Activities calendar

18 February 2018

21:33 - February 18, 2018
21:29 - February 18, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ తిరుమలగిరిలో దారుణం జరిగింది. స్నేహితుని వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న మైనర్ బాలికపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న మిలటరీ జవాను‌ కుమార్తె.. అమ్ముగూడ వద్ద స్నేహితుడిని కలిసి రైలు పట్టాల సమీపం నుంచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బాలికను అడ్డగించి బెదిరించాడు. అనంతరం చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు కలవడానికి వెళ్లిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేక ఎవరైనా బాలిక కదలికలు గమనించి అత్యాచారం చేశారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే సంఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు చెబుతున్నారు. 

21:29 - February 18, 2018

సిద్దిపేట : కొమురవెళ్లి దేవస్థానాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌. కుటుంబసమేతంగా కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామిని తలసాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించారని, త్వరలో ఆలయ సమీపంలో కాటేజెస్, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని తలసాని తెలిపారు. 

21:28 - February 18, 2018

హైదరాబాద్ : ఈ నెల 25, 26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితిల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో కేసీఆర్ పలు అంశాలపై అధికారులతో చర్చించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు చేర్చే విషయంలో రైతు సమన్వయ సమితిలు కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈనెల 25న హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, 26న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.

21:28 - February 18, 2018

అనంతపురం : జగన్‌కి దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయాలన్నారు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఎన్నికలు జరగవనే ఉద్దేశంతోనే జగన్ రాజీనామా నాటకం ఆడుతున్నారని విమర్శించారు. పవన్ జేఎఫ్‌సీ మీటింగ్‌కు పిలవకపోయినా తమకెలాంటి నష్టం లేదన్నారాయన. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జేసీ వ్యాఖ్యానించారు. 

21:27 - February 18, 2018

కృష్ణా : ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు హాజరై ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యమాన్ని ఖరారు చేశారు. మంగళవారం ఏపీజేఎఫ్‌ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన దీక్ష చేపడతారు. ఈనెల 19 నుంచి 28 వరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 20న రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. టాలీవుడ్‌ నటుడు శివాజీ నేతృత్వంలో ఈనెల 28న కర్నాటకలో సమావేశం ఏర్పాటు చేస్తారు. మార్చి 1న వైసీపీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుంది. వచ్చే నెల 4న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తారు. మార్చి 5న ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలని సీపీఎం నిర్ణయించింది. మార్చి 5న వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరులో భారీ సదస్సు నిర్వహిస్తారు. మార్చి 2న జాతీయ రహదారులు దిగ్బంధానికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల ఆందోళన, చలో పార్లమెంటు నిర్వహిస్తారు. ఇలా ఏ పార్టీకి ఆపార్టీ విడివిడిగా కార్యాచరణ ప్రకటించాయి.ప్రత్యేక హోదా పై చంద్రబాబు బాధ్యతారహితంగా వ్యవహరించారని రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు... ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్న టీడీపీ... ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. ప్రత్యే క హోదా సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణ అవసరమని, దీనిలో అందరూ భాగస్వాములు కావాలని సినీ నటుడు శివాజీ పిలుపు ఇచ్చారు. 

 

21:26 - February 18, 2018

ప్రకాశం : ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సవాల్‌పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సానుకూలంగా స్పందించారు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రజా సంకల్ప యాత్ర సభలో అవిశ్వాసానికి సిద్ధమన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామన్నారు. చంద్రబాబును ఒప్పించాలని పవన్‌ను జగన్‌ కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనాలు చేస్తారని చెప్పిన జగన్‌.. ఇందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉందా.. అని ప్రశ్నించారు. ఏపీకి కేంద్రం ఇచ్చింది ఎంత.. రాష్ట్రం తీసుకున్నదెంత అనే అంశంపై నిజానిజాలను నిగ్గు తేల్చే ఉద్దేశంలో పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా ఉందని జగన్‌ వ్యాఖ్యానించారుప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలని జగన్‌ కోరారు. 

మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

జోహెనస్ బర్గ్ : భారత్ తో జరుగుతున్నటీ20లో దక్షణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 51 పరుగుల వద్ద డెవిడ్ మిల్లర్ (90) హర్థిక్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

ముగిసిన బీజేపీ కోర్ కమిటీ భేటీ

కృష్ణా : బీజేపీ కోర్ కమిటీ భేటీ ముగిసింది. పార్టీల రాజకీయ దాడిని ఎదుర్కోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీల దాడులను తిప్పికొడుతూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సహం నింపాలని ఈ భేటీలో నిర్ణయించారు. 

రెండో వికెట్ కోల్పోయిన దక్షణాఫ్రికా

జోహెనస్ బర్గ్ : భారత్ తో జరుగుతున్న టీ20 సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగుల వద్ద జేపీ డుమ్నీ(3) భువనేశ్వర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

జోహెనస్ బర్గ్ : 204 పరుగుతు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగుల వద్ద స్మాట్(14) భువనేశ్వర్ బౌలింగ్ లో ధావన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

25,26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితీ సమావేశాలు

హైదరాబాద్ : ఈ నెల 25,26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సును నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 

భారత్ 203/5

జోహెనస్ బర్గ్ : దక్షణాఫ్రికా తో జరగుతున్న టీ20 భారత్ 203 పరుగులు చేసింది. బ్యాటింగ్ ధావన్ 72, పాండే 29, కోహ్లీ26, రోహిత్ 21 పరుగులు చేశారు.

రజినీతో కమల్ భేటీ

చెన్నై : పోయస్ గార్డెన్ లో రజనీకాంత్ ను కమల్ హసన్ కలిశారు. తన రాజకీయ పర్యటనపై రజినీకి వివరించానని, తన పర్యటన బాగా జరగాలని రజినీ కోరుకున్నాడని కమల్ తెలిపాడు.

మూడో వికెట్ కోల్పోయిన భారత్

జోహెనస్ బర్గ్ : దక్షణాఫ్రికాతో జరుగుతున్న టీ20 లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 108 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ(26) శంశి బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. 

18:44 - February 18, 2018

విశాఖ : జరిగిన డాగ్‌ షో పెట్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. పలు జాతులకు చెందిన డాగ్స్‌ క్యాట్‌ వాక్‌తో అదరగొట్టాయి. డాగ్స్‌ని పెంచుకునే వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ షో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. 

18:43 - February 18, 2018

విశాఖ : బీచ్‌ రోడ్డులో లివ్‌ లైఫ్‌ హాస్పటల్ ఆధ్వర్యంలో స్థూలకాయంపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. స్థూలకాయం పట్ల చిన్నతనం నుంచే పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి గంటా అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లివ్‌ లైఫ్ హాస్పటల్ ఎండి నందకిషోర్‌ మరియు ఏపీ చాంబర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు పాల్గొన్నారు. 

18:42 - February 18, 2018

విశాఖ : BSNL సెల్‌ టవర్స్‌ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా కేంద్రం BSNLను పోటీలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని సీఐటీయూ ఏపీ అధ్యక్షులు నరసింగరావు ఆరోపించారు. ఇదే జరిగితే ఉద్యోగులు, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని నరసింగరావు అన్నారు.అదే విధంగా డీసీఐ, స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న మొండి ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జీవిఎంసీ వద్ద ప్రభుత్వ రంగ ఉద్యోగులు చేపట్టిన 36 గంటల నిరాహారదీక్షలకు సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. మరోవైపు BSNL ఎంప్లాయీస్ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు పి.అభిమన్యు ఆధ్వర్యంలో BSNL రీజనల్ కార్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 

18:41 - February 18, 2018

గుంటూరు : రాజీనామా చేస్తామంటూ మూడేళ్లుగా జగన్ చెబుతున్న మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప విమర్శించారు. దమ్ము..ధైర్యం ఉంటే జగన్ ఈరోజే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకున్నా.. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చినరాజస్ప స్పష్టం చేశారు.

 

మూసీ కాల్వలో మహిళ మృతదేహం

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ మండలం కొర్రెముల మూసీ కాల్వలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ మెట్ కి చెందిన జవాజీ బాలమణిగా పోలీసులు గుర్తించారు. 

బీజేపీ అంతర్గత సమావేశంలో గొడవ

కృష్ణా : బీజేపీ అంతర్గత సమావేశంలో నేతల మంధ్య గొడవ జరిగింది. ఎంపీ హరిబాబుకు, లక్ష్మీపతి రాజు మధ్య వాగ్వాదం జరగింది. లక్ష్మీపతిరాజును మంత్రి మాణిక్యాలరావు సముదాయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పురందేశ్వరీ పాల్గొన్నారు. 

17:23 - February 18, 2018

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ మండలం కొర్రెముల మూసీ కాల్వలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ మెట్ కి చెందిన జవాజీ బాలమణిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ ప్రారంభించారు. 

17:22 - February 18, 2018

కృష్ణా : బీజేపీ అంతర్గత సమావేశంలో నేతల మంధ్య గొడవ జరిగింది. ఎంపీ హరిబాబుకు, లక్ష్మీపతి రాజు మధ్య వాగ్వాదం జరగింది. లక్ష్మీపతిరాజును మంత్రి మాణిక్యాలరావు సముదాయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పురందేశ్వరీ పాల్గొన్నారు. 

అవిశ్వాసానికి సిద్ధం : జగన్

ప్రకాశం : అవిశ్వాసం పెట్టడానికి మేం సిద్ధమని వైసీపీ అధినేత జగన్ మోహన్ స్పష్టం చేశారు.  4 ఏళ్ల పాటు బీజేపీతో చంద్రబాబు నడుస్తున్నా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని జగన్ ఆరోపించారు. అయినా చంద్రబాబు కేంద్రాన్ని పొగుడుతారని జగన్ విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:02 - February 18, 2018

ప్రకాశం : అవిశ్వాసం పెట్టడానికి మేం సిద్ధమని వైసీపీ అధినేత జగన్ మోహన్ స్పష్టం చేశారు.  4 ఏళ్ల పాటు బీజేపీతో చంద్రబాబు నడుస్తున్నా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని జగన్ ఆరోపించారు. అయినా చంద్రబాబు కేంద్రాన్ని పొగుడుతారని జగన్ విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:33 - February 18, 2018

తమిళనాడలో ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లా పమ్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

తమిళనాడలో ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లా పమ్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

16:24 - February 18, 2018

హైదరాబాద్ : 

పీఎన్‌బీ స్కామ్‌ నిందితుడైన నీరవ్‌ మోదీని పట్టుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ స్కామ్‌ గత ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారాయన. 2016లో హరిప్రసాద్‌ అనే వ్యక్తి నీరవ్‌ అవినీతి గురించి ముందుగానే ప్రధానికి లేఖ రాస్తే ఎందుకు పట్టించుకోలేదని సురవరం ప్రశ్నించారు. ఓవైపు విదేశాలకు పారిపోయిన నీరవ్‌పై ఎంక్వైరీ జరగుతుంటే ప్రధాని మోదీని నీరవ్‌ ఎలా కలిశాడని సురవరం మండిపడ్డారు. బీజేపీ అవినీతికి ఇదే పెద్ద నిదర్శనమని సురవరం ఆరోపించారు.

 

16:23 - February 18, 2018

కృష్ణా : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయవాడలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన నేతలు విమర్శించారు. వివిధ పార్టీల నాయకులు హాజరైన ఈ భేటీలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కూడా చర్చించారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం రాజకీయలకు అతీతంగా అన్ని పార్టీలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే నెల 2న జాతీయ రహదారుల దిగ్బంధానికి కాంగ్రెస్‌ పిలుపు ఇచ్చింది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మార్చి 6వ తేదీ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్యాకేజీకి ఒప్పుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 

16:23 - February 18, 2018

కృష్ణా : దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌లలో విజయవాడ రైల్వే స్టేషన్‌ ఒకటి. ఏడాదికి 175 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం, 70 ప్యాసింజర్‌ రైళ్లు, 250 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మొత్తం 370కుపైగా రైళ్లలో నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించిన విజయవాడ రైల్వే జంక్షన్‌ ప్రైవేట్‌పరం కాబోతోంది. ఇందుకోసం చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్‌ బేరానికి ప్రైవేట్‌ కంపెనీలు టెండర్‌కు సిద్ధమయ్యాయి. ఒకటికాదు.. రెండుకాదు... ఏకంగా 45 నుంచి 99 ఏళ్లపాటు లీజుకివ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు డెడ్‌లైన్‌ విధించాయి. బెజవాడ రైల్వే జంక్షన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే అమలు చేస్తున్నారు.

దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం
విజయవాడ రైల్వేస్టేషన్‌కు పరిసరాలు, ఫ్లాట్‌ఫామ్‌లు అన్నీ కలిపి దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం ఉంది. దీని అంచనా విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు. ఇందులో ప్రపంచస్థాయిలో సదుపాయాలు కల్పిస్తామంటూ రైల్వేశాఖ చెబుతోంది. మరోవైపు ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు ముమ్మరం అయ్యాయి. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి రైల్వేస్టేషన్‌ వెళితే ఆజమాయిషీ ఉండదు. గతంలోనే ఆయా ప్రైవేట్‌ కంపెనీలకు 45 ఏళ్లపాటు లీజుకు అప్పగించాలని 2017లోనే ప్రతిపాదించారు. కానీ 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తేనే టెండర్లు ఆహ్వానిస్తామని కంపెనీలు రైల్వేకు అల్టిమేటం ఇచ్చాయి.

వాస్తవానికి రైల్వేల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు ఆహ్వానించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ 2017 ప్రారంభంలోనే రీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. రైల్వేస్టేషన్లను ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా నాన్‌టిక్కెట్‌ రెవెన్యూ కింద లక్ష కోట్లు ఆర్జించాలని చూస్తోంది. ఇందుకోసం దేశంలో మొత్తం 23 స్టేషన్లు ఎంపిక చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు తొలి ప్రాతిపదికన ఎంచుకున్నారు. ఈ రెండు స్టేషన్లను రీ డెవలప్‌మెంట్‌ కింద ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించారు. రైల్వేస్టేషన్‌లోని కమర్షియల్‌ స్థలంతోపాటు రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలను 45 ఏళ్లపాటు ప్రైవేట్‌కు లీజుకు అప్పగిస్తారు.

ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలి
విజయవాడ రైల్వేస్టేషన్ ను ప్రైవేట్ కు అప్పగించడాన్ని రైల్వేయూనియన్ నేతలు, సిబ్బంది, కార్మికులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రైల్వేస్టేషన్లను ప్రైవేట్‌కు ఇవ్వడమంటే అందులోపనిచేస్తున్న వారిని దగా చేయడమేనని నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలని సీపీఎం నేతలు కోరుతున్నారు.మొత్తానికి విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్రైవేట్‌పరం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై రైల్వేశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

16:20 - February 18, 2018

చెన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లా పమ్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పోలీసుల నుంచి చెరువులోకి దూకి మృతి

కడప : జిల్లా ఒంటిమిట్టలో విషాదం జరిగింది. చెరువలో దూకి ఏడుగురు తమిళ కూలీలు మృతి చెందారు. మూడు రోజుల క్రితం కూలీలు అడవిలోకి వెళ్తుండగా పోలీసులు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకోవడానికి కూలీలు చెరువులోకి దూకారు.

15:53 - February 18, 2018
15:52 - February 18, 2018
15:52 - February 18, 2018

ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : కొంపల్లిలో విషాదం జరిగింది. శివశివానికి కాలేజీకి చెందిన ఎంబీఏ విద్యార్థిని హనీషా ఆత్మ హత్య చేసుకుంది. హనీషా ఓ ప్రైవేట్ హాస్టల్ గదిలో స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

బాలికపై దారుణంగా అత్యాచారం

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో అభంశుభం తెలియని పసికూనపై ఓ కామంధుడు పంజా విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం సాయంత్రం ట్యూషన్ కు వెళ్తుండగా బాలికను కిడ్నాప్ చేసిన దుండగుడు బాలికను దారుణంగా హింసించి అత్యాచారం చేశాడు.

14:34 - February 18, 2018

కడప : జిల్లా ఒంటిమిట్టలో విషాదం జరిగింది. చెరువలో దూకి ఏడుగురు తమిళ కూలీలు మృతి చెందారు. మూడు రోజుల క్రితం కూలీలు అడవిలోకి వెళ్తుండగా పోలీసులు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకోవడానికి కూలీలు చెరువులోకి దూకారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:33 - February 18, 2018

హైదరాబాద్ : కొంపల్లిలో విషాదం జరిగింది. శివశివానికి కాలేజీకి చెందిన ఎంబీఏ విద్యార్థిని హనీషా ఆత్మ హత్య చేసుకుంది. హనీషా ఓ ప్రైవేట్ హాస్టల్ గదిలో స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:27 - February 18, 2018

హైదరాబాద్ : మనిషి విచక్షణ కోల్పోతున్నాడా, కామం మనిషిని రాక్షసున్ని చేస్తుందా, ప్రభుత్వం ఎన్ని చట్టలు తీసుకొచ్చిన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో అభంశుభం తెలియని పసికూనపై ఓ కామంధుడు పంజా విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సికింద్రాబాద్ తిరుమలగిరిలో దారుణం జరిగింది. స్నేహితుని వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న మైనర్ బాలికపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న మిలటరీ జవాను‌ కుమార్తె.. అమ్ముగూడ వద్ద స్నేహితుడిని కలిసి రైలు పట్టాల సమీపం నుంచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బాలికను అడ్డగించి బెదిరించాడు. అనంతరం చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు కలవడానికి వెళ్లిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేక ఎవరైనా బాలిక కదలికలు గమనించి అత్యాచారం చేశారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే సంఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

టీఆర్ఎస్ కార్పొరేటర్ రాజీనామా

కరీంనగర్ : కార్పొషన్ లో టీఆర్ఎస్ మహిళా కార్పొరేట్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీలత అనే కార్పొరేటర్ ఎమ్మెల్యే గంగుల వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ కార్పొరేటర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానాని శ్రీలత హెచ్చరించారు. 

టీఆర్ఎస్ కార్పొరేటర్ రాజీనామా

కరీంనగర్ : కార్పొషన్ లో టీఆర్ఎస్ మహిళా కార్పొరేట్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీలత అనే కార్పొరేటర్ ఎమ్మెల్యే గంగుల వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ కార్పొరేటర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానాని శ్రీలత హెచ్చరించారు.

ఇరాన్ లో కుప్పకూలిన ఫ్లైట్

టెహ్రాన్ : ఇరాన్ లో ఓ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్ నుంచి విమానం సంబంధాలు తెగిపోయింది. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. టెహ్రాన్ నుంచి యుసూజ్ వెళ్తుండగా ఏస్ మ్యాన్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం ప్రమాదానికి గురైంది. 

14:14 - February 18, 2018

టెహ్రాన్ : ఇరాన్ లో ఓ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్ నుంచి విమానం సంబంధాలు తెగిపోయింది. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. టెహ్రాన్ నుంచి యుసూజ్ వెళ్తుండగా ఏస్ మ్యాన్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:13 - February 18, 2018

కరీంనగర్ : కార్పొషన్ లో టీఆర్ఎస్ మహిళా కార్పొరేట్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీలత అనే కార్పొరేటర్ ఎమ్మెల్యే గంగుల వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ కార్పొరేటర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానాని శ్రీలత హెచ్చరించారు. గతంలో ఓ మహిళా కార్పొరేటర్ కూడా ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:19 - February 18, 2018

11 వేల 300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఉచ్చు బిగుస్తోంది. దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ ఆచూకి కోసం సిబిఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. నీరవ్‌తో పాటు ఆయన మేనమామ మెహుల్‌ చోక్సిల పాస్‌పోర్టులను విదేశాంగశాఖ 4 వారాల పాటు సస్పెండ్‌ చేసింది. విచారణకు హాజరు కావాలని నీరవ్‌ మోదీకి ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణంలో పీఎన్‌బీ మాజీ డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి, మరో ఉద్యోగి మనోజ్‌ ఖరాజ్‌తో పాటు నీరవ్‌ మోదీ గ్రూప్‌కు చెందిన హేమంత్‌ భట్‌లను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెంకట్రామయ్య, ఆర్థిక రంగ నిపుణులు శశికుమార్, బీజేపీ అధికారి ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ అధికారి ప్రతినిధి బెల్యా నాయక్, ఆర్థిక రంగం నిపుణులు పాపారావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

బీజేపీ మద్దతు తెలుపబట్టే రాష్ట్ర విభజన : మంత్రి నారాయణ

నెల్లూరు : డ్రాఫ్ట్ బిల్లుకు బీజేపీ మద్దతు తెలుపబట్టే రాష్ట్ర విభజన జరిగిగిందని మంత్రి నారాయణ అన్నారు. మిత్ర ధర్మ కోసమే ఇన్ని రోజులు ఓపిక పట్టామని తెలిపారు.చట్టబద్ధంగా ఏపీకి రావాల్సిన వాటికోసం పోరాడుతామని చెప్పారు. 

 

13:03 - February 18, 2018

హైదరాబాద్ : 11 వేల 300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఉచ్చు బిగుస్తోంది. దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ ఆచూకి కోసం సిబిఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. నీరవ్‌తో పాటు ఆయన మేనమామ మెహుల్‌ చోక్సిల పాస్‌పోర్టులను విదేశాంగశాఖ 4 వారాల పాటు సస్పెండ్‌ చేసింది. విచారణకు హాజరు కావాలని నీరవ్‌ మోదీకి ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణంలో పీఎన్‌బీ మాజీ డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి, మరో ఉద్యోగి మనోజ్‌ ఖరాజ్‌తో పాటు నీరవ్‌ మోదీ గ్రూప్‌కు చెందిన హేమంత్‌ భట్‌లను సీబీఐ అరెస్ట్‌ చేసింది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ మొదలైంది. 11 వేల 300 కోట్ల స్కాం కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ చౌకసికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. వారంలోగా వీరిద్దరు ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

పిఎన్‌బి స్కాంలో దేశం విడిచి పారిపోయిన నీరవ్‌తో పాటు ఆయన మేనమామ మెహుల్‌ చోక్సిల పాస్‌పోర్టులను విదేశాంగశాఖ 4 వారాల పాటు సస్పెండ్‌ చేసింది. ఈ చర్య తీసుకోకుండా ఉండాలంటే, వారంలోగా తగిన కారణాలను చూపించాలని వారిని విదేశాంగ శాఖ కోరింది. వీరు సరైన కారణాలను చూపించకపోతే నాలుగు వారాల అనంతరం వీరిద్దరి పాస్‌పోర్టులను పూర్తిగా రద్దు చేస్తారు. 

నీరవ్‌మోదీ న్యూయార్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన జేడబ్ల్యూ మరియట్‌ ఎస్సెక్స్‌ హౌస్‌లో ఉన్నారు. ఆయన భార్య పేరిట తీసుకున్న ట్రిపుల్‌ బెడ్‌ రూమ్స్‌ సూట్‌లో ఒక రాత్రికి లక్ష చెల్లిస్తున్నట్లు సమాచారం. 

నీరవ్‌ మోది కోసం సిబిఐ వేటాడుతోంది. నీరవ్‌ మోదితో పాటు ఆయన  భార్య అమీ మోది, సోదరుడు నిశాల్‌ మోది, గీతాంజలి ప్రమోటర్ మెహుల్‌ చౌకసీలను పట్టుకునేందుకు సిబిఐ ఇంటర్‌పోల్‌ సాయం కోరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 11 వేల 3 వందల కోట్లకు పైగా మోసగించిన నీరవ్‌ మోది- కుంభకోణం బయటపడే ముందే గత నెల మొదటి వారంలో కుటుంబంతో సహా విదేశాలకు చెక్కేశారు. 

నీరవ్‌మోదీ, మరో ఆభరణాల కంపెనీ తమ బ్యాంకు ద్వారా మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు పీఎన్‌బీ జనవరి 28న సిబిఐకి ఫిర్యాదు చేసింది. పీఎన్‌బీ నుంచి అక్రమంగా లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను తీసుకెళ్లి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి రుణాల పొందినట్లు పేర్కొంది. జనవరి 31న  కేసు నమోదు చేసిన సిబిఐ విచారణ చేపట్టింది. నీరవ్‌, ఆయన భార్య, సోదరుడు, చోక్సీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఉన్న నీరవ్ ఆస్తులు, గీతాంజలి జెమ్స్ షోరూంలపై గురువారంనాడు ఈడీ దాడులు చేసింది. 5,100 కోట్లు విలువచేసే బంగారం, వజ్రాలు, ఇతర ఖరీదైన స్టోన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 18 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది.

12:56 - February 18, 2018

కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీకి ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. పరీక్షల బహిష్కరణతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చూస్తుంటే... అనుకున్న సమయానికే... యధావిధిగా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్ సతీష్, ప్రైవేట్ డీగ్రీ, పీజీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత సత్యానారాయణ గుప్తా పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయం సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:25 - February 18, 2018
12:22 - February 18, 2018

కృష్ణా : విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ చీఫ్ రఘువీరా, వైసీపీ నేత పార్ధసారధి, సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. జనసేన మద్దతు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

కృష్ణా : విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించనున్నారు.

10:37 - February 18, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని చట్నీస్ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హోటల్ లో మంటలు చెలరేగాయి. భయంతో కస్టమర్లు బయటికి పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాణం నష్టం ఏమీ జరగలేదు... కానీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:27 - February 18, 2018

అనంతపురం : చిరుత దాడిలో పశువుల కాపరి మృతి చెందారు. రాయచోటీ సమీపంలోని గువ్వలచెరువు ఘాట్ లో నిన్న రాత్రి సురేష్ అనే పశువుల కాపరి, గొర్రెలపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో పశువుల కాపరి, రెండు గొర్రెలు మృతి చెందారు. ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత నెల రోజులుగా పులి సంచరిస్తోందని స్థానికులు ఫిర్యాదు చేసినా.. ఫారెస్టు అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సురేష్ మృతి చెందారని ఆరోపిస్తున్నారు. అతని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అటవీశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు పులిని పట్టుకుని జూకు తరలిస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

09:41 - February 18, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాలుగా గుర్తింపు పొందిన నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాల నేతలను అక్కడే కట్టడి చేయాలని  ప్రణాళికలను రచించినట్లు సమాచారం. మరో సారి అధికారం దక్కించుకునేందుకు  కీలక నేతల నియోజకవర్గాలే టార్గెట్‌గా అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
మరోసారి అధికారానికి టీఆర్ఎస్ వ్యూహం
మరోసారి రాష్ర్టంలో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం.  అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో  పరిస్థితులను చక్కబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.   అభివృద్ధి నినాదంతో  రాబోయే ఎన్నికలకు వెళ్ళే దిశగా గులాబీ పార్టీ అడుగులేస్తోంది.
కాంగ్రెస్‌ సీనియర్లు, ముఖ్యనేతలకు చెక్‌ పెట్టే యోచన
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటు...  కీలక నేతల నియోజకవర్గాలపైనా గులాబీ బాస్ దృష్టి సారించినట్లు సమాచారం.  కాంగ్రెస్‌లోని సీనియర్లు, ముఖ్యనేతలకు చెక్‌ పెట్టేందుకు గులాబీ దళం ప్రయత్నిస్తోంది. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, డికే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లాంటి నేతలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బలమైన నేతల  అనుచరులను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి కారెక్కేందుకు సుముఖంగా ఉన్న వారికి  ప్రాధాన్యతతోపాటు.. పదవులు కూడా కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో చాలా మందిని కారెక్కించుకున్నారు గులాబీ బాస్‌.... కాగా మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పంథాను అనుసరించనున్నట్లు సమాచారం.  

 

జైరాం రమేష్ ఆరోపణలను ఖండించిన మంత్రి యనమల

అమరావతి : పోలవరంపై జైరాం రమేష్ ఆరోపణలను మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి..అధారాలుంటే బయటపెట్టాలన్నారు. రాష్ట్ర విభజనలో జైరాం రమేష్ ఆడిన డ్రామా ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. 

 

కేపీహెచ్ బీ చట్నీస్ హోటల్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : కేపీహెచ్ బీ చట్నీస్ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. కస్టమర్లు భయంతో హోటల్ నుంచి పరుగులు తీశారు.

హిజ్రా హల్‌చల్‌

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 119 మంది మందుబాబులను అదుపులోకి తీసుకుని... వాహనాలు సీజ్‌ చేశారు. అయితే... మద్యం సేవించి కారు నడుపుతున్న ఓ హిజ్రా హల్‌చల్‌ చేసింది. తనిఖీలు నిర్వహిస్తుండగా... పోలీసులు, మీడియా ప్రతినిధులపై విరుచుకుపడింది. అసభ్యకరంగా దూషించింది. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడినుంచి పరారయ్యారు. 

జూబ్లీహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 119 మంది మందుబాబులను అదుపులోకి తీసుకుని... వాహనాలు సీజ్‌ చేశారు. అయితే... మద్యం సేవించి కారు నడుపుతున్న ఓ హిజ్రా హల్‌చల్‌ చేసింది. తనిఖీలు నిర్వహిస్తుండగా... పోలీసులు, మీడియా ప్రతినిధులపై విరుచుకుపడింది. అసభ్యకరంగా దూషించింది. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడినుంచి పరారయ్యారు. 

08:54 - February 18, 2018

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 119 మంది మందుబాబులను అదుపులోకి తీసుకుని... వాహనాలు సీజ్‌ చేశారు. అయితే... మద్యం సేవించి కారు నడుపుతున్న ఓ హిజ్రా హల్‌చల్‌ చేసింది. తనిఖీలు నిర్వహిస్తుండగా... పోలీసులు, మీడియా ప్రతినిధులపై విరుచుకుపడింది. అసభ్యకరంగా దూషించింది. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడినుంచి పరారయ్యారు. 

 

08:04 - February 18, 2018

కేంద్రంలోని బీజేపీ ఏపీని అన్ని విధాల మోసం చేసిందని వక్తలు అన్నారు. బీజేపీ, టీడీపీ మైత్రి బంధం చివరిదశకు వచ్చిందా ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు బాబూరావు, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ, వైసీపీ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ... రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ... నిరంకుశ ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంతో సాగిలపడిపోవడం టీడీపీకి తగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:56 - February 18, 2018

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో ఎదురులేని ఇండియా.. సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. వన్డే టాప్ ర్యాంకర్‌ సౌతాఫ్రికా, సెకండ్‌ ర్యాంకర్‌ భారత్‌ మధ్య తొలి టీ20కి వాండరర్స్ స్టేడియంలో రంగం సిద్ధమైంది.వన్డే సిరీస్‌ నెగ్గి జోరు మీదున్న విరాట్‌ కొహ్లీ అండ్‌ కో  టీ20ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. 

ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో టీమిండియా,సౌతాఫ్రికా మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. తొలి టీ20 వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా....సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల సిరీస్‌కు సై అంటోంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో టీ20 3వ ర్యాంకర్‌ భారత్‌కు 6వ ర్యాంకర్‌ సౌతాఫ్రికా సవాల్‌ విసురుతోంది.

వన్డే సిరీస్‌ విజయంతో విరాట్‌ కొహ్లీ అండ్‌ కో జోరు మీదుంది. ఆల్‌రౌండ్‌ పవర్‌తో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా..టీ20 సిరీస్‌ సైతం  నెగ్గి చరిత్రను తిరగరాయాలని ప్లాన్‌లో ఉంది. వన్డే సిరీస్‌లో తేలిపోయిన సౌతాఫ్రికా జట్టు టీ20ల్లో డుమిని సారధ్యంలో బరిలోకి దిగనుంది.వన్డే సిరీస్‌ ఓటమికి భారత్‌పై బదులు తీర్చుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. 

టీ20 ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌దే   పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 10 టీ20ల్లో పోటీ పడగా...భారత్‌ 6 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 4 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాకే తొలి టీ20లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

07:52 - February 18, 2018

ఢిల్లీ : భారత, ఇరాన్‌ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్రమోది, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ భేటి అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.  చాబహర్ పోర్ట్ వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం తదితర 9 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. రౌహనీ, మోదీలు కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నేతలు పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు. రౌహనీ నేతృత్వంలో  రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని మోదీ అన్నారు. చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధికి దోహదపడటానికి అనుమతించిన రౌహానీ దార్శనికతను మోదీ ప్రశంసించారు. తమ పొరుగు దేశాలు ఉగ్రవాద రహిత దేశాలుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు మోది పేర్కొన్నారు. భారత్‌-ఇరాన్‌ల మధ్య సంబంధాలు చారిత్రాత్మకం, నాగరికతతో కూడినవని ఇరాన్‌ అధ్యక్షుడు రౌహాని అన్నారు. భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని.... ముఖ్యంగా రవాణా, ఇంధనం రంగాల్లో పటిష్ట బాంధవ్యం ఉందని రౌహాని వెల్లడించారు.

 

 

నేడు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ఐవీ ప్యాలెస్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. ప్రత్యేకహోదా, విభజన హామీలపై చర్చించనున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ చీఫ్ రఘువీరా, వైసీపీ నేత పార్థసారధి, సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ హాజరు కానున్నారు.

కొనసాగుతున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

అగర్తల : త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 60అసెంబ్లీ స్థానాల్లో 59 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఛరిలామ్ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి మృతి కారణంగా ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. 

 

91వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

ప్రకాశం : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 91వ రోజుకు చేరుకుంది. ఉదయం 8 గంటలకు నూకవరం నుంచి ప్రారంభం కానుంది. 

07:41 - February 18, 2018

హైదరాబాద్ : కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీకి ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. పరీక్షల బహిష్కరణతో  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చూస్తుంటే... అనుకున్న సమయానికే... యధావిధిగా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వంపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రకటిత యుద్ధం
ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంపై అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించాయి... కాగా ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టేందుకు తనదైన శైలిలో సన్నద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి తమ డిమాండ్లు సాధించుకోవాలని చూస్తున్న కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీకి  ప్రభుత్వం రివర్స్‌లో షాకిచ్చేలా నిర్ణయం తీసుకుంది. 
పరీక్షలన్నీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 
జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్ మెంట్ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరిస్తామని కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ  ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది... ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరీక్షల  నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షలన్నీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహించేందుకు  ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ విద్యా సంస్థలనే పరీక్షా కేంద్రాలు, పేపర్లు దిద్దే కేంద్రాలుగా  ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇన్విజిలేటర్లతోపాటు.. పేపర్లు దిద్దేందుకు కూడా  ప్రభుత్వ ఉపాధ్యాయులనే  వినియోగించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీటికి సంబంధించి సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించాలన్నారు.
ప్రభుత్వ, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
ఈనెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో డిగ్రీ వార్షిక పరీక్షలు.. 15నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఐతే ప్రభుత్వ  హైస్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రస్తుతం ఫర్నిచర్ బాగుందని, వీలైనంత వరకూ పరీక్షల కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
సత్తా చాటాలని యోచిస్తోన్న ప్రభుత్వం  
ప్రైవేటు విద్యాసంస్థలు తమ డిమాండ్ల సాధనకోసం పరీక్షలను అస్ర్తంగా వాడుకోవాలని చూస్తుంటే...పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహించి సత్తా చాటాలని ప్రభుత్వం యోచిస్తోంది.. కాగా... విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా... సమస్య తీవ్రతరం కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.

07:33 - February 18, 2018

నిజామాబాద్ : జిల్లాలోని ఆర్మూర్ లో ఎర్రజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు రైతన్నలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్, జక్రాన్ పల్లి, కమ్మర్ పల్లి, బాల్కొండలో రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. పోలీస్‌ ఆంక్షల మధ్య  రైతులు భారీ ప్రదర్శన నిర్వహించి.. తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఈనెల 19న ఆర్మూర్ పట్టణ బంద్ కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది...
ఈనెల 19న ఆర్మూర్‌ పట్టణ బంద్‌కు పిలుపు
ఎర్రజొన్న, పసుపు పంటల మద్దతు ధరపై ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ వేదికగా రైతు జేఏసీ చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది.  ఆమరణ నిరాహార దీక్షలు,  జాతీయ రహదారుల దిగ్బంధనం చేసిన రైతన్నలు.... మూడో రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతోపాటు ఈనెల 19న ఆర్మూర్‌ పట్టణ బంద్‌కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది.
పోలీస్  ఆంక్షలను లెక్కచేయని రైతాంగం
జక్రాన్ పల్లి మండలం కేంద్రంలో భారీ సంఖ్యలో రైతులు జాతీయ రహదారి నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను కూడా లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో రైతులు తరలొచ్చారు. తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎర్రజొన్న పంటను 4500 రూపాయల ధరతో కొనుగోలు చేయాలని రైతన్నలు నినదించారు. తమ న్యాయమైన డిమాండ్‌ పరిష్కంచకుంటే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కమ్మర్ పల్లి, బాల్కొండలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.
ఆర్మూర్‌లో కొనసాగుతున్న  పోలీస్‌ ఆంక్షలు
రైతుల ఆందోళన దృష్ట్యా ఆర్మూర్‌లో  పోలీస్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్, జక్రాన్ పల్లి, బాల్కొండలలో పోలీసులు బారీగా మోహరించారు. ఈనెల 19న బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరో వైపు ఎర్రజొన్న కొనుగోలుకు ప్రభుత్వం  సమాయత్తమైంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.   ఈనెల 19 నుంచి 45 రోజుల పాటు ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.... 
మార్క్ ఫెడ్ ద్వారా ఎర్రజొన్నల కొనుగోలుకు ప్రభుత్వం సన్నహాలు 
ప్రభుత్వం ఎర్రజొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు సన్నహాలు చేస్తుంటే.. మరోవైపు  రైతు సంఘాలు 19న ఆర్మూర్‌ పట్టణ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ పరిస్ధితి నెలకొంది. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో... వేచి చూడాల్సిందే.

 

07:26 - February 18, 2018

చిత్తూరు : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా మూఢనమ్మకాలు మాత్రం మనిషిని వదలడంలేదు. ఏదో ఒక వంకతో... క్షుద్రపూజలు అంటూ వివిధ రూపాల్లో తమ మూఢనమ్మకాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఎక్కడో కాదు హైటెక్‌ సీఎంగా చెప్పుకునే చంద్రబాబు.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలోనే ఇలాంటి అంధవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతోన్న స్మశాన కోళ్లుపై 10టీవీ స్టోరీ. 
క్షుద్ర తంతు
అమావాస్య  వచ్చిందంటే చాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్షుద్ర తంతుకు తెరలేస్తోంది. కొందరు అంధవిశ్వాసులు.. జంతుబలులు, శ్మశానంలో పూజలు లాంటి వాటిని ఆచారంగా చెప్పుకుని.. కొనసాగిస్తున్నారు. తాజాగా, చిత్తూరు జిల్లాలో ఇలాంటిదే ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. ఎక్కడో కాదు.. సాక్షాత్తు హైటెక్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం పట్టణంలోనే ఈ ఆచారం కొనసాగుతోంది. 
అమావాస్య రోజున వింత ఆచారం 
కుప్పం పట్టణంలోని ఎన్‌టీఆర్‌ కాలనీలో శ్రీ ప్రసన్న అంగాళ్ల పరమేశ్వరీ ఆలయం ఉంది. ఇక్కడ మహాశివాత్రి తర్వాత వచ్చిన అమావాస్య రోజున వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు భక్తులు పూనకంతో ఊగిపోతూ.. అమ్మవారిని శ్మశాన కోళ్లకు ఆహ్వానించడం విడ్డూరం. వీరి పూనకాలు.. శివాళ్ల నడుమ.. అంగాళ్ల పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని.. జనం శ్మశానం దాకా వెళతారు. ఆ సందర్భంగా.. డప్పుల చప్పుళ్లతో.. నాట్యాలు.. పూనకాలకు లెక్కేలేదు. 
స్మశాన కోళ్ల పేరుతో పూజలు
కుప్పం పట్టణంలో నివసించే తమిళులు.. శ్మశానకోళ్లు పేరిట ఏటా ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నరు. తమిళనాడులో సర్వసాధారణమైన తంతును ఇక్కడా జరుపుకుంటున్నారు. దాదాపు మూడేళ్లుగా ఇక్కడ స్మశాన కోళ్ల పేరుతో పూజలు నిర్వహిస్తున్నారు. 
శ్మశానంలో మట్టితో కాళికాదేవి ప్రతిమ 
శ్మశానంలో మట్టితో ఏర్పాటు చేసిన కాళికాదేవి ప్రతిమకు.. అంగాళ్ల పరమేశ్వరీ ఉత్సవ విగ్రహంతోపాటు ప్రదక్షిణలు చేసిన భక్తులు.. ఆ  తర్వాత అసలు తంతును ప్రారంభిస్తారు. అమ్మవారి గర్భగుడిలో ఉంచిన కొరడాతో దెబ్బలు వేయించుకుంటారు. ఇదేంట్రా అంటే.. దేహంలోని దెయ్యం పరారవుతుందంటూ నమ్మబలుకుతారు. చిన్న పెద్దా ఆడ మగా తేడాలేకుండా అందరూ కొరడా దెబ్బలకోసం క్యూ కట్టడం.. శాస్త్రసాంకేతిక వినువీధులకు చేరిన ఈ రోజుల్లో విస్మయాన్ని కలిగించక మానదు.  
ఎముకలు, పుర్రెలను తింటూ పూనకంతో మహిళ 
ఇక తర్వాతి తంతు బొందలగడ్డలోని మానవకంకాలం నుండి తీసిన ఎముకలతో పాటు పుర్రెలను తింటూ పూనకంతో ఓ మహిళ ఊగిపోవడం... క్షుద్రపూజలను తలపించేలా జరిగే ఈ తంతు స్మశాన కోళ్లు కార్యక్రమంలో చివరి ఘట్టం. ఈ తంతుకు తరలివచ్చే భక్తులకు భారీ బందోబస్తునే ఏర్పాటు చేశారు పోలీసులు. రాకెట్‌ యుగంలో.. ఇలాంటి ఆదిమకాలం నాటి మూఢనమ్మకాలు రాజ్యమేలుతుండడాన్ని హేతువాదులు తప్పుబడుతున్నారు. 

 

ప్రారంభమైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

అగర్తల : త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. మొత్తం 60అసెంబ్లీ స్థానాల్లో 59 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఛరిలామ్ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి మృతి కారణంగా ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. 

విజయవాడలో నేడు భాజపా కీలక సమావేశం

కృష్ణా : విజయవాడలో నేడు భాజపా కీలక సమావేశం జరుగనుంది. బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలను ఆహ్వానించారు. 

07:06 - February 18, 2018

అగర్తల : ఈశాన్య రాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. మొత్తం 25 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కోసం మొత్తం 3 వేల 214 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  త్రిపురలో మొత్తం 60 శాసనసభ స్థానాలు ఉండగా 59 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 307 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చరిలం అసెంబ్లీకి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ్‌దేవ్‌ వర్మ మృతితో అక్కడ పోలింగ్‌ వాయిదా పడింది.  అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ 57 స్థానాలు.. ఆ పార్టీతో కూటమిలో ఉన్న సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యుషనరీ సోషలిస్ట్‌ పార్టీ ఒక్కో స్థానం చొప్పున పోటీ చేస్తున్నాయి. 59 స్థానాల్లో కాంగ్రెస్, 51 స్థానాల్లో బిజెపి పోటీ పడుతున్నాయి. బిజెపితో పొత్తులో ఉన్న ఇండిజీనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. తృణముల్‌ కాంగ్రెస్‌ 24 మంది అభ్యర్థులను బరిలోకి దించింది. ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడనున్నాయి. త్రిపురలో గత పాతికేళ్లుగా సిపిఎం ఫ్రంట్‌ అధికారంలో ఉంది. 

 

నేడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

అగర్తల : నేడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 60అసెంబ్లీ స్థానాల్లో 59 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఛరిలామ్ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి మృతి కారణంగా ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. 

నేడు మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన

ముంబై : నేడు మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ముంబైలో ఎయిర్ పోర్టుకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

Don't Miss