Activities calendar

23 February 2018

కమల్ పార్టీ విధి విధానాలు...

చెన్నై : 'మక్కల్ నీది మయ్యమ్‌' అధినేత కమల్‌హసన్‌ పార్టీ విధి విధానాలను ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాలు కుల రాజకీయాలకంటే భయంకరమైనవని పేర్కొన్నారు. మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందన్నది కూడా చాలామందికి తెలియదని... రైతులు ఏమైతే నాకేంటీ...నాకు ముద్ద దొరికితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కెనడా పీఎం బాంగ్రా స్టెప్పులు...

ఢిల్లీ : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ టూడో డాన్స్‌ చేసి అతిథులను ఆకట్టుకున్నారు. ఢిల్లీలోని కెనడా హౌస్‌లో గురువారం రాత్రి జరిగిన విందుకు భార్యతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రూడో స్టేజిపైకి వెళ్లడానికి ముందు బాంగ్రా స్టెప్పులు వేశారు. 

కెనడా..ఇండియా..6 కీలక ఒప్పందాలు...

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోది ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో 6 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎలక్ట్రానిక్స్‌, పెట్రోలియం, స్పోర్ట్స్‌, కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ, ఉన్నత విద్య- సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

 

ఎల్జీని కలిసిన కేజ్రీ...

ఢిల్లీ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ అనిల్‌ బైజల్‌ను కలుసుకున్నారు. గత 3 రోజులుగా అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో పాలన స్తంభించిందని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

 

21:27 - February 23, 2018

విజయవాడ : మార్చి నెల నుంచి ఏపీలో ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను క్లియర్‌ చేసే విధానాన్ని అమలు చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2019 నాటికి కోటిమందిని డిజిటల్‌ లిటరేచర్లుగా, ఏపీని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలోని గ్రీవెన్స్‌హాల్‌లో ఈ-ప్రగతి గ్రాడ్యుయేషన్‌ వేడుకను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి తాను చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

అతి కష్టమ్మీద హైదరాబాద్‌కు ఐఎస్‌బీ స్కూల్‌ను తెప్పించానని, అక్కడ తన రెకమెండేషన్‌ను కూడా పక్కన పెట్టి, ప్రతిభకే పట్టం కట్టేలా వ్యవస్థను రూపొందించామన్నారు. ఏపీలో, వచ్చే మార్చి నుంచి, ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను క్లియర్‌ చేసే విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. ఈ-ప్రగతి గ్రాడ్యుయేషన్‌ వేడుకలో పాల్గొన్న ఐటీ మంత్రి నారాలోకేశ్‌.. పేపర్‌ సర్టిఫికెట్లకు కాలం చెల్లిందని, ఇకమీదంతా డిజిటల్‌ సర్టిఫికెట్ల కాలమేనంటూ వివరించారు.

ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటామని లోకేశ్‌ అన్నారు. గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ నివారణకు సంబంధించి డ్యాష్‌ బోర్డు సాయంతోనే తాము సమీక్షిస్తున్నామని వివరించారు. ఈ-ప్రగతి వేడుకల్లో ఐటీరంగ నిపుణులు పలువురు పాల్గొని.. విస్తరిస్తున్న సాంకేతికత గురించి వివరించారు. 

21:24 - February 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ముంపు నివారణ చర్యలు చేపట్టకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ హయత్‌ఉద్దీన్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు రావడంలోని ఆంతర్యం గురించిన పిటిషనర్‌ను ప్రశ్నిచింది.

తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రాజెక్టుపై ఇప్పుడు పిటషిన్‌ వేసిన హయత్‌ఉద్దీన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరం హంటింగ్‌ చేస్తున్నారా అంటూ మందలించింది. ఈ కేసు విచారణార్హంకాదంటూ తిరస్కరించింది. పిటిషన్‌ ఆలోచనా విధంగా సరిగాలేదని మండిపడింది. కేసు వేయడంలో జాప్యం చేశారని పిటిషనర్‌ దృష్టికి తెచ్చింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత పనులు ఆపాలంటూ పిటిషన్‌ వేయడం సరికాదరన్న తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను స్వయంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు.. పిటిషన్‌ను కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు.

ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకునే దురుద్దేశంతోనే హయత్‌ఉద్దీన్‌ పిటిషన్‌ వేశారని, పిటిషనర్‌ ఆంతర్యాన్ని సుప్రీంకోర్టు గ్రహించి కేసు కొట్టివేసిందని న్యాయవాది చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోత పథకం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసు తొలగిపోయిన నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది చివరినాటికి సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుంది. ఇందుకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. 

మోడీ నోరు ఎందుకు విప్పడం లేదన్న నాగేశ్వర్ రావు...

హైదరాబాద్ : వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడాన్ని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ తప్పు పట్టారు. బ్యాంకు రుణాలు ఎగొట్టే కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

 

ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్న విపక్షాలు...

విశాఖపట్టణం : లూలూ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంతో విలువైన భూమిని కేవలం 500 కోట్లకు 99 సంవత్సరాలకు లీజులకు ఎలా ఇస్తారని విశాఖ అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

21:10 - February 23, 2018

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 12..మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. 16 రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. 

21:05 - February 23, 2018

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరగనుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారడానికి అవకాశం ఇవ్వాలని నిందితునిగా ఉన్న జెరుసలేం మత్తయ్య.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. కొన్ని వాస్తవాలు బయటకు చెప్పే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కేసుతో... టీడీపీ, టీఆర్ఎస్‌ పార్టీలు తనను వేధింపులకు గురిచేస్తున్నాయని మత్తయ్య లేఖలో ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని జెరూసలెం మత్తయ్య పేర్కొన్నాడు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని...కేసుకు సంబంధించిన వాదనలను వినాలని..తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మత్తయ్య లేఖలో పేర్కొన్నాడు. 

20:57 - February 23, 2018

రక్షణ కల్పించాలన్న జెరూసలెం మత్తయ్య...

హైదరాబాద్ : తనకు ప్రాణహాని ఉందని జెరూసలెం మత్తయ్య పేర్కొన్నాడు. ఓటుకు నోటు కేసులో ఇతను నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాడు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని...కేసుకు సంబంధించిన వాదనలను వినాలని మత్తయ్య లేఖలో కోరాడు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, వాయిదాలు చెప్పడకుండా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. 

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు...

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తాను అప్రూవర్ గా మారుతానని మత్తయ్య పేర్కొన్నాడు. ఈ మేరకు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాడు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని...కేసుకు సంబంధించిన వాదనలను వినాలని మత్తయ్య లేఖలో కోరాడు. 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్...

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 12..మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. 

దర్పల్లి సీఐ బదిలీ...

నిజామాబాద్ : జిల్లాలోని దర్పల్లి సీఐ కృష్ణపై బదిలీ వేటు పడింది. ఏఆర్ విభాగానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం తాగి వీరంగం సృష్టించడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. 

28 నుండి ఇంటర్ పరీక్షలు...

విజయవాడ : ఏపీలో ఈనెల 28వ తేదీ నుండి వచ్చే నెల 19వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు, అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉదయ లక్ష్మీ వెల్లడించారు. ఆలస్యంగా వస్తే పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని..విద్యార్థులు తమ సెంటర్లను తెలుసుకొనేందుకు IPE Center locator app డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే 1800 2749 868 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయొచ్చన్నారు. 

సినిమా థియేటర్ల బంద్...

బెంగళూరు : క్యూబ్...యూఎఫ్ ఓ, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తో సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ చర్చలు విఫలమయ్యాయి. మార్చి 2 నుండి నిర్మాతలు డిజిటల్స్ వారికి కంటెంట్ ఇవ్వకూడదని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మార్చి 2 నుండి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి.

20:12 - February 23, 2018

రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగ ఇడగొట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆగం జేశిండ్రు అంటున్నడు ఆణిముత్యం చంద్రాలు..తెల్గుదేశం పార్టీని బీజేపీని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుమని పిల్పునిస్తమంటున్నడు.. పిడమర్తి రవిగారు..రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారి ఏక్ నంబర్ దొంగ ఉన్నట్టుండుగదా..? కాంట్రాక్ట్ అనే పదాన్ని తెల్గు నేలకు పరిచయం జేశిన పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు...ముత్యంరెడ్డి మరో కబ్జా...గవర్నర్ నర్సింహన్ సారు ఏం పనిజేయడు గుడులు గోపురాలు తిర్గెతందుకే సరిపోతడని కాంగ్రెస్ పార్టోళ్లు విమర్శిస్తాఉంటరు గడ్కోపారి.. తి యాడాది జైళ్లళ్లున్న ఖైదీలకు ఆటల పోటీలు వెట్టుడు ఆనందంగున్నదంటున్నడు మన ఇంటి మంత్రి నాయిని నర్సన్న.. సేమ్ చంద్రాలు గూడ.. మన తెలంగాణ చంద్రయ్యలెక్కనే మోపైండుగదా..? చంద్రబాబుగారు నీ సొంత భూమిల ఎవ్వడన్న జేసీబీ వెట్టితోడుతుంటే ఊకుంటవా నువ్వు..?...చీకటి వడ్డంక ఆ శ్రీశైలం తొవ్వల వోకుండ్రి సుమా..? మన్షి గుడ్డువెట్టుడేందిరా బాబు అర్థమైతలేదు.. గీ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:04 - February 23, 2018

ఏపీలో విభజన హామీలు..ప్రత్యేక హోదా వేడి ఇంకా చల్లారడం లేదు. విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వ్యాఖ్యలకు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీ నారాయణ (విశ్లేషకులు), కోటేశ్వరరావు(బిజెపి), పట్టాభిరామ్ (టిడిపి), రాఘవ వెంకటరమణ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:54 - February 23, 2018

టెన్ టివి వార్తకు స్పందన..

వరంగల్ : టెన్ టివిలో ప్రసారమైన కథనాలకు కాకతీయ యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించారు. ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్స్ పాల్ మల్లారెడ్డిని ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కేయూ వ్యవహారంపై డిప్యూటి సీఎం కడియం శ్రీహరితో ఎమ్మెల్యే వినయ్ ఫోన్ లో మాట్లాడారు. కేయూలో నెలకొన్న ఆందోళనలకు పరిష్కారం చూపలని కోరగా 48గంటల్లో పరిష్కారం చూపిస్తామని కడియం హామీనిచ్చినట్లు సమాచారం. శనివారం వర్సిటీని కడియం సందర్శించే అవకాశం ఉంది. 

వేరుశనగ రైతుల ఆందోళన...

మహబూబ్ నగర్ : వ్యవసాయ మార్కెట్ లో రైతులు ఆందోళన చేపట్టారు. వేరు శనగకు మద్దతు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 

18:45 - February 23, 2018

ప్రకాశం :జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులకు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. టిడిపి సర్కార్ కాంట్రాక్టు కార్మికులను వేధిస్తోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించిందన్నారు. కానీ ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గు చేటన్నారు. 

18:36 - February 23, 2018
18:35 - February 23, 2018
18:30 - February 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి గూడెంలో ఆయన విలేకురులతో మాట్లాడారు. బాపిరాజు అభివృద్ధి నిరోధకుడనని విమర్శించారు. తాడేపల్లి గూడెం నళ్లచెరువు మండలంలో జరిగిన నీరు - చెట్టు కార్యక్రమంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించే విధంగా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోరినట్లు, విచారణ అనంతరం నిజాలు బయటపడుతాయన్నారు. 

18:26 - February 23, 2018
18:25 - February 23, 2018

కర్నూలు : ఏపీ రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సీమ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది. 16 డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్ ను సమావేశంలో ఆమోదించారు. రాయలసీమలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించి ప్రతి ఏటా కొన్ని సమావేశాలు నిర్వహించాలని, హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకరించకుండా రాయలసీమకు కూడా విస్తరించాలన్నారు. రాయలసీమ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, రాయలసీమకు టిడిపి ఇచ్చిన 200 హామీలను అమలు చేయాలని కోరారు. 

18:19 - February 23, 2018

తూర్పుగోదావరి : మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ సభ్యులు రాజీనామ చేసే ప్రసక్తే లేదని టిడిపి కాకినాడ ఎంపీ తోట నర్సింహం కుండబద్ధలు కొట్టారు. ఇప్పటికే తాము రాజీనామా చేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని దానిని మధ్యలో విస్మరించమన్నారు. విభజన హామీలపై కేంద్రంపై వత్తిడి తీసుకొస్తామన్నారు. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం ఎలాంటి ప్రయోజనం లేదని...వైసీపీ పార్టీది ఒక డ్రామా అని అభివర్ణించారు. 

18:16 - February 23, 2018

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా...కేంద్ర హామీలపై రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. కానీ పోరాటం ఒక్కటే కాకుండా అభివృద్ధిపైన కూడా దృష్టి సారించామన్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రం..ఏపీ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టిడిపి..బిజెపి నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంపై ఒకింత ఆగ్రహంగానే మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలచేయాల్సిందేనంటూ పలు సభలలో వ్యాఖ్యానిస్తున్నారు. శుక్రవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ...ప్రత్యేక హోదా..ఇచ్చిన హామీలు..విభజన హామీలు పొందడం ఏపీ హక్కు అని..ఇవన్నీ ఇవ్వడం కేంద్రం బాధ్యత అన్నారు. ఎన్నోమార్లు ఈ విషయంలో అడగడం జరిగిందని స్పందన లేనందు వల్లే గట్టిగానే అడుగుతున్నట్లు తెలిపారు. పోరాటం వరకు పరిమితమైతే నష్టపోతామని..అందుకే మరో కోణంలో అభివృద్ధి విషయంపై దృష్టి సారించడం జరుగుతోందన్నారు. 

టీఆర్టీకి గ్రీన్ సిగ్నల్...

హైదరాబాద్ : టీఆర్టీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఆర్టీని రద్దు చేయాలని హైకోర్టులో నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు అభ్యర్థులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన దానిపై కోర్టు విచారించింది. హాల్ టికెట్లు అందలేదని, ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడంపై పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్టీపై స్టే ఇవ్వడం కుదరదని కోర్టు చెప్పడంతో అభ్యర్థులు పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. 

18:06 - February 23, 2018

హైదరాబాద్ : టీఆర్టీ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 4 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిసారి ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడం శుభపరిణామమని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ఘంటా చక్రపాణితో టెన్ టివి మాట్లాడింది.

తొలిసారి ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడం శుభపరిణామమని, ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు 2.75 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, పరీక్ష కేంద్రాల కేటాయింపు అధికారి టీఎస్పీఎస్సీకే ఉందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పరీక్షా కేంద్రాలు కేటాయించామని, పరీక్షకు సంబంధించిన వివరాలన్నీ టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారని, అభ్యర్థులకు ఉన్న సందేహాలను ఇన్విజిలేటర్లు పరిష్కరిస్తారన్నారు. దుష్ర్పచారాలను నమ్మవద్దని, అభ్యర్థులు మంచిగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:05 - February 23, 2018

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, కానీ దీనిని సుప్రీం కొట్టివేసిందని రైతాంగం..న్యాయం..ధర్మం గెలిచిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం ఇతరత్రా ప్రాజెక్టులపై వందలాది కేసులు వేసి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది. పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా దాఖలైన పిటషన్ సుప్రీకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును మరింత వేగంగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 

సింగరేణి కార్మికులకు శుభవార్త...

మంచిర్యాల : సింగరేణి కార్మికులకు శుభవార్త అందనుంది. సింగరేణి కార్మికుల సొంతింటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా రూ. 10 లక్షలు రుణం ఇచ్చేందుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. 

17:17 - February 23, 2018

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చెలరేగింది. వీసీ అసమర్థతతే వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని రోజులు వర్సిటీలో వివాదాలు చుట్టుముడుతుండడం..ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఎగ్జామీనేషన్ బ్రాంచ్ లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆందోళ చేపట్టడంతో ప్రభుత్వం విచారణ చేపడుతోంది. ఇదిలా కొనసాగుతుండగానే వీసీ చేపట్టిన అడ్మినిషన్ ప్రక్రియలో కూడా అవకతవకలు జరుగుతున్నా విద్యార్థి సంఘాలు పేర్కొంటూ వివిధ దశల్లో ఆందోళనలు చేస్తున్నారు. కానీ కాకతీయ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించలేదు.

చివరకు విద్యార్థి సంఘాల మద్దతు కూడగట్టడానికి ఓ విద్యార్థి సంఘం ప్రయత్నించింది. అందులో భాగంగా శుక్రవారం వర్సిటీలోని విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు జరిపారు. మద్దతు ఇవ్వాలని కోరారు. ఇంజినీరింగ్ బ్లాక్ వద్దకు వెళ్లిన విద్యార్థి నేతల్లో కొంతమంది దీనికి నిరాకరించారు. మద్దతు ఇవ్వాలని చెబుతున్న విద్యార్థులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. టీఆర్ఎస్ నేత రాజగోపాల్...పీడీఎస్ యూ కు చెందిన నేత గాయపడ్డారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఈ పంచాయతీ వీసీ ఛాంబర్ కు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్..వినయ్ భాస్కర్ లు వీసీతో చర్చలు జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలవాల్సి ఉంది. 

ఏసీబీకి చిక్కిన పెనుమంట్ర పంచాయతీ డీఈ..

పశ్చిమగోదావరి : ఏసీబీకి పెనుమంట్ర పంచాయతీ డీఈ రామకృష్ణ చిక్కాడు. పెనుగొండ సర్పంచ్ భర్త యాదాల రవి చంద్ర నుండి రూ. 25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

'అసైన్డ్ భూములు కలిగిన వారికి కొత్త పాస్ పుస్తకాలు..’

హైదరాబాద్ : అసెన్డ్ భూములు కలిగిన వారికి కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి ఆ భూముల యాజమాన్యంపై స్పష్టతనిచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వాలని అధికారుకు ఆయన సూచించారు. వ్యవసాయ భూమి కలిగిన రైతుకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే ఆ వివరాలను కూడా పాస్ పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు. అందుకోసం అదనపు కాలమ్ ను చేర్చాలని, పాస్ పుస్తకానికి ఆధార్ నంబర్ ను అనుసంధానించాలన్నారు. పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఎంట్రీని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. 

టి.ఎంసెట్ నిబంధనలో మార్పులు...

హైదారాబాద్ : తెలంగాణ ఎంసెట్ నిబంధనలో మార్పులు చోటు చేసుకున్నాయి. బీఎస్సీ ఫారెస్ట్ లో చేరాలంటే ఎంసెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ లో బయాలజీ సబ్జెక్ట్ రాసిన వారికి మాత్రమే బీఎస్సీ ఫారెస్ట్ లో అవకాశం పొందుపరిచారు. 

కేయూలో తీవ్ర ఉద్రిక్తత...

వరంగల్ : కేయూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీహెచ్ డీ వ్యవహారం విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆందోళనకు సంఘీభావం పలికేందుకు ఇంజినీరింగ్ బ్లాక్ వద్దకు వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. 

16:34 - February 23, 2018
16:32 - February 23, 2018

ఢిల్లీ : పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురైంది. దాణా స్కాంలో బెయిల్ ఇచ్చేందుకు జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. దియోఘర్ ట్రెజరీ నుండి అక్రమంగా నిధులు డ్రా చేసుకున్నారనే కేసులో బెయిల్ ఇవ్వాలని లాలూ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ లో ఐదు, పాట్నాలో ఒక కేసులో లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. దోషిగా తేలిన లాలూ రాంచీలోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

16:26 - February 23, 2018

నెల్లూరు : స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పెద్దలు పోరాడిన విధంగానే ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలోని గూడూరులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మగౌరవ దీక్ష లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ పెద్దలకు సమస్య వినిపించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని పనబాక కృష్ణయ్య స్పష్టం చేశారు. 

16:22 - February 23, 2018

కరీంనగర్ : ఈనెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారు. ప్రాంతీయ రైతు సమన్వయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్ సదస్సు జరిగే అంబేద్కర్ స్టేడియాన్ని పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను చూసిన పోచారం పలు సూచనలు చేశారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చేందేకే రైతు సమన్వయ సమితీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, మొదటి సమావేశం ఈనెల 25వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో జరుగుతుందన్నారు.

 

16:16 - February 23, 2018

కరీంనగర్ : ‘ఈ తండ్రి నాకొద్దూ..రోజు ఇంటికి వచ్చి కొడుతున్నడు..’ అంటూ ఓ బాలుడు ధైర్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈఘటన జిల్లాలోని జమ్మికుంటలో చోటు చేసుకుంది. కృష్ణా కాలనీలో శ్రీనివాస్..తన కొడుకు శశికుమార్ తో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి తాగొచ్చిన శ్రీనివాస్ శశికుమార్ ను ఇంట్లో తాళం వేసి కర్రతో ఇష్టమొచ్చినట్లుగా బాదినట్లు, ఆ సమయంలో తల్లి లేదని..ప్రతి రోజు ఇలాగే చేస్తున్నాడని జమ్మి కుంట పీఎస్ లో సీఐకు ఫిర్యాదు చేశాడు. ఈ తండ్రి తనకు వద్దని..హాస్టల్ లో చేరిపిస్తే బుద్ధిగా చదువుకుంటానని..కొట్టిన గాయాలు చూపించడంతో సీఐ కూడా చలించిపోయారు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

తండ్రిపై బాలుడు ఫిర్యాదు..

కరీంనగర్ : జిల్లాలో జమ్మికుంట కృష్ణా కాలనీలో ఓ తండ్రి నిర్వాకం బయటపడింది. తన తండ్రి తాగొచ్చి రోజు కొడుతున్నాడని..ఈ తండ్రి తనకు వద్దొని..హాస్టల్ చేరిపిస్తే బుద్ధిగా చదువకుంటానంటూ బాలుడు పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. 

15:52 - February 23, 2018

హైదరాబాద్ : బీసీ ఉప ప్రణాళిక తీసుకురావడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీసీ నాయకులు విమర్శించారు. బీసీ సబ్‌ ప్లాన్‌ సాధనపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాలకులు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బీసీ ఉప ప్రణాళికను వెంటనే తీసుకురాకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

15:50 - February 23, 2018

చిత్తూరు : జిల్లా మదనపల్లిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని..వారు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించాలంటూ... కాంట్రాక్ట్ ఉద్యోగులు రెడప్ప, లక్ష్మీనారాయణ... విద్యుత్‌ టవర్‌ ఎక్కి నిరసనకు దిగారు. దీంతో అక్కడున్న వారిలో టెన్షన్ నెలకొంది. 

15:49 - February 23, 2018

హైదరాబాద్ : వెస్ట్‌జోన్‌ పరిధిలోని హబీబ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఓ పాత నేరస్తుడు హల్‌చల్‌ చేశాడు. మామూలు ఇవ్వనందుకు యూసుఫ్‌ అనే వ్యక్తిపై సలీం కత్తులతో దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న యూసుఫ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సలీంను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ సలీంపై పోలీసు కేసులున్నాయి. 

15:47 - February 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులు చేస్తున్న ఆందోళనకు సీపీఎం మద్దుతు ప్రకటించింది. ఎకరానికి 30 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో దీక్షలు చేస్తున్న నిర్వాసిత రైతులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించారు. నిర్వాసితులకు పద్ధతి ప్రకారం పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:45 - February 23, 2018

ఆర్థిక శాఖాధికారులతో యనమల సమీక్ష...

విజయవాడ : ఆర్థిక శాఖాధికారులతో బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల సమీక్ష నిర్వహించారు. 2018-19 బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించనున్నట్లు, కొత్త పథకాలను బడ్జెట్ లో ప్రవేశ పెట్టనున్నట్లు..మైన్స్ అండ్ మినరల్స్ కొత్త పాలసీని ప్రవేశ పెడుతామన్నారు. బడ్జెట్ లో వ్యవసాయం..సంక్షేమం..యువత..మహిళలు..విద్య...గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలిపారు. 

బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు ఫైర్...

పశ్చిమగోదావరి : జడ్పీ ఛైర్మన్ బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు నిప్పులు చెరిగారు. తాడేపల్లిగూడెంకు నిట్ కు రాకుండా..నియోజకవర్గ అభివృద్ధికి కల్పించిన ఆటంకాలను ప్రజలు గమనిస్తున్నారని, తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాల్లో నీరు చెట్టు పథకం..అవినీతిపై విచారణ జరిపించాలని సీఎంకు అభ్యర్థించడం జరిగిందన్నారు. విచారణ అనంతరం బాపిరాజు నిజరూపం బయటకొస్తుందన్నారు.

 

ఆర్జిత సేవల టికెట్లు పెంచం - టిటిడి ఈవో...

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ధరలను పెంచాలని యోచన ప్రస్తుతానికి లేదని ఈవో అనీల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఆర్జిత సేవల ధరల పెంపుపై అధ్యయనం జరుగుతోందని, అన్యమతస్తుల ఉద్యోగుల అంశంపై కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వదర్శనం భక్తులకు స్లాబ్ విధానం అమలుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 

15:14 - February 23, 2018

కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడుతున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ భారీ సంఖ్యలో రైతులు రోడ్డెక్కారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని పేర్కొంటు శుక్రవారం ట్రాక్టర్లు..ఎడ్ల బండ్లతో నిరసన వ్యక్తం చేశారు. పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోయారు. మొక్క..వరి పంటలకు రూ. 2500, పసుపు పంటకు రూ. 15వేలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:13 - February 23, 2018

తూర్పుగోదావరి : అధికార అండదండలున్నాయి...తాము ఏమి చేసినా చెల్లుతుందని కొంతమంది ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు..సామాన్యుడినే ప్రధాన అస్త్రంగా చేసుకని భూ కబ్జాలకు..దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఏపీ రాష్ట్రంలో పలు ఘటనలు ఇప్పటికే వెలుగు చూడగా తాజాగా మరొక ఘటన బహిర్గతమైంది. రాజమహేంద్రవరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణపై భూ కబ్జాల ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి. అధికారులను మచ్చిక చేసుకుని..పేదల భూములకు ఎసరు పెట్టాడని తెలుస్తోంది. ఈ ఘటనపై టెన్ టివిలో వరుస కథనాలు ప్రసారం కావడంతో ఎమ్మెల్యే స్పందించారు. తన పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారని..దీనిపై పూర్తి విచారణ జరగాలన్నారు.

ఇదిలా ఉంటే అధికార అండతో బిజెపి ఎమ్మెల్యే రెచ్చిపోతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 12 కోట్ల విలువైన భూమిపై కన్ను పెట్టాడని...తాము కోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని తెలిపారు. మరింత సమాచారం తెలువాల్సి ఉంది. 

విద్యుత్ టవర్ ఎక్కిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు...

చిత్తూరు : సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. మదనపల్లిలోని విద్యుత్ టవర్ ను ఎక్కిన ఇద్దరు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

14:59 - February 23, 2018

ఢిల్లీ : కెనాడా ప్రధాని జస్టిస్ ట్రూడోను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం కలిశారు. గత కొద్ది రోజులుగా ట్రూడో భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్ కు వచ్చిన ట్రూడో కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. ట్రూడో కుటుంబసభ్యులతో మోడీ కరచాలనం చేసి మాట్లాడారు. అనంతరం ట్రూడో సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్యలు జరిపారు. కెనాడలో సిక్కు ఉగ్రవాదం గురించి..ఉగ్రవాద నిర్మూలనపై పరస్పర సహకారం గురించి వీరు చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు ట్రూడో భారత పర్యటన వివాదాస్పదంగా మారింది. కెనడా హైకమిషనర్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు తీవ్రవాది జస్పాల్ అత్వాల్‌కు ఆహ్వానం అందడం వివాదంగా మారింది. ముంబై విందులో పాల్గొన్న అత్వాల్‌.. ట్రూడో భార్యతో ఫొటోలు కూడా దిగడంతో వివాదం చెలరేగుతోంది.

14:52 - February 23, 2018

ఢిల్లీ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్షూ ప్రకాష్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరు శుక్రవారం సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ప్రకాష్ పై ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారనే ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. దాడి జరిగిన సమయంలో క కేజ్రీ ఇంట్లో ఉన్న సిబ్బందిని సైతం విచారించనున్నారు. అవసరమైతే కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించనున్నారు. అన్షూ ప్రకాష్ ఫిర్యాదు మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదిలా ఉంటే అన్షూపై దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. 

భూ కబ్జాలో తన పాత్ర లేదన్న ఆకుల...

తూర్పుగోదావరి : టెన్ టివి కథనానికి స్పందన వ్యక్తమైంది. భూ కబ్జాలో తన పాత్ర లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. భూ కబ్జాపై శ్రీరామపురం గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించడం జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పేర్కొన్నారు. 

నిరుద్యోగ యువత కోసం టి.సర్కార్ పథకం ?

హైదరాబాద్ : నిరుద్యోగ యువత కోసం తెలంగాణ సర్కార్ కొత్త పథకం తేవడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నిరుద్యోగులకు రూ. 2వేల బృథి ఇచ్చే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు టాక్.

 

చింతలపూడి భూ నిర్వాసితులతో ఏపీ మధు...

పశ్చిమగోదావరి : చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించారు. పరిహారం ఇవ్వకుండా కాలవ్వలు తవ్వుతున్న ఎర్రగుంట పల్లి కాంతం పాలెంలో రైతులతో కలిసి భూములను పరిశీలించారు. వారం రోజుల్లో చింతలపూడిలో బాధిత రైలుతో సభ ఏర్పాటు చేస్తామన్నారు. 

ఏపీ టిడిపి ఎంపీలు రాజీనామ చేయరన్న తోట..

తూర్పుగోదావరి : టిడిపి ఎంపీలు రాజీనామా చేసే ప్రసక్తే లేదని, రాజీనామాలతో ఉపయోగం లేదని ఎంపీ తోట నర్సింహ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చెప్పడం రాజకీయ డ్రామా అని అభివర్ణించారు. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతామన్నారు.

 

బంద్ కు సీపీఐ మద్దతు - చాడ...

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై 24 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఏస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గకరణ బిల్లు పెట్టాలని, మార్చి 13న ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ కు సీపీఐ మద్దతు తెలియచేస్తుందన్నారు. 

ఆభరణాలు అమ్ముకున్న ముత్తూట్ మేనేజర్...

ప్రకాశం : ఒంగోలు ముత్తూట్ ఫైనాన్స్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. కస్టమర్ సుబ్రమణ్యంకు చెందిన ఆభరణాలను మేనేజర్ అమ్ముకున్నాడు. దీనిపై బాధితుడు ఆందోళనకు దిగాడు. 

జగన్ డైరెక్షన్..వీర్రాజు యాక్షన్ - బుద్ధా వెంకన్న...

విజయవాడ : జగన్ డైరెక్షన్ చేస్తే వీర్రాజు యాక్షన్ చేస్తున్నారని..సోము వీర్రాజు వైసీపీ ఏజెంట్ లా జగన్ బీజేపీకి కోవర్టులా పనిచేస్తున్నారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. బీజేపీ మోసం చేస్తుందని ఊహించలేదని, ప్రధానిగా మోడీకి 2014లోనే అవకాశం వచ్చింది కానీ చంద్రబాబు నాయుడికి 1994లోనే ప్రధానిగా అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసం ప్రధాని పదవిని వదులుకున్న వ్యక్తిని మోసం చేసిన బిజెపికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 

13:29 - February 23, 2018

హైదరాబాద్ : బల్దియాలో కొందరు అధికారుల అక్రమాలు, అలసత్వంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. చేతులు తడపందే పనిచేయని వారు కొందరైతే... తడిపినా తడపకపోయినా... అసత్వం వీడని అధికారులు మరికొందరు బల్దియాలో ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు.జననధృవీకరణ పత్రం కోసం బల్దియా చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పనులు కావడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రం తీసుకోవడమంటే... మా చావుకొచ్చినట్టుందంటున్నారు ప్రజలు. ఏపనిమీద బల్దియాకు వెళ్ళినా పరిస్థితి మాత్రం ఇలాగే ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.బల్దియా చేతివాటం గాళ్ళ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చేయితడపనిదే పనిచేయని వారూ ఉన్నారు. ఇటీవల జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అక్రమాల గుట్టు రట్టయింది. ఇక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్న హెల్త్‌ అసిస్టెంట్ల వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. పాకిస్తాన్‌ దేశీయులకు కూడా హైదరాబాద్‌లో బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి బిడ్డ వివరాలు రిజిష్టర్‌ చేయించాలి...
పుట్టిన ప్రతి బిడ్డ వివరాలు రిజిష్టర్‌ చేయించాలి... జనన ధృవీకరణ పత్రం పొందడం ప్రతి బిడ్డకు ఉన్న హక్కు... హైదరాబాద్‌ పరిధిలో పుట్టిన ప్రతి బిడ్డకూ 21 రోజుల్లో బర్త్‌ సర్టిఫికెట్‌ను ఇంటికే పంపిస్తాం.. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మెడికల్‌ రిపోర్టుతో పాటు ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌ కూడా ఇస్తాం.. ఇవన్నీ బల్దియా చెప్పిన మాటలు.. ధృవీకరణ పత్రాల జారీలో మాత్రం బండెడు అలసత్వం చూపిస్తోంది బల్దియా. పుట్టిన బిడ్డకు ఆసుపత్రి దగ్గరే బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు అధికారులు... ఈ కార్యక్రమం కోసం ఐదు ఆసుపత్రులను ఎంపిక చేశారు. నయాపూల్ మెటర్నటీ ఆసుపత్రి, నిలోఫర్ చిల్ర్డన్స్ ఆసుపత్రితోపాటు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేవలం నయాపూల్‌ ఆసుపత్రిలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలో పుట్టిన బిడ్డకు అన్ని రకాల ధృవపత్రాలు ఇచ్చే విధంగా హైదరాబాద్‌లో కూడా బర్త్, ఆధార్‌ సర్టిఫిరకెట్‌ ఇస్తామని అధికారులు ప్రకటించారు. బల్దియా అధికారులకు ఆరంభంలో చూపే ఆర్బాటం ఆచరణలో లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

13:22 - February 23, 2018

కృష్ణా : ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి ఫైర్‌ అయ్యారు. రాష్ట్రనికి ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీతోనే ఎక్కువ న్యాయం జరుగుతోందని అప్పట్లో ప్రకటించిన చంద్రబాబు ఇపుడు కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. విభజన బిల్లు పార్లమెంటులో ఉండగా.. కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు నాడు కనీసం ప్రత్యేకహోదా డిమాండ్‌పై యూపీఏ ప్రభుత్వాన్ని నిలదేయలేదన్నారుజ నాడు నోరుమూసుకుని విభజనకు అంగీకరించిన నేతలు.. ఇపుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. 

బీజేపీ ఎమ్మెల్యే భూ కబ్జా

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు. ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా పేదల భూములను అధికారుల అండతో కబ్జా చేశారు.

జగిత్యాలలో ఉద్రిక్తత

కరీంనగర్/జగిత్యాల : జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించారు. పసుపు, వరి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరసన ర్యాలీలో 1000 మంది రైతులు పాల్గొన్నారు.

13:12 - February 23, 2018

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు. ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా పేదల భూములను అధికారుల అండతో కబ్జా చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:04 - February 23, 2018

కరీంనగర్/జగిత్యాల : జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించారు. పసుపు, వరి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరసన ర్యాలీలో 1000 మంది రైతులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:05 - February 23, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా దాఖలైన పిటషన్ సుప్రీకోర్టు కొట్టివేసింది. సుప్రీం తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును మరింత వేగంగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏపీకి బీజేపీ ఎన్నో చేసింది : సోము

గుంటూరు : ఏపీకి బీజేపీ ఎంతో చేసిందని, పోలవరం కోసం తెలంగాణ గ్రామలను ఏపీలో కలిపే ఆర్డినెన్స్ జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

11:58 - February 23, 2018

రంగారెడ్డి : జిల్లా షాద్‌ నగర్‌ ఏమ్‌వీఐ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఎమ్‌వీఐ శ్రీకాంత్‌. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన విజయేందర్‌ రెడ్డి అనే వ్యక్తి... డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వెళ్తే 5వేలు లంచం ఇవ్వమని డిమాండ్‌ చేశాడు ఎమ్‌వీఐ. దీంతో విజయేందర్‌ రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు డబ్బు ఇచ్చేందుకు వెళ్లగా ఎంవీఐ తన డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వమని చెప్పడంతో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఎమ్‌వీఐ శ్రీకాంత్‌ చక్రవర్తితో పాటు డ్రైవర్‌ బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

11:16 - February 23, 2018

గుంటూరు : ఏపీకి బీజేపీ ఎంతో చేసిందని, పోలవరం కోసం తెలంగాణ గ్రామలను ఏపీలో కలిపే ఆర్డినెన్స్ జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్

చిత్తూరు : శాంతిపురం మండలం పెద్దూరులో ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. గ్రామ చెరువులో ఏనుగుల తిష్టవేసి వేసి గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 

11:07 - February 23, 2018

పీఎస్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : సైఫాబాద్ పీఎస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ట్రాఫిక్ ఎస్ఐ అక్రమంగా చలానాలు రాస్తున్నారంటూ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడిని ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

వర్మ విచారణ వాయిదా

హైదరాబాద్ : దర్శకుడు వర్మకు స్వల్ప ఊరట లభిచింది. వర్మకు నేటి విచారణను వాయిదా వేశారు. మార్చి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని వర్మను పోలీసులు ఆదేశించారు. వర్మ ల్యాప్ టాప్ విషయంలో ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందకపోవడంతో వర్మ విచారణ వాయిదా పడింది.

10:30 - February 23, 2018

హైదరాబాద్ : సైఫాబాద్ పీఎస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ట్రాఫిక్ ఎస్ఐ అక్రమంగా చలానాలు రాస్తున్నారంటూ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడిని ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:26 - February 23, 2018

హైదరాబాద్ : దర్శకుడు వర్మకు స్వల్ప ఊరట లభిచింది. వర్మకు నేటి విచారణను వాయిదా వేశారు. మార్చి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని వర్మను పోలీసులు ఆదేశించారు. వర్మ ల్యాప్ టాప్ విషయంలో ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందకపోవడంతో వర్మ విచారణ వాయిదా పడింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:05 - February 23, 2018
09:10 - February 23, 2018
09:09 - February 23, 2018

వాషింగ్టన్ : చిన్నారి శాన్వితోపాటు తన నాయనమ్మ సత్యవతిని 2012 అక్టోబర్‌లో అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో యండమూరి రఘునందన్‌కు నేడు అమెరికా కోర్టు ఉరిశిక్ష అమలు చేయనుంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం, కుడుముల కుంటగ్రామానికి చెందిన శివప్రసాద్‌రెడ్డి, లత దంపతుల కుమార్తె శాన్వి. కాగా వీరు ఉద్యోగరీత్యా అమెరికాలోని పెన్సెల్వేనియాలో ఉంటున్నారు. అక్కడే నివసించే విశాపట్నానికి చెందిన రఘునందన్‌ ఈ జంటహత్యలకు పాల్పడ్డాడు.వ్యసనాలకు బానిసైన నిందితుడు డబ్బుకోసం ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అమెరికాలో ఉరిశిక్షపడ్డ తొలి భారతీయుడు రఘునందన్‌. ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదంటే... నిందితున్ని కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు, గ్రామస్థులు కోరుతున్నారు.

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ లోని కెమికల్ గోడౌన్ లో మంటలు చెరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలతో కిలోమీటర్ వరకు పొగ దట్టంగా కమ్ముకుంది.

08:50 - February 23, 2018

హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ లోని కెమికల్ గోడౌన్ లో మంటలు చెరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలతో కిలోమీటర్ వరకు పొగ దట్టంగా కమ్ముకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:47 - February 23, 2018

తెలంగాణ ప్రభుత్వం ఓట్ల రాజకీయలు చేస్తుందని, రైతు సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతు సమన్వయ సమితులు కేవలం ఓట్ల కోసమే అని, రైతు సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారని దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజరిందని, మొదట లక్ష రుణా మాఫీ అన్నారని కానీ దాన్ని ధఫా ధఫాలుగా చేసి వడ్డీ ఎగ్గొట్టారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ గౌడ్ అన్నారు. గత 60 సంవత్సరాల నుంచి రైతుల ఆందోళన కొనసాగుతుందని, రైతుల ఆత్మహత్యలు గత ప్రభుత్వాలే తప్పులే అని టీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:46 - February 23, 2018

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దత ధర ప్రకటించడం లేదని, పెట్టుబడిని బట్టి మద్దతు ధర నిర్ణయించాల్సిన అసరం ఉందని, వ్యాపారులు సిండికేట్ గా మారి రైతుల వద్ద పంటను తక్కువ ధరకు కొంటున్నారని, ప్రభుత్వం రైతులకు ఎటుంటి సహాయం చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగ్గారెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:45 - February 23, 2018

చెన్నై : మక్కల్ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హసన్‌ బిజెపిని టార్గెట్‌ చేశారు. భారత త్రివర్ణ పతాకంలో కాషాయ రంగు ఒక భాగమే తప్ప మొత్తం జెండాను కాషాయం చేయకూడదంటూ బిజెపిపై ధ్వజమెత్తారు. ఆనంద వికటన్ తమిళ మ్యాగజైన్‌కు రాసిన కాలమ్‌లో కమల్‌ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను కాషాయాన్ని ద్వేషించనని...త్రివర్ణ పతాకంలో ఉన్న కాషాయం త్యాగానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఇతరుల మనోభావాలకూ విలువ ఇవ్వాలని కమల్ కోరారు. తాను అతివాద భావజాలాన్ని ఏమాత్రం సహించబోనని చెప్పిన కమల్- తాను లెఫ్టూ కాదు.. రైటూ కాదు.. సెంటర్‌లో ఉంటానన్నారు. 

08:44 - February 23, 2018

ముంబై : దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం పుణేలో బహిరంగ వేదికపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్‌ అధ్యక్షుడు రాజ్ థాకరే ...శరద్‌ పవార్‌ను రెండు గంటల పాటు అనేక అంశాలపై ఇంటర్వ్యూ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మంచి రోజులున్నాయని..ఆయనలో చాలా మార్పు వచ్చిందని... దేశవ్యాప్తంగా పర్యటించి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని పవార్ పేర్కొన్నారు. బిజెపితో ఎలాంటి ఒప్పందం లేదని....కాంగ్రెస్‌ పార్టీతో సంకీర్ణానికే తాను ప్రాధాన్యత నిస్తానని శరద్‌పవార్‌ స్పష్టం చేశారు. నోట్ల రద్దు వల్ల మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటకలో బలంగా ఉన్న సహకార బ్యాంకులు భారీగా నష్టపోయాయని చెప్పారు. ప్రధాని మోదిని కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. గుజరాత్‌ సిఎంగానే మోది సక్సెస్‌ అయ్యారని...పవార్‌ చెప్పుకొచ్చారు.

08:42 - February 23, 2018

ఢిల్లీ : అవినీతిలో మన దేశం భూటాన్ కన్నా అధ్వాన్నంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అవినీతికి సంబంధించిన నివేదికను ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ విడుదల చేసింది. 2017కు గాను ప్రపంచ అవినీతి సూచీ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో భారత్‌ స్కోరు 40 కాగా 81వ ర్యాంకులో ఉంది. మొత్తం 180 దేశాలకు ఈ ర్యాంకింగ్‌ ఇచ్చారు. 2016లో అవినీతి ర్యాంకులో భారత్‌ 79వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ 117, బంగ్లాదేశ్‌ 143, శ్రీలంక 91వ స్థానంలో నిలిచాయి. 67 స్కోరుతో భూటాన్ 26వ స్థానంలో, 41 స్కోర్‌తో చైనా 77, రష్యా 135వ ర్యాంకులో నిలిచాయి. ఈ నివేదికలో అగ్ర స్థానాన్ని న్యూజిలాండ్, డెన్మార్క్ ఆక్రమించాయి. ప్రభుత్వ రంగంలో అవినీతిపై వ్యాపారులు, నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని కొన్ని దేశాల్లో ఎక్కువగా అవినీతి ఉందని, పత్రికా స్వేచ్ఛ లేదని ఈ నివేదిక వెల్లడించింది.

08:41 - February 23, 2018

ముంబై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ స్కాంకు పాల్పడ్డ ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా నీరవ్‌కు చెందిన 9 లగ్జరీ కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. 6 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350 సీడీఐలు, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా, పోర్షే పనమేరా, మూడు హోండా కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీరవ్‌, ఆయన మామ మెహుల్‌ ఛోక్సీలకు చెందిన దాదాపు 94కోట్ల విలువ చేసే షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్‌లో నీరవ్‌, ఛోక్సీలకు చెందిన కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌లో దాదాపు 5వేల మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇచ్చినట్లు సమాచారం. తాను జీతాలు ఇవ్వలేనని, వేరే ఉద్యోగాలు చూసుకోవాలని తన కంపెనీలకు చెందిన ఉద్యోగులకు నీరవ్‌ ఈమెయిల్‌ ద్వారా లేఖ రాశారు. తన బ్యాంకు ఖాతాలు సీజ్‌ అయ్యాయని..అవి రిలీజ్‌ అయ్యాక బకాయిలు చెల్లిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. 11,400కోట్ల భారీ మోసానికి పాల్పడిన నీరవ్‌ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.  

08:32 - February 23, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అప్పుడే మెల్లగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీలన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాజ్యాధికారమే లక్ష్యంగా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీలు తమతమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. 2019లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌పార్టీ బస్సుయాత్ర, పాదయాత్రలతో జనంబాట పట్టేందుకు డిసైడ్‌ అయ్యింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇదే రైట్‌టైమ్‌ అని భావిస్తోంది. ఇందుకోసం బస్సుయాత్ర, పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.

బస్సుయాత్ర
కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు పూర్తికావొస్తున్నాయి. వచ్చే నెలలో బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ సర్కార్‌ నాలుగవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టపోతోంది. అయితే ఈ నాలుగేళ్‌లలో బడ్జెట్‌లో చెప్పినవి, కేటాయించినవి ఇక్కడి ఇప్పటికీ అమలుకాలేదని కాంగ్రెస్‌ చెబుతోంది. చెప్పినవి, ప్రకటించినవి, కేటాయించినవే ఇప్పటికి అమలుకాలేదని ప్రభుత్వం అంటోంది. కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు గత బడ్జెట్‌లో చెప్పిన అంశాలను ఏమాత్రం పట్టించుకోలేదన్న ప్రచారం ప్రజల్లో చేయాలని కాంగ్రెస్‌ డిసైడ్‌ అయ్యింది. దీనికోసం బస్సుయాత్ర బాగా ఉపయోగపడుతుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ భావిస్తున్నారు..

సీనియర్స్‌తో ప్రత్యేక భేటీలు
యాత్రను బడ్జెట్‌ సమావేశాల తర్వాత ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీసీసీ చీఫ్‌ పార్టీలోని కొంతమంది సీనియర్స్‌తో ప్రత్యేక భేటీలు అవుతున్నారు. జానారెడ్డి, షబ్బీర్‌అలీ, ఆమోదర, డీకె అరుణలతో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమైన ఉత్తమ్‌... యాత్రకు ఇదే రైట్‌టైమ్‌ అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉన్న నేతలను సైతం కలుస్తూ... బస్సుయాత్రకు అందరినీ సిద్దం చేస్తన్నారు కెప్టెన్‌. తాను తలపెట్టిన బస్సుయాత్రతో గులాబీ ప్రభుత్వానికి దడ పుట్టించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ భావిస్తున్నారు. యాత్ర వందశాతం సక్సెస్‌ అయ్యేందుకు పక్కాప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. దోనికోసం తనతో కొంత అంటిమట్టనట్లు ఉంటున్న నేతలు ఈ మేరకు సక్సెస్‌ అవుతారో వేచి చూడాలి.

08:32 - February 23, 2018

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌టీ పరీక్షలు రేపటి నుంచే మొదలవ్వనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారు తమ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు సమాచారం ఇచ్చింది. దీంతో అభ్యర్థులంతా పోటీలుపడి మరీ నెట్‌ సెంటర్లముందు, కంప్యూటర్ల ముందు క్యూలు కట్టారు. మొదట కొంతమందికి సరైన హాల్‌టిక్కెట్లే వచ్చాయి. కానీ ఆతర్వాతే అసలు సమస్య ఉత్పన్నమైంది. మొత్తం వివిధ పోస్టులకు కలిపి రెండు లక్షల 70వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొంతమంది సరైన మార్కులశాతం లేక క్యాన్సిల్‌ అయ్యేవారు కూడా ఉంటారు. అయితే మిగిలిన వారికి ఇవ్వాల్సిన హాల్‌టికెట్‌ జారీలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టీఆర్‌టీ పరీక్ష వ్యవహారమంతా తలకిందులైంది. అభ్యర్థులు , వారి తల్లిదండ్రులు టీఎస్‌పీఎస్సీపై విరుచుకుపడ్డారు. ఒక్కోసారి ఒక్కో సమాధానం .. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చెప్పడం మొత్తం గందరగోళం అయ్యింది.

ఉద్యోగాల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. గతంలో టీచర్ల కొలువులు డీఈవోలే భర్తీ చేసేవారు. కానీ వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించింది. ఉద్దేశం మంచిదే. కానీ ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతోంది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ తరచూ విఫలం అవుతూనే ఉంది. పలురకాలుగా సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది. అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో సీఎం కూడా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కొలువుల భర్తీలో టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని... ప్రతిసారీ ఈ సమస్యలెందుకు వస్తున్నాయని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ తమ తప్పేమీలేదని... సాంకేతిక నైపుణ్యాన్ని అందించే సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌పై తప్పును తోసేసింది. తమ తప్పేమీ లేదని సీజీజీ నెట్‌వర్కింగ్‌ సిస్టంలో ఉన్న లోపాల వల్లే ఇదంతా నెలకొందని లేఖ రాసింది.

లేఖపై సీజీజీ సీరియస్‌
టీఎస్‌పీఎస్సీ లేఖపై సీజీజీ సీరియస్‌ అయ్యింది. టీఎస్‌పీఎస్సీకి గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. తాము ఒక్క టీఎస్‌పీఎస్సీకే కాదు.. మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలకు సహకారం అందిస్తున్నామని గుర్తు చేసింది. అక్కడెక్కడారానీ సమస్యలు ఒక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోనే ఎందుకు వస్తున్నాయని ఎదురు ప్రశ్నించింది. అభ్యర్థుల పత్రాలు అప్‌లోడ్‌చేసి కోడింగ్‌ ఇస్తారో వాటినే తాము జారీ చేస్తామని చెప్పినట్టు సమాచారం. మొత్తానికి రెండు ప్రభుత్వ సంస్థలు ఎవరికి వారే తమ తప్పేమి లేదంటూ సీఎస్‌కు లేఖలు రాశాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సమస్యను పరిష్కరించడానికి త్వరలోనే ఇరు సంస్థల్లోని అధికారులతో ఓ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

08:29 - February 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్‌ కసరత్తులో బిజీ అయ్యింది. కొద్దిరోజులుగా ఆర్థికశాఖ... శాఖలవారీగా వచ్చిన ప్రతిపాదనలపై దృష్టి సారించింది. ప్రపోజల్స్‌పై సమీక్ష చేపట్టింది. అన్ని శాఖల నుంచి వచ్చిన అంచనాల మొత్తం దాదాపు 2లక్షల కోట్లకుపైగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని రంగాల వారీగా కూర్పు చేయాల్సిన అవసరం ఉందని... అయితే సీఎం ప్రాధాన్యతలనుసార వెళ్లాల్సి ఉన్నందున ఆయన గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తోంది.సాధారణంగా గత బడ్జెట్‌ కంటే దాదాపు 15శాతం అధికంగా పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రం ప్రారంభం నుంచి మిగులు రాష్ట్రంగా.. ధనిక రాష్ట్రంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి పాత బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన ఏశాఖ నిధులనైనా... తను అనుకున్న వాటికే అధికంగా దారి మళ్లించారు. దీనికి ఒక్క ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చే ప్రత్యక్ష ఉదాహరణ.

పెన్షన్లు కూడా రెండుమూడు నెలలకు ఒకసారి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందుకు ముందున్న పథకాలను రద్దు చేసి.. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఎన్ని పథకాలు సృష్టించినాసరే నిధులలో ఎక్కువ శాతం నీటి పారుదల, మిషన్‌ భగీరథలవైపే దారి మళ్లించారు. సంక్షేమ రంగానికి తొలి ప్రాధాన్యత అంటూ చెప్పిన మాటలన్నీ పేపరు ప్రకటనలకు పరిమితం అయ్యాయి. చివరకు దళితులకు మూడెకరాల పథకంలో ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం పంచింది కేవలం 9వేల ఎకరాల భూమి మాత్రమే. అందులోనూ కొన్ని ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి.ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చే నాటికి పెన్షన్లు కూడా రెండుమూడు నెలలకు ఒకసారి ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇతర అభివృద్ధి పనులు , కాంట్రాక్ట్‌ పనుల బిల్లులు చెల్లించలేదు. దీంతో పనులు నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సర్కార్‌ ఖర్చుల వంటి నాన్‌ప్లానింగ్‌ వంటివి తప్ప.. మిగతావేమీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లో మొత్తం బకాయిపడ్డ నిధులు చెల్లించలేదు. భూసేకరణలకు పరిహారం చెల్లించకపోవడం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.

సంక్షేమ పథకాలకు దాదాపు 90వేల కోట్లు
వచ్చే బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు దాదాపు 90వేల కోట్లు కేటాయించే అవకాశముంది. మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ కలిపి 25వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 30వేల కోట్లు కేటాయించే అవకాశముంది. వ్యవసాయరంగానికి 25వేల కోట్లు కేటాయించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఈసారి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మహిళాబడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. వచ్చిన ప్రతిపాదనలన్నింటిని కూర్పుచేసే పనిలో ఆర్థికశాఖ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. రానున్న బడ్జెట్‌ అంతా ఎన్నికల కోణంలోనే ఉండబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగులు, యువతను టార్గెట్‌ చేస్తూ ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి సామాజిక తెలంగాణలో సంక్షేమ రంగానికి ఏమేరకు ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందో వేచి చూడాలి.

08:23 - February 23, 2018

అనంతపురం : జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో నిర్మాణంలో ఉన్న కియా మోటార్స్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియా దిగ్గజ కార్ల తయారీ సంస్థ కియా 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థలో ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుంది. భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కియా మోటార్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

కియా మోటార్స్‌కు భూమిపూజ
కియా మోటార్స్‌కు భూమిపూజ అనంతరం ఎర్రమంచి సభలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అరకొరసాయంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న కేంద్రంపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని స్పష్టం చేసిన చంద్రబాబు, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా డిమాండ్‌ సహేతుకమైనదని, ఈ విషయంలో పద్ధతి ప్రకారం ఆందోళన చేసేవారిని అభినందిస్తానన్న చంద్రబాబు.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. 

08:23 - February 23, 2018

అనంతపురం : జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో నిర్మాణంలో ఉన్న కియా మోటార్స్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియా దిగ్గజ కార్ల తయారీ సంస్థ కియా 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థలో ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుంది. భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కియా మోటార్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

కియా మోటార్స్‌కు భూమిపూజ
కియా మోటార్స్‌కు భూమిపూజ అనంతరం ఎర్రమంచి సభలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అరకొరసాయంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న కేంద్రంపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని స్పష్టం చేసిన చంద్రబాబు, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా డిమాండ్‌ సహేతుకమైనదని, ఈ విషయంలో పద్ధతి ప్రకారం ఆందోళన చేసేవారిని అభినందిస్తానన్న చంద్రబాబు.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. 

నేడు కృష్ణా బోర్డు క్రాస్ ఎగ్జామినేషన్

హైదరాబాద్ : నేడు కృష్ణా బోర్డులో క్రాస్ ఎగ్జామిన్ జరగానుంది తెలంగాణ లాయర్ ఏపీని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. 

Don't Miss