Activities calendar

28 February 2018

22:10 - February 28, 2018

ప్రకాశం : చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతారని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో ఆయన దిట్టని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. గెలిపించిన ఏపీ ప్రజలను ఆయన మోసం చేశారని దుయ్యబట్టారు. నవంబర్‌ 6న జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. 

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మరో మైలురాయి చేరుకుంది.   గతేడాది నవంబర్‌ 6న ప్రారంభమైన పాదయాత్ర... బుధవారంతో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ వంద రోజులు ఆరు జిల్లాలు 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. 1350 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

పాదయాత్ర వందోరోజు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సాగింది. జగన్‌కు చీమకుర్తి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్‌.. చంద్రబాబుపై మండిపడ్డారు. అబద్దాలు, అసత్యాలు చెప్పడంలో చంద్రబాబు దిట్టని విమర్శించారు. అబద్దాలు చెప్పేవారిని, ప్రజలను మోసం చేసే వారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని వారిని ఇంటికి పంపేలా వ్యవస్థలో మార్పురావాలన్నారు. 100 రోజులు ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకోవడంతో... గుర్తుగా చీమకుర్తిలో జగన్‌ జెండా ఎగురవేశారు. మార్చి 1న వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉండడంతో... పాదయాత్రకు విరామం ఇచ్చారు.
 

22:04 - February 28, 2018

సంగారెడ్డి : దేశమంతా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉంటే.. కేసీఆర్‌ మాత్రం ఆయనకు వత్తాసు పలుకుతున్నారని టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రజాచైతన్యయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్‌ నేతలు.. మోదీని చూసి కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు. మోదీ హయాంలో మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు.

22:01 - February 28, 2018

సూర్యాపేట : కాంగ్రెస్ బస్సు యాత్ర ఆలీబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్.. ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగల్లా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్.. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 175 జనావాసాలకు మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. బస్సు యాత్ర చేసేవాళ్లలో ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయన్నారు కేటీఆర్‌. 

21:59 - February 28, 2018

హైదరాబాద్ : జూనియర్‌ ఎన్టీఆర్‌ను లేదంటే బ్రాహ్మణిని.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ పార్టీ పగ్గాలు ఇచ్చి టీటీడీపీని బతికించాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబు ముందు గోడువెల్లబోసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఎన్ని చేస్తున్నా.. నాయకత్వం సరిగ్గా గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీని మరో పార్టీలో విలీనం చేస్తారంటూ వస్తోన్న వార్తలపైనా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీని విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

21:57 - February 28, 2018

ముంబై : శ్రీదేవి.. అంటే అతిలోక సుందరి.. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య.. అభిమానులకు అంతవరకే పరిచయం.. శ్రీదేవి జీవితంలో అభిమానులకు తెలియని ఎన్నో కోణాలున్నాయి. మోసాలు, బాధలు, కన్నీళ్లు ఎన్నో చవి చూసిన మహానటి శ్రీదేవి. ఆమె జీవితంలోని అనేక కోణాల్ని ఓ లేఖలో ఆవిష్కరించారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నటిగా శ్రీదేవి ఎదిగిన విషయాల నుంచి బోనీ కపూర్‌తో వివాహం వరకు తనకు తెలిసిన వివరాలన్నీ ఆ లేఖలో రాశారు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 
మరో సంచలనానికి తెరలేపిన వర్మ 
వర్మ.. వివాదాలకు పెట్టింది పేరు. ఆయన ఏం చేసినా సంచలనమే..ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న వర్మ.. తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. తను ఎంతగానో అభిమానించి.. ఆరాధించే నటి శ్రీదేవి జీవితంలో ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లను..అగాథాలను వివరిస్తూ ఓ లేఖ రాశారు. ట్విట్టర్‌లో ఆ లేఖను పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయిందన్న వర్మ 
దేశంలోనే అతి పెద్ద సూపర్ స్టార్‌గా 20 ఏళ్లపాటు వెండితెరను ఏలిన శ్రీదేవి నిజ జీవితం మాత్రం పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయిందని వర్మ లేఖలో ప్రస్తావించారు. తన కుటుంబం కోసం అహర్నిశలు పాటుపడుతూ తనను తాను మర్చిపోయిందని రాసుకొచ్చారు. అత్తింటి వారు అవమానించినా.. అన్నీ భరించి తన జీవితంలో చాలా కాలాన్ని దుఃఖంతో గడిపిన మహిళ శ్రీదేవి అంటూ వర్మ లేఖలో రాశారు. చివరి వరకూ తన గురించి ఆలోచించుకోకుండా జీవితాన్ని కోల్పోయిన శ్రీదేవి వచ్చే జన్మలో అయినా తన గురించి ఆలోచించుకోవాలని వర్మ లేఖలో కోరుకున్నారు. 
వర్మ లేఖపై టీవీ నటి కవితా కౌశిక్‌ మండిపాటు 
వర్మ లేఖపై ఓవైపు సినీ వర్గాలు.. అభిమానుల్లో చర్చ జరుగుతుంటే.. టీవీ నటి కవితా కౌశిక్‌ మండిపడ్డారు. శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ వర్మకు రీట్వీట్ చేశారు కవిత. వర్మ  బయటపెట్టిన అంశాలపై స్పందించి నోరు మూయించడానికి శ్రీదేవి భౌతికంగా లేరని.. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండంటూ వర్మకు ట్వీట్‌లో వార్నింగ్ ఇచ్చారామె.
తీవ్ర విషాదంలో మునిగిపోయిన వర్మ  
మరోవైపు శ్రీదేవి మరణించినప్పటి నుంచి వర్మ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె సినిమాలు చూస్తూ.. కాలక్షేపం చేస్తున్నారు. శ్రీదేవి అంతిమయాత్రలో ఫోటోను పోస్టు చేస్తూ 'సినీ దేవతకు తుది వీడ్కోలు' అని వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వర్మ రాసిన లేఖలు.. ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనం రేపుతూనే ఉన్నాయి. తాజాగా వర్మ రాసిన లేఖపై ఇంకెంతమంది స్పందిస్తారో చూడాలి. 

21:49 - February 28, 2018

ముంబై : దివి నుండి భువికి దిగిన అందాలతార మళ్లీ దివికేగింది. అర్ధ శతాబ్దం పాటు వెండితెరను ఏలిన అతిలోకసుందరి హఠాన్మరణంతో.. సినీ ప్రపంచంతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగారు. భారీ ఎత్తున తరలివచ్చిన సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు.. ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఏడు కిలో మీటర్ల మేర సాగిన అంతిమయాత్రలో భారీ ఎత్తున అభిమానులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. 
ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు 
అతిలోకసుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 
అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు  
దివి నుంచి భువికి దిగి వచ్చి వెండితెరను రాణిలా ఏలిన అందాలనటి మళ్లీ దివికేగింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. శ్రీదేవి అంతిమయాత్రలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 
ఏడు కిలోమీటర్ల మేర శ్రీదేవి అంతిమయాత్ర  
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది.  తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు  సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున పాల్గొని.. శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అంతిమయాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
బంగారు వర్ణపు కొంగున్న కంచిపట్టు చీరతో అలంకరణ 
అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు... బంగారు వర్ణపు కొంగున్న కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకు అలవాటు. దీంతో చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే ముస్తాబు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించిన వాహనాన్ని.. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. అంతిమయాత్ర వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. 
శ్రీదేవిని కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు  
అనంతలోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు. హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్‌ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు. ఇక సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి శ్రీదేవిని చూసేందుకు ముంబై తరలివచ్చిన అభిమానులంతా బాధాతప్త హృదయాలతో వెనుదిరిగారు. 
శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలు రద్దు 
శ్రీదేవి మృతికి సంతాపంగా ఆమె నివసించిన లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని గ్రీన్‌ ఏకర్స్‌ సొసైటీ హోళీ వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించింది. తన నటనతో యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలను రద్దు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. 

 

బీజేపీ, కాంగ్రెస్ ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

హైదరాబాద్ : మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. 

 

21:02 - February 28, 2018

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలను స్వాగతించాల్సిందే అని విశ్లేషకులు లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. జగన్ ప్రజా సంకలయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈనేపథ్యంలో పాదయాత్ర...అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుస్తాయని చెప్పారు. వామపక్షాలు పాదయాత్రలు చేసి, ప్రజా సమస్యలను తెలుసుకుని...వాటి పరిష్కారానికి పోరాటాలు చేశారని తెలిపారు. పాదయాత్రలు చేసే నాయకులుగా ఎదిగారని తెలిపారు. కానీ కాంగ్రెస్ లాంటి వేరే పార్టీల్లో వారసులు నాయకులుగా వస్తారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:56 - February 28, 2018

ఓట్లు దగ్గరికొస్తున్నా కొద్దికి శిగాలొస్తయా ఏంది..? ఈ రాజకీయనాయకులకు.. ప్రధానమంత్రి మోడేదో దిగజారి మాట్లాడుతున్నడు.. ఇటు చంద్రశేఖర్ రావుగారేమో ఎగవాకి మాట్లాడవట్టే.. ముఖ్యమంత్రి స్థాయి మన్షితోని మోడీ పంచాది.. ప్రధానమంత్రి స్థాయి మన్షితోని కేసీఆర్ పంచాది.. వీళ్ల పంచాది ఎందుకు..? ఎవ్వలికోసం అన్నట్టు..? 

చంద్రబాబుకు నల్పై ఏండ్ల రాజకీయ బారసాల బాగనే జేశిండ్రు ఆంధ్రల ఆడీడగని..? నల్పై ఏండ్ల సంది ఇంకొక మన్షికి రాజకీయ అవకాశం లేకుంట జేశ్నందుకు గూడ ఏదన్న ఒక్కటి జేయాలేగదా..? సరే నల్పై ఏండ్లళ్ల ఆయన ఎమ్మెల్యే స్థాయి కెళ్లి.. ముఖ్యమంత్రి పీఠం దాక ఎంతో కష్టపడి వచ్చిండు కని.. ఈ నడ్మ జరిగిన కథలు కొన్నే ఎందుకు జెప్పుకుంటున్నరు మరి..? 

అయ్యో ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటే మూతి మీసాలు గాలినట్టు.. మన చింతమడ్క చిన్నోడుగదా అని గెలిపిచ్చుకుంటే మీ పనిజేశిండు కేసీఆర్ అని సంగారెడ్డికాడ రేవంత్ రెడ్డి అడ్డగోల్గ మర్యాద జేశిండు ముఖ్యమంత్రి కేసీఆర్ను.. ఇంక అదేగాదు అంతకంటె ముందు సభల కేటీఆర్, తలసాని నెత్తెంటికెల పంచాది గూడ లేవట్టిండు..

యాంకర్: కేసీఆర్ సర్కారును గద్దె దించెదాక ఇడ్సిపెట్టమన్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కళలను నిజం జేస్తట్టే గొడ్తున్నరు పబ్లీకు.. ఓదిక్కు అరెస్టులు జేపిచ్చినా.. అడ్డుకున్నా.. ముఖ్యమంత్రి సభల నిరసనలు ఆందోళనలు ఆగకపాయే.. ఇవ్వేవి మనకు మీడియాళ్ల గనిపియ్యయ్ గని..? మచ్చుకు కొన్ని వట్కొచ్చిన సూడుండ్రి ముఖ్యమంత్రి గారు నిన్నమొన్న సభలు వెట్టెగదా ఆడ గంద్రగోళం ఎట్లైందో..

మళ్ల మిర్చీ లొల్లి సుర్వైంది గదా ఖమ్మం మార్కెట్ల..  వాస్తవానికి మార్కెట్లళ్ల ఎవ్వలుండాలే.. పంట అమ్ముకునెతందుకొచ్చిన రైతులుండాలే.. వ్యవసాయ శాఖా అధికారులుండాలే.. కొనెటోళ్లుండాలే అమాలోళ్లుండాలే.. కదా..? కని మన బంగారు తెలంగాణల మాత్రం మార్కెట్ల పొంటి పోలీసోళ్లు ఉంటున్నరు.. ఇదేం దౌర్జన్యం అనేది సీపీఎం మాట..

ఇయ్యాళటి సంది సుర్వైనయ్ ఇంటర్మీడియట్ పరీక్షలు.. సరే పిల్లలు సద్వుతరు రాస్తరు అయిపోతదిగని.. ప్రభుత్వం బెట్టె నిబంధనలు గమ్మతుంటయ్..నిమిషం ఆల్చమైన అనుమతించమని చెప్తాఉంటరు.. సరే పరీక్షకు నిమిషం ఆల్చమైన అనుమతించని అధికారులు.. స్కాలర్ షిప్పులు ఆల్చంగ విడుదల జేస్తె విద్యార్థులెందుకు ఊకోవాలె..? అంతేనా..?

సింగరేణిని ఎట్టిపరిస్థితిల ప్రైవేటీకరించం.. అవుసరమైతె కేంద్రం వాటా వాళ్లకు పైసలిచ్చి మొత్తం మనమే తీస్కుంటం అని నిన్నముఖ్యమంత్రిగారు జెప్పిండు.. సింగరేణి విషయంల కేంద్రం వాటా వద్దంటున్న ముఖ్యమంత్రిగారు మరి పస్పురైతులకు మద్దతు ధర ఇచ్చెకాడ గూడ.. కేంద్రంతోని సంబంధం లేకుంట మద్దతు ధర ఎందుకు ఇస్తాంటలేవు..?

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాడున్న విద్యోదయ స్కూలోడా నీకేమన్న శిగ్గుశరం ఉన్నదిరా..? నీ సిల్వర్ జూబ్లీ కోసం బడిపోరగాళ్లను ఎర్రటి ఎండల నిలవెట్టి ఏం తమాషరా నీది..? ఇర్వై ఐదు వసంతాలు అయ్యిందట వాడు బడివెట్టి.. నడి చౌరస్తలకు పోరగాళ్లను వట్కొచ్చి డ్యాన్సులు వాని కథలు జూడుండ్రి.. ఈ తల్లిదండ్రులకు గూడ జర్ర సోయిరావాలే..

20:46 - February 28, 2018

సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలే అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, టీఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు జి.రాంబాబు, ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలేవి ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని...నేటి వరకు చేయలేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ఏపీ రాష్ట్ర బడ్జెట్ ముహూర్తం ఖరారు

అమరావతి : రాష్ట్ర బడ్జెట్ ముహూర్తం ఖరారు అయింది. మార్చి 8న ఉ.11.30 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 

ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించాలి : కడియం

హైదరాబాద్ : కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలతో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దూర ప్రాంత పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్షలు ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు పంపేటప్పుడు ఎస్మార్ట్ కల్పించాలని తెలిపారు. 

 

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత

నల్గొండ : నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుడికాలువకు కృష్ణా నీటిని విడుదల చేయాలని ఏపీ కిరికిరి చేసింది. ఆంధ్రాకు నీటి విడుదల నిలిపివేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ కలెక్టర్, ఎస్పీలకు సాగర్ అధికారులు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఏపీ చర్యలున్నాయని తెలంగాణ అంటుతుంది.

 

'చలో గుంటూరు' కార్యక్రమానికి కోర్టు అనుమతి

విజయవాడ : 'చలో గుంటూరు' కార్యక్రమానికి కోర్టు అనుమతి లభించింది. మార్చి 4న మ.2 గంటకు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పెదగొట్టిపాడు దళితులపై దాడికి నిరసనగా చలో గుంటూరు చేపట్టారు. దళిత, గిరిజన ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో చలో గుంటూరు కార్యక్రమం నిర్వహించనున్నారు. దళితులపై అగ్రవర్ణాల దాడి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాధిత దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పోరాట కమిటీ తెలిపింది. దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి బాధిత కటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

19:47 - February 28, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల గుంపులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి తోటల మీద పడి పంటలను సర్వనాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుంతుంటే... మరోవైపు రాత్రివేళల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో బయటికి రావాలంటే భయమేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల బీభత్సం
శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీప్రాంతంలో ఏనుగుల సంచారంతో ప్రజలు హడలిపోతున్నారు.  హీరమండలం పాడలి పంచాయితీ దబ్బగూడ గిరిజన గ్రామంలో ప్రస్తుతం ఎనిమిది ఏనుగుల గుంపు సంచరిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అలాగే కొత్తూరు మండలం పొన్నుటూరు గ్రామ సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు చెబుతున్నారు... ఇవి తోటలపై పడి పంటలను సర్వ నాశనం చేస్తున్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇంతవరకూ తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని బాధితులు అంటున్నారు.
జనావాసాలకు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు
రాత్రి వేళల్లో జనావాసాలకు సమీపంలోనే ఏనుగులు సంచరిస్తుండడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిపైన దాడికి తెగబడతాయోనని బెంబేలు పడుతున్నారు. ఎనిమిది ఏనుగుల గుంపులో...  రెండు మగ, నాలుగు ఆడ, రెండు పిల్ల ఏనుగులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పిల్ల ఏనుగుల్లో ఒకటి రెండు నెలల వయసుగలది. ప్రజలు వాటిని కవ్వించొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతుంటే... మరో వైపు ఏనుగుల వల్ల తోటల్లో  జరిగిన  నష్టానికి పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.

 

19:44 - February 28, 2018

నల్గొండ : రేడిమేడ్‌ రంగం విస్తరించడంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని టైలర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మిర్యాలగూడ మేరు సంఘం అధ్యక్షుడు తాళ్ళ వేంకటేశ్వర్లు కార్యదర్శి గుంటి శ్రీనివాస్‌లు ప్రభుత్వాన్ని కోరారు. టైలర్స్‌ డే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో టైలర్స్‌ అందరూ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ వస్తే కులవృత్తులను కాపాడతామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఏంబీసీలో మేరు కులాన్ని చేర్చి, టైలర్స్ ని ఆదుకోవాలని కోరారు.

 

19:42 - February 28, 2018

విజయవాడ : సినీ నిర్మాతలకు భారం కలిగేలా డిజిటల్‌ ప్రొవైడర్లు బిల్లులు వసూలు చేస్తున్నారని ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ మార్చి 2న ఏపీలో అన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. యూఎఫ్‌వో, క్యూబ్‌ సంస్థలు ఒక్కో చిత్రానికి 27వేలు వసూలు చేస్తున్నాయని.. ఇది నిర్మాతలకు భారంగా మారిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఈ రెండు సంస్థలు ఒంటెద్దుపోకడలు పోతున్నాయని మండిపడ్డారు. డిజిటల్‌ ప్రొవైడర్ల అరాచకాలను అరికట్టేందుకే మార్చి 2న సినిమాలు నిలిపివేస్తున్నామని చెప్పారు.

 

19:37 - February 28, 2018

ముంబై : అతిలోకసుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దివి నుంచి భువికి దిగి వచ్చి వెండితెరను రాణిలా ఏలిన అందాలనటి మళ్లీ దివికేగింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. శ్రీదేవి అంతిమయాత్రలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 
శ్రీదేవి భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు 
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున పాల్గొని.. శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అంతిమయాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
ఎరుపురంగు చీర కంచిపట్టు చీరతో శ్రీదేవి అలంకరణ 
అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకు అలవాటు. దీంతో చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే ముస్తాబు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించిన వాహనాన్ని.. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. అంతిమయాత్ర వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. 
శ్రీదేవి కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు 
అనంతలోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు. హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్‌ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు.  
ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు  
ఇక సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి శ్రీదేవిని చూసేందుకు ముంబై తరలివచ్చిన అభిమానులంతా బాధాతప్త హృదయాలతో వెనుదిరిగారు. 
శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలు రద్దు 
ఇక శ్రీదేవి మృతికి సంతాపంగా ఆమె నివసించిన లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని గ్రీన్‌ ఏకర్స్‌ సొసైటీ హోళీ వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. తన నటనతో యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలను రద్దు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. 

 

రావెల కిషోర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

గుంటూరు : మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుందని రావెల అన్నారు. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా మట్టిని తరలించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు లంచాలకు లొంగిపోయారని ఆరోపించారు. మంత్రి పుల్లారావు పేరుతో అశోక్ బృందం విచ్చలవిడి మైనింగ్ జరుగుతుందని.. పుల్లారావుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 

 

 

ఐదుగురు సీపీఐ (మావోయిస్టు) మిలీషియా సభ్యులు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : ఐదుగురు సీపీఐ (మావోయిస్టు) మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మెడికల్ కిట్స్, మందులు స్వాధీనం చేసుకున్నారు.

 

మార్చి 1న జిల్లా కేంద్రంలో ధర్నాలకు వైసీపీ పిలుపు

విజయవాడ : ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మార్చి 1న జిల్లా కేంద్రంలో ధర్నాలకు వైసీపీ పిలుపునిచ్చింది. ధర్నాలో నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొనేందుకు వీలుగా మార్చి 1న ప్రజా సంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. పాదయాత్ర శిబిరం నుంచి ధర్నా కార్యక్రమాలను జగన్ పర్యవేక్షించనున్నారు. మార్చి 2న తిరిగి ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. 

 

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం అరెస్టు

చెన్నై : ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరాన్ని అరెస్టు చేశారు. కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఐఎన్ ఎక్స్ మీడియా అంశంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి.

 

పాతకాలపు రాజకీయాలను తలపిస్తోన్న కాంగ్రెస్ బస్సుయాత్ర : విప్ పల్లా

హైదరాబాద్ : కాంగ్రెస్ బస్సుయాత్ర పాత కాలపు రాజకీయాలను తలపిస్తోందని విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ బస్సుయాత్రను పట్టించుకోవడం లేదన్నారు. బస్సుయాత్రకు ప్రజలను బలవంతంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. 4 గంటల కరెంట్ కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోయిందన్నారు. 

19:02 - February 28, 2018

రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగడ్డ శివారులో ఉన్న మహి గ్రానైట్స్ పరిశ్రమలో యంత్రం వద్ద విధులు నిర్వహిస్తున్న అశోక్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించాడు. అశోక్‌ స్వస్థలం దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామం. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్‌ మృతి పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో  గ్రానైట్ పరిశ్రమ వద్దకు చేరుకున్న సీఐటీయూ రాష్ట్ర నేత భూపాల్ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దిగి వచ్చిన యాజమాన్యం అశోక్ కుటుంబానికి రూ.13 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. 

18:58 - February 28, 2018

చెన్నై : మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సిబిఐ అరెస్ట్‌ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంలో కార్తీ ఫెరా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనను సిబిఐ అరెస్ట్ చేసింది. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కార్తీ 10 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణ. బిజెపి రాజకీయ కక్షకు పాల్పడుతోందని కార్తీ అరెస్ట్‌పై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. 

ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. లండన్‌ నుంచి చెన్నై చేరుకున్న కార్తిని ఎయిర్‌పోర్టులోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అక్కడ కొద్దిసేపు ప్రశ్నించిన సిబిఐ మరిన్ని వివరాలు రాబట్టేందుకు కార్తీని ఢిల్లీకి తీసుకెళ్లింది.

2007లో చిదంబరం ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కోసం మారిషస్‌కు చెందిన పెట్టుబడిదారుల నుంచి 305 కోట్ల విదేశీ పెట్టుబడులను అనుమతించేలా చూశారని... ఇందుకోసం ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించినట్లు కార్తీపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో కార్తి 10 లక్షలు లంచం తీసుకున్నట్లు సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు సహకరించడంలేదన్న ఆరోపణలతో కార్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో  ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్లు - పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా కార్తీ చిదంబరం పేరును కూడా సిబిఐ చేర్చింది. 2017 మే 17న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కార్తీపై కేసు నమోదు చేసింది. 

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. నీరవ్‌మోదీ, చోక్సీ, డీడీ జెవెల్లర్స్‌, రోటోమ్యాక్‌ ఇలా రోజుకొకటి చొప్పున బయటపడుతున్న భారీ స్కాంలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని పేర్కొంది. ప్రజల దృష్టిని ఇతర అంశాలపైకి మరల్చేందుకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నమే ఇదని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. చిదంబరం ఆయన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకున్నంత మాత్రానా... మోది ప్రభుత్వంలోని అవినీతిని విలికితీయడంలో వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

ఈ కేసులో ఇదివరకే సిబిఐ, ఈడీ కార్తీ చిదంబరాన్ని పలుమార్లు ప్రశ్నించింది. ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మంగళవారం కార్తికి చెందిన సీఏ ఎస్‌. భాస్కరరామన్‌కు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీని విధించింది.

మరికొద్ది రోజుల్లో రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్తీ అరెస్ట్ చేశారు. పిఎన్‌బి స్కాంపై విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్‌ చేసే అవకాశం ఉండడంతో దాన్ని ఎదుర్కొనేందుకు కార్తీ అరెస్ట్‌ను తెరపైకి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

18:54 - February 28, 2018

పాట్నా : బిహార్‌ మాజీ సిఎం, దళిత నేత జీతన్‌రాం మాంఝీ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి మహాకూటమిలో చేరారు. ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్‌ ఆయనను స్వాగతించారు. మాంఝీ గత కొంతకాలంగా ఎన్డీయే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మార్చి 23న ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో బిజెపి కూటమి నుంచి వైదొలగాలని మాంఝీ నిర్ణయం తీసుకున్నారు.

 

 

18:48 - February 28, 2018

చెన్నై : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు. మంగళవారం రాత్రి జయేంద్ర సరస్వతికి ఒక్కసారిగా శ్వాస సమస్యలు తలెత్తడంతో శిష్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్తమించారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆయన కాంచిపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు.
1935, జులై 18న జయేంద్ర సరస్వతి జననం
అభినవ శంకరులుగా ప్రసిద్ధిగాంచిన జయేంద్ర సరస్వతి... 1935, జులై 18న తమిళనాడులోని మన్నార్‌గుడి సమీపంలోని ఇరుల్‌నిక్కి గ్రామంలో జన్మించారు. చంద్ర శేఖర సరస్వతి స్వామి అనంతరం 1954 మార్చి 24న కంచి పీఠానికి జయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా నియమితులయ్యారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్‌. కంచి పీఠం అధిష్టించిన తర్వాత ఆయన పేరును జయేంద్ర సరస్వతిగా మార్చుకున్నారు. కంచి కామకోటికి ఆయన 69వ పీఠాధిపతి.  
సామాజిక కార్యక్రమాలను చేపట్టిన కంచి పీఠం
జయేంద్ర సరస్వతి పీఠాధిపతి ఆయ్యాక ఆయన నేతృత్వంలో కంచి పీఠం అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టింది. ఆయన ఆధ్వర్యంలో కంచి పీఠం మరింతగా అభివృద్ధి చెందింది. మఠం ఆధ్వర్యంలో చెన్నైలో శంకర నేత్రాలయ, అసోంలో గౌహతి వద్ద శంకర దేవ నేత్రాలయాలను స్థాపించారు. అనేక పాఠశాలలు, పిల్లల ఆస్పత్రులు, హిందూ మిషన్‌ ఆస్పత్రులను సైతం నిర్వహిస్తోంది కంచి పీఠం. 
ప్రజాసేవకు శ్రీకారం చుట్టిన జయేంద్ర సరస్వతి
చంద్రశేఖర స్వామి వేద పాఠశాలలతో ప్రాచీన విద్య విధానాలను నాంది పలికితే... జయేంద్ర సరస్వతి ప్రజా సేవకు శ్రీకారం చుట్టారు. మానవ సేవ చేయాలని చెప్పడమే కాకుండా వాటిని అమలు పరిచారు. మత మార్పిడులను నిరోధించేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థల్లో హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. జయేంద్ర సరస్వతి మరణంతో కంచి కామకోటి పీఠం అధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి నియామకం అవుతారని సమాచారం.

18:40 - February 28, 2018

అనంతపురం : కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ప్రభుత్వ హాస్పటల్‌లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హాస్పటల్లో డాక్టర్లు టైం ప్రకారంగా వుండటం లేదని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద నిపుణులు లేని విషయం గుర్తించామని తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని, హాస్పటల్లో శానిటేషన్, సెక్యూరిటీ బాగుందని కలెక్టర్‌  అన్నారు. లేబర్‌ వార్డులో వెయ్యి రూపాయలు లంచం అడిగారంటూ కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో విచారణ చేయాలని హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

18:35 - February 28, 2018

చెన్నై : కొద్దిరోజుల క్రితం చెన్నై శివారులో తాలంబూర్‌లో ఐటీ ఉద్యోగిని లావణ్యరెడ్డిపై దుండుగుల దాడి ఘటనకు సంబంధించి ముగ్గురిని పల్లికరణై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని సెమ్మనజేరికి చెందిన వినాయకమూర్తి, నారాయణమూర్తి, లోకేష్‌లుగా గుర్తించారు. లావణ్య రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన దుండగులు ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాఫ్‌టాప్ లాక్కెళ్లారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లావణ్య చికిత్స అనంతరం కోలుకుంది. అయితే లావణ్యపై దుండగులు దాడి చేసిన ఘటనలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. లావణ్యపై దాడి మాత్రమే జరిగిందని పొరపాటున ఆ విధంగా వార్తలు వచ్చినట్లు అటు పోలీసులు, ఇటు బాధితురాలు తెలిపారు. లావణ్యది కృష్ణజిల్లా తేలప్రోలు కాగా.. ఇంతకు ముందు అమెరికాలో జాబ్ చేసి ఇటీవలే లావణ్య చెన్నైకి వచ్చింది. అంతలోనే ఆమె దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైంది.

 

18:30 - February 28, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు విపక్షాలతో చంద్రబాబు కలిసి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖలో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కలిసికట్టుగా పోరాడితేనే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజలతో చంద్రబాబు కలిసి వస్తారో లేదో తేల్చుకోవాలన్నారు. హోదా కోసం టీడీపీ... విపక్షాలతో కలిసిరాకుంటే ఆపార్టీకి నూకలు చెల్లినట్టేనన్నారు. 

 

18:24 - February 28, 2018

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి అడ్డంపడుతూ ఓ సైకోలా జగన్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జగన్‌ తీరుతో విసుగుచెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. భవిష్యత్‌ మరికొంతమంది చేరుతారని చెప్పారు. అసెంబ్లీ రూల్స్‌ తెలియని ప్రతిపక్ష నేత జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు. 

18:17 - February 28, 2018

హైదరాబాద్ : ఎలాంటి సమస్య ఎదురైనా తమ శక్తిసామర్థ్యాలతో పరిష్కరిస్తామని మహిళా పోలీసులు అంటున్నారు. తెలంగాణలో మహిళా పోలీసులు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. విధుల్లో చేరుతున్నారు. పోలీస్‌గా సమాజానికి తమ సేవలు అందించేందుకు డిపార్ట్‌మెంట్‌లో చేరామని చెప్తున్నారు. సమాజ శ్రేయస్సు, ప్రజలకు రక్షకులుగా ఉండటమే తమ కర్తవ్యమంటున్న మహిళా పోలీస్‌లతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రావెల కిషోర్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు : మాజీ మంత్రి రావెల కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజవర్గంలో  విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు రూ.100కోట్లుకు పైగా మట్టిని తరలించారని, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు లంచాలకు లొంగిపోయారని ఆయన ఆరోపించారు. 

17:47 - February 28, 2018

ముంబై : అతిలోక సుందరి, ప్రముఖ సినీనటి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. విలే పార్లేలోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించింది. గౌరవ సూచకంగా భౌతికకాయంపై పోలీసులు త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. అంతకముందు ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ హీరోయిన్ రాణిముఖర్జీతోపాటు తదితర నటులు శ్రీదేవి పార్ధివదేహాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. దుబాయ్ లో శ్రీదేవి హఠాన్మరణం చెందారు. ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి ఆమె మృతి చెందారు. రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఛలో గుంటూరుకు కోర్టు అనుమతి

కృష్ణా : ఛలో గుంటూరు కార్యక్రమానికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. మార్చి 4న మధ్యాహ్నం 2గంటలకు ఛలో గుంటూరు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెదగొట్టిపాడు దళితులపై దాడికి నిరసనగా ఛలో గుంటూరుకు సీపీఎం పిలుపునిచ్చింది. 

ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు

ముంబై : అతిలోకసుందరి శ్రీదేవి అత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని హిందు శ్మశానవాటికలో శ్రీదేవి అత్యక్రియలు జరిగాయి. శ్రీదేవి అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

17:32 - February 28, 2018

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయం విలే పార్లేలోని హిందూ స్మశానవాటికకు చేరుకుంది. అంతకముందు ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ హీరోయిన్ రాణిముఖర్జీతోపాటు తదితర నటులు శ్రీదేవి పార్ధివదేహాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. కాసేపట్లో విలే పార్లేలోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

పాటియాల కోర్టుకు కార్తీ చిదంబరం

చెన్నై : కార్తీ చిదంబరంను సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి పాటియాల హౌస్ కోర్టుకు తరలించారు. సీబీఐ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీని అరెస్ట్ చేశారు. 

16:46 - February 28, 2018

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయం విలే పార్లేలోని హిందూ స్మశానవాటికకు చేరుకుంది. అంతకముందు ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ హీరోయిన్ రాణిముఖర్జీతోపాటు తదితర నటులు శ్రీదేవి పార్ధివదేహాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. కాసేపట్లో విలే పార్లేలోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

శ్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి అంతిమయాత్ర

ముంబై : శ్రీదేవి అంతిమయాత్ర శ్మశానవాటికకు చేరింది. కాసేపట్లో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాజరుకానున్నారు. 

15:09 - February 28, 2018

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంతిమయాత్ర కొనసాగుతోంది. ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగనుంది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లేలోని సేవ్ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రోడ్లను క్లియర్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

కొనసాగుతున్న శ్రీదేవి అంతిమయాత్ర

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంతిమయాత్ర కొనసాగుతోంది. ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగనుంది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లేలోని సేవ్ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. 

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కార్తి చిందంబరం అరెస్టు

చెన్నై : ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కార్తి చిందంబరం అరెస్టు అయ్యారు. కార్తి చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఐఎన్ ఎక్స్ మీడియా అంశంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. 

శ్రీదేవిని చూసేందుకు తరలొస్తున్న అభిమానులు

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం అయింది. ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగనుంది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లేలోని సేవ్ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు తరలిస్తున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రోడ్లను క్లియర్ చేస్తున్నారు. 

శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం అయింది. ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగనుంది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లేలోని సేవ్ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

14:37 - February 28, 2018

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం అయింది. ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయింది. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగనుంది. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లేలోని సేవ్ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు తరలిస్తున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రోడ్లను క్లియర్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:28 - February 28, 2018

ముంబై : కొద్ది సేపట్లో సినీనటి శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికార లాంచనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచారు. అతిలోక సుందరి శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు తరలిస్తున్నారు. దాదాపు 6 కి.మీ అంతిమయాత్ర కొనసాగనున్నారు. అంతిమయాత్రలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర ప్రముఖులు పాల్గోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లేలోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:23 - February 28, 2018

వెండి వెన్నెల చినబోయింది.. అందమైన చందమామ మోము నిర్జీవమైంది. వెండితెరవేల్పు, బాలీవుడ్‌ మహిళా సూపర్‌ స్టార్‌, అతిలోక సుందరి శ్రీదేవి పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారులు తీరారు. ముంబైలోని సెలబ్రిటీ స్పోర్ట్స్‌ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు సందర్శకులను అనుమతి ఇస్తారు. ఆ తర్వాత సంతాప సభ నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల చిత్రప్రముఖులు సంతాప సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు ఆరు కి.మీ. మేర సాగే అంతిమయాత్రలో పలువురు చిత్ర ప్రముఖలు పాల్గొంటారు. విలే పార్లే సేవా సమాజ్‌లోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 

అసెంబ్లీ భద్రతపై స్పీకర్ సమీక్ష

గుంటూరు : అమరావతిలో మార్చి 5నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల భద్రతపై స్పీకర్ కోడెల సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేవిధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పీకర్ కోడెల అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. 

13:10 - February 28, 2018

కేప్ టౌన్ నగరంలో ఇది దక్షణాఫ్రికాలో ప్రధానమైన నగరం ఇప్పుడు నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. భారత్, దక్షణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ కు కేప్ టౌన్ అతిథ్యమిచ్చింది. అయితే అక్కడ అధికారులు భారత ఆటగాళ్లను ఇక్కడ నీటి కరువు ఉంది కొంచెం నీటి తక్కువగా వాడండి అన్నారు. వారి విజ్ఞప్తిని భారత ఆటగాళ్లు స్వీకరించి నీటిని తక్కుగా వాడారు. అయితే అక్కడి నీటి కష్టాలను చూసిని ఇరు జట్ల కెప్టెన్లు కేప్ టౌన్ రూ.5లక్షల విరాళు ప్రకటించారు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షణాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్ ఇద్దరు కలసి రూ.5లక్షల చెక్ ను కేప్ టౌన్ అధికారులకు అందజేశారు.

రాష్ట్రాల మంత్రలతో కేంద్ర మంత్రి భేటీ

ఢిల్లీ : అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస యోజన అమలుపై వారు చర్చించారు. 

12:52 - February 28, 2018

జామకాయ...ఇది తింటే జలుబు అధికమౌతుందని కొంతమంది అనుకుంటుంటారు. కానీ జామ పండు తినడం వల్ల జలుబుకు చెక్ పెట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇందులో బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. జామ పండుతో పాటు దీని ఆకులు కూడా ఆరోగ్యానికి..అందానికి ఉపయోగించుకోవచ్చు

ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి... నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది. పచ్చి జామకాయను ముద్దలా నూరి నుదుటి మీద పెట్టుకొంటే తలనొప్పి..మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో వీరి గుండె పనితీరు మెరుగుపడుతోంది. జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ.. ఉంటుంది. వృద్ధాప్య‌ చాయలను దూరం చేస్తోంది.

12:49 - February 28, 2018

సినీ ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ ఫ్లో చాల స్పీడ్ గా ఉంది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో అయితే ఇంకా వేరే చెప్పనక్కరలేదు. షార్ట్ ఫిలిమ్స్ తో సినీ టేకింగ్ నేర్చుకుని ఇప్పుడు సూపర్ స్టార్ ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇంతవరకు వెరైటీ కథలతో ఆకట్టుకున్న ఈ యంగ్ డైరెక్టర్ మూవీ అప్ డేట్స్...వరల్డ్ వైడ్ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ రజని కాంత్. తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ తన స్టైల్ ని డిఫెరెంట్ గా ప్రెసెంట్ చేసే ఈ స్టార్ హీరో 'రోబో' సినిమాతో తాను విభిన్నమైన కధలకు సూపర్ అప్షన్ అని నిరూపించాడు. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఎం శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రోబో సినిమా రికార్డ్స్ మోత మోగించింది. ఇప్పుడు రోబో కి సీక్వెల్ కూడా రెడీ అవుతోంది.

ఈ దశాబ్ద కాలంలో దక్షిణాదిన పరిచయమైన దర్శకుల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ యంగ్ టాలెంట్స్.. కార్తీక్ సుబ్బరాజ్. కొత్త కథలతో ఆడియన్స్ ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే ని అందిస్తూ ఫిలిం మేకింగ్ లో తన టాలెంట్ చూపిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. 'జిగర్ తండ' సినిమాతో విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు కార్తీక్.

జిగర్ తండ సినిమా కథ.. కథనం.. క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా కొత్తగా.. సెన్సేషనల్ గా ఉంటాయి. ఆ సినిమా చూసే రజినీ కూడా ఫిదా అయిపోయాడు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ సినిమా చెయ్యబోతున్నాడు. విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కార్తీక్...రజినీ లాంటి మాస్ సూపర్ స్టార్ ను ఎలా డీల్ చేస్తాడు అనేది చూడాలి. 'లింగ' సినిమా తరువాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న రజని కాంత్ తన ప్రెసెంట్ ఫోకస్ మొత్తం రాజకీయాల మీద పెడతాడా సినిమాల మీద పెడతాడా అనేది ఆడియన్స్ డౌట్.

గ్రూప్-2 వివాదంపై హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్ : గ్రూప్-2 ఓఎంఆర్ పత్రాల్లో దిద్దుబాటు వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండుసార్లు వైట్ నర్ వివాదలపై 5వేల జవాబు పత్రాలు పరిశీలించాలని హై కోర్టు ఆదేశించింది. 

12:42 - February 28, 2018

సినీ దేవికి కడసారి వీడ్కోలు పలుకుతోంది భారత చలన చిత్ర పరిశ్రమ. కడసారిగా శ్రీదేవిని చూసేందుకు ముంబయిలోని సెలబ్రేషన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు తారాలోకం తరలివచ్చింది. భారీ పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివస్తున్నారు. చిరంజీవి, ఐశ్వర్యారాయ్‌, అనిల్‌ కపూర్‌, సంజీవ్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, ఫరా ఖాన్‌, అను కపూర్‌, హేమమాలిని, ఇషా డియోల్‌, హర్షవర్ధన్‌ కపూర్‌, సారా అలీ ఖాన్‌, అర్జున్‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సుస్మితాసేన్‌ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.శ్రీదేవి భౌతికకాయాన్ని సందర్శించేందుకు కపూర్‌ కుటుంబం మీడియా ప్రతినిధులకు అనుమతి ఇచ్చింది. అయితే లోపలికి వచ్చేటప్పుడు కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లులాంటి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది. ఎవ్వరూ శ్రీదేవి భౌతికకాయం ఫొటోలను తీయకూడదని కోరారు.

వెండి వెన్నెల చినబోయింది.. వెండితెర ఇలవేల్పు, బాలీవుడ్‌ మహిళా సూపర్‌ స్టార్‌, అతిలోక సుందరి శ్రీదేవి పార్థివదేహం ముంబైలోని ఆమె నివాసం నుంచి సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు తరలించారు. వేలాది మంది అభిమానులు, టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ సినీ ప్రముఖులు సెలబ్రేషన్‌ క్లబ్‌కు చేరుకుని అంతిమ నివాళులర్పిస్తున్నారు. సోకసముద్రంలో ముగినిపోయిన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. సినీ పరిశ్రమలో దేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు సందర్శకులను అనుమతి ఇస్తారు. ఆ తర్వాత సంతాప సభ నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల చిత్రప్రముఖులు సంతాప సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు ఆరు కి.మీ. మేర సాగే అంతిమయాత్రలో పలువురు చిత్ర ప్రముఖలు పాల్గొంటారు. విలే పార్లే సేవా సమాజ్‌లోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 

టీయాప్ పోలియో కార్యక్రమం

హైదరాబాద్ : ఐటీసీ కాకతీయ హోటల్ లో టీయాప్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీజీపీ హాజరైయ్యారు. 

12:28 - February 28, 2018

షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఫీచర్ ఫిలిం తో టోటల్ ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేసిన డైరెక్టర్ తన మనసులో మాట చెప్పేసాడు. తన ప్రాజెక్ట్ విషయం లో క్లారిటీ గా ఉంటూనే స్టార్ హీరోలతో మల్టి స్టారర్ ప్లానింగ్ తన ఆలోచన అని మనసు విప్పాడు ఈ యంగ్ డైరెక్టర్ రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు ప్రెజెంట్ ఫిలిం మేకర్స్. తమ తమ టాలెంట్ ఏంటో ఫస్ట్ ఫిలిం తోనే చూపిస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇదే వే లో ఉన్న డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ వర్మ. షార్ట్ ఫిలిం నుండి తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు 'అ' అనే ఫీచర్ ఫిలిం తో ఆడియన్స్ ని పలకరించాడు.

' అ!’ సినిమా ఓ వర్గం వారికే నచ్చినా కథ పరంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ నటీనటులను తెరపై చూపించిన విధానం చాలా కొత్తగా అనిపించింది. ఈ దర్శకుడు తన మనసులో మాటను చెప్పేసాడు. తనకు మల్టి స్టారర్ సినిమా చెయ్యాలని ఉంది అని అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తో తన మల్టీస్టారర్ సినిమా చెయ్యాలని ఉంది అని చెప్పేసాడు ఈ యంగ్ డైరెక్టర్. 'సింహ' సినిమా హిట్ తో జోష్ లో ఉన్న బాలయ్య కొత్త డైరెక్టర్ అవకాశం ఇచ్చినా ఇస్తాడు. 

 

12:22 - February 28, 2018

లిమిటెడ్ బడ్జెట్ తో సినిమా తీసే డైరెక్టర్ గా నేమ్ తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. రెగ్యులర్ కథలకే డిఫెరెంట్ స్క్రీన్ ప్లే ఇస్తే చాలు ఆడియన్స్ చూస్తారు అనే థాట్ లో ఉన్నారు కొందరు డైరెక్టర్స్. ఈ థాట్ ని బ్రేక్ చేస్తూ వెరైటీ సినిమాలు తీస్తూ హిట్స్ కొట్టే ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. వారసత్వ హీరోలు హిట్ కొట్టడంలో చాల ఇబ్బంది పడుతున్నారు. కారణం కొత్తదనం లేని కధలు ఎంచుకోవడమే అని టాక్ కూడా ఉంది. మరి అలాంటి టాక్ ని పక్కన పెట్టి డిఫెరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నాడు అక్కినేని హీరో 'నాగ చైతన్య'. తన ప్రీవియస్ ఫిలిం ‘యుద్ధం శరణం’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న చైతూకు.. తర్వాత చేయబోయే సినిమాలు ఇంటరెస్టింగ్ గా మారాయి. ఈ మధ్య కాలంలో నాగచైతన్య సినిమాల్లో స్పీడ్ పెంచాడు.

మహానుభావుడు సినిమాతో హిట్ ట్రాక్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతీ. ఇంతకు ముందు కధలు అన్ని ఒకే మూస లో ఉన్నాయ్ అనే టాక్ ఉన్నా కానీ 'మారుతీ' మరో సినిమా రెడీ చేసాడు. రెగ్యులర్ కథను తలపించే 'బాబు బంగారం' సినిమా మారుతీ కి నిరాశ మిగిల్చింది. మారుతీ సినిమా అంటే ఒకప్పుడు క్రేజ్ ఉండేది ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి 'మహానుభావుడు' సినిమా హిట్ ట్రాక్ ని కంటిన్యూ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మారుతీ మరో సినిమాతో రాబోతున్నాడు.

మారుతీ 'మహానుభావుడు' లాంటి మంచి హిట్ తరువాత మారుతి ఇప్పుడు అక్కినేని నాగ చైతన్యతో ఒక సినిమాను ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా హిట్ తరువాత నాగ చైతన్య మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రెజెంట్ మారుతీ డైరెక్షన్ లో నాగచైత్యన్య చేస్తున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' అని ఈ సినిమాకు టైటిల్ ను కూడా సెట్ చేశారు. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ కనిపించనుంది. మరి ఈ సినిమా చైతుకు ఎంతవరకు విజయాన్ని ఇస్తుందో చూడాలి.

12:16 - February 28, 2018
12:14 - February 28, 2018

తన ప్రతి సినిమా లో సోషల్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేస్తూ మంచి సందేశాత్మక సినిమాలు ఆడియన్స్ కి అందిస్తున్న అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నాడు. నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకునే స్క్రిప్ట్ తో రాబోతున్న ఆ డైరెక్టర్ ఎవరు ?

తీసినవి కొన్ని సినిమాలే అయిన స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఈ సెన్సిబిల్ డైరెక్టర్ క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ తన స్క్రీన్ నేమ్ ని క్రిష్ గా మార్చుకుని 'కంచె' లాంటి అద్భుతమైన కులగజ్జిని వ్యతిరేకించే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తన సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలానే అవార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

హీరోలు ఏలే బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి కంగనా రనౌత్. 'క్వీన్' సినిమాతో ఒక రేంజి ప్రాఫిట్ ని బాలీవుడ్ లో మూటకట్టుకుంది. 'కంగనా' నటన చాల నాచురల్ గా ఉంటుంది ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేస్తుంది. 'క్వీన్' సినిమా లోనే కాదు కంగనా తాను చేసిన అనేక సినిమాల్లో ఎంతో సహజంగా నటించి మెప్పించింది.

డైరెక్టర్ 'క్రిష్' ఎప్పుడు కొత్తదనం కోరుకునే డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ లాంటి చారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమాతో కెరీర్లో అతి పెద్ద విజ‌యాన్నందుకున్న క్రిష్‌. ఈసారి మ‌రింత భారీ స్థాయిలో 'ఝాన్సీ ల‌క్ష్మీబాయి' క‌థ‌తో ‘మ‌ణిక‌ర్ణిక’ సినిమాకు రంగం సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. కంగనా , క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో 'కంగనా' రాజసం ఉట్టిపడుతున్న గెట్ అప్ లో కనిపించి సెట్ లో సూపర్ అనిపించింది. 'గౌతమి పుత్ర శాతకర్ణి'తో చరిత్రకు సంబంధించిన సినిమాలు క్రిష్ బాగా హ్యాండిల్ చెయ్యగలడు అని నిరూపించాడు.

12:10 - February 28, 2018

డిజిటల్ ప్రొవైడర్స్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మధ్య చర్చలు విఫలం అయ్యాయి. మార్చ్ రెండు నుండి సినిమా థియేటర్స్ క్లోజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. ఇలా ఇండస్ట్రీ క్లోజ్ చెయ్యడం వల్ల నష్టం ఎవరికీ ? తెలుగు సినిమా ఇండస్ట్రీ బంద్ ప్రకటించింది. వరదలా వచ్చిన చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి ఊపిరి పీల్చుకున్నాయి. ఇక ఈ బంద్ మార్చ్ రెండు నుండి ఉంటుంది అని చెప్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. తెలుగులోనే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆ తరవాత దీనికి సౌత్ లో మిగిలిన భాషల నిర్మాతలు కూడా గొంతు కలిపారు. ఏది ఏమైనా చిన్న సినిమాలకే నష్టం ఎక్కువ. అసలు చిన్న సినిమాలు లేకపోతే సంవత్సరానికి పది పదిహేను వచ్చే పెద్ద సినిమాలను నమ్ముకొని సినీ కార్మికులు ఉండలేరు.

క్రికెట్ మ్యాచ్ లు, పిల్లలకు పరీక్షల సమయాలు అంటేనే సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ కింద లెక్క. ఈ టైంలో థియేటర్లకు వచ్చేందుకు యూత్ ఇంట్రస్ట్ చూపరు. చదువుకునే పిల్లలున్న ఫ్యామిలీలైతే సినిమా హాళ్లవైపు కన్నెత్తి కూడా చూడవు. మార్చి 30న రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' మూవీ రిలీజయ్యేంత వరకు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉండే ఛాన్సులేమీ లేవు. 

అనిల్ కపూర్ ఇంటికి చేరుకుంటున్న ప్రముఖులు

ముంబై : శ్రీదేవి పార్థివదేహానికి నివాళులార్పించడానికి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖలు అనిల్ కపూర్ నివాసానికి చేరుకుంటున్నారు. శ్రీదేవి భౌతికకాయానికి అజయ్ దేవగణ్, కాజోల్, ఐశ్వర్య రాయ్, జయ బచ్చన్, రజనీకాంత్, వెంకటేశ్, చిరంజీవి నివాళులార్పించారు. 

12:03 - February 28, 2018

స్టార్ హీరోలతో సినిమాలు తీసి టాప్ ప్రొడ్యూసర్ గా ప్లేస్ సంపాదించిన ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. తన ప్రీవియస్ ఫిలిం ఆశించినంత సక్సెస్ అందించకపోవడంతో ఇప్పుడు తనకు కలిసి వచ్చిన కాంబినేషన్ ని కంటిన్యూ చెయ్యాలని థాట్ లో ఉన్న ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడంట. ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉంటూ హిట్ సినిమాలను అందించిన ప్రొడ్యూసర్ సి కళ్యాణ్. స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ ప్రొడ్యూసర్ గా కూడా కంటిన్యూ అయ్యాడు సి కళ్యాణ్. బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహ' సినిమా మాస్ లోను క్లాస్ లోను మంచి టాక్ సాధించి హిట్ సినిమా గా నిలిచి సి కళ్యాణ్ కి లాభాలు రాబట్టింది. 'జై సింహ' ఇచ్చిన బూస్టింగ్ తో మరో సినిమా చేసాడు సి కళ్యాణ్.

సి కళ్యాణ్ ప్రీవియస్ సినిమా 'ఇంటెలిజెంట్’. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది అని ఆడియన్స్ కి తెలుసు. సి కళ్యాణ్ కూడా నిర్మాతగా నష్టపోయాడు. దర్శకుడు వివి.వినాయక్ మీద నమ్మకం ఉంచి సాయి ధరమ్ తేజ్ తో నిర్మించిన ఆ సినిమా ఏ మాత్రం లాభాలని ఇవ్వలేకపోయింది. కనీసం సినిమా బడ్జెట్ లో సగం వసూళ్లు కూడా వెనక్కి రాలేదు అనే టాక్. ఇప్పుడు బాలకృష్ణ, వి వి వినాయక్ సి కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

11:58 - February 28, 2018

ఇంతకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కోసం ముంబై వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన సౌత్ నుండే హీరోయిన్స్ ఫ్లో పెరిగింది. హీరోయిన్స్ గా వస్తున్న వారిలో కేరళ గర్ల్స్ ఎక్కువ గా ఉండడం చూస్తూనే ఉంటాం. మరి మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు ? తన అందంతో అభినయంతో తెలుగు ఆడియన్స్ ని కట్టి పడేస్తున్న హీరోయిన్స్ చాల మంది ఉన్నారు. కానీ మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. మలయాళం సినిమా ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అదే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే అందులో కూడా అందమైన పాత్రలో నటించి మెప్పించింది అనుపమ పరమేశ్వరన్. అనుపమ దశ తిరిగింది. తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తాను చేసిన శతమానం భవతి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గ్రామీణ నేపధ్యంలో సాగే కథతో వచ్చిన ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర పడేలా చేసింది. అలాగే యంగ్ హీరో రామ్ పోతినేని తో ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాలో యాక్ట్ చేసి క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైంది.

తన ఫస్ట్ సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న మరో సౌత్ ఇండియన్ బ్యూటీ సాయిపల్లవి. ఈ మధ్య తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కీలకం అయిపోయారు. ఫస్ట్ సినిమాతో నే క్రేజ్ తెచ్చుకొని యూత్ ని ఫాన్స్ గా మార్చుకుంటున్నారు. చిన్న సినిమాలను పక్కన పెట్టి పెద్ద సినిమాలకు ఒకే చెప్తున్నారు ఇదే కోవలో ఫిదా సినిమాతో వచ్చిన సాయిపల్లవి ఆ తరువాత బిజీ అయిపోయింది. దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన ప్రీవియస్ సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమా లో హీరో నాని తో పాటు సాయి పల్లవి నటించింది. నాని యాక్టింగ్ ని కూడా డామినేట్ చేసింది సాయి పల్లవి అనే టాక్ వచ్చిందట. ఎం సి ఏ సినిమాలో నాచురల్ స్టార్ యాక్టింగ్ కి పోటీ ఇచ్చి నటించింది సాయి పల్లవి. ప్రెసెంట్ నాగశౌర్యతో కణం అనే సినిమా రెడీ చేసింది సాయిపల్లవి.

11:43 - February 28, 2018

తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పించే పనిలో పడ్డాడు ఈ స్టార్ హీరో కొడుకు. తాను సెలెక్ట్ చేసుకునే స్టోరీ లో లోపం ఉందో మరి తన డైరెక్టర్స్ ఛాయస్ లో లోపం ఉందో కానీ ప్రొపెర్ హిట్ లేక కష్టపడుతున్నాడు ఈ యంగ్ హీరో. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్నవాళ్లు ఈ మధ్య సినిమాల విషయం లో ఫోకస్డ్ గా ఉంటున్నారు. అప్ డేట్ అవుతున్న టాలెంట్ తో పాటు ట్రావెల్ చేస్తూ హిట్స్ కొడుతున్నారు యంగ్ హీరోస్. ఈ యంగ్ హీరోస్ జాబితాలో అక్కినేని అఖిల్ కూడా ఒకడు. 'అఖిల్ అక్కినేని' ఈ పేరు ఫస్ట్ సినిమా అఖిల్ నుండి బాగా పబ్లిసిటీ అయింది. నట వారసత్వంతో వచ్చిన ఈ యంగ్ హీరో ఒక్క పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

'హలో' అంటూ తన ప్రీవియస్ సినిమాతో పలకరించిన 'అఖిల్' కి అదిరిపోయే హిట్ మాత్రం పడలేదు అనే టాక్ ఉంది. తన రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎంత మేరకు పలకరించాయో పక్కన పెడితే ఇప్పుడు అఖిల్ కి ఒక హిట్ అయ్యే సినిమా కావాలి. అందుకోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కాంటాక్ట్స్ జరుగుతున్నాయట. 'తొలిప్రేమ' సినిమాతో మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకీ అట్లూరి. మరి వెంకీ అఖిల్ కి హిట్ ఇస్తాడా లేదా చూడాలి.

జయేంద్ర మృతిపై చంద్రబాబు సంతాపం

గుంటూరు : కంచి పీఠధిపతి జయేంద్ర సరస్వతి మరణంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కంచి పీఠాన్ని జయేంద్ర సరస్వతి బలమైన సంస్థగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. 

అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి పార్థివదేహం

ముంబై : సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీదేవి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం 12.30లగంటల వరకు ఉంచి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆమె అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్న 3.30 శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయి. 

ఐఎన్ఎక్స్ కేసులో కార్తి చిదంబరం అరెస్ట్

చెన్నై : ఐఎన్ఎక్స్ కేసులో కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కార్తి చిదంబరం రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. 

10:17 - February 28, 2018

ముంబై : అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలోని ఆమె నివాసానికి తరలించారు. ఉదయం పలువురు సినీ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

9గంటల ప్రాంతంలో సెలబ్రేష్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించారు. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు పలు ఆంక్షలను విధించారు. మీడియాకు కేవలం కొంత వరకు మాత్రమే పరిమితం చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉంచిన ప్రదేశం వరకు మీడియాకు అనుమతినివ్వడం లేదు.

 

మాజీ సమాజ్ వాదీ ఎమ్మెల్యే అరెస్టు...

ఉత్తర్ ప్రదేశ్ : మాజీ సమాజ్ వాదీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

6 కి.మీటర్ల పాటు శ్రీదేవి అంతిమయాత్ర...

ముంబై : అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని చూసేందుకు సెలబ్రెటీ స్పోర్ట్స్ క్లబ్ కు అభిమానులు పోటెత్తారు. దాదాపు 6 కి.మీటర్ల పాటు అంతిమయాత్ర సాగనుంది. ఈ అంతిమయాత్రలో అభిమానులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఇతర నటీ, నటులు పాల్గొననున్నారు. 

09:39 - February 28, 2018

చెన్నై : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కాంచీపురంలోని ఏబీసీడీ ఆసుపత్రిలో జయేంద్ర సరస్వతి చేరారు. బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న అభిమానులు, కంచి పీఠాధిపతి శిష్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలు వివాదఘటనలో ఆయన ఇరుకున్న సంగతి తెలిసిందే.

కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1935 జులై 18 న తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జయేంద్ర సరస్వతి జన్మించారు. ఈయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్‌. 1954 మార్చి 24న జయేంద్ర సరస్వతిగా పేరు మార్చుకున్నారు. కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ పీఠాధిపతి. 

2004, సెప్టెంబర్ 3న కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ గుడి ప్రాంగణంలోనే హత్యకు గురి కావడం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక కంచి పీఠాధిపతి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అదే ఏడాది దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు జయేంద్ర సరస్వతి 61 రోజులపాటు జైలు జీవితం గడిపారు. నవంబర్ 27వ తేదీన జయేంద్ర సరస్వతితోపాటు నిందితులందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. 

09:33 - February 28, 2018

చెన్నై : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. లండన్ నుండి చేరుకున్న కార్తీని ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో చార్టెర్డ్ అకౌంటెంట్‌‌ను కూడా సీబీఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాలో రూ. 300 కోట్ల మేర విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనల్ని ఉల్లంఘించారని సీబీఐ భావిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా చెల్లింపుల విషయంలో కార్తీ చిదంబరం, ఇతరులపై సీబీఐ ప్రత్యేకంగా కేసులు నమోదు చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా కార్తీ చిదంబరం ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

కంచి పీఠాధిపతి కన్నుమూత...

చెన్నై : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కాంచీపురంలోని ఏబీసీడీ ఆసుపత్రిలో జయేంద్ర సరస్వతి చేరారు. 

వేటగాళ్ల పరార్...

నిజామాబాద్ : వర్ణి (మండలం) కూనేపల్లి అటవీస్థానంలో వేటగాళ్లను పట్టుకొనేందుకు ఫారెస్టు అధికారులు ప్రయత్నించారు. వేటగాళ్లు పరారయ్యారు. బైక్, సెల్ ఫోన్, మూడు నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు.  

సెలబ్రేషన్స్ స్పోర్ట్ క్లబ్ కు శ్రీదేవి భౌతికకాయం...

ముంబై: సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు శ్రీదేవి భౌతికకాయం తరలించారు. కడసారి చూపుకోసం అభిమానులు, ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. 

09:23 - February 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో మార్చి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. విద్యార్ధులు పదిహేను నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

విద్యార్ధుల పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. మొబైల్‌లో హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ వస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... పరీక్షలు సక్రమంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

09:12 - February 28, 2018

ముంబై : అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు పోటెత్తుతున్నారు. ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లో ఆమె పార్థీవ దేహాన్ని ఉంచారు. రజనీకాంత్, కమలహాసన్, వెంకటేష్, షారూఖ్‌ ఖాన్, ఆయన భార్య గౌరీఖాన్, దీపిక పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావేద్‌ అఖ్తర్, షబానా ఆజ్మీ, రాణిముఖర్జీ తదితర వందలాది మంది నటీనటులు ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. శ్రీదేవి ఇంటి ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాసేపట్లో శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహం అక్కడనే ఉండనుంది. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయయిన సంగతి తెలిసిందే. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. శ్రీదేవి హఠాన్మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అనంతరం తీవ్ర ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలతో మంగళవారం రాత్రి శ్రీదేవి పార్థీవదేహం ముంబైకి చేరుకుంది. 

హైదర్ గూడలో అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

ఇంటర్ పరీక్షలు ప్రారంభం...

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 14 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 8.45 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 

హోలీ సెలవులు...

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హోలీ సెలవులు ప్రకటించింది. మార్చి 1న (గురువారం)న హోలీకి సాధారణ సెలవు ప్రకటించగా రెండో తేదీని ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడేగా పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

08:06 - February 28, 2018
08:02 - February 28, 2018

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపారు. ఈసందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఏకరవు పెట్టారు. మరోవైపు టి.కాంగ్రెస్ బస్సు యాత్ర పేరిట జనాల్లోకి వెళుతూ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), పున్నా కైలాశ్ (టి.కాంగ్రెస్), కాచం సత్యనారాయణ గుప్త (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

శ్రీదేవి ఇంటికి భారీగా అభిమానులు..

ముంబై : ప్రముఖ సినీ నటి శ్రీదేవికి కడసారి నివాళులర్పించేందుకు అభిమానులు, పలువురు ప్రముఖులు ముంబైలోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. గత రాత్రి దుబాయ్ నుంచి ముంబై విమానాశ్రాయానికి చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయాన్ని నగరంలోని లోఖండ్‌వాలా గ్రీన్ ఏకర్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు. 

06:44 - February 28, 2018

కల్లు గీత తెలంగాణలో ప్రధానమైన కులవృత్తుల్లో ఒకటి. కల్లుగీతను.. తాటి ఉత్పత్తులను నమ్ముకొని.. జీవిస్తున్న అనేక కుటుంబాలు నేడు చాలా సమస్యల్లో ఉన్నారు. కుల వృత్తులను గుర్తించి... వాటికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం... తమ సమస్యలు కూడా పరిష్కరించాలని కల్లుగీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యలు... వారి పట్ల ప్రభుత్వ విధానం.. వారి డిమాండ్లపై టెన్ టివి జనపథంలో గౌడ కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ సమితి ఛైర్మన్ అంబల నారాయణ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:42 - February 28, 2018

హైదరాబాద్ : విదేశీ విద్య ఎంతో ఖరీదుగా మారిపోయిన ఈ రోజుల్లో... ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు 'ది హోప్‌ ఓవర్సీస్‌' విద్యా కన్సల్టెన్సీ డైరెక్టర్‌ జీవన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో... విదేశాల్లో విద్యావకాశాలపై విద్యార్థులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. విదేశీ విద్య, అర్హతలు, సర్టిఫికెట్లపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఇటలీ, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో విద్యార్ధులకు ఉచితంగా విదేశీ విద్య కల్పిస్తున్నామని... విదేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 54 వేల మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తుండగా... వారిలో 11 వేల మంది హోప్‌ సంస్థ ద్వారా వెళ్లినవారేనన్నారు జీవన్‌రెడ్డి. 

06:40 - February 28, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఏప్రియల్ 18 నుంచి 22 వరకూ నిర్వహించనున్న సీపీఎం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను ఆ పార్టీ నేతలు ఎంబీభవన్‌లో ఆవిష్కరించారు. ఏప్రియల్ 22న లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు 25 వేల మంది యువ కార్యకర్తలతో కవాతు నిర్వహిస్తామని సీపీఎం నేతలు వివరించారు. మహాసభల్లో దేశ రాజకీయాలు.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న విధానాలు, బీఎల్‌ఎఫ్‌ను పటిష్టం చేసే దిశగా చర్చలు నిర్వహించనున్నట్లు సీపీఎం నేతలు తెలిపారు. 

06:37 - February 28, 2018

 

రంగారెడ్డి : కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో కేసీఆర్‌ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నీరుగార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర తాండూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఉత్తమ్‌... కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్‌ జేబులు నింపుకోవడానికే మిషన్‌భగీరథని విమర్శించారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే రైతులకు సాయం పేరుతో కేసీఆర్‌ కొత్త డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే.. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేఈసార్‌.. కేంద్రంపై నెపం వేస్తున్నారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్‌ఎస్‌ వారినే నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. మెట్‌పల్లి షుగర్‌ ఫ్యాక్టరీని కేసీఆర్‌ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

 

06:34 - February 28, 2018

హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇందుకోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో ఇవాల్టి నుంచి నుంచి మార్చి 19 వరకు,.. తెలంగాణలో మార్చి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. విద్యార్ధులు పదిహేను నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో విద్యార్ధుల పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. మొబైల్‌లో హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ వస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... పరీక్షలు సక్రమంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

06:32 - February 28, 2018

ముంబై : ఎదురుచూపులకు తెరపడింది. నాలుగు రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపిన శ్రీదేవి మృతి కేసు ముగిసింది. ఎట్టకేలకు మృత దేహం ఇంటింకి చేరింది. ఆమె హఠాన్మరణమే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా మృతికి కారణాలపై వచ్చిన కథనాలు క్షణక్షణం సంచలం రేపాయి. ఎన్నోమలుపులు.. మరెన్నో ఎన్నో అనుమానాలు.. చివరకు శ్రీదేవిది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని దుబాయ్‌ ప్రాసీక్యూషన్‌ అధికారులు తేల్చేశారు. మృతి ఉదంతంలో ఎలాంటి కుట్రకోణం లేదని కేసును క్లోజ్‌చేయంతో.. పార్థివదేహాన్ని భారత్‌కు తరలించారు.

శనివారం రాత్రి 11.30 గంటలకు శ్రీదేవి మృతి చెందినట్టు తెలియాగానే భారత్‌లో సంచలన రేపింది. తొలుత ఆమె గుండెపోటుతో మృతిచెందారన్న కుటుంబసభ్యుల ప్రకటన.. అనంతరం బాత్‌టబ్‌లో మునిగి ఊపిరాడక చనిపోయారన్న దుబాయ్‌ పోలీసుల ప్రకటనతో కేసులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే.. దుబాయ్‌లోని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు కేసును నిశితంగా పరిశీలించిన మీదట శ్రీదేవి డెత్‌లో ఎలాంటి మిస్టరీ లేదని తేల్చివేశారు. దీంతో మృతదేహాన్ని రసాయనాలతో శుభ్రపరిచే ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం దుబాయ్‌లోని విమానాశ్రయానికి తరలించారు.

శ్రీదేవి భౌతిక కాయంతో దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం మంగళవారం రాత్రి 10 గంటలకు ముంబైకి చేరుకుంది. శ్రీదేవి భౌతికకాయంతో పాటు పదిమంది కుటుంబ సభ్యులు విమానంలో వచ్చారు. ఇక అప్పటికే అనిల్‌కపూర్, సోనమ్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు, అనిల్ అంబానీ, టీనా అంబానీ.. ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ముంబయి పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ ఎయిర్‌పోర్టు ప్రొసిజర్స్ అనంతరం.. లోఖండ్‌వాలాలోని గ్రీన్ ఏకర్స్‌లో ఉన్న శ్రీదేవి నివాసానికి అంబులెన్స్‌లో పార్థీవదేహాన్ని తరలించారు. అంతకు ముందు తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు అభిమానులు శ్రీదేవి నివాసం వద్దకు భారీగా తరలి వచ్చారు.

అభిమానుల సందర్శనార్థం పార్థీవదేహాన్ని కంట్రీక్లబ్‌లో ఉంచారు. ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీదేవి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు ముగియనున్నాయి. ఈనెల 24న దుబాయ్‌కి దేవతలా వెళ్లిన శ్రీదేవి .. దేహంగా మాత్రమే తిరిగి రావడం అభిమానుల గుండెల్లో తీరని బాధను మిగిల్చింది. 

06:28 - February 28, 2018

ముంబై : అతిలోక సుందరి శ్రీదేవి పార్థివదేహం ముంబయి చేరుకుంది. ఉత్కంఠ పరిణామాల మధ్య మంగళవారం మధ్యాహ్నం దుబాయ్‌ పోలీసులు ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం దుబాయ్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. యూఏఈ నిబంధనల ప్రకారం అన్ని లాంఛనాలు పూర్తిచేసి అనిల్‌ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించారు. అదే విమానంలో బోనీకపూర్‌, అర్జున్‌కపూర్‌, సంజయ్‌కపూర్‌తో పాటు 10 మంది కుటుంబ సభ్యులు కూడా ఇండియాకు వచ్చారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి పార్థివదేహం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా లోఖండ్‌వాలాలోని గ్రీన్‌ యాకర్స్‌లోని ఆమె నివాసానికి శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించారు. కాగా ఇవాళ ఉదయం లోఖండ్‌వాలా స్పోర్ట్స్‌ క్లబ్‌లో ప్రజల సందర్శనకోసం భౌతికకాయాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 తర్వాత కుటుంబసభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు విలేపార్లే సేవా సమాజ్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు తమ అభిమాన కథానాయికను కడసారి చూసేందుకు ముంబైకు భారీ ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీదేవికి నివాళులర్పించేందుకు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కూడా ముంబైకి తరలివస్తున్నారు. 

జగన్ 100వ రోజు...

ప్రకాశం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఉప్పల పాడు నుండి జగన్ పాదయాత్ర కొనసాగనుంది. చీమకుర్తిలో బహిరంగసభ నిర్వహించనున్నారు. 

నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు...

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 8.45 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 

నేడు శ్రీదేవి అంత్యక్రియలు...

ముంబై : శ్రీదేవి అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మ.12.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం.. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచుతారు. మ.2 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మ.3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగునున్నాయి.

వైసీపీ నేతపై టిడిపి నేతల దాడి...

అనంతపురం : తాడిపత్రిలో టిడిపి..వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నేత మున్నాపై టిడిపి నాయకులు దాడి చేశారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసు జీపు ధ్వంసమైంది. 

ముంబైకి శ్రీదేవి భౌతికకాయం...

ఢిల్లీ : అందాల తార శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకుంది. దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. కడసారి చూసేందుకు భారీగా అభిమానులు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. 

Don't Miss