Activities calendar

04 March 2018

21:53 - March 4, 2018

నిజామాబాద్ : వచ్చే ఎన్నికల్లో దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా నిశ్శబ్ధ విప్లవం నడుస్తోందని ఆయన నిజామాబాద్‌లో కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రలో అన్నారు. బస్ యాత్రకు స్పందన లేదని.. సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు ఉత్తమ్. రాష్ట్రంలో ఏం జరుగుతోందో సీఎంకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.

 

21:51 - March 4, 2018

గుంటూరు : ఒక‌వైపు పార్లమెంట్ స‌మావేశాలు, మ‌రోవైపు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండు వేడిని రాజేయ‌నున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌లు ఒక‌వైపు ఠారెత్తిస్తుంటే మ‌రోవైపు పోలిటిక‌ల్ పార్టీల వ్యూహ‌ ప్రతివ్యూహాలతో అంతే వేడిని పుట్టిస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో... టీడీపీ, బీజేపీ మధ్య తమ అంతరం ఎంత ఉందో కూడా బయటపడనుంది. 
18రోజుల పాటు స‌మావేశాలు 
ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వరకు మొత్తం 18రోజులు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేసి హస్తినకు పంపిన చంద్రబాబు... బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహ‌ల‌ను సిద్దం చేసుకున్నారు. సోమవారం ఉద‌యం 9 గంటల 28గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ స‌మావేశం నిర్వహించి సభను ఎన్నిరోజులు నిర్వహించాలి... సభలో ఏయే అంశాలు చర్చకు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 8న ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే గత సమావేశాల తరహాలోనే... ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీ వైసీపీ సభకు హాజరుకావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ చర్యలు తీసుకునే వరకు.. సభకు హాజరుకాలేదని ప్రతిపక్ష నేత జ‌గ‌న్ సృష్టం చేశారు. వైసీపీ తమ నిర్ణయంపై పునరాలోచించుకొని.. సభకు హాజరు కావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. వైసిపి గైర్హాజరుతో... సభలో టీడీపీ, బీజేపీ మాత్రమే ఉండనున్నాయి.
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బీజేపీ
ప్రతిపక్షం వైసీపీ రాకపోయినా... టిడిపి మాత్రం అన్ని అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటోంది. ఇన్ని రోజులు మిత్రప‌క్షంగా ఉన్న బిజెపి కూడా అధికార పార్టీపై స్వరం పెంచడంతో... ఎవరు ఏది అడిగినా... స‌మాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉండాల‌ని.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. తమ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు జారీ చేశారు. అటు బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు.. తాము ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో సభకు ప్రస్తావించి సర్కారును ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అటు కమలనాథులను ఎదుర్కొనేందుకు దేశం నేతలు సిద్ధంగా ఉన్నారు. సమావేశాల్లో 29 అంశాల‌ను చ‌ర్చించాల‌ని టిడిపి భావిస్తోంది. అందులో విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా, కేంద్ర సహకారం, రాయ‌ల‌సీమ‌లో పారిశ్రామిక అభివృద్ది, రాజ‌ధానికి నిధులు, పోల‌వ‌రం, పురుషోత్తంప‌ట్నం, కృష్ణా గోదావ‌రి, పెన్న న‌దుల అనుసంధానం, ధ‌ర‌ల స్థిరీకరణ, పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం, చంద్రన్న పెళ్లికానుక త‌దిత‌ర అంశాల‌పై స‌భ‌లో చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇంతేకాకుండా గ‌త కొద్ది రోజులుగా ఏపీకి ఎన్నో ఇచ్చాం అని చెబుతున్న కేంద్రం ప్రకటనలపై సభ సాక్షిగా... అస‌లు రాష్ట్రానికి ఎంత ఇచ్చారు...ఇంకా ఎంత ఇవ్వాలి అనేదానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. మొత్తం మీద ఈసారి ప్రతిపక్షం లేకపోయినా.. బీజేపీని ఆ పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ స‌వాళ్లు-ప్రతిసవాళ్ల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. 
 

 

21:45 - March 4, 2018

హైదరాబాద్ : జాతీయస్థాయిలో మార్పు రావాల్సిన అవసరముందన్న కేసీఆర్‌కు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీలేదని.. ఖచ్చితంగా నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ కూటమి ఏర్పడాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. ప్రజల ఆశీస్సులతో ఈస్థాయికి వచ్చిన తనకు అందరి మద్దతు ఉంటే... ఖచ్చితంగా కొత్త మార్గదర్శకత్వం సూచిస్తానని స్పష్టం చేశారు గులాబీ దళపతి. 

పది లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని.. తనను పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల దీవెనలు ఉంటే ఈ దేశానికి ఓ కొత్త దశ దిశ చూపిస్తానన్నారు కేసీఆర్‌. జాతీయ స్థాయిలో మార్పు రావాల్సిన అవసరముందని ప్రకటించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీస్థాయిలో నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. ప్రగతి భవన్‌కు వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. దేశంలో పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరముందన్నారు. జాతీయస్థాయిలో నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ పార్టీ అవతరించాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. 

నిన్న కేవలం నాలుగు మాటలు చెబితే దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు కేసీఆర్‌. పశ్చిమబంగా నుంచి మమతాబెనర్జీ ఫోన్‌ చేసి... తన సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. అలాగే జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరన్‌, మహారాష్ట్ర నుంచి కొందరు ఎంపీలు ఫోన్‌ చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలన ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినవారు రాజకీయ ఆటలాడుతున్నారే తప్ప వాస్తవ దృక్పథంతో పని చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే.. నాలుగేళ్లలో ఏం జరగలేదన్నారు. చైనా 24 ఏళ్లలోనే అమెరికా తర్వాత అత్యంత బలమైన దేశంగా మారిందన్నారు. చైనాలో అయినప్పుడు.. మన దగ్గర ఎందుకు కాదు. దేశంలో పేదరికం పోవాలంటే కథలు, ఉపన్యాసాలు చెబితే సరిపోదన్నారు. జపాన్‌, చైనా, సింగపూర్‌ ఎలా పైకొచ్చాయో ఈ దేశం కూడా అలా పైకి రావాలి. ధైర్యం, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వందశాతం వచ్చి తీరుతుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వానికి దవాఖాన, మున్సిపల్‌ మోరీల వద్ద ఏం పని అని కేసీఆర్‌ ప్రశ్నించారు. వాళ్లు చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలపై అజమాయిషీ చలాయిస్తున్నారన్నారు. రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతున్నారని మాట్లాడుతుంటే జైల్లో పెడతామంటూ బెదిరిస్తున్నారన్నారు. కుంభకోణాలు చేసే వాళ్లు భయపడతారని.. కొందరిని పట్టుకుంటే భస్మమవుతారన్నారు. ఈ దేశంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరముందని... మార్పు రావాలంటే ఎక్కడో ఒకచోట మొదలవ్వాలని అన్నారు. కేంద్రం వద్ద కేవలం పరిమిత అధికారాలు మాత్రమే ఉంచుకుని.. మిగతా అధికారాలు రాష్ట్రానికి ఇస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. 

తనకు మద్దతు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల దీవెనలు ఉంటే ఈ దేశానికి ఓ కొత్త దశ, దిశ చూపిస్తానన్న కేసీఆర్‌... జై తెలంగాణ, జై భారత్‌ అంటూ ప్రసంగాన్ని ముగించడం కొసమెరుపు.

21:38 - March 4, 2018

గుంటూరు : దళితులపై దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. దళిత ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దళితుల భూములను లాగేసుకుంటున్నారని వాపోయారు. జన్మభూమి కమిటీలు కావు.. రాక్షస కమిటీలు అని మండిపడ్డారు. 2 నెలలు దాటుతున్న ఇప్పటికే పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరగలేదన్నారు. ఈ కేసులో పోలీసుల తీరు అత్యంత దుర్మార్గమన్నారు. దళితుల ఆత్మగౌరవ సభకు వస్తున్న పెదగొట్టిపాడు మహిళను అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ఈ కేసులో అగ్రకులాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరగకపోతే..రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. మరో 15 రోజుల్లో అసలైన దోషులను అరెస్టు చేయకపోతే చలో రాజమండ్రి, చలో ఏలూరు, చలో ఒంగోలు, చలో నెల్లూరు చేపడతామన్నారు. 

పోలీసుల తీరు అత్యంత దుర్మార్గం : పి.మధు

గుంటూరు : 2 నెలలు దాటుతున్న ఇప్పటికే పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరుగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. దళిత ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో పోలీసుల తీరు అత్యంత దుర్మార్గమన్నారు. దళితుల ఆత్మగౌరవ సభకు వస్తున్న పెదగొట్టిపాడు మహిళను అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ఈ కేసులో అగ్రకులాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరగకపోతే..రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. మరో 15 రోజుల్లో అసలైన దోషులను అరెస్టు చేయకపోతే చలో రాజమండ్రి, చలో ఏలూరు, చలో ఒంగోలు, చలో నెల్లూరు చేపడతామన్నారు. 

21:02 - March 4, 2018

గుంటూరు : చిన్నారుల కోసం 'పలకరింపు' కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశారు. ఈనెల 5 నుంచి 31 వరకు 21 రోజులు పాటు "పలకరింపు" కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని అన్నీ ఇళ్లను సందర్శించనున్నారని తెలిపారు. ఐదేళ్లలోపు 50 లక్షల మంది చిన్నారుల ఆరోగ్యాన్ని పరీక్షించడం,.. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తారన్నారు చంద్రబాబు. పోషక లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి జాగ్రత్తలు, సూచనలు అందించడం, అనారోగ్యంతో ఉన్న పిల్లలను గుర్తించి తగిన చికిత్స అందించడం జరుగుతుందన్నారు.

20:53 - March 4, 2018

'ప్రత్యేకహోదా'పై పోరేదారి అనే పేరుతో టెన్ టివి కర్నూలులో బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు నేతలు, సంస్థల ప్రతినిధులు ఆర్గనైజేషన్ల నాయకులు, విద్యార్థులు పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. బీజేపీ, టీడీపీ నాటకాలు కట్టిపెట్టి హోదా ఇవ్వాలన్నారు. రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం..కరువుతో అల్లాడుతున్న ప్రాంతమని.. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ రాయలసీమకు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బిగ్ డిబేట్ లో ఎమ్మెల్సీ గేయానంద్, టీడీపీ నేత నాగేశ్వర్ యాదవ్, బీజేపీ నేత కపిలీశ్వరయ్య, వైసీపీ నేత రామయ్య, వైసీపీ నాయకురాలు గౌరు చరిత, సీపీఐ నేత రసూల్, విజయకుమార్ రెడ్డి, నాగలక్ష్మీ, ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ చెన్నయ్య పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:21 - March 4, 2018

హైదరాబాద్ : హుస్సేన్‌సాగ‌ర్‌ను  క్లీన్ చేస్తాం... నీటినంతా తీసేసి పూడిక తీస్తాం.. మ‌ళ్లి మంచినీటి చెరువుగా మారుస్తాం... అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రక‌టిన ఇది. సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభుత్వ ప్రకటన మాటకే పరిమితం అయింది,   సాగ‌ర్ క్లినింగ్ పై స్పష్టత రానేలేదు. ఆస్ట్రీయా మోడ‌ల్ అన్నారు.. లెజ‌ర్ క్లీనింగ్ అన్నారు... ఇప్పుడు మ‌రో సారీ గ్లోబ‌ల్ ట్రీట్మెంట్ అంటున్నారు.  అస‌లు  సాగ‌ర్ కి మోక్షం ల‌బిస్తుందా..? మురుకూపంగా ఉన్న హుస్సేన్‌ సాగర్‌ మంచినీటి చెరువుగా మారేదెప్పు.. ? 
సాగర్‌ను శుద్ధి చేస్తామని 2ఏళ్ల క్రితం ప్రకటన 
హుస్సేన్‌ సాగర్‌లో నీటిని పూర్తిగా ఖాళిచేసి.. శుద్ది చేస్తామని గ‌త రెండేళ్ల క్రితం ప్రకటించింది  ప్రభుత్వం .దీనికోసం ఆస్ట్రియా దేశం నుంచి ప్రతినిధి బృందం కూడా వచ్చి  సాగ‌ర్ ను  ప‌రిశీలించింది. కాని ఆస్ట్రియా ప్రతి నిధి బృందం మాంత్రం దీనిపై ఎలాంటి రిపోర్టు   ఇవ్వలేదు. ఇక కెనడాకు చెందిన ఓ స్వచ్చంధం సంస్థ సోలార్ టెక్నాలజీని ఉప‌యోగించి సాగర్ నీటిని శుద్ది చేస్తామని ఒ పెద్ద ప్రయోగ‌మే చేసింది. అయితే అప్పట్లో కొద్దిగా మార్పు వ‌చ్చింద‌ని అధికారులు చెప్పినా ప‌రిస్థితి ఎక్కడ వేసిన గోంగ‌డి అక్కడే అన్నట్టుగా మారింది. 
నెక్లెస్‌రోడ్డులో పనిచేయని ట్రీట్‌మెంట్ ప్లాంట్
సాగ‌ర్ ను శుద్ది చేయాలంటే ముందుగా  జలాశయంలోని  వ‌చ్చే మురుగును అపాలి,   ఆరువాతే  పూడిక , వ్యర్థాలు తొల‌గించాల్సి ఉంది. హుస్సేన్ సాగర్‌లోకి నాలుగు ప్రధాన కాలువలనుండి మురుగునీరు వస్తోంది. బల్కపూర్ నాల, బంజారానాలా, పికేట్ నాలనుండి సివరేజ్ వాటర్  సాగ‌ర్ లోకి వ‌స్తుండ‌గా..  కూకట్ పల్లి నాల నుండి పారిశ్రామిక వ్యర్థ జలాలు, కెమికల్  వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి.  మరోవైపు  నెక్లెస్ రోడ్డు స‌మీపంలో ఏర్పాటు చేసిన సీవ‌రేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ‌త అక్టోబ‌ర్ నుండి ప‌ని చేయడం లేదు. 
వ్యర్థజలాలను మళ్లించేందుకు 2.8 కి.మీ. పైప్‌లైన్‌ 
కూకట్‌పల్లి నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాలను మళ్లించేందుకు  2.8కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం చేశారు. దీనికోసం 59కోట్లు ఖర్చుచేశారు. తాజాగా మరో 4 కోట్ల రూపాయలతో ప్రత్యేక పనులు చేపట్టారు అధికారులు. మొత్తానికి ఇప్పటిదాకా సాగర్‌ శుద్ధికోసం అంటూ 300 కోట్లరూపాయను హెచ్‌ఎండీఏ ఖర్చు చేసింది. ఇంత చేస్తున్నా వ్యర్థజ‌లాలు మాత్రం ఎప్పటిలాగానే సాగర్‌లోకి వస్తూనే ఉండటం అసలు విషాదం .
2006లో మొదలైన హుస్సేన్‌సాగ‌ర్ ప్రక్షాళన
2006 లో చెప‌ట్టిన హుస్సేన్ సాగ‌ర్ ప్రక్షాళన వాస్తవానికి పదేళ్లలో పూర్తి కావాలి. కాని పరిస్థితి చూస్తే మాత్రం ఎప్పటికి సాగర్‌ శుభ్రపడుతుంతో తెలియని పరిస్థితి నెలకొంది.  85 ఏళ్ల క్రింత మంచినీటి చెరువుగా ఏర్పాటయిన హుస్సేన్‌సాగర్‌ మళ్లీ ఆనాటి స్వచ్ఛతను ఎప్పటికి సంతరించుకుంటుందో కాలమే నిర్ణయించాలి. 

 

20:14 - March 4, 2018

గుంటూరు : బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దళితులకు న్యాయం జరుగదని స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన దళిత ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మోడీ వచ్చిన తర్వాత పెత్తందారుల, అగ్రకులాల దాడులు పెరిగాయన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనేక రకాలుగా దళితులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులు మీసాలు పెంచినందుకు...వారిపై దాడి చేశారని..దళితులు మీసాలు పెంచవద్దా అని ప్రశ్నించారు. క్రిస్టియిన్ మతంలోకి వెల్లిన దళితులపై దాడులు చేస్తున్నారు..వారు మళ్లీ హిందూమతంలోకి వస్తే దళితులకు బ్రాహ్మణత్వం ఇస్తారా అని సవాల్ విసిరారు. పెద్దగొట్టిపాడు దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
పోలీసులు ఎవరికి సేవ చేయడానికి ఉన్నారు ?  
సభ జరుగకూడదని పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారని... సభకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. పోలీసులు ఎవరికి సేవ చేయడానికి ఉన్నారని నిలదీశారు. పోలీసులంటే తమకు ద్వేషం లేదని...కానీ వారు వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకత ఉందన్నారు. పోలీసులు ఉన్నది.. అగ్రకులాలు, పెత్తందారులకు ఊడిగం చేయడానికా...మండిపడ్డారు. నియమ నిబంధనలు దళితులకేనా...రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు వర్తించవా.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రూల్స్ పాటిస్తే... దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలన్నారు. తమ పోరాటం పోలీసులుపై కాదు....పెత్తందారులు, అగ్రకులాల అహంకారంపై అన్నారు. కబడ్దార్ చంద్రబాబు..దళితులపై దాడులు జరిపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితులే దాడులకు గురయ్యారని తెలిపారు. ఎవరిపైనా దళితులు దాడులకు పాల్పడలేదన్నారు. నిరసన తెలుపుకునే హక్కు లేదా ? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలిగించేందుకే ఈ సభ నిర్వహించామని చెప్పారు. 

 

19:51 - March 4, 2018

ప్రత్యామ్నాయ విధానాలతో ఫ్రంట్ అవసరం : ప్రొ.నాగేశ్వర్

హైదరాబాద్ : విధానాల ఆధారంగా ప్రత్యామ్నాయం కావాలని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. మూడో ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ విధానాలతో ఫ్రంట్ అవసరం అన్నారు. ప్రాంతీయ పార్టీలకు స్ధిరత్వం ఉండదన్నారు. గతంలో బీజేపీ విధానాలపై సీఎం కేసీఆర్ మాట్లాడ లేదని అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మంచి వ్యూహకర్తని.. రాజకీయ వ్యూహంగా మాట్లాడారని అన్నారు. 

 

19:49 - March 4, 2018

హైదరాబాద్ : విధానాల ఆధారంగా ప్రత్యామ్నాయం కావాలని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. మూడో ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ విధానాలతో ఫ్రంట్ అవసరం అన్నారు. ప్రాంతీయ పార్టీలకు స్ధిరత్వం ఉండదన్నారు. గతంలో బీజేపీ విధానాలపై సీఎం కేసీఆర్ మాట్లాడ లేదని అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మంచి వ్యూహకర్తని.. రాజకీయ వ్యూహంగా మాట్లాడారని అన్నారు. 

 

కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్, బీజీపీ యేతర కూటమి ఏర్పడాలని సీఎం కేసీఆర్ అన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. అసవరమైతే తాను థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రెండు పార్టీల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ వద్ద నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు పరిపాలనలో దారుణంగా విఫలమయ్యాయని తెలిపారు.

19:39 - March 4, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి ఏర్పడాలని సీఎం కేసీఆర్ అన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. అసవరమైతే తాను థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రెండు పార్టీల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ వద్ద నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీల పరిపాలనలు దారుణంగా విఫలమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ విధానాల వల్లే దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రైతాంగం నష్టపోయిందని, ఉద్యోగాలు లేవని, నీటి కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలు దారుణంగా విఫలం 
కాంగ్రెస్, బీజేపీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలం అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ మీద కోపం వచ్చి బీజేపీకి ఓటేస్తే...ఆ పార్టీ ప్రభుత్వంలోనూ ప్రజలకు మేలు జరుగలేదన్నారు. రెండు జాతీయ పార్టీలు పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. 70 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రయాణం సాగించిన తర్వాత ఈ దేశం ఎటుపోతుందన్నారు. దేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని... రాజకీయ ఆటలు ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. అమెరికా తర్వాత చైనా ఆర్థికంగా బలవంతమైన దేశమని అన్నారు. 24ఏండ్లల్లో చైనా మహాశక్తిగా తయారైందన్నారు. భారత్ ఎందుకు చైనా, అమెరికా లాగా అభివృద్ధి చెందకూడదని ప్రశ్నించారు. భారత్ లో పేరుకే ఫెడరల్ వ్యవస్థగా ఉందన్నారు. రాజ్యాంగం, ప్రభుత్వం ప్రజల కోసమే ఉన్నాయని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చుకోవాలన్నారు.
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. 
బీజేపీ ఢిల్లీలో కూర్చుని..రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తుందని అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏలా..? అని ప్రశ్నించారు. రెండు పార్టీలు 130 కోట్ల మంది గోస పోసుకుంటున్నారని..విమర్శించారు. చిల్లర రాజకీయాల కోసం 130 కోట్ల మంది ప్రజలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆటలాడుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ 50 సం.రాలకుపైగా పరిపాలించిందని... బీజేపీ 11 సంవత్సరాలుగా పరిపాలిస్తూ దేశ ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. కేంద్రం చేయాల్సింది చేయకుండా..ఉట్టిమాటలు చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ఎందుకని ప్రశ్నించారు. ఆరోగ్యం, విద్యా, వ్యవసాయం, అర్బన్ డెవలప్ మెంట్ విధానం రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. దేశంలో రెండు ఖానూల్లు ఉంటాయా అని అన్నారు. నది నీళ్ల పంచాయతి 14 సం.రాలుగా సాగుతుందన్నారు.
కేంద్ర విధానాల వల్లే నీటి గొడవలు
కేంద్ర విధానాల వల్లే నీటి గొడవలు వస్తున్నాయని తెలిపారు. అధికారాలన్ని ఢిల్లీలో ఉంటే దేశం బాగుపడదని స్పష్టం చేశారు. ట్రూత్ ఫుల్ ఫెడరలిజం రావాలని ఆకాంక్షించారు. దళితులు పేదరికంలో మగ్గుతున్నారని వాపోపాయారు. రాష్ట్రంలో 85 శాతానికి పైగా బీసీలు, దళితులు, గిరిజనులు, ముస్లీంలు, మైనార్టీలు ఉన్నారు. ఓసీలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో 3లక్షల 20 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో కారు చీకట్లు కమ్ముకుంటే...కరెంట్ ను నేపాల్ కు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. 
పంటలకు గిట్టుబాట ధర లేదు...
దేశంలో అన్నింటికీ ధర పెగుతుతంది కానీ... రైతు పండించే ధాన్యం ధర మాత్రమే పెరగడం లేదన్నారు. దేశం బతికేది రైతుపైనే తెలిపారు. రైతులు, కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మాట్లాడితే జైలుకు పంపుతామని అంటున్నారు... 'మీ పిట్ట బెదిరింపులు కేసీఆర్ పైనా కావు' అని అన్నారు.  కుంభకోణాలు చేసినోళ్లు, మోసం చేసినవాళ్లకు భయం ఉంటుందని..తనకెందుకు భయం ఉంటుందని అన్నారు. మమ్మల్ని ముట్టుకుంటే భస్మం అయితారని హెచ్చరించారు.
దేశం నలుమూలల నుంచి ఫోన్లు 
నిన్న తాను థర్డ్ ఫ్రంట్ పై మాట్లాడితే దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. త్వరలోనే కలిసి మాట్లాడుతానని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పులు అవసరమన్న తన మాటలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు తెలిపారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఫోన్ చేశారని సంఘీభావం ప్రకటించారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించాలన్న తన నిర్ణయాన్ని హేమంత్ సోరెన్ స్వాగతించారని తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఏడుగురు ఎంపీలు ఫోన్లు చేశారని తెలిపారు. 

 

18:51 - March 4, 2018

హైదరాబాద్ : తమకు న్యాయం చేయండి మహప్రభో అని రైతులు వేడుకుంటే వారి చేతులకు బేడీలు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ కు ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను మర్చిపోయి... అడిగిన వారిపై పోలీసు కేసులు పెట్టిస్తు వారిని భయందోళనకు గురి చేస్తున్నారని ఆయన నిజామాబాద్‌లో మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఎంతో చూసుకొని జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాలని వీహెచ్ సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే కేసీఆర్ తమపై బురద చల్లుతున్నారని వీహెచ్ ఆరోపించారు. 

 

17:48 - March 4, 2018

హైదరాబాద్ : దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. కొత్త ఆలోచన విధానం ఉండాలంటే థర్డ్ ఫ్రంట్ అవసరం అని తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఉండాలని. ఉండి తీరాలని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలన్న ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉన్నాయన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోనప్పుడు థర్డ్ ఫ్రంట్ లు ఆవిర్భావిస్తాయని చెప్పారు. కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలన్నారు. బూజుపట్టిన ఆలోచలన విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే థర్డ్ ఫ్రంట్ కు జనసేన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. మనోభావాలను అర్థం చేసుకోనప్పుడు థర్డ్ ఫ్రంట్ లు ఆవిర్భావిస్తాయని చెప్పారు. యూపీఏ పాలనలో ప్రజలకు పెద్దగా మేలు జరుగలేదన్నారు. ఎన్డీఎ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోగా సమస్యలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ప్రత్యేకహోదాకు మద్దతు ఇచ్చినందుకు కేసీఆర్ కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్న ఒక్కటే అని.. సరస్పర సహకారం అవసరమన్నారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండాలని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా రాజకీయాలు జరుగవని, దేశ అభివృద్ధి జరుగదని స్పష్టం చేశారు. దేశంలో చాలా కీలక పరిణామాలు జరుగనున్నాయని పేర్కొన్నారు.
 

 

కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలి : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. బూజుపట్టిన ఆలోచలన విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే థర్డ్ ఫ్రంట్ కు జనసేన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. 

రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఉండాలి : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోనప్పుడు థర్డ్ ఫ్రంట్ లు ఆవిర్భావిస్తాయని చెప్పారు. రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఉండాలని... ఉండి తీరాలని స్పష్టం చేశారు. 

 

 

17:34 - March 4, 2018

కడప : టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లతో కడప జిల్లా పులివెందులలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పులివెందుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమైన వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, టీడీపీ నేత సతీష్‌రెడ్డి సవాళ్లు విసురుకున్నారు. దీంతో పులివెందులలో ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చర్చకు పోలీసులు నిరాకరించారు. పూల అంగళ్ల వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి తీవ్రగాయాలు కావడంతో... పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, టీడీపీ నేత సతీష్‌రెడ్డిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పులివెందులలో పోలీసులు భారీ ఎత్తున  మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:32 - March 4, 2018

గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గుంటూరులో ఉల్ఫ్‌ గ్రౌండ్స్‌లో కాసేపట్లో దళిత ఆత్మగౌరవ సభ జరగనుంది. ఏపీలోని 13 జిల్లాలతో పాటు తమిళనాడు, తెలంగాణ నుండి భారీగా దళితులు తరలివస్తున్నారు. దళిత ఆత్మగౌరవ సభకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. 

 

17:29 - March 4, 2018

గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గుంటూరులో ఉల్ఫ్‌ గ్రౌండ్స్‌లో కాసేపట్లో దళిత ఆత్మగౌరవ సభ జరగనుంది. ఏపీలోని 13 జిల్లాలతో పాటు తమిళనాడు, తెలంగాణ నుండి భారీగా దళితులు తరలివస్తున్నారు. దళిత ఆత్మగౌరవ సభకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. 

 

17:25 - March 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా... ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. నిన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి.. ఇప్పుడు విమర్శలు చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో అడగ్గముందే మద్దతిచ్చి.. ఇప్పుడు... ఆరోపణలు చేయడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. KCR దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని... అయితే ముందుగా తెలంగాణకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  

 

17:22 - March 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌ రాష్ట్రంలో ఏం చేశారని? ఇక దేశ రాజకీయాల్లో ఏం ఉద్దరిస్తారు? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొని వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాటల గారడితో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్ ప్రధానిని కించపరుస్తూ మాట్లాడినట్లు కేటీఆర్, కవిత అంగీకరించినా.. తాను అలా అనలేదని చెప్పడం ఎంత వరకు సబబబని లక్ష్మణ్ ప్రశ్నించారు. 

 

17:18 - March 4, 2018

విజయవాడ : ఏపీలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. రేపటి నుంచి సీఐటీయూ నేతలు కూడా దీక్షల్లో పాల్గోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

17:14 - March 4, 2018

విజయవాడ : జనసేన జేఎఫ్‌సీ రెండు వారాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నివేదిక ఇవ్వడం అభినందనీయమన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం 45 నెలలైనా ఇంకా కేంద్రం నుండి ఎన్ని నిధులు రావాలన్న దానిపై ఇంకా లెక్కలు వేస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రేపటి నుండి ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. రాష్ట్రానికి అన్నీ చేశామని చెబుతున్న బీజేపీ నేతలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలన్నారు. 

 

17:07 - March 4, 2018

కృష్ణా : జిల్లాలోని పెనుగంచిప్రోలులో అగ్ని ప్రమాదం జరిగింది. మునేటి ఒడ్డున తిరుపతమ్మ తిరునాళ్లకు వేసిన పాకలకు నిప్పంటుకుని నాలుగు పాకలు కాలిపోయాయి. స్థానికులు మంటలు ఆర్పివేశారు. 

 

కాసేపట్లో దళితుల ఆత్మగౌరవ సభ

గుంటూరు : కాసేపట్లో దళితుల ఆత్మగౌరవ సభ జరుగనుంది. సభకు వామపక్షాలు మద్దతు ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీగా బయల్దేరి..సభ ప్రాంగణానికి వెళ్లనున్నారు. 
 

13:47 - March 4, 2018

మూడో ఫ్రంట్ పై వీహెచ్ వ్యంగ్యాస్రాలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మూడో ఫ్రంట్ పెడితే వచ్చే వాళ్లెవరున్నారని టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. మూడో ఫ్రంట్ లో కేసీఆర్ ఒక్కరే మిగిలిపోతారని, ఎంఐఎం సంతోషం కోసమే బీజేపీకి కేసీఆర్ దూరమవుతున్నారని విమర్శించారు. 

విద్యార్థులకు అన్నా హజారే మద్దతు...

ఢిల్లీ : దేశ రాజధానిలో ఎస్ఎస్ సి విద్యార్థుల ఆందోళన చేపట్టారు బీహార్ ఎస్ఎస్ సి పేపర్ లీక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం విద్యార్థులు అన్నా హజారేనున కలిశారు. ఈ సందర్భంగా వారు చేపడుతున్న ఆందోళనకు అన్నా మద్దతు తెలిపారు.

 

మాణిక్ సర్కార్ రాజీనామా...

త్రిపుర : మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాసేపటి క్రితం గవర్నర్ కు ఇచ్చారు. గత 25 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. 

13:31 - March 4, 2018
13:30 - March 4, 2018
13:29 - March 4, 2018

హైదరాబాద్ : శ్రీదేవి చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగింది? స్నేహితుడు కోమల్‌ నహతకు బోనీ కపూర్‌ ఏం చెప్పారు? తన బ్లాగ్‌లో కోమల్‌ నహత శ్రీదేవి మరణం గురించి ఏం రాసుకున్నారు ? 'మోహిత్‌ పెళ్లయ్యాక పెద్ద కూతురు షాపింగ్‌ కోసం శ్రీదేవి దుబాయ్‌లో ఉంటానంది. నాకు లఖన్‌వూలో పనుండి ఇండియాకు వచ్చా. ఫిబ్రవరి 24 ఉదయం శ్రీదేవి నాకు ఫోన్‌ చేసింది. నన్ను చాలా మిస్‌ అవుతున్నానని చెప్పింది. వెంటనే శ్రీదేవి దగ్గరికి వెళ్లాలనుకున్నా. ఆ విషయాన్ని శ్రీదేవికి చెప్పలేదు

శ్రీదేవికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఫిబ్రవరి 24న సా.6.20 గంటలకు దుబాయ్‌కు చేరుకున్నా. నా వద్ద ఉన్న డుప్లికేట్‌ కీ తో రూంలోకి వెళ్లా. నన్ను చూసిన శ్రీదేవి సంతోషంతో ఆలింగనం చేసుకుంది. నేను దుబాయ్‌కు వచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తానన్న విషయాన్ని శ్రీదేవి ముందే ఊహించింది. స్నానం చేశాక డిన్నర్‌కు వెళ్దామని చెప్పి శ్రీదేవి వాష్ రూంకి వెళ్లింది. నేను హోటల్‌ లివింగ్‌ రూంలో టీవీ చూస్తూ ఎదురుచూస్తున్నా. ఎంతసేపటికి శ్రీదేవి రాకపోవడంతో గదిలోకి వెళ్లాను. ఇంకా శ్రీదేవి బాత్‌ రూం నుంచి రాలేదు. పలుమార్లు తలుపు కొట్టిచూశా అయినా ఎలాంటి స్పందన రాలేదు. బాత్‌ రూం డోర్‌ గడి పెట్టకపోవడంతో లోపలికి వెళ్లా. ఒక్కసారిగా షాకయ్యా. టబ్‌బాత్‌ నిండా ఉన్న నీటిలో శ్రీదేవి మునిగి ఉంది’. ఈ విషయాలన్నింటినీ కోమల్‌నహతా తన బ్లాగ్‌లో రాసుకున్నారు. 

13:19 - March 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత తూర్పుగోదావరి జిల్లా మన్యంలో అలజడి రేగుతోంది. రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. మావోయిస్టుల షెల్టర్‌ జోన్‌లో గాలింపు విస్తృతం చేశారు. దీంతో చింతూరు డివిజన్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. lనూగూరు వెంకటాపురం ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు చింతూరు దండకారణ్యం వైపు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాలు షెల్టర్‌ జోన్‌గా ఉపయోగించుకున్న విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఏనుగురాళ్లపల్లి, ఎటపాకలో మందుపాతర పేల్చిన ఘటనలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో ఎన్‌కౌంటర్లు జరిగిన పది, పదిహేను రోజుల్లోనే విలీన మండలాల్లో ప్రతీకార దాడులకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో గాలింపు విస్తృతం చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు, సోదాలు విస్తృతం చేస్తున్నారు. తూర్పు ఏజెన్సీలో 70 శాతం మంది గిరిజనులు, ఆదివాసీలు. వీరిలో మావోయిస్టు సానుభూతిపరులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని అడ్డంపెట్టుకుని మావోయిస్టులు ఏదైనా ఘటనకు పాల్పడవచ్చన్న ఉద్దేశంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. నిఘా పెంచారు. దీంతో ఏజెన్సీలో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 

13:14 - March 4, 2018

తూర్పుగోదావరి : పోలీసుల వేధింపులతో మనస్థాపానికి గురైన ఓ వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గండ్రేడు గ్రామానికి చెందిన ఏకాశిపై సరిహద్దు వివాదంలో కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారం ఎమ్మార్వో కోర్టు పరిధిలో ఉందని ఏకాశి పోలీసులకు చెప్పినప్పటికీ పదే పదే స్టేషన్‌కు పిలిచి దుర్భాషలాడుతూ కొడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన ఏకాశి స్టేషన్‌ ముందే పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఏకాశిని బంధువులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకీయంగా తమను ఎదుర్కోలేకే ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు మండి పడుతున్నారు. 

13:13 - March 4, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జబర్దస్త్‌ కామిడీ యాక్టర్‌ కార్తిక్, బుల్లితెర నటి కీర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. 

13:00 - March 4, 2018

మంచిర్యాల : గుప్త నిధుల కోసం మంచిర్యాల జిల్లాలో ఉన్న అరుదైన గుహలను అక్రమార్కులు తొలిచివేస్తున్నారు. గోదావరి తీరంలోని రాతిగుట్టపై ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిన జైన దేవాలయాలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం, పురావస్తు శాఖాధికారులు పట్టించుకోవడంతో ప్రాచీన సందపకు రక్షణలేకుండా పోయింది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:58 - March 4, 2018

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. లేవలేని స్థితిలో ఉన్న తన భార్యను వైద్యం కోసం తీసుకువచ్చాడు ఓ భర్త. అత్యవసర పరిస్థితిలో ఉన్న వృద్ధురాలిని ఆస్పత్రి వర్గాలు అడ్మిట్‌ చేసుకోలేదు. చాలా సేపటి తర్వాత రోగి పరిస్థితి తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీసుకురావాలని వైద్యులు చెప్పగా రేపటి వరకు తీయమని ఎక్స్‌ రే సిబ్బంది చెప్పారు. దీంతో భర్త నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.

12:53 - March 4, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ ఆందోళనలు ఉధృతం చేశాయి. అందులో భాగంగా ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళనలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజుతో టెన్ టివి మాట్లాడింది. 6, 7వ తేదీల్లో పార్లమెంట్ స్ట్రీట్ లో ఆత్మగౌరవ పేరిట దీక్ష చేపట్టనున్నట్లు, 8వ తేదీన పార్లమెంట్ ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని టిడిపి, బిజెపి పార్టీలపై 9వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై రాష్ట్రంలో, పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

సోమవారం నుండి ఏపీ పీసీసీ ఆందోళనలు...

విజయవాడ : ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఏపీ పీసీసీ నిర్ణయిచింది. దీనిలో భాగంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఆందోళన చేపట్టనుంది. 

11:54 - March 4, 2018
11:45 - March 4, 2018

కడప : పులివెందులలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని అధికార పక్షానికి చెందిన నేతలు సవాల్ విసరడం...తాము సిద్ధమేనని ప్రతిపక్ష నేతలు ప్రతిసవాల్ విసరడంతో గత కొన్ని రోజులుగా వాతావరణం వేడెక్కింది. పూల అంగళ్ల సెంటర్ లో బహిరంగ చర్చకు నేతలు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర ప్రాంతాల నుండి కార్యకర్తలకు పులివెందులకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో పులివెందులలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో భారీగా పోలీసులు మోహరించారు. 

11:43 - March 4, 2018

పెద్దపల్లి : ప్రస్తుతం సమాజం మారుతున్నా కొందరు మూఢనమ్మకాల్లోనే జీవిస్తున్నారు. తమకు మంచి జరగాలని..డబ్బులు సంపాదించాలని కొంతమంది నరబలిచ్చేందుకు సిద్ధమౌతుండడం ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోగా తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. కానీ బాలుడు తృటిలో తప్పించుకోవడంతో పెద్ద ఘోరం తప్పింది.

కాల్వ శ్రీరాంపూర్ (మం) కిష్టంపేటలో సుంకరితోట ఉంది. పురాతన కోట కావడం..ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం ఉంది. గుప్త నిధులు సంపాదించుకోవాలని ముగ్గురు దుండగులు ఓ బాలుడిని నరబలి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 17 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి సుంకరితోట వద్దకు తీసుకెళ్లారు. అక్కడ దుండగులు పూజలు చేస్తుండగా బాలుడు గ్రహించి తప్పించుకుని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

సుంకరికోటలో నరబలికి యత్నం...

పెద్దపల్లి : కాల్వ శ్రీరాంపూర్ (మం) కిష్టంపేటలో గుప్త నిధుల కోసం సుంకరికోటలో నరబలికి యత్నించారు. 17 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చేందుకు దుండుగులు తీసుకెళ్లారు. బాలుడు తప్పించుకుని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

11:25 - March 4, 2018

విజయవాడ : మార్చి 8న ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రాజెక్టుల వాటా ఎంత..?, గతంలో కంటే నిధులు పెరుగుతాయా... తగ్గుతాయా.. పోలవరంపై ప్రభుత్వం దృష్టి ఎలా ఉండబోతోంది.. ఇప్పుడిదే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కీలకంగా మారనుంది. ఈ యేడాది ఖర్చులతోపాటు ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. 2017-2018 బడ్జెట్‌లో జలవనరుల శాఖకు 12770.26 కోట్ల రూపాయలు కేటాయించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 11240.67 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పోలవరం కేటాయింపులు, ఇతర ఖర్చులు కూడా ఇందులోనే కలిపారు. కొత్త బడ్జెట్‌లో పోలవరం కాకుండా మిగతా ప్రాజెక్టులకు దాదాపు 11 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆర్థికశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌కుకు ముందుగా రాష్ర్ట ప్రభుత్వ నిధులు ఖర్చుచేశాకే.. కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సి ఉంది.

ఈ ఏడాది సాగునీటి రంగానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమారు 24 వేల కోట్ల రూపాయలు కేటాయించేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క పోలవరానికే అత్యధికంగా రూ.13 వేల కోట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. పోలవరం మొత్తం పనులకు సంబంధించి పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులకు కలిపి కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, వంశధార వంటి భారీ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న మొత్తం 60 ప్రాజెక్టులు, జలసంరక్షణ పనులు, చిన్ననీటి వనరులకు కలిపి సుమారు 11 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జలవనరుల శాఖకు తొలుత 35 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఐతే ఆర్థిక శాఖ విధించిన పరిమితి మేరకు ప్రాధాన్యత రీత్యా అవసరమైన మార్పులతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌లో పోలవరానికి 13 వేల కోట్ల రూపాయలు చూపిస్తే.... ఆ మేరకు రాష్ర్ట ఖజానాపై భారం ఉండదని అధికారులు లెక్కలు కడుతున్నారు. పోలవరానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా కేంద్రం నుంచి 2,800 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉంది.. సకాలంలో పోలవరం నిధులు విడుదలైతేనే.... ఆ నిధులు ఇతర ప్రాజెక్టులపై ఖర్చు చేసేందుకు వెసులుబాటు కలగనుంది. తుది దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తిచేసే లక్ష్యంతోనే బడ్జెట్ ను సిద్ధం చేయాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర బడ్జెట్ పై ప్రభుత్వం ఒకింత తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ర్టాలతోపాటు.. దేశవ్యాప్తంగా దుమారం రేగిన నేపథ్యంలో... బడ్జెట్‌పై విమర్శలు రాకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే బడ్జెట్‌ను హెచ్చుతగ్గులతో రూపొందిస్తే విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శల నుంచి కొంతలో కొంత బయటపడొచ్చన్న భావనలో ఉంది. ఇప్పటికే పోలవరం విషయంలో ప్రభుత్వాలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పోలవరంపై ఆడే నాటకాలను కట్టిపెట్టాలంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తం మీద ఈసారి బడ్జెట్‌ చర్చనీయాంశంగా మారనుంది.

పులివెందులలో ఉద్రిక్తత..

కడప : వైసీపీ..టిడిపి నేతల సవాళ్లు..ప్రతి సవాళ్లతో పుల్లివెందులలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పూల అంగళ్ల సెంటర్ లో బహిరంగ చర్చకు నేతలు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో భారీగా పోలీసులు మోహరించారు. 

నేడు చలో గుంటూరు..

 

గుంటూరు : వామపక్షాలు..దళిత సంఘాలు నేడు చలో గుంటూరుకి పిలుపునిచ్చాయి. గొట్టిపాడులో దళితులపై దాడి..రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా చలో గుంటూరుకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. సాయంత్రం 4గంటలకు గుంటూరులో నిర్వహించే భారీ బహిరంగసభలో వామపక్ష, దళిత అగ్రనేతలు పాల్గొననున్నారు. 

 

కరీంనగర్ మాజీ ఏఎస్ఐకి ఐటీ నోటీసులు...

కరీంనగర్ : మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 150 లావాదేవీలకు సంబంధించిన 40 మందికి నోటీసులు జారీ చేసింది. 

ముంబైకి కార్తీ చిదంబరం...

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు ముంబైకి తరలించారు. కార్తీతో పాటు పలువురిని సీబీఐ ప్రశ్నించనుంది. 

10:28 - March 4, 2018
10:27 - March 4, 2018

హైదరాబాద్ : తాగి నడుపొద్దు..అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా మందుబాబులు..ఆగడం లేదు. తామేమి తక్కువ తినలేదంటూ మహిళలు..యువతులు కూడా చిక్కుతుండడం గమనార్హం. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో మద్యం తాగి కారు నడుపుతూ ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. వీళ్ల వాహనాలను సీజ్ చేశారు. 

10:21 - March 4, 2018

మద్యం సేవించి..డ్యాన్స్ చేసిన సర్పంచ్ లు...

కరీంనగర్ : జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి తోటలో అధికారిక సర్పంచ్ లు 'ఫుల్' పార్టీ చేసుకున్నారు. ఈ విందులో కాంగ్రెస్ సర్పంచ్ లు హాజరై మందు సేవించారు. తాము ఘనకార్యం సాధించినట్లుగా డ్యాన్స్ లు చేస్తున్న దృశ్యాలను వీడియో తీయించుకున్నారు. 

09:41 - March 4, 2018

కరీంనగర్ : వాళ్లంతా ఓ ప్రజాప్రతినిధులు..ప్రజా సమస్యలు పరిష్కరించడం..మౌలిక సదుపాయాలు..అభివృద్ధిపై దృష్టి సారించడం..ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు తాగి..ఊగారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి తోటలో అధికారిక సర్పంచ్ లు 'ఫుల్' పార్టీ చేసుకున్నారు. ఈ విందులో కాంగ్రెస్ సర్పంచ్ లు హాజరై మందు సేవించారు. తాము ఘనకార్యం సాధించినట్లుగా డ్యాన్స్ లు చేస్తున్న దృశ్యాలను వీడియో తీయించుకున్నారు. ఈ వీడియో ఎలా బయటపడిందో తెలియదు కానీ ప్రజాప్రతినిధులు తాగి..డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. మీరు కూడా చూడండి....

09:36 - March 4, 2018

ఏజెన్సీ బంద్...

విశాఖపట్టణం : ఏజెన్సీ బంద్ కొనసాగుతోంది. గిరిజన సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని..బోయ, వాల్మీకీలను ఎస్టీలో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ ఈ బంద్ కొనసాగుతోంది. 

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన యువతులు...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో మద్యం తాగి కారు నడుపుతూ ఇద్దరు యువతులు పట్టుబడ్డారు.

బంగారుగడ్డలో కార్చన్ సెర్చ్,..

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ బంగారు గడ్డలో ఎస్పీ శ్రీనివాసరావు ఆధర్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

08:35 - March 4, 2018
08:33 - March 4, 2018

హైదరాబాద్ : మార్చి పదో తేదీకి మిలియన్ మార్చ్ జరిగిన ఆరేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా టీజేఏసీ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమౌతోంది. మిలియన్ మార్చ్ స్పూర్తితో ట్యాంక్ బండ్ పై కార్యక్రమాలు నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. సీపీఐ కార్యాలయంలో మిలియన్ మార్చ్ స్పూర్తి కమిటీ సమావేశం జరిగింది. ట్యాంక్ బండ్ పై జరిగే కార్యక్రమానికి అనుమతి కోసం పోలీసులకు లేఖ రాయడం జరిగిందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు భారీగా పాల్గొనాలని టీజేఏసీ నేతలు కోరారు. 

08:30 - March 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి కొనసాగుతోంది. ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సెటిలర్స్ అందరూ కాంగ్రెస్ తో కలిసి రావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో ఉత్తమ్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ...సెటిలర్స్ కు అండగా ఉంటామని, తాము చేపట్టిన బస్సు యాత్రతో కేసీఆర్..కేటీఆర్ లు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుండి కేసీఆర్ కుటంబాన్ని తరిమికొట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ కూడా మాట్లాడారు. 

08:24 - March 4, 2018

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా సీఎం చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి విభజన హామీలపై చర్చిద్దామని ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ నివేదిక బహిర్గతం చేశారు. మరోవైపు వామపక్షాలు, వైసీపీ పోరును మరింత ఉధృతం చేశాయి. సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా కార్యక్రమంలో గఫూర్ (సీపీఎం), సుబ్బారావు (టిడిపి), వెల్లంపల్లి శ్రీనివాస్ (వైసీపీ), లక్ష్మీ పతరాజు (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:16 - March 4, 2018

సాయుధ అధికారి సూసైడ్...

చెన్నై : జయలలిత మెమోరియల్ వద్ద సాయుధ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధుల్లో ఉన్న ఆ అధికారి గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

06:43 - March 4, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణ్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం కళ్యాణ మహోత్సవం.. మంగళవారం రథోత్సవం, బుధవారం స్వామివారి ధర్మగుండం నందు త్రిశూల యాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చెప్పారు. 

06:41 - March 4, 2018

హైదరాబాద్‌ : నగరం విష సంస్కృతి వడిలోకి వెళుతోంది. విదేశీ సంస్కృతి నగర వాసులను పెడ దారి పట్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పబ్‌, హుక్కా కల్చర్ విస్తరిస్తోంది. దీనికి అలవాటు పడుతున్న నగర యువత రేవ్ పార్టీలతో మజా చేస్తున్నారు.హుక్కాతో మత్తులో తూగుతున్నారు. డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, తాజాగా ఎల్ఎస్డి అన్నీ నగర యువతను ఓ గమ్మత్తైన లోకానికి తీసుకెళ్లి మత్తులో చిత్తు చేస్తోంది. చాలా గుట్టుగా సాగిపోతున్న హుక్కా కల్చర్ ఈ మధ్య కాలంలో పోలీసుల దాడుల్లో బయటపడింది. హుక్కా సెంటర్లు పైకి చూడడానికి కాఫీబార్లు, టీ స్పాట్లు, ఐస్ క్రీం పార్లర్లు ,గేమింగ్ పార్లర్ లాగా కనిపిస్తాయి. లోపల మాత్రం హుక్కా పొగలు గుప్పు గుప్పు మంటున్నాయి. ఒక్కో ఫ్లేవర్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి యజమానులు డబ్బులు దండుకుంటున్నారు. ఈ ఫ్లేవర్లకు తంబాకు, గంజాయి,కొకైన్, హెరాయిన్ మిక్స్ చేసి యూత్ ను మత్తులో ముంచెత్తుతున్నారు.

క్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న సెంటర్లు కొన్ని మాత్రమే ఉండగా.. అనధికారికంగా నడుస్తున్న సెంటర్లే అధికంగా ఉన్నాయి. వాటిపై నిఘా కొరవడడంతో మైనర్లు సైతం హుక్కా కు బానిసలవుతున్నారు. మత్తులో జోగుతున్నారు. తాజాగా షాలిబండ లోని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిని వారు 12 మంది మైనర్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

వాస్తవానికి హుక్క సెంటర్‌ నడపాలంటే విధిలా లైసెన్స్‌ తీసుకోవాలి. ప్రతీ సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మైనర్లను అనుమతించకూడదు. 18 ఏళ్లలోపు పిల్లలకు హుక్కా ఇవ్వడం నేరం కనుక సెంటర్‌కు వస్తున్న వారి పూర్తి వివరాలు వయసుతో సహా రిజిస్టర్‌లో నమోదు చేయాలి. దాంతోపాటు హుక్కాలో ఉపయోగించే పదార్థాలు,ఫ్లేవర్స్‌ వివరాలను బోర్డులో ప్రదర్శించాలి.. రాత్రి 9 గంటలకే హుక్కా సెంటర్లు బంద్‌ చేయాలి. కాని నగరంలో ఈ నిబంధనలేవీ పాటించిన దాఖలాలు కనిపించడంల లేదు. అసలు లైసెన్స్‌ లేకుండానే హుక్కా సెంటర్లు నడుస్తుంటే.. అధికారులు ఏంచేస్తున్నారని హైదరాబాద్‌ పబ్లిక్‌ ప్రశ్నిస్తున్నారు.

సిగరెట్ వల్ల ఎలాంటి హాని ఉంటుందో హుక్కావల్ల కూడా అంతే ప్రమాదం పొంచి ఉందని, ఇక అందులో మత్తుపదార్థాలు కలిపి సేవిస్తే వారి పని అంతే అంటున్నారు వైద్యులు. హుక్కా ద్వారా తంబాకు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని పీల్చినప్పుడు మనిషి కంట్రోల్ తప్పుతాడు. ఏం చేయడానికైనా తెగబడతారు. దోపిడీలకు, దొమ్మీలకు, చైన్ స్నాచింగ్లకు సైతం పాల్పడతారని వైద్య నిపుణలు అంటున్నారు. మత్తు పదార్థాల వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని మెదడుకు కుంచించుకు పోతుందని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై పొగ ప్రభావం పడి కేన్సర్‌ బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇప్పటికైనా .. అధికారులు హుక్కా సెంటర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతి లేకుండా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. దాంతోపాటు ఇప్పటికే మత్తుకు బానిసలుగా మారిన యువత, మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇప్పించి పెడమార్గం పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. 

06:38 - March 4, 2018

హైదరాబాద్ : నిజామాబాద్‌ కలెక్టర్‌.. ఎంపీ కవితకు బంధువు కావడం వల్లే తమ బస్సు యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించే భారీ బహిరంగ సభను అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. 

06:37 - March 4, 2018

విజయవాడ : సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏపి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ వ్యూహాన్ని సిద్దం చేసింది. దీనికోసం విశాఖలో సమావేశం అయిన కమలదళం టీడీనీ ఇక డైరెక్ట్‌గా టార్గెట్‌ చేయాలని నిర్ణయించింది. గత నాలుగేళ్ళలో ఏపీకి కేంద్రం చేసిన సహాయం పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడయ్యారు బీజేపీ నేతలు.

విశాఖలో బిజేపి శాసనసభాపక్ష సమావేశాలు వాడివేడిగా సాగాయి.. ఏపి బిజేపి అద్యక్షులు కంభంపాటి హరిబాబు అద్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. ప్రతిపక్షాలతో పాటుగా మిత్రపక్షం అయిన టీడీపీ కూడా తమపై విమర్శలను చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇక నుంచి టీడీపీని టార్గెట్‌ చేస్తూ ఎదురుదాడికి దిగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ కు ఏం చేసింది... ఎంత నిధులు కేటాయించింది.. అనే విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధం కావాలని ఏపీ కమలం పార్టీ నేతలు డిసైడయ్యారు. కేంద్రం నిధులతో పోలవరం ప్రాజెక్టులో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు నాయకులంతా ప్రాజెక్టు పర్యటకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.

మరోవైపు తాము ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్ష వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సభలో ఇక ప్రతిపక్షపాత్ర పోషించాలని నిర్ణయం తీసుకుంది బీజేపీ శాసనసభా పక్షం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబును ఎక్కడా డైరెక్ట్ గా ఎటాక్ చెయ్యలేదు.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను ఎలుగెత్తి చూపడం ద్వారా సీఎంను, అధికాపార్టీని ఇరకాటంలో పెట్టడానికి బిజేపి నాయకులు సిద్ధపడుతున్నట్లు సమాచారం..

అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలన్న వ్యూహాన్ని కూడా రూపొందించుకున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీతో సానుకూల దృక్పథాన్నే అనుసరించాలని నిర్ణయించినట్టు సమాచారం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయడానికి ఏంచేయాలన్న దానిపై కూడా కమలనాథులు చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మిత్రపక్షం అంటూనే చంద్రబాబు అనుసరిస్తున్న రెండునాల్కల ధోరణిని ఎండగడుతూ.. వైసీపీతో దోస్తీకి ప్రయత్నించాలని ఏపీ కమలదళం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

06:33 - March 4, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్ లో మహిళా ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దగా చేస్తున్నాయని ఐద్వా మహిళా కార్యదర్శి శ్రీదేవి మండిడ్డారు. గత మూడున్నరేళ్లుగా యువతను మోసపుచ్చే ధోరణితోనే వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికైనా విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలన్నారు శ్రీదేవి.  

షీ టీమ్ ఆధ్వర్యంలో రన్...

హైదరాబాద్ : మహిళల రక్షణపై అవగాహన కోసం ఆదివారం షీటీమ్‌ ఆధ్వర్యంలో '5కె, 10కె' రన్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న షీటీమ్స్‌ రన్‌లో రోబో కూడా పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. పోలీస్‌ ఎక్స్‌పోలో బెంగళూరు నుంచి తీసుకువచ్చిన రోబో ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికింది. 

టాప్ ర్యాంక్ పై కన్నేసిన టీమిండియా...

ఢిల్లీ : టెస్టు, వన్డే ఫార్మాట్లలో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న టీమిండియా టీ20ల్లోనూ టాప్‌ ర్యాంక్‌పై కన్నేసింది. లంకలో శ్రీలంక,బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌ నెగ్గి టీ20 ఫార్మాట్‌లోనూ తిరిగి టాప్ ర్యాంక్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. 

హోదా కోసం మార్చ్...

విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ ఆదివారం మార్చ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నుండి స్వరాజ్ మైదానం వరకు ఈ మార్చ్ కొనసాగనుంది. 

హస్తినకు వైసీపీ ఎంపీలు..నేతలు...

హైదరాబాద్ : నేడు ఏపీ వైసీపీ ఎంపీలు, నేతలు హస్తినకు చేరుకోనున్నారు. ప్రత్యేక రైలులో వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్లారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసీపీ నేతలు ధర్నా చేయనున్న సంగతి తెలిసిందే. 

టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశం...

హైదరాబాద్ : నేడు ప్రగతి భవన్ లో మధ్యాహ్నం మూడు గంటలకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం జరుగనుంది. జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

జగన్ 103వ రోజు...

ప్రకాశం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 103వ రోజుకు చేరుకుంది. తాళ్లూరు శివారు నుండి రాజానగరం గిరిజన కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, పార్వతీపురం క్రాస్ తిమ్మయ్యపాలెం, అద్దంకి వరకు యాత్ర కొనసాగనుంది. 

Don't Miss