Activities calendar

19 February 2018

21:40 - February 19, 2018

హైదరాబాద్ : ప్రపంచ ఐటీ సేవల సమాఖ్య నాస్‌కామ్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన HICC ప్రపంచ ఐటీ సదస్సు మొదటి రోజు ఘనంగా జరిగింది. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. డిజిటల్‌ యుగ వాగ్దానం నెరవేరుద్దాం-డిజిటల్‌ విస్తరణ అనే నినాదంతో ప్రారంభమైన సదస్సు ఈ నెల 21 వరకూ జరగనుంది. దేశవ్యాప్తంగా యువతలో నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. దీనికోసం నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఐటీ రంగ అభివృద్ధి, పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని మోదీ ప్రస్తావించారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం సాధిస్తున్న ఘనతకు రోబోట్‌ సోఫియానే నిదర్శనం అన్నారు. ఇంటలిజెంట్‌ ఆటొమేషన్‌ ద్వారా దేశంలో యువకతకు ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. భారత్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగడం ఇదే ప్రథమమని సదస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ.

దేశంలో మరింత అభివృద్ధి
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీని దేశంలో మరింత అభివృద్ధి దశకు చేరుస్తున్నామన్నారు కేంద్ర ఐటీశాఖా మంత్రి రవిశంకర్‌ప్రసాద్. డిజిటల్‌ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్‌తో దేశంలో యువతకు ఉపాధి కల్పన వేగవంతం అవుతోందన్నారు. ఐటీలో భారత్‌ సాధిస్తున్న అభివృద్ధి ఇరుగుపొరుగు దేశాలకు కూడా అందిస్తోందన్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందన్నారు. ఐటీ కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఐటీ విప్లవం... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షిస్తోందన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో ప్రస్తుతం ప్రత్యక్షంగా ఐదులక్షల మందికి ఉపాధి లభిస్తోందని కేటీఆర్‌ అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో రోబో సోఫియా ప్రధాన ఆకర్శణగా నిలుస్తోంది. 

21:39 - February 19, 2018

గుంటూరు : తెలుగుదేశం-బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం రోజురోజుకీ పెరుగుతోంది. నువ్వొకటంటే.. నేను నాలుగంటా అన్న తీరులో.. ఇరుపక్షాల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. చివరికి ఈ వాగ్దాడి.. ప్రభుత్వాల నుంచి వైదొలగడం అన్న అంశం దాకా వచ్చేసింది. అధిష్ఠానం ఆదేశిస్తే.. ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని.. బీజేపికి చెందిన రాష్ట్ర దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు కుండబద్దలు కొడితే.. తెలుగుదేశం కూడా.. దీనికి దీటుగానే సమాధానం ఇస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రస్తుత పరిస్థితి ఉప్పు, నిప్పులా తయారైంది. తాజాగా, జగన్‌ విసిరిన అవిశ్వాసతీర్మానం అస్త్రం కూడా ఈ రెండు పక్షాల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోంది. బీజేపీతో జగన్‌కు రహస్య ఒప్పందం కుదిరందన్న అనుమానాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తూ.. బీజేపీని, వైసీపీని ఏకకాలంలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్‌డీయే కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒక్కటొక్కటిగా బీజేపికి దూరమవుతూ వస్తున్నాయి. పంజాబ్‌లో అకాలీదళ్‌, మహారాష్ట్రలో శివసేన, ఒడిశాలో బీజేడీలు బీజేపీకి దూరమయ్యాయి. ఇప్పుడు తెలుగుదేశం మాత్రమే కమలదళంతో కొనసాగడమా... దూరం కావడమా అన్న డైలమాలో ఉంది. ఈ క్రమంలో... బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. తెలుగుదేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో.. రెండు పక్షాల మధ్య స్నేహానికి కటీఫ్‌ తప్పదేమోనన్న భావన కలుగుతోంది. 

21:11 - February 19, 2018

గుంటూరు : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం పెద్ద విషయం కాదని, అన్ని ప్రయత్నాలూ ముగిశాకే.. చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విభజన హామీల కోసం అన్ని పార్టీలూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 54 మంది ఎంపీలు ఉంటేగాని అవిశ్వాసం ప్రవేశ పెట్టలేమని, అయితే చివరి ప్రయత్నంగా అవసరమైతే అన్ని పార్టీల సహకారం తీసుకొని తీర్మానం పెట్టేందుకు తాము వెనకాడబోమని అన్నారు. ఈ నెల 22న మరోమరు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

21:06 - February 19, 2018

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌ విసిరిన సవాల్‌కు జనసేనాని స్పందించారు. కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే.. తగిన మద్దతు కూడగట్టేందుకు తాను సంపూర్ణంగా సహకరిస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైసీపీ నుంచి ఒక్క ఎంపీ అయినా అవిశ్వాస తీర్మానం పెట్టాలని, అదికూడా.. కాలయాపన చేయకుండా.. నాలుగో తేదీనే ప్రతిపాదించాలని పవన్‌ సూచించారు. జగన్ బలమైన నాయకుడని.. ఆయనకు దమ్ము..తెగింపు.. ధైర్యం ఉన్నాయన్నది తన భావన అని.. అందుకే.. జగన్‌ తక్షణమే అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ విసిరారు. వైసీపీకి తాను అండగా ఉంటానని .. అవసరమైతే రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ స్పష్టం చేశారు.

అన్ని పార్టీలకు ఎంపీల మద్దతు
మార్చి 5న వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే.. అన్ని పార్టీలకు ఎంపీల మద్దతు తాను కూడగడతానని పవన్ స్పష్టం చేశారు. మార్చి 4న తాను ఢిల్లీకి వచ్చి సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ ఆద్మీ, టీడీపీ తదితర పార్టీలతో తాను మాట్లాడతానని చెప్పారు. 5న అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు రావాలని పవన్ అన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ కవిత.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్‌ యాదవ్, రాహుల్ గాంధీలు మద్దతు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఇది తెలుగు జాతి సమస్య అని.. తన నుంచి వైసీపీకి ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటానని పవన్ స్పష్టం చేశారు.

 

20:50 - February 19, 2018

నిజామాబాద్ : ఆర్మూరు అంతటా నిర్బంధకాండ..రైతు కనిపిస్తే అరెస్టులే..బంద్‌ను నీరుగార్చే క్రమంలో పోలీసుల ఓవరాక్షన్‌..ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతులు బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా.. పోలీసులు రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. తెల్లవారుజామునే రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్తున్న వామపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రైతు అన్నవాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్, మామిడి పల్లి చౌరస్తా, పెర్కిట్, అంబేడ్కర్ చౌరస్తా, దోబీఘాట్, తహశీల్దార్ కార్యాలయం, సుభాష్ నగర్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి.. రైతులు నిరసనకు దిగకుండా విపరీతమైన కట్టడి చేశారు. ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించినా.. రైతుల డిమాండ్‌కు మద్దతుగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను నిర్వాహకులు స్వచ్చందంగా మూసేశారు.

ఎర్రజొన్న రైతులు ఆవేదన
చేతికొచ్చిన పంటకు సరైన ధర పెట్టి కొనుగోలు చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ ఎర్రజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో నెలరోజులుగా ఆందోళనలతో తమ నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వం దిగి రాలేదు. దీంతో... రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ బంద్‌ నిర్వహించారు. ఎర్రజొన్నకు రూ.4,500, పసుపుకు రూ.10వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు రైతుల బంద్‌లు.. ఆందోళనల నడుమే.. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఎర్రజొన్న కొనుగోళ్ల కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రూ.2,300తో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆయన చెప్పారు.ప్రభుత్వం పట్టుదలకు పోకుండా.. తమ డిమాండ్‌ మేరకు మద్దతు ధర ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

20:38 - February 19, 2018

ఇక్కడ అందరు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని, ప్యాకేజీతో అయిపోయిందని పొగుడుకున్న వారు ఇప్పుడు తిట్టుకుంటున్నారుని, ఇంతలో పవన్ జేఎప్ సీ ఏర్పాటు చేశారని దీంతో జగన్ రాజీనామాలకు సిద్ధమని తెలపడంతో టీడీపీపై ఒత్తిడి పెరిగి చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రముఖ విశ్లేషకులు తెలిపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చూడండి.

20:19 - February 19, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల రాజకీయాలు జూస్తుంటే ఏమనిపిస్తున్నది..? అబ్బా లీడర్లకు కమిట్మెంట్ అంటె ఇట్లుండాలే.. ప్రజల మీద..? మళ్లొక పారి మనం ఈ లీడర్లనే గెలిపిచ్చుకోని రుణం దీర్చుకోవాలె అనిపిస్తలేదు.. ప్రత్యేక హోదా విషయంల చంద్రబాబు కమిట్మెంట్... జగన్ బాబు.. ఆరాటం.. పవన్ బాబు పాకులాట.. బీజేపీ పనితనం.. కాంగ్రెస్ హెచ్చరికలు... జూస్తుంటే.. ఇట్లనే అనిపిస్తది.. కని అస్సలు కథ గిది..

పోశమ్మ పోగేశి పెడ్తె.. మైసమ్మ మాయం జేశినట్టు పాపం హరీష్ రావు సారేమో.. బైటిపార్టోళ్లను కండువాలు మార్చి కారెక్కిస్తుంటే.. ఇంకోదిక్కుకెళ్లి కార్లకెళ్లి దిగి ఎల్లిపోతున్నరు అసలైన నేతలే.. కరీంనగర్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్ల తయ్యారైందంటే.. ఇప్పటికి ఇప్పుడు ఓట్లొస్తె.. ప్రతిపక్షాల కంటె వేగంగ సొంతపార్టోళ్లే కారుపని జేశెతట్టున్నరు..

సేమ్ గొర్ల పత్కం ఎట్ల తెర్లు తెర్లైందో.. డబుల్ బెడ్రూం ఇండ్ల కథ గూడ.. గోవింత నామస్మరణల మున్గిపోయినట్టే అనిపిస్తున్నది.. ఈ శాతగాని మాటలు ఎందుకు జెప్పాలే జనానికి ఎందుకు ఆశవెట్టాలే.. ఉన్నదేదో ఇయ్యక.. అల్లుడొస్తె ఏడవండాలే.. కోడిపిల్లను ఏడగమ్మాలే అని జేజమ్మ ముచ్చట్లన్ని జెప్తె.. యాడాదికి అంగుళం చొప్పున శరవేగంగ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణమైతున్నది..

బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ, పేదలందర్ని ఒక్కతాన గల్పి.. బహుజనుల రాజ్యం తయ్యారు జేశితీర్తమని తెలంగాణ సామాజిక పోరాట సమితోళ్లు అనుకొచ్చిండ్రు.. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంల అధికారం చేజిక్కిచ్చుకుంటం.. ఎక్వమందున్న బహుజనులను పరిపాలకులను జేస్తమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుసంతోష్ జెప్పిండు.. కోదండరాం, చెర్కు సుధాకర్ గూడ గట్టిగనే మాట్లాడిండు..

అలవాట్ల పొర్పాటున బూతుమాట అన్న.. క్షమించుమంటున్నడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. మీడియాతోని మాట్లాడుకుంట మాట్లాడుకుంట జగన్ మోహన్ రెడ్డి మీద నాల్కె జారిండు.. ఎంటనే సరిజేస్కోని సారీ అని చెప్పిండు.. అయినా జేసీ దివాకర్ రెడ్డి అసొంటి ఉత్తమ పురుషులు బూతులు మాట్లాడకపోతె ఆశ్చర్యంగని.. మాట్లాడితె ఏం ఆశ్చర్యం అంతేనా..?

గప్పట్ల ఒకపారి ఓఎన్జీసీ గ్యాస్ పైపులు లీకై.. ఊరికి ఊరే మంటలు లేశెగదా..? అగో అసొంటి కథనే అయితుండే జర్రైతె మళ్లొకపారి.. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం గొల్లెపాలెం మీదికెళ్లి ఓఎన్జీసీ కంపినోడు పైపులు వర్సుకుంట గ్యాస్ దీస్కపోతున్నడు.. పుసుక్కున ఆ పైపు వల్గినట్టున్నది.. మొత్తం గ్యాస్ మీదికి చిత్తుతున్నది.. గింత నిప్పుగూడ తల్గెనాంటే ఒడ్సెర సుమతే..

నల్లగొండ జిల్లా ఎలికట్టె ఊర్లెకెళ్లి ఒక పిలగాడు నాకు వాట్సప్ల వీడియో వంపిండు.. ఆ ఊర్లె జనానికి ఈగెలకు దోస్తీ గల్చింది.. మన్సులను జూడంగనే ఉర్కొచ్చి ఆల్తయట ఈగెలు.. ఇగ తాళ్లళ్ల గూడ గండోళ్ల మీద అభిమానం వెంచుకోని పొమ్మంటె గూడ వోతలేవట.. వాడెవ్వడో పుణ్యాత్ముడు జేశిన ఉద్దార్కానికి ఈగెల మోత మోగుతున్నది..

యాడంగ దాపురమైందో ఏం పాడో.. చిర్తపులి రోజు రాత్రి పూట రాను.. బర్రెనో గొర్రొనో కొర్కి సంప.. ఎన్నొద్దులు సూస్తరు చెప్పుండ్రి రైతులు.. ఉత్తపుణ్యానికే పసులు సచ్చిపోవట్టే.. అడ్వి అధికారులకు చెప్తె వాళ్ల చెవ్వుమీద పేనువారినట్టు గూడ ఉండదాయే.. ఇగ లాభం లేదని.. ఒక రైతు.. ఏకంగ చిర్తపులిని పోస్టు మర్టానికి వంపిండు.. తను దావఖానకు వొయ్యిండు..

అరరరే పాపం గుండు అన్మంతరావు సచ్చిపోయిండటగదా..? మస్తు జోకులు జేస్తుండే సీన్మలళ్ల..ఇయ్యాళ తెల్లారంగనే ఈ ముచ్చట తెల్సింది.. పాపం మంచిమన్షుండే.. అయితే పాణం గూడ బాగలేదట చాలొద్దుల సంది.. వాళ్లు వీళ్లు జర్రంత పైస సాయం జేశిండ్రటగని.. పైస సాయం జేసుడు తప్ప మనం ప్రాణ సాయం జేయలేముగదా..? పాపం...

 

విజయవాడలో మాదిగల సభ

కృష్ణా : జిల్లా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మాదిగల మహాసభ జరిగింది. ఈ సభకు సీఎం చంద్రబాబు హాజరైయ్యారు. సీఎం సమంక్షంలో  పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు టీడీపీలో చేరారు. 

19:43 - February 19, 2018

ఎర్రజొన్న కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే పండిస్తారని, అసలు మద్దతు ధర పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఎర్రజొన్న మద్దతు ధరపై మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీఆర్ఎస్ నేత రామ్మోహన్ అన్నారు. ఆర్మూర్ బంద్ విజయవంతం కావడంపై రైతులను తను అభినందిస్తున్నాని కాంగ్రెస్ నేత అంద్దకి దయాకర్ అన్నారు. ఎర్రజొన్నకు పెట్టుబడికి ఎక్కువగా ఉందని, ధర మాత్రం తక్కువగా ఉందని, ఎర్రజొన్న బయట దేశం 7వేల నుంచి 8వేలు తీసుకెళ్తున్నాయని కానీ రైతుల దగ్గర 3వేలకు కొట్టున్నారని ఆయన తెలిపారు. ఆర్మూర్, అంకాపూర్ గురించి సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారని, ఎర్రజొన్నలు పంజాబ్ వేరే రాష్ట్రాలకు 7వేల క్విటాల్ చొప్పున కొంటున్నారని, కానీ రైతులకు మాత్రం 2వేలు చెల్లిస్తున్నారని సాగర్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జగన్ సవాల్ స్వీకరిస్తున్నా : పవన్

హైదరాబాద్ : తను జగన్ సవాల్ స్వీకరిస్తున్నాని,0 వచ్చే నెల 4న ఢిల్లీ అన్ని పార్టీ మద్దతు కోరుతనాని, ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండనని వైసీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

19:08 - February 19, 2018

హైదరాబాద్ : తను జగన్ సవాల్ స్వీకరిస్తున్నాని,0 వచ్చే నెల 4న ఢిల్లీ అన్ని పార్టీ మద్దతు కోరుతనాని, ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండనని వైసీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కుదిరితే రేపే అవిశ్వాస తీర్మానం పెట్టండి ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ కేంద్రానికి భయపడుతున్నాయని పవన్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

స్కైప్ యాజమాన్యానికి నోటీసు

హైదరాబాద్ : పోలీసులు స్కైప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. సీసీఎస్ పోలీసులు ఇప్పటికే వర్మ ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు.

సినీ దర్శకుడికి పోలీసు నోటీసు

హైదరాబాద్ : ఒరు ఆధార్ లవ్ సినిమా దర్శకుడికి ఫలక్ నుమా పోలీసలు నోటీసులు జారీ చేశారు. ఆ చిత్రంలోని ఓ పాట ముస్లింలను కించపరిచే విధంగా ఉందని కొంతి మంది ముస్లిం యువకులు పీఎస్ ఫిర్యాదు చేశారు. 

18:40 - February 19, 2018

పశ్చిమగోదావరి : జిల్లా మల్కిపురం మండలం గొల్లపాలెంలో గెయిల్‌కు చెందిన పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడి గ్యాస్‌ ఎగదన్నుతోంది. దీంతో స్ధానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో మల్కిపురం, సఖినేటిపల్లి మండలాల్లో తరచుగా గ్యాస్ లీక్‌లు జరుగుతున్నాయని వాటిని తాత్కాలికంగా అదుపు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారంచూడటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాలం చెల్లిన పైప్‌లైన్లు తొలగించి కొత్త పైప్‌లైన్లు వేయాలని కోరుతున్నారు. 

18:33 - February 19, 2018

హైదరాబాద్ :  ప్రతి మనిషికి ఒకే విలువ దక్కినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. హైదరాబాద్‌లో తెలంగాణ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్‌ సామాజిక న్యాయం కోసం అందరం కలిసి సంఘటితంగా ప్రయత్నం చేయాలన్నారు. 

18:32 - February 19, 2018
18:27 - February 19, 2018

హైదరాబాద్ : ఒరు ఆధార్ లవ్ సినిమా దర్శకుడికి ఫలక్ నుమా పోలీసలు నోటీసులు జారీ చేశారు. ఆ చిత్రంలోని ఓ పాట ముస్లింలను కించపరిచే విధంగా ఉందని కొంతి మంది ముస్లిం యువకులు పీఎస్ ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:22 - February 19, 2018

హైదరాబాద్ : పోలీసులు స్కైప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. సీసీఎస్ పోలీసులు ఇప్పటికే వర్మ ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:19 - February 19, 2018

గుంటూరు : చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో దళితులపై అనేక దాడులు జరిగాయని దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23న దళిత గిరిజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దళిత, ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. 

18:19 - February 19, 2018

హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందన్నారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐటీ కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఐటీ విప్లవం.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షిస్తోందన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో ప్రస్తుతం ప్రత్యక్షంగా ఐదులక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. 

18:18 - February 19, 2018

శ్రీకాకుళం : విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే టీడీపీ కోరుతోందన్నారు మంత్రి పితాని సత్యనారాయణ. రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. మిత్రపక్షాలుగా ఉన్న తాము పరస్పరం విమర్శలకు దిగడం మంచిదికాదన్నారు. మిత్రత్వం తెంచుకోడానికి కూడా సిద్ధమంటున్న ఏపీ బీజేపీ నేతల తీరున మంత్రి తప్పుపట్టారు. టీడీపీ -బీజేపీల పొత్తులు తదిర విషయాలు జాతీయ స్థాయిలో నాయకులు చూసుకుంటారని, అనవసర వ్యాఖ్యలతో సమస్యను మరింత జఠిలం చేయొద్దని మంత్రి పితాని హితవు పలికారు.

18:17 - February 19, 2018
18:14 - February 19, 2018
18:12 - February 19, 2018

కర్నూలు : జిల్లా ఆలూరు ఎమ్మార్వో కార్యాలయంలో సస్పెన్షన్ గురైన తశీల్దార్ సూర్యనారాయణ హల్ చల్ చేశారు. 3 వారాల క్రితం సస్పెన్షన్ గురైన సూర్యనారాయణ ఆఫీస్ వచ్చి ఫైల్స్ ఎత్తుకెళ్లెందుకు యత్నించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:07 - February 19, 2018
18:06 - February 19, 2018

విశాఖ : జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎల్పీ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి మీ సేవా కేంద్రంలోకి దూసుకెళ్లింది. ట్యాంకర్ కలకత్తా పారదీప్ నుంచి పరవాడ ఫార్మాసిటీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:05 - February 19, 2018

పశ్చిమగోదావరి : జగన్ అవిశ్వాస కామెట్స్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బీజేపీతో టీడీపీ ఎప్పుడు విడిపోతుందా, తము ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ చూస్తుందని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:04 - February 19, 2018

గుంటూరు : మంత్రి మణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు చేయమని అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామని అన్నారు. ఏపీలో టీడీపీతో విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని ఆయన వ్యాఖ్యనించారు. ఒకరు తమాతో పొత్తు వదులుకుంటే ఇంకొకరు మాతో కలవడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

విడిపోతే నష్టం లేదు : మాణిక్యాలరావు

గుంటూరు : మంత్రి మణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు చేయమని అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామని అన్నారు. ఏపీలో టీడీపీతో విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని ఆయన వ్యాఖ్యనించారు. ఒకరు తమాతో పొత్తు వదులుకుంటే ఇంకొకరు మాతో కలవడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. 

పురుషోత్తంరెడ్డిని కస్టడీకి అప్పగించాలన్న ఏసీబీ...

హైదరాబాద్ : హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డిని వారం పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పురుషోత్తంరెడ్డి న్యాయవాదికి ఏసీబీ కోర్టు సూచించింది. కస్టడీ పిటీషన్ పై బుధవారం వాదనలు జరుగనున్నాయి. 

13:21 - February 19, 2018

విశాఖపట్టణం: : అచ్యుతాపురంలో దారుణం జరిగింది. స్టోర్‌ టు స్టోర్‌ కంపెనీలో మహిళా ఉద్యోగిపై సహోద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు జనరల్‌ మేనేజర్‌ దిలీప్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ శ్యామ్‌సుందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. అయితే కంపెనీలో మహిళలపై లైంగిక వేధింపులను సీఐటీయూ నేతలు ఖండించారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

 

13:18 - February 19, 2018

హైదరాబాద్ : ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీని దేశంలో మరింత అభివృద్ధి దశకు చేరుస్తున్నామన్నారు కేంద్ర ఐటీశాఖా మంత్రి రవిశంకర్‌ప్రసాద్. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. డిజిటల్‌ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్‌తో దేశంలో యువతకు ఉపాధి కల్పన వేగవంతం అవుతోందన్నారు. ఐటీలో భారత్‌ సాధిస్తున్న అభివృద్ధి ఇరుగుపొరుగు దేశాలకు కూడా అందిస్తోందన్నారు కేంద్ర మంత్రి. 

13:15 - February 19, 2018

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ సమస్యలపై స్పందించాలని విద్యుత్ కాంట్రాక్టు కార్మిక నేతలు పేర్కొన్నారు. సోమవారం విజయవాడ నగరంలో కాంట్రాక్టు కార్మికులు కదం తొక్కారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కార్మిక నేతలు టెన్ టివితో మాట్లాడారు. సాయంత్రం స్పష్టమైన ప్రకటన రాకపోతే సమ్మెలోకి వెళుతామని హెచ్చరించారు. తాము గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగిందని, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళితే..మద్దతిస్తామని ఆనాడు పవన్ కళ్యాణ్ హామీనిచ్చారని తెలిపారు. ఏపీ రాష్ట్రంలో కీలకంగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నారని, వెంటనే పవన్ స్పందించాలని డిమాండ్ చేశారు. 

సస్పెండైన తహశీల్దార్ హల్ చల్...

కర్నూలు : ఆలూరు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సూర్యనారాయణ హల్ చల్ చేశారు. మూడు వారాల క్రితం అవినీతి ఆరోపణలతో ఆయన సస్పెండ్ కు గురయ్యారు. సోమవారం కార్యాలయానికి అనుమతి లేకుండా వచ్చిన ఆయన పలు ఫైల్స్ వెతికేందుకు ప్రయత్నించారు. దీనిపై ఇతర సిబ్బంది అభ్యంతరం తెలిపారు. కోర్టుకు సంబంధించిన ఫైల్స్ వెతుకుతున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భారీ ఎర్రచందనం దుంగల స్వాధీనం...

నెల్లూరు : జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 70 లక్షల విలువైన 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 27 మంది స్థానిక, అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు చేశారు. 4 కార్లు, 24 సెల్ ఫోన్లు, 6 గొడ్డళ్లు, రూ. 6450ని స్వాధీనం చేసుకున్నారు. కావలి రూరల్ (మం) దుత్తలూరు, సంగం మండలాల్లో ఏకకాలంలో పోలీసులు దాడులు చేశారు. 

ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు - బాబు..

పశ్చిమగోదావరి : నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. నరేగా పనులు ముమ్మరం చేసి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. 

ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు - బాబు..

పశ్చిమగోదావరి : నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. నరేగా పనులు ముమ్మరం చేసి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. 

'స్పందించాలి..లేకపోతే సమ్మెలోకి'...

విజయవాడ : సాయంత్రం స్పష్టమైన ప్రకటన రాకపోతే సమ్మెలోకి వెళుతామని ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు హెచ్చరించారు. తాము గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగిందని, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళితే..మద్దతిస్తామని ఆనాడు పవన్ కళ్యాణ్ హామీనిచ్చారని తెలిపారు.

12:53 - February 19, 2018

విశాఖపట్టణం : అచ్యుతాపురం బ్రాండిక్స్ స్టోర్ టు కంపెనీలో దారుణం చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగిపై వేధింపుల ఘటన చోటు చేసుకుంది. ఈ కంపెనీలో ఛత్తీస్ గఢ్ కు చెందిన దళిత మహిళ పనిచేస్తోంది. కంపెనీలపై తనపై జరుగుతున్న లైంగిక దాడి..లైంగిక వేధింపులపై 27వ తేదీన ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై డీఎస్పీ సహాయంతో విచారణకు ఆదేశించారు. లైంగిక దాడి..లైంగిక వేధింపులు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సెంట్రల్ మేనేజర్ దిలీప్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్యామ్ సుందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వివిధ కార్మిక సంఘాలు, సీపీఎం నేతలు గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఈఘటనను మహిళా సంఘాలు ఖండించాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

12:49 - February 19, 2018

నిజామాబాద్ : ఆర్మూర్ లో ఎర్రజొన్న రైతులు బంద్ పాటిస్తున్నారు. పసుపు..ఎర్రజొన్న కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న అధికారులు..ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలున్నాయి. దీనితో సోమవారం రైతులు ఆర్మూర్ రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారులపై రైతులు నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు రైతులను అరెస్టు చేశారు. ఎర్రజొన్నకు రూ. 4 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

విజయ్ కాంత్ తో కమల్ భేటీ...

చెన్నై : ప్రముఖ సినీ నటుడు, కమల్ హాసన్ డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్ కాంత్ ను కలిశారు. కమల్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్న సంగతి తెలిసిందే. ఆదివారం నటుడు రజనీకాంత్ ను కలిశారు. 

12:34 - February 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్ల భర్తీలో మరో అవినీతి భాగోతం వెలుగు చూసింది. అర్హులైన క్రీడాకారులకు పక్కనపెట్టి, అనర్హులకు సీట్లు కేటాయించడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తాజాగా తనకు అన్యాయం జరిగిందని నిర్మల్ జిల్లా కానాపూర్ మండలానికి చెందిన విలువిద్య క్రీడాకారిణి ఇవాన్ జలీస్ పేర్కొంటున్నారు. ఇవాన్ కు దక్కాల్సిన మెడికల్ సీటును మరో విద్యార్థినికి అధికారులు కేటాయించారు. సీనియర్ విభాగంలో ఆడితే జూ.విభాగంలో ఆడినట్లు పాయింట్లూ ఇస్తూ అధికారులు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జలీస్ పథకాలు సాధించారు. పని ఒత్తిడి వల్లే ఇలాంటి తప్పు జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇలాంటి మోసాలు వెలుగులోకి ఇంకా ఎన్ని ఉన్నాయో అనే ప్రచారం జరుగుతోంది.

ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కానీ ఇలాంటి అవినీతి భాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవలే అధికారుల నిర్వాకంతో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు భరత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షితా రాజ్‌ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. 

12:32 - February 19, 2018

పశ్చిమగోదావరి : రాష్ట్రంలో 28 ప్రాజెక్టులను జూన్ నాటికల్లా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో పోగొండి ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2019కల్లా పూర్తి చేస్తామన్నారు. వంశధార నుండి పెన్నా వరకు నదుల అనుంసధానానికి శ్రీకారం చుడుతామని, పట్టిసీమ పూర్తి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ లో మహాసంగమానినికి శ్రీకారం చుట్టినట్లైవుతుందన్నారు. 116 రోజులు జల సంరక్షణ ఉద్యమం చేపట్టడం జరిగిందని, సాగునీటి సంఘాలు భాగస్వాములు కావాలని...చివరి భూముల వరకు నీళ్లు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో 46వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని, గొలుసు కట్టు చెరువులుగా తయారు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 14వేల చెక్ డ్యామ్ లు నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉన్న చెక్ డ్యామ్ లకు మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు.

యనమల సమీక్ష...

విజయవాడ : 2018-19 బడ్జెట్ కసరత్తుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధక్షన మూడో రోజు సమీక్ష జరుగుతోంది. ఈ సమీక్షలో హోం మంత్రి చిన రాజప్ప, అధికారులు పాల్గొన్నారు. 

మెడికల్ సీట్ల భర్తీలో అవినీతి...

హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స కోటా మెడికల్ సీట్ల భర్తీలో మరో అవినీతి భాగోతం బయటపడింది. నిర్మల్ జిల్లా కానాపూర్ మండలానికి చెందిన విలువిద్య క్రీడాకారిణి ఇవాన్ జలీస్ కు అన్యాయం జరిగిందని వెలుగు చూసింది. జలీస్ కు దక్కాల్సిన మెడికల్ సీటును మరో విద్యార్థినికి అధికారులు కేటాయించారు. సీనియర్ విభాగంలో ఆడితే జూ.విభాగంలో ఆడినట్లు పాయింట్లూ ఇస్తూ అధికారులు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జలీస్ పథకాలు సాధించారు.

24 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం...

విశాఖపట్టణం : పబ్లిక్ రంగ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్రం గత బడ్జెట్ 24 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకుంది. అత్యంత లాభాలతో నడుస్తున్న ఆయిల్ సెక్టర్ తో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచే చర్యలను పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. 

11:38 - February 19, 2018

తూర్పుగోదావరి : అందమైన గోదావరి, అంతకంటే అందమైన ప్రకృతి మధ్యలో.. పడవ ప్రయాణం అంటే ఎవరికి ఇష్టముండదు. భూతల స్వర్గాన్ని తలపించే పాపికొండలకు పెట్టింది పేరు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యటకులు పెద్ద సంఖ్యలో పాపికొండలకు చేరుకుంటారు. ఇదే అదునుగా తీసుకున్న టూరిజం, బోటు నిర్వహకులు యాత్రికులను నిలువునా దోచేస్తున్నారు.

చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవీ ప్రాంతం, పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదమైన వాతావరణం పాపికొండలకే సొంతం. తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్‌ పురం మండలంలో ఉన్న పాపికొండలు జల విహార యాత్రకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. పోచవరం గ్రామం నుండి సుమారు రెండు గంటలు గోదావరి నదిలో సాగే ప్రయాణం పర్యటకులను మైమరపింప జేస్తుంది. అయితే ఇక్కడే మొదలైంది అసలు సమస్య. బోటు ప్రయాణం తప్పని సరైన ఈ ప్రదేశంలో బోటు నిర్వహకులు ధరలను విపరీతంగా పెంచేశారు.

ఉదయం 10 గంటలకు పోచావరం గ్రామం వద్ద మొదలైన బోటు ప్రయాణం పాపికొండల వద్దకు వెళ్లి వచ్చేందుకు ఒక్కో వ్యక్తి వద్ద 500 నుండి 700 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బోట్‌లో కనీసం లైఫ్‌ జాకెట్లు కూడా ఇవ్వడంలేదు. ఇటీవల జరిగిన కృష్ణా నదిలో పడవ ప్రమాదం తర్వాత కూడా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించడంలేదు.

రాత్రి వేళల్లో ఇక్కడ బస చేయాలంటే అక్కడి కొండ ప్రాంతంలో ఉండే కొల్లూరు గ్రామంలో వెదురు పాకలతో హట్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఉండేందుకు రద్దీని బట్టి 1000 రూపాయల నుండి 1500 వరకు రేట్‌ ఫిక్స్‌ చేస్తారు. చేసేదేమీలేక యాత్రికులు వారు అడిగినంత ఇచ్చి ఇక్కడ సేదతీరుతుంటారు. అయితే ఇక్కడా సౌకర్యాలు కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు నిర్వహకులు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా లేవు. నిత్యం వేలాది మంది పర్యటకులు సందర్శించే ఈ ప్రాంతంలో మద్యం ఏరులై పారుతోంది. అయినప్పటికీ హట్స్‌ నిర్వహకులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

భద్రాచలం ఈ ప్రాంతానికి చేరువలో ఉండటంతో పాపికొండలకు ఆదరణ మరింత పెరిగింది. పర్యటకులు అధికంగా వస్తుండటంతో బోటు సామర్థ్యానికి మించి టికెట్లు విక్రయిస్తున్నారు నిర్వహకులు. పాపికొండలు అటవీ ప్రాంతం కావడంతో సాయంత్రం 6 తర్వాత ఇక్కడ వాహనాలు తిరగకూడదనే నిబంధన ఉంది. అయినప్పటికీ నిర్వహకులు పట్టించుకోకపోవడంతో వన్యప్రాణులు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటక ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించని నిర్వహకులపై యాత్రికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకొని నిర్వహకుల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. 

11:35 - February 19, 2018

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో మోడీ...

ఢిల్లీ : భారత్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగడం ప్రథమమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. హెచ్ ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు భారత్..హైదరాబాద్ స్వాగతం పలుకుతోందని, డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వంతో సాధ్యమయ్యే పని కాదని, లక్ష గ్రామాలను ఆఫ్టికల్ ఫైబర్ తో అనుసంధించినట్లు వెల్లడించారు. 30 మిలియన్ల జన్ ధన్ ఖాతాలా ద్వారా రూ. 57వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు. 

11:26 - February 19, 2018

ఢిల్లీ : భారత్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగడం ప్రథమమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. హెచ్ ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు భారత్..హైదరాబాద్ స్వాగతం పలుకుతోందని, డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వంతో సాధ్యమయ్యే పని కాదని, లక్ష గ్రామాలను ఆఫ్టికల్ ఫైబర్ తో అనుసంధించినట్లు వెల్లడించారు. 30 మిలియన్ల జన్ ధన్ ఖాతాలా ద్వారా రూ. 57వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు. 

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ?

ఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ యోచిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రెస్ నేతలు కలిసి ఒప్పించినట్లు తెలుస్తోంది. విభజన సమస్యలపై 184 నిబంధన కింద కాంగ్రెస్ ఇప్పటికే నోటీసు ఇచ్చింది. 

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్...

హైదరాబాద్ : హైటెక్స్ వేదికగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని, సాంకేతికతను ఉపయోగించుకొని ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 

ప్రపంచ ఐటీ సదస్సులో మోడీ...

హైదరాబాద్ : హైటెక్స్ లోని హెచ్ఐసీసీలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. 

విక్రమ్ కొఠారీ ఇంట్లో సీబీఐ తనిఖీలు...

ఢిల్లీ : రొటోమాక్ పెన్స్ అధినేత విక్రమ్ కొఠారీ ఇంట్లో సీబీఐ సోదాలు జరుపుతోంది. సుమారు రూ. 800 కోట్లు ఎగ్గొట్టాడు. ఐదు బ్యాంకుల నుండి ఈ డబ్బును తీసుకున్న కొఠారి ఇప్పటి వరకు అసలు..వడ్డీ కొఠారీ చెల్లించలేదు. 

కర్నూలులో రేవ్ పార్టీ కలకలం...

కర్నూలు : అర్ధరాత్రి రేవ్ పార్టీ కలకలం రేపింది. ఎరువుల సంస్థ నిర్వాహకులు మద్యం సేవించి యువతులతో అశ్లీల నృత్యాలు చేశారు. రేవ్ పార్టీలో ఓ సీఐ, ఇతర పలువురు వ్యవసాయ అధికారులున్నట్లు సమాచారం. షీ టీమ్స్ దాడితో సీఐ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 

హైటెక్స్ లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు...

హైదరాబాద్ : హైటెక్స్ లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లు పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించనున్నారు. 89 దేశాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారు. 

సీబీఐ అదుపులో పీఎన్ బీ బ్యాంకు...

ఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ముంబై లో నీరవ్ మోడీ సీఎఫ్ వో కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ముంబై బ్రాడీ రోడ్డులోని పీఎన్ బీ బ్రాంచ్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. 

 

డిగ్రీ కాలేజీ బస్సు బోల్తా...

ప్రకాశం : కొత్తపట్నం మండలం ఆలూరు వద్ద ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండగా 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. 

శంషాబాద్ లో కస్టమ్స్ తనిఖీలు...

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయణీకుల నుండి కిలో 47 గ్రాముల బంగారం గాజులను స్వాధీనం చేసుకున్నారు.

 

ఏపీలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ...

విజయవాడ : ఏపీలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ లో బహిరంగ సభకు భారీగా కార్మికులు తరలివచ్చారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : నీరు ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే 45 రోజుల్లో నరేగా పనులు ముమ్మరం కావాలని ఆదేశించారు. 

10:44 - February 19, 2018

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని గ్రీన్ గోల్డ్ అపార్ట్ మెంట్ వద్ద వివాహిత విగతజీవిగా పడి ఉండడం కలకలం రేపింది. మృతి చెందిన మహిళ నాగలక్ష్మీగా పోలీసులు గుర్తించారు. మూడో ఫ్లోర్ నుండి కిందపడిపోయిందని భర్త పేర్కొంటుండగా ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం గమనార్హం. భర్తే హత్య చేసి అపార్ట్ మెంట్ వద్ద పడేశాడని కుటుంబసభ్యులు..స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:52 - February 19, 2018

హైదరాబాద్ : గుండు హనుమంతరావు మరణం తనను ఎంతో బాధించిందని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఎస్సార్ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ పెద్దలు గుండు హనుమంతరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. గుండు హనుమంతరావు సతీమణి, కూతురు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆయనకు ఒక కుమారుడు.

బ్రహ్మనందం..శివాజీ..మురళీ మోహన్..విచారం...
ఆయకు నివాళులర్పించిన అనంతరం శివాజీ, బ్రహ్మానందం, ఎంపీ మురళీ మోహన్ లు మీడియాతో మాట్లాడారు. గుండు హనుమంతరావు లేని లోటు తీర్చలేనిదని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఉద్యోగం..చదువు మానేసి గుండు హనుమంతరావును కొడుకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా..ఎదుర్కొన్నాడని ఎవరికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదన్నారు. కళ్లు సినిమాలో తాను గుండు హనుమంతరావు నటించడం జరిగిందని శివాజీ తెలిపారు. 'అమృతం' సీరియల్ తమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. ఎవరినీ ఏ సహాయం అడగలేదని తెలిపారు. మా అసోసియేషన్ తరపున గుండు హనుమంతరావు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. గుండు హనుమంతరావు మృతి ఎంతో బాధకరమని, ఎన్నో కార్యక్రమాలు చేశారని ప్రముఖ నటుడు, ఎంపీ మురళీ మోహన్ మెచ్చుకున్నారు. ఆయన ఆర్థికంగా చితికిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి కొంత ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. కుమారుడు గుండు హనుమంతరావు ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు కృషి చేశాడన్నారు. 

మల్కాజ్ గిరిలో వివాహిత మృతి...

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గ్రీన్ గోల్డ్ అపార్ట్ మెంట్ లో నాగలక్ష్మీ మృతి చెందింది. మూడో ఫ్లోర్ నుండి కిందపడిపోయిందని భర్త పేర్కొంటున్నారు. ఒంటిమీద గాయాలు లేకపోవడంతో భర్త హత్య చేశాడని మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు.

 

మహిళా ఉద్యోగిపై వేధింపులు...

విశాఖపట్టణం : అచ్యుతాపురం బ్రాండిక్స్ లోని స్టోర్ టు కంపెనీలో మహిళా ఉద్యోగిపై వేధింపుల ఘటన చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో సెంట్రల్ మేనేజర్ దిలీప్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్యామ్ సుందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

08:55 - February 19, 2018

ఢిల్లీ : మరో కుంభకోణం వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం మరువకముందే మరో మోసం బహిర్గతమైంది. రొటొమాక్ పెన్నుల కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు. సుమారు రూ. 800 కోట్లు ఎగ్గొట్టాడు. ఐదు బ్యాంకుల నుండి ఈ డబ్బును తీసుకున్న కొఠారి ఇప్పటి వరకు అసలు..వడ్డీ కొఠారీ చెల్లించలేదు. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుండి అప్పులు తీసుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘించిన పలు బ్యాంకులు అతడికి అప్పులిచ్చాయి. గత కొన్ని రోజులుగా కాన్పూర్ లో ఉన్న కార్యాలయం మూతపడింది. 

పగడాల రామయ్య కన్నుమూత...

ప్రకాశం : గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య (72) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ఏఐసీసీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 

08:26 - February 19, 2018

ప్రత్యేక హోదా..విభజన హామీల అమలుపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వారు క్రెడిట్ దక్కించుకొనేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరివారంలో అవిశ్వాసం తీసుకొస్తామని తేల్చి చెప్పారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దుర్గా ప్రసాద్ (టిడిపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), విష్ణు శ్రీ (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:12 - February 19, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమ మరొక నటుడిని కోల్పోయింది. ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఎస్సార్ నగర్ లోని ఓ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీనితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య..కూతురు...మరణించిన అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు ఒక కుమారుడున్నాడు. ఆర్థికంగా చితికిపోవడంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మా అసోసియేషన్ సహాయం అందచేసిన సంగతి తెలిసిందే. ఎస్సార్ నగర్ లో ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు. సాయంత్రం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అక్టోబరు 10, 1956లో విజయవాడలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. తొలిసారి రావణబ్రహ్మ వేషాన్ని వేశారు. 'సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారు. మొత్తం 400 సినిమాల్లో నటించారు. 'అమృతం' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు హనుమంతరావు మిఠాయి షాపు నిర్వహించేవారు.

బాబాయి హోటల్, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా.. తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 

08:10 - February 19, 2018

పెండింగ్‌లో ఉన్న వేలకోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వకపోతే పరీక్షలను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రైవేటు విద్యాసంస్థలు తేల్చి చెప్పిన ప్రస్తుత తరుణంలో ఈ డిమాండ్‌ తన చర్చ పరిధిని పెంచుకుంది. అసలు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విడుదలపై ప్రభుత్వం మొండిగా ఎందుకు వ్యవహరిస్తుంది అన్న విషయాలపై టెన్ టివి జనపథంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారమేశ్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఎర్రజొన్నల కొనుగోలు...

నిజామాబాద్ : నేటి నుండి ఎర్ర జొన్నల కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా ఈ కొనుగోలులు జరుగనున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, కిసాన్ నగర్, వేల్పూర్, కమ్మరపల్లిలోని మార్కెట్ లో కొనుగోలు జరుగనున్నాయి. 

కాంగ్రెస్ ఆత్మగౌరవ దీక్షలు...

విజయవాడ : నేటి నుండి 28వ తేదీ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్షలు జరుగనున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ దీక్షలు చేపట్టనుంది. 

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు...

కర్నూలు : నేటి నుండి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 2వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

07:28 - February 19, 2018

హైదరాబాద్ : మలుపు ప్రచురణా సంస్థ ఆధ్వర్యంలో.. యుద్ధకాలంలో స్వప్నాలు.. బాల్యజ్ఞాపకాలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కెన్యా రచయిత గుగి వా థియాంగో రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి జి.ఎన్‌.సాయిబాబా అనువాదం చేశారు. ఆదివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో... గుగి వా థియాంగో సహ విద్యార్థి ప్రొఫెసర్‌ సుజీతారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్‌.వేణుగోపాల్‌ అధ్యక్షతన ... జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుస్తక మూల రచయిత గుగి వా థియాంగో, వక్తలుగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, ప్రముఖ సాహితీ విమర్శకులు ఎ.కె. ప్రభాకర్‌ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి తన బాల్య స్మృతులకు గుగి వా థియాంగో ఇచ్చిన అక్షర రూపమే ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని సాయిబాబా తెలుగులోకి అనువాదం చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మూల రచయిత గుగి వా థియాంగో.

07:16 - February 19, 2018

విజయవాడ : కేంద్రంపై ఏపీలో వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు రాష్ర్ట బీజేపీ నేతలు విజయవాడలో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీకి కేంద్రం చేసిన ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. మిత్రపక్షమైన టీడీపీ కూడా బీజేపీనీ దెబ్బ కొట్టేందుకు చూస్తోందని.. దానికి చెక్‌ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై బీజేపీని విమర్శించే వారికి ఘాటుగా సమాధానం చెబుతుమంటూ హెచ్చరిస్తోంది ఆ పార్టీ రాష్ర్ట నాయకత్వం.

ఏపీలో విభజన హామీలపై ఆందోళనతోపాటు... తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ర్ట బీజేపీ ఆధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్‌ నేతలు, జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ర్టానికి కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వడం లేదన్న టీడీపీ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

సమావేశానికి హాజరైన నేతలందరికీ పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి అన్యాయం జరిగిందన్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని సూచించినట్లు సమాచారం. ఏపీకి కేంద్రం చేసిన ప్రయోజనాలపై ప్రచురించిన పుస్తకాన్నివిడుదల చేశారు. విభజన హామీలతోపాటు.. దుగరాజపట్నం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వేజోన్ వంటి కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

మెట్రోరైలు విషయంపై కేంద్రం సానుకూలంగా ఉందన్నారు హరిబాబు. రెవెన్యూ లోటు భర్తీకి ఇప్పటివరకూ 4వేల కోట్లు ఇచ్చిందన్నారు. లక్ష కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేసిన అంశాలు హక్కులు గానూ... ఇవ్వని వాటిని మోదీ పాపాలుగానూ అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కేంద్రం సాయంపై బహిరంగ చర్చకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు చేసిన సవాల్‌పై ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. సీఎం విసిరిన సవాల్‌కు తాము సిద్దమేనన్నారు. సినిమా స్క్రిప్టులు చదివే సంస్కృతి మాది కాదు... టీడీపీదే అంటూ మండి పడ్డారు. అమరావతితోపాటు విజయవాడ అభివృద్ధికి కూడా కేంద్రం ఎన్నో నిధులిచ్చిందన్నారు.

మిత్రపక్షం టీడీపీ తమపై చేస్తున్న దాడిని తప్పికొడతామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు హెచ్చరించారు. ఏపీ ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. విభజన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇంకా సమయం ఉన్నా మూడేళ్ళలోనే చాలా చేశామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఈ సమావేశంలో నేతల మధ్య గొడవ చోటు చేసుకోవడం కొసమెరుపు. పార్టీ నేతల నుంచి సలహాలు తీసుకునే సమయంలో... పార్టీ అధ్యక్షుడు హరిబాబుకు పార్టీ కార్యవర్గ సభ్యుడు లక్ష్మీపతిరాజుకు మధ్య వాగ్వివాదం జరిగింది. టీడీపీని ఎదుర్కొనే విషయంపై లక్ష్మీపతిరాజా మాట్లాడుతుంటే... ఇక కూర్చోండి అని హరిబాబు అనడంతో గొడవకు దారితీసింది. మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు సాగిన ఈ సమావేశంలో టీడీపీని టార్గెట్‌ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ భవిష్యత్తులో సంచనాలకు తెరతీసే సూచనలు కనిపిస్తున్నాయి.

గుండు హనుమంతరావు కన్నుమూత...

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు ఎస్సార్ నగర్ స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో గుండు జన్మించారు. 'అహ నా పెళ్లంట' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. 18 ఏళ్ల వయస్సులో 'రామ బ్రహ్మ' నాటకంలో నటించారు. సుమారు 400 సినిమాలో గుండ హనుమంతరావు నటించారు. కొబ్బరిబోండాం..మాయలోడు..యమలీల..వినోదం సినిమాలతో గుండుకు మంచి గుర్తింపు వచ్చింది. టీవీ కార్యక్రమాలకు సంబంధించి గుండు హనుమంతరావుకు మూడు నంది అవార్డులు లభించాయి. 

07:04 - February 19, 2018

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బుట్టాయగూడెం మండలం చింతలగూడెంలో నిర్మించిన పోగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. బైనేరు నదిపై 129 కోట్ల రూపాయల వ్యయంతో పోగొండ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించి ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ పోగొండ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభిస్తారు.

ఈ ఉదయం 9.50 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు చింతలగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్‌ దగ్గరికి వెళ్తారు. సరిగ్గా 10 గంటలకు ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం 10.15కు హెలికాప్టర్‌లో బయలుదేరి పోలవరం వెళ్తారు. 0.218 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ నీటి ద్వారా బుట్టాయగూడెం మండలంలోని 15 గ్రామాలకు చెందిన 4వేల ఎకరాల భూమి సాగులోకిరానుంది. కొయ్యలగూడెం మండలంలోని బందకట్టు ఆనకట్ట కింద చెరువుల ద్వారా సాగవుతున్న 3652 ఎకరాలకు సాగునీటి ఆయకట్టు స్థిరీకరణ జరిగిన ఏడాదికి... పదికోట్ల ఆదాయం ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సమకూరుతుంది. పోగొండ ప్రాజెక్ట్‌ నీటితో వరి, మొక్కజొన్న, పొగాకు, పత్తి, అపరాలు పండుతాయి. అంతేకాదు.. భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పూర్తిగా ఏజెన్సీ మండలంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌తో ఆ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. చుట్టూరా పచ్చని అడవి, ఎత్తైన కొండలు, సహజసిద్దమైన ప్రకృతి అందాల మధ్య నిర్మించిన పోగొండ రిజర్వాయర్‌ ప్రాంతం.. భవిష్యత్‌లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులను భారీగా మోహరించారు. పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు.

ఆర్మూర్ బంద్..ముందస్తు అరెస్టులు...

నిజామాబాద్ : ఆర్మూర్ బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. రైతు జేఏసీ నాయకుల ఇళ్లపై దాడి చేసి 15 మంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్ర జొన్న పంటకు మద్దతు ధర రూ. 4వేలు ప్రకటించాలని ఆర్మూర్ బంద్ కు రైతు జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

అంగన్ వాడీ టీచర్స్ హెల్పర్ యూనియన్ మహాసభ...

నిజామాబాద్ : నేడు అంగన్ వాడీ టీచర్స్ హెల్పర్ యూనియన్ రెండో మహాసభ జరుగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 

Don't Miss