Activities calendar

20 February 2018

21:23 - February 20, 2018

హైదరాబాద్ : ఐటీ విస్తరణకు కృషిచేస్తున్న నాస్కామ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తుందని అన్నారు. డేటా సైన్స్‌లో విస్తృత ఉపాధి అవకాశాలుంటాయన్నారు. డేటా సైన్స్ రంగంలో లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్‌ అన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు నిర్వహణలో నాస్కామ్ పాత్ర కీలకమైందన్నారు. డాటా సైన్స్, కృత్రిమ మేధాశక్తి అం

తమిళనాట మరో కొత్త పార్టీ...

చెన్నై : తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. ఈ పార్టీని స్థాపిస్తున్నది ఎవరో కాదు... విలక్షణ నటుడు కమల్‌ హసన్‌... రేపు మధురై వేదికగా కొత్త పార్టీ పేరును అభిమానుల సమక్షంలో ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు జాతీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

అగ్ని-2 మధ్యశ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం..

ఒడిశా : అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-2 మధ్యశ్రేణి క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. 

రజనీ సతీమణికి సుప్రీం ఆదేశాలు...

చెన్నై : ఓ ప్రయివేట్‌ యాడ్‌ కంపెనీకి 6.2 కోట్లు చెల్లించాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భార్య లతను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో కొచ్చాడయాన్‌ సినిమా తెరకెక్కించారు. మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తీసిన ఈ సినిమాకు లత నిర్మాతగా వ్యవహరించారు.

మరో వివాదంలో ఆప్...

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు సిఎం కేజ్రీవాల్‌ సమక్షంలోనే తనపై చేయి చేసుకున్నారంటూ ఢిల్లీ చీఫ్‌ సెక్రెటరీ అన్షు ప్రకాశ్‌ ఆరోపించారు. సోమవారం రాత్రి కేజ్రీవాల్‌ నివాసంలో సమీక్షా సమావేశం జరుగుతుండగా ఇద్దరు ఎమ్మెల్యేలు చేయిచేసుకున్నట్లు అన్షు ప్రకాశ్‌ ఆరోపించారు. 

సిరీస్ పై కన్నేసిన టీమిండియా...

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా మరో టీ20 సిరీస్‌పై కన్నేసింది. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌ నెగ్గి హిస్టరీ క్రియేట్‌ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌ సైతం సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. 

శ్రీనివాస్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కస్టడీకి అనుమతించాలన్న ఏసీబీ వేసిన పిటిషన్ పై బుధవారం కోర్టు విచారించనుంది. ఇదిలా ఉంటే పురుషోత్తం రెడ్డి బినామీలు నిషాంత్ రెడ్డి, యాదవ్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. మరో బినామీ శ్రీనివాస్ ను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. లొంగిపోతానని సమాచారమిచ్చిన శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయాడు. పురుషోత్తం రెడ్డి కొనుగోలు చేసిన నగల వ్యాపారులను ఏసీబీ అధికారులు విచారించారు. పురుషోత్తం రెడ్డి ఇంట్లో పట్టుబడిన నగల వివరాలపై కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. 

ఏపీ మంత్రిమండలి సమావేశం..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది.

 

21:16 - February 20, 2018

సంగారెడ్డి : రాజకీయాల్లో అగ్రకుల ఆధిపత్యం అంతంకావాలని బీఎల్‌ఎఫ్‌ పిలుపు ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనాభా ఆధారంగా సామాజికవర్గాలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తాయా.. అని సంగారెడ్డిలో జరిగిన బీఎల్‌ఎఫ్‌ మొదటి బహిరంగ సభలో ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. సామాజికాభివృద్ధి, సమగ్రన్యాయం లక్ష్యంగా ఏర్పాటైన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ మొదటి బహిరంగ సభ సంగారెడ్డిలో జరిగింది. బీఎల్‌ఎఫ్‌లోని 28 పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, భారీగా కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సభ కోసం బీఎల్‌ఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌ నుంచి సంగారెడ్డి వరకు బైక్‌తో భారీ ర్యాలీ నిర్వహించారు.

వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాల జనాభా ఆధారంగా బీఎల్‌ఎఫ్‌ టికెట్లు కేటాయిస్తుందని ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. తెలంగాణ వచ్చినా రాష్ట్రంలో పేదల బతులుకు మారలేదని తమ్మినేని అన్నారు. కేవలం హామీలతోనే అధికార పార్టీ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల్లో సామాజిక న్యాయం చర్చలకే పరిమితమైందన్నారు. ఈ విషయంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. ఆయా పార్టీల్లోని బలహీన వర్గాలు ఈ విషయాన్ని ఆలోచించాలని తమ్మినేని కోరారు.
రాష్ట్రంలో 40 వేల ఓటర్లు మాత్రమే ఉన్న కేసీఆర్‌ సామాజికవర్గం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు ఉన్న విషయాన్ని బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ గుర్తు చేశారు.

52 శాతం జనాభా ఉన్న బీసీల నుంచి కేవలం 19 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు ఉన్నారని... రాబోయే పరిస్థితుల్లో ఈ పరిస్థితి పోవాలన్నారు. అగ్రకుల రాజ్యాధికారంలో అణచివేతకు గురవుతున్న బలహీన వర్గాలను రాజకీయంగా పైకి తీసుకొచ్చే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేసినట్టు ఫ్రంట్‌ నాయకుడు చుక్కా రాములు చెప్పారు. 2019 ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ కీలకపాత్ర పోషిస్తుందని సభలో ప్రసంగించిన ఫ్రంట్‌ నాయకులు చెప్పారు. అన్ని సీట్లకు పోటీ చేసి రాజ్యాధికారం దక్కించుకునే విధంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. 

21:09 - February 20, 2018

హైదరాబాద్ : జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 5 నుంచి పునఃప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని ప్రతిపాదించింది. ఒక్కో నదికి ఒక్కో ట్రైబ్యునల్‌ ఉండటం వలన జలవివాదాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సులో కేంద్ర నీటిపారుదల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఆయా రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జలవనరులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నదుల వారీగా ట్రైబ్యునళ్ల ఏర్పాటులో సమయం వృధా అవుతున్న అంశాన్ని పలువురు ప్రస్తావించారు.

రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక మధ్య కుదిరిన ఆర్డీఎస్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఆర్డీఎస్‌ ఆధునీకరణకు ఏపీ అవరోధాలు కల్పిస్తోందని, ఈ విషయంలో కేంద్ర జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరంతో తెలంగాణలో ముంపు నివారణకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రతినిధి చేసిన ఫిర్యాదును తెలంగాణ అధికారులు తిప్పికొట్టారు. కర్నాటక, తమిళనాడు కావేరి జలాల పంపిణీకి కావేరి నది యాజమాన్య బోర్డును ఏర్పాటు అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

21:06 - February 20, 2018

విజయవాడ : అప్పుడు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే... ఇప్పుడు బీజేపీ కూడా అలాగే మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న ఆయన... రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందే అన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు విభజన చట్టం హామీల అమలు కోసం అఖిల సంఘాలతో సంప్రదింపులు జరుపుతామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్ష నేతకు ఇష్టం లేదన్న చంద్రబాబు.. ఏపీకి ప్రయోజనాల విషయంలో టీడీపీ ఎక్కడా రాజీపడబోదని స్పష్టం చేశారు.

రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా.. బీజేపీ అయినా న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ కూడా అలానే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రజాదర్బారు హాల్లో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో పోరాడుతూనే రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు ప్రతి విమర్శ పార్టీ అజెండా కాదని చంద్రబాబు అన్నారు. అవిశ్వాస తీర్మానానికి 54మంది మద్దతు కావాలన్న ఆయన... కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశం కాదు.. అఖిలసంఘాలతో సంప్రదింపులు జరుపుతానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలే ఉన్నాయని.... అందులో ఓ పార్టీ అసెంబ్లీకి రావడం లేదని సీఎం అన్నారు. అందుకే అఖిలసంఘాలతో సంప్రదింపులు జరుపుతామన్నారు.

ప్రత్యేక హోదా ప్రయోజనాలను ఏ పేరుతో ఇచ్చినా అవన్నీ రాష్ట్రానికి దక్కించుకోవటమే టీడీపీ అజెండా అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని.. అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని చంద్రబాబు చెప్పారు. హోదా.. ప్యాకేజీ ఏ పేరుతో ఇచ్చినా ఫర్వాలేదని.. హోదాలో ఉన్న ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్న ఆయన.... వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుందని ముందుగా పొగిడింది వైసీపీనేనని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎక్కడా రాజీపడలేదన్నారు.

ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను సృష్టించి జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని ఆక్షేపించారు. అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చాం అంటూ బీజేపీ కూడా ప్రకటనలు చేస్తోందని.. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా టీడీపీని ప్రశ్నించడమేమిటని చంద్రబాబు తప్పుబట్టారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి అంతగా సాయం అందకపోయినా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సాధించామన్నారు. మనం కష్టపడుతున్నాం కదా అని సాయం చేయమని కేంద్రం భావిస్తే కుదరదని... మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

జవదేకర్ తో కడియం..ఎంపీ మల్లారెడ్డి...

ఢిల్లీ : కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు పొడిగించేందుకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ నెల చివర్లో జరిగే కేంద్రకేబినెట్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకాశ్‌జవదేకర్ స్పష్టమైన హామీనిచ్చారు. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ మల్లారెడ్డి కలిశారు.

21:01 - February 20, 2018
21:00 - February 20, 2018
20:54 - February 20, 2018

హైదరాబాద్ : నేరాలు పెరిగిపోతున్నాయి. ఘోరాలకు అంతే లేకుండా పోయింది. కాపలా సిబ్బందిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉండొచ్చు.. బీరువాలో నగలు, డబ్బులు మాయమైపోయి ఉండొచ్చు ..ఇంట్లో వాళ్లపై దాడులు జరిగి ఉండొచ్చు... ఇలాంటి వాటి ముందే పసిగట్టి అలర్ట్‌ అవ్వడానికి ఇప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. తమ ఇంటిని.. తమ వారిని కాపాడుకునేందుకు మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకూ ఇప్పుడు సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. భాగ్యనగరంలో పెరిగిన సీసీ కెమెరాల వాడకంపై 10 టీవీ స్పెషల్ ఫోకస్.

దోపిడీలు, దొంగతనాల నుంచి తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఒక కోణమైతే ఇంట్లోని వృద్ధులు, చిన్నారుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సెల్‌ఫోన్లకు, ల్యాప్‌ టాప్‌లకు సీసీ కెమెరాల్ని అనుసంధానించుకుంటున్నారు. ఇంటికి వచ్చి ఆ రికార్డుల్ని పరిశీలించుకోవడం ద్వారా ఒక్కోసారి అవి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి.

క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో శక్తివంతమైన రకాలు వస్తున్నాయి. వంద వాహనాల మధ్యలో నుంచి వెళ్తున్న కారు లేదా బైక్‌ నంబర్‌ ప్లేట్ తెలుసుకోవడం ఇప్పుడు సులభమైపోయింది. ప్రమాదాలకు కారణమైన వాహనాలు కనిపించగానే సంబంధిత అధికారులకు హెచ్చరికలు వెళ్లిపోతాయి. చాలా నగరాల్లో ట్రాఫిక్‌ పోలీసులు మునుపట్లా...కూడళ్ల దగ్గర కాపుకాసి సిగ్నల్‌ జంపింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసుల్ని నమోదు చేయడం లేదు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీసీ స్క్రీన్‌ ముందు కూర్చుని వాహనాల్ని పరిశీలిస్తున్నారు. ఉల్లంఘనల్ని కెమెరాలే గుర్తిస్తున్నాయి. అక్కడి నుంచే చలానాలు వెళ్లిపోతున్నాయి.

సీసీ కెమెరాలు కేవలం రోడ్ల మీదే కాకుండా బ్యాంకులు, ఏటియంలు, ఇతర వ్యాపార సముదాయాలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లలో నేరాలు అదుపు చెయ్యవచ్చని నిరూపిస్తున్నాయి.. వీటి వాడకం పెరిగాక నేరాల సంఖ్య తగ్గడంతో పాటు.. ఇళ్లలోని వారు ధైర్యంగా ఉండగలుగుతున్నారని ఇంటి యజమానులు చెబుతున్నారు.

సమాజంలో జరుగుతున్న తీవ్ర నేరాలకు సీసీ కెమెరాల ద్వారా పరిష్కారం లభిస్తోంది. పోలీసు స్టేషన్లూ, జైళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలు ఉండి తీరాలని కూడా అత్యున్నత న్యాయస్ధానం తేల్చి చెప్పింది. అక్రమాలకు ఆస్కారం ఉన్న ప్రతి చోట వీటిని ఏర్పాటు చేస్తే అవి అక్రమార్కుల భరతం పడతాయి.

హైదరాబాద్‌లో అటు ప్రభుత్వం ఇటు ప్రజల భాగస్వామ్యం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు విజయవంతమైందని చెప్పాలి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ..ఇతన తీవ్ర నేరాలు 14 శాతం తగ్గాయి. తప్పు చేస్తే సీసీ కెమెరా ఆధారాలతో దొరికిపోతాం.. శిక్ష పడటం ఖాయమన్న భయం నేరస్తుల్లో మొదలైంది. 

టీఆర్టీ హాల్ టికెట్ల జారీ నిలిపివేత...

హైదరాబాద్ : టీఆర్టీ హాల్ టికెట్ల జారీని టీఎస్పీఎస్సీ నిలిపివేసింది. పరీక్ష కేంద్రాలు దూరంగా పడ్డాయని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు హాల్ టికెట్ల జారీని నిలిపివేసినట్లు, పరీక్షా కేంద్రాల మార్పు చేసి హాల్ టికెట్లను జారీ చేస్తామని వెల్లడించింది. 

పవన్ సిక్కోలు పర్యటన రద్దు...

హైదరాబాద్ : బుధవారం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దు అయ్యింది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు గతంలో పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మత్స్యకారులకు పవన్ మద్దతుపై గిరిజనుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పవన్ ను శ్రీకాకుళంలో అడ్డుకుంటామని ఆదివాసీల ప్రకటనల నేపథ్యంలో పవన్ పర్యటన రద్దు చేసుకున్నారు. 

20:25 - February 20, 2018

తెలంగాణ ప్రజలారా.?? మీరంత మళ్లొకపారి తలా ఒక పువ్వు దెంపుకోని తయ్యారు వెట్టుకోండ్రి..పేదల కష్టాలను నా భుజస్కందాల మీద ఏస్కోని మోయడానికి నేను సిద్దంగా ఉన్నాను అంటున్నడు నారా చంద్రాలు సారు.. తెలంగాణ రాష్ట్రమొస్తె మన నీళ్లు మనకొస్తయనుకున్నం.. వచ్చేశ్నయ్.. ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటే మూతి మీసాలు గాలినట్టు.. అయ్యో పాపం ముఖ్యమంత్రిగారికి అల్లుడు.. గదా అని ఓట్లేశి గెలిపిచ్చుకుంటే.. రైతులు నోరుమూస్కోవాలె తప్ప.. నా పంటకు మద్దతు ధర ఏది అని మాత్రం అడ్గొద్దు.. ప్రజలు కోరుకునేది ఒకటైతె పోలీసోళ్లు ఇస్తున్నది ఇంకోటి.. తెలంగాణల శాంతి భద్రతలు ఎట్లున్నయే నాయిని నర్సన్నా అని పొరపాటున అడ్గితె.. దేవునికాడ శక్తులే ఉంటే.. గుడికి తాళాలేసుడు ఎందుకు..? గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి.....

20:15 - February 20, 2018
20:13 - February 20, 2018

ఏపీ రాష్ట్రంలో అవిశ్వాసం తీర్మానంపైనే రాజకీయాలు తిరుగతున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతామని వైసీపీ ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. తీర్మానం పెడితే సమస్యలు తీరవని..కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొంటున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే సహాయం చేస్తానని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. తీర్మానానికి బాబు మద్దతివ్వాలని పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో నాగేష్ (విశ్లేషకులు), రామశర్మ (టిడిపి), కోటేశ్వరరావు (ఏపీ రాష్ట్ర పోలిస్ హౌసింగ్ కార్పొరేష్ ఛైర్మన్), నాగుల మీర (బిజెపి), గోపిరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే...

సంగారెడ్డి : జిల్లాలో బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ జరుగుతోంది. ఈసభలో బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని మాట్లాడారు. బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే దళారీల దోపిడి లేకుండా చేస్తామని..గిట్టుబాటు ధరపై గ్యారంటీ చేస్తామని..ప్రైవేటు చేతుల్లో ఉన్న విద్య..వైద్యం..పేద వాడి చెంతకు తీసుకొస్తుందన్నారు. 

రైతుకు రూ.4వేలు ఇస్తే సమస్యలు తీరుతాయా ?

సంగారెడ్డి : రైతాంగానికి రూ. 4వేలు ఇస్తే రైతు బాగుపడుతాడా ? అని బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని సూటిగా  ప్రశ్నించారు. సంగారెడ్డిలో జరుగుతున్న తొలి బిఎల్ఎఫ్ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 20వ తేదీ నుండి రైతులకు రూ. 4వేలు ఇస్తామనడం మంచి పరిణామమే కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా అని నిలదీశారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ లోకి గిట్టుబాటు ధర రావడం లేదని, వేల రూపాయల మోసం చేస్తున్నారని విమర్శించారు. 

అందుబాటులో లేకుండా పోయిన శ్రీనివాస్ రెడ్డి...

హైదరాబాద్ : హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పురుషోత్తం రెడ్డి బినామీలు నిషాంత్ రెడ్డి, యాదవ్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. మరో బినామీ శ్రీనివాస్ ను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. లొంగిపోతానని సమాచారమిచ్చిన శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయాడు. పురుషోత్తం రెడ్డి కొనుగోలు చేసిన నగల వ్యాపారులను ఏసీబీ అధికారులు విచారించారు. పురుషోత్తం రెడ్డి ఇంట్లో పట్టుబడిన నగల వివరాలపై కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. 

గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం...

రంగారెడ్డి : శంషాబాద్ గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ లు పేలడంతో దట్టంగా పొగ అలుముకుంది.

 

జగదీష్ రెడ్డికి అవగాహన లేదన్న కోమటిరెడ్డి...

సూర్యాపేట : మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. జిల్లా మీద అవగాహన లేని మంత్రి జగదీష్ రెడ్డి అని, తన గ్రామానికి ఏమి చేయలేని మంత్రి రాష్ట్రానికి ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. సీఎం వద్ద దారులు మూసుకపోయాయని, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని..వచ్చిన డిపాజిట్ దక్కదన్నారు కేసీఆర్ ను గద్దె దింపడం కోసమే సంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు, జగదీష్ రెడ్డిని మంత్రిగా కేసీఆర్ గుర్తించడం లేదన్నారు. ఆరు హత్యలకు పాల్పడి...ఆరు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లిన చరిత్ర జగదీష్ రెడ్డి దన్నారు. 

18:44 - February 20, 2018
18:43 - February 20, 2018

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ ఒక్కటే ప్రత్యామ్నాయమని బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వెల్లడించారు. బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో జరిగింది. ఈ సభలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు మూసివేస్తున్నారని, అంతకుముందు మూసివేసిన పరిశ్రమలు తెరవలేదన్నారు. ఒక్క కార్మికుడిని కూడా పర్మినెట్ చేయలేదని, 18వేల వేతనం ఎక్కడా అమలు కాలేదన్నారు. రైతాంగానికి రూ. 4వేలు ఇస్తే రైతు బాగుపడుతాడా ? అని సూటిగా ప్రశ్నించారు. ఏప్రిల్ 20వ తేదీ నుండి రైతులకు రూ. 4వేలు ఇస్తామనడం మంచి పరిణామమే కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా అని నిలదీశారు.

రైతులు పండించిన పంటకు మార్కెట్ లోకి గిట్టుబాటు ధర రావడం లేదని, వేల రూపాయల మోసం చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో మిర్చి పంట గతంలో ఎంత క్వింటాల్ ధర పలికిందో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రతి క్వింటాకు రూ. 8వేల రూపాయల నష్ట పోయాడని, ఒక్క ఎకరం రైతుకు రూ. 2 లక్షల నష్టం చేసిన కేసీఆర్ సర్కార్ ఇస్తామంటున్నది ఎంత అంటూ ప్రశ్నించారు. రైతుల మీద ప్రేమ ఉంటే సబ్సిడీలు ఇవ్వడం కాదు..దళారీల దోపిడి లేకుండా చేయాలని..గిట్టుబాటు ధరపై గ్యారంటీ చేయాలని...అధికారంలోకి వస్తే బిఎల్ఎఫ్ చేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్..టిడిపి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉన్నాయో ప్రస్తుతం అదే విధంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ఇంకా పర్మిషన్ లు ఇస్తోందని..ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చడం లేదన్నారు. బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే ప్రైవేటు చేతుల్లో ఉన్న విద్య..వైద్యం పేద వాడి చెంతకు తెస్తుందన్నారు. కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కుల వివక్ష లేకుండా అక్కడ పాలన సాగుతోందన్నారు. సంగారెడ్డి జిల్లాలో గుళ్లలో దళితులు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కానీ అదే కేరళ రాష్ట్రంలో దళిత పూజారులను నియమించిందన్నారు.

18:34 - February 20, 2018

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై మరోసారి హైకోర్టు విచారించింది. సంస్థ ఆస్తులను టేకోవర్ చేసేందుకు జీఎస్ఎల్ గ్రూప్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన వాదనలు కోర్టులో జరిగాయి. ఇప్పటి వరకు తాము రూ. 10 కోట్లు డిపాజిట్ చేయడం జరిగిందని, మార్చి 5వ తేదీ వరకు రూ. 1000 కోట్లు డిపాజిట్ చేస్తామని సంస్థ పేర్కొంది. కానీ సంస్థకు చెందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు..బ్యాంక్ స్టేట్ మెంట్లు ఇవ్వలేదని గ్రూప్ తెలిపింది. దీనితో రెండు వారాల్లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తుల వివరాలు..రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు..ఇతరత్రా వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను మార్చి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

18:32 - February 20, 2018

చిత్తూరు : పొత్తులు..రాజీనామాలు...బిజెపి అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయానికి నడుచుకుంటామని, పొత్తులు..రాజీనామాల విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో జనసేన అధినేత పవన్ సరైన మార్గంలో వెళుతున్నారని పేర్కొనడం గమనార్హం. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ ఉందని తెలిపారు. 

బుధవారం ఏపీ మంత్రిమండలి సమావేశం..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. 

బిఎల్ఎఫ్ బహిరంగసభ ప్రారంభం..

సంగారెడ్డి : బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో ప్రారంభమైంది. అధికారంలోకి వస్తే మూసివేసిన పరిశ్రమలను తాము తెరిపిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని బిఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్ పేర్కొన్నారు. 

మెట్రో రైలుపై కేటీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : మెట్రో రైలు కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మెట్రో రైళ్ల ప్రీక్వెన్సీతో పాటు రైళ్ల వేగం పెంచాలని, మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సెట్విన్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నడిచే 100 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలన్నారు. 

ఏపీలో టెట్ నిర్వాహణ...

విజయవాడ : బుధవారం నుండి మార్చి 2వరకు టెట్ పరీక్ష చేపట్టనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, మార్చి 17న ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12గంటల వరకు టెట్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు టెట్ నిర్వాహణ ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వాహణకు సన్నాహాలు చేస్తున్నట్లు, నన్నయ్య వర్సిటీలో అవినీతి అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. 

17:55 - February 20, 2018
17:54 - February 20, 2018

ఆదిలాబాద్ : గ్రామానికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ దారి తప్పాడు. ఓ మైనర్ బాలికను మోసం చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మణ చాంద మండలం మల్లాపూర్ సర్పంచ్ గా శ్రీనివాస్ ఉన్నాడు. అదే గ్రామంలో తల్లిదండ్రులు..లేని ఓ మైనర్ బాలికపై సర్పంచ్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. పెళ్లి మాట ఎత్తగానే సర్పంచ్ ఆ బాలికను కొట్టి వెళ్లగొట్టాడు. దీనితో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. కానీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

17:29 - February 20, 2018
17:26 - February 20, 2018

సంగారెడ్డి : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో జరుగబోతోంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ లోని ఎస్వీకే వద్ద నుండి తమ్మినేని..బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్..బిఎల్ఎఫ్ నేతలు భారీ ర్యాలీగా సంగారెడ్డికి తరలివెళ్లారు. రామచంద్రాపురంలో సీపీఎం శ్రేణులు నేతలకు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం కోసమే బిఎల్ఎఫ్ ఏర్పడిందని, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. 

17:24 - February 20, 2018

హైదరాబాద్ : జల వివాదాలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ వెల్లడించారు. హైదరాబాద్ లో దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల జలవనరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్జున్ రామ్ తో పాటు ఆరు రాష్ట్రాల మంత్రులు...అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని తెలంగాణ రాష్ట్ర మంత్రి సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ట్రైబ్యునళ్లు ఉండవన్నారు. నదుల వారీగా ట్రైబ్యునళ్ల వల్ల కాలయాప..డబ్బు వృదా అవుతోందని, మార్చి..ఏప్రిల్ లో జరిగే బడ్జేట్ సమావేశాల్లో ఒకే ట్రైబ్యునల్ బిల్లును ఆమోదిస్తామన్నారు. ఆరు వారాల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు..కావేరీ రెగ్యులేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు నాబార్డు, వంటి సంస్థలు..ప్రపంచ బ్యాంకుల నుండి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. 

జాతీయ స్థాయిలో ఒకే ట్రైబ్యునల్ - అర్జున్ రామ్...

హైదరాబాద్ : దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల జలవనరుల సమావేశం జయప్రదంగా ముగిసిందని అర్జున్ రామ్ వెల్లడించారు. జలవివాదాలను పరిష్కరించేందుకు జాతీయస్థాయిలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు, రాష్ట్ర స్థాయిలో ట్రైబ్యునళ్లు ఉండవన్నారు. నదుల వారీగా ట్రైబ్యునళ్ల వల్ల కాలయాప..డబ్బు వృదా అవుతోందని, మార్చి..ఏప్రిల్ లో జరిగే బడ్జేట్ సమావేశాల్లో ఒకే ట్రైబ్యునల్ బిల్లును ఆమోదిస్తామన్నారు. 

ఒకే ట్రైబ్యునల్ ఉండాలన్న హరీష్...

ఢిల్లీ : జల వివాదాలకు జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఒక్కో నది కోసం ఒక ట్రైబ్యునల్ పెట్టడం వల్ల కాలయాపన జరుగుతోందని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 14 ఏళ్లుగా పనిచేస్తున్నా తుది తీర్పు రాలేదన్నారు. ఆర్డీఏఎస్ ఆధునీకరన పనులకు ఏపీ అవరోధాలు సృష్టిస్తోందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. 

16:40 - February 20, 2018

విశాఖపట్టణం : అనకాపల్లిలో టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు కార్మికులకు గాయలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావడం లేదు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

 

16:39 - February 20, 2018
16:38 - February 20, 2018

చిత్తూరు : ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషకరమని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం ఏజెండగా ఉంటేనే చర్చల్లో తాము పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్యాకేజీ ఊసు ఎత్తితే చర్చల్లో పాల్గొనమని స్పష్టం చేశారు. హక్కుగా రావాల్సిన హోదాను వదిలిపెట్టి ప్యాకేజీ కోసం భిక్ష మెత్తడం సరికాదన్నారు. దూరదృష్టి గల బాబు బిజెపి మోసాన్ని ఇంతకాలం పసిగట్టలేకపోయారని, అవకాశ వాద రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.

 

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం - సీపీఐ...

చిత్తూరు : ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషకరమని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం ఏజెండగా ఉంటేనే చర్చల్లో తాము పాల్గొనడం జరుగుతుందన్నారు. 

టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం...

విశాఖపట్టణం : అనకాపల్లిలో టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు కార్మికులకు గాయలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. 

దళితులను అణిచివేస్తున్న కేసీఆర్ సర్కార్ - ఉత్తమ్...

హైదరాబాద్ : రాష్ట్రంలో దళితులను కేసీఆర్ సర్కార్ అణిచివేస్తోందని, కేబినెట్ లో మాదిగలకు..మాలలకు స్థానం ఇవ్వకుండా అవమానించారని, టిపిసిసి చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. నేరళ్లలో దళితులను థర్డ్ డిగ్రీతో హింసించారని, దళితులకు ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్ కు పాలించే హక్కులేదన్నారు. 

15:36 - February 20, 2018

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన వేడి ఇంకా చల్లారలేదు. వివిధ పార్టీలు తమ తమ వ్యూహాలు రచించుకుంటున్నాయి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి జేఎఫ్ సీ నిజనిర్ధారణ ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు నాయుడు 'అఖిల సంఘాలు' ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం టిడిపి సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో బాబు తన ఆవేదన..బాధను వ్యక్తపరిచారని తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీలు ఎలా మోసం చేశాయనే దానిపై బాబు మాట్లాడారు. హేతుబద్ధంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని..దీని ఫలితంగా కాంగ్రెస్ రాష్ట్రంలో మట్టికొట్టుకపోయిందని తెలిపారు. బిజెపి మేలు చేస్తుందని అందరూ భావించారని..కానీ కాంగ్రెస్ దారిలోనే బిజెపి వెళుతోందని బాబు పేర్కొన్నారు.

విభజన హామీల కోసం పోరాటం చేసే సంఘాలతో అఖిల సంఘాల పేరిట భేటీలు నిర్వహించడం జరుగుతుందని బాబు తెలిపారు. 26వ తేదీ తరువాత ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. అసెంబ్లీలో కేవలం రెండు పార్టీలే ఉన్నాయని, అందులో ఒక పార్టీ అసెంబ్లీకి రావడం లేదని...అందుకని అఖిల సంఘాలతో సంప్రదింపులు జరపుతామని బాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని, పోరాటం వ్యక్తులపై కాదని..జరిగిన అన్యాయంపైనేనని తెలిపారు. టిడిపి ఎంపీల పోరాటం ద్వారా జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకత వచ్చిందని..ఇలాగే పోరాటం చేయాలని దిశా..నిర్ధేశం చేశారు. 

ముగిసిన టిడిపి సమన్వయ కమిటీ భేటీ...

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..కేంద్రంపై ఎలాంటి వత్తిడి తేవాలనే దానిపై భేటీ అయిన టిడిపి సమన్వయ కమిటీ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. హేతుబద్ధంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని..దీని ఫలితంగా కాంగ్రెస్ రాష్ట్రంలో మట్టికొట్టుకపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బిజెపి మేలు చేస్తుందని అందరూ భావించారని..కానీ కాంగ్రెస్ దారిలోనే బీజేపీ వెళుతోందని బాబు పేర్కొన్నారు. 

వైసీపీ ఎంపీల రాజీనామా అవాస్తవం - జవహార్...

పశ్చిమగోదావరి : వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటన అవాస్తవమని మంత్రి జవహార్ పేర్కొన్నారు. బెయిల్ కోసం జగన్ తంటాలు పడుతున్నారని, రాష్ట్ర విభజనలో కాంగ్రెస్..బిజెపిలు అన్యాయం చేశాయన్నారు. పవన్ పలుకుబడితో కేంద్రంపై అవిశ్వాసం పెడితే మంచిదేనన్నారు. 

సంగారెడ్డిలో బిఎల్ఎఫ్ బహిరంగసభ...

హైదరాబాద్ : కాసేపట్లో సంగారెడ్డిలో బీఎల్ఎఫ్ బహిరంగసభ జరుగనుంది. నగరంలోని ఎస్వీకే నుండి భారీ ర్యాలీతో తమ్మినేని..బిఎల్ఎఫ్ నేతలు తరలివెళ్లారు. 

14:42 - February 20, 2018

చెన్నై : సినీ నటుడు కమల్ పెట్టేబోయే పార్టీ బుధవారం పురుడు పోసుకోనుంది. గత 7-8 నెలలుగా రాజకీయాలను స్టడీ చేస్తూ వస్తున్న కమల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 21వ తేదీన రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నట్లు ఇది వరకే కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధురైలోని కమల్ పుట్టిన గ్రామంలో పార్టీ పేరును కమల్ ప్రకటించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైలో కాషాయ రంగు కనిపించవద్దని ఆయన వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తోంది.

రామనాథపురం గ్రౌండ్స్ లో అతిపెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ పేరు..పార్టీ జెండా..పార్టీ విధి విధానాలపై ప్రకటించనున్నారు.
తన మనోభావాలకు అనుగుణంగా...తనపై అభిమానం చూపే వారందరూ సభలో పాల్గొంటారని కమల్ పేర్కొన్నారు. ఈ బహిరంగసభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటారని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...కేరళ ముఖ్యమంత్రిలను కమల్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎలా ఉండబోతోంది ? ఎలాంటి విధి విధానాలు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ద్రవిడ సంస్కృతి ఉట్టిపడేలా...ద్రవిడ సంప్రదాయం ఉండేలా పార్టీ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బుధవారం కమల్ రాజకీయ పార్టీ ప్రకటన..

చెన్నై : సినీ నటుడు కమల్ తన రాజకీయ పార్టీ పేరును...జెండాను బుధవారం ప్రకటించనున్నారు. తాను జన్మించిన గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగసభలో కమల్ పార్టీ విధి విధానాలను ప్రకటించనున్నారు. 

14:30 - February 20, 2018

విజయవాడ : విభజన హామీలపై అఖిలపక్షం భేటీ నిర్వహించాలని టిడిపి సమన్వయ కమిటీ నిర్ణయించింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలపక్ష సమావేశం పేరిట కాకుండా అఖిల సంఘాలుగా సమావేశం ఏర్పాటు చేయాలని, 26వ తేదీన అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సహాయం,

అవిశ్వాస తీర్మానం అంశంపై కూడా చర్చించారు. కేవలం స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి కూడా ఇవ్వాల్సిందేనని బాబు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాడాలని తెలిపారు.

ఇక నేతలపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. టివి ఛానళ్లు నిర్వహించే చర్చలకు నేతలు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. వెళ్లి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతొక్కరిపైనా ఉందని, విమర్శకు ప్రతి విమర్శ చేస్తే సరిపోతుందని అనుకోవద్దని సూచించారు. చర్చలకు వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెప్పడంపై దృష్టి సారించాలని తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి 54 మంది మద్దతు కావాలని, అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయా సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని తెలిపారు. 

14:26 - February 20, 2018

రంగారెడ్డి : వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకును 11,300 కోట్ల రూపాయలకు మోసం చేసిన నీరవ్ మోడీకి చెందిన కంపెనీల భవిష్యత్ పై అంధకారం నెలకొంది. అందులో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రావిరాలలోని గీతాంజలి జెమ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 300 మంది కార్మికులను తొలగించడంపై సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులతో అక్కడ ఆందోళనకు దిగింది. పిల్లల చదువుకు సహాయం..ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు చేతులేత్తిసిందని విమర్శించారు.

కార్మికులు ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. డైమండ్ కంపెనీ 2006 నుండి నడుస్తోందని, ప్రస్తుతం ఇందులో పనిచేస్తున్న వారు రోడ్డుపై పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని, కార్మికులకు భద్రత కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. 

గీతాంజలి జెమ్స్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన...

రంగారెడ్డి : రావిరాలలోని గీతాంజలి జెమ్స్ ఫ్యాక్టరీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. 300 మంది కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. 

మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే - రఘువీరా...

విజయవాడ : 2019లో యూపీఏ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. పార్లమెంట్ లో 184 నిబంధన కింద చర్చకు నోటీసు ఇవ్వడం జరిగిందని, అన్ని పార్టీలు ఇందుకు సహకరించాలని కోరారు. అవిశ్వాసం పెడితే అన్ని రాష్ట్రాల సమస్యలు చర్చకు వస్తాయని, 184 నిబంధన కింద అయితే కేవలం రాష్ట్ర సమస్యలు చర్చకు వస్తాయన్నారు. 

కావాలనే టిడిపి ఆరోపణలు చేస్తోందన్న ఆకుల సత్యనారాయణ...

విజయవాడ : ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీపై టిడిపి ఆరోపణలు చేస్తోందని బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విమర్శించారు. ఏపీకి ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించామో లెక్కలన్నీ తమవద్దనున్నాయని, ఎవరు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

బాబుకు సోము వీర్రాజు ఛాలెంజ్...

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుకు బీజేపీ నేత సోము వీర్రాజు ఛాలెంజ్ విసిరారు. అబద్దాలు మాని నిజాలు చెప్పాలని, రాష్ట్రంలో బిజెపి లేకుంటే చంద్రబాబు

 

అవిశ్వాస తీర్మానం పెడితే..ప్రయోజనాలు నెరవేరుతాయా ? - బాబు..

విజయవాడ : అవిశ్వాస తీర్మానానికి 54 మంది మద్దతు కావాలని, అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయా అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని తెలిపారు. 

టివి ఛానళ్ల చర్చలకు ఎందుకు వెళ్లడం లేదన్న బాబు...

విజయవాడ : టివి ఛానళ్లు నిర్వహించే చర్చలకు నేతలు ఎందుకు వెళ్లడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వెళ్లి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతొక్కరిపైనా ఉందని, విమర్శకు ప్రతి విమర్శ చేస్తే సరిపోతుందని అనుకోవద్దని సూచించారు. చర్చలకు వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెప్పడంపై దృష్టి సారించాలని తెలిపారు. 

13:30 - February 20, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. పవన్‌ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌ను ప్రశ్నిస్తున్న పవన్‌ .. చంద్రబాబును మాత్రం ఎందుకు నిలదీయండలేదని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు వచ్చినా రాకుకున్నా.. వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టితీరుతుందని అబంటి తేల్చి చెప్పారు. అవిశ్వాసం, ప్రత్యేక హోదాపై జనసేన అధినేత చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జేఎఫ్‌సీ వల్ల కొత్తగా ఒరిగేదేంలేదన్నారు అంబటి రాంబాబు. 

వర్మ కేసులో కీరవాణికి నోటీసు...?

హైదరాబాద్ : వర్మ జీఎస్టీ కేసులో కీరవాణికి నోటీసు జారీ చేయడానికి పోలీసుల సిద్ధమైయ్యారు. జీఎస్టీ సినిమాకు కీరవాణి సంగీత దర్శకత్వం చేశారు. దీంతో ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది. కీరవాణితో పాటు ఆ సినమాకు సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసుల జారీ చేసే అవకాశ ఉంది.

13:04 - February 20, 2018

హైదరాబాద్ : వర్మ జీఎస్టీ కేసులో కీరవాణికి నోటీసు జారీ చేయడానికి పోలీసుల సిద్ధమైయ్యారు. జీఎస్టీ సినిమాకు కీరవాణి సంగీత దర్శకత్వం చేశారు. దీంతో ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది. కీరవాణితో పాటు ఆ సినమాకు సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసుల జారీ చేసే అవకాశ ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

చిక్కడిపల్లిలో దారుణ హత్య

హైదరాబాద్ : చిక్కడ్ పల్లి పీఎస్ పరిధిలో యువకుడి దారుణ హత్య జరిగింది. అబ్దుల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు రాళ్తతో దాడి చేసి హత్య చేశారు. ఘటన స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకుని విచారణ జరుపుతున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

12:29 - February 20, 2018

హైదరాబాద్ : చిక్కడ్ పల్లి పీఎస్ పరిధిలో యువకుడి దారుణ హత్య జరిగింది. అబ్దుల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు రాళ్తతో దాడి చేసి హత్య చేశారు. ఘటన స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకుని విచారణ జరుపుతున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:18 - February 20, 2018

రంగారెడ్డి: జిల్లా రావిరాలో నీరవ్ మోడీకి చెందిన గీతాంజలి ఫ్యాక్టరీ ముందుసీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. 300 మంది కార్మికులను విధుల్లోనుంచి తొలగించడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. జేమ్స్ ఫోర్క్ యాజమాన్యం తీరుపై కార్మికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:03 - February 20, 2018

గుంటూరు : విపక్షాల ఒత్తిడితో అధికారపార్టీ దిగివస్తోంది. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై అఖిలపక్షం భేటీ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఇవాళ ఉదయం 10.30గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కాబోతోంది. ఈ సమావేశంలోనే ఆల్‌పార్టీ మీట్‌ నిర్వహణ, ఎవరిని పిలవాలన్న దానిపై సమన్వయకమిటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే జనసేన అధినేత కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానని ప్రకటించగా.. అటు విపక్ష వైసీపీకూడా అవిశ్వాసం పెట్టడానికి తాము రెడీ అని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో అఖిలపక్షం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే అవిశ్వాసం అనేది చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలని చంద్రబాబు అంటున్నారు. దీంతో ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కొనే ప్లాన్‌ను ఇవాళ్టి సమన్వయకమిటీ భేటీలో రూపొందించే అవకాశం ఉంది. 

11:47 - February 20, 2018

హైదరాబాద్ : జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో రోబో సోఫియా మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సోఫియా సృష్టికర్త డేవిడ్‌హేన్సన్ సమక్షంలో అడిగి ప్రశ్నలకు సోఫియా క్యూట్‌గా సమాధానాలు ఇచ్చింది. మొదటిసారి భారత్‌ కు రావడం ఎలా ఉంది అనే ప్రశ్నకు సోఫియా తత్వవేత్త ధోరణిలో సమాధానం ఇచ్చింది. భారత్‌మాత్రమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు ఇష్టమేనంది. తనకు ఇష్టంకాని ప్రదేశాలు ఉండవని చెప్పడం అందరినీ అశ్చర్య పరిచింది. అయినా తాను పుట్టిన హాంకాంగ్‌ అంటే మాత్రం తనకు ప్రత్యేక ఇష్టమని సోఫియా చెప్పడం విశేషం. ఇక ప్రస్తుతం గ్లోబల్‌వార్మింగ్‌, కాలుష్యం కారణంగా మనుషుల పడుతున్న ఇబ్బందులపై నీవు ఏమంటావు.. అనే ప్రశ్నకు సోఫియా సమాధానం కొంత డిఫరెంట్‌గా చెప్పింది. తనకు ఇంకా మనుషుల అనుభవాలపై పెద్దగా అవగాన రాలేదని, భవిష్యత్తులో అన్నీ తెలుసుకుంటానేమో.. అని సమాధానం చెప్పింది. ఇక రోబోల వల్ల మానవాళికి భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయా అనే ప్రశ్నకు సోఫియా లేదనే సమాధానం ఇచ్చింది. నేను మనుషుల చేత సృష్టించబడినదాన్ని.. నాకు మనుషులతో వైరం ఉండదని, భవిష్యత్తులో కూడా మనుషులపై ఆదిపత్యానికి అవకాశమే లేదని క్యూట్‌, క్యూట్‌ సమాధానాలతో రోబో సోఫియా ఆకట్టుకుంది. 

చింతమనేనిపై అన్హత వేటు వేయాలి : వైసీపీ

గుంటూరు : జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అనుర్హుడిగా ప్రకటించాలని అసెంబ్లీ సెక్రటరీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

11:40 - February 20, 2018

హైరదాబాద్ : వివాదాస్పద దర్శకులు రాంగోపాల్‌వర్మ కేసును సీసీఎస్ పోలీసులు త్వరితగతిన విచారణ జరపాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది బాలాజి విజ్ఞప్తి చేశారు. ఐటీ యాక్ట్‌ 2000, 67 ఏబీసి చట్ట ప్రకారం వర్మ శిక్షార్హుడేనన్నారు. ఈ కేసులో వర్మాకి మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వడ్డెర బాలాజి అన్నారు.

రూ.1200 కోసం కత్తులతో దాడి

హైదరాబాద్ : నగరంలో గ్యాంగ్ వార్ జరిగింది. కేవలంలో రూ.1200 కోసంల కత్తులతో దాడి చేసుకున్నారు. హబీబ్ నగర్ పీఎస్ పరిధిలోని మల్లేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైజాన్ అనే వ్యక్తిని రూ.1200 నింధితులు అడిగారు. తన వద్ద డబ్బులేదని ఫైజాన్ చెప్పడంతో అతని పై దుండుగులు కత్తులతో దాడి చేశారు.

10:25 - February 20, 2018

హైదరాబాద్ : నగరంలో గ్యాంగ్ వార్ జరిగింది. కేవలంలో రూ.1200 కోసంల కత్తులతో దాడి చేసుకున్నారు. హబీబ్ నగర్ పీఎస్ పరిధిలోని మల్లేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైజాన్ అనే వ్యక్తిని రూ.1200 నింధితులు అడిగారు. తన వద్ద డబ్బులేదని ఫైజాన్ చెప్పడంతో అతని పై దుండుగులు కత్తులతో దాడి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : ఉదయం 10.30లకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ భేటీ కానుంది. భేటీలో విభజన హామీలపై, అఖిలపక్షం భేటీకి తేదీ ఖరారు చేయడంపై చర్చించనున్నారు.

10:07 - February 20, 2018

గుంటూరు : ఉదయం 10.30లకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ భేటీ కానుంది. భేటీలో విభజన హామీలపై, అఖిలపక్షం భేటీకి తేదీ ఖరారు చేయడంపై చర్చించనున్నారు. సమన్వయ కమిటీ అఖిలపక్షం సమావేశానికి ఆహ్వానించాలన్న దానిపై నిర్ణయం తీసుకొనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రెండో రోజు ప్రపంచ ఐటీ సదస్సు ప్రారంభం

హైదరాబాద్ : రెండో రోజు ప్రపంచ ఐటీ సదస్సు ప్రారంభమైంది. రోబో సోఫియా సదస్సులో ప్రసగిస్తుంది. మానవత్వం మెరుగైన భవిష్యత్తు అంశంపై రోబో ప్రసంగం చేస్తోంది. 

09:31 - February 20, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 11 వేల 300 కోట్ల కుంభకోణం నుంచి ఇంకా జనం తేరుకోక ముందే మరో మోసం వెలుగు చూసింది. రొటొమాక్‌ పెన్నుల కంపెనీ యజమాని విక్రమ్‌ కొఠారి 5 బ్యాంకుల్లో 800 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టాడని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ జరిపిన దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకొచ్చాయి. కొఠారీ మోసం చేసింది 8 వందల కోట్లు కాదు...ఏడు బ్యాంకులకు వడ్డీతో కలిపి 3,695 కోట్లు అప్పుగా ఉన్నట్లు తేలింది.బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదు మేరకు విక్రమ్‌ కొఠారిపై సిబిఐ కేసు నమోదు చేసింది. కాన్పూర్‌లోని కొఠారీ నివాసం, కార్యాలయాల్లో సిబిఐ దాడులు నిర్వహించింది. అప్పు ఎగవేత కేసులో కొఠారీతో పాటు ఆయన భార్య, కుమారుడిని సిబిఐ ప్రశ్నించింది.సిబిఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కూడా రంగంలోకి దిగింది. విక్రమ్‌ కొఠారీపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది.అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి విక్రమ్‌ కొఠారీ రుణాలు తీసుకున్నారు. ఈ అప్పులకు అసలు కానీ వడ్డీ కానీ ఇంతవరకు చెల్లించలేదు గత ఏడాది ఫిబ్రవరిలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా రొటొమాక్ సంస్థలను డిఫాల్టర్ జాబితాలో వేసింది.

విక్రమ్‌ కొఠారీ కూడా దేశం విడిచి
పిఎన్‌బి స్కాం ప్రధాన సూత్రధారి వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీలాగే విక్రమ్‌ కొఠారీ కూడా దేశం విడిచి పారిపోయాడాని వార్తలొచ్చాయి. దీనిపై వెంటనే స్పందించిన కొఠారి....దేశాన్ని విడిచి వెళ్లే యోచన తనకు లేదని ... తాను కాన్పూర్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. విక్రం కొఠారి మాత్రం తానేమి తప్పు చేయలేదని చెబుతున్నారు. నేను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మాట వాస్తవమే...కానీ తాను అప్పులు చెల్లించడం లేదన్నది అవాస్తవమని...రుణాలను తిరిగి చెల్లిస్తానని చెప్పారు. బ్యాంకులు తన కంపెనీని నాన్‌ పర్‌ఫామింగ్ ఎసెట్‌ కింద ప్రకటించారని...ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉందన్నారు. రొటొమాక్ పెన్నుకు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. పాన్‌ పరాగ్‌ పాన్‌ మసాలా కూడా కొఠారి కుటుంబానికి సంబంధించినదే.

09:11 - February 20, 2018

కడప : జిల్లా రాజంపేట లో సోము అనే బీటెక్ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. సోము డెడ్ బాడీని దుండగుడు రైల్వేస్టేషన్ వద్ద పడసేసి పరారైయ్యారు. సాయి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పాత కక్షలే హత్యకు కారణమని అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:10 - February 20, 2018

కర్నూలు : జిల్లా తుంగభద్ర బ్రిడ్జివద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్ నేషనల్ హైవేపై రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు మునగాలపాడుకు చెందని ప్రసాద్, సుదర్శన్ గా గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

రాజంపేటలో విద్యార్థి హత్య

కడప : జిల్లా రాజంపేటలో విద్యార్థి హత్య గురైయ్యాడు. సోముసాయి అనే విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారైయ్యారు. కాలేజీలో గొడవలే ఈ హత్య కారణమని తెలుస్తోంది. 

వయోవృద్ధులకు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

చిత్తూరు : నేడు వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం సౌకార్యం  కల్పించనున్నారు. 

07:30 - February 20, 2018

చంద్రబాబు మాసకత్వం ఎంటంటే ప్రజల్లో వేడి కాబట్టి ఆయన వేడిగా మాట్లాడుతారని, కొన్ని రోజుల తర్వాత బీజేపీతో కలిసిపోతారని, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని మోసం చేశారని సీపీఎం నాయకులు గఫూర్ అన్నారు. రాజీనామాలు చేయడంలో గానీ కేంద్రం నుంచి బయటకు రావడంలో గానీ టీడీపీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, అయితే కేంద్రంపై ఒత్తిడి చేయాలని దీనిపై అందరు కలిసి పోరాటం చేయాలే తప్ప ఇలా చంద్రబాబుపై వైసీపీ, వామపక్షాలు విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నేత మన్నె సుబ్బారావు అన్నారు. టీడీపీ, పవన్ కల్యాణ్ తిరుపతి సభలో ఏపీ హామీలు ఇచ్చారని, ఏడాదికి ఒసారి ట్వీట్టర్ వేదికగా మాట్లాడతారని వైసీపీ మధన్ మోహన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నేడు రెండో రోజు ప్రపంచ ఐటీ సదస్సు

హైదరాబాద్ : నేడు రెండో రోజు ప్రపంచ ఐటీ సదస్సు జరగనుంది. సదస్సులో ఆకర్షణగా నిలవనున్న సోఫియా రోబో. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు అంశంపై రోబో వివరివరించనుంది. 

07:20 - February 20, 2018

హైదరాబాద్ : సచివాలయంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.. ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ, ఇంటర్‌, పాఠశాలల యాజమాన్యాల జేఏసీ నేతలతో భేటీ అయ్యారు. వారి సమస్యలను ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చాయి. సమస్యలన్నీ మంత్రికి వివరించాయి. కడియం శ్రీహరితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి.

ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం కేవలం 400 కోట్లు
నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ, పీజీ విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రైవేట్‌ రంగంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం కేవలం 400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని ప్రైవేట్‌ యాజమాన్యాలు తెలిపాయి. అందుకే ఈ మొత్తాన్ని నాన్‌ ప్రొఫెషనల్‌ కాలేజీలకు ప్రత్యేక పద్దుకింద విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు బడ్జెట్‌లో వేర్వేరు కేటాయింపులు చేయాలన్నారు. దీనికి కడియం సానుకూలంగా స్పందించినట్టు వారు మీడియా సమావేశంలో తెలిపారు. దోస్త్‌ అడ్మిషన్లను ఉమ్మడిగా చేపడుతున్నప్పటికీ ఆయా యూనివర్సిటీల కింద బోధనా ఫీజులు వేర్వేరుగా ఉన్నాయని.. ఫీజులను కూడా ఉమ్మడిగా నిర్ణయించాలని యాజమాన్యాలు కడియంను కోరాయి. మిగిలిపోయిన సీట్లను స్పాట్‌ అడ్మిషన్‌ కింద భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కోరాయి. ట్యూషన్‌ ఫీజు ఏటా పదిశాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరాయి. సమస్యలను పరిష్కరిస్తామని.. 15 రోజుల తర్వాత అధికారులు, జేఏసీ నేతలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కడియం హామీనిచ్చిన్టటు డిగ్రీ, పీజీ కాలేజీల జేఏసీ నేతలు తెలిపారు.ఇంటర్మీడియట్‌ అఫ్లియేషన్‌లో చాలా సమస్యలున్నాయని.. వీటిని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లినట్టు జూనియర్‌ కాలేజీల మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. అఫ్లియేషన్‌ సమస్యలను పరిష్కరించేందుకు కడియం హామీనిచ్చారన్నారు. ట్యూషన్‌ ఫీజును 40శాతం పెంచాలని కోరితే.. 50శాతం పెంచుకునేందుకు అంగీకరించారని చెప్పారు. దీంతో ప్రభుత్వానికి తాము పూర్తిస్థాయిలో పరీక్షల నిర్వహణలో సహకరిస్తామని చెప్పారు.

ప్రతి సంవత్సరం స్కూల్స్‌ను రెన్యూవల్‌ చేసుకోవడం
పక్కా భవనాలున్న చోట ప్రతి సంవత్సరం స్కూల్స్‌ను రెన్యూవల్‌ చేసుకోవడం కాకుండా.. ఒకేసారి రెన్యూవల్‌ చేసే విధానాన్ని కల్పించాలని ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు కడియం శ్రీహరిని కోరాయి. తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మార్చుకోవడం కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని.. ఇంకా ఏవైనా సమస్యలుంటే వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్టు కడియం హామీనిచ్చినట్టు తెలిపారు. మొత్తానికి ప్రభుత్వం తరపున కడియం శ్రీహరి ఇచ్చిన హామీలతో ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అటు ప్రభుత్వం కూడా పరీక్షల నిర్వహణకు ముందుకువచ్చిన యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన తగ్గినట్టైంది.

07:17 - February 20, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రత్యేక హోదా అంశం సవాళ్లు - ప్రతిసవాళ్లతో రక్తికడుతోంది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకహోదాపై రెండు రోజులపాటు జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీ పేరుతో సమాలోచనలు చేశారు. మేధావులు, విపక్షపార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సందర్భంలో... విభజన హామీలు రాబట్టేందుకు రాజీనామాలు చేస్తే సరిపోదని... పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితేనే ప్రయోజనం ఉంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగలిగితే.. తనకున్న పరిచయాలతో మద్దతు ఇప్పిస్తానని స్పష్టం చేశారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధమని
పవన్‌ సవాల్‌ను స్వీకరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరివారంలో అవిశ్వాసం తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పవన్‌ ఇతర పార్టీలను ఒప్పించాలని సవాల్‌ విసిరారు.జగన్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు జనసేనాని తెలిపారు. వైసీపీ అవిశ్వాసం పెడితే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని జగన్‌కు సూచించారు. తాను 4న ఢిల్లీకి వస్తానని... అక్కడే సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ఆద్మీ, టీడీపీతోపాటు ఇతర పార్టీల ఎంపీల మద్దతు సంపాదిస్తానన్నారు. అవసరమైతే కర్నాటక, తమిళనాడుకు వెళ్లి వారి మద్దతు కోరుతానని స్పష్టం చేశారు.

ఏపీలో మాటలయుద్ధం
అవిశ్వాస తీర్మానంపై ఏపీలో మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అవిశ్వాసంతో ఉపయోగం ఉండబోదని తేల్చిచెప్పారు. అవిశ్వాసానికి 54 మంది ఎంపీల మద్దతు కావాలన్నారు. అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం ఉండాలని అభిప్రాయపడ్డారు. మూడున్నరేళ్లుగా ఓపికగా ఉన్నామని... రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో ఎవరు పోరాడుతాని ఆయన ప్రశ్నించారు.అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో 184వ నిబంధన కింద నోటీస్‌ ఇచ్చామని... నోటీస్‌పై చర్చతోపాటు ఓటింగ్‌ కూడా ఉంటుందన్నారు. ఒకవేళ ఆ నోటీస్‌ను స్పీకర్‌ అనుమతించకపోతే.. తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తేల్చి చెప్పారు.మొత్తానికి ఏపీలో అవిశ్వాస రాజకీయం అన్ని పార్టీల్లోనూ సెగలు పుట్టిస్తోంది. మరి మార్చి నాటికి ఎవరు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారో.... ఏపీ ప్రజల విశ్వసనీయత ఎవరు పొందుతారో వేచి చూడాల్సిందే.

07:08 - February 20, 2018

మేము ఇంత కష్టం చేసి ఎర్రజొన్న పండిస్తే తమకు ప్రభుత్వం కేవలం 2,500 మద్దతు ధర ప్రటకించిందని, గత సంవత్సరం 4వేలు కొనుగోళు చేసిన వారు ఇప్పుడు రూ.1500 ఇస్తున్నారని, రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ మాపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఎర్రజొన్న రైతులు రవీందర్, శ్రీనివాస్, గంగారెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:03 - February 20, 2018

హైదరాబాద్ : తెలంగాణా స్పోర్ట్స్ అధారిటి లో అక్రమాల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు విద్యార్దులకు మెడికల్ సీట్ల కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం విచారణ చేపట్టినప్పటికీ ఆ రిపోర్టు వచ్చిన తరువాత భాద్యులపై చర్యలు తీసుకున్న ధాఖలాలు లేవు. తాజా గా మరో విద్యార్ధినికి అన్యాయం జరిగిందని ప్రభుత్వం తరుపున ద్విసభ్య కమిటి వేసి ఇవాళ విచారణ చేపట్టింది. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా లేదా అని భాదితులు ఎదురుచూస్తున్నారు.తెలంగాణా స్పోర్ట్స్ అధారిటి లో మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు చేటుచేసుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు విద్యార్ధులు అధారిటి అధికారులకి.. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదుచేసినా న్యాయం మాత్రం జరగటం లేదు. అయితే తాజాగా మీడియా లో వస్తున్న కథనాల ద్వారా ప్రభుత్వం స్పందించి ద్విసభ్య కమిటి ని ఏర్పాటు చేసింది. ఈ కమిటి ఇవాళ హైద్రాబాద్ లోని సాట్స్ కార్యలయంలో నష్టపోయిన క్రీడాకారులు.. వారి తల్లిదండ్రులతో విచారణ చేపట్టింది. ప్రాధమికంగా అధారిటిలోనే కొందరు కాసులకు కక్కుర్తిపడి మెడికల్ సీట్ల కేటాయింపులకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

జీవితాలతో చెలగాటం
అయితే 2017-18 నీట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్ధులు స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించినప్పటికీ కొందరు ఉన్నతాధికారులు వారి జీవితాలతో చెలగాటమాడారని భాదితులు మండిపడ్డారు. ఇదే విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టినప్పటికీ రిపోర్టులో కేవలం పనిఒత్తిడి వల్ల తప్పిదం జరిగిందని ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే తాజాగా మరో ఫిర్యాదు అందటంతో తెలంగాణా ప్రభుత్వం కూడా ఈవిషయంపై సీరియస్ గా తీసుకుని ద్విసభ్య కమిటి వేసి మొత్తం ఘటనపై విచారణ చేపట్టాలని సీనియర్ స్పోర్ట్స్ అధికారులను నియమించింది. అయితే దీనిపై సాట్స్ చైర్మన్ కూడా వెంటనే విచారణ లో నిజానిజాలు బయటకు వస్తాయని దోషులను శిక్షిస్తామని అంటున్నారు.

అధికారుల తప్పిదాలే
మరోవైపు ఈ కమిటి ఈ రోజు సాట్స్ కార్యలయంలో భాదితుల తురుపున వినేందుకు సిద్ధమయ్యారు. అయితే అందులో పూర్తిగా అధికారుల తప్పిదాలే కనిపిస్తున్నాయని ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్టుగా సమాచారం. గతంలో జరిగిన తప్పిదాలే ప్రస్తుతం ఫిర్యాదు చేసిన నిర్మల్ క్రీడాకారిణి విషయంలో కనిపిస్తున్నాయని ఓ అధికారి అన్నారు. నిజానికి విలువిద్య లో సీనియర్ జట్టులో ఆడిన దళిత విద్యార్ధిని జూనియర్ జట్టులో ప్రాతినిధ్యం వహించిన కిందకు చేర్చి తప్పులు తడకలుగా సర్టిఫికేట్లు సృష్టించి విద్యార్ధుల విలువైన విద్యాసంవత్సరాన్ని వృధా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటలో భాద్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. మెడికల్ సీట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా ఈ విచారణ కమిటి ఈనెల 24న ప్రభుత్వానికి రిపోర్టు అందజేయనున్నారు. ఈ రిపోర్టు అయినా దోషులను గుర్తించి తమకు న్యాయం జరుగుతుందనే ఆందోళనలో క్రీడాకారులున్నారు. 

Don't Miss