Activities calendar

17 February 2018

22:22 - February 17, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ బస్సుయాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 26 నుంచి చేవెళ్ల నుంచి బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చి 11 వరకు మొదటి విడత బస్సుయాత్ర కొనసాగనుంది. హోళీ కారణంగా మార్చి 1 నుంచి 3 వరకు బస్సుయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అలాగే ఏప్రిల్‌ 1 నుంచి మే 15 వరకు రెండో విడత బస్సుయాత్ర కొనసాగనుంది. అదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి  రేవంత్‌రెడ్డి, పొన్నం, భట్టి విక్రమార్కల పాదయాత్రలు కొనసాగనున్నాయి. మే 31 వరకు పాదయాత్రలు కొనసాగనున్నాయి. అదే సమయంలో వీహెచ్‌ రథయాత్ర కూడా కొనసాగనుంది. ఇక జూన్‌ 1న హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. 

22:20 - February 17, 2018

మహబూబ్ నగర్ : కాంగ్రెస్‌ నేతలకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు కట్టకుండా వేసిన కేసులను వెనక్కి తీసుకొని... ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి హరీష్‌రావు. నారాయణపేటలో సాగునీటి సాధన సభలో పాల్గొన్న హరీష్‌రావు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేస్తామన్నారు హరీష్‌రావు. 

 

22:16 - February 17, 2018

హైదరాబాద్ : 'నా ఇష్టం వచ్చినట్లు చేస్తా... నా ఇష్టమొచ్చిన సినిమాలు తీస్తా.. అడిగారంటే అడ్డంగా తిడుతా.. ఎవరైనా డోంట్‌ కేర్‌'.. ఇది వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తీరు. కానీ.. సీన్‌ రివర్స్‌ అయ్యింది. మహిళల ఆగ్రహానికి గురైన వర్మ తొలిసారి పోలీసుల విచారణకు హాజరయ్యాడు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే కొన్ని సాంకేతిక అంశాలపై సమయం కావాలని కోరడంతో.. సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులిచ్చి వచ్చే శుక్రవారం హాజరు కావాలని సూచించారు పోలీసులు. 

రామ్‌గోపాల్‌ వర్మ. ఎన్నో సంచలనాలకు మారు పేరు.. అనేక వివాదాలకు కేంద్ర బిందువు... ఇలాంటి రామ్‌గోపాల్‌వర్మ.. తన సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చిత్రకరించడమే కాకుండా... అడిగిన వారిపై అసభ్యకర కామెంట్లు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సామాజిక కార్యకర్త దేవి హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రామ్‌గోపాల్‌వర్మను స్టేషన్‌కు పిలిపించి విచారించారు.  

పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు, రామ్‌గోపాల్‌వర్మ మధ్యాహ్నం 12 గంటలకు సీసీఎస్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. జీఎస్ టీ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన అనేక అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించారు. దాదాపు వర్మను 25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే... కొన్ని టెక్నికల్‌ ప్రశ్నలకు వర్మ సమయం కోరడంతో... వచ్చే శుక్రవారం విచారణకు రావాలని 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులిచ్చారు. 

ఇక వర్మ విచారణలో ప్రధానంగా జీఎస్టీ సినిమాకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు పోలీసులు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?, విదేశాల్లో తీసినంతమాత్రాన భారతీయ చట్టాలకు ఈ సినిమా వర్తించదని ఎలా చెబుతారు?, ఐటీ చట్టం ప్రకారం మహిళలను అభ్యంతరకరంగా చూపడం నేరం కాదా?, జీఎస్టీని ఎంతకు అమ్మారు?, మాల్కోవాతో అభ్యంతర సన్నివేశాలు ఎలా తీశారు? అంటూ రకరకాల ప్రశ్నలను పోలీసులు సంధించినట్లు తెలుస్తోంది. అయితే... కాన్సెప్ట్‌ మాత్రమే తనదని... సినిమాను తాను రిలీజ్‌ చేయలేదని...  డైరెక్షన్‌ చేయలేదని విచారణలో చెప్పినట్లు అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు. పోలాండ్‌, యూకేలో సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారన్నారు. సినిమాకు సంబంధించిన విషయాలతో ఉన్న ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసి... ఎఫ్‌సీఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఓ చానల్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌లో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యనించడంపై.. ఉద్రేకంలో మాట్లాడినట్లు వర్మ సమాధానమిచ్చినట్లు పోలీసు వర్గాల సమాచారం.

ఇదిలావుంటే వచ్చే వారం విచారణ ఎలా సాగబోతోందన్న విషయంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. వర్మను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. మరి వర్మ విచారణ నెంబర్‌ టూ ఎలా సాగనుందో తేలాలంటే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే. 

 

22:12 - February 17, 2018

చిత్తూరు : ఏపీ విభజన సమస్యలపై తిరుపతిలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మాజీమంత్రి జైరాం రమేష్‌ హాజరయ్యారు. విభజన చట్టంలో ఏ ఒక్క అంశం కూడా అమలుకు నోచుకోలేదన్నారు జైరాం రమేష్‌. హక్కులను సాధించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణమంతా కేంద్ర బాధ్యత అని విభజన చట్టంలో పెట్టగా... కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర బాధ్యతగా మార్చారన్నారు. 

22:09 - February 17, 2018

గుంటూరు : కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నోరువిప్పారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తే.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం  కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఐదుకోట్ల ఏపీ ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా కాకాని, కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. విభజనవల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరగాలన్న ఆలోచనతోనే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని.. ప్రజలకు  మేలు జరగాలనే కేంద్ర ప్రభుత్వంలో చేరామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  స్పష్టంచేశారు. కాని.. నాలుగేళ్లు కావస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో సహాయం లభించలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  మిత్రుత్వం కారణంగా మొన్నటి బడ్జెట్‌ వరకు రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఆశించామన్నారు. కాని బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపించారని.. అందుకే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు.  కాంగ్రెస్‌పార్టీ ఇష్టవచ్చినట్టు రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందన్నారు. బడ్జెట్‌లో కేంద్రం పూర్తి సహకారం ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. 

మరోవైపు రాష్ట్రంలో విపక్షపార్టీల తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రాజకీయ లబ్దికోసం విపక్షాలు ఆరాటపడుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉండికూడా పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తే.. విపక్షపార్టీ మాత్రం రాజకీయ లబ్దికోసమే ప్రయత్నిస్తోందన్నారు. ఇటు జనసేన అధినేత ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్‌ఫైండింగ్‌ కమిటీపై కూడా చంద్రబాబు పరోక్షంగా విమర్శాత్మక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం - రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ లెక్కలను బయటికి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉండదన్నారు. నిధుల పంపిణీ, ఖర్చుల వివరాలన్నీ పార్లమెంటు, అసెంబ్లీలోనే ప్రకటిస్తామన్నారు. అంతేగాని కొందరు వ్యక్తులు, పార్టీలు నిధుల లెక్కలు అడగడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యనించారు. 

మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత తక్కువ తలసరి ఆదాయంతో ఏపీ సతమతం అవుతోందన్న చంద్రబాబు.. తాను అధికారం చేపట్టిన తర్వాత .. నిధుల కొరత ఉన్నా.. పలు రంగాల్లో అభివృద్ధి సాధిన్నామని తెలిపారు. గుంటూరుజిల్లా కాకానిలో జేఎన్‌టీయూ భవనాలకు శంకుస్థాపన చేసిన సీఎం.. విద్యార్థులు ఏం చదువుకున్నా.. వారి చదువుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో మెరుగులు దిద్దుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసినట్టే.. నవ్యాంధ్రనూ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. 

మొత్తానికి  కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ గత కొద్ది రోజులుగా విపక్షాలు చేస్తున్న ఆందోళనపై చంద్రబాబు గళం విప్పారు. అన్యాయంపై అటు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే.. విపక్షాల తీరును తప్పుపట్టారు. ఇప్పటికైనా  విపక్షపార్టీలు రాజకీయ విమర్శలు మానుకుని రాష్ట్ర విశాల ప్రయోజనం కోసం ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటంలో కలిసిరావాలని చంద్రబాబు విపక్షపార్టీలకు పిలుపునిచ్చారు. 

 

22:05 - February 17, 2018

హైదరాబాద్ : జనసేన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ కీలక డిమాండ్‌ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామంటూ ప్రకటిస్తున్న అధికార, విపక్ష పార్టీలు .. ముందుగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.  పార్లమెంటులో అవిశ్వాసం  కోరితే పార్టీల అసలు రంగు బయటపడుతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని, ఎంపీలు సరిగా పనిచేయకపోవడంతోనే ప్రత్యేక హోదా రాలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఎవరి వ్యక్తిగత సమస్య కాదని ఆయన అన్నారు. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు.  విభజన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన   నిజనిర్ధారణ కమిటీ  హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన మేధోమథన సమావేశం ముగిసింది.

హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ సమవేశం అనంతరం పవన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలపాటు తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపని పాలకులు చివరికి రాష్ట్ర విభజనను ఇష్టానుసారం చేశారన్నారు. అలాగే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రం నాన్చుడు ధోరణితో సమస్య మరింత జఠిలం అవుతోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఎంపీలు కేంద్రాన్ని నిలదీయండంలో మెతకవైఖరినే అవలంబించారు.. ఇపుడుకూడా అదే తీరుతో ఏపీకి తీరన నష్టం చేస్తున్నారని  పవన్‌ అన్నారు. అపుడు యూపీఏ హయాంలోనూ , ఇపుడు ఎన్డీయే ప్రభుత్వంలోనూ ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు  ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే కచ్చితమైన ఆలోచనా విధానంతోనే జనసేన వెళ్తుతోందన్నారు.  అందుకు ఈ జేఎఫ్‌సీ ఏర్పాటు మొదటి మెట్టు  అన్నారు పవన్‌ కల్యాణ్‌. 

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే.. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు పవన్‌. పవన్‌ వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సమర్ధించారు. విభజన హామీల అమలుకు... ఎంపీల రాజీనామాల‌ కంటే .. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం మంచిందని ఉండవల్లి అన్నారు. తమ డిమాండ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని పడేయాలని కాదని,  ఆంధ్రప్రదేశ్‌ సమస్యను దేశానికి తెలిసేందుకే అని అభిప్రాయపడ్డారు. సభలో యాభై మంది సభ్యుల బలముంటే అవిశ్వాసం పెట్టొచ్చన్న ఉండవల్లి.. ఆంధ్ర సభ్యులు అవిశ్వాసం పెడితే 42మంది ఎంపీలున్న కాంగ్రెస్ కూడా  మద్దతిచ్చే అవకాశం ఉందన్నారు. 

మరోవైపు జనసేన కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.  కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఇతర వివరాలతో కూడిన 118 పేజీల నివేదికను జేఎఫ్‌సీకి పంపంచింది. అధికారిక మెసెంజర్‌లో ఈ వివరాలను ఉంచినట్టు ప్రబుత్వం తెలిపింది. అయితే మొదట చెప్పిన విధంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులతో వివరాలు అందిస్తామన్న ప్రభుత్వం.. ఆ పని చేయకుండానే వివరాలను పంపించింది. మొత్తానికి   కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చిన జనసేన కొత్త చర్చకు తెరలేపింది. ఈ డిమాండ్‌పై టీడీపీ, వైసీపీలు ఎలా స్పందిస్తాయన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. 

21:53 - February 17, 2018

ఎంపీ బుట్టా రేణుకతో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను వైఎస్సార్ నుంచి గెలిచానని తెలిపారు. ఇప్పుడు కూడా తాను వైఎస్సార్ ఎంపీనని అని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ మంత్రి దగ్గరకు వెళ్లినా పార్టీ మారుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయని తెలిపారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:47 - February 17, 2018

ఈ కేకుల కటింగులు.. శంకుస్థాపనల సంగతేమోగని.. పాణాలు వోతుండే పబ్లీకుయి.. పొయ్యిపొయ్యి జోగురామన్న గూసున్న వేదిక టెంటుకే మంటలంటుకున్నయ్.. మంత్రిగారాయే.. కింద మందుండే.. మరి టపాకులు గాల్చిండ్రా.? ఏమైంది తెల్వదిగని.. మొత్తం మీద ఒక కుల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఆగమాగమైంది జర్ర శేపట్ల..

తలాపునే పారుతుంది గోదారి.. మనశేను.. మన చెలుక ఎడారి..? తెలంగాణ రైతు బత్కు అమాస.. చంద్రయ్య జేస్తున్నడు తమాష.. పాటలు ఇప్పుడు ఇట్ల వాడుకోవల్సొస్తదేమో అనిపిస్తున్నది.. కుద్దు మంత్రి కల్వకుంట్ల తారక రామారావుగారు దత్తత వట్టిన ఊర్లెనే మూడు నెళ్ల సంది తాగెనీళ్లు లేవంటే..? ఇది పారిపాలననేనా..? ప్రజల పాలనేనా సూడుండ్రి..

విదేశాల పొంట తిర్గి ఎంజాయ్ జేసుడుగాదు.. కల్వకుంట్ల తారక రామారావుగారూ.. నీకు ధమ్ము ధైర్యం ఉంటే.. ఒక్కసారి గల్ఫ్ కంట్రీలకు వొయ్యి.. ఆడున్న తెలంగాణ బిడ్డల నడ్మ నిలవడి సూడు అంటున్నరు కొంతమంది.. వేలమంది తెలంగాణ బిడ్డలు గల్ప్ దేశం బొయ్యి మోసపోతుంటే.. నువ్వు దావోసులు.. సింగపూర్లు లండన్లు తిర్గుకుంట.. ఏం కమాయి జేస్తున్నవయ్యా అనేది వాళ్ల మాట..

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. ఇగో ఇప్పుడు నేను జూపెట్టవోవే సావు.. మీ ఖాతల జమగావాల్సిన సావే.. మంచిగ పేదోళ్లకు ఎప్పటి లెక్కనే కంట్రోలు బియ్యం ఇయ్యక కథల వడ్తివి.. పాపం నీ ఏలిముద్రల సిగ్నల్ కోసం ఇల్లెక్కితె.. జారిపడి సచ్చిపోయింది ముసలామే.. ఈ పాపం మీరు జేశిందే అనేది జనం మాట..

మల్కాజ్ గిరి మల్లా రెడ్డి మళ్ల ఏశిండుగదా..? భారతదేశంలనే పెద్దనియోజకవర్గం మల్కాజ్ గిరి.. దానికి ఎంపీని నేను.. మల్లారెడ్డి.. మల్లారెడ్డి.. కని మల్లారెడ్డితోని ఏం పనిగాకున్నా.. మాటలైతె మంచిగుంటయయ్యా.. ఎన్కట డ్రామాలాడుతుంటే.. నడ్మిట్ల బుడ్డరఖాన్ తీర్గ ఒక్కడొస్తడు సూడుండ్రి.. అగో ఆ తరీఖల వచ్చి నవ్విస్తాఉంటడు.. మరి ఇయ్యాళ ఏం జేశిండో సూడుండ్రి..

నిత్య నిరసన వాది.. శ్రీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు.. ఇయ్యాళ ఇంకో వెరైటీ నిరసన వెట్టిండు.. ఏ వేదిక కాడికెళ్లైతె మోడీ ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు గురిపిచ్చిండో.. అదే వేదిక కాడికి వొయ్యి రెండు చెవ్వులళ్ల తామర పువ్వులు వెట్టుకోని నిరసన జెప్పిండు.. మీరు జూడుండ్రి శివప్రాసాద్ గట్టినట్టు ఏశాలు.. ఏ అగ్రవర్ణ ఎంపీలు గట్టరు.. ఆడరు.. ఎందుకంటె వాళ్లకు ఆత్మగౌరవం అడ్డొస్తది గదా..? మనకు ఆ సోయి ఉండదిగదా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు.. దేవాదుల పైపులైన్లు బర్తుడే గిప్టు ఇచ్చినయ్..  యాభై మీటర్ల మీదికెళ్లి నీళ్లు జిత్తి దీవెనార్తి వెడ్తున్నయ్.. సల్లగ బత్కు సారూ.. వెయ్యేండ్లు ఉండాలే మీ అసొంటి ముఖ్యమంత్రి.. అని.. అగో పైపులు దీవెనార్తి వెట్టుడేందనుకుంటున్నరా..? వాజీవే గవ్వెట్ల దీవెనార్తి వెడ్తయ్.. మల్లన్న కథలు గాకపోతె..?

ఎవ్వలయ్యా అన్నది మోడీ ఏం పనిజేస్తలేడు ఏమైనా బైటిదేశాల పొంట బైరాగి తిర్గినట్టు తిర్గుతడు అని..? చల్ ఇదంత తప్పు.. మోడీగారి పనితనం జనానికి తెలుస్తలేదు.. ముఖ్యంగ ప్రతిపక్ష పార్టీలు ఆయనను జూస్తె కంట్లె వెట్టుకుంటున్నరుగని.. ఈదేశానికి ఈ మూడున్నరేండ్ల కాలంల మోడీ జేశ్న గొప్పపనులు ఏంటియో నేను జూపెడ్త సూడుండ్రి.. 

చెడపకురా చెడేవు అన్న ముచ్చట్లకు రాంగోపాల్ వర్మ ముచ్చట సరిగ్గ సరిపోయెతట్టున్నది.. జీఎస్టీ అని ఒక వీడ్యో యూట్యూబ్ల వెట్టెగదా... ఆ పంచాది ముదిరి ముదిరి.. రాంగోపాల్ వర్మ తాత లెక్క తయ్యారైంది... నోరున్నదిగదా అని ఎట్లవడ్తె అట్లనే మాట్లాడిన మన్షిని.. చట్టం విల్చుకొచ్చింది.. ఇయ్యాళ పోలీసోళ్ల ముంగట హాజిరేశిండు..

కాంగ్రెస్ బస్సుయాత్ర ముహూర్తం ఖరారు

హైదరాబాద్ : కాంగ్రెస్ బస్సుయాత్ర ముహూర్తం ఖరారు అయింది. 26 మధ్యాహ్నం ఒంటి గంటకు చేవెళ్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈనెల 26 నుంచి మార్చి 11 వరకు తొలి విడత బస్సుయాత్ర జరుగనుంది. 

 

బేగంపేట ఏసీపీ రంగారావుపై బదిలి వేటు

హైదరాబాద్ : బేగంపేట ఏసీపీ రంగారావుపై బదిలి వేటు పడింది. రంగారావును బదిలీ చేస్తూ సీపీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మహిళా నిందితురాలిపై చేయి చేసుకున్న ఘటనలో రంగారావుపై చర్యలు తీసుకున్నారు. ఆర్మ్ డ్ హెడ్ క్వార్టర్స్ కు రంగారావు అటాచ్ చేశారు.   

21:19 - February 17, 2018

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. మొదటిరోజు విచారణ ముగిసింది. మళ్లీ వర్మను విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సురేష్, ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి మాట్లాడారు. సురేష్ మాట్లాడుతూ వర్మ డిఫెన్స్ లో పడ్డారని తెలిపారు. వర్మ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోందన్నారు. 'వేరే వాళ్లను పెట్టి పోర్న్ సినిమా తీసే బదులు.. నువ్వే పోర్న్ సినిమా తియ్యి' అని వర్మను ఉద్ధేంచి సురేష్ మాట్లాడారు. దేవి మాట్లాడుతూ కావాలనే వర్మ అలా అన్నాడని అన్నారు. పద్మావతి సినిమాపై నిరసన తెలిపే వారు....ఈ సమస్యపై ఎందుకు మాట్లాడడం లేదని.. వారికి నోళ్లు పడిపోయాయా అని ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:47 - February 17, 2018

ప్రకాశం : పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌ వలేటివారి పాలెం మండలం పొలినేనిపాలెంకు చేరుకున్నారు. దీంతో అక్కడి పొగాకు రైతులు జగన్‌ను కలిశారు. ఎకరాకు 70 వేలకు మించి ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతు కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉద్యమాలు తప్పవన్నారు జగన్‌. ప్రభుత్వం దిగివచ్చేవరకు పొగాకు గోడౌన్ల వద్ద రైతులు ధర్నాలు చేయాలని జగన్‌ సూచించారు. 

 

బోటులో అగ్నిప్రమాదం...

విశాఖ : ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ బోటు పూర్తిగా దగ్ధం అయింది. బోటులోపల వెల్డింగ్‌ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడి.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగినట్టు మత్స్యకారులు తెలిపారు. దాదాపు రూ. 35 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందంటున్న మత్సకారులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. బోటు కాలిపోవడంతో తాము జీవనాధారం కోల్పోయాయమని , ప్రభుత్వమే ఆదుకోవాలని 15 మత్సకార కుటుంబాలు కోరుతున్నాయి. 

20:26 - February 17, 2018

విశాఖ : ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ బోటు పూర్తిగా దగ్ధం అయింది. బోటులోపల వెల్డింగ్‌ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడి.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగినట్టు మత్స్యకారులు తెలిపారు. దాదాపు రూ. 35 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందంటున్న మత్సకారులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు.  బోటు కాలిపోవడంతో తాము జీవనాధారం కోల్పోయాయమని , ప్రభుత్వమే ఆదుకోవాలని 15 మత్సకార కుటుంబాలు కోరుతున్నాయి. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:21 - February 17, 2018

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జేఎఫ్‌సీ.. సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎంపీల రాజీనామాల కన్నా.. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మంచిదని సూచించింది. దీనివల్ల.. కేంద్రప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏమాత్రం లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షను జాతీయస్థాయిలో.. పార్లమెంటు వేదికగా వినిపించే అవకాశం ఉంటుందని జేఎఫ్‌సీ అభిప్రాయపడుతోంది. ఇవాళ రెండోరోజు.. జెఎఫ్‌సీ భేటీ ముగిశాక.. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. యాభై మంది సభ్యుల బలముంటే అవిశ్వాసం పెట్టొచ్చన్న ఉండవల్లి.. ఆంధ్ర సభ్యులు అవిశ్వాసం పెడితే 42మంది ఎంపీలున్న కాంగ్రెస్ కూడా  మద్దతిస్తుందన్నారు. ఇతర పార్టీలను కూడా వ్యక్తిగతంగా మద్దతు కోరి.. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవచ్చని సూచించారు. ఈ ప్రతిపాదనను ఆచరణలో పెట్టేందుకు, అన్ని పార్టీలూ కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

హేతుబద్దత లేని విభజన : సీఎం చంద్రబాబు

గుంటూరు : హేతుబద్దత లేని విభజన జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆస్తులు వారికి అప్పులు మనకు ఇచ్చారని తెలిపారు. విభజన చట్టంలో నామమాత్రంగా కొన్ని పెట్టారని చెప్పారు.

18:36 - February 17, 2018

హైదరాబాద్ : రాంగోపాల్‌వర్మను సీసీఎస్ పోలీసులు మూడున్నర గంటలపాటు విచారించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ నమోదైన కేసులో వర్మను పోలీసులు సీసీఎస్‌కు పిలిపించారు. ఈ విచారణలో దాదాపు 25 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్త దేవిలపై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన కావని..ఆవేశంలోనే మాట్లాడానని వర్మ తెలిపినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:29 - February 17, 2018

హైదరాబాద్ : ఈ నెల 19 నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఎర్రజొన్న కొనుగోలు విధివిధానాలపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు అయ్యిందని మంత్రి తెలిపారు. క్విటాల్ ఎర్రజొన్నకు 2వేల 300 రూపాయల మద్దతు ధర ఇస్తామన్నారు. తొలి దశలో నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మర్‌పల్లి, బాల్కొండ వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని... రైతులకు టోకెన్ పద్దతి ఇస్తామని మంత్రి తెలిపారు. 

18:25 - February 17, 2018

హైదరాబాద్ : నాలుగు బడ్జెట్‌లలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణను కించపరిచి మాట్లాడుతుంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ కవిత తెలంగాణ గురించి కాకుండా ఆంధ్రాకు న్యాయం చేయాలనడం తెలంగాణ అమరవీరులను కించపరిచినట్లేనని ఆయన అన్నారు. ఏపీ ఎంపీలు విభజన హామీల కోసం పోరాడుతుంటే తెలంగాణ ఎంపీలు మాత్రం మోదీ జపం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. సీబీఐ కేసు భయంతోనే కేసీఆర్‌ మోదీని ప్రశ్నించడంలేదని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

 

ముగిసిన రాంగోపాల్‌వర్మ విచారణ

హైదరాబాద్ : రాంగోపాల్‌వర్మ విచారణ ముగిసింది. సీసీఎస్ పోలీసులు వర్మను మూడున్నర గంటలపాటు విచారించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ నమోదైన కేసులో వర్మను పోలీసులు సీసీఎస్‌కు పిలిపించారు. ఈ విచారణలో దాదాపు 25 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

18:16 - February 17, 2018

హైదరాబాద్ : రాంగోపాల్‌వర్మను సీసీఎస్ పోలీసులు మూడున్నర గంటలపాటు విచారించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ నమోదైన కేసులో వర్మను పోలీసులు సీసీఎస్‌కు పిలిపించారు. ఈ విచారణలో దాదాపు 25 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అసలు విచారణలో వర్మను ఏయే ప్రశ్నలు అడిగారు.. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచారో లాంటి అంశాలపై సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. వర్మ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ సీజ్‌ చేశామని రఘువీర్‌ తెలిపారు. జీఎస్టీ సినిమాను పోలాండ్‌, యూకేలో చిత్రీకరించినట్లు తెలిపారని చెప్పారు. కాన్సెప్ట్‌ మాత్రమే తనదని విచారణలో తెలిపారని పేర్కొన్నారు. టెక్నికల్‌ పాయింట్స్‌పై వర్మ సమయం కోరారని తెలిపారు. వర్మకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశామన్నారు. వచ్చే శుక్రవారం వర్మను మళ్లీ విచారణకు పిలిచామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:59 - February 17, 2018

హైదరాబాద్ : సమస్య పరిష్కారానికి చర్చలు ముఖ్యమని జేఎఫ్‌సీ అభిప్రాయపడింది. విభజన హామీల అమలకు... ఎంపీల రాజీనామాల‌ కంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం మంచిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వాన్ని పడేయాలని కాదు.. ఆంధ్ర సమస్యను దేశానికి తెలియటానికే అవిశ్వాసమని ఆయన అభిప్రాయపడ్డారు. యాభై మంది సభ్యుల బలముంటే అవిశ్వాసం పెట్టొచ్చన్న ఉండవల్లి.. ఆంధ్ర సభ్యులు అవిశ్వాసం పెడితే 42మంది ఎంపీలున్న కాంగ్రెస్ కూడా  మద్దతిస్తుందన్నారు. పార్టీలను కూడా వ్యక్తిగతంగా కోరుతున్నానని ఉండవల్లి తెలిపారు. 

ఎంపీల రాజీనామాల‌ కంటే అవిశ్వాసం పెట్టడం మంచింది : ఉండవల్లి

గుంటూరు : సమస్య పరిష్కారానికి చర్చలు ముఖ్యమని జేఎఫ్‌సీ అభిప్రాయపడింది. విభజన హామీల అమలకు... ఎంపీల రాజీనామాల‌ కంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం మంచిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వాన్ని పడేయాలని కాదు.. ఆంధ్ర సమస్యను దేశానికి తెలియటానికే అవిశ్వాసమని ఆయన అభిప్రాయపడ్డారు. యాభై మంది సభ్యుల బలముంటే అవిశ్వాసం పెట్టొచ్చన్న ఉండవల్లి.. ఆంధ్ర సభ్యులు అవిశ్వాసం పెడితే 42మంది ఎంపీలున్న కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందన్నారు. పార్టీలను కూడా వ్యక్తిగతంగా కోరుతున్నానని ఉండవల్లి తెలిపారు. 

 

ముగిసిన రామ్‌గోపాల్‌ వర్మ విచారణ

హైదరాబాద్ : సీసీఎస్‌ పోలీస్ స్టేషన్‌లో రామ్‌గోపాల్‌ వర్మతో విచారణ ముగిసింది. వర్మను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. సోమవారం మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. సీసీఎస్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు పూర్తి ఆధారాలను సోమవారం అందజేస్తానని వర్మ చెప్పినట్లు సమాచారం. అలాగే జీఎస్టీ సినిమాను ఫారిన్‌లోనే తీసి అక్కడే విడుదల చేశానని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పినట్లు సమాచారం. 

 

17:24 - February 17, 2018

హైదరాబాద్ : సీసీఎస్‌ పోలీస్ స్టేషన్‌లో రామ్‌గోపాల్‌ వర్మతో విచారణ ముగిసింది.వర్మను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. సోమవారం మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. సీసీఎస్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు పూర్తి ఆధారాలను సోమవారం అందజేస్తానని వర్మ చెప్పినట్లు సమాచారం. అలాగే జీఎస్టీ సినిమాను ఫారిన్‌లోనే తీసి అక్కడే విడుదల చేశానని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పినట్లు సమాచారం. 

 

17:13 - February 17, 2018

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర సమితి నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి... నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.... కానుకగా కార్యకర్తలకు పదవుల పందేరం చేస్తారన్న ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. పదవుల పంపిణీకి సీఎం ముహూర్తం కూడా ఖరారు చేశారని పార్టీ నేతలు అంటున్నారు.

తెలంగాణాలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి... గులాబి నేతలను ఊరిస్తున్న పదవుల ఆశ... నెరవేరే కాలం ఆసన్నమైంది.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు నాలుగేళ్ళవుతున్నా... పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయలేదు. తొలి రెండేళ్లలో అతి తక్కువ సంఖ్యలోనే పదవులు భర్తీ చేశారు. గతేడాది  ఎక్కువ మంది నేతలకు పదవులు దక్కినా.... ఇంకా వేలాదిగా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు.   ఎన్నికలకు కేవలం  ఏడాది సమయమే ఉండడంతో.. ఈ విడత పదవుల భర్తీ భారీగానే   ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసిఆర్... కార్యకర్తలకు తన పుట్టినరోజు కానుకగా పదవులను పంచుతారని నేతలు అంటున్నారు. మరో  రెండు రోజుల్లోనే టీఆర్‌ఎస్‌ నేతలను ఈ పదవులు వరిస్తాయంటున్నారు. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు... డైరెక్టర్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయని.. వీలైనంత త్వరలోనే  వాటన్నింటినీ  భర్తీ చేస్తారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిందన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యమ సమయం నుంచి పార్టీతోనే ఉన్న నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో... ఈ విడత పదవులు భర్తీలో సీనియర్లకు పెద్దపీట వేసి సంతృప్తి పరచనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... పదవుల పందేరంతో  పార్టీలో అసమ్మతికి చెక్‌ పెట్టాలని భావిస్తోంది టీఆర్ఎస్‌ అధిష్టానం... మరోవైపు భారీగా పదవుల భర్తీ జరుగుతుందన్న సమాచారంతో... అధికార పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.

17:09 - February 17, 2018

ఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు, యాసిడ్‌ దాడులకు గురయ్యేవారికి ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. ప్రమాదాల బారినపడ్డవారికి ఇకపై ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందివ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీలోని ఏ ప్రయివేట్‌ ఆసుపత్రికి వెళ్లినా వంద శాతం క్యాష్‌లెస్‌ చికిత్స అందజేయడం తమ ప్రభుత్వ బాధ్యతగా కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పేద, ధనిక, ప్రాంతీయేతర తేడాలు లేకుండా ఇది అందరికి వర్తిస్తుందని చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా బాధితులను తక్షణమే సమీపంలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చితే ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఢిల్లీలో ప్రతియేటా 8 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

 

16:58 - February 17, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో సిబిఐ ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. పిఎన్‌బి మాజీ డిప్యూటి మేనేజర్ గోకుల్‌నాథ్‌ షెట్టి, పిఎన్‌బి ఉద్యోగి ఎస్ డబ్ల్యుసీ మనోజ్‌ ఖరాత్‌తో పాటు నీరవ్‌ మోది గ్రూప్‌కు చెందిన హేమంత్‌ భట్‌లను సిబిఐ అరెస్ట్‌ చేసింది. పిఎన్‌బి స్కాంలో మాస్టర్ మైండ్‌ గోకుల్‌నాథ్‌ షెట్టి స్విఫ్ట్‌ మెసేజింగ్‌ సిస్టంను దుర్వినియోగం చేశారని ... ఎలాంటి పూచికత్తు లేకుండానే  బ్యాంకు రుణాలు ఇప్పించారని ఆయనపై ఆరోపణలున్నాయి. వీరందరిని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పిఎన్‌బి స్కాంలో 18 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న గీతాంజలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 11 వేల 3 వందల కోట్ల పిఎన్‌బి స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోది, మేహుల్‌ చౌకసీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

 

16:56 - February 17, 2018

విశాఖ : కార్మికుల ఆందోళనను పట్టించుకోకుండా... ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, డీసీఐలను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు నర్సింగారావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ ప్రభుత్వ స్టీరింగ్‌ కమిటీ ఫిబ్రవరి 19న విశాఖలో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. జాతీయ ప్రభుత్వరంగ స్టీరింగ్‌ కమిటీ సీనియర్‌ నేతలు తపన్‌సేన్‌, స్వదేశ్‌ దేవ్‌ రాయ్‌, చందన్‌ పెళ్లై వంటి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నర్సింగరావు తెలిపారు. 

16:52 - February 17, 2018

శ్రీకాకుళం : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో అద్భుతంగా ఉందన్న టీడీపీ నేతలు... 2018లో బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు... కేంద్రం ఇచ్చిన సహాయం ఎక్కడ, ఎలా ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం అందించిన ఆర్థిక సాయంపై ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న భయంతోనే కొంతమంది నేతలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ ఎంపీల రాజీనామాల ప్రకటనలన్నీ రాజకీయ డ్రామాలే అన్నారు. 

16:49 - February 17, 2018

గుంటూరు : రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో  బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరుజిల్లా కాకానిలో జేఎన్‌టీయూ భవనాల శంకుస్థాపన సందర్భంగా జరిగన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ చేసిన తప్పునే బీజేపీ కూడా చేస్తోందన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా పార్లమెంటులో నిలదీశామని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో మోదీ ప్రభత్వం ఏపీకి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.  

 

16:47 - February 17, 2018

గుంటూరు : విద్యార్థులకు, యువతకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఫ్లాట్‌ఫాంకింద ఉంటుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరుజిల్లా కాకానిలో జేఎన్‌టీయూ భనాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఏ రంగంలో చదువుకున్నా. ఫైనల్‌గా ఐటీ చుదువుకుంటే.. వారి భవిష్యత్తుకు ఎదురే ఉండదన్నారు.  ఐటీ కంపెనీల వల్ల దేశంలో సంపద సృష్టి జరిగిందన్నారు. భవిష్యత్తులో ఐటీ రంగానికే మంచి డిమాండ్‌ ఉంటుందని, విద్యార్థులు  ఆదిశగా తమ ఎడ్యుకేషన్‌ కొనసాగించాలని సీఎం  చంద్రబాబు పిలుపునిచ్చారు.  

 

వర్మపై సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం

హైదరాబాద్ : డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. జీఎస్టీ సినిమా వివాదం.. మహిళల్ని కించపరిచారన్న అభియోగంపై  సీసీఎస్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇవ్వడంతో... వర్మ విచారణకు హాజరయ్యారు. వర్మకు సీసీఎస్‌ పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమాను ఎందుకు తీశారు? మియా మాల్కోవాతో అసభ్యకరంగా ఎలా చిత్రీకరించారు.? ఐటీ యాక్ట్‌ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు అని తెలియదా? టీవీ చర్చలో సామాజిక కార్యకర్త దేవితో అసభ్యకరంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌.? సినిమాను అమెరికాలో తీసి అక్కడి నుంచే అప్లోడ్‌ చేస్తా అంటున్నారు.

16:39 - February 17, 2018

హైదరాబాద్ : డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. జీఎస్టీ సినిమా వివాదం.. మహిళల్ని కించపరిచారన్న అభియోగంపై  సీసీఎస్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇవ్వడంతో... వర్మ విచారణకు హాజరయ్యారు. వర్మకు సీసీఎస్‌ పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమాను ఎందుకు తీశారు? మియా మాల్కోవాతో అసభ్యకరంగా ఎలా చిత్రీకరించారు.? ఐటీ యాక్ట్‌ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు అని తెలియదా? టీవీ చర్చలో సామాజిక కార్యకర్త దేవితో అసభ్యకరంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌.? సినిమాను అమెరికాలో తీసి అక్కడి నుంచే అప్లోడ్‌ చేస్తా అంటున్నారు. మీకు అమెరికాలో డబ్బులు ఎవరు సమకూర్చారు. అంటూ వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

 

15:37 - February 17, 2018

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 50 కిలో వాట్ల పవర్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్‌ను తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఎస్వీకేలో సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. భవిష్యత్‌లో ప్రజల సహకారం ఎస్వీకే అభివృద్ధికి ఉపయోగపడాలని తమ్మినేని అన్నారు. 

 

15:35 - February 17, 2018

తమిళనాడు : చెన్నైలో ఐటీ మహిళ లావణ్యరెడ్డిపై అత్యాచారం, దారి దోపిడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సెమ్మంజేరికి చెందిన వినాయకమూర్తి, నారాయణమూర్తి, లోకేశ్‌లుగా గుర్తించారు. వీరి దగ్గర నుంచి కత్తులు, ఇనుపరాడ్లు, లావణ్య స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్యరెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడింది. లావణ్యను ఈ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

 

15:31 - February 17, 2018

కృష్ణా : విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించడంపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇవాళ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. సిస్‌ చాలెంజ్‌ విధానంలో 45 ఏళ్ల లీజుకు గతేడాది టెండర్లు పిలిచారు. ఇప్పుడు వాటిని 99 ఏళ్లకు పెంచాలని బిడ్డర్లు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. లీజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:29 - February 17, 2018

కృష్ణా : అహర్నిశలు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప  మనిషి  కామ్రేడ్ సురనేని విజయసారధిరావు అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో విజయసారధిరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సీపీఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

15:26 - February 17, 2018

హైదరాబాద్ : డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. జీఎస్టీ సినిమా వివాదం.. మహిళల్ని కించపరిచారన్న అభియోగంపై సీసీఎస్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇవ్వడంతో... వర్మ ఇవాళ విచారణకు వచ్చారు. తన లాయర్‌తో కలిసి వర్మ సీసీఎస్ స్టేషన్‌కు వచ్చారు. సీసీఎస్ పోలీసులు సూచించిన ప్రకారం బ్లాక్‌ వర్మ డ్రెస్‌లో వచ్చారు. జీఎస్ టీ మూవీ విడుదల సమయంలో... ఓ ఛానెల్ చర్చా వేదికలో వర్మ తనను అవమానించారంటూ సామాజిక కార్యకర్త దేవి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఆర్ పీసీ లోని సెక్షన్ 41 ద్వారా వర్మకు పోలీసులు నోటీసులు జారీచేశారు. ముందుగా వర్మ స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు... తర్వాత వీడియో అనాలసిస్ రికార్డింగ్ ద్వారా విచారణ జరుపుతారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నరసరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : నరసరావుపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కోటప్పకొండలో రూ.7 కోట్లతో నిర్మించనున్న రోప్ వేకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. యాంపీ థియేటర్, చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

పెట్లూరిపాలెం..కోటప్పకొండ ఆర్ ఆండ్ బీ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుంటూరు : పెట్లూరిపాలెం..కోటప్పకొండ ఆర్ ఆండ్ బీ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.6 కోట్లతో పెట్లూరివారిపాలెం..కోటప్పకొండ ఆర్ ఆండ్ బీ రహదారి నిర్మాణం చేపట్టారు. అచ్చమ్మపాలెం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. 

14:00 - February 17, 2018

హైదరాబాద్ : అందమైన అమ్మాయిని ఓరగా చూసాడు.. కంటిచూపుతో క్యూట్‌గా సైగ చేశాడు. ఇక ఆమె చూపుల్ని తట్టుకోలేక అందంగా ఓ నవ్వు నవ్వేశాడు... రోషన్ అబ్దుల్ రవూఫ్‌.. ఇప్పుడు రోషన్ అమ్మాయిలకు వీరాభిమాని అయిపోయాడు. ఫిబ్రవరి 9 నుంచి ఇంటర్నెట్‌లో 'ఒరు ఆధార్ లవ్' సినిమాలోని పాట 'మాణిక్య మలరవ పూవి' సంచలనం మొదలైంది. ఆ పాటలో నటించిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ని చూసిన అబ్బాయిలంతా మనసు పారేసుకున్నారు. ఇక వాలంటైన్స్ డేకి ముందురోజు అదే సినిమా నుంచి రిలీజైన ఇంకో క్లిప్‌ చూసిన యువత ప్రియరాగాలు తీసారు... ఆ పాటలో నటించిన ప్రియ సోషల్ మీడియా సంచలనంగా మారింది. అయితే ఈ పాటలో నటించిన రోషన్ అబ్దుల్‌కి అమాంతంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రియని కుర్రాళ్లు ఎంతగా అభిమానిస్తున్నారో.. రోషన్‌ని అమ్మాయిలు ఆరాధిస్తున్నారు.

రోషన్‌కి అమ్మాయిల ఫాలోవర్లు
ఒరు ఆధార్ లవ్ వీడియో క్లిప్స్‌లో రోషన్‌ నటనకి అమ్మాయిలు తెగ మార్కులు వేసేస్తున్నారు. అసలు ఆ లవ్ సీన్ పండటానికి రోషన్ కారణమంటున్నారు. ఫేస్ బుక్.. వాట్సాప్.. ట్విట్టర్.. ఇన్‌స్టా గ్రామ్‌లలో రోషన్‌కి అమ్మాయిల ఫాలోవర్లు తెగ పెరిగిపోయారు. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ రాని సక్సెస్‌ని ఒకే పాటలో చక్కని హావభావాలు ప్రదర్శించి దక్కించుకున్నాడు రోషన్ అబ్దుల్ రవూఫ్.. 1998 ఏప్రియల్ 23న అబుదబీలో పుట్టిన రోషన్ అక్కడే ఉన్న స్కాలర్స్ ఇండియన్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. ప్రస్తుతం రోషన్ ఫ్యామిలీ కేరళలో సెటిల్ కావడంతో అతను అక్కడే బీసీఏ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్ అయిన రోషన్ పలు డ్యాన్స్ షోలలో పాల్గొన్నాడు. సెల్ఫీ మ్యాడ్‌ నెస్ పేరుతో యూ ట్యూబ్ ఛానల్‌ని నడుపుతున్నాడు. రోషన్ డెబ్యూట్ ఫిల్మ్‌ ఒరు ఆధార్‌ లవ్ ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ కాబోతోంది.విడుదలకు ముందే ప్రియ, రోషన్లకు మాంచి హైప్ తెచ్చిపెట్టిన ఒరు ఆధార్ లవ్ సినిమా విడుదయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

 

13:58 - February 17, 2018

చిలీ : మెక్సికోను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు రోడ్లమీదకు పరుగులు తీశారు. ఒక్సాకా, మెక్సికో సిటీలోని పలు భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. నిమిషం పైనే భూమి కంపించిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చైనీస్‌ న్యూఇయర్‌ వేడుకలు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రహదారుల మీదకు చేరారు. అదే సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. గతేడాది సెప్టెంబరు నెలలోనూ రెండు సార్లు భారీ భూకంపం వచ్చింది.

జోగు రామన్నకు తప్పిన ప్రమాదం

మంచిర్యాల : అటవీ శాఖ మంత్రి జోగురామన్నకు ప్రమాదం తప్పింది. మున్నూరుకాపు భవన ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భవన ప్రారంభోత్సవ సందర్భంగా బాణాసంచా పేల్చడంతో ఆ నిప్పు రవ్వలు పడి టెంట్ అంటుకుంది.

13:43 - February 17, 2018

దేవాదుల పైప్ లైన్ లీక్

వరంగల్ : జిల్లా ధర్మసాగరం మండలం మల్లీకుర్ల గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీక్ అయింది. పైప్ లైన్ రెండు చోట్ల లీక్ అవ్వడంతో పంట పొలలాన్ని నీట మునిగిపోయాయి.

13:41 - February 17, 2018

కరీంనగర్ : అలుపెరుగకుండా కష్టపడితే ఉద్యోగాలు సాధించడం సులువేనని నిరూపించారు కరీంనగర్‌ జిల్లాలోని ఢిల్లీ డిఫెన్స్‌ అకాడమి విద్యార్థులు. నవంబర్‌లో నిర్వహించిన ఆర్మి రిక్రూట్‌మెంట్ ర్యాలీలో డిఫెన్స్‌ అకాడమిలో శిక్షణ పొందిన 30 మంది అభ్యర్థులకుగాను 26 మంది ఆర్మీలో ఉద్యోగాలను సాధించారు.మూడు నెలల పాటు కఠోర సాధన చేసి ఉద్యోగాలను సాధించిన వారిని సంస్థ నిర్వాహకుడు కొత్త సతీష్‌రెడ్డి అభినందించారు. వారందరినీ అకాడమిలో ఘనంగా సన్మానించారు. అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో నెలకొల్పిన ఢిల్లీ డిఫెన్స్‌ అకాడమి నిరుద్యోగులను కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తుందన్నారు డైరెక్టర్ సతీష్‌రెడ్డి.

13:41 - February 17, 2018

పెద్దపల్లి : మారుమూల అటవీప్రాంతంలో గ్రామగ్రామాన తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు మంథని ఎమ్మెల్యే పుట్ట మధు. అభివృద్ధికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో విద్య, వైద్య సదుపాయాలను అందించడంతో పాటు సొంత ఖర్చులతో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ద్వారా ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్నారు.

13:40 - February 17, 2018

హైదరాబాద్ : కేంద్ర సర్కార్ వేసిన జిఎస్టీ పై వెనుకా ముందు అలోచించకుండా సమర్ధించిన రాష్ట్ర సర్కార్ కి ఇప్పడుడిప్పుడే సీన్‌ అర్ధం అవుతున్నది. నాడు అందరికంటే ముందే జీఎస్టీని సమర్ధించి నేడు ఆకులు పట్టుకొని ఆయింట్‌మెంట్‌ పెట్టుకుంటుంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు స్టీల్ యాజమాన్యాలు స్టీలు సరఫరాను నిలిపివేయడంతో సర్కారుకు అసలు సీన్ కనిపించింది.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరకు ఉక్కును విక్రయించేలా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్ రంగంలోకి దిగారు. సిఎం క్యాంపు కార్యాలయంలో అధికారులు, స్టీల్ ఉత్పత్తి యజమాన్యాలు, ఆలిండియా స్టీల్ అసోసియేషన్ చైర్మన్ సురేష్‌కుమార్ సింఘాల్‌తో పాటు ఇత‌ర స్టీల్ కంపెనీల య‌జ‌మానుల తో చర్చించారు. మొత్తానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రూ.43 వేల 660కే మెట్రిక్ ట‌న్ ఉక్కును అందించేందుకు స్టీల్ కంపెనీల య‌జ‌మానులు అంగీక‌రించారు. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీలును నిర్ధిష్టమైన (బేస్ రేట్) ధరకు అందించాలని స్టీల్ కంపెనీలను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్ కోరారు. గ్రామాల్లో లక్ష ఇండ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నులు, పట్టణాల్లో 60 వేల ఇండ్లకు 1.04 లక్షల మెట్రిక్ టన్నులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లకు 2.78 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం. ఈ మేరకు రెండు నెల‌ల కాలానికి రూ. 43,660కే ఉక్కును అమ్మేందుకు ఉక్కు కంపెనీలు అంగీక‌రించాయి.

మెట్రిక్ ట‌న్ స్టీల్ ధ‌ర రూ.32,550
డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ ప‌థ‌కం ప్రారంభించినప్పుడు మెట్రిక్ ట‌న్ స్టీల్ ధ‌ర ట్యాక్స్ ల‌తో క‌లుపుకుని రూ.32,550 ఉండ‌గా..బ‌హిరంగ మార్కెట్లో ప్రస్తుత స్టీల్ ధ‌ర జీఎస్టీతో కలిపి రూ.53,100 ఉంది. అయితే స్టీల్ కంపెనీల య‌జ‌మాన్యాల‌తో చ‌ర్చించిన త‌ర్వాత స్టీల్ మెట్రిక్ ట‌న్ ధ‌ర రూ.43,660కే వస్తోంది. దీంతో గృహ నిర్మాణ శాఖ‌పై రూ.264.60 కోట్ల భారం త‌గ్గింది. బ‌హిరంగ మార్కెట్ తో పోలిస్తే ఒక్కో మెట్రిక్ టన్ కు రూ.9,440 త‌గ్గింద‌ని చెప్పొచ్చు.మొత్తానికి ప్రభుత్వం తన కు ఓట్లు తెచ్చి పెట్టే పథకాలకోసం ఎంత వరకైనా పోతుంది..అదే పేద వాడికి నడ్డి విరిగే నిర్ణయాలు అయితే మాత్రం..అంతా అభివృద్దిలో భాగమేనని సర్ధిచెప్తుంది. 

13:37 - February 17, 2018

మంచిర్యాల : అటవీ శాఖ మంత్రి జోగురామన్నకు ప్రమాదం తప్పింది. మున్నూరుకాపు భవన ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భవన ప్రారంభోత్సవ సందర్భంగా బాణాసంచా పేల్చడంతో ఆ నిప్పు రవ్వలు పడి టెంట్ అంటుకుంది. మరింత సమాచారం కోసం వీడయిఓ క్లిక్ చేయండి.

13:29 - February 17, 2018

వరంగల్ : జిల్లా ధర్మసాగరం మండలం మల్లీకుర్ల గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీక్ అయింది. పైప్ లైన్ రెండు చోట్ల లీక్ అవ్వడంతో పంట పొలలాన్ని నీట మునిగిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

వర్మను విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. వర్మ తన లాయర్ తో కలసి విచారణకు హాజరైయ్యారు. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుతో వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు సీఆర్పీషీ 41 సెక్షన్ ప్రకారం వర్మకు నోటీసులు ఇచ్చారు. 

13:10 - February 17, 2018

హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. వర్మ తన లాయర్ తో కలసి విచారణకు హాజరైయ్యారు. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుతో వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు సీఆర్పీషీ 41 సెక్షన్ ప్రకారం వర్మకు నోటీసులు ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు వర్మ స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడయో క్లిక్ చేయండి.

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ముగ్గురి అరెస్ట్

ఢిల్లీ : పంజాబ్ నేసనల్ బ్యాంక్ కుంభకోణంలో కేసులో సీబీఐ ముగ్గురిని అరెస్ట్ చేసింది. అర్టైనా వారిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజనర్ గోకుల్ నాథ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్, నీరవ్ మోడీ సంస్థలకు చెందిన ఉద్యోగి హేమంత్ భట్ ఉన్నారు. 

12:21 - February 17, 2018
12:02 - February 17, 2018

హైదరాబాద్ : జీఎస్టీ సినిమా వివాదం.. మహిళల్ని కించపరిచారన్న అభియోగంపై డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు వర్మను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక కార్యకర్త దేవి...ఓ ఛానెల్ చర్చా వేదికలో వర్మ తనను అవమానించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో సీసీఎస్ ముందుకు వర్మ

హైదరాబాద్ : రాంగోపాల్ వర్మ కాసేపట్లో సీసీఎస్ పోలీసులు ముందుకు రానున్నారు. సీసీఎస్ వర్మ వస్తుండడంతో సీసీఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

జేపీ వ్యాఖ్యలను ఖండించిన ఐవీఆర్

హైదరాబాద్ : కేంద్రానికి రాష్ట్రం జవాబుదారికాదన్న జేపీ వ్యాఖ్యలను ఏపీ  మాజీ సీఎస్ ఐవైఆర్ ఖండించారు. కేంద్రానికి రాష్ట్రాలను నిధుల వివరాలు అడిగే హక్కు ఉంటుందని ఐవైఆర్ అన్నారు 

11:50 - February 17, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా... ఆయన కూతురు కవిత.. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా... పూజారులు... ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

11:49 - February 17, 2018

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో దాదాపు 30వేల మందికి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించారు. సభకు స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంటుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ఇప్పటికే GHMC ప్రచారంతో .. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తగ్గిందని... అయితే అది నూటికి నూరుశాతం జరగాల్సి ఉందని గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.

11:49 - February 17, 2018

సెంచూరియన్ : చివరి వన్డేలో టీమ్‌ ఇండియా ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుకు షాక్‌ ఇచ్చింది. సెంచూరియన్‌లో నెగ్గి.. ఆరువన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆరో వన్డేలో టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ అద్భుతశతకం చేయడంతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు కట్టడి చేశారు. 204 పరుగులకే ఆలౌట్‌ చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌ 4 వికెట్లు తీసి సఫారీలను బెంబేలెత్తించాడు. బుమ్రా, చాహల్‌ తలా రెండు వికెట్లుపడగొట్టి దక్షిణాఫ్రికా నడ్డివిరిచారు. భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 46.5 ఓవర్లలో కేవలం 204 పరుగులకే చేతులెత్తేసింది.

ఆదిలోనే ఎదురుదెబ్బ
205 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమ్‌ ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టుస్కోరు 19 పరుగుల దగ్గర రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 18పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర శిఖర్‌ ధావన్‌ పెవిలియన్‌కు చేరినా.. రహానేతో కలిసి మరో వికెట్‌ పడకుండా స్కోరు బోర్డును ఉరకలు పెట్టించాడు. ఈ జోడీ 117 బంతుల్లో 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో 32.1 ఓవర్లో సౌతాఫ్రియా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ పూర్తి చేసింది. దీంతో 6వన్డేల సిరీస్‌ను 5-1తేడాతో టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది.

సెంచరీతో చెలరేగిన కోహ్లీ
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటాడు. కెరీర్‌లో అతనికిది 35వ సెంచరీకాగా... కెప్టెన్‌గా 13వ సెంచరీ. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. 25ఏళ్ల క్రితం తొలిసారి ఇక్కడే ఆడిన సిరీస్‌లో భారత్‌ 5 వన్డేలు ఓడిపోయింది. ఇప్పుడు అదే 5వన్డేలు అందుకుంది. ఇది విరాట్‌సేనకే సాధ్యమైంది. ఇక ఇరుజట్ల మధ్య మూడు టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది.

11:47 - February 17, 2018

పెద్దపల్లి : జిల్లా కాల్వశ్రీ రాంపూర్‌ మండలం కునారం గ్రామంలో భూములు లేని నిరుపేదలు నిజాం కాలం నాటి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. 2వేల ఎకరాల పైచిలుకు నిజాం భూములను పెత్తం దారులు, పలుకుబడి ఉన్నవారంతా ఆక్రమించుకోవడంతో భూములు కోల్పోయిన వారంతా పోరు బాట పట్టారు. ఏళ్ల తరబడి అక్రమార్కులు చేతుల్లో కబ్జాకు గురైన తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం ఆగదంటున్నారు.

11:47 - February 17, 2018

గుంటూరు : ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. అందరు ఏకమై ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని అన్ని రాజకీయ పక్షాలు పోరురు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. వామపక్షాలతో సహా ప్రధాన ప్రతిపక్షం వైసీసీ కూడా ఇదేబాటను అనుసరిస్తున్నాయి. అటు టీడీపీ కూడా మిత్రపక్షమైన బీజేపీపైనా పోరుకు సై అంటోంది. టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్‌ను సమర్ధవంతంగా వినిపించారు. జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకెళ్లగలిగారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కేంద్రం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారుకానీ.. ఎక్కడా బహిరంగంగా మాట్లాడటం లేదు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి 16 రోజులైంది. అయినా ఇంతవరకు చంద్రబాబు ఎక్కడా దానిపై మాట్లాడలేదు. మౌనమే తన సమాధానం అన్నట్టు సైలెంట్‌ అయిపోయారు.

పార్టీలో జోరుగా చర్చ
చంద్రబాబు మౌనంగా ఉండటంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకు చంద్రబాబు సైలెంట్‌గా ఉంటున్నారని వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరైతే చంద్రబాబు మౌనం వ్యూహాత్మకమని వాదిస్తున్నారు. చంద్రబాబు సైలెంట్‌ వెనుక ఏదోమర్మం దాగుందని జోస్యాలు చెప్పేస్తున్నారు.రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ఉద్యమాలు ఉధృతంగా జరిగాయి. ఈ సమయంలోనూ చంద్రబాబు కొన్ని రోజులపాటు సైలెంట్‌గా ఉన్నారు. ఆ రోజుల్లో పార్టీ నేతలు సైతం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా నాకు రెండు రాష్ట్రాలు సమానమని... రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని అన్నారేతప్ప.. అంతకుమించి ఎక్కడా మాట్లాడలేదు. అప్పుడు అలా మౌనంగా ఉండబట్టే ఏపీలో టీడీపీని కాపాడుకోగలిగారు. పాలిటిక్స్‌లో 40ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మాత్రం తొణకరు.. బెణకరు అన్నపేరు చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సేమ్‌ ఫార్ములానే అవలంభిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది అని పార్టీ అంతర్గత సమావేశాల్లోనే ఆయన తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి కేంద్రం తీరును ఎండగడితే సీన్ పూర్తిగా మారిపోతుంది.

బీజేపీ, టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టే
బీజేపీ టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టే అవుతుంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తూ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఎంపీల పోరాటానికి సలహాలు ఇస్తూ స్టెప్‌ బై స్టెప్‌ నిర్ణయం తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. మలివిడత పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయ్యేనాటికి కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే కచ్చితంగా చంద్రబాబు మౌనం వీడి ఏదోఒకటి తేల్చుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు జాగ్రత్తగా మౌనం వహిస్తూ కేంద్ర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఎలాంటి సమస్య ఎదురైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకపోవడమే మంచిది అనే సామెత ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఈ సామెతనే పాటిస్తున్నారు. అన్ని సమస్యలకు మౌనమే దారి చూపుతుందన్న భావనలో ఉన్నారు. మరి చంద్రబాబు భావిస్తున్నట్టు సమస్య పరిష్కారం అవుతుందా.. లేదా అన్నది చూడాలి.

11:38 - February 17, 2018
11:37 - February 17, 2018
10:28 - February 17, 2018

కాసేపట్లో జేఎఫ్ సీ భేటీ

హైదరాబాద్ : కాసేపట్లో జేఎఫ్ సీ భేటీ కానుంది. నిన్న మాజీ ఐఏసెస్ ఆఫీసర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 11 అంశాలపై అధ్యయనం చేయనున్నారు.

10:17 - February 17, 2018
09:16 - February 17, 2018

రాంగోపాల్ వర్మ అరెస్ట్ కు అవకాశం...?

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కు రెండోసారి సీసీఎప్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ వివాదం, మహిళల్ని కించపరిచారన్న అభియోగంపై వర్మకు పోలీసుసు నోటీసు పంపారు. నేడు వర్మను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

09:11 - February 17, 2018

హైదరాబాద్ : కాసేపట్లో జేఎఫ్ సీ భేటీ కానుంది. నిన్న మాజీ ఐఏసెస్ ఆఫీసర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 11 అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:10 - February 17, 2018

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కు రెండోసారి సీసీఎప్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ వివాదం, మహిళల్ని కించపరిచారన్న అభియోగంపై వర్మకు పోలీసుసు నోటీసు పంపారు. నేడు వర్మను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో సామాజిక కార్యకర్త దేవి వర్మపై ఫిర్యాదు చేసినన సంగతి తెలిసిందే. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గాల్లోకి పోలీసుల కాల్పులు

చిత్తూరు : జిల్లా తిరుపతి చంద్రగిరి మండలం శ్రీవారి మెట్ట అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. వారు పోలీసులపైకి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వెంటనే గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. 

మందేసిన యువతులు

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడు నెం. 45 లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులు, మీడియ సిబ్బందిపై మందు బాబులు చిందేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. 15 కార్లు, 7 బైక్ లను సీజ్ చేశారు.

08:05 - February 17, 2018

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడు నెం. 45 లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులు, మీడియ సిబ్బందిపై మందు బాబులు చిందేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. 15 కార్లు, 7 బైక్ లను సీజ్ చేశారు.

నరసరావుపేటలో చంద్రబాబు పర్యటన

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 

ఎర్రజొన్న కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

హైదరాబాద్ : ఎర్రజొన్న కొనుగోళ్లపై మంత్రి హరీష్ సమీక్ష నిర్వహించారు. ఎర్రజొన్న కొనుగోళ్లకు మంత్రి అధికారులను ఆదేశించారు. 

90వ రోజుకు చేరిన జగన్ ప్రజా సంకల్పయాత్ర

ప్రకాశం : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర 90వరోజుకు చేరింది. నేడు జగన్ గాంధీనగర్, వలేటివారిపాలెం,  రోళ్లపాలెంలో పాదయాత్ర చేయనున్నారు. 

07:46 - February 17, 2018

విభజన హామీల అమలు రాజకీయలకు అతీతంగా ఉండాలని, అయితే దీనిపై ప్రజలను రెండు ప్రభుత్వాలు గందరగోళానికి గురి చేస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్ అన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ఒకే మాట మాట్లాడుతుందని, ఇప్పటికే 12 వేల కోట్లు ఇచ్చామని, మరో 10 వేల కోట్లు ఇస్తామని సభలో ప్రకటించామని బీజేపీ నేత శ్రీధర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:44 - February 17, 2018

మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా పేర్కొనవచ్చు. తక్కువ పంట కాలం దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. మన తెలంగాణ వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్నని సాగు చేయవచ్చు. మెదక్ జిల్లా అలిరాజాపేట గ్రామ రైతు సౌర్యులు మొక్కజొన్న పంట సాగులో అద్భుతంగా రాణిస్తున్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

07:42 - February 17, 2018

ఖమ్మం : ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేసేందుకు రైతులను ప్రోత్సహించేందుకు రైతులకు సబ్సీడీ కింద ట్రాక్టర్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి క్రషి వికాస్‌ యోజన, ఎఫ్‌ ఎం పథకం ద్వారా 75 శాతం సబ్సీడీతో వ్యవసాయం చేస్తున్న రైతులకు సబ్సీడీ ట్రాక్టర్లను పంచేందుకు నిర్ణయించారు. ఇందుకు గాను ఖమ్మం జిల్లాకు 578 ట్రాక్టర్లు మంజూరు అయ్యాయి. ఇందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసేందుకు మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. సబ్సీడీ ట్రాక్టర్ల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీలు పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైన రైతులను ఎంపిక చేయాల్సి ఉంది. కాని జిల్లాలోని చాలా మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన వారినే లబ్దిదారులుగా ఎంపిక చేశారు. చిన్న, సన్న కారు రైతులు, మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా అసలు వ్యవసాయం చేయని వారికి, సెంటు భూమికూడా లేని వారిని లబ్దిదారులుగా ఎంపిక చేశారు. గతంలో కూడా ఇలాంటివి జరిగినట్లు ఆరోపణలున్నాయి.

అధికార పార్టీకి చెందిన వారే
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తోన్న పాలేరు నియోజకవర్గంలో ఎంపికైన లబ్దిదారుల్లో మెజారిటీ లబ్దిదారులు అధికార పార్టీకి చెందిన వారే ఉండటం గమనార్హం. అనంతసాగర్, పాతర్ల పాడు గ్రామాల్లో కూడా చాలా మంది అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా వ్యవహరించే వారిని ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులుగా ఎంపిక చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదు. మధిర నియోజకవర్గంలోని బోనకల్‌ మండలంలో 22 మంది లబ్దిదారుల్లో 9 మంది టీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారు. తిరుమలయాపాలెం, నేలకొండపల్లి, మధిర మండలాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సబ్సీడీ ట్రాక్టర్ల మంజూరులో అధికార పార్టీనేతల ఒత్తిళ్లకు తోడు అధికారుల అవినీతి దాహం కూడా ఉంది. లబ్దిదారులను ఎంపిక చేయాంటే ప్రతి లబ్దిదారుడి నుండి 30 నుండి 50 వేల వరకు ముట్టజెప్పాల్సి ఉందన్న ఆరోపణలున్నాయి. కమిటీ కన్వీనర్‌ వ్యవసాయ శాఖ అధికారులు కావడంతో వారి ఆదేశాల ప్రకారమే ట్రాక్టర్ల మంజూరు జరిగింది. ఈ విషయమై వ్యవసాయ అధికారులు మాత్రం ఎలాంటి అవినీతికి తావులేదని చెబుతున్నారు.

వ్యవసాయ శాఖ అధికారికి 10వేల లంచం
చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన మహిళా రైతు...మండల వ్యవసాయ శాఖ అధికారికి 10వేల లంచం ఇచ్చినప్పటికీ లబ్దిదారుల ఎంపికలో తన పేరులేదని ఆమె జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే అర్హులు కాని చాలా మందికి తమని లబ్దిదారులుగా ఎంపిక చేయలేదని పలువురు రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లబ్దిదారులకు రేపు ట్రాక్టర్లను అందించనున్నారు. అయితే సాక్షాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిత్యం వహిస్తోన్న జిల్లాలోనే ఇంత అవినీతి జరుగుతుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా లబ్దిదారులకు ట్రాక్టర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

07:40 - February 17, 2018

చిత్తూరు : జిల్లాలో ఓ సెప్టిక్‌ ట్యాంక్‌ ఏడుగురి ప్రాణాలు బలితీసుకుంది. పలమనేరు మండలంలోని మొరం గ్రామంలోని శ్రీవెంకటేశ్వర హెచరీస్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఎస్వీ హేచరీస్‌ సంస్థ యాజమాన్యం శుక్రవారం ఉదయం.. పారిశుద్ధ్య కార్మికులను నియోగించింది. ఈ క్రమంలో క్లీనింగ్‌ కోసం.. నలుగురు కార్మికులు డ్రైనేజీలోకి దిగారు. అయితే అప్పటికే అక్కడ నిల్వ ఉండి.. మురిగిపోయిన కోళ్ల వ్యర్థాల నుంచి విషవాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చి నలుగురూ స్పృహ కోల్పోయారు. విషయాన్ని గుర్తించిన మరో ముగ్గురు వారిని కాపాడేందుకు ప్రయత్నించి తామూ అస్వస్థులయ్యారు.

మార్గమధ్యంలో నలుగురు కార్మికులు మృతి
విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకొని మురుగు కాలువ పై కప్పును తొలగించి లోపల ఉన్న కార్మికులను వెలికితీశారు. అపస్మారక స్థితిలో ఉన్న కార్మికులను చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అయిన వారిని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో కార్మికుల కుటుంబాలతో పాటు మొరం గ్రామంలోనూ విషాదం నెలకొంది. 

07:39 - February 17, 2018

గుంటూరు : వచ్చే నెల 5 నుండి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా శాఖాధిపతులు, కార్యదర్శులు, మంత్రులతో సీఎం బడ్జెట్‌ ప్రిపరేటరీ సమావేశం నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వం అనేక లక్ష్యాలను నిర్దేశించుకుందని, కొన్ని శాఖల్లో తీసుకున్న నిర్ణయాలతో సానుకూల ఫలితాలొచ్చాయని సీఎం అన్నారు. విద్యుత్‌ శాఖలో మంచి ఫలితాలు సాధించామని, పంచాయితీ రాజ్‌ శాఖలో ఎన్నో పురస్కారాలు వచ్చాయని సీఎం వివరించారు. భూగర్భజలాలను పెంచుకోగలిగామని తెలిపారు. ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కోగలిగామని 7 లక్షల పంట సంజీవని ఫామ్‌పాండ్స్‌ తవ్వించామన్నారు. ఒకప్పుడు సేద్యం చేసేందుకు సాగునీటి వసతిపై అయోమయ స్థితి ఉండేదని, ఇప్పుడు అన్ని పంటలకు కచ్చితంగా నీళ్లు ఇవ్వగలుగుతున్నట్లు తెలిపారు. అయితే కొన్ని శాఖల్లో ఆశించిన పురోగతి కనిపించలేదని చంద్రబాబు చెప్పారు.

15 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా
15 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు సీఎం. అన్ని శాఖల్లో సంస్కరణలు తీసుకువస్తున్నామని, అవసరమైతే పాత చట్టాలు రద్దు చేసి కొత్త చట్టాలు తీసుకువస్తామన్నారు. శాఖల లక్ష్యాలకు అనుగుణంగా ఎంత నిధులు అవసరమో అంచనాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వలేదన్నారు సీఎం. సాంకేతికతను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని, విజ్ఞాన సముపార్జనతోనే వ్యక్తులు, సంస్థలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఏపీని విజ్ఞాన బాండాగారంగా రూపొందించాలన్నదే లక్ష్యమని సమావేశంలో తెలిపారు సీఎం.

07:38 - February 17, 2018

కరీంనగర్ : రాష్ర్టంలో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్లోనే నిర్వహిస్తామని రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది... కాగా ప్రభుత్వానికి షాకిచ్చే విధంగా ప్రైవేటు విద్యాసంస్థలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. వార్షిక పరీక్షలన్నింటిని బహిష్కరిస్తున్నామని తేల్చిచెప్పాయి... గత నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూశామని ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు తెలిపాయి. అవి నేటికీ ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూనే చిన్నా చితకా కాలేజీలన్నింటిని రోడ్డున పడేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బకాయిలను చెల్లించమంటే... లేనిపోని ఆంక్షలు
తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలను చెల్లించమంటే... లేనిపోని ఆంక్షలు, నిబంధనలతో తమను మానసికంగా ప్రభుత్వం హింసిస్తోందని ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. చాలా సార్లు సీఎంను కలిసేందుకు ప్రయత్నించామని... కానీ... కొందరు ప్రజాప్రతినిధులు.. అధికారులు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోయామని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అంటున్నాయి.. ప్రభుత్వం తమని దోషుల్లాగా చిత్రీకరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే వందలాది కాలేజీలు రోడ్డున పడగా... మరోవైపు కొందరు కాలేజీలు నడపలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని చెబుతున్నారు. ఇంతజరిగినా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉనికే ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో ప్రభుత్వం స్పందించకుంటే... సహాయనిరాకరణ కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

అవసరంలేని ఫైర్‌ సేఫ్టీ....
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరంలేని ఫైర్‌ సేఫ్టీ.... ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఏర్పాటు చేయాల్సిన అసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అఫ్లియేషన్ల కోసం ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ... తిప్పించుకుంటున్నారని వారు మండిపడ్డారు. పదేళ్లు నిండిన అన్ని జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల కార్పస్ ఫండ్ లు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు ఆస్థి పన్నుతోపాటు... విద్యుత్‌ చార్జీల్లోనూ రాయితీ ఇవ్వాలని కోరారు. పాఠశాలలకు ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే... ఇంటర్‌తోపాటు.. పదో తరగతి పరీక్షలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. వచ్చే యేడాదిని జీరో ఇయర్ గా కొనసాగించేందుకు కూడా సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు. 

07:37 - February 17, 2018

హైదరాబాద్ : నిజమాబాద్ జిల్లాలో ఎర్ర జోన్న రైతుల నిరసనకు సర్కారు దిగొచ్చింది.. స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె కవిత పార్లమెంట్ పరిధి కావడంతో... ప్రభుత్వం ఆఘామేఘాల మీద కదిలింది. సీఎంను సంప్రదించి మరీ ధరను ప్రకటించింది. మరోవైపు ఈ కొనుగోళ్ళ పై విధి విధానాలు రూపొందించేందుకు మార్కెంటింగ్ శాఖ సిద్ధమైంది.

వెంటనే ఆర్మూరును సందర్శించాలి
అధికారులు వెంటనే ఆర్మూరును సందర్శించాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు వ్యవసాయ కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశం కావాలన్నారు. ఎర్రజొన్న రైతులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలని అధికారులకు చెప్పారు. నిజమైన రైతుల నుంచే ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు.ఎకరానికి 12 క్వింటాళ్ళకు మించి ఎర్రజొన్నను మార్కెట్ కు తెచ్చే వారిపై నిఘా పెట్టాలన్నారు మంత్రి. కొన్న సరుకుకు ఇచ్చే డబ్బును నేరుగా రైతు అకౌంట్‌లో జమ చేయాలన్నారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. కొనుగోలుతో పాటు నిల్వ, ఎగుమతి, అమ్మకాలు వంటి తదితర అంశాలపై ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

బయటి ప్రాంతాలనుంచి ఎర్రజొన్నలు రాకుండా
బయటి ప్రాంతాలనుంచి నిజామాబాద్ జిల్లాలోకి ఎర్రజొన్నలు రాకుండా కట్టడి చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. తూప్రాన్, మేడ్చెల్, రామాయంపేట వంటి చోట్ల కోల్డ్ స్టోరేజ్ లలోని నిల్వల వివరాలు సేకరించాలన్నారు. ధర పెరిగినప్పుడు అమ్మేందుకు కొందరు దళారులు కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వచేసి ఉంటారన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.. మరోవైపు అవకతవకలు, అక్రమాలకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారుఇక నుంచి రాష్ర్ట వ్యాప్తంగా సాగుచేస్తున్న పంటలు... వస్తున్న దిగుబడి, వాటికి మార్కెట్ లో లభించే ధరలు, ఎగుమతి అవకాశాలపై పరిశోధన జరపాలని మంత్రి హరీశ్ రావు అధికారులను అదేశించారు.

నేడు రెండో రోజు జేఎఫ్ సీ సమావేశం

హైదరాబాద్ : నేడు రెండు రోజు పవన్ జేఎఫ్ సీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రారానికి రావాల్సిన నిధులపై వారు చర్చించనున్నారు. 

Don't Miss