Activities calendar

02 March 2018

పరువు హత్య

రాజన్న సిరిసిల్ల : పెందుర్తి మండలం రాంరావుపల్లిలో పరువు హత్య జరిగింది. తన కూతురిని తీసుకెళ్లాడని ప్రియుడి తండ్రిని యువతి తండ్రి రాజయ్య, సోదరుడు చింటు కత్తితో పొడిచి హత్య చేశారు. మృతుడు లింగంపల్లి లింగయ్య. ప్రేమికులు అనిల్, ప్రియాంక ఇంటి నుంచి వెళ్లిపోయారు. 

22:00 - March 2, 2018
21:58 - March 2, 2018

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం... వ్యవసాయ సబ్సిడీ యంత్రపరికరాల పంపిణీ కార్యక్రమానికి... ఖమ్మం జిల్లాలో శ్రీకారం చుట్టింది. మొత్తం 576 ట్రాక్టర్లు,18 వరి కోత మిషన్లను పంపిణీ చేశారు. సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన  ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.  దేశంలోనే అత్యధికంగా రైతులకు సబ్సిడీ యంత్రాలు అందజేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మంత్రి పోచారం చెప్పారు. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం రాష్ర్టంలో ఉడటంవల్లే ఈ ఘనత సాధ్యమైందని మంత్రి పోచారం అన్నారు. 

21:55 - March 2, 2018

హైదరాబాద్ : ఏపీ విభజన హామీల లెక్కలు తేల్చేందుకు ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ... తన నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేతిలో పెట్టేసింది..దీనిపై ఈరోజు మరోసారి చర్చించి రేపు అధికారికంగా నివేదిక వివరాలను ప్రజలకు వెల్లడించనున్నారు. మాజీ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నాలుగేళ్ళుగా చేసిన తప్పులను బట్టబయలు చేసినట్లు సమాచారం... తన చేతికందిన నివేదిక ఆధారంగా జనసేనాని ఏం చేయబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది... 
జనసేనాని చేతిలో జేఎఫ్‌సీ నివేదిక
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నిజాల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన జేఎఫ్‌సీ... తాను రూపొందించిన నివేదికను జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చేతికి అందించింది. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కలిసి ప్రజలను  మోసగించాయని  ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
నివేదికపై చర్చించేందుకు జేఎఫ్ సీ భేటీ 
నివేదికపై విస్తృతంగా చర్చించేందుకు గురువారం సాయంత్రం జేఎఫ్‌సీ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగానే కమిటీ సభ్యులు నివేదికను పవన్‌కు అందజేశారు. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, ఏపీ మాజీ సీఎస్ఐ ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్, మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌  ఈ సమావేశానికి హాజరయ్యారు.  రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నివేదికలో బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది..  ఒక్క హామీని కూడా రెండు ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదని నివేదికలో అభిప్రాయపడింది. నివేదికపై మరోసారి చర్చించి.. వివరాలు ప్రజలకు వెల్లిండించాలని నిర్ణయించారు.
ప్రత్యేక ప్యాకేజీ ఊసేలేదని కమిటీలో తేల్చినట్లు సమాచారం
పార్లమెంటు సాక్షిగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ విషయంలో బీజేపీ, టీడీపీలు ప్రజలను తప్పుదారి పట్టించాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.. హోదా స్థానంలో ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని ఇంతవరకూ ఇవ్వలేదని, బడ్జెట్లో ఇచ్చిన నిధులు రాష్ర్టాలకు ఇచ్చినట్లే ఏపీకీ కూడా  ఇచ్చారని కమిటీ  తేల్చింది. మరోవైపు  వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రపై కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పేర్కొనింది. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని నివేదికలో ఉన్నట్లు సమాచారం. లోటు బడ్జెట్‌పై రాష్ర్ట ప్రభుత్వం అడిగిన నిధుల్లోనూ భారీగానే కోత పెట్టిందని నివేదికలో తేల్చినట్లు తెలుస్తోంది.
బకాయిలపై నివేదికలో వెల్లడించినట్లు సమాచారం
రుణ విమోచన, పెన్షన్, డిస్కంల నష్టాల సర్దుబాటు, వేతన సంఘం బకాయిలు తదితర అంశాల్లో రాష్ర్ట ప్రభుత్వం అభ్యర్థనల్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదనే అంశం కూడా నివేదికలో పొందుపరిచినట్లు సమచారం. మెట్రో, పెట్రో కెమికల్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి కార్యక్రమాలు ఆచరణ సాధ్యం కావని కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేసిందని కమిటీ నిర్దారిచిందని తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై  రాష్ర్ట ప్రభుత్వానికి స్పష్టత లేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ విషయంలో  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ అన్యాయం చేశాయని... జేఎఫ్‌సీ నివేదికలో తేల్చినట్లు తెలుస్తోంది...

 

21:50 - March 2, 2018

గుంటూరు : విభజన హామీల అమలుకు పోరు ఉధృతం చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా.. కేంద్రంపై దశలవారీగా పోరాటం చేయాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. మార్చి 5 నుంచి పార్లమెంట్‌ వేదికగా నిరసనను హోరెత్తించాలని డిసైడ్‌ అయ్యారు.  అవసరమైతే న్యాయస్థానం మెట్లెక్కడానికి వెనుకాడబోమనీ తేల్చి చెప్పారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేసేందుకు సన్నద్ధమైనట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని... అందులో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చజరిగింది. విభజన హామీల సాధనకు ఏం చేయాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీల నుంచి ఒక్కొక్కరిగా అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు, విభజన చట్టంలోని హామీల అమలుకు ఎంపీలంతా ఐక్యంగా కృషి చేయాలన్నారు. విభజన జరిగి నాలుగేళ్లయినా ఆ గాయాలు నేటికీ మానలేదన్నారు. ప్రత్యేకహోదా వద్దని తానెప్పుడూ చెప్పలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అమలులో ఇబ్బందులు ఉన్నాయని... హోదాకు సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని హామీ నిచ్చినందునే ప్యాకేజీకి ఒప్పుకున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేకహోదా ఉండదనిచెప్పి... ఇప్పుడు కొనసాగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.  ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నందునే ఏపీకి అదే పేరుతో ఇవ్వాలన్న డిమాండ్‌ తెరపైకి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌పై చంద్రబాబు మండిపడ్డారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రాన్ని నిధులు అడగకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని... ప్రజా ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీకి హోదా ఒక్కటే చాలదని... విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయాలని.. వాటి అమలుకు ఎంపీలంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆదేశించారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం
ఏపీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పోరాటం ఉంటుందని టీడీపీ ఎంపీలు తేల్చి చెప్పారు. విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని గల్లా జయదేవ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. పార్లమెంట్‌ సాక్షిగా చేసిన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. వీటి అమలుకు అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు వెనుకాడబోమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల మద్దతు కూడగడతామని చెప్పారు. దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాయనున్నట్టు తెలిపారు.
పోరాటం ఉధృతం చేస్తాం : ఎంపీ తోట
ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుకు పార్లమెంట్‌ వేదికగా పోరాటం ఉధృతం చేస్తామని ఎంపీ తోట నరసింహం అన్నారు. పార్లమెంట్‌ లోపలా, బయటా నిరసన తెలుపుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనలతో తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కలిసికట్టుగా పోరాడుతాం : ఎంపీ రామ్మోహన్‌నాయుడు 
ఏపీ విభజన చట్టానికి సంబంధించిన 19 అంశాల అమలు కోసం టీడీపీ ఎంపీలమంతా కలిసికట్టుగా పోరాడుతామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. హోదా సాధన ఉద్యమంలో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. మొత్తానికి టీడీపీ ఎంపీలు ఈనెల 5 నుంచి పోరాటం మరింత ఉధృతం చేయాలని డిసైడ్‌ అయ్యారు. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
 

 

21:44 - March 2, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ సాయంత్రం ఫోన్‌ చేశారు. విభజన హామీలపై చర్చించుకుందామని తెలిపారు. ఈనెల 5న చర్చిద్దామని చంద్రబాబుకు సూచించారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీని చర్చలకు పంపుతామని చంద్రబాబు అమిత్‌షాకు చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ విభజన హామీలు అమలు చేయాలని అమిత్‌షాకు చంద్రబాబు స్పష్టం చేశారు.  పార్లమెంట్‌ వేదికగా విభజన హామీల అమలుకు పోరాడాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించిన నేపథ్యంలో అమిత్‌షా ఫోన్‌ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విభజన హామీలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. దీంతో 5న చర్చలు  ఎలా సాగుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏయే హామీలను కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఆసక్తి నెలకొంది. 

 

21:10 - March 2, 2018

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం కృషి చేశానని తెలిపారు. దళితులు, గిరిజనుల్లో ఆత్మస్థైర్యం నింపామని చెప్పారు. వారి అభివృద్ధి దోహదపడ్డానని పేర్కొన్నారు. తన నియోజకవర్గానికి పూర్తి కాలం కేటాయించేందుకు తనను మంత్రి పదవి నుంచి తొలగించారని భావిస్తున్నట్లు చెప్పారు. ఏ స్థాయికి వెళ్లినా కుల వివక్ష తప్పదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయికి వెళ్లినా వివక్ష తప్పదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. విభజన హామీలపై చర్చిద్దామని ఆహ్వానం పలికారు. 

తెలంగాణ భవన్ ను పేల్చేస్తామని ఫోన్ కాల్

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్ ను పేల్చేస్తామని ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

20:54 - March 2, 2018

ఇప్పటికిప్పుడు ఓట్లొస్తె జేఏసీకి ఇర్వై సీట్లు..కోదండరాం జేపిచ్చుకున్న ప్రత్యేక సర్వే, జానాబాబా నల్పైమంది దొంగల పంచాది...కేటీఆర్ను ఉతికి ఆరేస్తున్న కాంగ్రెసోళ్లు, పన్నెండు మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్..పోస్టు మార్టాలకే సరిపోతున్న భద్రాచలం దావఖాన, టీఆర్ఎస్ పార్టీతోని పొత్తువెట్టుకోవాల్సిందేనట...మొత్తుకుంటున్న మోత్కుపల్లి నర్సింహులు, అసెంబ్లీ ఎన్నికలకు ఆత్మలతోని ప్రచారాలు...బయోపిక్ లను దించుతున్న టీడీపీ.. వైసీపీ, వెంకట స్వామి కొడ్కు మీద చీటింగ్ కేసట..ఉప్పల్ పోలీసు స్టేషన్ల అన్మంతన్న ఫిర్యాదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్రమంత్రి సురేష్ ప్రభు కేటీఆర్ కు లేఖ రాశారు. స్పైసెస్ బోర్డు ఆఫీస్ లో తెలంగాణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని సురేష్ ప్రభు లేఖ రాశారు. పసుపు కొరకు ప్రత్యేకంగా స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు సహకరిస్తామని సురేష్ ప్రభు అన్నారు. 

20:28 - March 2, 2018

ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో టీడీపీ నేత పట్టాభిరామ్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ నేత సుందర్ రాంశర్మ, బీజేపీ నేత కోటేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. ఏపీ రాజకీయాలపై వాడీవేడీ చర్చ జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:19 - March 2, 2018

హైదరాబాద్ : రెండు మనసులను కలిపేది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం అన్న భేదం లేదు. అందుకే ప్రేమ ఖండాంతరాలు దాటుతోంది. హైదరాబాద్‌కు చెందిన అభినవ్‌ విదేశీ వనిత బియాంకను ప్రేమించాడు. వీరి పెళ్లికి ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో ఈ జంట  పెళ్లికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అభినవ్‌ త ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

20:15 - March 2, 2018

కరీంనగర్ : చట్టాలు ఎన్ని ఉన్నా దళితులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది...  కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రామచంద్రాపురంలో ఓ దళిత కుటుంబంపై ఆర్ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. మోజేష్‌ కుటుంబంపై జరిగిన దాడి ఘటనలో మన్యాల్ అనే యువకునికి కాలు విరిగింది.  ఆతను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. దాడి విషయం తెలుసుకున్న కుల వివక్ష పోరాట సమితి నాయకులు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దళిత కుటుంబంపై దాడిచేసిన  హిందూత్వ వాదులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 

 

20:12 - March 2, 2018

గుంటూరు : జిల్లాలోని బాపట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతుళ్ళు మృతి చెందారు. బాపట్ల పట్టణంలోని భీమునిగుంట వాగు వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. కోట్రావారి విధికి చెందిన కోట్రా శ్రీనివాస్‌రావు తన పెద్ద కూతురు లక్ష్మీ ప్రియాంకను కళాశాల నుంచి స్కూటీ పై ఇంటికి తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో లక్ష్మీ ప్రియాంక అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రావు మృతి చెందాడు. 

 

20:09 - March 2, 2018

సిద్దిపేట : అనంతగిరి, రంగనాయక ప్రాజెక్ట్‌లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.  పనులను వేగవంత చేయాలన్నారు.  వచ్చే వర్షకాలం నాటికి రైతులకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల పరిహారం వీలైనంత త్వరగా ముగించాలన్నారు.

 

20:05 - March 2, 2018

హైదరాబాద్ : రాజ్యసభ సీటును అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కేసీఆర్ బంధువు సంతోష్‌కు రాజ్యసభ సీటు ఇస్తున్నప్పుడు.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. టీఆర్ ఎస్, బీజేపీ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతోందన్న వీహెచ్.. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఓ పెద్ద డ్రామా అన్నారు. 

 

20:00 - March 2, 2018

గుంటూరు : విభజన హామీల అమలు కోసం.. రాజీలేని పోరాటం చేస్తున్నమని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఈమేరకు రామ్మోహన్ నాయుడితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. విభజన హామీల పోరాటంలో ఏ తప్పు చేయలేదని చెప్పారు. హామీల అమలు కోసం.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి పార్లమెంటులో తమ పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. 

 

19:49 - March 2, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ... శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  పిల్లలు, యువత కేరింతలతో ఏలూరి రోడ్లు సందడిగా మారాయి.

 

19:47 - March 2, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని బండి మెట్‌లో హోలీ వేడుకలు సందడిగా జరిగాయి. హోలీ వేడుకల్లో స్థానిక నేతలు పాల్గొన్నారు. చిన్న పిల్లలతో కలిసి తీన్మారు పాటలకు స్థానిక కార్పొరేటర్ అరుణ డాన్స్‌లు చేశారు. వయస్సుతో తేడా లేకుండా చిన్న పెద్ద అందురూ కలిసి హుషారుతో చిందులేశారు.

19:45 - March 2, 2018

తూర్పుగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. రాజమండ్రి మోరంపూడి సెంటర్‌లో జిల్లా పీసీసీ అధ్యక్షులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కార్యకర్తలు హైవేను దిగ్బంధించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీ స్ధాయిలో నిలిచిపోయాయి.  ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 6,7,8 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు నానాజీ తెలిపారు.
నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ రదారుల దిగ్బంధనం
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారులను దిగ్బంధించింది.  రాష్ర్టస్థాయి పిలుపులో భాగంగా కాంగ్రెస్ నాయకులు  చెన్నై-కలకత్తా ఐదో నెంబర్ జాతీయ రహదారితోపాటు.. నెల్లూరు-ముంబై నెంబర్ 565, నకిరేకల్-డోర్నాల జాతీయ రహదారులపై  వాహనాలను అడ్డుకున్నారు.. దీంతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పనబాక క్రిష్ణయ్య, దేవకుమార్ రెడ్డితోపాటు యువజన కాంగ్రెస్ అనుబంధ విభాగాలు పాల్గొన్నాయి.
విజయవాడలో వామపక్షాలు ధర్నా 
ఏపీకి ప్రత్యేక  హోదా ఆంధ్రుల హక్కు అంటూ.. వామపక్షాలు విజయవాడలో ధర్నా చేపట్టాయి. అలంకార్ చౌక్‌లో నిర్వహించిన  ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు...  వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినదించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు ప్రకటించారు. హోదావిషయంలో రాష్ర్ట ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కర్నూలులో కాంగ్రెస్ ఆందోళన
ప్రత్యేక హోదా డిమాండ్‌తో కర్నూలు తుంగభద్ర నది వద్ద బెంగళూరు హైవేపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు హైవేను దిగ్బంధించడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. వారిని తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు తోపులాట జరిగింది. పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేశారు. చంద్రబాబు దగా కోరు రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు. 

 

19:43 - March 2, 2018

భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మృతిచెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. కీలక నేతలు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 10 మంది ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పుల్లో పోలీస్‌ కమాండో సుశీల్‌ కూడా చనిపోయారు. ఇదే ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గాయపడ్డారు. 
12 మంది మావోయిస్టులు హతం
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భూపాలపల్లి జిల్లా నూగూరు, వెంకటాపురంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది  మవోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.  మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తోపాటు  సెంట్రల్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. మృతదేహాలను భధ్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ముగ్గురు పోలీసుల్లో వికారాబాద్‌కు చెందిన సుశీల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పది  ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన హరిభూషణ్‌
ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన హరిభూషణ్‌ది ఉమ్మడి వరంగల్‌ జిల్లా. కొత్తగూడ మండలం మడగూడెంకు చెందిన హరిభూషణ్‌ 20 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లాడు. పార్టీలో అంచలంచలుగా ఎదిగి తెలంగాణ సెంట్రల్‌ కమిటీలో పనిచేశాడు. గతంలో పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హరిభూషణ్‌... తాజా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. 
ఎప్పటి నుంచో హిట్ లిస్ట్‌లో ఉన్న హరిభూషణ్‌
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా హరిభూషణ్‌ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉత్తర తెలంగాణాలోని ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజన్‌లో కార్యకలాపాలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. అగ్రనేతగా ఎప్పటి నుంచో హిట్‌ లిస్టులో ఉన్న హరిభూషణ్‌ కోసం పలుమార్లు ప్రత్యేక ఆపరేషన్లు కూడా జరిగాయి. హరిభూషణ్‌పై దాదాపు 50 కేసులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు కూడా ఉంది.
చర్ల ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు
మరోవైపు చర్ల ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2016 మార్చి 2న ఇదే భద్రాద్రి-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్‌ మరణించినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు ప్రకటించాయి. కానీ తెలంగాణ పోలీసులు ఆ ప్రకటనను కొట్టిపారేశారు. అదే సమయంలో హరిభూషణ్‌ కీలక నేత కావడంతో ఆయనను రహస్య ప్రాంతంలో విచారించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రయత్నించిన పోలీసులు ఎట్టకేలకు చర్ల ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్ హతం అయినట్లు ప్రకటించారు.
ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్‌ 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వరంగల్ ఎంజీఎంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘ నేతలు పిటిషన్‌లో కోరారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్ట్ పార్ట్ మొత్తం వీడియో చిత్రీకరణ ద్వారా చేయాలని హైకోర్టు సూచించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఇద్దరు సీనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మృతదేహాలన్నింటినీ గుర్తించి వారి బంధువులకు అప్పగించని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
ఎన్‌కౌంటర్‌పై హత్యానేరం నమోదు చేయాలి : వరవరరావు  
ఎన్‌కౌంటర్‌పై హత్యానేరం నమోదు చేయాలని ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. చర్ల ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పటికే వరుస నిర్బంధాలతో ఉనికిని కోల్పోతున్న మావోయిస్టులకు ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలతో సహా 12 మంది కోల్పోవడం తీరని లోటే. 

 

19:41 - March 2, 2018

గుంటూరు : విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఏపీకి జరిగిన అన్యాయంపై దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు రాయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశాల్లోనైనా ఏపీకి న్యాయం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 

ప్రత్యేకహోదాతోపాటు 18 అంశాలపైనా పోరాటం : రామ్మోహన్‌నాయుడు

గుంటూరు : విభజనచట్టంలోని హామీల అమలుకు కేంద్రంపై దశలవారీగా పోరాడుతామని టీడీపీ ఎంపీలు తేల్చి చెప్పారు.  ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము పోరాటం చేయనున్నట్టు చెప్పారు. ప్రత్యేకహోదాతోపాటు 18 అంశాలపైనా తమ పోరాటం ఉంటుందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. 

 

ఈనెల 5 నుంచి పోరాడుతాం : ఎంపీ తోట నరిసంహం

గుంటూరు : ఈనెల 5 నుంచి మేము పోరాడుతామని టీడీపీ ఎంపీ తోట నరిసంహం అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రత్యేకహోదా వద్దని మేము ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. హోదా ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పినందునే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపచేస్తామన్నారు. పార్లమెంట్‌ లోపలా, బయటా మా ఆందోళన కొనసాగుతుందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామ తెలిపారు.

హామీల అమలుకు దశల వారీగా పోరాటం : గల్లా జయదేవ్‌

గుంటూరు : హామీల అమలుకు దశల వారీగా పోరాటం చేస్తామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. చట్టసభల్లో చేసిన చట్టాలను అమలు చేయడం లేదని తెలిపారు. దీనిపై అవసరమైతే కోర్టులకు వెళ్తామని చెప్పారు. ఇతర పార్టీల ఎంపీలకు లేఖలు రాస్తామని పేర్కొన్నారు.

 

19:06 - March 2, 2018

గుంటూరు : విభజనచట్టంలోని హామీల అమలుకు  కేంద్రంపై దశలవారీగా పోరాడుతామని టీడీపీ ఎంపీలు తేల్చి చెప్పారు.  ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము పోరాటం చేయనున్నట్టు చెప్పారు. టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమై.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు..  విభజన హామీల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. ప్రత్యేకహోదా వద్దని తాము ఎప్పుడూ అనలేదని.. అది ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నందునే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామన్నారు.  ఈనెల 5 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో సభను స్తంభింపచేస్తామన్నారు. పార్లమెంట్‌ బయటా, లోపలా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. చట్టసభల్లో చేసిన చట్టాలకు కూడా కేంద్రం విలువ ఇవ్వకపోవడం దారుణమన్నారు. అవసరమైతే దీనిపై న్యాయస్థానానికి వెళ్లడానికి తాము వెనుకాబడోమని స్పష్టం చేశారు. అన్ని పార్టీల ఎంపీలకు ఏపీకి జరిగిన అన్యాయంపై లేఖలు రాయనున్నట్టు చెప్పారు. 
గల్లా జయదేవ్‌..
'హామీల అమలుకు దశల వారీగా పోరాటం చేస్తాం. చట్టసభల్లో చేసిన చట్టాలను అమలు చేయడం లేదు. దీనిపై అవసరమైతే కోర్టులకు వెళ్తాం. ఇతర పార్టీల ఎంపీలకు లేఖలు రాస్తాం' అని అన్నారు.  
తోట నరసింహం..
'ఈనెల 5 నుంచి మేము పోరాడుతాం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మా పోరాటం కొనసాగుతుంది. ప్రత్యేకహోదా వద్దని మేము ఎప్పుడూ చెప్పలేదు. హోదా ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పినందునే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాం. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపచేస్తాం. పార్లమెంట్‌ లోపలా, బయటా మా ఆందోళన కొనసాగుతుంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం' అని తెలిపారు. ప్రత్యేకహోదాతోపాటు 18 అంశాలపైనా తమ పోరాటం 
ఉంటుందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. 

 

18:43 - March 2, 2018

తూర్పుగోదావరి : ప్రత్యేక హోదా ఉద్యమం రాజమహేంద్రవరంలో ఉధృతమైంది. తూర్పుగోదావరి జిల్లాలోని పలుప్రాంతాల్లో విపక్షపార్టీలు, ప్రజాసంఘాలు నిరసన దీక్షలు చేపట్టాయి.  ప్రత్యేకహోదా సాధన సమితి, వామపక్షాల  ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిరసన దీక్షకు దిగారు. ఈ దీక్షలకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 
ప్రత్యేక హోదా మా జన్మ హక్కు   
ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు.  విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. బస్సులోని మరికొంత మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

18:16 - March 2, 2018

సంగారెడ్డి : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. బస్సులోని మరికొంత మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

 

18:09 - March 2, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చర్ల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వరంగల్ ఎంజీఎంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘ నేతలు పిటిషన్‌లో కోరారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్ట్ పార్ట్ మొత్తం వీడియో చిత్రీకరణ ద్వారా చేయాలని హైకోర్టు సూచించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఇద్దరు సీనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మృతదేహాలన్నింటినీ గుర్తించి వారి బంధువులకు అప్పగించని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

17:40 - March 2, 2018

గుంటూరు : టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీల సాధనకు అనుసరించాల్సిన వ్యూహం.. ప్రజా ఆందోళనలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ పార్లమెంట్‌ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేసేలా ఒత్తిడి ఎలా తీసుకురావాలన్నదానిపై ఎంపీల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్లమెంట్‌ బయటా, లోపలా ఆందోళనలు నిర్వహించాలని ఎంపీలు అభిప్రాయం చెప్పినట్టు తెలుస్తోంది. విభజనతో ఏపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తలిగిందని.. నాలుగేళ్లైనా విభజన గాయాలు మానలేదని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ అన్యాయం చేస్తుందా అన్న భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఇక ప్రత్యేకహోదా వద్దని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. హోదాకు అడ్డంకులు ఉన్నాయని కేంద్రం చెప్పినందువల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించినట్టు చంద్రబాబు ఎంపీలకు వివరించారు. వేరే రాష్ట్రాలకు కూడా హోదా ఉండదని చెప్పినందువల్లే ప్యాకేజీకి అంగీకరించామన్నారు. హోదా సాధించేందుకు ఎంపీలంతా కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.

 

ప్రజల మనోభావాలను కేంద్ర గౌరవించాలి : టీడీపీ

ఢిల్లీ : ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించాలని టీడీపీ నేతలు కోరారు. ఇప్పటికై విభజన హామీలు అమలు చేయాలన వారు కోరుతున్నారు.

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చూసేందుకు వస్తున్న బంధువులు

భద్రాద్రి : మావోయిస్టు అగ్రనేత అగ్రనేత హరిభూషణ్ ప్రభుత్వ ఆసుపత్రికి సోదరుడు విజయ్, సోదరి భారతి వచ్చారు. 

ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

గుంటూరు : టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీల సాధనకు అనుసరించాల్సిన వ్యూహం.. ప్రజా ఆందోళనలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ పార్లమెంట్‌ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేసేలా ఒత్తిడి ఎలా తీసుకురావాలన్నదానిపై ఎంపీల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు. 

16:47 - March 2, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదికి అమెరికాలో ఊరట లభించింది. ఫాయర్‌స్టార్‌ డైమండ్‌ కంపెనీ తీసుకున్న రుణాల వసూళ్లపై అమెరికా కోర్టు స్టే విధించింది. తమ కంపెనీ దివాళా తీసిందని ప్రకటించిన ఫాయర్‌ స్టార్‌ కంపెనీ... దివాళా చట్టాన్ని ఆశ్రయించి రక్షణ పొందింది. మరోవైపు నీరవ్‌ మోదీ తమ దేశంలో ఉన్నట్లు ధృవీకరించలేమని అమెరికా స్పష్టం చేసింది. నీరవ్‌పై దర్యాప్తులో భారత అధికారులకు తమ న్యాయశాఖ సహాయపడుతుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కాంలో  నీరవ్‌ మోది, ఆయన మామ మెహుల్‌ చోక్సీ 12 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని వివిధ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్‌ మోది న్యూయార్క్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోంది.

 

16:43 - March 2, 2018

ముంబై : బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ హోలీ వేడుకల్లో పాల్గొన్నది. గురువారం రాత్రి 12 గంటలకు బిగ్‌బీ ఇంట్లో విధి విధానంతో హోలికా దహన్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జయాబచ్చన్‌ అమితాబ్‌ బచ్చన్‌ నుదిటిన తిలకం పెట్టారు. అందరూ కలిసి గుజియా స్వీట్‌ను ఆరగించారు. ఈ వేడుక‌ల్లో అమితాబ్‌, జ‌యా బ‌చ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్‌ బచ్చన్‌ కనిపించలేదు. హోలికా దహన్‌కు సంబంధించిన ఫొటోలను అమితాబ్‌ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

 

16:41 - March 2, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అబ్బాస్ నక్వి ఇంట్లో హోలీ వేడుకలను నిర్వహించారు. రాజ్‌నాథ్‌ తన ఇంట్లో ఉద్యోగులతో కలిసి హోలి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో హోలికా దహన్‌లో బాగంగా ప్రజలు నిప్పులపై నడిచారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఉన్న పర్మర్త్ నికేతన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్‌లో హోలీ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. 

 

16:39 - March 2, 2018

విశాఖ : నగరంలో నారా బ్రాహ్మణి సందడి చేశారు.  మహిళా పారిశ్రామిక వేత్తల కోసం నిర్వహిస్తున్న వర్క్‌ షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  లిస్టెడ్ కంపెనీలలో ఉమెన్ డైరెక్టర్ ఉండాలన్న నియమంతో  మహిళలకు మేలు జరుగుతోందన్నారు బ్రాహ్మణి. ప్రస్తుతం మనదేశంలో బోర్డ్‌ రూమ్ కంట్రి బ్యూషన్‌లో మహిళల పాత్ర చాలా తక్కువగా ఉందన్నారు. స్వీడన్ లాంటి దేశాల్లో  సుమారు 40 శాతం ఉందని చెప్పారు. కానీ భవిష్యత్తులో రాష్ర్టంలో బోర్డ్‌ రూమ్‌లలో మహిళల ప్రాధాన్యం పెరుగుతుందన్న ఆశాభావాన్ని నారా బ్రాహ్మణి వ్యక్తం చేశారు. 

16:31 - March 2, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిందని... నాలుగేళ్లయినా ఆ గాయాలు మానలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ పోయింది... వీళ్లూ అన్యాయం చేస్తారా అనేది ప్రజల ఆవేదన అన్నారు. 'హోదా వద్దని మనం ఎక్కడా, ఎప్పుడూ అనలేదు' అని చంద్రబాబు అన్నారు. హోదాకు అడ్డంకులు ఉన్నాయని అన్నందువల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించామని తెలిపారు. వేరే రాష్ట్రాలకు కూడా హోదా ఉండదని చెప్పినందువల్లే ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. ఎంపీల ఒక్కొక్కరి అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకుంటున్నారు. 
 

సంగారెడ్డి ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి : జిల్లా కంది మండలం ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గరు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. 

ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్ పౌరహక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం మృతదేహాలను వరంగల్ లో ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరడంతో భద్రాచలం ప్రభుత్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

16:00 - March 2, 2018

విశాఖ : నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా నగరవాసులందరూ విశాఖ బీచ్‌ వద్దకు చేరుకొని హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ యూత్‌ ఎంజాయ్‌ చేస్తోన్నారు. వైఎంసీలో హోలీ సంబరాలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

15:56 - March 2, 2018

కరీంనగర్‌ : జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వాహకులు బంద్ పాటిస్తున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ భారత చలన చిత్ర పరిశ్రమల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, గోదావరిఖనిలో సుమారు 40కి పైగా థియేటర్లు మూతబడ్డాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 8 థియేటర్లలో ఉన్న మూడు ఏషియన్ సినిమా థియేటర్ల నిర్వాహకులు సైతం బంద్ పాటిస్తున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సినిమా థియేటర్ల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. 

15:54 - March 2, 2018

కృష్ణా : డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తీరును నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల చిత్ర పరిశ్రమ థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. సర్వీస్‌ ప్రొవైడర్ల విధానాలతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో...డిజిటల్‌ ప్రొవైడర్స్‌ చార్జీలు తగ్గించేవరకు బంద్‌ కొనసాగిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెబుతున్నారు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ పాటిస్తామని అంటున్నారు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్ల బంద్‌పై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

 

15:41 - March 2, 2018

గుంటూరు : కేంద్రంపై వైసీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం, రాజీనామాలతో రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదంతా ఓ డ్రామా అని  వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు. ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతోనే ఏప్రిల్‌ 6న రాజీనామా చేస్తామని అంటున్నారని విమర్శించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడే రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని జేసీ సవాల్‌ విసిరారు. అవిశ్వాసం, రాజీనామాలతో ప్రయోజనం ఉండదని సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ చెప్పారు. 

 

15:36 - March 2, 2018

హైదరాబాద్ : చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్‌ కౌంటర్‌పై విచారణ జరిపించాలంటూ హై కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మృతదేహాలను భద్రపరిచి న్యాయనిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషన్‌ వేశారు. వరంగల్‌ ఎమ్‌జీఎమ్‌లో గాని గాంధీ మార్చురీలోగాని పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషన్‌ వేశారు నేతలు. అలాగే ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పిటిషన్‌ను హై కోర్టు విచారణకు స్వీకరించింది.

 

15:25 - March 2, 2018

భూపాలపల్లి : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భూపాలపల్లి జిల్లా నూగూరు-వెంకటాపురంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మవోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తోపాటు సెంట్రల్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ముగ్గురు పోలీసుల్లో వికారాబాద్‌కు చెందిన సుశీల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 తుపాకులు సహా పది ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 
హరిభూషణ్ ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసి
ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన హరిభూషణ్‌ది ఉమ్మడి వరంగల్‌ జిల్లా. కొత్తగూడ మండలం మడగూడెంకు చెందిన హరిభూషణ్‌ 20 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లాడు. పార్టీలో అంచలంచలుగా ఎదిగి తెలంగాణ సెంట్రల్‌ కమిటీలో పనిచేశాడు. గతంలో పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హరిభూషణ్‌... తాజా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. హరిభూషణ్‌ భార్య జజ్జరి అలియాస్‌ సమ్మక్క, అలియాస్‌ స్వర్ణక్క మావోయిస్టు ఉద్యమంలో పని చేశారు. అనారోగ్య కారణంలో 2009లో పోలీసులకు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కొనసాగుతున్నారు. 
 

కొనసాగుత్ను టీడీపీ పార్లమెంటరీ భేటీ

గుంటూరు : టీడీపీ పార్లమెంటరీ భేటీ కొనసాగుతుంది. సమావేశంలో చంద్రబాబు ఎంపీల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అన్యాయం చేసింద కాబట్టి కాంగ్రెస్ పోయిందని వీళ్లూ అన్యాయం చేస్తారా అనేది ప్రజల ఆవేదనని చంద్రబాబు అన్నారు.

అన్ని కేంద్ర పరిశీలనలో ఉన్నాయి : హరిబాబు

విశాఖ : ఏపీకి సంబంధించి రెవెన్యూ, దుగ్గరాజపట్నం ఓడరేవు, స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ అంశాలు పెండింగ్ లో ఉన్నాయిని, ప్రత్యేక హోదాతో పన్ను రాయతీలు వస్తాయనుకోవడం తప్పని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. సాంకేతిక సమస్యలతో దుగ్గరాజపట్నం ఓడరేవు ఆగిందని హరి బాబు తెలిపారు. 

రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి

గుంటూరు : రాజధాని నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. రాజధాని రోడ్లతో పాటు అన్ని మౌలిక వసతులు ఒకేసారి కల్పిస్తామని, మొత్తం 340 కి.మీ మేర రోడ్ నెట్ వర్క్ ఉంటుందని, ఇప్పటికే 220 కి.మీ రోడ్ పనులు వేగంగా జరగుతున్నాయని మంత్రి తెలిపారు. 

13:45 - March 2, 2018
13:44 - March 2, 2018

భూపాలపల్లి : జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం అనంతరం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సంఘం తరపు న్యాయవాది టెన్ టివితో మాట్లాడారు. బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

హోదా వద్దని ఎప్పుడు అనలేదు : చంద్రబాబు

గుంటూరు : ఏపీ ప్రత్యేక హోదా వద్దని ఎప్పుడు అనలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హోదాకు అడ్డంకులు ఉన్నాయని అన్నందువల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించామని ఆయన తెలిపారు. 

13:37 - March 2, 2018

వచ్చే వేసవి మండిపోనుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఎండ ఎక్కువగా ఉందని పని చేయడం మానెస్తామా లేదు పని చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో బయటకు వెళ్లే ముందు కడుపు నిండ తినాలి. అది కూడా మసాల, ఫ్రై కర్రీస్ కాకుండా నీరు ఉండే పదార్థలు తీసుకోవాలి. అలాగే నల్లటి దుస్తువులు కాకుండా తెల్లవి కానీ ఇతర రంగు దుస్తువులు ధరించాలి. దుస్తువులు కూడా పలుచగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండలో ఎక్కువ సేపు ఉంటే శీతాల పనీయలు కాకుండా కొబ్బరి నీళ్లు, చెఱకు రసం, సోడ, జ్యూస్,కరబుజ, కీరదోస వంటివి తీసుకోవాలి. ప్రతి అర గంటకు నీరు తాగాలి ఇలా చేస్తే శరీరానికి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. 

కొనసాగుతున్న టీడీపీ పార్లమెంటరీ భేటీ

గుంటూరు : టీడీపీ పార్లమెంటరీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, పార్లమెంట్ లో ఎంపీలు అనుసరించాల్సిన అంశం వారు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

13:20 - March 2, 2018

హైదరాబాద్ : టిడిపి కోసం సర్వం త్యాగం చేయడం జరిగిందని, పార్టీలో పటిష్టమైన నాయకత్వం లేదని టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. తెలంగాణలో టి.టిడిపి ప్రతిష్ట రాను రాను దిగజారుతోందన్నారు. పొత్తు పెట్టుకోవాల్సినవసరం ఉంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని మరోసారి పేర్కొన్నారు. ఈ విషయంలో బాబు పేర్కొనడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తనను పిలవకపోవడం చాలా బాధ ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎవడికి భయపడే వ్యక్తిని తాను కాదని..పేద ప్రజలకు ఏదైనా సమస్య వస్తే గొంతెత్తే వాడినన్నారు. తనకు ఏమి ఇచ్చినా..బాబు తమ్ముడేనని తెలిపారు. మోత్కుపల్లిని కాదని..తనను పిలవకుండా సమావేశం పెట్టారని, తనకు ఏదైనా జరిగితే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిననంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూడాలన్నారు. సరైన నాయకత్వం..పటిష్టమైన నాయకత్వం లేదని..కమిట్ మెంట్ లేని నాయకత్వం ఉండడం వల్ల పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. పార్టీని ముంచేసి వెళ్లిపోయిన వ్యక్తిపై గురించి ఎవరూ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డిని తాను అనేక సార్లు మందలించానన్నారు. ఓటుకు నోటు కేసులో పార్టీ పరువును బజారున పడేశారని,

బాబుపై ఈగల వాలితే ఊరుకోనని...కానీ ఆయనకు దీని ద్వారా మచ్చ వచ్చిందని..ఆ సమయంలోనే రేవంత్ ను వెళ్లగొడితే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. పది లక్షల మంది క్యాడర్ పరిస్థితి ఎవరు చూస్తారని, ప్రతాప్ రెడ్డిని నెల రోజుల పాటు జైల్లో పెట్టారని..ఈ సమయంలో ఉద్యమం చేయాల్సినవసరం లేదా ? అని ప్రశ్నించారు. నాయకత్వం లోపం వల్ల ఇదంతా జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి..జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. 

టీ-టీడీపీలో పటిష్ట నాయకత్వం లేదు : మోత్కుపల్లి

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి పటిష్ట నాయకత్వం లేదని సీనియర్ టీడీపీ నేత మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని మోత్కుపల్లి తెలిపారు. టీ-టీడీపీ రేవంత్ రెడ్డితో భ్రష్టుపట్టుకుపోయిందని విమర్శించారు.

13:14 - March 2, 2018

సౌరబ్ గంగూలీ తన ఆత్మ కథ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ లో ఆసక్తికార విషయాలను తెలిపారు. తన టెస్టు అరంగేట్రం ఇగ్లాండ్ తో 1996 లో జరిగింది. అప్పుడు లార్డ్స్ లో టెస్టు ఆడుతున్నపుడు టీ సమయానికి తన సెంచరీ చేశానని, టీ విరామం కోరకు డ్రెసింగ్ రూం వెళ్లి బ్యాడ్స్ విప్పి కూర్చోని ఉండగా తన వద్ద టీ వచ్చిందని గంగూలీ తెలిపారు. టీ తాగుతూ బ్యాట్ హ్యాండిల్ సరిచేసుకుంటుండగా సచిన వచ్చి బ్యాట్ సంగతి నేను చూస్తా నువ్వు టీ తాగు అన్నాడని గంగూలీ తన ఆత్మకథలో రాసుకొంచారు.

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహదుల్లో ఎన్ కౌంటర్

భూపాలపల్లి : తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహాద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సుశీల్ కుమార్ ది వికారాబాద్ జిల్లా మేకవనంపల్లి వాసి పోలీసులు తెలిపారు. 

టీడీపీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం

గుంటూరు : టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రలు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు, రాష్ట్రమంత్రులు యనమల, సోమిరెడ్డి, నారాయణ, దేవినేని ఉమ హాజరైయ్యారు. 

జూన్ నెలకు శ్రీవారి ఆర్జీత సేవా టికెట్లు విడుదల

చిత్తూరు : జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆన్ లైన్ ఆర్జీత సేవా టికెట్లు టీటీడీ విడుదల చేసింది. 56,424 టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని, నెలాఖరులోపు సర్వదర్శనం టైమ్ స్లాడ్ కౌంటర్లు ప్రారంభిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. 

12:48 - March 2, 2018

ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అంటూ నెల్లూరు జిల్లా వాసులు నినదిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సామాన్యుడి నుండి ప్రజా ప్రతినిధులు..మేధావులు రగిపోతున్నారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ సమర శంఖాన్ని పూరిస్తున్నారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని...జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నెల్లూరు జిల్లా వాసులు..ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:33 - March 2, 2018

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో సమన్వయ భేటీ జరిగింది. గురువారం ఉదయం సీఎం నివాసం పక్కనే గ్రీవెన్స్ సెల్ లో జరుగుతున్న ఈ సమావేశంలో టిడిపి ఎంపీలు పాల్గొన్నారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా..కేంద్రంపై వత్తిడి..వైసీపీ అవిశ్వాస తీర్మానం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీల ఎంపీల్లో కొంతమంది మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై మేం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని ఎంపీ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అంచెలంచెలుగా వ్యూహాన్ని అమలు చేస్తామని, ఎంపీల రాజీనామాలతో ఒరిగేదేమీలేదని టీజీ విమర్శించారు. విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏదో ఒక నిర్ణయం తప్పదని తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం పేర్కొన్నారు.

ఏదో ఒక నిర్ణయం తప్పదన్న ఎంపీ తోట...

విజయవాడ : విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏదో ఒక నిర్ణయం తప్పదని టిడిపి ఎంపీ తోట నరసింహం పేర్కొన్నారు.

హామీలన్నీ నెరవేర్చాల్సిందే - టీజీ వెంకటేష్...

విజయవాడ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని ఎంపీ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అంచెలంచెలుగా వ్యూహాన్ని అమలు చేస్తామని, ఎంపీల రాజీనామాలతో ఒరిగేదేమీలేదని టీజీ విమర్శించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై హరీశ్ సమీక్ష...

సిద్ధిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష చేపట్టారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఎన్ కౌంటర్ లో వికారాబాద్ కానిస్టేబుల్ వాసి మృతి...

భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలం సరిహద్దులోని తడపలగుట్ట-పుజారి కాంకేడు అటవీప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ సైతం మృతిచెందాడు. 

12:17 - March 2, 2018

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో వికారాబాద్ జిల్లాలోని మేకవనంపల్లికి చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిదే. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ తో పాటు అతని భార్య సమ్మక్క, సెంట్రల్ కమిటీ సభ్యులున్నారు.

భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట - పూజారి కాంకేడు సరిహద్దులో తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:56 - March 2, 2018

ఎన్ కౌంటర్ పై లంచ్ మోషన్ పిటిషన్

హైదరాబాద్ : భూపాలపల్లి ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పౌరహక్కుల నేతలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. వారి పిటిషన్  హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. 

11:48 - March 2, 2018

శ్రీదేవి మృతిపై , ఆమె జీవితంపై వచ్చిన మీడియా, సోషల్ మీడియాలో అనేక కథనలు వచ్చాయి. దీనిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై నటి అమల స్పందించారు. సోషల్ మీడయాలో ఓ పోస్ట్ పెట్టారు. నా జీవితాన్ని నాకు వదిలేయండి, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వండి, అంటూ భావోద్వేగ పోస్టు చేశారు. నాకెంత జుట్టు ఉందన్న విషయం గురించే పట్టించుకుంటారు కానీ, నాకున్న జ్ఞానాన్ని గుర్తించరు. కెమెరాలు ఓ మనిషి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా చూపించగలుగుతాయా? నేను ఎలా వంట చేస్తాను? వంటి విషయాలు అడగకుండా నన్ను ప్రశాంతంగా అర్థవంతమైన విషయాలపై చర్చించనిస్తారా?' అని ఆమె ప్రశ్నించారు.

బిక్షం వేస్తే ఏపీ అభివృద్ధి చెందదు

గుంటూరు : ఏపీకి రూ.10 బిక్షం వేస్తే అభివృద్ధి చెందదని, రైల్వేజోన్ కి సంబంధించి మహా అయితే రూ.10 కోట్లు బిల్డింగ్స్ కు అవుతాయని అది కూడా కేంద్రం ఇవ్వలేకపోతుందని ఎంపీ జేసీ అన్నారు.  రాజీనామాలతో  ఒరిగేదేమీలేదని ఎంపీల రాజీనామాలతో కేంద్ర దిగిరాదని ఆయన తెలిపారు. 

11:39 - March 2, 2018

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్, సెంట్రల్ కమిటీ సభ్యులున్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుశీల్ రెడ్డి అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇటీవలి కాలంలో ఇది పెద్ద ఎన్ కౌంటర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని..గురువారం రాత్రి మావోయిస్టులను పట్టుకుని అడవిలో కాల్చి చంపేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట - పూజారి కాంకేడు సరిహద్దులో మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో తెలంగాణ - ఛత్తీస్ గడ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది : సీఎం రమేష్

గుంటూరు : కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. జగన్ తన ఎంపీల రాజీనామాకు ఎందుకు గడువు పట్టారని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసంతో ఒరిగేదిలేదని రమేష్ స్పష్టం చేశారు.

కేంద్ర తీరు సంతృప్తిగా లేదు : రామ్మోహన్

గుంటూరు : కేంద్రం తీరు సంతృప్తిగా లేదని, ఎంపీల ఆందోళన తర్వాత కూడా ఫలితం కనిపించలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంట్ ఆందోళన మరింత ఉధృతం చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

11:32 - March 2, 2018

హైదరాబాద్ : సినిమా థియేటర్లు బోసిపోయాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. ఈ సందర్భంగా థియేటర్ల బంద్ కారణంగా ఎలాంటి పరిస్థితి నెలకొన్నందనే విషయం తెలుసుకొనేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్యా థియేటర్ వద్దకు టెన్ టివి వెళ్లింది. థియేటర్ కు రూ. 50వేలు, ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా రూ. 25వేలు నష్టమొస్తుందని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. థియేటర్ల మూసివేత కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:31 - March 2, 2018

అతిలోక సుందరి శ్రీదేవి నటి మాత్రమే కాదు మంచి కాళాకరిణి కూడా ఆమె ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేస్తుండేవారట. ఓ సారి సొనమ్ కపూర్ నటించిన సావరియా చిత్రంలోని ఓ ఫొటో శ్రీదేవికి బాగా నచ్చి దాన్ని అందమైన పెయింటింగ్ గా అవిష్కరించరట. అంతేకాదు పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ పాటు చాలా బొమ్మలను శ్రీదేవి పెయింటింగ్ వేశారట. ఇప్పుడు వాటిని వేలం వేయనున్నారు. వాటికి వచ్చిన డబ్బులను చారిటబుల్ ట్రస్ట్ కు అందించనున్నారు.  

11:19 - March 2, 2018

విజయవాడ : వైసీపీ ఎంపీలకు టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడే రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జేసీ సవాల్ విసిరారు. ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే గ్రీవెన్స్ సెల్ లో టిడిపి ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై వైసీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం..రాజీనామాలతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని పేర్కొన్నారు. ఇదంతా ఓ డ్రామా అని, ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతోనే ఏప్రిల్ ఆరో తేదీన రాజీనామాలు చేస్తామని వైసీపీ పేర్కొంటోందన్నారు. 

11:19 - March 2, 2018

దర్శకుడు బోయపాటి హీరోలకు సమానంగా రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ తో ఆయన ఓ చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైంది. రెండవ షెడ్యూల్ ను ఈ నెల 6నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకు ముందు ఆయన పారితోషికం రూ.10గా ఉండేది. 

11:01 - March 2, 2018

కడప : 'ప్రత్యేక హోదా మా జన్మ హక్కు' అంటూ కడప జిల్లా వాసులు నినదిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సామాన్యుడి నుండి ప్రజా ప్రతినిధులు..మేధావులు రగిపోతున్నారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ సమర శంఖాన్ని పూరిస్తున్నారు. కరవు కాటకాలతో జీవనం సాగిస్తున్న కడప జిల్లా వాసులపై మొండి చూపడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని...జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కడప జిల్లా వాసులు..ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:59 - March 2, 2018

రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారని అందరు అనుకుంటే రజనీ మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో 2.0 ముగియగానే ఆయన మరో చిత్రం చేయనున్నారు. అదే 'కాలా' ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో రజనీ కొత్త గేటప్ లో కనిపించారు. ఆ గ్యాంగ్ స్టార్ ఇతివృత్తంతో ఈ చిత్రం తీయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ పా రంజీత్ దర్శకత్వం వహించనున్నారు.

10:59 - March 2, 2018

విశాఖపట్టణం : సినిమా థియేటర్లు బోసిపోతున్నాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిదే. ఇంగ్లిష్‌ సినిమాకు లేని వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు తెలుగు సినిమాకు ఎందుకని జేఏసీ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. విశాఖపట్టణంలో పరిస్థితిని తెలుసుకొనేందుకు వీడియో క్లిక్ చేయండి. 

10:50 - March 2, 2018

ఇంటలిజెంట్ దర్శకుడు సుకుమార్, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కాంబినెషన్ లో వస్తున్న మూవీ రంగస్థలం. అసలు రంగస్థలం అనే ఊరు ఉందా అంటే లేదని సమాధానం ఇవ్వాలి అంటే ఈ సినిమా 90 శాతం షూటింగ్ సెట్స్ లో చేసినవే.మిగతా 10 శాతం ఏపీలో తీశారు. సినిమా 90 శాతం సెట్స్ లో అంటే సెట్స్ వేయడానికి భారీగా ఖర్చుఅయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో రోజుకు రోజుకు అంచనాలు పెరిగిపపోతున్నాయి. దానికి కారణం రిసెంట్ రిలీజైన ఎంత సక్కగున్నావే పాట. ఈ పాటతో ఈ మూవీపై క్రేజ్ మరింత పెరిగింది. రంగస్థలం మూవీని ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉంది.

10:43 - March 2, 2018

సినిమా ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ కుటుంబం నుంచి మరో వ్యక్తి వస్తున్నారు. అతనే మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ బాబు. రమేష్ బాబు మహేష్ బాబు కంటే ముందుగానే సినీ పరిశ్రకు వచ్చిన వరుస పరాజయాలతో ఆయన సినిమాలకు దూరమయారు. కానీ ఆయన కొడుకును త్వరలో సినీ పరిశ్రమకు పరిచయం చేయనున్నారు. జయకృష్ణ ఇప్పటికే సత్యనంద్ దగ్గర నటన శిక్షణ తీసుకున్నాడు. 

10:41 - March 2, 2018

2003 వరల్డ్ కప్ ధోనీ ఉంటే బాగుడేందని మాజీ కెప్లెన్ సౌరభ్ గంగూలీ అన్నారు. తను 2004లో ధోనీ గురించి తెలుసుకున్నానని అప్పుడు ధోనీ టీసీ గా పని చేస్తున్నాడని తెలిసిందని గంగూలీ తన ఆత్మకథలో రాసుకున్నాడు. 2001లో కలకాత్తాలో ఆస్ట్రేలియాపై విజయం తన జీవితంలో మారుపురానిదని గంగూలీ రాసుకొచ్చాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కామెంటెటర్ గా ఉన్నానని కాని జట్టు విజయ క్షణాల్లో తను కామెంటెటర్ గా చేయాలేనని చెప్పి బౌండ్రి లైన్ లో నిల్చూన్నాని గంగూలీ తన పుస్తకంలో తెలిపారు.

 

10:38 - March 2, 2018

టిడిపి సమన్వయ భేటీ..లెటెస్ట్ న్యూస్...

ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్

హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలోన్ని సినిమా థియేటర్లు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఇంగ్లీష్ సినిమాలకు లేని వర్చువల్  ప్రింట్ ఫీజ్ ప్రాంతీయ చిత్రాలకు వసూలు చేస్తున్న డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వీపీఎఫ్ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్ కొనసాగుతుంది నిర్మాత మండలి నిర్ణయం తీసుకుంది.

కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ భేటీ

గుంటూరు : కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ ప్రారంభం కానుంది. ఈ నెల 5నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పున: ప్రారంభం నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అమిత్ షాతో భేటీ వివరాలను ఎంపీ రామ్మోహన్ నాయుడు సీఎంకు వివరించనున్నారు. 

12 మంది మావోయిస్టుల మృతి...

ఖమ్మం : భూపాలపల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత హరికిషన్ తో పాటు పలువురు సెంట్రల్ కమిటీ సభ్యులున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

10:14 - March 2, 2018

ఖమ్మం : భూపాలపల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత హరికిషన్ తో పాటు పలువురు సెంట్రల్ కమిటీ సభ్యులున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయడం లేదు. ఆసుపత్రికి మొత్తం మృతదేహాలను తరలించిన అనంతరం విలేకరుల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం.

భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట - పూజారి కాంకేడు సరిహద్దులో మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీనితో తెలంగాణ - ఛత్తీస్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులతో అడవి దద్ధరిల్లింది. మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని..ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారని తెలుసుకున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుండి ఏకే 47 ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

ఎన్ కౌంటర్ బూటకం - వరవరరావు...

హైదరాబాద్ : భూపాలపల్లి ఎన్ కౌంటర్ బూటకమని విరసం నేత వరవరరావు వ్యాఖ్యానించారు. మావోయిస్టులను పట్టుకొచ్చి తెలంగాణ - ఛత్తీస్ గడ్ లో చిత్రహింసలకు గురి చేసి చంపారని ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 

దేశ వ్యాప్తంగా హోలీ...

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. హోలీలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో ఘనంగా హోలీ సంబరాలు జరిగాయి. 

పెరిగిన మావోయిస్టుల మృతుల సంఖ్య...

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. 

టిడిపి సమన్వయ భేటీ...

విజయవాడ: కాసేపట్లో టిడిపి సమన్వయ భేటీ జరుగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగనుంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలపై రానున్న రోజుల్లో ఎలాంటి పోరాటం..కేంద్రంపై ఎలాంటి వత్తిడి తేవాలనే దానిపై చర్చించనున్నారు. 

09:15 - March 2, 2018

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలపై రానున్న రోజుల్లో ఎలాంటి పోరాటం..కేంద్రంపై ఎలాంటి వత్తిడి తేవాలనే దానిపై ఏపీ టిడిపి తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కీలక నేతలు..పార్టీ ప్రజాప్రతినిధులతో బాబు చర్చలు జరుపుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి టిడిపి సమన్వయ భేటీ జరుగనుంది. గురువారం ఉదయం సీఎం నివాసం పక్కనే ఉన్న గ్రీవెన్స్ హాల్లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి టిడిపి ఎంపీలు హాజరు కానున్నారు.

కేంద్రంపై ఎలాంటి వత్తిడి తేవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. గత పార్లమెంట్ లో అనుసరించాల్సిన పోరాటాన్ని కొనసాగించాలని ఏపీ టిడిపి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు పెట్టబోయే అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కానీ అవిశ్వాస తీర్మానం అనేది చివరి అస్త్రంగా ఉండాలని బాబు ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షాతో భేటీ అయిన ఎంపీ రామ్మోహన్ నాయుడు సమావేశానికి సంబంధించిన వివరాలను బాబుకు వివరించనున్నారు. మొత్తానికి ఉభయ సభల్లో పోరాటం కంటిన్యూ చేయాలని బాబు సూచించనట్లు సమాచారం. భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి.  

09:11 - March 2, 2018

ఖమ్మం : మళ్లీ అడవిలో అలజడి రేగింది. మావోయిస్టుల ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్న పోలీసులకు చుక్కెదురైంది. మావోయిస్టుల కదలిక ఉందని గ్రహించిన పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ - ఛత్తీస్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురంలో మావోయిస్టులు తారపడ్డారు. వెంటనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అశ్వాపురంలో ఇటీవలే ఇద్దరిని కాల్చి చంపిన మావోయిస్టులు ప్రొక్లెయిన్లరను దగ్ధం చేశారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ల ద్వారా భద్రాచలానికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఏడుగురు మావోయిస్టుల మృతి...

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

08:18 - March 2, 2018

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడుపకండి...డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కఠిన నిబంధనలు అమలు చేస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు ఎన్నిమార్లు హెచ్చరించిన మందుబాబులు మారడం లేదు. ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పలు ప్రమాదాలకు కారణమౌతున్నారు. తాజాగా నవీన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తప్ప తాగి కారు నడుపడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బేగంపేటలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి బేగంపేటలో యూ టర్న్ తీసుకుంటున్న ఆటోను నవీన్ కారు ఢీకొట్టింది. దీనితో ఆటో డ్రైవర్ రఫీక్ అక్కడికక్కడనే మృతి చెందాడు. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో నవీన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. 

08:13 - March 2, 2018

హైదరాబాద్ : ఫలక్ నుమాలో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. రౌడీషీటర్ ను ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రౌడీషీటర్ గా నమదైన ఈసా రాత్రి సమయంలో ఫలక్ నుమాలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద నుండి వెళుతున్నాడు. జావీద్, నవీన్ లు తల్వార్ లు..కత్తులతో వెంటాడి..ఈసాను చంపేశారు. తన సోదరుడి భార్య ఈసా వద్ద ఉందని...జవీద్, నవీద్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

మద్యం మత్తులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్..వ్యక్తి మృతి...

హైదరాబాద్ : బేగంపేటలో ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో షాపూర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ రఫీక్ మృతి చెందాడు. మద్యం మత్తులో సాప్ట్ వేర్ ఇంజినీర్ కారును నడపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

08:01 - March 2, 2018

విభజన హామీలు..ప్రత్యేక హోదాపై ఏపీలోని విపక్షాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారపక్షమైన టిడిపిపై విమర్శల దాడి చేస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. దీనికి టిడిపి ఎంపీలు మద్దతివ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), బి.వి.కృష్ణ (సీపీఎం), శ్రీరాములు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:47 - March 2, 2018

వెబ్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న పోర్న్‌ సైట్స్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చిన్నారులను, యువతను పెడదోవ పట్టిస్తున్న పోర్న్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో పోర్న్‌ సైట్స్‌ నిషేధించే వరకు పోరాడతాం అంటున్నారు. అటు మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం నిరాహారా దీక్షలకు సిద్ధమవుతున్నాయి మహిళా సంఘాలు. ఈ విషయాలపై ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:45 - March 2, 2018

ఢిల్లీ : లోక్‌పాల్‌ సమావేశానికి తాము హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ప్రధానికి లేఖ రాశారు. తనను ప్రత్యేక ఆహ్వానితుడిగా సమావేశానికి ఆహ్వానించడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి వ్యతిరేక కమిటీ సమావేశానికి ప్రతిపక్ష నేతను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడమంటే ప్రతిపక్షాల స్వేచ్ఛను ప్రభుత్వం హరించినట్లేనని ఖర్గే అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రధాని ఓ రాజనీతజ్ఞుడిగా వ్యవహరించడం మంచిదని ఆ లేఖలో ఖర్గే అభిప్రాయపడ్డారు లోక్‌పాల్‌ సభ్యుల ఎంపికపై చర్చలు జరిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌పాల్‌ బిల్లును 2013లో పార్లమెంట్‌ ఆమోదించింది. ఐదేళ్లు గడుస్తున్నా ఆ ప్రక్రియ ముందుకు జరగడం లేదు. 

రౌడీ షీటర్ దారుణ హత్య...

హైదరాబాద్ : పాతబస్తీలో రౌడీ షీటర్ ఈసా దారుణ హత్యకు గురయ్యాడు. ఈసాను జావీద్, నవీన్ లు కత్తులతో పొడిచి చంపేశారు. మదీనా కాలనీకి చెందిన వివాహితను ఈసా వివాహం చేసుకున్నాడు. తన అన్న భార్యను ఈసా పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహంతో హత్య చేసినట్లు సమాచారం. 

ఇంటర్ సెకండియర్ పరీక్షలు...

హైదరాబాద్ : నేటి నుండి ఇంటర్ సెకండీయర్ పరీక్షలు జరుగనున్నాయి. నేడు జరిగే లాంగ్వేజ్ పరీక్షకు సెట్ - ఏ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. 

07:38 - March 2, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు సిబిఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కార్తీ చిదంబరంకు కోర్టు 5 రోజుల సిబిఐ కస్టడీ విధించింది. కార్తీ రిమాండ్‌పై పటియాలా హౌస్‌ కోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. కార్తీని విచారించేందుకు 14 రోజుల రిమాండ్‌ విధించాలని సిబిఐ కోరింది. ఇందుకోసం కొన్ని కీలక పత్రాలను న్యాయమూర్తికి చూపింది. కార్తీకి కస్టడీ విధించడాన్ని ఆయన తరపు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కార్తీకి 5 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించారు. కార్తీ చిదంబరానికి హోం ఫుడ్‌ను నిరాకరించిన కోర్టు ఔషధాలకు మాత్రం అనుమతించింది. కార్తీ మార్చి 6 వరకు సిబిఐ కస్టడీలో ఉండనున్నారు.

 

బాబు హోలీ శుభాకాంక్షలు...

విజయవాడ : రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల వసంతం హోలీ తెలుగు వారి జీవితాల్లో సంతోషపు రంగులు నింపాలని ఆకాంక్షించారు. 

07:15 - March 2, 2018

నిజామాబాద్ : హోలీ పండగ అంటే రంగులు చల్లుకుంటూ సందడి చేయడమే మనందరికీ తెలుసు... కానీ ఉత్కంఠ... ఉద్రిక్తత వాతావరణంలో జరుపుకునే హోలీ గురించి మీకు తెలుసా... ఆ ప్రత్యేకతేంటో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం వెళ్లాల్సిందే. హున్సా గ్రామంలో జరిగే హోలీ పండుగా పూర్తిగా డిఫరెంట్‌. ఇక్కడ హోలీ వేడుకల్లో ఉత్సాహానికి బదులు ఉద్రిక్తత ఉంటుంది. రంగులకు బదులు రక్తం కారుతుంది. ఒకరిపై ఒకరు రంగులు చట్టుకోవడానికి బదులు పిడిగుద్దులు కురిపించుకుంటారు. ప్రతీ సంవత్సరం ఇక్కడి ప్రజలు హోలీని ఇలానే జరుపుకుంటారు.

హోళీ పండుగ సాయంత్రం గ్రామ శివారులోని పంట పొలాల్లొ కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్తులంతా హనుమాన్ మందిరం వద్దకు చేరుకుంటారు. వందల సంఖ్యలో జనం ఒక చోట గుమిగూడతారు.. రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి ప్రజలు రెండు వైపులా రెండువర్గాలుగా చేరుతారు. సుమారుగా అరగంట పాటు ఈ వికృత క్రీడ కొనసాగుతుంది .పైగా ఈ ఆట ఆడకుంటే తమ గ్రామానికి అరిష్టమన్నది గ్రామస్థుల మూఢ నమ్మకం. హున్సాలో ఈ రక్తకేళీ 50ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.

ఆధునికంగా అభివృద్ధి చెందిన డిజిటల్‌ యుగంలోనూ ఈ ఆటవిక క్రీడా ఆనవాయితీగా జరుపుకుంటూనే ఉన్నారు. ముఖంమీద, వీపు మీద పిడిగుద్దులు కురిపించుకునే సమయంలో ఆ ప్రాంతంమంతా రంణరంగాన్ని తలపిస్తుంది... పోలీసులు ఆంక్షలు విధించినా ఈ క్రీడ కొనసాగుతూనే ఉంది. ప్రజల్లో మూఢనమ్మకాన్ని తొలగించి...ప్రాణాంతంకమైన ఈ పిడిగుద్దులాటను అరికట్టేందుకు... అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

07:03 - March 2, 2018

విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అగ్రిగోల్డ్‌ సంస్థ మోసం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దార్ల అందరికీ న్యాయం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఆగ్రిగోల్డ్ బాధితులకు ఎపీ సియం చంద్రబాబు చెక్కులను పంపిణీ చేశారు. ప్రాణాలు కోల్పోయిన అగ్రిగోల్డ్‌ మోసం వల్ల చనిపోయిన 96 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆదుకోడానికే ఈ పరిహారం అందించినట్టు చంద్రబాబు తెలిపారు. నిబంధనలు ఎలా ఉన్నా.. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామని సీఎం అన్నారు.

ఐదు రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మంది పేదలు.. 6 వేల 380 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. చిరు వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయారన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 3 వేల 900 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. అధికవడ్డీలు, రెండేళ్లలో రెట్టింపు చేస్తామన్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పేదలు తమ సొమ్మును బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేసుకోవాలన్నారు. మొత్తానికి అగ్రిగోల్డ్‌ మోసంతో మృతిచెందిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పోయిందనుకున్న తమ డబ్బు తిరిగి ఇస్తున్నందకు ఏపీ ప్రభుత్వానికి అగ్రిగోల్డ్‌ డిపాజిట్ దార్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

07:00 - March 2, 2018

విజయవాడ : ఈనెల 5న మ‌లివిడ‌త పార్లమెంట్ స‌మావేశాలు తిరిగి ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఎపిలో మ‌ళ్ళీ పోలిటిక‌ల్ హీట్ మొద‌లైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరుపై పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీన్లో భాగంగా ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ అవుతోంది. ఉండ‌వ‌ల్లిలోని సియం నివాసంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం ఎంత‌వ‌ర‌కైనా పోరాడ‌తాం అని చెప్పిన చంద్రబాబు..ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.ఈ నెల 5వ తేది నుండి తిరిగి పార్లమెంట్ బ‌డ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో అందుకు తగిన విధంగా చంద్రబాబు తమపార్టీ ఎంపీలకు డైరెక్షన్‌ ఇస్తున్నారు. దీనికోసం ఇవాళ టీడీపీ ఎంపీలతో ఉండవల్లిలో భేటీ అవుతున్నారు.

ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ టీడీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్లమెంట్‌ లోపలా, బయటా టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. అయితే, బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడినందున ఆ పోరాటానికి తాత్కాలికంగా విరామం వచ్చింది. కాగా ఈ నెల 5 నుంచి మరోసారి సమావేశాలు ప్రారంభం అవుతున్నందున చంద్రబాబు తన వ్యూహానికి పదును పెడుతున్నారు. విభజన హామీలన్నీటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని కోసమే ఇవాళ టీడీపీ ఎంపీలతో భేటీ అవుతున్నారు. మరోవైపు ఇప్పటికే వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం కావడం.. మరోవైపు కేంద్రంపై అవిశ్వాసం పెడతామని ప్రతిపక్ష వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో .. అధికార పార్టీగా ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఇవాళ్టి భేటీలో టీడీపీపీ చర్చించే అవకాశ వుంది. మరోవైపు ఈ నెల 5వ తేదిన కేంద్ర హోంశాఖ ఎపి అధికారుల‌ని చ‌ర్చల‌కు ఆహ్వనించింది.ఈ చ‌ర్చల త‌ర్వాత కేంద్ర వైఖ‌రిపై క్లారిటి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఏది ఏమైన‌ప్పటికీ పార్లమెంట్ స‌మావేశాల్లో కేంద్ర వైఖ‌రిని బ‌ట్టి త‌దుప‌రి నిర్ణయం తీసుకోవాల‌ని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేంద్రంపై అవిశ్వాసం అనేది చివ‌రి అస్త్రంగా ఉండాల‌ని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. 

06:57 - March 2, 2018

హైదరాబాద్ : జనసేన జేఎఫ్‌సీ నివేదిక సిద్ధమైంది.. లెక్కల డేటాపై విశ్లేషణ దాదాపు పూర్తయింది.. కేంద్రం ఇచ్చిందెంత..రాష్ట్రం తీసుకున్నదెంత.. అన్ని లెక్కలూ ప్రజల ముందుకు రానున్నాయి. కేంద్ర రాష్ట్రాలు రెండూ ఏపీ ప్రజలను తప్పుదారి పట్టించాయని జేఎఫ్‌సీ నివేదికలో పెర్కొన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇక పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం ఎలాఉండనుందన్న దానిపై ఇపుడు ఆసక్తి నెలకొంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు 'జేఎఫ్‌సీ' నివేదిక అందజేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజలను తప్పుదోవ పట్టించాయని కమిటీ నివేదికలో నిగ్గుతేలినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చలేకపోయాయని నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. కనీసం ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాయని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

గురువారం సాయంత్రం జనసేన అధినేత పవన్‌క్యాణ్‌తో భేటీ అయిన జయప్రకాశ్‌ నారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, పద్మనాభయ్య కమిటీ నివేదికపై చర్చించారు. కాగా ఇవాళ మరోసారి సమావేశమై నివేదికపై చర్చించే అవకాశం ఉందని జనసేన వర్గాలు పెర్కొన్నాయి. నివేదికపై సమగ్ర పరిశీలన తర్వాత ఇవాళ సాయంత్రానికి నివేదికను ప్రజలక ముందుకు తెచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి నిధులు ఇచ్చామని కేంద్రం, ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో... జనసేన జేఎఫ్‌సీ నివేదిక ఏం చెబుతుందో అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. జేఎఫ్‌సీ నివేదికను ప్రజల ముందుకు తెచ్చాక.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేసేందుకు పవన్‌ రంగంలోని దిగుతారని జనసేన వర్గాల నుంచి సమాచారం వస్తోంది. 

టీడీపీ పార్లమెంటరీ భేటీ...

విజయవాడ : ఈనెల 5న మ‌లివిడ‌త పార్లమెంట్ స‌మావేశాలు తిరిగి ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఎపిలో మ‌ళ్ళీ పోలిటిక‌ల్ హీట్ మొద‌లైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరుపై పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీన్లో భాగంగా ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ అవుతోంది. ఉండ‌వ‌ల్లిలోని సియం నివాసంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. 

ఢిల్లీకి వైసీపీ శ్రేణులు...

విజయవాడ : ప్రత్యేక హోదా ఆందోళన నేపథ్యంలో నేడు విజయవాడ నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరనుంది. వైసీపీ శ్రేణులు ఈ రైలులో తరలివెళ్లనున్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సీపీఎం పార్టీ ఆఫీస్ సెక్రటరీ దారుణ హత్య..

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దారుణం జరిగింది. సీపీఎం పార్టీ ఆఫీస్ సెక్రటరీ కొండలరావును గత రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. గొమ్మూరు ఇసుక ర్యాంప్ వద్ద పూడ్చి పెట్టారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కార్తీ చిదంబరంకు సిబిఐ కస్టడీ...

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు సిబిఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కార్తీ చిదంబరంకు కోర్టు 5 రోజుల సిబిఐ కస్టడీ విధించింది. 

రూ. 1217 కోట్ల ఆస్తుల సీజ్...

ఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం కేసులో మెహుల్ చోక్సికి చెందిన రూ. 1217 కోట్ల విలువైన 41 ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని 15 ఫ్లాట్లు, 17 కార్యాలయాలున్నాయి.

భగ్గుమంటున్న సిరియా..

ఢిల్లీ : అంతర్‌ యుద్ధంతో సిరియా భగ్గు మంటోంది. ప్రభుత్వ బలగాలు మిలిటెంట్లపై జరుపుతున్న దాడుల వల్ల అమాయక ప్రజలే సమిధలవుతున్నారు. మృతుల్లో ముక్కుపచ్చలారని పిల్లలు, మహిళలే అధిక సంఖ్యలో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సిరియాలో జరుగుతున్న నరమేధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సినిమా థియేటర్ల బంద్...

హైదరాబాద్ : దక్షిణాదిలో నేటి నుండి సినిమా థియేటర్ల బంద్ జరుగనుంది. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంద్ చేయనున్నారు. 

కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం...

ఢిల్లీ : నేడు కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఇరు రాష్ట్రాల ఇంజనీర్ లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. 

జేఎఫ్ సీ నివేదిక విడుదల...

విజయవాడ : నేడు జేఎఫ్ సీ నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై పవన్ కు జేఎఫ్ సీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Don't Miss