Activities calendar

27 February 2018

22:16 - February 27, 2018

ముంబై : ప్రముఖ సినీ నటి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంది. ముంబై ఎయిర్ పోర్టు వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంబామింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు పార్ధివదేహం అప్పగించారు. దుబాయ్ నుంచి ముంబైకి తరలించారు. దుబాయ్ ఎమిరేట్స్ కార్గో విమానంలో శ్రీదేవి భౌతికకాయం తరలించారు. రేపు శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మ.12.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం.. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచుతారు. మ.2 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మ.3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగునున్నాయి. తమ అభిమాన కథనాయికను కడసారి చూసేందుకు భారీగా అభమానులు తరలివస్తున్నారు. ప్రత్యేక భద్రత ఏర్పాట్లు పోలీసులు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

22:04 - February 27, 2018

పెద్దపల్లి : ప్రాణాలు పోయినా సరే సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తి లేదన్నారు సీఎం కేసీఆర్. సింగరేణిలో కారుణ్య నియామకాలకు దరఖాస్తు పెట్టుకున్న వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈరోజు కేసీఆర్‌ ఆదిలాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు.  

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా పర్యటించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్‌మూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్‌ శంఖుస్థాపన చేశారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రి ఈటల, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ పలువురు అధికారులు ఉన్నారు. 

80 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ పథకం పూర్తయితే అంతర్గాం, పాలకుర్తి మండలాల పరిధిలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీలో 16 వందల మెగావాట్ల విద్యుత్ పరిశ్రమ పనులు కొనసాగుతున్నాయని.. ఎరువుల కర్మాగారం ఆధునీకరణ జరగుతోందన్నారు.

అంతకుముందు కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని బ్యాగు నుండి పొగలు వచ్చాయి. తీగల గుట్టపల్లి వద్ద నుండి హెలికాప్టర్‌ పైకిలేచే సమయంలో పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై 100 మీటర్ల దూరంలో బ్యాగును పడేశారు. వైర్‌ లెస్‌ సెట్‌లో షాట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

అనంతరం పెద్దపల్లి నుంచి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకున్న కేసీఆర్...  సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారీ బహిరంగ సభలో  మాట్లాడిన కేసీఆర్ సింగరేణిని ప్రాణం పోయినా ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం తన వాటా విరమించుకుంటే డబ్బులు చెల్లించి కంపెనీని సొంతం చేసుకుంటామని తేల్చి చెప్పారు. 

సింగరేణిలో కారుణ్య నియామకాలకు దరఖాస్తు పెట్టుకున్న వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అర్హులైన వారంతా కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కేసీఆర్ సూచించారు. అందుకోసం మార్చి మొదటివారంలోనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

నేడు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సింగరేణి కార్మికులకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కేసీఆర్ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.  దీంతో సింగరేణిపై 10 కోట్ల ఆర్థిక భారంతో పాటు.. ఉత్పత్తిపరంగా మరో 5 కోట్లు నష్టం జరగనున్నట్లు సమాచారం. 

 

పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్

22:00 - February 27, 2018

గుంటూరు : రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని స‌రిచేయాల‌నేదే త‌న డిమాండని అన్నారు. హేతుబ‌ద్దత లేకుండా విభ‌జ‌న చేయ‌డం న్యాయ‌మా, ఇచ్చిన హ‌మీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం న్యాయ‌మా అంటూ అయ‌న కేంద్రాన్ని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తిచేసుకున్న చంద్రబాబును టీడీపీ నేతలు అభినందించారు. 

అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. దాదాపు మూడుగంటలపాటు సాగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రిపై చంద్రబాబు మండిప‌డ్డారు. జ‌గ‌న్‌పై ఉన్న కేసులు వాస్తవమని రాష్ట్రానికి  వ‌చ్చే పెట్టుబ‌డులూ వాస్తవ‌మే అని అన్నారు. జ‌గ‌న్ నేరాల వ‌ల్ల రాష్ట్ర ప్రతిష్ట మంట‌గ‌లిసింద‌న్నారు. జ‌గ‌న్ నిర్వాకం వ‌ల్ల దేశ ప్రధానికి కూడా  నోటీసులు వ‌స్తున్నాయ‌ని అన్నారు. ఇలాంటి వ్యక్తి తన ఆస్తుల గురించి తన వ్యక్తిత్వం గురించి మాట్లాడడమేంటని ఎద్దేవా చేశారు. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి క‌దా మీకెందుకు ప్రత్యేక హోదా అని బీజేపి నేత‌లు ప్రశ్నించ‌డాన్ని కూడా స‌మావేశంలో చంద్రబాబు త‌ప్పుప‌ట్టారు.

జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మరిచిపోకూడదని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు బాగుండి వారు ఆనందంగా గడిపే వాతావరణం కల్పించే ప్రభుత్వాలే మనుగడ సాధిస్తాయన్నారు. టీడీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు వచ్చాయని.. అయితే వారు కాసుల కోసం కక్కుర్తి పడి వాటిని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. 2004 నుంచి పదేళ్లు కూడా తామే అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదన్నారు. కట్టుబట్టలతో పాలన ప్రారంభించినా మూడేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. సాంకేతికతను ఎంత అందిపుచ్చుకుంటున్నా తాను ఇప్పటికీ సెల్ ఫోన్ వాడనని చంద్రబాబు తెలిపారు. స్మార్ట్ ఫోన్ సాయంతో కదలకుండా ఎన్నో పనులు చక్కపెట్టుకోవచ్చని...  కానీ తాను ఎంతో అవసరమైతే తప్ప స్మార్ట్‌ఫోన్‌ వాడనన్నారు. ఫోన్‌ దగ్గర ఉంటే ఒత్తిడికి కారకంగా భావిస్తానన్నారు. 

అంతకుముందు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అందరి మధ్య 40 కిలోల కేక్‌ను చంద్రబాబు కట్‌ చేశారు. 

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చంద్రబాబు కటౌట్‌కు పాలాభిషేకం చేసి.. 40 రక్షాల పుష్పాలతో అభిషేకం చేశారు.  కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు ఆధ్వర్యంలో 40 పావురాలను ఎగురవేశారు. TNSF ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి కేక్‌ కట్‌చేశారు. 

అటు  నటి శ్రీదేవి మృతికి సమన్వయ కమిటీ సంతాపం తెలిపింది. శ్రీదేవి మృతి బాధాకరమని.. మన రాష్ట్రంలో పుట్టిన ఆమె జాతీయస్థాయి సినిమా రంగంలో రాణించారన్నారు. శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తుండటం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అఖిల సంఘాల స‌మావేశం ఎప్పుడు నిర్వహించాలి ఈ స‌మావేశానికి ఎవ్వరెవ‌రిని పిల‌వాలి అనేదానిపై మ‌రో రెండు రోజుల్లో జ‌రిగే స‌మ‌న్వయ క‌మిటీలో నిర్ణయిద్దామ‌ని చంద్రబాబు అన్నారు.

21:57 - February 27, 2018

ముంబై : నటి శ్రీదేవి మృతిపై మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. శ్రీదేవి ప్రమాద వశాత్తు మృతి చెందినట్లు పేర్కొన్న దుబాయ్‌ అధికారులు కేసును మూసివేశారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రి పది గంటలలోపు శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకోనుంది. శ్రీదేవి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.
ఉత్కంఠకు తెర
దుబాయ్‌లోని ఓ హోటల్‌లో కన్నుమూసిన నటి శ్రీదేవి భౌతికకాయం అప్పగింతలో గత మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ విచారణ ముగియడంతో శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
బాత్‌టబ్‌లో పడి మృతి చెందారని ఫోరెన్సిక్‌ నివేదిక
శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందారని ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చింది. అనంతరం పోలీసులు ఈ కేసును దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ విచారణ పూర్తి చేశాక మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఈమేరకు భారత దౌత్య అధికారులు, శ్రీదేవి కుటుంబసభ్యులకు అనుమతి పత్రాలు అందజేశారు. శ్రీదేవి మృతి ప్రమాదవశాత్తు జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఈ కేసును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అన్ని కేసుల మాదిరిగానే శ్రీదేవి కేసును విచారణ చేపట్టామని దుబాయ్‌ సీనియర్‌ ప్రాసిక్యూటర్‌ గల్ఫ్‌న్యూస్‌కు వెల్లడించారు. హై ప్రొఫైల్‌ కావడంతో దుబాయ్‌ అధికారులు ఈ కేసులో ఆచి తూచి వ్యవహరించారు. ఎంబామిగ్‌ ప్రక్రియ తర్వాత శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి తరలించారు.
శ్రీదేవి మృతికేసు ఎన్నో మలుపులు 
శ్రీదేవి మృతికేసు ఎన్నో మలుపులు తిరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయారన్న వార్తలు వచ్చాయి. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో శ్రీదేవి మునిగి చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది. శ్రీదేవి తలకు బలమైన గాయాలైనట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైందని వదంతులు వినిపించాయి. ఈ కేసులో దుబాయ్‌ పోలీసులు శ్రీదేవి భర్త బోనికపూర్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు సమాచారం. అదే హోటల్‌లో ఉన్న శ్రీదేవి సోదరి శ్రీలత స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ముంబై అంధేరి వెస్ట్‌లో ఆమె ఇంటి సమీపంలో ఉన్న సెలబ్రేషన్‌క్లబ్‌లో ఉంచుతారు. శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.

 

21:52 - February 27, 2018

ముంబై : కాసేపట్లో సినీ నటి శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకోనుంది. ఇప్పటికే దుబాయ్‌ నుంచి ముంబైకి ప్రత్యేక విమానం బయల్దేరింది. రేపు శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు ప్రజల సందర్శనార్దం సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఉంచనున్నారు. అనంతరం 2 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి విలే పార్లే సేవా సమాజ్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు తమ అభిమాన కథానాయికను కడసారి చూసేందుకు ముంబైకు భారీ ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీదేవికి నివాళులర్పించేందుకు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కూడా ముంబైకి తరలిరానున్నారు. 

 

21:41 - February 27, 2018

చంద్రబాబు రాజకీయ జీవితానికి 40 ఏళ్లు... ఈ 40 ఏళ్లలో బాబు సాధించింది ఏంటి ? చంద్రబాబులో ప్లస్ లు, మైనస్ లు ఏంటీ ? ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

బస్సుయాత్రలో బహిరంగ సభలు ఏంటి : డీకే.అరుణ

హైదరాబాద్ : బస్సుయాత్రలో బహిరంగ సభలు ఏంటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ అన్నారు. వైఎస్, కిరణ్ లు బస్సు యాత్రలు చేశారు కానీ ఇలా బహిరంగసభలు పెట్టలేదని చెప్పారు.

సీపీఎం జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : ఎంబీ భవన్ లో సీపీఎం జాతీయ మహాసభల పోస్టర్ ను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్ లో జాతీయ మహాసభలు జరుగుతాయని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఏప్రిల్ 22న భారీ బహిరంగ సభ ఉంటుందని.. వేలాది మందితో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఉంటుందని తెలిపారు. మహాసభల నిర్వహణకు 21 కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రభాత భేరీలు, బైక్ లు ర్యాలీలు, 2కే రన్ లు, బస్సు జాతాలు నిర్వహిస్తామని తెలిపారు.

మేమే తెచ్చామని బీజేపీ భుజాలు ఎగరేసుకుంటుందన్న టీజీ

హైదరాబాద్ : తామే తెచ్చామని బీజేపీ భుజాలు ఎగరేసుకుంటుందని టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా ఇచ్చి భుజాలు ఎగరేసుకుంటే అభ్యంతరం లేదన్నారు. 

రుణమాఫీ వడ్డీ చెల్లింపులకే సరిపోయిందన్న డీకే.అరుణ

హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీ చెల్లింపులకే సరిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ అన్నారు.  రైతు సమన్వయ సమితులు కావు... రౌడీ సమన్వయ సమితులు అని ఘాటు విమర్శలు చేశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం సర్వేలకే వాడుతోందన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ ఎకరాకు రూ.4 వేలు అంటున్నారని..4 ఏళ్లలో ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారా..? ఒక్క ఎకరాకు నీళ్లు అందించారా..? అని ప్రశ్నించారు. 

 

20:46 - February 27, 2018

చింతకాయల కథ సెప్పిన రేవంత్ రెడ్డి..కేసీఆర్ గూడ అసొంటోడే అంటున్నడు, కాంగ్రెస్ పార్టీ యాత్ర మీద మంత్రి కౌంటర్...ఆమీలన్నీ నెరవేర్సేసినమంటున్న జగదీష్, ప్రత్యేక హోదాకు అడ్డంకి రాష్ట్ర నాయకులే...ప్రజల ప్రశ్నిస్తే తప్ప దొర్కరు ఈ దొంగలు, తెలంగాణల ఊపందుకున్న డీఎస్పీ యాత్ర... ఊహించని ఉద్యమంగా దళిత శక్తి ప్రోగ్రాం, శ్రీదేవిగారి సావుజేస్తున్న టీవీలు, పేపర్లు... ఎవల్కిఅక్కరకొచ్చే వార్తలివేంది, క్రిష్ణ జిల్లాల ఇరవై తండాలకు కిడ్నీల రోగం.. మరో ఉద్ధానం లేకఅయితున్న గిరిజన గూడాలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:26 - February 27, 2018

రైతు సమన్వయ సమితిలు కావని..టీఆర్ ఎస్ సమన్వయ సమితిలు అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ నేత మంద జగన్నాథం పాల్గొని, మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలు తప్ప వేరేవారు లేరని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:14 - February 27, 2018
20:12 - February 27, 2018
20:04 - February 27, 2018

నిజామాబాద్‌ : పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతు జేఏసీ నేతలు పర్యటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళారులంతా ఏకమై తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు... లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

20:01 - February 27, 2018

పెద్దపల్లి : సీఎం కేసీఆర్ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. అంతర్గాం మండలం మూర్‌మూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ పథకం పూర్తి అయితే అంతర్గాం, పాలకుర్తి మండల పరిధిలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీలో 16 వందల మెగావాట్ల విద్యుత్ పరిశ్రమ పనులు కొనసాగుతున్నాయని.. ఎరువుల కర్మాగారం ఆధునీకరణ జరగుతోందన్నారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రి ఈటల, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ పలువురు అధికారులు ఉన్నారు. 

రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు

హైదరాబాద్ : రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగున్నాయి. మార్చి 14వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 8.45 గంటలకు నుంచి 12 గంటల వరకు పరీక్షల వేళలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 9, 63 వేల 5 46 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 

ఎంబామింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు పార్ధివదేహం అప్పగింత

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎంబామింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు పార్ధివదేహం అప్పగించారు. కాసేపట్లో శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. దుబాయ్ ఎమిరేట్స్ కార్గో విమానంలో శ్రీదేవి భౌతికకాయం తరలించనున్నారు.

19:50 - February 27, 2018

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎంబామింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు పార్ధివదేహం అప్పగించారు. కాసేపట్లో శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. దుబాయ్ ఎమిరేట్స్ కార్గో విమానంలో శ్రీదేవి భౌతికకాయం తరలించనున్నారు. దుబాయ్ నుంచి ముంబై చేరుకునేందుకు మూడు గంటల సమయం పడుతుంది. రాత్రి 9 గంటలకు శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీదేవిని కడసారి చూసుకునేందుకు అభిమానులు భారీ ఎత్తున ముంబై తరలివస్తున్నారు. ఇప్పటికే అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరోవైపు అభిమానులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

మార్చి 3, 4న పోలీస్ ఎక్స్ పో ఏర్పాటు : డీజీపీ

హైదరాబాద్ : మార్చి 3, 4న పోలీస్ ఎక్స్ పో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎక్స్ పోను హోంమంత్రి నాయిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మార్చి 4న పీపుల్స్ ప్లాజా నుండి రన్ మొదలు అవుతుందన్నారు. 

సాత్నాల ప్రాజెక్టుకు రూ.28 కోట్లు మంజూరు : సీఎం కేసీఆర్

ఆదిలాబాద్ : డైట్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సాత్నాల ప్రాజెక్టుకు రూ.28 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. చెరువుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టుకు రూ.870 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

 

డైట్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ

ఆదిలాబాద్ : డైట్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్న గిరిజన విద్యార్థులు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని గిరిజన విద్యార్థులు అడ్డుకున్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. గిరిజన విద్యార్థుల నిరసన పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. 

పలువురు బాలకార్మికులకు విముక్తి

హైదరాబాద్ : పాతబస్తీ మొఘల్ పురా బంగ్లే కార్ఖానాలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఖైసర్ హోటల్ లో పలువురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు. 

18:14 - February 27, 2018

నిజామాబాద్‌ : పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులంతా సిండికేట్‌గా మారడంతో గిట్టుబాటు దర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న ధరతో తమ ఖర్చులు కూడా రావడం లేదని... క్వింటాకు 12 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిజామాబాద్‌లో పసుపు పంట రైతుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆనంద్‌పాల్‌ అందిస్తారు. 


 

ప్రత్యేక విమానంలో శ్రీదేవి పార్ధివదేహాన్ని ముంబైకు తరలింపు

దుబాయ్ : శ్రీదేవి మృతిపై విచారణ ముగిసినట్లు దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. శ్రీదేవి మృతి వెనక ఎలాంటి కుట్ర లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందినట్లు నిర్దారించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రాసిక్యూషన్‌ అందజేసింది. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాసేపట్లో శ్రీదేవి బౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. అనంతరం శ్రీదేవి భౌతికకాయం ముంబై తరలించనున్నారు. ఇప్పటికే సిద్దంగా ఉన్న ప్రత్యేక విమానంలో శ్రీదేవి పార్ధివదేహాన్ని ముంబైకు తరలించనున్నారు.

శ్రీదేవి మృతిపై ముగిసిన విచారణ

దుబాయ్ : శ్రీదేవి మృతిపై విచారణ ముగిసినట్లు దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. శ్రీదేవి మృతి వెనక ఎలాంటి కుట్ర లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందినట్లు నిర్దారించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రాసిక్యూషన్‌ అందజేసింది. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాసేపట్లో శ్రీదేవి బౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. అనంతరం శ్రీదేవి భౌతికకాయం ముంబై తరలించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

18:04 - February 27, 2018

దుబాయ్ : శ్రీదేవి మృతిపై విచారణ ముగిసినట్లు దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. శ్రీదేవి మృతి వెనక ఎలాంటి కుట్ర లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందినట్లు నిర్దారించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రాసిక్యూషన్‌ అందజేసింది. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాసేపట్లో శ్రీదేవి బౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. అనంతరం శ్రీదేవి భౌతికకాయం ముంబై తరలించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పటికే సిద్దంగా ఉన్న ప్రత్యేక విమానంలో శ్రీదేవి పార్ధివదేహాన్ని ముంబైకు తరలించనున్నారు. దుబాయ్‌ నుంచి ముంబైకు దాదాపు నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో శ్రీదేవి భౌతికకాయం రాత్రి 10 గంటల వరకు ముంబై చేరుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున ముంబై తరలివస్తున్నారు. ఇప్పటికే అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరోవైపు అభిమానులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో.. పోలీసులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. 

 

17:58 - February 27, 2018

వికారాబాద్ : 'కేసీఆర్.. నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు' అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీ.కాంగ్రెస్ బస్సుయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుపడ్తదని అందరూ అనుకున్నారని...కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశలు నీరుగార్చారని పేర్కొన్నారు. నాలుగేళ్లలో దోపిడీ వ్యవస్థ ఏర్పడిందన్నారు. మిషన్ భగీరత, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెస్తామని చెప్పుకుంటూ.. కేసీఆర్, కేటీఆర్ జేబులు నింపుకునేందుకు మిషన్ భగీరత, ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొచ్చారని తెలిపారు. 

17:54 - February 27, 2018

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్ టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు. తన కుటుంబంలోని ఎవర్ని చంద్రబాబు నమ్మరని...కానీ అవకాశం కోసం కుటుంబసభ్యులను వాడుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్ టీఆర్ గొప్పవాడే..అందులో ఏలాంటి డౌట్ లేదు.. కానీ ఎన్ టీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకున్నదా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

 

సీఎం చంద్రబాబుపై అంబటి ఫైర్

హైదరాబాద్ : ఎన్ టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యారని వైసీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు  ఆరోపించారు. తన కుటుంబంలోని ఎవర్ని చంద్రబాబు నమ్మరని...కానీ అవకాశం కోసం కుటుంబసభ్యులను వాడుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్ టీఆర్ గొప్పవాడే..అందులో ఏలాంటి డౌట్ లేదు.. కానీ ఎన్ టీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకున్నదా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

 

17:46 - February 27, 2018

హైదరాబాద్ : బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్‌ చేశారు. నోట్లరద్దు- జీఎస్టీని అభినందించిన కేసీఆర్‌ ఇప్పుడు బీజేపీని తిట్టినట్లు చేస్తున్నారని అన్నారు. రైతులకు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చినంత మాత్రాన టీఆర్‌ఎస్‌ పక్షాన వస్తారనుకోవడం పొరపాటన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వని టీఆర్‌ఎస్‌ను గద్దెదింపేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ అన్నారు. 

 

17:42 - February 27, 2018

ప.గో : చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి.. 40 కేజీల కేక్‌ కట్‌ చేశారు. అనంతరం రోడ్డుపై వెళ్తున్న వాహనాలను నిలిపి మరీ స్వీట్లు పంచి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నిరంతరం శ్రామికుడిలా కష్టపడుతుంటే... జగన్‌ సీఎం పదవి కోసం పాకులాడుతూ పాదయాత్ర చేస్తున్నారని చింతమనేని ఆరోపించారు. 

 

17:40 - February 27, 2018

గుంటూరు : రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన..  పెట్టుబడులు వస్తున్నాయి కదాని ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నించడం సరికాదన్నారు. జగన్‌పై కేసులు ఎంత వాస్తవమో.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అంతే నిజమని చంద్రబాబు అన్నారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మరిచిపోకూడదని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు బాగుండి వారు ఆనందంగా గడిపే వాతావరణం కల్పించే ప్రభుత్వాలే మనుగడ సాధిస్తాయన్నారు. టీడీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు వచ్చాయని.. అయితే వారు కాసుల కోసం కక్కుర్తి పడి వాటిని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. 2004 నుంచి పదేళ్లు కూడా తామే అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదన్నారు. కట్టుబట్టలతో పాలన ప్రారంభించినా మూడేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. అంతకు ముందు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు  శుభాకాంక్షలు తెలిపారు. అందరి మధ్య 40 కిలోల కేక్‌ను చంద్రబాబు కట్‌ చేశారు. అటు  నటి శ్రీదేవి మృతికి సమన్వయ కమిటీ సంతాపం తెలిపింది. శ్రీదేవి మృతి బాధాకరమని.. మన రాష్ట్రంలో పుట్టిన ఆమె జాతీయస్థాయి సినిమా రంగంలో రాణించారన్నారు. శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తుండటం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

సాయంత్రం దుబాయ్‌ నుంచి భారత్‌కు శ్రీదేవి పార్ధివదేహం

దుబాయ్ : సాయంత్రం 6 గంటల సమయంలో దుబాయ్‌ నుంచి శ్రీదేవి పార్ధివదేహం భారత్‌కు బయల్దేరనుంది. దుబాయ్‌ నుంచి ముంబైకు వచ్చేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో శ్రీదేవి భౌతికకాయం ముంబైకు రాత్రి 10 గంటల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇక ముంబైలో శ్రీదేవి భౌతికకాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభిమానులు ముంబైలోని శ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. ఇక శ్రీదేవి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో...

శ్రీదేవి భౌతికకాయం తరలించేందుకు క్లియరెన్స్‌ పత్రాలు జారీ

దుబాయ్ : ఎన్నెన్నో ట్విస్టుల అనంతరం శ్రీదేవి మృతదేహం భారత్‌కు తరలించేందుకు దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు అంగీకరించారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌ నివేదికల అనంతరం మళ్లీ విచారణ చేపట్టిన ప్రాసిక్యూషన్‌... హోటల్‌ సిబ్బంది, బోనీకపూర్‌తో పాటు అనేకమందిని విచారించిన అనంతరం... శ్రీదేవి భౌతికకాయం తరలించేందుకు క్లియరెన్స్‌ పత్రాలు జారీ చేసింది. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి రెండు గంటల సమయం పడుతుంది. అనంతరం శ్రీదేవి భౌతికకాయం కుటుంబ సభ్యులకు అందజేస్తారు. 

17:30 - February 27, 2018

దుబాయ్ : ఎన్నెన్నో ట్విస్టుల అనంతరం శ్రీదేవి మృతదేహం భారత్‌కు తరలించేందుకు దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు అంగీకరించారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌ నివేదికల అనంతరం మళ్లీ విచారణ చేపట్టిన ప్రాసిక్యూషన్‌... హోటల్‌ సిబ్బంది, బోనీకపూర్‌తో పాటు అనేకమందిని విచారించిన అనంతరం... శ్రీదేవి భౌతికకాయం తరలించేందుకు క్లియరెన్స్‌ పత్రాలు జారీ చేసింది. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి రెండు గంటల సమయం పడుతుంది. అనంతరం శ్రీదేవి భౌతికకాయం కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సాయంత్రం 6 గంటల సమయంలో దుబాయ్‌ నుంచి శ్రీదేవి పార్ధివదేహం భారత్‌కు బయల్దేరనుంది. దుబాయ్‌ నుంచి ముంబైకు వచ్చేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో శ్రీదేవి భౌతికకాయం ముంబైకు రాత్రి 10 గంటల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇక ముంబైలో శ్రీదేవి భౌతికకాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభిమానులు ముంబైలోని శ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. ఇక శ్రీదేవి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో... పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

 

దుబాయ్ ఎయిర్ పోర్టుకు శ్రీదేవి మృతదేహం తరలింపు

దుబాయ్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ ఎయిర్ పోర్టుకు తరలించారు. ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

17:10 - February 27, 2018

నిజామాబాద్‌ : జిల్లా రాజకీయాల్లోకి వారసులు వచ్చేస్తున్నారు. ఆపార్టీ.. ఈ పార్టీ... అని భేదం లేకుండా.. ప్రతి పార్టీలోని సీనియర్‌ నాయకుడూ.. తమ వారసుణ్ణి రాజకీయాల్లోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణ ఎన్నికల నాటికి.. వారసుడిని బరిలోకి దించి.. గెలిపించి.. చట్టసభలకు పంపేందుకు చాలామంది నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. 
రాజకీయాల్లోకి సీనియర్‌ నేతల వారసులు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని రాజకీయాలకు ఇప్పుడు వారసత్వం అంశం కేంద్ర బిందువుగా మారింది. అన్ని పార్టీల్లోని సీనియర్‌ నాయకులు.. తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేయాలన్న వాదన వినిపిస్తుండడం... కొందరు నేతలకు వయసు మీద పడుతుండడం కారణంగా.. వారసుల అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. తమ కుమారులను రాజకీయాల్లో దించేందుకు నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. 
రాజకీయాల్లో జిల్లాకు ప్రత్యేక స్థానం 
రాష్ర్ట రాజకీయాల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ప్రత్యేకత స్థానం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ జిల్లాకు చెందిన నాయకులు  కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఆనాటి అర్గుల్‌ రాజారాం నుంచి నేటి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వరకూ చాలామంది.. మంత్రులుగా కీలక భూమిక పోషించారు. సంతోష్‌రెడ్డి, ఏలేటి మహీపాల్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, డి.శ్రీనివాస్, మండవ వెంకటేశ్వరరావు, షబ్బీర్‌ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేశ్‌పల్లి గంగారెడ్డి, మధు యాష్కి, కవిత ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది నిజామాబాద్‌ నేతలు రాష్ర్ట, జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందినవారే. 
డీఎస్‌కు అసలైన వారసులెవరన్న చర్చ
2019 ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించేందుకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగాను, మంత్రిగాను చేసి... ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న డి.శ్రీనివాస్‌ తనయులు సంజయ్‌, అర్వింద్‌లు చట్టసభలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సంజయ్‌ ఇప్పటికే నగరపాలక సంస్థ మేయర్‌గా కూడా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలకు వెళ్లాలని డీఎస్‌ కుమారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో.. డీఎస్‌ చిన్న కుమారుడు ఏకంగా తన తండ్రి కొనసాగుతున్న పార్టీని కాదని బీజేపీలో చేరారు. ఈయన, నిజామాబాద్‌ లోక్‌సభకు కమలదళం తరఫున బరిలోకి దిగాలని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పుడు ఈ వారసులిద్దరిలో డీఎస్‌ పేరు ఎవరు నిలబెడతారన్న ఆసక్తి నెలకొంది.
పోటీకి వ్యూహ ప్రతివ్యూహాలు 
మరోవైపు టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారులు సైతం పోటీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. పోచారం చిన్న కుమారుడు భాస్కర్‌ ఇప్పటికే రాజకీయ అరంగేట్రం చేసి... దేశాయిపేట సహకార సంఘం ఎన్నికల్లో  గెలిచి ఛైర్మన్‌ అయ్యారు. తండ్రితో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ యువతను ఆకర్షిస్తున్నాడు. అటు, పోచారం పెద్ద కుమారుడు సురేందర్‌రెడ్డి కూడా రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే అనుచరులతో దీనిపై చర్చిస్తున్నారు..  పోచారానికి వయసు మీదపడుతున్న నేపథ్యంలో...  ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక తన కుమారుల్లో ఎవరో ఒకరికి  అవకాశం ఇప్పిస్తారా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పుడే చట్టసభలకు వెళ్ళాలన్న భావనలో ఈ ఇద్దరు అన్నదమ్ములూ ఉన్నట్లు సమాచారం. 
కుమారుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న షబ్బీర్‌ అలీ 
మరో వైపు కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత... మండలి ప్రతి పక్ష నాయకుడు షబ్బీర్‌ అలీ తన కుమారుడు ఇలియాస్‌ను రాజకీయ వారసుడిగా బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కుమారుణ్ణి పార్టీ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారాయన. ఇలియాస్‌ కూడా యూత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తన కుమారుడు ఇలియాస్‌ను గత ఎన్నికల్లోనే కామారెడ్డి నుంచి పోటీలో నిలిపేందుకు ప్రయత్నించినా.. చివరి నిమిషంలో ఎడ్లరాజిరెడ్డికి అవకాశం దక్కింది. ఈసారి పార్టీ అధిష్ఠానం యువతకే పెద్దపీట వేస్తామని ప్రకటించడంతో తన వారసుణ్ణి కామారెడ్డి లేదా ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దింపేందుకు షబ్బీర్‌అలీ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకీ జగన్‌ ఆసక్తి 
మాస్‌ లీడర్‌గా పేరుపొందిన టీఆర్ఎస్‌  సీనియర్‌ నేత  బాజిరెడ్డి గోవర్దన్‌ కూడా తన కుమారుడు జగన్‌ను రాజకీయ వారసుడిగా ఎన్నికల్లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న జగన్‌... ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకీ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోని పలువిభాగాల నాయకులను సమన్వయం చేసుకుంటున్న జగన్‌.. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ తనదైన శైలిలో రాజకీయాలు చక్కబెడుతున్నారు. తండ్రి సలహాలు, సూచనలు తీసుకుంటూ ప్రజాసేవలో ఉంటానని...  పార్టీ అవకాశం కల్పిస్తే.. పోటీకి సిద్ధమేనని జగన్‌ సుముఖతనూ వ్యక్తం చేశారు. 
ఎన్నికల్లో  పలువురి పరాజయం  
ఈ జిల్లాలో  పలువురు ముఖ్యనేతల వారసులు పోటీ చేసి ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంతోష్‌రెడ్డి కుమారుడు వాసుబాబు, కేశ్‌పల్లి గంగారెడ్డి తనయుడు ఆనంద్‌రెడ్డి, టీడీపీ నేత అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లిఖార్జున్‌ రెడ్డి గతంలో ఎన్నికల్లో పోటీచేసి ఓటమిని చవిచూశారు. అయితే.. తండ్రి ఆశించి ఓడినా.. తనయుడు చట్టసభ వెళ్లిన సందర్భమూ జిల్లాలో ఉంది. వేముల సురేందర్‌రెడ్డి పరాజయం కాగా..  ఆయన కుమారుడు తొలి ప్రయత్నంలోనే శాసనసభలో అడుగుపెట్టి... ప్రస్తుతం  మిషన్ భగీరథ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న నేతల వారసుల భవితవ్యం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. 

 

17:04 - February 27, 2018

శ్రీకాకుళం : లక్షలాది మంది దాహార్తిని తీర్చే నది మురికి కాలువను తలపిస్తోంది. మురుగు నీరు, చెత్త, చెదారం, ఇతర వ్యర్థాలన్నీ కలిసి మురికి కాలువగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా నగర ప్రజలకు సురక్షిత నీరు అందించాల్సిన నగర పాలక సంస్థ చోద్యం చూస్తోంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది పరిస్థితి.  
దుర్గంధం వెదజల్లుతున్న నాగావళి నది
ఎందరికో దాహార్తిని తీర్చే నాగావళి నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దుర్గంధం వెదజల్లుతూ శ్రీకాకుళం నగరవాసులను ఇబ్బంది పెడుతోంది. ఆస్పత్రుల నుండి వచ్చే వ్యర్థాలు, మురుగు నీరు ఈ నదిలోనే కలుస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వ వైద్య విద్యాలయ, ప్రైవేటు కిమ్స్‌ ఆస్పత్రి వ్యర్థాలన్నిటితో నదిని డంపింగ్‌ యార్డుగా వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.  
80 శాతం ప్రజలకు జీవనాధారం
శ్రీకాకుళం జిల్లాలో 80 శాతం ప్రజలకు ఈ నది జీవనాధారం. నగర వాసులకు ప్రతిరోజు సురక్షిత త్రాగునీరు అందించాలన్న నిబంధన మేరకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో... ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉన్న మెయిన్‌ వాటర్‌ ట్యాంకుల నుండి నీటి సరఫరా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ నీటిని ఫిల్టరైజేషన్‌, క్లోరినేషన్‌ ఎంత వరకు చేస్తున్నారన్నది అధికారులకే తెలియాలి. నది ఇంత కలుషితం అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. 
నాగావళిలో తగ్గిన నీటి నిల్వలు
కాలుష్యానికి తోడు నదిలో నీటి నిల్వలూ తగ్గిపోయాయి. దీంతో వ్యర్థాలన్నీ కుప్పలుతెప్పలుగా నదిలో తేలియాడుతున్నాయి. నాగావళిలో కాలుష్యంపై చర్యలు తీసుకోవాలంటున్నారు నగరవాసులు. హాస్పిటల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్దతులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ది ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ శ్రీకాకుళం సంస్థ సేవ్‌ నాగావళి అంటూ అధికారుల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నాగావళిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 

 

16:57 - February 27, 2018

తూర్పుగోదావరి : అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా అవినీతి నిరోధకశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అప్పుడే రాజకీయ అవినీతి బయటపడుతుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన ఏసీబీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...  ప్రతి జిల్లాలోనూ ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు ధనార్జన కోసం కాకుండా.. సేవే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 

 

16:40 - February 27, 2018

ముంబై : ఎన్నో ట్విస్టులు నెలకొన్న శ్రీదేవి మృతిపై అనుమానాలు వీడుతున్నాయి. శ్రీదేవి భౌతికకాయం ఇచ్చేందుకు ప్రాసిక్యూషన్‌ అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన పలు పత్రాలు బోనీకపూర్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ నిర్వహిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు శ్రీదేవి భౌతికకాయం అందజేయనున్నారు. ఇక శ్రీదేవి మృతిపై బోనీకపూర్‌ కుటుంబ సభ్యులు నోరువిప్పారు. శ్రీదేవి భౌతికకాయం ముంబై తరలింపునకు న్యాయపరమైన లాంఛనాలు పూర్తయ్యాయని అర్జున్‌కపూర్‌ తెలిపారు. ఇక సాయంత్రం దుబాయ్‌ నుంచి శ్రీదేవి భౌతికకాయం బయల్దేరి... రాత్రికి ముంబై చేరుకోనుంది. శ్రీదేవి మృతదేహం తరలించేందుకు ప్రాసిక్యూషన్‌ అనుమతి ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలే తమ అభిమాన నటి మృతి చెంది విషాదంలో మునిగిపోగా... గత రెండు రోజుల నుంచి అనేక పరిణామాలు అభిమానులను మరింత కలవరానికి గురి చేశాయి. తాజాగా శ్రీదేవి భౌతికకాయం తరలించేందుకు క్లియరెన్స్‌ ఇవ్వడంతో తమ అతిలోకసుందరిని కడసారి చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. రేపు శ్రీదేవి అంత్యక్రియల నేపథ్యంలో.. భారీ ఎత్తున అభిమానులు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీదేవి నివాసం వద్ద భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి ప్రమాద వశాత్తు మరణించారా లేదా హత్యా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బోనీకపూర్ ను పోలీసులు విచారించారు. వాటర్ టబ్ లో పడిపోయినప్పుడు శ్రీదేవి తలకు బలమైన గాయం అయింది. బోనీకపూర్ కు శ్రీదేవి రెండో భార్య అయినందున ఏమైనా కుటుంబ తగాదాలు ఉన్నాయా ? శ్రీదేవి, బోనీకపూర్ మధ్య ఏమైనా వివాదాలు తలెత్తాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి నివాసం వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

రాత్రికి ముంబై చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయం ఇచ్చేందుకు దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు అంగీకారించారు. బోనీకపూర్ కుటుంబసభ్యులకు క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్. శ్రీదేవి భౌతికకాయం రాత్రికి ముంబై చేరుకొనుంది. 

15:52 - February 27, 2018

కృష్ణా : నవ్యాంధ్ర రాజధానికి కూతవేటు దూరంలోని ఆ ప్రాంతం కిడ్నీ వ్యాధితో మరుభూమిని తలపిస్తోంది. కృష్ణాజిల్లాలోని  తండాల్లో గిరిజన ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.  వైద్యఖర్చులకు డబ్బులేక... ఆదుకునే నాథుడు కానరాక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్నీ వ్యాధితో ఇంటికొకరు మంచాన పడి ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకునేవారు లేని దుర్భర పరిస్థితుల్లో జీవశ్చవాల్లా గడుపుతున్నారు. సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోని ఈ పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్. 
చావుబతుకుల మధ్య తండాలు
కృష్ణా జిల్లాలోని గిరిజన తండాలు కిడ్నీ వ్యాధితో కుటుంబాలకు కుటుంబాలే కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం మండలాలు మరో ఉద్దానాన్ని తలపిస్తున్నాయి. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి గిరిజనులు మృత్యువుతో పోరాడుతున్నారు. తాగునీటిలో అధిక స్థాయిలో ఉన్న ఫ్లోరైడ్‌ వల్ల  అమాయక గిరిజనులు రోగాలబారిన పడుతున్నారు.  సుమారు 20 తండాల్లో  ఏ ఒక్కరిని  పలకరించినా కన్నీటికథలే వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. తండాలన్నీ కన్నీటి సంద్రాల్లా మారాయి. వందలాది మంది కిడ్నీ బారిన పడుతుంటే... సుమారు పాతిక మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
తండాల్లో మృత్యు ఘంటికలు
తిరువూరు నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గిరిపుత్రులను కిడ్నీ వ్యాధులు కబళించి వేస్తున్నాయి. దీప్లానగర్, మాన్‌సింగ్, చీమలపాడు, కృష్ణారావుపాళెం కేశ్యా, కృష్ణారావుపాళెంగ్యామా, ఎ.కొండూరు మత్రియా, చైతన్యనగర్‌, ఎ.కొండూరు తండా, కుమ్మరికుంట, రేపూడి, మాధవరం, గొల్లమందల, కంభంపాడు, గోపాలపురం, వల్లంపట్ల, రామచంద్రాపురం, లక్ష్మీపురం, జీళ్ళవుంట, పోలిశెట్టిపాడు తండాల్లో ఈ ప్రాంతంలో సుమారు 25మంది చనిపోయారని గిరిజనులు చెబుతున్నారు.
కిడ్నీ వ్యాధితో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు
సాధారణంగా తాగునీటిలో ఫ్లోరైడ్‌ 1.5శాతం ఉండాలి. కానీ  ప్రభుత్వ ఆర్వో ప్లాంటుల్లోనే 2.4 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కిడ్నీ వ్యాధివల్ల  చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కడుపు కోత తట్టుకోలేక విలిపిస్తుంటే.... మరోవైపు  కాళ్ళు, కీళ్ల  సమస్యలతో  మరికొందరు మంచానపడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లోని పిల్లలు చదువు మానుకుని కూలీ పనులకు వెళ్తున్నారు. పిల్లల కూలీ డబ్బునే వైద్యానికి ఖర్చు చేస్తున్నా.. అది కూడా ఏ మూలకూ చాలడంలేదని ఆవేదన చెందుతున్నారు
డబ్బులేక ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులు
ఆసుపత్రికి వెళ్ళిరావడానికి బస్‌ ఛార్జీలు, మందుల ఖర్చుల నిమిత్తం నెలకు వేలాదిరూపాయలు ఖర్చవుతోంది. వైద్య ఖర్చులను భరించలేక  చెట్టంత మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన వైద్య శిబిరాల్లో 50మందికి రక్త పరీక్ష నిర్వహించగా, 25మందికిపైగా కిడ్నీలు దెబ్బతిన్నట్లు నిర్దాణరణ అవ్వటం సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
పదేళ్లుగా సమస్య తెలిసినా స్పందించని అధికారులు
పదేళ్లుగా వేళ్ళూనుకున్న కిడ్నీ సమస్యగురించి తెలిసినా అధికారులు స్పందించడంలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు....  వ్యాధి నివారణకు మంచినీటి పైప్‌ లైన్లను ఏర్పాటు కూడా చేయలేదు.  ఈ ప్రాంతం రాజధానికి కూత వేటు దూరంలో ఉండడమే కాదు..  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సొంత జిల్లాలోనే ఉండడం గమనార్హం..  రాజకీయనాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే తాము గుర్తుకొస్తామని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని  బాధిత గిరిజనులు కోరుతున్నారు. కిడ్నీ వ్యాధికి  మందులను ఉచితంగా ఇవ్వాలని.. కుటుంబ పోషణ ప్రభుత్వమే భరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

15:47 - February 27, 2018

హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే  కేసిఆర్ సిద్ధమ‌వుతున్నారా..? దేశంలో మోదీ హవా తగ్గిందని గులాబీ దళపతి భావిస్తున్నారా.. ? సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ సర్కార్‌ ఏర్పడుంతుందని అంచానకు వచ్చారా..? బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి  ఘాటు విమర్శల ఆంతర్యం ఏంటీ..? రెండు జాతీయ పార్టీల‌పై  ముఖ్యమంత్రి కేసిఆర్  తీవ్ర విమ‌ర్శలు చేయ‌డం.. ఇపుడు  కొత్త చ‌ర్చకు దారితీస్తోంది. 
జాతీయ పార్టీల‌పై స్వరం పెంచిన కేసీఆర్ 
జాతీయ పార్టీల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా స్వరం పెంచారు. ముఖ్యంగా బీజేపీ పై విమర్శల ఘాటు పెంచారు. కేంద్రంతో యుద్దానికి సిద్దం  అనే సంకేతాలు ఇచ్చిన ఆయన..ప్రత్యక్ష ఆరోప‌ణ‌ల‌కు దిగారు. రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల గాలాబీబాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇపుడు  చర్చనీయాంశం అయింది.  
సాగు సంక్షోభానికి కాంగ్రెస్, బీజేపీ లే కారణం : కేసీఆర్‌ 
రాష్ట్రంలో సాగు సంక్షోభానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లే కారణమంటూ కేసీఆర్‌ మండిపడుతున్నారు.  రైతుల సమస్యలను పరిష్కరించడంలో  జాతీయ పార్టీలు విఫ‌ల‌మ‌య్యాయాని  విమ‌ర్శిస్తున్నారు. ఉపాధి హమీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తాము కోరినా కేంద్రం స్పందించక పోవ‌డంపై ఆగ్రహం కేసీఆర్‌  వ్యక్తం చేశారు.  త్వర‌లో మొద‌ల‌య్యే రెండో విడ‌త కేంద్ర బడ్జెట్  సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో దూకుడు ప్రదర్శిస్తారని రైతు సమన్వయ సమితుల సదస్సు సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. 
కేంద్రం నుంచి సహాకారం లేదని గుర్రు 
ఇప్పటివరకు తాము కేంద్రంతో సయోధ్యగానే ఉంటున్నా.. రాష్ట్రనాకి మాత్రం సరైన రీతిలో సహకారం అందండం లేదని  ముఖ్యమంత్రి చెబుతున్నారు.  మైనారిటీ , గిరిజన రిజర్వేషన్ల బిల్లులకు మెలిక పెట్టడం... విభ‌జ‌న హామీల‌పై ఆశించిన స్థాయిలో స్పందించ‌క‌పోవ‌డంపై గులాబీపార్టీ గుర్రుగా ఉంది.కేంద్రం తెలంగాణపై చిన్న చూపు చూస్తుందని  అధికార పార్టీ నేత‌లు ప్రచారం అందుకున్నారు.  మరోవైపు నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డంపై కూడా  మోదీ సర్కార్‌పై కేసిఆర్ ఆగ్రహానికి కార‌ణ‌మ‌న్న అభిప్రాయం గులాబీపార్టీ  నేత‌ల్లో వ్యక్తం అవుతోంది.   
మోదీ హవా తగ్గుతోందని భావిస్తున్న కేసీఆర్‌
వచ్చే సాధారణ ఎన్నిక‌ల అనంత‌రం  జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న వ్యూహంలో భాగంగానే గులాబి ద‌ళ‌ప‌తి పాలువు కదుపుతున్నట్టు చర్చలు నడుస్తున్నాయి.  ఈ వ్యూహంలో భాగంగానే  రెండు జాతీయ పార్టీలను టార్గెట్ చేసినట్లు కూడా పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. దేశంలో మోడీ హ‌వా త‌గ్గుతుంద‌న్న అభిప్రాయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసిఆర్.. కేంద్రంలో  ఏర్పడబోయే  సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా  వ్యవ‌హ‌రించాల‌ని భావిస్తున్నట్లు  పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికోసమే కేసీఆర్ జాతీయ పార్టీలపై విమర్శలు ఎక్కుపట్టారన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 

15:42 - February 27, 2018

ఖమ్మం : మిర్చి యార్డులోకి విపక్షాలు, రైతుల సంఘాల నాయకులు, మీడియా ప్రవేశించకుండా పోలీసులు విధించిన ఆక్షంలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ... సీపీఎం నాయకులు ధర్నా చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు మార్కెట్‌ యార్డులోకి ఎవరైనా ప్రవేశించే అధికారం ఉందని సీపీఎం నాయకులు నినాదాలు చేశారు. ధర్నా చేసిన పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

 

అరుదైన నటి శ్రీదేవి : సీఎం చంద్రబాబు

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అంతకు ముందు చంద్రబాబు.. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య 40 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు ఆధ్వర్యంలో 40 పావురాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి సినిమాల్లో రాణించిన శ్రీదేవి మృతి బాధాకరం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అరుదైన నటి శ్రీదేవి అని కొనియాడారు.

శ్రీదేవి మృతికి టీడీపీ సమన్వయ కమిటీ సంతాపం

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్‌, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి మృతికి టీడీపీ సమన్వయ కమిటీ సంతాపం ప్రకటించింది. 

కొనసాగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్‌, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

15:15 - February 27, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్‌, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి మృతికి టీడీపీ సమన్వయ కమిటీ సంతాపం ప్రకటించింది.  అంతకు ముందు చంద్రబాబు.. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య 40 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు ఆధ్వర్యంలో 40 పావురాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి సినిమాల్లో రాణించిన శ్రీదేవి మృతి బాధాకరం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అరుదైన నటి శ్రీదేవి అని కొనియాడారు.

 

కాసేపట్లో శ్రీదేవి మృతిపై పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ నివేదిక

ముంబై : శ్రీదేవి మృతిపై దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ చేతిలో కీలక నివేదిక ఉంది. కాసేపట్లో పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అనుమానాలుంటే రీపోస్టుమార్టంకు ఆదేశించే అవకాశం ఉంది. రీపోస్టుమార్టంకు ఆదేశిస్తే శ్రీదేవి మృతదేహం తరలింపులో మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. శ్రీదేవి మృతిపై దర్యాప్తుకు ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు అయింది. మరోవైపు దుబాయ్‌లో శ్రీదేవి బసచేసిన హోటల్‌ గదిని పోలీసులు సీజ్‌ చేశారు. హోటల్‌ సిబ్బందితోపాటు, దుబాయ్‌లో శ్రీదేవి కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. 

15:00 - February 27, 2018

ముంబై : శ్రీదేవి మృతిపై బోనీ కపూర్‌ కుటుంబం నోరు విప్పింది. బోనీ మొదటి భార్య తనయుడు అర్జున్‌ కపూర్‌ దుబాయ్‌ చేరుకున్నారు. మృత దేహాన్ని ముంబై తరలించేందుకు ఉన్న న్యాయపరమైన లాంఛనాల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. శ్రీదేవి మృతిపై దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ చేతిలో కీలక నివేదిక ఉంది. కాసేపట్లో పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అనుమానాలుంటే రీపోస్టుమార్టంకు ఆదేశించే అవకాశం ఉంది. రీపోస్టుమార్టంకు ఆదేశిస్తే శ్రీదేవి మృతదేహం తరలింపులో మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. శ్రీదేవి మృతిపై దర్యాప్తుకు ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు అయింది. మరోవైపు దుబాయ్‌లో శ్రీదేవి బసచేసిన హోటల్‌ గదిని పోలీసులు సీజ్‌ చేశారు. హోటల్‌ సిబ్బందితోపాటు, దుబాయ్‌లో శ్రీదేవి కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

శ్రీదేవి మృతిపై నోరు విప్పిన బోనీ కపూర్‌ కుటుంబం

ముంబై : శ్రీదేవి మృతిపై బోనీ కపూర్‌ కుటుంబం నోరు విప్పింది. బోనీ మొదటి భార్య తనయుడు అర్జున్‌ కపూర్‌ దుబాయ్‌ చేరుకున్నారు. మృత దేహాన్ని ముంబై తరలించేందుకు ఉన్న న్యాయపరమైన లాంఛనాల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మరోవైపు దుబాయ్‌లో శ్రీదేవి బసచేసిన హోటల్‌ గదిని పోలీసులు సీజ్‌ చేశారు. హోటల్‌ సిబ్బందితోపాటు, దుబాయ్‌లో శ్రీదేవి కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. 

 

మేఘాలయ, నాగాలాండ్ లో కొనసాగుతున్న పోలింగ్

కోహిమ : మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11గంటల వరకు నాగాలాండ్ లో 37 శాతం, మేఘాలయలో 41 శాతం నమోదు అయింది. 

శ్రీదేవి మృతిపై సుబ్రహ్మమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ : శ్రీదేవి మృతిపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిని హత్య చేశారని, ఆ రోజు రాత్రి హోటల్ గదికి ఎవరు వెళ్లారో బయటకు పెట్టాలని, సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు.

13:27 - February 27, 2018

నెల్లూరు : కరెంట్ ఆఫీస్ సెంటర్ లోని ఆసుపత్రిలో మమత అనే నర్సు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత పెద్దాస్పత్రిలో ఏడాది కాలంగా పని చేస్తుంది. గుంటూరు జిల్ల కేశినేపల్లి ఆమె స్వస్థలం 

13:23 - February 27, 2018

దుబాయి : కాసేపట్లో శ్రీదేవి మరణంపై  పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక ఇవ్వనున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోయిందని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

వనస్థలిపురంలో విద్యార్థి అదృశ్యం

హైదరాబాద్ : వనస్థలిపురం ప్రశాంత్ నగర్ లో విద్యార్థి అదృశ్యం కలకలం రేగింది. ఉపాధ్యాయుడు మందలించాడని లేఖ రాసి ఇంటి నుంచి అదృమైయ్యాడు. 

టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్‌, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

కృష్ణా : సీపీఎం ఆధ్వర్యంలో బందర్ రోడ్డులో ఆలిండియా రేడియో స్టేషన్ వద్ద బైఠాయించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు వారు డిమాండ్ చేశారు. 

12:34 - February 27, 2018

ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం టూర్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్‌ పర్యటనపై టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:33 - February 27, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్‌, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అందరి మధ్య 40 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు ఆధ్వర్యంలో 40 పావురాలను ఎగురవేశారు. 

12:30 - February 27, 2018

గుంటూరు : 1978లో రాజకీయాల్లో ప్రవేశించి 2018 ఫిబ్రవరి 27 నాటికి 40ఏళ్ళు పూర్తి అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ప్రస్తుతం దేశంలోని ఇప్పటి ముఖ్యమంత్రుల్లో అగ్రగణ్యుడు. ఇంతటి పరిపాలన అనుభవం ఉన్న వారెవ్వరూ లేరు. దేశ సమస్యలను సైతం ఆయన అనుభవంతో, విషయ పరిజ్ఞానంతో పరిష్కరించిన రాటు తేలిన రాజనీతిజ్ఞుడు. ఆర్ధిక సంస్కరణలను పూర్తిగా ఒంట బట్టించుకున్న అతి కొద్ది మంది ఆర్ధిక, రాజకీయ వేత్తలలో ఆయన ఒక్కరు. సమగ్రమైన అవగాహనతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుచూపుతో పనిచేసే చంద్రబాబు వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆదర్శాలు వల్లించడం కాదు ఆచరించడమే నా నైజం అంటు ముందుకు సాగే తత్వం ఆయనది. చంద్రబాబు ఏ పని చేసినా భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా, ప్రపంచ స్థాయిలో దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల దృష్టితోనే చేయడం ఆయన నైజం.

మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి
సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాలను శాసించే స్థాయి నేతగా ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కున్నా అద్భుతమైన విజయాలు సాధించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఆయన ఎప్పుడు విఫలం కాలేదు. చంద్రబాబు నాయుడు, బిఎ చదువుతుండగానే వినాయక సంఘం పేరుతో సామాజికాభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఐదున్నర కిలోమీటర్ల మేర నారావారిపల్లె నుండి భీమవరానికి శ్రమదానంతో రోడ్ల నిర్మాణం తలపెట్టారు.

చంద్రబాబు తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్‌, హిస్టరీలో కాలేజీ విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రం ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు. ఈ దశలోనే ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా అడుగులు పడ్డాయి. 1977లో కృష్ణజిల్లాలో సంభవించిన దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు కూడా హాస్టల్ విద్యార్థులు చంద్రబాబు నాయుడునే నాయకునిగా ఎన్నుకున్నారు. ఆ ఉత్సాహమే ఆయన్ను రాజకీయాల వైపు వ్యవసాయ కుటుంబంలో పుట్టి, గ్రామీణ నేపథ్యం కలిగి, చిన్నతం నుంచి సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న చంద్రబాబుకు అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను ఆలోచనే తడువుగా ఆచరణలో పెట్టారు. దీనికి కుటుంబసభ్యులు, మిత్రుల ప్రోత్సాహం లభించింది.

పట్టభద్రుల శాసనమండలి స్థానానికి
నారా చంద్రబాబు నాయుడు, 1976లో తొలిసారి 23ఏళ్ల వయస్సులో పట్టభద్రుల శాసనమండలి స్థానానికి రెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. వయసు సరిపోదన్న విషయం తెలిసీ.. తన రాజకీయ అరంగేట్రానికి చక్కటి బాటలు వేసేందుకు అప్పుడే వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేసి.. ఆరోజుల్లోనే దాదాపు పదివేల రూపాయలు ఖర్చు చేశారు. ఆవిధంగా జలగం వెంగళరావు దృష్టిని ఆకర్షించారు. పోటీ గట్టిగా ఉంటుందన్న భావనతో.. జలగం వెంగళరావు చంద్రబాబును పిలిచి, అధికార పార్టీ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయవద్దంటూ సూచించారు. ప్రతిగా, తర్వాతి ఎన్నికల్లో ఎమ్మెల్యేటికెట్‌ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తన వ్యూహం ఫలించడంతో.. చంద్రబాబు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. అప్పట్లో వివిధ కారణాల వల్ల.. జలగం వెంగళరావు హామీ మేరకు, చంద్రబాబుకు పార్టీ టికెట్‌ లభించలేదు. దీంతో, ఆయన ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో ఇందిరా కాంగ్రెస్ పై చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండేది. గ్రామాల్లోని బలమైన నేతలంతా జనతా పక్షాన ఉండేవారు. అసలు ప్రచారానికే రానివ్వం అన్నట్లు కొన్ని గ్రామాల్లో పరిస్థితి ఉండేది. గెలుపే దుర్లభం అనుకున్న క్లిష్ట పరిస్థితుల్లో ఏమాత్రం రాజకీయ అనుభవం...., ఎలాంటి పలుకుబడీ లేని చంద్రబాబు సహచర విద్యార్థుల మద్దతుతో ఎన్నికల్లో పోటీకి సిద్దపడ్డారు. జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న చంద్రగిరికి ఆ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థి కొంగర పట్టాభి చౌదరి విజయం నల్లేరుపై నడకే అన్న రీతిలో ఉన్న పరిస్థితుల్లో 26ఏళ్ల ప్రాయంలో ఎన్నికల బరిలో దిగారు చంద్రబాబు .

వినూత్న పంథాలో ప్రచారం
ఎన్నికల బరిలో దిగిన చంద్రబాబు.. అంతకు ముందు ఎన్నడూ ఎరుగని రీతిలో వినూత్న పంథాలో ప్రచారానికి వెళ్లారు. అసలు ఆయన సర్వే లక్షణాన్ని పుణికి పుచ్చుకుంది కూడా అప్పుడే. జనం నాడి ఎలా ఉంది అనే దానిపై ఎస్వీయూ విద్యార్థులతో సర్వే చేయించారు. ఆ ఫలితాలకు అనుగుణంగా వ్యూహాలు రచించారు. ఓటర్లకు నేరుగా ఉత్తరాలు రాసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న ఐవీఆర్‌ విధానానికి అదే మూలమన్నమాట. చంద్రబాబు, సహచర విద్యార్థులతో కలిసి నియోజకవర్గంలోని గ్రామాలన్నీ తిరిగారు. ప్రతి ఇంటి తలుపూ తట్టారు. కరపత్రాలు పంచారు. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ప్రచారం సాగించారు. 'మన ప్రాంతానికి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం..., యువతను ప్రోత్సహించండని అందరినీ కోరారు. 1978 ఫిబ్రవరి 27న... సరిగ్గా 40ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాలు రావడం మొదలైంది. చంద్రగిరి నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో తొలి రౌండు జనతాపార్టీకే ఆధిక్యం. తొలి దఫా రౌండ్లన్నీ జనతా పార్టీకే మెజారిటీ వస్తూ వచ్చింది. చివరి రెండు రౌండ్లలో అనూహ్యంగా చంద్రబాబు ఆధిక్యం సాధించారు. అంతిమంగా 2,494 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తొలిప్రయత్నంలోనే చిన్నవయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు.

1978లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి తొలి విజయం
నారా చంద్రబాబు నాయుడు, 1978లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి తొలి విజయం అందుకున్నారు. 1980లో పురావస్తుశాఖ, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలకు మంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తెలివితేటలు, వినయ విదేయతలు, శక్తి సామర్ధ్యాలు ఎన్టీఆర్‌ గారిని అమితంగా ఆకట్టుకున్నాయి. మామ ఎన్టీఆర్‌ కోరిక మేరకు, చంద్రబాబు 1983 చివరలో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ్నుంచి ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభం అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, ఏడాదికే, 1984లో ఎన్టీఆర్‌ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు. ఆయన వ్యూహరచనతో, రాజకీయ చతురతతో నాదెండ్ల అనుసరించిన చర్యను భగ్నం చేశారు. తెలుగుదేశం పార్టీకివచ్చిన 1984 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు నిర్వహించిన పాత్ర అద్వితీయం. 1989లో పార్టీ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించి వెళ్లటంతో ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. 1994లో అధికారంలోకి రావటానికి చంద్రబాబు పాత్రే ప్రధానమైనది. పార్టీలో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువ అవ్వటం వల్ల గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించటంతో..., ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

1998లో హైటెక్‌ సిటీ
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపే ఉద్దేశంతో 1995 నవంబర్‌ 1న ప్రజల వద్దకే పాలనను ప్రారంభించారు. 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రతి మనిషీ ప్రభుత్వంపై ఆధారపడే తత్వం నుంచి ఎవరి గ్రామ సమస్యల్ని వారే పరిష్కరించుకోవడంలో అందరిని భాగస్వామ్యులం కావాలనే దృక్పధం ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరనుంచి పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశేష కృషి చేశారు. సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గురింపును తెచ్చారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటైంది చంద్రబాబు హయాంలోనే. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు మొదలైన సామాజిక సంక్షేమ నిర్ణయాలు చిత్తశుద్థితో చేపట్టారు. ఆయన పనితీరు ప్రజలను, అధికారులను అబ్బుర పరిచింది. అందుకే తిరుగులేని మెజార్టీతో రెండవసారి అధికారంలోకి పార్టీని తెచ్చారు. రాజకీయ రంగంలో చంద్రబాబుకు అపరచాణక్యుడు అని పేరుంది. చంద్రబాబు నాయుడు, 1999ఎన్నికల్లో గెలిచి చిన్న వయసులోనే రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 ఏప్రిల్‌-అక్టోబర్‌ మద్య నీరు-మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టి అప్పట్లోనే భూగర్బ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. జల సంరక్షణ, భూసార రక్షణ, చెరువుల పూడికతీత, పంట భూములలో బోదెలను అభివృద్ధి చేశారు. రైతు బజార్లు ఆవిర్బావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా తెలుగుదేశం ఎదుగుదల వెనుక ఆనాటి నేషనల్‌ ఫ్రంట్‌ వెనుక చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. రెండు సార్లు ప్రధానమంత్రుల నియామకంలో కీలక పాత్ర పోషించారు .రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం నియామకంలోను ముఖ్య భూమిక వహించారు.

హత్యా ప్రయత్నం
ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు దీక్షా దక్షతలను చూసిన నాయకులు, ప్రధాని పదవిని స్వీకరించవలసిందిగా కోరారు. నిజంగా అది అపూర్వమైన అవకాశం. కాని చంద్రబాబు ప్రధాని పదవిని స్వీకరించడానికి ససేమిరా సమ్మతించలేదు. తనకు రాష్ట్రంలో చేయవలసింది చాలా వుందని, తన కార్యస్థానం రాష్ట్రమేనని స్పష్టంగా చెప్పి ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు. 1995-2004 మే వరకు రాష్ట్ర ,జాతీయ రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన చంద్రబాబు 2004 ఎన్నికల్లో ఓటమి చెందినా 2009లో మళ్ళీ అధికారంలోకి రాలేకపోయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాయకుల్లో,కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతూ అనేక సమస్యలపై గల్లీ నుండి దిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అలుపెరగని పోరాటం చేశారు. అన్నదాత కోసం నిరాహారదీక్ష చేపట్టి 8రోజులపాటు అన్నం మానేసిన నాయకుడు చంద్రబాబు. ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం 208రోజులు 2,817 కి.మీ ప్రజల కోసం పాదయాత్ర చేశారు. ప్రపంచ రాజకీయాల్లో స్పష్టమైన ప్రణాళిక కలిగిన అతి కొద్ది నాయకుల్లో చంద్రబాబు ఒకరు.2003 అక్టోబర్‌లో శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు పొల్గొనేందుకు వెళ్తుండగా అలిపిరి వద్ద ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు ఆయన వాహనంపై క్లెమోర్‌ మోన్లు పేల్చారు. ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకొని మృత్యుంజయుడు అయ్యారు.

12:19 - February 27, 2018

ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నాలుగేళ్ల తర్వాత జిల్లా పర్యటనకు వస్తున్న కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందన్న భయంతో గిరిజన, విద్యార్ధి సంఘాల నాయకుల పోలీసులు అరెస్టు చేశారు. 

12:17 - February 27, 2018

కరీంనగర్ : సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని బ్యాగు నుండి పొగలు వచ్చాయి. హెలికాప్టర్‌ పైకిలేచే సమయంలో పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై 100 మీటర్ల దూరంలో బ్యాగును పరేశారు. వైర్‌ లెస్‌ సెట్‌లో షాట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ : జిల్లా వేల్పూరు మండలం చేంగల్ గ్రామంలో డిగ్రీ విద్యార్థిని దీక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరు తో యువకుడు మోసం చేశాడని మృతదేహంతో విద్యార్థి సంఘాలు ఆందోళ దిగారు.

రామగుండం ఎత్తిపోతలకు కేసీఆర్ శంకుస్థాపన

పెద్దపల్లి : జిల్లా ముర్మూరులో సీఎం కేసీఆర్ రామగుండం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పరిశీలించారు. ఎత్తిపోతల పథకం ద్వారా 20 గ్రామల ప్రజలకు లబ్ది చేకురింది.

10:29 - February 27, 2018

దుబాయి : తన భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహానికి దుబాయ్‌ వెళ్లిన బాలీవుడ్‌ నటి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం సినీ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్‌లోని ఖలీజ్‌ టైమ్స్‌ కథనం ప్రకారం బోనీకపూర్‌ దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరి వచ్చారు. భార్య శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు శనివారం తిరిగి దుబాయ్‌కు వెళ్లారు. సాయంత్రం ఐదున్నర సమయంలో నిద్రలో ఉన్న శ్రీదేవిని బోనీకపూర్‌ లేపారు. 15 నిముషాల పాటు ఇద్దరు మాట్లాడారు.

డిన్నర్‌ చేద్దామని శ్రీదేవిని పిలిచారు
అనంతరం డిన్నర్‌ చేద్దామని శ్రీదేవిని బోనీకపూర్‌ ఆహ్వానించారు. డిన్నర్‌ కోసం రెడీ అయ్యేందుకని శ్రీదేవి బాత్రూం వెళ్లారు. కొద్దిసేపటి వరకు ఆమె బాత్రూం నుంచి బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన బోనీకపూర్‌ బాత్రూం తలుపు తట్టారు. శ్రీదేవి ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో బోనీకపూర్‌ బల ప్రయోగంతో తలుపును తెరిచారు. లోనికెళ్లి చూసేసరికి శ్రీదేవి బాత్‌టబ్‌లో విగతజీవిగా పడిపోయి ఉన్నారు. ఆ టబ్‌ నీటితో నిండిపోయి ఉంది. శ్రీదేవిని స్పృహ లోకి తెచ్చేందుకు బోనీకపూర్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. వెంటనే స్నేహితునికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రీదేవికి గుండె సంబంధిత వ్యాధులేవి లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు.వెంటనే పోలీసులు, వైద్య సహాయకులు శ్రీదేవిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. శ్రీదేవి మృతదేహాన్ని ఫొరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కు తరలించారు. శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు తరలించడంలో జరిగిన జాప్యంపై అభిమానులకు పలు సందేహాలు తలెత్తాయి.

హెలికాప్టర్ లో పెద్దపల్లి బయల్దేరిన కేసీఆర్

కరీంనగర్ : కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ల్ పెద్దపల్లి కి బయల్దేరారు. సీఎం ఎత్తపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. 

కొనసాగుతున్న నాగలాండ్ ఎన్నికల పోలింగ్

కోహిమ : నాగలాండ్ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అక్కడి ఎన్నికల కమిషన్ తెలిపంది.

సీఎం రాకతో రూ.15కోట్ల నష్టం

పెద్దపల్లి : నేడు తెలంగాణ సీఎం పెదపల్లి సింగరేణి ఏరియాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభకు హాజరుకావాడానికి యాజమాన్యం కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. సెలవు కారణంగా సింగరేణికిపై రూ.10 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అలాగే ఉత్పత్తి పరంగా మరో రూ.5 కోట్ల నష్టం రానుంది. 

08:36 - February 27, 2018

పెద్దపల్లి : నేడు తెలంగాణ సీఎం పెదపల్లి సింగరేణి ఏరియాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభకు హాజరుకావాడానికి యాజమాన్యం కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. సెలవు కారణంగా సింగరేణికిపై రూ.10 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అలాగే ఉత్పత్తి పరంగా మరో రూ.5 కోట్ల నష్టం రానుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

07:42 - February 27, 2018

తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని, అలాగే ఉత్పత్తి ఖర్చులో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుందని, అయితే పెట్టుబడి సయం కేవలం భూ యాజమానులకు మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో కౌలు రైతులు నష్టపోతారని సీపీఎం నేత నంధ్యాల నరసింహ రెడ్డి అన్నారు. రైతులపై ప్రేమ ఒలకపోస్తున్న కేసీఆర్ తెలంగాణ రైతు ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని, మిర్చి రైతులకు బెడీలు వేశారని కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. సమైఖ్య ఏపీలో కౌలు రైతుల సిస్టం ఎక్కువగా ఉందని, ఇప్పుడు తెలంగాణ కౌలు రైతుల సంఖ్య తగ్గిపోయిందని, అందుకే కౌలు రైతులకు ఇవ్వలేమని టీఆర్ఎస్ నేత రాజమోహన్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:31 - February 27, 2018

చదువుకున్నా ఆ చదువును గుర్తించకపోతే... ర్యాంకులు కొట్టినా, గోల్డ్‌ మెడల్ సాధించినా ఉద్యోగం రాకపోతే.. ఎలా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితిని ఫేస్‌ చేస్తున్నారు ఫార్మాడి విద్యార్థులు. ప్రస్తుతం తమకు ఎంప్లాయ్‌మెంట్‌ కల్పిచంమంటూ వారు ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనా కారణాలు, వారిపట్ల పాలకులు అనుసరిస్తున్న తీరు, వారి డిమాండ్లపై చర్చించేందుకు ఫార్మ్‌ డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు చంద్రశేఖర్, రామలక్ష్మి, రంజిత్‌ మనతో ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:28 - February 27, 2018

ప్రకాశం : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులే వారిని కాటేయజూస్తున్నారు. ఒంగోలు బండమిట్టలోని మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ సాయి శ్రీధర్‌, పీఈటీ రామకృష్ణారావు విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నారు. వారిని తాకరానిచోట తాకుడూ పైశాచికానందం పొందుతున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. 

07:27 - February 27, 2018

కృష్ణా :ఆంధ్రపదేశ్‌లో పనిచేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళనబాట పట్టారు. కొన్నాళ్లుగా ప్రభుత్వంపై నిరసన తెలుపుతూనే ఉన్నారు. విజయవాడలో దీక్షలు సైతం చేస్తున్నారు. అయినా వారి సమస్యపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనే లేదు.తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీనిచ్చారు. దీన్ని నమ్మిన విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు టీడీపీకి ఓటేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పలుమార్లు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమను పర్మినెంట్‌ చేయాలని అభ్యర్థించారు. అయినా ప్రభుత్వం మాత్రం రేపు.. మాపు అంటూ దాటవేస్తూ వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా వారిని పర్మినెంట్‌ చేయలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పోరుబాట పట్టారు.
మూడు కేటగిరీలుగా విభజన
విద్యుత్‌శాఖలోని వివిద సెక్షన్స్‌లో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. స్కిల్డ్‌ , సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ అని కార్మికులను మూడుగా విభజించింది. వీరికి వేర్వేరుగా వేతనాలు చెల్లిస్తోంది. అదీకూడా ప్రభుత్వం వారికి నేరుగా ఇవ్వకుండా ఓ కాంట్రాక్ట్‌ ద్వారా ఇస్తోంది. దీంతో ఒక్కో కార్మికుడిపై 18శాతం జీఎస్టీ, సూపర్‌వైజర్‌ చార్జీలు 10శాతం, సేఫ్టీ అలవెన్స్‌ కింద 4శాతం చెల్లించాల్సి వస్తోంది. ఏపీ వ్యాప్తంగా విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 22,536 మందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తే కేవలం ఏడాదికి 24కోట్లు మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుంది. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. కార్మికుల ఆందోళనలతో ప్రభుత్వం ఓ కమిటీని వేసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. ఆ చర్చలు కూడా విఫలయం అయ్యాయి.విజయవాడ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతున్నారు. వీరి ఆందోళనకు సీపీఎం, కాంగ్రెస్‌, వైసీపీ, జనసేనతోపాటు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరాయి.
నాలుగేళ్లకోసారి వేతనాల సవరణ
వేతనాల సవరణ ప్రతి నాలుగేళ్లకోసారి ప్రభుత్వం చేపట్టాలి. కానీ ఐదేళ్లు అవుతున్నా వేతన సవరణ చేయకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఆదివారాలు సెలవులు కూడా ఉండడం లేదు. అదనపు గంటలు పనిచేసినా వారికి చెల్లింపులేవీ ఉండవు. కార్మిక చట్టాలకు ప్రభుత్వం యధేచ్చగా తూట్లు పొడుస్తోంది. కార్మికులకు కనీస భద్రత కల్పించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకవాలని... విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు.. టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

07:21 - February 27, 2018

అనంతపురం : నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు వాడివేడి చర్చలతో గందరగోళం మధ్య ముగిశాయి. నగర పాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ సమావేశంతో పాటు పాలక వర్గ సాధారణ సమావేశం జరిగింది. సభలో ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లతోపాటు అధికార పార్టీ సభ్యులు సైతం వివిధ అంశాలపై అధికారులను నిలదీయడంతో సమావేశం ఉత్కంఠంగా సాగింది. బడ్జెట్ కేటాయింపులతో పాటు అజెండా సైతం తప్పుల తడకగా ఉందంటూ అధికార పక్షం సభ్యులే విమర్శలకు దిగారు. మరోవైపు తమ వార్డుల్లో చేస్తున్న పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. దీంతో సభ రసాభాసగా ముగిసింది.

07:19 - February 27, 2018

కర్నూలు : కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్న డిమాండ్‌తో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. గత వారం రోజులుగా విద్యుత్‌ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం నిరాహారదీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చిరించారు. 

07:12 - February 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 2 నుంచి ఏడో తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలిసారి ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో... పరీక్ష ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షల ఫీజు చెల్లింపు వివరాలతో పాటు... పరీక్ష తేదీలను పాపిరెడ్డి విడుదల చేశారు. మార్చి 4 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు ఉన్నతవిద్యామండలి ప్రకటించింది. ఏప్రిల్‌ 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చు. ఏప్రిల్‌ 5 నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 రూపాయల ఫైన్‌తో ఏప్రిల్‌ 11 వరకు.. వెయ్యి రూపాయల ఫైన్‌తో ఏప్రిల్‌ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏప్రిల్‌ 6 నుంచి 9 వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

మే 4, 5, 7 తేదీలలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు
ఇక పరీక్షలు మే 2 నుంచి నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ నేపథ్యంలో 2, 3 తేదీలలో అగ్రికల్చర్‌ ఫార్మసీ విద్యార్థులకు,... 4, 5, 7 తేదీలలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రానికి గంట ముందే విద్యార్ధులు రావాలని... పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఆన్‌లైన్‌ పరీక్ష నేపథ్యంలో దరఖాస్తుల ఫీజును భారీ ఎత్తున పెంచారని పలువురు విద్యార్థులంటున్నారు. గతేడాది 500 రూపాయలు ఉన్న ఫీజును 800 రూపాయలకు పెంచారని.. ఫీజు తక్కువగా ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే... ఆన్‌లైన్‌లో పరీక్ష నేపథ్యంలో ఫీజు పెంచక తప్పలేదని అధికారులంటున్నారు. ఏదిఏమైనా ఉన్నత విద్యామండలి ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకటించడంతో విద్యార్ధులంతా ఇక చదువుపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. 

07:08 - February 27, 2018

విశాఖ : జరిగిన భాగస్వామ్య సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకువచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తోనే ఇది సాధ్యమని ఆయన అన్నారు.

07:07 - February 27, 2018

దుబాయి : వెండితెర జాబిలమ్మ.. శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మరాగా..ఎలా చనిపోయిందన్న దర్యాప్తుకూడా గంటకో మలుపుతిరుగుతూ ఉత్కంఠను రేకిత్తిస్తోంది. ఫోరెన్సిక్‌ నివేదికను పరిశీలించిన దుబాయ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌‌ బోనీకపూర్‌ ను నిశితంగా ప్రశ్నించింది. ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు పూర్తయ్యేవరు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీచేయడం కేసును మరోమలుపు తిప్పుతోంది. దర్యాప్తు కొనసాగుతుందని న్యాయస్థానం తెలపడంతో శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. శనివారం రాత్రి ప్రమాదవశాత్తూ హోటల్‌గదిలోని బాత్‌టబ్‌లో మునిగి శ్రీదేవి మృతి చెందారని యూఏఈ ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. అయితే... దుబాయ్‌ పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. శ్రీదేవి మృతికి కారణాలేంటి? దుబాయ్‌‌ హోటల్‌‌లో అసలేం జరిగింది? బయట ఏం చెప్పారు? మత్తులో శ్రీదేవి తనంతట తానే టబ్‌‌లో పడిపోయారా? వేరే ఎవరైనా తోసేశారా? ముందు కార్డియాక్ అరెస్ట్ అని శ్రీదేవి బంధువులు ఎందుకు చెప్పారు? మృతికి గల కారణాలపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి?. అసలు ఆమెది ఆత్మహత్యా? లేదా హత్యా? నిజంగా శ్రీదేవి ప్రమాదవశాత్తే చనిపోయారా?. అనే ప్రశ్నలకు ఇపుడు సమాధానాలు రావాల్సి ఉంది.

ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం
ఓవైపు ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్టు ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేస్తుండగా...మరోవైపు బోనీకపూర్‌ను దుబాయ్‌ పోలీసులు ఎందుకు అనుమానిస్తున్నారనేది అంతుబట్టని విషయంగా మారింది. శ్రీదేవి బస చేసిన హోటల్‌ గదిని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం జల్లెడపడుతున్నారు. దుబాయ్‌ పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు లభిస్తే అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబయి తరలించేందుకు అనుమతిస్తారని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్‌ అవశేషాలు ఉన్నాయని ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి కావడం.. శ్రీదేవికి ఆల్కహాలు తీసుకునే అలవాటు లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఈ పరిణామాలన్నీ అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి భౌతికకాయం ఎప్పుడు భారత్‌కు వస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సామాజికి మాధ్యామాల్లో మాత్రం రకరకాల కథనాలు
ఇక శ్రీదేవి మృతిపై సామాజికి మాధ్యామాల్లో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి. శ్రీదేవి సౌందర్యం కాపాడుకోడానికి పలురకాల మందులు వాడిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. చర్మం ముడతలు పడకుండా, శరీరంలో మెరుపు రావడానికి బోటాక్స్‌ ఇంజక్షన్లతోపాటు ..పలు రకాల సర్జరీలు చేయించుకుంటోందని.. వాటి ఫలితంగానే ఆమెకు హఠాత్తుకు మృత్యువు వచ్చిందనే సందేహాలు సామాజికి మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. కాని ఇవన్నీ వట్టి అనుమానాలేనని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఇదిలావుంటే ఇవాళ మధ్యాహ్నానికి శ్రీదేవి పార్దీవదేహం ముంబైకి చేరుకునే అవకాశం ఉందని ముంబైలో కొందరు అధికారులు సమచారం ఇస్తున్నారు. మృతదేహం ముంబైకి చేరగానే జూహూలోని శాంతాక్రజ్‌ లో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకి చేరుకున్న నటులు, అభిమానులు శ్రీదేవి పార్దీవదేహాన్ని కడసారి చూసేందుకు వేచి చూస్తున్నారు. మొత్తానికి మూడురోజలుగా తీవ్ర ఉత్కంఠంగా మారిన అతిలోకసుందరి మృతి మిస్టరీ వీడిపోయాలంటే మరికొన్నిగంటలు వేచి చూడాల్సిందే.

శ్రీదేవి డెడ్ బాడీ తరలింపుపై కొనసాగుతున్న సందిగ్దత

దుబాయ్ : శ్రీదేవి మృతదేహం తరలింపుపై సందిగ్దత కొనసాగుతుంది. లంచనాలు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు కేసు విచారణను పబ్లిక్ ప్రొసిక్యూషన్ కు దుబాయ్ ప్రభుత్వం బదిలీ చేసింది. 

నేడు ఢిల్లీకి పోచారం

హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి పోపచారం శ్రీనివాస రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో సమావేశం కానున్నారు. 

99వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర

ప్రకాశం : నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. నేడు పొదిలి సమీపంలో పాదయాత్ర ప్రారంభమై కాటూరివారిపల్లె, అగ్రహారం, అన్నారం, తలమళ్లలో జగన్ పాదయత్ర కొనసాగనుంది. 

Don't Miss