Activities calendar

01 March 2018

టీఆర్ ఎస్ కు 2 సీట్లు వస్తాయన్న రేవంత్

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో అమరవీరుల కుటుంబాలకు అవకాశం కల్పించాలని మీడియాతో చిట్ చాట్ లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ సంఖ్యా బలం ప్రకారం వారికి 2 సీట్లు వస్తాయని..మూడోది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వచ్చేదే అని ఎద్దేవా చేశారు.

22:07 - March 1, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలంలో దారుణం జరిగింది. సీపీఎం పార్టీ ఆఫీస్ సెక్రటరీ కొండలరావును గత రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. గొమ్మూరు ఇసుక ర్యాంప్ వద్ద పూడ్చి పెట్టారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

22:05 - March 1, 2018

హైదరాబాద్ : రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌ కానున్నాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జేఏసీ నిర్ణయించింది. ఇంగ్లిష్‌ సినిమాకు లేని వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు తెలుగు సినిమాకు ఎందుకని జేఏసీ నేతలు ప్రశ్నించారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్‌ చేస్తున్నట్టు దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జేఏసీ నిర్ణయించింది. జేఏసీ ఛైర్మన్‌ సురేష్‌బాబు నేతృత్వంలో దక్షిణాది నిర్మాతల మండలి జేఏసీ సమావేశమైంది. ఇంగ్లీష్‌ సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు వసూలు చేయడంలేదని, ప్రాంతీయ చిత్రాలకు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వసూలు చేస్తున్నారని సురేష్‌ బాబు అన్నారు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇందుకోసం ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు కూడా మద్దతు ఇచ్చారని సురేష్‌బాబు తెలిపారు.

కేవలం వీపీఎఫ్‌ ధరలే కాకుండా.. చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయని సురేష్‌బాబు అన్నారు. కొన్నిసార్లు సినిమా థియేటర్లలో 20 నిమిషాల పాటు ప్రకటనలు వేస్తున్నారని.. దీనివల్ల ప్రేక్షకుడు తీవ్ర అసహనానికి గురవుతున్నాడన్నారు. ఇక జనాలకు ఇష్టమైన సినిమా ట్రైలర్‌లను వేయడానికి ఎక్కువ వసూలు చేస్తున్నారన్నారు. ఇలా పలు అంశాలపై చర్చిస్తున్నామని చెప్పారు. 

సినిమాలను ఆపేయాలని తమకు ఎలాంటి దురుద్దేశం లేదన్న సురేష్‌బాబు... సినిమాను ఆపకుండా ఉండాలనేదే తమ తపన అన్నారు. తాము చేసేది సమ్మె కాదన్న ఆయన.. మంచి పరిస్థితుల్లో పనిచేయాలని అనుకుంటున్నామన్నారు. బంద్‌ చేయటం వల్ల కోల్పోయే నష్టం కన్నా, భవిష్యత్‌లో వచ్చే లాభమే ఎక్కువ అని సురేష్‌బాబు అన్నారు. ఇంగ్లిష్‌ సినిమాకు లేని వీపీఎఫ్‌ తెలుగు సినిమాకు ఎందుకని మాత్రమే ప్రశ్నిస్తున్నామని సురేష్‌ బాబు అన్నారు. చిన్న సినిమాకు కూడా  పెద్ద లాభం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

22:01 - March 1, 2018

నిజామాబాద్ : కేసీఆర్‌ కుటుంబ పాలనను మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. మీ తండ్రి గతాన్ని దృష్టిలో పెట్టుకునిమాట్లాడాలని... నిజామాబాద్‌లో ఆయన కేటీఆర్‌ ను హెచ్చరించారు. ఆకాశంమీద ఉమ్మేయాలని చూస్తే... అది మీమీదే పడుతుందన్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ ఏనుగులాంటిదని... కుక్కలెన్ని మొరిగినా దానికేమీ కాదన్నారు. 'కేటీఆర్..నీ పేరులోనే సగం ఆంధ్ర ఉంది' అని ఎద్దేవా చేశారు. 

21:59 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతలకు సూచించారు. మహానాడులోపు మూడు బహిరంగసభలు నిర్వహించాలన్న నేతల సూచనకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్న ఆయన... ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించాలని చెప్పారు. మరోవైపు కార్యకర్తలు తనకు  ఫిర్యాదు చేసే పరిస్థితులు తెచ్చుకోరాదని ఘాటుగా నేతలను హెచ్చరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం, టీటీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో దాదాపు గంటన్నర పాటు భేటీ అయిన ఆయన.. తాజా రాజకీయ పరిణామాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు విస్తృతంగా కొనసాగించాలని బాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర నాయకత్వం స్వయంగా ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తలో ధైర్యం వస్తుందని... త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభకు తాను హాజరవుతానని బాబు చెప్పారు. మహానాడులోపు మూడు బహిరంగసభలు నిర్వహించాలని నేతల సూచనకు బాబు అంగీకారం తెలిపారు. 

పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్న చంద్రబాబు... ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే నేతలంతా దృష్టి సారించాలని చెప్పారు. బీజేపీ పొత్తు వద్దనుకుంటే... స్వతంత్రంగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తుపై ఎలక్షన్ సమయంలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 

రెండు రాష్ట్రాల్లో పార్టీకి అండగా ఉంటానన్న చంద్రబాబు... కొందరు నాయకులు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. మే నెలాఖరు నాటికి నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో టీడీపీ నేతలు ఎల్.రమణ, సండ్ర వెంకట వీరయ్య, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

21:56 - March 1, 2018

రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్లలో యుద్ధ విమాన విడిభాగాల తయారీ కేంద్రం ప్రారంభమైంది. టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ కంపెనీలో ఉత్పత్తి  మొదలైంది.  రక్షణ ఉత్పత్తుల ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేశారని.. డెడ్‌లైన్‌ కంటే ముందే ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నారని కేందమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రశంసించారు. రక్షణరంగ ఉత్పత్తులకు తెలంగాణ పర్యావరణహిత కేంద్రంగా ఉందని.. రాష్ట్రంలో డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు.

రక్షణ ఉత్పత్తులకు తెలంగాణ కేంద్ర బిందువు అవుతోంది. అత్యాధునిక ఫైటర్ హెలికాఫ్టర్ అపాచీ ప్రధాన భాగాలు ఇప్పుడు తెలంగాణలో తయారుకానున్నాయి.  రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ కేంద్రంలో ఇవి రూపుదిద్దుకోనున్నాయి.  ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌, టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్ రతన్‌టాటా, తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఉత్పత్తిని పరిశీలించారు.

ఆదిభట్లలోని  టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ కంపెనీలో జీరో డిఫెక్ట్‌తో హెలికాప్టర్ల తయారీ జరుగుతోందని అమెరికా సంస్థ వెల్లడించినట్టు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. అపాచీ హెలికాప్టర్లు మల్టీ కంబాట్‌రోల్స్‌ ప్లే చేస్తాయన్నారు.  రోబోట్లు తయారు చేస్తే లోపాలు ఉండవని.. అదే తరహాలో ఎలాంటి లోపాలు లేని అపాచీ హెలికాప్టర్లను ఆదిభట్లలో నిర్మిస్తున్నారని ఆమె తెలిపారు.  అత్యంత నైపుణ్యం కలిగిన మానవశక్తితోనూ లోపాలు లేని హెలికాప్టర్లు తయారుచేయవచ్చని అదిభట్ల యూనిట్‌ తెలియజేస్తోందన్నారు.  ఆదిభట్ల రక్షణ ఉత్పత్తుల ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేశారని... డెడ్‌లైన్‌ కంటే ముందే ఉత్పత్తులను డెలివరి చేయడం అభినందనీయమన్నారు.

రక్షణ రంగ ఉత్పత్తులకు తెలంగాణ పర్యావరణహిత  కేంద్రంగా ఉందని  తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బోయింగ్, ఎయిర్‌బస్, యూటీసీ సీఎఫ్ ఎమ్ లాంటి  ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు.  హైదరాబాద్‌లో మూడు ఏరోస్పేస్ పార్కులున్నాయని చెప్పారు.  హైదరాబాద్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ బాగుందని వెల్లడించిన మంత్రి.... తెలంగాణలో డిఫెన్స్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.

విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్‌ 18న నాటి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్, రతన్‌టాటా, కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.  టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, బోయింగ్‌ సంస్థలు కలిసి టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేశాయి. దీని ఆధ్వర్యంలో వైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో దాదాపు 200 కోట్లతో ఈ పరిశ్రమను నిర్మించాయి. బోయింగ్‌ అపాచీ ఏహెచ్‌ 64 ఫైటర్ హెలికాఫ్టర్ల భాగాలతో పాటు మెయిన్ బాడీ ఇందులో తయారు చేయనున్నారు. వీటికి అమెరికా సహా 15 దేశాల్లో డిమాండ్‌ ఉంది.

21:53 - March 1, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధన ఉద్యమం ఉధృతమైంది. గుంటూరులో ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. హోదా సాధనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని సదస్సు తీర్మానించింది. హోదా సాధించేవరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 5 నుంచి ఢిల్లీ వేదికగా ఆందోళన ఉధృతం చేయనున్నట్టు సదస్సుల్లో పాల్గొన్న నేతలు ప్రకటించారు.

గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యేక హోదా కోరుతూ సదస్సు జరిగింది. ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వైసీపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌పార్టీలతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీకి హోదా సాధించడంపై నేతలు చర్చించారు.

విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. విభజన హామీలు సాధించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నాలుగేళ్లపాటు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఏదో పోరాడుతున్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ కలిసి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ నిలదీయాలన్నారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో  టీడీపీ కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీకి న్యాయం చేయకపోతే మోదీ హఠావో..ఏపీ బచావో నినాదం ఇస్తామన్నారు. టీడీపీ రాజకీయలబ్ది కోసం పాటుపడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా టీడీపీ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయిందని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఏపీకి హోదా సాధించేందుకు అవసరమైతే ఆమరణ దీక్షలు చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలకు పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్‌ అని హీరో శివాజి మండిపడ్డారు.  బాధ్యతాయుతమైన పనిలో ఉండి రాజకీయాలు చేస్తున్నాని ఆరోపించారు. మొత్తానికి కలిసి కట్టుగా ఉద్యమించి హోదా సాధించాలని సదస్సు నిర్ణయించింది. ఇందుకు ఢిల్లీని వేదికగా చేసుకుని పోరాడాలని పిలుపునిచ్చింది.

 

21:47 - March 1, 2018

హైదరాబాద్ : ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చడానికి జనసేన నియమించిన జేఎఫ్‌సీ రిపోర్ట్‌ను ఇచ్చింది. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై సుదీర్ఘ నివేదిక ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని జేఎఫ్‌సీ నివేదిక తేల్చింది. రాష్ట్రం అడిగిన నిధులను కేంద్రం ఇవ్వలేదని జేఎఫ్‌సీ పేర్కొంది. నివేదికలోని అంశాలపై పవన్‌, జేపీ, ఉండవల్లి చర్చించారు. జేఎఫ్‌సీ ఇచ్చిన నివేదికపై రేపు కూడా చర్చించనున్నారు. జనసేన రేపు సాయంత్రానికి నివేదికను విడుదల చేయనుంది.

21:43 - March 1, 2018

రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. సౌతిండియాలోని ఐదు రాష్ట్రాల్లో సినిమాలు  బంద్ కాబోతున్నాయి. ఇది ప్రేక్షకులకు నిజంగానే చేదువార్త. ప్రాబ్లమ్ ఏంటంటే డిజిటల్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించేందుకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ జేఏసీ రేపటి నుంచి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చింది. అన్ని థియేటర్లలో సినిమాలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ? వాళ్ల ప్రధానమైన డిమాండ్స్ ఏంటీ ? వీటికి సంబంధించిన అన్ని విషయాలపై టెన్ టివి చర్చను చేపట్టింటి. ఈ చర్చలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రామకృష్ణగౌడ్, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ సాయివెంకట్ పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

పవన్ కళ్యాణ్ కు జేఎఫ్ సీ నివేదిక అందజేత

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జేఎఫ్ సీ నివేదిక అందజేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముంచాయని నివేదిక తేల్చింది.  

20:20 - March 1, 2018

తెలంగాణ, ఆంధ్రల హోలీ పండుగ ఎట్లైంది..?, 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న ఉత్తమ్... 106 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్, పాలమూరు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు అందని పరిహారం, నాలుగు నెలల నుంచి రాని పించన్లు...వృద్ధులు, వికలాంగుల ఆందోళనలు, రైతుల గోసలు, సెల్ ఫోన్ ఎవరు గెలిచారు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లు వీడియోలో చూద్దాం.. 

20:13 - March 1, 2018

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు దీక్షలు చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎంఎ.గఫూర్, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు బాలకాశి, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక చైర్మన్ బెల్లయ్య, నేతలు నాగరాజు, మధుబాబు పాల్గొని, మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఉదాసీనత వీడి కార్మికులకు న్యాయం చేయాలన్నారు.  కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

19:53 - March 1, 2018

కడప : కడప...అమరావతి మధ్య విమాన అనుసంధానత ఏర్పడింది. కడప నుంచి విజయవాడకు ట్రూజెట్‌ విమాన సర్వీలు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ శివప్రసాద్‌ లాంచనంగా ఈ సర్వీసును ప్రారంభించారు. కడప నుంచి హైదరాబాద్‌, బెంగళూరుకు విమాన సర్వీసులు నడుపుతున్న ట్రూజెట్‌ ఇప్పుడు విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించడం ద్వారా ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే విమానాల  సర్వీసుల సంఖ్య మూడుకు పెరిగింది. 
 

19:45 - March 1, 2018

కర్నూలు : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్ధం కోసం ప్రత్యేక హోదాని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నాయని కర్నూలు ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యే హోదా ద్వారానే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని ముక్తకంఠంతో చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే  ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న కర్నూలు ప్రజలతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ప్రజల మనోగతానికి సంబంధించిన   మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

19:41 - March 1, 2018

తిరుపతి : ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు.  విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు.
హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ప్రత్యేక హోదా అంటూ నాలుగేళ్లు ఊరించి ఇప్పుడు చేతులెత్తేశారు. కనీసం ప్యాకేజీ కూడా వచ్చే పరిస్థితి కనబడటంలేదు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ప్రత్యేక హోదా విషయమై విద్యార్థుల అభిప్రాయాలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

19:38 - March 1, 2018

గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఐదు రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మంది పేదలు..  6 వేల 380 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసినట్లు చెప్పారు. చిరు వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయారన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 3 వేల 900 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. అగ్రిగోల్డ్‌ మోసం వల్ల చనిపోయిన 96 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం అందించారు.  

అగ్రిగోల్డు బాధితులకు చెక్కులు అందజేసిన సీఎం చంద్రబాబు

అమరావతి : అగ్రిగోల్డు మోసం వల్ల చనిపోయిన కుటుంబాలకు సీఎం చంద్రబాబు చెక్కులు అందజేశారు. 96 మంది కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున సాయం చేశారు. 

ఏపీలో గ్రేహౌండ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

ఢిల్లీ : ఏపీలో గ్రేహౌండ్స్ ఏర్పాటుకు కేంద్రం హోంశాఖ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. రూ.2,019 కోట్లతో గ్రేహౌండ్స్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విశాఖ సమీపంలో గ్రేహౌండ్స్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

 

కార్తి చిదంబరానికి సిఐబి కస్టడీ

ఢిల్లీ : కార్తి చిదంబరానికి సిఐబి కస్టడీ విధించారు. మార్చి 5వరకు సీబిఐ కస్టడీకి పటియాల కోర్టు అనుతించింది. మార్చి 6న పటియాల కోర్టు హౌజ్ లో సీబీఐ కార్తి చిదంబరాన్ని హాజరుపర్చనున్నారు. 

18:46 - March 1, 2018

ఒంగోలు : ప్రత్యేకహోదా సాధనకోసం వైసీపీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి  పోరాడుతోంది వైసీపీనే  అన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 

 

18:42 - March 1, 2018

నెల్లూరు : వైసీపీ తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడిలో భాగంగా నెల్లూరులో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏపీ సీఎం చంద్రబాబుపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ర్టాన్ని దరిద్రమైన వ్యక్తి పాలిస్తున్నందుకు విచారకరంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు ఉద్యమించిన ప్రతిసారి జైల్లో పెడతామంటూ చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు.  

 

18:11 - March 1, 2018

అగ్రిగోల్డు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : అగ్రిగోల్డు బాధితులకు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. సీఎం చేతుల మీదుగా బాధితులు చెక్కులు అందుకుంటున్నారు. 

 

17:55 - March 1, 2018

నిజామాబాద్ : భోదన్ లో హోలీ పండుగలో విషాదం నెలకొంది. భోదన్ బీసీ బాలుర వసతి గృహంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థి యోగేష్ హోలీ ఆడుతూ కిందపడడంతో తీవ్రగాయాల పాలయ్యారు. విద్యార్థి యోగేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతోనే ఈ ప్రమదం జరిగింది. ఈ ఘటనకు వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని పలువురు అంటున్నారు.  

 

17:44 - March 1, 2018

నిజామాబాద్ : డిచ్ పల్లి అనాథ శరణాలయంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. సంబురాల్లో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ పాల్గొన్నారు. అనాథ ఆశ్రమ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. బాలలకు విద్య బోధనతో అన్ని వసతులను కల్పిస్తామని చెప్పారు. బాలలు రంగులు పూసుకుని, స్వీట్లు పంచుకుని సంతోషంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

 

17:35 - March 1, 2018
17:28 - March 1, 2018

ప్రకాశం : ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు.  విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల జన్మహక్కు 
ప్రత్యేక హోదా ఆంధ్రుల జన్మహక్కు అంటూ ప్రజా సంఘాలు నినదిస్తున్నారు. ఇదిగో ప్రత్యేక హోదా కాదు కాదు ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు సంవత్సరాలుగా ఊరిస్తున్నాయి. కాని ఇప్పటికీ ఏపీకి ఒరిగిందేమిలేదంటున్నారు ఏపీ ప్రజలు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల అభిప్రాయాలను ప్రకాశం జిల్లా నుండి టెన్ టివి అందిస్తోంది. 
చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడు పోయారు : వైసీపీ
ప్రజల ఓట్ల కోసం ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడు పోయి రాష్ట్రాన్ని రియలెస్టేట్‌ వ్యాపార సంస్థగా మార్చేసిన దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయకత్వంలో జరిగిందన్నారు ప్రకాశం జిల్లా వైసీపీ నేత. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ప్రత్యేక హోదా కోసం టీడీపీపై నిందలు మోపుతుందని టీడీపీ నేత బాలాజీ ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నింటికీ ఎన్నికల ఎజెండాగా ప్రత్యేక హోదా అంశం ఉందని సీపీఐ నేతలంటున్నారు. అసలు ప్రత్యేక హోదా విషయమై ప్రకాశం జిల్లా నేతలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

17:27 - March 1, 2018

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర పత్తి జిన్నింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పత్తి బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో లక్షల్లో ఆస్తినష్టం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని యాజమాని చెబుతున్నారు. 

ప్రత్యేక హోదాపై తేల్చాలి : రామకృష్ణ

గుంటూరు : పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై తేల్చుకోవాలని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముంత, మట్టి, చెంబు, నీళ్లు తప్ప మోడీ ఏపీకి ఏమీ ఇవ్వలేదని ఆయన అన్నారు. 

17:14 - March 1, 2018

సిద్దిపేట : పట్టణ వాసులు చిన్న పెద్ద అందరు కలిసి రంగులు రుద్దుకుంటూ హోలీ వేడుకలో పాల్గొన్నారు.  సిద్దిపేట మున్సిపాల్‌ చైర్మన్‌ రాజనర్సు, డీసీపీ నర్సంహ్మా రెడ్డి, సీఐ సైదులు హోలీ వేడుకలో పాల్గొని పట్టణ, జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. 

 

17:11 - March 1, 2018

హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి బ్యాండ్‌ వాయించి.. తీన్మార్‌ పాటకు స్టెప్పులేశారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఆయన... స్థానికులతో కలిసి రంగులు పూసుకున్నారు. అనంతరం డ్యాన్స్‌ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

 

17:08 - March 1, 2018

విజయవాడ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు.  13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు... సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, నెలకు 5వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌  చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించవద్దని కోరుతున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎంఎ.గఫూర్ మాట్లాడుతూ చంద్రబాబుకు మతిస్థితిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు మనిషేనా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అన్నం తింటున్నాడా... అని అన్నారు. ఇది ప్రభుత్వమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ కు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మంత్రులతో సీఎం భేటీ

గుంటూరు : మంత్రివర్గ సహచరులు, ఉన్నధికారులతో మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. రానున్న బడ్జెట్ సెషన్ లో గవర్నర్ ప్రసంగంలో ఏ ఏ అంశాలు ఉండాలన్న అంశంపై వారు చర్చించారు.

17:00 - March 1, 2018

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌, విపక్ష నేత జానారెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. కాంగ్రెస్ బస్సు యాత్ర జానాబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై జానారెడ్డి మండిపడ్డారు. బస్సు యాత్ర చేసేవాళ్లలో ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసులు ఉంటే చట్టప్రకారం తేల్చుకోవాలన్నారు. అధికార దురంహంకారంతోనే కేటీఆర్‌ అలా మాట్లాడుతున్నారని జానారెడ్డి మండిపడ్డారు. కేసులు ఎవరిపై లేవని జానారెడ్డి.. కేటీఆర్‌ను ప్రశ్నించారు.  

16:58 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి టాటా ట్రస్టు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్యాన్సర్‌ నియంత్రణపై టాటా ట్రస్టుతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరువర్గాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐ కేర్ కార్యక్రమం కింద రాష్ట్రంలో వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కింద 13 జిల్లాల్లో పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా పాల్గొన్నారు.

 

16:54 - March 1, 2018

అనంతపురం : కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈనెల 5 నుంచి పార్లమెంట్‌ వేదికగా తమ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తారని చెప్పారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే అవసరమైతే రాజీనామాల తమ ఎంపీలు సిద్ధమని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట వైసీపీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.  టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ విమర్శించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

 

రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలపిన సీఎం

గుంటూరు : రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారికి సీఎం చంద్రబాబు హోలీ, వసంతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితం వర్ణమయం కావాలని సీఎం ఆకాంక్షించారు. దుష్టశక్తులకు పరాభవం తప్పదన్న సందేశమే హోలీ అని ఆయన అన్నారు. 

16:47 - March 1, 2018

బీజింగ్‌ : 2018 పెయోంగ్‌ చాంగ్‌ ఒలింపిక్స్ పోటీలకు తెరపడటంతో 2022 వింటర్‌ ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 23వ వింటర్‌ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేశారు. 

16:43 - March 1, 2018

సిరియా : అంతర్‌ యుద్ధంతో సిరియా భగ్గు మంటోంది. ప్రభుత్వ బలగాలు మిలిటెంట్లపై జరుపుతున్న దాడుల వల్ల అమాయక ప్రజలే సమిధలవుతున్నారు. మృతుల్లో ముక్కుపచ్చలారని పిల్లలు, మహిళలే అధిక సంఖ్యలో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సిరియాలో జరుగుతున్న నరమేధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గౌటాలో ఏరులై పారుతోన్న రక్తం 
అంతర్‌ యుద్ధంతో సిరియా సతమతమవుతోంది. ప్రభుత్వ బలగాలు, ప్రీ సిరియన్‌ ఆర్మీకి మధ్య 2011లో మొదలైన పోరు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సిరియా రాజధాని శివారు నగరమైన గౌటాలో రక్తం ఏరులై పారుతోంది. గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గౌటాలో ప్రస్తుతం పరిస్థితి విషమించింది. రష్యా, సిరియా బలగాల దాడులతో కకావికలమైన మిలిటెంట్లు గౌటా నగరంలోకి చొచ్చుకు రావడమే ఇందుకు కారణం. మిలిటెంట్లను ఏరివేసేందుకు ప్రభుత్వ బలగాలు గత వారం రోజులుగా గౌటా నగరంపై వైమానిక దాడులు జరుపుతున్నాయి. 
541 మందికి పైగా మృతి
వైమానిక దాడులు జనావాసాలపై జరుగుతుండడంతో జననష్టం అధికంగా ఉంది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 541 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిగా జనం గాయపడ్డారు. మృతుల్లో పసిపిల్లలు, మహిళలే  అధికంగా ఉన్నారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కనీస వైద్య సౌకర్యాలు లభించడం లేదు. కరెంట్‌, మెడికేషన్, ఆక్సీజన్, అనస్థీషియా, మందులు ఏవీ అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. సిరియా లో ప్రస్తుత పరిస్థితి మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని ఓ డాక్టర్‌ అన్నారంటేనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దాడులపై అంతర్జాతీయ సమాజం ఆందోళన
గౌటా నగరంలో జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం ఆందోళనకు గురవుతోంది. నెల రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని భద్రతామండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానికి రష్యా అనుకూలంగా ఓటు వేసినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. మానవతా దృక్పథంతో రోజుకు 5 గంటల పాటు దాడుల్ని ఆపుతామని...ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. అయినా దాడులు కొనసాగుతుండడంతో సుమారు 4 లక్షల మంది పౌరులు యుద్ధక్షేత్రంలో చిక్కుకుపోయారు.
సిరియా అధ్యక్షుడికి రష్యా మద్దతు 
సిరియా అధ్యక్షుడు అల్‌ అసద్‌ గద్దె దిగాలంటూ 2011లో తిరుగుబాటు మొదలైంది. అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 12,763 పౌరులు మృతి చెందారు. సిరియా అధ్యక్షుడికి రష్యా మద్దతుగా నిలవగా... సిరియా తిరుగుబాటుదారులకు అమెరికా సహాయం అందిస్తోంది.

కర్నూలు జిల్లాలో అగ్నిప్రమాదం

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర జిన్నింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పత్తి బేళ్లు బూడిదయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని యజమాని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

 

రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్

హైదరాబాద్ : రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళలో థియేటర్ల బంద్ పాటించనున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ దక్షణాది నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 

16:28 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశంను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని టీటీడీపీ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ తెగతెంపులు చేసుకుంటే.. తాము స్వతంత్రంగానే ఉంటామని ఆపార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇవాళ రెండోరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ పొత్తు వద్దనుకుంటే... స్వతంత్రంగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తుపై ఎలక్షన్ సమయంలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు రావుల తెలిపారు.

 

16:17 - March 1, 2018

డాక్టర్లు, పోషకాహర నిపుణులు మనను ఎప్పుడు తాజాగా ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకోమ్మని చెబుతారు. మనం కూడా తాజ కూరగాయలని కొనుకుంటాం కానీ వాటిపై రసాయనాలు, దుమ్ము ఉంటుంది. వాటి నుంచి మనం కాస్తనై బయటపడలంటే మనం కొనుకున్న కూరగాయాలు, పండ్లు తినేముందు ఉప్పు నీటితో కడగాలి. ఒక బౌల్ లో నీరు తీసుకుని అందులో ఉప్పు కలిపి దాంట్లో కూరగాయలు ముంచి మనం వాడుకొవచ్చు. 

16:15 - March 1, 2018

నెల్లూరు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరులో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు కోరుతున్నారు. వారి దీక్షలకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మీ సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న ధనలక్ష్మీతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కాంట్రాక్ట్‌ కార్మికుల డిమాండ్స్‌ న్యాయమైనవన్నారు. వారి డిమాండ్స్‌ను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

16:06 - March 1, 2018

విశాఖ : కేంద్రంతో లాలూచీపడి సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్యాకేజీతో ముడుపులు తీసుకోవచ్చనే చంద్రబాబు అందుకు అంగీకరించారని విశాఖ ధర్నాలో ఆరోపించారు. ఈమేరకు విజయసాయిరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. హోదా కోసం ఏప్రిల్‌ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని చెప్పారు. 

15:37 - March 1, 2018

విశాఖ : ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ డ్రామాలు 
టీడీపీ, బీజేపీపై విశాఖ నగర వాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయని విశాఖ వాసులు మండిపడుతున్నారు. మొన్నటి వరకు ప్రత్యేకప్యాకేజీ చాలన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదం ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి ప్రత్యేకహోదా కోసం పోరాడకుండా టీడీపీ ఎందుకు మౌనంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మళ్లీ చంద్రబాబు ప్రత్యేకహోదా నినాదం ఎత్తుకున్నారని మండిపడుతున్న విశాఖ ప్రజలతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ప్రజలు అన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే ప్రత్యేకహోదా సాధించగలమని ప్రజలు అంటున్నారు.
ప్రత్యేకహోదా ఇచ్చితీరాల్సిందే
ఏపీకి ప్రత్యేకహోదా కేంద్రం ఇచ్చితీరాల్సిందేనని విశాఖలోని విపక్షపార్టీల నేతలు కోరుతున్నారు. ప్రత్యేకహోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి ఆంధ్రరాష్ట్ర ప్రయోజాలను దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు అధికార టీడీపీ మాత్రం తాము మొదటి నుంచి ప్రత్యేకహోదా కోరుతున్నామని చెబుతోంది.

 

15:30 - March 1, 2018

ఖమ్మం : హోలీ సంబురాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా  ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.   హోలీ పండుగ రోజు ఇలా ఒకరపై మరొకరు రంగులు చల్లుకోవడం తమ చిన్న నాటి స్నేహితులతో ఇలా ఆడటం ఎంతో సంతోషం కలుగుతుందని యువతి, యువకులు చెప్పారు.  

 

15:28 - March 1, 2018

హైదరాబాద్ : అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నేతల మధ్య సయోధ్య లేకపోవడం అటు ఉంచితే.. ఎమ్మెల్యేలు, మంత్రులపైనే గులాబి నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రుల వైఖరికి నిరసనగా పార్టీని వీడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
నేతల మధ్య అంతర్గత పోరు
అధికార టిఆర్ ఎస్ పార్టీ రాజకీయ పునరేకీకరణ పేరుతో వలస నేతలకు ప్రాధాన్యతనిస్తోందని సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 31జిల్లాల్లో వలసనేతలతో పాత నేతలకు ఉప్పూనిప్పుల పంచాయతీ నడుస్తోంది. పార్టీ  ఆవిర్భావం నుంచి జెండా మోసిన తమ పరిస్థితి కూరలోకరివేపాకు మాదిరిగా మారిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవుల నియామకంలో కూడా తమకు న్యాయం జరుగడం లేదన్న ఆందోళన ఉద్యమ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఈ   పరిస్థితుల్లో ఇటీవల  చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీలో మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
ఎమ్మెల్యే గంగులపై పార్టీనేతల గుర్రు 
పార్టీకి పట్టున్న  కరీంనగర్‌లో ఇద్దరు కార్పోరేటర్లు  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు.  ఎమ్మెల్యే, మేయర్ వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో ఇద్దరు కార్పోరేటర్లు  పార్టీని వీడారని ప్రచారం జరుగుతోంది.  ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగానే తాము  పార్టీని వీడుతున్నామని వారుకూడా ప్రకటించడం పార్టీలో పరిస్థితిని బయటపట్టినట్టేంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా  జడ్పీటీసికి   మంత్రి  తుమ్మల  నాగేశ్వర్ రావ్ వర్గాలమధ్య చిటపటలు బయటపడుతున్నాయి.  వివాదాలకు దూరంగా ఉండే తమ్ములపై కూడా  ఆరోపణలు  రావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
బయటపడుతున్న అంతర్గత పంచాయతీలు 
ఓవైపు మరోఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు తరముకొస్తున్న సందర్భం.. ఇటు ఇంతకాలం లోలోపలే రగులుతున్న నేతల అంతర్గత పంచాయతీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ పరిస్థితి గులాబీపార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు కొత్త దారులు వెతుక్కుంటుండం పార్టీలో చర్చనీయంశంగా మారుతోంది.

 

15:06 - March 1, 2018

గుంటూరు : మిర్చియార్డు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మిర్చిపంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేట రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యార్డుకు వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అందినకాడికి పంటను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

పల్లెపల్లెకు టీడీపీ మరింతగా : చంద్రబాబు

హైదరాబాద్ : పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. రాష్ట్రనాయకత్వం స్వయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని, కార్యకర్తలు ఫిర్యాదు చేసే అవకాశం మరోసారి కల్పించొద్దని ఆయన అన్నారు. 

14:14 - March 1, 2018

కడుపుతో ఉన్నవారికి అందరు జాగ్రత్తలు చెబుతుంటారు. కానీ పెరుగుతున్న సంకేతికత ఆధారంగా ఓ యాప్ సిద్దమైంది. కడుపుతో ఉన్న వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌  ‘బేబీ బంప్‌ ప్రెగ్నెన్సీ ప్రో’. ఇందులో కాబోయే అమ్మ కోరుకునే అనేక సదుపాయాలు ఉన్నాయి. పుట్టబోయే బిడ్డకు పెట్టాలనుకునే పేర్లూ, వారికి అవసరమయ్యే వస్తువులూ, తీసుకోవల్సిన జాగ్రత్తలు అన్నీ ఇందులో వివరంగా పొందుపరిచారు. దాంతోపాటే కడుపుతో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు రోజుల వారీగా ఇందులో భద్రపరచుకోవచ్చు. అలాగే నవమాసాల సమయంలో పెరిగే బరువూ, జరిగే మార్పులకు సంబంధించిన వివరాల్నీ ఈ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో అనేక గ్రూపులు అందుబాటులో ఉంటాయి. సభ్యుల్లో చాలామంది గర్భిణులే. వారందరి అభిప్రాయాలూ, సూచనల్ని కూడా అందుకోవచ్చు.

 
 

కేంద్రంపై ఒత్తిడి తేవాలి : రఘువీరా రెడ్డి

గుంటూరు : ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఏప్రిల్ 5 తర్వాత చేసే త్యాగాలు, రాజీనామాలు, ఉద్యమాల వల్ల ఉపయోగం లేదని ఆయన తెలిపారు. 

13:39 - March 1, 2018
13:37 - March 1, 2018
13:36 - March 1, 2018
13:16 - March 1, 2018
13:14 - March 1, 2018

గుంటూరులో మిర్చి రైతుల ఆందోళన

గుంటూరు : మిర్చి మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రైతులు మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని రోడ్డెక్కారు. చిలకలూరిపేట రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచి పోయాయి. 

టీ-టీడీపీ నేతల సమావేశం

హైదరాబాద్ :  ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీ-టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ టీడీపీ చెపట్టబోయే కార్యక్రమాల గురించి వారు చర్చిస్తున్నుట్టు తెలుస్తోంది. 

ప్రత్యేక హోదాపై సదస్సు

గుంటూరు : విజ్ఞాన మందిరంలో ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై సదస్సు నిర్వహించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ , పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, చలసాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి హాజరైయ్యారు.  

టాటా బోయింగ్ ఏరోస్పేస్ ప్రారంభించిన కేటీఆర్

రంగారెడ్డి : ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ పాల్గొన్నారు.

జీవీఎంసీ వద్ద వైసీపీ నేతల ధర్నా...

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. 

టాటా బోయింగ్ ఏరోస్సేస్ కంపెనీ...

రంగారెడ్డి : ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామనస్, రతన్ టాటా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

12:14 - March 1, 2018

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక గ్రామానికి చెందిన కొండగొర్ల తిరుపతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం తిరుపతి భార్య భూదేవి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. అంతకు ముందు ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చారు. కూతురు కీర్తన, కుమారుడు శ్రీశాంత్‌ పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:11 - March 1, 2018

హైదరాబాద్ : న్యాయం కోసం వాదించే న్యాయవాదులు రోడ్డెక్కారు. తమ సమస్యలు..డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ...ఏపీ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. న్యాయవాదుల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు.

రెండు రోజుల పాటు ఈ ఆందోళన కొనసాగనుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి వీరి డిమాండ్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

కృష్ణమూర్తికి సంతాపం తెలిపిన చంద్రబాబు

గుంటూరు : చిత్తూరు చెందిన ప్రముఖ రచయత, కవి, సంపాదకులు నాయని కృష్ణమూర్తి మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. 

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

శ్రీకాకుళం : జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్ లో విషాదం జరిగింది. ఇద్దరు చిన్నారులతో పాటు ఓ తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 

12:00 - March 1, 2018
11:55 - March 1, 2018

విజయవాడ : క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం కొనసాగుతోంది. అందుకోసం చట్టాలు ఉన్నా విజయవాడలో మాత్రం లెక్కచేయడంలేదు.. కౌన్సిల్‌ లో తీర్మానం చేసినా.. నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రజలు, పశువులు అనారోగ్యాల పాలవుతున్నా అధికారుల్లో చలనం రావడంలేదు. విజయవాడ నగరంలో 1999నుంచి ప్రభుత్వం క్యారీబ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది.వీటి నిషేధానికి గట్టి చర్యలు తీసుకుంటామని పాలకులు, అధికారులు రెండుసార్లు కౌన్సిల్లో తీర్మానాలు కూడా చేశారు. 2018 జనవరి ఒకటి నుంచి కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఐనా... క్యారీ బ్యాగుల వినియోగం యథేచ్ఛగా సాగిపోతోంది.

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ నిబంధనలు 2011 ప్రకారం 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ టీ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సీసాలు, తోరణాలు, ప్లెక్సీలు, బ్యానర్లను వినియోగంపై నిషేధం కొనసాగుతోంది. చట్టాలను లెక్క చేయకుండా పాతబస్తీ, ఆటోనగర్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్యారీ బ్యాగుల విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి.

విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు నిషేధిత ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల సరఫరా జోరుగా సాగుతోంది. రోజుకు 35 టన్నుల వరకు విక్రయాలు సాగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాసిరకపు క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇక్కడకు దిగుమతి అవుతున్నాయి. అయితే నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలను అడ్డుకోవాల్సిన కార్పొరేషన్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా నిషేధిత క్యారీబ్యాగుల, ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి, విక్రయాలు చేస్తున్న వ్యాపారులను కట్టడి చేయాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు.

11:53 - March 1, 2018

విజయవాడ : నిన్నటి దాకా అమ్మో చలి.. ఇక నుంచి అబ్బా ఎండలు.. ఏపీలో ఎండలు అపుడే ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణతాపం పెరిగిపోతోంది. మార్చినెల మొదలవడంతోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పటికే 38 డిగ్రీలకు చేరుతున్న ఎండలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చలి గడపదాటిందో లేదో.. అపుడే సూర్యుడు మిడిసిపడుతున్నాడు. మండిపోతున్న ఎండలతో ఏపీలో ప్రజలు అవస్థలు మొదలయ్యాయి. ఏప్రిల్, మేలో తీవ్రమయ్యే ఎండలు, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సెగలు కక్కుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఎండలు క్రమక్రమేణా మండిపోతుండటంతో రహదారులపై జనం లేక వెలవెలబోతున్నాయి.

వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు హడలిపోతున్నారు. గతేడాది వందలాది మంది ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారు. దీనికితోడు వేసవిలో ఆయా జిల్లాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొవాల్సి వస్తోంది. ఎండలు మరింతగా ముదరక ముందే నీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత రెండు వారాలపైగా ఎండలు చిర్రెత్తిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు రాజధాని ఏరియా విజయవాడలో ఎండలు సుర్రుమంటున్నాయి. మధ్యాహ్నం వేళ బెజవాడలో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి.

మొత్తానికి మార్చి నెల మొదట్లోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్‌,మే నెలలు ఊహించుకుంటేనే జనం విలవిల్లాడి పోతున్నారు. ఇప్పటికే 38 డిగ్రీలకు చేరుతున్న ఎండలు.. మరికొద్ది రోజుల్లో 40దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చి జల్లు పడితే తప్ప ఇప్పట్లో చల్లబడి చాన్సే లేదంటున్నారు. దీంతో ఈసారి ఎండలు తాటతీస్తాయనడంలో సందేహం లేదని జనం ఆందోళన పడుతున్నారు. 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిన పాక్

 శ్రీనగర్ : పాక్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లఘించి భీంబర్ గాలి సెక్టార్ లో రేంజర్లు కాల్పులకు పాల్పపడ్డారు. భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొడుతన్నారు. సైన్యం కాల్సుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు.

11:12 - March 1, 2018

ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఖర్గే

 ఢిల్లీ : కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించారు. లోక్ పాల్, లోకాయుక్త ఎంపిక కమిటీ భేటీ కోసం మల్లికార్జున ఖర్గేకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

11:11 - March 1, 2018

కార్తీ చిదంబరంను ప్రశ్నిస్తున్న సీబీఐ

ఢిల్లీ : సీబీఐ అధికారులు  కార్తీ చిదంబరాన్ని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిన్న కార్తీ చిదంబరాన్ని సీబీఐ అరెస్టు  చేసింది.

జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం

చెన్నై : జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం జరిగింది. వేదమంత్రాల మధ్య బృందావన ప్రవేశ క్రతువు నిర్వహించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే బృందావన ప్రవేశం జరిగింది. 

స్విమ్మర్ ప్రశాంత కర్మాకర్ పై వేటు

ఢిల్లీ : పారా స్విమ్మర్  ప్రశాంత కర్మాకర్ పై మూడేళ్ల పాడు సస్పెన్షన్ వేటు విధిస్తూ భారత పారాలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మహిళా స్విమ్మర్లను వీడియోఓ తీసినందుకు కార్మకర్ పై సస్పెన్షన్ విధించారు. 

10:42 - March 1, 2018

హైదరాబాద్ : భాగ్యనగరంలో అందర్నీ ఆకర్షిస్తూ భారీ హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. తాజాగా వీటి ఏర్పాటు వెనుక భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సిటీలో అక్రమ హోర్డింగ్‌ల ఏర్పాటుతో బల్దియా తీవ్రంగా నష్టపోతోంది. దీనికి తోడు అక్రమ హోర్డింగ్‌లను తొలగించడంలోనూ అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎటు చూసినా వందల సంఖ్యలో హోర్డింగులు దర్శనమిస్తుంటాయి. సిటీలో భారీ వర్షం కురిసిందంటే ఎప్పుడు ఏ హోర్డింగ్ కూలుతుందో తెలియని పరిస్థితి. గత రెండేళ్లుగా వర్షాకాలంలో హోర్డింగ్స్‌ కూలిన ఘటనల్లో ప్రాణ నష్టం జరగనప్పటికీ ..భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. హోర్డింగ్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.. తీసుకున్న అనుమతికి మించి హోర్డింగ్‌లు నిర్మించడం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా బల్దియా పరిధిలో 2వేల 684 హోర్డింగ్స్‌కి మాత్రమే అనుమతి ఉంది. ఇటీవల ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో వాటిపై బల్దియా నిర్వహించిన సర్వేలో 333 అక్రమ హోర్డింగ్‌లు ఉన్నట్లు లెక్క తేలింది.

ఇక అక్రమ హోర్డింగ్స్‌ని పనిపట్టేందుకు బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అక్రమ హోర్డింగ్ తొలగించడం ద్వారా వచ్చే ఇనుముకు ప్రతి కేజీకీ రూ.13 రూపాయల మేర ఆదాయం వస్తుంది. ఈ లెక్క ప్రకారం పెద్ద మొత్తంలో బల్దియాకు ఆదాయం వస్తుంది. అయితే ఇప్పటికే హోర్డింగ్స్‌పై అక్రమార్జనకు అలవాటు పడ్డ వారంతా ఇప్పుడు ఆ హోర్డింగ్స్‌ను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బ‌ల్దియాలోని హోర్డింగ్స్ విభాగంలో ఇంజ‌నీర్లు, అక్రమ హోర్డింగ్స్ యజమానులు కుమ్మక్కై అవినీతికి తెరలేపారంటూ ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికైనా అక్రమ హోర్డింగ్స్ ద్వారా ఏళ్ల తరబడి ఆదాయం పొందిన వారిని గుర్తించడంతో పాటు.. అక్రమ హోర్డింగ్స్ ద్వారా బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నవారిపై చర్యలు చేపట్టాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు. దీనిపై బల్దియా అధికారులు ఏ మేరకు దృష్టి పెడతారో వేచి చూడాలి. 

10:40 - March 1, 2018

హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే కేసిఆర్ సిద్ధమ‌వుతున్నారా..? దేశంలో మోదీ హవా తగ్గిందని గులాబీ దళపతి భావిస్తున్నారా.. ? సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ సర్కార్‌ ఏర్పడుంతుందని అంచానకు వచ్చారా..? బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి ఘాటు విమర్శల ఆంతర్యం ఏంటీ..? రెండు జాతీయ పార్టీల‌పై ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర విమ‌ర్శలు చేయ‌డం.. ఇపుడు కొత్త చ‌ర్చకు దారితీస్తోంది.

రాష్ట్రంలో సాగు సంక్షోభానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లే కారణమంటూ కేసీఆర్‌ మండిపడుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో జాతీయ పార్టీలు విఫ‌ల‌మ‌య్యాయాని విమ‌ర్శిస్తున్నారు. ఉపాధి హమీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తాము కోరినా కేంద్రం స్పందించక పోవ‌డంపై ఆగ్రహం కేసీఆర్‌ వ్యక్తం చేశారు. త్వర‌లో మొద‌ల‌య్యే రెండో విడ‌త కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో దూకుడు ప్రదర్శిస్తారని రైతు సమన్వయ సమితుల సదస్సు సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇప్పటివరకు తాము కేంద్రంతో సయోధ్యగానే ఉంటున్నా.. రాష్ట్రానికి మాత్రం సరైన రీతిలో సహకారం అందండం లేదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మైనారిటీ , గిరిజన రిజర్వేషన్ల బిల్లులకు మెలిక పెట్టడం... విభ‌జ‌న హామీల‌పై ఆశించిన స్థాయిలో స్పందించ‌క‌పోవ‌డంపై గులాబీ పార్టీ గుర్రుగా ఉంది.కేంద్రం తెలంగాణపై చిన్న చూపు చూస్తుందని అధికార పార్టీ నేత‌లు ప్రచారం అందుకున్నారు. మరోవైపు నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డంపై కూడా మోదీ సర్కార్‌పై కేసిఆర్ ఆగ్రహానికి కార‌ణ‌మ‌న్న అభిప్రాయం గులాబీపార్టీ నేత‌ల్లో వ్యక్తం అవుతోంది.

వచ్చే సాధారణ ఎన్నిక‌ల అనంత‌రం జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న వ్యూహంలో భాగంగానే గులాబి ద‌ళ‌ప‌తి పాలువు కదుపుతున్నట్టు చర్చలు నడుస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే రెండు జాతీయ పార్టీలను టార్గెట్ చేసినట్లు కూడా పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. దేశంలో మోడీ హ‌వా త‌గ్గుతుంద‌న్న అభిప్రాయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసిఆర్.. కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవ‌హ‌రించాల‌ని భావిస్తున్నట్లు పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికోసమే కేసీఆర్ జాతీయ పార్టీలపై విమర్శలు ఎక్కుపట్టారన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 

10:37 - March 1, 2018

హైదరాబాద్ : 17 ఏళ్లు.. ఓసారి 9కోట్లు.. మరోసారి 35 కోట్లు..ఖర్చు చేశారు. కాని పనులు చేస్తున్నట్టే ఉంటుంది..పనికి రాకుండా పోతోంది. దేశం అంతా తిరిగారు.. చారిత్రక కట్టడాలను పరిశీలించారు. అయినా.. చార్మినార్‌ అవృద్ధి ప్రాజెక్టు మాత్రం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. తాజా ఇస్తాంబుల్‌ టూర్‌కు ప్లాన్‌ చేస్తున్నారు.. అధికారులు-ప్రజాప్రతినిధులు. ప్రాజెక్టు పేరుతో విదేశీ టూర్లకు ప్లాన్‌వేశారనే విమర్శలు వస్తున్నాయి.

ఏళ్లు గడుస్తున్నాయి.. కోట్లు ఖర్చవుతున్నాయి.. అయినా చార్మినార్‌ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఎప్పటి క‌ప్పుడు మంత్రులు, అధికారులు హడావిడి చేస్తున్నా.. రెండు అడుగులు మందుకు మూడు అడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది చార్మినార్‌ ప్రాజెక్టు పరిస్థితి. కోద్ది నెల‌ల క్రితం అమృత్‌సర్‌ వెళ్లిన అధికారుల బృందం..ఇపుడు ఇస్తాంబుల్‌ వెళ్లి చారిత్రక కట్టడాలను అధ్యయనం చేయాలంటోంది. 400 సంవత్సరాలకు పైగా చ‌రిత్ర ఉన్న చార్మినార్... ఇపుడు ట్రాఫిక్, పొల్యూష‌న్‌తో తన కళను కోల్పోతోంది. ఈ చారిత్రక క‌ట్టడం ప‌రిస‌రాల్లోని పరిస్థితులు నానాటి మ‌రింత‌గా దిగ‌జారుతున్నాయనే ఆందోళ‌న వ్యక్తమ‌వుతోంది.చార్మినార్ చుట్టు పక్కల‌ 100 మీట‌ర్ల పరిధిలో ఎలాంటి శ‌బ్దకాలుష్యం లేకుండా, చార్మినార్ సందర్శనకు వ‌చ్చే ప‌ర్యాట‌కుల సౌల‌భ్యం కోసం పెడ‌స్ట్రియ‌న్ ప్రాజెక్ట్‌కు రూప‌క‌ల్పన 17 ఏళ్ల క్రిత‌మే జ‌రిగింది. అప్పటి నిబంధ‌న‌ల ప్రకారం చార్మినార్ చుట్టుప‌క్కల ఎలాంటి కొత్త క‌ట్టడాలు జ‌రుగ‌కుండా చూడాల‌ని మున్సిప‌ల్ శాఖ‌ను ప్రభుత్వం ఆదేశించింది. అయినా వాటిని నిలువ‌రించ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది బ‌ల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం. దాంతో భారీ భ‌వ‌నాలు వెల‌సి చార్మినార్ స‌హ‌జ అందాల‌ను కోల్పోయేలా చేశాయి.

చార్మినార్ సుంద‌రీక‌ర‌ణ ప‌నుల్లో భాగంగా చార్మినార్ చుట్టూ ఇన్నర్, ఔట‌ర్ రింగ్ రోడ్‌ల‌ను అభివృద్ధి చేయడానికి 1999లో అప్పటి ప్రభుత్వం తొమ్మిదిన్నర కోట్ల రూపాయలను కేటాయించింది. నిధులు ఖర్చయినా పరిస్థితి మారలేదు. ఇక 2006లో మరోసారి 35 కోట్ల రూపాయలను కేటాయించారు. కాని.. పనులు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నా.. చార్మినార్‌ వద్ద ట్రాఫిక్‌ అస్తవ్యస్థంగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో చార్మినార్‌ ప్రాజెక్టుపై బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ మొదట కొంత హడావిడి చేశారు. చార్మినార్‌ను సందర్శించి పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ సేమ్ సీన్ ద‌ర్శన‌మిస్తోంది చార్మినార్‌ పరిసరాల్లో.

ఇదిలావుంటే .. సిటీకి చెందిన ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం కొద్ది నెల‌ల క్రితం అమృత్ స‌ర్ వెళ్లి అక్కడ స్వర్ణదేవాలయం ప‌రిసారాల అబివృద్దిని స్టడి చేశారు. స్వర్ణ దేవాల‌యం స‌మీపంలో జరిగిన అభివృద్ధి పనులను చార్మినార్‌ పరిసరాల్లో చేపట్టాలని నిర్ణయించారు. కాని వీరి సిఫారస్‌లు కూడా ఆచరణకు నోచుకోలేదు. అయితే పనులు కొద్దికొద్ది కంప్లీట్‌ చేస్తామంటున్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌. ఇదిలావుంటే... చార్మినార్‌ ప్రాజెక్టు పేరుతో మరో విదేశీ టూర్‌కు ప్లాన్‌ సిద్ధం అవుతోంది. టర్కీలోని ఇస్తాంబుల్‌ సిటీని సందర్శించి.. అక్కడి చారిత్రక కట్టడాలను పరిశీలించడానికి నాయకులు అధికారుల బృందం పయనం అవుతామంటోంది. మొత్తానికి చార్మినార్‌ను కాపాడ్డం ఏమోగాని గత 17ఏళ్లుగా టూర్‌లతోనే కాలం గడిచిపోతోంది. హైదరాబాద్‌ ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్‌ను కాపాడుకోవడానికి.. నాయకులు, అధికారులు ఇకనైనా చిత్తశుద్ధి చూపాల్సిన అవసరం ఉంది. 

10:33 - March 1, 2018

చెన్నై : శివైక్యం పొందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహాసమాధి క్రతువు ప్రారంభమైంది. కంచిమఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతిని మహాసమాధికి ఏర్పాట్లు చేశారు. వేద మంత్రాల మధ్య జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం క్రతువు నిర్వహిస్తున్నారుం. స్వామికి వీడ్కోలు పలికేందుకు దేశం నలుమూల నుంచి ప్రముఖులు కంచికి తరలివచ్చారు. స్వామి పార్థివదేహాన్ని లక్షలాది మంది దర్శించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. 

10:32 - March 1, 2018

విజనా..! కొత్తగా ఉంది కాదు. ఇంతవరకు సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లూక్, ట్రైలర్, టీజర్ విన్నారు కానీ విజన్ అనే మాట ఎప్పుడు వినలేదు కాదు. కానీ ఇప్పుడు వినబోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ప్రమోషన్స్ పై ఇంతవరకు దృష్టి పెట్టాని దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు మార్చి 6న భరత్ అనే నేను విజన్ ను విడుదల చేయనున్నారు. ఈ విజన్ కోసం మహేష్ అభిమానుల అతృతగా ఎదురు చూస్తున్నారు. 

10:30 - March 1, 2018

హైదరాబాద్ : రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టితో గులాబీపార్టీ ముందస్తుగా జాగ్రత్త పడుతోందా.. ? అన్నివర్గాలను ఆకర్షించేందుకే కొత్త కొత్త పధకాల ప్రవేశపెడుతోందా.. ? ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్న నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు భారీగా నోటిఫికేషన్లకు తెరతీస్తోందా.. ? ఒక వైపు నిరుద్యోగ భృతికి ప్లానింగ్ వేస్తూనే.. మరోవైపు భారీగా నోటిఫికేషన్లు రిలీజ్‌ చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్‌ అవుతున్నట్టు సచివాలయంలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమాని నాంది పలికిన వాటిలో నీళ్ళు, నిధులు,నియమాకాలు అత్యాంత ప్రదానమైనవి. అందులో నీళ్ళ గురించి ప్రాజెక్టులను నిర్మాణాలను ప్రారంభించిన సర్కార్‌.. విపక్షాల విమర్శలను కొంతమేరకు అడ్డుకుంటోంది. అయితే నియామకాల విషయంలో మాత్రం.. కేసీఆర్‌ సర్కార్‌పై నిరుద్యోగులు, యువత గుర్రుగా ఉన్నారు. లక్షుఉద్యోగాల హామీ నెరవేర్చకపోగా.. నిరసన తెలిపిన వారిని కఠినంగా అణచడానికి ప్రయత్నించడంతో గులాబీ పార్టీ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న సాధారణ ఎన్నికలు టీఆర్‌ఎస్‌పార్టీని కలవర పెడుతున్నాయి. దీంతో నిరుద్యోగులు, యువతలో ఉన్న వ్యతిరేకతను చల్లార్చడానికి తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కేసీఆర్‌ సర్కార్‌ డిసైడయినట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా వచ్చిన ప్రతి నోటిఫికేషన్లపై ప్రభుత్వం కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించి ఏడాది గడుస్తున్న ఇంకా కోర్టు క్లీయరెన్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అటు విధ్యుత్ సంస్ధలో పని చేస్తున్న కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంలో సరైనా ప్రణాళిక లేక.. ప్రభుత్వం కోర్టుబోనులో నిలబడాల్సి వచ్చింది. అయితే ప్రతిదానికి కోర్డుకు వెళ్లి సమస్యలను సృష్టిస్తున్నారని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల విషయంలో ప్రతిపక్షాలు, నిరుద్యోగల సంఘాలదే తప్పు అని ప్రభుత్వం ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇలా ప్రతి అంశం కోర్టుల చూట్టునే ఉండడంతో రాష్ట్రంలో నిరుద్యోగులు సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఒక వైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం..మరో వైపు ప్రతిపక్షాలన్ని నిరుద్యోగులతో జత కట్టడంతో మేల్కోన్న ప్రభుత్వం వారిని శాంతింప చేసే మంత్రం జపించేందుకు సిద్దం అయ్యింది.

ఇప్పటికే వివిధ శాఖల్లోని ఖాళీపోస్టుల వివరాలను ఫైనాన్స్ క్లీయరెన్స్ కోసం పంపించారు. వీటితో పాటు గ్రూప్ 1, గ్రూప్‌ 2 ల నోటిఫికేషన్లుకు కూడా పబ్లిక్ సర్వీసు కమీషన్ ను సిద్దంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేసినట్టు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో 14,700, వి ఆర్ ఓ లు 700, గ్రూప్ 4 లో 1500 , పంచాయితీ సెక్రటరీ లు 2200, గ్రూప్ 1 లో 193, గ్రూప్ 2 లో 750, గ్రూప్ 3 లో 975 పోస్టులు నోటిఫై చేసి రెడీ గా ఉన్నట్టు సమాచారం. ఇక ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతాయని సెక్రెటెరియట్‌ నుంచి వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని ఇప్పటికే గులాబీసర్కార్‌ ప్లాన్స్‌ రెడీ చేసింది. వచ్చేనెలలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంలో నిరుగ్యోగులకు భృతిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్కార్ లో అలజడి మొదలైందనే చెప్పాలి. 

10:27 - March 1, 2018

హైదరాబాద్ : పార్టీ జెండా..ఏజెండా ఖరారు కాక ముందే.. వెన్నుద‌న్నుగా నిలిచే వారి కోసం టి.జె.ఏ.సి ప్రయ‌త్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ఉద్యమానికి స‌హ‌క‌రించిన ఎన్ ఆర్.ఐల‌ను మ‌రొసారి త‌న‌వైపుకు తిప్పుకునేందుకు జాక్ చైర్మన్ అడుగులు వేస్తున్నారు.ఆయ‌న ఏర్పాటు చేయ‌బోయే పార్టీకి ఇంటా బ‌య‌ట మ‌ద్దతు కూడ‌గ‌ట్టెప్రయ‌త్నం చేస్తున్నారు. కోదండ‌రామ్ అమెరికా ప‌ర్యట‌న హ‌ట్ టాపిక్ గా మారింది.

వారం రోజుల క్రితం స‌తీమ‌ణితో క‌లిసి కొదండ‌రామ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే ఇది కేవలం కోదండరామ్‌ వ్యక్తిగత పర్యటన మాత్రమేనని టీజేఏసీ వర్గీయులు చెబుతున్నా... రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం, మార్చి రెండో వారంలో పార్టీని ప్రారంభించబోతున్న క్రమంలో.. కోదండరాం అమెరికాకు వెళ్లడం రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కించింది. పార్టీని ప్రారంభించబోతున్న రోజే పార్టీ పేరును, గుర్తును, విధివిధానాలను కోదండరామ్ ప్రకటించబోతున్నారు.ఓ వైపు తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పొషించి ..తెలంగాణ వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలను అందరిని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో వైపు ప్రపంచ నలుదిక్కుల్లో ఉన్న తెలంగాణ వాదులను సైతం ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం ప్రోపెసర్ కొదండరామ్ చేపట్టారు.

తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏక తాటిపైకి తెవ‌డంలో కొదండ‌రామ్ ప్రముఖ పాత్ర పొషించారు. స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌మ‌యంలో అమెరికా..ఇత‌ర దేశాల్లో ఉండే ఎన్ .ఆర్ .ఏలు స్వయంగా మ‌ద్దతు ప‌లికారు.టిజాక్ కు తెర వెనుక,ముందు అన్ని విధానాలు స‌హ‌కరాలు అందించారు.తెలంగాణ రాష్ట్రం సిద్దించినా ఇంకా తెలంగాణ యువ‌త ఆంకాక్షలు కా నేర‌వేర‌క పొవ‌డం వంటి అంశాల‌ను ప‌లుమార్లు ఎన్.ఆర్.ఐలు కొదండ‌రామ్ దృష్టికి తీసుకోచ్చారు.అధికార టి.ఆర్.య‌స్ పార్టీని ఎదుర్కోవలంటే.ఒక్క కొదండ‌రామ్ సార్ వ‌ల్లే అవుతుంద‌ని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇపుడు టీజాక్‌ పార్టీ ఏర్పాటు వెనుక వారి సహకారం చాలా ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నేతలు, అధికారపార్టీలోని కొంతమంది అసంతృప్త నేతలు కోదండరామ్‌కు టచ్‌లో ఉన్నట్టు తెలిస్తోంది. కోదండరామ్‌ అమెరికాకు వెళ్లడానికి ముందు పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 200 మందితో ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశారు.వంద మంది టీజేఏసీకి చెందిన వారు కాగా, మరో వందమంది బయటవారిని తీసుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కోదండరామ్‌ వారందరితో సన్నాహాక మీటింగ్‌ను ఏర్పాటు చేయ‌బోతున్నాట్లు తెల‌స్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గులాబీపార్టీకి ఎర్త్‌పెట్టేందుకు కోదండరాం సారు.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 

10:26 - March 1, 2018

కపూర్, అయ్యప్పన్ కుటుంబ సభ్యులు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తమ గత కొద్దిరోజులుగా బాధలో ఉన్నామని కనీసం ఏడవడానికి కూడా సమయం దొరకలేదని, దయచేసి మీడియా మాకు దూరంగా ఉండాలని వారు కోరారు. కష్టసమయంలో తమకు అండగా నిలిచిన తోటి నటులకు, అభిమానులకు ధన్యవాదలు తెలిపారు.శ్రీదేవి జీవితాంతం గౌరవంగా బతికారని గుర్తుచేసిన బంధువులు, ఇకపై కూడా అదే గౌరవాన్ని కొనసాగించాలని కోరారు.

10:25 - March 1, 2018

విజయవాడ : మార్చి నెల.. ఏపీకి ప్రత్యేక హోదాపోరు అటు చట్టసభల్లో..ఇటు ప్రజాక్షేత్రంలో మార్మోగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా..? వద్దా..? ఓవైపు పార్టీ అధినేత పాదయాత్ర..! మరోవైపు ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా..! ఎటు వెళితే పార్టీ గళం ఎఫెక్టివ్‌గా వినిపించే అవకాశం ఉంది..? ఇపుడు ఇదే అంశంపై వైసీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహంగా ఉన్న వైసీపీ గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై ఆన‌ర్హత వేటు వేయడంతోపాటు నలుగురు మంత్రులను కూడా తొలగించాలని వేయాలన్న తమ డిమాండ్‌ చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి కాని.. స్పీకర్‌ నుంచి కాని స్పందన రాకపోవడంతో ఈసారి బడ్జెట్‌ సమావేశాలను కూడా బాయ్‌కాట్‌ చేస్తాయాలని వైసీపీ అధినాయకత్వం డిసైడైనట్టు తెలుస్తోంది.

ఎపీకి ప్రత్యేక హోదా కోసం ఉధృతంగా పోరు సాగుతోంది. చివరికి సీఎం చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ మాండును వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉంది. ఇపుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. కీలకమైన ప్రత్యేక హోదాపై పార్టీ గళాన్ని వినిపించే ఛాన్స్‌ మిస్సయినట్టేనని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంది. మార్చి ఒక‌టిన ఆన్ని క‌లెక్టర్ కార్యాల‌యాల ముందు ద‌ర్నా చేయ‌డంతో పాటు మార్చి ఐదున డీల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద మహాధర్నా చేయడానికి ప్రణాళిక రూపొందించారు. పార్లమెంట్ స‌మావేశాల్లో ఎంపీలు ఆందోళ‌న చేప‌ట‌్టలాలని వైసీపీ నిర్ణయించింది. దాంతోపాటు మార్చి 21న కేంద్ర ప్రభుత్వంపై ఆవిశ్వాసం పెట్టి.. ఏప్రిల్‌ ఆరున ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు.

దీంతో ఆటు పార్లమెంట్‌లోనూ, ఇటు అసెంబ్లీలోనూ ప్రత్యక హోదా గళాన్ని గట్టిగా వినిపిస్తే.. ప్రభావం మరింత గట్టిగా ఉంటుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఓవైపు పార్టీ అధినేత పాదయాత్ర, మరోవైపు ఢిల్లీలో ఆందోళన నేపథ్యంలో అసెంబ్లీని బహిష్కరిస్తేనే.. జనంలోకి ఆందోళన మరింత ఉధృతంగా తీసుకెళ్ల వచ్చని వైసీపీలో మరికొందరు నేతలు వాదిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదా గళాన్ని వినిపిస్తేనే బాగుంటుందని మెజారిటీ అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. 

కాసేపట్లో జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం

తమిళనాడు : కాసేపట్లో జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేయనున్నారు. జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని శిష్యుగణం బృందావనం ప్రవేశ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

బెల్లంపల్లిలో విషాదం

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లిలో మండలం చొప్పరిపల్లిలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు దంపతులతో పాటు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. 

జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : బందిపోర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందాడు.  

09:51 - March 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ 'హోదా'పై పోరు కొనసాగనుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా గురువారం కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్న జగన్ నేడు విరామం ప్రకటించారు. ఇదిలా ఉంటే గుంటూరులో వామపక్షాల సదస్సు కూడా జరుగనుంది. రేపు మండల కేంద్రాల్లో ధర్నాలు..మార్చి 3వ తేదీన తిరుపతిలో మానవహారం, 4న విశాఖలో క్యాండిల్ ర్యాలీ...5వ తేదీ నుండి ఢిల్లీలో దీక్షలను చేపట్టనున్నట్లు వామపక్ష నేతలు ప్రకటించారు. 

సామూహిక గృహ నిర్మాణాల శంకుస్థాపన...

మచిలీపట్నం : మచిలీపట్నంలో గురువారం సామూహిక గృహనిర్మాణాల సముదాయానికి శంకుస్థాపన జరగనుంది. రుద్రవరం, గోసంఘం భూముల్లో శంకుస్థాపన మహోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. 

తెలంగాణకు శృంగేరి పీఠాధిపతి...

హైదరాబాద్ : శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖరస్వామి తెలంగాణ రాష్ర్టానికి రానున్నారు. గద్వాల్‌ జిల్లా కర్ణాటక- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నందిన్నె గ్రామానికి రానున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలుకనున్నారు.

09:18 - March 1, 2018

నెల్లూరు : యశ్వంత్ పూర్ లక్నో ఎక్స్ ప్రెస్ లో దోపిడి జరిగింది. జనరల్ బోగీలోకి ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తులు బర్త్ డే అంటూ ప్రయాణీకులకు బిస్కెట్లు, కూల్ డ్రింక్ ఇచ్చారు. వీటిని తీసుకున్న 13 మంది ప్రయాణీకులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం దుండగులు విలువైన వస్తువులను అపహరించారు. రేణిగుంట స్టేషన్ లో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ప్రయాణీకులు అపస్మారకస్థితిలో ఉండడం గమనించారు. వెంటనే గూడూరు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు స్టేషన్ లో రైలును ఆపి అపస్మారకస్థితిలో ఉన్న ప్రయాణీకులను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంత విలువైన వస్తువులు చోరీ చేశారో అనేది తెలియాల్సి ఉంది. 

జయేంద్ర సరస్వతికి బృందావన ప్రవేశ అభిషేకం...

చెన్నై : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి బృందావన ప్రవేశ అభిషేకం నిర్వహించారు. జయేంద్ర సరస్వతి బుధవారం అస్తమించిన సంగతి తెలిసిందే. అభిషేకాన్ని ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి నిర్వహించారు. టిటిడి ఈవో ఎ.కె.సింఘాల్, డాలర్ శేషాద్రి, టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. 

07:29 - March 1, 2018

పార్టీని విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని, పొత్తుల గురించి ఆయా సందర్భంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లయ్య యాదవ్ (టి.టిడిపి), ప్రకాష్ రెడ్డి (బిజెపి), మన్నె గోవర్ధన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రవాణా శాఖ ఆన్ లైన్ సేవలు బంద్...

విశాఖపట్టణం : నేడు, రేపు రవాణా శాఖ ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. రవాణా శాఖ సర్వర్ ను పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ చేయాలని, సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మోర్దనపల్లిలో రోడ్డు ప్రమాదం...

చిత్తూరు : మోర్దనపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొంది. ఇద్దరు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

తిరుమలలో కుమారధార ముక్కోటి...

చిత్తూరు : తిరుమలలో నేడు కుమారధార ముక్కోటి కార్యక్రమం జరుగనుంది. తెప్పోత్సవాల కారణంగా నేడు పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది. మార్చి 14న అన్నమయ్య 545 వర్ధంతి..మార్చి 29 నుండి మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. 

నేడు వామపక్షాల సదస్సు...

గుంటూరు : హోదా..రైల్వే జోన్ కోసం నేడు వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు జరుగనుంది. వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు జరుగనున్నాయి. 3న తిరుపతిలో మానవహారం, 4న విశాఖలో క్యాండిల్స్ లో ర్యాలీ, వామపక్షాల ఆధ్వర్యంలో మార్చి 5న ఢిల్లీలో దీక్షలు చేయనున్నారు. 

కంచి మఠానికి పోటెత్తుతున్న వీఐపీలు..భక్తులు..

చెన్నై : కంచి మఠానికి వీఐపీలు..భక్తులు పోటెత్తుతున్నారు. జయేంద్ర సరస్వతి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఉదయం 8గంటలకు ఆయన్ను మహాసమాధి చేయనున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే సమాధి చేయనున్నారు. 

06:33 - March 1, 2018

HMDA పరిధిలో ఎలాంటి అ్రపూవల్‌ లేకుండా వందల లేఔట్స్‌ వెలుస్తున్నాయి. అయితే వీటిని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా... ఆ చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ఏంటి ? వాటిలో ఉన్న లోపాలేంటి ? ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ప్రజలు, ప్రభుత్వం పాటించాల్సిన నియమాలు ఏంటనే అంశంపై టెన్ టివి 'జనపథం'లో 'ఫెడరేషన్‌ ఆఫ్‌ కాలనీస్‌ అండ్‌ అపార్ట్‌మెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు అంజయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:32 - March 1, 2018

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన త్రైమాసిక జిడిపి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో దేశ జిడిపి 7.2 శాతానికి పెరిగింది. 2016-17 తర్వాత అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. ఈ త్రైమాసికంలో జిడిపి 6.9 శాతంగా ఉంటుందని ఆర్థికవేత్తల అంచనాను అధిగమించింది. డిసెంబర్ త్రైమాసికంలో చైనా జిడిపి 6.8గా నమోదైంది. ఏప్రిల్‌- జూన్‌ క్వార్టర్‌లో నిత్యావసర వస్తువుల ఉత్పత్తి తగ్గుముఖం పట్టడంతో జిడిపి మూడేళ్ల కిందకు పడిపోయి 5.7 శాతంగా నమోదైంది. 2017-18 మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతం ఉండగా.. అంతకుముందు క్వార్టర్‌లో 6.1 శాతంగా ఉంది. నోట్లరద్దు, జిఎస్‌టి అమలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన విషయం తెలిసిందే. 

06:31 - March 1, 2018

ఢిల్లీ : పిఎన్‌బి, రొటోమాక్, సింబోలి షుగర్స్‌ కుంభకోణం తరహాలో మరో స్కాం బయటపడింది. కోల్‌కతాకు చెందిన ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్‌, ఆ సంస్థ డైరెక్టర్లు సుమారు 515.15 కోట్ల మేర బ్యాంకులకు మోసం చేసినట్లు సిబిఐ కేసు నమోదు చేసింది. కంపెనీ డైరక్టర్ శివాజీ పంజా, కౌస్తువ్ రాయ్, వినయ్ బఫ్నా, వైస్ ప్రెసిడెంట్ దేబ్‌నాథ్ పాల్‌తో పాటు మరి కొందరిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో 180.44 కోట్లు మోసం చేసినట్లు 2015లోనే కేసు నమోదైంది. కంపెనీ డైరక్టర్ శివాజీ పంజా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఢాకా పర్యటనకు వెళ్లి వస్తుండగా అరెస్ట్‌ చేశారు. ఆర్పీ మోసంపై కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలోని 10 బ్యాంకుల కన్సార్టియం సీబీఐని ఆశ్రయించింది. 

06:30 - March 1, 2018

హైదరాబాద్ : హోళీ అంటే రంగులు..హోళీ అంటే స్టెప్పులు, కేరింతలు. హోళీరోజు రంగులు చల్లుకుంటూ యూత్‌ తెగ ఎంజాయ్‌ చేస్తారు. శీతాకాలం చలిగాలుల నుంచి ఆహ్లాదకర వసంత రుతువులోకి అడుగుపెట్టడానికి గుర్తు హోళీ. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా జనం సంబరాల్లో మునిగితేలుతారు. హోళీ అంటే రంగుల కలబోత, మనుషుల రంగుల జీవితానికి దర్పణంగా హోళీ నిలుస్తుంది. కష్ట-సుఖాల కలబోతే ఈ రంగుల పండుల. చెడుపై మంచి గెలిచిన రోజుగా కొందరు హోళీ చేసుకుంటే మరికొందరు శీతాకాల చలి గాలుల నుంచి ఆహ్లోదకర వసంతరుతువులోకి ప్రవేశానికి హోళీ మోదటి మజీలీగా భావించి హోళీని జరుపుకుంటారు. అనుబంధాలకు అనురాగ అప్యాయతలకు రంగులకు అవినాభావ సంబంధం ఉంది.

భారత్‌ అంటేనే పండుగుల దేశం. దేశంలో ఏదోఒక ప్రాంతంలో పండుగ సందడి నెలకొనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసి, ఆనందంతో చిందులు వేసే పండుగ అంటే హోళీనే గుర్తుకు వస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాల కతీతంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు కలసి జరుపుకునే రంగుల పండుగ హోళీ. రంగులతో సయ్యాటలే కాదు.. నోరూరించే తీపి వంటకాల ఘుమఘుమలు కూడా హోళీ ప్రత్యేకత. రంగులు చల్లుకుంటూ.. తీపిరుచులను ఆస్వాధీస్తూ జనం చేసే సందడి అంతా ఇంతాకాదు.. ఒక రకంగా దేశం మొత్తం బృదావనంలా మారిపోవడం హోళీ ఈ పండుగలోనే చూస్తూ ఉంటాం.

అయితే సంతోషం, కేరింతల వెనుక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయంటున్నారు వైద్యులు. నేచురల్‌ కలర్స్‌ చల్లుకుంటే ఫర్వాలేదుకాని.. ప్రమాదకర రసాయనాలతో తయారైన రంగులు చల్లుకుంటే.. చర్మసంబంధ రోగా వస్తాయంటున్నారు. అంతేకాదు.. కల్తీరంగుల ధూళిని పీలిస్తే శ్వాసకోశవ్యాధుల వస్తాయంటున్నారు. చెవులు, కళ్లకు కూడా హాని జరిగే ప్రమాదం పొంచి ఉందటున్నారు డాక్టర్లు. ఒక్కోసారి కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రంగులు చల్లుకునే సమయంలో కళ్లకు ప్రొటెక్టివ్‌ గ్లాసెస్‌ ధరించాలని సూచిస్తున్నారు.

హోళీ అంటేనే రంగుల పండగ సరదాగా బంధుమిత్రులతో, కుటుంభ సభ్యులతో రంగులు చల్లుకుంటు ఎంజాయ్ చేయండి.. కాని సహజమయిన రంగులు వాడటంతో పాటు వైద్యులు సూచిస్తున్న చిన్న చిన్న జాగ్ర్తత్తలు పాటిస్తు రంగుల పండుగను ఎంజాయ్ చేయాలని టెన్‌టీవీ కోరుకుంటోంది. హ్యాపీ అండ్ సేఫ్ హోళీ అంటోంది టెన్‌టీవీ. 

06:29 - March 1, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ - టీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీరే దొంగలు అంటే కాదు మీరే అంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ బస్సుయాత్ర ఆలీబాబా 40దొంగల యాత్ర అంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించగా.. ప్రధాని మోదీకి కేసీఆర్‌ చెంచాగిరి చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికార పార్టీ వర్సెస్‌ హస్తంపార్టీగా సాగుతున్న విమర్శలు తెంగాణ రాజకీయాలను రంజుగా మార్చాయి.

కాంగ్రెస్‌ పార్టీ తమ బస్సుయాత్ర సందర్భంగా గులాబీపార్టీని నిశితంగా విమర్శిస్తోంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా సంగారెడ్డిజిల్లాలో పర్యటించిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీని చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

కాంగ్రెస్‌ విమర్శలకు మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. హస్తంపార్టీ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధే లేకుండా పోయిందన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ బస్సు యాత్రను ఆలీబాబా 40 దొంగల యాత్ర అంటూ మంత్రి కేటీఆర్‌ కామెంట్‌చేశారు. వారి యాత్రకు జానాబాబా 40 దొంగలు అని పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నారు కేటీఆర్‌. బస్సు యాత్ర చేసేవాళ్లలో ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయని ఎద్దేవాచేశారు. మొత్తానికి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అధికారపార్టీని హస్తంపార్టీ టార్గెట్‌ చేస్తోంటే.. దానికి దీటుగానే గులాబీనేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. 

06:27 - March 1, 2018

హైదరాబాద్ : జూనియర్‌ ఎన్టీఆర్‌ను లేదంటే బ్రాహ్మణిని.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ పార్టీ పగ్గాలు ఇచ్చి టీ-టీడీపీని బతికించాలని సైకిల్‌ పార్టీ శ్రేణులు చంద్రబాబు ముందు గోడువెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఎన్ని చేస్తున్నా.. నాయకత్వం సరిగ్గా గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీ-డీపీని మరో పార్టీలో విలీనం చేస్తారంటూ వస్తోన్న వార్తలపైనా చంద్రబాబు సమక్షంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడిపి నేతలతో బాబు భేటీ...

హైదరాబాద్ : నేడు టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో టిడిపి నేతలు సమావేశం కానున్నారు. పొత్తులు తదితర అంశాలపై చర్చించనున్నారు. 

టి.సర్కార్ కు మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీస్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీస్ ఇచ్చింది. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. మార్చి 15, 16, 17 తేదీల్లో సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకుంది. జీవో నం 14 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. 

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల గడువు పెంపు...

హైదరాబాద్ : తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31 వరకు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

లుథియానాలో సీఎం అమరేందర్ సింగ్...

పంజాబ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ లుథియానాలోని పంజాబ్ పోలీసు అకాడమీకి చేరుకున్నారు. జవాన్లు నిర్వహించిన పాసింగ్ పరేడ్ లో ఆయన పాల్గొన్నారు. 

ప్రయాణీకులకు మత్తు బిస్కెట్లు తినిపించి...

నెల్లూరు : యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణీకులకు గుర్తు తెలియని వ్యక్తులు మత్తు బిస్కెట్లు ఇచ్చారు. బిస్కెట్లు తిన్న 8మంది ప్రయాణీకులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మోడీకి కేసీఆర్..క్షమాపణలు చెప్పాలన్న లక్ష్మణ్...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సృహ లేకుండా మాట్లాడుతున్నారని, పీఎం మోడీపై కేసీఆర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని బిజెపి నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. మోడీకి కేసీఆర్ క్షమాపణ చెప్పకపోతే నిరసన తెలియచేస్తామని, మజ్లిస్ మెప్పు కోసం కేసీఆర్ దిగజారుతున్నారని విమర్శించారు. 

గ్రూప్ 2 ఓఎంఆర్ పత్రాల దిద్దుబాటుపై హైకోర్టు ఉత్తర్వులు...

హైదరాబాద్ : గ్రూప్ 2 ఓఎంఆర్ పత్రాల్లో దిద్దుబాటు వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండుసార్లు దిద్దుబాటు, వైట్నర్ వివాదాలపై వివాదాస్పద ఓఎంఆర్ పత్రాల పరిశీలనకు ముగ్గురు లాయర్లను హైకోర్టు నియమించింది. శని, ఆదివారాల్లో జవాబు పత్రాలను పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది. 

Don't Miss