Activities calendar

26 February 2018

21:29 - February 26, 2018

పెద్దపల్లి : పార్లమెంట్‌ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోడీ అనడం తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. 60ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తునే ఉందని ఇందుకు జైరాం రమేష్‌ వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన సిద్దిపేటలో అన్నారు. కాంగ్రెస్‌ పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత చేవెళ్లకు మొండి చూపిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తామనడం కాంగెస్‌ దివాలా కోరు తనానికి నిదర్శనం అని ఆయన సిద్దిపేటలో అన్నారు. కాంగ్రెస్‌ పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత చేవెళ్లకు మొండి చూపిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తామనడం కాంగెస్‌ దివాలా కోరు తనానికి నిదర్శనం అని, అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన తెలంగాణ కాంగ్రెస్‌ ఎందుకు గుర్తుకు రాలేదని హరీశ్ విమర్శించారు. 

ఎంసెట్ షెడ్యూల్ విడుదల...

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గడువు దాటిన తర్వాత 500 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పరీక్షలు మే 2 నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్ధులు గంట ముందు పరీక్షా కేంద్రానికి రావాలని... నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

 

 

2018- 2019 బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం...

హైదరాబాద్ : GHMC 2018- 2019 బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవ‌త్సరానికి గానూ 13 వేల 150కోట్ల అంచ‌నాల‌ను బల్దియా సర్వసభ్య సమవేశం ఆమోదించింది. రోజువారీ ఖర్చుల కోసం 6వేల 76కోట్లు కేటాయించగా..... హౌసింగ్, మూసి, రోడ్ల అభివృద్ధి కోసం 7వేల 73కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించిన నిధులను... 3 కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం 7వేల 73 కోట్ల రూపాయలను గ్రాంట్ల రూపంలో ప్రభుత్వం అందించనుంది.

మరో స్కాం...

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, రోటోమాక్‌ కుంభకోణాల తర్వాత మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌-ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో 109 కోట్ల రుణాలు తీసుకుని మోసానికి పాల్పడింది. రుణాలు చెల్లించకపోవడంతో ఓబిసి సిబిఐకి ఫిర్యాదు చేసింది.

 

తృణముల్ కు భూటియా గుడ్ బై...

ఢిల్లీ : మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్‌ బైచుంగ్ భూటియా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఎంసీ పార్టీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ - హరీష్...

పెద్దపల్లి : పార్లమెంట్‌ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోడీ అనడం తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. 60ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తునే ఉందని ఇందుకు జైరాం రమేష్‌ వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన సిద్దిపేటలో అన్నారు. 

21:13 - February 26, 2018

పెద్దపల్లి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో సీఎం కేసీఆర్ రైతుల బీమా పథకాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌లో పర్యటించారు. ఉదయం పదిన్నర గంటలకు కరీంనగర్ చేరుకున్న కేసీఆర్‌.. అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. పదహారు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితులు సభ్యులు సదస్సుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ.. రైతులతో కేసీఆర్ ఏకగ్రీవ తీర్మానం చేయించారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఎంపీలు పార్లమెంటులో రైతుల పక్షాన పోరాడతారని కేసీఆర్ స్పష్టం చేశారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని సభలో కేసీఆర్‌ హెచ్చరించారు. పీడీ యాక్టు పెట్టి అరెస్టు చేస్తామని చెప్పారు. కల్తీ విత్తనాలను అరికట్టాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

కేసీఆర్ రైతుల కోసం 5లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రకటించారు. రైతులు అనారోగ్యానికి గురైనా, అకాల మరణం చెందినా వారి కుటుంబాలకు 5 లక్షల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. మిర్చి, పత్తి, వరి, గోధుమల మద్దతు ధర పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు. సదస్సు అనంతరం తీగలగుట్టపల్లికి కేసీఆర్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

21:12 - February 26, 2018

విజయవాడ : మూడు రోజులు. 4253 మంది ప్రతినిధులు. 734 భాగస్వామ్య ఒప్పందాలు. నాలుగు లక్షల 39వేల 765 కోట్ల పెట్టుబడులు. 11లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు. ఇవీ విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ సాధించిన పెట్టుబడులు. పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ తమ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు. అందుకే ఈ సమ్మిట్‌ను వచ్చే ఏడాది కూడా తామే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసింది. ఈ సమ్మిట్‌లో మూడోరోజు పెట్టుబడి ఒప్పందాలు వెల్లువెత్తాయి. ఒక్క చివరి రోజే ఏపీ ప్రభుత్వం 369 భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా 2 లక్షల 20వేల 951 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మూడు రోజుల్లో మొత్తంగా 734 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. వీటితో ఏపీకి 4లక్షల 39వేల 765 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏపీలోని 11 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశం లభించనుంది.

పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమని సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడుల పురోగతి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచామని చెప్పారు. భావనపాడులో పోర్టుకు ఆదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదిరినట్టు చంద్రబాబు తెలిపారు. ఏపీని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తామని... ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామన్నారు. ప్రతిసవాల్‌ను ఒక అవకాశంగా మల్చుకుంటూ అభివృద్ధివైపు పయనిస్తున్నామన్నారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సభలో పాల్గొన్న గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు సారథ్యంతో ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. పనిలో చంద్రబాబుతో ఎవరూ పోటీపడలేరన్నారు. ఒక యంత్రంలా చంద్రబాబు పనిచేస్తారన్నారు. చంద్రబాబును చూసైనా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఏపీ అనుకూల రాష్ట్రమని.. అక్కడ వ్యాపారానికి పూర్తి భద్రత ఉందన్నారు.

అంతకుముందు ప్లీనరీ విత్‌ సోషల్‌ ఐకాన్‌ పేరిట నిర్వహించిన సమావేశంలో చందబ్రాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ పాల్గొన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో సంపద సృష్టించడం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్‌ వ్యాలీగా నెలకొల్పడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.

ఎలక్ట్రానిక్స్‌ రంగంపై జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోందన్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్స్‌ పాలసీలో సవరణలు తీసుకొస్తామన్నారు. మూడు రోజులపాటు జరిగిన పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ను ఏపీ ప్రభుత్వం విజయంతంగా నిర్వహించింది. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతమయ్యారు. దీంతో చంద్రబాబును పలువురు ఘనంగా సస్మానించారు. సమ్మిట్‌ విజయవంతానికి కృషి చేసిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా తామే భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.-----

21:09 - February 26, 2018

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ శ్రీదేవి మృతి దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంతకీ శ్రీదేవి ఎలా మృతి చెందారు? దుబాయ్‌లో ఆ రోజు ఏం జరిగింది? తన భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహానికి దుబాయ్‌ వెళ్లిన బాలీవుడ్‌ నటి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం సినీ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

దుబాయ్‌లోని ఖలీజ్‌ టైమ్స్‌ కథనం ప్రకారం బోనీకపూర్‌ దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరి వచ్చారు. భార్య శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు శనివారం తిరిగి దుబాయ్‌కు వెళ్లారు. సాయంత్రం ఐదున్నర సమయంలో నిద్రలో ఉన్న శ్రీదేవిని బోనీకపూర్‌ లేపారు. 15 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడారు.

అనంతరం డిన్నర్‌ చేద్దామని శ్రీదేవిని బోనీకపూర్‌ ఆహ్వానించారు. డిన్నర్‌ కోసం రెడీ అయ్యేందుకని శ్రీదేవి బాత్రూం వెళ్లారు. కొద్దిసేపటి వరకు ఆమె బాత్రూం నుంచి బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన బోనీకపూర్‌ బాత్రూం తలుపు తట్టారు. శ్రీదేవి ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో బోనీకపూర్‌ బల ప్రయోగంతో తలుపును తెరిచారు. లోనికెళ్లి చూసేసరికి శ్రీదేవి బాత్‌ టబ్‌లో విగతజీవిగా పడిపోయి ఉన్నారు. ఆ టబ్‌ నీటితో నిండిపోయి ఉంది.

శ్రీదేవిని స్పృహ లోకి తెచ్చేందుకు బోనీకపూర్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. వెంటనే స్నేహితునికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రీదేవికి గుండె సంబంధిత వ్యాధులేవి లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు, వైద్య సహాయకులు శ్రీదేవిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. శ్రీదేవి మృతదేహాన్ని ఫొరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కు తరలించారు. శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు తరలించడంలో జరిగిన జాప్యంపై అభిమానులకు పలు సందేహాలు తలెత్తాయి.

21:08 - February 26, 2018

ఢిల్లీ : శ్రీదేవి మృతిపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి మృతి చెందిందని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చినా... ఇంకా విచారణ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అప్పగించారు. శ్రీదేవి కేసులో లోతైన విచారణ చేయాల్సి ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. దీంతో శ్రీదేవి పార్ధివదేహం భారత్‌కు వచ్చేందుకు జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే... శ్రీదేవి మృతిపై అనేక అనుమానలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. శ్రీదేవి బాత్‌టబ్‌లో ఎలా పడిపోయింది..? ఎవరైనా ఆమెను తోసేశారా ? అని విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు.. బోనీకపూర్‌తో పాటు.. మరో ముగ్గురు కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఇక శ్రీదేవి, బోనీకపూర్‌ కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

డీఈవో ఆఫీసులో ఏసీబీ సోదాలు...

వరంగల్ : డీఈవో ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ. 3లక్షలు లంచం తీసుకుంటున్న సర్వశిక్ష అభియాన్ డీఈ రవీందర్ రావు చిక్కాడు. 

శ్రీదేవి మృతి కేసు...

హైదరాబాద్ : శ్రీదేవి మృతి కేసు దుబాయి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ అయ్యింది. శ్రీదేవి మృతిపై మరింత విచారణ అవసరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఆమె మృతదేహాన్ని ఇవాళ అప్పగించలేమని, బోనకపూర్ ను దుబాయిలోనే ఉండాలని..భారత కాన్సులేట్ నుండి మరిన్ని పత్రాలు కావాలని కోరింది. 

20:42 - February 26, 2018

శ్రీదేవి హఠాన్మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. ఆమె జీవితం ఎలా ఉంది ? తదితర విషయాలపై టెన్ టివి పసుపులేటి రామారావు (సీనియర్ జర్నలిస్టు) ముచ్చటించింది. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నలుగురు మావోల హతం...

జార్ఖండ్ : పలమా జిల్లాలో జరిగని ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఉదయం సీఆర్పీఎఫ్..జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా గాలింపులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

అభిమానుల్లో ఉత్కంఠ...

ముంబై : శ్రీదేవి భౌతికకాయం ఎప్పుడొస్తుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం మృతి చెందితే సోమవారం రాత్రి వరకు కూడా ఆమె పార్థీవదేహం ముంబైకి చేరుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అన్ని సమావేశాలు ఇక ప్రత్యక్షప్రసారం...

ఢిల్లీ : అన్ని సమావేశాలను ప్రత్యక్షప్రసారం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీ.ఎస్.ప్రకాశ్ పై ఎమ్మెల్యేలు దాడి చేశారన్న అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

20:33 - February 26, 2018

కేసీఆర్ను ఓడగొట్టి కుర్చిల కెళ్లి కిందికి దించితె తప్పు తెలంగాణల ప్రజల బత్కులు మారయంటున్నడు బిఎల్ఎఫ్ నేత తమ్మినేని వీరభద్రంగారు..తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్లు జోరుమీదికొచ్చిండ్రుగదా... బస్సుయాత్ర వెట్టుకోని బాగనే తన్లాడుతున్నరు.. రైతుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అంటున్నడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు..ఓ దేవనపల్లి కవితమ్మా.. ఎటువాయే తమరు తెస్తాని చెప్పిన పస్పుబోర్డు..? ఏమాయే మీ హామీలు అంటున్నరు పస్పువండిచ్చిన రైతులు.. మొత్తం మీద బోజగుట్ట కాడ గుడిశెలేస్కోని బత్కుతున్న పేదోళ్లను సంపెదాక ఇడ్సిపెట్టెతట్టులేరుగదా..? సర్కారోళ్లు..నిన్ను ఆ పిలగాడు మోసం జేశిండు అనెతందుకు నీతా ప్రూఫ్స్ ఏమున్నయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీసోళ్లు.. సిరిసిల్ల రాజన్న జిల్లా పోలీసోళ్లు రికార్డుల మీద రికార్డులు తిర్గరాస్తట్టే ఉన్నరు.. గీ ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి...

శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై సందిగ్ధతత..

ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి మృతదేహం అప్పగింతపై సందిగ్ధతత కొనసాగుతోంది. మృతదేహాన్ని అప్పగించలేమని, భారత కాన్సులేట్ నుండి మరిన్ని పత్రాలు రావాల్సి ఉందని దుబాయి ప్రాసిక్యూటర్ వెల్లడించారు. 

20:06 - February 26, 2018
19:30 - February 26, 2018

పాతబస్తీలో దారుణం...

హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది దుండగులు 29ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి నగ్నంగా వీడియో చిత్రీకరణ చేసి నగ్న వీడియోలను కుటుంబసభ్యులకు పంపించారు. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. చాంద్రాయణగుట్టలో పీఎస్ లో ముస్తఫా అనే యువకుడు యువతిని కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. 

బోనీకపూర్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు...

ముంబై : అందాల తార శ్రీదేవి మృతి మిస్టరీ డెత్ ఇంకా కొనసాగుతోంది. ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని..బాత్ టబ్ లో పడి పోవడంతో కన్నుమూసిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె భర్త బోనీకపూర్ ను మూడున్నర గంటల పాటు అక్కడి పోలీసులు ప్రశ్నించారు. 

రైతుల ఆందోళన..రైతు మృతి...

అనంతపురం : హిందూపురం మార్కెట్ లో గంగప్ప అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. చింతపండు ధరలను తగ్గించాలంటూ దళారులు..రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో గంగప్పకు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. 

18:25 - February 26, 2018

విశాఖపట్టణం : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐఐ సదస్సు ముగిసింది. విశాఖ నగరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు..తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను బాబు వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావాలని, పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని బాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 734 ఒప్పందాలు జరిగాయి. రూ. 4,39,765 కోట్ల పెట్టుబడులు జరిగాయి. దీనిద్వారా 11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సీఐఐ సదస్సులో ఎంవోయూలు...

విశాఖపట్టణం : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వం పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకుంది. ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 

18:14 - February 26, 2018

ముంబై : బాలీవుడ్ అందాల నటి శ్రీదేవి ఎలా చనిపోయిందనే దానిపై రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. కాసేపటి క్రితం ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక ప్రకంపనాలు సృష్టిస్తోంది. ప్రమాదవశాత్తు టబ్ లో పడిపోయి చనిపోయిందని నివేదికలో ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. కానీ అంతకుముందు నేరపూరిత ఉద్ధేశ్యం లేదని యూఏఈ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కానీ ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన నివేదిక భిన్నంగా ఉండడం గమనార్హం. దీనితో ఆమె ఎలా చనిపోయిందనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. గుండె పోటుతో కుటుంబసభ్యులు ఎందుకు పేర్కొన్నారనేది తెలియరావడం లేదు.

ఆమె మృతిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి మద్యం సేవించిందా ?..ప్రమాదవశాత్తు టబ్ లో పడి చనిపోయిందా ? ఆ సమయంలో భర్త బోనీకపూర్ లేడా ? ఉంటే ఎక్కడున్నారు ? టబ్ లోకి ఎవరైనా తోసేశారా ? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉత్పన్నమౌతున్నాయి.

ఇదిలా ఉంటే శ్రీదేవి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పోలీసులు బదిలీ చేశారు. మరింత లోతుగా జరపాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనితో శ్రీదేవి భౌతికకాయం అప్పగింతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. 

17:38 - February 26, 2018

హైదరాబాద్ : ప్రతి నెలా ఐదో తేదీలోగా పెన్షన్‌ ఇవ్వాలని వికలాంగులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి హైదరాబాద్‌ సెర్ఫ్‌ కార్యాలయానికి చేరుకున్న వికలాంగులు.. ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి మండుటెండలో ఆందోళన చేస్తున్నా... తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుల ఆందోళనపై మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

17:38 - February 26, 2018

హైదరాబాద్ : భూనిర్వాసితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ భూనిర్వాసితుల సంఘం ఆందోళన ఉధృతం చేయబోతుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రంలోని అన్ని భూనిర్వాసిత కేంద్రాల వద్ద ఆందోళన చేయనున్నట్లు... హైదరాబాద్ ఎంబీ భవన్‌లో సమావేశమైన రైతు సంఘం, రైతు కూలీ సంఘం, గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. 2017లో సవరించిన భూసేకరణ చట్టం రద్దు చేయాలని,.. భూనిర్వాసితులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు.

శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదట

దుబాయి : శ్రీదేవి మృతిపై ఫోరెన్సిక్ నివేదిక విడుదల అయింది. ప్రమాదవశాత్తూ శ్రీదేవి మరణించినట్లు దుబాయ్ వైద్యులు నిర్ధారించారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు నివేదికలో వెల్లడైయింది. శ్రీదేవి మరణం వెనక నేరపూరిత ఉద్దేశం లేదని యూఏఈ ఆరోగ్యశాఖ తెలిపింది. 

17:06 - February 26, 2018

ముంబై : బాలీవుడ్ నటి శ్రీదేవి హఠాన్మరణంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వల్లే శ్రీదేవి మృతి చెందిందని, బాత్ టబ్ లో పడి మృతి చెందిందని నివేదికలో పేర్కొన్నారు. నేరపూరిత ఉద్ధేశ్యం లేదని యూఏఈ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కానీ ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన నివేదిక భిన్నంగా ఉండడం గమనార్హం. దీనితో ఆమె మృతిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి రీ పోస్టుమార్టం చేస్తారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. కుటుంబసభ్యులు...వైద్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోతుండడంతో రీ పోస్టుమార్టం జరిగే అవకాశం లేదని సమాచారం.

శ్రీదేవి అంత్యక్రియలు ముంబైలోని పవన్‌ హంస్‌ క్రీమ్‌టోరియంలో అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. 

రైతు సమన్వయ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం

కరీంనగర్ : రైతు సమన్వయ సమితి సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కౌలు రైతులకు పంట పెట్టుబడి ఇవ్వలేమని, టెనెన్సీ యాక్ట్ ప్రమాదకరమైనదని , కౌలు అంటే రైతుకు కౌలుదారకు మధ్య ప్రైవేటు వ్యవహారమని కేసీఆర్ అన్నారు. 

16:42 - February 26, 2018

రామ్ చరణ్, సమంత కలసి నటిస్తున్న సినిమా రంగస్థలం. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1980ల్లో ప్రేమ కథ ఎలా ఉంటుందో అలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే ఈ మధ్య ఆ చిత్రం యూనిట్ ప్రేమికుల రోజు సందర్భాంగా ఎంత సక్కగున్నవే లచ్చిమి అనే పాటను విడుదల చేశారు. ఆ పాట ప్రస్తుతం నెట్ వైరల్ గా మారింది. ప్రతి పది మొబైల్స్ లో ప్రతి మూడింటికి ఈ పాట రింగ్ టోన్ గా ఉంది. మొత్తం 2లక్షల లైక్స్ తో కోటి పైగా వ్యూస్ తో ఈ పాట దూసుకుపోతుంది. ఇక రంగస్థలం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చ్ 30న రిలీజ్ కాబోతోంది.

16:35 - February 26, 2018
16:30 - February 26, 2018

అవును మీరు విన్నది నిజమే స్పీన్ బౌలర్ రవీచంద్రన్ అశ్విన్ కు కెప్టెన్ పదవి వరించింది. కానీ దేశం తరుపున కాదు ఐపీఎల్ లో ఓ జట్టు అశ్విన్ ను కెప్టెన్ గా నియమిస్తూ ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. ఆ జట్టు ఏదో కాదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ సీజన్ 11కు పంజాబ్ తరుపున అశ్విన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గతంలో పుణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన అశ్విన్ ఈ సారి పంజాబ్ తరుపున ఆడుతున్నాడు. వేలం పాటలో అశ్విన్ పై చెన్నై మొగ్గు చూపలేదు. దీంతో పంజాబ్ జట్టు అశ్విన్ రూ.7.6కోట్లకు కొనుగోలు చేసింది. సెహ్వాగ్ సూచన మేరకే అశ్విన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

ఏపీ ఒక స్టార్టప్ రాష్ట్రం : లోకేష్

విశాఖ : ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ రాష్ట్రంగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉందని, కానీ మూడున్నరేళ్లలో సమస్యలు అధిగమించామని మంత్రి లోకేష్ అన్నారు. 2022 నాటికి అభివృద్ధి చెందిన 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలనేది తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. 

సింగాపూర్ మంత్రి సీఎం ధన్యవాదాలు

విశాఖ : ఏపీకి మొదటి నుంచి సాయం అందిస్తున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజధానికి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరమని సీఎం అన్నారు. 

16:14 - February 26, 2018

ముంబై : అందాల నటి శ్రీదేవి మరణం సహజ మరణమేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమె గుండెపోటుతోనే మృతి చెందారని, మృతిలో ఎలాంటి కుట్రలు లేవని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను శ్రీదేవి కుటుంబసభ్యులకు అందచేశారు. శ్రీదేవి హఠాన్మరణం నేపథ్యంలో దుబాయి ప్రతిక ప్రచురించిన కథనాలతో ఉత్కంఠ ఏర్పడింది. నివేదికలో వైద్యులు పేర్కొన్న అంశాలతో అనుమానాలు పటాపంచలయ్యాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:12 - February 26, 2018

నిజామాబాద్ : జిల్లాలోని మాచారెడ్డి మండలం దేవునిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక రైతు రాజయ్య చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలంలో వేసిన బోరులో నీరు రాకపోవడం..పంట కోసం చేసిన అప్పులు అధికం కావడంతో రాజయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. రాజయ్యకు భార్య..ఇద్దరు కుమారులున్నారు. రాజయ్య చిన్న కుమార్తె ఇటీవలే పాము కాటుతో మృతి చెందింది. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో మృతుల కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  

గుండెపోటుతోనే శ్రీదేవి మృతి - ఫోరెన్సిక్ నిపుణులు...

ముంబై : అందాల నటి శ్రీదేవి మరణం సహజ మరణమేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమె గుండెపోటుతోనే మృతి చెందారని, మృతిలో ఎలాంటి కుట్రలు లేవని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో వెల్లడించారు.

15:59 - February 26, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పర్యటించారు. కామవరపుకోటలో 42 అడుగుల శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అనుగుణంగా ప్రత్యేక నిధులు ఇస్తేనే బీజేపీతో ఉంటామని తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోందని ఓ మీడియా ప్రతినిధి అడగగా చిన రాజప్ప ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆ పార్టీలో చేరడం లేదని, చిరంజీవి పార్టీ పెడితే వెళ్లలేదన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. 

15:55 - February 26, 2018

పెద్దపల్లి : కౌలు రైతులకు పంట పెట్టుబడి ఇవ్వలేమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. పెద్దపల్లి జిల్లాలో రైతు సమన్వయ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొని దిశా..నిర్ధేశం చేశారు. రైతులను రక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, పామాయిల్ రైతులకు కూడా పంట పెట్టుబడి అందిస్తామన్నారు. పంట పెట్టుబడి అనేది రైతు, కౌలుదారుడు చూసుకుంటారని తెలిపారు. పాత కరీంనగర్ జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ వరకు నాలుగు జీవధారాలు సజీవంగా ఉంటాయని, 365 రోజులు గోదావరి నది పారుతుందన్నారు. చెరువులు ఎప్పుడూ నిండుగానే ఉండే విధంగా చూసుకుంటామని, జీవ వైవిధ్య సంపద తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 70 లక్షల మంది రైతులకు బీమాలు చేయిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం విస్తృతంగా సాగాలని, అప్పుడే కోతుల సమస్య తీరుతుందన్నారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పంట చెట్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

15:31 - February 26, 2018
15:29 - February 26, 2018

ఏలూరు : విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు 7వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్టు విధానం రద్దు చేసి నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో 1200 మంది కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. గత ఏడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోడంతో కలెక్టరేట్ వద్ద రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఎంతో మంది ఇళ్లలో వెలుగులు నింపుతున్నా తమ జీవితాల్లో వెలుగులు లేవన్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకోవంతో వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. తమ సమస్యలు తీర్చలేని పక్షంలో ఆమరణ నిరహార దీక్షకు పూనుకుంటామన్నారు. 

15:22 - February 26, 2018

ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ప్లానిటేషన్..రోడ్ల విస్తరణ..వీధి దీపాల ఎల్ ఈడీ బల్బులు..పార్కుల అభివృద్ధి అంశాలపై కార్పొరేటర్లు చర్చించారు..

15:17 - February 26, 2018

వేధింపుకు ఒక చట్టం...ర్యాగింగ్ కు ఒక యాక్ట్..గృహ హింసకు ఒక చట్టం...అత్యాచారానికి ఒక చట్టం...మహిళలను కించపరిస్తే తాటతీసే చట్టాలున్నాయి. కానీ ఇన్ని చట్టాలున్నా మహిళలకు రక్షణ కరువైంది. ఇది లెటెస్ట్ రిపోర్టు చెబుతున్న సత్యం. మహిళలకు రోజు రోజు నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఈ నేరాలు చట్టాలు ఎందుకు ఆపలేకపోతున్నాయి. లోపం ఎక్కడుంది ? ఈ అంశంపై మానవి వేదికలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సింగపూర్ అద్భుతమైన మాస్టర్ ప్లాన్ - బాబు...

విశాఖపట్టణం : ఏపీకి మొదటి నుండి సాయం అందిస్తున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, సింగపూర్ అద్బుతమైన మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. పెట్టుబడిదారులకు సాయం అందించేందుకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 

ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానించాలి : కేసీఆర్

కరీంనగర్ : ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుంసంధనం చేయాలని కేంద్రాన్ని ఎప్పటి నుంచి కోరుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. 

14:30 - February 26, 2018

కరీంనగర్ : ఒక వైపు విజ్ఞాన శాస్త్రం పరుగులు పెడుతుంటే... మరోవైపు పల్లెళ్లలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో మంత్రాల నెపంతో మహిళను గామస్తులు చితకబాదారు. పెద్దపల్లి మండలం రాగినేడులో ఇటీవల అనారోగ్యంతో సోమిశెట్టి లక్ష్మీ చనిపోయారు. మరో మహిళ మంత్రాలు చేయడం వల్లే చనిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహిళను గ్రామస్తులు చితకొట్టారు. దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:24 - February 26, 2018

హైదరాబాద్ : అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ ఐసీసీలో ఈ.. గవర్నెన్స్ జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 15 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు బ్రాండ్ బ్యాండ్ వస్తుందని చెప్పారు. 

14:15 - February 26, 2018

కరీంనగర్ : రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలే ఉంటారని వేరేవారిని పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్  తేల్చి చెప్పారు. రైతు సమన్వయ సమితుల్లో ముమ్మాటికి టీఆర్ ఎస్ కార్యకర్తలు, నేతలే ఉంటారని... ఇతరులను నియమించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ లో జరుగుతన్న రైతు సమన్వయ సమితి సదస్సులో ఆయన మాట్లాడారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రభుత్వం పీడీయాక్టు కింద చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజలందరూ ఐక్యమై కల్తీ విత్తనాల అమ్మేవారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కల్తీ విత్తనాలు తేవాలంటే భయపడాలన్నారు. 'మీకు మీరే కాపాలదారులుగా ఉండాలి' అని చెప్పారు.  కల్తీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కనీస మద్దతు ధర రాబట్టే పని ప్రారంభించాలని తెలిపారు. రాజకీయాలు చేయడం మాని.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని హితవు పలికారు. పాలకులకు సిగ్గు రావాలన్నారు. ఇప్పటికే నక్సలిజం వచ్చిందిపోయిందని..ఇంకా ఏమీ రావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే టీడీపీ ధర్నా చేసింది.. టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నా చేసిందని...కానీ రైతులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక మాత్రమే రైతులకు న్యాయం జరిగిందని.. నీళ్లు, కరెంట్ వచ్చిందన్నారు. తెలంగాణనలో కరెంట్ పోయే పరిస్థితి రాదన్నారు. రైతాంగానికి ఏడాదికి రెండు పంటలకు పెట్టుబడులు ఇస్తామని చెప్పారు. రూ.35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. చెరువులను నాశనం చేయడం వల్ల భూగర్భజలాలు అడుగంటాయని తెలిపారు. రూ.40 వేల కోట్లతో రైతులు 23లక్షల బోర్ వెల్ వేసుకున్నారని పేర్కొన్నారు. రైతులు దేశానికి అన్నం పెట్టేవారని కొనియాడారు. ఐక్యమత్యంగా ఉంటే అద్భుతమైన శక్తి వస్తుందన్నారు. రాష్ట్రంలో 2638 మంది ఏఈవో లు ఉన్నారని తెలిపారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉన్నాడని చెప్పారు. ఏఈవో కింద 1100 వరకు రైతులు ఉన్నారని పేర్కొన్నారు. రైతు వేదకకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రైతు వేదికల జాగాలను దాతలు, ప్రభుత్వం నుంచి సేకరించాలన్నారు. రాబోయే జూన్ నుంచి తెలంగాణలో ఏ ఏ పంటులు ఉన్నవో తెలవాలన్నారు.

13:58 - February 26, 2018

విశాఖ : ఆహార శుద్ధి పరిశ్రమలకు ఏపీలో ఆపార అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సహకాలు ఉంటాయని తెలిపారు. నేటితో సీఐఐ సదస్సు ముగియనుంది. 

13:48 - February 26, 2018
13:45 - February 26, 2018
13:44 - February 26, 2018

ముంబై : దుబాయ్‌లో కన్నుమూసిన నటి శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తరలింపులో ఆలస్యమవుతోంది. ఆమె భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైనా దౌత్యపరమైన కారణాలతో తరలింపు ఆలస్యమౌతుంది. నివేదిక అందాకే దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయన్ని అప్పగిస్తారు. ఆమె పార్థీవదేహం భారత్ చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శన తర్వాత ముంబైలోని జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శ్రీదేవి భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బస చేశారు. రాత్రి 11గంటలకు శ్రీదేవి బాత్రూంలో కుప్పకూలిపోయారని సమాచారం. గుండెపోటు తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెను వెంటనే రషీద్ హోటల్‌కు తరలించారు. అయితే ఈలోగానే ఆమె చనిపోయారు. శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు శ్రీదేవి మరణంపై సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫంక్షన్ కు వెళ్లేటప్పుడు ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఉన్నట్టుండి అనారోగ్యానికి ఎలా గురయ్యారని శ్రీదేవి అభిమానులు, పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:36 - February 26, 2018

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయంలో బీజిగా మారడంతో పవన్ కోసం వేచి చూస్తున్న అనేక మందికి డైరెక్టర్లకు నిరాశ మిగిలింది. పవన్ ఇక నుంచి సినిమాలు చేయడంలేదని ప్రకటించడం వీరికి నిరాశకు కారణం. పవన్ సినిమాకు డైరెక్ట్ చేయడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ పవన్ ప్రకటన తో బాధలో పడ్డారట. అయితే అదే స్టోరీని నానీ హీరో గా మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పవన్ కోసం రాసిని స్టోరీ దర్శకుడు నాని వినిపించినట్టు దానికి నాని ఓకే చెప్పినట్టు తెలిసింది.

76 కంపెనీలతో ఏపీ ఒప్పందం

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ చెందిన 76 కంపెనీలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. దీంతో ఏపీలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 

రాత్రి 7గంటలకు ముంబైకి శ్రీదేవి మృతదేహం

అబుదబి : మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో శ్రీదేవి మృతదేహం భారత్ తరలించనున్నారు. రాత్రి 7గంటలకు శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకొనుంది. 

అనంతపురం మున్సిపల్ సమావేశం రసాభాస

అనంతపురం : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. గత ఏడాది నిధులు ఖర్చు పెట్టకుండా బడ్జెట్ లో చూపడంపై వైసీపీ, పలువురు టీడీపీ కార్పొరేటర్ల అభ్యంతరం తెలిపారు. కమిషనర్ తో కార్పొరేటర్ల వాగ్వాదానికి దిగారు. 

పార్టీ బలోపేతానికి బస్సు యాత్ర :

హైదరాబాద్ :  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బస్సు యాత్ర ఉపయోగపడుతుందని మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. 

నేటి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర  ప్రారంభం కానుంది. నాంపల్లి దర్గాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రార్థనలు చేసిన అనంతరం గండిపేట రోడ్డులోని ఆరె మైసమ్మ ఆయలంలో పూజలు చేసిన తర్వాత మొయినాబాద్ చర్చిరలో ప్రార్థనలు చేసి బస్సు యాత్రను ప్రారంభించారు. 

13:05 - February 26, 2018

తమిళ హీరో విశాల్ చికిత్స కోసం అమెరికా వెళ్లాడు. విశాల్ గతంలో ఓ చిత్ర చిత్రీకరణ సమయంలో గాయపడ్డాడు. అప్పుడు ఆయన మోకాలికి గాయమైంది. దానికి తోడు విశాల్ ను తీవ్రమైన తల నొప్పి కూడా వేధిస్తున్నట్టు తెలిసింది. ఆ మధ్య ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు విశాల్ చికిత్స కోసం అమెరికా వెళ్లాడు. 

12:38 - February 26, 2018

జయం చిత్రంలో చిత్రసీమలో ప్రవేశించిన నితిన్ ఆ తర్వాత వచ్చిన దిల్ సినిమాతో తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ప్లాప్ లు వచ్చిన ఈ యంగ్ హీరో మళ్లీ గాడిలో పడ్డాడు. ప్రస్తుతం నితిన్ చల్ మోహన రంగ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తైయ్యాయి. ఇక పాటల చిత్రీకణ మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నితిన్ ప్రతి సినిమాలో వైవిధ్యమైన స్టెప్పులు వేస్తుంటాడు. దానికి చాలా శమ్రించాల్సి ఉంటుంది. నితిన్ గత సినిమాలు గమనిస్తే డాన్స్ వెరైటీలు చూపిస్తూ వస్తున్నాడు. చలో మోహన రంగ చిత్రంలో పాట షూటింగ్ లో నితిన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఓ క్రిటికల్ స్టెప్పు వెస్తున్నప్పుడు అతిని భుజ కండారలు పట్టెసినట్లు తెలిసింది. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ ప్యాకప్ చెప్పి నితిన్ డాక్టర్ చూపించారట. ఈ చిత్రాన్ని పవన్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. 

12:19 - February 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి యాత్ర మొదలవుతంది. పార్టీ ముఖ్యనేతలందరూ యాత్రలో పాల్గోనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజ్యా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు యాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లుభట్టివిక్రమార్క టెన్ టివితో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు జనంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. నిరుద్యోగుల ఆశలు సీఎం కేసీఆర్‌ ఒమ్ము చేశారని తెలిపారు. టీ కాంగ్రెస్‌ బస్సు యాత్ర సక్సెస్‌ అవుతుందని అజారుద్దీన్‌ పేర్కొన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఎక్కడ పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 

 

పోస్టు మార్టం అందితే మృతదేహం

అబుదాబి : శ్రీదేవి మృతదేహం తరలింపులో మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మృతదేహం పోస్టుమార్టం నివేదిక వచ్చి తర్వాతే డెడ్ బాడీని అప్పగిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. 

11:58 - February 26, 2018

కృష్ణా : ఐఐటీల్లో పూర్వ ప్రమాణాలు నేడు లేవని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తిచలమేశ్వరరావు అన్నారు.. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద జరిగిన విశ్వభారతి స్కూల్‌ గోల్డెన్‌ జూబ్లీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 50 ఏళ్ళ కిందట నాలుగు ఐఐటీలు మాత్రమే ఉండేవని... వాటిలో సీటు సాధించడం ఎంతో కష్టంగా ఉండేదన్నారు. నేడు 25 ఐఐటీలు ఉన్నా... ప్రమాణాలు  మాత్రం లేవన్నారు.. ఈ కార్యక్రమంలో  సెంట్రల్‌ విజిలెన్స్ కమిషనర్‌ కొసరాజు వీరయ్య చౌదరి, ఎంపీ కొనకళ్ళ నారాయణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, విజ్ఞాన్‌ గ్రూప్స్‌  ఛైర్మన్‌ లావు రత్తయ్య, విశ్వభారతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు పొట్లూరి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

11:54 - February 26, 2018

కరీంనగర్‌ : ఇవాళ జిల్లాలో జరుగనున్న రైతు సమన్వయ సమితి సదస్సుకు సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పిలుపునివ్వడంతో సీపీఎం, సీఐటీయూ నాయకులతో పాటు విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని కోరితే అక్రమ అరెస్ట్‌లు చేస్తూ... ఉద్యమాలను అణచి వేయాలని చూడడం దుర్మార్గమైన చర్య అన్నారు విద్యార్థి సంఘం నాయకులు. పోలీసులు అక్రమంగా సీపీఎం కార్యాలయంలోకి చొరబడడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందా రెడ్డి తీవ్రంగా ఖండించారు. 

 

11:48 - February 26, 2018

విశాఖ : ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన.. అనుమతులన్నీ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని అన్నారు. ఏపీలో సంపద సృష్టించడం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్‌ వ్యాలీగా నెలకొల్పడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఉన్న కుటుంబ విలువులు ప్రపంచంలో మరెక్కడాలేవని తెలిపారు. దేశం, ప్రజలు మారుతున్నారు...రాజకీయాలు మారాలన్నారు. సమాజంలో విలువలు ఉండాలని చెప్పారు.

సమాజంలో విలువలు ఉండాలి : సీఎం చంద్రబాబు

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. దేశంలో ఉన్న కుటుంబ విలువులు ప్రపంచంలో మరెక్కడాలేవని తెలిపారు. దేశం, ప్రజలు మారుతున్నారు...రాజకీయాలు మారాలన్నారు. సమాజంలో విలువలు ఉండాలని చెప్పారు.

 

ప్రారంభమైన జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2018..19 బడ్జెట్ పై కౌన్సిల్ చర్చించనుంది. నగర ప్రజల సమస్యలతోపాటు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానాలపై చర్చించనున్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేశారు : భట్టి

హైదరాబాద్ : తెలంగాణ ప్రజా సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలోతొక్కారని ఆయన విమర్శించారు. 

హెచ్ ఐసీసీలో 21వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు

హైదరాబాద్ : హెచ్ ఐసీసీలో 21వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు జరుగుతోంది. రెండు రోజులపాటు ఈ సదస్సు కొనసాగనుంది. కేంద్రమంత్రి సీఆర్ చౌదరి, మంత్రి కేటీఆర్ లు సదస్సులో పాల్గొన్నారు.

 

మూడోరోజు కొనసాగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖ : మూడోరోజు సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. మూడు రోజులపాటు సమ్మిట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో ఏపీ సర్కార్ ఎంవోయూలు కుదుర్చుకుంది. నేటితో భాగస్వామ్య సదస్సు ముగియనుంది. ముగింపు సమావేశానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. 

 

11:02 - February 26, 2018

ఇవాళ జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సాధారణ భేటీ

హైదరాబాద్ : ఇవాళ జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2018..19 బడ్జెట్ పై కౌన్సిల్ చర్చించనుంది. నగర ప్రజల సమస్యలతోపాటు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానాలపై చర్చించనున్నారు.

10:56 - February 26, 2018

హైదరాబాద్ : నేడు జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2018..19 బడ్జెట్ పై కౌన్సిల్ చర్చించనుంది. నగర ప్రజల సమస్యలతోపాటు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానాలపై చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కొప్పుల ఈశ్వర్ కారు ఢీకొని ఒకరి మృతి

కరీంనగర్ : ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వేములవాడకు వెళ్లి వస్తుండగా ఆయన కారు భక్తులను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేకపోవడం గమనార్హం. 

10:40 - February 26, 2018

విశాఖ : నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది. మూడు రోజులపాటు సమ్మిట్ సాగింది. ఇప్పటికే పలు కంపెనీలతో ఏపీ సర్కార్ ఎంవోయూలు కుదుర్చుకుంది. ఐటీ శాఖ మంత్రి విదేశీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇవాళ 60 కి పైగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మూడు రోజుల్లో 400 ఎంవోయూలు జరగాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ముగింపు సమావేశానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నేటితో ముగియనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖ : నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది. గత మూడు రోజులుగా సీఐఐ సదస్సు కొనసాగుతోంది. పలు కంపెనీలతో ప్రభుత్వానికి పలు ఒప్పందాలు కుదిరాయి. 

10:15 - February 26, 2018

హైదరాబాద్ : సౌందర్యాభిమానుల కోసం లా బ్లిస్‌ స్కిన్‌ అండ్‌ హెయిర్‌ కేర్‌ ఫర్‌ ఉమెన్‌ సంస్థ ప్రారంభించినట్లు నిర్వహకులు తెలిపారు. అతివల అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు, వారిలో తరగని ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇందుకు ప్రఖ్యాత సంస్థల్లో శిక్షణ పొందిన ఎస్థటీషియన్ ఉషా కొండవీటి సేవలు అందిస్తున్నారని అన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న 100 మంది కస్టమర్లకు 6 నెలల వరకు 50 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్థ లాభాల్లో 50 శాతం సొమ్మును స్వచ్ఛంద సేవా సంస్థ  ద్వారా పేద బాలికల చదువుకు , పేద మహిళల అభ్యున్నతికి వినియోగించినున్నట్లు నిర్వహకులు తెలిపారు. 

 

10:08 - February 26, 2018

నల్గొండ : జిల్లాలో జాతీయ పక్షి నెమళ్లకు రక్షణ లేకుండా పోయింది. అడవిదేవులపల్లి మండలం కృష్ణపట్టి ప్రాంతంలో నెమళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. తాజాగా గుండ్రాలబోడు అటవీప్రాంతంలో  వేటగాటళ్ల విషప్రయోగానికి  ఎనిమిది నెమళ్లు బలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఐదు నెమళ్లను స్థానికులు మాయం చేశారు. ప్రాణం కోల్పోయిన మూడు నెమళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా లేకపోవడంతో జాతీయ పక్షి నెమళ్లకు రక్షణలేకుండా పోయిందని  ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 


 

09:50 - February 26, 2018

చిత్తూరు : కుటుంబ పోషణ కోసం మలేషియా వెళ్లిన కుప్పం యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుప్పం మండలం కమతమూరు గ్రామానికి చెందిన కరుణాకర్‌ కుమారుడు సోము ఐదేళ్ల క్రితం మలేషియాకు వెళ్లాడు. మలేషియాలోని ఓ హోటల్‌లో పని ఇప్పిస్తానని అదే మండలానికి చెందిన రహమాన్‌ సోమును మలేషియా తీసుకువెళ్లాడు. సోము తండ్రి ఇటీవల ఇల్లు కొనుగోలు చేయగా డబ్బు పంపమని సోమును అడిగారు. రెండు మూడు రోజుల్లో పంపిస్తానని చెప్పిన సోము ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడని మలేషియాలోని సహోద్యోగులు సమాచారం అందించారని సోము తండ్రి చెప్పారు. అయితే తన కొడుకు అనారోగ్యంతో చనిపోలేదని రహమానే కొట్టి చంపేసి ఉంటాడని సోము తండ్రి ఆరోపిస్తున్నారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

 

09:45 - February 26, 2018

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు నగరానికి చేరుకునే కేసీఆర్‌.. అంబేద్కర్‌ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులో పాల్గొంటారు. పదహారు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితులు సభ్యులు సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం వరకు సదస్సు జరుగుతుంది. ఆ తర్వాత తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌కు చేరుకుని రాత్రికి బస చేస్తారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

09:41 - February 26, 2018

కర్నూలు : బీజేపీ చేసిన కర్నూలు డిక్లరేషన్‌ను టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ స్వాగతించారు. ఇది పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు అయితే బాగుంటుందన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ కేంద్రం రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కేంద్రం తొలి రాజధానినే ఇంకా పూర్తి చేయలేదని విమర్శించారు. కేంద్రం రాయలసీమకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాయలసీమకు నిధులు ఇచ్చి మాట్లాడాలన్నారు. అన్ని పార్టీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా కష్టం కాదని స్పష్టం చేశారు.

 

09:32 - February 26, 2018

హైదరాబాద్‌ : వెస్ట్‌ జోన్‌ పరిధిలోని కుల్సుంపుర పోలీసు స్టేషన్‌ పరిధిలో గ్యాంగ్‌ వార్‌ జరిగింది. ఓ ముఠా సభ్యులు  మహిళలపై హాకీ స్టిక్స్‌, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. రెండు వర్గాల మధ్య పెరిగిన  మాటా, మాటా దాడికి కారణమైంది. ఘర్షణకు దిగిన రెండు కుటుంబాలు బంధులు కూడా. బాధితులు కుల్సుంపుర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

 

కుల్సుంపుర పీఎస్ పరిధిలో గ్యాంగ్‌ వార్‌

హైదరాబాద్‌ : వెస్ట్‌ జోన్‌ పరిధిలోని కుల్సుంపుర పోలీసు స్టేషన్‌ పరిధిలో గ్యాంగ్‌ వార్‌ జరిగింది. ఓ ముఠా సభ్యులు  మహిళలపై హాకీ స్టిక్స్‌, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. రెండు వర్గాల మధ్య పెరిగిన  మాటా, మాటా దాడికి కారణమైంది. ఘర్షణకు దిగిన రెండు కుటుంబాలు బంధులు కూడా. బాధితులు కుల్సుంపుర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

09:25 - February 26, 2018

రంగారెడ్డి : ఫంక్షన్ కు వెళ్లి తిరిగివస్తుండగా విషాదం నెలకొంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ దుంగలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వెనక వస్తున్న కారుపై దుంగలు పడడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు రామంతపూర్‌కు చెందిన స్వప్న, మణికాంత్‌, పద్మగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఇవాళ కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

కరీంనగర్ : ఇవాళ సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రైతు సమన్వయ సమితి సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 

ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు

ముంబై : దుబాయ్‌లో కన్నుమూసిన నటి శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తరలింపులో ఆలస్యమవుతోంది. ఆమె భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైనా దౌత్యపరమైన కారణాలతో తరలింపు ఆలస్యమౌతుంది. నివేదిక అందాకే దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయన్ని అప్పగిస్తారు. ఆమె పార్థీవదేహం భారత్ చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శన తర్వాత ముంబైలోని జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

దౌత్యపరమైన కారణాలతో శ్రీదేవి భౌతికకాయం తరలింపు ఆలస్యం

ముంబై : దుబాయ్‌లో కన్నుమూసిన నటి శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తరలింపులో ఆలస్యమవుతోంది. ఆమె భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైనా దౌత్యపరమైన కారణాలతో తరలింపు ఆలస్యమౌతుంది. నివేదిక అందాకే దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయన్ని అప్పగిస్తారు. ఆమె పార్థీవదేహం భారత్ చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శన తర్వాత ముంబైలోని జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

09:08 - February 26, 2018

ముంబై : దుబాయ్‌లో కన్నుమూసిన నటి శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తరలింపులో ఆలస్యమవుతోంది. ఆమె భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైనా దౌత్యపరమైన కారణాలతో తరలింపు ఆలస్యమౌతుంది. నివేదిక అందాకే దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయన్ని అప్పగిస్తారు. ఆమె పార్థీవదేహం భారత్ చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శన తర్వాత ముంబైలోని జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శ్రీదేవి భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బస చేశారు. రాత్రి 11గంటలకు శ్రీదేవి బాత్రూంలో కుప్పకూలిపోయారని సమాచారం. గుండెపోటు తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెను వెంటనే రషీద్ హోటల్‌కు తరలించారు. అయితే ఈలోగానే ఆమె చనిపోయారు. శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

09:03 - February 26, 2018

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాస్వామ్య సదస్సుపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ నేత విష్ణు, వైసీపీ నాయకురాలు ఉషాకిరణ్, టీఆర్ ఎస్ ఎంపీ సీతారాం నాయక్, టీడీపీ నేత దినకరన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:50 - February 26, 2018

ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల కోసం విశాఖలో అట్టహాసంగా సదస్సులు నిర్వహిస్తోంది. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలోనూ ఏపీ ప్రభుత్వం ఇలాంటి సదస్సును నిర్వహించింది. మరి వీటివల్ల వస్తున్న పెట్టుబడులెంత, కల్పించబడుతోన్న ఉద్యోగాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం చెబుతోన్న లెక్కల్లో వాస్తవమెంత. అనే వాటిపై నర్సింగరావు చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

శ్రీదేవి పార్దివదేహానికి పోస్టుమార్టం పూర్తి

దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి పార్దివదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు సినీ ప్రముఖులు ముంబైకి తరలి వెళ్లారు. 

08:37 - February 26, 2018

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. జగన్‌ కుట్రలు, కుతంత్రాల్లో ఎవరూ భాగస్వాములు కావద్దని కోరారు. కేంద్ర నిధులు ఇచ్చి ఉంటే రాష్ట్రం ఇంకా మెరుగైన అభివృద్ధి సాధించేదని తెలిపారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఆఖరి అస్త్రంగానే ఉండాలన్నారు. 

 

08:31 - February 26, 2018

మహబూబ్ నగర్ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణకు చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ ఎఫ్ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈమేరకు తమ్మినేనితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఎల్ ఎఫ్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు పార్టీలు చేసే మోసపూరిత హామీలను నమ్మొద్దన్నారు. 

 

08:26 - February 26, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది. మూడు స్థానాల కోసం సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీలో పని చేసినవారికి, సీనియర్లకు అవకాశమిచ్చే యోచనలో గులాబీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సామాజికవర్గాల వారీగా సీట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉండడంతో ఆయా సామాజికవర్గానికి చెందిన నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 
రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీఆర్‌ఎస్‌ భవన్‌ లో హీట్ 
తెలంగాణలో రాజ్యసభ సీట్ల వ్యవహారం టీఆర్‌ఎస్‌ భవన్‌తో పాటు... అటు సచివాలయం, ఇటు ప్రగతిభవన్‌లోనూ హీట్‌ పుట్టిస్తోంది. సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ ఉండడంతో ఆశావహులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పలువురు తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను కలిసి సీట్ల కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. 
ఖాళీ కానున్న 3రాజ్యసభ స్థానాలు  
ఏప్రిల్‌ 2వ తేదీతో తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు స్థానాలూ టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశం ఉంది. దీంతో సీనియర్‌ నేతలంతా రాజ్యసభ సీటుపై కన్నేశారు. పార్టీలో మొదటి నుండి పని చేసిన నేతలతో పాటు తాజాగా పార్టీలో చేరిన నేతలు సైతం ఆ దిశగా పావులు కదుపుతున్నారు. చాలామంది సీఎం కేసీఆర్‌, మంత్రులు, కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కవితల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. 
రాజ్యసభ సీటు కోసం పోటీపడుతున్న జోగినపల్లి 
ఇక రాజ్యసభ సీటు కోసం పోటీపడుతున్న వారిలో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. అదేవిధంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి.. గొల్ల కురుమలలో ఒకరికి ప్రాతినిధ్యం కల్పించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యాదవుల్లో రాజ్యసభ సీటుపై ఆసక్తి పెరిగింది. ఈ సామాజికవర్గానికి చెందిన వరంగల్ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, విద్యాసంస్థల అసోసియేషన్‌ నాయకుడు సుందర్‌రాజ్‌ యాదవ్‌ రాజ్యసభ టికెట్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండడంతో పాటు... రాష్ట్రవ్యాప్తంగా అందరితో సత్సంబంధాలున్నాయి. అలాగే... సీనియర్‌ నేత రాజయ్య యాదవ్‌ కూడా రాజ్యసభ సీటుకోసం ప్రయత్నిస్తున్నారు. 
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ కసరత్తు 
ఇదిలావుంటే... రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు చాలామంది సిద్దమవుతున్నారు. వారిలో కూడా కొంతమంది రాజ్యసభ సీట్లపై కన్నేసినట్లు సమాచారం. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు రాజ్యసభ సీటుపై దృష్టి సారించారు. ఈ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీతో పాటు మరో నాయకుడు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అలాగే... స్పీకర్‌ మధుసూదనాచారి పేరును కూడా కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రావు పేరు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. 
కులాల ప్రాతిపదికన సీట్లు కేటాయించే అవకాశం
మొత్తానికి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. అయితే కులాల ప్రాతిపదికన కేసీఆర్‌ సీట్లు కేటాయించే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కసరత్తు వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే మరో వారం రోజు వేచి చూడాల్సిందే. 

 

08:16 - February 26, 2018

హైదరాబాద్ : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేసీఆర్‌ హాజరయ్యారు. 
తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి
రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సును హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డిని తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా దక్షిణ తెలంగాణ రైతు సమన్వయ సమితి తీర్మానించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌  రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కోటి 62 లక్షల ఎకరాల భూమి : సీఎం కేసీఆర్ 
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌. భూ ప్రక్షళణ నేపథ్యంలో రాష్ట్రంలో కోటి 62 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం భారతదేశంలో ఇప్పటివరకు లేదని, రైతులకు మేలు చేసే పనులు చేపట్టాలని ప్రధాని కోరినట్లు సీఎం తెలిపారు. అయితే కేంద్రం నుండి ఎలాంటి సహకారం లభించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ మొత్తాన్ని నిజామాబాద్‌జిల్లాలోని అంకాపూర్‌ను మించి తీర్చిదిద్దాలని అప్పుడే రైతు సమన్వయ సమితులు విజయం సాధించినట్లని సీఎం చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత రాష్ర్ట ప్రభుత్వానిదే అన్నారు సీఎం. వ్యవసాయ క్షేత్రంలో రైతే రాజన్నారు. రైతులు బంగారు పంటలు పండించాలని సూచించారు. 
కొత్త మండలాలకు గోదాం నిర్మిస్తాం : మంత్రి హరీష్‌ రావు 
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి మండలానికి గోదాం నిర్మిస్తామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణ వచ్చాక వెయ్యి కోట్లతో 18 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాంలు నిర్మించామన్నారు. రైతు సమన్వయ సమితుల సూచన మేరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు అనువైన చోటు మార్కెట్ యార్డులు నిర్మిస్తామన్నారు. రైతు సమన్వయ సమితుల తొలి సదస్సులో 13 జిల్లాల నుండి రాష్ట్ర, మండల, జిల్లా సభ్యులు, సమన్వయ కర్తలు పాల్గొన్నారు. 

 

08:02 - February 26, 2018

ముంబై : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతితో యావద్దేశం దిగ్ర్భాంతికి గురైంది. బాల నటిగా నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టున్నారు. 'పదహారేళ్ల వయసు' సినిమాతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ వంటి అనేక భాషల్లో  నటించి సాటిలేని నటిగా ఎదిగారు. ఐదు పదులు దాటిన వయసులోనూ  అతిలోకసుందరిగా కీర్తి పొందిన శ్రీదేవి మరణాన్ని అభిమానులతోపాటు.. ఆమె సహ నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
శ్రీదేవి మృతిపట్ల చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి 
శ్రీదేవి మృతిపట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  'భారత సినీ రంగంలో శ్రీదేవి లాంటి నటి మరొకరు లేరు రారు అన్నారు. 'జగదేక వీరుడు-అతిలోక సుందరి'లో ఇంద్రజ పాత్ర తన కోసమే పుట్టిందా? అన్నట్లు నటించి మెప్పించిందన్నారు. శ్రీదేవితో తనకు  కుటుంబ సాన్నిహిత్యమూ ఉందన్నారు చిరంజీవి. తెలుగులో శ్రీదేవి అత్యధికంగా 31 సినిమాల్లో తనతో నటించిందని కృష్ణ అన్నారు. శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఆయన అన్నారు. వైజయంతి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నిర్మాత అశ్వినీదత్‌ గుర్తు చేసుకున్నారు. 
శ్రీదేవి మరణ వార్త షాక్‌కు గురిచేసింది- రజనీకాంత్‌
శ్రీదేవి మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని నటుడు రజనీకాంత్‌ అన్నారు. భారత దేశ చిత్రపరిశ్రమ మంచి నటిని కోల్పోయిందన్నారు. శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. శ్రీదేవి బాలనటిగా తనకు తెలుసని..  సినిమాల్లో అంకితభావంతో పనిచేసేవారని అన్నారు. శ్రీదేవీ మృతిపట్ల ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీదేవి మరణం వెండితెరకు తీరనిలోటన్నారు హీరో రజనీకాంత్‌. సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌.  శ్రీదేవితో కలిసి నటించిన రోజులు గుర్తు చేసుకున్నారు నటి శారద. శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 
శ్రీదేవి మృతికి 'మా' సంతాపం 
శ్రీదేవి మృతికి మూవీ ఆర్టిర్ట్స్‌ అసోసియేషన్‌ సంతాపం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో  శ్రీదేవితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణతో నటనలో ఉన్నత శిఖరాలను ఎదిగిన నటి శ్రీదేవి అని ప్రస్తుతించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
మహానటి శ్రీదేవి మృతి తీరని లోటు : కోటశ్రీనివాసరావు
నందమూరి తారకరామారావు తర్వాత అంతటి గొప్ప నటి శ్రీదేవి అని కోట శ్రీనివాసరావు అన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎందరో నటుల సరసన అద్భుతంగా నటించారన్నారు.అంతటి మహానటి మనకు దూరం కావడం తీరని లోటన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ... ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని కోటశ్రీనివాసరావు అన్నారు.
శ్రీదేవి పోషించిన పాత్రలు చిరస్మరణీయం : టీజీ. వెంకటేష్‌ 
శ్రీదేవి వెండితెరపై పోషించిన పాత్రలు చిరస్మరణీయమని రాజ్యసభసభ్యుడు టీజీ. వెంకటేష్‌ అన్నారు. కర్నూలులో శ్రీదేవి మృతికి సంతాపాన్ని తెలిపారు. బాలనటిగా నటజీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి అశేషంగా అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. నేటితరం నటీనటులు శ్రీదేవిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అతిలోకసుందరి అంటే  ఇలాగే ఉంటుందనేలా ముద్ర వేసిన అందాల తార శ్రీదేవి. ఆ గొప్పనటి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె నటించిన చిత్రాలు మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోతాయి. 

07:55 - February 26, 2018

ముంబై : దుబాయ్‌లో కన్నుమూసిన శ్రీదేవి పార్ధివ దేహం ఎప్పుడెప్పుడు భారత్‌కు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. త్వరగా ఆమె భౌతికకాయం భారత్‌కు తరలించేందుకు అత్యున్నత స్థాయి వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం శ్రీదేవి పార్ధివదేహం ముంబై చేరుకునే అవకాశం ఉంది. దీంతో శ్రీదేవిని కడసారి చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు  ముంబైకు తరలివస్తున్నారు. 
దౌత్యపరమైన కారణాలతో తరలింపు కార్యక్రమాలు ఆలస్యం 
అనంతలోకాలకు వెళ్లిన అందాల నటి శ్రీదేవి భౌతికకాయం ఇవాళ భారత్‌ చేరుకోనుంది. నిన్న దుబాయ్‌లో ఓ వివాహ వేడుకకు వెళ్లి మృతి చెందిన శ్రీదేవి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైనా దౌత్యపరమైన కారణాలతో తరలింపు కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే పోలీసులు శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తరలించేందుకు అనుమతిస్తారు. దీంతో నిన్న రాత్రే భారత్‌కు వస్తుందనుకున్న శ్రీదేవి భౌతికకాయం ఆలస్యమైంది. ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్ద మరణిస్తే పోస్ట్‌మార్టం నివేదికకు 24 గంటల సమయం పడుతుందని పలువురంటున్నారు. 
జూహూ శాంతాక్రాజ్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు 
శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం మెహబుబా స్టూడియోకు తరలిస్తారు. అనంతరం జూహూ శాంతాక్రాజ్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక..  శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు ముంబైలోని చార్‌బంగ్లాకు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని... శ్రీదేవి కూతురు జాహ్నవిని పరామర్శించారు. 
శ్రీదేవి నివాసం వద్ద భారీ బందోబస్తు 
మరోవైపు శ్రీదేవి నివాసం వద్ద పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ శ్రీదేవి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.  దీంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి అంత్యక్రియలకు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. 

 

ఇవాళ ముంబైకి చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయం ఇవాళ ముంబైకి చేరుకోనుంది. ఈరోజు సాయంత్రం లోపు శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల నివాళుల తర్వాత జుహూలోని శాంతాక్రజ్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరుగునున్నాయి. శ్రీదేవి అంత్యక్రియల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొననున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరాఖండ్ లో బీజేపీ ఎమ్మెల్యే మంగన్ లాల్ కన్నుమూత

ఉత్తరాఖండ్ : బీజేపీ ఎమ్మెల్యే మంగన్ లాల్ కన్నుమూశారు. డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగన్ లాల్ మృతి చెందారు. 

 

రెండు కుటుంబాలు మధ్య ఘర్షణ

హైదరాబాద్ : కుల్సుంపురా పరిధిలో రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. మహిళలపై బ్యాట్లు, హాకీ స్టిక్స్ తో ఓ ముఠా దాడి చేశారు. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇరు కుటుంబాల బంధువులు ఘర్షణ పడ్డారు. సీసీ ఫుటేజీలో దాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. 

Don't Miss