Activities calendar

22 February 2018

బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసే - శరద్ పవార్...

మహారాష్ట్ర : దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం పుణేలో బహిరంగ వేదికపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్‌ అధ్యక్షుడు రాజ్ థాకరే ...శరద్‌ పవార్‌ను రెండు గంటల పాటు అనేక అంశాలపై ఇంటర్వ్యూ చేశారు.

బిజెపిపై కమల్ ధ్వజం...

ఢిల్లీ : మక్కల్ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హసన్‌ బిజెపిని టార్గెట్‌ చేశారు. భారత త్రివర్ణ పతాకంలో కాషాయ రంగు ఒక భాగమే తప్ప మొత్తం జెండాను కాషాయం చేయకూడదంటూ బిజెపిపై ధ్వజమెత్తారు. 

రాజకీయాల్లో బిగ్ బి ?

ఢిల్లీ : బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా? ట్విట్టర్‌లో అకస్మాత్తుగా పలువురు కాంగ్రెస్‌ నేతలను ఫాలో కావడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. రాజీవ్‌గాంధీ హయాంలో అమితాబ్‌ బచ్చన్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. అలహాబాద్‌ నుంచి పోటీ చేసిన ఆయన హెచ్‌ఎన్‌ బహుగుణను ఓడించి సంచలనం సృష్టించారు.

21:19 - February 22, 2018

నల్గొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యుత్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్‌ శాఖలో ఆపరేటర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అధికార పార్టీ నేతలు నిరుద్యోగుల ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి మోసం చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, విజిలెన్స్‌ శాఖలకు ఫిర్యాదు చేశానన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి సొంత జిల్లాలో భారీ కుంభకోణం జరుగుతున్నా.. మంత్రి పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు.

ట్రూడో పర్యోటన వివాదాస్పదం...

ఢిల్లీ : కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత పర్యటన వివాదస్పదంగా మారింది. ట్రూడో పాల్గొనే విందు కోసం సిక్కు వేర్పాటువాది జస్పాల్‌ అత్వాల్‌కు కెనడా హైకమిషన్ ఆహ్వానం పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కెనడా రాయబార కార్యాలయం ప్రకటించింది.

21:17 - February 22, 2018

హైదరాబాద్ : రాబోయే రోజుల్లో సేవాదళ్ కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానంతో పాటు.. టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ సేవాదళ సదస్సులో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడింగ్ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. RSS మతతత్వాన్ని రెచ్చగొడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే.. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచిన చరిత్ర సేవాదళ్‌దని ఉత్తమ్ అన్నారు. ప్రస్తుతం మోదీ, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను సేవాదళ్ కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్ సూచించారు.

 

21:16 - February 22, 2018

మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి సాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూలు ప్రకారం పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు ఆదేశించారు. పనులు చేయని ఏజెన్సీలను తొలగించి, కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించాలని కోరారు. 

21:14 - February 22, 2018

హైదరాబాద్‌ : చుట్టు పక్కల ఉన్న ఫార్మా కంపెనీల నుంచి ప్రతి ఏటా ఒక కొత్త వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నగరంలో మూడు రోజుల పాటు జరిగే బయో ఏషియా-2018 సదస్సును కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సదస్సుకు యాభై దేశాల నుంచి 1200 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో వస్తున్న ఆధునిక పరిశోధనలపై చర్చిస్తున్నారు. ప్రపంచానికి చౌకైన వ్యాక్సిన్లు అందించడంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

21:13 - February 22, 2018

హైదరాబాద్ : త్వరలో తెలంగాణలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. గురువారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన వ్యవసాయ రంగంపై జరిగిన సమీక్షా సమావేశం జరిగింది. రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలపై సమీక్ష జరిపారు. వీలైనంత త్వరగా కొత్త కార్పొరేషన్ ప్రారంభించాలని సూచించారు. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ లాగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రజత్‌కుమార్‌ను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

బయో సైన్స్ లో కేటీఆర్..

హైదరాబాద్ : బయో సైన్స్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్స్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. 

ప్రారంభమైన బయో ఏషియా సదస్సు...

హైదరాబాద్ : నగరంలోని హెచ్‌ఐసీసీలో బయో ఏషియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్, 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

21:10 - February 22, 2018

విజయవాడ : ఐఏఎస్‌ల‌పై గ‌తంలో తాను చేసిన వ్యాఖ్యల‌కు క‌ట్టుబ‌డి ఉన్నానని వైసీపీ రాజ్యస‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. టీడీపీకి కొంద‌రు ఐఏఎస్‌లు తొత్తులుగా వ్యవ‌హరిస్తున్నారని.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఆ ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తానని అన్నారు. విజ‌య‌సాయి రెడ్డి ఆరోప‌ణ‌పై ఐఏఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రాజ్యసభసభ్యుడు విజ‌య‌సాయి రెడ్డికి ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్‌ల‌కు మ‌ధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజ‌య‌సాయి రెడ్డి మ‌రో మారు అదే స్థాయిలో మండిప‌డ్డారు. టీడీపీ ప్రభుత్వానికి కొంద‌రు ఐఏఎస్‌లు కార్యక‌ర్తల్లా ప‌నిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఏఏస్ అధికారులు సెటిల్మెంట్‌లు చేస్తున్నార‌ని మండిపడ్డారు.

గ‌తంలో తాను ఐఏఏస్‌లపై చేసిన వ్యాఖ్యల‌కు క‌ట్టుబ‌డి ఉన్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. దీంతో పాటు అస‌లు వైసీపీ నుంచి త‌మ ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్లటం వెనుక ఐఏఏస్‌లు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయి ప్రసాద్, ఐజీ‌ వెంకటేశ్వర రావులు ఉన్నార‌ని ఆరోపించారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పకుండా మీడియాకు విడుద‌ల చేస్తామ‌ని మీడియా చిట్ చాట్‌లో కీల‌క వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు విజ‌య‌సాయి రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై ఐఏఎస్‌లు మండిప‌డుతున్నారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబ‌డుతున్నారు. బాధ్యతాయుత వృత్తిలో ఉన్న అధికారులపై రాజకీయ పార్టీల అసత్య ఆరోపణలు తగదని హితవు ప‌లుకుతున్నారు. అధికారులకు రాజకీయాలు అంటగట్టడం ఏంట‌ని ప్రశ్నిస్తున్నారు. పరిపాలన సజావుగా సాగేందుకు అధికారులు కృషి చేస్తుంటే రాజకీయాలు ఆపాదించడం మంచి ప‌రిణామం కాద‌ని ఐఏఎస్‌ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఐఏఎస్‌ అధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే వాటిపై తీవ్రంగా స్పందించిన అధికారులు.. విజయసాయిరెడ్డి ఆ వ్యాఖ్యలను సమర్థించడంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

21:07 - February 22, 2018

హైదరాబాద్ : ఏపీలో టీడీపీకి కటీఫ్‌ చెప్పి.. ఫ్యాన్‌ కిందికి చేరదామనుకున్న కమలదళానికి అనూహ్యంగా జగన్‌సెగ తగిలింది. జగన్‌ కేసుల వ్యవహారం.. ఇప్పుడు ప్రధాని మోదీకి అంతర్జాతీయ నోటీసులు జారీ అయ్యేదాకా వెళ్లింది. ఇందూ టెక్‌ జోన్‌- ఐటీ సెజ్‌ కేసులో తాము భారీగా నష్టపోయామని తమకు న్యాయం చేయాలంటూ మారిషస్‌ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని ఆర్బిట్రేషన్‌ కోర్టును ఆశ్రయించింది. దాంతో పాటే.. ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులకూ నోటీసులు పంపింది.

జగన్ ఆస్తుల కేసు ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. భారత్‌ను ఇంటర్నేషనల్‌ కోర్టు ముందు ఉంచింది. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసుతో తాము భారీగా నష్టపోయామని, న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు పంపించింది.

ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసులో జగన్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురిపై సీబీఐ చార్జిషీట్‌లు దాఖలు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇందూ టెక్ జోన్‌లో మారిషస్‌కు 49 శాతం వాటా ఉంది. ఐటీ సెజ్‌ కోసం మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం 115 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. అయితే సీబీఐ కేసుతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని.. 50 మిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రధాని మోదీకి నోటీసులు పంపడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. మారిషస్ నోటీసులు పంపిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరించింది. సీబీఐ, ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నందున తమ పెట్టుబడుల ఒప్పందానికి రక్షణ లేకుండా పోయిందంటూ మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపించినట్టు తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

21:05 - February 22, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హోదా ఇచ్చే వరకు ఒత్తిడి పెంచుతామని తేల్చి చెప్పారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచినా, మనోభావాలను దెబ్బతీసినా సహించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు. విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అనంతపురం జిల్లా ఎర్రమంచి సభలో చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో నిర్మాణంలో ఉన్న కియా మోటార్స్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియా దిగ్గజ కార్ల తయారీ సంస్థ కియా 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థలో ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుంది.

భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కియా మోటార్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. కియా మోటార్స్‌కు భూమిపూజ అనంతరం ఎర్రమంచి సభలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అరకొరసాయంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న కేంద్రంపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని స్పష్టం చేసిన చంద్రబాబు, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా డిమాండ్‌ సహేతుకమైనదని, ఈ విషయంలో పద్ధతి ప్రకారం ఆందోళన చేసేవారిని అభినందిస్తానన్న చంద్రబాబు.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. 

21:02 - February 22, 2018
20:56 - February 22, 2018

మొన్న నాగం జనార్దన్ రెడ్డిగారు ఢిల్లీకి సీక్రెటుగ వొయ్యి ఎవ్వలిని గల్చిండట తెల్చిందా.. మీరంత మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రువా..? ఓదిక్కు రైతులు తన్లాడుతుంటే.. కనీసం వాళ్లగురించి ఆలోచన జేస్తున్నరా..?తెలంగాణ జేఏసీ సర్కారు మీద రివైంజ్ తీర్చుకుంటున్నది.. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి అమరవీరులు యాదికొచ్చిండ్రు.. ఈ భూమ్మీద ఏ జీవైనా సరే.. బత్కి బట్టగట్టాల్నంటే ఆహారం సంపాయించుకోవాలె.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పేదబిడ్డ సావుదాలకొచ్చింది.. ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలంల గిరిజనుల భూములు మాత్రం అక్రమంగున్నయని గుంజుకుంటున్నరట..నాయిని నర్సన్నా నీకోసమే వచ్చిందే ఒక స్పెషల్ వార్త.. హైద్రావాద్ రోడ్ల మీద..పోరని బండ్లెకెళ్లే ఒక నాగుంబాము.. ముతి బైటికి వెట్టి సూస్తున్నది.. అది జూశ్న పోరని పరిస్థితి ఏంది..? మంచిగ అడ్విల చేన్ల పొంట చెల్కల పొంట ఆడుకోక.. ఊర్లెకు ఉర్కొచ్చింది నెమలి..గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:55 - February 22, 2018

తెలంగాణ పొలిటికల్ వేడి రగులుతోంది..పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది..సామాజిక న్యాయమంటూ సభల ద్వారా బీఎల్ఎఫ్ ముందుకొచ్చింది...కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు కోదండరాం ప్రయత్నాలు చేస్తున్నారు...ముందు దూకుడు ప్రదర్శించినా...ప్రస్తుతం బీజేపీ డైలామాలో పడిపోయింది..ఇక టీఆర్ఎస్ జిల్లాల్లో నాయకులను మోహరించింది..ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), ప్రకాష్ రెడ్డి (బిజెపి), కొనగళ్ల మహేష్ (కాంగ్రెస్), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

20:54 - February 22, 2018

కృష్ణా : జిల్లాలోని పెనుమలూరులో నడి రోడ్డుపై విద్యార్థులు కొట్టుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు రాళ్లతో..కర్రలతో దాడి చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. చిత్రీకరిస్తున్న మీడియాపైనా కూడా దాడికి దిగారు.

కేవలం హాస్టల్ లో అద్దె విషయంలో వివాదం చెలరేగినట్లు, దీనిపై ఓ వర్గానికి చెందిన విద్యార్థులు పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మరో వర్గం పీఎస్ వద్దకు చేరుకుని వారితో వాగ్వాదానికి దిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు..కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడులు చేయడం పట్ల జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

సీఐ విజయ్ కుమార్ జైలు శిక్ష...

కరీంనగర్ : అవినీతి కేసులో సీఐ విజయ్ కుమార్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. రూ. 10 వేలు జరిమాన విధిస్తూ జిల్లా ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. 

విచారణకు హాజరు కానన్న వర్మ...

హైదరాబాద్ : శుక్రవారం సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరు కానంటూ ట్విట్టర్ లో వర్మ ట్వీట్ చేశారు. మళ్లీ సీసీఎస్ పోలీసులు తనను విచారణకు పిలిచారన్నది అవాస్తమన్నారు. 

సీఎస్ లకు ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు...

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై పూర్తిస్థాయి నివేదికను నాలుగు వారాల్లో ఇవ్వాలని సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.  

దీక్షలు విరమించిన మహిళా నేతలు...

విశాఖపట్టణం : మహిళా సంఘాల ఐక్య వేదిక 48గంటల దీక్షలు విరమణయ్యాయి. ఇంజనీరింగ్ విద్యార్థి భాను యాదవ్ నిమ్మరసం ఇవ్వడంతో మహిళా నేతలు దీక్షలను విరమించారు. 48గంటల మహిళా సంఘాల దీక్షతో పోలీసులు దిగొచ్చారు. రాంగోపాల్ వర్మపై ఏంవీపీ పీఎస్ లో సెక్షన్ 354 ఏ, 500, 504, ఐటీ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. 

వ్యవసాయ శాఖపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలు...

తిరుమల : ఈనెల 25వ తేదీ నుండి మార్చి 1 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి పుష్కరిలో తెప్పలను జేఈవో, అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. 

18:54 - February 22, 2018
18:52 - February 22, 2018

అమెరికా : దేశంలోని స్కూళ్లలో పని చేసే టీచర్ల చేతిలో పెన్ను..పుస్తకాలతో పాటు తుపాకులు కూడా పట్టుకోనున్నారు. కాల్పుల ఘటనలు అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. టీచర్లకు తుపాకులు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకొన్నారు. స్కూళ్లలో 20 శాతం మంది టీచర్లకు తుపాకుల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యక్ష సాక్షులు..బాధితులతో ట్రంప్ మాట్లాడారు. కాల్పుల ఘటనలు తగ్గించేందుకు గన్ ఫ్రీ లేకుండా చూస్తామని పేర్కొన్నారు. తుపాకుల యజమానులకు నిబంధనలు కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. 

18:43 - February 22, 2018

సీజీజీ వర్సెస్ టీఎస్పీఎస్సీ

హైదరాబాద్ : సీజీజీ వర్సెస్ టీఎస్పీఎస్సీ గా మారిపోయింది. ఒకరిపై ఒకరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకున్నారు. సీజీజీ సాంకేతిక లోపాలతోనే ఇబ్బందులని టీఎస్పీఎస్సీ పేర్కొంది. టీఎస్పీఎస్సీ పదే పదే నిబంధనలు మార్చడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీజీజీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ప్రభుత్వం వద్దకు చేరింది. బుధవారం మీడియా సమావేశంలో సీజీజీ పొరపాటు వల్లే ఇబ్బందులని టీఎస్పీఎస్సీ పేర్కొన్న విషయం తెలిసిందే. త్వరలోనే వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసే యోచనలో సీఎస్ ఉన్నట్లు సమాచారం. 

పెనుమలూరులో విద్యార్థుల గ్యాంగ్ వార్...

విజయవాడ : పెనుమలూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నడి రోడ్డుపై కర్రలు..రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. చిత్రీకరిస్తున్న మీడియాపైనా కూడా దాడికి దిగారు. 

17:49 - February 22, 2018
17:31 - February 22, 2018

హైదరాబాద్ : పౌరసరఫరా శాఖలో చేసిన సంస్కరణ వల్ల రూ. 1800 కోట్లు ఆదా అయ్యాయని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 2.75 లక్షల లబ్ధిదారుల ఫింగర్ తమ వద్ద ఉందని, కొన్ని షాపులకు నెట్ వర్క్ సమస్య ఉందని తెలిపారు. 1-15 వరకు సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

17:27 - February 22, 2018

జగన్ కేసుపై మారిషస్ ప్రభుత్వం పిటిషన్...

ఢిల్లీ : వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పెట్టుబడులు పెట్టి తాము మోసపోయామని పిటిషన్ దాఖలు చేయడంతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి..కేంద్ర మంత్రులకు నోటీసులు జారీ చేసింది.

17:16 - February 22, 2018

ఢిల్లీ : వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పెట్టుబడులు పెట్టి తాము మోసపోయామని పిటిషన్ దాఖలు చేయడంతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి..కేంద్ర మంత్రులకు నోటీసులు జారీ చేసింది. నోటీసు రావడం భారత పరువు దిగజార్చే విధంగా ఉందని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఇందూ టెక్ జోన్ కుంభకోణం కేసులో శ్యాం ప్రసాద్ రెడ్డి..వైఎస్ జగన్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మారిషస్ కు చెందిన ఓ కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద 49 శాతం వాటా కలిగి ఉంది. కానీ సీబీఐ కేసు నమోదు చేయడంతో పనులు నిలిచిపోయాయి. పెట్టుబడులు పెట్టి తాము నష్టపోయామని, ఇందుకు రూ. 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కోరింది. దీనితో అక్కడి న్యాయస్థానం భారత ప్రధాని మోడీ..కేంద్ర మంత్రులు..ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. 

వైసీపీ ఎంపీ సంచలన ఆరోపణలు...

విజయవాడ : ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయి ప్రసాద్, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావులపై ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడంలో ఈ అధికారుల పాత్ర ఉందని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా వీరు అడ్డుకుంటున్నారని, తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని...అధికారులు అడిగితే ఆధారలు బయటపెట్టేందుకు సిద్ధమన్నారు. 

16:55 - February 22, 2018
16:55 - February 22, 2018

మోడీ ప్రకటన చేస్తారనే నమ్మకం ఉందన్న మంత్రి...

విజయవాడ : ఏపీకి సంబంధించి 18 అంశాలు అమలు కాలేదని మంత్రి ఆది నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈనెల 23న కేంద్రం చర్చలకు ఆహ్వనించిందని, మోడీపై తమకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నట్లు తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య మాటకు విలువనివ్వాలని, కేంద్రం వైఖరిపై సీఎం బాబు ఆలోచించడం జరుగుతోందన్నారు. 

బోనకల్ లో ప్రేమోన్మాది....

ఖమ్మం : బోనకల్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనని ప్రేమించడం లేదని పాత సినిమా హాలు వద్ద యమున అనే యువతిని రామలింగయ్య కత్తితో పొడిచాడు. యువతి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

 

బాబు ప్రసంగాన్ని అడ్డుకున్న న్యాయవాదులు...

అనంతపురం : పెనుకొండలో సీఎం ప్రసంగాన్ని న్యాయవాదులు అడ్డుకున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

 

16:29 - February 22, 2018

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డిని ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. ఏసీబీ నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల ఆస్తులు బయపడిన సంగతి తెలిసిందే. అతని బంధువులు..ఇతర నివాసాలపై దాడులు కొనసాగుతుండగానే పురుషోత్తమ్ రెడ్డి కనిపించకుండా పోయాడు. కొద్ది రోజుల అనంతరం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోరింది. దీనితో ఈనెల 23 నుండి 28 వరకు కస్డడీకి అనుమతినిచ్చింది. పురుషోత్తమ్ రెడ్డి బినామీ శ్రీనివాస రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

16:17 - February 22, 2018

పవన్ తో సీపీఐ నేత రామకృష్ణ...

హైదరాబాద్ : ఓ సమావేశంలో సినీ నటుడు శివాజీపై దాడులు చేయడం సరికాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్, సీపీఐ నేత రామకృష్ణలు పేర్కొన్నారు. నగరంలోని జనసేన కార్యాలయంలో పవన్ తో రామకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం వేర్వేరుగా మీడియాతో వారు మాట్లాడారు. 

16:14 - February 22, 2018

హైదరాబాద్ : ఓ సమావేశంలో సినీ నటుడు శివాజీపై దాడులు చేయడం సరికాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్, సీపీఐ నేత రామకృష్ణలు పేర్కొన్నారు. నగరంలోని జనసేన కార్యాలయంలో పవన్ తో రామకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం వేర్వేరుగా మీడియాతో వారు మాట్లాడారు.

బిజెపి దాడి చేయడం ఖండిస్తున్నట్లు, విద్యుత్ కార్మికుల సమ్మెపై సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారమయ్యే విధంగా చూడాలని సీపీఐ నేత రామకృష్ణ కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులను ఆదుకోవాలన్నారు. మార్చి 1వ తేదీన గుంటూరులో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని తాను పవన్ కోరడం జరిగిందన్నారు.

పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు వివరాలు తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారని, దాడులు చేయడం మంచిది కాదని పవన్ తెలిపారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తెలుసుకుని వారికి మద్దతు తెలపడం జరిగిందని, ఈ సమస్య పరిష్కారానికై చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 1న నిర్వహించే సమావేశానికి హాజరయ్యేది రెండు రోజుల్లో చెబుతానన్నారు. 

16:00 - February 22, 2018

అనంతపురం : జిల్లాలో బాబు పర్యటించారు. జిల్లాకు నీళ్లు వస్తాయని..ఇంత తొందరగా వస్తాయని ఊహించారా ? అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎర్రమంచిలో కియా మోటార్స్ ప్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల 13వేల కోట్ల పెట్టుబడులు...4వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వస్తాయని...7వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అనంత జిల్లా ఆటో మొబైల్ హబ్ గా తయారవుతుందని పేర్కొన్నారు.

అనంతంలో గతంలో తాగడానికి నీళ్లు లేవని..ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, జిల్లాకు నీళ్లు అందించాలని కృషి చేయడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాల నుండి జిల్లాపై శ్రద్ధ పెట్టి..కాల్వలపై ప్రయాణం చేసి ప్రాజెక్టు దగ్గర నిద్ర పోవడం జరిగిందన్నారు. సమయానికి పని చేయకపోతే వదిలిపెట్టనని హెచ్చరించినట్లు, వారం వారం నీరు ప్రగతి కింద సమీక్షలు చేయడం జరిగిందన్నారు. గొల్లపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చినట్లు..హంద్రీ నీవా కాల్వ వెడల్పు చేసి చిత్తూరు వరకు నీళ్లు తీసుకొస్తామన్నారు. రాయలసీమకు 144 టీఎంసీల నీళ్లు తీసుకరావడం జరిగిందని, వర్షాలు కూడా ఎక్కువే పడ్డాయన్నారు. 17.5 మీటర్ల నీటి మట్టం పెరిగిందని, నీళ్లు బాగుండే జిల్లాలో అనంత కూడా చేరిందన్నారు.

ఇక విభజన సమయంలో కాంగ్రెస్ మోసం చేసిందని..ఒక రాష్ట్రానికి ఆదాయం...మరొక రాష్ట్రానికి అప్పులు కేటాయించారని తెలిపారు. ఎన్నో కష్టాల నడుమ ముఖ్యమంత్రి అయ్యానని, బస్సులోనే ఉంటూ పాలన కొనసాగించడం జరిగిందని గుర్తు చేశారు. విజయవాడలో తాను జరిపే సమీక్ష సమావేశానికి హైదరాబాద్ నుండి ఉద్యోగులు ఎంతో శ్రమకు ఓర్చి ఇక్కడకు వచ్చే వారని తెలిపారు. అందులో భాగంగా సచివాలయం ఏర్పాటుకు రైతులు సహకరించారన్నారు. రూ. 24వేల కోట్ల రుణమాఫీ చేయడం టిడిపికే దక్కిందన్నారు. 

15:34 - February 22, 2018
15:25 - February 22, 2018

కర్నూలు : జిల్లా మంత్రాలయంలో.. రాఘవేంద్రస్వామి పుట్టినరోజు వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. టీటీడీ అధికారులు.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో భాగంగా.. రాఘవేంద్ర స్వామి మృతికను, పాదాలను మఠం నలు వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో.. ఏపీ, తమిళనాడు, కర్నాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

15:23 - February 22, 2018

నెల్లూరు : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చాలీచాలని జీతాలతో ఎన్నో ఏళ్లుగా బ్రతుకుతున్న మమ్మల్ని పర్మినెంట్ చేయమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. కమిటీలతో కాలయాపన చేయకుండా డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే.. రాష్ట్రాన్ని అంధకారం చేసేందుకు వెనకాడబోమని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరించారు. 

15:21 - February 22, 2018

హైదరాబాద్ : ఫేక్ ఓటర్ కార్డ్స్..ఫేక్ పాన్ కార్డ్స్..అన్నీ ఫేక్ లే..ఇవన్నీ ఉపయోగించి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు. లక్షల రూపాయలు మోసం చేసిన ఇతడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

ఫేక్ ఓటర్..ఫేక్ పాన్..ఇతర కొన్నింటినీ నకిలీ కార్డులను సృష్టిస్తాడని..అనంతరం వివిధ బ్యాంకులను సంప్రదించి అకౌంట్ లను తెరుస్తాడని తెలిపారు. నకిలీ 41 మందికి చెందిన డెబిట్ కార్డులను తన దగ్గరే ఉంచుకుంటాడని..ఆయా అకౌంట్ లలో శాలరీలను వేస్తాడని..మొదటి నెల వేతనం వేసి అతనే డ్రా చేస్తాడని..ఇలా కొన్ని నెలల పాటు డ్రా చేస్తాడన్నారు. అనంతరం ఆయా బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటాడన్నారు. ఇలా 33 మంది కోసం క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని

25 లక్షలకు పైగా మోసం చేశాడని తెలిపారు. స్టాండర్ ఛార్టడ్ బ్యాంకులో 41 క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 77.45 లక్షలు..రత్నాకర్ బ్యాంకులో రూ. 3 లక్షలకు పైగా..హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకులో రూ. 48 లక్షలకు పైగా..మొత్తంగా కోటి 58 లక్షలకు పైగా డ్రా చేశాడని తెలిపారు. ఇతనికి ఆయా బ్యాంకుల్లో పనిచేసే వారు కొంతమంది సహాయం చేశారని పేర్కొన్నారు. 

15:14 - February 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహిళా యూనివర్సిటీ ప్రారంభించేలా చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా బుధవారం కోఠి ఉమెన్స్ కాలేజీని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సందర్శించారు. అక్కడున్న వసతులను సందర్శించారు. యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడారు. విభజన అనంతరం మహిళా విశ్వ విద్యాలయం ఏపీకి వెళ్లిందని..తెలంగాణలో ప్రస్తుతం మహిళా విశ్వ విద్యాలయం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని యోచిస్తోందని అందులో భాగంగా కోఠి మహిళా విశ్వ విద్యాలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చేందుకు కావాల్సిన అర్హతలున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి మహిళా యూనివర్సిటీ ప్రారంభించనున్నట్లు కడియం తెలిపారు. 

15:04 - February 22, 2018
15:02 - February 22, 2018

వ్యాపారంలో పలువురు మహిళలు తమదైన ముద్రతో లాభాల బాటలో పయనిస్తున్నారు. లాభ..నష్టాలు..సాదక..బాధలు..అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్నారు. వీరిలో ఆర్థిక స్థోమత ఉండి..వ్యాపార రంగంలోకి వచ్చే వారు కొందరైతే...ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా వచ్చే వారు మరికొంతమంది...సుడిగుండంలో చిక్కుకున్న చిరునావ..ఏటి అలలకు తట్టుకుని సురక్షితంగా తీరానికి చేరినట్లు...కష్టాలను ..సుడిగండాలను ఎదురీది..విజయతీరాలకు చేరిన ఓ అతివ కథనం..మానవిలో..పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

14:55 - February 22, 2018

హైదరాబాద్ : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్‌కు రాజకీయాలతో పనేంటని అసద్‌ ప్రశ్నించారు. అస్సాంలో ముస్లింల జనాభా చాలా వేగంగా వృద్ధి చెందుతుండడం... ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పటిష్టమవుతుండటంపై బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఓ పథకం ప్రకారమే వలసలు పెరిగిపోతున్నాయని, ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోస్‌ పాక్‌ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన అసద్‌... రాజకీయ పార్టీలతో ఆర్మీకి ఏం పని.. ఇందులో బిపిన్ జోక్యం చేసుకోవడం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లోబడి ఆర్మీ పనిచేయాలంటూ అసద్ ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఆర్మీ స్పందించింది. రావత్ ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయలేదని తెలిపింది. 

ఇబ్రహీంపూర్ లో దారుణం...

వికారాబాద్‌ : జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్‌ తండాలో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పని కోసం పొలం వెళ్తున్న బాలికను ఇద్దరు యువకులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాల్ని వైద్య పరీక్షల కోసం తాండూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. 

14:40 - February 22, 2018

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. ఓ మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ లోని ఇబ్రహీంపూర్ లో చోటు చేసుకుంది. పొలం పని కోసం వెళుతున్న బాలికను ఇద్దరు అపహరించి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఇద్దరు కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితురాలిని తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

14:37 - February 22, 2018

హైదరాబాద్ : టిడిపి..బిజెపి పార్టీలపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. విభజన హామీలు..ప్రత్యేక హోదాపై ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానంపై ఆయన మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఒక డ్రామ ఆడిందని..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని..13 జిల్లాల కోరుకుంటున్నారంటూ ఉద్యమాలు చేస్తున్నామని...పోరాటాలు చేస్తున్నామంటూ ఆనాడు మంత్రులుగా ఉన్నవారు చక్కగా నటించారని విమర్శించారు. అలాంటి డ్రామాలు వేసిన కాంగ్రెస్ కు తరువాత ఎలాంటి గతి పట్టిందో అలాంటి గతి బిజెపి..టిడిపికి పడుతుందని పేర్కొన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో టిడిపి..బిజెపి పార్టీలకు డిపాజిట్ లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.

ఎన్టీరామారావు అధికారంలోని నుండి దించడమే కాకుండా పార్టీని..గుర్తుని..ఎన్నో లాక్కొన్నారని, ఆయన మరణించడానికి బాబు కారకులని ఆరోపించారు. ఎన్టీరామారావు బొమ్మలు పెట్టి...ఆశయ సాధన కోసం పాటు పడుతామని చెప్పడం దౌర్భాగ్యమన్నారు. ఆయనను నమ్ముకున్న ఓ వర్గం వారు గ్రహించాలని..బాబు పచ్చిమోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడని అంబటి విమర్శించారు. 

14:34 - February 22, 2018

విశాఖపట్టణం : జీఎస్టీ సినిమా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాం గోపాల్ వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' బూతు సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ నేపథ్యంలో ఉన్న సినిమా ఉండడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే షార్ట్ ఫిలింను నిషేధించాలని మహిళా నేతలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తమపై వర్మ కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కానీ ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం అక్కడి మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే వర్మపై కేసు నమోదు చేయాలని..అరెస్టు చేయాలని జీవీఎంసీ ఎదుట మహిళా సంఘాలు రెండు రోజుల పాటు నిరహార దీక్షకు పూనుకున్నారు. బుధవారం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాము డిమాండ్ చేస్తున్నట్లుగా కేసులు నమోదు చేయలేదని దీక్షలు కొనసాగించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. డ

14:23 - February 22, 2018

కరీంనగర్ : సూరారం వీఆర్ఏ సతీష్ ఎక్కడున్నాడు ? ఎందుకు అదృశ్యమయ్యాడు ? అధికారుల వేధింపులే కారణమా ? అనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది. ఇటీవలే అధికారుల వేధింపుల వల్లే ఓ సీఐ అదృశ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా సూరారం వీఆర్ఏ అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి నుండి ఇతను కనిపించకుండా పోయాడు. దీనితో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల వేధింపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గురువారం ఉదయం మహదేవపూర్ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న సతీష్ కుటుంబసభ్యులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన కుటుంబసభ్యులు అక్కడే ధర్నాకు దిగారు. మహదేవ్ పూర్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది వేధింపులే కారణమని పేర్కొంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే సతీష్ తన సన్నిహితులతో మాట్లాడినట్లు సమాచారం. అధికారులు చేస్తున్న అవినీతిని తాను గుర్తించినట్లు..ఎక్కడ చెబుతానోనని వేధింపులకు గురి చేస్తున్నారని సతీష్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సతీష్ ఆచూకి కనుక్కొవడానికి పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. 

వేధింపుల వల్లే తన భర్త అదృశ్యం - వీఆర్ఏ సతీమణి...

కరీంనగర్ : భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం సూరారం వీఆర్ఏ అదృశ్య మిస్టరీ వీడడం లేదు. మంగళవారం రాత్రి నుండి వీఆర్ఏ సతీష్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. మహదేవ్ పూర్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది వేధింపులే కారణమని వీఆర్ఏ సతీమణి పేర్కొంటోంది. వేధింపులకు తాళలేక అదృశ్యమయ్యాడని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మార్వో ఆఫీసుకు తాళ: వేసిన వీఆర్ఏ కుటుంబసభ్యులు అక్కడే ధర్నాకు దిగారు.

 

పౌరసరఫరాల శాఖాధికారులతో ప్రత్తిపాటి సమీక్ష...

గుంటూరు : పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. రేషన్ షాపులు నిర్ణీత సమయంలో తెరిచి ఉంచాలని, పౌరసరఫరాల శాఖ డీలర్లు..అధికారుల పనితీరు మెరుగుపడాలని, షాపులు తెరవని డీలర్లపై ముందుగా జరిమాన..తరువాత చర్యలు తప్పవని హెచ్చరించారు. రోస్టర్ ప్రకారం డీలర్ల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 

అమీర్ పేటలో 50 పడకల ఆసుపత్రి...

హైదరాబాద్ : అమీర్ పేటలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి తలసాని భూమి పూజ చేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయమన్నారు.

తెలంగాణ మహిళా యూనివర్సిటీగా...

హైదరాబాద్ : తెలంగాణ మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ మారనుంది. ఇందుకు కాలేజీని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సందర్శించారు. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చేందుకు కావాల్సిన అర్హతలున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి మహిళా యూనివర్సిటీ ప్రారంభించనున్నట్లు కడియం తెలిపారు.

 

కియా వల్ల 32 లక్షల మందికి ఉపాధి --బాబు..

అనంతపురం : ప్రపంచంలోనే వాహన తయారీ రంగంలో కొరియా రెండో అతి పెద్ద దేశమని, అన్ని ప్లాంట్ల కంటే అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తులు చేస్తుందని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కియా ప్లాంట్ కు ఎన్నో ప్రయోజనాలున్నాయని, చెన్నై - కృష్ణపట్నం కారిడార్ అందుబాటులో ఉందన్నారు. ఏడాదికి పది లక్షల కార్లు ఉత్పత్తి చేసుందని భావిస్తున్నట్లు తెలిపారు. 32 లక్షల మందికి ఉపాధి లభించనుందని, ఆటోమొబైల్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 

రైతులకు బాబు కృతజ్ఞతలు - బాబు...

అనంతపురం : పెనుకొండ మండలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎర్రమంచిలో కియా మోటార్స్ ప్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని బాబు ప్రారంభించారు. రైతుల చూపించిన చొరవతో కియా పరిశ్రమ జిల్లాకు వచ్చిందని, ఇందుకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బాబు పేర్కొన్నారు.

 

13:26 - February 22, 2018

అనంతపురం : జిల్లా పెనుకొండలో కియోమోటార్స్‌కు చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా... ముఖ్యమంత్రి... ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మౌళిక వసతుల సదుపాయాలకు లోటు లేదన్నారు సీఎం. కియో మోటార్స్‌కు అన్ని విధాల సహకరిస్తామని.. నీటి సమస్య లేకుండా హంద్రీనీవా నుంచి త్వరలోనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. చెన్నై-కృష్ణపట్నం కారిడార్‌ సమీపంలోనే ఉండటంతో... ఎగుమతులు కూడా సులభంగా చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఈఫ్లాంట్ ప్రపంచంలోనే అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేసే కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 

13:26 - February 22, 2018

విశాఖ : జిల్లా కోట మండలంలో గరుడ బస్సు అదుపు తప్పింది. రహదారిపై లారీని తప్పించబోయి.. డివైడర్‌ పైకి బస్ దూసుకుపోయింది. వెంటనే డ్రైవర్‌ బస్సును అదుపులోకి తీసుకురావడంతో... ప్రమాదం తప్పింది. ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వేరే బస్సులో ప్రయాణికులను విశాఖ తరలించారు.

13:25 - February 22, 2018

హైదరాబాద్ : ఇంటర్నెట్‌...ఇది మంచికే కాదు చెడుకీ ఉపయోగపడుతోంది. ప్రపంచంలో సైబర్‌ నేరాలు పెరగడానికి ఇదే కారణం. టెక్నాలజీ పెరిగిపోతుంటే తామూ ఆ వైపు అడుగులు వేస్తున్నామంటూ రెచ్చిపోతున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఆన్‌లైన్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు సోషల్ మీడియాలో మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగిస్తూ ఈజీగా వారికి కావాల్సింది దోచేసుకుంటున్నారు.

కొంచెం ఏమరపాటుగా ఉన్నామా
సోషల్‌ మీడియాలో కొంచెం ఏమరపాటుగా ఉన్నామా అంతే సంగతులు. మనకు తెలియకుండా మన ఇన్ఫర్మేషన్‌ను దోచేస్తారు. బ్లాక్‌మెయిల్‌ చేసేస్తారు. క్రెడిట్‌ కార్డుల విషయంలోనూ అంతే. మనకు తెలీకుండానే మన అకౌంట్‌లోంచి డబ్బు మాయం అవుతుంది. అంతేనా సినిమాలపై కూడా సైబర్‌ కన్ను పడింది. సినిమా రిలీజ్‌ అవ్వడమే ఆలస్యం...ఆ మూవీ మాస్టర్‌ ప్రింట్ బయటకు తీసి ఇంటర్నెట్‌లో కొన్ని లక్షలకు విక్రయించి లాభలు ఆర్జిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ సైబర్‌ నేరగాళ్లకు అంతులేకుండా పోతుంది. బడా సాఫ్డ్‌ వేర్‌ కంపెనీల డేటా హ్యాక్‌ చేసి లక్షల కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు.

సైబర్‌ పోలీసులు జాగ్రత్తలు
ఇలాంటి వారి బారిన పడకుండా సైబర్‌ పోలీసులు జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నారు. ఇంటర్నెట్‌ కేఫ్‌లు, ఉచిత వైఫై లాంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండటమే మేలంటున్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలు, క్రెడిట్, డెబిట్‌ కార్డులు పోయినా ఇతరులు వాటిని వినియోగిస్తే పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు. ఫోన్‌ చేసి వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక లావాదేవీలు అడిగినట్లయితే తొందరపడి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని చెబుతున్నారు. సోషల్‌ మీడియా ఖాతాలో వ్యక్తిగత వివరాలు ఎక్కువగా ఉంచకపోవడం మంచిదంటున్నారు. ఈ వివరాలతో నేరగాళ్లు మీ ఐడెంటిటీని గుర్తించి ఖాతాలోకి చొరబడే అవకాశం ఉంది. సో పీపుల్స్‌ టెక్నాలజీ ఎంత మేలు చేస్తుందో అంతే చేటు చేస్తుంది. జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం వస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త. 

కియా ఇన్ స్టలేషన్ విభాగాన్ని ప్రారంభించిన సీఎం

అనంతపురం : జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో కియా మోటర్స్ ప్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

ఖమ్మం మార్కెట్లో రైతుల ధర్నా

ఖమ్మం : జిల్లా మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. తమ మిర్చి కనీస మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నిన్న క్విటాల్ రూ.12వేల కొన్న వారు నేడు రూ.9వేలు కొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

13:03 - February 22, 2018

ఖమ్మం : జిల్లా మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. తమ మిర్చి కనీస మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నిన్న క్విటాల్ రూ.12వేల కొన్న వారు నేడు రూ.9వేలు కొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

వరంగల్ : ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈ కొండల్ రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణ రావడంతో ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, హైదరాబాద్ లో ఏసీబీ అధికారలు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

12:05 - February 22, 2018

వరంగల్ : ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈ కొండల్ రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణ రావడంతో ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, హైదరాబాద్ లో ఏసీబీ అధికారలు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:43 - February 22, 2018

హైదరాబాద్ : అధికార టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీనే అని భావిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు... ఆ ధీమాతోనే చేరికల పర్వానికి మరో సారి తెరతీసేందుకు కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ వ్యతిరేక శ‌క్తులన్నింటీని చేరదీసేపనిలో పడింది కాంగ్రెస్‌. ఇప్పటికే రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొలివిడ‌త‌గా భారీగా కాంగ్రెస్ లోకి చేరిక‌లు జ‌రిగాయి. కాగా.. రెండో ద‌ఫా చేరిక‌ల‌్లో వివిధ పార్టీల ముఖ్యనేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ ఆపరేషన్‌తో టీడీపీ
ఈ సారి కూడా కాంగ్రెస్‌ ఆపరేషన్‌తో టీడీపీ భారీగానే కుదేలవుతుందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.. ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కొత్తకోట ద‌యాక‌ర్ రెడ్డి, కొత్తకోట సీత ద‌యాక‌ర్ రెడ్డి, రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, ఉమ్మడి మెద‌క్ జిల్లా, గ‌జ్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి కూడా నేతల క్యూ కట్టనున్నట్లు తెలుస్తోంది. వంటేరు ప్రతాప్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు లు, ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్దమైన‌ట్లు సమాచారం. కాగా రావుల చేరిక‌పై మాత్రం మ‌రింత స్పష్టత రావాల్సి ఉంద‌ని పీసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక బిసీ ఉద్యమ‌నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయ‌నకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే డిల్లీ పెద్దలతో చ‌ర్చలు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.. ఇక గ‌తంలో టిఆర్ఎస్ ను వీడిన జిట్టా బాల‌కిష్టారెడ్డి కూడా హ‌స్తం గూటికే చేర‌నున్నట్లు సమాచారం

ఆపరేషన్‌లో బీజేపీకి కూడా
ఈ సారి కాంగ్రెస్‌ ఆపరేషన్‌లో బీజేపీకి కూడా భారీగానే గండిపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది... సీనియ‌ర్ నేతలు మాజీ మంత్రి. నాగం జ‌నార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్, బండి సంజయ్, ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్ లో చేర‌డం దాదాపు ఖాయ‌ం అయ్యిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.. నాగం ఇప్పటికే ఏఐసీసీ అధినేత రాహుల్ గాందీతో భేటి అయ్యారు. విశ్వస‌నీయ స‌మాచారం ప్రకారం సోమ‌వారం నాడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగం ను రాహుల్ తో క‌లిపినట్లు తెల‌ుస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి అన్ని విధాలా హామీ ల‌భించిన‌ట్లు స‌మాచారం. కాగా నాగం చేరిక‌పై మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆమె అధిష్టానం వ‌ద్ద త‌న అభ్యంత‌రాల‌ను వ్యక్తం చేశారు. స్థానికంగా ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి కూడా నాగం చేరిక‌పై అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు.త‌న చేరిక‌ను వ్యతిరేకిస్తున్న నేత‌ల ఇంటికి వెళ్ళి ప్రస‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు నాగం. ఇప్పటికే ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డిని క‌లిశారు. ఇక డీకే అరుణను సైతం క‌లిసేందుకు ప్రయ‌త్నించినా.. ఆమె అందుబాటులో లేక‌పోవ‌డంతో... ఫోన్ లో మాట్లాడారు. త్వర‌లోనే డీకే ను కూడా ఇంటికి వెళ్ళి క‌ల‌వ‌నున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రాహుల్ సూచ‌న‌ల మేర‌కే చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.... ఓ వైపు చేరికలపై పార్టీలోని ముఖ్యనేత‌ల అభ్యంత‌రాలను సానుకూలంగా మారుస్తూ... పార్టీ బ‌లోపేతానికి పునాదులు వేస్తున్నారు పీసీసీ కెప్టెన్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఉత్తమ్ అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మహిళ మెడలో నుంచి 6 తులాల గొలుసు చోరి జరిగింది. అమరావతి వెళ్లే రైలు ఎక్కుతుండగా ఘటన జరిగింది. 

ఖమ్మం మార్కెట్ లో ఉద్రిక్తత

ఖమ్మం : జిల్లా మార్కెట్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ధర్నాకు దిగారు. క్వింటా మిర్చిని రూ.1100కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

11:28 - February 22, 2018

ఖమ్మం : జిల్లా మార్కెట్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ధర్నాకు దిగారు. క్వింటా మిర్చిని రూ.1100కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:26 - February 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం తాండవం చేస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో కాసుల కక్కుర్తి ప్రజలను నిండా ముంచుతున్నాయి. డాక్టర్‌ ఫీజు మొదలు కొని స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు, వివిధ రకాల టెస్టులు, మందులు, ఇంజిక్షన్లు ఇలా మొత్తం బిల్లు కలిసి సామాన్యున్ని నిలువు దోపిడీ చేసేస్తుంది. జాతీయ ఔషధ ధరల నియంత్రాధికార సంస్థ ఢిల్లీలో నాలుగు ఆస్పత్రుల్లో తనిఖీ చేయగా విస్తు గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

అధిక ధరకు విక్రయం
చాలా వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మందులను అధిక ధరకు విక్రయిస్తుండడాన్ని ఎన్‌పీపీఏ అధికారులు గుర్తించారు. ఎమ్‌ఆర్‌పీ కన్నా చాలా తక్కువ ధరకు ఔషధ తయారీ సంస్థలు ఆస్పత్రులకు మందులు అందజేస్తున్నాయి. అయితే ఆస్పత్రులు మాత్రం కనీసం డిస్కౌంట్‌ కూడా ఇవ్వకుండా మందులను విక్రయిస్తున్నారు. అంతేకాకుండా... వాటిపై అధిక ధర ముద్రించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరే వారు అక్కడి మందుల దుకాణంలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి. దీంతో బయట తక్కువ ధరకు మందులు లభిస్తున్నా, పరిస్థితులు అనుకూలించక ఆస్పత్రిలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఆస్పత్రులు షరతులు
అయితే ఔషధ తయారీ సంస్థలకు ఆస్పత్రులు షరతులు కూడా విధిస్తున్నాయి. మందులపై ధరలను ముద్రించే సమయంలోనే అధిక ధరను ముద్రిస్తేనే అధిక మొత్తంలో కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. కొన్ని ఆస్పత్రులు మూకుమ్మడిగా చర్చించుకొని ఇలా షరతులు విధించడంతో ఔషధ తయారీ సంస్థలకు మరో దారి లేక ఆ షరతును అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు... అడ్రెనార్ 2MG ఇంజక్షన్ ధర 189 రూపాయలు కాగా... బల్క్‌గా కొన్నందుకు కేవలం 15 రూపాయలకే లభిస్తుంది. కాని అది రోగి బిల్లులో మాత్రం 5వేల 310 రూపాయలుగా చూపించి వసూలు చేస్తారు. రెండు వాల్వలున్న త్రీవే స్టాప్‌కాక్ ధర 5రూపాయల 77పైసలకు కొని.. పేపెంట్లకు 106 రూపాయలకు విక్రయిస్తున్నారు. లాభం 1737శాతం. ఇలాంటి అక్రమాలు చాలానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. తమ మందులను విక్రయించుకునేందుకు, లభాలు పొందేందుకు ఔషధ తయారీ సంస్థలు మందులపై అధిక ధరలు ముద్రిస్తున్నాయి. దీంతో రోగుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది.

డెంగీ, ఇతర వ్యాధులు
ఇటీవల కొందరు డెంగీ, ఇతర వ్యాధుల కారణంగా మరణించడంతో వారి కుటుంబాలకు చెందిన పలువురు ఎన్‌పీపీఏకు ఫిర్యాదు చేశారు. బయట దుకాణాలతో పోలిస్తే ఆస్పత్రులలో మూడు నుండి నాలుగు రెట్లు అధిక ధరకు మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌పీపీఏ అధికారులు తనిఖీలు చేసి ఈ విషయాలను వెళ్లడించారు. ఆస్పత్రుల్లో మందులను విక్రయించడం ద్వారా ఏకంగా 350 నుండి 1737 శాతం అధికంగా లాభం పొందుతున్నాయని గుర్తించారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. 

10:23 - February 22, 2018

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సుమారు 40లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు వేలాది గ్రామాలకు తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు పరిశీలించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ అధికారులూ సందర్శించారు. భారీ ఎత్తున నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులను రప్పిస్తు.. ప్రాజెక్ట్‌ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్‌రిపోర్ట్‌ను పరోక్షంగా పంపుతోంది. జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను చాటిచెప్పే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. భారీ ఎత్తున చేపడుతున్న ప్రాజెక్ట్‌ కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

15 ఆర్థిక సంఘం అధికారులు సైతం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌, దాని అనుబంధంగా నిర్వహిస్తున్న రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లను ఈ మధ్య గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించారు. అంతేకాదు.. కేంద్ర జలవనరుల అధికారులు, 15వ ఆర్థిక సంఘం అధికారులు సైతం ఈ ప్రాజెక్ట్‌ను సందర్శించి... జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణ శాసనమండలి సభ్యులు పరిశీలించేందుకు రంగం సిద్ధమైంది. శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో ఈనెల 23,24 తేదీల్లో ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించాలని నిర్ణయించారు. శాసన మండలి సభ్యులందరికీ చైర్మన్‌ ఆహ్వానాన్ని పంపారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ప్రాణహిత - చేవెళ్ల పేరుతో
ప్రాణహిత - చేవెళ్ల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..ఈ ప్రాజెక్ట్‌ను రీడిజైనింగ్‌ చేసింది. ప్రాజెక్ట్ పేరును కాళేశ్వరంగా మార్చింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రేపుతోంది.

10:21 - February 22, 2018

గుంటూరు : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 67 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకుంది. అయితే ఎన్నికల తర్వాత ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు వైసీపీ విలవిల్లాడిపోయింది. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్‌ అయ్యారు. దీంతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 44కు తగ్గింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురికి మాత్రమే మంత్రిపదవులు దక్కాయి. మిగిలిన వారికి ఎలాంటి పదవులు లేవు. దీంతో వారంతా టీడీపీపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీలో ప్రధాన్యత లేకుండా పోయింది.
వైసీపీనీ వీడి టీడీపీ కండువాకప్పుకున్న ఎమ్మెల్యేలకు పార్టీలో ప్రధాన్యత లేకుండా పోయింది. టీడీపీలో వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు వారివారి నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానంపై జంపింగ్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తమ పనులు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో ఇమడలేకపోతున్నానని బహిరంగంగానే చెప్పారు. టీడీపీ నేతలు తనను చాలా రకాలుగా ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు.

ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీ వైపు
టీడీపీలో ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి కూడా వీరికి ఆహ్వానం పలుకుతున్నారని సమాచారం. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారిని వెనక్కి వస్తే రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని వైసీపీ చెబుతోంది. పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారు... త్వరలోనే మళ్లీ వైసీపీలో చేరుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున... ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో 5 నుంచి 10 మందిని వెనక్కి రప్పించే వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. మొత్తానికి టీడీపీలోకి జంప్‌ అయిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంతగూటివైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బ్యాక్‌ రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది త్వరలోనే తేలనుంది.

 

ముదస్తు అరెస్ట్ లు

అనంతపురం : హిందుపురంలో సీఎం పర్యటన నేపథ్యంలో  సీఎం పర్యటనను అడ్డుకుంటారని వామపక్షనేతలు,  విద్యార్థి సంఘం నాయకులు, న్యాయవాదులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. 

దంపతుల ఆత్మహత్య

మెదక్ : జిల్లా తుఫ్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసున్నారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. 

తిరుమలలో గుర్తులియని మృతదేహం

చిత్తూరు : తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో గర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతిపై టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రాజమండ్రిలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని మొరంపూడి జంక్షన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వీడియోకాన్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు భవనమంతా వ్యాపించడంతో మంటలను అదుపులోకి తెచ్చెందుకు ఫైర్ సిబ్బంది కష్టపడ్డారు. సుమారు రూ.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

08:14 - February 22, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని మొరంపూడి జంక్షన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వీడియోకాన్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు భవనమంతా వ్యాపించడంతో మంటలను అదుపులోకి తెచ్చెందుకు ఫైర్ సిబ్బంది కష్టపడ్డారు. సుమారు రూ.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:08 - February 22, 2018

సూర్యపేట : జిల్లా గంజాయి కలకలం రేగింది. గాయత్రి కాలేజీ హాస్టల్ లో అర్ధరాత్రి వంద కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని విద్యార్థిసంఘాలు పోలీసులకు పట్చించాయి. విద్యాబోధన ముసుగులో యాజమాన్యం గంజాయి వ్యాపారం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నింధితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు అనంతలో సీఎం పర్యటన

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన  ఎర్రమంచి వద్ద కార్ల తయారీ కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. 

07:31 - February 22, 2018

కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రభావం తమిళనాడులోనే కకుండా ఇతర రాష్ట్రాలపై పడుతుందని, ఆయన ఎక్కడ మాట్లాడిన లౌకికంగా మాట్లాడతారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. తమిళనాడులో రాజకీయ అన్చితి కొనసాగుతుందని, అక్కడ బీజేపీ పగా వేయాలని చూసిందని, అక్కడ ఉన్న పరిస్థిలు చూస్తే ద్రవిడ సంస్కృతి ఉంటుందని, వారికి ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుందని, తమిళనాడులో సినిమా హీరోలు పెట్టిన పార్టీలు అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత పున్న కౌలష్ అన్నారు. ఎన్నికల ముందు చాలా మంది కొత్త పార్టీలు పెడుతుంటారని, అందులో భాగంగానే కమల్ పార్టీ పెట్టారని, ఇంతకు ముందు శరత్ కుమార్ లాంటి వారు చాలా మంది పార్టీలు పెట్టారని, కమల్ పార్టీ సిద్దాంతం ప్రకారం పని చేస్తే రాజకీయాల్లో ఎదగడం కష్టమని బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:30 - February 22, 2018

సెంచూరియన్ : సౌతాఫ్రికాతో జరిగిన టీ20 రెండో మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఓటమిచెందింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాజట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని... 18.4 ఓవర్లలోనే ఛేదించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్దేశిత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. మనీష్‌పాండే 79 రన్స్‌చేయగా... ధోనీ 52తో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా... ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగింది. హెన్రిచ్‌ క్లాసెస్‌ 69 రన్స్‌ చేయగా... డుమిని 40 బాల్స్‌లో 64రన్స్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

07:29 - February 22, 2018

ముంబై : 7 బ్యాంకులకు 3 వేల 7 వందల కోట్లకు మోసం చేసిన కేసులో రోటోమాక్ ఓనర్ విక్రమ్ కొఠారీ, ఆయన కుమారుడు రాహుల్‌ కొఠారిని సీబీఐ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చింది. వీరిద్దరిని సిబిఐ ప్రశ్నిస్తోంది. మరోవైపు విక్రమ్‌ కొఠారీ కుటుంబం దేశం విడిచి పారిపోకుండా ఈడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కంపెనీ పనులకు కాకుండా తమ స్వంత పనులకు వాడుకున్నారని విక్రమ్‌ కొఠారీపై ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజులుగా కాన్పూర్‌లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ దాడులు చేసింది. ఈ కేసులో విక్రమ్‌ కొఠారీ, ఆయన భార్య సాధన, కుమారుడు రాహుల్‌తో పాటు రోటోమాక్ గ్లోబల్ ప్రైవేటు సంస్థ డైరక్టర్లను కూడా అధికారులు విచారించారు. ఆదాయపు పన్నుశాఖ రోటోమాక్‌ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది.

07:29 - February 22, 2018

ఢిల్లీ : బొగ్గు గనుల ప్రయివేటీకరణకు అనుమతిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం ఖండించింది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలను అనుమతించేందుకు కేంద్రం సమ్మతించింది. మోది సర్కార్‌ చేపడుతున్న ఆర్థిక సంస్కరణల్లో భాగమే ఈ నిర్ణయమని విమర్శించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయివేట్‌ సంస్థల గుత్తాధిపత్యం పెరిగిపోయి ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియాకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కార్మికుల భద్రతకు ముప్పు కలిగే ఈ చర్యను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మరోవైపు బిజెపి ప్రభుత్వ హయాంలో ఆశ్రిత పెట్టుబడిదారి విధానం పెరిగిపోతుండడంపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. కుట్రపూరిత ఆలోచనతో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ మోది ఉదంతమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. నీరవ్‌ విదేశాలకు పారిపోవడంపై ప్రభుత్వం నోరు విప్పడం లేదని విమర్శించింది.

07:28 - February 22, 2018

హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి.. హెల్త్ కార్డులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డి నిర్ణయించారు. ఆరోగ్య పరీక్షలను జూలై నుంచి ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకుల విద్యాలయాలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివే 8 లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే కేజీబీవీలు, గురుకుల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని 3 లక్షల మందికి విద్యాశాఖ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తోందని మంత్రులు తెలిపారు. హెల్త్ కిట్స్ లో అందిస్తున్న వస్తువులను ప్రదర్శించారు.

యుక్తవయస్సులో వచ్చే ఆరోగ్య సమస్యలు, సంరక్షణపై
ఏడు నుంచి పదవ తరగతి చదివే బాలికలకు యుక్తవయస్సులో వచ్చే ఆరోగ్య సమస్యలు, సంరక్షణపై అవగాహనా తరగతులు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సంయుక్తంగా నిర్ణయించారు. వైద్యారోగ్య శాఖ తరపునుంచి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. బాలికల్లో రక్తహీనత సమస్య నివారణకు ఇప్పటికే గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో పోషక ఆహారాలతో కూడిన మెనూ అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. మిగిలిన పాఠశాలల్లో కూడా రక్తహీనతను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆరోగ్య శాఖ సూచించాలని కోరారు.

ఆరోగ్య కార్డులు
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య కార్డులు ఇవ్వడానికి ఒక్కో జిల్లాలో, ఒక్కో స్కూల్ కు ముందుగానే షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. ఖచ్చితంగా షెడ్యూల్లో పేర్కొన్న తేదీల్లోనే పరీక్షలు నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. . వీటితో పాటు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించే బాధ్యత కూడా రెండు శాఖలు సంయుక్తంగా చేపడుతాయని తెలిపారు. దేశంలో విద్యార్థినిల ఆరోగ్యం పట్ల ఈ విధంగా శ్రద్ధ తీసుకుని అమలు చేయనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రులు తెలిపారు. బాలికల భవిష్యత్ దృష్ట్యా పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా అమలు చేసే కార్యాచరణ రూపొందించాలన్నారు. 

07:28 - February 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వ్యూహాత్మక రహదారి పథకం కోసం... వినూత్నంగా బాండ్ల విక్రయంతో నిధుల సేకరణకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.. గతంలో పుణే నగరపాలక సంస్థ తొలిసారి మున్సిప‌ల్ బాండ్లు విక్రయించి నిధులు సమకూర్చుకుంది.. దీన్నే బల్దియా ఆదర్శంగా తీసుకుంది. జీహెచ్‌ఎంసీ మొదటిసారే వెయ్యి కోట్ల రూపాయల సేకరణకు బాంబే స్టాక్ ఎక్చేంజ్‌ ద్వారా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు వెళ్లింది. డబుల్‌ ఏ రేటింగ్‌ వల్లే జీహెచ్ఎంసీకి నిధుల సమీకరణ సులభమైంది.

14 ముంబైలో నిర్వహించిన ఎలక్ర్టానిక్ బిడ్డింగ్
ఈ నెల 14న ముంబైలో నిర్వహించిన ఎలక్ర్టానిక్ బిడ్డింగ్ ద్వారా జీహెచ్ఎంసీ జారీ చేసిన బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. దీన్ని బ‌ల్దియా వ‌ర్గాలు ధృవీకరించాయి కూడా. రెండు రోజుల‌ వ్యవధిలోనే 200 కోట్ల నిధులు 8.9 శాతం రేటుకే సమకూరాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఖాతాలో నగదు కూడా జమ అయ్యింది. ఇలా నిధుల సేకరణలో దేశంలోని ఇతర పురపాలక, నగరపాలక సంస్థలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలిచిందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో జీహెచ్ఎంసీ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమాన్ని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు.

స్కైవేలు, అండర్ పాస్ ల నిర్మాణం
బాండ్ల ద్వారా సేకరించిన నిధులతో స‌మ‌గ్ర ర‌హ‌దారుల డెవ‌ల‌ప్ మెంట్, స్కైవేలు, అండర్ పాస్ ల నిర్మాణం వేగవంతం కానున్నాయి.. ప్రస్తుతం సేకరించిన 2 వందల కోట్ల రూపాయలతో ఈ పనులను ముమ్మరం చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మరో 800 కోట్ల రూపాయలు సేకరించాలని బల్దియా నిర్ణయించింది. గత యాభై ఏళ్లలో దేశంలో పురపాలక సంస్థలు, స్థానిక సంస్థలు బాండ్ల రూపంలో 2వేల కోట్ల రూపాయలు సేకరించగా... వీటిలో పదిశాతాన్ని కేవలం జీహెచ్ఎంసీ సేకరించింది. ఇతర పురపాలక సంస్థలకు ఇది ఆదర్శవంతంగా నిలుస్తుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు.జీహెచ్‌ఎంసీ నిధుల సమీకరణతో ఇతర రాష్ర్టాలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది... ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిస్తూ... మరింత మంచి స్టేటస్ సాధించి.. అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తోంది.

07:27 - February 22, 2018

చెన్నై : తమిళ రాజకీయ యవనికపై సరికొత్తపార్టీ ఆవిష్కృతమైంది. లోకనాయకుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలో నూతన పార్టీ పురుడుపోసుకుంది. విలక్షణ నటుడు నటుడు కమల్‌హాసన్‌ రాజకీయ రంగప్రవేశం చేశారు. బుధవారం మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. మక్కళ్‌ నీది మయ్యమ్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. పార్టీ జెండాలో ఆరు చేతులు ఒకదాన్కొకటి మణికట్టు దగ్గర పట్టుకున్నట్టుగా, వర్తులాకృతిలో ఉన్న చిత్రం, మధ్యలో నక్షత్రం ఉండేలా పతాక రూపకల్పన చేశారు. ఆ చేతులు ఎరుపు, తెలుపు రంగుల్లో ఒకదాని తర్వాత మరొకటి ఉండేలా చిత్రించారు. ఆ ఆరు చేతులు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకలని తన ప్రసంగంలో కమల్‌ స్పష్టం చేశారు.

తాను ప్రజల చేతుల్లోని ఆయుధాన్నని
తాను ప్రజల చేతుల్లోని ఆయుధాన్నని కమల్‌ అభిర్ణించుకున్నారు. పార్టీ ఏర్పాటు ప్రజాపాలనకు తొలి అడుగని, ప్రజాసమూహంలోని ప్రతీ ఒక్కరూ నాయకులేనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వివాదాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. నేను మీకు సలహాలు ఇచ్చే నాయకుడిని కాను. మీ సలహాలు వినే కార్యకర్తను అని వేదికపై కమల్‌ చెప్పడంతో ప్రజలంతా చప్పట్లు, ఈలలు, కేరింతలతో కొత్త పార్టీకి స్వాగతం పలికారు. రాజకీయాల్లో చేరేందుకు వృత్తి ఏమిటనేది ముఖ్యం కాదని, నీతి, నిజాయితీ, సత్యం, ఉద్వేగం వంటి సుగుణాలు కలిగి ఉన్నవారంతా రాజకీయ రంగ ప్రవేశానికి అర్హులేనని కమల్‌ చెప్పారు. తమిళనాడు ప్రజలు ఇంకా ఎన్నాళ్లు అవినీతి పాలనలను భరించాలని ప్రశ్నించారు. ఓటుకు ఆరువేలు ఇచ్చి నష్టపోతున్నామని నేతలంటున్నారు. నేను డబ్బులిచ్చి ఓటు అడగనని తేల్చి చెప్పారు.

ప్రజా సేవకుడిగా
ప్రజా సేవకుడిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుంటే మరొకరికి సారథ్యం అప్పగిస్తానే గాని పదవులను పట్టుకుని ఊగిసలాడనని కమల్‌ స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు తనతోపాటు త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలకు క్వార్టర్‌ బాటిల్, స్కూటర్‌లు ఉచితంగా ఇవ్వబోనని చెప్పారు. స్కూటర్లు కొనుక్కునే స్తోమతకు ప్రజలను తీసుకుని వస్తానని స్పష్టం చేశారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇంటిని సందర్శించి కమల్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కలాం దేశభక్తి, ఆశయాలకు తాను ముగ్దుడినయ్యాననీ, ఆయనే తనకు మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత అని కమల్‌ కొనియాడారు. శతాధిక వృద్ధుడైన కలాం అన్న మహమ్మద్‌ ముత్తుమీరన్‌ లెబ్బై మరైక్కయార్‌ను కమల్‌ కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మధురైలోని ఒత్తకడై మైదానంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. 

రెండో ట్వీ20లో సౌతాఫ్రికా విజయం

సెంచూరియన్ : రెండో ట్వీ20 భారత్ పై దక్షణాఫ్రికా 4 వికెట్ల విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 188/4 చేసింది. దక్షణాఫ్రికా 194/4 చేసింది.  

06:56 - February 22, 2018

ఏపీలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, గుంటూరు జిల్ల పెదగొట్టిపాడులో ఒ చిన్న సంఘటన ఆధారంగా చేసుకుని అగ్రకులాల వారు దళితులపై దాడులకు దిగారని, దళితులపై దాడి వ్యతిరేకంగా గుంటూరులో సభ నిర్వహిస్తున్నామని కేవీపీఎస్ కృష్ణ మోహన్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss