Activities calendar

03 March 2018

21:58 - March 3, 2018

హైదరాబాద్ : ప్రతి పేదవానికి సాయం చేసే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ట్రస్ట్ ఛైర్మన్ భువనేశ్వరి, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఏ వ్యక్తి అభివృద్ధిలో నైనా విద్య ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకే తమ ప్రభుత్వం విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలులో 75శాతం అమ్మాయిలే ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. 

21:57 - March 3, 2018

ఢిల్లీ : కాంట్రాక్టర్లు తన చేతిలో ఉండాలనే కక్కుర్తితోనే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సహకరించకూడదని తన అధికారులకు దిశా నిర్దేశం చేశారన్నారు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు. పోలవరం ప్రాజెక్ట్‌ తన చేతి నుండి చేజారిపోకుండా శతవిధాలా ప్రయత్నించారన్నారు. ఏ కారణం చేతనైనా ప్రాజెక్ట్‌ నిర్మాణం రాష్ట్రం చేతికి రాకపోతే... కాంట్రాక్టర్లకు మేలు చేయాలని... వారికి లాభాలు తగ్గకూడదని 2015లో జీవో 22 విడుదల చేశారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో జరుగుతున్న పరిణామాలతో నష్టపోయేది రాష్ట్ర ప్రజలేనన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రాష్ట్రం చేతికి రావడం వెనక ఎన్నో లొసుగులు ఉన్నాయని.. అందుకే శ్వేతపత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు జంకుతున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని విమర్శలు చేస్తున్నారన్నారు కేవీపీ. ఇప్పటికైనా చంద్రబాబు తప్పులన్నీ తెలుసుకుని.. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులన్నీ కేంద్రమే ఇచ్చేలా లిఖిలపూర్వకంగా కోరాలని.. చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. 

21:53 - March 3, 2018

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం పోరాటం క్లైమాక్స్‌కు చేరుకుందన్నారు వైసీపీ అధినేత వైఎస్.జగన్. ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్న ఆయన టీడీపీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చేలా పవన్ చూడాలన్నారు. ఏప్రియల్ 6న వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తారని చెప్పారు. మార్చి 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో  ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం శివరాంపురంలో వైసీపీ శ్రేణులతో జగన్ భేటీ అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదిక ధర్నా నిర్వహించబోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 5న ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌ వద్ద వైసీపీ నేతలు  పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు

ఈ నేపథ్యంలో తాళ్లూరుకు చేరుకున్న వైసీపీ నేతలు ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వారందరితో జగన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నా, ప్రత్యేక హోదా పోరాటంపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్న ఆయన.. టీడీపీ ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇచ్చేలా పవన్ చూడాలన్నారు. ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేవరకూ అసెంబ్లీకి వెళ్లేది లేదని జగన్‌ స్పష్టం చేశారు. 

ప్రత్యేక హోదాయే లక్ష్యంగా తాము ఢిల్లీ యాత్ర చేపడుతున్నామని, హోదా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. హోదా కోసమే ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామని తెలిపారు. మొత్తానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ తమ ఆందోళనలను తీవ్రతరం చేయబోతోంది. 

21:49 - March 3, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 90శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని పవన్‌ డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాల కోసం.. పాచిపోయిన లడ్డూలైనా తీసుకుంటామని టీడీపీ నేతలన్నారని, ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూలు కూడా పూర్తిగా రాలేదని పవన్‌ మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాకపోవడాన్ని పవన్‌ తప్పుపట్టారు. సీఎం చంద్రబాబు ఓసారి ప్యాకేజీ అంటూ మరోసారి హోదా అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని పవన్‌ అన్నారు. 
జేఎఫ్ సీ తుది నివేదిక వివరాలు వెల్లడి 
హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో నిజనిర్ధారణ కమిటీ తుది నివేదిక వివరాలను పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు అనుభవజ్ఞులైన వారితో జేఎఫ్‌సీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర విభజనలో ప్రజల పాత్ర లేదని..  రాజకీయ నాయకుల పాత్రే ఉందని పవన్‌ అన్నారు. సీఎం చంద్రబాబు ఒకసారి ప్రత్యేక హోదా కావాలని.. ఇంకోసారి ప్రత్యేక ప్యాకేజీ చాలని విరుద్ధ ప్రకటనలు చేస్తూ సందిగ్ధంలో పడిపోయారని పవన్‌ అన్నారు. పాచిపోయిన లడ్డూలైనా ఫర్వాలేదని ఓ సారి .. ఇప్పుడు హోదా ఇవ్వాలని అడుగుతున్నారని విమర్శించారు. ఇంత విరుద్ధ ప్రకటనలెందుకు చేస్తున్నారని పవన్‌ ప్రశ్నించారు. 
హామీల్లోని అన్ని అంశాలను నెరవేర్చాలి : పవన్ 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విభజన చట్టం హామీల్లోని అన్ని అంశాలను నెరవేర్చాలన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న 11 అంశాలు కమిటీలో చర్చించామన్న పవన్‌.. ఆవిర్భావానికి కారణం ప్రజలకు జరిగిన అన్యాయమే అన్నారు. బీజేపీ, టీడీపీల గెలుపునకు కృషిచేసినందున .. ఇప్పుడు తనపై నైతిక బాధ్యత ఉందని పవన్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదన్న ఆయన.. సకాలంలో పోలవరం పూర్తి కాకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్నే నిందించాల్సి ఉంటుందని అన్నారు.
విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తే తప్పేంటి :పవన్  
విశాఖ రైల్వేజోన్‌ కేంద్రం ప్రకటించాలని, రైల్వేజోన్‌పై పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఊరైన హాజీపూర్‌కి రైల్వే జోన్‌ ఇచ్చిన కేంద్రం విశాఖకు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. దుగరాజుపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపడంలేదన్నారు పవన్‌కల్యాణ్‌.
అన్నింటికీ కేంద్రమే నిధులు ఇవ్వాలి : జేపీ
రాజధానిలో మౌలిక సదుపాయాలు, రహదారులు ఇలా అన్నింటికీ నిధులు కేంద్రమే ఇవ్వాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే రాజధాని నిర్మాణానికి మరో 50 ఏళ్ల  సమయం పడుతుందని ఆయన అన్నారు. ఇవ్వలేమని కేంద్రం చెప్పడం తగదని.. స్పెషల్ స్టేటస్ ఇచ్చే తీరాలన్నారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉందని ఆయన వెల్లడించారు. వెనకబడిన 7 జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. జేఎఫ్‌సీ భేటీలో ఉండవల్లి, జేపీతో పాటు మాజీ హోం సెక్రెటరీ పద్మనాభయ్య, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపించనున్నారు. 
 

 

21:43 - March 3, 2018

హైదరాబాద్ : నిన్న మొన్నటివరకు తెలంగాణలోనే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగగా... ఇప్పుడు కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. అనేక అంశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్‌ సమావేశాల్లో పోరాటం చేస్తామన్నారు కేసీఆర్‌. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందని... అది థర్డ్‌ ఫ్రంట్‌ అయినా... వేరే ఏది అయినా ముందుండి నడిపించేందుకు సిద్ధమన్నారు గులాబీ దళపతి. 
బీజేపీ నేతల ఆరోపణలను ఖండించిన సీఎం కేసీఆర్‌  
ప్రధాని మోదీని కించపరిచేవిధంగా వ్యాఖ్యానించారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖండించారు. తాను ఎక్కడా ఆ విధంగా వ్యాఖ్యానించలేదని... తాను మాట్లాడిన టేపులను కూడా విన్నానన్నారు కేసీఆర్‌. కొందరు కావాలనే కల్పించుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే కొంతమంది ప్రధానినే విమర్శిస్తారా అని అంటున్నారని... ప్రధానిని విమర్శించొద్దని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా ? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌కు జైలుకు పోవాలని ఉందా అని ఓ బీజేపీ ఎమ్మెల్యే అన్నారని... దేశంలో మాట్లాడినోళ్లందరినీ జైలుకు పంపిస్తారా అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినైనా సరే మేం ఏమైనా చేయగలమనుకుంటే... కొన్ని సందర్భాల్లో కొందరిని ముట్టుకుంటే భస్మమైపోతారన్నారు. తనపై ఏం కేసులు పెడతారన్నారు. కుంభకోణాలు చేసేవారు భయపడతారని.. తమకేం భయమన్నారు కేసీఆర్‌. 
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం... 
ఈనెల 5 నుంచి పార్లమెంట్‌లో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌లో పొందుపర్చిన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కేసీఆర్‌. విభజన చట్టంలోని అనేక హామీలను నెరవేర్చాలని కేంద్రానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం వద్ద పెట్టుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చెప్పిన విధంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తన పెత్తనాన్ని వదులకోవడానికి సిద్దంగా లేదని.. వాళ్ల గుప్పిట్లోనే పవర్‌ పెట్టుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఇక పంటలకు కనీస మద్దతు ధరపై పోరాడుతామన్నారు. కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే అన్ని పంటలకు మద్దతు ధర 500 రూపాయలు పెంచాలని డిమాండ్‌ చేశారు. 
దేశ రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ప్రయత్నాలు 
ఇక దేశ రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కేసీఆర్‌. మూస ధోరణులు మారాలని... ఖచ్చితంగా మార్పు రావాలన్నారు. పరిస్థితులు వచ్చినప్పుడు నాయకుడు పుడతాడన్నారు. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే.. ఖచ్చితంగా వహిస్తానన్నారు. థర్డ్ ఫ్రంట్ కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు, కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలని... మార్పు కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతానన్నారు కేసీఆర్‌. మొత్తానికి నిన్నటివరకు కేంద్రానికి మద్దతుగా నిలిచిన టీఆర్‌ఎస్‌... కేంద్రంపై యుద్ధానికి సిద్ధమైంది. భవిష్యత్‌లో థర్డ్‌ ఫ్రంట్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 

21:25 - March 3, 2018

పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.శ్రీనివాస్ తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్ధాల నుంచి ప్రాథమిక వైద్య సేవలను నిర్లక్ష్యం చేశామని చెప్పారు. జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేయాలని..వాటికి మెడికల్ కాలేజీలను జోడించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ, నగరాలకు వచ్చిన ప్రజల లైఫ్ స్టైల్ మారిందన్నారు. గ్రామాల నుంచి నగరాలకు వచ్చిన వారిలో వ్యాయామం చేయడం తగ్గిందన్నారు. ఆహారపు అలవాట్లు మారాయని చెప్పారు. జీవన శైలి మారిందని పేర్కొన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు అధికమయ్యాయని తెలిపారు. ఇండియన్స్ కు అర్లీ హార్ట్ అటాక్ ఎక్కువ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు అవసరం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మార్పుల కోసం నాయకత్వం వహించాల్సి వస్తే సిద్ధమే అని చెప్పారు. సీతారాం ఏచూరితో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు. 

21:13 - March 3, 2018

కాంగ్రెస్ పాలనలో దేశ రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో దేశ రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశం కోసం పని చేసే హక్కు మాకు లేదా..? అని అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మూడో ఫ్రంటో..మరో ఫ్రంటో...ఏదో ఒకటి వస్తుంది అని అన్నారు. రాజకీయాల్లో మూడు సందర్భాల్లో మార్పులు చూశామని గుర్తు చేశారు. ఒకటి జనతాపార్టీ ఆవిర్భావం..60 రోజుల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. రెండోది ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావం...9 నెలల్లోనే అధికారంలోకి రావటం, మూడోది టీఆర్ ఎస్ ఆవిర్భావం... 60 రోజుల్లోనే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు.

 

త్రిపుర ప్రజల ప్రయోజనాల కోసం సీపీఎం కట్టుబడి ఉంది : సీపీఎం పొలిట్ బ్యూరో

ఢిల్లీ : త్రిపుర ప్రజల ప్రయోజనాల కోసం సీపీఎం కట్టుబడి ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో తెలిపింది. రాష్ట్రంలోని గిరిజన, గిరిజనేతర, శ్రామిక వర్గాల ఐక్యతకు కృషిని కొనసాగిస్తామని పేర్కొంది. ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేసి విచారణ చర్యలు తీసుకుంటామని చెప్పింది. 

20:49 - March 3, 2018

అవద్దాలు శోధిస్తున్న నిజనిర్దారణ కమిటీ...ప్రత్యేక హోదా మీద మళ్ల ప్రత్యేకంగ భేటీ, సర్కారు వంచిన సబ్సిడీ టాక్టర్ల గోల్ మాల్..టీఆర్ఎస్ లీడర్లకే ముడుతున్న పథకాలు, నాయిని నోరు జారిండన్న బిడ్డె కవితమ్మ...ప్రథాని మీద వాడిన పదానికి వివరణ, మంత్రి మహేందర్ రెడ్డికి పుట్టెడు అవమానం...అమరుని సంస్మరణ సభల ఆడుకున్నజనం, హోళీ పిడిగుద్దులు గుద్దుకున్న జనాలు... ఆచారం ఇదేనట.. ఊరంత బాగుంటదట, దళితుల స్మశానాన్ని కబ్జావెట్ట జూశిండ్రు...సంతనూతలపాడు దిక్కు సీపీఎం లొల్లి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:43 - March 3, 2018

జేఎఫ్ సీ నివేదికపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఏపీకి ప్రత్యేకహోదా.. జేఎఫ్ సీ నివేదిక.. అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత పట్టాభిరామ్, బీజేపీ నేత విష్ణుశ్రీ, విశ్లేషకులు తులసీదాస్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. కేంద్రం... విభజన చట్టం హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

భారత రైతాంగంలో అసహనం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ప్రజలే న్యాయ నిర్ధేతలు అని సీఎం కేసీఆర్ అన్నారు. భారత రైతాంగం అసహనానికి గురయ్యారని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టబడుతుందన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎయిమ్స్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రానికి చాలా వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన అన్ని హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు.

2019 లో కాంగ్రెస్ కు పది సీట్లు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తాము ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం సర్వే చేయలేదని.. తమ కోసం చేయించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తాము చేయించిన రెండు సర్వేల్లో ఒక సర్వేలో టీఆర్ ఎస్ కు 106 సీట్లు, రెండో సర్వేలో 103 సీట్లు గెలుస్తామని చెప్పాయని..దానికి తాము చేయగలిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీవారు ప్రస్టేషన్ లో ఉన్నారని చెప్పారు. 2019 లో కాంగ్రెస్ కు పది సీట్ల కంటే ఎక్కువ రావని..సవాల్ చేశారు.

20:06 - March 3, 2018
20:01 - March 3, 2018

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీపై ధ్వజమెత్తారు. ప్రధానిని విమర్శించొద్దని రాజ్యాంగంలో ఉందా ? అని ప్రశ్నించారు. విమర్శిస్తే కేసీఆర్ కు జైలుకు పోవాలా.. దేశంలో మాట్లాడినవారినందరినీ జైలుకు పంపుతారా.? ఇదేమైనా తానాశాహినా అని సీఎం అన్నారు. కొంతమందిని ముట్టుకుంటే భస్మం అయిపోతారని అన్నారు. 'తొక్కనాకున్నదేంది..నేను జైలుకెళ్లేదేంది ? తమను ఎవ్వరు ఏమీ చేయలేరు.. తనను ముట్టుకుని చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందని అని అన్నారు. 'మేము సన్నాసులం కాదు..మా కూడా బుద్ధి ఉంది అన్నారు. కేసీఆర్...భయపడడని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందుదొందే అని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని అన్నారు. 
మోడీని అలా అనలేదు.. 
తాను ప్రధానిని కించపరిచానని అనడం శుద్ధ తప్పున్నారు. 'మోడీ గారు అన్నాను... మోడీ గాడు' అని అనలేదని తెలిపారు. ప్రధానిని తాను తులనాడలేదని..బీజేపీ వారే ప్రధానిని తక్కువ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. తాను ఎవరినీ దూషించలేదని...దూషించనని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు ఒల్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి..
బీజేపీ నాయకులు ఒల్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ గల్లంతు అయిందని... తెలంగాణలో బీజేపీ పార్టీ ఎక్కడుంది ? అన్నారు. బీజేపీ పార్టీని తాము జోక్ కింద తీసుకుంటామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లేని బీజేపీని చూపించి.. లక్ష్మణ్ ప్రత్యామ్నాయం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 'మీకోసం నా భాష మార్చుకోను.. నేను ఇలానే మాట్లాడుతానని తేల్చి చెప్పారు. సంస్కృతం మాట్లాడనని... తెలంగాణలో ప్రజలు మాట్లాడుకునే  సాధారణ భాషనే మాట్లాడతానని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తే ఎవరు వద్దన్నారని...ఇప్పటికైనా దృష్టి పెడితే తమకు అభ్యంతరం, నష్టం లేదన్నారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. 
2019 లో కాంగ్రెస్ కు పది సీట్లు...
తాము ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం సర్వే చేయలేదని.. తమ కోసం చేయించుకున్నామని తెలిపారు. తాము చేయించిన రెండు సర్వేల్లో ఒక సర్వేలో టీఆర్ ఎస్ కు 106 సీట్లు, రెండో సర్వేలో 103 సీట్లు గెలుస్తామని చెప్పాయని..దానికి తాము చేయగలిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీవారు ప్రస్టేషన్ లో ఉన్నారని చెప్పారు. 2019 లో కాంగ్రెస్ కు పది సీట్ల కంటే ఎక్కువ రావని..సవాల్ చేశారు. బీజేపీ మొత్తం గల్లంతవుతుందనన్నారు. 10 సం.రాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలోని 9 జిల్లాలకు లక్ష 9 కోట్ల క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ ఉంటే.. 4 స.రాల కాలంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాలకు లక్ష 15 కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ ఇచ్చామని అన్నారు. ఎలక్షన్స్ వేరు.. పర్సనల్ లైఫ్ వేరని అన్నారు. అన్ని పార్టీల మాదిరిగానే తమ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. తమ పార్టీ సభ్యులు 70 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ప్రజలే న్యాయ నిర్ధేతలు అని అన్నారు. భారత రైతాంగం అసహనానికి గురయ్యారని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టబడుతుందన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎయిమ్స్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రానికి చాలా వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన అన్ని హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు.

 

బీజేపీ నాయకులు... ఒల్లు దగ్గరపెట్టుకోండ్రీ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : బీజేపీ నాయకులు ఒల్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రధానిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. విమర్శిస్తే కేసీఆర్ కు జైలుకు పోవాలా.. దేశంలో మాట్లాడినవారినందరినీ జైలుకు పంపుతారా.? ఇదేమైనా తానాశాహినా అన్నారు. కొంతమందిని ముట్టుకుంటే భస్మం అయిపోతారు.. తొక్కనాకున్నదేంది..నేను జైలుకు కెల్లేంది ? తమను ఎవ్వరు ఏమీ చేయలేదు.. తనను ముట్టుకుని చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. 

'మోడీ గారు అన్నాను... మోడీ గాడు' అనలేదు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : 'మోడీ గారు అన్నాను... మోడీ గాడు' అని అనలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానిని తాను తులనాడలేదని.. బీజేపీ నేతలు ప్రధానిని తక్కువ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు.  

మా దగ్గర అసంపూర్ణమైన సమాచారం : జేపీ

హైదరాబాద్ : 'మాది తుది నివేదిక కాదు అని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. జేఎఫ్ సీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ దగ్గర అసంపూర్ణమైన సమాచారం మాత్రమే ఉందన్నారు. అయితే సమాచారం ఉన్నంతమేరకు స్పష్టత ఉందని తెలిపారు. తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. చాలా అంశాలల్లో మాకు సమాచారం లేదన్నారు. అద్భుతాలు చేసే శక్తి తమకు లేదన్నారు. తాము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడం లేదని..స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వాస్తవం ఒక్కటే ఉంటుందని.. రెండు రకాలుగా ఉండదన్నారు.

18:49 - March 3, 2018

హైదరాబాద్ : 'మాది తుది నివేదిక కాదు' అని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. జేఎఫ్ సీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ దగ్గర అసంపూర్ణమైన సమాచారం మాత్రమే ఉందన్నారు. అయితే సమాచారం ఉన్నంతమేరకు స్పష్టత ఉందని తెలిపారు. తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. చాలా అంశాలల్లో మాకు సమాచారం లేదన్నారు. అద్భుతాలు చేసే శక్తి తమకు లేదన్నారు. తాము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడం లేదని..స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వాస్తవం ఒక్కటే ఉంటుందని.. రెండు రకాలుగా ఉండదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందన్నారు. కేంద్రం నుంచి 7 అంశాల కింద ఇప్పటి వరకు రూ.75 వేల కోట్లు రావాల్సివుందని గుర్తించామని చెప్పారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేకహోదా అమలులో ఉందని తెలిపారు. వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరంలో డబ్బుల ప్రస్తావన తాము తీసుకురాలేదన్నారు. 

 

17:53 - March 3, 2018

హైదరాబాద్ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..ఇతర హామీలు అమలు ఎందుకు చేయలేదని...నాలుగేళ్లు అయినపోయిన తరువాత గుర్తుకొచ్చాయా ? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జేఎఫ్ సీ నివేదికపై మేధావులతో భేటీ అయిన పవన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. 
ప్రభుత్వాలు ఏమి చేయలే...
జనసేన ఆవిర్భావానికి రాష్ట్ర విభజన కారణమని, డివిజన్ ప్రాసెస్ అంతా ఆంధ్రా ప్రజలు నిందింపపడ్డారని పవన్ తెలిపారు. విభజనలో ప్రజల పాత్ర లేదన్నారు. ఇబ్బందులు పడుతున్నది..పడుతోంది..ప్రజలేనన్నారు. పార్టీల పరంగా మాట్లాడుతారు..కానీ ప్రజల కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉందని జేపీ పేర్కొనడం జరిగిందని..ఇది వాస్తవమేనని..ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు..కేంద్రం ఏమి చేయలేదన్నారు. 
వ్యత్యాసమైన ప్రకటనలు...
ఎన్డీయే, టిడిపి పార్టీలకు తనవంతు కృషి చేయడం జరిగిందని, ఏమి చేసినా..బయటకు వెళితే..ఆయా పార్టీల పార్ట్ నర్ అంటున్నారని..దీనితో ప్రజలకు సమాధానం చెప్పాల్సినవసరం ఏర్పడిందని తెలిపారు. విభజన హామీలు నెరవేరుస్తామని..ప్రత్యేక హోదా పదేళ్లు..కాదు..పదిహేను ఏళ్లు ఇస్తామని ఇలా ఎన్నో చెప్పడం జరిగిందన్నారు. ఎన్నో వ్యత్యాసమైన ప్రకటనలు వస్తున్నప్పుడు ఎందుకు స్పందించరని ఎన్నో ప్రశ్నలు వచ్చాయన్నారు. 
కమిటీ గుర్తించింది 11 అంశాలు...
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగిందని, చాలా సంస్థలు ఉండిపోయాయని..రకరకాల అంశాలతో కూడిన వాగ్దానాలు ఇచ్చారని గుర్తు చేశారు.  ఈ నేపథ్యంలో జేఎఫ్ సీ ఏర్పాటు చేయడం జరిగిందని..ఈ కమిటీ 11 అంశాలు గుర్తించిందన్నారు. 
హోదా...
హోదా ఇస్తారని అందరిలాగే తాను నమ్మడం జరిగిందని, వంద రోజుల వరకు తాను ఊరుకోవడం జరిగిందన్నారు. తిరుపతిలో దీనిపై తాను నిలదీయడం జరిగితే రాత్రికి రాత్రి స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రకటించారని గుర్తు చేశారు. దీనిపై పాచిపోయిన లడ్డూలంటే అవి ఇష్టమని టిడిపి పేర్కొనడం జరిగిందని, కానీ అవి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. స్పెషల్ కేటగిరి...ఇస్తామని తేనే రాసి వదిలేశారని..ఇలా చాలా సార్లు కన్ ఫ్యూజ్ చేసేశారని..ఒక్క మాటలో వాడుకొని వదిలేశారని విమర్శించారు. స్పెషల్ ప్యాకేజీ..హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం లేదని, భిన్నమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని భయపడ్డానని..ప్రజల్లో ఎలాంటి అశాంతి వస్తుందనే దానిపై వివరించేందుకు గతంలో పీఎంను కలిసి విన్నవించడం జరిగిందన్నారు. అడగడానికి ఎందుకు నాలుగు సంవత్సరాలు పట్టిందని ప్రశ్నించారు. ఇంత కన్ ఫ్యూజ్ లో ఉంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని, బాధ్యతగా ముందుకు తీసుకోకపోతే అస్థిరతకు...రాజకీయ పరిణామాలు మారిపోతాయన్నారు. హోదా ఇస్తేనే ప్రజలకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందని, 
జైట్లీ ఆ మాట ఎలా అన్నారు ? 
2014లో ఏరియర్స్ పై స్పష్టత రాలేదని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారని ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జేఎఫ్ సీ కోసం తాను నలుగురు ఆఫీసర్లు రిక్వెస్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే నివేదిక ఇచ్చారని తెలిపారు. 
విద్యా సంస్థలు...
11 జాతీయ విద్యా సంస్థల్లో 9 మాత్రమే ఇచ్చారని...నిధుల్లో కూడా కొంతమటుకు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. మొత్తం ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని సూటిగా ప్రశ్నించారు. పుండుమీద కారం చల్లినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయని మండిపడ్డారు. 
పోలవరం ప్రాజెక్టు...
పోలవరం ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకారం నిర్మాణం చేయాల్సి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. సాధ్యమైనంత సహకారం ప్రభుత్వం సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని సూచించడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తీసుకోకపోతే బాగేండదని..పూర్తికాకపోతే కేంద్రాన్ని ప్రశ్నించరని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారని తెలిపారు. 
విశాఖ రైల్వే జోన్...
విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ విషయం ఏపీ పునర్ విభజన చట్టంలో పేర్కొనడం జరిగిందని తెలిపారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదని...కానీ రామ్ విలాస్ పాశ్వాన్ ఊరు హజీపూర్ ను రైల్వే జోన్ గా ఎలా చేశారని సూటిగా ప్రశ్నించారు. అలాంటి సమయంలో ఏపీని ఎందుకు పట్టించుకోరు ? పార్లమెంట్ ఇచ్చిన మాటను పట్టించుకోరా అని నిలదీశారు. ఇచ్చిన మాటను మరిస్తే ప్రజలను పాలించే నైతిక హక్కు కోల్పోతారని, ఇంత అన్యాయం జరుగుతున్నా నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని నిలదీశారు. 
దుగ్గరాజు పట్నం...
దుగ్గరాజు పట్నం విషయంలో కొన్ని సమస్యలు ప్రస్తావించారని ఆ సమయంలో ప్రత్యామ్నాయంగా వేరే పోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని సూచించారు. 
విజయవాడ, విశాఖ మెట్రో రైల్...
కొత్త మెట్రో రైల్ వర్తించదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందని, పునర్ విభజన చట్టం ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ఉండాలని పేర్కొనడం జరిగిందన్నారు. ఆయా విషయాల్లో తనను ప్రశ్నించినప్పుడు రెండు ప్రభుత్వాలు పార్ట్ నర్స్ అయిన విషయంలో ప్రజాప్రతినిధులకు ఎందుకు స్పష్టత లేదన్నారు. ప్రజలు విపరీతంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రజల్లో ఉన్న ఆందోళనలు...విభజన సమయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని..ఎండగట్టిన ఉండవల్లి...జయ ప్రకాష్ నారాయణతో పాటు మేధావులు..ఇతరులను జేఎఫ్ సీ లో పనిచేశారని తెలిపారు. ఇందులో రాజకీయ లబ్ది లేదని..ప్రజలకు మంచి చేయాలనే ఆకాంక్ష ఉందన్నారు. పిలవగానే ముందుకొచ్చి నివేదిక అందచేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

 

విభజనలో రాజకీయ నేతల పాత్ర ఉంది...ప్రజల పాత్ర లేదు : పవన్

హైదరాబాద్ : జేఏఎఫ్ తుది నివేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జేఎఫ్ సీ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. విభజనలో రాజకీయ నేతల పాత్ర ఉంది...ప్రజల పాత్ర లేదన్నారు. ప్రజలకు నైతికంగా సమాధానం చెప్పాల్పివచ్చినందునే జేఎఫ్ సీ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

 

జేఎఫ్ సీ తుది నివేదికపై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

హైదరాబాద్ : జేఎఫ్ సీ తుది నివేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జేఎఫ్ సీ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నానని తెలిపారు. 

ముగిసిన జేఎఫ్ సీ సమావేశం

హైదరాబాద్ : జేఎఫ్ సీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఉండవల్లి అరుణ్ కుమార్, పద్మనాభయ్య, తోట చంద్రశేఖర్ హాజరయ్యారు. ప్రత్యేకహోదాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని తెలిపింది.  

17:00 - March 3, 2018

3 ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన

ఢిల్లీ : మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఎన్నికల్లో త్రిపురలో తమకు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. ఒకేఒక చోట మాత్రమే డిపాజిట్ కాపాడుకోగలిగామని తెలిపారు. 

వారు మూల్యం చెల్లించుకోక తప్పదు : జగన్

హైదరాబాద్ : చర్ల ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు స్పందించారు. మావోయిస్టులు సేదతీరుతున్న సమయంలో దాడి చేశారని మావోయిస్టు నేత జగన్ అన్నారు. దాడిలో కీలక నేత ఎవరూ చనిపోలేదని తెలిపారు. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. పోలీసు అధికారులు, టీఆర్ ఎస్ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

త్రిపురలో బీజేపీకి దాదాపు 49.5 శాతం ఓట్లు

అగర్తల : త్రిపురలో బీజేపీ దాదాపు 49.5 శాతం ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో సొంతంగా 41.4 శాతం ఓట్లు సాధించింది. 

 

16:34 - March 3, 2018

త్రిపురలో ఖాతా తెరవని కాంగ్రెస్, టీఎంసీ కూటమి

అగర్తల : త్రిపురలో కాంగ్రెస్, టీఎంసీ కూటమి ఇంకా ఖాతా తెరవ లేదు.  కాంగ్రెస్ కనీస ఓటింగ్ శాతాన్ని సాధించలేకపోయింది. కేవలం 1.5 శాతం ఓట్లకే కాంగ్రెస్ పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 31 వేల ఓట్లు మాత్రమే సాధించింది. 

 

16:33 - March 3, 2018

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని జేఎఫ్ సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఐదు గంటలుగా జేఎఫ్ సీ సమావేశం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వెనుకబడిన ప్రాంతాలకు రూ. 20వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని...మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వెంటనే ప్రారంభించాలని...పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని జేఎఫ్ సీ కోరనున్నట్లు తెలుస్తోంది. పదో షెడ్యూల్ లో ఉన్న ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలని, కేంద్రం ప్రకటించిన విద్యా సంస్థలను ఐదేళ్లలోపు పూర్తి చేయాలని పేర్కొననన్నుట్లు టాక్. 

16:26 - March 3, 2018

హైదరాబాద్ : ఎన్ కౌంటర్ ఘటనను తెలంగాణ సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ ఖండించారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొన్నారు. కాసేపటి క్రితం అయిన ఆడియో టేప్ ను విడుదల చేశారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని, మృతి చెందిన వారిలో పార్టీ టాప్ క్యాడర్ ఎవరూ లేరన్నారు. ప్రజా సమస్యలు చర్చించుకుని సేద తీరుతున్న సమయంలో ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో గ్రే హౌండ్స్ కాల్పులు జరిపారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని పట్టుకుని, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి చంపేశారని పేర్కొన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రాంపూర్ మండలంకు చెందిన రత్నా అనే నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మిగతా వారంతా సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందినవారన్నారు. గిరిజనులకు చెందిన ఖనిజ సంపద, వనరులను ప్రభుత్వాలు అమ్మేస్తున్నాయని ఆరోపించారు. పోలీసు అధికారులు, టీఆర్ఎస్ నేతలు మూల్యం చెల్లించుకోకతప్పదని, మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. ఇంకా ఏమీ మాట్లాడారో వీడియో వినండి...

'హోదా'కే జేఎఫ్ సీ మొగ్గు...

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని జేఎఫ్ సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఐదు గంటలుగా జేఎఫ్ సీ సమావేశం కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు రూ. 20వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని...మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వెంటనే ప్రారంభించాలని...పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని..రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని జేఎఫ్ సీ కోరనున్నట్లు తెలుస్తోంది. 

16:10 - March 3, 2018

ప్రకాశం : వైసీపీ అధ్యక్షుడు జగన్ కీలక ప్రకటన చేశారు. విభజన హామీల అమలు..ప్రత్యేక హోదా ఏర్పాటు చేయాలంటూ రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తుండడంతో ఏపీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ పేర్కొనడంతో టిడిపి అప్రమత్తమైంది. వరుస భేటీలు జరుపుతూ వైసీపీపై టిడిపి నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ శనివారం కీలక ప్రకటన చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని..అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో చేస్తారని జగన్ వెల్లడించారు. ఈ విషయంలో టిడిపి ఎంపీలు మద్దతిచ్చేలా చూడాలని జనసేన అధినేత పవన్ ను జగన్ కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకు తాము అసెంబ్లీకి వెళ్లమని స్పష్టం చేశారు. 

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం - జగన్..

విజయవాడ : 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతామని, టిడిపి ఎంపీలు మద్దతు ఇచ్చేలా పవన్ చూడాలని, ఏప్రీల్ 6వ తేదీన స్పీకర్ ఫార్మాట్ లో ఎంపీలు రాజీనామాలు చేస్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకు తాము అసెంబ్లీకి వెళ్లమని స్పష్టం చేశారు. 

ప్రజల సంక్షేమం కోసం కృషి - సీపీఎం...

ఢిల్లీ : త్రిపురలో పార్టీ ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. త్రిపురలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. సీపీఎం, లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటేసిన 45 శాతం మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, అన్ని రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని పేర్కొంది. గిరిజనులు..గిరిజనేతరుల ఐక్యం కోసం పని చేస్తామని వెల్లడించింది. 

15:40 - March 3, 2018
15:37 - March 3, 2018

మేడ్చల్ : జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డీసీఎం, నిల్వ ఉంచిన టైర్లు, ఆయిల్ కాలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఆఫీస్ పక్కనే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. పెద్దగా ఆస్తినష్టం జరగలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

ఏకపక్షంగా కాల్పులు - సీపీఐ మావోయిస్టు...

హైదరాబాద్ : పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో పది మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారిలో పార్టీ టాప్ క్యాడర్ ఎవరూ లేరని, ఓ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఎన్ కౌంటర్ చేశారన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రాంపూర్ మండలంకు చెందిన రత్నా నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయారని, మిగతా వారంతా సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందినవారన్నారు.

చనిపోయిన మావోయిస్టుల గుర్తింపు...

విజయవాడ : చర్ల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. సుక్మా జిల్లా వీరపురానికి చెందిన రామే, దబ్బపోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, బస్తర్ కు చెందిన కమల, తిప్పాపురానికి చెందిన దళ సభ్యుడు ఐతు, సింగంకు చెందిన బుద్రి, రంగాయిగూడెంకు చెందిన కోసి, ఇంద్రావతికి చెందిన మల్లేశ్, గంగులూరుకు చెందిన సుక్కి, బీజాపూర్ కు చెందిన రత్న, సోంబిలుగా గుర్తించారు. 

జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో అగ్నిప్రమాదం

మేడ్చల్ : జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

15:27 - March 3, 2018

తూర్పుగోదావరి : ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్స్ లో నిరసనను ఉధృతం చేసి పార్లమెంట్ ను స్థంభింపజేస్తామని ఎంపీ మురళీమోహన్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని కొత్తపేటలో వంతెన పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సెషన్ పూర్తయ్యే లోపు ఏపీ విషయంలో స్పష్టమైన హామీ రాకపోతే బీజేపీతో కొనసాగేది లేదని కరకండిగా చెప్పారు. ఏప్రిల్ 10వరకు తాము నిరసనలు తెలుపుతామని...అప్పటికీ తేల్చకుంటే సీఎం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. 

జేఎఫ్ సీ రిపోర్టు విడుదల...

హైదరాబాద్ : జేఎఫ్ సీ రిపోర్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. 

ఎంపీలతో భేటీ కానున్న కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సాయంత్రం భేటీ కానున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని అన్నారు. యూపీఏ సర్కార్ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి..పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 

 

14:28 - March 3, 2018

మేఘాలయ : రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హంగ్ ఏర్పడనుందా ? ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. మొత్తం 59 స్థానాలకు గాను కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్ పిపి 16, బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబట్టకపోవడంతో ఇతర పార్టీలపై ఆధార పడాల్సినవసరం ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్ నాథ్ లు షిల్లాంగ్ కు బయలుదేరారు. స్వతంత్ర అభ్యర్థులను తమవైపుకు లాక్కొవాలని ఇప్పటి నుండే కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గోవా, మణిపూర్ లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ రెండు చోట్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మేఘాలయలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. 

14:21 - March 3, 2018

త్రిపుర : రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కాషాయదళం ఆధిక్యంలో కొనసాగుతుండడం గమనార్హం. 25ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎం పార్టీకి ప్రజాదరణ చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. సీపీఎంకు వచ్చిన ఓట్ల శాతమే ఇందుకు నిదర్శనం. సీపీఎం ఓట్ల శాతంలో అందరికంటే ముందు స్థానంలో నిలిచింది. సీపీఎం 43.5 శాతం, బీజేపీ 42.01 శాతం, ఐపీఎఫ్ టీ -07.08 శాతం, కాంగ్రెస్ - 01.08 శాతం ఓటింగ్ సంపాదించాయి. 

విద్యార్థిని..విద్యార్థి మృతి...

రంగారెడ్డి : జిల్లాలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు దుర్మరణం చెందారు. టిప్పర్ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వైష్ణవి..లోకేశ్ లు మృత్యువాత పడ్డారు.

ముగ్గురు ప్రభుత్వాధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు...

విశాఖపట్టణం : మల్కాపురం వీఆర్వో సంజీవ్ కుమార్, అర్బన్ వీఆర్వో వెంకటేశ్వరరావు, జీవీఎంసీ ఛైర్మన్ నాగేశ్వరరావు నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. 21 టీంలు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే దానిపై ఈ సోదాలు జరుగుతున్నాయి. 

మళ్లీ అడవిలో కాల్పులు...

హైదరాబాద్ : తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దులో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. కోడిపుంజుల గుట్టల వద్ద మళ్లీ కాల్పుల కలకలం రేగింది. అగ్రనేతల లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది నక్సల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. 

బాబుకు కేవీపీ బహిరంగ లేఖ...

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడికి కేవీపీ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, యూపీఏ సర్కార్ పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, పోలవరం ప్రాజెక్టు అథార్టీ ఏర్పాటు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు అథార్టీ పనులు చేపట్టడానికి రాష్ట్రం ఉద్ధేశ్యపూర్వకంగానే సహకరించలేదన్నారు. టిడిపి గెలుపునకు సహకరించిన పవన్ ప్రశ్నించడంతో సీఎం చంద్రబాబు పోలవరం వివరాలు ఆన్ లైన్ లో పెట్టారన్నారు. 

నాగాలాండ్ లో ఓట్ల శాతం...

ఢిల్లీ : నాగాలాండ్ లో ఓట్ల శాతం వివరాలు ఇలా ఉన్నాయి : ఎన్ పీఎఫ్ 38.09 శాతం, ఎన్ డీపీపీ 27.05 శాతం, బీజేపీ 12.08 శాతం, ఎన్ పీఈపీ 07.03 శాతం ఓటింగ్ సంపాదించాయి. 

మేఘాలయాలో ఓట్ల శాతం...

ఢిల్లీ : మేఘాలయలో ఓట్ల శాతం వివరాలు ఇలా ఉన్నాయి : కాంగ్రెస్ 28.07 శాతం, ఎన్ పీఈపీ 20.02 శాతం, బీజేపీ 10.02 శాతం, యూడీపీ 11.05 శాతం, ఐఎన్ డి 10.05 శాతం, పీడీఎఫ్ 08.03 శాతం ఓటింగ్ సంపాదించాయి. 

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు..ఫలితాలు..

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపురలో సీపీఎం 15 స్థానాల్లో అధిక్యంలో కనబరుస్తూ 03 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 33 స్థానాల్లో అధిక్యంలో కనబరుస్తూ 08 స్థానాల్లో గెలుపొందింది. మేఘాలయలో కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ 10 స్థానాల్లో గెలుపొందింది. యూడీపీ 05 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తూ 08 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 05 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తూ 01 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 09 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తూ 09 స్థానాల్లో గెలుపొందారు. నాగాలాండ్ లో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్ ఫీఎఫ్ 05 స్థానాల్లో గెలుపొందింది.

13:34 - March 3, 2018
13:33 - March 3, 2018

రంగారెడ్డి : జిల్లాలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఉన్నత చదువులు చదివి తమకు చేదోడువాదోడుగా ఉంటాడని అనుకున్న కుటుంబసభ్యులకు తీరని విషాదం మిగిలింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు దుర్మరణం చెందారు. టిప్పర్ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వైష్ణవి..లోకేశ్ లు మృత్యువాత పడ్డారు. వీరు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వారు. సమాచారం తెలుసుకున్న కాలేజీ స్టూడెంట్స్...కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాలేజీకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

13:18 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కాషాయ దళం ఏం చేసింది ? ఎలాంటి మార్గాలు అనుసరించింది ? ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించింది ? ఇలా అనేక ప్రశ్నలకు కొండూరి వీరయ్య సమాధానం ఇచ్చారు. త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి కొండూరి వీరయ్యతో ముచ్చటించింది. విధానపరమైన రాజకీయాలతో సీపీఎం గెలుస్తుందని..కానీ విచ్చినకరమైన...ధనిక రాజకీయల్లో సీపీఎం గెలవదన్నారు. త్రిపురలోని ఒక్కో నియోజకవర్గంలో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టారని..ఇక్కడ సీపీఎంను ఓడించడానికి విచ్చిన్నకరమైన శక్తులతో కాషాయం జత కట్టిందన్నారు. నీతి బాహ్యమైన రాజకీయాలకు తెరలేపిందన్నారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సరియైన సమయంలో నిధులు ఇవ్వకుండా కేంద్రం కాలయాపన చేయడం...రాష్ట్ర ప్రభుత్వం సరియైన విధంగా అభివృద్ధి చేయడం లేదని ప్రజల్లో ఒక విధమైన నమ్మకం ఏర్పరిచే విధంగా ప్రయత్నించిందన్నారు.

ధనం..విచ్చిన్నకరమైన..రాజకీయ పార్టీల కప్ప దాటు వైఖరే సీపీఎం ఆధిక్యంలో కొనసాగపోవడానికి కారణమని కానీ ఇక్కడ సీపీఎం ఓటు బ్యాంకు అలాగే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని నేతలు గుంపులు గుంపులుగా బీజేపీలో చేరారని...తామే గెలిచామని బీజేపీ చెప్పుకుంటుంటే వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ప్రస్తుతం త్రిపుర రాష్ట్రం విడిపోతుందా ? లేదా ? అనేది ఈ సమయంలో చెప్పలేమని, 20 సంవత్సరాలుగా శాంతిభద్రతలను కాపాడడంలో మాణిక్ సర్కార్..సీపీఎం సక్సెస్ అయ్యిందన్నారు. మతోన్మాద కలహాలు సీపీఎం అధికారంలో ఉన్న సమయంలో బెంగాల్ లో చోటు చేసుకోలేదని, అధికారంలో నుండి పక్కకు వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

త్రిపుర, నాగాలాండ్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

కోహిమ : త్రిపుర, నాగాలాండ్ లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. కానీ మేఘాలయలో మాత్రం అధిక్యంలో కొనసాగుతోంది. 

12:56 - March 3, 2018
12:46 - March 3, 2018
12:41 - March 3, 2018

ఖమ్మం : ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టును పోలీసులు గుర్తించారు. దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ గా గుర్తించారు. ఇతని స్వస్థలం కాజీపేట మండలతం రాంపేట్ అని పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ ఎన్ టీఎస్ జడ్ సీ సభ్యుడే కాకుండా యాక్షన్ టీం కమాండర్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఇతని మృతదేహం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు.

భూపాలపల్లి జిల్లా సరిహద్దు వెంకటాపురం మండలం తడపల గుట్టలు, ఛత్తీస్ గడ్ రాష్ట్ర పూజారి కాంకేడ్ మధ్య కొండపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 10 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులున్నారు. 

12:36 - March 3, 2018

భద్రాచలం : ఏరియా ఆసుపత్రి వద్ద ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నక్సల్స్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా సరిహద్దు వెంకటాపురం మండలం తడపల గుట్టలు, ఛత్తీస్ గడ్ రాష్ట్ర పూజారి కాంకేడ్ మధ్య కొండపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 10 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి ఆజాద్, పూర్వ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ నేతృత్వంలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సమావేశమవుతుండగా ఈ ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది.

ఇందులో హరిభూషణ్ మృతి చెందాడు. వీరందరికీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అంబర్ కిషోర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. కానీ మావోయిస్టు మృతదేహాల గుర్తింపులో పోలీసులు తర్జన భర్జనలు పడుతున్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు హరిభూషణ్ కుటుంబసభ్యులు వచ్చారు. సోదరుడు..సోదరితో టెన్ టివి ముచ్చటించింది. తమ అన్నయ్య చిన్నప్పుడే ఇంటి నుండి వెళ్లిపోయాడని, మృతి చెందింది అన్నయ్యనేనా కాదా ? తెలుసుకోవడానికి వచ్చామన్నారు. అన్నయ్య పెద్ద చదువులు చదువుకుంటున్నాడని అని అమ్మ చెప్పేదని, ఎవరైనా లొంగిపోతే అందులో తన అన్నయ్య ఉంటే బాగుండేదనని అనిపించేదన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:22 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు కొత్తదనం కోరుకున్నారా ? గత 25 ఏళ్లుగా అభివృద్ధే ధ్యేయంగా..ప్రజల సంక్షేమమే ధ్యేయంగా త్రిపురలో అధికారంలో అప్రతిహతంగా కొనసాగుతున్న వామపక్ష ప్రభుత్వాన్ని అక్కడి రాష్ట్ర ప్రజలు వద్దనుకున్నారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తే ఉత్పన్నమౌతున్నాయి. ఈశాన్య రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానంగా త్రిపురలో కాషాయ దళం అధిక్యంలో కొనసాగుతుండడం గమనార్హం.

త్రిపుర రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ ఎన్నో వ్యూహాలు రచించింది. అందులో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారితో జత కట్టింది. త్రిపురలో బిజెపి...ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపురతో జతకట్టింది. ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న వారితో కాషాయం పొత్తు పెట్టుకోవడం గమనార్హం. అంతేగాకుండా త్రిపుర రాష్ట్రంలో విభజన రాజకీయాలకు తెరలేపడం..గిరిజనులు..గిరిజనేతరుల మధ్య చిచ్చు రేపిందని సీపీఎం నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని బీజేపీతో జత కట్టిన పార్టీలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

నాగాలాండ్ లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో జత కట్టి ఎన్నికల బరిలో నిలిచింది. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని, ఇతర సంక్షేమ పథకాలు చేస్తామని ఆయా పార్టీలు పేర్కొన్నాయి. ఎన్పీఎఫ్ 24 స్థానాల్లో అధిక్యం కొనసాగుతుండగా బీజేపీ 30, ఇతరులు 06 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.

మేఘాలయాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి (2018)లో కొన్ని స్థానాలు కోల్పోయినా ఇతర పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 18 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 13 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతూ 02 స్తానాలోల్ గెలుపొందింది. ఇక్కడ బీజేపీ 6 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతూ 01 స్థానంలో విజయం సాధించింది.

ప్రారంభమైన జేఎఫ్ సీ సమావేశం

హైదరాబాద్ : జేఎఫ్ సీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి పవన కల్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్, జయ ప్రకాష్ నారాయణ హాజరు అయ్యారు. వీరికి నివేదికను త్రిసభ్య కమిటీ అందజేయనుంది. 

12:04 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ను భారీ భద్రత నడుమ ప్రారంభమైంది. ప్రధానంగా త్రిపురపైనే అందరి దృష్టి నెలకొంది. గత 25 ఏళ్లుగా అక్కడ సీపీఎం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కాషాయం జత కట్టి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించింది. అందులో భాగంగా త్రిపురలో ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపురతో జతకట్టింది. విభజన రాజకీయాలకు తెరలేపడం..రాష్ట్రంలో చిచ్చు రేపడానికి ప్రయత్నించిందని సీపీఎం నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రం విభజించాలని కోరుతున్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కారణమని తెలుస్తోంది.

గత మూడు సంవత్సరాలుగా ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సంఘ్ పరివార్ శక్తులు కొన్ని ప్రయత్నాలు చేసినా వామపక్ష భావాలు బలంగా ఉండడం ఆ ప్రయత్నాలు అంతగా పారలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పశ్చిమబెంగాల్ జరుగుతున్న పరిణామాలు, సమీకరణాలు త్రిపుర ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మేఘాలయాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా నాగాలాండ్ లో మాత్రం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మేఘాలయలో కాంగ్రెస్ అధిక్యం

కోహిమ : మేగాలయలో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రస్తుతం 27 స్థానాల్లో యూడీపీ 10 స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. 

త్రిపురలో అధిక్యం దిశగా బీజేపీ

అగర్తాల : త్రిపురలో బీజేపీ కూటమి అధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం బీజేపీ కూటమి 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా సీపీఎం 17 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. 

మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్

ఢిల్లీ : మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. త్రిపురలో బీజేపీ, మేఘాలయలో కాంగ్రెస్, నాగాలాండ్ లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది. 

మావోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం

కొత్తగూడెం : భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఎన్ కౌంటర్ చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం చేశారు. పోస్టు మార్టంను నలుగురు ఫోరెన్పిక్ నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. 

11:16 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కాషాయ దళం ఉత్సాహం చూపుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా చెప్పడం గమనార్హం. ప్రధానంగా త్రిపురలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక్కడ కాషాయ దళం విభజన రాజకీయాలకు తెరలేపిందని..త్రిపుర రాష్ట్రంలో గిరిజనులు..గిరిజనేతరుల మధ్య చిచ్చు పెట్టిందని సీపీఎం నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీపీఎం ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు సమర్పించాయి. ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రాన్ని చీల్చే విధంగా బీజేపీ ప్రయత్నించిందని, 25 ఏళ్లుగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్న రాష్ట్రంలో కాషాయం చిచ్చు రేపిందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మేఘాలయాలో కాంగ్రెస్ కొంత ముందంజలో దూసుకెళుతోంది. నాగాలాండ్ లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. 

సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి...

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల కౌంటింగ్ కొనసాగుతోంది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కాసేపటి క్రితం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. 

11:05 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం 08 గంటలకు ప్రారంభమైంది. ఈశాన్య భారతంలో అధికారం చేజిక్కించుకోవాలని కాషాయ దళం ఉత్సుహకతో ఉంది. ముఖ్యంగా త్రిపురలో ఆ పార్టీ అధికార కుర్చీ చేపట్టాలని వ్యూహాలు రచించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకే అనుకూలంగా రావడం విశేషం. పాతికేళ్లుగా అధికారంలో ఉన్న వామపక్షాలను గద్దె దించాలని బీజేపీ పలు అక్రమాలకు పాల్పడిందని...అక్రమమైన పద్ధతులు అనుసరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. త్రిపురలో బీజేపీ, వామపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 38 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా సీపీఎం 21 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.
ఇక మేఘాలయలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ యూడీపీ 12, బీజేపీ 5 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.
నాగాలాండ్ లో ఎన్పీఎఫ్ 25 స్థానాల్లో, బీజేపీ 32 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది. 

త్రిపురలో దూసుకుపోతున్న సీపీఎం

అగర్తాల : త్రిపురలో సీపీఎం దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సీపీఎం మ్యాజిక్ ఫిగర్ అధిక్యాన్ని సాధించింది.

08:25 - March 3, 2018

ఢిల్లీ : ఈశాన్య భారతంలోని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు వద్ద కేంద్రాల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయా, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరిగింది. కానీ అందరి చూపు త్రిపుర ఎన్నికల కౌంటింగ్ పైనే ఉంది. పాతికేళ్లుగా త్రిపురలో సీపీఎం అధికారంలో కొనసాగుతోంది. అధికారం చేపట్టకముందు రావణకాష్టంగా ఉన్న రాష్ట్రాన్ని వామపక్షం అధికారంలోకి వచ్చిన తరువాత శాంతియుత వాతావరణం నెలకొందని విశ్లేషకులు పేర్కొంటుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి వాతావరణం ఎలా ఏర్పడిందని చర్చించుకుంటుంటారు.

మాణిక్ సర్కార్...
త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ నిజాయితిపరుడని..అత్యంత పేద ముఖ్యమంత్రి. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా.. నమ్మిన సిద్ధాంతాలకోసమే సంపాదనను ఖర్చు చేస్తోన్న ఆదర్శ రాజకీయవేత్త. త్రిపుర రాష్ట్రానికి 1998లో తొలిసారి ఎన్నికైన మాణిక్‌ సర్కార్.. అప్రతిహతంగా ఐదు పర్యాయాలూ ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. మాణిక్‌సర్కార్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ... అతి సాధారణవ్యక్తి మాదిరిగా జీవిస్తున్నారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్‌ సర్కార్‌కు కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడగా లేదు. బయటికి వెళ్లేప్పుడు, రిక్షాల్లోనూ.. రైల్వే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. రాజకీయాలు అనగానే.. దోపిడికి దగ్గర దారి అని భావించే ఎందరో నాయకులకు.. మాణిక్‌ సర్కార్‌ నిబద్ధత.. జీవనశైలి నిస్సందేహంగా ఆదర్శప్రాయమే.

కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో కాషాయ దళం విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. లెఫ్ట్ వ్యతిరేక శక్తులను ఒకతాటి పైకి తెచ్చి బీజేపీ కొనుగోలు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విలువలకు పట్టం కడుతారా ? అవకాశ వాదం తాత్కాలికంగా విజయం సాధిస్తుందా ? అనేది చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

08:15 - March 3, 2018

త్రిపుర(32/59) :

  అధిక్యం   గెలుపు 
సీపీఎం 09 08
బీజేపీ 18 24
కాంగ్రెస్  00 00
ఇతరులు 00 00

 

మేఘాలయ(48/59) :

  అధిక్యం  గెలుపు 
కాంగ్రెస్  04 18
యూడీపీ  01 17
బీజేపీ  01 01
ఇతరులు  05 12

 

నాగాలాండ్(29/60) :

  అధిక్యం గెలుపు 
ఎన్ ఫీఎఫ్  15 14
బీజేపీ  14 14
కాంగ్రెస్  00 00
ఇతరులు 02 01

 

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

   

 •  మేఘాలాయలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
 • త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ధన్ పూర్ అంసెబ్లీ స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. 
 • త్రిపురలో దూసుకుపోతున్న సీపీఎం 
 • నాగాలాండ్ బీజేపీ కూటమి అభ్యర్థి విజయం సాధించారు.
 • నాగాలాండ్  లో బీజేపీ కూటమి ముందంజ
 •  త్రిపురలో సీపీఎం, బీజేపీ మధ్య హోరహోరీ పోటీ జరగుతుంది.         
 • మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి.
 • త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయా, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరిగింది.
 • త్రిపురలో సిపిఎం 57 స్థానాలు, ఆ పార్టీతో కూటమిలో ఉన్న సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యుషనరీ సోషలిస్ట్‌ పార్టీ ఒక్కో స్థానం చొప్పున పోటీ చేశాయి.
 • త్రిపురలో బిజెపి ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపురతో జతకట్టింది.
 • బిజెపి 51, ఐపిఎఫ్‌టి 9, కాంగ్రెస్‌ 59, టిఎంసి 24 స్థానాల్లో పోటీ చేశాయి.
 • మేఘాలయలో 59 స్థానాల్లో కాంగ్రెస్, 47 స్థానాల్లో బిజెపి పోటీ చేశాయి.
 • నాగాలాండ్‌లో బిజెపి ఎన్‌డిపిపితో చేతులు కలిపింది. ఎన్‌డిపిపి 39 స్థానాలు, బిజెపి 20 స్థానాల్లో పోటీ చేశాయి.
 • నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 58 స్థానాలు, కాంగ్రెస్‌ 18 స్థానాల్లో పోటీపడ్డాయి.

కౌంటింగ్ ప్రారంభం...

ఢిల్లీ :  త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సాయంత్రం మూడు గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

07:17 - March 3, 2018

ఇన్నాళ్లు ఎంత పోరాటం చేసిన కేంద్రం నుంచి స్పందన రాలేదని, కేంద్రం మధ్య సమన్వయం లేకుండా బీజేపీ, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ప్రముఖ విశ్లేషకులు వినయ్ అన్నారు. టీడీపీ గత నాలుగేళ్ల నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుందని, కానీ కేంద్రం పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని, ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి ఏపీకి న్యాయం చేయకుంటే కేంద్రం టీడీపీ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేత చాంద్ సాంబశివరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నేడు మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

కోహిమ : నేడు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

07:09 - March 3, 2018

కోహిమ :  ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వేర్వేరు కారణాల వల్ల త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 59 స్థానాలకే పోలింగ్‌ జరిగింది. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయా, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరిగింది. త్రిపురలో సిపిఎం అభ్యర్థి, మేఘాలయలో ఎన్‌సిపి అభ్యర్థి మృతి చెందడంతో పోలింగ్‌ వాయిదా పడింది. నాగాలాండ్‌లో ఎన్‌డిపిపి చీఫ్‌ నెయిఫ్యూ రియోను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

త్రిపురలో సిపిఎం 57 స్థానాలు
త్రిపురలో సిపిఎం 57 స్థానాలు, ఆ పార్టీతో కూటమిలో ఉన్న సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యుషనరీ సోషలిస్ట్‌ పార్టీ ఒక్కో స్థానం చొప్పున పోటీ చేశాయి. త్రిపురలో బిజెపి ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపురతో జతకట్టింది. బిజెపి 51, ఐపిఎఫ్‌టి 9, కాంగ్రెస్‌ 59, టిఎంసి 24 స్థానాల్లో పోటీ చేశాయి. మేఘాలయలో 59 స్థానాల్లో కాంగ్రెస్, 47 స్థానాల్లో బిజెపి పోటీ చేశాయి. నాగాలాండ్‌లో బిజెపి ఎన్‌డిపిపితో చేతులు కలిపింది. ఎన్‌డిపిపి 39 స్థానాలు, బిజెపి 20 స్థానాల్లో పోటీ చేశాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 58 స్థానాలు, కాంగ్రెస్‌ 18 స్థానాల్లో పోటీపడ్డాయి.త్రిపురలో గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలో వామపక్ష కూటమే అధికారంలో ఉంది. వరుసగా ఆరోసారి గెలిచి రికార్డ్‌ సాధించాలని సిపిఎం ఉవ్వీళ్లూరుతోంది. మేఘాలయాలో గత పదేళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి ముచ్చటగా మూడోసారి అధికార పీఠం దక్కించుకోవాలని భావిస్తోంది.

2003 నుంచి నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అధికారం
నాగాలాండ్‌లో 2003 నుంచి నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉంది. 2008లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో 3 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత ఎన్‌పిపినే అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్జిట్‌ పోల్స్‌ మాత్రం బిజెపి వైపే మొగ్గు చూపాయి. త్రిపురలో బిజెపి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. నాగాలాండ్‌లోను బిజెపి-ఎన్‌డిపిపి కూటమి గెలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. మేఘాలయంలో మాత్రం హంగ్‌ ఏర్పడుతుందని ఎగ్జిట్‌పోల్స్‌ జోస్యం చెప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎంతవరకు నిజమౌతాయన్నది శనివారం వెలువడే ఫలితాల్లో తేలనుంది.

07:07 - March 3, 2018

హైదరాబాద్ : డిజిటల్ సర్వీస్ ప్రోవైడర్ల తీరును నిరసిస్తు భారత చలన చిత్ర పరిశ్రమల జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు బంద్‌ నిర్వహించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేలాదిగా థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ, తెలంగాణలో దాదాపు అన్ని థియేటర్లు మూసివేశారు. దీంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి లేక వెలవెలబోయాయి.

అధిక మొత్తంలో వసూలు చేయడం..
డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు వర్చువల్ ప్రింట్ ఫీజుని ప్రాంతీయ చిత్రాలపై అధిక మొత్తంలో వసూలు చేయడం.. ఇంగ్లీషు సినిమాలకు అసలు ఫీజు వసూలు చేయకపోవడం థియేటర్ల నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. వీటితో పాటు ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా 20 నిముషాల పాటు ప్రకటనలు వేయడం..ఇక ట్రైలర్స్‌ విషయంలో అధికంగా డబ్బులు వసూలు చేస్తుండటంతోపాటుగా మరికొన్ని అంశాలు నష్టం చేకూరుస్తున్నాయని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగిరాక పోతే వేరే కంపెని సర్వీస్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతామని డిస్టిబ్యూటర్స్ చెబుతున్నారు. దీంతో సగటు ప్రేక్షకుడు సినిమా చూడాలంటే ఇంకా ఎన్నిరోజులు పట్టొచ్చో.. ఇప్పుడే చెప్పలేం.

 

06:59 - March 3, 2018

హైదరాబాద్ : తెలంగాణలో హస్తంపార్టీకి కొత్త అస్త్రం దొరికింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గులాబీపార్టీకి చుక్కలు చూపించే వ్యూహానికి పదునుపెడుతోంది. కేసీఆర్‌ బంధువుకు రాజ్యాసభ సీటు దక్కకుండా పక్కాగా స్కెచ్‌వేస్తోంది. రాజ్యసభ సీటును అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. తన బంధువైన సంతోష్‌రావుకు రాజ్యసభ సీటును కట్టబెట్టేందుకు కేసీఆర్‌ రెడీ అయ్యారని హస్తంపార్టీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది.

మూడు రాజ్యస‌బ సీట్లు
తెలంగాణ‌లో మూడు రాజ్యస‌బ సీట్లు ఖాళీ అవుతున్నాయి. తమకున్న సంఖ్యాబలం ఆధారంగా టీఆర్‌ఎస్‌కు రెండు సీట్లు దక్కుతాయి. కాగా మూడో స్థానం కూడా ప్రత్యర్థులకు దక్కకుండా గులాబీపార్టీ వ్యూహాలు పన్నుతోంది. కాంగ్రెస్ , టిడిపి , వైసీపీ, సీపిఐల నుంచి గులాబీపార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో మూడ‌వ సీటును కూడా తమ ఖాతాలోనే వేసుకోవచ్చని అధికారపార్టీ భావిస్తోంది. అయితే ఈ మూడవ సీటును కేసీఆర్‌ తనకు కుమారుడి వరసఅయ్యే సంతోష్‌రావుకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఇపుడు ఆయుధంగా వాడుకోవాలని హస్తంపార్టీ రెడీ అయ్యింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ మద్దతుతో వ‌చ్చే రాజ్యస‌భ సీటును తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబాల్లో ఒకరికి కేటాయించానలన్న డిమాండ్‌ను కాంగ్రెస్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈవిష‌యాన్ని లేవ‌నెత్తిన రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ బంధుపక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే .. మూడవ సీటును అమవర వీరుల కుటుంబాలకు కేటాయించాలని కాంగ్రెస్‌నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

వ్యూహం వెనుక మూడు లక్ష్యాలు
తమ వ్యూహం వెనుక మూడు లక్ష్యాలు ఉన్నాయని కాంగ్రెస్‌నేతలు చెప్పుకుంటున్నారు. ఒకటి.. కేసిఆర్‌ బంధువైన సంతోష్‌రావుకు టికెట్ దక్కకుండా అడ్డుకోవడం. రెండు.. ఒక‌వేళ సంతోష్ వైపు కేసీఆర్ మొగ్గుచూపితే.. ప‌ద‌వుల‌న్నీ కేసీఆర్ కుటుంబానికేనా అన్న వాద‌న‌తో టీఆర్‌ఎస్‌ను తెలంగాణ స‌మాజం ముందు దోషిగా నిల‌బెట్టవ‌చ్చు. ఇక మూడో టార్గెట్‌ పార్టీ ఫిర్యాయించిన ఎమ్మెల్యేలపై పెట్టింది హస్తంపార్టీ. వలస ఎమ్మెల్యేలు సంతోష్‌రావుకు మద్దతు ఇస్తే.. ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటుకు మార్గం సుగమం అవుతుందనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా ఒకే బుల్లెట్‌తో మూడు టార్గెట్‌లు ఎయిమ్‌ చేస్తున్న హస్తంపార్టీ.. ఫలితం ఏదయినా తమకు లాభమే అనే భావనలో ఉంది.

 

06:58 - March 3, 2018

మనం పశువులకు ముఖ్యంగా పెట్టవాల్సింది పశుగ్రాసం. మనం వేసే పశుగ్రాసంలో పోషకాలు ఎక్కువ ఉండేవిధంగా చూసుకోవాలి. అందుకే పోషకలు ఎక్కువగా ఉన్న అవిశ గడ్డి, దశరథ గడ్డి పెంచుకోవాలని ఆదర్శ రైతు బ్రహ్మయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ భేటీ

హైదరాబాద్ : నేడు సాయంత్రం 4గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటీర పార్టీ సమావేశం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం వారు చర్చించనున్నారు.

నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్

హైదరాబాద్ : నేటి నుంచి రెండు రోజులపాటు గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని, హోంమంత్రిని కలవనున్నారు.

Don't Miss