుంది.

ప్రెసెంట్ 'అనుష్క శర్మ' ఒక హారర్ కాన్సెప్ట్ తో రాబోతుంది. 'పారి అనే హారర్' సినిమా తో 'అనుష్క' ఈ సారి సీరియస్ దెయ్యంలా కనిపించబోతుంది. తనలో ఇంత యాక్టింగ్ ఉందా అని 'పారి' సినిమా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇన్ని రోజులు గ్లామర్ డాల్ గా కనిపించిన 'అనుష్క' ఇప్పుడు వొళ్ళు గొగుర్పొడిచే హారర్ సినిమా లో కనిపిస్తుంది. మరి అలరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:54 - February 16, 2018

సినిమా ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. రీసెంట్ సినిమాల హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చక చక సినిమాలు చేస్తున్నారు. తెలుగు లో బయోపిక్స్ రావడం కొంచం రేర్ అనే ఒపీనియన్ ఉన్న ఈ టైం లో ఒక బయో పిక్ తో రెడీ అవుతున్నాడు స్టార్ హీరో.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీరితో పాటు స్టార్ హీరో హోదా ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య సినిమా అంటే మాస్ లో క్లాస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. తన సినిమాల్లో కచ్చితంగా ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు బాలకృష్ణ. తన ప్రీవియస్ సినిమా జై సింహ లో కూడా బాలకృష్ణ చాల పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చింది.

బాలకృష్ణ ప్రెసెంట్ 'నందమూరి తారకరామారావు' జీవిత కథని ఆధారం చేసుకొని బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా కి డైరెక్టర్ తేజ ..ఒక టీజర్ కూడా షూట్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఏమి రాలేదు. చక చక సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాలో ఆ స్పీడ్ ఎందుకు చూపించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల డౌట్. తేజ రీ ఎంట్రీ ఇచ్చి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన...

చిత్తూరు : తిరుపతిలో ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నిరసన తెలియచేశారు. తారకరామ స్టేడియంలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రానికి హోదాపై మోడీ ఇదే స్టేడియంలో హామీనిచ్చిన సంగతి తెలిసిందే.

 

యూపీ బడ్జెట్...

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. కాసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీకి చేరుకున్నారు. 

12:35 - February 16, 2018

పెద్దపల్లి : ఫిర్యాదు దారుల నుండి బాధ్యతగా వ్యవహరించాలి..వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈ ఘటన చూపిస్తోంది. గోదావరిఖని వన్ టౌన్ సీఐ కృష్ణ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏసీపీ అపూర్వ నివేదిక రూపొందించారు. దీనితో రామగుండం కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని బాపూజీ నగర్ లో గత నాలుగు నెలల కిత్రం కూతురిపై అత్యాచారం చేసిన ఘటనపై వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో బాధిత మహిళ స్వాతి వన్ టౌన్ సీఐ కృష్ణతో మాట్లాడేందుకు వెళ్లిందని, కానీ సీఐ దుర్బాషలాడారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తీవ్ర మనస్థాపానికి గురైన స్వాతి బలవన్మరణానికి పాల్పడిందని, వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీనిపై ఏసీపీ అపూర్వరావు ఓ నివేదికను తయారు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించారని నివేదికలో పేర్కొనడంతో సీఐ కృష్ణను వీఆర్ కు అటాచ్ చేస్తున్నట్లు రామగుండం కమీషనర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ సీఐపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

గోదావరి ఖని వన్ టౌన్ సీఐపై...

పెద్దపల్లి : జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోదావరిఖని వన్ టౌన్ సీఐని వీఆర్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ రామగుండం కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. 

12:24 - February 16, 2018

చిత్తూరు : జిల్లాలోని పలమనేరులోని మొరంలో జరిగిన తీవ్ర విషాద ఘటనకు కారకులెవరనేది తెలియడం లేదు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర హెచరీస్ లో జరిగిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. పౌల్ట్రీ ఉత్పత్తుల పరిశ్రమను నిర్వహిస్తూ, వెంకీస్, వెన్ కాబ్ వంటి పలు బ్రాండ్లను వెంకటేశ్వర హెచరీస్‌ మార్కెటింగ్ చేస్తున్నట్లు సమాచారం. పద్మ శ్రీ అవార్డు పొందిన వ్యక్తి హాయంలో హెచరీస్ అభివృద్ధి చెందింది.

ఈ హెచరీస్ లో జరిగిన ప్రమాదంపై పలమనేరు పీఎస్ లో కేసు నమోదైంది. కానీ ఈ ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక మురుగు కాల్వ శుభ్రం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకున్నారా ? తీసుకుంటే ఇలాంటి ఘటన ఎందుకు జరుగుతుంది ? కార్మికులను ఎవరు దించారు ? అసలు వీరితో ఎవరు మాట్లాడారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలవాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పొద్దున వెళ్లిన వారు విగతజీవులుగా మారడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. ప్రస్తుతం పలమనేరు ఆసుపత్రిలో మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై విదేశాల్లో ఉన్న మంత్రి అమర్ నాథ్ రెడ్డి తెలుసుకుని కలెక్టర్ కు పలు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి సూచించారు. యాజమాన్యంపై చర్యలుంటాయా ? ఇతరులను బలి పశువు చేస్తారా ? అనేది చూడాలి. 

12:16 - February 16, 2018

హైదరాబాద్ : ఏపీ విభజన హామీలు..ప్రత్యేక హోదా తదితర వివరాలు..కేంద్రం నుండది ఏపీకి వచ్చి నిధులపై నిగ్గు తేల్చేందుకు సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్' సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన 'జేఎఫ్ సీ' తొలి సమావేశం నేడు జరుగబోతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా ఇప్పటికే పలువురు నేతలకు, రాజకీయ వేత్తలు, నిపుణులకు, ఇతరులకు పవన్ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.

జేఎఫ్ సీ తొలి సమావేశం నగరంలోని దస్ పల్లా హోటల్ లో జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ హోటల్ కు చేరుకున్నారు. అంతకంటే ముందు ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో పాల్గొనేందుకు చలసాని, ఉండవల్లి, వామపక్ష నేతలు మధు, వైవి, రామకృష్ణ, కొణతాల తదితరులు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లు హాజరయ్యారు.

ఇక్కడకు చేరుకున్న నేతలకు స్వయంగా 'పవన్' స్వాగతం పలికారు. విడివిడిగా బృందాలతో ఆయన సమావేశమవుతూ విభజన వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నాం రెండు గంటలకు అందరి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మొదటి రోజు కేవలం అందరీ అభిప్రాయాలు..వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారని, రెండో రోజు జేఎఫ్ సీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. 

దసపల్లా హోటల్ కు పవన్...

హైదరాబాద్ : సినీ నటుడు పవన్ కళ్యాణ్ దసపల్లా హోటల్ కు చేరుకున్నారు. జేఎఫ్ సీ తొలి సమావేశం నేడు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమావేశంలో పాల్గొనేందుకు చలసాని, ఉండవల్లి, మధు, రామకృష్ణ, కొణతాల తదితరులు చేరుకున్నారు. 

ఏపీలో ప్రీ బడ్జెట్ సమావేశాలు..

~ ఆర్థిక మంత్రి యనమల ఛాంబర్ లో రెండో రోజు ప్రీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సమావేశంపై చర్చిస్తున్నారు. ఈసమావేశంలో మంత్రి కామినేని పాల్గొన్నారు. 

11:55 - February 16, 2018
11:49 - February 16, 2018

పెద్దపల్లి : కూతురిపై అత్యాచారం జరిపిన వారు విడుదలయ్యారని...ఈ కేసుపై ప్రశ్నించడానికి వెళితే సీఐ దూషించాడని...కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని..

తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించడం..దళిత సంఘాలు ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని బాపూజీ నగర్ లో చోటు చేసుకుంది.

గత నాలుగు నెలల కిత్రం కూతురిపై అత్యాచారం చేసిన ఘటనపై వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. ఇటీవలే నిందితులు విడుదలయ్యారని తెలుస్తోంది. దీనితో బాధిత మహిళ వన్ టౌన్ సీఐ కృష్ణకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కానీ సదరు సీఐ దుర్బాషలాడారని..మనస్థాపానికి గురైన స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని..కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సదరు సీఐపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ అపూర్వరావు హామీనిచ్చినా కుటుంబసభ్యులు..దళిత సంఘాలు వినిపించుకోలేదు. రామగుండం కమీషనర్ దుగ్గల్ ఆరా తీసినట్లు, హెడ్ క్వార్టర్ కు అటాచ్ మెంట్ చేస్తామని హామీనిచ్చినట్లు తెలుస్తోంది. కానీ సీఐపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

పెద్దపల్లిలో వివాహిత ఆత్మహత్య...

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని బాపూజీ నగర్ లో స్వాతి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వన్ టౌన్ సీఐ కృష్ణ దూషించడంతో స్వాతి మనస్థాపంతో ఉరి వేసుకుందని దళిత సంఘాలు, కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. 

11:23 - February 16, 2018
11:22 - February 16, 2018
11:21 - February 16, 2018

ఢిల్లీ : దాదాపు పదేళ్లుగా సాగుతున్న కావేరీ నది జలాల వివాదంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెరదించింది. కావేరీ నది జలాలపై ఏ రాష్ట్రానికి సంపూర్ణ హక్కు లేదని పేర్కొంది. ఆయా రాష్ట్రాలకు నీటిని కేటాయించింది. తమిళనాడుకు 177 టీంఎసీల నీటిని ఇవ్వాలని కర్నాటక రాష్ట్రాన్ని సుప్రీం ఆదేశించింది. కర్నాటక రాష్ట్రానికి 184.75 టీంఎసీలు, బెంగళూరు తాగునీటి అవసరాలకు 4.5 టీఎంసీలు, కేరళ, పుదుచ్చేరిలకు యథాతథంగా కేటాయింపులుంటాయని తెలిపింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళనాడులో అసంతృప్తులు వ్యక్తమౌతున్నట్లు సమాచారం. కరవుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నీటిని అదనంగా కేటాయించాలని కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ మరింత తక్కువగా నీటిని కేటాయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు..ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కర్నాటక రాష్ట్రానికి ఇప్పుడిస్తున్న నీటికి అదనంగా కేటాయింపులు జరిపినట్లు, రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో తమకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

11:15 - February 16, 2018

చిత్తూరు : జిల్లాలోని పలమనేరులోని మొరంలో తీవ్ర విషాదం నెలకొంది. పాల్ట్రీ ఫాంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి ఏడుగురు మృత్యువాత పడడం కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే...మొరం ప్రాంతంలో కొన్ని ఏళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న కోళ్లఫారాన్ని పునరుద్ధరించేందుకు కొందరు నిర్ణయం తీసుకున్నారు. అక్కడున్న సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసేందుకు కొంతమందిని మాట్లాడుకున్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది మంది అక్కడకు వచ్చారు. క్లీన్ చేసేందుకు అందులోకి దిగగా ఒక్కసారిగా విషవాయువులు చిమ్మాయి. లోనికి దిగిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకన్న పైనున్న వారు లోనికి దిగారు. వారు కూడా ఊపిరిఆడక అక్కడికక్కడనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఒక్కరు మాత్రమే ఈ ఘటన నుండి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు రోదనతో ఆసుపత్రి ప్రాంతం మారుమోగుతోంది. ఘటనపై ప్రభుత్వం..అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

జీజీహెచ్ కు వెళ్లిన మంత్రి కామినేని...

గుంటూరు : జీజీహెచ్ ఆసుపత్రిలో మంత్రి కామినేని తనిఖీలు నిర్వహించారు. సెల్ ఫోన్ లైట్ లో ఆపరేషన్ పై ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సమయంలో 5 నిమిషాలు కరెంటు ఆగిపోయిందని, ఆ రోజు నాలుగు సార్లు కరెంటు పోవడం వల్లే అంతరాయం ఏర్పడిందన్నారు. ఐదు నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించారని, ఈ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. 

10:48 - February 16, 2018

హైదరాబాద్‌ : ఉప్పల్‌ చిలుకానగర్‌లో చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. మూఢనమ్మకాలే చిన్నారి హత్యకు కారణమని తేల్చారు. భార్య ఆరోగ్యం కోసం ఇంటి యజమాని రాజశేఖరే ఈ దారుణానికి పాల్పడ్డాడని నిర్దారించారు. అయితే ఈ నరబలికి బీజం పడింది మాత్రం రెండేళ్ల కిందటే అని విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడించారు పోలీసులు. రెండు వారాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. నిందితుని కాల్‌డేటా విశ్లేషణ, 40 మంది సాక్షుల విచారణ, వంద సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కేసు చిక్కుముడి విప్పారు. రెండేళ్ల క్రితమే రాజశేఖర్‌ నరబలికి ప్లాన్‌ వేసినట్లు విచారణలో తేల్చారు.

రెండేళ్ల కిందట మేడారం జాతరకు వెళ్లిన రాజశేఖర్‌, లత దంపతులు వెళ్లగా ఓ కోయదొర ఇచ్చిన సలహాతో ఈ దారుణానికి పాల్పడ్డట్టు నిందితులు ఒప్పుకున్నారు. అప్పటి నుండే బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా ప్రయత్నించగా ఈ క్రమంలోనే జనవరి 31న రాజశేఖర్‌ బోయిగూడ ఫుట్‌ పాత్‌ నుండి చిన్నారిని ఎత్తుకొచ్చాడు. రాజశేఖర్‌ ఒక పాతబస్తీలోని ఒక తాంత్రికునితో పూజ చేయించి, ప్రతాపసింగారం వద్ద చిన్నారిని హత్యచేసి మూసీ నదిలో శిశువు మొండెంను పడేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు పోలీసులు. అనంతరం శిశువు తలను డాబాపై ఉంచినట్లు తెలిపారు. డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా డాబాపై ఉంచిన తల ఆడ శిశువుదిగా నిర్థారణ అయిందని స్పష్టంచేశారు.

రాజశేఖర్‌కు మూఢవిశ్వాసాలు ఎక్కువగా ఉన్నందున క్షుద్రపూజలు చేస్తే భార్య లత ఆరోగ్యం నయమవుతుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీపీ తెలిపారు. అయితే అపహరించిన చిన్నారి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. శాస్త్ర సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నా ఇంకా ఇలాంటి క్షుద్రపూజలు, నరబలులు నమ్మి ఘాతుకాలకు పాల్పడడం బాధాకరమన్నారు. సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాజశేఖర్‌ దంపతులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అయితే నిందితులు కేసును తప్పుదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని... అందుకే కేసును చేధించడానికి చాలా సమయం పట్టిందన్నారు. కేసును ఇంకా విచారణ చేయాల్సి ఉందన్నారు సీపీ. 

10:47 - February 16, 2018

ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తొలిసారిగా అతిపెద్ద కుంభకోణం వెలుగు చూసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 11 వేల 3 వందల కోట్ల స్కాం జరిగింది. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి నీరవ్‌ మోది...మాల్యా దారిలోనే విదేశాలకు పారిపోయాడు. పిఎన్‌బి స్కాంపై సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. నీరవ్‌కు చెందిన కార్యాలయాలు, షోరూమ్‌లపై ఈడీ దాడులు జరిపింది. 5 వేల కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఇందులో వజ్రాలు, బంగారం, ఆభరణాలు ఉన్నాయి. పిఎన్‌బి స్కాంలో మోది ప్రభుత్వం ప్రమేయం ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ముంబై బ్రాంచ్‌లో 11వేల300 కోట్ల భారీ స్కాం వెలుగు చూసింది. ఈ స్కామ్‌లో ప్రధాన అనుమానితుడిగా ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పేరు తెరపైకి రావడంతో ఆయనపై విచారణ మొదలైంది. పిఎన్‌బి ఫిర్యాదు మేరకు సిబిఐ, సెబి, ఈడీ నీరవ్‌ మోదీపై దర్యాప్తు చేపట్టాయి. నీరవ్‌ మోదికి సంబంధించిన కార్యాలయాలు, షోరూమ్‌లు, వర్క్‌షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. ముంబై, ఢిల్లీ, సూరత్‌ తదితర 13 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. నీరవ్‌ మోది ఇంట్లో తనిఖీలు చేయకపోవడం చర్చనీయాంశమైంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 11 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టిన నీరవ్‌ మోదీ కూడా విజయ్‌ మాల్యా బాటలోనే విదేశాలకు పారిపోయాడు. ఈ మొత్తాన్ని విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీరవ్‌ మోది విదేశాలకు పారిపోయాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 280 కోట్ల మోసం జరిగినట్లు పిఎన్‌బి జనవరి 29న సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిబిఐ విచారణ జరుపుతుండగానే..15 రోజుల తర్వాత ఈ నెల 13న 11 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు పిఎన్‌బి సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకముందే నీరవ్‌ మోది విదేశాలకు జారుకోవడం గమనార్హం.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ముంబై బ్రాంచ్‌లో జరిగిన స్కాంను సిబిఐ, సెబికి అప్పగించినట్లు ఎండి సునీల్‌ మెహతా తెలిపారు. ఈ స్కాంలో కొంత మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని... మరికొంతమందిని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టడంపై విపక్షాలు మోది ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. నీరవ్‌ మోది దేశాన్ని ఎలా లూటీ చేశారో రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 'ప్రధాని మోదీని నీరవ్‌ కౌగిలించుకోవడం...ప్రధానితో దావోస్‌లోనూ నీరవ్‌ కనిపించడం...ఆ బిల్డప్‌తో రూ 12 వేల కోట్లు కొట్టేసి, మాల్యా తరహాలో విదేశాలకు చెక్కేయడం' అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదికి ఈ స్కాం గురించి ముందే తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్‌ విమర్శించింది.

పిఎన్‌బి స్కాంలో బీజేపీ ప్రమేయం ఉందని ఆప్‌ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వ జోక్యం లేకుండా నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాలు దేశం విడిచిపెట్టి వెళ్లారంటే నమ్మగలమా..? అంటూ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. నీరవ్‌ మోదీ జువెల్లరీస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఆయన కంపెనీకి నోటీసులు పంపింది. తనకు ప్రకటన డబ్బులు చెల్లించలేదని ఆ నోటీసుల్లో ఆరోపించింది. మరోవైపు డబ్బులు చెల్లించేందుకు తనకు 6 నెలల గడువు ఇవ్వాలని నీరవ్‌ మోది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు లేఖ రాసినట్లు సమాచారం. తన కంపెనీ 'ఫైర్‌ స్టార్‌ డైమండ్‌' 6 వేల 435 కోట్ల విలువ చేస్తుందని ఆ కంపెనీ ద్వారా డబ్బు చెల్లించనున్నట్లు బేరమాడుతున్నారు. 

10:40 - February 16, 2018

టాలీవుడ్ నేచురల్ స్టార్ గా పేరొందిన నటుడు 'నాని'. దర్శకులకు ఇతను ఓ వరంలా మారిపోయాడు. ఇతను నటించిన సినిమాలు వరుసుగా విజయవంతం అవుతూ వస్తున్నాయి. తాజాగా ఇతను నిర్మాతగా మారిపోయాడు. వాల్ పోస్టర్ అనే బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమా తీశాడు. వైవిధ్యమైన కథతో సినిమా తీయడం జరిగిందని 'నాని' పేర్కొనడంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 'నాని' నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అ!'లో నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు నేడు (ఫిబ్రవరి 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిత్ర ఫస్ట్ లుక్..టీజర్..ట్రైలర్ లు చిత్రంపై ఆసక్తిని పెంచాయి. చిత్ర టైటిల్ కూడా వైవిధ్యంగా ఉండడంతో..సినిమా కూడా అంతేస్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఊహిస్తున్నారు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రంపై మంచి టాక్ వినిపిస్తోందని తెలుస్తోంది. సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మాధ్యమాల్లో కామెంట్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ? మరింత విశేషాల కోసం టెన్ టివిలో సాయంత్రం ప్రసారమయ్యే 'టెన్ టివి ఫర్ ఫెక్ట్ షో'లో చూడండి. 

10:23 - February 16, 2018

సినీ ఇండస్ట్రీ అంటేనే లక్కుతో ముడిపడి ఉంటుంది. హార్డ్ వర్క్ టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటె ఈ ఇండస్ట్రీ లో అవకాశాలకు కొదువు ఉండదు. తన మొదటి సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ ని ఇప్పుడు స్టార్ హీరోలు పిలిచి మరి ఆఫర్స్ ఇస్తున్నారట. మారుతున్న ట్రెండ్ ని ఫాలో అవుతూ హిట్ ట్రాక్ లో ఉన్నాడు నాని. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాని ఈ మధ్య సినిమాలన్నీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. రీసెంట్ గా 'ఎంసి ఏ' అంటూ వరుస విజయాలతో దూసుకువెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. మంచి నటుడిగా గుర్తింపు ఉన్న సరే కమర్షియల్ గా ఒక మంచి హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో 'శర్వానంద్'. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో 'శర్వానంద్' కి 'మహానుభావుడు' సినిమా మరో హిట్ గా మారింది. రెగ్యులర్ సినిమాలకు బై బై చెప్పి ఎప్పుడైతే డిఫెరెంట్ సినిమాలను చెయ్యడానికి ఫిక్స్ అయ్యాడో అప్పటినుండి 'శర్వానంద' కి మంచి హిట్స్ పడుతున్నాయి.

ఇటీవల చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది 'ఛలో'. ఈ సినిమా డైరెక్టర్ వెంకీ. రీసెంట్ గా ఛలో సినిమాతో విజయం అందుకున్న వెంకీ కుడుముల కూడా ఇప్పుడు యంగ్ హీరోలకి డైరెక్టర్ గామారాడు. త్రివిక్రమ్ దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వెంకీ 'ఛలో' సినిమాలో మంచి ఎంటర్టైన్ ని అందించాడు. రీసెంట్ గా 'నాని - శర్వానంద్' 'ఛలో' సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారట. దీంతో సరికొత్త కథలు ఇంకేమైనా ఉంటే చూడు చేయడానికి సిద్ధమే అని ఇద్దరు హీరోలు ఓ సిగ్నల్ ఇచ్చారట. ఇది మేటర్....

10:22 - February 16, 2018

తన ఫామిలీ హీరోలకి కాకుండా తనను నిజంగా అభిమానించే నటుడికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ కూడా తన సపోర్ట్ ని అనౌన్స్ చేశాడు. లవర్ బాయ్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో 'నితిన్'. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవడంలో 'నితిన్' ముందు ఉంటాడు. 'లై' లాంటి సినిమాలతో పాటు ఫామిలీ స్టోరీస్ కూడా టచ్ చేసిన 'నితిన్' తన ప్రీవియస్ సినిమా 'లై' లో ఇంటరెస్టింగ్ రోల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ట్రై చేశాడు. 'లై' సినిమాలో 'నితిన్' నటనకు మంచి మార్కులే పడ్డాయి.

'నితిన్' ని లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ఫామిలీ హీరోగా నటించిన 'అ ఆ' సినిమాని కూడా హిట్ చేశారు. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' డైరెక్షన్ లో వచ్చిన 'అ ఆ' సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. 'నితిన్' స్వతహాగా 'పవన్ కళ్యాణ్' అభిమాని. పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు 'నితిన్' సినిమాకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రియల్ 5న విడుదలయ్యే ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ కృష్ణ చైతన్య. పవన్ కళ్యాణ్ తో పాటు నితిన్ తో 'అ ఆ' సినిమా తీసిన త్రివిక్రమ్ కూడా 'నితిన్' కి సపోర్ట్ ఇస్తున్నాడు.

ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 'మేఘా ఆకాశ్' క‌థానాయిక‌గా నటిస్తోంది. 'ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', 'శ్రేష్ట్ మూవీస్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, మూవీకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

వర్మకు సీసీఎస్ నోటీసులు...

హైదరాబాద్ : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నగర సీసీఎస్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం సీసీఎస్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. జీఎస్టీ వ్యవహారం, మహిళలను కించపరిచారన్న అభియోగాలపై వర్మను పోలీసులు విచారించనున్నారు. 

సబ్సిడీ గొర్రెలతో వెళుతున్న లారీకి...

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో మందలపల్లి సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. సబ్సిడీ గొర్రెలతో వెళుతున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు చనిపోగా మరికొన్ని గొర్రెలకు గాయలయ్యాయి. 

09:25 - February 16, 2018

అలిపిరి వద్ద పిస్టల్...

చిత్తూరు : తిరుమలలోని అలిపిరి తనిఖీల కేంద్రం వద్ద పిస్టోల్ లభించడం కలకలం రేగింది. కారులో ఒడిశాకు చెందిన వ్యక్తి నుండి లైసెన్స్ లేని పిస్టోల్, రెండు బుల్లెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

09:13 - February 16, 2018

హైదరాబాద్ : నగరంలోని దసపల్లా హోటల్ పై అందరి చూపు నెలకొంది. సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ తొలి సమావేశం ఆ హోటల్ లో జరుగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం నుండి ఏపీకి వచ్చిన నిధులు..ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై నిగ్గు తేల్చేందుకు 'పవన్' జేఎఫ్ సీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జేఎఫ్ సీలో లోక్ సత్తా నేత జయ ప్రకాష్ నారాయణ, రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ లున్నారు.

శుక్రవారం..శనివారం రోజుల్లో జరిగే సమేశాలకు హాజరు కావాలని పవన్ పలువురిని ఆహ్వనం పలికారు. కొణతాల రామకృష్ణ, వామపక్ష నేతలు మధు, రామకృష్ణలతో పాటు ఇతర విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు సమావేశంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్ కు పవన్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి పవన్ నివాళులర్పించి మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఈ సమావేశంలో పవన్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్..జేఎఫ్ సీకి ఓయూ విద్యార్థి సంఘం నేతలు మద్దతు పలికారు. 

08:32 - February 16, 2018

నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ ఎంపీలతో పాటు టీడీపీ లోక్‌సభ సభ్యులు కూడా రాజీనామాలకు ముందుకురావాలని వైసీపీ అధినేత జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే... హోదా ఎందుకురాదో చూద్దామని సవాల్‌ విసిరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాలలో జరిగిన వైసీపీ మహిళా సదస్సులో జగన్‌... టీడీపీ ఎంపీల రాజీనామాకు డిమాండ్‌ చేశారు.

 

08:27 - February 16, 2018
08:26 - February 16, 2018

ఖమ్మం : ఎస్సీ గురుకుల పాఠశాలలో చేరిపించండి...మంచి చదువు..నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ కొన్ని జిల్లాల్లో అలాంటి పరిస్థితి లేదని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఎస్సీ గురుకుల పాఠశాలలోని హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భద్రాచలం కొత్తగూడెం గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి విద్యార్థినిలు భోజనం చేశారు. అనంతరం ఒక్కసారిగా విద్యార్తినిలు కడుపునొప్పి..వాంతులతో బాధ పడుతున్నారు. దీనిని గుర్తించిన హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి భోజనంలో పప్పు..పెరుగు మాత్రమే వాడినట్లు, ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం లేదని హాస్టల్ వార్డెన్ పేర్కొంటున్నారు.

కొంతకాలంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలో ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, దీని కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీనిని హాస్టల్ యాజమాన్యం కొట్టిపారేస్తుంది. తాజా జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

08:18 - February 16, 2018

హైదరాబాద్ : కూతురు, కొడుకు, తల్లి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన అంబర్ పేటలో చోటు చేసుకుంది. కొడుకు సాకేత్, కూతురు అంజలితో తల్లి రాజేశ్వరీ గురువారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన కుటుంబసభ్యులకు ఫలితం కనించలేదు. దీనితో అంబర్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలింంచనున్నారు. కుటుంబ తగదాలున్నాయా ? ఆర్థిక విబేధాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

08:07 - February 16, 2018

ఏపీలో విభజన హామీల వేడి కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు..ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ తొలి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో కోటేశ్వరరావు (బిజెపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), లక్ష్మణరావు (సీపీఎం), అనురాధ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:02 - February 16, 2018

వేగవంతమైన అభివృద్ధి ఆకాశాన్ని ఏలుతున్న మన శాస్ర్త విజ్ఞానం... ఈ పరిస్థితుల్లోనూ.. మూఢత్వం మనిషి మెదడును వదలడం లేదు. ఎవరో చెప్పిన మాటలు విని... మంచి జరుగుతుందని, పసిపాపని నరబలి ఇచ్చిన సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. ఆధునిక సమాజంలోనూ.. ఇంకా ఈ మూఢ విశ్వాసాలు ఎందుకున్నాయి... ఇవి మన సమాజాన్ని, మన మెదళ్ళను వదలి వెళ్ళాలంటే... ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో 'జన విజ్ఞాన' వేదిక జాతీయ నాయకులు రమేష్‌ విశ్లేషించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:00 - February 16, 2018

సౌతాఫ్రికాలో చరిత్ర సృష్టించిన విరాట్‌ కొహ్లీ అండ్‌ కో 6 వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించాలని తహతహలాడుతోంది. సిరీస్‌ ఆధ్యంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆతిధ్య దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ ....6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే 4-1తో సొంతం చేసుకుంది.ఆఖరి వన్డేలో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది.

సిరీస్‌ ఆధ్యంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆతిధ్య దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ ....6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే 4-1తో సొంతం చేసుకుంది. రోహిత్‌ శర్మ ,శిఖర్ ధావన్‌,విరాట్‌ కొహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సైతం రాణిస్తే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. స్పిన్‌ ట్విన్స్‌ యజ్వేంద్ర చహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఎంతలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రస్తుత సిరీస్‌లో ఇద్దరూ కలిసి 30 వికెట్లు తీసి భారత్‌ సిరీస్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత సిరీస్‌లో కొహ్లీ అండ్‌ కో జోరు చూస్తుంటే...ఆఖరి వన్డేలోనూ ఆతిధ్య దక్షిణాఫ్రికా జట్టుకు అవకాశమిచ్చేలా లేదు. 

06:59 - February 16, 2018

అమెరికా : మరోమారు ఉలిక్కిపడింది. చిన్నారులు కేరింతలు వినపడాల్సిన స్కూల్‌... బుల్లెట్ శబ్ధాలతో అవాక్కైంది. పాఠశాల నుంచి సస్పెండ్ చేశారన్న అక్కసులో... ఓ 19 ఏళ్ల ఉన్నాది మారణహోమానికి.. 17 మంది చనిపోగా... 14 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మారణహోమంతో... అమెరికాలో మరోసారి గన్‌ కల్చర్‌ అకృత్యాలపై చర్చ మొదలైంది.

కాల్పులకు పాల్పడ్డ నిందితుడు అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి పందొమ్మిదేళ్ల నికోలస్‌ క్రూజ్‌గా పోలీసులు గుర్తించారు. నికోలస్‌ను కొద్ది రోజుల క్రితం యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. తనను సస్పెండ్‌ చేశారన్న కోపంతోనే ఈ దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. కోపంతో గన్‌తో... పాఠశాలలోకి ప్రవేశించిన నికోలస్ ముందుగా తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురినీ కాల్చేశాడు. అనంతరం పాఠశాలలోని ఫైర్‌ అలారం మోగించాడు. ఏదో జరుగుతోందని అందరూ విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో.. నికోలస్‌ వారిపై అత్యంత కిరాతకంగా చెలరేగిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి చిన్నారులు భయంతో పరుగులు తీశారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగుడు స్కూల్‌ బిల్డింగ్‌లో దాక్కున్నాడు. అనంతరం వారిపై కూడా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎదురు కాల్పులకు దిగిన పోలీసులు నికోలస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు నికోలస్‌కు ముందు నుంచే తుపాకులంటే ప్రాణం. తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లలో గన్‌లతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసేవాడు. బల్లి, కప్ప లాంటి జీవును హింసించి చంపి.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంచేవాడు. స్కూల్‌లో కూడా తోటి విద్యార్థులను కాల్చేస్తానని బెదిరించవాడని... ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవపడేవాడని సహచరులు తెలిపారు. పార్క్‌ల్యాండ్‌ స్కూల్‌లో జరిగిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో పెరిగిపోతున్న గన్‌ కల్చర్‌ ఇంకా ఎందరి ప్రాణాలు పొట్టన పెట్టుకుంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

06:38 - February 16, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో రైతు సమస్య రాజకీయ రంగు పులుముకుంటోందా... ఎర్రజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోదని... 4500 రూపాయలు ప్రకటించే వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.... మరో వైపు మద్దతు ధర ప్రకటన ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయమని... దీనిపై కాంగ్రెస్‌ అనవసర రాద్దాంతం చేస్తోందని టీఆర్ఎస్‌ విమర్శిస్తోంది. అంతేకాదు.. మద్దతు ధరపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ... ఆర్మూర్‌లో ఆర్‌ఎస్‌ నేతలు టపాసులు పేల్చి.. స్వీట్లు కూడా పంచుకున్నారు.

ఎర్రజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన 2300 రూపాయల మద్దతు ధరను అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. ఎర్రజొన్నకు కనీసం 4 వేల నుంచి 4500 రూపాయలు , పసుపు పంటకు 15వేల రూపాయల మద్దతు ధర ప్రకటించే వరకూ దీక్షలు విరమించే ప్రసక్తే లేదంటున్నారు. తమ డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రకటన రాకుంటే... ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితమే ఎర్రజొన్న కొనుగోలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎంపీ కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అనవసరంగా దీనిపై రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. గతంలో కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపిందన్నారు. ఎర్రజొన్నలు ఆఖరి బస్తా వరకూ మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు చేస్తామన్న ఎంపీ కవిత.... మద్దతు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఎర్రజొన్న కొనుగోళ్ళ విషయాన్ని ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్ళామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి... సోమవారం నుంచి కొనుగోళ్ళు ప్రారంభించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. క్వింటాలుకు 2300 రూపాయలు చెల్లించి ఎర్రజొన్న కొనుగోళ్ళు చేస్తామన్నారు. గతంలోని బకాయిలు 12కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మరోవైపు ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న మద్దతు ధరను ప్రకటించడం చారిత్రక నిర్ణయమని టీఆర్ఎస్ నేత లింగారెడ్డి అంటున్నారు. రైతులు తమ సమస్యను పరిష్కరించేవరకూ తీవ్రంగా ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తుంటే... దీన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు రాజకీయపార్టీలు పోటీ పడుతున్నాయి... ఇంతకీ ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

06:35 - February 16, 2018

హైదరాబాద్ : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం.. కేంద్రమంత్రిని కలిసి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నిధులివ్వలేదన్న కేసీఆర్‌... రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థలం, మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్‌ ఇవాళ మరికొంత మంది కేంద్రమంత్రులను కలవనున్నారు.

విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేసీఆర్‌ అరుణ్‌జైట్లీని కోరారు. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని తొమ్మిది పాత జిల్లాలను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించినందుకు జైట్లీకి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 2014 నుండి 2017 వరకు రాష్ట్రానికి రావాల్సిన 1350 కోట్లు విడుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 2017-18 నిధులను కూడా విడుదల చేయాలని కోరారు.

ఇక గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎయిమ్స్‌, ఐఐఎమ్‌లు మంజూరు చేయాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్‌ మంజూరు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన ప్థలం ఇవ్వడంతో పాటు... మిగిలిన మౌలిక వసతులు కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇవాళ కూడా ఢిల్లీలో ఉండనున్న కేసీఆర్‌ పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

06:35 - February 16, 2018

హైదరాబాద్ : నీటి వాడకంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించబోమంటోంది తెలంగాణ సర్కార్‌. ఢిల్లీలో జలవనరుల శాఖ సమావేశంలో... తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను తేల్చిన తర్వాతే కృష్ణా, గోదావరి బోర్డుల గురించి నిర్ణయించాలని స్పష్టం చేసింది. నాలుగేళ్లయినా తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది... వచ్చే భేటీలో అన్నీ అంశాలు చర్చిద్దామని సమావేశాన్ని ముగించింది జల వనరులశాఖ.

60 ఏళ్లుగా నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఒక ఏ మాత్రం సహించేది లేదని తెలంగాణ సర్కార్‌ స్పష్టం చేసింది. ఢిల్లీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కృష్ణాలో ఆంధ్రప్రదేశ్‌ 512, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకునేందుకు గాను ఒక ఏడాది కోసం వర్కింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ జరిగాయని టీఎస్‌ సీఎస్‌ తెలిపారు. కానీ, నాలుగేళ్లయినా నీటి కేటాయింపులు జరగడం లేదన్నారు. తెలంగాణకు న్యాయం దక్కాల్సిన వాటాను తేల్చిన తర్వాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని పట్టుబట్టింది. ఈ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది.

సాగునీటిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికైనా యుద్దప్రాతిపదికన సరిదిద్దాలని తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ జోషి కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లు ప్రస్తావనకు వచ్చినప్పుడు... రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పాతవేనని... ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను జోషి స్పష్టం చేశారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే అపెక్స్‌ బాడీ ఆమోదం అవసరమన్నారు. ఈ విషయంలో ఏపీ వితండవాదం చేస్తుందన్నారు. మరోవైపు కేఆర్‌ఎంబి, జీఆర్‌ఎంబీల అనుమతి లేకుండానే ఏపీ ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తుందని జోషి ఆరోపించారు. పట్టిసీమకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. పట్టిసీమలో రాష్ట్రానికి 45 టీఎంసీలు రావాలన్నారు. పోలవరంలో తెలంగాణకు 45 టీఎంసీలు కేటాయించాలని బజాజ్‌ కమిటీ చేసిన సూచనలను ఏపీ సర్కార్‌ పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఏఐబీపీ కింద తెలంగాణలో ఎంపిక చేసిన 11 ప్రాజెక్టులలో రెండు ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు హరీష్‌రావు. సమావేశానంతరం మాట్లాడిన హరీష్‌రావు.. ఈ ఏడాది జూన్‌ వరకు మరో ఆరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. మిగిలిన మూడు ప్రాజెక్టులను 2019 మార్చి వరకు పూర్తి చేస్తామన్నారు.ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలంటే కేంద్రం నాబార్డు నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి హర్షవర్దన్‌ను హరీష్‌రావు కలిశారు. పాలమూరు ఎత్తిపోతలకు తొలిదశ అవీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగించారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి వివాదాలపై ఒక అవగాహనకు రావాలని.. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సమావేశం ముగించారు. 

మహిళా క్రికెట్ - సౌతాఫ్రికాతో భారత్ ఢీ...

ఈస్ట్ లండన్ : ధనాధన్ క్రికెట్ లో భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే రెండో టీ 20లో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో కౌర్ బృందం 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. 

17 నుండి 27 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు...

యాదాద్రి : ఈనెల 17 నుండి 27 వరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ సునీతా రెడ్డి అధికారులను ఆదేశించారు. 

నేడు మధ్యాహ్నం టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్ష....

హైదరాబాద్ : శుక్రవారం ఉదయం జరగాల్సిన పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షను మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. 

విభజన సమస్యలపై 21న సమావేశం...

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారంపై 21న సమావేశం జరుగనుంది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని హోం శాఖ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం...

పనాజి : గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఫుడ్ పాయిజనింగ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. 

 

జైట్లీని కలిసిన సీఎం కేసీఆర్...

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం రాత్రి కలిశారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్, ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి జైట్లీని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని...రైతులకు సాగు నిమిత్తం ఎకరాకు రూ. 4 వేలు ఇస్తున్నామని, ఇందుకోసం బ్యాంకుల్లో నగదును అందుబాటులో ఉంచాలని జైట్లీకి కేసీఆర్ కోరారు. 

జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. దసపల్లా హోటల్ లో మధ్యాహ్నం 1గంటకు జరిగే ఈ సమావేశంలో రాజకీయ వేత్తలు, న్యాయకోవిదులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక నిపుణులతో పాటు అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. 

Don't Miss