Activities calendar

21 February 2018

టాస్ సీడ్ ఫెడ్డీ జోరు...

ఢిల్లీ : సెమీ ఫైనల్‌లో ఆండ్రియాస్‌ సెప్పీని ఓడించిన ఫెడ్డీ ...టైటిల్‌ ఫైట్‌లో బల్గేరియన్ స్టార్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌ను చిత్తు చేశాడు. టాప్‌ సీడ్‌ ఫెడ్డీ జోరు ముందు దిమిత్రోవ్‌ తేలిపోయాడు. ఫెదరర్‌ కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 92వ ATP టైటిల్‌ కావడం విశేషం.

పంజాబ్ లో కెనాడా పీఎం...

ఢిల్లీ : వారం రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో పంజాబ్‌లో పర్యటించారు. ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఆయనకు స్వాగతం పలికారు. ట్రూడో కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణమందిరాన్ని దర్శించుకున్నారు.

కేబినెట్ నిర్ణయాన్ని ఖండించిన సీపీఎం...

ఢిల్లీ : బొగ్గు గనుల ప్రయివేటీకరణకు అనుమతిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం ఖండించింది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలను అనుమతించేందుకు కేంద్రం సమ్మతించింది. మోది సర్కార్‌ చేపడుతున్న ఆర్థిక సంస్కరణల్లో భాగమే ఈ నిర్ణయమని విమర్శించింది. 

21:23 - February 21, 2018

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధనలో... సాంకేతికత కూడా.. కీలక పాత్ర పోషిస్తుందన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. టీ ఫైబర్‌ ద్వారా ఇళ్లు, స్కూళ్లు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీ ఏదైనా అది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని హైదరాబాద్‌లో జరిగిన ఐటీ కాంగ్రెస్‌ ముగింపు సదస్సులో మంత్రి కేటీఆర్‌ చెప్పారు. చివరిరోజు సదస్సులో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌.. ఐవోటీ ఆధారిత సేవల విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తైవాన్‌తో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, తైవాన్‌ సిటీ బోర్డు డైరెక్టర్‌ రాబర్ట్‌ హువాంగ్‌ సంకతాలతో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే ముందుందన్నారు మంత్రి కేటీఆర్‌. టెక్నాలజీతో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని.. వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. విద్య, వైద్యం, వ్యవసాయం శాఖల్లో టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం తెలంగాణయేనని ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పారు. దేశంలో మొదటిసారి తెలంగాణలో టెలిమెడిసిన్‌ను ప్రారంభించించిన విషయాన్ని గుర్తు చేశారు.

చివరి రోజు సదస్సుకు హాజరైన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె మానసిక ఆనందంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. జీవన శైలిలో మార్పు, సామాజిక చైతన్యం ద్వారా కుంగుబాటు నుంచి బయటపడొచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తాను ఒంటరిననే భావన నుంచి బయటకు రావాలని సూచించారు. కుంగుబాటు లక్షణాలున్నవారిని గుర్తించి అండగా నిలవలాన్నారు. పని, ఆహారం, విశ్రాంతిలో నియమాలు పాటించాలని దీపిక సూచించారు. వచ్చే ఏడాది ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను ఆర్మేనియాలో జరపాలని నిర్ణయించారు. దీంతో ఆర్మేనియాకు సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ అప్పగించింది. 

21:20 - February 21, 2018

విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంపుపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరవు భత్యాన్ని 2.096 శాతం మేర పెంచాలని తీర్మానించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1048.60 కోట్ల రూపాయల భారం పడనుంది. అలాగే పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి 1244.36 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏసీబీలో 350 పోస్టుల భర్తీ, గన్నవరం కోర్టులో 25 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే వివిధ సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సుమారు మూడు గంటలకు పైగా జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. ఉద్యోగులకు 2017 నుంచి 2018 మార్చి 31 వరకు 2.096 శాతం డీఏ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1048.60 కోట్ల రూపాయల భారం పడనుంది.

గ్రామ రెవిన్యూ సహాయకులకు ఇస్తున్న మొత్తానికి అదనంగా నెలకు రూ.300 చొప్పున పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌1న తీసుకొనే మార్చినెల జీతం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి 1244.36 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం, ఆ తర్వాత మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఇదివరకే చంద్రబాబు ప్రకటించినప్పటికీ.. మంత్రివర్గం చర్చించి దీనిపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అలాగే విశాఖ, తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఇందుకోసం విశాఖలో 2.7 ఎకరాలు, తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో 3.37 ఎకరాలను 33 ఏళ్లపాటు SPI సినిమాస్‌ ప్రెవేట్ లిమిటెడ్‌కు లీజ్‌కు అనుమతి ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి మండలి తీర్మానించింది. ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల క్రింద ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు పబ్లిక్ హెల్త్, మెడికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని సింగిల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

లొంగిపోయిన ఎమ్మెల్యే అమానుతల్లా ఖాన్...

ఢిల్లీ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ జామియా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇదే కేసులో ఆప్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌ జార్వాల్‌ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు.

యూపీ పెట్టుబడుదారుల శిఖరాగ్ర సమావేశం...

లక్నో : ప్రధానమంత్రి నరేంద్రమోది 'ఉత్తరప్రదేశ్‌ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశాన్ని' లక్నోలో ప్రారంభించారు. యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. బుందేల్‌ ఖండ్‌లో 20 వేల కోట్లతో ఇండస్ట్రియల్‌ కారీడార్‌ను నిర్మించనున్నట్లు మోది ప్రకటించారు. 

21:12 - February 21, 2018

చెన్నై : తాను హీరోల్లా భావించే వారిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకరని.. నటుడు కమలహాసన్‌ అన్నారు. రామేశ్వరంలో మత్స్యకారులతో భేటీ అనంతరం.. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మ్యానిఫెస్టో గురించి అందరూ అడుగుతున్నారన్న కమల్‌.. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబును సంప్రదించానని, ప్రజలకు ఏమి చేయాలన్నదానిపై ముందుగా స్పష్టత తెచ్చుకోవాల్సిందిగా సూచించారని చెప్పారు. దాని ఆధారంగా సేవ చేస్తే.. మిగిలినవన్నీ అప్రాధాన్య అంశాలే అవుతాయని చంద్రబాబు సలహా ఇచ్చారని కమల్‌ వెల్లడించారు.

21:10 - February 21, 2018

తమిళనాడు : పార్టీ ప్రారంభోత్సవానికి ముందు... నటుడు కమల్ హాసన్ రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అబ్దుల్‌ కలాం సోదరుడు 90 ఏళ్ల మొహమ్మద్‌ ముథుయిమీరన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కమల్‌కు మాజీ రాష్ట్రపతి ఫొటోను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. సాధారణ కుటుంబానికి చెందిన అబ్దుల్‌ కలాం తనకు ఆదర్శప్రాయుడని కమల్‌ పేర్కొన్నారు. కలాం ఇంటి నుంచి తన యాత్రను ప్రారంభించడంలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. 

21:07 - February 21, 2018

తమిళనాడు : విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. మక్కల్‌ నీతి మయమ్‌ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. మదురైలోని ఒత్తకడై గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అభిమానుల కేరింతల మధ్య.. ఆయన తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమై ఉంది. చేయి చేయి కలిపి ఉన్నట్లు ఈ జెండాలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు హాజరయ్యారు. తాను ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదని.. ప్రజల నుంచి సలహాలు తీసుకునే వ్యక్తినన్నారు కమల్. ఈ ఒక్కరోజుతోనే కార్యక్రమం ఆగిపోదు. నేడు నాయకుడిని కాదు. మీలో ఒకడినినన్నారు. మీకు సేవ చేసేలా మాకు మార్గనిర్దేశం చేయాలని కమల్‌హాసన్ తన అభిమానులు, కార్యకర్తలను కోరారు. 

పురుషోత్తం రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ పురుషోత్తం రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో రేపు విచారణ జరుగుతుంది. పురుషోత్తంరెడ్డికి బినామీ శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌లోని చాముండేశ్వరి అపార్ట్‌మెంట్స్‌లోని 101 ఫ్లాట్‌లో సోదాలు చేస్తున్నారు. కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

20:50 - February 21, 2018

అయ్యో తెలంగాణ సర్కారును నోటికొచ్చినట్టు తిడ్తున్నరు సోషల్ మీడియాల జనం..తెలంగాణ ప్రజలారా..? మీకు తెల్సా..? మీరు ఎంత అప్పులళ్ల జిక్కిన సంగతి..? ఏ జగదీశ్వర్ రెడ్డి గురించి నేనెందుకు మాట్లాడ్త.. ఆయన తీన్ పీటుంటడు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల కోసం తయ్యారైనట్టే అనిపిస్తున్నది...ఆర్ఎస్ పార్టీకి ధమ్ముంటే.. కాంగ్రెస్ పార్టీల గెల్చి టీఆర్ఎస్ పార్టీల జేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలు..పదవుల కోసం మేము బుట్టలేదు.. పదవులే మాకోసం బుట్టినయ్ అంటున్నడు.. కరీంనగర్ ఎంపీ వినోద్...గొర్ల పత్కం గోవిందా గోవిందా.. ఏ గొల్లకుర్మాయిన జూడు.. జగిత్యాల జిల్లా హస్నాబాద్ కాడ.. ఒకామెకు నిన్న శిగమొచ్చిందట.. గిసొంటి ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఇంజనీర్ సిండికేట్ రియల్ ఎస్టేట్స్ ఎండీ అరెస్టు...

హైదరాబాద్ : ఇంజనీర్ సిండికేట్ రియల్ ఎస్టేట్స్ ఎండీ సుమిత్ సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు. షామీర్ పేట పీఎస్ లో కేసు నమోదైంది. ఒక ప్లాట్ యజమానిని మోసం చేసిన కేసులో ఆయన్ను అరెస్టు అయ్యారు. ఇంజనీర్ సిండికేట్ పాట్నర్ గొడవలు తలెత్తాయి. మరో నలుగురు డైరెక్టర్ల మీద కూడా కేసులు నమోదు చేశారు.

 

20:08 - February 21, 2018

విభజన రాజకీయాలు ఇంకా నడుస్తునే ఉన్నాయి. టిడిపి, బిజెపి పార్టీలు మోసం చేస్తున్నాయని..కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరించుకోవాలని విపక్షాలు పేర్కొంటున్నాయి. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు అఖిల సంఘాలతో భేటీ కావాలని టిడిపి నిర్ణయిస్తోంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైసీపీ రెడీ అవుతోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చ వేదికలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), మన్నె సుబ్బారావు (టిడిపి), రామకృష్ణ (కాంగ్రెస్), రామకోటయ్య (బిజెపి) నేతలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు...

పశ్చిమగోదావరి : జిల్లాలోని దేవరపల్లిలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టైంది. ముఠాను చుట్టుముట్టిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ వాసు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 

కమల్ రాజకీయ పార్టీ పేరు ప్రకటన...

తమిళనాడు : పార్టీ పేరును సినిమా నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ‘మక్కల్ నీతి మయ్యం'గా పేరును ప్రకటించారు. మధురై ఒత్తకడై మైదానంలో పార్టీ జెండాను కమల్ ఆవిష్కరించారు. ఈ సభలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, భారీగా అభిమానులు హాజరయ్యారు.  

ఒక్కపక్క అన్యాయం..మరో పక్క అవమానం - బాబు..

విజయవాడ : సాధికారమిత్రలతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. విభజన తరువాత అందరూ భయపడ్డారని, ఉద్యోగులు హైదరాబాద్ వచ్చి సమీక్షా సమావేశాలకు హాజరై వెళ్లారని తెలిపారు. కష్టమైనా..నష్టమైనా..ఇక్కడి నుండే పరిపాలించాలని నిర్ణయించడం జరిగిందని, విభజనతో ఒక్కపక్క అన్యాయం..మరో పక్క అవమానం ఎదురైందన్నారు. మూడున్నరేళ్లుగా కేంద్రం సహకరించడం లేదని, గత ప్రభుత్వ దుష్పరిపాలన..వాస్తవిక స్థితిపై 8 శ్వేతపత్రాలు రూపొందించినట్లు తెలిపారు. 

ఎన్ఆర్ చందూర్ జగతి అవార్డు...

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఎన్ఆర్ చందూర్ జగతి అవార్డు ప్రధానోత్సవం జరుగనుంది. అంతర్జాతీయ ప్రాతికేయుడు, తెలుగుతేజం నరిసెట్టి రాజుకు అవార్డును వెంకయ్య ప్రధానం చేశారు. 

పోకిరిని అరెస్టు చేసిన షీటీమ్...

హైదరాబాద్ : పెన్షన్ ఆఫీసు వద్ద యువతిని వేధించిన పోకిరిని షీటీమ్ అరెస్టు చేసింది. టీఎస్ 13 ఇఇ 1019 బైక్ పై వచ్చి లిఫ్ట్ ఇస్తానంటూ వేధింపులకు గురి చేశాడు. పోకిరి చేష్టలను యువతి సెల్ ఫోన్ లో రికార్డు చేసి షీటీమ్ కు వాట్సప్ పంపించింది. రంగంలోకి దిగిన షీటీమ్ సిబ్బంది పోకిరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను టప్పాచబుత్రకు చెందిన వాడిగా గుర్తించారు. 

18:35 - February 21, 2018

చిత్తూరు : టిటిడిలో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తులకు ఊరట లభించింది. అన్యమత ఉద్యోగస్తులను తొలగించకూడదంటూ ఉభయ రాష్ట్రాల హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్యమతస్తులుగా ఉన్న 42 మందిని తొలగిస్తూ టిటిడి ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఉద్యోగస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా టిటిడి కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టు విచారించింది. ఏన్నో ఏళ్లుగా పనిచేస్తున్న హైందవేతరులను ఎలా తొలగిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 

18:31 - February 21, 2018

విశాఖపట్టణం : జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ తీసిన వర్మ ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనంటూ మహిళా సంఘాలు పిడికిలి బిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసును బుక్ చేసినా ఏపీలో మాత్రం అలాంటిదేమి చేయకపోవడం పట్ల మహిళా సంఘాలు కన్నెర్ర చేస్తున్నారు. వర్మపై కేసు నమోదు చేయాల్సిందే..ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ ఎదుట 48గంటల పాటు నిరహార దీక్షకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:27 - February 21, 2018

అనంతపురం : జిల్లాలో కియా ఆటమొబైల్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన శంకుస్థాపన చేయడానికి గురువారం జిల్లాకు సీఎం చంద్రబాబు రానున్నారు. జిల్లాలోని పెనుగొండ మండలం అమ్మవారి పల్లె వద్ద 650ఎకరాల్లో రూ. 1300 కోట్లతో కొరియా సంస్థ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసే బహిరంగసభలో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. 1.30 గంటలకు బహిరంగసభ జరుగుతుందని, 4.30 గంటలకు బాబు పుట్టపర్తికి వెళ్లి అక్కడి నుండి విజయవాడకు వెళుతారని టిడిపి నేతలు తెలిపారు. కియా ఆటో మొబైల్ పరిశ్రమ రావడంతో ఉపాధి అవకాశాలు మెరుగువతాయని ఇక్కడి వారు అనుకుంటున్నారు. 

18:21 - February 21, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలని..ఈ విషయంలో టిడిపి..బిజెపి పార్టీలు మోసం చేశాయని ఏపీలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం వైసీపీ నేత పార్థసారధి సీఎం చంద్రబాబు నాయుడిపై తిట్ల దండకం అందుకున్నారు.

ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరైంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా నాటకలకు తెరలేపొద్దని..సిగ్గు..లజ్జ ఉంటే..వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. మళ్లీ కొత్త డ్రామాలు ఆడవద్దని..రాష్ట్ర విభజన అంశాలను సాధించడానికి పోరాటం చేస్తున్న యోధుడు జగన్ ఒక్కరనేనని..ఇది ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. మరి పార్థసారధి చేసిన ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎలా స్పందిస్తుందో ? వారు కూడా ఇలాగే తిట్లదండకం అందుకుంటారా ? చూడాలి. 

బాండ్ల రూపంలో నిధుల సేకరణ -మేయర్...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఆర్థిక పరిపుష్టి కోసం బాండ్ల రూపంలో నిధుల సేకరణ చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని భారీ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు రూ. 1000 కోట్ల నిధులు బాండ్స్ ద్వారా సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో బిడ్డింగ్ ద్వారా రూ. 200 కోట్లు, 8.90 శాతం వడ్డీ కింద నిధులు సేకరణ చేయనున్నట్లు తెలిపారు. 

అధికారులతో కడియం..లక్ష్మారెడ్డిల భేటీ...

హైదరాబాద్ : సచివాలయంలో అధికారులతో మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలు సమావేశమయ్యారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు..హెల్త్ కార్డుల పంపిణీపై చర్చించారు.

 

టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన వద్దు - ఘంటా చక్రపాణి..

హైదరాబాద్ : అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. టీఆర్‌టీ పరీక్ష సెంటర్ల కేటాయింపు విషయంలో తప్పులు దొర్లడంతో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. పరీక్షా కేంద్రాల విషయంలో అందుబాటులో ఉన్న వాటిని కేటాయించడం జరిగిందని, కేంద్రాల కేటాయింపు సజావుగానే జరిగిందని తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో పరీక్ష నిర్వాహణ ఉంటుందని, ఏ జిల్లాలోని అభ్యర్థులకు ఆ జిల్లాలోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లు ఆన్ లైన్ లో తీసుకోవాలని సూచించారు. 

గాంగ్వర్ తో ఇంద్రకిరణ్ భేటీ...

ఢిల్లీ : కేంద్ర మంత్రి సంతోస్ గాంగ్వర్ తో మంత్రి ఇంద్రకిరణ్ భేటీ అయ్యారు. నిర్మల్ లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

17:58 - February 21, 2018

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ నిర్వహించే టీఆర్టీ పరీక్షా విషయంలో నెలకొన్న గందరగోళంపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఇతర జిల్లాల్లో పరీక్షా సెంటర్లు కేంద్రీకరించారని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. హైదరాబాద్ హెచ్ఎండీఈతో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో జిల్లాలో ఆన్ లైన్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ లో ఈ సదుపాయం లేదన్నారు. ఆయా జిల్లాల్లో హైదరాబాద్ ఏరియా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టీఆర్‌టీ తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు డౌన్ లౌడ్ అవుతున్నాయని, ఈ నెల 24న తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అనుకున్న సమయానికి పరీక్షలు జరుగుతాయన్నారు. 
టీఆర్‌టీ పరీక్ష సెంటర్ల కేటాయింపు విషయంలో తప్పులు దొర్లడంతో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

17:34 - February 21, 2018

హైదరాబాద్ : లంగర్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. దాదపు 80 తులాల బంగారు ఆభరణాలు..1.50 లక్షల నగదును దొంగలు అపహరించారు. ఓ విందుకు హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి కుటుంబం వెళ్లింది. తాళం వేసి ఉందని గమనించిన గుర్తు తెలియని దుండగులు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అమీన్ పూర్ లో స్టూడెంట్స్ మిస్సింగ్...

సంగారెడ్డి : అమీన్ పూర్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. టైలర్స్, లింగమయ్య కాలనీలకు చెందిన విద్యార్థులు శివ (13), సైపుద్దీన్ (14)లు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

17:22 - February 21, 2018

హైదరాబాద్ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం టి.సర్కార్ ని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఈనెల 24వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ వరకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని..మార్చి 3వ తేదీ నుండి విద్యుత్ పంపిణీ సంస్థల వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించింది. కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు. 

17:10 - February 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం స్టార్టప్ స్టేట్‌గా ఎదుగుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగిసింది. చివరి రోజు సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కొత్తగా వచ్చే ఏ టెక్నాలజీ అయినా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు. టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని, భారత్‌లో తొలిసారి టెలిమెడిసిన్‌ను ఇక్కడే ప్రారంభించామని గుర్తు చేశారు. టీ ఫైబర్‌తో ఇండ్లు, స్కూళ్లు, పీహెచ్‌సీలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. 

17:01 - February 21, 2018

ఏపీలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా వారు కోరుతున్నారు. వివిధ దశల్లో వారు ఆందోళనలు..నిరసన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూలంగా స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళుతున్నట్లు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నేతలు ప్రకటించారు. గత రెండు రోజులుగా 24వేల మంది కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. మంత్రి కళా వెంకట్రావ్ తో జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ సమస్యపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిపిన చర్చా వేదికలో విద్యుత్ జేఏసీ నాయకులు చంద్రశేఖర్, బాలకాశీ, రమణమూర్తి పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కొఠారిని ప్రశ్నిస్తున్న సీబీఐ...

ఢిల్లీ : రొటామిక్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి..ఆయన కుమారుడిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విక్రమ్ కొఠారి రూ. 3,700 కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 141.27 పాయింట్లు లాభ పడి 33844.86 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 37.05 పాయింట్ల లాభంతో 10, 397.45 పాయింట్లకు చేరింది. 

16:47 - February 21, 2018

తెలుగు ఇండస్ట్రీ కి సుపరిచితమైన స్టార్ హీరో ఫామిలీ వరుస సినిమాలతో ఎప్పుడు టాక్ ఆఫ్ ధీ టౌన్ గా ఉంటుంది. ఈ ఫామిలీకి చెందిన హీరో ఇప్పుడు తన బ్రదర్ ఫాదర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు 'నందమూరి తారక రామారావు'. ఎన్ టి ఆర్ నుండి నటవారసత్వాన్ని తీసుకుని వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హీరోగానే కాక ప్రొడ్యూసర్ గా కూడా మంచి ఫామ్ లో ఉన్న 'నందమూరి హీరో కళ్యాణ్ రామ్'. కెరీర్ స్టార్టింగ్ నుండి హీరోగా ట్రై చేస్తూ 'ఫటాస్' సినిమాతో హిట్ ట్రాక్ పట్టిన హీరో 'నందమూరి కళ్యాణ్ రామ్’.

శివ రామరాజు, సీతయ్య లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టుతో హీరోగా కనిపించిన నందమూరి హీరో హరికృష్ణ. తన నటనతో ఆకట్టుకుంటూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హరికృష్ణ. గతంలో మంచి పాత్రలని చేసిన 'హరికృష్ణ' ఈ మధ్య కాలంలో స్క్రీన్ మీద కనిపించలేదు. హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటూ అలరించిన 'హరికృష్ణ' మరలా స్క్రీన్ మీద కనిపించబోతున్నాడట.

కళ్యాణ్ రామ్, హరికృష్ణ, ఎన్ టి ఆర్ ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే చూడాలని ఫాన్స్ కి ఉంటుంది. ఇప్పుడు వీరి ముగ్గురిని ఒకే తెరపై కలిపి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుకున్నట్టు జరిగితే... తండ్రీ కొడుకులు త్వరలోనే ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. సావిత్రి - ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ సాధినేని ఒక కథతో కళ్యాణ్ రామ్ ని మెప్పించి హీరోగా కళ్యాణ్ రామ్, అతిథి పాత్రలో ఎన్ టి ఆర్ హరికృష్ణ ని చెయ్యాలని అడిగారట. మరి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నందమూరి వంశంలో బాలకృష్ణ తరువాత ఆ స్థాయికి చేరింది జూనియర్ ఎన్టీఆరే.

16:35 - February 21, 2018

సంగారెడ్డి : స్కూల్లో పిల్లలు అల్లరి చేసినా..చదవకపోయినా..ఇతరత్రా కారణాలు ఏవైనా ఓపికతో నచ్చచెప్పాల్సిన టీచర్లు కిరాతకంగా మారిపోతున్నారు. చిన్న పిల్లలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా చావబాదుతున్నారు. పటన్ చెరువులోని మంజీరా స్కూల్ లో ఓ టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది.

పటన్ చెరులోని మంజీరా స్కూల్ లో ఓ టీచర్ దారుణానికి తెగబడింది. యూకేజీ చదువుతున్న విద్యార్థిని పుష్పాంజలిని మేఘన టీచర్ తీవ్రంగా కొట్టింది. చిన్నారి బట్టలు విప్పగా ఈ విషయం తెలుసుకన్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థి సంఘాలు..కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. చేతులు..వీపుపై వాతలు వచ్చేలా కొట్టిందని, ఆసుపత్రిలో చూపించి పటన్ చెరు పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 

16:30 - February 21, 2018

విశాఖపట్టణం : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'జీ ఎస్టీ' సినిమా వివాదం ఇంకా వీడడం లేదు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో యూ ట్యూబ్ లో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పేరిట పోర్న్ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. సామాజిక వేత్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది. కానీ ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

దీనితో మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద మహిళలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను బుధవారం దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవీతో టెన్ టివి మాట్లాడింది. ఐద్వా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు పక్కన పెట్టడం సరికాదన్నారు. జీఎస్టీ సినిమా దర్శకుడు వర్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని, మహిళల ఆత్మగౌరవాన్ని వర్మ కించపరిచారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:22 - February 21, 2018

తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న కొత్త టాలెంట్ ఇప్పుడు హిట్ ట్రాక్ లో నడుస్తుంది. చిన్న చిన్న సినిమాలతో హిట్ కొట్టి ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటున్నారు. కొత్త డైరెక్టర్స్ హావా పెరుగుతుంది. ఇండస్ట్రీ లో కొత్త డైరెక్టర్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి హిట్ కొట్టిన 'చలో' సినిమా కూడా కొత్తడైరెక్టర్ వెంకీ కుడుములు నుండి వచ్చిందే. యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా రష్మిక హీరోయిన్ గా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఉష మూల్పూరి నిర్మాతగా వచ్చిన ఈ లవ్ అండ్ ఎంటర్టైనర్ 'చలో' సినిమా కలక్షన్స్ బాగా రాబట్టింది.

యూత్ ఫుల్ లవ్ సబ్జక్ట్స్ కి రైటర్ గా ఉంటూ ..కొత్తదనం ఉన్న స్టోరీ లైన్స్ మీద వర్క్ చేసిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఫ్రెష్ లవ్ స్టోరీ ఈ 'తొలిప్రేమ' సినిమా. ఫ్రెష్ లవ్ స్టోరీస్ వచ్చి చాల రోజులైంది అని వెయిట్ చేసే ఆడియన్స్ కోసం కొత్త తరహా లవ్ స్టోరీ ని ప్రెజెంట్ చేసాడు వెంకీ అట్లూరి. నటుడిగా రైటర్ గా పరిచయం ఉన్న వెంకీ అట్లూరి ఇప్పుడు డైరెక్టర్ గా మారి హిట్ కొట్టాడు.

షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద స్క్రీన్ కి పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని.. నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన సినిమా 'అ!’. విభిన్నమైన.. ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చింది. హిట్ ట్రాక్ తో కలక్షన్స్ రాబడుతుంది ఈ సినిమా. 

హైదరాబాద్ లో దీపికా...

హైదరాబాద్ : వరల్డ్ ఐటీ సదస్సులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు దీపికా సమాధానం చెప్పారు. 

16:00 - February 21, 2018

తెలుగు సినిమాలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటున్న డైరెక్టర్ ఇప్పుడు మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోని కూడా ఫిక్స్ చేసి స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యాడు. కాకతీయ రాణి రుద్రమదేవి పరాక్రమాలని తెరకెక్కించిన డైరెక్టర్ గుణశేఖర్. తెలంగాణ వీరనారి జీవిత కధలో కొన్ని ఘట్టాలను అద్భుతంగా తీసి వీర తెలంగాణ చరిత్రని ఆన్ స్క్రీన్ చూపించిన డైరెక్టర్ గుణశేఖర్ మరో స్టోరీతో రాబోతున్నాడు. 'రుద్రమదేవి' లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ మీద రూ.70 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి పెద్ద సాహసమే చేశాడు గుణ. ఆ సినిమా చాలా వరకు పెట్టుబడిని వెనక్కి తెచ్చి గుణశేఖర్ కష్టానికి మంచి ఫలితమే అందించింది.

'రుద్రమదేవి' తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్.. 'హిరణ్యకశిప' సినిమా తీయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాను ఈ సినిమా చేయబోతున్నట్లు రానా కూడా ధ్రువీకరించాడు. ఈ సినిమా మీద , రానా మీద రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతున్నాడట గుణ. రానా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు 'ఘాజీ'ని మూడు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ కు వచ్చింది. 'నేనే రాజు నేనే మంత్రి' తెలుగులో పెట్టుబడిని వెనక్కి తెచ్చింది. మరి గుణ..రానా కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. 

15:56 - February 21, 2018

అరుదైన రికార్డు ని సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ కమెడియన్. కమెడియన్ గానే కాక హీరోగా కూడా తన సత్త చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ చేసిన ఈ స్టార్ కమెడియన్ చెప్పిన విశేషాలు చాల ఇంటరెస్టింగ్ గ ఉన్నాయ్. తన టైమింగ్ తో కామెడీ తో అలరిస్తున్న కమెడియన్స్ చాల మంది ఉన్నారు. టాలీవుడ్ లోని సుప్రసిద్ధ కమెడియన్ లలో అలీ ఒకరు. అలీ పేరు చెబితేనే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు విరబూస్తాయి. అలీ స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా ఆనందానికి హద్దులుండవ్. 5 భాషల్లో దాదాపు 1100 చిత్రాల్లో నటించిన అరుదైన ఘనత అలీ కి ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన అలీ...ఆ తర్వాత కమెడియన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అలీ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏ ఏడాది ఏప్రిల్ 28కి ‘యమలీల’విడుదలై 24 ఏళ్లవుతుందని ఆ తేదీకి చాలా ప్రత్యేకత ఉందని అలీ అన్నారు. సరిగ్గా అదే తేదీన ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ - ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ లు విడుదలయ్యాయని అలీ గుర్తు చేసుకున్నారు. అలీ హీరోగా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే .

15:38 - February 21, 2018

నల్గొండ : జిల్లా కలెక్టరేట్ లో బుధవారం కలకలం రేగింది. ఉప సర్పంచ్ ఆత్మహత్యకు ప్రయత్నించడం పెద్ద దుమారం రేగింది. గోపాలపురం ఉప సర్పంచ్ కలెక్టరేట్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది స్పందించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. 24 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు.

ఎస్ఎల్ బీసీ కాల్వకు గండి పెడుతున్నావని ఫీల్డ్ అసిస్టెంట్ ను యాదయ్య ను ప్రశ్నించాడు. ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం...కేసు పెడుతానని ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరించడంతో యాదయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఉప సర్పంచ్ ఆత్మహత్యాయత్నం...

నల్గొండ : జిల్లా కలెక్టరేట్ లో కలకలం రేగింది. గోపాలపురం ఉప సర్పంచ్ యాదయ్య ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం...కేసు పెడుతానని ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యాదయ్య కలెక్టరేట్ లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతడిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

టీఆర్టీ పరీక్షపై హైకోర్టుకు అభ్యర్థులు...

హైదరాబాద్ : ఈనె 28వ తేదీన టీఎస్ పీఎస్సీ నిర్వహించనున్న టీఆర్టీ పరీక్షపై పీఈటీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రెండు భాషల్లో పరీక్ష నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. రెండు భాషల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్ పీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. 

అన్యమతస్తులను తొలగించవద్దన్న హైకోర్టు...

హైదరాబాద్ : అన్యమతస్తులను తొలగించవద్దని టిటిడికి హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్యమతస్తులను తొలగించవద్దని..ఉద్యోగాల్లో కొనసాగించాలని సూచించింది. 

15:28 - February 21, 2018

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా..స్పెషల్ ప్యాకేజీపై గతంలో ఒక మాట మాట్లాడారని..ప్రస్తుతం ఒక మాట మాట్లాడుతున్నారని..బాబు మాట మారుస్తున్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, ప్రత్యేక హోదాపై ప్రజలను భాగస్వాములను చేయాలని..లేనిపక్షంలో తామే ఈ పని చేపడుతామన్నారు. మార్చి 1వ తేదీన గుంటూరులో జరిగే బహిరంగసభలో భవిష్యత్ కార్యాచరణనను ప్రకటిస్తామన్నారు. ప్రత్యేక హోదా ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తే రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేయడం ముఖ్యమన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

డీఏ పెంపు..ప్రభుత్వంపై అదనపు భారం - కాల్వ..

విజయవాడ : బుధవారం నాడు జరిపిన ఏపీ కేబినెట్ లో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు..తదితర వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులకు 2.096 శాతం డీఏ చెల్లింపు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీనివల్ల ప్రభుత్వానికి ఏడాది రూ. 845.44 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇప్పుడిస్తున్న వేతనానికి అదనంగా రూ. 300 అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 

15:18 - February 21, 2018

విజయవాడ : బుధవారం నాడు జరిపిన ఏపీ కేబినెట్ లో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు..తదితర వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులకు 2.096 శాతం డీఏ చెల్లింపు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీనివల్ల ప్రభుత్వానికి ఏడాది రూ. 845.44 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇప్పుడిస్తున్న వేతనానికి అదనంగా రూ. 300 అదనంగా ఇవ్వనున్నట్లు..ఏప్రిల్ 1వ తేదీన అమల్లోకి రానుందన్నారు. పదవీ విరమణ చేసిన వారికి...సీపీఎస్ ఉద్యోగులకు మార్చి నెల వేతనం నుండి డీఏ వర్తిస్తుందని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పాత రేట్లకే కొన్ని పనులు చేయడానికి నవయుగ కంపెనీ ముందుకొచ్చిందని..ఆయా సంబంధిత సూపరిటెండెంట్ ఇంజనీర్ ప్రతిపాదనలు..ఇతరత్రా వాటికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం మేరకు నవయుగ కంపెనీకి రూ. 1244 కోట్ల పనుల అనుమతికి మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీ ఎకానమిక్ బోర్డుకు స్వయంప్రతిపత్తి కల్పించే డ్రాఫ్ట్ బిల్లును కేబినెట్ లో ఆమోదించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో ఏసీబీ అవినీతిపరులపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తోందని..అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ సిబ్బంది సరిపోవడం లేదనని..అదనంగా 300 పోస్టులను మంజూరు చేయాలని ఏసీబీ ప్రతిపాదించిన దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. 300 ఖాళీలను నేరుగాను...50 ఖాళీలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకుంటారన్నారు. గన్నవరంలో సీనియర్ సివిల్ జడ్జీ కోర్టు కోసం 25 పోస్టులకు మంజూరు చేస్తామని, ఇందుకు కోటి 46 లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఇక కేంద్రం నుండి అందిన నిధులు..వాటి వివరాలను ఆయా శాఖల అధికారులకు చెప్పడం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 

ఢిల్లీ సీఎస్ దాడిపై ఏపీ ఐఏఎస్ స్పందన..

ఢిల్లీ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై జరిగిన దాడిని ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఖండించింది. సీఎం, డిప్యూటి సీఎం సమక్షంలో ఘటన జరగడం బాధాకరమని, ఢిల్లీ ఐఏఎస్ అధికారులు అసోసియేషన్ కు మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించింది. 

ముగిసిన ఏపీ కేబినెట్...

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఉద్యోగులకు 2.096 శాతం డీఏ చెల్లింపు...ఏసీబీ శాఖలో 350 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్...300 పోస్టులు రెగ్యులర్..50 పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ...పోలవరం కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు సబ్ కాంట్రాక్టు పొందిన నవయుగ కంపెనీకి రూ. 1244 కోట్ల పనుల అనుమతికి మంజూరు చేసింది. 

14:38 - February 21, 2018

సమాజం ఎంత అభివృధ్ధి చెందుతున్నా దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. వీటిని అరికట్టేందుకు చట్టం ఉందని లాయర్ పార్వతి విశ్లేషించారు. మానవి 'మై రైట్' లో లాయర్ పార్వతి విశ్లేషించారు. అగ్రవర్ణాలు..దళిత వర్ణాల మధ్య మరొక పోరాటం కొనసాగుతోందని...ఇంకా అంటరానితనం కొనసాగుతోందన్నారు. అనేక రకాల అత్యాచారాలు...దాడులు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో అట్రాసిటీ నిరోధక చట్టం వచ్చిందన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతో ఈ చట్టం వచ్చిందన్నారు. కానీ ఇందులో శిక్షలు తక్కువగా పడుతున్నాయని, దీనికంతటికి ఫిర్యాదు చేయడానికి భయపడడం..ఇతరత్రా కారణాలు అని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:29 - February 21, 2018

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదని చెప్పుకుంటున్న గొర్రెల పంపిణీ పథకం దారి తప్పుతోంది. వివిధ రాష్ట్రాలు..ప్రాంతాల నుండి గొర్రెలను తీసుకొచ్చి రైతులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ గొర్రెలపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. సబ్సిడీ గొర్రెలను తరలిస్తూ పలువురు పట్టుబడిన ఘటనలు దాఖలయ్యాయి కూడా.

తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం గుంపు గ్రామంలో గొర్రెలను తరలిస్తున్నారన్న పశువైద్యాధికారి ఫిర్యాదుతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సబ్సిడీ గొర్రెల అమ్మకాన్ని అడ్డుకున్నారురు. 61 గొర్రెలతో పాటు ఇద్దరు నిందితులను పీఎస్ కు తరలించారు. 

14:23 - February 21, 2018

అనంతపురం : జిల్లాలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. అన్ని పార్టీల నేతలు జెండాలు పట్టుకుని రోడ్డు మీదకు రావడం గమనార్హం. బుధవారం ఉదయం దెంతులూరు నుండి అనంతపురం ఆర్డీవో కార్యాలయం వరకు అన్ని పార్టీల నేతలు పాదయాత్ర చేపట్టారు. సుమారు 14 కి.మీటర్ల మేర పాదయాత్ర జరిగింది. కేంద్రీయ విశ్వ విద్యాలయ పనులు చేపట్టాలని..అనంత కరువు పారదోలేందుకు చర్యలు తీసుకోవాలని నేతలంతా డిమాండ్ చేశారు. మోసం చేసిన బిజెపికి టిడిపి ఎందుకు మద్దతిస్తోందని..కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేపట్టిన నేతలతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్...

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులకు 2.096 శాతం డీఏ చెల్లింపునకు ఆమోదం తెలిపింది. 

14:19 - February 21, 2018

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులకు 2.096 శాతం డీఏ చెల్లింపునకు ఆమోదం తెలిపింది. ఏసీబీ శాఖలో 350 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్...300 పోస్టులు రెగ్యులర్..50 పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీకి ఆమోదం తెలిపింది. పోలవరం కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు సబ్ కాంట్రాక్టు పొందిన నవయుగ కంపెనీకి రూ. 1244 కోట్ల పనుల అనుమతికి మంజూరు చేసింది. 

సావేలి సత్యనారాయణ ఆమరణ నిరహార దీక్ష...

పశ్చిమగోదావరి : పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఏలేరుపాడులో సావేలి సత్యనారాయణ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. 

కోర్టుకు మధు..భారీగా పోలీసులు...

శ్రీకాకుళం : ఆముదాలవలస కోర్టుకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వాయిదా అనంతరం వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను కలిసేందుకు మధు వెళుతారని ఊహించిన పోలీసులు భారీగా మోహరించారు. 

ఎల్కేజీ స్టూడెంట్ పై టీచర్ దాష్టీకం...

సంగారెడ్డి : పటన్ చెరులో మంజీరా స్కూల్ లో టీచర్ దాష్టీకానికి తెగబడింది. ఎల్కేజీ విద్యార్థి పుష్పాంజలిని ఓ టీచర్ తీవ్రంగా కొట్టింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు..కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. 

నరబలి నిందితుడికి పోలీసు కస్టడీ...

హైదరాబాద్ : ఉప్పల్ చిలుకానగర్ చిన్నారి నరబలి కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్ కు పోలీసు కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. 

షాపింగ్ కాంప్లెక్సుల వివరాలపై విచారణ...

విజయవాడ : మున్సిపాల్టీల్లో రజకులకు కేటాయించిన షాపింగ్ కాంప్లెక్సుల వివరాలపై విచారణ ప్రారంభమైంది. కాంప్లెక్సుల కేటాయింపుల నివేదికను వారంలోపు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లను ఏపీ రజక ఫెడరేషన్ ఎండీ సూచించారు. కేటాయింపుల్లో రజకులకు న్యాయం జరిగేలా కసరత్తు చేస్తామని పేర్కొన్నారు. 

13:55 - February 21, 2018

కరీంనగర్ : తెలంగాణ పండుగల విశిష్టతను తెలుపుతూ కరీంనగర్‌ నిఘమ ఇంజనీరింగ్‌ కళాశాల ట్రెడిషనల్‌ డే నిర్వహించింది. కళాశాల 10వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు అందరినీ అలరించాయి. దసరా, దీపావళి, బతుకమ్మ పండుగలతో సహా గణేష్‌ నిమజ్జనం వంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు సాంప్రదాయబద్దంగా అలంకరించుకుని.. ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ట్రెడిషనల్‌ డే నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ట్రెడిషనల్‌ డేలో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్ధులంటున్నారు. 

 

13:55 - February 21, 2018

కృష్ణా : విజయవాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు తర్జనభర్జనల మధ్యే కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్‌ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించలేదు. రెండు దఫాలుగా వంతెనను పొడిగించంతో మరోసారి పొడిగింపు వీలుపడదని తేల్చి చెప్పింది.  తప్పని పరిస్థితిలో ఫ్లైఓవర్‌ను పొడిగించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది.

రెండో వరుసకు గ్రీన్‌సిగ్నల్‌
ఫ్లైఓవర్‌ నిర్మాణంలో రెండో వరుసకు సంబంధించి ఎన్‌హెచ్‌ అధికారులు 110 కోట్లతో సిద్దం చేసిన డీపీఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బెంజ్‌ సర్కిల్‌ నుంచి రమేష్‌ ఆస్పత్రి వరకు తూర్పువైపున 1.47 కిలోమీటర్ల మేర మూడు వరుసల ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది. రమేష్‌ ఆస్పత్రి నుంచి నిడమనూరు వరకు 4కిలోమీటర్ల మేర  ఫ్లైఓవర్‌ నిర్మించాల్సి ఉంది. 1.47 కిలోమీటర్లకు మూడు వరుసల్లో ఒకవైపు నిర్మించడానికి 110 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. రామవరప్పాడు సెంటర్‌ నుంచి నిడమనూరు వరకు వివిధ దుకాణాలు ఉన్నాయి. వీటిని తొలగించి రోడ్డ విస్తరించాలంటే భూ సేకరణకు మరో 500 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా. ఫ్లైఓవర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్ల ఖర్చు భరించాలి. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించిన ప్రాజెక్ట్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయింపులు జరుపుతారా లేదా అనేది ఆసక్తికా మారింది.

ట్రాఫిక్‌ చక్రబంధంలో ప్రయాణీకులు
ఫ్లైఓవర్‌ పనులు ఊపందుకోవడంతో ట్రాఫిక్‌ చక్రబంధంలో ప్రయాణీకులు నరకం చవిచూస్తున్నారు. దీంతో పైవంతెనను పొడిగించాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. విజయవాడలో గత మూడేళ్ల కాలంలో వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. ఇంకోవైపు  విజయవాడకు వివిధ జిల్లాల నుంచి వాహనాల తాకిడి కూడా అధికంగా ఉంది. ఈ వాహనాలన్నీ కూడా బెంజ్‌ సర్కిల్‌ దగ్గరే కలవాల్సి ఉంది. దీంతో భారీ సంఖ్యలో చేరుకుంటున్న వాహనాలతో నిత్యం వాహనదారులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు.  త్వరితగతిన ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేసి  అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

13:55 - February 21, 2018

కృష్ణా : ఆరు దశాబ్దాల చరిత్ర గలిగిన విజయవాడ విమానాశ్రయం సరికొత్త హంగులను సంతరించుకుంటోంది. విమానాశ్రయ రూపురేఖలే మారిపోతున్నాయి. దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌ పోర్టుల కంటే అధికంగా వృద్ధిరేటు సాధిస్తూ.. గణనీయంగా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. గత ఆర్థిక ఏడాదిలో 8 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది లక్షలాది మంది రాకపోకలు సాగించే దిశగా అధికారులు ప్రాణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ విమానాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి 33 విమాన సర్వీసులు నడుస్తుండగా.. మార్చిలో మరికొన్ని  నూతన విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి.

ముంబైకి విమాన సర్వీసు
విజయవాడ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా ఢిల్లీకి మూడవ సర్వీసును ప్రారంభించింది.  ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబైకి విమాన సర్వీసును ప్రారంభించింది. మార్చి 2 నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైకి ఇండిగో సంస్థ సర్వీసులతోపాటు ట్రూజెట్‌ సంస్థ కడపకు విమాన సర్వీసు ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఇక్కడి నుంచి పలు కీలకమైన దేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. దుబాయ్‌, షార్జా, సింగపూర్‌లాంటి దేశాలకు తొలిసారి ఫ్లైట్స్‌ను నడపాలని భావిస్తున్నారు. ఇక ఇండిగో ఢిల్లీ, జైపూర్‌, కోల్‌కతాలాంటి నగరాలకు విమాన సర్వీసులు నడపాలని, గల్ఫ్‌ దేశాలకు విమానాలు ప్రారంభించాలనే యోచన చేస్తున్నాయి.
750మంది ప్రయాణికుల 
అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం పాత టెర్మినల్‌ను ఆధునీకరించి .. అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించనున్నారు. ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌ 750మంది ప్రయాణికుల రాకపోకలకు ఒకేసారి అవకాశం కల్పించనున్నారు. గత కొంతకాలంగా ఎయిర్‌పోర్టు సాధిస్తున్న ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణానికి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో స్టుప్‌ అనే సంస్థను కేంద్రం ఎంపిక చేసింది.  టెర్మినల్‌ బిల్డింగ్‌ వ్యవహారాలన్నీ ఈ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతాయి. అంతేకాదు.. డిజైన్స్‌ అన్నింటినీ ఈ సంస్థే రూపొందిస్తుంది.  ఇలా విజయవాడ విమానాశ్రయానికి నూతన హంగులు రూపుదాల్చనున్నాయి.

13:54 - February 21, 2018
13:54 - February 21, 2018

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది కాంగ్రెస్‌ పార్టీ.  ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ధీటుగా పార్టీ నిర్మాణం చేపడుతూ వస్తోన్న కాంగ్రెస్‌.. మరింతగా దూకుడు పెంచుతోంది. వచ్చే డిసెంబర్‌లోనే ఎన్నికలు వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. తన అమ్ముల పొదిలోని బస్సుయాత్ర, పాదయాత్రలను చేపట్టాలని నిర్ణయించింది.
తెలంగాణ వచ్చిన నాలుగేళ్లలోనే
తెలంగాణ వచ్చిన నాలుగేళ్లలోనే రాష్ట్ర ప్రజల కలలు చెదిరిపోయాయని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ వైఫల్యాలనే ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ డిసైడ్‌ అయ్యింది. ఇందుకోసం ఈనెల 26 నుంచి కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సుయాత్రను తలపెట్టినట్టు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన ఫైర్‌ అయ్యారు. దళితులకు మూడు ఎకరాల భూమి అంశాన్ని బస్సుయాత్రలో ప్రస్తావిస్తామని చెబుతున్నారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలను ఈ బస్సుయాత్రలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు పన్నుతోంది. సిరిసిల్లలో దళితులపై దాడి, ఖమ్మంలో రైతులకు బేడీలు, మహిళలు, యువతను పట్టించుకోకపోవడాన్ని హైలెట్‌ చేయాలని భావిస్తోంది. ఒకవైపు బస్సుయాత్రను కొనసాగిస్తూనే మరోవైపు తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. తమ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు సిద్దమయ్యింది. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా బస్సుయాత్ర సాగనుంది. ఇక ఇంతకుముందెన్నడూ లేని విధంగా పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పించనుంది. ఏఐసీసీ సభ్యులుగా యువకులకు హైకమాండ్‌ అవకాశం కల్పించబోతుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. 
కాంగ్రెస్‌ రెడీ
మొత్తానికి బస్సుయాత్ర, పాదయాత్రలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ రెడీ అయ్యింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.

13:43 - February 21, 2018

ప్రియ ప్రకాశ్ కు సుప్రీంలో ఊరట

ఢిల్లీ : ఒరు అదార్ లవ్ మూవీపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీనిపై ప్రియ సుప్రీంను ఆశ్రయించింది. దీంతో ప్రియకు అనూకులంగా సుప్రీం తీర్పు వెల్లడించింది. ఈ మూవీపై ఎవరు కేసులు నమోదు చేయ్యోద్దని ఆదేశించింది. 

బ్యాంకు కుంభకోణంపై సీబీఐ విచారణ

రంగారెడ్డి : జిల్లా అజీజీనగర్ తెలంగాణ గ్రామీన బ్యాంక్ కుంభకోణంపై సీబీఐ విచారణ ప్రారంభించారు. 2010,18 మధ్య 50 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి 9 కోట్ల గల్లంతు జరిగింది. దీనపై ఈ నెల 7న సీబీఐ, ఏసీబీకి బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. 

12:23 - February 21, 2018

ఢిల్లీ : ఒరు అదార్ లవ్ మూవీపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీనిపై ప్రియ సుప్రీంను ఆశ్రయించింది. దీంతో ప్రియకు అనూకులంగా సుప్రీం తీర్పు వెల్లడించింది. ఈ మూవీపై ఎవరు కేసులు నమోదు చేయ్యోద్దని ఆదేశించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:14 - February 21, 2018

రంగారెడ్డి : జిల్లా అజీజీనగర్ తెలంగాణ గ్రామీన బ్యాంక్ కుంభకోణంపై సీబీఐ విచారణ ప్రారంభించారు. 2010,18 మధ్య 50 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి 9 కోట్ల గల్లంతు జరిగింది. దీనపై ఈ నెల 7న సీబీఐ, ఏసీబీకి బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. 

ప్రారంభమైన కమల్ రాజకీయా యాత్ర

చెన్నై : కమల్ హాసన్ రాజకీయ యాత్ర ప్రారంభమైంది. రామేశ్వరం నుంచి మధురై వరకు కమల్ యాత్ర కొనసాగనుంది. మధురైలో సాయంత్రం భారీ బహిరంగ సభలో కమల్ తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. 

కూసుమంచిలో ఉద్రిక్తత

ఖమ్మం : జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్యపేట, ఖమ్మం జాతీయ రహదారి కోసం రెవెన్యూ అధికారులు భూసర్వే చేయడానికి వచ్చారు దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.

11:29 - February 21, 2018

ఖమ్మం : జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్యపేట, ఖమ్మం జాతీయ రహదారి కోసం రెవెన్యూ అధికారులు భూసర్వే చేయడానికి వచ్చారు దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

గందరగోళంగా ఏపీ టెట్

మేడ్చల్ : జిల్లా చర్లపల్లిలో ఏపీటెట్ సెంటర్ గందరగోళంగా మారింది. ఆఖరి నిమిషంలో అధికారులు ఎగ్జామ్ సెంటర్ ను మార్చారు. హయత్ నగర్ వివేకానంద ఇన్ స్టిట్యూట్ కు సెంటర్ ను మార్చారు.

11:22 - February 21, 2018

మేడ్చల్ : జిల్లా చర్లపల్లిలో ఏపీటెట్ సెంటర్ గందరగోళంగా మారింది. ఆఖరి నిమిషంలో అధికారులు ఎగ్జామ్ సెంటర్ ను మార్చారు. హయత్ నగర్ వివేకానంద ఇన్ స్టిట్యూట్ కు సెంటర్ ను మార్చారు. దీంతో అభ్యర్థులు ఆవేదనకు గురైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జగన్ పాదయాత్రను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

ప్రకాశం : జిల్లా పొన్నలూరు మండలం అగ్రహారం వద్ద జగన్ పాదయాత్రను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. 

గంటలో టీఅర్టీ : టీఎస్ పీఎస్సీ

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ సీజీజీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టీఆర్టీ హాల్ టికెట్లు సాంకేతిక సమస్యలను సీజీజీ పరిష్కరిస్తుందని వాణిప్రసాద్ తెలిపారు. గంటలోపు హాల్ టికెట్లను వెబ్ సైట్లో ఉంచుతామని ఆమె తెలిపారు. 

11:06 - February 21, 2018

కటక్ : అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-2 మధ్యశ్రేణి క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఈ క్షిపణికి వెయ్యి కిలోల బరువును మోసుకెళ్లే స్థోమత ఉంది. అగ్ని-2 మిసైల్‌ ఆర్మీ ఆయుధాగారంలో ఇప్పటికే చేరింది. ఇంతకు ముందు ఫిబ్రవరి 6న అగ్ని-1 పరీక్ష కూడా విజయవంతమైంది.

11:05 - February 21, 2018
10:26 - February 21, 2018

చెన్నై : ఓ ప్రయివేట్‌ యాడ్‌ కంపెనీకి 6.2 కోట్లు చెల్లించాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భార్య లతను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో కొచ్చాడయాన్‌ సినిమా తెరకెక్కించారు. మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తీసిన ఈ సినిమాకు లత నిర్మాతగా వ్యవహరించారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కోసం మీడియా వన్‌ ఓ యాడ్‌ కంపెనీ నుంచి అప్పు తీసుకుంది. కొంత చెల్లించిన 6.2 కోట్లు అప్పు తీర్చకపోవడంతో యాడ్‌ కంపెనీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. 6.2 కోట్లను కంపెనీ చెల్లించకపోతే...లతనే చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.

10:26 - February 21, 2018

చెన్నై : తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ మధురై వేదికగా కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించి జెండాను ఆవిష్కరించనున్నారు. మధురైలోని ఐల్యాండ్‌ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ విధి విధానాలను కమల్‌ ప్రకటిస్తారు. ఇప్పటికే మధురైకి చేరుకున్న కమల్‌ హసన్‌- బహిరంగసభ ఏర్పాట్లను సహచరులతో కలిసి పర్యవేక్షించారు. కమల్‌ అక్కడి నుంచి నేరుగా రామేశ్వరం వెళ్లి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమాధిని సందర్శించుకోనున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కమల్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.

తమిళనాట రాజకీయ సందడి
ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలు రానుండడంతో తమిళనాట రాజకీయ సందడి నెలకొంది. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేరళ సీఎం పినరయి విజయన్, కమ్యూనిస్టు నేతలు సహా పలువురు జాతీయ స్థాయి నేతలను కమల్ ఆహ్వానించారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌కాంత్‌ తదితరులు హాజరు కానున్నారు. డిఎంకె చీఫ్‌ కరుణానిధిని కూడా కమల్‌ కలుసుకున్నారు. అధికారంలో ఉన్న అన్నాడిఎంకెను మాత్రం ఆయన ఆహ్వానించలేదు. అన్నాడిఎంకె విధానాలు నచ్చకనే తాను రాజకీయాల్లోకి వచ్చానని కమల్‌ స్పష్టం చేశారు. అవినీతి, మతతత్వ విధానాలను కమల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తమిళనాట రాజకీయాలకు సినీరంగానికి విడదీయరాని బంధముంది. తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి సినీరంగానికి చెందినవారే. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్‌హసన్‌ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఫుల్‌ టైం రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్న లోకనాయకుడికి తమిళ ప్రజలు ఎలా ఆదరిస్తారన్నది వేచి చూడాలి.

నగరంలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్ : నగరంలో పోలీసులు విసృత తనిఖీలు చేపట్టారు. టోలీచౌకి, బంజారాహిల్స్ ల్లో విదేశియులు నివసించే ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 250 మందిపైగా సూడాన్, నైజీరియన్ దేశస్తులు వారి వీసా గడువు ముగిసిన కూడా సిటీలో ఉండడంతో వారిని అదపులోకి తీసుకున్నారు. 

10:24 - February 21, 2018

హైదరాబాద్ : నగరంలో పోలీసులు విసృత తనిఖీలు చేపట్టారు. టోలీచౌకి, బంజారాహిల్స్ ల్లో విదేశియులు నివసించే ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 250 మందిపైగా సూడాన్, నైజీరియన్ దేశస్తులు వారి వీసా గడువు ముగిసిన కూడా సిటీలో ఉండడంతో వారిని అదపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:08 - February 21, 2018

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఈ నెల 23 న కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా విశాఖలో జరిగే పాట్నర్ షిప్ సమ్మీట్ పై కూడా చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:01 - February 21, 2018
09:58 - February 21, 2018

సెంచూరియన్ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా మరో టీ20 సిరీస్‌పై కన్నేసింది. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌ నెగ్గి హిస్టరీ క్రియేట్‌ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌ సైతం సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. సెంచూరియన్‌ పార్క్‌ వేదికగా జరుగనున్న 2వ మ్యాచ్‌లో టీ20 3వ ర్యాంకర్‌ భారత్‌కు 7వ ర్యాంకర్‌ సౌతాఫ్రికా సవాల్‌ విసురుతోంది.తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా సెకండ్‌ టీ20తోనే సిరీస్‌ నెగ్గి సఫారీ గడ్డపై సంచలనం సృష్టించాలని తహతహలాడుతోంది. ఆల్‌రౌండ్‌ పవర్‌తో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా..టీ20 సిరీస్‌ సైతం నెగ్గి చరిత్రను తిరగరాయాలని ప్లాన్‌లో ఉంది. రోహిత్‌,ధావన్‌,విరాట్‌ కొహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు బ్యాటింగ్‌లో మునుపెన్నడూ లేనంతలా బలంగా ఉంది. భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా ,జయదేవ్‌ ఉనద్కత్‌, చహాల్‌తో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ సైతం పదునుగా ఉంది.

తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌
తొలి టీ20లో తేలిపోయిన సౌతాఫ్రికా టీమ్‌..సెకండ్ టీ20లో నెగ్గి సిరీస్‌లో నిలవాలని పట్టుదలతో ఉంది. టీ20 ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌దే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 11 టీ20ల్లో పోటీ పడగా...భారత్‌ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 4 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది.పటిష్టమైన టీమ్‌ కాంబినేషన్‌తో పాటు....ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియాకే సెకండ్‌ టీ20లోనూ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

వనపర్తి : జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు.

09:10 - February 21, 2018

వనపర్తి : జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:19 - February 21, 2018

తూర్పుగోదావరి : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కోరారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విసిరిన సవాల్‌పై జగన్‌ సానుకూలంగా స్పందించడం మంచి పరిణామన్నారు. అవిశ్వాసంపై చంద్రబాబు కాలయాపన చేయడం సరికాదన్నారు. 

08:16 - February 21, 2018

విశాఖ : జిల్లా ఎన్ఏడీకొత్త రోడ్డు మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడి 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని కేజీహెచ్ తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:11 - February 21, 2018

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ మొదలైన ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తున్నామని చెబుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు కేంద్రం ఏమాత్రం సాయం చేయడంలేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జయప్రకాశ్‌నారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌తోపాటు మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావులాంటి మేధావులు ఉన్నారు. అంతేకాదు.. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ సభ్యులు రెండు రోజులపాటు జరిగిన జేఎఫ్‌సీ సమావేశాల్లో పాల్గొన్నారు.

సభ్యుల మధ్య విభేదాలు
జేఎఫ్‌సీ సమావేశాల సందర్భంగా సభ్యుల మధ్య విభేదాలు పొడచూపాయన్న వాదన వినిపిస్తోంది. సమావేశాల మొదటి రోజు ప్రభుత్వం లెక్కలు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని జేపీ అన్నారు. అయితే దీనికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు.. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని జేపీ చేసిన వ్యాఖ్యలను మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం కచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేననని జేపీకి కృష్ణారావు కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత రోజు దీనిపై జేపీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లెక్కలు అడిగినా రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిందేనంటూ క్రిష్ణారావు తెలిపారు. దీంతో కమిటీలోని సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీకి ఇచ్చిన హామీలు
జేఎఫ్‌సీలో జరుగుతున్న చర్చ విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడంలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. విభజన హామీలు అమలు చేయించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌, వామపక్షపార్టీల నేతలు వాదిస్తున్నారు. కమిటీలో కొంతమంది సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతోంటే... మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. దీంతో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. జేఎఫ్‌సీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చర్చ జరుగకుండా... కేవలం కేంద్రం ఇచ్చే నిధులు, హామీలపైనే ఎక్కువ చర్చ జరుగుతుందన్నది కొంతమంది వాదన. నిజాలను నిగ్గుతేల్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాల్సిందేనని మరికొంత మంది సభ్యులు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టకుండా.. కేవలం కేంద్రం హామీలు అమలు చేయడంలేదని వాదించడం సరికాదన్నది మరికొందరి వాదన.జేఎఫ్‌సీ ఏర్పాటై అసలు విషయాలపై ఇంకా స్పష్టతకు రాకుండానే.. ఇలా సభ్యుల మధ్య విభేదాలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏ కమిటీ ఏర్పాటు ప్రారంభంలో ఇలాంటి చిన్నచిన్న బేదాభిప్రాయాలు సహజమేనని కొందరి అభిప్రాయం. మరి పవన్‌... జేఎఫ్‌సీ నుంచి ఎలాంటి ప్రతిఫలాను సాధిస్తారో వేచి చూడాలి.

08:09 - February 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగా రాజకీయ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ.... కనుమరుగు కానుంది. టీజేఏసీ నూతన పార్టీగా ఆవిర్భవించబోతోంది. ఇందుకోసం తెరవెనుక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులను టీజేఏసీ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. సాధారణంగా పార్టీ ఏర్పాట్లను.. ఎవరైతే పార్టీ పెడతారే వారే నేరుగా చేసుకుంటారు. కానీ టీజేఏసీ మాత్రం .. పార్టీ పనులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. కోదండరామ్‌ నేరుగా పార్టీ ఏర్పాటు పనుల్లో నిమగ్నం అయితే.. అటు అధికార పార్టీ నుంచి.. జాతీయ స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానంతో.. కోదండరామ్‌ అండ్‌ టీమ్‌ పార్టీ ఏర్పాటు పనులను ఏజెన్సీకి అప్పగించింది. పార్టీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటేషన్‌ పనుల కోసం ఏజెన్సీ ఇప్పటికే పలుమార్లు కోదండరామ్‌ సలహాలు , సూచనలతో ఢిల్లీకి వెళ్లివచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి కోదండరామ్‌తో కలిసి మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. కోదండరాం ఏర్పాటు చేయనున్న పార్టీ గుర్తు, జెండాను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ పనులను ప్రైవేట్‌ ఏజెన్సీకి
పార్టీ పనులను ప్రైవేట్‌ ఏజెన్సీ చూసుకుంటుంటే.. కార్యాలయం కోసం టీజేఏసీ నేతలు అన్వేషిస్తున్నారు. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక భాగాన్ని టీజేఏసీ ఇప్పటికే ఉపయోగించుకుంటోంది. ఈ క్వార్టర్స్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేకు చెందినదిగా తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు పనులను నేరుగా కోదండరామ్‌ ఇంట్లోనే నిర్వహించడం సాధ్యంకాకపోవడంతో ఈ క్వార్టర్‌ను ఉపయోగించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ ఏర్పాటు, స్టీరింగ్‌ కమిటీ సమావేశాలు ఇతర పనుల ఏర్పాట్లు సైతం ఈ క్వార్టర్స్‌ నుండే జరుగుతున్నాయి. కోదండరామ్‌ పార్టీ ఏర్పాటు పనులు చక్కబెడుతూనే మరోవైపు ఆవిర్భావ సభకు జాతీయ స్థాయిలో నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో వరంగల్‌లో నిర్వహించే సభకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను టీజేఏసీలోని కీలక నేతలు అప్పగించారు. మొత్తానికి కోదండరామ్‌ పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

08:06 - February 21, 2018

గుంటూరు : రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా.. బీజేపీ అయినా న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ కూడా అలానే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రజాదర్బారు హాల్లో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో పోరాడుతూనే రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు ప్రతి విమర్శ పార్టీ అజెండా కాదని చంద్రబాబు అన్నారు. అవిశ్వాస తీర్మానానికి 54మంది మద్దతు కావాలన్న ఆయన... కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశం కాదు.. అఖిలసంఘాలతో సంప్రదింపులు జరుపుతానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలే ఉన్నాయని.... అందులో ఓ పార్టీ అసెంబ్లీకి రావడం లేదని సీఎం అన్నారు. అందుకే అఖిలసంఘాలతో సంప్రదింపులు జరుపుతామన్నారు.

14వ ఆర్థిక సంఘం చెప్పిందని..
ప్రత్యేక హోదా ప్రయోజనాలను ఏ పేరుతో ఇచ్చినా అవన్నీ రాష్ట్రానికి దక్కించుకోవటమే టీడీపీ అజెండా అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని.. అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని చంద్రబాబు చెప్పారు. హోదా.. ప్యాకేజీ ఏ పేరుతో ఇచ్చినా ఫర్వాలేదని.. హోదాలో ఉన్న ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్న ఆయన.... వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుందని ముందుగా పొగిడింది వైసీపీనేనని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎక్కడా రాజీపడలేదన్నారు.

జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం
ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను సృష్టించి జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని ఆక్షేపించారు. అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చాం అంటూ బీజేపీ కూడా ప్రకటనలు చేస్తోందని.. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా టీడీపీని ప్రశ్నించడమేమిటని చంద్రబాబు తప్పుబట్టారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి అంతగా సాయం అందకపోయినా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సాధించామన్నారు. మనం కష్టపడుతున్నాం కదా అని సాయం చేయమని కేంద్రం భావిస్తే కుదరదని... మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

07:38 - February 21, 2018

బీఎల్ఎఫ్ ను తెలంగాణ ప్రజలు అరించాల్సిన అవసరం ఉందని, అనేక సామాజిక సమస్యలు పరిష్కారం కోసం, కేరళ తరహా విధానాలు రావాలంటే బీఎల్ఎఫ్ అధికారంలోకి రావాలని సీపీఎం నాయకులు నంద్యాల నరసింహరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా చూసినట్టైతే దేశంలో సీపీఎం పరిస్థితి ఎలా చూస్తున్నామని, కేరళలో అక్షర్యాసత ఎప్పటి నుంచే ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. కాంగ్రెస్ పాలనాలో కూడ దేశం అభివృద్ధి చెందిందని, కానీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగాలేదని, ప్రతి ప్రభుత్వంలో కుంభకోణం జరిగిందని టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏపీలో నేటి నుంచి టెట్

తూర్పగోదావరి : జిల్లాలో నేటి నుంచి మార్చి 2వరకు టెట్ నిర్వహించనున్నారు. మార్చి 17న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంలకు నుంచి మధ్యాహ్నం 12 వరరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటలకు టెట్ నిర్వహణ జరగనుంది. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : నేడు అమరావతిలో ఉదయం 10.30 లకు ఏసీ కేబినెట్ భేటీ కానుంది. ఉద్యోగులకు బకాయిలున్న ఒక డిఏకు కేబినెట్ ఆమోదించనుంది. అసెంబ్లీ నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై ఈ కేబినెట్ లో చర్చ జరగనుంది. 

విశాఖలో రోడ్డు ప్రమాదం

విశాఖ : జిల్లా మర్రిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు. 

07:19 - February 21, 2018

ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఐదు డిమాండ్లు చేస్తున్నామని, ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీని దేశంలోనే నెం.1 నిలబెడతామని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం రూ.500కోట్లు ప్రకటించారని వాటిని ఇంతవరకు విడుదల చేయాలేదని, అంతేకాకుండా పే స్కేలు కూడా పెంచాలని సీఐటీయూ నాయకులు వీఎస్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss