Activities calendar

24 February 2018

22:02 - February 24, 2018
22:00 - February 24, 2018

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. ఇదే అంశంపై 10టివి నిర్వహించిన బిగ్ డిబేట్ 'పోరే దారి' చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కాంగ్రెస్ నేత జంగా గౌతమ్, టీడీపీ నేత వర్ల రామయ్య, సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు, బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, లాయర్ రాజేంద్రప్రసాద్, శాంతి పాల్గొని, మాట్లాడారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా, ప్రత్యేకప్యాకేజీ సాధించడంలో విఫలమైందని విమర్శించారు. టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి పదువులకు రాజీనామా చేసి, ప్రత్యేకహోదా కోసం పోరాడాలని సూచించారు. బీజేపీ ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఏపీకి జరిగిన అన్యాయంపై నినదించాలన్నారు. అందరూ ఐక్యమై ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచి, ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా సాధించుకోవాలన్నారు. 
పి.మధు..
రాష్ట్రానికి రాజధాని లేదు. కొన్ని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారు. విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు..కానీ వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదు. నాలుగేళ్లు గడిచినా ప్రత్యేకహోదా ఇవ్వలేదు, విభజన చట్టంలోని హామీలు అమలు జరుపలేదు. ప్రత్యేకహోదా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. 
వర్ల రామయ్య
ఏపీకి అన్యాయం జరిగింది. ప్రత్యేకహోదా ఇవ్వాలి. స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రం తప్పటడుగు వేసింది. బీజేపీ అసత్యప్రచారం చేస్తోంది.   
తమ్మారెడ్డి భరద్వాజ
ఏపీకి అన్యాయం జరిగిందని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ అంటున్నాయి. అందరూ కలిసి ఒకతాటిపైకి రావాలి. ప్రత్యేకహోదా సాధించుకోవాలి. ఒక కన్ క్లూజన్ కు రావాలి.. ప్రత్యేకహోదా కోసం ఏం చేయాలో ఆలోచించాలి. 
జంగా గౌతమ్
సీపీఎం ఒక్కటే స్పష్టమైన వైఖరి తీసుకుంది. సమైక్య అంధ్రకు మద్దతు తెలిపింది. రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాలు ముఖ్యం. బీజేపీ, టీడీపీ తిట్టుకోవడం అసహ్యంగా ఉంది. రాష్ట్రాన్ని కాపాడండి.
అంబటి రాంబాబు 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. 
బీజేవైఎం నేత విష్ణువర్ణన్ రెడ్డి 
రాష్ట్ర విభజన విషయంలో సీపీఎం ఒక్కటే స్పష్టంగా ఉన్నది. సమైక్య రాష్ట్రానికి మద్దతు పలికారు.
లాయర్ రాజేంద్రప్రసాద్..
లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడవద్దు. పిల్లల భవిష్యత్ ను నాశనం చేయొద్దు. రాజకీయాలు పక్కకు పెట్టి, అందరూ ఏకమై పోరాడాలి. 
శాంతి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. పిల్లలకు అన్యాయం చేయొద్దు. ప్రత్యేకహోదా కావాలి. తల్లిపిల్లలం కలిసి పోరాటం చేస్తాం.  
రమేష్
బీజేపీ ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉందో లేదో తెలపాలి. బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేకహోదా ఇవ్వాలి. 
కేఎస్ లక్ష్మణ్ రావు... 
రాష్ట్రంలోని 13 జిల్లాలో 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని గుర్తించారు. 13వ షెడ్యూల్ అత్యంత ఇంపార్టెంట్ షెడ్యూల్. బీజేపీ, టీడీపీ ప్రజలను వంచించారు. పార్టీలను వంచాలంటే.. ప్రజా ఉద్యమాలు చేయాలి అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఈనెల 27న సీఎం కేసీఆర్ సింగరేణి యాత్ర

హైదరాబాద్ : ఈనెల 27న సీఎం కేసీఆర్ సింగరేణి యాత్ర చేయనున్నారు. మంచిర్యాలలోని శ్రీరాంపూర్ లోని గనుల ప్రాంతంలో పర్యటించనున్నారు. సింగరేణి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

20:53 - February 24, 2018
20:51 - February 24, 2018

కర్నూలు : జిల్లాలోని పత్తికొండలో దారుణం చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఓ వృద్ధుడిని శ్మశానంలో వదిలి వెళ్లారు కుటుంబసభ్యులు. వృద్ధుడి రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో భారమని భావించి శ్మశానంలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నారు. 

 

20:48 - February 24, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని యలమంచలిలో చిటీల పేరుతో సత్యనారాయణ అనే వ్యక్తి 4 కోట్లతో ఉడాయించాడు. వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడి అని జనాన్ని నమ్మించి  మోసం చేశాడు. 5 నెలల క్రితం పాలకొల్లులో లేడీస్‌ టైలరింగ్ షాప్ పెట్టి.. ఇప్పుడు అనారోగ్యం పేరుతో పారిపోయాడని బాధితులు తెలిపారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని పొదుపు చేసి పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం.. దాచుకున్నామని బాధితులు లబోదిబోమంటున్నారు. మోసంపై బాధితులు పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. 

 

20:45 - February 24, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని మల్కాజిగిరి మౌలాలీలోని గాంధీ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. చాక్లెట్‌ ఆశ చూపి చిన్నారులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు యువకులు యత్నించారు. పిల్లలను ఎత్తుకొని పారిపోతుండగా చిన్నారులు అరవడంతో స్థానికులు యువకులను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

 

20:38 - February 24, 2018

విశాఖ : పెట్టుబ‌డులు ఆక‌ర్షించే రాష్ట్రంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నెంబ‌ర్‌వ‌న్‌ స్థానంలో ఉంద‌ని ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప‌ర‌కాల ప్రభాకర్‌ అన్నారు. పెట్టుబడుల సదస్సు ద్వారా ఆసియా ఖండంలోనే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రంలో ఏపీ ఉందన్నారు. ఇప్పటికే దేశవిదేశాల నుండి అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల కన్నా విభిన్న ఆలోచనలతో ఏపీ ప్రభుత్వం పన్నులు, రాయితీ కల్పిస్తోందంటున్న పరకాల ప్రభాకర్‌తో 10 టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈసారి రూ.3లక్షల కోట్ల విలువైన ఎమ్‌ఓయులు కుదుర్చుకునే అవకాశముందని చెప్పారు.

 

20:21 - February 24, 2018

జీహెచ్ ఎంసీ స్కామ్ లో మరొకరు అరెస్టు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ స్కామ్ లో మరొకరు అరెస్టు అయ్యారు. ట్రాన్స్ పోర్ట్ వింగ్ ఏఈ కిషోర్ ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 

ఐదో టీ20లో భారత మహిళా జట్టు గెలుపు

 హైదరాబాద్ : ఐదో టీ20లో భారత మహిళా జట్టు గెలుపొందింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత మహిళ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 112 పరుగులకు ఆలౌట్ అయింది.

సీఐఐ భాగస్వామ్య సదస్సులో పలు ఒప్పందాలు

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సులో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆటో మొబైల్ రంగంలో 15 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో రూ.15,224 కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో పరిశ్రమల ద్వారా 57 వేల మందికి ఉపాధి కల్పన కలగనుంది. 

19:35 - February 24, 2018

విశాఖ : సీఐఐ సదస్సులో కీలక అడుగు పడింది. పెట్టుబడులను ఆకర్శించేందుకు సీఎం చంద్రబాబు డిలిగేట్స్‌తో సమావేశమయ్యారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రికల్‌ రంగాలతో పాటుగా ఇతర రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పలు కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

 

19:31 - February 24, 2018

విశాఖ : సంస్కరణలతో భారత్‌ ఆర్థిక పురోగతి సాధిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన.. నోట్ల రద్దు, జీఎస్టీ సాహసోపేత నిర్ణయాలన్నారు. నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ మొత్తం బ్యాంకులకు తిరిగివచ్చిందన్నారు. ఇన్‌కం టాక్స్‌ కట్టేవారి సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఒకే దేశం ఒకే పన్ను ఉండాలన్న లక్ష్యంతో జీఎస్టీ తెచ్చారని.. దీని సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. ఇండస్ట్రీల అనుమతుల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదని వెంకయ్యనాయుడు అన్నారు. 

18:52 - February 24, 2018

హైదరాబాద్ : చిక్కడపల్లి  పీఎస్ పరిధిలోని అశోక్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహ ఎన్ క్లీవ్ అపార్ట్ మెంట్లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న మొగులప్ప.. తన భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో భార్యను పొడిచిచంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

18:48 - February 24, 2018

విశాఖ : భారత్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌లు ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని సీఐఐ ప్రెసిడెంట్‌ శోభనా కామినేని అన్నారు. టెక్నాలజీ ఉపయోగంతో పారిశ్రామిక విప్లవం సాధించవచ్చని ఆమె అన్నారు. సాంకేతికతతో కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. 2025 నాటికి భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

18:44 - February 24, 2018

విశాఖ : భావనాపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని... అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ పోర్టు నిర్మాణానికి 8వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో అదానీ పాల్గొన్నారు. భావనపాడుతో పాటు... సౌర విద్యుత్‌ రంగంలోనూ వేయి కోట్ల పెట్టుబడులు పెడతామని ఆయన ప్రకటించారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు అనుకూలంగా ఉన్నాయని... అదానీ ప్రశంసించారు. 

 

18:39 - February 24, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు స్వర్గదామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సైతం ఆకర్శిస్తున్నామని చెప్పారు. గత సీఐఐ సదస్సు కన్నా ఈసారి పారిశ్రామిక వేత్తల స్పందన బాగుందని సీఎం అన్నారు. 2022 వరకు దేశంలో మూడోస్థానంలో.. 2029 వరకు దేశంలో నెంబర్‌వన్‌ స్థానం సాధించడమే ఏపీ లక్ష్యమన్నారు. 2050 వరకు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపుపొందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఏపీ రెండంకెల గ్రోత్‌రేట్‌ సాధించడం పట్ల చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
వ్యవసాయం తర్వాత ఇండస్ట్రీ, సర్వీస్‌ సెక్టార్‌పైనే ప్రధాన దృష్టి : చంద్రబాబు
వ్యవసాయం తర్వాత తమ ప్రధాన దృష్టి ఇండస్ట్రీ, సర్వీస్‌ సెక్టర్‌పైనే ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. అలాగే కోస్టల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్‌పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. మూడున్నరేళ్లలో ఆటోమోబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌, హెల్త్‌కేర్‌, ఇంజినీరింగ్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. మూడున్నరేళ్లలో వివిధ కంపెనీలతో 1946 ఎంవోయూలు కుదుర్చుకున్నామని.. 13 లక్షల 54 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 31 లక్షల మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు తెలిపారు. 

 

18:03 - February 24, 2018

జీఎస్టీని కేవలం కేంద్రం, ఒక పార్టీ నిర్ణయించలేదు : ఉప రాష్ట్రపతి

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని, ప్రసంగించారు. జీఎస్టీని కేవలం కేంద్రం, ఒక పార్టీ నిర్ణయించలేదని.. అన్ని రాష్ట్రాలు పలుమార్లు సమావేశమై ఏకగ్రీవ అంగీకారానికి వచ్చాయని పేర్కొన్నారు. జీఎస్టీ అమలుకు దాదాపు 21 భేటీలు నిర్వహించారని గుర్తు చేశారు.

నోట్ల రద్దు ప్రధాని చేపట్టిన అతి పెద్ద ఆర్థిక సంస్కరణ : ఉప రాష్ట్రపతి

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని, ప్రసంగించారు. నోట్ల రద్దు ప్రధాని చేపట్టిన అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అని పేర్కొన్నారు. దాచి ఉంచిన నల్లధనాన్ని బ్యాంకులకు చేర్చడమే నోట్ల రద్దు ఉద్దేశమన్నారు. నోట్ల రద్దు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు దిగివస్తాయని తెలిపారు. 

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని, ప్రసంగించారు. దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోందని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. 

17:54 - February 24, 2018

విశాఖ : దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోందని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని, ప్రసంగించారు. నోట్ల రద్దు ప్రధాని చేపట్టిన అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అని పేర్కొన్నారు. దాచి ఉంచిన నల్లధనాన్ని బ్యాంకులకు చేర్చడమే నోట్ల రద్దు ఉద్దేశమన్నారు. నోట్ల రద్దు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు దిగివస్తాయని తెలిపారు. జీఎస్టీని కేవలం కేంద్రం, ఒక పార్టీ నిర్ణయించలేదని.. అన్ని రాష్ట్రాలు పలుమార్లు సమావేశమై ఏకగ్రీవ అంగీకారానికి వచ్చాయని పేర్కొన్నారు. జీఎస్టీ అమలుకు దాదాపు 21 భేటీలు నిర్వహించారని గుర్తు చేశారు.

 

పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం : సీఎం చంద్రబాబు

విశాఖ : రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్రంలో మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈ సారి సదస్సుకు స్పందన బాగుందని తెలిపారు. 

రాష్ట్రంలో మూడోసారి భాగస్వామ్య సదస్సు : సీఎం చంద్రబాబు

విశాఖ : ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్రంలో మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈ సారి సదస్సుకు స్పందన బాగుందని తెలిపారు.

17:20 - February 24, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్రంలో మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈ సారి సదస్సుకు స్పందన బాగుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయంలో గణనీయ వృద్ధి రేటు సాధిస్తున్నామని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో 13.8 శాతం లోటు వర్షపాతం నమోదు అయిందని చెప్పారు. నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాశ్వత కన్వెన్షన్ కేంద్రం, షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

 

13 లక్షల 54 వేల పెట్టుబడులు వచ్చాయి : సీఎం చంద్రబాబు

విశాఖ : విశాఖ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానమన్నారు. ఏపీకి 13 లక్షల 54 వేల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

 

విశాఖ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించిన సీఎం చంద్రబాబు

విశాఖ : విశాఖ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానమన్నారు. 

15:37 - February 24, 2018
15:25 - February 24, 2018
15:22 - February 24, 2018
15:07 - February 24, 2018
13:40 - February 24, 2018

హైదరాబాద్ : గత మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త పథకాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌. హెదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఏషియా సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పారిశ్రామిక, ఐటీ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని కేటీఆర్‌ వివరించారు. టీహబ్‌తో రాష్ట్రంలో కొత్తపారిశ్రామిక వేత్తలనుప్రోత్సహిస్తున్నామన్నారు. అటు ఫార్మా రంగంలోనూ భవిష్యత్తులో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. మెడికల్‌ డివైజిస్‌ తయారీ పరిశ్రమలను కూడా ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి తెలంగాణకే కాదు.. ఐటీరంగంతోపాటు, ఫార్మా, మెడికల్‌డివైజస్‌, జినోవ్యాలీ ప్రాజెక్టు దేశం మొత్తానికి గర్వకారణంగా ఉంటోందన్నారు.

13:40 - February 24, 2018

విశాఖ: భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు అధ్బుతంగా ఉన్నాయన్నారు.. కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు. సదస్సులో కార్యక్రమాలు పారిశ్రామిక ప్రతినిధులను ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఫలితాలను ఇస్తాయన్నారు. దేశంలో విమానయానాన్ని బాగా పెంచగలిగామని, చిన్న చిన్న పట్టణాలకు కూడా రాబోయే ఐదేళ్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

13:18 - February 24, 2018

ఏపీతో 49 అవగాహన ఒప్పందాలు

విశాఖ : భాగస్వామ్య సదస్సులో పర్యాటకశాఖకు శుభారంభం కల్గింది. పర్యాటకరంగం నుంచి రూ.8వేల కోట్ల విలువగల ప్రాజెక్టులకు సంబంధించి 49 అవగాహన ఒప్పందాలు జరిగాయి. 

హయత్ నగర్ లో విషాదం

హైదరాబాద్ : హయత్ నగర్ పీఎస్ లో పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ నిర్మాణ పనుల్లో కార్మికుడు మృతి చెందాడు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మన్యంగా పోలీసులు గుర్తించారు. 

తెలంగాణ ఇంటర్ పరీక్షల సెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి మార్చి 14వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,294 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,63,546 మంది విద్యార్థులు పరీక్ష రానున్నారు.  

12:10 - February 24, 2018

కరీంనగర్ : జిల్లాలో విద్యుత్‌షాక్‌ తగిలి ఎలుగుబంటి మృతి చెందింది. కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయబావి వద్ద నీరుతాగడానికి ప్రయత్నించడంతో విద్యుత్‌షాక్‌ తగిలినట్టు స్థానికులు చెబుతున్నారు. గ్రామశివారు ప్రాంతంలోని గుట్టల్లో కొంతకాలం మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతుండటంతో భయంతో ఎలుగుబంటి అడవి నుంచి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి మృతిపై వివరాలు సేకరిస్తున్నారు. 

12:08 - February 24, 2018

అనంతపురం : రాష్ట్రాలో 19లక్షల ఇళ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు మంత్రి కాల్వశ్రీనివాసులు. ఇప్పటికే 13 లక్షల ఇళ్ల నిర్మాణా సాగుతోందన్నారు. పక్షంరోజుల టార్గెట్‌పెట్టుకుని 3లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాడానికి సమీక్ష లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు కూడా పాల్గొనేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 12వ తేదీ లోపుగా 13జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తామన్నారు.

12:06 - February 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అక్రమాల‌కు తావు లేకుండా.. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రకటించింది. పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నా... కొందరు అక్రమార్కులు అడ్డంకులు కలిగిస్తున్నారు. కల్తీ ఇసుకతో ప్రభుత్వ పథకాని తూట్లు పొడుస్తున్నారు.

గ్రేట‌ర్‌లో 109 ప్రాంతాల్లో
డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను ప్రభుత్వం సిరిసిల్ల..., కాళేశ్వరంలోని ఇసుక రీచ్‌ల‌ నుంచి అందిస్తోంది. గ్రేట‌ర్‌లో 109 ప్రాంతాల్లో నిర్మిస్తున్న... ల‌క్ష డ‌బుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల కోసం ఇసుకను సప్లై చేస్తోంది. నిర్మాణంలో ఉన్న 89వేల ఇళ్లకోసం త‌ర‌లిస్తున్న ఇసుక కొన్ని చోట్ల ప‌క్కదారి ప‌డుతోంది. ఈమేరకు సమాచారం అందుకున్న సిరిసిల్ల కలెక్టర్ నాలుగు లారీల‌ను సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా, కల్తీని అడ్డుకునేందుకు సిరిసిల్ల కలెక్టర్‌ నడుం బిగించారు. ఇప్పటి వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించిన ఇసుకకు యుటిలిటీ స‌ర్టిఫికేట్ ఇవ్వాల‌ని అధికారుల‌ు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఐతే బ‌ల్దియా ఇంజ‌నీర్లు ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. కలెక్టర్‌ ఆదేశాలతో అక్రమార్కులు దిక్కుతోచని స్థితిలో పడడంతో ఇసుక ర‌వాణా ఆగిపోయింది.

నిర్మాణ పనులకు బ్రేక్...
ఇసుక ర‌వాణా ఆగడంతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది.. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ప‌నులు నిలిచిపోయాయి.... మ‌రికొన్ని చోట్ల అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నిబంధన‌లకు పాత‌రేస్తున్నారు. పూర్తిగా డ‌స్ట్‌తో కూడిన రాక్ శాండ్‌ను సరఫరా చేస్తున్నారు.. ఇంకొన్ని చోట్ల ఇసుక‌ను కంక‌ర క్రష‌ర్ల నుంచి వ‌చ్చిన‌ డ‌స్ట్ శాండ్ ను మిక్స్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈస్ట్ జోన్ ప‌రిధిలో చివ‌రి దశకు చేరుకున్న ఇళ్లకు ప్లాస్టింగ్ చెయ్యడానికి సరైన ఇసుక లేక ప‌నులు నిలిచిపోయాయి. పెద్దఎత్తున ఇసుక రవాణాలో అక్రమాలు జరిగినా... అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆ సమస్య పరిష్కారమైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చెప్పారు.. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాల నాణ్యత విష‌యంలో రాజీ పడేది లేదని అధికారులు అంటున్నారు.. ఎవరైనా నిబంధన‌లు అతిక్రమిస్తే చ‌ర్యలు త‌ప్పవ‌ని హెచ్చరిస్తున్నారు. పేదలకు సాయం చేసే నాథుడే లేని కాలంలో... ఈ ఇసుక మాఫియా ప్రభుత్వా పథకానికి తూట్లుపొడుస్తోందని ప్రజానీకం మండిపడుతోంది. అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

12:05 - February 24, 2018

ఆసిఫాబాద్ : ఇంటర్‌నెట్‌ యుగంలోనూ లెటర్‌ అందని ఇంటిని ఒక్కటైనా చూశారా... కానీ శుభవార్త, దుర్వార్త, ఉద్యోగ నియామకం, ఇన్సూరెన్స్‌ డబ్బులు, భూముల దస్తావేజులు ఇలాంటి పత్రాలేవైనా సరే... పోస్ట్‌ ద్వారా అందుకోలేని చీకటి యుగంలో ఉన్నారు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట గ్రామస్థులు. గత మూడేళ్ళుగా తపాలా ద్వారా ఎలాంటి సమాచారం అందుకోలేని చీకటియుగంలో బతుకుతున్నారు వారంతా. గత మూడేళ్ళుగా తపాలా ద్వారా తమకెలాంటి ఉత్తరాలు రాలేదనే అనుకుంటున్నారు చిర్రగుంట గ్రామస్థులు. కానీ దీని వెనుక విస్తుబోయే వాస్తవం ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడికి వచ్చే ఉత్తరాలు చెత్తకుప్పల్లో చేరుతున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు ఇంకో వాదన వినిపిస్తున్నారు.. తపాలా ద్వారా వచ్చిన ఉత్తరాలతో పాటు ఇతర సర్టిఫికెట్లను పోస్టల్‌ సిబ్బంది గోనె సంచిల్లో నింపి దాస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ సిబ్బంది స్నేహితుల, బంధువుల ఇళ్ళలో భద్రపరుస్తున్నట్లు సమచారం.

యువత భవిష్యత్ గాల్లో దీపంలా
ఆ ఊరి యువత భవిష్యత్ గాల్లో దీపంలా మారింది.. ఓ యువకుడికి ఇండియన్‌ నేవీలో ఉద్యోగం వచ్చినా కాల్‌లెటర్‌ అందించని దుస్థితిలో అక్కడి పోస్టల్‌ వ్యవస్థ ఉంది. అమూల్యమైన, అపురూపమైన ఉత్తరాలు, దస్తావేజులు చేరాల్సిన చోటుకు చేరకుండా పోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.ఇంతకీ ఉత్తరాల ముఖం చూసే అదృష్టం తమకు కలుగుతుందో లేదో అన్న బెంగతో ఉన్నారు ఆ ఊరి ప్రజలంతా... ప్రపంచమే కుగ్రామంగా మారిన డిజిటల్‌ యుగంలో... సరైన పోస్టల్‌ వ్యవస్థలేని గ్రామాలున్నాయంటే ప్రభుత్వాలకు, నాయకులకు సిగ్గుచేటు. చిర్రగుంట గ్రామానికి ఉత్తరాలు చేరవేయడంలో పోస్టల్‌శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా తపాలాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆ గ్రామానికి వచ్చే ఉత్తరాలను ప్రజలకు చేరవేయాలని కోరుతున్నారు. 

గాయపడ్డ యాకయ్య మృతి

జనగామ : జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో పెట్రోల్ దాడిలో గాయపడ్డ యాకయ్య మృతి చెందాడు. యాకయ్యతో పెళ్లి ఇష్టంలేక వధువు అరుణ హత్యకు కుట్రపన్ని యాకయ్యపై తనకు వరసకు సోదరుడైన బాలస్వామితో పెట్రోల్ దాడి చేయించింది.

11:35 - February 24, 2018

జనగామ : జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో పెట్రోల్ దాడిలో గాయపడ్డ యాకయ్య మృతి చెందాడు. యాకయ్యతో పెళ్లి ఇష్టంలేక వధువు అరుణ హత్యకు కుట్రపన్ని యాకయ్యపై తనకు వరసకు సోదరుడైన బాలస్వామితో పెట్రోల్ దాడి చేయించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:30 - February 24, 2018

హైదరాబాద్ : అంబర్ పేటలో దారుణం జరిగింది. ఓ యువకున్ని స్నేహితులు కత్తులతో పొడిచారు. బాపు నగర్ లో రిటైర్డ్ సీఐ కుమారుడు ఇమ్రాన్ అతని స్నేహితులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చావుబతుకుల మధ్య ఉన్న ఇమ్రాన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

కృష్ణాలో రైతు ఆత్మహత్య

కృష్ణా : గంపలగూడెం మండలం తెలువలనులో విషాదం చోటుచేసుకుంది. అప్పుబాధతో కౌలు రైతు వెంకయ్య(40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎరువుల షాపు యజమాని బోనపాటి మురళి అప్పు తీర్చాలంటూ వేధించడంతో వెంకయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఎరువుల షాపు ఎదుట  బంధువులు ఆందోళనకు దిగారు. 

10:23 - February 24, 2018

విశాఖ : నేటినుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమ్మిట్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమ్మిట్‌లో 14 దేశాల వాణిజ్యమంత్రులు, 60 దేశాల నుంచి వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

10:22 - February 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ లో టీఆర్టీ ఎగ్జామ్‌ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 4వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండగా అభ్యర్థులు 9గంటలకు ఎగ్జామ్‌సెంటర్‌కు చేరుకున్నారు. 9.15 నుంచి లోపలికి అనుమతించిన అధికారులు.. ఓ 5 నిముషాలు లేట్‌గా వచ్చిన వారిని కూడా లోపలికి అనుమతించారు. దీంతో పరీక్షకు ఆలస్యంగా వచ్చి టెన్షన్‌ పడుతున్న అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి మొత్తం 8వేల 792 పోస్టులకు 2లక్షల 77వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:20 - February 24, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పరిధిలో జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 79 కేసులను నమోదు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 2గంటల వరకు ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న ఓ యువతి పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. నోటికి వచ్చినట్టు తిడుతూ మరోకారులో తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల సందర్భంగా పోలీసులపై మందుబాబులు తిరగబడుతుండటంతో ఈసారి ఎస్పీఓ పోలీసులను రంగంలోకి దించారు. దాంతోపాటు మహిళా పోలీసులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొనడంతో నిందితులను ఈజీగా హ్యాండిల్‌ చేయగలిగామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 6 చోట్ల నిర్వహించిన తనిఖీల్లో 49 టూ, 2 ఆటోలు, 28 కార్లను సీజ్‌చేశారు. 

10:20 - February 24, 2018

హైదరాబాద్ : అత్తాపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పడడం కలకలం సృష్టించింది. ట్యాంకర్‌ బోల్తా పడడంతో పెట్రోల్‌ రోడ్డుపై వృధాగా పోయింది. పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పడడంతో స్థానికులంతా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందస్తుగా అత్తాపూర్‌ రోడ్డును మూసివేసి వాహనదారులను దారి మళ్లించారు. 

అనంతలో యువకుడి దారుణ హత్య

అనంతపురం : జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. గార్లదిన్నెలో బైక్ వెళ్తున్న రాజశేఖర్ ను వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపారు. అనంతరు నింధితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తుంది. 

10:11 - February 24, 2018

అనంతపురం : జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. గార్లదిన్నెలో బైక్ వెళ్తున్న రాజశేఖర్ ను వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపారు. అనంతరు నింధితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మధిర రైల్వేస్టేషన్ లో బాంబు కలకలం

ఖమ్మం : జిల్లా మధిర రైల్వేస్టేషన్ లో బాంబు పుకార్లు కలకలం రేగింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్టు ఫోన్ కాల్ రావడంతో రైల్వేస్టేషన్ లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన రెండు బాక్స్ లు, ఓ చేతిసంచి స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్ దూరంగా తీసుకెళ్లి పరీక్షించారు.

09:22 - February 24, 2018

ఖమ్మం : జిల్లా మధిర రైల్వేస్టేషన్ లో బాంబు పుకార్లు కలకలం రేగింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్టు ఫోన్ కాల్ రావడంతో రైల్వేస్టేషన్ లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన రెండు బాక్స్ లు, ఓ చేతిసంచి స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్ దూరంగా తీసుకెళ్లి పరీక్షించారు. చివరికి అది బాంబు కాదని తేల్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో టీఆర్టీ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్టీ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు మొదటి పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రెండవ పరీక్ష జరగనుంది.

09:12 - February 24, 2018

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్టీ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు మొదటి పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రెండవ పరీక్ష జరగనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు : జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. సి.వి రామన్ జూనియర్ కళాశాలో ఇంటర్ చదువుతున్న నాజీమున్నీసా తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. 

09:08 - February 24, 2018

కర్నూలు : జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. సి.వి రామన్ జూనియర్ కళాశాలో ఇంటర్ చదువుతున్న నాజీమున్నీసా తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

యాదాద్రి : లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైవభంగా కొనసాగుతున్నాయి. నేడు బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు తిరుకల్యాణోత్సవం జరగనుంది. స్వామివారికి పట్టువస్త్రాలు మంత్రి సమర్పించనున్నారు. 

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 79 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

07:20 - February 24, 2018

రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఆవేదన కల్గించే విధంగా ఉందని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదని, స్వామినాథన్ కమిషన్ సూచించిన సిఫార్సులను ప్రభుత్వాలు పాటించడంలేదని, దీని వల్ల రైతుల సంక్షోభంలో కూడుకుపోయే ప్రమాదం ఉందని, రుణా మాఫీ కూడా కొన్ని చోట్లు జరగలేదని ప్రముఖ విశ్లేషకులు వినయ్ అన్నారు. ప్రస్తుత పరిస్థతిల్లో రైతులకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్నారని, రైతులకు రుణా మాఫీ ఏకాలంలో జరిగితే వారి కొంచెం ఉపశమనం కలిగి ఉండేదని, మార్కెట్ వ్యవస్థ కూడా సరిగా లేదని బీజేపీ జనరల్ సెక్రటరీ ఆచారి అన్నారు. రాష్ట్రంలో కందుల మద్దతు ధర ఇచ్చి కొన్నామని, దేశంలో ఒక్కోచోట పంట చేతికి వస్తుందని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

నేడు నాగర్ కర్నూలులో మంత్రి హరీష్ పర్యటన

నాగర్ కర్నూలు : జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఆయన కొల్లపూర్ నియోజవర్గంలో గోదాములను ప్రారంభించనున్నారు. 

06:54 - February 24, 2018

డర్బన్ : టీ20 సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు టీమిండియా,సౌతాఫ్రికా సై అంటే సై అంటున్నాయి. ఆఖరి టీ20కి కేప్‌టౌన్‌లో రంగం సిద్ధమైంది.తొలి టీ20లో టీమిండియా తిరుగులేని విజయం సాధించింది.డూ ఆర్‌ డై సెకండ్‌ టీ20లో సౌతాఫ్రికా జట్టు సంచలన విజయం సాధించింది.సఫారీ గడ్డపై తొలి సారిగా టీ20 సిరీస్‌ నెగ్గాలని టీమిండియా పట్టుదలతో ఉండగా...సెకండ్‌ టీ20 విజయంతో జోరు మీదున్న సౌతాఫ్రికా సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 12 టీ20ల్లో పోటీ పడగా...భారత్‌ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది.5 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది.సౌతాఫ్రికాలో తొలి టీ20 సిరీస్‌ నెగ్గాలంటే మాత్రం ఆఖరి టీ20లో టీమిండియా అంచనాలకు మించి రాణించాల్సిందే.

06:51 - February 24, 2018

మహబూబ్ నగర్ : సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో.. ఈనెల 25న మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ జరగనుంది. స్థానిక జడ్పీ మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను బీఎల్‌ఎఫ్‌ వైస్ ఛైర్మన్ జలజం సత్యనారాయణ, సీపీఎం నేతలు పరిశీలించారు. సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరు కానున్నారు. బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని నేతలు తెలిపారు.

06:51 - February 24, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం ఇంటర్‌బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల 26వేల 891 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 5 లక్షల,9వేల 898 మందికాగా.... మరో 5లక్షల 16వేల 993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1423 పరీక్ష కేంద్రాలను ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసింది. 116 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
ఇంటర్‌ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతించరు. ఇక పరీక్ష కేంద్రాలు విద్యార్థులు తెలుసుకునేందుకు ఇంటర్‌బోర్డు ఓ యాప్‌ను రూపొందించింది. ఎగ్జామ్‌సెంటర్‌ అడ్రస్‌ తెలియని విద్యార్థులు IPE Centre locator app డౌన్లోడ్ చేసుకుంటే, సులువుగా తెలుసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే.. 18002749868 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌చేసి తెలుసుకోవచ్చు. 

06:49 - February 24, 2018

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణా రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ4 నిందితుడు, టీడీపీకి సన్నిహితుడు అయిన జెరూసలెం మత్తయ్య అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు
గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టీడీపీ యత్నించింది. అందులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ వీడియోలు బయటికి రావడంతో పెనుదుమారం రేగింది... దీనికి తోడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌ సంభాషణలు చేసినట్టు చెబుతున్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో ఓటుకు నోటు కేసు రెండు రాష్ర్టాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య.. తనకు కేసుతో సంబంధమే లేదని చెప్తున్నారు. తాను కేవలం క్రిస్టియన్ సమస్యల మీద చర్చించడానికే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ని కలిశానని తెలిపారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.... హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి ఆయన ఆరోపణలు చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు... తనను హత్య చేయడానికి యత్నిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

హైకోర్టులో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు
ఈ కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సహకరించిందని.. కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో ఎవరూ సాయం చేయడంలేదని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీ ఇన్ పర్సన్ గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. తనకు తెలిసిన విషయం మొత్తం కోర్టుకు వివరిస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసుతో పాటు ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. రెండు కేసుల్లోని రహస్యాలను సీబీఐ వెలికితీయాలని' మత్తయ్య సుప్రీంకోర్టు సీజేకు విన్నవించారు.మత్తయ్య అప్రూవర్‌గా మారతానంటూ సీజేకు లేఖ రాయడంతో ఇంతకీ ఈ కేసులో ఏంజరగబోందన్న ఉత్కంఠ నెలకొంది. మత్తయ్య అప్రూవర్‌ ఐతే పరిస్థితేంటి.. ఇంతకీ మత్తయ్యను చంపేందుకు ఎవరు యత్నిస్తున్నారు. ఆయన ఆరోపణల్లో నిజమెంత.. అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

06:47 - February 24, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పాస్‌పుస్తకాల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. అనేక పీఠముడులు ఉన్న భూరికార్డులు, తగాదాల నెలకొన్నా వాటన్నింటిని పరిష్కరించింది రెవెన్యూ అధికారయంత్రాంగం. రేయింబవళ్లు ఎంతో శ్రమకోడ్చి భూరికార్డు ప్రక్షాళన విజయంతం చేశారు. దీంతో వారికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

అసైన్డ్‌ భూములు కలిగిన వారికి కూడా
అసైన్డ్‌ భూములు కలిగిన వారికి కూడా కచ్చితంగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇక వ్యవసాయ భూమి కలిగిన రైతులకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే... ఆ వివరాలు కూడా పాస్‌పుస్తకంలో నమోదు చేయాలన్నారు. ఇందుకోసం అదనపుకాలమ్‌ పెట్టాలని సూచించారు. పాస్‌పుస్తకానికి ఆధార్‌కార్డు నెంబరు కూడా కచ్చితంగా అనుసంధానం చేయాలని ఆదేశించారు. మార్చి 11 తేదీనే పట్టాదారు పాస్‌పుస్తకాలన్నీ పంపిణీ చేసి తీరాలనే తొందరలో పొరపాట్లు జరగడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వవద్దని నిర్దేశించారు. భూరికార్డుల్లో ఆధార్‌కార్డు నంబర్‌ను కచ్చితంగా నమోదు చేయించుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయని భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందన్నారు. భూ రికార్డులకు ఆధార్‌కార్డు లింక్‌ చేయడానికి వెనుకాడుతున్న వారు ఇప్పటికైనా కచ్చితంగా ముందుకు రావాలని సూచించారు.

ధరణి వెబ్‌సైట్‌లో నమోదు
భూ ప్రక్షాళన తర్వాత వచ్చిన వివరాలన్నీ ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసే పని జరుగుతోందని కేసీఆర్‌ వివరించారు. ఆ వివరాల ఆధారంగానే కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. సొంత భూమి కలిగిన రైతులతోపాటు అసైన్డ్‌ చేసిన భూమిని సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు కూడా సేకరించాలని సూచించారు. అసైన్డ్‌ దారులకు కూడా భూమి యాజమాన్యం హక్కులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పాస్‌ పుస్తకాల్లో నమోదయ్యే వివరాలను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మొత్తానికి పట్టాదారు పాస్‌బుక్‌లను సకాలంలో అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 

06:46 - February 24, 2018

విశాఖ : ప్రపంచంలోనే పేరుగాంచిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వారి ప్రతినిధి బృందాలు హాజరయ్యే సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటి నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. సమ్మిట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు 500 మంది కార్మికులు ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. మధ్యాహ్నం 2.30కు భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో 14 దేశాల నుంచి
విశాఖ వేదికగా జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో 14 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు, 60 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరి కోసం ప్రధాన వేదికతోపాటు మరో ఐదు సమావేశమందిరాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వీటిల్లో 9 ప్లీనరీ సమావేశాలు, 8 సెక్టోరల్‌ సమావేశాలు, జపాన్‌, దక్షిణ కొరియా సదస్సులు జరుగనున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆశీనులయ్యేందుకు అనువుగా ఫర్నీచర్‌, సౌకర్యవంతమైన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎటు చూసినా సమ్మిట్‌ ప్రాంగణాన్ని పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు. పది ఎకరాలు విస్తీర్ణంలో తాత్కాలిక సమావేశమందిరాలు, చర్చలు జరిపేందుకు ప్రత్యేక గదులు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వేదికలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా కోసం కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సౌకర్యంతోపాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. జపాన్‌, కొరియా దేశాల నుంచి ప్రత్యేకంగా పారిశ్రామిక బృందాలు వస్తున్నాయి. దుబాయ్‌, యూఏఈలాంటి అరబ్‌ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్‌కు తరలివస్తున్నారు. దాదాపు 2వేల మంది వరకు విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరంతా నగరంలో ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విదేశాలకు చెందిన 18 మంది మంత్రులతోపాటు.. పదిమంది అంబాసిడర్లు కూడా భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్నారు.

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ సోదరుల బృందం
విశాఖ సమ్మిట్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ సోదరుల బృందం కూడా పాల్గొంటుంది. జీఎంఆర్‌ అధినేత మల్లికార్జునరావుతోపాటు మరికొంతమంది పారిశ్రామిక ప్రముఖులు వస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య ముఖ్య అథితిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్నారు. చంద్రబాబు ఈ ఉదయం విశాఖకు చేరుకుంటారు. దేశ, విదేశీ ప్రతినిధుల కోసం విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల దగ్గర ప్రభుత్వం అధికారులతో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది.ప్రపంచ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నేటి నుంచి 26 వరకు హార్బర్‌ పార్క్‌ రోడ్డులోని ఏపీఐఐసీ మైదానం వైపు వాహనాలను మళ్లించారు. పెదవాల్తేరు బస్‌డిపో కూడలి నుంచి కోస్టల్‌ బ్యాటరీ కూడలి వరకూ బీచ్‌రోడ్డులో ఎలాంటి వాహనాలను నిలపకూడదు. వాహన ప్రయాణాలను కూడా నిషేధించారు. స్థానిక నివాసితులంతా రాకపోకలు సాగించేందుకు బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయం వద్ద ఉన్న పోలీస్‌ అవుట్‌పోస్టు కార్యాలయంలో పాసులు ఇచ్చారు. మూడు రోజులపాటు జరిగే పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా పెట్టుబడులు భారీగా రాబట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పలు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది.

06:43 - February 24, 2018

డైరీ బాగా నడపాలంటే ముందుగా పశువులను సరిగా చూసి ఎంచుకోవాలని, డైరీ ఫామ్ పెట్టె చోట చెట్లు ఉండేట్లు చూసుకోవాలని, మనం డైరీ ఫామ్ పెట్టె ముందు స్థానికంగా ఉన్న పశువుల డాక్టర్ ను సంప్రదించాలని, డైరీ ఫామ్ ఖర్చు మానం ఎంచుకునే పశువులను బట్టి ఉంటుందని కేసిరెడ్డి మనోజ్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

నేటి నుంచి విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్

విశాఖ : నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. 

Don't Miss