Activities calendar

25 February 2018

21:30 - February 25, 2018

హైదరాబాద్ : రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సును హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డిని తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా దక్షిణ తెలంగాణ రైతు సమన్వయ సమితి తీర్మానించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

గిట్టుబాటు ధర కల్పించడమే
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌. భూ ప్రక్షళణ నేపథ్యంలో రాష్ట్రంలో కోటి 62 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం భారతదేశంలో ఇప్పటివరకు లేదని, రైతులకు మేలు చేసే పనులు చేపట్టాలని ప్రధాని కోరినట్లు సీఎం తెలిపారు. అయితే కేంద్రం నుండి ఎలాంటి సహకారం లభించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ మొత్తాన్ని నిజామాబాద్‌జిల్లాలోని అంకాపూర్‌ను మించి తీర్చిదిద్దాలని అప్పుడే రైతు సమన్వయ సమితులు విజయం సాధించినట్లని సీఎం చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత రాష్ర్ట ప్రభుత్వానిదే అన్నారు సీఎం. వ్యవసాయ క్షేత్రంలో రైతే రాజన్నారు. రైతులు బంగారు పంటలు పండించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి మండలానికి గోదాం నిర్మిస్తామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణ వచ్చాక వెయ్యి కోట్లతో 18 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాంలు నిర్మించామన్నారు. రైతు సమన్వయ సమితుల సూచన మేరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు అనువైన చోటు మార్కెట్ యార్డులు నిర్మిస్తామన్నారు. రైతు సమన్వయ సమితుల తొలి సదస్సులో 13 జిల్లాల నుండి రాష్ట్ర, మండల, జిల్లా సభ్యులు, సమన్వయ కర్తలు పాల్గొన్నారు. 

21:18 - February 25, 2018

విశాఖ : పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో ఏర్పాటు చేసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండవ రోజు కొనసాగింది. 50 దేశాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దాదాపు 500 మంది ఫారిన్‌ బిజినెస్‌ డిలిగేట్స్‌ హాజరయ్యారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే అంశంపై సీఎం చంద్రబాబు సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రానికి లక్ష ఎలక్ట్రానిక్‌ వాహనాలు తీసుకువస్తామన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందన్న సీఎం... రాష్ట్రంలో సోలార్, పవన విద్యుత్‌కు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో రాష్ట్రంలో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

పెట్టుబుడులకు ఆంధ్రప్రదేశ్‌ సురక్షితం
పెట్టుబుడులకు ఆంధ్రప్రదేశ్‌ సురక్షితమన్నారు సీఎం. అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని చెప్పారు.నవకల్పనకు ఏపీని ప్రయోగశాలగా చేసుకోవాలని పెట్టుబడిదారులను మంత్రి నారాలోకేష్‌ కోరారు. కొత్త ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని.. అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న 20 శాతం స్మార్ట్‌ ఫోన్లు రాష్ట్రంలోవే అని చెప్పారు. రిలయన్స్‌ సహకారంతో ఏపీలో సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని తీసుకువస్తే, తాము మేక్‌ ఇన్ ఆంధ్రప్రదేశ్‌ తీసుకువచ్చామన్నారు. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన పార్ట్‌నర్‌ షిప్‌ సమ్మిట్‌ సోమవారంతో ముగియనుంది.

 

21:03 - February 25, 2018

హైదరాబాద్ : శ్రీదేవి మృతిపట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'భారత సినీ రంగంలో శ్రీదేవి లాంటి నటి మరొకరు లేరు రారు అన్నారు. 'జగదేక వీరుడు-అతిలోక సుందరి'లో ఇంద్రజ పాత్ర తన కోసమే పుట్టిందా? అన్నట్లు నటించి మెప్పించిందన్నారు. శ్రీదేవితో తనకు కుటుంబ సాన్నిహిత్యమూ ఉందన్నారు చిరంజీవి. తెలుగులో శ్రీదేవి అత్యధికంగా 31 సినిమాల్లో తనతో నటించిందని కృష్ణ అన్నారు. శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఆయన అన్నారు. వైజయంతి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నిర్మాత అశ్వినీదత్‌ గుర్తు చేసుకున్నారు.

షాక్‌కు గురిచేసింది...
శ్రీదేవి మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని నటుడు రజనీకాంత్‌ అన్నారు. భారత దేశ చిత్రపరిశ్రమ మంచి నటిని కోల్పోయిందన్నారు. శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. శ్రీదేవి బాలనటిగా తనకు తెలుసని.. సినిమాల్లో అంకితభావంతో పనిచేసేవారని అన్నారు. శ్రీదేవీ మృతిపట్ల ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శ్రీదేవి మరణం వెండితెరకు తీరనిలోటన్నారు హీరో రజనీకాంత్‌. సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌. శ్రీదేవితో కలిసి నటించిన రోజులు గుర్తు చేసుకున్నారు నటి శారద. శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. శ్రీదేవి మృతికి మూవీ ఆర్టిర్ట్స్‌ అసోసియేషన్‌ సంతాపం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీదేవితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణతో నటనలో ఉన్నత శిఖరాలను ఎదిగిన నటి శ్రీదేవి అని ప్రస్తుతించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప నటి
నందమూరి తారకరామారావు తర్వాత అంతటి గొప్ప నటి శ్రీదేవి అని కోట శ్రీనివాసరావు అన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎందరో నటుల సరసన అద్భుతంగా నటించారన్నారు.అంతటి మహానటి మనకు దూరం కావడం తీరని లోటన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ... ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని కోటశ్రీనివాసరావు అన్నారు.శ్రీదేవి వెండితెరపై పోషించిన పాత్రలు చిరస్మరణీయమని రాజ్యసభసభ్యుడు టీజీ. వెంకటేష్‌ అన్నారు. కర్నూలులో శ్రీదేవి మృతికి సంతాపాన్ని తెలిపారు. బాలనటిగా నటజీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి అశేషంగా అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. నేటితరం నటీనటులు శ్రీదేవిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.అతిలోకసుందరి అంటే ఇలాగే ఉంటుందనేలా ముద్ర వేసిన అందాల తార శ్రీదేవి. ఆ గొప్పనటి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె నటించిన చిత్రాలు మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోతాయి. 

20:46 - February 25, 2018
20:44 - February 25, 2018

అవిశ్వాసం అనవసర ప్రక్రియని, విభజన హామీ అంశాల్లో 62 శాతం పూర్తైయ్యాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారని, విభజన హామీలు అమలు చేయడానికి 2022 వరకు ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విభజన హామీలు గురించి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏపీ ప్రభుత్వం-రిలయన్స్ గ్రూప్ మధ్య ఒప్పందం

విశాఖ : లో జరుతుగున్న పార్ట్ నర్ షిప్ సమ్మిట్  లో ఏపీ ప్రభుత్వం-రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్ గ్రూప్  దశలవారిగా ఏపీలో రూ.52 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు, పెట్రోలియం సహా ఇతర రంగాల్లో రూ.37 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. 

19:40 - February 25, 2018

శ్రీదేవి నాలుగు భాషల్లో వెలుగు వెలిగిన తార అని, ఆమె మరణం సినీలోకానికి తీరని లోటు అని రచయత నడుపల్లి సీతారామ శాస్త్రి అన్నారు. శ్రీదేవికి మిగతా వాళ్లకు చాలా తేడా ఉందని, అగ్రశ్రేణిలో శ్రీదేవి ఉంటుందని, ఉదయాన్నే ఆమె మరణ వార్త వినడం బాధకరమని తెలకపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:33 - February 25, 2018
18:17 - February 25, 2018

కృష్ణా : సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతోపాటు.. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలంటూ... విద్యుత్ కాంట్రాక్‌ కార్మికులు చేపట్టిన ఆందోళనను తీవ్రతరం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా కొనసాగిస్తున్న సమ్మెలో భాగంగా... ఆరవ రోజున విజయవాడ చిట్టినగర్ కూడలిలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు... ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే... ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

18:11 - February 25, 2018

విశాఖ : ఈ ప్రగతిలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టింది. విశాఖలో జరుగుతోన్న సీఐఐ సదస్సులో భాగంగా ఈ సేవలను రవాణా శాఖ మంత్రి అచ్చెం నాయుడు, కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ సేవల ద్వారా 70 రకాల రవాణా సేవలు ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉందంటున్నారు రవాణా శాఖ కమిషనర్‌. ఇవ్వాళ్టి నుండి ఈ సేవలు అందుబాటులో ఉంటాయంటున్నారు.

17:46 - February 25, 2018

చెన్నై : శ్రీదేవి మృతి పట్ల  కమల్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీదేవి చనిపోతుందని ఎవరు ఊహించలేదని ఆయన అన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకురాలని కోరుకున్నారు. 

17:44 - February 25, 2018

విశాఖ : కొత్త ఆలోచనలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందన్నారు మంత్రి నారాలోకేష్‌. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ఏపీ దూసుకుపోతుందన్నారు. రిలయన్స్‌ సహకారంతో ఏపీలో సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీ చేపడతామన్నారు. కేంద్రం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని తీసుకువస్తే, తాము మేక్‌ ఇన్ ఆంధ్రప్రదేశ్‌ తీసుకువచ్చామన్నారు. 

17:44 - February 25, 2018

విశాఖ : రాష్ట్రానికి లక్ష ఎలక్ట్రానిక్‌ వాహనాలు తీసుకువస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకు ఎమ్‌వోయూ కుదుర్చుకుంటున్నట్లు ఆయన CII సదస్సులో చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందన్న సీఎం.. రాష్ట్రంలో సోలార్‌, పవన విద్యుత్‌కు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో రాష్ట్రంలో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు.  

17:43 - February 25, 2018

హైదరాబాద్ : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ముషీరాబాద్‌ నియోజకవర్గలోని బోలక్‌పూర్‌ డివిజన్‌లో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా తయారు చేశారని గుర్తు చేశారు. మెట్రో రైలును టీడీపీ ప్రభుత్వం తీసుకువస్తే, ఐదేండ్ల జాప్యం తరువాత ఐదువేల కోట్లకు పెంచారని తెలిపారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నమ్మడం లేదని, మంత్రి కేటీఆర్‌ టీవీల్లో, ట్విట్టరులో కనిపిస్తూ టీటీఆర్‌గా మారరని రావుల విమర్శించారు.

17:42 - February 25, 2018

మహబూబునగర్ : సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్రను అడ్డుకొని, తిరగబడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు సూచించారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తమపై కూడా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అయినప్పటికీ పాదయాత్ర చేపట్టిన మాకు రాళ్ల దెబ్బలు వస్తాయనుకుంటే ఆశ్చర్యకరంగా పూలజల్లులు కురుస్తున్నాయన్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాబోయే కాలంలో బీఎల్‌ఎఫ్‌ లెఫ్ట్‌ పార్టీలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ మేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బహుజనుల రాజ్యాధికారం కోసం సాగుతోన్న ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు

17:40 - February 25, 2018

హైదరాబాద్ : పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు ప్రారంభానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు సమన్వయ సమితి ఆటం బాంబులాగా పనిచేయాలన్నారు. ప్రపంచంలో ఏదేశం చేయని విధంగా రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత రాష్ర్టప్రభుత్వానదే అన్నారు. ఈ సదస్సులో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, 13 జిల్లాల నుంచి తరలివచ్చిన మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల సభ్యులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

రాత్రికి ముంబై చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం

ముంబై : నటి శ్రీదేవి భౌతికకాయం రాత్రికి ముంబై చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం 2గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

నిరుద్యోగుల బతుకులు మారలేదు : తమ్మినేని

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల బతుకులు మారలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ 4 ఏళ్ల పాలనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆయన విమర్శించారు. 

16:45 - February 25, 2018
15:31 - February 25, 2018

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి సదస్సు కొనసాగుతోంది. దేశంలో ఎవరు నిర్మించని విధంగా తెలంగాణలో గోదాములు నిర్మించామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:04 - February 25, 2018

శ్రీదేవి మృతి పట్ల దర్శకుడు వర్మ దిగ్భ్రాంతి

హైదరాబాద్ : శ్రీదేవి మృతి పట్ల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేవుడిని ద్వేషించినంతగా మరే రోజు ద్వేషించలేదన్నారు. ఉజ్వలమైన వెలుగులను ఆర్పేశారు. బోనీకపూర్ కు తన హృదయపూర్వక సంతాపం తెలిపారు.

14:09 - February 25, 2018

హైదరాబాద్ : శ్రీదేవి పుట్టింది తమిళనాడులోనైనా తెలుగు ప్రేక్షకులకు ఆమె ఆరాధ్య దేవతైంది. ఆమెను తెలుగింటి ఆడపడుచుగానే ఆరాధించారు. తమ కలల రాణిగా శ్రీదేవిని పూజించారు. ఒకానొక దశలో శ్రీదేవి. లేని సినిమా లేదు...ఆమె లేని చిత్రాన్ని కూడా అభిమానులు ఊహించుకోలేకపోయారు. అంతలా అందరిని తబ్బిబ్బు చేసింది శ్రీదేవి.
రెండు తరాలతో నటించిన శ్రీదేవి
రెండు తరాలతో నటించి నెంబర్ వన్ స్థానంలో నిలబడటం కథానాయకులకే సాధ్యం అన్న ఒరవడిని బ్రేక్‌ చేసింది శ్రీదేవి. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు రెండు తరాలతో నటించగలరని నిరూపించింది.  అలా నటించి  అందరి మన్ననలు అందుకుంది ఈ సౌందర్య రాశి. అభిమానులకే కాదు తోటి నటీనటులకు కూడా శ్రీదేవి రోల్‌మోడల్‌ అనడంలో అనుమానమే లేదు.
సౌందర్య గని శ్రీదేవి 
కవితలు రాని వారిని సైతం కళాపిపాసులుగా మార్చేయగల సౌందర్య గని శ్రీదేవి. అందుకే రెండు తరాల కథానాయకుల సరసన నటించినా వన్నెతగ్గని అందం...కేవలం శ్రీదేవి సొంతం. పదహారేళ్ల వయసుకు పరువాలు తొడగాలన్నా....జాబిలితో ఊసులు చెప్పాలన్నా ఈ అతిలోక సుందరికే సాధ్యం. మాసు...క్లాసు అన్ని వర్గాల అభిమానులను మెప్పించి, మైమరపించి నేటికీ వారి మదిలో అద్భుత అందంగా ముద్ర వేసుకున్న అసమాన నటి శ్రీదేవి. ఒక్క అందంతోనే కాదు అంతకుమించిన అద్భుత నటనతో ఉత్తర దక్షిణ భారతాలను ఊపేసిన కథానాయికి శ్రీదేవి. సిరిమల్లె పువ్వు చిన్నబోయింది.. ఆమె అందాన్ని చూసి.. వెల్లువ గోదావరి ఎల్లాకిల్లా పడింది... ఆమె ఒంపులు చూసి ..బంగినపల్లి మామిడి పండు కోతకొచ్చింది.. ఆమె వయ్యారాలు చూసి.. ఆమె నవ్వు పంట చేలోని పాల ఎంకి నవ్వు... ఆ నవ్వుకు దాసోహం కాని వారు లేరు. ఆ అందానికి ప్రేమాభిషేకం చేయని వారూ లేరు. 
1963 ఆగస్టు 13న శ్రీదేవి జననం 
1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాసిలో పూసింది ఈ సిరిమల్లె పువ్వు. దివి నుంచి భువికి దిగి వచ్చిన పారిజాత పుష్పంలా అందరి మదిని మల్లెలా అల్లుకుపోయింది శ్రీదేవి. స్వర్గం ఉంటుందో ఉండదో తెలియదు. అక్కడ దేవకన్యలు ఉంటారో ఉండరో తెలియదు. కాని తెలుగు ప్రేక్షకులకు తెలిసిన దేవకన్య శ్రీదేవి. అప్సరసలు ఉంటే గనుక అచ్చు శ్రీదేవిలానే ఉంటారు అనేంతలా మాయచేసిన కథానాయికి శ్రీదేవి. 1967 నుంచే శ్రీదేవి బాల నటిగా తన కెరియర్‌ను ప్రారంభించింది. కన్దన్‌ కరుణాయ్ అనే తమిళ  చిత్రంతో మొదలైన ఆమె సినీ ప్రస్థానం రెండు తరాలపాటు విజయపథంలో పయనించింది.

 

 

13:56 - February 25, 2018

హైదరాబాద్ : శ్రీదేవి మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. అతిలోకసుందరి మరణం చితపరిశ్రమకు తీరనిలోటని శ్రీదేవి కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు. చిత్రపరిశ్రమలో  శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తెలుగులో అత్యధికంగా 31 సినిమాల్లో తనకు నటించిన శ్రీదేవి మరణం పట్ల కృష్ణ బాధ వ్యక్తం చేశారు. వైజయంతి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నిర్మాత అశ్వినీదత్‌ గుర్తు చేసుకున్నారు. 
 

శ్రీదేవి హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం

విశాఖ : శ్రీదేవి హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

శ్రీదేవి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

విశాఖ : శ్రీదేవి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బహు భాషా నటిగా తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథనాయకిగా ఎదిగారని తెలిపారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించ దగ్గ నటిగా నిలిచిపోయారని చెప్పారు.

13:25 - February 25, 2018

ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతి దురదృష్టకరమని విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. శ్రీదేవి మృతి ఆశనిపాతంలాగా ఉందన్నారు. శ్రీదేవి అంకితభావంతో పని చేశారని తెలిపారు. తన అందం, నటనతో మకుఠాయమాన స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. శ్రీదేవి మహానటి అని కొనియాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:35 - February 25, 2018

హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. దుబాయ్‌లోని ఓ పెళ్లి ఫంక్షన్‌కు హాజరైన ఆమె రాత్రి రెడున్నర గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. శ్రీదేవి మృతికి మూవీ ఆర్టిర్ట్స్‌ అసోసియేషన్‌ సంతాపం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల శ్రీదేవితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణతో నటనలో ఉన్నత శిఖరాలను ఎదిగిన నటి శ్రీదేవి అని ప్రస్తుతించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీదేవి క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు ఎదిగిందిన శివాజీ అన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు కృష్ణంరాజు సానుభూతి తెలిపారు. శ్రీదేవి హఠాన్మరణంతో దిగ్ర్భాంతికి గురయ్యానని మంజు లక్ష్మి 
చెప్పారు. 

12:29 - February 25, 2018

హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. దుబాయ్‌లోని ఓ పెళ్లి ఫంక్షన్‌కు హాజరైన ఆమె రాత్రి రెడున్నర గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. హార్ట్‌ఎటాక్‌ సీవియర్‌గా రావడంతో ఆమె అక్కడి కక్కడే కుప్పకూలిపోయారు. కొద్ది నిముషాల్లోనే ఆమె కన్నుమూశారు. శ్రీదేవి మృతి పట్ల సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ సంతాపం ప్రకటించారు. సినీ పరిశ్రమ గొప్పనటిని కోల్పోయిందని 
అన్నారు. శ్రీదేవికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు.

 

12:12 - February 25, 2018

విశాఖ : ఏపీ పైబర్ గ్రిడ్ దేశానికే ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో రెండోరోజు ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అన్నారు. 2022 నాటికి దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉంటుందన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు. మూడు రోజలపాటు సమ్మిట్ కొనసాగనుంది. సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో 14 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటున్నారు. సమ్మిట్ కు 60 దేశాల నుంచి వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రధాన వేదికతోపాటు మరో ఐదు సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. జపాన్, కొరియా నుంచి పారిశ్రామిక బృందాలు, అరబ్ దేశాల నుంచి వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. సమ్మిట్ లో అదానీ గ్రూప్, ఇతర వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు.

 

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం : సీఎం చంద్రబాబు

విశాఖ : ఏపీ పైబర్ గ్రిడ్ దేశానికే ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో రెండోరోజు ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అన్నారు. 2022 నాటికి దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉంటుందన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు.

రెండోరోజు ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండోరోజు ప్రారంభమైంది. మూడు రోజలపాటు సమ్మిట్ కొనసాగనుంది. సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో 14 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటున్నారు. సమ్మిట్ కు 60 దేశాల నుంచి వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రధాన వేదికతోపాటు మరో ఐదు సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. జపాన్, కొరియా నుంచి పారిశ్రామిక బృందాలు, అరబ్ దేశాల నుంచి వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. సమ్మిట్ లో అదానీ గ్రూప్, ఇతర వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు.

 

శ్రీదేవి మరణ వార్తతో చిత్రసీమ,అభిమానులు దిగ్ర్భాంతి

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. శ్రీదేవి మరణ వార్తతో చిత్రసీమ,అభిమానులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

 

11:47 - February 25, 2018

హైదరాబాద్ : అందం ఆమెను చూస్తే కుళ్లు కుంటుంది. చందమామ సైతం పక్కకు తప్పుకుంటుంది. భారతీయ సినీ రంగంలో విరబూసిన పారిజాతం శ్రీదేవి. అందానికి అభినయాన్ని జోడించి  వెండి తెరను ఐదు దశాబ్ధాల పాటు ఏలిన  మకుటం లేని  మహరాణి శ్రీదేవి. ఏ తరాన్నైనా మెప్పించి మైమరపించగల అందం శ్రీదేవిది శ్రీదేవి పుట్టింది తమిళనాడులోనైనా తెలుగు ప్రేక్షకులకు ఆమె ఆరాధ్య దేవతైంది. ఆమెను తెలుగింటి ఆడపడుచుగానే ఆరాధించారు. తమ కలల రాణిగా శ్రీదేవిని పూజించారు. ఒకానొక దశలో శ్రీదేవి. లేని సినిమా లేదు...ఆమె లేని చిత్రాన్ని కూడా అభిమానులు ఊహించుకోలేకపోయారు. అంతలా అందరిని తబ్బిబ్బు చేసింది శ్రీదేవి రెండు తరాలతో నటించి నెంబర్ వన్ స్థానంలో నిలబడటం కథానాయకులకే సాధ్యం అన్న ఒరవడిని బ్రేక్‌ చేసింది శ్రీదేవి. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు రెండు తరాలతో నటించగలరని నిరూపించింది.  అలా నటించి  అందరి మన్ననలు అందుకుంది ఈ సౌందర్య రాశి. అభిమానులకే కాదు తోటి నటీనటులకు కూడా శ్రీదేవి రోల్‌మోడల్‌ అనడంలో అనుమానమే లేదు. 

 

11:32 - February 25, 2018

హైదరాబాద్ : అతిలోక సుందరి అనంతలోకాలు వెళ్లిపోయింది. కోట్లాది మంది గుండెల్లో కొండత బాధను మిగిల్చి దివిసీమలకు పయనమయింది. ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ పెళ్లి ఫంక్షన్‌కు హాజరైన ఆమె రాత్రి రెడున్నర గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. హార్ట్‌ఎటాక్‌ సీవియర్‌గా రావడంతో ఆమె అక్కడి కక్కడే కుప్పకూలిపోయారు. కొద్ది నిముషాల్లోనే ఆమె  కన్నుమూశారు. శ్రీదేవి మృతి చెందిన సమయంలో  భర్త బోనీకపూర్‌, చిన్నకూతురు ఖుషీ ఆమెవద్దే ఉన్నారు. శ్రీదేవి మృతికి రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి తమను షాక్‌కు గురిచేసిందని పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌ లో సంతాపం ప్రకటిస్తున్నారు.

సిరిమల్లెపూవు వసివాడింది.. అర్ధశతాబ్దంపాటు భారత సినీతోటలో సుగంధాలను విరబూసిన నటనాకుసుమం.. శ్రీదేవి. మూడో ఏటనుంచే వెండితెరపై వెలిగిన వెలుగుల నక్షత్రం.. చుక్కల లోకానికి వెళ్లిపోవడం అభిమానులను గుండెలను పిండివేస్తోంది.

ఆమె ఒక నటనాతరంగం .. అభిమానుల గుండెల్లో వెల్లువగోదావరిలా ఉప్పొంగింది. 1964ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించింది శ్రీదేవి. తండ్రిపేరు అయ్యప్పన్‌, తల్లి రాజేశ్వరి. తన నాలుగోఏటనే నటన ప్రారంభించిన శ్రీదేవి.. కన్దన్‌కరుణాయ్‌ అనే తమిళ సినమాలో నటించింది. 1975 -నుంచి 1985వరు తమిళ సినీపరిశ్రమలో శ్రీదేవి అగ్రకథానాయికగా కొనసాగారు. 

తెలుగు సినీపరిశ్రమలో శ్రీదేవి అందరు అగ్రహీరోలతో జోడీగా నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు,చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునతో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి తెలుగుతెరపై వెన్నెలమ్మ, వెల్లువగోదావరిలా నిలిచిపోయింది. పదహారెళ్లవయసు చిత్రంలో శ్రీదేవిని చూసి గుండెజారని కుర్రకారు అప్పట్లో లేదంటే అతిశేయొక్తికాదు. అంతలా తన అందం, అంతకు మించిన సహజ, చిలిపినటతో కోట్లాదిమంది అభిమానుల మనసుల్లోనిలిచిపోయింది ఈ జాబిలమ్మ. 

శ్రీదేవికి 1996లో బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీ ఉన్నారు. తెలుగు,తమిళ, హిందీ మళయాళం, కన్నడతోపాటు పలు భారతీయ భాషల్లో నటించి శ్రీదేవి సాటిలేని నటిగా పేరుపొందారు. 2013లో పద్మశ్రీ అవార్డు,  15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 

1978లోనే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగిడిన శ్రీదేవి సోలాసావన్‌ మూవీలో నటించింది. ఆమె జితేంద్రతో నటించిన హమ్మత్‌వాలా  సినిమాద్వారా హిందీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. 1980ల్లో ఆమో హిందీ యవనికపై ఓ వెలుగు వెలిగారు. నగీన, మిస్టర్‌ఇండియా, చాందినీ, చాల్‌బాజ్‌చిత్రాలద్వారా ప్రేక్షకుగల గుండెల్లో జాబిల్లిలా నిలిచింది శ్రీదేవి. 

శ్రీదేవి మరణ వార్తతో యావత్‌ భారత సినీపరిశ్రమతోపాటు కోట్లాది మంది అభిమానుల గుండెలు బరువెక్కాయి. దివిసీమలకేగిన జాబిలమ్మ.. నిత్యం అభిమానుల మనసుల్లో వెలుగుతూనే ఉంటుంది.. 

11:20 - February 25, 2018

హైదరాబాద్ : అతిలోక సుందరి అనంతలోకాలు వెళ్లిపోయింది. కోట్లాది మంది గుండెల్లో కొండత బాధను మిగిల్చి దివిసీమలకు పయనమయింది. ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ పెళ్లి ఫంక్షన్‌కు హాజరైన ఆమె రాత్రి రెడున్నర గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. హార్ట్‌ఎటాక్‌ సీవియర్‌గా రావడంతో ఆమె అక్కడి కక్కడే కుప్పకూలిపోయారు. కొద్ది నిముషాల్లోనే ఆమె  కన్నుమూశారు. శ్రీదేవి మృతి చెందిన సమయంలో  భర్త బోనీకపూర్‌, చిన్నకూతురు ఖుషీ ఆమెవద్దే ఉన్నారు. శ్రీదేవి మృతికి రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి తమను షాక్‌కు గురిచేసిందని పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌ లో సంతాపం ప్రకటిస్తున్నారు.
సాటిలేని నటిగా పేరుపొందిన శ్రీదేవి  
శ్రీదేవికి 1996లో బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జాన్వీ,ఖుషీ ఉన్నారు. తెలుగు,తమిళ, హిందీ మళయాళం, కన్నడతోపాటు పలు భారతీయ భాషల్లో నటించి శ్రీదేవి సాటిలేని నటిగా పేరుపొందారు. 2013లో పద్మశ్రీ అవార్డు,  15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 

 

11:16 - February 25, 2018

హైదరాబాద్ : అతిలోక సుందరి అనంతలోకాలు వెళ్లిపోయింది. కోట్లాది మంది గుండెల్లో కొండత బాధను మిగిల్చి దివిసీమలకు పయనమయింది. ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్‌లోని ఓ పెళ్లి ఫంక్షన్‌కు హాజరైన ఆమె రాత్రి రెడున్నర గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. హార్ట్‌ఎటాక్‌ సీవియర్‌గా రావడంతో ఆమె అక్కడి కక్కడే కుప్పకూలిపోయారు. కొద్ది నిముషాల్లోనే ఆమె  కన్నుమూశారు. శ్రీదేవి మృతి చెందిన సమయంలో  భర్త బోనీకపూర్‌, చిన్నకూతురు ఖుషీ ఆమెవద్దే ఉన్నారు. శ్రీదేవి మృతికి రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి తమను షాక్‌కు గురిచేసిందని పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌ లో సంతాపం ప్రకటిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

శ్రీదేవి మృతి వార్త షాక్ కు గురిచేసింది : రజనీకాంత్

చెన్నె : శ్రీదేవి మృతి వార్త తనను షాక్ కు గురిచేసందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 

 

09:52 - February 25, 2018

సినీనటి శ్రీదేవి మృతి బాధాకరమని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మల్లాది విష్ణు, బీజేపీ నేత లక్ష్మీపతిరాజా, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు, టీడీపీ నాయకురాలు అనురాధ పాల్గొని, మాట్లాడారు. శ్రీదేవి సహజ నటి అని..ఆమె మృతి దురదృష్టకరమన్నారు. శ్రీదేవి మృతి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల వక్తలు సంతాపం తెలిపారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:43 - February 25, 2018

విశాఖ : 2029 నాటికి ఏపీని దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని సీఎం అన్నారు. ఇన్వెస్టర్లకు అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని.. 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్పారు. 
ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు 
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ మైదానంలో జరుగుతున్న ఈ సదస్సును.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 50 దేశాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 500 మంది ఫారిన్‌ బిజినెస్‌ డిలిగేట్స్‌ హాజరవుతున్నారు. 
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు స్వర్గధామమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో... 2029 నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. 2050 వరకు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపుపొందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఏపీ రెండంకెల వృద్ధిరేటు సాధించడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. 
వ్యవసాయం తర్వాత ఇండస్ట్రీ, సర్వీస్‌ సెక్టర్‌పైనే ప్రధాన దృష్టి : చంద్రబాబు 
వ్యవసాయం తర్వాత తమ ప్రధాన దృష్టి ఇండస్ట్రీ, సర్వీస్‌ సెక్టర్‌పైనే ఉంటుందని చంద్రబాబు అన్నారు. మూడున్నరేళ్లలో ఆటోమోబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌, హెల్త్‌కేర్‌, ఇంజినీరింగ్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. మూడున్నరేళ్లలో 1946 ఎంవోయూలు కుదుర్చుకున్నామని.. 13 లక్షల 54 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 31 లక్షల మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
అవకాశాలకు అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్ : వెంకయ్య నాయుడు 
అవకాశాలకు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ వేదికగా నిలుస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నోట్లరద్దు, జీఎస్టీ అతిపెద్ద సంస్కరణలని వెంకయ్య నాయుడు కొనియాడారు. దేశంలో, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను వెంకయ్య కోరారు. 
పెట్టుబడులకు ఏపీ అన్నివిధాలా అనుకూలం : నారా లోకేష్ 
పెట్టుబడులకు ఏపీ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ అన్నారు. విశాఖతో పాటు అమరావతి, రాయలసీమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పటికే ఎన్నో కంపెనీలు రాయలసీమకు వచ్చాయని గుర్తుచేశారు. సదస్సులో... గూగుల్‌ స్టేషన్‌ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చింది. 30 వేల గ్రామపంచాయితీలకు ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని కల్పించేందుకు గూగుల్‌ అంగీకరించింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.

 

09:36 - February 25, 2018

హైదరాబాద్ : సిరిమల్లెపూవు వసివాడింది.. అర్ధశతాబ్దంపాటు భారత సినీతోటలో సుగంధాలను విరబూసిన నటనాకుసుమం నేలరాలింది. మూడో ఏటనుంచే వెండితెరపై జిగేల్మన్న వెలుగుల నక్షత్రం.. చుక్కల లోకానికి వెళ్లిపోవడం అభిమానులను గుండెలను పిండివేస్తోంది. ప్రముఖ సినీ నటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. ఓ పెళ్లివేడుకకు హాజరై, అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 2.30 గంటల సమయంలో మృతి చెందారు. 
ఆమె ఒక నటనాతరంగం .. 
ఆమె ఒక నటనాతరంగం .. అభిమానుల గుండెల్లో వెల్లువగోదావరిలా ఉప్పొంగింది. 1964ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశీలో శ్రీదేవి జన్మించింది . తండ్రిపేరు అయ్యప్పన్‌, తల్లి రాజేశ్వరి. తన నాలుగోఏటనే నటన ప్రారంభించిన శ్రీదేవి.. కన్దన్‌కరుణాయ్‌ అనే తమిళ సినమాలో మొదటిసారిగా  నటించింది. 1975 -నుంచి 1985వరు తమిళ సినీపరిశ్రమలో శ్రీదేవి అగ్రకథానాయికగా కొనసాగారు. 
అగ్రహీరోలతో నటించిన శ్రీదేవి 
తెలుగు సినీపరిశ్రమలో శ్రీదేవి అందరు అగ్రహీరోలతో జోడీగా నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు,చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునతో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి తెలుగుతెరపై వెన్నెలమ్మ, వెల్లువగోదావరిలా నిలిచిపోయింది. పదహారెళ్లవయసు చిత్రంలో శ్రీదేవిని చూసి గుండెజారని కుర్రకారు అప్పట్లో లేదంటే అతిశేయొక్తికాదు. అంతలా తన అందం, అంతకు మించిన సహజ, చిలిపినటతో కోట్లాదిమంది అభిమానుల మనసుల్లోనిలిచిపోయింది ఈ జాబిలమ్మ. 

 

1967లో బాలనటీగా శ్రీదేవి ఆరంగేట్రం

దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. శ్రీదేవి మరణవార్త విని భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. శ్రీదేవి మరణం షాక్ కు గురి చేసిందని సీని ప్రముఖులు అంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. 1967లో బాలనటీగా ఆరంగేట్రం చేశారు. నాలుగవ ఏటనే నటన ప్రారంభించారు. 1975లో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో పద్మశ్రీ అవార్డు పొందారు.

 

07:29 - February 25, 2018

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి (54) ఇకలేరు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. ఓ పెళ్లివేడుకకు హాజరై, అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 2.30 గంటల సమయంలో మృతి చెందారు. శ్రీదేవి మృతి చెందినప్పుడు ఆమె భర్త బోనీకపూర్, చిన్న కూతురు ఖుషి ఆమె వద్దే ఉన్నారు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తల్లి రాజేశ్వరి. 1996లో బోనికపూర్ తో శ్రీదేవి వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు శాన్వి, ఖుషి. ఆమె మరణవార్త విని భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. శ్రీదేవి మరణం షాక్ కు గురి చేసిందని సీని ప్రముఖులు అంటున్నారు. ఆమె మృతి పట్ల సంతాప ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, కేసీఆర్ లు సంతాపం తెలిపారు. 1967లో బాలనటీగా ఆరంగేట్రం చేశారు. నాలుగవ ఏటనే నటన ప్రారంభించారు. 1975లో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఎన్ టీఆర్, ఎన్నార్ వంటి అగ్రనటులతో నటించారు. నాగార్జున, చిరంజీవితో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో శ్రీదేవి నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. మూడు తరాల చలనచిత్ర రంగంలో శ్రీదేవి నటించారు. ఐదు దశాబ్ధాలతో సినిమా రంగంతో అనుబంధం ఉంది. 

 

పలు భాషల్లో నటించిన సినీనటి శ్రీదేవి

దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. శ్రీదేవి మరణవార్త విని భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. శ్రీదేవి మరణం షాక్ కు గురి చేసిందని సీని ప్రముఖులు అంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. 

 

శ్రీదేవి మృతి పట్ల చంద్రబాబు, కేసీఆర్ లు సంతాపం

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఇకలేరు. శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. ఓ పెళ్లివేడుకకు హాజరై, అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 2.30 గంటల సమయంలో మృతి చెందారు. శ్రీదేవి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, కేసీఆర్ లు సంతాపం తెలిపారు. 

శ్రీదేవి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. శ్రీదేవి మృతి పట్ల సంతాప ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. 

 

సినీనటి శ్రీదేవి మృతితో భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతి

దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. శ్రీదేవి మరణవార్త విని భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. శ్రీదేవి మరణం షాక్ కు గురి చేసిందని సీని ప్రముఖులు అంటున్నారు.

06:52 - February 25, 2018

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి (54) ఇకలేరు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. ఓ పెళ్లివేడుకకు హాజరై, అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 2.30 గంటల సమయంలో మృతి చెందారు. శ్రీదేవి మృతి చెందినప్పుడు ఆమె భర్త బోనీకపూర్, చిన్న కూతురు ఖుషి ఆమె వద్దే ఉన్నారు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తల్లి రాజేశ్వరి. 1996లో బోనికపూర్ తో శ్రీదేవి వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు శాన్వి, ఖుషి. ఆమె మరణవార్త విని భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. శ్రీదేవి మరణం షాక్ కు గురి చేసిందని సీని ప్రముఖులు అంటున్నారు. ఆమె మృతి పట్ల సంతాప ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, కేసీఆర్ లు సంతాపం తెలిపారు. 1967లో బాలనటీగా ఆరంగేట్రం చేశారు. నాలుగవ ఏటనే నటన ప్రారంభించారు. 1975లో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఎన్ టీఆర్, ఎన్నార్ వంటి అగ్రనటులతో నటించారు. నాగార్జున, చిరంజీవితో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో శ్రీదేవి నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. మూడు తరాల చలనచిత్ర రంగంలో శ్రీదేవి నటించారు. ఐదు దశాబ్ధాలతో సినిమా రంగంతో అనుబంధం ఉంది. 

 

గుండెపోటుతో సినీనటి శ్రీదేవి మృతి

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్ లో గుండెపోటుతో ఆమె మృతి చెందారు. 1963 ఆగస్టు 12న జన్మించారు. 

 

Don't Miss