Activities calendar

05 March 2018

అరుణ్‌ జైట్లీతో ముగిసిన యనమల బృందం కీలక భేటీ

ఢిల్లీ : విభజన సమస్యలపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీతో.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల బృందం కీలక భేటీ ముగిసింది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వేజోన్‌తో పాటు పలు విషయాలను జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు యనమల తెలిపారు. పారిశ్రామిక రాయితీలు, రెవెన్యూలోటును భర్తీ చేయాలని... రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జైట్లీ స్పష్టం చేసినట్లు యనమల తెలిపారు.

21:55 - March 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి  సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం మవుతాయి. 

 

21:50 - March 5, 2018

ఢిల్లీ : 'ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు' అనే నినాదాలు ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌లో మార్మోగాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని... విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ హస్తినలో వైసీపీ మహాధర్నా నిర్వహించింది. నాలుగేళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఢిల్లీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. పార్లమెంట్‌ లోపల, బయట కూడా ఏపీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు పేరుతో వైసీపీ మహాధర్నా చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ ధర్నాకు వామపక్షాల నేతలు మద్దతిచ్చారు. కేంద్రం తమ హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని... కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ ఎంపీలు హెచ్చరించారు. ర్యాలీ అనంతరం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది పోయి... తమ పోరాటాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. తమను అరెస్ట్‌ చేసినా పోరాటంపై వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. 

రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించడమే కాకుండా.. నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోకుండా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు... మళ్లీ ప్రజలను వంచించేందుకు యత్నిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయని... ప్రజలే చంద్రబాబుకు బుద్ది చెబుతారన్నారు వైసీపీ నేతలు. 

వైసీపీ నేతల ఆందోళనలకు వామపక్షాలు మద్దతిచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. పార్లమెంట్‌ ఎదుట మంగళవారం, బుధవారం ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ఒత్తిడితోనే టీడీపీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు నాటకమాడుతుందే తప్ప.... రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదన్నారు మధు. 

విభజన హామీలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మోదీ చేస్తున్న అన్యాయంపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని... కేంద్రం కచ్చితంగా దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు రామకృష్ణ. మొత్తానికి నిన్నటి వరకు రాష్ట్రానికి పరిమితమైన ఆందోళనలు ఢిల్లీని చుట్టుముట్టాయి. ప్రత్యేక హోదా సాధించుకునే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వామపక్షాలు, ప్రజాసంఘాలు  హెచ్చరించడంతో... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

21:47 - March 5, 2018

ఢిల్లీ : విభజన సమస్యలపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీతో.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల బృందం కీలక భేటీ ముగిసింది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వేజోన్‌తో పాటు పలు విషయాలను జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు యనమల తెలిపారు. పారిశ్రామిక రాయితీలు, రెవెన్యూలోటును భర్తీ చేయాలని... రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జైట్లీ స్పష్టం చేసినట్లు యనమల తెలిపారు. రాష్ట్రానికి 16 వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు రావాల్సి ఉందని... ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ అమలుచేయాలని జైట్లీకి తెలిపామన్నారు. అయితే.. అన్ని విషయాలను ఇతర కేంద్రమంత్రులతో చర్చించి... మరోసారి భేటీ అవుదామని జైట్లీ తెలిపారన్నారు.
విభజన సమస్యలన్నీ చర్చించాం : హరిబాబు  
ప్రత్యేక హోదా, పెండింగ్‌ విభజన సమస్యలపై చర్చించినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని... ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని జైట్లీ హామీ ఇచ్చారన్నారు హరిబాబు. 

 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 12న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 

21:32 - March 5, 2018

బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ రావాల్సిన అవసరముందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాజకీయ చర్చకు తెరతీశారు. నిజంగా అందుకవసరమైన పొలిటికల్ అట్మాస్పియర్ దేశంలో నెలకొని ఉందా..? కేవలం రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల ఆలోచనలను మళ్లించడానికే కేసీఆర్ ఈ ప్రతిపాదన వెనక్కి తెచ్చారా..? ఒక వేల తెలంగాణ సీఎం చిత్తశుద్ధితోనే ఈ అంశాన్ని చేపట్టినప్పటికీ సహకరించేవారెవరు ? లోక్ సభలో కేవలం మూడు శాతం సీట్లు మాత్రమే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రికి జాతీయ ఫ్రంట్ కు నేతగా పెద్ద రాష్ట్రాల ప్రాంతీయ అధినేతలు అంగీకరిస్తారా ? తమ తమ రాజకీయ ప్రయోజనాలను బట్టి బీజేపీ, కాంగ్రెస్ లతో మార్చి, మార్చి జట్టు కడుతూ కుప్పిగంతులు వేస్తున్న ప్రాంతీయ పార్టీలు కమిటెడ్ పోరాటానికి సిద్ధమవుతాయా ? కేసీఆర్ కేవలం రాజకీయ ఫ్రంట్ కే పరిమితమవుతారా ? ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించి, ప్రజల్లోకి తీసుకెళ్లగలరా ? అన్ని ప్రశ్నలే. గతంలో విఫల ప్రయోగాలుగా మిగిలిపోయిన నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లకు భిన్నమైన ఐక్యతను కూటమి సంతరించుకోగలుతుందా ? ఇదీ సందేహమే ? రెండు బలమైన పక్షాలు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి పొలిటికల్ స్పేస్ ఉందా ? జెండా, ఎజెండా ఎలా ఉండాలి ? ఎలా ఉంటే దేశ వ్యాప్తమైన ఆదరణకు అవకాశముంటుంది. కారాబోయే రోజుల్లో మరింత చర్చకు దారితీసే హార్ట్ టాపిక్ ఇదే..  ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు నగేష్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ వల్ల బీజేపీకి నష్టం లేదని....కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:06 - March 5, 2018

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అని వక్తలు అన్నారు. 'ప్రత్యేకహోదా, విభజన హామీలు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత లక్ష్మీపతిరాజా, వైసీపీ నేత మండల హనుమంతరావు, టీడీపీ నేత రామకృష్ణ పాల్గొని, మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే : యనమల

ఢిల్లీ : బీజేపీ, టీడీపీ నేతల సమావేశం ముగిసింది. ప్రత్యేకహోదా, పారిశ్రామిక ప్రోత్సహకాలపై చర్చించామని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అన్నారు. 

20:29 - March 5, 2018

అమెరికా : ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సతం లాస్‌ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరిగింది.  లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సారి ఆస్కార్‌ అవార్డుల్లో  ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌  నాలుగు కేటగిరిల్లో అవార్డులను సొంత చేసుకొని టాప్‌లో నిలిచింది. షేప్‌ ఆఫ్‌ వాటర్ సినిమాకు గట్టిపోటీ ఇచ్చిన డన్‌కర్క్‌ చిత్రాన్ని మూడు అవార్డులు వరించాయి. 
ఉత్తమ చిత్రంగా ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌
ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేట్‌ అయిన ఎనిమిది చిత్రాలతో పోటీ పడి 'ది షేప్‌ ఆఫ్‌ వాటర్' చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2017లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు గులెర్మో డెల్‌టోరో అమెరికన్‌ ఫాంటసీ డ్రామా చిత్రంగా తెరకెక్కించారు. ఓ ప్రభుత్వ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఓ మూగ యువతి, ఇదే ల్యాబొరేటరీలో పరిశోధన నిమిత్తం ఉంచిన హ్యూమనాయిడ్‌ నీటి జంతువుతో ప్రేమలో పడుతుంది. 19.5 మిలియన్‌ డాలర్స్‌ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్‌ వద్ద 114.3 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు,  బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌,  బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ అవార్డులు కూడా ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌ సినిమానే వరించాయి.
ఉత్తమ నటుడుగా గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ 
ఉత్తమ నటుడుగా గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. డార్కెస్ట్‌ అవర్‌ చిత్రానికి గానూ గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ ఉత్తమ నటుడిగా ఈ  అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో గ్యారీ.. మాజీ బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ పాత్రలో నటించారు. అవార్డు అందుకోగానే గ్యారీ మొదట 99 ఏళ్ల తన తల్లిని గుర్తుచేసుకున్నారు. ఈ అవార్డు ఇంటికి తెస్తానని తన తల్లి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మండ్‌ 
ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మండ్‌ ఆస్కార్‌ను సగర్వంగా అందుకున్నారు. త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌  మిస్సోరీ' అనే చిత్రానికి గానూ ఫ్రాన్సెస్‌ ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ఓ హత్య కేసులో కూతుర్ని పోగొట్టుని న్యాయం కోసం పోరాడుతున్న తల్లి పాత్రలో ఫ్రాన్సెస్‌ నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ గోల్బెన్‌ గ్లోబ్‌, బాఫ్టా అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఉత్తమ దర్శకుడగిగా గల్లీర్మో డెల్‌టోరో
ఉత్తమ దర్శకుడిగా  గల్లీర్మో డెల్‌ టోరోను ఆస్కార్‌ అవార్డు వరింది. ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌ సినిమాకు  దర్శకత్వం వహించిన గల్లీర్మోకు ఆస్కార్‌ అవార్డు దక్కింది. 'ఐ, టోన్యా' సినిమాకి గానూ జాన్నే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో జాన్నే తల్లి పాత్రలో నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూశాక విమర్శకులు సైతం ఆమె నటనను అభినందించకుండా ఉండలేకపోయారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
ఉత్తమ సహాయనటుడుగా సామ్‌ రాక్‌వెల్‌
'త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ' చిత్రానికి గానూ రాక్‌వెల్‌ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో రాక్‌వెల్‌ మద్యానికి బానిసైన పోలీస్‌ అధికారి పాత్రలో నటించారు. సహాయనటుడిగా రాక్‌వెల్‌ పేరు ప్రకటించగానే తన ప్రేయసి వల్లే ఈ అవార్డు వరించిందని తెలిపారు.
డన్‌కర్క్‌ చిత్రానికి మూడు అవార్డులు
డన్‌కర్క్‌ చిత్రాన్ని మూడు ఆస్కార్‌ అవార్డులు వరించాయి. బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌, బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరిల్లో ఈ చిత్రం మూడు ఆస్కారాలను ఎగరేసుకుపోయింది.
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం: కోకో
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రంగా కోకో, ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలింగా డియర్‌ బాస్కెట్‌బాల్‌, ఉత్తమ సినీమాటోగ్రఫీ చిత్రంగా బ్లేడ్‌ రన్నర్‌ 2049, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మార్క్‌ బ్రిడ్జెస్‌, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌గా ఇకారస్‌, ఉత్తమ లఘు చిత్రంగా హెవెన్‌ ఈజ్‌ ఎ ట్రాఫిక్‌ జామ్‌ ఆన్‌ ది 405, ఉత్తమ ఎడిటర్‌గా లీ స్మిత్‌, ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ‌ అవార్డులు కజుహిరో సుజి, డేవిడ్‌ మాలినోవ్‌స్కీ, లైసీ సిబ్బెక్‌ను వరించాయి.  బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ కేటగిరిలో మార్క్‌ వీన్‌గార్టెన్‌, గ్రెగ్‌ ల్యాన్‌డార్కర్‌, గ్యారీ ఎ.రిజ్జోలు డన్‌కర్క్‌ చిత్రంకుగాను ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు.  బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పాల్‌ డెన్‌హామ్‌, ఆస్టర్‌బెర్రీ  ఆస్కార్‌ను అందుకున్నారు.  ఉత్తమ విదేశీ చిత్రంగా చిలీకి చెందిన ఎ ఫెంటాస్టిక్‌ ఉమెన్‌ చిత్రం ఆస్కార్‌ అందుకుంది. 
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం : డియర్‌ బాస్కెట్‌బాల్‌
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలింగా  డియర్‌ బాస్కెట్‌బాల్‌, బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌కుగాను జాన్‌ నీల్సన్‌, గెర్డ్‌ నెఫ్జర్‌, పాల్‌ లాంబర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌. హూవర్‌లు ఆస్కార్ అందుకున్నారు.  బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలింగా ది సైలెంట్‌ చైల్డ్‌, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే అవార్డు జేమ్స్‌ ఐవరీ , బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే అవార్డును జోర్డన్‌ పీలే, బెస్ట్‌ ఒరిజినల్‌ పాటకు గాను రిమెంబర్‌ మీ ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు.
శశికపూర్‌, శ్రీదేవికి ఆస్కార్‌ వేదిక నివాళి
హాలీవుడ్‌ దిగ్జజాల సమక్షంలో... ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వేడుకను ఆద్యాంతం  అలరించారు. దివంగత బాలీవుడ్  నటుడు శశికపూర్‌కు, దేవకన్య శ్రీదేవికి ఆస్కార్‌ వేదిక నివాళులర్పించింది.

 

20:25 - March 5, 2018

గుంటూరు : దేశానికి ఉపయోగపడే అధికారులుగా విద్యార్థులు ఎదగాలని మహారాష్ట్ర అడిషనల్‌ డీజీపీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో కృష్ణదేవరాయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన  ప్రతిభపురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు విద్యార్థులకు స్కాలర్‌ ఫిప్‌లు అందించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల చదువులకు తులసీ గ్రూప్‌ అందిస్తున్న చేయూతను లక్ష్మీనారాయణ ప్రశంశించారు. కుల, మతాల ప్రస్థావన లేకుండా గత పదేళ్లుగా విద్యార్థులకు స్కాలర్‌ ఫిప్‌లు అందిస్తున్నామని తులసీ గ్రూప్స్‌ చైర్మన్‌ రామచంద్రప్రభు అన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు చేయూత అందిస్తామన్నారు. 
 

 

20:21 - March 5, 2018

హైదరాబాద్ : సికింద్రబాద్‌లోని రేతిఫైల్‌ బస్టాండ్‌ ఎదురుగా ఇద్దరు కాలేజి అమ్మాయిలను ఓ ఆటో డ్రైవర్‌ వేధించాడు. రెండు కిలో మీటర్ల దూరం నుండి వెక్కిలి చేష్టలు చేస్తూ, రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్దకు రాగానే ఇద్దరు అమ్మాయిల చేతులను పట్టుకుని లాగాడు. అమ్మాయిలు కేకలు వేయడంతో పక్కనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించాడు. 

 

20:17 - March 5, 2018

మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో కందులు కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. స్థానిక జాతీయ రహదారిపై కందులు కుప్పగాపోసి నిరసన తెలిపారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లక్సెట్టిపేట మార్కెట్‌ యార్డ్‌లో రెండు రోజులు మాత్రమే కందులు కొనుగోలు చేశారని చెప్పారు. పండించిన కందులు నిల్వ చేయలేక పోతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కందులు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. 

20:12 - March 5, 2018

కరీంనగర్ : శాతావహన యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని.. సౌకర్యాలు ఏమాత్రం బాగాలేవంటూ... ధర్నా చేపట్టారు. 4నెలలుగా ఉడికీ ఉడకని అన్నం, రుచీపచీలేని కూరలను పెడుతున్నారంటూ.. విద్యార్థులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

ఏడుగురు రెజర్లపై ఏడాదిపాటు నిషేధం

ఢిల్లీ : ఏడుగురు రెజర్లపై రెజ్లింగ్ సమాఖ్య ఏడాదిపాటు నిషేధం విధించింది. సొంత రాష్ట్రాల నుంచి నిరభ్యంతర పత్రాలు, వయోపరిమితి విషయంలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు. 

 

మూడో ఫ్రంట్ తో దేశ పరిస్థితి మారనుంది : కడియం

వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ వైఫల్యం వల్లే బ్యాంకులనే లూటీ చేసే వ్యక్తులు పుట్టుకొచ్చారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. టీఆర్ ఎస్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే మూడో ఫ్రంట్ తో దేశ పరిస్థితి మారనుందన్నారు. 

ఎంజీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రజనీకాంత్

చెన్నై : వెలప్పన్ చావడిలో ఎంజీఆర్ వర్సిటీ 31 వ వార్షికోత్సవంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఎంజీఆర్ కాంస్య విగ్రహాన్ని రజనీకాంత్ ఆవిష్కరించారు. 

ఇంటింటికీ నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కేటీఆర్

వరంగల్ : ఇంటింటికీ నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని చెప్పారు. పరకాల అభివృద్ధికి ఎన్నికోట్లయినా ఇస్తామని చెప్పారను. ఎరువులు, విత్తనాల కోసం గతంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో సమస్యలను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. 

19:23 - March 5, 2018

హైదరాబాద్ : అవినీతి మయం అయిన దేశరాజకీయాలను చక్కదిద్దే సమర్థత కేసీఆర్‌కు ఉందని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ ప్రయత్నాలను తాను స్వాగతీస్తున్నాని తెలిపారు. తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్‌ దేశ పరిస్థితులను చక్కదిద్దగలరని అన్నారు. కాంగ్రెస్‌ హాయంలో దేశం కుంభకోణాల్లో కూరుకు పోతే.. బీజేపీ పాలనలో బ్యాంకులను లూఠీ చేస్తున్నారని కడియం విమర్శించారు. ఈపరిస్థితులు మారాలంటే.. దేశంలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, దానికి నూటికి నూరుశాతం కేసీఆర్‌ సమర్థుడని కడియం తెలిపారు. 

 

19:20 - March 5, 2018

వరంగల్ : టెక్నాలజీ చదువుకున్న వాళ్లకు మాత్రమే కాదన్నారు మంత్రి కేటీఆర్‌. వరంగల్‌ ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో ఐటీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఇన్నోవేషన్‌ అంటే ఆర్టిఫీషియల్‌గా ఆలోచించడం కాదని, ఇన్నోవేషన్‌లో సోషల్‌ అండ్‌ రూరల్‌ ఇన్ఫర్మేషన్ కూడా వుందన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలని సూచించారు. వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం‌ కృషి చేస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకుబేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

 

19:18 - March 5, 2018

ఢిల్లీ : ఏపీకి న్యాయం చేయాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ఆందోళన చేపట్టారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. చట్టాలు చేసే సభలో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాజ్యసభలో తన వంతు పోరాటం చేస్తున్నట్లు కేవీపీ తెలిపారు. 

 

19:13 - March 5, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మోసం చేశారని ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పీఎస్‌లో ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ న్యాయం చేస్తామని చట్టసభల్లో హామీలిచ్చి తుంగలో తొక్కారన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం టీడీపీ రాజీ పడుతోందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నామని... కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. 

 

19:08 - March 5, 2018
19:04 - March 5, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన ప్రకంపనలతో హస్తినలో వాతావరణం వేడెక్కింది. కాసేపట్లో బీజేపీ, టీడీపీ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన నిధులపై... టీడీపీ ఈ సమావేశంలో స్పష్టత కోరనుంది. 

కాసేపట్లో బీజేపీ-టీడీపీ నేతల కీలక భేటీ

ఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన ప్రకంపనలతో హస్తినలో వాతావరణం వేడెక్కింది. కాసేపట్లో బీజేపీ-టీడీపీ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన నిధులపై... టీడీపీ ఈ సమావేశంలో స్పష్టత కోరనుంది. 

 

18:58 - March 5, 2018

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లులేని నిరుపేదలను నాలుగేళ్లుగా ఊరిస్తున్న మాట. కేసిఆర్ ప్రభుత్వం చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి? కడతామని చెప్పిన ఇండ్లెన్ని? కట్టిన ఇండ్లెన్ని? గృహనిర్మాణంలో సర్కార్ కు ఎదురవుతున్న సవాళ్లేంటి? అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై టెన్ టీవి స్పెషల్ ఫోకస్‌.. కీప్‌ వాచ్ దిస్ స్టోరీ..
ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు 
గత ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న గృహనిర్మాణం అవినీతిమయంగానూ, లోపభూయిష్టంగానూ ఉందని అందులో పేర్కొన్నారు. పేదలను అవమాన పరిచే విధంగా సర్కార్ నిర్మించే ఇండ్లు ఉన్నాయన్నారు. ఒకే గదిలో కుటుంబం అంతా నివసించే దుస్థితి నెలకొందని రాశారు. అందుకే దేశ చరిత్రలోనే విన్నూత్నంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గృహనిర్మాణాన్ని చేపడతామని ప్రణాళికలో రాశారు. పేదలకు అత్యంత గౌరవ ప్రదంగా ఉండే విధంగా  125 గజాలలో రెండు పడక గదులు, హాలు, కిచెన్, మరుగు దొడ్డి నిర్మిస్తామని చెప్పారు. పేదలపై ఎటువంటి రుణ భారం పడకుండా ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇస్తుందని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చారు. అరవై నెలల పాలనకు గానూ నలభై రెండు నెలల పాలన గడిచింది. ఇండ్ల కోసం లక్షల సంఖ్యలో అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లు వందల సంఖ్యలోనే ఉన్నాయి. 
గ్రామీణ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి రూ. 5,04,000
అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి పూనుకుంది కేసిఆర్ సర్కార్. గ్రామీణ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు, మౌళిక సదుపాయాల కల్పనకు ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలను ఒక యూనిట్ ధరగా నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ముప్పయి వేల రూపాయలు, మౌళిక సదుపాయాల కల్పనకు డెబ్బయిఅయిదు వేల రూపాయలు మెత్తం ఆరు లక్షల ఐదు వేల రూపాయలు, హైదరాబాద్ మహానగర పరిధిలో నిర్మించే ఇళ్లకు ఇంటి కోసం ఏడు లక్షల రూపాయలు, మౌళిక సదుపాయాల కోసం డెబ్బయి ఐదు వేలు కలిపి ఏడు లక్షల డెబ్బయి వేల రూపాయలను యూనిట్ ఖర్చుగా ఫైనల్ చేసింది ప్రభుత్వం. 
ఐడీహెచ్ కాలనీలో 396 ఇళ్లు పూర్తి
అధికారంలోకి వచ్చాక తొలి రెండు సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పరిధిలోని ఐడిహెచ్ కాలనీలో 396 ఇండ్లను నిర్మించారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లిలో 600, నర్సాపూర్ లో 250 ఇండ్లను మోడల్ గా నిర్మించారు. ఇవి తప్ప 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇతర ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల 37 వేల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకుండా నిర్మాణాలు ఎలా చేపడతారని శాసన సభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. బడ్జటేతర నిధులతో ఇండ్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. 
ఇళ్ల నిర్మాణానికి హడ్కో నుంచి రూ.1200 కోట్ల రుణం
ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు హడ్కో నుండి పన్నెండు వందల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇండ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. అయితే ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్ల నుండి ఆశించిన స్పందన రావడం లేదు. టెండర్లు దక్కించుకున్న వారు సైతం కొన్ని చోట్ల నిర్మాణాలను ప్రారంభించ లేదు. నిర్మాణాలు ప్రారంభించిన చోట మధ్యలోనే ఆపేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెండు లక్షల పదిహేను వేల ఇండ్లకు టెండర్లు పిలిస్తే లక్షా డెబ్బయి ఒక్క వేయి ఇండ్లకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారయిన వాటిలో లక్షా ముప్పయి ఆరు వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభమయిందని ప్రభుత్వం చెబుతోంది. అన్ని జిల్లాల్లో కలిపి కేవలం ఐదు వేల మూడు వందల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు ఇండ్లు పూర్తి కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది వందల నలభై మూడు ఇండ్లు పూర్తయ్యాయి. 
గ్రేటర్‌లో ప్రారంభమైన 92,000 ఇళ్లు
ఇండ్ల నిర్మాణాల ప్రారంభ విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదు. ప్రారంభమైన లక్షా ముప్పయి ఆరువేల గృహ నిర్మాణాల్లో గ్రేటర్ పరిధిలోనే తొంబయి రెండు వేల ఇండ్లు ఉన్నాయని ప్రభుత్వం యంత్రాంగం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని మినహాయిస్తే రాష్ట్రంలోని ముప్పయి జిల్లాల్లో కలిపి ప్రారంభమైన ఇండ్లు 44వేలు మాత్రమే. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జిల్లాల పర్యటన చేపట్టారు. వరంగల్ పర్యటన సందర్భంగా, మహబూబ్ నగర్ జిల్లా పర్యటనల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు అక్కడ కూడా ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మహాబూబ్ నగర్ పట్టణంలో సిఎం శంఖు స్థాపన చేసిన ఇండ్లను మాత్రమే పూర్తి చేశారు.  సిఎం ప్రకటించిన 330 ఇండ్లు మినహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఇక సిఎం సొంత జిల్లా సిద్దిపేటలో పూర్తయిన 19 వందల ఇండ్లలో ఎర్రవల్లి, నర్సాపూర్ గ్రామాల్లో పూర్తయిన ఇండ్లే సగం వరకు ఉన్నాయి. 
పడకేసిన ఇళ్ల నిర్మాణం
గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లాలోనూ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పడకేసింది. ఒక వెయ్యి ఏడు వందల నలబై ఇండ్లకు టెండర్లు పిలిస్తే ఐదు వందల ఇండ్లకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించక పోవడంతో స్వయంగా మంత్రిగారు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయినా కాంట్రాక్టర్లు దిగిరాలేదు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి తన సొంత గ్రామమైన ఆళ్లపల్లిలో నలభై ఇండ్లను నిర్మించుకోగలిగారు. మంత్రి సొంత గ్రామంలో తప్ప నిర్మల్ జిల్లాలో ఇండ్ల నిర్మాణమే ప్రారంభం కాలేదు. నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ఏర్పాటయిన మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ డబుల్ బెడ్ రూం నిర్మాణం ప్రారంభదశను దాటలేదు. ఎక్కువ మంది పేదలూ, గిరిజనులు ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగడం ఇండ్లు లేని పేదలకు నిరాశే ఎదురవుతోంది.
హడ్కో నుంచి రూ.1200 కోట్ల రూపాయల అప్పు
కేసిఆర్ మానస పుత్రికగా అభివర్ణించిన ఈ గృహనిర్మాణ పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. బడ్జెటేతర నిధులతో నిర్మాణం చేపట్టడం పథకం ఆశించిన రీతిలో ముందుకు సాగకపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఒప్పందం మేరకు హడ్కో నుండి పన్నెండు వందల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ నిధుల్లోనూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమానంగా పంచలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేటకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అత్యంత నిరుపేదలు ఉండీ, వలసలకు మారుపేరయిన నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. రాష్ట్రంలోనే గిరిజన జనాభా అధికంగా ఉండీ అభివృద్దిలో బాగా  వెనకబడిన జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కేవలం ఐదు లక్షలు మంజూరు చేశారు. 
గ్రేటర్‌లో మొదలైన 92 వేల ఇళ్ల నిర్మాణం
గ్రేటర్ లో మురికి వాడల వాసులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తాం. హైదరాబాద్ లో మురికి వాడలు లేకుండా చేస్తామని మున్సిపల్ మంత్రి కేటిఆర్ ప్రకటించారు. నగరంలో తొంబయి రెండు వేలకు పైగ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో పేర్కొన్నారు. ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలంటే ఏడు వేల 130 కోట్ల రూపాయలు అవసరం కానీ కేటాయించింది. కేవలం మూడు వందల డెబ్బయి అయిదు కోట్ల రూపాయలు మాత్రమే. ఇలా కేటాయింపులు చేస్తే ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న తొంబయి రెండు వేల ఇండ్లు పూర్తి కావాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి గ్రేటర్ లో లక్ష ఇండ్లు పూర్తి చేస్తామని మంత్రి కేటిఆర్ చెప్పిన మాటకి క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. 
4400 ఇండ్ల నిర్మాణం 
గ్రేటర్ కాకుండా రాష్ట్రంలో మిగిలిన 30 జిల్లాల్లో నలభై నాలుగు వేల ఏడు వందల ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. ప్రారంభమైన ఇండ్లు పూర్తి కావాలంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం. వీటి నిర్మాణానికి ఎనమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. కావాల్సిన నిధులు వేల కోట్లలో ఉన్నాయి. కేటాయిస్తున్న నిధులేమో ఏ మూలకూ చాలకుండా వందల కోట్లు కేటాయిస్తున్నారు. ఓ వైపు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. టెండర్లు ఖరారయిన వాటిలోనూ సగం కూడా ప్రారంభం కావడం లేదు. ప్రారంభమయిన వాటికీ సరిపడా నిధులు కేటాయించడం లేదు. కేటాయిస్తున్న నిధుల్లోనూ అసమానతలు ఉంటున్నాయి. వెరసి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టు తయారయ్యింది. 
ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం 
డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉద్యమాలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను నిలదీసిన ఘటనలూ వెలుగు చూసాయి. కొన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, నిరహార దీక్షలు చేస్తున్నారు. ఒక్క అడుగు ముందు వేసి జనగామ జిల్లాలో ఓ గ్రామంలో అధికార పార్టీకి చెందిన వారితో సహా పార్టీల కతీతంగా రిలే దీక్షలు చేపట్టారు. దాదాపు పది రోజుల నుండి ఈ దీక్షలు  కొనసాగుతున్నాయి. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో మంజూరయి నిర్మాణ దశలో ఉన్న,  నిర్మించుకున్న ఇండ్లకు బిల్లులు చెల్లించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకున్న వారు అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ ఇటీవల జరిగాయి. ప్రభుత్వం కట్టిస్తామని చెప్పిన కొత్త ఇండ్లు ఇవ్వక, కట్టుకున్న ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులూ ఇవ్వక పోవడంతో ప్రజలు ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తుందా? 
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పట్ల ప్రజలే కాదు, కేంద్రం కూడా ఆసక్తిగా చూస్తోంది. పథకం అమలు తీరు ప్రజలకంటే ముందు కేంద్రానికి ఆర్థమయింది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్‌ డబుల్ బెడ్ రూం పరిశీస్తానని చెప్పారు. ఆ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని రాష్ట్ర మంత్రి చెప్పడంతో అవాక్కవడం కేంద్ర మంత్రి వంతయింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో డబుల్ బెడ్ రూం నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తుందా అనేది వేచి చూడాలి. 

 

18:46 - March 5, 2018

కడప : జిల్లాలోని పులివెందులలో నిన్న జరిగిన ఘర్షణతో విధించిన 144 సెక్షన్‌ కొనసాగుతుంది. దాదాపు 800 పోలీసులు పులివెందులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కడప జిల్లా ఎస్పీ బాపూజీ అట్టడా పరిస్థతిని సమీక్షిస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతుందని, పరిస్థితిని బట్టీ ఎత్తివేస్తామని అన్నారు. నిన్నటి ఘర్షనకు సంబంధించి కేసులు  నమోదు చేశామని, త్వరలోనే విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ బాపూజీ అన్నారు. 

18:44 - March 5, 2018

నిజామాబాద్ : నాలుగేళ్ల వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే జాతీయ స్థాయి రాజకీయాలు అంటు కేసీఆర్ హడవుడి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రికి ఏరోజు మనసొప్పదన్నారు. ఇప్పుడు ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు థర్డ్ ప్రంట్ అంటు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:40 - March 5, 2018

హైదరాబాద్‌ : సంగీత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. బోడుప్పల్‌లో భర్త ఇంటిముందు మరోసారి బాధితురాలు సంగీత నిరసనకు దిగింది. కోర్టు ఆదేశంతో భర్త ఇంటిలో ఉంటున్న తనను అత్తింటివారు మళ్లీ  వేధింపులకు గురిచేస్తున్నారని సంగీత ఆరోపిస్తోంది. ఆదివారం రాత్రి మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డి తనపై దాడిచేసి కొట్టారని సంగీత అంటోంది. మరిది శ్రీధర్‌రెడ్డి నన్ను చంపేప్రయత్నం చేశాడని ఆరోపించారు. రక్షణ కల్పించాలని మేడిపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సంగీత చెబుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

18:31 - March 5, 2018

విశాఖ : విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. విశాఖలోని జీవీఎంసీ నుండి సరస్వతి పార్క్‌ వరకు వినూత్న నిరసన చేపట్టారు. 'బీజేపీ రైలు బండి నాలుగేళ్లు లేటు' అంటూ ఆందోళనలు చేపట్టారు. 'నాలుగేళ్లుగా చేస్తాం.. చూస్తామన్నారు'.. కానీ ఏమీ చేయలేదని నేతలు విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చాలని నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే వరకు పోరాటం చేస్తామని టీడీపీ నేతలంటున్నారు. టీడీపీ నేతల ఆందోళనలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

ప్రధాని మోడీ మోసగాడు : రఘువీరారెడ్డి

హైదరాబాద్ : ప్రధాని మోడీ మోసగాడు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మోడీ ఒక్క మాట మాట్లాడడం లేదని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని బీజేపీ నేతలు అంటున్నారని తెలిపారు. 

17:45 - March 5, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు అమలు చేయాలంటూ ఢిల్లీ వేదికగా వామపక్షాలు ఆందోళనలు ఉధృతమయ్యాయి. మోదీ చేస్తున్న అన్యాయాలపై ప్రతిపక్షాలన్నీ గళమెత్తుతున్నాయి. హక్కులన్నీ సాధించే వరకు పోరాడుతామంటున్న  సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. విభజన హామీల కోసం ఏపీకి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని తెలిపారు. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

17:41 - March 5, 2018

గుంటూరు : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఏపీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలను న్యాయం చేయాలని కోరారు. 
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. విభజనతో ఏపీ ఆర్థికంగా నష్టపోయిన అంశాన్ని గవర్నర్‌ నరసింహన్‌  ప్రస్తావించారు. ప్రధానంగా ఆదాయం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు.
హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే : గవర్నర్ 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత నివారించామని చెప్పిన గవర్నర్‌... అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడులకు ఏపీకి గమ్యస్థానంగా మారుస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని అమరావతిని 45 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్‌ నరసింహన్‌, మౌలిక సదుపాయాల కల్పనకు  10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజల కలలు సాకామయ్యే వరకు ప్రభుత్వం  విశ్రమింబోదని చెప్పి ప్రసంగాన్ని ముగించారు. 
ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక స్పీకర్‌ కోడెల అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈనెల 28 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. ఈనెల 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు.  మార్చి 8న ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈనెల 9 నుంచి 11 వరకు తిరిగి 17, 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 12 నుంచి 15 వరకు బడ్జెట్‌పై చర్చిస్తారు. 16 నుంచి 27 వరకు శాఖలవారీ పద్దులపై చర్చ చేపడతారు. 28న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత సభ నిరవధిక వాయిడా పడుతుంది. ఈ మేరకు బీఏసీలో  షెడ్యూలు ఖరారు చేశారు. 
 

 

ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి : పోలవరం ప్రాజెక్టు సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. 

మోడీ, చంద్రబాబులపై పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ లో ఫిర్యాదు

ఢిల్లీ : ప్రత్యేకహోదా హామీ, విభజన చట్టం అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుపై పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ లో ఏపీ పీసీసీ నాయకులు ఫిర్యాదు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు పరచకుండా ఏపీకి అన్యాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

17:19 - March 5, 2018

చిత్తూరు : జిల్లాలో తలలేని బాలిక మృతదేహం కలకలం రేపింది. పెనుమూరులో కలవగుంట జలాశయంలో తలలేని బాలిక మృతదేహం లభ్యం అయింది. క్షుద్రపూజలు చేసి బాలికను బలిచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికకు 12 నుంచి 14 సం.రాలు ఉంటాయని అంటున్నారు. తల లేకపోవడంతో బాలిక వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. తల కోసం చుట్టుప్రక్కల గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:05 - March 5, 2018

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గవర్నర్ దంపతులు ఉత్సాహంగా గడిపారు. సచివాలయానికి వచ్చిన గవర్నర్ దంపతులు.. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను సందర్శించి ముగ్ధులయ్యారు. ఆర్టీజీ సెంటర్ పనితీరుపై అక్కడి అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి గవర్నర్ ఆనందం వ్యక్తంచేస్తూ.. గంట కాదు.. రోజంతా ఇక్కడే ఉండాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆర్టీజీ సెంటర్ ఊతంతో పనిచేస్తే వృద్ధిరేటు 15 శాతమైనా సాధించొచ్చని కితాబిచ్చారు. చంద్రబాబు లాంటి విజనరీ సీఎం ఉండడం.. ఏపీ ప్రజల అదృష్టమని గవర్నర్ పొగడ్తలతో ముంచెత్తారు. 

 

16:59 - March 5, 2018

హైదరాబాద్ : పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌లో మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో నారాయణ గూడ చౌరస్తాలో జరిగిన ఆందోళనలో  వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. మహిళా బిల్లును ఆమోదించేవరకు మహిళ పోరాటం ఆగదన్నారు. మహిళను ఓటుబ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వం.. మహిళా బిల్లుపై నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:53 - March 5, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రేపు, ఎల్లుండి పార్లమెంట్‌ ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు వామపక్షాలు సమాయత్తమయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక తీసుకువచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామంటున్న సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఆందోళనలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ఆలోచన విధానపరంగా నిలబడదన్నారు. కేసీఆర్‌ విధానాలు మార్చుకోకుండా థర్డ్‌ ఫ్రంట్‌ అంటే ప్రజలు నమ్మరని తెలిపారు. రాజకీయ పార్టీల ఒత్తిడితోనే టీడీపీ కేంద్రంపై పోరాట నాటకం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పని చేయడం లేదని పేర్కొన్నారు.

16:44 - March 5, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర సహాయాన్ని టీడీపీ ఎంపీలు తక్కువచేసి చూపిస్తున్నారంటున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. హోదాతో ఎక్కువ నిధులు రావని సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని తెలిపారు. -

 

16:39 - March 5, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు 17రోజుల పాటు జరగనున్నాయి. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక సభాపతి కోడెల అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 28 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో మొత్తం 17 రోజుల పాటు అసెంబ్లీ జరగనుంది. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుగనుంది. 8న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు. 12 నుంచి 15 వరకూ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 16 నుంచి  27 వరకూ శాఖల వారీగా కేటాయింపులపై చర్చ చేపట్టనున్నారు. 28న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చతో అసెంబ్లీ ముగియనుంది.

 

16:36 - March 5, 2018

అమెరికా : న్యూయార్క్‌లో 90వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌కు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డెల్‌టోరో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. అలాగే డార్కెస్ట్‌ అవర్‌ చిత్రంలో అద్భుతంగా నటించిన గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ ఉత్తమ నటుడుగా ఆస్కార్‌ను అందుకున్నాడు. త్రీ బిల్‌ బోర్డ్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరి చిత్రాలలో అత్యుత్తమ నటన కనబరిచిన ఫ్రాన్సిస్‌ మెక్‌ డోర్మండ్‌ ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. 

 

16:33 - March 5, 2018

పంజాబ్ : మనీ లాండరింగ్‌ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మీసా భారతికి, ఆమె భర్త శైలేశ్‌ కుమార్‌కు పటియాలా హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దరికీ పటియాలా హౌస్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ కోసం 2 లక్షల రూపాయలను ష్యూరిటీ కింద సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు అనుమతి లేకుండా.. దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. మిశైల్‌ ప్యాకర్స్‌ అండ్‌ ప్రింటర్స్‌ పేరుపై మీసా భారతీ, ఆమె భర్త ఢిల్లీలో ఓ ఫామ్‌ హౌస్‌ కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మీసా భారతిని ఈడీ ప్రశ్నిస్తోంది. ఈ కంపెనీతో తనకేమి సంబంధం లేదని, తన భర్త, సిఏ సందీప్‌ శర్మతో కలిసి నిర్వహించేవారని మీసా పేర్కొన్నారు. మిసా భారతి, శైలేష్‌ కుమార్‌, జైన్‌ బ్రదర్స్‌ ర1.20 కోట్ల మనీలాండరింగ్‌లో ప్రధాన వ్యక్తులని ఈడీ కోర్టుకు తెలిపింది. 

 

16:22 - March 5, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవహారంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయని విషయాలపై ఈడీ తనను ప్రశ్నిస్తోందని కార్తి చిదంబరం అన్నారు. ఈడీ విచారణ ఆపాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం వాదనలు విననుంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సిబిఐ కార్తీ చిదంబరాన్ని ఫిబ్రవరి 28న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ఎఫ్‌ఐపిబి క్లియరెన్స్‌ కోసం ఐఎన్‌ఎక్స్‌ మీడియా నుంచి కార్తి చిదంబరం 3.5 కోట్లు తీసుకున్నారని ఆరోపణలున్నాయి.

 

16:15 - March 5, 2018

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో మాలోత్‌ లక్ష్మయ్య అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాంతో రైతులు తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పంటలు సరిగ్గా పండకపోవడం, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు చెప్పారు.

 

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు : పెనుమూరులోని కలవగుంట జలాశయంలో తలలేని బాలిక మృతదేహం లభ్యం అయింది. క్షుద్రపూజలు చేసి బాలికను బలిచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. 

పంచాయితీరాజ్ శాఖ ఇంజినీర్‌ సురేశ్ రెడ్డి అరెస్టు

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తిలో పంచాయితీరాజ్ శాఖ ఇంజినీర్‌ కొండసాని సురేశ్ రెడ్డిని... క్రికెట్ బుకీలతో సంబంధాలున్నాయని పోలీసులు రాత్రి అరెస్ట్ చేసారు. అయితే తనకు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న సురేశ్ రెడ్డి.. ఉదయం పీఎస్‌లోనే బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు సురేశ్ రెడ్డిని... ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

15:58 - March 5, 2018

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తిలో పంచాయితీరాజ్ శాఖ ఇంజినీర్‌ కొండసాని సురేశ్ రెడ్డిని... క్రికెట్ బుకీలతో సంబంధాలున్నాయని పోలీసులు రాత్రి అరెస్ట్ చేసారు. అయితే తనకు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న సురేశ్ రెడ్డి.. ఉదయం పీఎస్‌లోనే బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు సురేశ్ రెడ్డిని... ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

15:43 - March 5, 2018

ఢిల్లీ : మోడీ ప్రధానిగా ఉన్నత కాలం ఏపీకి ప్రత్యేకహోదా రాదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఢిల్లీలోని వైసీపీ ధర్నాకు లెఫ్ట్ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీని వాయిదా వేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. 

15:33 - March 5, 2018

ఢిల్లీ : హస్తినలో వైసీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సంసద్ మార్గ్ లో వైసీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని, నేతలను అరెస్టు చేసి, పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ కు తరలించారు. అరెస్టైనవారిలో విజయసాయిరెడ్డి, వరప్రసాద్, సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి సహా పులువురు నేతలున్నారు. అయితే నేతలను తరలిస్తున్న పోలీసులను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  

 

ఢిల్లీలో వైసీపీ కార్యకర్తలు, నేతల అరెస్టు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ కు తరలించారు. ఏపీకి హోదా కోసం సంసద్ మార్గ్ లో మహాధర్నాలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి, వరప్రసాద్, సుబ్బారెడ్డి సహా పులువురు నేతలను అరెస్టు చేశారు.

13:55 - March 5, 2018

విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక నిరహార దీక్ష చేపట్టాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల దీక్షకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏపీ ఎన్జీవో మద్దతు తెలిపాయి. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే స్పందించకపోతే చలో విద్యుత్ సౌధ కార్యక్రమం చేపడుతామని హచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

13:52 - March 5, 2018
13:44 - March 5, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో మార్పు రావాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ ప్రకటించి కొద్ది రోజులైనా కాలేదు అప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. థర్డ్ ఫ్రంట్ కోసం భవిష్యత్ ప్రణాళికలను కేసీఆర్ సిద్ధం చేసుకుంటున్నారు. దేశ ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతొక్క వర్గంతో ఆయన మాట్లాడనున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలు..ప్రముఖలతో భేటీలు కావాలని నిర్ణయించారు. సివిల్ సర్వీస్ అధికారులు, న్యాయ నిపుణులు, రైతు సంఘాల నేతలతో ములాఖాత్ కానున్నారు. మాజీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, మీడియా ప్రముఖలతోనూ కేసీఆర్ భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 

వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే థర్డ్ ఫ్రంట్ - ఉత్తమ్...

నిజామాబాద్ : నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరిట కొత్త నాటకానికి తెర తీశారని, నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. వారి గురించి స్పందించని కేసీఆర్ రైతుల విషయంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక - రేవంత్...

నిజామాబాద్ : కేసీఆర్ మూడో ఫ్రంట్ పై టి.కాంగ్రెస్ నేత రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే థర్డ్ ఫ్రంట్ అని పేర్కొన్నారు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మయ్యారని, నాగ్ పూర్ స్లీపర్ సెల్స్ ప్రగతి భవన్ లో మోహరించారని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక వచ్చిందని, ఆయన ఇంట్లో సంతోష్ థర్డ్ ఫ్రంట్ గా మారారని తెలిపారు. తనను సీఎం చేయాలని కేటీఆర్ పట్టుబడుతున్నాడని, చైనా చట్టాలు ఇక్కడ అవలింబిస్తే కేసీఆర్ కు ఉరిశిక్ష పడుతుందన్నారు.

 

 

13:31 - March 5, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు అవుతుంది. ఆనాడు ఇచ్చిన హామీలు అమలు కాకపోతుండడంతో టిడిపి మేల్కొంది. ఆ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో...లోపల ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కూడగొట్టి ఏపీకి సంబంధించిన అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తాలని టిడిపి ఎంపీలు కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రాత్రి ఏడు గంటలకు అమిత్ షాతో టిడిపి ఎంపీలతో కీలక భేటీ జరుగనుంది. విభజన హామీలు..ప్రత్యేక హోదాపై వీరు చర్చించనున్నారు. మరి ఈ భేటీ అనంతరం స్పష్టత వస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

ఢిల్లీలో వైసీపీ నేతల అరెస్టు...

ఢిల్లీ : పార్లమెంట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం తాము వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రమే వెళుతామని నేతలు పేర్కొంటున్నారు. 

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుండి ప్రారంభమైన ఈ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. విభజన హామీలు...తదితర అంశాలను ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. అనంతరం సభలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీ సమావేశం జరిగింది. మొత్తంగా 17 రోజుల పాటు సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 9,10,11,17,18,24,25 సెలవులు.

13:14 - March 5, 2018
13:11 - March 5, 2018

ఢిల్లీ : న్యూయార్క్ లో ఆస్కార్ అవార్డుల అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది.

  • ఉత్తమ సహాయనటుడు : శామ్ రాక్ వెల్ (త్ర్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్ మిస్సోరి)
  • ఉత్తమ సహాయ నటి : అల్లీసన్ జెన్నీ (ఐ టోన్యా)
  • ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ (సెబాస్టియన్ లిలియో)
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ : 'ఇకారస్' (బ్రియాన్ ఫోజెల్, డాన్ కోగన్)
  • ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ : 'కోకో' (లీ అన్ క్రిక్, డార్లా కే ఆండర్ సన్)
  • ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : 'డియర్ బాస్కెట్ బాల్' (కే బ్రియాంట్, జీన్ కేనీ)
  • బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : గెర్డ్ ఫెక్చర్, రిచర్డ్ ఆర్ హూవర్, జాన్ నీసన్ (బ్లేడ్ రన్నర్ 2049)
  • ఉత్తమ వస్త్రాలంకరణ : మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)
  • ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : మార్క్ వెంగర్టెన్ (డన్ క్రిక్)
12:59 - March 5, 2018
12:49 - March 5, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు..ప్రత్యేక హోదా ఆందోళనలు దేశ రాజధానికి చేరుకున్నాయి. ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా పలు ఆందోళనలు పిలుపునిచ్చింది. దీనితో ఢిల్లీలోని ఏపీ భవన్ లో మీడియాపై ఆంక్షలు విధించింది. వార్తలను కవరేజ్ చేయకూడదని..మీడియా వ్యక్తులు ఏపీ భవన్ లోకి అనుమతి లేదంటూ ఏపీ భవన్ గేటుకు నోటీసు బోర్డును అందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి కనబరుస్తున్నారని, కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ గడుపుతున్నారని వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఏపీ భవన్ ప్రభుత్వానిది కాదని..ఐదు కోట్ల ప్రజలదని తెలిపారు. ఈనెలలో తాము పలు ఆందోళన కార్యక్రమాలు..నిరసనలు చేపట్టనున్నామని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చామన్నారు. కానీ ఈ విషయంలో టిడిపి ముందుకు రావడం లేదని..డ్రామాలొద్దని సూచించారు.

 

ఏపీ భవన్ వద్ద మీడియాపై ఆంక్షలు...

ఢిల్లీ : ఏపీ భవన్ లో మీడియాపై ఆంక్షలు విధించారు. వార్తలను కవరేజ్ చేయకూడదని..మీడియా వ్యక్తులు ఏపీ భవన్ లోకి అనుమతి లేదంటూ ఏపీ భవన్ గేటుకు నోటీసు బోర్డును అందించారు. దీనిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. 

12:23 - March 5, 2018

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని..వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవలే సీఎం కేసీఆర్ ఓ సభలో కేంద్ర ప్రభుత్వం..మోడీపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేసీఆర్ తిరిగి చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్రంగా స్పందించింది. సోమవారం ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని, ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేపడుతామని పేర్కొంది. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయమే చిక్కడపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడే ఉన్న లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నారు. బర్కత్ పురాలోని నివాసం ఉంటున్న కిషన్ రెడ్డిని...తార్నాకాలో నివాసం ఉంటున్న ఎమ్మెల్సీ రామచంద్రారావులను గృహ నిర్భందం చేశారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పినా అరెస్టు, గృహ నిర్భందం చేయడం సబబు కాదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 

12:13 - March 5, 2018

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. అందరూ ఊహించినట్లే జరిగింది. ఏపీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ వెలుపలా...లోపలా ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ వారు నినదించారు. దీనితో లోక్ సభ పలు మార్లు వాయిదా పడింది.

ఉదయం ప్రారంభం కాగానే ఇటీవలే మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహజన్ చదివి వినిపించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయాలని..ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పలు మార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు శాంతించలేదు. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి 12గంటలకు ప్రారంభమైన సభలో పరిస్థితిలో మార్పు కనిపించలేదు. చివరకు మంగళవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ బయట వైసీపీ కూడా మహాధర్నా చేపట్టింది. 

లోక్ సభ తిరిగి మంగళవారం..

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభ్యులు మాత్రం ఆందోళన చేపట్టాయి. ఏపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేపట్టాయి. దీనితో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

లోక్ సభ తిరిగి ప్రారంభం...

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభ్యులు మాత్రం ఆందోళన చేపట్టాయి. ఏపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేపట్టాయి. 

లాలూ కూతురు, అల్లుడికి ఊరట...

బీహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్ కు కొంచెం ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో వీరికి ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులు విధించింది. 

12:00 - March 5, 2018
11:59 - March 5, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా కల్పించాలంటూ సిని క్రిటిక్ కత్తిమహేష్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న పార్టీలతో కలిసి పాల్గొన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ తో టెన్ టివి మాట్లాడింది. ప్రత్యేక హోదా పెద్ద సంజీవని కాదని..ఆనాడు గతంలో పేర్కొన్నారని..డ్రామాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు. ఎంపీలు రాజీనామా చేయడం లేదని..కనీసం రాజీనామా చేస్తామని అనడం లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఎల్లంపల్లి పైప్ లైన్ వాల్ ను తొలగించిన రైతులు...

పెద్దపల్లి : పాలకుర్తి (మం) మారెడుపల్లి సమీపంలో ఎల్లంపల్లి పైప్ లైన్ వాల్ ను రైతులు తొలగించారు. వంద మీటర్లకు పైగా నీరు ఎగిసిపడుతోంది. పంటలకు నీరందక ఎండిపోతుండడంతో నీళ్లను రైతాంగం మళ్లించుకుంది. నందిమేడారం రిజర్వాయర్ కు నీటి తరలింపులో బ్రేక్ ఏర్పడింది. 

హోదా కల్పించాలి - కత్తి మహేష్...

విజయవాడ : ప్రత్యేక హోదా కల్పించాలంటూ సిని క్రిటిక్ కత్తిమహేష్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న పార్టీలతో కలిసి పాల్గొన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఏపీ అసెంబ్లీ 17 రోజులు...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు 17 రోజులు జరుగన్నాయి. కాసేపటి క్రితం బీఏసీ సమావేశం ముగిసింది. 9,10,11,17,18,24,25 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఇవ్వనున్నారు. 28 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

ఏపీ బీఏసీ సమావేశం...

విజయవాడ : స్పీకర్ కోడెల అధ్యక్షతనలో బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, విష్ణుకుమార్ రాజులు హాజరయ్యారు. అసెంబ్లీ తేదీల ఖరారు, తదితర అంశాలపై చర్చించారు.

 

11:34 - March 5, 2018

ఢిల్లీ : రాజ్యసభలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ఎంపీలు..ఇతర సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం బడ్జెట్ సమావేశాలు రెండోసారి ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది అనంతరం 11.20కి ప్రారంభమైన సభలో పరిస్థితిలో మార్పు రాలేదు. పలు మార్లు డిప్యూటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. తనకు కొన్ని నోటీసులు వచ్చాయని..అవి చదివి..తన నిర్ణయం వెలువరించే వరకు ఆందోళన చేయవద్దని సూచించారు.

కొంతమంది సభ్యులు దగ్గరి నుండి నోటీసులు ఇచ్చారని, కావేరీ బోర్డు అంశానికి సంబంధించిన అంశంపై కూడా నోటీసు ఇచ్చారని సభకు తెలిపారు. ఏపీ విభజన పునర్ వ్యవస్థీకరణపై సభ్యులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కానీ రూల్ ప్రకారం నోటీసులివ్వాల్సి ఉంటుందని సభ్యులకు సూచించారు. పంజాబ్ నేషనల్, బ్యాకింగ్ సిస్టంలో నెలకొన్న వాటిపై ఇది ముఖ్యమైన అంశమైన అంశమని, చర్చించాల్సినవసరం ఉందన్నారు. కానీ సరియైన విధంగా ముందుకు రావాలని ముందుకు సూచించారు. దీనిపై తాను ప్రభుత్వంతో చర్చించి ఒక సరియైన సమయం తీసుకుంటానన్నారు. కావేరీ అంశంపై జీరో అవర్ తరువాత అనుమతినిస్తానని. సీఎం రమేష్, రామచంద్రారావులిచ్చిన నోటీసులు సరియైన రూల్ కింద ఇవ్వాలని అప్పటి వరకు అనుమతినించనని వెంకయ్య తెలిపారు. కానీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నం 02.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

బీజేపీ చలో ప్రగతి భవన్...

హైదరాబాద్ : బీజేపీ చలో ప్రగతి భవన్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. చిక్కడపల్లిలో బీజేపీ ఆఫీసులో లక్ష్మణ్..కిషన్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. తార్నాకాలో ఎమ్మెల్సీ రామచంద్రరావులను గృహ నిర్భందం చేశారు. 

11:18 - March 5, 2018

ఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతాయని ఊహించినట్టే ప్రారంభమయయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ తొలుత ఇటీవలే చనిపోయిన సభ్యులకు సంతాప తీర్మానం చదివారు. అనంతరం సభ నివాళులర్పించింది. అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టగానే సభ్యులు ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి అనంతరం సభను మధ్యాహ్యానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. సభా కార్యాకలాపాలకు సభ్యులు అడ్డు తగిలారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని డిప్యూటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించినా సభ్యులు వినిపించుకోలేదు. నినాదాలు మిన్నంటాయి. దీనితో సభను 11.20గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని... ఏపీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేయగా వైసీపీ కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించడంతో.. విభజన సమస్యల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జాతీయ అంశాలైన నీరవ్ మోదీ వ్యవహారం, కార్తీ చిదంబరం అంశాలు కూడా హాట్‌ టాపిక్‌ కానున్నాయి. పార్లమెంటు సమావేశాలపై పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

రాజ్యసభలో కూడా...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. 

లోక్ సభలో ఆందోళనలు...వాయిదా...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సభ నివాళులర్పించింది. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టగానే సభ్యులు ఆందోళనకు దిగారు. దీనితో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

లోక్ సభలో ఆందోళనలు...

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సభ నివాళులర్పించింది. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టగానే సభ్యులు ఆందోళనకు దిగారు. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం...

ఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఏపీ విభజన హామీలు..ప్రత్యేక హోదా..ఇతర అంశాలపై విపక్షాలు ఆందోళన చేయడానికి సిద్ధమయ్యాయి. 

ఆస్కార్ లో 'శ్రీదేవి' నివాళి...

లాస్ ఏంజిల్స్ : 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. 2017, 2018 సంవత్సరాల్లో తుదిశ్వాస విడిచిన ప్రముఖ ఆర్టిస్టుల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా దివంగత బాలీవుడ్ సూపర్‌ స్టార్లు శశికపూర్‌తో పాటు ఇటీవల మరణించిన శ్రీదేవికి కూడా నివాళులర్పించారు.

బాబుపై భూమన విమర్శలు...

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సంసద్ మార్గ్ లో వైసీపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతోందని, ప్రత్యేక హోదా కల్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో జగన్ పలు సభల ద్వారా చెప్పడం జరిగిందని తెలిపారు.

టిడిపి ఎంపీల ధర్నా...

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీలు ధర్నా చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని..విభజన చట్టం అమలు చేయాలని నినాదాలు చేశారు. 

10:44 - March 5, 2018

విజయవాడ : నూతన భవనాల్లో రెండోసారి బడ్జెట్ సమావేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రసంగంలో విభజన సమస్యలు..ఇబ్బందులు..కేంద్రం హామీలు..హోదా ఉండడం గమనార్హం. విభజన అనంతరం ఏపీ ప్రస్తుతం కొలుకోంటోందని, విభజనతో ఏపీ రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. భౌగోళిక ప్రదేశం ఆధారంగా ఇరు రాష్ట్రాలకు ఆస్తులు పంచారని, జనాభా ప్రాతిపదికన అప్పులను పంచారని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో కష్టాలు మరింత పెరిగాయని, 56 శాతం ఉన్న జనాభాకు 46 శాతం రాబడి ఇవ్వడం అన్యాయమన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, అమరావతికి ఆర్థిక సహాయం, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.

విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఏపీ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. చట్టంలో ఇచ్చిన హామీ ప్రతిదీ అమలయ్యేవరకు తమ ప్రభుత్వం వెనుకడగు వేయదని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళుతున్నట్లు తెలిపారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటుతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోవడం జరిగిందని, విభజన హామీల అమలు కోసం మూడున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా..రైల్వే జోన్ హామీలు అమలు కావాల్సి ఉందన్నారు.

కేంద్ర నిధులతో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆటో మొబైల్ కేంద్రంగా అనంతపురం అభివృద్ధి చెందుతోందని, ఎలక్ట్రానిక్ హాబ్ గా చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. వెనుకబడిన జిల్లాలో ఆర్థిక సాయం 9, 10 షెడ్యూల్ సంస్థలను విభజించాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలపై దృష్టి సారించడం జరిగిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థ ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని పూర్తిగా అణిచివేయడం జరిగిందని, పోలీసులు కనబడకుండా పోలీసింగ్ కనబడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు.

యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయంగా ఎదిగేందుకు ప్రోత్సాహిస్తామని, అభివృద్ధి ఫలాలు ప్రతొక్కరికీ చేరేందుకు నిర్విరామంగా కృషి చేస్తామని, 2029 నాటికి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. వృద్ధి గమనాన్ని సుస్థిర పరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాలు అందిస్తామన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు..పన్ను విధింపు విషయాల్లో తేడాలను పరిష్కరించాలన్నారు. విశాఖ - విజయవాడ మెట్రో రైలు రోడ్డు అనుసంధానం కావాల్సి ఉందన్నారు. పూర్తి ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

టిడిపి వాయిదా తీర్మానం...

ఢిల్లీ : పార్లమెంట్ లో టిడిపి వాయిదా తీరానాన్ని ఇచ్చింది. సభా కార్యకలాపాలను పక్కన పెట్టి విభజన చట్టంపై చర్చించాలని తీర్మానంలో పేర్కొంది. 

29న 'ఎన్టీఆర్' సినిమా ప్రారంభం - బాలకృష్ణ...

విజయవాడ : ఏపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈనెల 29వ తేదీన ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తామని, హైదరాబాద్ రామకృష్ణ సినిమా స్టూడియోలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని, వచ్చే సంక్రాతికి సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సినిమాకు చాలా మంది పేర్లు సూచించారని, ఎన్టీఆర్ కు మించిన పేరు లేదని అదే ఖరారు చేయడం జరిగిందన్నారు. 

హోదా..రైల్వే జోన్ అమలు కావాలి - గవర్నర్...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి  తెలుగు రాష్ట్రాల గవర్నర్ ప్రసంగించారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటుతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోవడం జరిగిందని, విభజన హామీల అమలు కోసం మూడున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా..రైల్వే జోన్ హామీలు అమలు కావాల్సి ఉందన్నారు. 56 శాతం ఉన్న జనాభాకు 46 శాతం రాబడి ఇవ్వడం అన్యాయమన్నారు.

ఇబ్బందుల్లో ఏపీ ప్రజలు - గవర్నర్...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి  తెలుగు రాష్ట్రాల గవర్నర్ ప్రసంగించారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో కష్టాలు మరింత పెరిగాయన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఏపీ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 

గవర్నర్ ప్రసంగంలో విభజన హామీలు..

విజయవాడ : నూతన భవనాల్లో రెండోసారి బడ్జెట్ సమావేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రసంగంలో విభజన సమస్యలు..ఇబ్బందులు..కేంద్రం హామీలు..హోదా ఉండడం గమనార్హం. విభజన అనంతరం ఏపీ ప్రస్తుతం కొలుకోంటోందని, విభజనతో ఏపీ రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఆస్తులను ప్రాంతాల వారీగా..అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని గుర్తు చేశారు.

09:42 - March 5, 2018

న్యూఢిల్లీ : విభజన హామీలు..ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విపక్షాలు ఢిల్లీ వేదికగా గళమెత్తుతున్నాయి. సోమవారం ఉదయం ఆయా పార్టీలకు చెందిన నేతలు..ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమౌతున్న సందర్భంలో కేంద్రానికి సెగ తగిలే విధంగా విపక్ష నేతలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రా మేధావుల సంఘం నేత చలసాని, సినీ క్రిటిక్, విమర్శకుడు కత్తి మహేష్ తో టెన్ టివి ముచ్చటించింది. విభజన హామీలు అమలు చేస్తామని ఎవరైనా చెబితే వారిని స్వాగతిస్తామని, తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకుంటున్నాయని..నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఒకవేళ హామీ ఇవ్వకపోతే పార్లమెంట్ పై నమ్మకం పోతుందన్నారు. జెండాలు పక్కన పెట్టి పోరాటం చేయాలని సూచించారు.

ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని కత్తి మహేష్ తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ అని తెలిపారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం దారుణమని, ప్రత్యేక హోదా ఇస్తారా ? లేదా ? విభజన హామీలు అమలు చేస్తారా ? లేదా ? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహం గురికాక తప్పదన్నారు. ప్రజల్లో తాను ఒక్కడినని, తాను ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అని తెలిపారు. 

09:35 - March 5, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉభయసభలనుద్దేశించి ఉభయ రాష్ట్రాల గవర్నర్ ప్రసంగించనున్నారు. అసెంబ్లీకి వెళ్లేముందు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యే వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఏసీ స‌మావేశం నిర్వహించి సభను ఎన్నిరోజులు నిర్వహించాలి... సభలో ఏయే అంశాలు చర్చకు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించనున్నారు. ఈనెల 29వరకు మొత్తం 18రోజులు ఈ స‌మావేశాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.

  • ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీ వైసీపీ సభకు హాజరుకావడం లేదు.
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ చర్యలు తీసుకునే వరకు.. సభకు హాజరుకాలేదని ప్రతిపక్ష నేత జ‌గ‌న్ సృష్టం చేశారు.
  • వైసీపీ తమ నిర్ణయంపై పునరాలోచించుకొని.. సభకు హాజరు కావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
  • వైసిపి గైర్హాజరుతో... సభలో టీడీపీ, బీజేపీ మాత్రమే ఉండనున్నాయి.

గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం...

విజయవాడ : ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించనున్న గవర్నర్ ప్రసంగానికి ఏపీ కేబినెట్ ఆమోదం వేసింది. ఉదయం 9.30గంటలకు గవర్నర్ ప్రసంగించనున్నారు. 

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరహార దీక్షలు...

విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికై నేటి నుండి నిరవధిక నిరహార దీక్షలు జరుగనున్నాయి. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఎంఏ గఫూర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు చలసాని రామారావులు పాల్గొననున్నారు. 

08:22 - March 5, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాలు హస్తినకు చేరుకున్నాయి. విభజన హామీలు అమలు పరచాలని..ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతిపక్షాలు ఒక్కసారిగా వ్యూహం మార్చాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమౌతున్న సందర్భంలో ఆందోళనలు..నిరసనలు అక్కడే చేపట్టాలని నిర్ణయించాయి. అందులో భాగంగా వైసీపీ..కాంగ్రెస్ నేతలు హస్తినకు చేరుకున్నారు. పార్లమెంట్ లోపల..వెలుపల టిడిపి..వైసీపీ నిరసనలు చేపట్టనున్నాయి.

  • పార్లమెంట్ స్ట్రీట్ లో వైసీపీ మహా ధర్నా చేపట్టనుంది.
  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం మోడీలపై ఏపీ కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టనున్నారు.
  • రెండు రోజుల పాటు కాంగ్రెస్ ఆత్మగౌరవ దీక్షలు చేపట్టనుంది.
  • 8న పార్లమెంట్ ను ఏపీ కాంగ్రెస్ నేతలు ముట్టడించనున్నారు.
  • టిడిపి, బిజెపి గుర్తింపు రద్దుకు ఈనెల 9న ఈసీని కాంగ్రెస్ కలువనుంది. 
08:16 - March 5, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి వెళ్లేముందు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యే వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. సోమవారం ఉద‌యం 9. 28గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ స‌మావేశం నిర్వహించి సభను ఎన్నిరోజులు నిర్వహించాలి... సభలో ఏయే అంశాలు చర్చకు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించనున్నారు. ఈనెల 29వరకు మొత్తం 18రోజులు ఈ స‌మావేశాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.

అయితే గత సమావేశాల తరహాలోనే... ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీ వైసీపీ సభకు హాజరుకావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ చర్యలు తీసుకునే వరకు.. సభకు హాజరుకాలేదని ప్రతిపక్ష నేత జ‌గ‌న్ సృష్టం చేశారు. వైసీపీ తమ నిర్ణయంపై పునరాలోచించుకొని.. సభకు హాజరు కావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. వైసిపి గైర్హాజరుతో... సభలో టీడీపీ, బీజేపీ మాత్రమే ఉండనున్నాయి.

07:55 - March 5, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో మార్పు రావాల్సిన అవసరముందన్న కేసీఆర్‌కు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీలేదని.. ఖచ్చితంగా నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ కూటమి ఏర్పడాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చావ వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), రఘురాం (బీజేపీ), దేవీ ప్రసాద్ (టీఆర్ఎస్), దుర్గా ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం...

న్యూయార్క్ : ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉత్తమ సహాయ నటుడిగా సామ్ రాక్ వెల్ (త్రీ బిల్ బోర్డ్స్ సైడ్ ఎబ్బింగి) గెలుపొందారు. 

07:25 - March 5, 2018

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఇది దేశంలోనే చాలా ప్రాధాన్యత ఉన్న విద్యా సంస్థ. నాలుగు ప్రాంతాల్లో దీనికి కేంద్రాలున్నాయి. ఇలాంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉన్నట్టుండి స్కాలర్ షిప్ లు ఎత్తివేయడంపై ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరి వారు ఎందుకు ఆందోళనలకు దిగారు ?ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ? తదితర వివరాలు విశ్లేషించేందుకు విద్యార్థులు టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:17 - March 5, 2018

ఢిల్లీ : సోమవారం నుండి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని... ఏపీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశాలున్నాయి. అటు వైసీపీ కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించడంతో.. విభజన సమస్యల అంశం హాట్‌టాపిక్‌గా మారనుంది. మరోవైపు విభజన హామీలు అమలు చేయాలని తెలంగాణ సభ్యులు కూడా గొంతు కలపనున్నారు. వీటికి తోడు.. జాతీయ అంశాలైన నీరవ్ మోదీ వ్యవహారం, కార్తీ చిదంబరం అంశాలు కూడా హాట్‌ టాపిక్‌ కానున్నాయి. పార్లమెంటు సమావేశాలపై పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:15 - March 5, 2018

విజయవాడ : ఒక‌వైపు పార్లమెంట్ స‌మావేశాలు, మ‌రోవైపు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండు వేడిని రాజేయ‌నున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌లు ఒక‌వైపు ఠారెత్తిస్తుంటే మ‌రోవైపు పోలిటిక‌ల్ పార్టీల వ్యూహ‌-ప్రతివ్యూహాలతో అంతే వేడిని పుట్టిస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో... టీడీపీ-బీజేపీ మధ్య తమ అంతరం ఎంత ఉందో కూడా బయటపడనుంది. ఈనెల 29వరకు మొత్తం 18రోజులు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేసి హస్తినకు పంపిన చంద్రబాబు... బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహ‌ల‌ను సిద్దం చేసుకున్నారు. సోమవారం ఉద‌యం 9 గంటల 28గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ స‌మావేశం నిర్వహించి సభను ఎన్నిరోజులు నిర్వహించాలి... సభలో ఏయే అంశాలు చర్చకు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 8న ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే గత సమావేశాల తరహాలోనే... ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీ వైసీపీ సభకు హాజరుకావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ చర్యలు తీసుకునే వరకు.. సభకు హాజరుకాలేదని ప్రతిపక్ష నేత జ‌గ‌న్ సృష్టం చేశారు. వైసీపీ తమ నిర్ణయంపై పునరాలోచించుకొని.. సభకు హాజరు కావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. వైసిపి గైర్హాజరుతో... సభలో టీడీపీ, బీజేపీ మాత్రమే ఉండనున్నాయి.

ప్రతిపక్షం వైసీపీ రాకపోయినా... టిడిపి మాత్రం అన్ని అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటోంది. ఇన్ని రోజులు మిత్రప‌క్షంగా ఉన్న బిజెపి కూడా అధికార పార్టీపై స్వరం పెంచడంతో... ఎవరు ఏది అడిగినా... స‌మాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉండాల‌ని.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. తమ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు జారీ చేశారు. అటు బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు.. తాము ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో సభకు ప్రస్తావించి సర్కారును ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అటు కమలనాథులను ఎదుర్కొనేందుకు దేశం నేతలు సిద్ధంగా ఉన్నారు. సమావేశాల్లో 29 అంశాల‌ను చ‌ర్చించాల‌ని టిడిపి భావిస్తోంది. అందులో విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా, కేంద్ర సహకారం, రాయ‌ల‌సీమ‌లో పారిశ్రామిక అభివృద్ది, రాజ‌ధానికి నిధులు, పోల‌వ‌రం, పురుషోత్తంప‌ట్నం, కృష్ణా గోదావ‌రి, పెన్న న‌దుల అనుసంధానం, ధ‌ర‌ల స్థిరీకరణ, పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం, చంద్రన్న పెళ్లికానుక త‌దిత‌ర అంశాల‌పై స‌భ‌లో చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇంతేకాకుండా గ‌త కొద్ది రోజులుగా ఏపీకి ఎన్నో ఇచ్చాం అని చెబుతున్న కేంద్రం ప్రకటనలపై సభ సాక్షిగా... అస‌లు రాష్ట్రానికి ఎంత ఇచ్చారు...ఇంకా ఎంత ఇవ్వాలి అనేదానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. మొత్తం మీద ఈసారి ప్రతిపక్షం లేకపోయినా.. బీజేపీని ఆ పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ స‌వాళ్లు-ప్రతిసవాళ్ల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. 

వెంకటపాలెం నుండి బాబు అసెంబ్లీకి...

విజయవాడ : నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లనున్నారు. 

జగన్ 104వ రోజు పాదయాత్ర...

ప్రకాశం : జగన్ చేపట్టిన పాదయాత్ర 104వ రోజుకు చేరింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం అద్దంకి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

నేటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు...

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వరకు మొత్తం 18రోజులు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేసి హస్తినకు పంపిన చంద్రబాబు... బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహ‌ల‌ను సిద్దం చేసుకున్నారు. సోమవారం ఉద‌యం 9 గంటల 28గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.

ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆందోళన...

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలో నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించించింది. ఇందుకోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకుంటున్నారు. ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదన్న ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారు.

 

ఏపీలో 'పలకరింపు' కార్యక్రమం...

విజయవాడ : ఈ నెల 5 నుంచి 31 వరకు 21 రోజులు పాటు "పలకరింపు" కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఎం రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఆరోగ్య బులిటెన్‌ను ఆయన విడుదల చేశారు. 

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...

హైదరాబాద్ : సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని... ఏపీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశాలున్నాయి. అటు వైసీపీ కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించడంతో.. విభజన సమస్యల అంశం హాట్‌టాపిక్‌గా మారనుంది.

 

ఓర్వలేకే కేసీఆర్ విమర్శలు - వీహెచ్...

హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఎంతో చూసుకొని జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే KCR తమపై బురద చల్లుతున్నారని వీహెచ్ ఆరోపించారు.

కేసీఆర్ రాష్ట్రంలో ఏం చేశారు - లక్ష్మణ్...

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌ రాష్ట్రంలో ఏం చేశారని? ఇక దేశ రాజకీయాల్లో ఏం ఉద్దరిస్తారు? అంటూ ప్రశ్నించారు.

 

Don't Miss