Activities calendar

31 January 2018

22:10 - January 31, 2018
22:07 - January 31, 2018

గుంటూరు : విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలన్నారు మంత్రి యనమల రామకృష్ణుడు. 2014-15 రెవెన్యూ లోటులో 7 వేల కోట్లకుగాను... కేంద్రం 4 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనకు ఇచ్చిన హామీల మేరకు... అదనంగా నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. ఏపీకి ప్రకటించిన ప్యాకేజి ప్రకారం నిధులు ఇస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. 

 

22:05 - January 31, 2018

ఢిల్లీ : 2018-19 సాధారణ బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రేపు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు మరింత ప్రాధాన్యత చేకూరింది. ఎన్నికల దృష్ట్యా వ్యవసాయం, ఉపాధి, మౌళిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రజాకర్షక బడ్జెటా? లేక అభివృద్ధికి ఊతమిస్తుందా? 
బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న అరుణ్‌జైట్లీ  
2018-19 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో మోది ప్రభుత్వానికి ఇది ఎంతో కీలకంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న బిజెపికి గ్రామీణ ప్రజలను ఆకర్షించడం పెద్ద సవాల్‌గా మారింది.  రైతులు, గ్రామీణ ప్రజలను ఆకర్షించేవిధంగా బడ్జెట్‌ ఉంటుందని అంచనా. రైతులకు కొత్త పథకాలు, యువతకు ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా బడ్జెట్‌ ఉండబోతోందని నిపుణుల అంచనా. వ్యవసాయం, రహదారుల నిర్మాణం,  రైల్వేల ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కల్పించే అవకాశం ఉంది. 
జిఎస్‌టి అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్‌ 
కేంద్రప్రభుత్వం తీసుకున్న రెండు అతిపెద్ద నిర్ణయాలు పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బడ్జెట్‌లో చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహకాలు కల్పించే వీలుంది. జిఎస్‌టి అమలులోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలిబడ్జెట్‌ ఇది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ తదితర పరోక్ష పన్నులన్నీ జిఎస్‌టిలో కలిసిపోయాయి. దీంతో పన్నుల ప్రస్తావన ఈ బడ్జెట్‌లో కనిపించదు. కస్టమ్స్‌ డ్యూటీ  కేంద్రం ఆధీనంలో ఉండడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, సోలార్‌ పానల్స్‌ లాంటి వస్తువులపై సుంకం విధించవచ్చు.
సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌  
ఎన్డీయే ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా కాకుండా సాధారణ బడ్జెట్‌లో కలిపివేసింది. 2018 బడ్జెట్‌లో రైల్వేలకు కోత తప్పకపోవచ్చు. ప్రభుత్వానికి రావలసిన పరోక్ష పన్నుల ఆదాయం తగ్గిపోవడంతో రైల్వేలకు ప్రకటించిన గ్రాస్‌ బడ్జెటరీ సపోర్ట్‌లో 27 కోత విధించవచ్చని ఆర్థక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన రూ.1.31లక్షల కోట్ల మూలధన వ్యయంలో ప్రభుత్వ వాటా 55 వేలు ఉండగా ఈసారి 40 వేల కోట్లకే పరిమితమయ్యే ఛాన్సుంది. భవిష్యత్తులో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే ప్రకటించింది. ధరలను నియంత్రించడానికి బడ్జెట్‌లో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ ఆర్థికమంత్రిత్వ శాఖను కోరింది. ఈ అభ్యర్థన ఎంతవరకు ఫలిస్తుందన్నది వేచి చూడాలి.
ఎన్డీయే ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌ 
ఎన్డీయే ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌ కావడంతో మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే అవకాశం లేకపోలేదు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును 3 లక్షలకు పెంచే అవకాశం కనిపిస్తోంది. జిడిపి వృద్ధిరేటును పరుగులు పెట్టించడానికి పెట్టుబడులనే నమ్ముకున్న కేంద్రం ఎఫ్‌డిఐలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. 

21:58 - January 31, 2018

గద్వాల : 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడితే రాజకీయం సన్యాసం చేస్తా... దానికి ఉత్తమ్‌ సిద్ధమా అని కేటీఆర్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. నెహ్రూ కాలం నుంచి సోనియా, రాహుల్‌గాంధీ వరకు తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గద్వాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్‌... ఉభయ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోయిన జిల్లా పాలమూరు అన్నారు... దీనికి కాంగ్రెస్ నేతలే ప్రధాన కారణమన్నారు. 

 

21:53 - January 31, 2018

హైదరాబాద్ : చంద్రగ్రహణం చూడడం వల్ల ఎలాంటి అనర్ధాలు జరగవంటోంది జన విజ్ఞాన వేదిక. ఎప్పుడో వచ్చే ఈ ఖగోళ అద్భుతాన్ని అందరూ చూడవచ్చంటున్నారు. గ్రహణం సమయంలో భుజించేందుకు అందరూ భయపడతారని... అయితే అలాంటి భయాలు అవసరం లేదని హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై అందరికీ టిఫిన్లు పంచిపెట్టారు. ఖగోళ అద్భుతంపై నగరవాసులేమంటున్నారో మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:48 - January 31, 2018
21:46 - January 31, 2018

హైదరాబాద్ : ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చల్లని వెన్నెలను పంచే చంద్రుడు అత్యంత అరుదైన రూపంలో దర్శనమిచ్చాడు. సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌, బ్లడ్‌ మూన్‌లుగా కనువిందు చేశాడు. దీన్నే సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌ అని అంటారు. ఇలాంటి అత్యంత అరుదైన దృశ్యం చివరి సారిగా 1982లో చోటుచేసుకుంది. ఈ అరుదైన ఘట్టం మళ్లీ వీక్షించాలంటే 2037 వరకూ ఆగాల్సిందే. భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని సూపర్‌ మూన్‌ అంటారు. ఈ సమయంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు. మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌ అంటారు. చంద్రగ్రహణం నాడు ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి. దీంతో చంద్రుడు గోధుమ వర్ణంలో కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని బ్లడ్‌ మూన్‌ అంటారు. ఈ విధంగా చంద్రుడు మూడు రూపాల్లో కనువిందు చేశాడు. అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు. ఈ పరిణామాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా వాసులకు దక్కింది. 

 

21:42 - January 31, 2018

చెన్నై : నటి అమలాపాల్‌ లైంగిక వేదింపులకు గురయ్యారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు వ్యాపారవేత్త అలగేశన్‌ను అరెస్ట్ చేయటంతో విషయం వెలుగుచూసింది.  చెన్నైలోని టీనగర్ పాండిబజార్ పోలీస్టేషన్‌లో అలగేశన్‌పై నటి అమలాపాల్ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించారని, అంతేకాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది. సమాజంలో మహిళలకు భద్రత లేదని, చేతలతో మాటలతో నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారని ఆమె అన్నారు. నటిగా ఉన్న  తానే వేధింపులకు గురయ్యానని, ఇక సామాన్య మహిళల పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోయారు. తనను వేధించిన  వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

తెలంగాణలో టీఆర్టీ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్టీ షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

18:26 - January 31, 2018

చంద్రగ్రహణంపై అపోహలు ఉండవద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధి బీఎన్ రెడ్డి, జేవీవీ ప్రతినిధి రమేష్, మనోహర్, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, ప్రొ.వెంకటేశ్వరరావు, సైక్రియాటిస్టు వీరేంద్రనాథ్, ప్రొ.రాంచంద్రయ్య పాల్గొని, మాట్లాడారు. చంద్రగ్రహణం చూడడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవన్నారు. ఎలాంటి నష్టం, ముప్పు వాటిల్లదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:09 - January 31, 2018

హైదరాబాద్ : హుమాయన్ నగర్ లో రౌడీ షీటర్ల వీరంగం సృష్టించారు. ఇద్దరు రౌడీ షీటర్లు ఐదుగురిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఒకరు మృతి చెందారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

17:59 - January 31, 2018

హైదరాబాద్ : 'మాకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు వద్దంటున్నారు' హైదరాబాద్ మెహదీపట్నం భోజగుట్ట వివేకానంద కాలనీవాసులు. ఏళ్ల తరబడిగా నివాసం ఉంటున్న తమ ఇళ్లు కూలిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామంటూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చిన తరువాతే కాలనీని ఖాళీ చేస్తామని స్పష్టం చేస్తున్న భోజగుట్ట వివేకానందకాలనీ వాసులతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:56 - January 31, 2018

ఢిల్లీ : ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కొత్తపల్లి గీత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణలతో పాటు ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృంద సభ్యులు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పోలవరం పనులు వేగవంతం చేసి.. సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన నేపథ్యంలో పూర్తి నిధులను కేంద్రం భరించడంతో పాటు పునరావాస ఖర్చును కూడా కేంద్రమే భరించాలని ఎంపీలు గడ్కరీని కోరారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కొణతాల రామకృష్ణ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. 

17:51 - January 31, 2018

అసిఫాబాద్ : పేదలను ఆదుకోవడంలో ఆ ప్రజాప్రతినిధి అందరికంటే ముందుంటారు. నిస్సహాయకులను సాయం చేయడంలో ఆయనది పెద్దచేయి. కరవు రోజుల్లో గిరిజన గూడేల్లో అంబలి కేంద్రాలు తెరిచి ఆదుకున్న ఆ ఎమ్మెల్యే...  ఇప్పుడు 58 గిరిజన జంటలకు సొంత ఖర్చులతో సామూహిక వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈయన పేరు కోనేరు కోనప్ప. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. పేదలకు ఆపన్నహస్తం అందించడంలో ఘనాపాటి. గతంలో పలు ధాతృత్వ కార్యక్రమాలు నిర్వహించిన ఈయన ఇప్పుడూ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. బెజ్జూరు మండలం సోమిని గ్రామంలో గిరిజన జంటలకు సామూహిక వివాహం జరిపించారు. 

ఒకటికాదు.. రెండుకాదు... 58 ఆదివాసీ గిరిజన జంటలకు పెళ్లి జరిపించారు. వీరిలో కోయ, కోలాం, మన్నె తెగలకు చెందినవారు ఉన్నారు. తలంబ్రాల నుంచి తాంబూల వరకు అన్నింటికీ సొంతంగా ఖర్చులు పెట్టుకున్నారు. తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, ఇంటి సామాగ్రి అందచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కోనేరు చారిటబుల్‌ ట్రస్టు తరపున విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే కోనప్ప దంపతులతోపాటు మంత్రి జోగురామన్న, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరిందరికి కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వ సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

పేద గిరిజనులకు సామూహిక వివాహాలు జరిపించిన కోనేరు కోనప్పను పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, గిరిజన సంఘాల నాయకులు అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వలో సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో పర్యటించనున్నారు. ఆ సందర్భంలో 116 పేదల జంటలకు పెళ్లిల్లు జరిపించాలని నిర్ణయించారు. 

 

హుమాయున్ నగర్ లో రౌడీషీటర్ల వీరంగం

హైదరాబాద్ : హుమాయున్ నగర్ లో రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు.ఐదుగురిపై ఇద్దరు రౌడీషీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

17:46 - January 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలో జంబ్లింగ్‌ విధానం అమలు ఏళ్లుగా సందగ్ధంలోనే ఉంది. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేయడమే గాని ఈ విధానంపై నిర్ణయం తీసుకునేందుకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడంలేదు. ఈ సారి కూడా జంబ్లింగ్‌ విధానం లేకుండానే పరీక్షలకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. 
జంబ్లింగ్ విధానం అమలుపై గందరగోళం  
తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలో జంబ్లింగ్‌ విధానం అమల్లోకి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. 2004 నుండి ఈ విధానం అమలుపై గందరగోళం నెలకొంది. ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ చేయించకుండానే మార్కులు వేస్తున్నారని ఆరోపణలున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు 2004లో ప్రొఫెసర్‌ దయారత్నం కమిటీ వేసింది అప్పటి ప్రభుత్వం. ఈ కమిటీతో ప్రైవేటు కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెప్పినప్పటికీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. 
ప్రైవేటు కాలేజీలపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు  
ఎవరి కాలేజీలో వారికే సెంటర్‌ వేయడం వల్ల వారి కాలేజీ లెక్చరర్స్‌తో పాటు బయట నుండి వచ్చే ఎక్స్‌టర్నల్‌ని మ్యానేజ్‌ చేస్తే సరిపోతుందనే ఆలోచనలోనే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని తలెత్తనీయకుండా జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 
జంబ్లింగ్‌ విధానంతో బెంబేలెత్తుతోన్న ప్రైవేటు యజమాన్యం
ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ చెప్పడంతో ప్రైవేటు యజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. దీంతో కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమాన్యాలు రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్నాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. 
మరింత అధ్వాన్నంగా ప్రైవేటు కాలేజీలు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో సరైన ల్యాబ్‌ సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలేజీల్లో ల్యాబ్‌ సౌకర్యం ఉన్నా ప్రాక్టికల్స్‌ చేయించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రైవేటు కాలేజీలో ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. దీంతో విద్యార్థులకు పిప్పెట్‌, బ్యూరెట్‌ అంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నారని విద్యావేత్తలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రాక్టికల్స్‌ చేయించకుండానే మార్కులు వేస్తున్నారని అందుకే జంబ్లింగ్‌ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 
జంబ్లింగ్‌ నిర్ణయంపై నిర్లక్ష్యం వహిస్తోన్న ప్రభుత్వం
ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్‌పై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ నిర్లక్ష్యాన్ని వీడి గ్రామీణ ప్రాంత విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

 

17:40 - January 31, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వ్యయం తడిసిమోపెడవుతోంది. ఇప్పటికే  అంచనా వ్యయం 58 వేల కోట్ల రూపాయలు  మించిపోయింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
పెరుగుతున్న ప్రాజెక్టు అంచనా వ్యయం 
పోలవరం.. ఏపీ ప్రజల జీవనాడి. ప్రాజెక్టు అంచనా వ్యయం అంతకంతకు పెరగడం ఆందోళనకర పరిణామం. మొదట్లో 2 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.45 వేల కోట్లు 
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక అందజేసింది. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 45 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటందని అంచనా వేస్తున్నారు. దీనిలో ఎక్కువ భాగం నిర్వాసితుల  పునరావాసం, పునర్నిర్మాణానికే వెచ్చించాల్సి ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు, పునరావాసానికి 30 వేల కోట్లు అవుతుందని అంచాన వేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టైనా ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు కేంద్ర సుముఖంగా లేదు. ప్రధాన ప్రాజెక్టుపై చేసిన ఖర్చులు ఇవ్వడానికే కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. 
పనులతో పోల్చితే ఖర్చే ఎక్కువగా ఉందన్న విమర్శలు 
పోలవరంలో జరుగుతున్న పనులతో పోలిస్తే ఖర్చే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. కుడి కాల్వ పనులు 91 శాతం పూర్తయ్యాయి. ఎడవ కాల్వ పనులు 60 శాతం చేసినట్టు కేంద్రానికి నివేదిక పంపారు. హెడ్‌ వర్క్స్‌ పనులు 34 నుంచి 39 శాతం పనులు పూర్తియ్యాయి. స్పిల్‌ వే పనులు 73 శాతం పూర్తయ్యాయి. డయాఫ్రం వాల్‌ పనుల్లో 62 శాతం పురోగతి ఉందని లెక్క  చూపించారు. నత్త నడకన సాగుతున్న పోలవరం పనులను  చూస్తే ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో సాగునీరు ఇచ్చే అవకాశంలేదని అధికారులే చెబుతున్నారు. కాఫర్‌ డ్యామ్‌  నిర్మించి సాగునీరు అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు కూడా నీటిమూటలుగానే మిగిలిపోయాయన్న విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనుల్లో కొంత భాగాన్ని ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి తప్పించి, మరో సంస్థకు అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తాజా నిర్ణయం తర్వాతైనా పనుల్లో పురోగతి ఉంటుందో  లేదో చూడాలి.  
 

17:36 - January 31, 2018

నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌ సర్కార్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 4 నుంచి జరిగే సీపీఎం రాష్ట్ర మహాసభల తొలిరోజు నిర్వహించే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆయన అన్నారు. నాలుగు రోజులు ప్రతి సాయంత్రం షాట్ పేరుతో వివిధ అంశాలపై కళారూపాలు ఉంటాయని జూలకంటి తెలిపారు.

 

17:33 - January 31, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీని టార్గెట్‌ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌లో దోస్తీ చేసేందుకు ఎంఐఎం సన్నాహాలు చేస్తున్న తరుణంలో మజ్లిస్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎంఐఎం ప్రభావిత నియోజకవర్గాల్లో మైనారిటీ వర్గానికి  చెందిన బలమైన నేతలను ప్రోత్సహించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 
సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతలు దృష్టి 
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్న హస్తం పార్టీ.. అధికారమే  లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ పాతబస్తీలో ముస్లిం నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. 
టీఆర్‌ఎస్‌తో దోస్తీ ప్రారంభించిన ఎంఐఎం 
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ... తమ ప్రయోజనాల కోసం  ప్రభుత్వాన్ని అన్ని విధాల వాడుకున్న మజ్లిస్‌ నేతలు... రాష్ట్ర విభజన తర్వాత అధికార టీఆర్‌ఎస్‌తో దోస్తీ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది. టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంతో  అధికార పార్టీకి మరింత చేరువైంది. అధికారం ఎటువుంటే అటు వాలిపోవడం మజ్లిస్‌ నైజం. దీంతో ఎప్పుడూ అవకాశవాదాన్ని అందిపుచ్చుకునే మజ్లిస్‌ను టార్గెట్‌ చేసే విషయంలో ఈసారి పూర్తి స్పష్టతో ముందుకెళ్లాలని టీ కాంగ్రెస్‌ నిర్ణయించింది. 
అక్బరుద్దీన్‌పై చంద్రాయణగుట్ట నుంచి ఫహిల్వాన్‌ పోటీ ?
పాతబస్తీలో ఎంఐఎం నేతలను ఢీ కొట్టే ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థులపై దృష్టి పెట్టింది. అసెంబ్లీలో మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌పై చంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానంలో ఫహిల్వాన్‌ను బరిలో దింపాలని డిసైడైంది. చార్మినార్‌ శాసనసభ సీటు నుంచి మాజీ కార్పొరేటర్‌ గౌస్‌ను, నాంపల్లి స్థానం నుంచి ఫిరోజ్‌ఖాన్‌ను పోటీ పెట్టడం ద్వారా పాతబస్తీలో మస్లిజ్‌కు బ్రేక్‌లు వేయొచ్చని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 
అసదుద్దీన్‌పై పోటీకి అజారుద్దీన్‌ సుముఖత ?
హైదరాబాద్‌  లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై పోటీకి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను దింపాలన్న యోచనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. దీనిపై అజర్‌తో టీ కాంగ్రెస్‌ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం.  2009 లోక్‌సభ ఎన్నికల్లో  ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి గెలిచిన అజారుద్దీన్‌ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అజారుద్దీన్‌ను హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అసదుద్దీన్‌ ఒవైసీపై పోటీకి దింపితే పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పట్టు బిగించడంతోపాటు, కాంగ్రెస్‌ జెండా ఎగురవేయవచ్చని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అజర్‌ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అజారుద్దీన్‌ను బరిలో దింపితే మైనారిటీ యవకులు కాంగ్రెస్‌ వైపు మళ్లీ అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు అంచనావేస్తున్నారు. మొత్తంమీద హైదరాబాద్‌ పాతబస్తీలో మజ్లిస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ప్రణాళికలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో చూడాలి. 

 

సినిమా టికెట్ల ధరలపై ఉపసంఘం భేటీ

ఏపీ : సినిమా టికెట్ల ధరలపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో సామాన్య ప్రజల మీద భారం పడకుండా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్ వెంకటేశ్వర్ అన్నారు. 

17:28 - January 31, 2018

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలంలో సొరంగం బయటపడింది. తవ్వకాలు జరుపుతుండగా..పురాతన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి.  రుద్రాక్షమఠంలోని గుహలో అధికారులు నిర్వహిస్తున్న తవ్వకాల్లో పూజా సామాగ్రి, వంటపాత్రలు బయటపడ్డాయి. అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణం

కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళా అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బెజ్జూరు మండలం మర్తిడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన స్రవంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

17:25 - January 31, 2018

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్ద ట్రాన్స్‌ట్రాయ్‌ కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకుదిగారు. నవయుగ చేతికి పోలవరం స్పిల్‌ వే కాంట్రాక్టు పనులు మారడంతో 2 వేల మందిని ట్రాన్స్‌ ట్రాయ్‌ యాజమాన్యం తీసివేసింది. 4 నెలల బకాయిలు చెల్లించకుంటే సైట్‌ నుంచి వెళ్లేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు. మరోవైపు కాంక్రీట్ పనులు చేయించడానికి ఇతర రాష్ట్రాల నుంచి 2 వేల మంది కార్మికులను ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ తీసుకువచ్చింది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై పిటిషన్ స్వీకరించిన హై కోర్టు

హైదరాబాద్: నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని హై కోర్టులో ఆయన భార్య లక్ష్మి వేసిన పిటిషన్ హై కోర్టు విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని నల్లగొండ ఎస్పీని కోర్టు ఆదేశించింది.

17:19 - January 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్‌జోషిని ప్రభుత్వం నియమించింది. కాసేపట్లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం కేసీఆర్‌కు ఎస్‌కే జోషి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు... సీఎం లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తామంటున్న ఎస్‌కే జోషితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. రీడిజైనింగ్‌తోనే ప్రాజెక్టుల పూర్తి సాధ్యమన్నారు. చర్చలతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

 

ఫిబ్రవరి 2న పాత వరంగల్ లోని స్కూళ్లకు సెలవు

హైదరాబాద్ : విద్యాశాఖ పాత వరంగల్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలకు ఫిబ్రవరి 2న స్కూళ్లకు సెలవు ప్రటించింది. మేడారం జాతర నేపథ్యంలో సెలువు ప్రకటించారు.

17:11 - January 31, 2018

కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళా అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బెజ్జూరు మండలం మర్తిడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన స్రవంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే.. తనపై స్థానిక నేతలు ముగ్గురు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ముగ్గురు నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా స్థానిక నాయకులు, స్రవంతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం గ్యాస్‌ లీకై స్రవంతి ఇళ్లు దగ్ధమైంది. అయితే... ఆ ప్రమాదానికి నాయకులే కారణమని స్రవంతి తన వాంగ్మూలంలో తెలిపింది. 

 

17:08 - January 31, 2018
17:06 - January 31, 2018

ఉత్తరప్రదేశ్ : రిపబ్లిక్‌ డే రోజున ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న మత ఘర్షణలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తిరంగా యాత్ర సందర్భంగా చందన్‌ గుప్తా స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తున్న దృశ్యం ఇందులో ఉంది.  ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం నుంచి తిరంగా ర్యాలీగా వెళ్తుండగా కాల్పులు జరిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో చందన్ గుప్తా మృతి చెందాడు. ఆ సమయంలో కొందరు యువకులు తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్లతో వీధుల వెంట హల్‌చల్‌ చేస్తూ వెళ్లారు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి పై అంతస్తుపై నుంచి తీయగా అది  వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 114 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా...33 మందిపై కేసు నమోదైంది. కాస్‌గంజ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.

17:02 - January 31, 2018

మహారాష్ట్ర : భారత నావికాదళంలో స్కార్పీన్‌ శ్రేణికి చెందిన మూడో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ జలప్రవేశం చేసింది. ముంబయిలోని మజగావ్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ను నావికాదళంలో చేర్చారు.  నేవీ చీఫ్‌ అడ్మైరల్‌ సునీల్‌ లంబా సతీమణి రీనా లంబా ఈ జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఏడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించనున్నట్లు సునీల్‌ లంబా వెల్లడించారు.  మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్‌ భాగస్వామ్యంతో ఈ జలాంతర్గామిని స్వదేశంలో రూపొందించారు. ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఈ జలాంతర్గామి అతి తక్కువ శబ్దంతో శత్రు నౌకను ఛేదించనుంది. 

 

16:58 - January 31, 2018

హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి 15 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిఘా నీడలో పరీక్షలు నిర్వహించబోతున్నారు.  
విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు  
ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌లో ముడిపడిన ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. 
మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు 
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరుగనున్నాయి. ఈసారి 11,109 పాఠశాలలకు చెందిన  5,60,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 5,04,545 మంది. సప్లిమెంటరీ విద్యార్థులు 35,864 మంది. ఒకేషనల్‌ విద్యార్థులు 19,986 మంది.  రాష్ట్ర వ్యాప్తంగా 2,500 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు.  హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 356, రంగారెడ్డిలో 190, మేడ్చల్‌లో 186 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అతితక్కువగా అతితక్కువగా 34, వనపర్తిలో 35, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఫర్నిచర్‌, మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రహరీగోడలు, గేట్లు సరిగాలేకపోతే వెంటనే రిపేర్లు చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నిచర్‌ లేకపోతే పక్క పాఠశాలల నుంచి తెప్పించి సర్దుబాటు చేయాలని ఆదేశించారు.
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. సమస్యాత్మకమైన 405 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2016-17లో 330 కేంద్రాల్లో సీసీ కెమెరాల నీఘా నీడలో పరీక్షలు నిర్వహించారు. 2015-16లో జిల్లాకు ఒకటి, రెండు చొప్పున మొత్తం 15 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో ఈ కేంద్రాల్లో తక్కువ ఉత్తీర్ణతా శాతం నమోదుకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి విస్తృతంగా తనిఖీ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రెవెన్యూ అధికారులను నియమించనున్నారు.  

 

నటుడు సామ్రాట్ కు బెయిల్ మంజూరు

హైదరాబాద్ : సినీనటుడు సామ్రాట్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల మరియు ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుతో మియాపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాసేపట్లో చర్లపల్లి జైలు సామ్రాట్ విడుదల కానున్నారు. 

నిడదవోలులో కోడి పందాలు

పశ్చిమగోదావరి : కోడిపందాలపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నిడదవోలులో 95 మంది పందెంరాయుళ్లును అరుస్టు చేశారు. వారిని పోలీసులు కోర్టుకు హాజరుపర్చారు. 

16:52 - January 31, 2018

హైదరాబాద్ : ఐపీసీలోని 506, 507 సెక్షన్లను సవరించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ఈ రెండు సెక్షన్ల సవరణను రాజకీయ పార్టీలు,  న్యాయవాదుల  సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులకు విశేషాధికారాలు అప్పగించే ఐపీసీలోని 506, 507 సెక్షన్ల సవరణపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
506, 507 సెక్షన్ల సవరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం  
ఐపీసీలోని 506, 507 సెక్షన్ల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆగ్రహంతో  ప్రభుత్వాన్ని, ఇతరులను పరుష పదజాలతో విమర్శిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టింగ్‌లు పెట్టినా..ఎవరైనా ఫిర్యాదు చేస్తే, పోలీసులు వెంటనే అరెస్టు చేసి నేరుగా జైలుకు పంపిస్తారు. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం కూడా చేశారు. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
ఇది పౌరస్వేచ్ఛను హరించడమే : న్యాయ నిపుణులు 
పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం, తిట్టడం, కించరపరచడం 506 సెక్షన్‌ కిందకు వస్తాయి. నేరాన్ని ప్రేరేపిండం వంటి పరోక్ష బెదిరింపులు 507 సెక్షన్‌ కిందకు వస్తాయి. ప్రస్తుతం ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ రెండు సెక్షన్ల సవరించిన తర్వాత కోర్టు అనుమతి లేకుండా ఫిర్యాదు అందిన వెంటనే నేరుగా అరెస్టు చేసే అధికారం పోలీసులకు దక్కుతుంది. పోలీసులకు అపరిమిత అధికాలు సంక్రమిస్తాయి. ఇది పౌరస్వేచ్ఛను హరించడమే అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 
ప్రతిపక్షాల నోళ్లు నొక్కేందుకే సవరణ 
ప్రతిపక్షాల నోళ్లు నొక్కేందుకే ప్రభుత్వం ఐపీసీలోని 506, 507 సెక్షన్లను సవరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్‌ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈరెండు సెక్షన్ల సవరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి న్యాయవాద సంఘాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలు కూడా ఇదే విధమైన సన్నాహాల్లో ఉన్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. 

 

16:36 - January 31, 2018

గుంటూరు : అమరావతిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏపీ తాత్కాలిక సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు, సందర్శకులకు స్మార్ట్ సైకిళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 30  స్మార్ట్‌ సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిళ్లకు సంబంధించి మరింత సమచారాన్ని వీడియోలో చూద్దాం... 

16:31 - January 31, 2018

ఉత్తరప్రదేశ్ : గ్రేటర్‌ నోయిడాలో దారుణం జరిగింది. ఓ యువకుడు ఇద్దరు యువకులు మరో యువతిని కర్రతో చికతబాదిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు యువకుల్ని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. 

 

16:25 - January 31, 2018

నల్గొండ : జిల్లాలో జరిగిన వరుస హత్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌1 అని సీఎం చెప్తుంటాడని.. కానీ హత్యల్లో కూడా నెంబర్‌1 అని చెప్పడం లేదని ఎద్దేవ చేశారు.  రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై కేంద్రం హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి లేఖ రాస్తానని వీహెచ్‌ అన్నారు.

 

మెట్రో బైక్ లను ప్రారంభంచిన ఎన్ వీఎస్ రెడ్డి

హైదరాబాద్ : మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో బైకులను మెట్రో ఎండీ ఎన్ వీఎస్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. బైక్ తీసుకునేందుకు డ్రైవింగ్ లైన్సెన్స్ లేదా ఐడీ ఫ్రూఫ్ ఉండాలని ఆయన అన్నారు. మెట్రో బైక్ కు కిలో మీటర్ కు రూ.4 వసూలు చేస్తారని ఆయన తెలిపారు.

16:17 - January 31, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయంతోనే టీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో చేరలేదనే కారణంతో నల్గొండ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని ఆరోపించారు. నిందితుల కాల్‌డేటా ఇస్తామని ఎస్పీ చెప్పినా... అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. 

 

మేడారం చేరుకున్న డీజీపీ

భూపాలపల్లి : సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తుండడంతో డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. ఆయన హుటాహుటిన హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. ఆయన పోలీస్ అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరకు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో భద్రత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. 

16:12 - January 31, 2018

సంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గండెమ్మగుడి దగ్గరలోని ఓ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షాపు ప్రధాన రహదారిపై ఉండడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

 

శ్రీశైలంలో బయటపడ్డ సొరంగం

కర్నూలు : జిల్లా శ్రీశైలంలో సొరంగం బయపడింది. సొరంగంలో పురాతన సామాగ్రి బయపడింది. రుద్రాక్షమఠంలో జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా సొరంగం బయటపడింది. బయటడిన వస్తువులను అధికారులు పురవస్తు శాఖ అప్పగిస్తామని తెలిపారు. 

పోలవరం వద్ద కార్మికుల ఆందోళన

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ట్రాన్స్ రాయ్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. నవయుగ చేతికి పోలవరం స్పీల్ వే కాంట్రాక్టు మారడంతో ట్రాన్స్ రాయ్ కంపెనీ 2 వేల మంది కార్మికులను తొలగించింది. గత 4 నెలలుగా బకాయిలు చెల్లించలేదని కార్మాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

15:58 - January 31, 2018

లీగల్ పరిభాషలో గిఫ్టీడ్ అంటే ఏమిటి ?  అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిఫ్ట్...అంటే బహుమతి ఇవ్వడం అని తెలిపారు. స్థిర, చర ఆస్తులు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఒక వ్యక్తి.. మరో వ్యక్తికి దానంగా ఇవ్వడాన్ని గిఫ్ట్ అంటారని తెలిపారు. గిఫ్ట్ ఇచ్చే వారుండాలి.. తీసుకునే వారుండాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఇచ్చేదాన్ని దానం అంటారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:41 - January 31, 2018

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని శివన్నగూడెంలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. డానో వ్యాక్సిన్ బయలాజికల్ కెమికల్ కంపెనీలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న డానో కంపెనీలో అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

శివన్నగూడెంలో కొనసాగుతున్న డ్రగ్స్ అధికారుల తనిఖీలు

మేడ్చల్ : జిల్లాలోని ఘట్ కేసర్ సమీపంలోని శివన్నగూడెంలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. డానో వ్యాక్సిన్ బయాలాజికల్ కెమికల్ కంపెనీలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. 

 

14:52 - January 31, 2018

వరంగల్ : మేడారం జాతరకు భక్త జనం పోటెత్తుతోంది. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు ఎగురుకోళ్ల తో సిద్ధమయ్యారు భక్తులు. సంప్రదాయంగా వస్తోన్న ఈ మొక్కుల చెల్లింపుతో సమీప గ్రామస్థులు ఉపాధిని పొందుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:50 - January 31, 2018

వరంగల్ : నాలుగురోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద ఎత్తున భక్తులు హాజరవనున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు భక్తులు. మేడారం ఏర్పాట్లపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:49 - January 31, 2018

హైదరాబాద్ : ప్రజాయుద్ధనౌక, ప్రజాగాయకుడు గద్దర్‌ 70 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్‌కు టీమాస్‌ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమాస్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి సెలబ్రేట్‌ చేశారు. ఇక మిగతా జీవితం కూడా ప్రజలకొరకే అంకితం చేస్తానంటున్న గద్దర్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:46 - January 31, 2018
14:45 - January 31, 2018

ఢిల్లీ : హస్తినతోపాటు ఉత్తరాదిలో కొద్ది సేపటి క్రితం భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ రాజధాని ఏరియాతోపాటు పంజాబ్‌, హర్యాణా, కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్గనిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భూ కంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్‌ స్కేలుపై 6.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారి చోటుచేసుకున్న ప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఖమ్మం మున్సిపల్ సమావేశం రసాభాస

ఖమ్మం : నగర మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గొట్టిపాడులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన

గుంటూరు : జిల్లా గొట్టిపాడులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె. రాములు పర్యటించారు. ఆయన దళితులను పరామర్శించారు. 

నకిలీ డైమండ్ కేసులో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ : నకిలీ డైమండ్ అమ్మి మోసం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

బీహెచ్ఈఎల్ సమీపంలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి : జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ సమీపంలోని వెదురు బొంగుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటాలర్పుతున్నారు. 

తెలంగాణ నూతన సీఎస్ గా ఎస్ కే జోషి

హైదరాబాద్ : తెలంగాణ నూతన సీఎస్ గా ఎస్ కే జోషిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా ఎస్పీ సింగ్ ఉన్నారు. 

ఉత్తరాదిలో భూ ప్రకంపనలు

ఢిల్లీ : ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్గానిస్థాన్, పాక్ బోర్డర్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 

13:36 - January 31, 2018

ఖమ్మం : మున్సిపల్ సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. అధికార..విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం..ఆందోళనతో సమావేశం దద్దరిల్లింది. సుదీర్ఘకాలం అనంతరం బుధవారం సమావేశం ఏర్పాటైంది. సమావేశంలో అధికార...విపక్ష సభ్యులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని కాంగ్రెస్ కార్పోరేటర్ లు లేవనెత్తారు. దీనితో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. వెంటనే ఎమ్మెల్సీ పొంగులేటి జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడియం ఎదుట ఇరుపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనితో సమావేశం రసాభాసగా మారిపోయింది. 

13:26 - January 31, 2018
13:14 - January 31, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా ఎస్ కే జోషి నియమితులయ్యారు. ఎస్ సింగ్ పదవీకాలం నేటితో ముగియనుంది. కానీ సింగ్ పదవీకాలం పొడిగిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఆయనకు మరో మూడు నెలలపాటు పదవీ కాలాన్ని పొడిగించాలని గత ఏడాది డిసెంబరు 24న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ తర్వాత దానిపై పెద్దగా ఒత్తిడి తీసుకు రాలేదని సమాచారం. నుంచి కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. పొడిగింపుపై కేంద్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీనితో జోషిని నియమించడానికి సీఎం కేసీఆర్ ఆసక్తి చూపినట్లు, ఇందుకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో బీపీ ఆచార్య, బినయ్‌ కుమార్‌, రంజీవ్‌ ఆచార్య, ఎస్‌కే జోషి, అజయ్‌ మిశ్రా, రాజేశ్వర్‌ తివారీ ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ జోషి వైపు మొగ్గు చూపారు. ఇతను 1984 బ్యాచ్ కు చెందిన అధికారి. ప్రస్తుతం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న జోషి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో నిర్మాణాత్మక పాత్రను పోషించారు. 2019 డిసెంబరు వరకూ ఆయన సర్వీసులో ఉంటారు. 

సీఎం అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం

గుంటూరు : సీఎం అధ్యక్షతన సీఆర్ డీఏ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మమావేశానికి మంత్రిన నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరైయ్యారు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీగా అవతరించాలని సీఎం అన్నారు. వినూత్న ఆలోచనలకు ఏపీ వేదికగా నిలవాలని ఆయన అకాంక్షించారు. 

13:06 - January 31, 2018

ఢిల్లీ : ఉత్తర, ఈశన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైంది. అప్ఘనిస్తాన్, పాక్ సరిహద్దులో భూకంప కేంద్రంగా గుర్తించారు. ఢిల్లీ, కాశ్మీర్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్లు..ఆఫీసుల నుండి జనాలు పరుగులు తీశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి : జిల్లా తాడ్వాయిలో ఆటో లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పాల్వంచకు చెందిన వారు ఆటోలో మేడారం వెళ్తుండగా ప్రమాదం జరగింది. 

12:55 - January 31, 2018
12:53 - January 31, 2018

హైదరాబాద్ : ఆధార్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు కృషి చేస్తోంది. అందులో భాగంగా సైఫాబాద్ బ్రాంచీలో 200వ ఆధార్ సెంటర్ ను బ్యాంకు అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రాబ్యాంకు శాఖల్లో 56 ఆధార్ సెంటర్లు పనిచేస్తున్నాయని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఏబీ శాఖల్లో 15 ఆధార్ సెంటర్లున్నాయన్నారు. ఖాతాదారులే కాకుండా ఇతరులకూ ఆంధ్రా బ్యాంకు సేవలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

హైదరాబాద్ : జీడిమెట్ల పీఎస్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 10 రోజుల కిత్రంత గాజులరామరం చితారమ్మ జాతరలో బాలుడు ఉదయ్ తేజ్ 

కిడ్నాప్ కు గురైయ్యాడు. జీడిమెట్ల పోలీసులు 11 బృందాలీతో గాలింపు చేపట్టాయి. కిడ్నాపర్లు భయంతో బాలుడిని సిద్దిపేటలో వదిలేశారు. 

12:49 - January 31, 2018
12:44 - January 31, 2018

కర్నూలు : మాటలతో నమ్మించాడు..ప్రేమించాడు..పెళ్లి చేసుకుంటానని అన్నాడు..చివరకు వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు..సమాచారం తెలుసుకున్న ఆ యువతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ప్రేమికుడిని పట్టుకుని చెప్పు దెబ్బలు కొట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దివ్యాభాయి..చంద్రశేఖర్ లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. కానీ చంద్రశేఖర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని దివ్య తెలుసుకుంది. చంద్రశేఖర్ కోసం వెతికింది. చివరకు అతను కనబడడంతో పట్టుకుని పోలీసు భవన్ కు తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు చూసే అమ్మాయిను వివాహం చేసుకుంటానని చంద్రశేఖర్ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన దివ్య చెప్పుతో బాదింది. శారీరకంగా..మానసికంగా వాడుకుని ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. పీఎస్ లో ఎదురుగానే యువతి..కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కౌన్సిలంగ్ చేయడంతో చంద్రశేఖర్ వివాహం చేసుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. 

మైనర్ బాలికకు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ

గుంటూరు : అమరావతిలో దారుణం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ షరీఫ్ మైనర్ బాలికకు అబార్షన్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షరీఫ్ కొంతకాలంగా అబార్షన్లు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వ వైద్యుల తనిఖీల్లో ఈ నిజం వెలుగు చూసింది. 

12:38 - January 31, 2018

హైదరాబాద్ : జీడిమెట్ల పీఎస్ పరిధిలో గత కొన్ని రోజులు కింద అదృశ్యమైన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాపర్లు బాలుడిని వదిలి వెళ్లిపోయారు. ఓ కుటుంబం కుమారుడు ఉదయ్ తేజతో చిత్తారమ్మ జాతరకు వచ్చింది. అనంతరం జాతరలో ఉదయ్ అదృశ్యమయ్యాడు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకి లభించలేదు. చివరకు పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. జీడిమెట్ల సీఐ ఆధ్వర్యంలో 11 బృందాలు గాలింపుల్లో పాల్గొన్నాయి. కిడ్నాప్ అయిన అనంతరం 23వ తేదీ నుండి టెన్ టివిలో వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనితో కిడ్నాపర్లు భయాందోళనలకు గురయినట్లు సమాచారం. సిద్ధిపేటలో బాలుడిని వదిలేశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. బాలుడిని గుర్తు పట్టకుండా ఉండేందుకు గుండు కొట్టించినట్లు తెలుస్తోంది. చివరకు బాలుడు క్షేమంగా ఉన్నాడనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యం

సంగారెడ్డి : జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. పటాన్ చెరు పోలీసులు గోవాలో విద్యార్థులను గుర్తించారు. 

తెలంగాణలో సహకార సంఘాల పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ సహకార సంఘాల పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో 456 సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం ఫిబ్రవరి 3తో ముగియనుంది. 

స్మార్ట్ సైకిళ్లు ప్రారంభించిన చంద్రబాబు

గుంటూరు : అమరావతి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్మార్ట్ సైకిళ్లను ప్రారంభించారు. ఉద్యోగులు, సందర్శకులకు స్మార్ట్ సౌకిళ్లు ఏర్పాటు చేశారు. 

12:23 - January 31, 2018

స్మార్ట్ సైకిళ్లు ప్రారంభించిన చంద్రబాబు

గుంటూరు : అమరావతి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్మార్ట్ సైకిళ్లను ప్రారంభించారు. ఉద్యోగులు, సందర్శకులకు స్మార్ట్ సౌకిళ్లు ఏర్పాటు చేశారు. 

12:15 - January 31, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఉన్నతాధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సుమారు రూ. 100 కోట్లకు పైగానే ఆస్తులున్నట్లు ఏసీబీ భావిస్తోంది.

1987లో వాణిజ్య పన్నుల శాఖలో సీటీఓగా లక్ష్మీ ప్రసాద్ పనిచేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వద్ద ఓఎస్డీగా పనిచేశారు. 2006-11 మధ్య కమిషనర్ ఆఫీసులో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కమిషనర్ కార్యాలయంలో విధుల్లో ఉన్న సమయంలోనే ఇతనిపై పలు ఆరోపణలు వచ్చాయి. జీఎస్టీ అనంతరం కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా లక్ష్మీ ప్రసాద్ కు పదోన్నతి లభించింది.

సీటీఓ నుండి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేసే సమయంలోనే భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు ఈ అధికారిపై నిఘా పెట్టినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం బుధవారం దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

విజయవాడ, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో -3, గుంటూరులో -3, శ్రీకాకుళంలో -3 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. శ్రీకాకుళంలోని సోదరుడి నివాసంపై, నర్సన్నపేటలోని బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగించారు. సాయంత్రం మీడియా సమావేశంలో అక్రమాస్తుల విలువ..తదితర వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ సాంకేతికలోపం తలెత్తడంతో ఉదయం 7.30 నుంచి ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. 

నేడు శ్రీవారి ఆలయం మూసివేత

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆయాన్ని చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. తిరిగి రాత్రి 9గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆయాన్ని తెరవనున్నారు.

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

హైదరాబాద్ : నేడు సంపూర్న చంద్రగ్రహణం ఏర్పాడనుంది. సాయంత్రం 5.18 నిమిషాల నుంచి రాత్రి 8.14 నిమిషాల వరకు గ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం సందర్భంగా చంద్రుడు 14 శాతం పెద్దదిగా కనిపించనున్నాడు. 

11:33 - January 31, 2018

కడప : ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవ కార్యక్రమాన్ని పెద్దలు చేపట్టారు. ఈ గంధోత్సవానికి ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ విచ్చేశారు. రెహమాన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

వివాహితతో ఎస్ఐ అక్రమసంబంధం...?

హైదరాబాద్ : తన భార్యతో ఎస్ఐ నర్సింహ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సతీష్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. జవహర్ నగర్ పీఎస్ లో నర్సింహులు ఎస్ ఐగా పనిచేస్తున్నాడని, ఎస్ఐ క్రెడిట్ కార్డుతో జ్యోత్స్నా దేవి షాపింగ్ చేసిందని భర్త సతీష్ అంటున్నారు. తనను ఎస్ఐ నరసింహులు జ్యోత్స్నాదేవికి విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని సతీష్ మల్కాజ్ గిరి డీసీపీకి ఫిర్యాదు చేశాడు. 

11:21 - January 31, 2018
11:12 - January 31, 2018

బాలీవుడ్ లో సంచలనం రేపిన జియాఖాన్ మృతికేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియా ఖాన్ ఆత్మహత్య కేసులో యువ హిరో సూరజ్ పంచోలీ నింధుతుడే అని ముంబై సెషన్స్ కోర్టు తేల్చి చెప్పింది. సూరజ్ పై ఆరోపణ నిజమైతే అతనకి గరిష్ట్రంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన స్టేట్ మెంట్ కీలకంగా మారింది. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్ బలవంతంగా తొలగించినట్లు తేలింది. ఓ రోజు సూరజ్ తన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి జియా ఖాన్ కు పిల్స్ ఇచ్చాను కానీ ఆమె అబార్షన్ సరిగా కాలేదు సగం చెత్త ఆమె ఉన్నట్లు చెప్పాడని డాక్టర్ విచారణలో వెల్లడించాడు. జియా తన సూసైడ్ నోట్ లో నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువుణూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు అని జియా రాసుకున్నారు.

11:10 - January 31, 2018

అజ్ఞాతవాసి సినిమా డిజస్టర్ నుంచి తెరుకున్న తెరుకున్న మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు తన తర్వాతి సినిమా పై దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. జై లవ కుశ తో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ ఆ ఊపు కొసాగించాలని చూస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది తెలడం లేదు. మొదట్లో అనుపమ పరమేశ్వరన్, అను ఇమ్మన్యుయల్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో పూజ హెగ్డే ను తిసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని యుద్దపూడి సులచన రాణి నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని వినబడుతుంది.

11:09 - January 31, 2018

దపంతుల ఆత్మహత్య

కృష్ణా : జిల్లా సూర్యారావుపేటలోని ఆసుపత్రిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు విజయవాడకు చెందిన  నాగసత్యరాణి, రామకృష్ణగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో వారు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.  

10:41 - January 31, 2018
10:40 - January 31, 2018

ఎల్లుండి మేడారం రానున్న ఉపరాష్ట్రపతి

భూపాలపల్లి : ఎల్లుండి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మేడారం రానున్నారు. ఉపరాష్ట్రపతితో పాటు సీఎం కేసీఆర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జైయల్ రానున్నారు. 

నేడు గద్దెపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు

భూపాలపల్లి : నేడు గద్దెపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రానున్నారు. మేడారం జాతరకు ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

భూపాలపల్లి : నేటి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ఈ మహా జాతర జరగనుంది. 

కమర్షియల్ టాక్స్ కమిషనర్ ఇళ్ల ఏసీబీ దాడులు

కృష్ణా : విజయవాడ కమర్షియల్ టాక్స్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

10:25 - January 31, 2018

విజయవాడ : కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేసింది. దాడులు చేస్తున్న సమయంలో ఆ అధికారి తాపీగా పేపర్ చదువుతూ ఉండడం గమనార్హం. ఈ దాడుల్లో రూ. 100 కోట్ల మేర అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం.

లక్ష్మీ ప్రసాద్ 1987లో వాణిజ్య పన్నుల శాఖలో సీటీఓగా పనిచేశారు. గతంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు వద్ద ఓఎస్డీగా పనిచేశాడు. 2006-11 మధ్య కమిషనర్ ఆఫీసులో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. కమిషనర్ కార్యాలయంలో విధుల్లో ఉన్న సమయంలోనే ఇతనిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులను సైతం గుప్పిట్లో పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

విజయవాడ, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. విశాఖ -3, గుంటూరు -3, శ్రీకాకుళం -3 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

భూపాలపల్లి : మేడారం జాతరకు భక్తులు పోటెత్తున్నారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో వస్త్రా నుంచి ములుగు వరకు ట్రాఫిక్ స్తంభించింది. 

10:18 - January 31, 2018

హైదరాబాద్ : ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. వీరిలోకి పోలీసులు కూడ వస్తుండడం వ్యవస్థ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసుపై డీసీపీకి ఫిర్యాదు అందింది.

ఓ కేసు నిమిత్తం జవహార్ పీఎస్ కు తన భార్యతో కలిసి వెళ్లడం జరిగిందని, ఎస్ఐ నరసింహ తన భార్యను ట్రాప్ చేశాడని ఓ వ్యక్తి మల్కాజ్ గిరి డీసీపీకి ఫిర్యాదు చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు విడాకులివ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను డీసీపికి ఇచ్చినట్లు సమాచారం. 

బస్సు దగ్ధం...

మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం తిమాయిపల్లి గ్రామం వద్ద పెట్రోల్ బంక్ వద్ద బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ తో బస్సు మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. 

కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు అకాడమీలో కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. 9 నెలల పాటు 741 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాసింగ్ ఔట్ పరేడ్ లో 448 మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి నాయినీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. 

09:36 - January 31, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో లంచగొండి అధికారులు పెరిగిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలు వస్తున్న అధికారుల ఇళ్లపై దాడులు చేస్తూ కూడబెట్టిన సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు. లక్షలు..కోట్లు అక్రమంగా సంపాదిస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా కమర్షియల్ టాక్స్ కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. విశాఖ -3, గుంటూరు -3, శ్రీకాకుళం -3 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. మొత్తంగా ఈ సోదాల్లో రూ. 50కోట్లు అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:26 - January 31, 2018
09:15 - January 31, 2018

వరంగల్ : మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సుమారు కొన్ని కిలోమేటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామన్న అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని తెలుస్తోంది.

బుధవారం సారలమ్మ..పగిడిద్దరాజు..గోవిందరాజు..గద్దెలపైకి తీసుకొని రానున్నారు. గురువారం సమ్మక్క - పగిడిద్దరాజు పెండ్లి వేడుక కార్యక్రమం జరుగనుంది. ఇందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 300 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి బయల్దేరారు. ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు. సారలమ్మతో కలిసి ముగ్గురు గద్దెల మీదకు చేరుకుంటారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మతోపాటు పగిడిద్దరాజు ఆయన తమ్ముడు గోవింద రాజులు గద్దెలమీదే ఉంటారు. జాతర చివరి రోజైన శనివారం సమ్మక్క వన ప్రవేశం చేస్తుంది. ఈ జాతరలోనూ పగిడిద్ద రాజు సమ్మక్కను పెళ్లాడతారు.

కమర్షియల్ టాక్స్ కమిషనర్ నివాసంపై ఏసీబీ దాడులు...

విజయవాడ : కమర్షియల్ టాక్స్ కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 

కల్తీ పాల తయారీ...

అనంతపురం : జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. బుక్కరాయసముద్రం(మం) దెంతులూరులో కల్తీ పాలు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

బిజెపి ఎంపీ కన్నుమూత...

ఢిల్లీ : మహారాష్ట్రలోని పాల్ఘడ్ బిజెపి ఎంపీ చింతామన్ (67) కన్నుమూశారు. నివాసంలో కుప్పకూలిన చింతామన్ ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

08:33 - January 31, 2018

కర్నూలు : ఎంతో మందికి వైద్యం అందించాల్సిన ఓ మెడిక విద్యార్థిని బలవన్మరానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. బృందావనం అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటూ విష్ణు ప్రియ మెడిసిన్ చదువుతోంది. బుధవారం ఉదయం ఈమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కానీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావడం లేదు. అనంతపురం జిల్లాకు చెందిన విష్ణు ప్రియకు కొన్ని సమస్యలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చనిపోయే ముందు ఒక లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఈ లెటర్ దొరికతే కాని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. 

మెడికో సూసైడ్...

కర్నూలు : మెడికో విద్యార్థి విష్ణుప్రియ ఆత్మహత్యకు పాల్పడింది. బృందావనం అపార్ట్ మెంట్ లో ఉరివేసుకుంది. మృతురాలు అనంతపురం జిల్లా వాసిగా గుర్తించారు. ఆత్మహత్య కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

08:26 - January 31, 2018

కుషాయిగూడలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : కుషాయిగూడ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్ గిరి డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు జరిపిన ఈ తనిఖీల్లో 32 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 5 సిలిండర్లు..9 బైక్ లు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 

07:35 - January 31, 2018

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. స్పిల్‌వే కాంట్రాక్టు పనులను నవయుగకు అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పిల్‌వే కాంక్రీట్, స్పిల్‌వే చానల్ పనులను ఇక నవయుగ సంస్థే చేపట్టనుంది. పాత ధరలకే ఈ పనులను చేయనుంది. ఢిల్లీలో ఏపీ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియో జరిగిన జరిగిన చర్చా వేదికలో మల్లాది విష్ణు (వైసీపీ), లక్ష్మీపతి రాజు (బిజెపి), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఫ్లైఓవర్ పనుల జాప్యంపై ఏపీ కాంగ్రెస్ ఆందోళన..

విజయవాడ : దుర్గగుడి వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్‌ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఏపీ సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన జరుగనుంది. ఫిబ్రవరి మూడో తేదీన నిరసన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 

ఫిబ్రవరి 1న బ్రహ్మకుమారి సమాజం ఆధ్యాత్మిక కేంద్రం...

విజయవాడ : తుళ్లూరు రెవెన్యూలో నెక్కల్లు గ్రామ సమీపంలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు కానుంది. ఫిబ్రవరి ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 

శరణార్థులపై అమెరికా నిర్ణయం...

అమెరికా : పది ముస్లిం దేశాలతో పాటు ఉత్తరకొరియా నుండి వస్తున్న శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కానీ శరణార్థులు మాత్రం కఠినమైన తనిఖీలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. 

06:47 - January 31, 2018

పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఒకపక్క తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్న చంద్రబాబు సర్కార్ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శలు చేస్తున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, వారిపట్ల ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో యూటీఎఫ్ ఏపీ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:45 - January 31, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించేందుకు మరో ఐక్య వేదిక సిద్ధమైంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హ నేతృత్వంలో ఏర్పడిన ఈ జాతీయ వేదికకు వివిధ రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. వేదిక ప్రారంభోత్సవంలో... రైతాంగ, నిరుద్యోగ సమస్యలు, ప్రజలపై మోపుతున్న భారాలతో పాటు పాలనా విధానాలను ప్రధానంగా చర్చించారు. ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ఆధ్వర్యంలో నేషనల్‌ ఫోరం ఏర్పాటైంది. బీజేపీ, కాంగ్రెస్‌, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ, ఆమ్‌ఆద్మీ నేతలు, రైతు సంఘాల నాయకులు, సామాజిక వేత్తలు ఈ ఫోరానికి మద్దతు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ఆర్థిక విధానాలను విమర్శించిన యశ్వంత్‌ సిన్హా ఈ ఫోరంకు నేతృత్వం వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశామని యశ్వంత్‌సిన్హ చెప్పారు. ఆర్థిక సర్వే ప్రజలను సంతృప్తి పరిచే విధంగా లేదని.. ప్రజలపై భారాలు మరింత పెరగబోతున్నాయని యశ్వంత్‌ సిన్హ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో రాజ్యాంగబద్ద సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని యశ్వంత్‌ సిన్హ అన్నారు. సుప్రీంకోర్టులో జడ్జీల సమస్య సమసిపోలేదని.. కీలక కేసుల విచారణలో సుప్రీం కోర్టు ఒత్తిళ్లకు లోనవుతుందన్నారు. రాజ్యంగాబద్ద సంస్థలైన సీబీఐ, ఈడీ, NIA, ఇన్‌కం టాక్స్‌ సంస్థలు ప్రమాదంలో ఉన్నాయన్నారు.

గతంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు 9 రోజులు జరిగేవని.. ప్రస్తుతం నాలుగు రోజుల్లో ముగిస్తున్నారని యశ్వంత్‌ సిన్హ అన్నారు. మూడు రోజులు సాధారణ బడ్జెట్‌పై, మూడు రోజులు రైల్వే బడ్జెట్‌పై, మూడు రోజులు రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించే వారని చెప్పారు. ఇప్పుడు నాలుగు రోజుల్లో ఏం చర్చిస్తారని యశ్వంత్‌ సిన్హ ప్రశ్నించారు.

నేషనల్‌ ఫోరం సమావేశానికి కాంగ్రెస్‌ తరపున ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు జాతీయ వేదిక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా రైతాంగ, నిరుద్యోగ సమస్యలు పెరిగాయని.. వీటన్నింటిపై జాతీయ వేదిక ద్వారా పోరాడుతామన్నారు. ప్రభుత్వ విధానలతో ప్రజలపై భారాలు పెరుగుతున్నాయన్న యశ్వంత్‌ సిన్హ ఢిల్లీలో ఉంటే రైతుల సమస్యలు తెలియవని.. క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుందని అన్నారు. పోరాడేందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు భరోసా, ఉపాధి కల్పన, గ్రామీణ-పట్టణ ప్రాంత సమస్యలు, మహిళా భద్రత, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, మైనార్టీల సమస్యలు, దేశభద్రతపై నేషనల్‌ ఫోరం పోరాడుతుందని చెప్పారు. 

06:42 - January 31, 2018

కరీంనగర్‌ : జ్యోతినగర్‌లో ప్రభుత్వ ఉద్యోగి మద్దెల ఓదేలుకు స్థానిక మహిళలు దేహశుద్ది చేశారు. జ్యోతినగర్‌కు చెందిన మద్దెల ఓదేలు ఎస్సారెస్పీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఓదేలు బాత్‌రూమ్‌లో ఓ మహిళ స్నానం చేస్తుండగా...దొంగచాటుగా చూస్తున్నాడంటూ స్థానికులు అతడిని పట్టుకొని కొట్టారు. చెప్పులతో కొడుతూ దేహశుద్ది చేశారు. 

06:40 - January 31, 2018

హైదరాబాద్ : రేపు రైల్వే బడ్జెట్‌ కూతపెట్టనుంది. ఈ బడ్జెట్‌లోనైనా ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరుతాయా? విజయవాడ రైల్వే డివిజన్‌ నుంచి వచ్చే ఆదాయాన్నైనా దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు జరుపుతారా? లేక గతంలోలాగా.. మొండిచెయ్యే చూపుతారా? రైల్వే బడ్జెట్‌పై ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా? దేశవ్యాప్తంగా 13 లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగసంస్థ ఇండియన్‌ రైల్వేస్‌.. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు సేవలందించడంలో ముందువరుసలో ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ రైల్వే బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టపోతున్నారు. మరి ఈ బడ్జెట్‌లోనైనా ఏపీకి న్యాయం జరుగుతుందా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. విజయవాడ రైల్వే డివిజన్‌కు మరిన్ని సదుపాయాలు, అభివృద్ధి, నూతన లైన్లు, డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు, రైల్‌నీర్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

విజయవాడ నుంచి నాగపట్నానికి రైలు నడపాలనే డిమాండ్ దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉంది. క్రైస్తవుల సౌకర్యార్థం ఇక్కడి నుంచి కొత్త రైలు నడపాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు, కొత్తరైళ్లు మంజూరుపై కేంద్రం కరుణించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ-అమరావతి-గుంటూరు మధ్య కొత్త రైలు మార్గం ఏర్పాటు, మచిలీపట్నం, విజయవాడ నుంచి ముంబాయి, అహ్మదాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కొత్త రైళ్లు ఉంటాయా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్ కు రోజూ 350కుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 2 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో విజయవాడ స్టేషన్ పై ఒత్తిడి, ప్రయాణికుల తాకిడి తగ్గించేందుకు గుణదల, కొండపల్లి, కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. దీన్ని బడ్జెట్ లో చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. మచిలీపట్నం-ఒంగోలు మధ్య కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని, మచిలీపట్నం నుంచి విశాఖకు మరో రెండు స్లీపర్ కోచ్‌లు నడపాలన్న డిమాండ్‌ ఉంది. ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించి, విజయవాడ మీదుగా పలు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కరుణ చూపాలని, ఆదాయపరంగా విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం రైల్వే డివిజన్లు పరిగణలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఇచ్చారు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నూతన రైళ్లు, రైల్వేలైన్లు, నిధుల విషయమై పలు కీలక ప్రతిపాదనలు, సూచనలను కేంద్రానికి చేశారు. మరి కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలపై కరుణ చూపిస్తారా లేక... గతంలో మాదిరిగానే ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతారా అనేది తేలిపోనుంది.

06:36 - January 31, 2018

హైదరాబాద్ : రుణాల కోసం రైతులు తనఖా పెట్టిన పాసుపుస్తకాలను బ్యాంకులు వాపస్‌ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతులకు బ్యాంకర్లు స్కెల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కింద అప్పులివ్వాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్ల భూరికార్డుల ప్రక్షాళన పూర్తైందన్న ఆయన... కోల్డ్‌ స్టోరేజీలకు నాబార్డు రుణాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు... నాబార్డు 2018-19 సంవత్సరానికి రూపొందించిన రుణ విధానపత్రాన్ని విడుదల చేశారు. ఇక నుంచి పంట రుణాలు తీసుకోవడానికి పాస్‌పుస్తకాలు అవసరం లేదన్నారు. ఇక బ్యాంకులు తమ దగ్గర ఉంచుకున్న పాసుపుస్తకాలను తిరిగి రైతులకు వాపస్‌ చేయాలని బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్‌ ఎంతో ముందు చూపుతో దాదాపు 8దశాబ్దాలుగా జరగని భూముల రికార్డులను సంపూర్ణంగా ప్రక్షాళన చేశారని చెప్పారు. రైతుల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో ఉన్నందున వెరిఫికేషన్‌ పేరిట రైతుల నుంచి పాసుపుస్తకాలు బ్యాంకులు తీసుకున్నాయన్నారు. వాటిని ఇప్పటికీ వెనక్కి ఇవ్వలేదన్నారు. వెంటనే వాటిని వాపస్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని నాబార్డు అధికారులను కోరారు. రైతులకు మే, జూన్‌ నెలల్లోనే పంటరుణాలు అందజేయాలని కోరారు.

ప్రభుత్వం ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నట్టు హరీశ్‌ తెలిపారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కోల్డ్‌ స్టోరేజీలకు నాబార్డు రుణం అందజేయాలని ఆయన కోరారు. మిషన్‌ కాకతీయ కార్యక్రమంతో అద్భుతమైన పంటదిగుబడి వస్తున్నట్టు గుర్తు చేశారు. పూడికతీత మట్టితో దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్‌ రంగంలో గోడౌన్ల నిర్మాణానికిగాను.. వెయ్యికోట్ల ఆర్థిక తోడ్పాటు అందించిన నాబార్డుకు ఈ సందర్భంగా హరీశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

06:33 - January 31, 2018

హైదరాబాద్ : మూడున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్ర ఆదాయం దేశ సగటు ఆదాయంకంటే ఎక్కువగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా... అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన ఆయన... దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ కసరత్తు దాదాపు పూర్తయ్యింది. బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. సకలజనుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులకు తగిన విధంగా కేటాయింపులు ఉంటాయని ఈటల అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును త్వరలోనే రైతులకు కానుకగా ఇస్తామన్నారు. 2018-19 బడ్జెట్‌ రూపకల్పనపై శాఖల వారీగా కసరత్తు పూర్తికావొచ్చిందన్నారు. ఆర్థికశాఖ ఆధ్వర్యంలో అన్నిశాఖలతో సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్షా 49వేల 644 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దీనికి మరింత పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలే లక్ష్యంగా వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఈటల చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ నిధులను ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటుకంటే కూడా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలైన గిరిజన యూనివర్సిటీ, హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు ఈ బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. ఇదే అంశాన్ని ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విన్నవించామన్నారు. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణదే అగ్రస్థామని చెప్పారు.

06:30 - January 31, 2018

విజయవాడ : జన్మభూమి కమిటీలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక నుంచి జన్మభూమి కమిటీల పేరుతో చెడ్డపేరు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కమిటీలోని సభ్యులు తప్పుచేస్తే వారిని వెంటనే మార్చి... కొత్తవారితో కమిటీలు వేయాలని సూచించారు. సెక్రటేరియట్‌లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న చంద్రబాబు... నాయకుల మధ్య విభేదాలు సమసిపోవాలని ఆల్టిమేటం జరిచేశారు.

ఏపీ సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జన్మభూమి కమిటీల్లో అవినీతి జరుగుతోందని కొంతకాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కమిటీ సభ్యులు తప్పుచేస్తే ఎట్టి పరిస్థితిలో సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. వెంటనే జన్మభూమి కమిటీలను మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వంపట్ల రాష్ట్ర ప్రజలు 60శాతం సంతృప్తిగా ఉన్నారని.. వచ్చే రోజుల్లో దీన్ని 80శాతం వరకు తీసుకెళ్లేలా కృషి చేయాలన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేసినట్టుగానే..... దళిత తేజం కార్యక్రమాన్ని విజయంతం చేయాలన్నారు. అందరూ దళితవాడలకు వెళ్లి వారితో మమేకం కావాలని సూచించారు. ఆర్థిక సర్వేలో ఏపీకి మంచి మార్కులు వచ్చాయని... పర్యాటకరంగంలో దేశంలోనే మూడోస్థానంలో మన రాష్ట్రం ఉండడం టీడీపీ ప్రభుత్వ ప్రగతికి నిదర్శమన్నారు.

ఫిబ్రవరి నెలనుంచి పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్టు చంద్రబాబు ఈ సందర్భంగా నాయకులకు తెలిపారు. అన్ని నియోజకవర్గ నేతలతో ప్రతిరోజూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఉపేక్షించబోనని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో మనదే గెలుపుకావాలన్న సంకల్పంతో అందరూ పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్లాలన్నారు. ఫిబ్రవరి రెండున మరోసారి టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ రోజు జరిగే సమన్వయ కమిటీలో బీజేపీతో పొత్తుపై చర్చించే అవకాశముంది.

ఫిబ్రవరి 2న టిడిపి సమన్వయ కమిటీ..

విజయవాడ : ఫిబ్రవరి రెండున టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ రోజు జరిగే సమన్వయ కమిటీలో బీజేపీతో పొత్తుపై చర్చించే అవకాశముంది.

మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతర..

మేడారం : నేటి నుండి సమ్మక్క - సారాలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి మూడో తేదీ వరకు ఈ జాతర కొనసాగనుంది. తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ నుండి భక్తులు తరలి రానున్నారు. 

కొనసాగుతున్న జగన్ పాదయాత్ర...

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం కలిచేడు నుండి పాదయాత్ర కొనసాగనుంది. 

పట్టాలు తప్పిన రైలు..

ఒడిశా : బలుగావ్ - చిల్కా స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పింది. నాలుగు కిలోమీటర్ల మేర పట్టాలు దెబ్బతిన్నాయి. దీనిఫలితంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

Don't Miss